ఇశ్రాయేలీయులు సేవించినట్లుగా సేవ చేయండి

ఈ రోజుల్లో చాలమంది ఇతరులతో సమన్వయము చేసుకుంటున్నపుడు ఎటువంటి పాఠాలు నేర్చుకోవాలన్నదానిపై శ్రద్ధ చూపడంలేదు. మీలో చాలమంది ఇతురులతో సమన్వయము చేసుకొంటున్నప్పుడు పాఠాలు నేర్చుకోవడంలేదని నేను కనుగొన్నాను. మీలో చాలామంది మీ స్వంత అభిప్రాయాలకు కట్టుబడి ఉంటారు. సంఘములో పని చేస్తున్నప్పుడు నీవు నీ మాటలు చెబుతావు, మరొకరు వారి మాటలు చెబుతారు, అప్పుడు ఒకరికొకరికి పొంతన ఉండదు, నిజానికి అసలు సహకారమే ఉండదు. మీరు మీకు తెలిసిన మీ మనసులోని గోడు చెప్పుకోవడంలో లేక మీ బాధ వెళ్లగక్కడంలో ఎంత నిమగ్నమైపోయారంటే అసలు జీవితాన్ని అర్థం చేసుకొనే చిన్న ప్రయత్నం కూడా చేయలేనంతగా నిమగ్నమైపోయారు. మీరు చేసే పని వెట్టి పనిగా పని చేస్తున్నట్లుగా కనిపిస్తారు. ఎవరు ఏమి చెప్పినా, ఏమి చేసినా మీరు మాత్రం యాంత్రికంగా మీ పని మీరు చేసుకుంటూపోవాలని నమ్ముతారు. ఇతరుల పరిస్థితి ఎలా ఉన్న పరిశుదాత్మ నడిపించినట్లుగానే నువ్వు సహవాసం చేయాలాని నువ్వు ఆలోచిస్తావు. మీరు ఇతరుల బలాలను కనుగొనలేరు, లేకమిమ్మల్ని మీరు పరీక్షించుకొనలేరు. మీరు విషయాలను స్వీకరించే విధానం చాల వక్ర పధ్ధతిగాను మరియు తప్పుడు పద్దతిగాను ఉంటుంది. ఇప్పటికీ మీరు ఆ పాత స్వభావం తిరిగివచ్చినట్లుగా ప్రవర్తిస్తూ మళ్లీ స్వ-నీతిని ఎక్కువగా ప్రదర్శిస్తున్నారని చెప్పవచ్చు. మీరు మనస్సు విప్పి మాట్లాడుకొను విధంగా ఒకనితో ఒకరు సంభాషించుకొనుటకు ప్రయత్నించరు, ఉదాహరణకు కొన్ని సంఘాలలో మీరు పనిచేయడం ద్వారా ఎటువంటి ఫలితాలను సాధించారు అనేదానిని గూర్చి గానీ లేక మీ అంతరంగపు స్థాయిలను గూర్చిన ఇటీవల పరిస్థితిని గూర్చి గానీ మరియు మొదలగు విషయాలను గూర్చి గానీ ఎవరితొనూ పంచుకోరు. మీరు మీ ఆలోచనలను మార్చుకోవడంలో లేక మిమ్మల్ని మీరు ఉపేక్షించుకోవడమువంటి అభ్యాసాలలో ఖచ్చితంగా నిమగ్నమై ఉండరు. నాయకులు మరియు పరిచారకులు తమ సోదరులు మరియు సోదరీమణులు ప్రతికూలంగా మారకుండా ఎలా చూసుకోవాలని మరియు వారిని బాగా అనుసరించే వారీగా ఎలా చేయాలన్న దాని గురించి మాత్రమే ఆలోచిస్తారు. అయినప్పటికీ, బాగా అనుసరించగలిగితే సరిపోతుందని మీరందరు అనుకుంటారు కానీ ప్రాథమికంగా, మిమ్మల్ని మీరు తెలుసుకోవడం మరియు మిమ్మల్ని