దుష్టులు తప్పక శిక్షించబడతారు
మీరు చేసే ప్రతికార్యంలో మీరు ధర్మాన్ని పాటిస్తున్నారా మరియు మీ కర్మలన్నింటినీ దేవుడు గమనిస్తున్నాడా అని చూడటానికి మీలోనికి మీరు చూసుకోండి: దేవుణ్ణి నమ్మినవారు తమ వ్యవహారాలను నిర్వహించడంలో పాటించే మూలసూత్రం ఇదే. మీరు దేవుణ్ణి సంతృప్తిపరచగలుగుతారు కాబట్టి, మీరు దేవుని సంరక్షణ మరియు భద్రతను అంగీకరిస్తారు కాబట్టి మీరు ధర్మవర్తనులు అని పిలువబడతారు. దేవుని సంరక్షణ, భద్రత మరియు పరిపూర్ణతను అంగీకరించేవారందరూ అలాగే ఆయన సొంతమైనవారందరూ దేవుని దృష్టిలో ధర్మవర్తనులు మరియు వారందరినీ ఆయన ప్రియమైనవారిగా ఆదరిస్తాడు. దేవుని ప్రస్తుత వాక్యములను మీరు ఎంత ఎక్కువగా అంగీకరిస్తారో, అంతే ఎక్కువగా మీరు దేవుని చిత్తాన్ని పొందగలుగుతారు మరియు అర్థం చేసుకోగలుగుతారు మరియు మీరు అంతేఎక్కువగా దేవుని వాక్యములను జీవించగలుగుతారు మరియు ఆయన కోరికలను సంతృప్తి పరచగలుగుతారు. ఇదే మీకు దేవుని ఆజ్ఞ మరియు మీరందరూ సాధించగలిగేది ఇదే. దేవుడు మారనిమట్టివిగ్రహం అన్నట్టు దేవుడిని కొలవడానికి మరియు ఆయనకు హద్దులేర్పచడానికి మీరు మీసొంత అభిప్రాయాలను ఉపయోగిస్తే, మరియు మీరు దేవునికి పూర్తిగా బైబిల్ ప్రమాణాలలో హద్దులు నిర్ణయించి, పరిమిత కార్యపరిధికి ఆయనను పరిమితం చేస్తే, అప్పుడది మీరు దేవుణ్ణి ఖండించినట్టు రుజువు చేస్తుంది. ఎందుకంటే పాత నిబంధనయుగంలోని యూదులు, దేవుడు అంటే దైవదూత అని మాత్రమే పిలువబడాలి మరియు దైవదూత అని పిలువబడేవాడు మాత్రమే దేవుడు కాగలడు అన్నట్టు, దేవుడిని తమ హృదయాలలో నిలుపుకున్న స్థిరమైనరూపంగల విగ్రహంగా భావించారు, మానవాళి దేవుడిని మట్టివిగ్రహం (నిర్జీవమైన) అయినట్లు సేవించారు, పూజించారు, ఆయనకు మరణదండన విధిస్తూ ఆనాటి యేసును శిలువకు మేకులతో కొట్టారు, ఆవిధంగా పాపరహితుడైన యేసును మరణానికి గురిచేశారు. దేవుడు ఎటువంటి అపరాధమూ ఎరుగనివాడు, అయినప్పటికీ మనిషి ఆయనను వదిలిపెట్టడానికి నిరాకరించాడు మరియు ఆయనకు మరణదండన విధించాలని పట్టుబట్టాడు, అందువలన యేసు శిలువ వేయబడ్డాడు. మనిషి ఎల్లప్పుడూ దేవుడు మార్పుచెందనివాడని నమ్ముతాడు మరియు మనిషికి దేవుని నిర్వహణ గురించి పరిపూర్ణమైన అవగాహన ఉంది అన్నట్టు, దేవుడు చేసేదంతా మనిషి తన అరచేతిలో ఉంచుకున్నట్లు, ఒకేఒక్క పుస్తకం, అంటే బైబిల్ ఆధారంగా ఆయనను నిర్వచిస్తాడు. వ్యక్తులు విపరీతంగా అసంబద్ధంగా ఉంటారు, విపరీతంగా అహంకారంతో ఉంటారు మరియు ఆడంబరాలపట్ల వారందరికీ ఒక అభిరుచి ఉంటుంది. దేవుని గురించి నీకు ఎంత గొప్పజ్ఞానం ఉన్నా, నీకు దేవుడు తెలియదని, నీవు దేవుడిని అత్యధికంగా వ్యతిరేకించేవారిలో ఒకడివని మరియు నీవు దేవుడిని ఖండించావని నేను ఇప్పటికీ అంటాను, ఎందుకంటే నీవు దేవుని కార్యానికి విధేయత చూపడంలో మరియు దేవునిచే