మనిషి యొక్క సామాన్య జీవితమును పునరుద్దరించుట మరియు అద్భుతమైన గమ్యస్థానానికి అతణ్ణి తీసుకువెళ్ళుట

ఈ రోజున జరిగే కార్యమును మరియు భవిష్యత్తులో జరగబోయే కార్యమును కొంతమట్టుకు మనిషి అర్థం చేసుకుంటున్నాడు గానీ మానవాళియంత ప్రవేశించబోయే గమ్యాన్ని మాత్రం అర్థం చేసుకోవడం లేదు. సృష్టించబడిన జీవిగా, సృష్టించబడిన జీవి యొక్క కర్తవ్యాన్ని మనిషి తప్పకుండానెరవేర్చాలి: అతను చేసే ప్రతి దానిలో దేవుణ్ణి తప్పకుండ అనుసరించాలి; నేను మీకు చెప్పిన విధానములో మీరు ముందుకు కొనసాగుతూ వెళ్ళాలి. నీ అంతటికి నీవు ఆలోచించి నడుచుకోవడానికి నీకు అవకాశం లేదు మరియు నీపై నీకు పట్టు లేదు; అందరు దేవుని కరుణను ఆశ్రయించువారైయున్నారు మరియు ప్రతీది ఆయన హస్తాలలోనే ఉంచబడియున్నది. దేవుని కార్యము అనేది మనిషికి ఒక లక్ష్యాన్నో, అద్భుతమైన గమ్యాన్నో, కాలం కంటే ముందుగా అందించినట్లయితే, దేవుడు దీనిని మనిషిని వశపరచుకోవడానికి మరియు మనిషి ఆయనను వెంబడించడానికి ఉపయోగించుకొన్నట్లయితే, అంటే ఆయన మనిషితో ఒప్పందం చేసుకొని ఉన్నట్లయితే, అప్పుడు ఇది జయించు కార్యముగా ఎంచబడేది కాదు, లేక మానవ జీవితానికి జరిగించే కార్యముగా ఉండేది కాదు. మనిషి హృదయాన్ని గెలుచుకోవడానికి మరియు అతణ్ణి నియంత్రించడానికి దేవుడు మనిషి యొక్క గమ్యాన్ని ఉపయోగించుకొన్నాడా, అలాగైతే ఆయన మనిషిని పరిపూర్ణునిగా చేసేవాడు కాదు, లేక ఆయన మనిషిని సంపాదించుకునేవాడు కాదు గాని అతన్ని నియంత్రించడానికి గమ్యాన్ని ఉపయోగించుకొనేవాడ అయ్యేవాడు. నిరీక్షణ కలిగియుండుటకు మంచిది ఏదైనా ఉందా లేదా అనేదానితో సంబంధము లేకుండా మనుష్యులు భవిష్యత్తు ముగింపు, అంతిమ గమ్యముకంటే మరి దేనిని పట్టించుకోరు. జయించు కార్యము జరిగే సమయములో మనిషికి అందమైన నిరీక్షణను ఇచ్చినట్లయితే, మనిషిని జయించుటకు ముందుగా, వెంబడించడానికి అతనికి సరియైన గమ్యాన్ని ఇచ్చినట్లయితే, మనిషిని జయించు కార్యములోని ఫలితాలను సాధించకపోవడమే కాకుండా, జయించు కార్యము యొక్క ఫలితాలు మీద కూడా ఆ ప్రభావము పడుతుంది. ఈ విషయాన్ని మరొక విధంగా చెప్పాలంటే, మనిషికున్న తిరుగుబాటు స్వభావమును తీర్పు తీర్చి, శిక్షించుట ద్వారాను మరియు మనిషికున్న భవిష్యత్తులోని అవకాశాలను, విధిని తీసివేయుట ద్వారాను జయించు కార్యము తగు ఫలితాలను సాధిస్తుంది. ఇది మనిషితో ఒప్పందము చేసుకోవడము ద్వారా సాధించబడేది కాదు, అంటే మనిషికి ఆశీర్వాదములను మరియు కృపను ఇవ్వడం ద్వారా వచ్చేది కాదు గాని మనిషికున్న అవకాశాలను, అతనికున్న “స్వాతంత్ర్యమును” అతని నుండి తీసివేయుట ద్వారా మనిషికున్న విధేయతను బయలు పరచడం ద్వారా ద్వారా ఫలితాలు వస్తాయి. ఇదే జయించు కార్యము యొక్క గుణలక్షణమైయున్నది. ఆరంభములోనే మనిషికి అందమైన నిరీక్షణ ఇచ్చి, ఆ తరువాత మందలింపు మరియు తీర్పుల కార్యమును జరిగించినట్లయితే, అప్పుడు అతను కలిగియున్న అవకాశాలను ఆధారము చేసుకొని ఈ శిక్షను మరియు తీర్పును అంగీకరిస్తాడు. అంతిమంగా, దేవుడు సృష్టించిన సమస్త జీవుల ద్వారా సృష్టికర్తకు చూపించవలసిన షరత్తులులేని విధేయత మరియు జరిగించవలసిన ఆరాధన అనేవి ఉండవు; అప్పుడు అక్కడ గృడ్డితనము, నిర్లక్ష్యపూరితమైన అవిధేయతలే ఉంటాయి, లేక మనిషి గృడ్డిగా దేవుణ్ణి కోరికలను అడుగుతూనే ఉంటాడు. అప్పుడు మనిషి హృదయాన్ని సంపూర్ణముగా జయించడానికి అసాధ్యమవుతుంది. తద్వారా, మనిషిని సంపాదించుకోవడం అనేది అటువంటి జయించు కార్యమువలన అసాధ్యమే. అంతేగాకుండా, అటువంటి కార్యము ద్వారా దేవునికి సాక్ష్యము కలిగియుండడం అనేది కూడా అసాధ్యమే. సృష్టించబడిన అటువంటి జీవులు తమ కర్తవ్యాన్ని జరిగించలేరు మరియు దేవునితో కేవలం బేరసారాలు ఆడుతూనే ఉంటారు; దీనిని జయించడం అని అనరు గానీ దీన్ని కరుణ, ఆశీర్వాదం అని అంటారు. మనిషితో ఉన్న అతి పెద్ద సమస్య ఏమిటంటే తనకున్న విధి మరియు అవకాశాలు తప్ప మరిక దేని గురించి ఆలోచించక, వీటినే ఆరాధిస్తూ ఉంటాడు. మనిషి తనకున్న విధి మరియు భవిష్యత్తులోని అవకాశాల కొరకు మాత్రమే దేవుణ్ణి వెంబడిస్తాడు; ఆయన మీద అతనికి ప్రేమ ఉన్నందువలన అతను దేవుణ్ణి ఆరాధించడు. అందుచేత, మనిషిని జయించుటలో మనిషికున్న స్వార్థం, లోభం మరియు అతను దేవుణ్ణి ఆరాధించకుండా అడ్డగించే ప్రతి దానిని గమనించి, తొలగించుకోవాలి. ఈ విధంగా చేయుట ద్వారా మనిషిని జయించుటలో ఫలితాలు సాధించబడతాయి. తత్ఫలితంగా, మనిషిని జయించే మొదటి దశలలో మనిషికున్న క్రూరమైన ఆశయాలను మరియు అత్యంత ప్రాణాంతకమైన బలహీనతలను తొలగించుకోవడం ఎంతో అవసరం. ఈ విధంగా చేయడం ద్వారా, దేవునిపట్ల మనిషికున్న ప్రేమను బయలుపరచడం మరియు మానవ జీవితముపట్ల అతనికున్న అవగాహనను, దేవుని విషయమైన తనకున్న దృష్టికోణమును మరియు తన ఉనికికున్న అర్థాన్ని మార్చుకోవడము అవసరం. ఈ విధంగా, దేవునిపట్ల మనిషికున్న ప్రేమ శుద్ధీకరించబడుతుంది, అంటే మనిషి హృదయం జయించబడుతుందన్నమాట. అయితే, సమస్త జీవులపట్ల దేవునికున్న ధోరణిలో జయించుట కొరకు మాత్రమే దేవుడు జయించడు; ఆయన స్వంత మహిమ కొరకు మాత్రమే, ఆయన మనిషిని సంపాదించుకోవాలనే క్రమములో మరియు ఆరంభములో ముందున్న అసలు మనిషివలె పూర్వ వైభవమును తీసుకు వచ్చే క్రమములో జయిస్తాడు. జయించుట కొరకు మాత్రమే ఆయన జయించినట్లయితే, జయించు కార్యము యొక్క ప్రాముఖ్యత ఏమీ ఉండదు. అలాంటప్పుడు, మనిషిని జయించిన తరువాత, దేవుడు మనిషి హస్తాలను కడిగాడు మరియు మనిషి జీవము కొరకు లేక మనిషి మరణం కొరకు ఏమీ చెల్లించలేదని చెప్పాలి. అప్పుడు దీనిని మానవాళి యొక్క నిర్వహణ కార్యమని గాని, లేక మనిషి రక్షణ కొరకు మాత్రమే మనిషిని జయించు కార్యమని గాని పిలవరు. అతని విజయాన్ని అనుసరించి మనిషిని సంపాదించుకోవడం మరియు అద్భుతమైన గమ్య స్థానానికి అతను అంతిమంగా చేరుకోవడమే రక్షణ కార్యమంతటి యొక్క ముఖ్య కేంద్రమైయున్నది మరియు కేవలము ఇది మాత్రమే మనిషి యొక్క రక్షణ కార్యము యొక్క లక్ష్యాన్ని సాధించగలదు. మరొక విధంగా చెప్పాలంటే, అద్భుతమైన గమ్య స్థానానికి మనిషి చేరుకోవడం మరియు అతను విశ్రాంతిలోనికి ప్రవేశించడం అనే భవిష్యత్తుకు సంబంధించిన విషయాలను మాత్రమే సృష్టించబడిన ప్రతి జీవి స్వంతం చేసుకోవాలి మరియు సృష్టికర్త ద్వారా జరగవలసిన కార్యము ఇదే. ఈ కార్యమును మనిషి చేసినట్లయితే, ఇది చాలా పరిమితంగా ఉంటుంది: ఇది మనిషి ఒక నిర్దిష్టమైన స్థానానికి తీసుకు వెళ్తుంది గానీ ఇది మనిషిని నిత్య గమ్యానికి తీసుకు వెళ్ళలేదు. ఒక మనిషి మరొక మనిషి యొక్క గమ్య స్థానాన్ని నిర్ణయించలేడు, లేక భవిష్యత్తులో మనిషికి జరగబోయే విషయాలకు మరియు భవిష్యత్తు గమ్యానికి హామీ ఇవ్వలేడు. ఏదేమైనా, దేవుని ద్వారా జరిగిన కార్యము విభిన్నమైనది. అతణ్ణి ఆయన సృష్టించినందున, ఆయన అతణ్ణి నడిపిస్తాడు; అతణ్ణి ఆయన రక్షించుచున్నందున, ఆయన అతణ్ణి పూర్తిగా రక్షిస్తాడు మరియు ఆయన అతణ్ణి సంపూర్ణముగా సంపాదించుకుంటాడు; ఆయన మనిషిని నడిపిస్తున్నందున, ఆయన అతణ్ణి సరియైన గమ్య స్థానానికి తీసుకు వస్తాడు; ఆయన మనిషిని సృష్టించి, నడిపిస్తున్నందున, ఆయన తప్పనిసరిగా మనిషి యొక్క విధి మరియు భవిష్యత్తులోని భరోసాల కొరకు బాధ్యత తీసుకోవాలి. ఇదీ సృష్టికర్త ద్వారా జరిగించబడవలసిన కార్యమైయున్నది. మనిషి తనకున్న దురాశలను ప్రక్షాళన చేసుకోవడము ద్వారా జయించు కార్యము సాధించుకొనినప్పటికీ దేవుని ద్వారా తన కొరకు సిద్ధము చేసిన ఉంచిన సరియైన గమ్య స్థానములోనికి మనిషి అంతిమంగా తీసుకు రాబడాలి. ఇది ఖచ్చితంగా జరగాలి ఎందుకంటే మనిషి గమ్య స్థానాన్ని కలిగియున్నాడని మరియు తన భవిష్యత్తుకు హామీ ఇవ్వబడియున్నదని దేవుడు మనిషిపై కార్యము జరిగించుచున్నాడు. ఇక్కడ, సూచించబడిన సరియైన గమ్యస్థానము అనేది మనిషికున్న ఆశలు కాదు మరియు గతములో ప్రక్షాళించబడిన దురాశలు కాదు; అవి రెండు విభిన్నమైనవి. మనిషి ఆశ పెట్టుకొనిన విషయాలు మరియు తను అనుసరించే విషయాలన్నీ మనిషినిబట్టి నియమించబడిన గమ్యస్థానమును అనుసరించుటకంటే శరీరము యొక్క విపరీతమైన కోరికలను అతను అనుసరించుట నుండి ఉత్పన్నమైన కోరికలే. ఇది ఇలా ఉండగా, దేవుడు మనిషి వేటిని సిద్ధము చేశాడంటే మనిషి ఒక్కసారి పవిత్రుడైనప్పుడు మనిషినిబట్టి ఆశీర్వాదాలను మరియు వాగ్దానములను సిద్ధము చేసి ఉంటాడు, ఇవి లోకమును సృష్టించిన తరువాత దేవుడు మనిషి కొరకు సిద్ధము చేసినవి మరియు మనిషి శరీరాన్నిబట్టి గాని లేక మనిషి ఎంపికలనుబట్టి, ఆలోచనలనుబట్టి, ఊహలనుబట్టి కలుషితమైనవి కాదు. ఈ గమ్యస్థానము అనేది ఒక వ్యక్తి కొరకే సిద్ధము చేయబడియుండలేదు గాని ఇది సర్వ మానవాళి విశ్రాంతి తీసుకునే స్థలమైయున్నది. అందుచేత, ఈ గమ్యస్థానము మానవాళియంతటికీ తగిన గమ్యస్థానమైయున్నది.