మీరు ఉపేక్షించుకోవడం అంటే ఏమిటో మీకు అర్థం కాలేదు, ఇతరుల సమన్వయంతో సేవ చేయడం అంటే ఏమిటో మీకు అర్థం కాలేదు. దేవుని ప్రేమకు ప్రతిఫలం చెల్లించాలనే సంకల్పంతో, పేతురువలె జీవించాలని మాత్రమే మీరు ఆలోచిస్తారు. ఈ విషయాలు తప్ప, మీరు ఇంకేమీ ఆలోచించరు. ఇతరులు ఏమి చేసినా నేను మాత్రం గుడ్డిగా లోబడనని కూడా నీవు చెబుతావు, ఎవరు ఎలా ఉన్న నేను మాత్రం దేవుని ద్వారానే పరిపూర్ణత కోరుకొంటానని, అది సరిపోతుందని కూడా నీవు అంటావు. ఏది ఏమైనప్పటికీ, వాస్తవం ఏమిటంటే, నీ చిత్తం వాస్తవిక కోణములో ఎటువంటి బలమైన వ్యక్తీకరణను సంతరించుకొనలేదు. ఇవన్నీ ఈ రోజుల్లో మీరు ప్రదర్శించే చౌకబారు ప్రవర్తనలు కావా? మీలో ప్రతి ఒక్కరూ మీ స్వంత దృక్కోణమును గట్టిగా నమ్ముతారు మరియు మీరందరూ పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటారు. మీరు చాలా కాలం పాటు సేవ చేసినప్పటికీ సరైన పురోగతి సాధించలేదని నేను చూస్తున్నాను; ప్రత్యేకించి, సామరస్యంగా కలిసి పని చేసే పాఠంలో, మీరు ఖచ్చితంగా ఏమీ సాధించలేకపోయారు! సంఘాలలోనికి వెళ్ళేటప్పుడు నువ్వు నీ విధానంలో సంభాషిసావు, ఇతరులు వారి విధానంలో సంభాషణ చేస్తారు. మీలో సామరస్య సమన్వయం చాలా అరుదుగా కానవస్తుంది. మరీముఖ్యంగా నీ క్రింద ఉన్న నిజమైన అనుచరుల విషయములో మరి ఎక్కువగా కనబడుతుంది. ఇంకొక విధంగా చెప్పాలంటే, మీలో దేవుని సేవించడం అంటే ఏమిటో, లేదా దేవుని ఎలా సేవించాలో అర్ధం చేసుకున్న వారు ఉండటం అరుదు అని చెప్పవచ్చు. మీకు అర్థంకాక అలంటి పాఠాలను నేర్చుకోవటం అల్పమైన విషయాలుగా పరిగణిస్తారు. చాలామంది ఈ సత్యాన్ని అనుసరించడంలో విఫలమవటమే కాకుండా, తెలిసి తెలిసి తప్పు చేసేవారుగా ఉన్నారు. అనేక సంవత్సరాలుగా సేవ చేస్తున్నవారు కూడా ఒకరికి ఒకరు పడక పన్నాగాలు పన్నుకుంటూ ఉంటారు, వారు అసూయతో పోటి పడుతూ ఉంటారు; ప్రతి మనిషి తన కోసం తాను అన్నట్లుగా ఉండి అస్సలు సహకరించుకోరు. ఇవన్నీ మీ అసలైన స్థితిని తెలియజేయడంలేదా? అనుదినం కలసి దేవుణ్ణి సేవించే మీరు, ప్రతిదినం దేవుని మందిరంలో నేరుగా సేవించిన ఇశ్రాయేలీయులవంటివారుగా ఉన్నారు. దేవుణ్ణి సేవించే మీకు ఎలా సమన్వయము చేసుకోవాలో, ఎలా దేవుణ్ణి సేవించాలో ఆలోచన లేకుండా మీరు ఎలా ఉండగలుగుచున్నారు?

