మోయాబు సంతతి వారిని రక్షించడం యొక్క ప్రాముఖ్యత

ఈ రెండు మూడు సంవత్సరాల కార్యములో, మీపై తీర్పు తీర్చే కార్యములో సాధించాల్సినది ప్రాథమికంగా సాధించడమైనది. చాలా మంది ప్రజలు వారి భవిష్యత్తు అవకాశాలు మరియు గమ్యమును వదులుకున్నారు. అయితే, మీరు మోయాబు సంతతి వారని పేర్కొనబడినప్పుడు, మీలో చాలా మంది దానిని సహించలేదు, అంటే మీకున్న సహజ లక్షణాలన్నీ మార్పు చెందాయి, మీ నోరులు మెలితిప్పబడ్డాయి మరియు మీ కన్నులు అలా చూస్తూ నిశ్చల స్థితిలో ఉండిపోయాయి. మీరు మోయాబు సంతతి వారని మీరు కేవలం నమ్మలేదు. మోయాబు శపించబడిన తరువాత ఈ దేశానికి రాకుండా బహిష్కరించబడ్డాడు. ఆయన సంతానం ఆయన వంశావళిని ఈ రోజు వరకు కలిగి ఉంది, మరియు మీరందరూ ఆయన వారసులు. నేను చేయగలిగినది ఏమీ లేదు—మోయాబు ఇంట్లో పుట్టమని నీకు ఎవరు చెప్పారు? నేను నీపై జాలిపడుతున్నాను మరియు నీపై అలాంటిది కోరుకోను, కానీ ఈ వాస్తవాన్ని ఎవరూ మార్చలేరు. నీవు మోయాబు వంశస్థుడవు కనుక నీవు దావీదు వంశస్థుడవని నేను చెప్పలేను. నీవు ఎవరి వారసుడవయినా, నీవు హీన స్థాయిలో ఉన్నప్పటికీ, అధమ జన్మ కలిగిన జీవివైనప్పటికి నీవు ఇప్పటికీ ఒక సృష్టించబడిన జీవివైయున్నావు. సృష్టించబడిన జీవులు దేవుని కార్యాలను అనుభవించాలి; వారందరూ ఆయన జయించే లక్ష్యాలుగా ఉన్నారు, వారందరూ తప్పనిసరిగా ఆయన నీతి స్వభావమును చూడాలి మరియు ఆయన జ్ఞానమును, సర్వశక్తిని అనుభవించాలి. నేడు, నీవు మోయాబు వంశస్థుడవు కనుక నీవు ఈ తీర్పును మరియు శిక్షను అంగీకరించాలి; నీవు మోయాబు వంశస్థుడవు కాదా, నీవు కూడా ఈ తీర్పు మరియు శిక్షను అంగీకరించాల్సిన అవసరం లేదా? దీన్ని గమనించండి! నిజానికి, మోయాబు సంతతిపై ఈ రోజు కార్యము చేయడం అత్యంత విలువైనది మరియు అత్యంత ముఖ్యమైనది. మీపైనున్న కార్యము పూర్తి చేయబడినందున, దీనికి అపారమైన ప్రాముఖ్యత ఉంది. హాము యొక్క వారసులపై పని జరిగినట్లయితే, అది ముఖ్యమైనది కాదు, ఎందుకంటే, మోయాబులా కాకుండా, వారు అధమ జన్మకు చెందినవారు కాదు. నోవహు రెండవ కుమారుడైన హాము యొక్క సంతతి వారు మాత్రమే శపించబడ్డారు, అంటే వారు జారత్వం నుండి వచ్చినవారు కారు. నోవహు వారిని దాసులకు సేవకులుగా ఉండమని శపించాడు కాబట్టి వారు కేవలం తక్కువ స్థాయిలో ఉన్నారు. వారికి అధమ స్థానం ఉంది, కానీ వారి అసలు విలువ తక్కువైనది కాదు. మోయాబు గురించి మాట్లాడుతూ, అతను జారత్వంలో జన్మించినందున ఆయన అసలు స్థానం తక్కువగా ఉందని ప్రజలకు తెలుసు. లోతు యొక్క స్థానం చాలా ఉన్నతమైనప్పటికీ, లోతు మరియు అతని కుమార్తె నుండి మోయాబు వచ్చాడు. లోతు నీతిమంతునిగా పిలువబడ్డాడు, కానీ మోయాబు మాత్రం శపించబడిన వానిగా ఉన్నాడు. మోయాబు తక్కువ విలువగలవాడు మరియు తక్కువ స్థానమును కలిగి ఉన్నాడు, మరియు అతను శపించబడకపోయినప్పటికీ, అతను ఇంకా అపవిత్రంగానే ఉన్నాడు, కాబట్టి అతను హాముకు భిన్నంగా ఉన్నాడు. అతను యెహోవాను తెలుసుకోలేదు, దానికి బదులుగా ప్రతిఘటించాడు మరియు యెహోవాకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు కాబట్టి అతను అంధకార ప్రదేశాలలో పడిపోయాడు. మోయాబు సంతతిపై ఇప్పుడు కార్యమును చేయడమంటే గొప్ప అంధకారములో పడిపోయిన వారిని రక్షించడమే. వారు శపించబడినప్పటికీ, దేవుడు వారి నుండి మహిమను పొందటానికే ఇష్టపడతాడు, ఎందుకంటే వారు దేవుడు లేనటువంటి హృదయాలు కలిగిన ప్రజలందరీలో మొదటివారు; వారి హృదయాలలో దేవుణ్ణి కలిగి లేనివారిని ఆయనకు విధేయత చూపేలా చేయడం, ఆయనను ప్రేమించేలా చేయడం మాత్రమే నిజమైన విజయం, మరియు అటువంటి కార్యము యొక్క ఫలం అత్యంత విలువైనది మరియు అత్యంత నమ్మదగినది. ఇది