పరలోకపు తండ్రి చిత్తానికి విధేయత చూపడమే క్రీస్తు తత్వం
శరీరధారియైన దేవుడు క్రీస్తు అని పిలువబడ్డాడు మరియు క్రీస్తు అంటే, దేవుని ఆత్మను ధరించిన శరీరము. ఈ శరీరము ఇతర ఏ మనుష్యుని శరీరం వలెనూ ఉండదు. ఈ భిన్నత్వమునకు కారణం, క్రీస్తు అంటే, రక్తమాంసముల శరీరము కాదు; ఆయన ఆత్మ యొక్క అవతారం. ఆయనకు సాధారణ మనుష్యత్వము మరియు సంపూర్ణ దైవత్వము రెండూ ఉన్నాయి. ఆయనకున్న దైవత్వము ఏ మనిషికీ లేదు. ఆయనలోని సాధారణ మనుష్యత్వము అనేది శరీర సంబంధిత సాధారణ కార్యకలాపాలన్నింటినీ నిర్వహిస్తూనే, ఆయనలోని దైవత్వము దేవుని కార్యాన్ని స్వయంగా నిర్వహించింది. అది ఆయన మనుష్యత్వము కావచ్చు లేదా దైవత్వము కావచ్చు, రెండూ పరలోకపు తండ్రి చిత్తానికి లోబడి ఉంటాయి. క్రీస్తు తత్వమే ఆత్మ, అంటే దైవత్వం అని అర్థం. కాబట్టి, ఆయన తత్వం స్వయంగా ఆ దేవుడిదే; ఈ తత్వం ఆయన సొంత కార్యానికి ఆటంకం కలిగించదు మరియు ఆయన సొంత కార్యాన్ని నాశనం చేసే ఏ పనినైనా ఆయన చేయలేడు లేదా తన సొంత ఇష్టానికి వ్యతిరేకమైన వాక్యములను ఆయన ఎన్నడూ ఉచ్చరించడు. కాబట్టి, శరీరధారియైన దేవుడు ఖచ్చితంగా తన సొంత నిర్వహణకు ఆటంకం కలిగించే ఏ పనిని ఎప్పుడూ చేయడు. ఈ విషయాన్ని జనులందరూ అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ కార్య తత్వమనేది మనిషిని రక్షించడానికి మరియు దేవుని సొంత నిర్వహణ కోసమే. అదేవిధంగా, క్రీస్తు కార్యము కూడా మనిషిని రక్షించడం మరియు దేవుడి చిత్తం కోసమే ఉంది. దేవుడు శరీరముగా మారినందున, ఆయన తత్వం తన శరీరము లోపలే ఉందని ఆయన గ్రహించును, అంటే ఆయన శరీరము ఆయన కార్యమును చేపట్టుటకు సరిపోతుంది. కాబట్టి, అవతార సమయంలో దేవుడి ఆత్మ కార్యమంతా క్రీస్తు కార్యం ద్వారా భర్తీ చేయబడుతుంది మరియు అవతార సమయం యావత్తూ కార్యము మౌళిక భాగం క్రీస్తు కార్యమే. ఇది ఏ ఇతర యుగములోని కార్యముతోనూ మిళితం చేయబడదు. మరియు దేవుడు శరీరముగా మారినందున, ఆయన తన దేహమనే గుర్తింపుతో పనిచేస్తాడు; ఆయన దేహంతో వస్తాడు కాబట్టి, ఆయన చేయవలసిన కార్యమును శరీరముతోనే ముగించును. అది దేవుడి ఆత్మ కావచ్చు లేదా అది క్రీస్తు కావచ్చు, రెండూ స్వయంగా దేవుడే, ఆయన చేయవలసిన పనిని చేస్తాడు మరియు ఆయన నెరవేర్చవలసిన పరిచర్యను నెరవేరుస్తాడు.
స్వయంగా దేవుడి తత్వమే అధికారాన్ని చలాయిస్తుంది, కానీ ఆయన తన నుండి వచ్చే అధికారానికి పూర్తిగా లోబడి ఉండగలడు. అది ఆత్మ కార్యము కావచ్చు లేదా శరీర కార్యము కావచ్చు, ఏదీ కూడా మరొకదానితో విభేదించకూడదు. ఈ సమస్త సృష్టిపై దేవుడి ఆత్మకే అధికారం ఉంది. దేవుడి తత్వంతో కూడిన దేహానికి కూడా ఆ అధికారం ఉంటుంది. అయితే, పరలోకపు తండ్రి చిత్తానికి లోబడే శరీరంలోని దేవుడు కార్యమునంతటినీ చేయగలడు. దీన్ని ఏ ఒక్క వ్యక్తి సాధించలేడు లేదా ఊహించలేడు. స్వయంగా దేవుడే అధికారి కాబట్టి, ఆయన శరీరం ఆయన అధికారానికి లోబడి ఉండగలదు. అందుకే “తండ్రియైన దేవుడి చిత్తానికి క్రీస్తు లోబడతాడు” అని చెప్పబడినప్పుడు సూచించబడేది ఇదే. దేవుడు ఒక ఆత్మ మరియు మనుష్యునిగా మారగలడు కాబట్టి, మోక్షానికి సంబంధించిన కార్యమును చేయగలడు. ఏమైనప్పటికీ, దేవుడే తన సొంత కార్యమును చేస్తాడు; పరస్పరం విరుద్ధంగా ఉండే కార్యమును ఆయన చేయకపోవడం మాట అటుంచి, ఆయన దానికి ఆటంకం కలిగించడు లేదా జోక్యం చేసుకోడు, ఎందుకంటే ఆత్మ మరియు శరీరము ద్వారా చేసే పని తత్వం ఒకేలా ఉంటుంది. అది ఆత్మ అయినా లేదా శరీరమైనా, రెండూ ఒకే సంకల్పాన్ని నెరవేర్చడానికి మరియు ఒకే కార్యమును నిర్వహించడానికి పని చేస్తాయి. ఆత్మ మరియు శరీరానికి రెండు భిన్నమైన లక్షణాలు ఉన్నప్పటికీ, వాటి తత్వాలు మాత్రం ఒకటే; రెండూ కూడా దేవుడి తత్వము మరియు దేవుడి గుర్తింపునే కలిగి ఉంటాయి. స్వయంగా దేవుడు అవిధేయత మూలతత్వాలను కలిగి ఉండడు; ఆయన తత్వమే మంచిది. సౌందర్యం మరియు మంచితనంతోపాటు ప్రేమ అంతటికీ ఆయనే అభివ్యక్తి. శరీరధారిగా ఉన్నప్పటికీ, తండ్రియైన దేవుడికి అవిధేయత చూపే ఏ పనినీ ఆయన చేయడు. తన ప్రాణత్యాగం చేయాల్సి వచ్చినప్పుడు కూడా, అలా చేయడానికి ఆయన సంపూర్ణ హృదయంతో సిద్ధంగా ఉంటాడు మరియు ఆయన మరోదానిని ఎంచుకోడు. దేవుడికి స్వీయ-నీతి లేదా స్వీయ-ప్రాముఖ్యత లేదా ఆత్మస్తుతి మరియు అహంకారపు మూలతత్వములు లేవు; ఆయనకు వికృతంగా ఉండే మూలతత్వములు లేవు. దేవుడికి అవిధేయత చూపే ప్రతి ఒక్కటి సాతాను నుండి వస్తుంది; అన్ని వికృతులకు మరియు దుష్టత్వానికి సాతానుడే మూలం. సాతాను లక్షణాలతో సమానమైన లక్షణాలు మనుష్యుడు కలిగి ఉండడానికి కారణం, మనిషి సాతాను చేత చెరపబడ్డాడు మరియు మార్పు చేయబడ్డాడు. క్రీస్తు సాతానుచే చెరపబడలేదు, కాబట్టి, ఆయన దేవుడి లక్షణాలనే కలిగియున్నాడు మరియు ఆయనలో సాతాను లక్షణాలేవీ లేవు. కార్యము ఎంతో ప్రయాసతో కూడినదైనప్పటికీ, లేదా దేహం బలహీనంగా ఉన్నప్పటికీ, దేవుడు ఆయన దేహంతో ఉన్నప్పుడు, దేవుడి కార్యానికి ఆటంకం కలిగించే దేనినీ ఆయన ఎప్పుడూ చేయడు, అవిధేయతతో తండ్రియైన దేవుడి చిత్తాన్ని విడిచిపెట్టడు. తండ్రియైన దేవుడి చిత్తానికి విరుద్ధంగా నడుచుకోవడంకంటే దేహం నొప్పులనే ఆయన ఇష్టంగా సహిస్తాడు; యేసు తన ప్రార్ధనలో చెప్పినట్లు, “తండ్రీ, సాధ్యమైతే ఈ గిన్నె నాయొద్దనుండి తొలగి పోనిమ్ము, అయినను నా యిష్టప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని.” అన్న రీతిలోనే ఆయన అన్నింటినీ భరిస్తాడు. మనుష్యులు తమ సొంత నిర్ణయాలు తీసుకుంటారు, కానీ క్రీస్తు అలా చేయడు. ఆయన స్వయంగా దేవుడి స్వరూపమే కలిగి ఉన్నప్పటికీ, తండ్రియైన దేవుడి చిత్తాన్నే ఆయన కోరుకుంటాడు, తండ్రియైన దేవుడు దేహపరంగా ఆయనకు అప్పజెప్పిన పనిని నెరవేరుస్తాడు. ఇది మనుష్యుడు సాధించలేనిది. అంటే, సాతాను నుండి వచ్చిన దానిలో దేవుడి తత్వం ఉండదు; దానిలో దేవుడిని ధిక్కరించేది మరియు ప్రతిఘటించేది మాత్రమే ఉంటుంది. అది దేవుడి చిత్తానికి విధేయంగా ఉండటం అటుంచి, పూర్తిగా విధేయత కూడా చూపలేదు. క్రీస్తు తప్ప మనుష్యులందరూ దేవుడిని ప్రతిఘటించేది ఏదైనా చేయవచ్చు మరియు దేవుడు అప్పగించిన కార్యాన్ని ఏ ఒక్క మనిషి కూడా నేరుగా చేయలేడు; దేవుడి నిర్వహణను తమ సొంత విధిగా ఎవరూ పరిగణించలేరు. తండ్రియైన దేవుడి చిత్తానికి లోబడి ఉండడమనేది క్రీస్తు తత్వం; దేవుడికి అవిధేయత చూపడమే సాతాను లక్షణం. ఈ రెండు గుణాలు ఒకదానికొకటి సరిపోనివి, సాతాను గుణాలు ఉన్నవారెవరినీ క్రీస్తు అని పిలవలేము. మనిషి తన స్థానంలో ఉండి దేవుడి కార్యాన్ని ఎందుకు చేయలేడంటే, మనుష్యునిలో దేవుడి తత్వం ఏదీ లేదు. మనిషి తన వ్యక్తిగత ప్రయోజనాలు మరియు భవిష్యత్తు అవకాశాల దృష్ట్యా దేవుడి కోసం పని చేస్తాడు. కానీ, క్రీస్తు తండ్రియైన దేవుడి చిత్తాన్ని నెరవేర్చడానికి పని చేస్తాడు.