గతంలో, ఇశ్రాయేలీయులు నేరుగా మందిరంలో యెహోవాను సేవించారు, వారికి యాజకులని గుర్తింపు ఉండేది. (అయితే, ప్రతి వ్యక్తి యాజకుడు కాదు; మందిరంలో యెహోవాను సేవించే కొందరికి మాత్రమే ఆ గుర్తింపు ఉండేది.) వారందరూ యెహోవా తమకు ఇచ్చిన కిరీటాలను ధరించేవారు (అంటే వారు ఈ కిరీటాలను యెహోవా సూచనలకు అనుగుణంగా తయారు చేశారని అర్థం; యెహోవా నేరుగా వారికి కిరీటాలను ఇచ్చాడని కాదు). యెహోవాచే వారికి అనుగ్రహింపబడిన యాజక వస్త్రాలను కూడా వారు ధరించేవారు మరియు ఉదయం నుండి రాత్రి వరకు చెప్పులు లేకుండా మందిరంలో నేరుగా ఆయనను సేవించేవారు. వారు యెహోవాకు చేసే సేవ గందరగోళంగా ఉండేది కాదు, ఏదో గుడ్డిగా హడావుడి చేయడం కూడా ఉండేది కాదు కానీ ఆయనను నేరుగా సేవించేవారు ఉల్లంఘించలేని నిబంధనల ప్రకారం సేవించటం జరిగేది. వారందరూ ఈ నిబంధనలకు కట్టుబడి ఉండాలి; లేకుంటే, వారు మందిరంలోకి ప్రవేశించకుండా నిషేధించబడతారు. వారిలో ఎవరైనా మందిర నియమాలను ఉల్లంఘించినట్లయితే—అనగా, ఎవరైనా యెహోవా ఆజ్ఞలకు అవిధేయత చూపితే ఆ వ్యక్తిపై అయన జారీ చేసిన నియమాల ప్రకారం చర్య తీసుకోవాలి మరియు ఎవరు దీనికి అభ్యంతరం తెలపడానికైనా లేక అతిక్రమించినవారిని రక్షించడానికైనా అనుమతించబడేవారు కాదు. వారు ఎన్ని సంవత్సరాలు దేవుని సేవ చేసారన్నదానితో సంబంధము లేకుండా, అందరూ నియమాలకు కట్టుబడి ఉండవలసిందే. ఈ కారణంగా, చాలా మంది యాజకులు ఈ విధంగా యాజక వస్త్రాలను ధరించి ఏడాది పొడవునా నిరంతరం యెహోవాను సేవించారు యెహోవా వారికి ప్రత్యేక శ్రద్ధ ఇవ్వనప్పటికీ, ఈ పద్ధతిలో వారు తమ జీవితమంతా బలిపీఠం ముందు, మందిరంలో గడిపేవారు. ఇది వారి విధేయత మరియు సమర్పణకు నిదర్శనం. యెహోవా వారికి అలాంటి ఆశీర్వాదాలు ఇవ్వడంలో ఆశ్చర్యం లేదు; వారి విధేయత కారణంగానే వారు అనుగ్రహాన్ని పొందారు మరియు యెహోవా కార్యాలన్నిటినీ చూశారు. ఆ దినాలలో యెహోవా ఇశ్రాయేలులో తాను ఎన్నుకున్న జనుల మధ్య కార్యములు చేసినప్పుడు, ఆయన వారిపై చాలా భారభరితమైన ఆంక్షలను ఉంచాడు. వారందరూ చాలా విధేయులు మరియు ఆజ్ఞలచేత పరిమితి చేయబడ్డారు; యెహోవాయందు భయభక్తులు కలిగియుండుటకు ఈ ఆజ్ఞలన్నీ రక్షణ కవచంగా ఉపయోగించబడ్డాయి. ఇవన్నియు యెహోవా యొక్క నిర్వాహక శాసనములు. ఆ యాజకులలో ఎవరైనా విశ్రాంతి దినమును పాటించకపోయినా, లేక యెహోవా యొక్క ఆజ్ఞలను ఉల్లంఘించినట్లు ప్రజలు చూసినట్లయితే, ఆ వ్యక్తిని వెంటనే బలిపీఠం ముందు తీసుకెళ్లి రాళ్లతో కొట్టి చంపేస్తారు. ఆ శవములను మందిరములోగాని దాని పరిసర ప్రాంతాలలోగాని ఉంచడానికి వీలు లేదు; యెహోవా దానిని అనుమతించలేదు. అలా చేసిన వారెవరైనా వారు “అపవిత్రమైన బలులు” అర్పించే వ్యక్తిగా పరిగణించబడిన తరువాత అటువంటి వారిని చంపుటకు ఒక పెద్ద గోతిలో పడవేసేవారు. అటువంటి వారందరూ తమ ప్రాణాలను వదులుకునేవారు; వారిలో ఏ ఒక్కరూ వదిలిపెట్టబడలేదు. అపవిత్రమైన దహన బలులు అర్పించినవారు కూడా ఉండేవారు; వేరొక విధంగా చెప్పాలంటే, యెహోవా నియమించిన రోజుల్లో బలులు అర్పించనివారు తాము అర్పించిన వాటితోపాటు యెహోవా అగ్నిచేత కాల్చబడ్డారు, కాల్చబడినవి బలిపీఠం వద్ద ఉండటానికి అనుమతించేవారు కాదు. యాజకులు పాటించవలసిన పద్ధతులు ఈ క్రింది విధంగా ఉన్నాయి: ముందు వారి పాదములు శుభ్రపర్చుకోకుండా మందిరంలోనికి గాని, లేక మందిర ప్రాంగణంలోకి గాని ప్రవేశించడానికి వారికి అనుమతిలేదు; వారు తమ యాజక వస్త్రాలు ధరించకుండా మందిరములోనికి ప్రవేశించకూడదు; వారు తమ యాజక కిరీటాలను ధరించకుండా మందిరములోనికి ప్రవేశించకూడదు; ఒక శవమును తాకటం ద్వారా అపవిత్రమైతే వారు మందిరములోనికి ప్రవేశించకూడదు; ఒకవేళ అవినీతిపరుడు చేతిని తాకినయడల వారు మొదట తమ చేతులను కడుక్కొనకుండా మందిరములోనికి ప్రవేశించకూడదు; మరియు వారు స్త్రీ సాంగత్యముచేత తమను తాము అపవిత్రపరచుకున్న యెడల (మూడు నెలలపాటు) మందిరములోనికి ప్రవేశించకూడదు. మరియు వారికి యెహోవా ముఖమును చూచుటకు అనుమతి లేదు. వారికిచ్చిన ఆ మూడు నెలలు ముగిసినప్పుడు, అనగా మూడు నెలల తర్వాత మాత్రమే వారు పరిశుద్ధమైన యాజక వస్త్రాలను ధరించడానికి అనుమతించబడతారు. వారు మందిరములోనికి ప్రవేశించి యెహోవా ముఖమును చూచుటకు మునుపు ఏడు రోజులు బయట ప్రాంగణంలో సేవ చేయవలసి వచ్చేది. యెహోవా మందిరమును అపవిత్రపరచుకుండా ఉండేందుకు వారు ఈ యాజక వస్త్రధారణలో దేనినైనా మందిర ఆవరణలో మాత్రమే ధరించడానికి అనుమతించబడ్డారు, ఎంతమాత్రం బయటికి వెళ్లకూడదు. యాజకులుగా ఉన్న వారందరూ యెహోవా యొక్క న్యాయ విధులను ఉల్లంఘించిన అపరాధులను ఆయన బలిపీఠం ముందుకు తీసుకురావాలి, అక్కడ వారు సాధారణ ప్రజలచేత చంపబడతారు; లేకపోతే, అపరాధాన్ని చూసిన యాజకుని మీదకి అగ్ని వచ్చి దహించి వేసేది. ఆ విధంగా, వారు యెహోవాకు నమ్మకముగా, విధేయులుగా ఉండేవారు, ఎందుకంటే ఆయన కట్టడలు వారిపట్ల తీవ్ర స్థాయిలో ఉండేవి, ఆయన పాలనాపరమైన శాసనాలను ఉల్లంఘించడానికి వారు ఎప్పటికీ సాహసించేవారు కాదు. ఇశ్రాయేలీయులు యెహోవాకు విధేయులుగా ఉండేవారు, ఎందుకంటే వారు ఆయన అగ్నిని చూసారు, ఆయన తన ప్రజలను శిక్షించే బాహువును కూడా చూశారు మరియు వారు ఆది నుంచి ఆయన పట్ల అటువంటి భయభక్తులు కలిగి ఉండేవారు. కాబట్టి, వారు యెహోవా యొక్క అగ్ని మాత్రమే కాక, ఆయన సంరక్షణ, ఆయన రక్షణ మరియు ఆయన ఆశీర్వాదములు కూడా పొందుకున్నారు. వారి విధేయత ఏమిటంటే వారు జరిగించు క్రియలన్నిటిలో యెహోవా ఆజ్ఞలకు లోబడి ఉండేవారు మరియు ఎవరూ అవిధేయత చూపించి ఉండలేదు. అవిధేయత ఎక్కడైనా కనిపించినా, ఇతరులు యెహోవా ఆజ్ఞలను అనుసరించి, యెహోవాకు వ్యతిరేకంగా ప్రవర్తించిన వారిని చంపారు కాని ఆ వ్యక్తిని ఆయనకు దూరంగా ఉంచి దాచి పెట్టలేదు. విశ్రాంతి దినమును ఉల్లంఘించిన