పరిపూర్ణులు కాబడిన వారికి హామీలు
దేవుడు మనిషిని పరిపూర్ణుడిగా తీర్చిదిద్దడానికి అనుసరించే మార్గము ఏది? ఆ ప్రయత్నములో ఎటువంటి అంశాలు ఇమిడి ఉంటాయి? దేవుడిచే పరిపూర్ణుడివిగా తీర్చిదిద్దబడటానికి నీవు సిద్ధంగా ఉన్నావా? ఆయన తీర్పును, ఆయన శిక్షను అంగీకరించడానికి నీవు సుముఖుడివై ఉన్నావా? ఈ ప్రశ్నలకు నీ దగ్గర సమాధానం ఉందా? నీకు ఏం మాట్లాడాలో తెలియకుండా ఉన్నట్లయితే, దేవుడి కార్యము గురించి నీకు ఇంకా ఏమీ తెలియదని చెప్పడానికి, అలాగే, పరిశుద్ధాత్మ ద్వారా నీవు జ్ఞానము పొందలేదు అనడానికి అదే రుజువు. అటువంటి మనుష్యులు పరిపూర్ణులు కాబడటం అనేది అసాధ్యం. వారికి తాత్కాలికముగా తక్కువ మోతాదులో దేవుని కరుణ లభిస్తుంది కానీ, అది ఎక్కువ కాలం ఉండదు. దేవుడి కరుణను కేవలము ఆస్వాదించే మనుష్యులు దేవుడిచే పరిపూర్ణులుగా తీర్చిదిద్దబడలేరు. కొందరు మనుష్యులు తమ శరీరానికి శాంతి, సుఖము దక్కినంతనే సంతృప్తి పడిపోతుంటారు. వారి జీవితము సునాయాసంగా సాగిపోతూ, ఎటువంటి ఒడిదుడుకులు కానీ దురదృష్టము కానీ కలుగకుండా ఉంటూ, వారి యావత్ కుటుంబము సంతోషముగా ఉండి, ఎటువంటి ఘర్షణలు కానీ వివాదాలు కానీ లేకుండా ఉన్నప్పుడు, ఆ మనుష్యులు అదంతా దేవుడి ఆశీర్వాదము అని కూడా విశ్వసిస్తూ జీవిస్తుంటారు. కానీ వాస్తవముగా, అది కేవలము దేవుడి కరుణ మాత్రమే. మీరు దేవుడి కరుణను మాత్రమే ఆస్వాదిస్తూ దానితో సంతృప్తి పడిపోరాదు. అటువంటి ఆలోచన చాలా నీచమైనది. నీవు దేవుని వాక్యములను ప్రతిరోజూ చదువుతున్నా సరే, ప్రతిరోజూ ప్రార్థిస్తున్నా సరే, నీ ఆత్మ గొప్పగా ఆనందిస్తున్నా సరే, ఎంతో ప్రశాంతతను పొందుతున్నా సరే, దేవుడి గురించి, ఆయన కార్యము గురించి చెప్పడానికి నీకు కొద్దిపాటి జ్ఞానము కూడా లేనట్లయితే, అలాగే, దేవుడి కార్యమును నువ్వు అనుభూతి పొందనట్లయితే, నీవు దేవుడి వాక్యమును ఎంతగా చదువుకున్నప్పటికీ, అది నిరర్ధకము. నీవు కేవలము ఆధ్యాత్మిక శాంతిని, ఆనందాన్ని పొందుతూ, దేవుడి వాక్యము నీకు మధురాతి మధురముగా అనిపిస్తూ, దానిని నీవు తనివి తీరనంతగా ఆస్వాదిస్తున్నప్పటికీ, ఎటువంటి దేవుని వాక్యములు విషయములో అయినా, నీవు వాస్తవమైన అనుభవం పొందనప్పుడు, ఆయన వాక్యములను నీవు నిజజీవితములో వాస్తవముగా అనుభూతి చెందనప్పుడు, దేవుడి పట్ల నీకు ఎంతటి విశ్వాసము ఉండి మాత్రము నువ్వు ఏమి లాభపడతావు? దేవుడి వాక్యముల సారాంశాన్ని నీవు నీ నిత్య జీవనములో ఆచరించని యెడల, ఆయన వాక్యములను నీవు అనుక్షణమూ పఠిస్తున్నా, స్మరిస్తున్నా, నీవు ఎన్ని ప్రార్థనలు చేస్తున్నా, అవి కేవలము దేవుని పట్ల నీకు ఉన్న విశ్వాసాన్ని తెలుపుతాయి తప్ప మరేమీ ఉపయోగకరము కాదు. అటువంటి మనుష్యులు దేవునిచే పరిపూర్ణులుగా తీర్చిదిద్దబడలేరు. వారిని దేవుడు సొంతము చేసుకొనలేడు. ఎవరు సత్యమును అనుసరిస్తారో వారినే దేవుడు సొంతము చేసుకుంటాడు. దేవుడు ఏమి సొంతము చేసుకుంటాడంటే, మనిషి శరీరమును కాదు, లేదా మనిషికి చెందిన వస్తువులను కాదు కానీ, అతనిలో భాగమై ఉన్న దైవితకతను దేవుడు సొంతం చేసుకుంటాడు. ఆ విధముగా, దేవుడు మనుష్యులను పరిపూర్ణులుగా చేసినప్పుడు, ఆయన వారి శరీరాలను పరిపూర్ణము చేయడు, కానీ వారి హృదయాలను పరిపూర్ణముగా తీర్చిదిద్దుతాడు. అప్పుడు, ఆ హృదయాలను దేవుడు సొంతం చేసుకుంటాడు. దీనిని బట్టి చెప్పగలిగినది ఏమిటంటే, దేవుడు మనిషిని పరిపూర్ణం చేశాడంటే, మనిషి హృదయాన్ని పరిపూర్ణము చేశాడని అర్థం. ఫలితముగా ఆ హృదయము దేవుడి వైపు మరలి ఆయనను ప్రేమిస్తూ తరిస్తుంది.
మనిషి శరీరము అశాశ్వతము. మనిషి శరీరమును పొందడం వల్ల దేవునికి కలిగే ఉపయోగము ఏమీ ఉండదు, ఎందుకంటే, మనిషి శరీరము అనివార్యముగా నశిస్తుంది, ఫలితముగా ఆయన వారసత్వాన్ని లేదా ఆశీర్వాదాలను పొందలేకపోతుంది. మనిషి శరీరమును దేవుడు పొందితే, ఆ మాంసపూరితమైన శరీరము మాత్రమే దైవస్రవంతిలో ఉంటుంది, కానీ అప్పుడు ఆ మనిషి శరీరము దైవస్రవంతిలో ఉన్నప్పటికీ, అతని హృదయము మాత్రము సాతానుకు చెంది ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, మనుష్యులు ఆ దేవుడి స్వరూపము కాలేరు, కానీ వారు దేవుడికి భారము కూడా కాగలరు, అప్పుడు దేవుడు మనుష్యులను ఎంచుకొనుటలో అర్థమే ఉండదు. దేవుడు ఎవరిని పరిపూర్ణులుగా మార్చాలి అనుకుంటాడో, వారు ఆయన ఆశీర్వాదములు ఇంకా ఆయన వారసత్వము పొందగలరు. ఇంకా చెప్పాలంటే, దేవుడు ఏమి కలిగి ఉన్నాడో, దానిని వారు కూడా పొందగలరు, ఫలితముగా దేవుడిలో ఉన్న దైవత్మమును వారు పొందగలరు, తద్వారా వారిలో అంతర్లీనంగా ఉండే దైవత్మముగా అది మారిపోవును; అప్పుడు ఆ దేవుడి వాక్యములన్నీ వారిలో ఇమిడిపోవును; దేవుడు ఎంతటి స్వరూపుడో, మీరు దానినంతా ఖచ్చితముగా పొందగలుగుతారు, ఆ తరువాత మీ జీవితమంతా ఆ సత్యముతో జీవించగలుగుతారు. దేవుడిచే పరిపూర్ణుడు అయిన వ్యక్తి ఈ విధముగా ఉంటాడు, ఇంకా అతడు దేవునిచే స్వీకరించబడతాడు. ఇటువంటి వ్యక్తి మాత్రమే దేవుడి ఆశీర్వాదములు పొందడానికి అర్హుడు కాగలుగుతాడు:
1. దేవుని ప్రేమనంతటినీ పొందగలగడం.
2. అన్ని విషయాలలోనూ దేవుడి చిత్తమునకు అనుగుణంగా వ్యవహరించడం.
3. దేవుని మార్గదర్శనమును పొందడం, దేవుని వెలుగులో జీవనం సాగించడం, ఇంకా దేవుని జ్ఞానమును పొందడం.
4. దేవుడు ఇష్టపడే విధమైన మనిషిగా ఈ భూమి మీద జీవించడం; పేతురు ప్రేమించిన విధముగా స్వచ్ఛముగా దేవుడిని ప్రేమించడం, దేవుని కోసం పేతురు సిలువ వేయబడిన విధముగా దేవుని ప్రేమ కోసం తనని తాను మార్చుకుని మరణించడానికి కూడా అర్హతను పొందడం; పేతురు పొందిన కీర్తిని అంతే సమానముగా పొందగలగడం.
5. ఈ భూమి మీద ప్రతి ఒక్కరి చేత ప్రేమించబడటం, గౌరవించబడటం ఇంకా ఆరాధించబడటం.
6. మరణానికి ఇంకా నరకానికి సంబంధించిన ప్రతి ఒక్క బంధాన్నీ అధిగమించడం, తన పనిని చేయడానికి సాతానుకు ఏ ఒక్క అవకాశాన్నీ ఇవ్వకుండా చేయడం, దేవుడి స్వాధీనములో ఉండటం, ఎల్లప్పుడూ ఉల్లాసముగా, స్వచ్ఛమైన మనసుతో జీవించడం, విసుగు చెందకుండా ఉండటం.
7. జీవించినంత కాలమూ అన్ని సమయాలలో అనిర్వచనీయమైన ఆనందాన్ని, ఉత్సాహాన్ని కలిగి ఉండటం, ఏ విధంగా అంటే, దేవుని దివ్యకీర్తి అరుదెంచిన రోజును ప్రత్యక్షముగా చూసిన విధంగా అనిర్వచనీయమైన అనుభూతిని పొంది ఉండటం.
8. దేవునితో పాటుగా కీర్తిని గెలుచుకోవడం, ఇంకా దేవునికి ఇష్టులైన పవిత్రమైన సెయింట్ల మాదిరిగా రూపాంతరం చెందడం.
9. ఈ భూమి మీద దేవుడు ఇష్టపడే వ్యక్తిగా మారడం, అనగా, ఆ ప్రియమైన దైవకుమారుడిగా తయారవ్వడం.
10. రూపాంతరం చెంది, దేవుని దివ్యమైన మూడవ స్వర్గమును చేరుకునే ప్రయత్నం చేయడం, ఇంకా ఈ మాంసపు శరీరాన్ని అధిగమించడం.