క్రీస్తు మనుష్యత్వము అనేది ఆయనలోని దైవత్వము చేత పాలించబడుతుంది. ఆయన దేహ రూపంలో ఉన్నప్పటికీ, ఆయన మనుష్యత్వము అనేది సంపూర్ణంగా దేహధారి అయిన మనిషిలాగా ఉండదు. ఆయన తన సొంత విలక్షణ గుణాన్ని కలిగి ఉన్నాడు మరియు అది కూడా ఆయన దైవత్వం చేతనే పాలించబడుతుంది. ఆయన దైవత్వంలో బలహీనత లేదు; క్రీస్తులో ఉన్న బలహీనత అంతా ఆయన మనుష్యత్వమును సూచిస్తుంది. కొంత స్థాయి వరకు, ఈ బలహీనత ఆయన దైవత్వాన్ని పరిమితపరిచినప్పటికీ, అలాంటి పరిమితులు నిర్దిష్ట పరిధి మరియు సమయం లోపలే ఉంటాయి మరియు వీటికి హద్దులు ఉంటాయి. ఆయన దైవత్వ కార్యమును నిర్వహించే సమయం వచ్చినప్పుడు, అది ఆయన మనుష్యత్వముతో సంబంధం లేకుండా చేయబడుతుంది. క్రీస్తు మనుష్యత్వము సంపూర్తిగా ఆయన దైవత్వంచేత నిర్దేశించబడింది. ఆయన మనుష్యత్వము సాధారణ జీవితాన్ని పక్కన పెడితే, ఆయన మనుష్యత్వమునకు సంబంధించిన అన్ని ఇతర చర్యలు ఆయన దైవత్వం చేత ప్రేరితమవుతాయి, ప్రభావితం చేయబడతాయి మరియు నిర్దేశించబడతాయి. క్రీస్తుకు మనుష్యత్వము ఉన్నప్పటికీ, అది ఆయన దైవత్వ కార్యానికి ఆటంకం కలిగించదు. ఎందుకంటే, క్రీస్తు మనుష్యత్వము ఆయన దైవత్వం చేత నిర్దేశించబడింది; ఇతరులతో ఎలా ప్రవర్తించాలనే విషయంలో ఆయన మనుష్యత్వము పరిపక్వత చెందకపోయినా, అది ఆయన దైవత్వపు సాధారణ కార్యాన్ని ప్రభావితం చేయదు. ఆయన మనుష్యత్వము చెరపబడలేదని నేను అన్నప్పుడు, క్రీస్తు మనుష్యత్వము ఆయన దైవత్వం చేత ప్రత్యక్షంగా ఆజ్ఞాపించబడుతుందని మరియు ఆయన సాధారణ మనుష్యుని కంటే ఉన్నత భావాన్ని కలిగి ఉన్నాడని చెప్పడమే నా ఉద్దేశ్యం. ఆయన మనుష్యత్వము ఆయన కార్యములో దైవత్వం చేత నిర్దేశించబడడానికి అత్యంత అనుకూలమైనది; ఆయన మనుష్యత్వము, దైవత్వపు కార్యాన్ని వ్యక్తీకరించడానికి మరియు అలాంటి కార్యానికి లొంగిపోవడానికి అత్యంత సమర్థవంతమైనది. దేవుడు దేహంలో పని చేస్తున్నప్పుడు, దేహధారియైన మనిషి నెరవేర్చవలసిన బాధ్యత పట్ల దృష్టిని ఎప్పటికీ ఆయన కోల్పోడు; నిజమైన హృదయంతో ఆయన పరలోకపు దేవుడిని ఆరాధించగలడు. ఆయనలో దేవుడి తత్వం ఉంది మరియు ఆయన గుర్తింపు స్వయంగా దేవుడే. ఆయన భూమిపైకి వచ్చి, సృష్టించబడిన జీవికి సంబంధించిన బాహ్య స్వరూపంతో, సృష్టించబడిన జీవిగా మారాడు మరియు ఇప్పుడు ఆయన ఇంతకు ముందెప్పుడూ లేని మనుష్యత్వము కలిగి ఉన్నాడు. ఆయన పరలోకపు దేవుడిని ఆరాధించగలడు; ఎందుకంటే, ఆయన స్వయంగా దేవుడు మరియు ఆయనను మనిషి అనుకరించలేడు. ఆయన గుర్తింపు స్వయంగా దేవుడే. మానవ దేహంలో ఉన్నాడనే కోణంలోనే ఆయన దేవుడిని ఆరాధిస్తాడు; కాబట్టి, “క్రీస్తు పరలోకపు దేవుడిని ఆరాధిస్తాడు” అనే పదాలు తప్పు కావు. ఆయన మనిషిని అడిగేది ఖచ్చితంగా స్వయంగా ఆయననే; ఏమి సాధించాలని ఆయన మనిషిని అడిగేవన్నీ వారిని అడగడానికి ముందే ఆయన సాధించాడు. ఆయన ఇతరుల నుండి స్వతంత్రంగా ఉంటూనే, వారి నుండి ఎలాంటి డిమాండ్లు ఎప్పటికీ చేయడు, ఎందుకంటే ఇవన్నీ ఆయనలోనే ఉంటాయి కాబట్టి. ఆయన తన కార్యాన్ని ఎలా నిర్వర్తిస్తాడనే దానితో సంబంధం లేకుండా, ఆయన దేవుడికి అవిధేయత చూపే విధంగా ప్రవర్తించడు. మనిషిని ఆయన ఏమి అడిగినప్పటికీ, ఆయన కోరిక ఏది కూడా మనిషి సాధించగలిగే దానిని మించినదై ఉండదు. ఆయన చేసేదంతా దేవుడి చిత్తం