సృష్టికర్త సర్వ జీవులను సరియైన విధంగా నడిపించాలని ఉద్దేశించియున్నాడు. ఆయన జరిగించే ఏ కార్యమునకైన నువ్వు అవిధేయత చూపకూడదు, తిరస్కరించకూడదు, లేక ఆయనపై తిరుగుబాటు చేయకూడదు. ఆయన తన కార్యమును జరిగించినప్పుడు అంతిమంగా ఆయన అనుకున్నది సాధిస్తాడు, ఇందులో ఆయన మహిమను పొందుకుంటాడు. ఈ రోజున నువ్వు మోయాబు సంతానమని, లేక గొప్ప ఘట సర్పము యొక్క సంతానమని ఎందుకు చెప్పలేదు? ఏర్పరచుకోబడిన ప్రజలను గురించి ఎందుకు మాట్లాడుకోవడం లేదు మరియు ఎందుకు సృష్టించబడిన జీవులను గురించే మాట్లాడుకోవడం జరుగుతోంది? సృష్టించబడిన జీవి అనేది మనిషికివ్వబడిన నిజమైన పేరు, ఇదే అతని సహజసిద్ధంగా వచ్చిన గుర్తింపుయైయున్నది. యుగాలు మరియు కార్యము జరిగిన కాలాలు మారుతూ ఉన్నందున పేర్లు మారుతూ ఉంటాయి; వాస్తవానికి, మనిషి ఒక సామాన్య జీవి. సృష్టించబడిన జీవులలో భ్రష్టుపట్టినవైనా, లేక అతి పవిత్రమైనవైనా, అవి తప్పకుండ సృష్టించబడిన జీవి యొక్క కర్తవ్యాన్ని జరిగించాల్సిందే. దేవుడు జరిగించు కార్యమును జరిగిస్తూ ఉన్నప్పుడు, నీకున్న దురాశలను, విధిని లేక గమ్యస్థానాన్నిబట్టి ఆయన నిన్ను నియంత్రించడు. వాస్తవానికి ఆయన విధంగా కార్యమును జరిగించవలసిన అవసరము లేదు. జయించు కార్యము యొక్క ముఖ్య లక్ష్యము ఏమనగా సృష్టించబడిన జీవి యొక్క కర్తవ్యాన్ని మనిషి జరిగించునట్లు చేయడమే, సృష్టి కర్తను ఆరాధించేలా చెయ్యడమే; ఇది జరిగిన తరువాత మాత్రమే మనిషి అద్భుతమైన గమ్యస్థానములోనికి ప్రవేశిస్తాడు. మనిషి యొక్క విధి దేవుని హస్తాల ద్వారా నియంత్రించబడుతుంది. నిన్ను నువ్వు నియంత్రించుకోలేవు: మనిషి తన పక్షాన తాను ఎల్లప్పుడూ పరిగెడుతూ, తన పనిలో తాను నిమగ్నమైయున్నప్పుడు, తనను తాను నియంత్రించుకునే స్థితిలో ఉండడు. నీ స్వంత ఆశలను గురించి నీవు తెలుసుకున్నట్లయితే, నీ విధిని నీవు నియంత్రించుకున్నట్లయితే, అప్పుడు నీవు సృష్టించబడిన వ్యక్తిగా ఉంటావా? సంక్షిప్తంగా, దేవుడు తన కార్యములను ఏ విధంగా చేస్తాడనేదానితో సంబంధములేకుండా, ఆయన చేసే కార్యమంతా కూడా కేవలము మనిషి కోసం మాత్రమే అన్నట్లు ఉంటుంది. ఉదాహరణకు, మనిషికి సేవ చేయుటకు దేవుడు భూమ్యాకాశములను మరియు సమస్తమును సృష్టించాడు: మనిషి కొరకు ఆయన చేసిన సూర్య చంద్ర నక్షత్రాలు, చెట్లు మరియు ప్రాణులు, వసంత ఋతువు, ఎండాకాలం, శరత్కాలం మరియు చలికాలం, ఇలా మొదలగునవన్నీ కేవలము మనిషి యొక్క ఉనికి కొరకు మాత్రమే చేయబడ్డాయి. అందుచేత, దేవుడు మనిషిని ఎలా శిక్షిస్తాడో, ఎలా తీర్పు తీరుస్తాడో అనే దానితో సంబంధము లేకుండా, ఇదంతా మనిషి రక్షణ పొందడం కొరకు మాత్రమే జరిగించబడుతోంది. ఆయన మనిషి యొక్క శరీర కోర్కెలను తొలగించినప్పటికి, ఇదంతా కూడా మనిషిని శుద్ధి చేయడానికే మరియు మనిషి జీవించడానికే శుద్ధి చేయడమనేది జరుగుతుంది. మనిషి యొక్క గమ్యస్థానము సృష్టికర్త హస్తాలలో ఉంది, అలాంటప్పుడు మనిషి తననుతాను ఎలా నియంత్రించుకోగలడు?

జయించు కార్యము సంపూర్ణముగా ముగించబడినప్పుడు, మనిషి అద్బుతమైన ప్రపంచములోనికి తీసుకురాబడతాడు. అంటే, ఈ జీవితము భూమి మీదనే ఉంటుందనుకోండి, అయితే ఈ రోజు మనిషి కలిగియున్న జీవితానికి విరుద్ధంగా ఉంటుంది. ఈ జీవితాన్ని సమస్త మానవాళి జయించబడిన తరువాత మానవాళి పొందుకుంటారు, ఇది భూమి మీద మనిషికి క్రొత్త ఆరంభం, ఎందుకంటే సమస్త మానవాళి సరిక్రొత్త అందమైన ప్రపంచములోనికి ప్రవేశించారనేందుకు రుజువుగా మానవాళి అటువంటి జీవితమును కలిగియుంటారు. ఇది భూమి మీద దేవునికి మరియు మనిషి జీవితానికి ఆరంభమైయుంటుంది. మనిషి పవిత్రీకరించబడిన తరువాత, జయించబడిన తరువాత, అటువంటి అందమైన జీవితానికి ఆధారం అలాగే ఉంటుంది, సృష్టికర్త ఎదుట మనిషి తనను సమర్పించుకుంటాడు. అందుచేత, సమస్త మనుష్యులు అద్భుతమైన గమ్యస్థానములోనికి ప్రవేశించుటకు ముందుగా జయించు కార్యము అనేది దేవుని కార్యములోని చివరి దశయైయుంటుంది. అటువంటి జీవితమే భూమి మీద మనిషి యొక్క భవిష్యత్తు జీవితమైయున్నది, భూమి మీద అత్యంత అందమైన జీవితమైయున్నది, మనిషి కోరుకునే మంచి జీవితమైయున్నది, ఇటువంటి జీవితాన్ని మనషి ప్రపంచ చరిత్రలో మునుపెన్నడూ సాధించలేదు. ఇది 6,000 సంవత్సరాల కార్య నిర్వహణ యొక్క ఫలితమైయుంటుంది; ఇటువంటి జీవితము కొరకే సమస్త మానవాళి పరితపిస్తున్నారు మరియు ఇదే దేవుడు మనిషికిచ్చిన వాగ్దానమైయున్నది. అయితే, ఈ వాగ్దానము అంత త్వరగా నెరవేర్చబడదు: ఒకసారి అంత్య దినాలలోని కార్యము పూర్తి చేయబడిన తరువాత భవిష్యత్తులోని గమ్యస్థానములోనికి మనిషి ప్రవేశిస్తాడు మరియు అతను సంపూర్ణముగా జయించబడతాడు, అంటే సాతాను సంపూర్ణముగా ఓడించబడతాడు. మనిషి శుద్ధీకరించబడిన తరువాత, అతను పాపభూయిష్టమైన స్వభావము లేకుండ ఉంటాడు, ఎందుకంటే దేవుడు సాతానును ఓడించాడు, అంటే శత్రు మూక ఆక్రమణలు ఉండవని అర్థం మరియు మానవ శరీరముపైన దాడి చేయగలిగే ఎటువంటి శత్రు మూకలు ఉండవు. అప్పుడు మనిషి స్వతంత్రుడై, పరిశుద్ధుడుగా ఉంటాడు, అంటే అతను నిత్యత్వములోనికి ప్రవేశించాడని అర్థం. అంధకార శత్రు సైన్యములు బంధించబడితేనే మనిషి ఎక్కడికి వెళ్ళిన స్వతంత్రముగా ఉండగలడు, అప్పుడతను ఎటువంటి తిరస్కారము లేక తిరుగుబాటుతనము లేకుండా ఉండగలడు. సాతాను బంధించబడియుండాలి, అప్పుడు మనిషితో అన్ని బాగానే ఉంటాయి; ప్రస్తుత పరిస్థితి ఇలా ఉందంటే కారణం సాతాను భూమి మీద ప్రతి చోట సమస్యను రేకెత్తిస్తున్నాడు, ఎందుకంటే దేవుని కార్యనిర్వాహణ యొక్క సమస్త కార్యము భూదిగంతముల వరకు చేరాలి. ఒకసారి సాతాను ఓడించబడిన తరువాత, మనిషి సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని పొందుకొని ఉంటాడు; మనిషి దేవుణ్ణి సంపాదించుకున్నప్పుడు, సాతాను అధికారము నుండి బయటకు విడిపించబడతాడు, అప్పుడు అతను నీతి సూర్యుని కలిగియుంటాడు. సామాన్య మనిషి జీవితాన్ని తిరిగి పొందుకుంటాడు; సామాన్య మనిషి ద్వారా సమస్తము స్వాధీనపరచబడాలి, అంటే మంచి చెడులను వివేచించే సామర్థ్యాన్ని తిరిగి పొందుకోవాలి మరియు తనకు తాను ఎలా తినాలి, ఎలా ధరించుకోవాలో అర్థము చేసుకోవాలి మరియు సామాన్యముగా జీవించే సామర్థ్యాన్ని కలిగియుండాలి, ఇవన్నీ తిరిగి పొందుకోవాలి. సర్పము ద్వారా హవ్వ శోధించబడకుంటే ఆరంభములో అతను సృష్టించబడిన తరువాత మనిషి ఇటువంటి సామాన్య జీవితమునే కలిగియుండేవాడు. అతను ఈ భూమి మీద తింటూ, ధరించుకుంటూ సామాన్య జీవితమునుగడిపి ఉండేవాడు. అయినా, మనిషి పతనమైపోయిన తరువాత, ఈ జీవితం సాధించలేని ఊహా ప్రపంచముగానే మిగిలిపోయింది, ఈ రోజుటికి మనిషి అటువంటి సంగతులను ఊహించుకోవడానికి కూడా సాహసం చేయడము లేదు. వాస్తవానికి, మనిషి ఆశించుకునే ఇటువంటి అందమైన జీవితము అవసరమే. మనిషి అటువంటి గమ్యస్థానాన్ని కలిగియుండకపోయినట్లయితే, ఈ భూమి మీద చెడిపోయిన తన జీవితానికి ముగింపు ఉండదు. అటువంటి అందమైన జీవితమే లేకపోయినట్లయితే, సాతాను విధికి, లేక భూమిపై సాతాను కలిగియున్న అధికారములోని యుగానికి ముగింపు అనేదే ఉండేది కాదు. చీకటి శక్తులు చేరుకోలేని ప్రపంచానికి మనిషి చేరుకోవాలి, అలాగు మనిషి చేసినప్పుడు సాతాను ఓడిపోయాడని నిరూపించబడుతుంది. ఈ విధంగా, సాతాను ద్వారా ఎటువంటి ఆటంకము కలగనప్పుడు, స్వయంగా దేవుడే మానవాళిని నియంత్రిస్తాడు మరియు మానవ జీవితాన్ని తన అధీనములో ఉంచుకొని, తన జీవితాన్ని ఆదేశిస్తాడు; అప్పుడే సాతాను నిజంగా ఓడిపోయాడని అర్థం. ఈ రోజున మనిషి జీవితము అపవిత్రమైన జీవితమైయున్నది; అది ఇంకా బాధలతోను మరియు శ్రమలతోను నిండిన జీవితమైయున్నది. దీనిని సాతాను ఓటమి అని అనరు; మనిషి ఇంకా సముద్రమంత బాధనుండి తప్పించుకోబడవలసియున్నాడు, మనిషి ఇంకా మానవ జీవితమనే కష్టాల కొలిమి నుండి, లేక సాతాను ప్రభావము నుండి తప్పించబడవలసియున్నాడు మరియు అతను దేవుని అనంతమైన జ్ఞానమును పొందుకొనవలసియున్నాడు. మనిషి ఎదుర్కునే సమస్త కష్టాలన్నీ సాతాను ద్వారానే సృష్టించబడ్డాయి; మనిషి జీవితానికి శ్రమలను తీసుకు వచ్చించే సాతాను. అందుచేత, సాతాను బంధించబడిన తర్వాతే మనిషి సంపూర్ణముగా కష్టాల సముద్రము నుండి తప్పించుకోగలడు. అయితే, మనిషి హృదయాన్ని జయించుట ద్వారా, సంపాదించుకొనుట ద్వారా మరియు సాతానుతో జరిగించే యుద్ధములో మనిషి నిర్వీర్యము చేయుట ద్వారా సాతాను బంధించబడతాడు.