వారు, వ్యభిచారములో పట్టబడినవారు మరియు యెహోవాకు అర్పించిన అర్పణలను దొంగిలించిన వారు మరీ కఠినంగా శిక్షించబడ్డారు. విశ్రాంతి దినమును ఉల్లంఘించిన వారు మినహాయింపు లేకుండా (సామాన్య ప్రజలచేత) రాళ్లతో కొట్టి లేక కొరడాతో కొట్టి చంపబడ్డారు. వ్యభిచరించినవారు—ఆకర్షణీయమైన స్త్రీలపట్ల మొహం కలిగినవారు లేదా భక్తిహీన స్త్రీలను చూచి విపరీతమైన కామవిచారములను పెంచుకున్నవారు లేదా య్యవ్వన స్త్రీలను చూసి కామాంధులుగా మారేవారందరూ చంపబడ్డారు. ముసుగు ధరించని యువతి ఎవరైనా ఒక వ్యక్తిని అక్రమ ప్రవర్తనకు ప్రలోభపెడితే, ఆ స్త్రీకి మరణశిక్ష విధించబడుతుంది. ఈ విధమైన కట్టడలను ఉల్లంఘించిన వ్యక్తి యాజకుడైతే (మందిరములో సేవ చేసే వ్యక్తి), అతను సిలువ వేయబడతాడు లేదా ఉరితీయబడతాడు. అలాంటి వ్యక్తులెవరూ జీవించడానికి వీలులేదు వారిలో ఒక్కడు కూడా యెహోవా కటాక్షము పొందడు. ఇటువంటి వ్యక్తి యొక్క బంధువులు అతని మరణం తర్వాత మూడు సంవత్సరాల వరకు బలిపీఠం ముందు యెహోవాకు బలులు అర్పించడానికి అనుమతించబడరు లేదా యెహోవా జనులకు అనుగ్రహించిన బలులలో భాగం పంచుకోవడానికి అనుమతించబడరు. ఆ కాలం పూర్తయిన తర్వాత మాత్రమే వారు యెహోవా బలిపీఠం వద్దకు శ్రేష్ఠమైన పశువులను లేదా గొర్రెలను తీసుకురాగలరు. ఇంకేదైనా అపరాధములు చేసినట్లైతే, వారు యెహోవా సన్నిధిలో మూడు రోజులు ఉపవాసం ఉండి, ఆయన కటాక్షం కొరకు వేడుకోవాలి. వారు యెహోవాను ఆరాధించిన్నది కేవలము ఆయన న్యాయ విధులు చాలా కఠినంగా ఉన్నందున మాత్రమే కాదు కానీ; వారు ఆయన దయను బట్టి మరియు ఆయన పట్ల వారికున్న విధేయతను బట్టి అలా చేసారు. కాబట్టి, ఈ రోజు వరకు వారు తమ సేవలో అదే విధేయతతో ఉన్నారు మరియు వారు యెహోవాకు చేసే తమ విన్నపాల విషయంలో ఎన్నడూ వెనక్కి మళ్ళలేదు. ఇశ్రాయేలు ప్రజలు ఇప్పటికీ ఆయన సంరక్షణ మరియు రక్షణను పొందుతున్నారు, ఆయన ఇప్పటికీ వారి మధ్య తన దయను ఉంచుతూ, ఎల్లప్పుడూ వారితో ఉంటాడు. వారందరికీ యెహోవాను ఎలా సన్మానించాలో మరియు ఆయనను ఎలా సేవించాలో తెలుసు మరియు ఆయన సంరక్షణ మరియు రక్షణను పొందేందుకు వారు ఎలా ప్రవర్తించాలో వారందరికీ తెలుసు; ఎందుకంటే వారందరూ తమ హృదయాలలో ఆయనను భయభక్తులతో ఆరాధిస్తారు. వారి సేవలన్నింటి యొక్క విజయ రహస్యం వారి భయభక్తులతో కూడిన సేవ తప్ప మరొకటి కాదు. కాబట్టి, ఈ రోజుల్లో మీరందరూ ఎవరివలె ఉన్నారు? మీకు ఇశ్రాయేలు ప్రజలతో ఏదైనా పోలిక ఉందా? ఈ రోజుల్లో సేవ చేయడం ఒక గొప్ప దైవజనుని యొక్క నాయకత్వాన్ని అనుసరించడం లాంటిదని మీరు భావిస్తున్నారా? మీకు ఎలాంటి నమ్మకత్వము గాని మరియు దేవునియందు భయభక్తులు గాని లేవు. మీరు తగినంత దయను పొందుకున్నారు ఎందుకంటే మీరందరూ నేరుగా దేవుణ్ణి సేవిస్తున్నందున ఇశ్రాయేలీయుల యాజకులతో సమానంగా ఉన్నారు. మీరు మందిరములోనికి ప్రవేశించనప్పటికీ, మీరు పొందేది