దేవుని ఆశీర్వాదములు పొందే మనుషులు మాత్రమే పరిపూర్ణులుగా మారతారు, ఆపై ఆ దేవునిచే పొందబడతారు. ప్రస్తుత కాలములో నీవు ఏదైనా పొంది ఉన్నావా? దేవుడు ఎంత మొత్తములో నిన్ను పరిపూర్ణుడిగా చేశాడు? దేవుడు ఏ మనిషిని యాదృచ్ఛికంగా పరిపూర్ణుడిని చేయడు; ఆయన మనిషిని పరిపూర్ణుడిని చేయడానికి ఒక నియమం ఉంటుంది, ఇంకా అందుకు చాలా స్పష్టమైన, సదృశ్యమైన ఫలితాలు కనిపిస్తాయి. మానవుడు ఊహించుకున్న విధంగా, తనకు దేవుని పట్ల విశ్వాసము కలిగి ఉన్నంత మాత్రముతోనే దేవునిచే తను పరిపూర్ణుడిని చేయబడతాడు, దేవునిచే పొందబడతాడు అనుకున్నట్లుగా అది జరగదు. అలాగే, కేవలం విశ్వాసము కలిగి ఉన్నంత మాత్రమున ఈ భూమి మీద దేవుని ఆశీర్వాదములు ఇంకా ఆయన వారసత్వము తనకు లభిస్తుంది అని కూడా అనుకుంటారు కానీ అది కేవలము ఊహాజనితము. అటువంటి సంఘటనలు చాలా కష్టసాధ్యమైనవి—చెప్పాలంటే, విశ్వాసము వల్ల మనుషుల రూపములు ఏ విధంగానూ మారవు. ప్రస్తుతము, మీరు ప్రధానంగా ఏమి కోరుకోవాలి అంటే అన్ని విషయాల యందు ఆ దేవునిచే మీరు పరిపూర్ణులుగా మార్చబడాలని కోరుకోవాలి. అందరు మనుషుల ద్వారా, వ్యవహారాల ద్వారా, మీరు ఎదుర్కొనే సంఘటనల ద్వారా ఆ దేవునిచే మీరు పరిపూర్ణులుగా మార్చబడాలి. ఏ విధముగా అంటే, దేవునిలోని వీలైనంత ఎక్కువ దివ్యత్వము మీలోకి ప్రవేశించేలా చేసుకోవాలి. మొదటగా మీరు ఈ భూమి మీద దేవుని వారసత్వమును అందుకోవాలి; అప్పుడు మాత్రమే మీరు ఆయన వారసత్వమును మరింతగా పొందడానికి, ఇంకా గొప్పగా, దేవుని ఆశీర్వాదములు కలిగి ఉండటానికి అర్హత సంపాదించగలుగుతారు. మీరు కోరుకోవలసిన అన్ని విషయాలు ఇవి మాత్రమే, వీటిని మీరు అన్నింటికన్నా ఎక్కువగా అర్థం చేసుకోవలసి ఉంటుంది. దేవునిచే పరిపూర్ణులు కావాలని మీరు ఎంత ఎక్కువగా కోరుకుంటే, అంత మొత్తంగా మీరు అన్ని విషయాలలోనూ ఆ దేవుని హస్తమును చూడగలుగుతారు. దాని ఫలితముగా మీరు వివిధ దృక్పథాలలోనూ, ఇంకా విభిన్నమైన వ్యవహారాలలోనూ, దేవుని వాక్యమును పొందడం కోసం ఆరాటపడతారు ఇంకా ఆయన వాక్యమును వాస్తవములో ఆచరించగలుగుతారు. కేవలము పాపములు చేయకుండా ఉండటం అనే నిష్క్రియ ద్వారా మీరు సంతృప్తి చెందరాదు, అలాగే, ఎటువంటి ఉద్దేశాలు, ఎటువంటి సిద్ధాంతాలు లేకుండా, ఎటువంటి మానవ సంకల్పమూ లేకుండా జీవించడం వల్ల కూడా ప్రయోజనం ఉండదు. దేవుడు మనిషిని ఎన్నో మార్గాలలో పరిపూర్ణుడిని చేస్తూ ఉంటాడు; అన్ని వ్యవహారాలలోనూ మనిషి పరిపూర్ణుడిగా మారడానికి అవకాశాలు ఉంటాయి. ఆయన నిన్ను కేవలం మంచి విషయాలలో మాత్రమే పరిపూర్ణుడిని చేయడు, చెడు విషయాల నుంచి కూడా నిన్ను కాపాడి, నీవు మరింత అధికంగా దేవుడి దివ్యత్వాన్ని పొందేలా చేయగలడు. దేవునిచే పరిపూర్ణుడిగా మారడానికి ప్రతి ఒక్క రోజూ ఎన్నో అవకాశాలు లభిస్తుంటాయి, అలాగే దేవునిచే పొందబడటానికి ఎన్నో సందర్భాలు ఏర్పడతాయి. కొద్దికాలం పాటు ఈ అనుభవాలను పొందిన తరువాత, నీవు గొప్పగా మార్పు చెందుతావు, ఆ తరువాత, గతంలో నీకు తెలియని చాలా విషయాలను నీవు సహజంగానే అర్థం చేసుకోగలుగుతావు. ఇక అప్పుడు ఇతరుల ఆదేశాల ప్రకారం నీవు నడుచుకునే అవసరం ఉండదు; నీకు ఎరుక లేకుండానే, దేవుడు నీకు జ్ఞానోదయం కలుగజేస్తాడు, ఫలితముగా నీవు అన్ని విషయాలలో జ్ఞానము పొంది, నీ అనుభవాలలోకి సవివరముగా ప్రవేశించగలుగుతావు. దేవుడు ఖచ్చితముగా నీకు మార్గదర్శనం చేసి, కుడిఎడమల వైపు తప్పటడుగులు వేయనీయకుండా, నిన్ను పరిపూర్ణుడిగా మార్చగల దివ్యపథము వైపు నిన్ను నడిపిస్తాడు.