ఈ రోజున మనిషి ఈ భూమి మీద సామాన్య జీవితము కలిగియుండక మునుపు అతను జయించబడినవానిగాను మరియు పరిపూర్ణునిగాను మారేందుకు పరుగెడుతూ ఉంటాడు. సాతాను బంధించబడక ముందు అతను వెదికే విషయాలవి. ప్రాముఖ్యంగా, మనిషి జయించువానిగాను మరియు పరిపూర్ణునిగాను మారే తన పరుగు, లేక గొప్పగా ఉపయోగించబడాలనే తన ప్రయాస సాతాను ప్రభావము నుండి తప్పించుకోవడానికే: మనిషి అలా వెదికినప్పుడే జయించువానిగా మారుతాడు, అయితే చివరి ఫలితార్థము ఏమనగా సాతాను ప్రభావము నుండి తప్పించబడతాడు. సాతాను ప్రభావము నుండి తప్పించుకోవడం ద్వారా మాత్రమే భూమి మీద సామాన్యమైన మానవ జీవితనాన్ని నడిపించుకోగలడు, దేవుణ్ణి ఆరాధించే జీవితాన్ని కలిగియుండగలడు. ఈ రోజున మనిషి జయించబడాలని, పరిపూర్ణుడవ్వాలనేవి ఈ భూమి మీద సామాన్య మానవ జీవితాన్ని కలిగియుండె క్రమములోనే జరిగించబడతాయి. అవి ప్రాథమికంగ సృష్టికర్తను ఆరాధించే క్రమములో భాగంగా సత్యాన్ని ఆచరణలో పెట్టడానికి మరియు శుద్ధీకరించబడడానికి మాత్రమే జరిగించబడతాయి. మనిషి ఈ భూమి మీద సామాన్య జీవితాన్ని, ఎటువంటి కష్ట నష్టాలు బాధలు లేనటువంటి జీవితాన్ని పొందుకొనినట్లయితే, మనిషి జయించువానిగా ఉండడానికి ఎటువంటి ప్రయాస పడనక్కరలేదు. “జయించువానిగా మారడం” మరియు “పరిపూర్ణుడవ్వడం” అనేవి మనిషి వెంబడించాలని దేవుడు మనిషికిచ్చిన లక్ష్యాలైయున్నవి మరియు ఈ లక్ష్యాలను వెంబడించడం ద్వారానే సత్యాన్ని ఆచరణలో పెట్టాలని మరియు అర్థవంతమైన జీవితాన్ని జీవించాలని ఆయన మనిషిని బలపరుస్తున్నాడు. ఇక్కడ మనిషిని సంపూర్ణునిగా చేయడం మరియు అతనిని సంపాదించుకోవడమే ఇక్కడ ముఖ్య లక్ష్యం. అందుకే, జయించువానిగాను మరియు పరిపూర్ణునిగాను మారడమనేది కేవలం ఒక సాధనమైయున్నది. భవిష్యత్తులో మనిషి అద్భుతమైన ప్రపంచములోనికి ప్రవేశించినప్పుడు అక్కడ జయించువానిగాను మరియు పరిపూర్ణుడగుటకును అవకాశం ఉండదు; అక్కడ సృష్టించబడిన ప్రతి జీవి తన కర్తవ్యమును జరిగించుటయే ఉంటుంది. ఈ రోజు మనిషి కొరకు నిరీక్షణను నిర్వచించు క్రమములో కేవలము ఈ విషయాలను అనుసరించడానికే మనిషి ఉన్నాడు, తద్వారా మనషి యొక్క అనుసరణ మరింత ఎక్కువ లక్ష్యంగాను మరియు ఆచరణాత్మకంగాను ఉంటుంది. ఇలాకాకపోతే, మనిషి అస్పష్టమైన వాటి మధ్యన జీవిస్తూ, నిత్యజీవములోనికి ప్రవేశించుటకు ఆరాటపడతాడు. ఇది ఇలాగే ఉన్నట్లయితే, మనిషి మరింత ఎక్కువగా దుస్థితికి చేరుకోడా? ఎటువంటి లక్ష్యాలు, లేక ఎటువంటి నియమాలు లేకుండా ఈ విధంగానే బ్రతకడం అనేది తనను తాను మోసపుచ్చుకోవడం కాదా? అంతిమంగా, ఇటువంటి జీవితము స్వాభావికముగానే ఫలాలు లేనటువంటి జీవితమే కదా; ముగింపులో, మనిషి సాతాను అధికారము క్రిందనే జీవించవలసి ఉంటుంది మరియు ఆ అధికారము నుండి తనను తాను విడిపించుకోలేని స్థితిలో ఉండిపోతాడు. ఎటువంటి లక్ష్యములేని జీవితానికి ఎందుకు గురయ్యాడు? నిత్య గమ్య స్థానములోనికి మనిషి ప్రవేశించినప్పుడు, మనిషి సృష్టికర్తను ఆరాధిస్తాడు. ఎందుకంటే, మనిషి రక్షణను సంపాదించుకున్నాడు మరియు నిత్యత్వములోనికి ప్రవేశించాడు, ఇక మనిషి ఎటువంటి లక్ష్యాలను కలిగి జీవించడు, లేక సాతాను ద్వారా పట్టుబడతానేమోనన్న చింతను కలిగియుండడు. ఇటువంటి సమయములో మనిషి తన స్థానాన్ని తెలుసుకుంటాడు మరియు తన కర్తవ్యాన్ని నెరవేరుస్తాడు. వారు శిక్షించబడకపోయినా, లేక తీర్పు తీర్చబడకపోయినా, ప్రతి వ్యక్తి తమ విధులను నిర్వర్తిస్తారు. ఆ సమయములోనే మనిషి తన గుర్తింపులోను మరియు తనకున్న స్థాయిలోను ఒక జీవిగా ఉంటాడు. అప్పుడు తక్కువ ఎక్కువ భేదాలనేవి ఉండవు. ప్రతీ మనిషి ప్రత్యేకమైన పనిని నిర్వర్తిస్తాడు. సమస్త మానవాళికి సరిపోయిన మరియు క్రమమైన గమ్య స్థానములో మనషి జీవిస్తూనే ఉంటాడు; దేవుణ్ణి ఆరాధించుట కొరకు మాత్రమే మనిషి తన కర్తవ్యాన్ని జరిగిస్తాడు. ఈ మానవాళియే నిత్యజీవమును పొందుకునే మానవాళిగా మారుతారు. ఆ సమయములో మనిషి దేవుడు వెలిగించిన జీవితాన్ని పొందుకుంటాడు, దేవుని సంరక్షణలోను మరియు దేవుని భద్రతలోను ఉన్నటువంటి జీవితాన్ని పొందుకుంటాడు మరియు దేవునితో కలిసి జీవిస్తాడు. మానవాళియంతా ఈ భూమి మీద సామాన్య జీవితమును కలిగి జీవిస్తారు మరియు ప్రజలందరూ సరియైన మార్గములోనికి ప్రవేశిస్తారు. 6,000 సంవత్సరాల కార్యనిర్వహణ ప్రణాళికయంతయు సాతానును సమూలంగా ఓడిస్తుంది, దీని అర్థం ఏమంటే సృష్టించినప్పుడు మనిషికున్న నిజమైన స్వరూపమును దేవుడు తిరిగి ఇచ్చేస్తాడు. ఆ విధంగా, దేవుని నిజమైన ఉద్దేశము నెరవేర్చబడుతుంది. ఆరంభములో సాతాను ద్వారా మనిషి భ్రష్టుపట్టక మునుపు, మనుష్యులందరూ భూమి మీద సామాన్య జీవితాన్ని కలిగి జీవించారు. ఆ తరువాత, మనిషి సాతాను ద్వారా భ్రష్టుపట్టినప్పుడు, మనిషి తనకున్న సామాన్య జీవితనము కోల్పోయాడు. అప్పుడు దేవుని కార్యనిర్వహణ కార్యము ఆరంభమయ్యింది మరియు మనిషి సామాన్య జీవితమును తిరిగి ఇచ్చుటకు సాతానుతో యుద్దము మొదలయ్యింది. 6,000 సంవత్సరాల దేవుని కార్యనిర్వహణ కార్యము ముగింపుకు వచ్చినప్పుడు సమస్త మానవాళి జీవితము అధికారకంగా ఈ భూమి మీద ఆరంభించబడుతుంది; అప్పుడే మనిషి అద్భుతమైన జీవితాన్ని కలిగియుంటాడు మరియు ఆరంభములో దేవుడు మనిషిని సృష్టించుచున్నప్పుడు కలిగియున్న ఉద్దేశమును ఆయన తిరిగి కలిగియుంటాడు, అదే విధంగా మనిషికున్న నిజమైన స్వరూపాన్ని కూడా తిరిగి ఇస్తాడు. ఈ భూమి మీద మనుష్యులందరూ సామాన్య జీవితమును కలిగియున్న తరువాత, మనిషి మరలా జయించుబడువానిగాను లేక పరిపూర్ణుడైన వ్యక్తిగాను ఉండుటకు ప్రయాసపడవలసిన అవసరము లేదు, ఎందుకంటే మనుష్యులందరూ పరిశుద్దులుగా ఉంటారు. “జయించువారు” మరియు “పరిపూర్ణులైనవారు” ఆని ఎవరిని గూర్చియితే ప్రజలు మాట్లాడుకుంటున్నారో వారందరూ దేవునికి మరియు సాతానుకు మధ్యన జరిగే యుద్ధములో వెంబండించడానికి మనిషికి ఇచ్చిన లక్ష్యాలైయున్నారు. మనిషి భ్రష్టుపట్టినందునే వారందరూ ఉనికిలో ఉన్నారు. నీకు ఒక లక్ష్యాన్నిచ్చి, ఈ లక్ష్యాన్ని వెంబడించు విధంగా నిన్ను ప్రోత్సహించినట్లయితే, ఆ సాతాను ఓడిపోతాడు. సాతానుకు సిగ్గు కలిగే విధంగా నీవు సాక్ష్యము కలిగియుండడానికి అవసరమైనవాటిని ఉపయోగించాలని, లేక పరిపూర్ణుడవవ్వాలని, లేక జయించువానిగా ఉండాలని అడగడం జరుగుతోంది. ముగింపులో మనిషి ఈ భూమి మీద సామాన్య జీవితమును కలిగి జీవిస్తాడు మరియు మనిషి పరిశుద్ధంగా ఉంటాడు; ఇది జరిగినప్పుడు, ప్రజలు ఇంకా జయించువారుగా ఉండాలని ఎదురు చూడాలా? వారందరూ సృష్టియై ఉన్నవారు కారా? జయించువారు మరియు పరిపూర్ణులైనవారిని గూర్చి మాట్లాడవలసి వస్తే, ఈ మాటలన్నీ మనిషి యొక్క అపవిత్రతను, మరియు సాతానును ఉద్దేశించబడ్డాయి. “జయించువాడు” అనే ఈ మాట సాతాను మీదను మరియు శత్రు సమూహము మీద విజయానికి సూచన కాదా? నీవు పరిపూర్ణుడవయ్యావని నీవు చెప్పినప్పుడు, ఎందులో నీవు పరిపూర్ణుడవయ్యావు? నీకున్న భ్రష్టుపట్టిన సాతాను స్వభావములనుండి నిన్ను నీవు విడిపించుకున్నావు కాదా, తద్వారా దేవుని కొరకు అత్యున్నతమైన ప్రేమను పొందుకున్నావు కాదా? ఇటువంటి విషయాలన్నీ మనిషిలోని అపవిత్రతకు సంబంధించిన విషయాలుగా, సాతానుకు సంబంధించిన విషయాలుగా చెప్పుకుంటారు; అవన్నీ దేవునికి సంబంధించిన విషయాలుగా చెప్పబడలేదు.

ఇప్పుడు నీవు జయించువానిగా ఉండటానికి మరియు పరిపూర్ణుడగుటకు ప్రయాస పడకపోతే, భవిష్యత్తులో భూమి మీద మనుష్యులందరూ తమ సామాన్య జీవితాన్ని కలిగి జీవించేటప్పుడు అటువంటి ప్రయాసకు అవకాశమనేది ఉండదు. ఆ సమయములో ప్రతి విధమైన వ్యక్తి యొక్క ముగింపు బయలుపరచబడుతుంది. ఆ సమయములోనే నువ్వు ఎటువంటి వ్యక్తివో స్పష్టముగా అర్థమవుతుంది. నువ్వు జయించువానిగాను, పరిపూర్ణుడైన వ్యక్తిగాను ఉండడానికి ఇష్టపడినట్లయితే, అప్పుడది అసాధ్యమవుతుంది. తన తిరస్కారమునుబట్టి ఇది అలాగే ఉంటుంది, మనిషి తానెవరో బయలుపరచబడిన తరువాత శిక్షించబడాలి. ఆ సమయములో ఇతరవాటికంటే మనిషి యొక్క ప్రయాస ఉన్నత స్థితిలో ఉండదు, కాబట్టి కొంతమంది మాత్రమే జయిగించువారుగాను మరియు మరికొంతమంది పరిపూర్ణులైనవారుగాను ఉంటారు, లేక కొంతమంది మాత్రమే దేవుని జేష్ఠ పుత్రులుగాను మరియు మరికొంతమంది దేవుని కుమారులుగాను ఉంటారు; వారెవ్వరూ ఈ విషయాలను వెంబడించరు. అందరూ దేవుడు సృష్టించిన జీవులుగానే ఉంటారు, అందరూ ఈ భూమి మీద జీవిస్తారు మరియు ఈ భూమి మీద అందరూ దేవునితోపాటు కలిసి జీవిస్తారు. దేవునికి మరియు సాతానుకు మధ్యన యుద్ధము జరిగే సమయము ఆసన్నమయ్యింది, ఈ యుద్ధానికి ముగింపు పలకవలసిన సమయమిది, ఈ సమయములోనే మనిషి సంపూర్ణముగా సంపాదించబడాలి; ఇది రూపాంతరము జరిగే ఒక కాలవ్యవధి. అందుచేత, మనిషి జయించువానిగాను, లేక దేవుని ప్రజలలో ఒక వ్యక్తిగాను ఉండుటకు ప్రయాసపడవలసియున్నది. ఈ రోజున ఎన్నో విభిన్నమైన స్థాయిలు ఉన్నాయి గాని సమయము వచ్చినప్పుడు అటువంటి భిన్న స్థాయిలు అనేవి ఉండవు: జయించినవారందరి స్థాయి ఒకటే ఉంటుంది, వారు సమస్త మానవాళియందు అర్హతను సంపాదించుకున్న సభ్యులు, వారు భూమి మీద సమానంగా జీవిస్తారు, అంటే వారందరూ అర్హత పొందిన సృష్టించబడిన జీవులుగా ఉంటారు మరియు ఆ అర్హతనే సమస్త మానవాళికి ఇవ్వబడుతుంది. యుగాలన్నిటిలో దేవుని కార్యము విభిన్నమైయున్నందున, ఆయన కార్యము యొక్క లక్ష్యాలు విభిన్నమైనందున, ఈ కార్యము మీలో జరిగియున్నట్లయితే, మీరు జయించువారుగా ఉండటానికి మరియు పరిపూర్ణులవడానికి అర్హులు; ఇది ఇతర దేశాలలో జరిగి ఉన్నట్లయితే, జయించబడినవారుగా ఉండే ప్రజల మొదటి గుంపుగా ఉండటానికి అక్కడున్న ప్రజలకు అర్హత ఉంటుంది మరియు మొదటి గుంపు ప్రజలు పరిపూర్ణమవుతారు. ఈ రోజున ఈ కార్యము ఇతర దేశాలలో జరిగించబడుట లేదు, అందుచేత ఇతర దేశాల ప్రజలు పరిపూర్ణులవడానికి మరియు జయించువారుగా ఉండటానికి అర్హులు కారు మరియు వారు మొదటి గుంపుగా ఏర్పడడం అనేది అసాధ్యమైన విషయం. ఎందుకంటే దేవుని కార్యము యొక్క లక్ష్యము విభిన్నమైనది, దేవుని కార్యము యొక్క యుగము విభిన్నమైనది మరియు దానికున్న పరిధి విభిన్నమైనది, మొదటి గుంపు ఉంది, అంటే జయించువారు ఉన్నారు, అలాగే పరిపూర్ణులైనవారి రెండవ గుంపు కూడా ఉంటుంది. ఒకసారి మొదటి గుంపువారు పరిపూర్ణులైనప్పుడు మాదిరిలు మరియు ఆదర్శవంతులు ఉంటారు. అందుచేత భవిష్యత్తులో పరిపూర్ణులైనవారిలో రెండవ మరియు మూడవ గుంపు కూడా ఉంటుంది గాని నిత్యత్వములో అందరూ సమానమే మరియు స్థాయికి సంబంధించిన విభిన్నతలనేవి ఉండవు. వారు విభిన్న కాలాలలో పరిపూర్ణులై ఉంటారంతే మరియు స్తాయీ భేదాలేవీ ఉండవు, అందరూ పరిపూర్ణులైన సమయం ఆసన్నమైనపుడు సర్వ విశ్వము యొక్క కార్యము ముగించబడినపుడు, స్థాయిలో ఎటువంటి విభిన్నతలనేవి ఉండవు మరియు ప్రతి ఒక్కరికీ ఒకే సమాన స్థాయి ఉంటుంది. ఈ రోజున మీ మధ్యన ఈ కార్యము జరిగి ఉన్నది, అందుచేత మీరందరూ జయించువారయ్యారు. ఈ కార్యము బ్రిటన్నులో జరిగియున్నట్లయితే, బ్రిటన్ మొదటి గుంపుగా ఉండేది, ఆ విధంగానే మీరు కూడా మొదటి గుంపుగా ఉండేవారు. ఈ రోజున మీ మధ్యన జరిగించబడుచున్న ఈ కార్యము యొక్క విధానములో మీరు కృపతో ప్రత్యేకముగా ఆశీర్వదించబడినవారుగా ఉంటారంతే, ఈ కార్యము మీ మధ్యన జరగకపోయినట్లయితే, మీరు రెండవ గుంపుగా ఉండేవారు, లేక మూడవ గుంపుగానో, నాల్గవ గుంపుగానో, లేక ఐదవ గుంపుగానో ఉండేవారు. కార్యము జరుగు విధానములో విభిన్నత ఉన్న కారణాన ఇలా ఉంటుంది; మొదటి గుంపు మరియు రెండవ గుంపు ఇతరవాటికంటే ఒకటి గొప్పది, లేక మరొకటి తక్కువైనది అనే భిన్నత్వమును సూచించదు, ఇది కేవలము ఈ ప్రజలు పరిపూర్ణులైన క్రమాన్ని మాత్రమే సూచిస్తుంది. ఈ రోజున మీతో ఈ విషయాలన్ని పంచుకోవడం జరుగుతోంది, అయితే మీకు ముందుగా ఈ విషయాలన్నీ ఎందుకు తెలియజేయలేదు? ఎందుకంటే, ఒక ప్రక్రియ లేకుండ ప్రజలు విపరీతమైనవాటి వైపు మొగ్గు చూపుతుంటారు. ఉదాహరణకు, “నేను వెళ్తున్నట్లుగానే, నేను తిరిగి వస్తాను” అని యేసు ఈ భూమి మీద ఉన్నప్పుడు చెప్పాడు. ఈ రోజున అనేకమంది ఈ మాటల ద్వారా మైమరచిపోయారు మరియు వారు కేవలము తెల్లని నిలువుటంగీని ధరించుకొని, ఆకాశమందు ఎత్తబడుటకై ఎదురుచూస్తూ ఉంటారు. అందుచేత, అతి త్వరగా మాట్లాడకూడని ఎన్నో మాటలు ఉన్నాయి; ఆ మాటలు అతి త్వరగా మాట్లాడినట్లయితే, మనిషి విపరీతమైన వాటికి వెళ్ళే అవకాశం ఉంది. మనిషి స్థాయి చాలా చిన్నది మరియు అతను ఈ మాటలలోని సత్యాన్ని చూడలేడు.