మాత్రమే మహిమను పొందుకోవడం అవుతుంది, అంటే ఇది అంత్య దినాలలో దేవుడు పొందాలనుకుంటున్న మహిమయైయున్నది. ఈ వ్యక్తులు అధమ స్థాయిలో ఉన్నప్పటికీ, వారు ఇప్పుడు ఇంత గొప్ప రక్షణను పొందగలగడం అనేది నిజంగా దేవుని చేత హెచ్చించబడడమే. ఈ కార్యము చాలా అర్ధవంతమైనది, మరియు తీర్పు తీర్చడం ద్వారా ఆయన ఈ ప్రజలను సంపాదించుకుంటాడు. ఈ ప్రజలను శిక్షించడం ఆయన ఉద్దేశ్యం కాదు కానీ వారిని రక్షించడమే ఆయన ఉద్దేశమైయున్నది. ఒకవేళ, అంత్య దినాలలోఆయన ఇప్పటికీ ఇశ్రాయేలును జయించే కార్యము జరిగిస్తూ ఉంటే, ఇది విలువలేని కార్యముగా ఎంచబడుతుంది; అది ఫలించినప్పటికీ, దానికి విలువ గాని, లేక ఏ విధమైన గొప్ప ప్రాముఖ్యత గాని ఉండదు, మరియు ఆయన మహిమనంతటినీ పొందుకోలేడు. ఆయన అంధకారములో పడిపోయిన మీలాంటి వారిపై, అత్యంత వెనుకబడిన వారిపై కార్యము జరిగిస్తూ ఉన్నాడు. ఈ ప్రజలు దేవుడు ఉన్నాడని అంగీకరించరు మరియు దేవుడు ఉన్నాడని ఎన్నడూ తెలుసుకోలేరు. ఇట్టి జీవులు సాతాను చేత ఎంతగా భ్రష్టుపట్టబడ్డారు, వారు దేవుణ్ణి మరచిపోయారు. వారు సాతానుచే గ్రుడ్డివారిగా చేయబడి పరలోకములో దేవుడు ఉన్నాడని అస్సలు తెలుసుకోలేకపోవుచున్నారు. మీ హృదయాలలోమీరందరూ విగ్రహాలను ఆరాధిస్తారు మరియు సాతానును ఆరాధిస్తారు, అలాంటప్పుడు మీరు ప్రజలలో అత్యంత హీనమైన స్థితిలో ఉన్నవారు కారా, ప్రజలలో అత్యంత వెనుకబడినవారు కారా? మీరు ఎటువంటి వ్యక్తిగత స్వాతంత్ర్యము లేకుండానే శరీరములో అత్యంత అధములుగా ఉన్నారు, అలాగే మీరు కష్టాలను కూడా అనుభవిస్తున్నారు. మీరు ఈ సమాజంలో అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి ప్రజలు, విశ్వసించే స్వతంత్రత కూడా లేనివారుగా ఉన్నారు. మీవంటి వారిపై కార్యము చేయడంలోగల ప్రాముఖ్యత ఇక్కడ ఉంది. మోయాబు వంశస్థులైన మీవంటి వారిపై ఈ రోజు కార్యము చేయడం అనేది మిమ్మల్ని అవమానించడానికి కాదు గానీ కార్యము యొక్క ప్రాముఖ్యతను బహిర్గతం చేయడమైయున్నది. ఇలా చేయడం ద్వారా మిమ్మల్ని గొప్పగా హెచ్చించడమైయున్నది. ఒక వ్యక్తికి హేతువు మరియు అంతర్దృష్టి ఉంటే కనుక, “నేను మోయాబు వంశస్థుడిని, ఈ రోజు దేవునిచే ఇంత గొప్ప ఔన్నత్యాన్ని పొందేందుకు లేదా ఇంత గొప్ప ఆశీర్వాదాలను పొందేందుకు నేను నిజంగా అనర్హుడను. నేను చేసేదంతా మరియు చెప్పేదంతా మరియు నా హోదా మరియు విలువ ప్రకారం, నేను భగవంతుని నుండి అటువంటి గొప్ప ఆశీర్వాదాలకు ఎట్టి యోగ్యుడిని కాదు. ఇశ్రాయేలీయులు దేవునిపట్ల గొప్ప ప్రేమను కలిగి ఉన్నారు మరియు వారు ఆనందించే కృప ఆయన ద్వారా వారికి ప్రసాదించబడింది, అయితే వారి స్థితి మనకంటే చాలా ఉన్నతమైనది. అబ్రాహాము యెహోవాపట్ల ఎంతో అంకితభావంతో ఉండేవాడు, పేతురు యేసుపట్ల ఎంతో అంకితభావంతో ఉండేవాడు, అంటే, వారి భక్తి మన కన్నా వంద రెట్లు ఎక్కువ. మన క్రియల ఆధారంగా, దేవుని కృపను ఆస్వాదించడానికి మనం పూర్తిగా అనర్హులం” అని వారు చెబుతారు. చైనాలో ఈ ప్రజల సేవ దేవుని ముందుకి సులభముగా తీసుకురాబడదు. ఇది పూర్తిగా అలజడితోను కలవరముతోను కూడుకున్న విషయం; మీరు ఇప్పుడు దేవుని కృపను చాలా ఆనందిస్తున్నారంటే అది పూర్తిగా దేవుని ఔన్నత్యమే! మీరు దేవుని కార్యమును ఎప్పుడు కోరుకున్నారు? దేవుని కోసం మీ జీవితాన్ని ఎప్పుడు త్యాగం చేసారు? మీరు మీ కుటుంబాన్ని, మీ తల్లిదండ్రులను మరియు మీ పిల్లలను ఎప్పుడు సిద్ధముగా వదులుకున్నారు? మీరెవరూ గొప్ప మూల్యం చెల్లించుకోలేదు! పరిశుద్ధాత్మ మిమ్మల్ని బయటకు తీసుకురాకపోతే, మీలో ఎంతమంది సమస్తం త్యాగం చేయగలరు? మీరు ఈ రోజు వరకు బలవంతంగా మరియు ఒత్తిడితో మాత్రమే అనుసరించారు. మీ భక్తి ఎక్కడ ఉంది? మీ విధేయత ఎక్కడ ఉంది? మీ చర్యల ఆధారంగా, మీరు చాలా కాలం క్రితమే నాశనం చేయబడి ఉండాలి, అంటే మీరందరూ మొత్తం తుడిచి పెట్టుకుపోవాల్సిన పరిస్థితిలో ఉండేవారు. ఇంత గొప్ప ఆశీర్వాదాలను ఆస్వాదించడానికి మీకు ఎట్టి యోగ్యత ఉంది? మీకు కనీసపు అర్హత కూడా లేదు! మీలో ఎవరు తమకు తామే మార్గాన్ని ఏర్పరచుకున్నారు? మీలో ఎవరు నిజమైన మార్గాన్ని కనుగొన్నారు? మీరంతా సోమరులు, తిండిపోతులు, సుఖం కోరే దౌర్భాగ్యులు! మీకు మీరే గొప్ప అని భావిస్తున్నారా? మీరు దేని గురించి గొప్పగా చెప్పుకోవాలి? మీరు మోయాబు వారసులని విస్మరించినప్పటికీ, మీ స్వభావం లేదా మీ జన్మస్థలము ఉన్నతమైన క్రమమా? మీరు అతని వారసులని విస్మరించినప్పటికీ, మీరందరూ మోయాబు వారసులు కాదా? వాస్తవాల సత్యాన్ని మార్చగలరా? ఇప్పుడు మీ స్వభావాన్ని బహిర్గతం చేయడం వాస్తవాల సత్యాన్ని తప్పుగా సూచిస్తుందా? మీ దాస్యత్వం, మీ జీవితాలు మరియు మీ వ్యక్తిత్వాలను చూడండి, అంటే మీరు మానవజాతిలో అత్యంత అధమస్థితిలో ఉన్నారని మీకు తెలియదా? మీరు దేని గురించి గొప్పలు చెప్పుకోవాలి? సమాజంలో మీకున్న స్థానాన్ని చూడండి. మీరు అత్యంత అల్ప స్థాయిలో లేరా? నేను తప్పుగా మాట్లాడానని మీరు అనుకుంటున్నారా? అబ్రహాము ఇస్సాకును అర్పించాడు, నీవు ఏమి సమర్పించావు? యోబు అన్నిటిని అర్పించాడు, మరి మీరు ఏమి అర్పించారు? చాలా మంది ప్రజలు సత్య మార్గాన్ని వెతకడానికి తమ ప్రాణాలను అర్పించారు, శిరచ్చేదనం చేయబడ్డారు, రక్తాన్ని చిందించారు. మీరు అట్టి మూల్యం చెల్లించారా? పోల్చి చూస్తే, ఇంత గొప్ప కృపను ఆస్వాదించడానికి మీకు ఎటువంటి యోగ్యత లేదు. మీరు మోయాబు వంశస్థులని ఈ రోజు చెప్పడం తప్పా? మిమ్మల్ని మీరు చాలా గొప్పగా భావించుకోకండి. మీరు గొప్పగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఇంత గొప్ప రక్షణ ఇంత గొప్ప కృప మీకు ఉచితంగా ఇవ్వబడింది. మీరు ఏమీ త్యాగం చేయలేదు, అయినప్పటికీ మీరు ఉచితంగా కృపను అనుభవిస్తున్నారు. మీకు సిగ్గుగా లేదా? ఇది మీ అంతటా మీరు వెదుక్కుని పొందుకున్న సత్య మార్గమా? దానిని అంగీకరించమని మిమ్మల్ని ఒప్పింప చేసినది పరిశుద్ధాత్మ కాదా? మీకు ఎన్నడూ వెదికే హృదయాలు లేవు, చాలా కొద్ది హృదయాలు మాత్రమే సత్యం కోసం వెతుకుతాయి. మీరు చక్కగా వెనకాల కూర్చొని ఈ కృపను ఆనందిస్తున్నారు; మీరు ఎట్టి ప్రయాస లేకుండానే ఈ సత్యాన్ని పొందారు. ఫిర్యాదు చేయడానికి మీకు ఏ హక్కు ఉంది? నీకు నీవేఅత్యంత విలువైనవాడివని భావిస్తున్నావా? తమ ప్రాణాలను త్యాగం చేసి రక్తాన్ని చిందించిన వారితో పోలిస్తే, మీరు దేని గురించి ఫిర్యాదు చేయాలి? ఇప్పుడు సహజంగా మిమ్మల్ని నాశనం చేయడమే సరియైన విషయము! మీరు విధేయత కలిగి వెంబడించడం తప్ప వేరే మార్గం లేదు. మీరు కేవలం అనర్హులు! మీలో చాలా మంది పిలువబడ్డారు, కానీ మీ వాతావరణం మిమ్మల్ని బలవంతం చేయకున్న, లేదా మిమ్మల్ని పిలవకున్న, మీరు బయటకు రావడానికి పూర్తిగా ఇష్టపడే వారు కాదు. అటువంటి పరిత్యాగానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు? శారీరక సుఖాలను వదులుకోవడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు? మీరందరూ దురాశతో సుఖంగా ఆనందించే మరియు విలాసవంతమైన జీవితాన్ని కోరుకునే వ్యక్తులు! మీరు అటువంటి గొప్ప ఆశీర్వాదాలను పొందుకున్నారు, అలాంటప్పుడు, మీరు ఇంకా చెప్పడానికి ఏముంది? మీకు ఎలాంటి ఫిర్యాదులు ఉన్నాయి? మీరు పరలోకంలో గొప్ప ఆశీర్వాదాలను మరియు గొప్ప కృపను ఆస్వాదించడానికి అనుమతించబడ్డారు మరియు భూమిపై ఇంతకు ముందెన్నడూ చేయని కార్యము ఈ రోజు మీకు