దేవునిచే పరిపూర్ణుడిగా మారడం అనేది దేవుడి వాక్యమును నిరంతరం ఆస్వాదించడానికి మాత్రమే పరిమితం కాకూడదు. అటువంటి అనుభవము కేవలం ఏకపక్షముగా ఉండి, చాలా తక్కువ పరిణామంలో దివ్యత్వము సిద్ధించి, మనుషులకు చాలా తక్కువ అవకాశాలను కల్పిస్తుంది. అటువంటి పరిస్థితిలో, మనుషుల్లో ఆధ్యాత్మిక నిర్దేశనము అవసరమైన దానికంటే తక్కువే ఉంటుంది. మీరు గనుక దేవునిచే పరిపూర్ణులుగా మారాలని కోరుకున్న పక్షములో, అన్ని వ్యవహారములలోనూ దివ్య అనుభూతిని ఎలా పొందవచ్చునో, మీకు జరిగే అన్ని సంఘటనలలోనూ మీరు దివ్య జ్ఞానాన్ని ఎలా సంపాదించవచ్చునో మీరు తెలుసుకోవాలి. అది మంచి కానీ, చెడు కానీ, అది నీకు లబ్ధిని చేకూర్చాలి, ఇంకా మీలో చెడును దూరం చేయాలి. ఏది ఏమైనా, నీవు దేవుని పక్షమున నిలబడి పరిస్థితులను పరిశీలించగలగాలి కానీ, ఒక మానవమాత్రునికి ఉండే సాధారణ దృష్టితో ఆ పరిస్థితులను విశ్లేషించడం కానీ, అధ్యయనం చేయడం కానీ, చేయకూడదు (ఇది నీ అనుభూతికి విరుద్ధమైన మార్గము అవుతుంది). ఇటువంటి అనుభవమును నీవు పొందితే, అప్పుడు నీ జీవితపు భారములతో నీ గుండె నిండిపోతుంది; దేవుని రూపము యొక్క తేజస్సుతో నిరంతరమూ నీవు జీవించగలుగుతావు, అప్పుడు నీ సాధన నుండి నీవు పక్కదోవ పట్టకుండా నడుచుకుంటావు. అటువంటి మనుషులకు భవిష్యత్తు చాలా దివ్యముగా ఉంటుంది. దేవునిచే పరిపూర్ణులుగా మారడానికి ఎన్నో అవకాశాలు లభిస్తాయి. కానీ ఆ అవకాశాలన్నీ మీ మీదనే ఆధారపడి ఉంటాయి. దేవుడిని మీరు నిజముగా ప్రేమించే వారా, దేవునిచే పరిపూర్ణులు కావడానికి మీరు గట్టి సంకల్పం కలిగి ఉన్నారా, దేవునిచే పొందబడటానికి, ఆయన ఆశీర్వాదములు పొందడానికి, ఆయన వారసత్వమును పొందడానికి మీరు ఎంతగా కోరుకుంటున్నారో అనే విషయాలపైన మీరు దేవునిచే పరిపూర్ణులు కావడం అనేది ఆధారపడి ఉంటుంది. కేవలం సంకల్పం మాత్రమే ఉంటే సరిపోదు; మీకు తగిన జ్ఞానము ఉండాలి, లేని యెడల మిమ్మల్ని మీ సాధన నుండి పక్కదోవ పట్టించడానికి ఇతర మనుష్యులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. మీలో ప్రతి ఒక్కరినీ పరిపూర్ణులుగా మార్చడానికి దేవుడు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. ఇప్పటి పరిస్థితి ప్రకారం, సుదీర్ఘ కాలంగా మనుషులు దేవుని కార్యమును