మరియు మీరు చూసేది మందిరంలో యెహోవాను సేవించిన యాజకులు పొందిన దానికంటే చాలా ఎక్కువ అని చెప్పవచ్చు. అయినప్పటికీ, మీరు వారికంటే చాలా రెట్లు ఎక్కువ తిరుగుబాటు చేసి ఎదురించారు. దేవునియందు మీరు కలిగియున్న భయభక్తి చాలా తక్కువ, దాని ఫలితంగా మీరు చాలా తక్కువ కృపను పొందుతున్నారు. మీరు చాలా తక్కువ సమర్పణ కలిగిఉన్నప్పటికీ, మీరు ఆ ఇశ్రాయేలీయుల కంటే చాలా ఎక్కువ పొందారు. వీటన్నింటిలో, మీరు ఎక్కువ దయను పొందలేదా? ఇశ్రాయేలులో కార్యము జరుగుతున్నప్పుడు, ప్రజలు యెహోవాను ఇష్టానుసారంగా తీర్పు తీర్చడానికి ధైర్యం చేయలేదు. అయితే, మీ సంగతి ఏమిటి? మిమ్మును సంపాదించుకోవడం కోసం నేను ప్రస్తుతం చేస్తున్న పని కాదా, మరి నా నామమునకు ఇంత దారుణంగా అవమానం కలిగించడాన్ని నేను ఎలా సహించగలను? మీరు ఉంటున్న ఈ కాలం ధర్మశాస్త్ర యుగమైనట్లయితే మీ మాటలు మరియు క్రియలను బట్టి, మీలో ఒక్కరు కూడా జీవముతో ఉండేవారు కాదు. మీకున్న భయభక్తులు అతి తక్కువ! మీకు ఎక్కువ అనుగ్రహం ఇవ్వలేదని మీరు ఎల్లప్పుడూ నన్ను నిందిస్తూ ఉంటారు మరియు నేను మీకు తగినంత ఆశీర్వచనాలు పలకలేదని, మీ కోసం నావద్ద శాపాలు మాత్రమే ఉన్నాయని కూడా మీరు వాదిస్తున్నారు. నా పట్ల ఇంత తక్కువ భయభక్తులు కలిగి ఉంటే మీరు నా ఆశీర్వాదాలను పొందటం అసాధ్యమని మీరెరుగరా? మీరు చేసే సేవ యొక్క దుస్థితి కారణంగా నేను మిమ్మల్ని నిరంతరం నిందిస్తూనే ఉంటానని, తీర్పు తీరుస్తానని మీకు తెలియదా? మీకు అన్యాయం జరిగిందని మీరందరూ భావిస్తున్నారా? తిరుగుబాటు చేస్తూ అవిధేయులైన సమాజమును నేను ఎలా ఆశీర్వదించగలను? నా పేరుకు అవమానం కలిగించే వ్యక్తులకు నేను అలవోకగా నా అనుగ్రహాన్ని ఎలా ఇవ్వగలను? ఇప్పటికే మీ పట్ల చాలా ఎక్కువ కృప చూపబడింది. ఇశ్రాయేలీయులు ఈ దినము మీలాగే తిరుగుబాటు చేసి ఉంటే, చాలా కాలం క్రితమే వారిని నేను నాశనం చేసి ఉండేవాడిని. అయినను, నేను మీతో ఏ మాత్రం కఠినంగా వ్యవహరించలేదు. ఇద ఉపపకారం కాదా? మీరు ఇంతకంటే గొప్ప ఆశీర్వాదాలు కోరుకుంటున్నారా? యెహోవా తనయందు భయభక్తులుగలవారిని మాత్రమే ఆశీర్వదిస్తాడు. తనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసే వ్యక్తులను ఆయన శిక్షిస్తాడు, వారిలో ఒకరిని క్షమించడు. సేవ చేయడం ఎలాగో తెలియని నేటి ప్రజలారా, మీ హృదయాలు పూర్తిగా త్రిప్పబడడానికి మీకు శిక్ష మరియు తీర్పు అవసరం లేదా? అటువంటి శిక్ష మరియు తీర్పు మీకు అందించుట ఉత్తమమైన ఆశీర్వాదాలు కాదా? అవి మీకు ఉత్తమమైన సంరక్షణ కాదా? అవి లేకుండా, మీలో ఎవరైనా యెహోవా యొక్క దహించు అగ్నిని సహించగలరా? మీరు నిజంగా ఇశ్రాయేలీయుల వలె విధేయతతో సేవ చేయగలిగితే, మీ నిత్యా సహవాసముగా మీమీద కూడా దయ ఉండదా? మీరు కూడా తరచుగా సంతోషం మరియు కావలసినంత దయ కలిగి ఉండరా? మీరు ఎలా సేవ చేయాలో మీకందరికీ తెలుసా?

ఈ రోజు మీరు సామరస్యంగా కలిసి పనిచేయాలని మీనుండి కోరుకొనేది ఏమిటంటే ఇశ్రాయేలీయుల నుండి యెహోవా కోరిన సేవవలెనే ఉండాలి: లేకపోతే, సేవ చేయడం మానేయండి. మీరు నేరుగా దేవుణ్ణి సేవించే వ్యక్తులు కాబట్టి, కనీసం మీరు మీ సేవలో నమ్మకత్వము మరియు సమర్పణలను కలిగినవారుగా ఉండాలి మరియు ఆచరణాత్మకంగా పాఠాలను కూడా నేర్చుకోగలగాలి. ప్రత్యేకించి మీరు సంఘములో పనిచేస్తున్నవారైతే, మీ క్రింద ఉన్న సోదరులు మరియు సోదరీమణులలో ఎవరైనా మీతో నేరుగా మాట్లాడడానికి ధైర్యం చేస్తారా? మీ పొరపాట్లను మీ ముఖం మీద చెప్పడానికి ఎవరైనా ధైర్యం చేస్తారా? మీరు అందరికంటే ఉన్నతంగా కనబడతారు; మీరు రాజులుగా పరిపాలిస్తుంటారు! మీరు ఈ విధమైన ఆచరణాత్మక పాఠాలను కూడా అధ్యయనం చేయరు లేదా ప్రయత్నించరు, అయినప్పటికీ మీరు దేవుని సేవించుటను గురించి మాట్లాడుతారు! ప్రస్తుతం, నీవు అనేక సంఘములకు నాయకత్వం వహించవలసిందిగా కోరబడ్డావు, కానీ నిన్ను నీవు ఎలాగూ విడిచిపెట్టకొనకపోగా, పైగా నువ్వు అనుకొన్నదానినే పట్టుకొని నీ అభిప్రాయాలకు కట్టుబడి, “ఈ పని ఈ విధంగా చేయాలని నేను భావిస్తున్నాను, దేవుడు చెప్పినట్లుగా మనము ఇతరులచేత నియంత్రించబడకూడదని మరియు ఈ రోజుల్లో మనం గుడ్డిగా లోబడకూడదని” అని మాట్లాడుతావు. అందువల్ల, మీలో ప్రతి ఒక్కరూ మీ స్వంత అభిప్రాయాన్ని కలిగి ఉంటారు, ఎవరూ ఎవరికీ లోబడరు. మీ పరిచర్య స్తంభించి ఉందని మీకు స్పష్టంగా తెలిసినప్పటికీ, “నేను చూస్తున్నట్టు, నా మార్గం గమ్యమునకు ఎంతో దూరం లేదు. ఏది ఏమైనప్పటికీ, మనలో ప్రతి ఒక్కరికి తన వాదన ఉంటుంది: నీవు నీ దాని గురించి మాట్లాడతావు, నేను నా దాని గురించి మాట్లాడతాను; నీ దర్శనముతో నీవు సహవాసం చేయి, నేను తెలుసుకున్నదాని గురించి నేను మాట్లాడతాను” అని అంటావు. మీరు పట్టించుకోవలసిన చాల విషయాల గురించి లేదా చేయిస్తున్న వాటి గురించి బాధ్యత తీసుకోరు, మీలో ప్రతి ఒక్కరూ మీ స్వంత అభిప్రాయాలను రుద్దుతారు మరియు మీరు వివేకంతో మీ ప్రతిష్టతను, కీర్తిని మరియు విలువను కాపాడుకుంటూ ఉంటారు, మీలో ఎవరూ మిమ్మల్ని మీరు తగ్గించుకోవడానికి ఇష్టపడరు, జీవితం మరింత వేగంగా అభివృద్ధి చెందడానికి మిమ్మల్ని మీరు ఉపేక్షించుకోరు, ఒకరి లోపాలను మరొకరు సరిదిద్దుకోవడానికి ఎవరికివారు చొరవ తీసుకోరు. మీరు సమన్వయం చేసుకొంటున్నప్పుడు, సత్యమును అపేక్షించటం నేర్చుకోవాలి. “ఈ అంశం యొక్క సత్యం గురించి నాకు స్పష్టమైన అవగాహన లేదు, ఈ విషయములో నీకున్న అనుభవం ఎలాంటిది?” అని నువ్వు అనవచ్చు లేదా, “ఈ అంశానికి సంబంధించి నాకంటే నీకే ఎక్కువ అనుభవం ఉంది; దయచేసి నాకు కొంత మార్గదర్శకత్వం ఇవ్వగలరా?” అని కూడా నువ్వు అనవచ్చు. దానిని గూర్చి వెళ్ళడం ఒక మంచి మార్గం కాదా? మీరు చాలా వాక్యోపదేశాలు విన్నారు మరియు సేవ చేయడములో కొంత అనుభవాన్ని గడించారు. మీరు సంఘములో పని చేసేటప్పుడు ఒకరి నుండి ఒకరు నేర్చుకోకపోతే, ఒకరికొకరు సహాయం చేసుకోకపోతే, ఒకరి లోపాలను మరొకరు దిద్దుకోకపోతే, అప్పుడు మీరు ఎలా పాఠాలు నేర్చుకోగలరు? మీరు ఏదైనా పరిస్థితి ఎదుర్కొన్నప్పుడు, ఒకరితో ఒకరు సహవాసం చేయాలి, తద్వారా మీ జీవితాలు ప్రయోజనము పొందుకుంటాయి. అంతేకాకుండా, మీరు పలు విషయాల గురించి నిర్ణయాలు తీసుకునే ముందు ఆ విషయాల గూర్చి జాగ్రత్తగా సహవాసం చేయాలి. అలా చేయడం ద్వారా మాత్రమే మీరు వ్యర్థముగా వ్యవహరించక సంఘములో బాధ్యత వహించినవారవుతారు. మీరు అన్ని సంఘములను