చేసేదే మరియు అది ఆయన నిర్వహణ కోసమే. క్రీస్తు దైవత్వం మనుష్యులందరిని మించినది; కాబట్టి, సృష్టించబడిన జీవులన్నింటికీ ఆయన అత్యున్నత అధికారి. ఈ అధికారమే ఆయన దైవత్వం, అంటే ఆయన స్వభావం మరియు స్వయంగా దేవుడై ఉండడం అనేవే ఆయన గుర్తింపును నిర్ణయిస్తాయి. కాబట్టి, ఆయన మనుష్యత్వము ఎంత మామూలుగా ఉన్నప్పటికీ, ఆయనే స్వయంగా దేవుడు అనే గుర్తింపు నిరాకరించలేనిది; ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడినా మరియు ఆయన దేవుని చిత్తానికి ఎలా లోబడి ఉన్నా, ఆయనే స్వయంగా దేవుడు కాదని చెప్పలేము. మూర్ఖులు మరియు అజ్ఞానులు క్రీస్తు సాధారణ మనుష్యత్వమును తరచూ ఒక లోపంగా భావిస్తారు. ఆయన దైవత్వాన్ని ఎలా వ్యక్తీకరించినా మరియు వెల్లడించినా, ఆయనే క్రీస్తు అని మనిషి ఒప్పుకోలేడు. క్రీస్తు ఎంత ఎక్కువగా తన విధేయతను మరియు వినయాన్ని ప్రదర్శిస్తాడో, తెలివి తక్కువవారు అంతే ఎక్కువ తేలికగా క్రీస్తును భావిస్తారు. ఆయన పట్ల మినహాయింపు మరియు ధిక్కార ధోరణి అనుసరించేవారు కూడా ఉన్నారు, అయినప్పటికీ, “గొప్ప మనుష్యుల” ఎత్తైన చిత్రాలను బల్లపై ఉంచి ఆరాధిస్తుంటారు. దేవుడి పట్ల మనిషి ప్రతిఘటన మరియు అవిధేయత అనేవి అవతారుడైన దేవుడి తత్వం, దేవుడి చిత్తానికి సమర్పించబడుతుందని, అలాగే క్రీస్తు సాధారణ మనుష్యత్వము నుండి వచ్చిందనే వాస్తవం నుండి వచ్చాయి; ఇవే దేవుడి పట్ల మనిషి ప్రతిఘటనకు మరియు అవిధేయతకు మూలాలు. క్రీస్తు తన మనుష్యత్వము ముసుగులో ఉండకపోయినా లేదా సృష్టించబడిన జీవి దృష్టికోణం నుండి తండ్రియైన దేవుడి చిత్తాన్ని కోరుకోకపోయినా, దానికి బదులుగా ఒక ఉత్తమమైన మనుష్యత్వము కలిగి ఉండి ఉంటే, అప్పుడు మనుష్యులలో బహుశా ఆయన పట్ల అవిధేయత ఎక్కువగా ఉండేది కాదు. పరలోకంలోని అదృశ్య దేవుడిని ఎల్లప్పుడూ విశ్వసించేందుకు మనుష్యుడు ఇష్టపడటానికి కారణం పరలోకంలోని దేవుడికి మనుష్యత్వము లేకపోవడమే లేదా సృష్టించబడిన జీవి యొక్క ఒక్క గుణాన్ని కూడా కలిగి ఉండకపోవడమే. కాబట్టి, మనిషి ఎల్లప్పుడూ ఆయనను గొప్ప గౌరవంతో చూస్తాడు, కానీ క్రీస్తు పట్ల ధిక్కార వైఖరిని కలిగి ఉంటాడు.
భూమిపై ఉన్న క్రీస్తు స్వయాన దేవుడి తరపున పని చేయగలిగినప్పటికీ, ఆయన తన శరీరావతారాన్ని మనుష్యులందరికీ చూపించాలనే ఉద్దేశ్యంతో రాలేదు. మనుష్యులందరికీ కనిపించేలా ఆయన రాడు; మనిషిని తన చేతితో నడిపించటానికి ఆయన వస్తాడు, ఆవిధంగా మనిషి కొత్త యుగంలోకి ప్రవేశిస్తాడు. క్రీస్తు శరీరము యొక్క విధి స్వయంగా దేవుడి కార్యము కోసమే, అనగా, శరీరములోని దేవుడి కార్యము కోసం, అంతేగానీ మనిషి తన శరీర తత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకునేటట్లు చేయడానికి కాదు. ఆయన ఎలా పనిచేసినా, ఆయన చేసేది ఏదీ కూడా శరీరం సాధించగలిగేదాన్ని దాటి ఉండదు. ఆయన ఎలా పనిచేసినా, ఆయన శరీరంలో సాధారణ మనుష్యత్వముతోనే అలా చేస్తాడు మరియు దేవుని నిజమైన ఆమోదాన్ని మనిషికి పూర్తిగా వెల్లడించడు. అంతేగాకుండా, శరీరధారిగా ఆయన చేసే కార్యం మనిషి ఊహించినంత అతీంద్రియమైనది లేదా దివ్యమైనది కాదు. శరీరధారియైన క్రీస్తు దేవుడికే ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ, దేవుడే చేయవలసిన కార్యాన్ని స్వయంగా నిర్వర్తిస్తున్నప్పటికీ, ఆయన పరలోకంలోని దేవుడి ఉనికిని నిరాకరించడు లేదా