భూమి మీద మానవ నిజమైన జీవితాన్ని మనిషి సాధించినప్పుడు మరియు సాతాను యొక్క సమస్త సమూహము బంధించబడినప్పుడు, మనిషి ఈ భూమి మీద చాలా సులభంగా జీవిస్తాడు. ఈ రోజున ఉన్నటువంటి క్లిష్టమైన పరిస్థితులు ఉండవు: మానవ సంబంధాలు, సామాజిక సంబంధాలు, సంక్లిష్టమైన కుటుంబ సంబంధాలు ఎంతో గొప్ప సమస్యలను తీసుకువస్తాయి, ఎంతో ఎక్కువ బాధ ఉంటుంది! ఇక్కడున్న మానవ జీవితము చాలా దుర్భరంగా ఉంటుంది! ఒకసారి మనిషి జయించబడితే, అతని హృదయం మరియు అతని మనస్సు మారుతుంది: దేవునియందు భయభక్తులుగల మరియు ప్రేమగల హృదయాన్ని అతడు పొందుకుంటాడు. విశ్వమంతటిలో దేవుణ్ణి ప్రేమించాలని కోరుకునేవారందరూ ఒకసారి జయించబడితే, అంటే ఒకసారి సాతాను ఓడిపోతే. ఒకసారి సాతాను, అంటే సమస్త చీకటి శక్తులన్ని బంధించబ డితే, ఆ తరువాత భూమి మీద మనిషి జీవితానికి ఏ సమస్య ఉండదు మరియు అతను ఈ భూమి మీద స్వాతంత్ర్యముగా జీవిస్తాడు. మనిషి జీవితము శారీరకమైన సంబంధాలు మరియు శరీర సంబంధమైన సమస్యలు లేకుండా చాలా సాఫీగా సులభంగా గడిచిపోతుంది. శరీర సంబంధమైన మానవ సంబంధాలన్నీ చాలా క్లిష్టమైనవి మరియు మనిషి అలాంటి వాటిని కలిగి ఉన్నాడనే విషయమే అతనింకా సాతాను ప్రభావం నుండి విముక్తి చెందాల్సి ఉందని ఋజువు చేస్తుంది. మీ సహోదరి సహోదరులందరిలో ఒక్కొక్కరితో అదే విధమైన సంబంధాన్ని నీవు కలిగియున్నట్లయితే, నీ కుటుంబములోని ఒక్కొక్కరితో అదే విధమైన సంబంధాన్ని నీవు కలిగియున్నట్లయితే, నీకు ఎలాంటి ఆందోళనలు ఉండవు మరియు నీవు ఎవరిని గూర్చి చింతించనక్కరలేదు. ఏదీ ఉత్తమమైనది కాదు మరియు ఈ విధంగా మనిషి తనకున్న శ్రమలలో సగం శ్రమల నుండి ఉపశమనం పొందుతాడు. భూమి మీద సామాన్య మానవ జీవితాన్ని కలిగి జీవిస్తున్నప్పుడు, మనుష్యులు దూతలకు సమానులై ఉంటారు; శరీర ధారియై ఉన్నప్పటికీ అతను అచ్చం దేవదూత వలె ఉంటాడు ఇదే చివరి వాగ్దానము, ఇదే మనిషి మీద ఉంచిన చివరి వాగ్దానము. ఈ రోజున మనిషి శిక్ష మరియు తీర్పుల గుండా వెళ్తాడు; అటువంటి విషయాలలో మనిషి పొందుకునే అనుభవం అర్థము లేనిదని నీవనుకొనుచున్నావా? శిక్షించుట మరియు తీర్పు తీర్చుట అనే కార్యము ఈ కారణము లేకుండా జరుగుతుందా? మనిషిని శిక్షించడం మరియు తీర్పు తీర్చడం అనేవి అతనిని అగాధ బిలములలోనికి నెట్టినట్లేనని మునుపు చెప్తూ ఉండేవారు, అంటే అతనికున్న విధి మరియు భవిష్యత్తులోని భరోసాలన్ని తీసివేయబడినవని అర్థం. ఇది కేవలం ఒక దాని కొరకు మాత్రమే జరుగుతుంది; అదే, మనిషిని శుద్ధి చేయుట. మనిషిని ఉద్దేశపూర్వకముగా అగాధ బిలములలో ఉంచబడలేదు, ఆయన అతని చేతులను కడిగి శుద్ధి చేస్తాడు. ఇది మనిషిలో తిరుగుబాటుతనముతో వ్యవహరించు క్రమములో జరుగుతుంది, తద్వారా చివరికి మనిషిలోని సమస్త విషయాలు శుద్ధీకరించబడతాయి, తద్వారా అతను దేవుని గూర్చిన నిజమైన జ్ఞానాన్ని కలిగియుంటాడు మరియు పరిశుద్ధుడైన వ్యక్తిగా ఉంటాడు. ఇది జరిగినట్లయితే, అన్నిటిని సాధించినట్లే. వాస్తవానికి, మనిషిలో వ్యవహరించవలసిన విషయాలన్నిటితో వ్యవహరించినప్పుడు మనిషి అద్భుతమైన సాక్ష్యాన్ని కలిగియుంటాడు, సాతాను కూడా ఓడించబడతాడు. శుద్ధీకరించబడనివి మనిషిలో కొన్ని విషయాలు ఉన్నప్పటికిని, ఒకసారి సాతాను ఓడించబడితే, ఇక ఎటువంటి సమస్య ఉండదు మరియు ఆ సమయములో మనిషి సంపూర్ణముగా శుద్ధీకరించబడతాడు. అటువంటి జీవితాన్ని మనిషి ఎన్నటికి అనుభవించలేదు, అయితే సాతాను ఓడిపోయినప్పుడు, సమస్తము స్థిరపరచబడతాయి మరియు మనిషి లోపలి ప్రతి చిన్న విషయము పరిష్కరించబడుతుంది. ఒకసారి పెద్ద సమస్య పరిష్కరించబడినప్పుడు, ఇతర సమస్యలన్నీ పరిష్కరించబడతాయి. భూమి మీద ఈ శరీరధారి మనుష్యుల మధ్య తన వ్యక్తిగత కార్యమును జరిగించుచున్నప్పుడు, ఆయన జరిగించిన కార్యమంతయు సాతానును ఓడించడానికే జరిగించాడు. మిమ్మల్ని పరిపూర్ణులనుగా చేయుట ద్వారాను మరియు మనిషిని జయించుట ద్వారాను ఆయన సాతానును ఓడిస్తాడు. మీరు అద్భుతమైన సాక్ష్యాన్ని కలిగియున్నప్పుడు కూడా సాతాను ఓడించబడియున్నాడనుటకు ఒక గురుతుగా ఉంటుంది. సాతాను ఓడించే క్రమములో మనిషి మొట్ట మొదటిగా జయించబడాలి మరియు అంతిమంగా సంపూర్ణముగా పరిపూర్ణుడవ్వాలి. ఏదేమైనా, సాతానును ఓడించడముతోపాటు ముఖ్యంగా చూసుకున్నట్లయితే, ఈ శూన్యమైన కష్టాల సముద్రము నుండి సమస్త మానవాళికి రక్షణ కలుగుతుంది. చైనాలోగాని, లేక విశ్వమంతటిలోగాని కొనసాగించబడిందా లేదా అనే దానితో నిమిత్తము లేకుండా, ఇదంతా కూడా సాతానును ఓడించు క్రమములోను మరియు సమస్త మానవాళికి రక్షణను తీసుకొచ్చే క్రమములో జరుగుతుంది. తద్వారా, మనిషి విశ్రాంతి స్థలములోనికి ప్రవేశిస్తాడు. ముఖ్యంగా సాతానును ఓడించడానికి మాత్రమే శరీరధారియైన దేవుడు ఇటువంటి సామాన్యమైన శరీరమును ధరించుకున్నాడు. శరీరమందు జరిగే దేవుని కార్యము దేవుని ప్రేమించి పరలోకమునకు చేర్చబడే ప్రతి ఒక్కరికి రక్షణ తీసుకు రావడానికి ఉపయోగించబడుతుంది, ఇది సమస్త మానవాళిని జయించుట కొరకు మాత్రమే జరిగించబడుతుంది. అంతేగాకుండా, సాతానును ఓడించడానికి మాత్రమే జరుగించబడుతుంది. దేవుని కార్యనిర్వహణ కార్యము యొక్క మూలము ఏమనగా సాతానును ఓడించడానికి మరియు సమస్త మానవాళికి రక్షణను తీసుకు రావడానికే. ఈ కార్యములో ఎక్కువగా మీరు సాక్ష్యమును కలిగియుండాలనే విషయమును గూర్చి ఎందుకు మాట్లాడవలసి వచ్చింది? ఈ సాక్ష్యము ఎవరిని ఉద్దేశించి చెప్పబడింది? ఇది సాతానును ఉద్దేశించి కాదా? దేవుని కొరకును మరియు దేవుని కార్యము తగు ఫలితాలను సాధించియున్నదని సాక్ష్యమిచ్చుట కొరకును ఈ సాక్ష్యము ఇవ్వాలి. సాక్ష్యమును కలిగియుండడం అనేది సాతానును ఓడించు కార్యమునకు సంబంధించియున్నది; సాతానుతో యుద్ధమే ఉండకపోతే, మనిషి సాక్ష్యమును కలిగియుండనవసరము లేదు కదా. సాతాను తప్పకుండ ఓడించబడాలి, అదే సమయములో మనుష్యులను రక్షించు దిశగా, సాతాను ఎదుట ఆయనకు ప్రతి మనిషి సాక్ష్యమును కలిగియుండాలని దేవుడు కోరుకొనుచున్నాడు, ఈ సాక్ష్యాన్ని ఆయన మనుష్యులను రక్షించడానికి మరియు సాతానుతో యుద్ధము చేయడానికి ఉపయోగించుకొనుచున్నాడు. తత్ఫలితంగా, మనిషి రక్షణ పొందుకోవడానికి మరియు సాతానును ఓడించుటకును ఒక ఉపకరణమైయున్నాడు. అందుచేత, మనిషి దేవుని సమస్త కార్యనిర్వహణ కార్యము యొక్క మూలమైయున్నాడు, అయితే సాతాను కేవలము వినాశనానికి, శతృత్వమునకు మూలమైయున్నాడు. నువ్వు ఏమి చేయలేదని నీవు అనుకోవచ్చు గాని నీ స్వభావములో జరిగిన మార్పులనుబట్టి, సాక్ష్యము ఇవ్వబడింది మరియు ఈ సాక్ష్యము సాతానును ఉద్దేశించియుంటుంది మరియు ఇది మనిషి కొరకు ఇవ్వబడేది కాదు. అటువంటి సాక్ష్యమునందు ఆనందించడానికి మనిషి సరైనోడు కాదు. దేవుని ద్వారా జరిగిన కార్యమును అతను ఎలా అర్థము చేసుకుంటాడు? దేవుని పోరాటము యొక్క లక్ష్యం సాతానే; ఆ సమయములోనే మనిషి కేవలము రక్షణ పొందవలసిన లక్ష్యంగా ఉన్నాడు. మనిషి భ్రష్టుపట్టిన సాతాను స్వభావాలను కలిగియున్నాడు, ఈ కార్యమును అర్థము చేసుకోవడానికి అసమర్థుడైయున్నాడు. సాతాను భ్రష్టత్వమునుబట్టి ఇలా జరుగుచున్నది మరియు ఇది మనిషికి స్వాభావికముగా వచ్చినది కాదు గానీ సాతాను ద్వారా నిర్దేశించబడియున్నది. ఈ రోజున సాతానును ఓడించుటయే దేవుని ముఖ్య కార్యమైయున్నది, అంటే మనిషిని సంపూర్ణముగా జయించుటయైయున్నది, తద్వారా మనిషి సాతాను ఎదుట దేవునికి అంతిమ సాక్ష్యమును కలిగియుంటాడు. ఈ విధంగా, సమస్తము నెరవేర్చబడతాయి. అనేకమైన విషయాలలో, నీ కళ్ళకు ఏమి జరగలేదన్నట్లుగానే కనిపిస్తుంది గాని, వాస్తవానికి కార్యము ఇదివరికే సంపూర్ణముగా ముగించబడింది. ముగించబడిన కార్యమంతా కనబడాలని మనిషి కోరుకుంటాడు గాని అది నీకు కనబడకుండానే నా కార్యమును నేను సంపూర్ణముగా చేసి ముగించాను, కాబట్టి సాతాను లోబడ్డాడు, అంటే వాడు చాలా దారుణంగా ఒడిపోయాడు. దేవుని జ్ఞానము, శక్తి మరియు అధికారమంతయు సాతానును ఓడించాయి. ఇటువంటి సాక్ష్యాన్ని ఖచ్చితంగా కలిగియుండాలి. ఈ సాక్ష్యము మనిషి స్పష్టంగా వ్యక్తము కాకపోయినా, ఇది కళ్ళకు కనిపించకపోయినా, సాతాను ఇదివరికే ఓడిపోయాడు. ఈ కార్యమంతా సాతానుకు విరుద్ధముగా జరిగించబడుతుంది మరియు సాతానుతో యుద్ధము చేయుటకొరకే కొనసాగించబడుతుంది. అందుచేత, మనిషి చూడనటువంటి ఎన్నో విజయవంతమైన విషయాలు ఉన్నాయి గానీ దేవుని దృష్టిలోనైతే అవి ఎప్పుడో విజయవంతంగా సంపూర్ణముగా నెరవేర్చబడ్డాయి. దేవుని కార్యమంతటిలోని అంతర్గత సత్యాలలో ఇదీ ఒకటైయున్నది.