వెల్లడి చేయబడింది. ఇది ఆశీర్వాదం కాదా? మీరు దేవుణ్ణి ఎదిరించి, ఆయనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినందున ఈ రోజు మీరు శిక్షించబడ్డారు. ఈ శిక్ష కారణాన, మీరు దేవుని దయను మరియు ప్రేమను చూశారు, అంతే కాక మీరు ఆయన నీతిని మరియు పరిశుద్దతను చూశారు. ఈ శిక్ష యొక్క కారణంగా, మానవజాతి యొక్క అపవిత్రత కారణంగా, మీరు దేవుని గొప్ప శక్తిని చూశారు మరియు మీరు ఆయన పరిశుద్దతను మరియు గొప్పతనాన్ని చూశారు. ఇది సత్యాలలో అరుదైనది కాదా? ఇది అర్థంతో కూడిన జీవితం కాదా? దేవుడు చేసే కార్యము పూర్తి అర్థవంతంగా ఉంటుంది! ఈ విధంగా, మీ స్థానం ఎంత తక్కువగా ఉంటే, మీరు దేవునిచే అంతగా హెచ్చింపబడ్డారని అది రుజువు చేస్తుంది మరియు ఈ రోజు మీపై ఆయన చేసిన కార్యము యొక్క గొప్ప విలువను అది రుజువు చేస్తుంది. ఇది కేవలం అమూల్యమైన నిధి, ఇది మరెక్కడా పొందలేనిది! యుగయుగాలుగా, ఇంత గొప్ప రక్షణను ఎవరూ అనుభవించలేదు. మీ స్థాయి తక్కువగా ఉండటం అనే వాస్తవం దేవుని రక్షణ ఎంత గొప్పదో చూపిస్తుంది మరియు దేవుడు మానవాళికి నమ్మకంగా ఉన్నాడని కూడా చూపిస్తుంది, అంటే ఆయన రక్షిస్తాడు గాని నాశనం చేయడనే విషయం తెలియజేస్తుంది.

చైనా ప్రజలు ఎన్నడూ దేవుణ్ణి నమ్మలేదు; వారు యెహోవాను ఎన్నడూ సేవి౦చలేదు, యేసును ఎన్నడూ సేవి౦చలేదు. వారు కేవలం మోకరిల్లడం, ధూపం వేయడం, జోస్ అనే విగ్రహపు కాగితాన్ని కాల్చడం మరియు బుద్ధుడిని ఆరాధించడం చేస్తుండేవారు. వారు కేవలం విగ్రహాలను ఆరాధిస్తారు, వారందరూ అత్యంత తీవ్రమైన తిరుగుబాటుదారులు. కాబట్టి, జనులు ఎంత హీనస్థితిలో ఉంటే అది మరింత ఎక్కువగా దేవుడు మీ నుంచి మరింత ఎక్కువ ఘనతను పొందుతాడు అని చూపిస్తుంది. “దేవా, నీవు చేసే కార్యము ఏమిటి? ఈ అపవిత్రమైన భూమి పైకి వచ్చిన నీవు ఎంత గొప్ప దేవుడవు, ఎంత పరిశుద్ధ దేవుడవు? నీ గురించి నీవు ఇంత తక్కువగా అనుకుంటావా? మేము చాలా అపవిత్రముగా ఉన్నాము, కానీ నీవు మాతో ఉండటానికి ఇష్టపడ్డావా? నీవు మా మధ్య జీవించడానికి ఇష్టపడ్డావా? మేము చాలా హీన స్థితిలో ఉన్నాము, కానీ నీవు మమ్మల్ని సంపూర్ణులుగా చేయడానికి ఇష్టపడుచున్నావా? మరియు నీవు మమ్మల్ని మాదరికరమైన వ్యక్తులుగాను మరియు దుష్టాంతములనుగాను ఉపయోగించుకుంటావా?” అని కొంతమంది తమ దృష్టికోణము నుండి చెబుతారు. అయితే, నీవు నా చిత్తాన్ని అర్థం చేసుకోలేదు. నేను చేయాలనుకుంటున్నకార్యాన్ని నీవు అర్థం చేసుకోలేదు, నా స్వభావాన్ని కూడా నీవు అర్థం చేసుకోలేదు. నేను చేయబోయే కార్యము యొక్క ప్రాధాన్యతను పొందుకోవడం నీ సామర్థ్యానికి మించినది అని నేను చెప్పుచున్నాను. నా కార్యము నీ మానవ ఉద్దేశాలకు అనుగుణంగా ఉండగలదా? మానవ ఉద్దేశాల ప్రకారం, నేను ఉన్నత హోదా కలిగి ఉన్నానని చూపించడానికి, నేను గొప్ప విలువగల వానినని చూపించడానికి, నా గౌరవాన్ని, పవిత్రతను మరియు గొప్పతనాన్ని చూపించడానికి నేను మంచి దేశంలో జన్మించి ఉండాల్సి ఉంది. నన్ను గుర్తించే ప్రదేశంలో ఒక ఉన్నత కుటుంబంలో గనుక నేను జన్మించి ఉంటే, మరియు నేను ఉన్నత స్థానం మరియు హోదా కలిగి ఉంటే, అప్పుడు నన్ను చాలా బాగా చూసుకుంటారు. అలాంటి స్థితి నా కార్యమునకు ఎటువంటి ప్రయోజన౦ చేకూర్చదు, కనుక అటువంటప్పుడు గొప్ప రక్షణ బయలుపరచబడేదా? నన్ను చూసేవారందరూ నాకు విధేయత చూపుతారు, మరియు వారు అపవిత్రతతో కలుషితం కాలేరు. నేను ఈ విధమైన ప్రదేశంలో జన్మించి ఉండాల్సి ఉంది. అదే మీరు నమ్మేది. కానీ దీని గురి౦చి ఆలోచి౦చ౦డి: దేవుడు ఆన౦ద౦ కోస౦ వచ్చాడా, లేక కార్యము చేయడం కోస౦ భూమి మీదకి వచ్చాడా? నేను ఆ రకమైన సులభమైన, సౌఖర్యవంతమైన