తన సొంత కార్యములను వ్యాకులతతో ప్రకటించడు. దానికి బదులుగా, వినయంగా ఆయన తన శరీరం లోపలే దాగి ఉంటాడు. క్రీస్తుకు కాకుండా, క్రీస్తు అని అబద్ధముగా చెప్పుకునేవారికి ఆయన లక్షణాలు ఉండవు. అహంకారపూరిత మరియు స్వీయ-పొగడ్త స్వభావంగల ఆ అబద్ధపు క్రీస్తుల పక్కనే పెట్టి చూసినప్పుడు, ఎలాంటి స్వభావంగల దేహం నిజమైన క్రీస్తు అనేది స్పష్టంగా తెలుస్తుంది. అలాంటి అబద్ధపు క్రీస్తులు ఎంత అబద్ధంగా ఉంటారో, అంతే ఎక్కువగా వారిని వారు పొగుడుకుంటారు మరియు మనిషిని మోసం చేయడానికి సంకేతాలు మరియు అద్భుతాలు చేయగల మరింత సమర్థత వారికి ఉంటుంది. అబద్ధపు క్రీస్తులకు దేవుడి లక్షణాలు ఉండవు; తప్పుడు క్రీస్తులకు చెందిన ఏ మూలతత్వంతోనూ క్రీస్తు కలుషితం కాలేదు. దేవుడు శరీరానికి సంబంధించిన కార్యమును పూర్తి చేయడానికే శరీరధారి అవుతాడు, అంతేగానీ కేవలం మనుష్యులు ఆయనను చూసేలా చేయడానికి కాదు. దానికి బదులుగా, ఆయన కార్యము తన గుర్తింపును ధృవీకరించేలా ఆయన చేస్తాడు మరియు ఆయన వెల్లడించేది ఆయన తత్వాన్ని ప్రమాణీకరించేలా చేస్తాడు. ఆయన తత్వం నిరాధారమైనది కాదు; ఆయన గుర్తింపు ఆయన చేతితో బంధించబడలేదు; ఆ గుర్తింపు ఆయన కార్యము మరియు ఆయన తత్వం ద్వారా నిర్ణయించబడుతుంది. ఆయనలో స్వయంగా దేవుడి తత్వం ఉన్నప్పటికీ మరియు దేవుడి కార్యమును స్వయంగా చేయగలిగినప్పటికీ, ఏదేమైనా ఆయన ఆత్మ వలె కాకుండా ఇప్పటికీ దేహమే. ఆయన ఆత్మ లక్షణాలు గల దేవుడు కాదు; ఆయన దేహ స్వరూపాన్ని కప్పుకున్న దేవుడు. కాబట్టి, ఆయన ఎంత సామాన్యుడైనా, ఎంత బలహీనుడైనా మరియు తండ్రియైన దేవుడి చిత్తాన్ని ఎంత ఆయన కోరుకున్నా, ఆయన దైవత్వం నిరాకరించలేనిది. అవతారిమైన దేవుడిలో సాధారణ మనుష్యత్వమే కాకుండా దాని బలహీనతలు కూడా ఉంటాయి; ఆయన దైవత్వం యొక్క అద్భుతం మరియు గంభీరతతో పాటు శరీరంతో చేసే ఆయన అన్ని కార్యములు ఉంటాయి. కాబట్టి, మనుష్యత్వము మరియు దైవత్వం రెండూ క్రీస్తులో ఉన్నాయి, యదార్థంగా మరియు ఆచరణాత్మకంగా అనే, రెండు విధాలుగా అవి ఉన్నాయి. ఇదేదో చాలా డొల్ల లేదా అతీంద్రియమైనది కాదు. కార్యాన్ని నెరవేర్చే ప్రాథమిక లక్ష్యంతో ఆయన భూమి మీదకు వస్తాడు; భూమిపై కార్యాన్ని చేయడానికి సాధారణ మనుష్యత్వము కలిగి ఉండటం అనేది తప్పనిసరి; లేకపోతే, ఆయన దైవత్వం ఎంత గొప్ప శక్తివంతమైనదైనప్పటికీ, దాని అసలు విధిని సరిగా చేయలేదు. ఆయన మనుష్యత్వము చాలా ప్రాధాన్యత ఉన్నప్పటికీ, అది ఆయన తత్వం మాత్రం కాదు. ఆయన తత్వం దైవత్వం; కాబట్టి, ఆయన భూమిపై తన పరిచర్యను నిర్వహించడం ప్రారంభించిన క్షణమే ఆయన తన దైవత్వాన్ని వ్యక్తపరచడం ప్రారంభించిన క్షణంగా ఉంటుంది. ఆయన దైవత్వాన్ని ఒక సాధారణ దేహంలో నుండి నిర్వహించగలగడానికి ఆయన దేహధారిగా సాధారణ జీవితాన్ని నిలుపుకోవడానికి మాత్రమే ఆయనకు మనుష్యత్వము ఉంది; ఆయన కార్యాన్ని పూర్తిగా నిర్దేశించేది ఆ దైవత్వమే. ఆయన తన కార్యాన్ని పూర్తి చేసినప్పుడు, ఆయన తన పరిచర్యను పూర్తి చేసినవాడవుతాడు. మనిషి తెలుసుకోవలసింది సంపూర్ణంగా ఆయన కార్యాన్ని గురించే మరియు ఆయన తన కార్యము ద్వారానే మనిషి తనను తెలుసుకోగలిగేలా చేస్తాడు. ఆయన కార్యము చేస్తున్న క్రమంలో, ఆయన తన దైవత్వపు ఉనికిని సంపూర్ణంగా వ్యక్తపరుస్తాడు, ఇది మనుష్యత్వముతో కలుషితమైన స్వభావం కాదు లేదా మానవ ఆలోచన మరియు