ఒకసారి సాతాను ఓడించబడ్డాడనంటే మనిషి సంపూర్ణముగా జయించబడ్డాడని అర్థం. ఆ తరువాత, ఈ కార్యమంతా కేవలం రక్షణ కొరకేనని మరియు సాతాను కబంధ హస్తాలనుండి ప్రజలను విడిపించడమే ఈ రక్షణ కార్యమని మనిషి గ్రహిస్తాడు. 6,000 సంవత్సరాల ఈ దేవుని కార్యనిర్వహణ కార్యము మూడు దశలుగా విభజించబడియున్నది. ధర్మశాస్త్ర యుగము, కృపా యుగము మరియు దేవుని రాజ్య యుగము. కార్యములోని ఈ మూడు దశలన్నీ మానవులందరూ రక్షణ పొందుటకొరకే, అంటే సాతాను ద్వారా అతి దారుణంగా భ్రష్టుపట్టిన సమస్త మానవాళి రక్షణ పొందుట కొరకే ఆ మూడు దశలు ఉన్నాయని చెప్పవచ్చు. ఏదేమైనా, అదే సమయములో దేవుడు సాతానుతో యుద్ధము చేసేందుకు కూడా అవి ఉన్నాయి. అందుచేత, రక్షణ కార్యము మూడు దశలుగా విభజించబడినట్లుగా, సాతానుతో యుద్ధము కూడా మూడు దశలుగా విభజించబడియున్నది. దేవుని కార్యములోని ఈ రెండు అంశాలు ఒకదానితో ఒకటి సమానముగా జరిగించబడుతుంటాయి. సాతానుతో యుద్ధము అనేది వాస్తవానికి మానవాళి రక్షణ కొరకు మాత్రమే జరిగించబడుతుంది. ఎందుకంటే, మానవాళి రక్షణ కార్యము అనేది ఒకే దశలో విజయవంతంగా పూర్తయ్యేది కాదు, సాతానుతో యుద్ధము అనేది కూడా దశలువారిగాను, కాలాలువారిగాను విభజించబడింది. యుద్ధము అనేది మానవుని అవసరతలనుబట్టి మరియు అతని మీద ప్రభావము చూపబడిన సాతాను యొక్క భ్రష్టత్వపు స్థాయి మేరకు సాతాను మీద జరుగుతుంది. ఈ యుద్ధములో సాతానుకు విరుద్ధముగా దేవుడు ఆయుధాలను విసురుతాడని, అదే విధంగా రెండు సైన్యములు ఒకదానితో ఒకటి పోరాటం చేస్తాయని మనిషి తన ఊహల్లో నమ్ముతుండవచ్చు. ఇది కేవలము మనిషి జ్ఞానము యొక్క ఊహా సామర్థ్యము మాత్రమే; ఇది చాలా అస్థిరమైన మరియు అవాస్తవమైన ఆలోచన, అయినా దీన్నే మనిషి నమ్ముతాడు. ఇక్కడ నేను చెప్పవస్తున్న సంగతి ఏమిటంటే మానవాళి రక్షణ కార్యము అనేది కేవలము సాతానుతో యుద్ధము చేయుట ద్వారానే జరుగుతుందని, ఆ విధంగానే యుద్ధము జరుగుతుందనిమనిషి ఊహించుకొనుచున్నాడు. మానవాళి రక్షణ కార్యమునకు మూడు దశలు ఉన్నాయి, అంటే సాతానును ఒకేసారి సమూలంగా ఓడించేందుకు సాతానుతో జరిగే యుద్ధాన్ని మూడు దశలుగా విభజించబడియున్నది. సాతానుతో జరిగే యుద్ధము యొక్క కార్యమంతటి అంతర్గత సత్యము ఏమంటే దీనికి సంబంధించిన ఫలితాలన్నీ కార్యములోని అనేక దశలవారిగా సాధించబడతాయి: మానవుని మీద కృపను అనుగ్రహించడం, మానవుని పాపపు అర్పణగా మారడం, మనిషి పాపాలను క్షమించడం, మనిషిని జయించడం మరియు మనిషిని పరిపూర్ణునిగా చేయడం. వాస్తవానికి, సాతానుతో యుద్ధం చేయడం అనేది సాతానుకు విరుద్ధంగా ఆయుధాలను ఎత్తి పట్టుకోవడం కాదు గానీ మనిషి రక్షణ, మనిషి జీవితము యొక్క కార్యమును జరిగించుట మరియు మనిషి స్వభావమును మార్చుటయైయున్నది, తద్వారా అతను దేవుని కొరకు సాక్ష్యమును కలిగియుంటాడు. ఈ విధంగా సాతాను ఓడించబడతాడు. భ్రష్టుపట్టిన మానవ స్వభావము మార్పు చెందుట ద్వారా సాతాను ఓడించబడతాడు. సాతాను ఓడిపోయినప్పుడు, అంటే మనిషి సంపూర్ణముగా రక్షించబడినప్పుడు, అవమానించబడిన సాతాను సంపూర్ణముగా బంధించబడతాడు. ఈ విధంగా, మనిషి సంపూర్ణముగా రక్షించబడతాడు. అందుచేత, మనిషి రక్షణపొందుట యొక్క ముఖ్య ఉద్దేశము సాతానుకు విరుద్ధంగా యుద్ధము చేయడమే. ఈ యుద్దము ప్రాథమికంగా మనిషి రక్షణలో ప్రతిబింబిస్తుంది. అంత్య దినాలలోని ఈ దశ, అంటే మనిషి జయించబడే ఈ దశ సాతానుతో యుద్ధము చేయుటలో చివరి దశయైయున్నది. అంతేగాకుండా, ఇది మనిషిని సాతాను అధికారము నుండి సంపూర్ణముగా రక్షించు కార్యమైయున్నది. మనిషి జయించు కార్యము యొక్క అంతర్గత అర్థము ఏమనగా సాతాను ద్వారా భ్రష్టుపట్టిపోయిన మనిషి సాతాను స్వరూపము నుండి తన జయము అనుసరిస్తూ సృష్టికర్త వద్దకు తిరిగి రావడం అని అర్థం, ఈ విధంగా అతను సాతానును త్యజించి, దేవుని వైపుకు సంపూర్ణముగా తిరిగి వస్తాడు. ఈ విధంగా, మనిషి సంపూర్ణముగా రక్షణ పొందుతాడు. అందుచేత, జయించు కార్యము అనేది సాతానుకు విరుద్ధంగా జరిగించే యుద్ధములో చివరి కార్యమైయున్నది మరియు సాతానును ఓడించుట కొరకు మాత్రమే జరిగించే దేవుని కార్యనిర్వహణలో చివరి దశయైయున్నది. ఈ కార్యము లేకుండా, మనిషి యొక్క సంపూర్ణ రక్షణ కార్యము అంతిమంగా అసాధ్యము, సాతానును చిత్తుచిత్తుగా ఓడించడం కూడా అసాధ్యం మరియు మానవాళియంతా అద్భుతమైన గమ్యస్థానములోనికి ప్రవేశించడం అసాధ్యం, లేక సాతాను ప్రభావము నుండి విడిపించబడడం అసాధ్యం. తత్ఫలితంగా, సాతానుతో యుద్ధము ముగియక ముందు మనిషి రక్షణ కార్యము ముగించబడదు, ఎందుకంటే దేవుని కార్యనిర్వహణ కార్యమునకు మూలము సమస్త మనుష్యులందరూ రక్షించబడబడమే. మునుపు మానవాళియంతా దేవుని హస్తాలలో ఉండేవారు గాని సాతాను శోధననుబట్టి మరియు భ్రష్టత్వమునుబట్టి మనిషి సాతాను ద్వారా బంధించబడియున్నాడు మరియు దుష్టుని హస్తాలలో పడిపోయాడు. అందుచేత, దేవుని కార్యనిర్వహణ కార్యమంతటిలో సాతాను ఓడించబడడమే ముఖ్య లక్ష్యంగా మారింది. ఎందుకంటే సాతాను మనిషిని స్వాధీనము చేసుకున్నాడు. సమస్త కార్యనిర్వహణ కార్యమంతటిని తీసుకువెళ్ళడానికి దేవుడు ఉపయోగించుకునే కేంద్రం మనిషే కాబట్టి, మనిషి రక్షించబడాలి అంటే, అతణ్ణి సాతాను హస్తాలలోనుండి అతి త్వరగా వెనక్కి తీసుకురావాలి, అంటే సాతాను ద్వారా మనిషి బంధించబడిన తరువాత అతను తప్పకుండ వెనక్కి తిరిగి రావాలి. అందుచేత, మనిషి పాత స్వభావములో మార్పులు రావడం ద్వారా, అంటే ఈ మార్పులు మనిషి యొక్క నిజమైన హేతుబద్దతను పునరుద్ధరించుట ద్వారా సాతాను ఓడించబడాలి. ఈ విధంగా, బంధించబడిన మనిషి సాతాను కబంధ హస్తాల నుండి విడిపించబడాలి. సాతాను బంధకము నుండి, వాని ప్రభావము నుండి మనిషి విడిపించబడినప్పుడు, సాతాను సిగ్గుపరచబడతాడు, అప్పుడు అంతిమంగా మనిషి వెనక్కి తీసుకురాబడతాడు మరియు సాతాను ఓడించబడతాడు. సాతాను చీకటి ప్రభావము నుండి మనిషి విడిపించబడినందున, మనిషి ఈ యుద్ధమంతటిని చెరుపువాడవుతాడు మరియు యుద్ధము ముగిసిన తరువాత సాతాను శిక్షించబడతాడు. ఇది జరిగిన తరువాత, మానవాళి రక్షణ యొక్క సమస్త కార్యము సంపూర్తి చేయబడుతుంది.