దర్శించిన తర్వాత, మీరు కనుగొన్న అన్ని సమస్యల గురించి మరియు మీ పనిలో ఎదురయ్యే ఏవైనా సమస్యల గురించి మీరు ఒకచోట చేరి సహవాసం చేయాలి, అప్పుడు మీరు పొందిన వెలిగింపును గూర్చి మరియు జ్ఞానోదయమునుగురించి మీరు పంచుకొవాలి—ఈ విధముగా చేయడం పరిచర్యలో అతి ప్రాముఖ్యం. దేవుని పని నిమిత్తము, సంఘము యొక్క ప్రయోజనం కోసం మరియు మీ సోదరులు మరియు సోదరీమణుల ఎదుగుదల కొరకు సామరస్యపూర్వకమైన సహకారాన్ని మీరు సాధించాలి. ఒకరితో ఒకరు సమన్వయం చేసుకోవాలి, ప్రతి ఒక్కరు మరొకరిని సరిచేసుకుంటూ మెరుగైన ఫలితాన్ని సాధించాలి, తద్వారా దేవుని చిత్తం జరిగించాలి. నిజమైన సహకారం అంటే ఇదే, అందులో నిమగ్నమైన వారు మాత్రమే నిజమైన ప్రవేశాన్ని పొందుతారు. సహకరిస్తున్నప్పుడు, మీరు మాట్లాడే కొన్ని పదాలు అనుచితంగా ఉండవచ్చు, కానీ అది పెద్ద విషయం కాదు. దాని గురించి తరువాత సహవాసంలో పంచుకోండి, దాని గురించి స్పష్టమైన అవగాహన పొందండి; దానిని నిర్లక్ష్యం చేయవద్దు. ఈ విధమైన సహవాసం తర్వాత, మీరు మీ సోదరులు లేదా సోదరీమణుల లోపాలను పూరించవచ్చు. ఇలా మీ పనిలో మీరు మరింత లోతుగా వెళ్లడం ద్వారా మాత్రమే మంచి ఫలితాలను సాధించగలరు. మీలో ప్రతి ఒక్కరూ, దేవునికి సేవ చేసే వ్యక్తులుగా, మీ స్వంత ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోకుండా, మీరు చేసే ప్రతి పనిలో సంఘ ప్రయోజనాలను కాపాడుకోగలగాలి. ఒకరినొకరు తక్కువగా చూడడం, ఒంటరిగా పనిచేయడం ఆమోదయోగ్యం కాదు. ఆ విధంగా ప్రవర్తించేవాళ్ళు దేవుని సేవకు పనికిరారు! అలాంటి వ్యక్తులు భయంకరమైన స్వభావం కలిగి ఉంటారు; వారిలో కనీసం మానవత్వం కూడా ఉండదు. వాళ్ళు వంద శాతం సాతానే! వారు మృగాలే! ఇప్పుడు కూడా, మీ మధ్య ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి; మీరు సహవాసం సమయంలో కూడా ఒకరిపై ఒకరు దాడి చేసుకునేంత దూరం వెళతారు, ఉద్దేశపూర్వకంగా సాకులు వెతుకుతూ ఎవ్వరు తగ్గక కొన్ని చిన్న చిన్న విషయాలపై వాదించుకుంటూ ముఖమంతా కందిపోయే విధంగా చేసుకుంటూ ఉంటారు, ప్రతి వ్యక్తి తన మనోగతాన్ని మరొకరి నుండి దాచిపెడతాడు, ఎల్లప్పుడూ జాగ్రత్తపడుతూ అవతలి వ్యక్తిని నిశితంగా గమనిస్తూ ఉంటాడు. ఈ విధమైన స్వభావం దేవుని సేవకు తగినదా? మీలాంటి పని మీ సోదరులు మరియు సోదరీమణులకు ఏదైనా ఉపయోగపడుతుందా? నీవు సరైన జీవన విధానంలో ప్రజలను నడిపించలేకపోవటమే కాక, నీ స్వంత అవినీతిని నీ సోదరులు మరియు సోదరీమణులలోకి చొప్పిస్తావు. నీవు ఇతరులను నొప్పించడం లేదా? నీ మనస్సాక్షి భయంకరంగా ఉంది మరియు అది మొదలుకు కుళ్లుపట్టి పోయింది! నీవు వాస్తవంలోకి ప్రవేశించవు, నీవు సత్యాన్ని ఆచరణలో పెట్టవు. అదనంగా, నీవు సిగ్గులేకుండా నీకున్న పైశాచిక స్వభావాన్ని ఇతరులకు బహిర్గతం చేస్తావు. నీకు సిగ్గు అనేదే తెలియదు! ఈ సోదరులు మరియు సోదరీమణులు నీకు అప్పగించబడ్డారు, అయినప్పటికీ నీవు వారిని నరకానికి తీసుకువెళుతున్నావు. నీవు కుళ్ళిపోయిన మనస్సాక్షిగల వానివి కావా? నీకు ఖచ్చితంగా సిగ్గే లేదు!

మునుపటి:  విజయ కార్యపు అంతర్గత సత్యము (4)

తరువాత:  మోయాబు సంతతి వారిని రక్షించడం యొక్క ప్రాముఖ్యత

సెట్టింగులు

  • వచనం
  • థీమ్స్

ఘన రంగులు

థీమ్స్

అక్షరశైలి

అక్షరశైలి పరిమాణం

గీతల మధ్య దూరం

గీతల మధ్య దూరం

పేజీ వెడల్పు

విషయ సూచిక

శోధించండి

  • ఈ వచనాన్ని శోధించండి
  • ఈ పుస్తకాన్ని శోధించండి

Connect with us on Messenger