ప్రవర్తనతో కలుషితమైనది కాదు. సమయం వచ్చినప్పుడు, ఆయన పరిచర్య అంతా ముగిసినప్పుడు, ఆయన వ్యక్తపరచవలసిన స్వభావాన్ని అప్పటికే ఆయన సంపూర్ణంగా మరియు పూర్తిగా వ్యక్తపరిచి ఉంటాడు. ఆయన కార్యము ఏ మనిషి సూచనల ద్వారా నిర్దేశితం చేయబడదు; ఆయన స్వభావపు వ్యక్తీకరణ కూడా చాలా స్వతంత్రంగా ఉంటుంది మరియు అది మనస్సు ద్వారా నియంత్రించబడదు లేదా ఆలోచన ద్వారా మార్పు చేయబడదు కానీ, అది సహజంగానే వెల్లడించబడుతుంది. ఇది ఏ మనిషి కూడా సాధించలేనిది. పరిసరాలు కర్కశంగా ఉన్నప్పటికీ, లేదా పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ, ఆయన తగిన సమయంలో తన స్వభావాన్ని వ్యక్తపరచగలడు. క్రీస్తు అయిన వ్యక్తి క్రీస్తుగా తన ఉనికిని వ్యక్తపరుస్తాడు, అలాకాని వారిలో క్రీస్తు స్వభావం ఉండదు. కాబట్టి, అందరూ ఆయనను ప్రతిఘటించినా లేదా ఆయన గురించి అభిప్రాయాలు ఏర్పరచుకున్నా, క్రీస్తు వ్యక్తీపరచిన స్వభావం దేవుడిదే అనడాన్ని మనుష్యుల అభిప్రాయం ఆధారంగా ఎవరూ నిరాకరించలేరు. నిజమైన హృదయంతో క్రీస్తును అనుసరించే వారందరూ లేదా ఉద్దేశపూర్వకంగా దేవుడి కోసం పరితపించే వారందరూ ఆయన దైవత్వపు వ్యక్తీకరణపై ఆధారపడిన క్రీస్తు అని ఒప్పుకుంటారు. మనిషి అభిప్రాయాలకు అనుగుణంగా లేని ఏ కోణం నుండైనా వారు క్రీస్తును ఎప్పటికీ తిరస్కరించరు. మనిషి ఎంతో మూర్ఖుడు అయినప్పటికీ, మనిషి చిత్తం ఏమిటో మరియు దేవుడి నుండి ఉద్భవించినది ఏమిటో అందరికీ ఖచ్చితంగా తెలుసు. చాలా మంది మనుష్యులు తమ ఉద్దేశాల ఫలితంగా మాత్రమే క్రీస్తును ఉద్దేశపూర్వకంగా ప్రతిఘటిస్తారు. దీని కోసం కాకపోతే, క్రీస్తు ఉనికిని నిరాకరించడానికి ఏ ఒక్కరికైనా కారణం ఏదీ ఉండదు, ఎందుకంటే క్రీస్తు వ్యక్తీకరించిన దైవత్వం నిజంగా మనుగడలో ఉంది మరియు ఆయన కార్యాన్ని కంటితో చూడవచ్చు.
క్రీస్తు కార్యము మరియు వ్యక్తీకరణ ఆయన తత్వాన్ని నిర్ణయిస్తాయి. తనకు అప్పగించిన దానిని ఆయన నిజమైన హృదయంతో పూర్తి చేయగలడు. నిజమైన హృదయంతో పరలోకపు దేవుడిని ఆయన ఆరాధించగలడు మరియు నిజమైన హృదయంతో తండ్రియైన దేవుడి చిత్తాన్ని కోరుకోగలడు. ఇదంతా ఆయన తత్వంతో నిశ్చయింపబడుతుంది. మరియు ఆయన సహజ ప్రకటన ఆయన తత్వం ద్వారా నిశ్చయింపబడుతుంది; నేను దీనిని ఆయన “సహజమైన ప్రకటన” అని ఎందుకు పిలుస్తానంటే, ఆయన వ్యక్తీకరణ అనుకరణ కాదు లేదా మనిషి నేర్చుకున్న విద్య ఫలితం లేదా మనిషి అనేక సంవత్సరాల సంస్కృతి యొక్క ఫలితం కాదు. ఆయన దానిని నేర్చుకోలేదు లేదా దానితో తనను తాను అలంకరించుకోలేదు; దానికి బదులుగా, అది ఆయనలో అంతర్లీనంగా ఉంది. మనిషి ఆయన కార్యాన్ని, ఆయన వ్యక్తీకరణను, ఆయన మనుష్యత్వము మరియు ఆయన సాధారణ మనుష్యత్వము సంపూర్ణ జీవితాన్ని నిరాకరించవచ్చు కానీ, ఆయన నిజమైన హృదయంతో పరలోకపు దేవుడిని ఆరాధిస్తాడని ఎవరూ నిరాకరించలేరు; ఆయన పరలోకపు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చారనడాన్ని ఎవరూ నిరాకరించలేరు మరియు ఆయన తండ్రియైన దేవుడి కోసం పరితాపం చెందడంలోని నిజాయితీని ఎవరూ నిరాకరించలేరు. ఆయన ఆకారం ఇంద్రియాలకు నచ్చకపోయినప్పటికీ, ఆయన ప్రసంగంలో అసాధారణమైన గాలి లేకపోయినప్పటికీ, మరియు మనిషి ఊహించినట్లుగా ఆయన కార్యము భూమిని బద్దలు చేయకపోయినప్పటికీ లేదా పరలోకాన్ని కుదిపివేయనప్పటికీ, ఆయన పరలోకపు తండ్రి