దేవుడు సృష్టించబడిన జీవులపట్ల ఎటువంటి ద్వేషాన్ని కలిగియుండడు; కేవలము సాతానును ఓడించాలని మాత్రమే ఆయన కోరుకుంటున్నాడు. ఆయన చేయు కార్యమంతయు, అంటే అది శిక్షించడమైనా, లేక తీర్పు తీర్చడమైనా, అది సాతానును ఉద్దేశించే జరుగుతుంది; ఇది సమస్త మానవాళి రక్షణ కొరకు మాత్రమే కొనసాగించబడుతుంది, ఇదంతా కూడా సాతానును ఓడించు క్రమములోనే జరుగుతుంది మరియు ఈ కార్యమునకు ఒకే లక్ష్యము ఉంటుంది: సాతానుకు విరుద్ధంగా యుద్ధము చివరి వరకు చేయడానికే! ఆయన సాతాను మీద విజయము పొందుకునేంతవరకు ఆయన విశ్రమించడు! ఆయన సాతానును ఓడించిన తరువాతనే ఆయన విశ్రాంతి తీసుకుంటాడు. ఎందుకంటే, దేవుని ద్వారా జరిగించబడే ప్రతి కార్యము సాతానును ఉద్దేశించే జరుగుతుంది. సాతాను భ్రష్టుపట్టిన వారందరూ సాతాను అధికార నియంత్రణలో ఉన్నవారే మరియు అందరు సాతాను అధికారము క్రింద జీవిస్తున్నారు. సాతానుకు విరుద్ధంగా యుద్ధము చేయకుండా, వానితో తెగదెంపులు చేసుకోకపోతే, సాతాను ఈ ప్రజలపై తన పట్టు సడలించడు మరియు వారు సంపాదించబడరు. వారు సంపాదించబడకపోయినట్లయితే, తద్వారా సాతాను ఓడించబడలేదని నిరూపించబడుతుంది, అది ఓడిపోలేదని అర్థం. అందుచేత, దేవుని 6,000 సంవత్సరాల తన కార్యనిర్వహణ ప్రణాళికలో, మొదటి దశలో ఆయన ధర్మశాస్త్ర కార్యమును జరిగించాడు, రెండవ దశలో ఆయన కృపా యుగానికి సంబంధించిన కార్యమును జరిగించాడు, అంటే సిలువను గూర్చిన కార్యమును జరిగించాడు మరియు మూడవ దశలో సమస్త మనుష్యులను జయించు కార్యమును జరిగించుచున్నాడు. ఈ సమస్త కార్యమంతా సాతాను మానవాళిని ఏ మేరకు భ్రష్టుపట్టించాడనే దానినిబట్టి ఉంటుంది, ఇదంతా సాతానును ఓడించు క్రమములోనే జరుగుతుంది మరియు దశలలోని ప్రతీ దశ సాతానును ఓడించు ఉద్దేశము కొరకే జరుగుతుంది. దేవుని 6,000 సంవత్సరాల కార్యనిర్వహణ ప్రణాళిక యొక్క ప్రయాస అంతయు ఎర్రని మహా ఘట సర్పానికి విరుద్ధంగా చేసే యుద్దమైయున్నది. సమస్త మానవాళిని నిర్వహించు కార్యము కూడా సాతానును ఓడించు కార్యమైయున్నది, సాతానుతో జరిగించే యుద్ధ కార్యమైయున్నది. దేవుడు 6,000 సంవత్సరాలు యుద్ధము చేశాడు. అందుచేతనే, అంతిమంగా మానవులకు క్రొత్త ప్రపంచమును తీసుకురావడానికి ఆయన 6,000 సంవత్సరాలు పని చేశాడు. సాతాను ఓడిపోయినప్పుడు, మనిషి సంపూర్ణ స్వాతంత్ర్యమును పొందుకుంటాడు. ఈ రోజున జరిగే దేవుని కార్యము యొక్క ఉద్దేశము ఇది కాదా? ఖచ్చితంగా ఇది దేవుని కార్యము యొక్క ఉద్దేశమైయున్నది: మనిషికి సంపూర్ణ విడుదల కలిగించి, స్వాతంత్ర్యమును కలిగించడం, తద్వారా అతను ఈ నియమాలకు లోబడకుండా ఉండడం, లేక ఎటువంటి బంధకాలకు లేక ఎటువంటి షరతులకు పరిమితి కాకుండా ఉండడం. ఈ కార్యమంతా కూడా మీకున్న స్థాయినిబట్టి, మీకున్న అవసరాలనుబట్టి జరిగించబడుతుంది, అంటే మీరు సాధించగలిగిన ప్రతీది అందించబడుతుంది. ఇది ఏదో మిమ్మల్ని బలవంతముపెట్టి చేసే కార్యము కాదు, మీ మీద దేనిని రుద్ది చేసే కార్యము కాదు; దానికి బదులుగా, ఈ కార్యమంతా మీకున్న అవసరాలను బట్టి కొనసాగించబడుతుంది. కార్యములోని ప్రతి దశ మనిషికుండే నిజమైన అవసరతలు మరియు ఆకాంక్షలనుబట్టి కొనసాగించబడుతుంది; కార్యములోని ప్రతి దశ కూడా సాతానును ఓడించడానికే జరుగుతుంది. వాస్తవానికి, ఆరంభములో సృష్టికర్తకు మరియు సృష్టించబడిన జీవులకు మధ్యన ఎటువంటి అడ్డు ఉండేది కాదు. ఈ అడ్డు ఆటంకాలన్ని సాతాను ద్వారానే వచ్చాయి. సాతాను మనిషిని చెడిపిన దానినిబట్టి మరియు భ్రష్టుపట్టించిన తీరునుబట్టి మనిషి చూడలేకపోవుచున్నాడు లేక దేనిని ముట్టుకోలేకపోవుచున్నాడు. మనిషి మోసగించబడిన బాధితుడు. ఒకసారి సాతాను ఓడిపోతే, సృష్టించబడిన జీవులన్నీ సృష్టికర్తను చూస్తారు మరియు సృష్టికర్త తాను సృష్టించబడిన జీవులను చూస్తాడు మరియు వాటిని వ్యక్తిగతంగా నడిపిస్తాడు. కేవలము ఇటువంటి జీవితాన్ని మాత్రమే మనిషి ఈ భూమి మీద కలిగియుండాలి. అందుచేత, దేవుని కార్యము ప్రాథమికంగా సాతానును ఓడించు క్రమములోనే జరుగుతుంది, ఒకసారి సాతాను ఓడిపోయినట్లయితే, ప్రతీది పరిష్కరించబడుతుంది. ఈ రోజున దేవుడు మనుష్యుల మధ్యకు రావడమనేది అంత చిన్న విషయమేమీ కాదని నీవు చూస్తున్నావు. ప్రతిరోజు మీలో తప్పులు పట్టడానికి ఆయన రాలేదు, అది ఇది అని చెప్పడానికి రాలేదు, లేక ఆయన ఎలా ఉంటాడో, ఆయన ఎలా మాట్లాడుతాడో మరియు జీవిస్తాడో అని మీరు చూసుకుంటూ ఉండటానికి ఆయన శరీరధారిగా రాలేదు, లేక ఆయన తెరచిన ఏడు ముద్రల రహస్యాలను మరియు ఆయన మాట్లాడిన రహస్యాలను మీరు వినాలని ఆయన రాలేదు. దానికి బదులుగా, సాతానును ఓడించడానికి ఆయన శరీరధారిగా వచ్చాడు. ఆయన సాతానుతో యుద్ధము చేయడానికి మరియు మానవులను రక్షించడానికి వ్యక్తిగతంగా శరీరధారిగా మనుష్యుల మధ్యకు వచ్చాడు; ఆయన శరీరధారిగా రావడానికిగల ప్రాముఖ్యత ఇదే. సాతానును ఓడించే క్రమములో ఇది ఉండకపోయినట్లయితే, ఆయన ఈ కార్యమును వ్యక్తిగతంగా చేసి ఉండేవాడు కాదు. మనుష్యుల మధ్య ఆయన ఈ కార్యమును చేయడానికి, ఆయన తనను తాను వ్యక్తిగతంగా బయలుపరచుకోవడానికి మరియు మనుష్యులందరూ ఆయనను చూడటానికి దేవుడు ఈ భూమి మీదకు వచ్చాడు. ఇది చిన్న విషయమా? ఇది నిజంగా చిన్న విషయమేమీ కాదు! మనిషి ఊహించుకున్నట్లుగా ఇది ఉండదు: దేవుడు వచ్చాడు కాబట్టి మనిషి ఆయనను చూడవచ్చు, తద్వారా దేవుడు అస్పష్టతగలవాడనో లేక శూన్యములో ఉన్నవాడనో కాకుండా దేవుడు నిజమైనవాడని మనిషి అర్థము చేసుకోవచ్చు మరియు దేవుడు గొప్పవాడైనప్పటికి, ఆయన తగ్గించుకున్నాడని కూడా మనిషి తెలుసుకోవచ్చు. ఇది అంత సులభమా? ఇది అంత సులభము కాదు, ఎందుకంటే సాతాను మనిషి శరీరాన్ని భ్రష్టుపట్టించాడు మరియు దేవుడు రక్షించాలనుకున్న వ్యక్తి మనిషి ఒక్కడే, అందుచేత శరీరము సాతానుతో యుద్ధము చేయాలని మరియు మనిషిని వ్యక్తిగతంగా సంరక్షించాలని దేవుడు అనుకుంటాడు. కేవలము ఇదే దేవుని కార్యమునకు ప్రయోజనకరమైయున్నది. సాతానును ఓడించే క్రమములోనూ మరియు మనిషిని ఉన్నతంగా రక్షించే క్రమములొనూ దేవుని అవతారముగా వచ్చిన రెండు శరీరాలు ఉనికిలోనికి వచ్చాయి. ఈ కారణం చేతనే సాతానుతో యుద్ధము జరిగించే ఒకరు దేవునిగా ఉండగలరు, ఈ ఒక్కరు దేవుని ఆత్మయైన ఉండవచ్చు, లేక శరీరధారిగా వచ్చిన దేవుడైన ఉండవచ్చు. సంక్షిప్తంగా చెప్పాలంటే, ఆ ఒక్కరి స్థానములో సాతానుతో యుద్ధము జరిగించే దూతలు గాని, సాతాను ద్వారా భ్రష్టుపట్టిన మనిషి గాని ఉండటానికి వీల్లేదు. ఈ యుద్ధము చేయడానికి దూతలకు శక్తి లేదు మరియు మనిషి వాటికంటే చాలా శక్తిహీనుడు. అలా ఉన్నందున, మానవ జీవితములో కార్యము చేయడానికి దేవుడు ఇష్టపడినట్లయితే, మనిషి రక్షించడానికి ఆయన వ్యక్తిగతంగా భూమి మీదకి రావడానికి ఇష్టపడినట్లయితే, ఆయన తప్పకుండ వ్యక్తిగతంగా శరీరధారిగానే రావాలి, అంటే ఆయన తప్పకుండ వ్యక్తిగతంగా శరీరాన్ని ధరించుకోవాలి. ఆయన తన స్వాభావిక గుర్తింపుతోను మరియు ఆయన చేయవలసిన కార్యముతోను మనుష్యుల మధ్యకు రావాలి మరియు వ్యక్తిగతంగా మనుష్యులను రక్షించాలి. అలా కాకుండా, ఈ కార్యమును దేవుని ఆత్మ గాని, లేక మనిషి గాని చేసినట్లయితే, ఈ యుద్ధములోనుండి ఎటువంటి ఫలితము వచ్చి ఉండేది కాదు, దానికి ముగింపు ఉండేది కాదు. మనుష్యుల మధ్యన సాతానుకు విరుద్ధముగా యుద్ధము చేయడానికి దేవుడు వ్యక్తిగతంగా మనిషిగా మారి వచ్చినప్పుడే రక్షణ పొందడానికి అవకాశము ఉంటుంది. అంతేగాకుండా, దేవుడు అలా చేసినప్పుడే సాతాను సిగ్గుపరచబడతాడు మరియు ఎటువంటి సాహసాలు చేయడానికి అవకాశాలు గాని లేక అమలు చేయడానికి ఎటువంటి ప్రణాళికలు గాని లేకుండా వదిలి వెళ్ళిపోతాడు. శరీరధారియైన దేవుని ద్వారా జరిగిన కార్యము దేవుని ఆత్మ ద్వారా జరగడం అనేది అసంభవం మరియు దేవుని పక్షాన ఈ కార్యమును జరిగించడానికి ఎటువంటి శరీర సంబంధమైన మనిషికి కూడా మరి ఎక్కువ అసాధ్యమైన విషయమే. ఎందుకంటే, మనుష్యులందరూ జీవము పొందుటకు మరియు భ్రష్టుపట్టిన మానవ స్వభావమును మార్చుటకు ఆయన ఈ కార్యము చేస్తున్నాడు. ఈ యుద్ధములో మనిషి పాల్గొంటే, అతను భయంకరమైన కలవరముతో కూడిన పరిస్థితులు వచ్చినప్పుడు పారిపోతాడు మరియు భ్రష్టుపట్టిన తన స్వభావమును మార్చుకోలేని స్థితిలో ఉండిపోతాడు. సిలువ నుండి మనిషిని రక్షించడములోను, లేక మనుష్యులందరి తిరుగుబాటుతనమును జయించడానికి అతను అసమర్థుడే గాని సాతానును ఓడించడానికి సంబంధములేని ఎటువంటి కార్యమునైనా, లేక నియమాలకు అతీతంగా వెళ్ళని ఒక చిన్న పాత పనిని చేయడానికైనా అతను పనికొస్తాడు. అందుచేత, ఎందుకు బాధ పడాలి? మనుష్యులను సంపాదించుకోలేని, సాతానును ఓడించలేని కార్యముకు ఎటువంటి ప్రాముఖ్యత ఉంటుంది? అందుచేత, సాతానుతో యుద్ధము చేయడమనేది కేవలము దేవుడే చేయగల యుద్దమైయున్నది మరియు మనిషి ఈ కార్యమును జరిగించడం అసాధ్యము. మనిషి కర్తవ్యము విధేయత చూపాలి మరియు వెంబడించాలి. ఎందుకంటే మనిషి భూమ్యాకాశములను సృష్టించే కార్యమును చేయలేడు, లేక సాతానుతో యుద్ధము జరిగించే కార్యమును చేయలేడు. మనిషి కేవలము దేవుని నాయకత్వము క్రింద సృష్టికర్తను మెప్పించె పనిని మాత్రము చేయగలడు, ఈ విధంగా సాతానును ఓడిస్తాడు; ఇది మాత్రమే మనిషి చేయగలడు. అందుచేత, క్రొత్త యుద్ధము మొదలైన ప్రతిసారి, అంటే క్రొత్త యుగపు కార్యము మొదలైన ప్రతిసారి, ఈ కార్యము వ్యక్తిగతంగా దేవుని ద్వారానే జరిగించబడుతుంది, ఈ విధంగా ఆయన యుగమునంతటిని నడిపిస్తాడు మరియు సమస్త మానవాళి కొరకు ఒక క్రొత్త మార్గాన్ని తెరుస్తాడు. సాతానుతో జరిగే యుద్ధములో ప్రతి క్రొత్త యుగము మొదలైన ప్రతిసారి క్రొత్త ఆరంభం అవుతుంది. ఈ విధంగా మనిషి క్రొత్తదైన, అత్యంత అందమైన ప్రపంచములోనికి ప్రవేశిస్తాడు మరియు ఆ క్రొత్త యుగము వ్యక్తిగతంగా దేవుని ద్వారానే నడిపించబడుతుంది. మనిషి సమస్తముపైన యజమానియై ఉంటాడు, అయితే సంపాదించుకొనినవన్నీ సాతానుతో చేసిన యుద్ధాలకు ఫలితంగా ఉంటాయి. సాతానుడు అన్నిటిని భ్రష్టుపట్టించాడు, యుద్ధాల ముగింపులో వీడు ఓడిపోతాడు మరియు ఈ యుద్ధాలన్ని ముగిసిపోయిన తరువాత శిక్షించబడేవాడు వాడే. దేవుడు, మనుష్యులు మరియు సాతాను అనువారి మధ్యన కేవలం సాతాను మాత్రమే అసహ్యించుకొనబడతాడు మరియు తిరస్కరించబడతాడు. సాతాను ద్వారా సంపాదించబడిన వారందరూ దేవుని ద్వారా తిరిగి వెనక్కి రారు. ఆ సమయములో, సాతాను పక్షంగా శిక్షను పొందుకునే వారుగా మారుతారు. ఈ ముగ్గురిలో కేవలం దేవుడు మాత్రమే అన్నిటి ద్వారా ఆరాధించబడతాడు. సాతాను ద్వారా భ్రష్టుపట్టిన వారందరూ దేవుని ద్వారా వెనక్కి తీసుకు రాబడి, దేవుని మార్గాన్ని అనుసరించువారైతే, వారు దేవుని వాగ్దానమును పొందుకుంటారు మరియు దేవుని కొరకు దుష్టులకు తీర్పు తీరుస్తారు. దేవుడు తప్పనిసరిగా విజయమును పొందుకుంటాడు మరియు సాతాను తప్పనిసరిగా ఓడిపోతాడు, అయితే మనుష్యుల మధ్యన జయము పొందిన వారుంటారు మరియు ఓడిపోయినవారుంటారు. జయము పొందినవారు జయించినవారికి సంబంధించి ఉంటారు మరియు ఓడిపోయినవారందరూ ఓడిపోయిన వారికి సంబంధించి ఉంటారు; ఈ విధంగా ప్రతియొక్కరు వర్గీకరించబడతారు, ఇదే దేవుని కార్యమంతటికి అంతిమ ముగింపుగా ఉంటుంది. ఇది దేవుని కార్యమంతటికి ముఖ్య లక్ష్యముగా కూడా ఉంటుంది మరియు ఇది ఎన్నటికి మారదు. దేవుని కార్యనిర్వహణ ప్రణాళిక కార్యము యొక్క ముఖ్య ఉద్దేశము మనుష్యులను రక్షించుటయే. ఈ ముఖ్య ఉద్దేశము నిమిత్తము, ఈ కార్యము నిమిత్తము మరియు సాతానును ఓడించు నిమిత్తము దేవుడు శరీరధారిగా వచ్చాడు. సాతానును ఓడించడానికి కూడా మొట్ట మొదటిసారిగా దేవుడు శరీరధారిగా వచ్చాడు: సర్వమానవాళి విమోచనా కార్యమైన, మొట్ట మొదటి ఈ యుద్ధమును ముగించు ఈ కార్యములో ఆయన వ్యక్తిగతంగా శరీరధారిగా వచ్చాడు మరియు వ్యక్తిగతంగానే సిలువలో మేకులను కొట్టించుకున్నాడు. ఆ విధంగానే, ఈ కార్యము యొక్క దశ కూడా వ్యక్తిగతంగా మనుష్యుల మధ్యన తన కార్యమును చేయడానికి. వ్యక్తిగతంగా తన మాటలు మాట్లాడడానికి మరియు మనుష్యులందరూ ఆయన చూడడానికి శరీరధారిగా వచ్చిన దేవుని ద్వారానే జరిగించబడింది. అవును, ఆ మార్గములోనే ఆయన మరి కొంత ఇతర కార్యమును జరిగించవలసిన అవసరత ఉన్నది, అయితే ఆయన ఈ కార్యమును వ్యక్తిగతంగా కొనసాగించడానికిగల ముఖ్య కారణము సాతాను ఓడించుట, సమస్త మానవాళిని జయించుట మరియు ఈ ప్రజలందరినీ సంపాదించుకొనుటయే. అందుచేత, శరీరధారియైన దేవుని కార్యము నిజంగా అంత సులభమేమీ కాదు. ఆయన ఉద్దేశం కేవలము దేవుడు దీనుడని, మర్మమైయున్నాడని మరియు దేవుడు నిజమైనవాడని మనుష్యులకు చూపించేదైతే, ఈ కార్యమును మాత్రమే జరిగించడానికైతే, ఆయన శరీరధారిగా రానవసరత ఉండేది కాదు. ఆయన శరీరధారిగా రానకున్నా కూడా, ఆయన తన దీనత్వమును, మర్మయుక్త స్వభావమును, ఆయన గొప్పతనాన్ని, ఆయన పరిశుద్ధతను మనిషికి నేరుగా బయలుపరచగలడు గాని మనుష్యుల కార్యనిర్వహణ కార్యానికి అటువంటి విషయాల ద్వారా ఎటువంటి ప్రయోజనము ఉండదు. అవన్నీ మనిషిని రక్షించలేవు, లేక అతణ్ణి సంపూర్ణునిగా చేయలేవు, కనీసం సాతానుని కూడా ఓడించలేవు. ఆత్మకు విరుద్ధంగా జరిగించే యుద్ధములో ఆత్మ జోక్యము చేసుకొని సాతానును ఓడించేదైతే, అటువంటి కార్యమునకు తక్కువ ఆచరణాత్మకమైన విలువను కలిగి ఉంటుంది; తద్వారా మనిషి సంపాదించుకోవడం అసాధ్యం మరియు మనిషి విధిని మరియు భవిష్యత్తు భరోసాలు పాడవుతాయి. అలాగే, ఈ రోజున జరిగే దేవుని కార్యము లోతైన ప్రాముఖ్యతను సంతరించుకున్నది. మనిషి ఆయనను చూడడం, లేక మనిషి కన్నులు తెరుచుకోవడం, లేక అతనికి కదిలే అనుభూతిని మరియు ప్రోత్సాహమును అందించడంలాంటిది మాత్రమే జరిగితే, అటువంటి కార్యానికి ఎటువంటి ప్రాముఖ్యత ఉండదు. నీవు ఇటువంటి జ్ఞానమును గూర్చి మాత్రమే మాట్లాడితే, అప్పుడది శరీరధారియైన దేవుని నిజ ప్రాముఖ్యతను గూర్చి నీకు ఏమి తెలియదని నిరూపిస్తుంది.