ప్రదేశంలో కార్యము చేస్తే, నేను నా పూర్తి స్థాయి మహిమను పొందగలనా? నా సృష్టి మొత్తాన్ని నేను జయించుకోగలనా? దేవుడు భూమి మీదకు వచ్చినప్పుడు, ఆయన ఈ ప్రపంచానికి చెందినవాడు కాదు, మరియు లోకాన్ని ఆస్వాదించడానికి ఆయన శరీరధారిగా రాలేదు. ఆయన కార్యమును జరిగించే ప్రదేశం ఆయన స్వభావాన్ని వెల్లడిస్తుంది మరియు, ఆయన జన్మించిన ప్రదేశం ఇంకా అర్థవంతంగా ఉంటుంది. అది పవిత్రమైన దేశమైనా, అపవిత్ర ప్రదేశమైనా, ఆయన ఎక్కడ కార్యము జరిగించిన ఆయన పరిశుద్ధుడు. సాతాను చేత ఎంత భ్రష్టుపట్టినప్పటికీ, ప్రపంచంలోని ప్రతిదీ ఆయన ద్వారానే సృజించబడింది. అయితే, సమస్తము ఇప్పటికీ ఆయనకే చెందుతాయి; అవన్నీ ఆయన చేతుల్లోనే ఉన్నాయి. ఒక అపవిత్రమైన భూమికి వచ్చి తన పరిశుద్ధతను వెల్లడిచేయడానికి ఆయన అక్కడ కార్యమును జరిగిస్తాడు; ఆయన తన కార్యము కోసం మాత్రమే దీన్ని చేస్తాడు, అంటే ఈ అపవిత్ర భూమిపైనున్న ప్రజలను రక్షించడానికి అటువంటి కార్యము చేయడానికి ఆయన చాలా అవమానాన్ని భరిస్తాడు. ఇది మానవాళి అందరి కోసం సాక్ష్యమివ్వడానికి చేయబడినది. అటువంటి కార్యము దేవుని నీతిని ప్రజలకు చూపిస్తుంది, ఇది దేవుని ఆధిపత్యాన్ని ఉత్తమంగా ప్రదర్శించడం మంచిది. ఇతరులు తిరస్కరి౦చే అల్పుల గు౦పు రక్షణలో ఆయన గొప్పతన౦, న్యాయము వ్యక్తమవుతు౦ది. అపవిత్రమైన భూభాగములో పుట్టడం అనేది ఆయన తక్కువ స్థితిగలవాడని ఏ మాత్రం ఋజువు చేయదు; ఇదంతా కూడా ఆయన గొప్పతనాన్ని, మానవాళిపట్ల ఆయనకున్న నిజమైన ప్రేమను సృష్టి అంతా చూడటానికి అనుమతిస్తుంది. ఆయన అలా చేసినకొలది, అది ఆయన స్వచ్ఛమైన ప్రేమను, మానవుని పట్ల ఆయనకున్న దోషరహిత ప్రేమను వెల్లడి పరుస్తుంది. దేవుడు పరిశుద్ధుడును, నీతిమ౦తుడైయున్నాడు. ఆయన ఒక అపవిత్రమైన భూమిపై జన్మి౦చినప్పటికీ, అపవిత్రతతో ని౦డిన ప్రజలతో కలిసి జీవిస్తున్నప్పటికీ, యేసు కృపా యుగ౦లో పాపులతో జీవి౦చినట్లే, ఆయన చేసిన ప్రతి కార్యము మానవజాతి మనుగడ కోస౦ మాత్రమే జరిగించలేదా?మానవజాతి గొప్ప రక్షణను పొ౦దడానికిగాను దీనంతటిని చేయలేదా? రెండు వేల సంవత్సరాల క్రితం, ఆయన చాలా సంవత్సరాలు పాపాత్ములతో నివసించాడు. అది కూడా విమోచన కోసమే. నేడు, ఆయన అపవిత్రమైన తక్కువ స్థాయి ప్రజల సమూహంతో నివసిస్తున్నాడు. ఇదంతా రక్షణ కొరకు మాత్రమే. ఆయన కార్యము అంతా మీ మానవుల కోసం కాదా? మానవజాతిని రక్షించడానికి కాకపోతే, ఆయన పశువుల పాకలో పుట్టిన తర్వాత ఎన్నో ఏళ్ళు పాపులతో ఎ౦దుకు జీవిస్తూ బాధి౦పబడేవాడు? మానవాళిని కాపాడడానికి కాకపోయినట్లయితే, దయ్యాలు నిండియున్న ఈ భూమిలో పుట్టి, సాతాను ద్వారా లోతుగా భ్రష్టుపట్టిన ఈ ప్రజలతో కలిసి జీవి౦చిన ఆయన రె౦డవసారి శరీరధారిగా ఎ౦దుకు తిరిగి వస్తాడు? దేవుడు నమ్మదగినవాడు కాడా? ఆయన జరిగించే కార్యములో ఏ భాగ౦ మానవాళి కొరకు చేయలేదు? మీ గమ్యానికి సంబంధించి ఏ భాగం లేదు? దేవుడు పరిశుద్ధుడు, ఇది మార్చలేనిది! అతడు అపవిత్ర ప్రదేశాలకు వచ్చినను అపవిత్రతచేత కలుషితం కాడు. వీటన్నిటి ద్వారా మానవ జాతిపట్ల దేవుని ప్రేమ చాలా నిస్వార్థమైనదనియు, ఆయన భరి౦చే బాధలు, అవమాన౦ అత్యంత గొప్పవని అర్థ౦ చేసుకోవచ్చు! మీ అందరికొరకు మరియు మీ యొక్క భవిష్యత్తు కొరకు ఆయన ఎంత గొప్ప అవమానం అనుభవించాడో మీకు తెలియదా? గొప్ప వ్యక్తులను లేదా ధనిక మరియు శక్తివంతమైన కుటుంబాల కుమారులను రక్షించడానికి బదులుగా, అతను తక్కువ మరియు తక్కువగా చూడబడే వారిని రక్షించే గురిని కలిగి ఉన్నాడు. ఇదంతా ఆయన పవిత్రత కాదా? ఇదంతా ఆయన నీతి కాదా? మానవాళి మనుగడ కోసం, అతను ఒక అపవిత్ర భూమిలో జన్మించి ప్రతి అవమానాన్ని అనుభవించాడు. దేవుడు