చిత్తాన్ని నిజమైన హృదయంతో నెరవేర్చే మరియు మరణానికి విధేయత చూపే నిజమైన క్రీస్తు. ఎందుకంటే, ఆయన తత్వం క్రీస్తు తత్వం. ఇది మనిషి నమ్మడానికి కష్టమైన నిజం కానీ, ఇదే వాస్తవం. క్రీస్తు పరిచర్య సంపూర్ణంగా నెరవేర్చబడినప్పుడు, ఆయన కార్యములో ఆయన స్వభావాన్ని మరియు ఆయన పరలోకపు దేవుడి స్వభావానికి ప్రతినిధిగా ఉండడాన్ని మరియు దేవుడే అయి ఉండడాన్ని మనిషి చూడగలుగుతాడు. ఆ సమయంలో, ఆయన కార్యపు మొత్తం సారాంశం, దేహ రూపంలోకి మారిన వాక్యము నిజంగా ఆయనే అని ధృవీకరిస్తుంది, అంతేగానీ శరీరము కలిగిన మనిషిలా కాదు. భూమి మీద క్రీస్తు కార్యపు ప్రతి అడుగులో దాని ప్రాతినిధ్యపు ప్రాముఖ్యత ఉన్నప్పటికీ, ప్రతి అడుగు వాస్తవిక కార్యాన్ని అనుభవించే మనిషి ఆయన కార్యపు ప్రాముఖ్యతను గ్రహించలేడు. దేవుడు తన రెండవ అవతారంలో చేపట్టిన అనేక దశల కార్యానికి ఇది ప్రత్యేకంగా వర్తిస్తుంది. క్రీస్తు వాక్యములను కేవలం విన్న లేదా చూసిన వారిలో చాలా మందికి, ఆయనను ఎప్పుడూ చూడని వారికి ఆయన కార్యము గురించి ఎటువంటి అభిప్రాయాలు ఉండవు; క్రీస్తును చూసిన మరియు ఆయన వాక్యములను విన్న మరియు ఆయన కార్యాన్ని అనుభవించిన వారికి ఆయన కార్యాన్ని అంగీకరించడం కష్టమనిపిస్తుంది. క్రీస్తు ఆకారం మరియు ఆయన సాధారణ మనుష్యత్వము మనిషికి రుచించకపోవడమే దీనికి కారణమా? క్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత ఆయన కార్యాన్ని అంగీకరించే వారికి అలాంటి కష్టాలు ఉండవు, ఎందుకంటే, వారు కేవలం ఆయన కార్యాన్ని అంగీకరిస్తారు మరియు క్రీస్తు సాధారణ మనుష్యత్వముతో సంబంధం కలిగి ఉండరు. మనిషి దేవుడి గురించి తన అభిప్రాయాలను వదులుకోలేక పోతున్నాడు, దానికి బదులుగా ఆయనను లోతుగా పరిశీలిస్తాడు; దీనికి కారణం, మనిషి ఆయన ఆకారంపై మాత్రమే దృష్టి పెడతాడు మరియు ఆయన కార్యము, వాక్యముల ఆధారంగా ఆయన తత్వాన్ని గుర్తించజాలడు. మనిషి క్రీస్తు ఆకారాన్ని చూడకుండా కళ్ళు మూసుకుంటే, లేదా క్రీస్తు మనుష్యత్వము గురించి చర్చించకుండా ఉంటే, ఏ మనిషికీ సాధ్యం కాని ఆయన కార్యము మరియు వాక్యములను అందించిన ఆయన దైవత్వం గురించి మాత్రమే మాట్లాడితే, అప్పుడు మనిషి అభిప్రాయాలు సగానికి సగం తగ్గిపోతాయి, ఎంతవరకంటే మనిషి కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. అవతారియైన దేవుడి కార్యము సమయంలో, మనిషి ఆయనను సహించలేడు మరియు ఆయన గురించి అనేక అభిప్రాయాలతో నిండి ఉంటాడు మరియు ప్రతిఘటన మరియు అవిధేయత సందర్భాలు అనేవి సాధారణం. మనిషి దేవుడి ఉనికిని సహించలేడు, క్రీస్తు వినయం మరియు అదృశ్యత పట్ల సౌమ్యతను చూపలేడు లేదా పరలోకపు తండ్రికి విధేయుడయ్యే క్రీస్తు తత్వాన్ని క్షమించలేడు. కాబట్టి, ఆయన తన కార్యాన్ని పూర్తి చేసిన తర్వాత శాశ్వతంగా మనిషితో ఉండలేడు, ఎందుకంటే, మనిషి ఆయనతో కలిసి జీవించడానికి ఇష్టపడడు. మనిషి ఆయన కార్యము సమయంలో ఆయన పట్ల సౌమ్యత చూపలేకపోతే, ఆయన తన పరిచర్యను పూర్తిచేసిన తర్వాత, తన వాక్యములను మెల్లమెల్లగా మనుష్యులు అనుభవించడం చూస్తాడు కాబట్టి, వారితో కలిసి ఆయన జీవించడాన్ని మనుష్యులు ఎలా సహించగలరు? అప్పుడు ఆయన కారణంగా అనేక మంది పడిపోరా? ఆయన భూమిపై పని చేయడానికి మాత్రమే మనిషి అనుమతిస్తాడు; ఇదే మనిషి సౌమ్యతకు అత్యున్నత పరిధి. ఆయన పని కోసం కాకపోయినట్లయితే, మనిషి