దేవుని సమస్త కార్యనిర్వహణ ప్రణాళిక యొక్క కార్యమంతా వ్యక్తిగతంగా దేవుని ద్వారానే జరిగించబడింది. మొదటి దశ, అంటే సర్వ లోక సృష్టి వ్యక్తిగతంగా దేవుని ద్వారానే జరిగించబడింది మరియు ఇలా సృష్టించబడకపోయినట్లయితే, ఎవరూ మానవాళిని సృష్టించియుండేవారు కాదు; సమస్త మానవాళిని విమోచించుటయే రెండవ దశ, ఇది కూడా వ్యక్తిగతంగా దేవుని ద్వారానే జరిగించబడింది; సమస్త దేవుని కార్యమంతా దేవుని ద్వారానే ముగించబడవలసిన అవసరత ఎంతో ఉంది అనే ఈ మాట ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేకుండానే ఈ మూడవ దశ కొనసాగించబడుతోంది. విమోచించుట, జయించుట, సంపాదించుకొనుట మరియు సమస్త మానవాళిని పరిపూర్ణము చేయుట అనే ఈ కార్యము వ్యక్తిగతంగా దేవుని ద్వారానే కొనసాగించబడాలి. ఆయన ఈ కార్యమును వ్యక్తిగతంగా జరిగించకపోయినట్లయితే, ఆయనకున్న గుర్తింపుకు మనుష్యులు ప్రాతినిధ్యం వహించేవారు కాదు, లేక మనిషి ద్వారా ఆయన కార్యము జరిగించబడేది కాదు. సాతానును ఓడించే క్రమములో, సమస్త మానవాళిని సంపాదించుకునే క్రమములో, ఈ భూమి మీద మనిషికి ఒక సామాన్య జీవితాన్ని ఇచ్చే క్రమములో ఆయన వ్యక్తిగతంగా మనిషిని నడిపించాలి మరియు మనుష్యుల మధ్యన వ్యక్తిగతంగా పని చేయాలి; ఆయన సమస్త కార్యనిర్వహణ ప్రణాళిక కొరకు మరియు ఆయన కార్యము అంతటి కొరకు మాత్రమే, ఆయన వ్యక్తిగతంగా ఈ కార్యమును తప్పకుండ జరిగించాలి. దేవుడు వచ్చాడు, కాబట్టి మనుష్యులందరూ సంతోషపడుటకు ఆయనను చూడవచ్చుననే నమ్మకాన్ని మాత్రమే మనిషి కలిగియున్నట్లయితే, అటువంటి నమ్మకాలకు ఎటువంటి విలువ ఉండదు, ఎటువంటి ప్రాముఖ్యత ఉండదు. మనుష్యుల గ్రహింపు తేలిపోయే విధంగా పైపై అవగాహనను మాత్రమే కలిగియుంటారు! ఆయన మాత్రమే ఈ కార్యమును కొనసాగించగలడని చెప్పినప్పుడు, దేవుడు మాత్రమే ఈ కార్యమును చక్కగా సంపూర్తి చేయగలడు. దేవుని పక్షాన మనిషి ఈ కార్యమును చేయలేడు. అతనికి దేవుని గుర్తింపుగానీ, లేక ఆయన గుణగణాలు లేనందున, అతను దేవుని కార్యమును జరిగించుటకు అసమర్థుడు మరియు ఒకవేళ మనిషి ఈ కార్యమును జరిగించినట్లయితే, దాని నుండి ఎటువంటి ఫలితాలు ఉండవు. విమోచించుట కొరకే, సమస్త మానవాళిని తమ పాపముల నుండి విడిపించుట కొరకే, మనిషి శుద్ధీకరణ చేయబడుటకు మరియు తన పాపముల కొరకై పశ్చాత్తాపము పొందుట కొరకే మొట్ట మొదటిసారిగా దేవుడు శరీరధారిగా వచ్చాడు. జయించు కార్యము అనేది కూడా మనుష్యుల మధ్య వ్యక్తిగతంగా దేవుని ద్వారానే జరగాలి. ఈ దశలో దేవుడు ప్రవచనాన్ని మాత్రమే పలుకుతూ ఉంటే, ప్రవక్త గాని, లేక వరము పొందిన ఇతర వ్యక్తియైనా ఆయన స్థానాన్ని పొందుకుంటాడు; కేవలం ప్రవచనం మాత్రమే చెప్పబడియున్నట్లయితే, దేవుని స్థానములో మనిషి నిలబడతాడు. అయినా, దేవుడు జరిగించవలసిన కార్యమును మనిషి వ్యక్తిగతంగా జరిగించడానికి ప్రయత్నించినట్లయితే, మనిషి జీవమును పొందు కార్యమును జరిగించడానికి ప్రయత్నించినట్లయితే, ఈ కార్యమును మనిషి జరిగించడం అసాధ్యం. దేవుడే ఈ కార్యమును వ్యక్తిగతంగా జరిగించాలి: ఈ కార్యమును జరిగించడానికి దేవుడు తప్పనిసరిగా వ్యక్తిగతంగా శరీరధారిగా రావలిసిందే. వాక్యపు యుగములో కేవలము ప్రవచనము మాత్రం చెప్పబడినట్లయితే, యెషయా లేక ఏలియా ప్రవక్తలు ఈ కార్యమును జరిగించియుండేవారు కదా. అప్పుడు దేవుడే వ్యక్తిగతంగా ఈ కార్యమును చేయవలసిన అవసరత ఉండేది కాదు. ఎందుకంటే, ఈ దశలో కార్యము జరిగించబడడం అనేది కేవలము ప్రవచనమును పలుకుట ద్వారా జరిగేది కాదు. ఎందుకంటే మనిషిని జయించడానికి మరియు సాతానును ఓడించడానికి వాక్కుల కార్యము ఉపయోగించడం అనేది గొప్ప ప్రాముఖ్యమైన విషయమే, అయితే ఈ పని మనిషి ద్వారా జరగకూడదు, దేవుడే వ్యక్తిగతంగా ఈ కార్యమును జరిగించాలి. ధర్మశాస్త్ర యుగములో యెహోవా దేవుడు ఈ కార్యములో ఒక భాగము మాత్రమే చేశాడు, ఆ తరువాత ఆయన కొన్ని వాక్కులను పలికాడు మరియు ప్రవక్తల ద్వారా కొంత కార్యమును కూడా జరిగించాడు. అందుచేత, ఆయన కార్యములో యెహోవాకు బదులుగా మనిషి ఉండగలడు మరియు ఆయన ప్రక్షాళన కొన్ని కలలకు అర్థాన్ని వివరించగలదు మరియు భవిష్యత్తులోని సంగతులను ముందుగానే చెప్పగలడు. ఆరంభములో జరిగిన కార్యము మనిషి స్వభావమును నేరుగా మార్చే కార్యము కాదు మరియు మనిషి పాపానికి సంబంధములేని విధంగా ఉండేది మరియు మనిషి కేవలము ధర్మశాస్త్రమును అనుసరించే వ్యక్తిగా ఉండేవాడు. అందుచేత, యెహోవా శరీరధారిగా రాలేదు, మనిషికి తనను తాను బయలుపరచుకొనలేదు; ఆయన నేరుగా మోషేతోనూ మరియు ఇతరులతోనూ మాట్లాడుటకు బదులుగా, ఆయన పక్షాన వారు మాట్లాడి, పని చేయునట్లుగా వారిని చేశాడు. వారు మనుష్యుల మధ్యన నేరుగా పని చేయునట్లుగా చేశాడు. దేవుని కార్యములోని మొదటి దశ అనేది మానవ నాయకత్వమై ఉండెను. ఇది సాతానుకు విరుద్ధంగా జరిగించే యుద్ధ ఆరంభమై ఉండెను గానీ ఈ యుద్దము ఇంకా అధికారికంగా ఆరంభించవలసి యుండెను. సాతానుకు విరుద్ధంగా జరిగించే ఈ అధికారిక యుద్ధము మొదటి శరీరధారిగా వచ్చిన దేవునితో ఆరంభించబడాలి. ఇది అప్పటి నుండి ఇప్పటి వరకు, అంటే నేటి వరకు కొనసాగించబడుతూనే ఉన్నది. ఈ యుద్ధములోని మొదటి పోరాటము దేవుడు శరీరధారిగా వచ్చి, సిలువకు మేకులతో కొట్టబడ్డాడు. శరీరధారియైన దేవుడు సిలువ వేయబడం ద్వారా సాతాను ఓడించబడ్డాడు. ఇదే యుద్ధములో మొదటి విజయవంతమైన దశ. మానవ జీవితములో శరీరధారియైన దేవుడు నేరుగా పనిచేయుటను ఆరంభించినప్పుడు, మనిషి తిరిగి సంపాదించుకునే కార్యమునకు అధికారిక ఆరంభమైయుండెను. ఎందుకంటే ఇదే మనిషి పాత స్వభావమును మార్చే కార్యమైయుండెను, ఇదే సాతానుతో యుద్ధము చేసే కార్యమైయుండెను. ఆరంభములో యెహోవా ద్వారా జరిగించబడిన కార్యపు దశ కేవలము ఈ భూమి మీద మానవ జీవితపు నాయకత్వమై ఉండెను. అది దేవుని కార్యానికి ఆరంభమైయుండెను. ఇందులో ఎటువంటి యుద్ధము గాని, లేక ఏదైనా పెద్ద కార్యము లేకపోయినప్పటికీ, రాబోయే యుద్ధ కార్యానికి ఒక పునాదిని వేసింది. ఆ తరువాత, కృపా కాలములో జరిగే కార్యములోని రెండవ దశలో మానవుని పాత స్వభావము మార్చే కార్యము ఉంటుంది. అంటే, దేవుడే మానవ జీవితాన్ని తీర్చి దిద్దాడు. ఇది వ్యక్తిగతంగా దేవుని ద్వారానే జరిగించబడాలి: దీనికి దేవుడే వ్యక్తిగతంగా శరీరధారిగా రావాలి. ఆయన శరీరధారిగా రాకపోయినట్లయితే, ఈ దశలో జరిగే కార్యములో ఆయనకు బదులుగా ఎవరూ నిలబడలేరు, అందుచేత, ఇది సాతానుకు విరుద్ధముగా జరిగించే పోరాట కార్యమైయున్నదని చెప్పబడింది. ఒకవేళ మనిషి దేవుని పక్షాన ఈ కార్యమును జరిగించినట్లయితే, మనిషి సాతాను ఎదుట నిల బడినప్పుడు, సాతాను లోబడకపోవచ్చు మరియు సాతాను ఓడిపోవడం కూడా అసాధ్యమయ్యేది. శరీరధారియైన దేవుడే దిగి వచ్చి సాతానును ఓడించాలి, ఎందుకంటే శరీరధారియైన దేవుని గుణగణాలన్నిటితో దేవుడైయున్నాడు, ఆయన ఇంకను మానవ జీవితాన్ని కలిగియున్నాడు మరియు ఆయన సృష్టికర్తయైయున్నాడు; ఏది జరిగినా, ఆయన గుర్తింపు మరియు గుణగణాలు మార్పు చెందవు. అందుచేత, సాతానును సంపూర్ణముగా లోబరుచుకునేందుకు ఆయన శరీరధారిగా వచ్చాడు మరియు కార్యమును జరిగించాడు. అంత్య దినాలలో జరిగే కార్యపు దశలో మనిషే ఈ కార్యమును జరిగించి, నేరుగా మాటలను మాట్లాడుటకు అవకాశము కలిగించినట్లయితే, అతను ఆ మాటలను మాట్లాడిఉండేవాడు కాదు. ప్రవచనము చెప్పబడి ఉన్నట్లయితే, ఈ ప్రవచనము మనుష్యులను జయించేది కాదు. శరీరము ధరించుకొని, సాతానును ఓడించడానికి దేవుడు వచ్చాడు మరియు అది సంపూర్ణముగా లోబడుతుంది. ఆయన సాతానును తుక్కు తుక్కుగా ఓడించినప్పుడు, మనుష్యులను సంపూర్ణముగా జయిస్తాడు మరియు సంపూర్ణముగా మనుష్యులను సంపాదించుకుంటాడు, ఈ దశలో జరిగే కార్యము సంపూర్ణముగా ముగించబడుతుంది మరియు విజయవంతమవుతుంది. దేవుని కార్యనిర్వహణలో దేవునికి బదులుగా ఆయన స్థానములో మనిషి నిలబడలేడు. ప్రత్యేకంగా, యుగమును నడిపించే కార్యము మరియు క్రొత్త కార్యమును ఆరంభించుట అనేది వ్యక్తిగతంగా దేవుని ద్వారానే జరగించబడవలసిన గొప్ప అవసరత ఉన్నది. మనిషికి ప్రత్యక్షతనివ్వడం మరియు అతనికి ప్రవచనం అందించడం మనిషి ద్వారా జరిగించబడవచ్చు, గానీ దేవునికి మరియు సాతానుకు మధ్యనున్న యుద్ధ కార్యము వ్యక్తిగతంగా దేవుని ద్వారానే జరిగేదైతే, ఈ కార్యము మనిషి ద్వారా జరిగించబడదు. కార్యములోని మొదటి దశలో, సాతానుతో యుద్ధము లేనప్పుడు, యెహోవా వ్యక్తిగతంగా ప్రవక్తల ద్వారా పలికించిన ప్రవచనములను ఉపయోగించి ఇశ్రాయేలు ప్రజలను నడిపించాడు. ఆ తరువాత, కార్యములోని రెండవ దశలో సాతానుతో యుద్ధము చేసే సమయానికి, దేవుడే వ్యక్తిగతంగా శరీరధారిగా వచ్చాడు. ఈ కార్యమును జరిగించడానికి శరీరమును ధరించుకున్నాడు. సాతానుకు విరుద్ధముగా జరిగించబడే యుద్ధములో పాల్గొనే ప్రతీది కూడా శరీరధారియైన దేవునిలో పాల్గొంటుంది, అంటే ఈ యుద్ధము మనిషి చేసేది కాదని అర్థము. మనిషి యుద్ధము చేసినట్లయితే, అతను సాతానును ఓడించజాలడు. అతను సాతాను అధికారము క్రింద ఉండి, వానికి విరుద్ధముగా పోరాటం చేయడానికి బలాన్ని ఎలా కలిగియుండగలడు? మనిషి మధ్యలో ఉన్నాడు: నీవు సాతాను మీద ఆనుకుంటే, అప్పుడు నీవు సాతానుకు సంబంధించినవాడవు, కానీ నీవు దేవుణ్ణి మెప్పించగలిగితే, అప్పుడు నీవు దేవుని సంబంధికుడవవుతావు. ఈ యుద్ధములో జరిగే కార్యములో దేవునికి బదులుగా మానవుడు ప్రయత్నించి, నిల బడగలడా, అతనికి నిలబడే సామర్థ్యము ఉందా? ఒకవేళ అతను అలా చేసిన, అతను ఎప్పుడో నాశనమై ఉండేవాడు కదా? అతను ఎప్పుడో నరకమునకు చేరియుండేవాడు కదా? అందుచేత, ఆయన కార్యములో దేవునికి బదులుగా మనిషి నిలబడలేడు, అంటే మనిషి దేవుని గుణగణాలను కలిగిలేడని మరొక రీతిగా చెప్పవచ్చు మరియు ఒకవేళ నీవు సాతానుతో యుద్ధము చేసినా, నీవు వానిని ఓడించలేవు. మనిషి కొంతమట్టుకు మాత్రమే పనిని చేయగలడు; అతను కొంతమందిని మాత్రమే గెలవగలడు గానీ దేవుడే చెయవలసిన కార్యములో దేవునికి బదులుగా అతను నిలబడలేడు. మనిషి సాతనుతో ఎలా యుద్ధము చేయగలడు? నీవు యుద్దమును ఆరంభించక ముందే సాతాను నిన్ను చెరపట్టి ఉంటాడు. దేవుడే సాతానుతో యుద్ధము చేసినప్పుడు మాత్రమే, మనిషి దీనిని ఆధారము చేసుకొని దేవునికి విధేయత చూపాలి మరియు ఆయనను అనుసరించాలి, అప్పుడే దేవుని ద్వారా మనుష్యులందరూ సంపాదించబడతారు మరియు సాతాను బంధకాలనుండి విడిపించబడతారు. మనిషి తనకున్న స్వంత జ్ఞానముతోనూ మరియు సామర్థ్యములతోను సాధించేవి చాలా పరిమితమైనవి; అతను ఒక మనిషిని సంపూర్ణునిగా చేయలేడు, అతనిని నడిపించలేడు, అంతమాత్రమే కాకుండా సాతానును కూడా ఓడించలేడు. మనిషికున్న మేధావితనం మరియు జ్ఞానము అనేవి సాతాను తంత్రములను ఎదిరించలేవు, అందుచేత మనిషి సాతానుతో ఎలా యుద్ధము చేయగలడు?