చాలా సత్యవంతుడు, అంటే ఆయన తప్పుడు కార్యము చేయడు. కార్యముల ప్రతి యొక్క దశ కూడా ఎంతో ఆచరణాత్మక రీతిలో చేయబడలేదా? జనులందరూ ఆయనను దూషించి, ఆయన పాపులతో బల్ల వద్ద కూర్చుంటాడని చెప్పినప్పటికీ, అన్నీ రకాల ప్రజలు ఆయనను ఎగతాళి చేసి, ఆయన అపవిత్ర కుమారులతో నివసిస్తున్నాడని, ఆయన తక్కువ స్థాయిగల ప్రజలతో కలిసి నివసిస్తున్నాడని చెప్పినప్పటికీ, ఆయన ఇప్పటికీ తనను తాను నిస్వార్థంగా అప్పగించుకున్నాడు, మరియు ఆయన ఇప్పటికీ మానవాళి ద్వారా తిరస్కరించబడ్డాడు. ఆయన భరించే బాధ మీకంటే గొప్పది కాదా? మీరు చెల్లించిన వెలకంటే అతడు చేసిన కార్యము ఎక్కువ కాదా? మీరు అపవిత్ర భూమిలో జన్మించారు, అయినప్పటికీ మీరు దేవుని పవిత్రతను పొందారు. దెయ్యాలు కూడుకునే భూమిపై మీరు జన్మి౦చారు, అయినప్పటికీ మీకు గొప్ప రక్షణ లభి౦చింది. ఎంపిక చేసుకునే విధంగా మీకు ఏముందు? మీకు ఎటువంటి ఫిర్యాదులు ఉన్నాయి? మీరు అనుభవించిన బాధలకంటే అతను భరించిన బాధ ఎక్కువ కాదా? ఆయన భూమిపైకి వచ్చాడు మరియు మానవ ప్రపంచం యొక్క ఆనందాలను ఎన్నడూ ఆస్వాదించలేదు. ఆయన అలాంటి వాటిని అసహ్యించుకుంటాడు. మానవుని భౌతిక వస్తువులతో తనను సరి చూసుకోవడానికి దేవుడు భూమి పైకి రాలేదు, మానవుని యొక్క ఆహారం, బట్టలు మరియు ఆభరణాలను ఆస్వాదించడానికి కూడా రాలేదు. ఆయన ఈ విషయాలను పట్టించుకోడు. లోకభాగ్యాన్ని అనుభవించడానికి కాదు, మనిషి కోసం బాధపడటానికి ఆయన భూమికి వచ్చాడు. ఆయన బాధపడటానికి, కార్యము చేయడానికి మరియు ఆయన నిర్వహణ ప్రణాళికను పూర్తి చేయడానికి వచ్చాడు. ఆయన ఒక మంచి స్థలాన్ని ఎంచుకోలేదు, రాయబార కార్యాలయంలో లేదా విలాసవంతమైన హోటల్ లో నివసించడానికి రాలేదు, లేక అతని కోసం వేచి ఉండటానికి చాలా మంది సేవకులు అతనికి లేరు. మీరు చూసిన దాని ఆధారంగా, ఆయన కార్యము జరిగించడం కొరకు వచ్చాడా లేదా ఆనందం కొరకు వచ్చాడా అనేది మీకు తెలియదా? మీ కళ్లు చూడలేదా? ఆయన మీకు ఎంత ఇచ్చుంటాడో? ఆయన సౌకర్యవంతమైన ప్రదేశంలో జన్మించి ఉంటే, ఆయన మహిమను పొందగలడా? ఆయన కార్యము చేయగలడా? ఆయన అలా చేయడ౦లో ఏదైనా ప్రాముఖ్యత ఉ౦దా? ఆయన మానవ జాతిని పూర్తిగా జయి౦చగలడా? ఆయన అపవిత్ర భూమి నుండి ప్రజలను రక్షించగలడా? ప్రజలు తమ తల౦పుల ప్రకార౦, “దేవుడు పరిశుద్ధుడు కాబట్టి, ఆయన మన ఈ అపవిత్ర స్థల౦లో ఎ౦దుకు జన్మి౦చాడు? నీవు అపవిత్ర మానవులైన మమ్మల్ని ద్వేషిస్తావు మరియు అసహ్యించుకుంటావు; నీవు మా ప్రతిఘటనను మరియు మా తిరుగుబాటును అసహ్యించుకుంటావు, కాబట్టి నీవు మాతో ఎందుకు జీవిస్తావు? నీవు ఒక సర్వోన్నత దేవుడవు. నీవు ఎక్కడైనా జన్మించి ఉండవచ్చు, కాబట్టి నీవు ఈ అపవిత్ర భూమిపైననే ఎందుకు జన్మించాల్సి వచ్చింది? నీవు ప్రతిదినం మమ్మల్ని శిక్షిస్తావు మరియు తీర్పు తీరుస్తావు, మరియు మేము మోయాబు వారసులమని నీకు స్పష్టంగా తెలుసు, కనుక నీవు మా మధ్య ఇంకా ఎందుకు నివసిస్తావు? నీవు మోయాబు వారసుల కుటు౦బ౦లో ఎ౦దుకు జన్మి౦చావు? నీవు ఎందుకు అలా చేశావు?” అని అడుగుతూ ఉంటారు. మీకున్న అటువంటి ఆలోచనలు పూర్తిగా అహేతుకమైనవి! అటువంటి కార్యము ద్వారా మాత్రమే ప్రజలు ఆయన గొప్పతనాన్ని, ఆయన దీనత్వాన్ని, అదృశ్యతను చూడడానికి అనుమతిస్తుంది. ఆయన తన కార్యము కోసం ప్రతిదీ త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, మరియు ఆయన తన కార్యము కోసం అన్ని బాధలను భరించాడు. ఆయన మానవజాతి కొరకు, మరియు దానికంటే ఎక్కువగా సాతానును జయించటానికి, అన్ని జీవులు ఆయన ఆధిపత్యానికి లోబడి ఉండడానికి కార్యము చేస్తాడు. ఇది మాత్రమే అర్థవంతమైన, విలువైన కార్యము. యాకోబు వంశస్థులు చైనాలో, ఈ భూభాగంలో జన్మించినట్లయితే, వారందరూ మీరే అయితే, మీలో జరిగిన కార్యము యొక్క ప్రాముఖ్యత ఏమిటి? సాతాను ఏమి చెబుతాడు? “వారు నీకు ఇంతకుముందు భయపడ్డారు, వారు మొదటి నుండి నీకు విధేయత చూపారు మరియు వారికి నీకు ద్రోహం చేసిన చరిత్ర లేదు. వారు మానవ జాతిలో అత్యంత చీకటిగా ఉన్నవారు కారు, అల్పమైనవారు కారు, లేదా అత్యంత తక్కువ స్థితిని కలిగినవారు కారు” అని సాతాను చెప్పవచ్చు. ఒకవేళ కార్యము నిజంగా ఈ విధంగా జరిగితే, దాని ద్వారా ఎవరు ఒప్పించబడతారు? విశ్వమంతటిలో చైనీయులు అత్యంత వెనుకబడిన జనులు. వారు తక్కువ సమగ్రతతో జన్మించి, తక్కువ స్థితిలో జన్మించారు; వారు మందబుద్ధిగలవారు మరియు నిస్సత్తువగా ఉంటారు మరియు వారు అసభ్యులు మరియు క్షీణించినవారు. వారు సాతాను స్వభావాలతో, మురికితో మరియు విచ్చలవిడితనంతో నాన్చబడియున్నారు. మీరు ఈ సాతాను స్వభావాలన్నింటినీ కలిగి ఉన్నారు. ఈ కార్యము పూర్తయిన తర్వాత, జనులు ఈ అవినీతి స్వభావాలను విడిచి పెడతారు మరియు పూర్తిగా విధేయత చూపుతారు, పరిపూర్ణులవుతారు. కేవలం అటువంటి కార్యపు ఫలాలు మాత్రమే సృష్టిలో సాక్ష్యమును కలిగియుంటాయి! సాక్ష్యం అంటే ఏమిటో నీకు అర్థమైందా? నిజానికి సాక్ష్యం ఎలా పుడుతుంది? ఈ రకమైన కార్యము మిమ్మల్ని మెరుపు కాగితాల్లా చేసి, అలాగే సేవను అందించే సాధనాలుగా మార్చింది; అంతేగాకుండా, అది మిమ్మల్ని రక్షణ సాధనాలుగా చేసింది. ఈ రోజున మీరు దేవుని జనులు; తర్వాత మీరు మాదిరి కలిగిన, ఆదర్శవంతమైన ప్రజలవుతారు. ఈ కార్యములో మీరు వివిధ రకాల పాత్రలను పోషిస్తారు మరియు అంతిమంగా మీరు రక్షణ సాధనాలుగా మారుతారు. దేనినిబట్టి చాలా మంది ప్రతికూలంగా ఉన్నారు; వారు పూర్తిగా గుడ్డివారు కాదా? నీవు ఏదీ స్పష్టంగా చూడవు! నిన్ను కేవలం అలా అనడం ఘోరంగా అనిపిస్తుందా? దేవుని నీతియుతమైన స్వభావం ఏమిటో నువ్వు అర్థం చేసుకున్నావా? దేవుని రక్షణ అంటే ఏమిటో నీకు అర్థమైందా? దేవుని ప్రేమ అంటే ఏమిటో నీకు అర్థమైందా? నీకు యథార్థత లేదు! నిన్ను మంచిగా సూచించి చెప్పినప్పుడు, నువ్వు సంతోషంగా ఉంటావు. నిన్ను చెడుగా సూచించి చెప్పినప్పుడు, నువ్వు ఇష్టపడవు మరియు వెనుదిరుగుతావు. అసలు నువ్వు ఏమిటి? నువ్వు నిజమైన మార్గాన్ని అనుసరించడం లేదు! ఇప్పటికిప్పుడు వెతకడం మానేయండి—ఇది సిగ్గుచేటు! ఇంత చిన్న విషయం మిమ్మల్ని అధిగమిస్తుందంటే ఇది అవమానానికి సంకేతం కాదా?

కొంతమట్టుకు నిన్ను గూర్చి నీవు తెలుసుకోవడానికి అభ్యసించడం మేలు. నిన్ను నీవు అతి గొప్పగా ఎంచుకోవద్దు మరియు పరలోకానికి వెళ్ళడం గురించి కల గనకు, అంటే భూమి మీద జయించడానికి కేవలం నిష్కపటమైన విధేయతతో వెదకితే చాలు. ఉనికిలో లేని ఆ అవాస్తవమైన కలల గురించి ఆలోచించకు! ఎవరైనా కింద పేర్కొన్న దానివలె చెప్పినట్లయితే, ఆ వ్యక్తి మాటలు గట్టిగాను మరియు సంకల్పముతో కూడిన మాటలుగా ఉంటాయి: అవేమనగా, “నేను మోయాబు సంతతికి చెందిన వాడిని అయినప్పటికీ, నేను దేవుని కొరకు శ్రమ పొందుటకు సంకల్పించుకున్నాను. నేను నా పితరులకు వెన్ను చూపుతాను! అతను నాకు జన్మనిచ్చాడు మరియు నన్ను అణచివేశాడు, మరియు ఇప్పటివరకు నేను అంధకారంలో జీవిస్తున్నాను. ఈ రోజున దేవుడు నన్ను విడుదల చేశాడు మరియు నేను చివరకు ఆకాశమందున్న సూర్యుణ్ణి చూసాను. దేవునిచేత బహిర్గతం చేయబడడం ద్వారా నేను చివరకి మోయాబు సంతతికి చెందినవాడినని తెలుసుకున్నాను. నాకు గుడ్డితనము కలుగక మునుపు, దేవుడు చాలా గొప్ప కార్యమును చేశాడని నాకు తెలియదు, ఎందుకంటే పాత సాతాను నా కన్నులకు గుడ్డితనము కలుగజేసియుండెను. నేను దానికి వెన్ను చూపుతాను మరియు దాన్ని