చాలా కాలం క్రితమే ఆయనను భూమి నుండి వెలివేసేవాడు, కాబట్టి ఆయన కార్యము పూర్తయిన తర్వాత వారు ఎంత తక్కువ సౌమ్యత చూపుతారు? అప్పుడు మనిషి ఆయనకు మరణదండన విధించడా మరియు ఆయనను హింసించి చంపివేయడా? ఆయన క్రీస్తు అని పిలవబడకపోతే, బహుశా ఆయన మానవజాతి మధ్య పని చేసి ఉండలేడు; ఆయన స్వయంగా దేవుడి గుర్తింపుతో పని చేయకపోతే మరియు దానికి బదులుగా ఒక సాధారణ మనిషిగా మాత్రమే పని చేస్తే, అప్పుడు కార్యములో అతిస్వల్పాన్ని సహించడం మాట అటుంచి, మనిషి ఆయన ఒక్క వాక్యాన్ని కూడా ఉచ్చరించడాన్ని సహించేవాడు కాడు. కాబట్టి, ఆయన తన కార్యముతో మాత్రమే తన గుర్తింపును కొనసాగించగలడు. ఈ విధంగా, ఆయన అలా చేసి ఉండకపోవడం కంటే ఆయన కార్యము ఎంతో శక్తివంతమైనది, ఎందుకంటే మనుష్యులందరూ నిలబడి మరియు గొప్ప గుర్తింపును పాటించటానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన స్వయంగా దేవుడిగా పనిచేసినప్పుడు లేదా కనిపించినప్పుడు, ఆయన స్వయంగా దేవుడి గుర్తింపును కలిగి ఉండకపోతే, ఆయనకు అసలు పని చేసే అవకాశమే ఉండేది కాదు. ఆయనలో దేవుడి తత్వం ఉన్నది మరియు ఆయన క్రీస్తు అన్నది వాస్తవమే అయినప్పటికీ, ఆయన మానవాళి మధ్య సులభంగా పని చేయడాన్ని మనిషి తేలికగా తీసుకుని మరియు అనుమతించి ఉండేవాడు కాడు. ఆయన తన కార్యములో దేవుడి గుర్తింపును కలిగి ఉంటాడు; అలాంటి గుర్తింపు లేకుండా చేసిన దానికంటే ఆ పని డజన్ల రెట్లు ఎక్కువ శక్తివంతమైనది అయినప్పటికీ, మనిషి ఇప్పటికీ ఆయనకు పూర్తిగా విధేయత చూపడు, ఎందుకంటే, మనిషి ఆయన హోదాకు మాత్రమే లొంగుతాడు మరియు ఆయన తత్వానికి కాదు. అలాంటప్పుడు, బహుశా ఒకరోజు క్రీస్తు తన పదవి నుండి దిగిపోయినప్పుడు, మనిషి ఆయనను ఒక్కరోజైనా బతకనివ్వగలడా? దేవుడు తన చేతితో చేసిన కార్యము రాబోయే సంవత్సరాలలో కలిగించే ప్రభావాలను చూడవచ్చునని ఆయన మనిషితో కలిసి భూమిపై జీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయినప్పటికీ, మనిషి ఆయన ఉనికిని ఒక్కరోజు కూడా సహించలేడు, కాబట్టి ఆయన మాత్రమే వదులుకోగలిగాడు. దేవుడు మనుష్యుల మధ్య ఆయన చేయవలసిన కార్యాన్ని చేయడానికి మరియు ఆయన పరిచర్యను నెరవేర్చడానికి అనుమతించడంలో మనిషి ఇప్పటికే అత్యంత ఎక్కువ మేరకు సౌమ్యత మరియు దయను ప్రదర్శించాడు. ఆయనచే వ్యక్తిగతంగా జయించబడిన వారు ఆయన పట్ల అలాంటి దయ చూపినప్పటికీ, వారు ఇప్పటికీ ఆయన పని పూర్తయ్యే వరకు మాత్రమే ఉండడానికి ఆయనను అనుమతిస్తారు మరియు దాని తర్వాత ఒక్క క్షణం కూడా అనుమతించరు. ఇది అలా ఉన్నప్పుడు, ఆయన జయించని వారి సంగతేమిటి? అవతారధారియైన దేవుడితో మనిషి ఈ విధంగా ప్రవర్తించడానికి కారణం, ఆయన ఒక సాధారణ మానవుని స్వరూపంతో ఉన్న క్రీస్తు కాబట్టేనా? ఆయనకు సాధారణ మనుష్యత్వము లేకుండా దైవత్వం మాత్రమే ఉంటే, అప్పుడు మనిషి కష్టాలు అత్యంత సులువుగా పరిష్కరించబడి ఉండేవి కావా? మనిషి అయిష్టంగా ఆయన దైవత్వాన్ని అంగీకరిస్తాడు మరియు ఆయన తత్వం ఖచ్చితంగా పరలోకపు తండ్రి చిత్తానికి లొంగిపోయే క్రీస్తు తత్వం అయినప్పటికీ, ఆయన సాధారణ మనిషి స్వరూపం పట్ల ఆసక్తి చూపడు. అందుచేత, మనిషి తన ఉనికిని ఇక ఏమాత్రం సహించలేడు కాబట్టి, వారితో సంతోషాలు మరియు దుఃఖాలు రెండింటినీ పంచుకోవడానికి ఆయన మనుష్యుల మధ్య ఉండే తన కార్యాన్ని రద్దు చేసుకోగలిగాడు.