పరిపూర్ణుడిగా తయారుచేయబడుతున్న మార్గంలో నడుచుకోవడంలో పూర్తిగా అసమర్థుడివి. మనిషిచేసే కర్మలతో దేవుడు ఎప్పుడూ ఎందుకు సంతృప్తి చెందలేదు? ఎందుకంటే మనిషికి దేవుడు తెలియదు, ఎందుకంటే అతనికి చాలా అభిప్రాయాలు ఉన్నాయి, ఎందుకంటే దేవుని గురించి అతని పరిజ్ఞానం వాస్తవికతతో ఏవిధంగానూ ఏకీభవించదు, దానికి బదులుగా ఎలాంటి మార్పు లేకుండా ఏకరీతిన ఒకే నేపధ్యాన్ని పునరావృతం చేస్తాడు, ప్రతిసందర్భానికి ఒకేపద్ధతిని ఉపయోగిస్తాడు. కాబట్టి, ఈనాడు భూమిపైకి వచ్చిన తరువాత, దేవుడు మరోసారి మనిషిచేత శిలువ వేయబడ్డాడు. క్రూరమైన మానవజాతి! ఉపేక్ష మరియు కుతంత్రం, ఒకరినొకరు దోచుకోవడం మరియు లాక్కోవడం, కీర్తి మరియు సంపదకోసం పెనుగులాట, పరస్పరం నరుక్కోవడం—ఇది ఎప్పుడు అంతం అవుతుంది? దేవుడు వందలవేల వాక్యములు చెప్పినా, ఎవరూ మేల్కోలేదు. మనుష్యులు తమ కుటుంబాలు, కుమారులు మరియు కుమార్తెల కోసం, తమ ఉద్యోగాలు, భవిష్యత్తు అవకాశాలు, హోదా, ఆడంబరము మరియు డబ్బు కోసం, ఆహారం, బట్టలు మరియు దేహం కోసం పనిచేస్తారు. కానీ నిజంగా దేవుని కోసం పనిచేసేవారు ఎవరైనా ఉన్నారా? దేవుని కోసం పనిచేసేవారిలో కూడా, దేవుడిని తెలుసుకున్నవారు చాలా కొద్దిమంది మాత్రమే ఉన్నారు. ఎంతమంది తమ స్వప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరించకుండా ఉన్నారు? తమ సొంతహోదాను కాపాడుకోవడం కోసం ఎంతమంది ఇతరులను అణచివేయరు లేదా వెలివేయరు? కాబట్టి, దేవుడు అనేకసార్లు బలవంతంగా మరణదండన విధించబడ్డాడు, లెక్కలేనంత మంది అనాగరిక న్యాయమూర్తులు దేవుడిని ఖండించారు మరియు మరోసారి ఆయనకు శిలువ వేశారు. నిజంగా దేవుని కొరకు పనిచేస్తారు కాబట్టి ఎంతమందిని ధర్మవర్తనులుగా పిలువవచ్చు?
పవిత్రుడిగా లేదా ధర్మవర్తనుడిగా దేవుని ముందు పరిపూర్ణతను పొందడం అంత సులభమా? “ఈ భూమిపై ధర్మవర్తనులు లేరు, ధర్మవర్తనులు ఈ లోకంలో లేరు” అనేది ఒక నిజమైన ప్రకటన. మీరు దేవుని యెదుటకు వచ్చినప్పుడు, మీరు ఏమి ధరిస్తున్నారో పరిశీలించండి, మీ ప్రతి మాట మరియు పనిని, మీ ప్రతి ఆలోచన మరియు అభిప్రాయం మరియు మీరు ప్రతిరోజూ కనే కలలను కూడా పరిగణించండి—అవన్నీ మీ సొంత ప్రయోజనం కోసమే. నిజమైన పరిస్థితి ఇది కాదా? “ధర్మం” అంటే ఇతరులకు భిక్ష వేయడం అని కాదు, నీలాగే నీ పొరుగువారిని ప్రేమించడం అని కాదు, గొడవలు, వివాదాలు లేదా దోచుకోవడం, దొంగతనం మానుకోవడం అని అర్థం కాదు. ధర్మం అంటే దేవుని ఆజ్ఞను మీ విధిగా స్వీకరించడం మరియు సమయం లేదా ప్రదేశంతో సంబంధం లేకుండా, ప్రభువైన యేసు చేసిన అన్నిటిలాగే దేవుని కూర్పులను మరియు ఏర్పాట్లను పరలోకం-పంపిన మీ విధిగా పాటించడం. దేవుడు చెప్పిన ధర్మం ఇదే. లోతును ధర్మవర్తనుడు అని పిలవవచ్చు ఎందుకంటే ఆయన తన సొంత లాభనష్టాలను పరిగణనలోకి తీసుకోకుండా