ఇప్పటికే ఆమోదించి ఉన్నప్పటికీ, వారు కేవలము దేవుని దివ్యత్వములో మనుగడ సాగించడానికే పరిమితం అయిపోతున్నారు. వారు తమ శరీరాలకు కేవలం కొద్దిపాటి సుఖమును సౌకర్యాన్ని ఆ దేవుని ద్వారా పొందడానికి మాత్రమే తమను తాము పరిమితం చేసుకుంటున్నారు. కానీ వారు దేవుని నుండి మరింత ఎక్కువగా, మరింత ఉన్నతంగా, దేవుని ప్రకటనలను పొందడానికి సిద్ధంగా ఉండటం లేదు. ఇది ఏమి చెబుతుందీ అంటే, ఒక మనిషి హృదయం ఎప్పుడూ వెలుపలే ఉంటుంది అని. ఒక మనిషి చేసే పని, అతని సేవ, దేవుని పట్ల ప్రేమ కలిగిన హృదయములో ఎటువంటి మలినాలు లేకున్నప్పటికీ, అతని అంతర్గతములోనూ, అతని ఆలోచనల నేపథ్యములోనూ, మనిషి ఎప్పుడూ తన శరీరానికి ప్రశాంతతనీ, ఆనందాన్నీ నిరంతరమూ కోరుకుంటూ ఉంటాడు. ఇంకా అతను దేవునిచే పరిపూర్ణుడు కాబడిన తరువాత ఎటువంటి పరిస్థితులు ఉంటాయో, వాటి ప్రయోజనాలు ఏమిటో తెలుసుకునే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటాడు. అందువలన, చాలామంది మనుషుల జీవితాలు అసహ్యకరంగానూ, నైతికపతనంతోనూ సాగుతుంటాయి. వారి జీవితాలలో కొద్దిగా కూడా మార్పు ఉండదు. దేవుని పట్ల విశ్వాసము కలిగి ఉండటానికి వారు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వరు. వారు ఇతరుల పట్ల విశ్వాసము కలిగి ఉన్నట్లుగా వ్యవహరిస్తూ, యథేచ్ఛగా వ్యవహరిస్తూ, కాలయాపన చేస్తూ, ఒక ప్రయోజనం లేని మనుగడను సాగిస్తూ పక్కదోవ పడుతుంటారు. అటువంటి మనుషులలో కొద్దిమంది మాత్రమే అన్ని విషయాలలో దేవుని వాక్యములోకి ప్రవేశించాలని కోరుకుంటూ, మరింత అధికముగా, మరింత సుసంపన్నమైన విషయాలను పొందగలుగుతుంటారు. అటువంటి వారు నేడు దేవుని గృహములో అత్యంత సంపదను కలిగిన మనుషులుగా వృద్ధి చెందుతారు. వారు దేవుని ఆశీర్వాదములను మరింత ఎక్కువగా పొందగలుగుతారు. నీకు కూడా అన్ని విషయాలలో దేవునిచే పరిపూర్ణుడివి కావాలని కోరుకున్నట్లయితే, ఈ భూమి మీద దేవుడు చేసిన వాగ్దానములను నీకు కూడా అందుకోవాలి అని అనుకున్నట్లయితే, అన్ని విషయాలలో దేవిని చేత జ్ఞానము పొందాలని ఆకాంక్షిస్తున్నట్లయితే, కాలగమనంలో సంవత్సరాలు కేవలము నిష్క్రియతో వృథా చేయనట్లయితే, క్రియాశీలకంగా మీరు ప్రవేశించతగిన మంచి మార్గము ఇదే. అప్పుడు మాత్రమే మీరు దేవునిచే పరిపూర్ణులు కావడానికి అర్హతను