పరిపూర్ణులవ్వాలని కోరుకునేవారందరూ పరిపూర్ణులవడానికి అవకాశం ఉంది, అందుచేత ప్రతియొక్కరూ తప్పనిసరిగా విశ్రాంతి తీసుకోవాలి: భవిష్యత్తులో మీరందరూ గమ్యస్థానములోనికి ప్రవేశిస్తారు. అయితే, నీవు పరిపూర్ణుడవ్వాలని కోరుకోనట్లయితే, అద్భుతమైన ప్రపంచములోనికి ప్రవేశించాలని ఇష్టపడనట్లయితే, అది నీ స్వంత సమస్య. దేవునికి నమ్మకస్తులుగా ఉండాలని, పరిపూర్ణులవ్వాలని ఇష్టపడే వారందరూ, లోబడువారందరూ మరియు తమ కర్తవ్యాన్ని నమ్మకంగా జరిగించువారందరూ, అంటే అటువంటి ప్రజలందరూ పరిపూర్ణులవ్వచ్చు. ఈ రోజున తమ కర్తవ్యాన్ని నమ్మకంగా జరిగించని వారందరూ, దేవునికి నమ్మకస్తులుగా ఉండని వారందరూ, దేవునికి లోబడనివారందరూ, ముఖ్యంగా పరిశుద్ధాత్మ ద్వారా జ్ఞానోదయమును మరియు వెలిగింపును పొందుకొని దానిని ఆచరణలో పెట్టనివారందరూ పరిపూర్ణులవ్వలేరు. దేవునికి నమ్మకంగా ఉండటానికి మరియు లోబడటానికి ఇష్టపడేవారందరూ కొంచెం తెలివితక్కువ వారుగా ఉన్నప్పటికీ పరిపూర్ణులవుతారు; వెంబడించడానికి ఇష్టపడే వారందరూ పరిపూర్ణులవుతారు. ఈ విషయమును గూర్చి వారు చింతించనక్కరలేదు. ఈ దిశగా నీవు వెంబడించడానికి ఇష్టపడినట్లయితే, నీవు పరిపూర్ణుడవవుతావు. మీ మధ్యన ఎవరినీ వెలివేయడానికి, లేక వదిలివేయడానికి నాకు ఇష్టము లేదు గానీ ఏ వ్యక్తియైతే సరిగ్గా ప్రవర్తించకపోయినట్లయితే, నిన్ను నీవే నాశనము చేసుకున్నవాడవవుతావు; నిన్ను వెలివేసేది నేను కాదు గానీ నిన్ను నీవే నిన్ను నీవే వెలివేసుకుంటున్నావు. నీకు నీవు సరిగ్గా ప్రవర్తించడానికి ప్రయాసపడకపోతే, అంటే నీవు సోమరిగానో ఉండడమో, లేక నీ కర్తవ్యాన్ని సరిగ్గా నిర్వర్తించకపోయినట్లయితే, లేక సత్యాన్ని వెంబడించకుండా నీకు ఇష్టము వచ్చినట్లు నీవు నడుచుకున్నట్లయితే, నీవు ఎక్కువగా వ్యవహరించినట్లయితే, నీ స్వంత పేరు కోసమో మరియు నీ స్వలాభము కోసమో పోరాడినట్లయితే, ఇతరులపట్ల అన్యాయంగా ప్రవర్తిస్తున్నట్లయితే, నీ పాపాల భారాన్ని మోస్తావు; ఏ ఒక్కరి జాలిని పొందుకోవడానికి నీవు అర్హుడవు కాదు. మిమ్ములను పరిపూర్ణులుగా చేయడమే మీ అందరిపట్ల నేను కలిగియున్న ఉద్దేశమైయున్నది మరియు ఏ ఒక్కరు వదిలిపెట్టబడకుండా ప్రతి ఒక్కరూ జయించబడాలి, తద్వారా ఈ కార్యములోని ఈ దశ విజయంతవంతగా సంపూర్తి చేయబడుతుంది. ప్రతి ఒక్కరూ పరిపూర్ణులవ్వాలని, ఆయన ద్వారా సంపాదించబడాలని, ఆయన ద్వారా సంపూర్ణముగా శుద్ధీకరించబడాలని, ఆయన ప్రేమించే ప్రజలుగా మారాలన్నదే ప్రతి ఒక్కరిపట్ల దేవుడు కలిగియున్న ఇష్టము. మీరు వెనుకబడిన ప్రజలని, లేక చాలా తక్కువ సామర్థ్యమున్న ప్రజలని నేను చెప్పానా లేదా అనేదానితో సంబంధము లేకుండా, ఇదే వాస్తవమైయున్నది. నేను ఉద్దేశ పూర్వకముగా మిమ్మల్ని వదిలి వేస్తున్నానని, మీయందు నాకు ఎటువంటి నిరీక్షణ లేదని, కనీసం మిమ్మల్ని రక్షించడానికి కూడా నేను ఇష్టపడటం లేదని నేను చెప్పే మాట నిరూపించదు. ఈ రోజున నేను మిమ్మల్ని రక్షించే కార్యమును జరిగించడానికి వచ్చాను, అంటే నేను జరిగించే కార్యము రక్షణ కార్యము యొక్క కొనసాగింపుయైయున్నది. ప్రతి ఒక్కరికి పరిపూర్ణులయ్యే అవకాశము ఉంది: నీవు ఇష్టపడినట్లయితే, నీవు వెంబడించినట్లయితే, అంతములో నీవు ఈ ఫలితాన్ని సంపాదించుకుంటావు మరియు మీలో ఏ ఒక్కరూ విడిచిపెట్టబడరు. నీకు తక్కువ సామర్థ్యము ఉన్నట్లయితే, నీ నుండి నేను కోరిన ప్రతీది నీకున్న తక్కువ సామర్థ్యమును బట్టే ఉంటాయి; నీకు ఎక్కువ సామర్థ్యము ఉన్నట్లయితే, నేను నీ నుండి కోరినవి నీకున్న ఎక్కువ సామర్థ్యమును బట్టే ఉంటాయి; నీకు తెలివి తక్కువ ఉండి, నీవు పామరుడవైతే, నీకున్న నిరక్షరాస్యతనుబట్టే నేను నీ నుండి కోరుకుంటాను; నీవు అక్షరాస్యుడవైతే, నీ అక్షరాస్యతనుబట్టే నేను నీ నుండి కోరుకోవడం జరుగుతుంది; నీవు పెద్దవాడివైతే, నీకున్న వయస్సునుబట్టే నేను నీ నుండి కోరుకుంటాను; నీకు ఆతిథ్యం ఇవ్వగలిగిన సామర్థ్యము ఉన్నట్లయితే, ఆ ఆతిథ్యమునుబట్టే నీ నుండి నేను కోరుకుంటాను, నీ నుండి నేను కోరుకునేవన్ని నీకున్న సామర్థ్యముబట్టే ఉంటాయి; నీకు ఆతిథ్యం చేయడానికి సామర్థ్యములేక, కేవలము ఏదైనా ఒక పని చేయడానికి సామర్థ్యము ఉన్నట్లయితే, అంటే అది సువార్తను వ్యాపకము చేయడమైనా, లేక సంఘమును సంరక్షించడమైనా, లేక ఇతర సామాన్య వ్యవహారాలను జరపడానికి హాజరుకావడానికైనా, నీపట్ల నాకున్న పరిపక్వత నీ జరిగించే పనిని బట్టి ఉంటుంది. చివరి వరకు నమ్మకంగా, విధేయత కలిగి ఉండడం మరియు దేవుని కొరకు అత్యున్నతమైన ప్రేమను కలిగియుండడానికి ప్రయాస పడడం అనే వీటిని నీవు తప్పనిసరిగా సాధించాలి. ఈ మూడు విషయాలకంటే ఆచరించడానికి ఉత్తమ విషయాలు ఇంకేమీ లేవు. అంతిమంగా, మనిషి ఈ మూడు విషయాలను తప్పక సాధించాలి. అతను వాటిని సాధించినట్లయితే, అప్పుడు అతడు పరిపూర్ణుడవుతాడు. అయితే, పైనున్నవాటికంటే, నీవు తప్పకుండ నిజంగా వెంబడించాలి, నీవు తప్పకుండ చురుకుగా ముందుకు సాగాలి మరియు పైకి వెళ్ళాలి, మరియు దానికి సంబంధించిన దానిలో నీవు అచేతనంగా ఎంత మాత్రము ఉండకూడదు. ప్రతి ఒక్కరికీ పరిపూర్ణులయ్యే అవకాశం ఉందని మరియు ప్రతి ఒక్కరూ పరిపూర్ణులగుటకు సామర్థ్యము కలిగియున్నవారేనని నేను చెప్పాను. ఇది సత్యము, అయితే నీవు అనుసరించుటలో నీవు మెరుగ్గా ఉండటానికి ప్రయత్నించవద్దు. ఈ మూడు విషయాలను నీవు సాధించలేకపోయినట్లయితే, అంతములో నీవు బయటకు వెలివేయబడతావు. ప్రతియొక్కరూ దీనిని సాధించాలని, పరిశుద్ధాత్మ కలిగించు జ్ఞానోదయమును మరియు కార్యమును ప్రతి ఒక్కరూ కలిగియుండాలని మరియు అంతము వరకు లోబడి ఉండాలని నేను కోరుకొనుచున్నాను. ఎందుకంటే, మీలో ప్రతి ఒక్కరూ జరిగించవలసిన కర్తవ్యమిది. మీ కర్తవ్యాన్ని మీరందరూ జరిగించినట్లయితే, మీరందరూ పరిపూర్ణులవుతారు, మీరు కూడా అద్భుతమైన సాక్ష్యాన్ని కలిగియుంటారు. సాక్ష్యమును కలిగియున్నవారందరూ సాతాను మీద విజయము పొందినవారే మరియు దేవుని వాగ్దానమును సంపాదించుకున్నవారే. వారే అద్భుతమైన గమ్యస్థానములో జీవించడానికి మిగిలి ఉంటారు.

మునుపటి:  పరలోకపు తండ్రి చిత్తానికి విధేయత చూపడమే క్రీస్తు తత్వం

తరువాత:  దేవుడు మరియు మనిషి కలిసి విశ్రాంతిలోకి ప్రవేశిస్తారు

సెట్టింగులు

  • వచనం
  • థీమ్స్

ఘన రంగులు

థీమ్స్

అక్షరశైలి

అక్షరశైలి పరిమాణం

గీతల మధ్య దూరం

గీతల మధ్య దూరం

పేజీ వెడల్పు

విషయ సూచిక

శోధించండి

  • ఈ వచనాన్ని శోధించండి
  • ఈ పుస్తకాన్ని శోధించండి

Connect with us on Messenger