దేవుడు పంపిన ఇద్దరు దేవదూతలను రక్షించాడు; ఆ సమయంలో ఆయన చేసిన పనిని మాత్రమే ధర్మం అని చెప్పవచ్చు, కానీ అతన్ని ధర్మవర్తనుడైన మనిషి అనలేము. లోతు దేవుడిని చూశాడు కాబట్టి ఆయన తన ఇద్దరు కుమార్తెలను దేవదూతలకు బదులుగా ఇచ్చాడు, కానీ గతంలో అతని ప్రవర్తన అంతా ధర్మం కోసం నిలబడలేదు. కాబట్టి నేను “ఈ భూమిపై ధర్మవర్తనులు లేరు” అని అంటాను. పునరుద్ధరణ స్రవంతిలో ఉన్నవారిలో కూడా, ఎవరూ ధర్మవర్తనులు అని పిలవబడరు. నీ పనులు ఎంత మంచిగా కనిపించినా, నీవు దేవుని నామాన్ని ఎంత మహిమపర్చినట్టు కనిపించినా, ఇతరులను కొట్టడం, తిట్టడం, ఇతరులను దోచుకోవడం, కొల్లగొట్టడం చేయకపోయినా, నిన్ను ఇప్పటికీ ధర్మవర్తనుడివి అని పిలవలేరు, ఎందుకంటే ఇది సాధారణ వ్యక్తికి ఉండే సామర్థ్యమే. ప్రస్తుతం ఉన్న కీలకమైన విషయం ఏమిటంటే, నీకు దేవుడు తెలియదు. ప్రస్తుతం నీవు కొద్దిగా మామూలు మానవత్వాన్ని కలిగి ఉన్నావని మాత్రమే చెప్పవచ్చు, కానీ దేవుడు చెప్పిన ధర్మంలోని అంశాలు ఏవీ లేవు, కాబట్టి నీవు చేసే పనిలో దేనికీ నీకు దేవుడు తెలుసని రుజువు చేసే సామర్థ్యం లేదు.
గతంలో, దేవుడు పరలోకంలో ఉన్నప్పుడు, మనిషి దేవునిపట్ల మోసపూరితంగా ప్రవర్తించాడు. ఈనాడు, దేవుడు మనుష్యుల మధ్యనే ఉంటున్నాడు—ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా ఉన్నాడో ఎవరికీ తెలియదు—అయినా మనిషి పనులు చేయడంలో ఇంకా ఇష్టానుసారం వెళుతూ ఆయనను మోసంచేయడానికి ప్రయత్నిస్తున్నాడు. మనిషి తన ఆలోచనలో చాలా వెనుకబడిలేడా? యూదా విషయంలో కూడా అదే జరిగింది: యేసు ఆగమనానికి ముందు, యూదా తన సోదరులు మరియు సోదరీమణులను మోసంచేయడానికి అబద్ధాలు చెప్పేవాడు, యేసు ఆగమనం తర్వాత కూడా అతనిలో పరివర్తన లేదు; అతను యేసును కనీసంగా కూడా యెరుగడు, చివరికి అతను యేసుకు నమ్మకద్రోహం చేశాడు. ఇలా చేసింది అతను దేవుడిని యెరుగకపోవడం వల్ల కాదా? ఈనాటికీ, మీకు దేవుడు ఇంకా తెలియకపోతే, మీరు మరొక యూదాగా మారే అవకాశం ఉంది మరియు దీని తర్వాత సంభవించేది, రెండువేల సంవత్సరాల క్రితం కృపాయుగంలో జరిగినట్లే యేసును శిలువవేసే విషాదం మళ్లీ ప్రదర్శించబడడమే. మీరు దీన్ని నమ్మరా? ఇది వాస్తవం! ప్రస్తుతం, చాలామంది ఇదే పరిస్థితిలో ఉన్నారు—నేను ఈ విషయాన్ని బహుశా కొంచెం ముందే చెబుతున్నాను—అలాంటి వ్యక్తులందరూ యూదా పాత్రను పోషిస్తున్నారు. నేను అర్ధంలేని మాటలు మాట్లాడటంలేదు, కానీ వాస్తవం ఆధారంగా మాట్లాడుతున్నాను—మరియు నీవు ఒప్పుకోలేకపోవచ్చు. చాలామంది వినయం నటిస్తున్నప్పటికీ, వారి హృదయాలలో నాచుబట్టిన నీటిమడుగు, దుర్వాసనతో కూడిన నీటిగుంట తప్ప మరొకటి లేదు. ప్రస్తుతం చర్చిలో ఇలాంటివారు చాలామంది ఉన్నారు మరియు దీని గురించి నాకు పూర్తిగా తెలియదని మీరు భావిస్తున్నారు. ఈనాడు, నా ఆత్మ నాకోసం