పొందుతారు. దేవునిచే పరిపూర్ణుడివి కావాలని నీవు నిజముగానే కోరుకుంటున్నావా? అన్ని విషయాలను తెలుసుకోవడం కోసం నీవు నిజముగా ఉత్సాహము కలిగి ఉంటున్నావా? పేతురుకు ఉన్న విధముగా దేవుడి పట్ల అదే ప్రేమ భావనను నీవు కూడా కలిగి ఉంటున్నావా? ఏసు ప్రభువు మాదిరిగా దేవుడిని ప్రేమించాలనే కోరికను నీవు కూడా కలిగి ఉన్నావా? ఏసు ప్రభువు పట్ల నీవు చాలా సంవత్సరాలుగా విశ్వాసాన్ని కలిగి ఉన్నావా? ఏసు ప్రభువు దేవుడిని ఏ విధముగా ప్రేమించాడో నీవు గమనించి ఉన్నావా? నీవు నిజముగానే ఏసు ప్రభువు పట్ల విశ్వాసము కలిగి ఉన్నావా? నీవు నేటి ఆచరణాత్మకమైన దేవుడి పట్ల విశ్వాసము కలిగి ఉన్నావా? మన శరీరములో ఉన్న ఆచరణాత్మకమైన దేవుడు ఆ స్వర్గములో ఉన్న దేవుడిని ఏ విధముగా ప్రేమిస్తున్నాడో నీవు గమనించి ఉన్నావా? ప్రభువైన ఏసు క్రీస్తు పట్ల నీకు విశ్వాసము ఉంది. ఎందుకనగా, మానవాళిని ఉద్ధరించడానికి ఏసు ప్రభువు శిలువ వేయబడినాడు ఇంకా ఆయన ప్రదర్శించిన అద్భుతాలు అందరికీ తెలిసిన వాస్తవాలే గనుక. అయినప్పటికీ, కేవలము ఏసు క్రీస్తు గురించి తెలుసుకోవడం ద్వారా, ఆయనను నిజముగా అర్థం చేసుకోవడం ద్వారా ఒక మనిషిలో విశ్వాసము ఏర్పడదు. నీవు కేవలము ఏసు ప్రభువు పేరును మాత్రమే విశ్వసిస్తున్నావు, కానీ ఆయన ఆత్మ పట్ల విశ్వాసము కలిగి ఉండటం లేదు. ఎందుకనగా, ఏసు ప్రభువు దేవుడిని ఏ విధముగా ప్రేమించాడో నీవు పట్టించుకునే పరిస్థితిలో ఉండవు. దేవుడి పట్ల నీకు గల విశ్వాసము చాలా స్వల్పమైనది. ఏసు ప్రభువును చాలా సంవత్సరాలుగా నీవు విశ్వసిస్తున్నప్పటికీ, దేవుడిని ఎలా ప్రేమించాలో నీకు తెలియదు. దీని వల్ల ఈ ప్రపంచంలోనే నీవు అతి పెద్ద మూర్ఖుడివి కావడం లేదా? ప్రభువైన ఏసు క్రీస్తు ఇచ్చిన ఆహారాన్ని నీవు చాలా సంవత్సరాలుగా వృథాగా భుజిస్తున్నావు అనడానికి ఇదియే రుజువు. నేను అటువంటి మనుషులను ఇష్టపడను సరికదా, నీవు పూజించే ప్రభువైన ఏసు క్రీస్తు కూడా అటువంటి వారిని ఇష్టపడడు అని నేను నమ్ముతాను. అటువంటి మనుషులు ఏ రకంగా పరిపూర్ణులు కాగలరు? అవమాన భారంతో నీ ముఖం కందిపోవడం లేదా? నీవు సిగ్గు పడటం లేదా? నీకు నిజముగా ఆ ప్రభువైన ఏసు క్రీస్తును ఎదుర్కొనే ధైర్యము ఉన్నదా? నేను చెప్పిన మాటలను మీరు అర్థం చేసుకోగలుగుతున్నారా?