నిర్ణయం తీసుకుంటుంది మరియు నాకోసం సాక్ష్యమిస్తుంది. నాకు ఏమీ తెలియదని నీవు అనుకుంటున్నావా? మీ హృదయాలలోని మోసపూరిత ఆలోచనలు, మీరు మీ హృదయాలలో ఉంచుకున్న విషయాలు నాకు ఏమీ అర్థంకావని నీవు అనుకుంటున్నావా? దేవుని మెప్పు పొందడం అంత సులభమా? నీ ఇష్టం వచ్చినట్టు నీవు ఆయనతో వ్యవహరించవచ్చని అనుకుంటున్నావా? గతంలో, మీరు వివశులు అవుతారేమోనని నేను కొద్దిగా ఆందోళన చెందాను, కాబట్టి నేను మీకు స్వేచ్ఛను ఇస్తూనే వచ్చాను, కానీ మానవాళి వారిపట్ల నేను మంచిగా ఉన్నానని చెప్పలేక పోయింది మరియు నేను ఒక అంగుళం ఇచ్చినప్పుడు వారు ఒక గజం తీసుకున్నారు. మీరే ఒకరినొకరు ప్రశ్నించుకోండి: నేను దాదాపు ఎవరితోనూ వ్యవహరించలేదు మరియు ఎవరినీ కొద్దిగా కూడా మందలించలేదు—అయినా మనిషి యొక్క ప్రేరణలు మరియు ఆలోచనల గురించి నాకు చాలా స్పష్టంగా తెలుసు. తనకుతానే సాక్ష్యంగా నిలబడే దేవుడు, మూర్ఖుడు అని నీవు అనుకుంటున్నావా? అలా అనుకుంటే, నీవు చాలా గుడ్డివాడివని నేను అంటాను! నేను నిన్ను బహిరంగపర్చను, కానీ నీవు ఎంత అవినీతిపరుడవు కాగలవో ఊరికే చూద్దాం. నీజిత్తులమారి చిన్నచిన్న వ్యూహాలు నిన్ను రక్షించగలవేమో లేదా దేవుడిని ప్రేమించేందుకు నీవు అత్యుత్తమంగా ప్రయత్నించడం నిన్ను రక్షించగలదేమో చూద్దాం. ఈనాడు, నేను నిన్ను ఖండించను; నీపై దేవుడు ఎలా ప్రతీకారం తీర్చుకుంటాడో చూసే సమయం వరకు వేచి చూద్దాం. నీతో పనికిరాని కబుర్లు చెప్పే సమయం నాకు ఇప్పుడు లేదు మరియు కేవలం నీకోసం నాగొప్ప కార్యాన్ని ఆలస్యం చేయడం నాకు ఇష్టంలేదు. దేవుడు నీతో వ్యవహరించడానికి పట్టే సమయం నీలాంటి లార్వాకోసం అర్హమైనదికాదు—కాబట్టి నీవు ఎంతవరకు దుష్ప్రవర్తనగలవానిగా మారగలవో మాత్రమే చూద్దాం. ఇలాంటి మనుష్యులు దేవుడి గురించి కనీస జ్ఞానం కోసం ప్రయత్నించరు లేదా వారికి ఆయనపట్ల కనీస ప్రేమ కూడా ఉండదు, అయినా వారు దేవుడు తమను ధర్మవర్తనులుగా పిలవాలని కోరుకుంటారు—ఇది హాస్యాస్పదంకాదా? ఎందుకంటే, కొద్దిసంఖ్యలో మనుష్యులు వాస్తవానికి ధర్మవర్తనులు కాబట్టి, నేను మనిషికి జీవాన్ని అందించడంపై మాత్రమే దృష్టి పెడతాను. నేను ఈరోజు చేయవల్సింది మాత్రమే చేయిస్తాను, కానీ భవిష్యత్తులో ప్రతి ఒక్కరికి వారు చేసిన దాన్నిబట్టి నేను ప్రతీకారం తీర్చుకుంటాను. నేను చెప్పవలసినదంతా చెప్పాను, ఎందుకంటే ఇదే నేను ఖచ్చితంగా చేసే పని. నేను ఏమి చేయాలో అదే చేస్తాను మరియు నేను చేయకూడనిది చేయను. ఏదేమైనా, మీరు మననం చేసుకోవడంలో ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తారని నేను ఆశిస్తున్నాను: దేవుని గురించి నీజ్ఞానం ఎంతవరకు ఖచ్చితంగా నిజమైనది? మరోసారి దేవుడిని శిలువ వేసిన వారిలో నీవు ఒకడివా? నా చివరి మాటలు ఇవే: దేవుడికి శిలువ వేసిన వారికి శోకం కలుగుగాక.