పూర్తిగా అవమానపరుస్తాను!” ఆ విధముగా, మీరు అటువంటి సంకల్పం కలిగి ఉన్నారా? మీలో ప్రతి ఒక్కరు మనిషివలె కనిపిస్తున్నారనేది వాస్తవమైనప్పటికీ, అందరికంటే వేగంగా పతనం చెందుతారు మరియు మీరు ఈ విషయంపట్ల చాలా సున్నితంగా ఉంటారు. మీరు మోయాబు యొక్క సంతతికి చెందినవారు అని చెప్పబడగానే, మీ నోర్లను వంకరగా అటూ ఇటూ తిప్పుతూ అలకను చూపిస్తారు. ఇది పంది స్వభావము కాదంటారా? మీరు పనికిమాలిన వారు. మీరు కీర్తి మరియు సంపద కొరకు మీ జీవితాలను త్యాగం చేస్తారు! నీవు మోయాబు యొక్క సంతానానికి చెందకూడదని కోరుకోవచ్చు, కానీ నీవు మోయాబు సంతానము కాదా? నువ్వు మోయాబు సంతానమేనని నేను ఈ రోజు చెప్పుచున్నాను మరియు నువ్వు ఈ విషయాన్ని గుర్తించాలి. నేను వాస్తవానికి విరుద్ధంగా మాట్లాడను. కొంత మంది దీనివలన ప్రతికూలంగా ఉన్నారు, కానీ అక్కడ ప్రతికూలంగా ఉండటానికి ఏముంది? నీవు కూడా మహా ఘట సర్పం యొక్క సంతానం కాదా? నీవు మోయాబు యొక్క సంతానానికి చెందిన వాడివని చెప్పడం అన్యాయమా? నీవు లోపల మరియు బయట ఎట్లా జీవిస్తున్నావో చూడు. నీ శిరస్సు నుండి పాదాల వరకు, మెచ్చుకోదగినది ఏమీ లేదు. విచ్చలవిడితనం, అసహ్యం, గుడ్డితనం, విరోధము, తిరుగుబాటు తనం అనే ఇవన్నీ మీ స్వభావానికి చెందిన గుణాలు కావా? నీవు ఎల్లప్పుడూ విచ్చలవిడితనం ఉన్నటువంటి రాజ్యంలో జీవిస్తావు, మరియు నీవు ఏ చెడు చేయకుండా వదిలిపెట్టవు. నీవు అద్భుతమైన పరిశుద్ధుడివని భావిస్తావు. నీవు చేసిన పనులను చూడు, ఇప్పటికీ నీలో నువ్వు గర్వంగా ఉంటున్నావు. ప్రశంసించడానికి ఏమి చేసావు? నీవు మృగాలవంటివాడవు. నీకు మానవత్వం లేదు! నీవు జంతువులతో సహజీవనం చేస్తావు మరియు దుష్ట, విచ్చలవిడి ఆలోచనల నడుమ జీవిస్తావు. మీకు ఎంత లోటు ఉంది? మీరు మహా ఘట సర్పం యొక్క సంతానమని నీవు అంగీకరిస్తావు, మరియు నీవు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నావు, కానీ తర్వాత, నీవు మోయాబు సంతతికి చెందిన వాడివని చెప్పబడినప్పుడు, నీవు ప్రతికూలంగా మారతావు. ఇది సత్యము కాదా? ఇది నీవు నీ తల్లిదండ్రులకు పుట్టినట్లే, అంటే వారు ఎంత భయంకరమైన వారైనా నువ్వు వాళ్ళకి పుట్టిన వాడివే అవుతావు కదా, ఒకవేళ నీవు పెంపుడు తల్లిని వెతుక్కుని మరియు ఇంటిని విడిచిపెట్టినప్పటికీ, నీవు ఇంకా నీ అసలు తల్లిదండ్రుల బిడ్డవి కావా? ఆ వాస్తవం మార్చబడుతుందా? నేను నిన్ను కారణం లేకుండా మోయాబు యొక్క సంతతి అని ముద్ర వేసానా? “నీవు నన్ను వేరేలా పిలవలేవా?” అని కొంతమంది అంటారు. అప్పుడు, నేను, “నేను నిన్ను మెరుపు కాగితం అని పిలిస్తే ఏలా ఉంటుంది?” అంటాను. వాళ్లు మెరుపు కాగితాల్లా ఉండడానికి కూడా ఇష్టపడరు. ఆలాంటప్పుడు, నీవు ఏమై ఉండటానికి ఇష్టపడతావు? మెరుపు కాగితాల్లాంటివారు, సేవ చేసేవారు కాదా మీరు? నీవు ఇంకా దేనిని ఎంచుకుంటావు? నీవు మహాఘట సర్పం యొక్క దేశం లో పుట్టిన వ్యక్తివి కావా? నీవు దావీదు యొక్క సంతానమని ఎలా చెప్పినప్పటికీ, అది వాస్తవాలకి అనుగుణంగా ఉండదు. నీ కొరకు నీవు ఎంచుకున్నది ఇదేనా? నీవు నీ కొరకు నీకు నచ్చిన ఏదైనా అందమైన పేరును ఎంచుకోగలవా? మహా ఘట సర్పం యొక్క సంతానంగా ప్రస్తావించబడిన వారు మీ అవినీతి జనులు కారా? సేవచేసేవాళ్ళ విషయానికి వస్తే వాళ్లు కూడ మీ అవినీతి జనులు కారా? జయించబడినట్లుగా ప్రస్తావించబడిన ఆ మాదిరికరమైన మరియు ఆదర్శవంతమైన ప్రజలు కూడా మీ జనులు కారా? పరిపూర్ణముగా ఉండే మార్గము మీ కొరకు చెప్పబడలేదా? శిక్షించబడిన మరియు తీర్పు చెప్పబడిన వారందరూ మీ జనులే; తరువాత పరిపూర్ణత గావించబడేవాళ్ళు మీలో కొంతమంది ఉండరా? ఈ పేరు మీకు అంత ప్రాముఖ్యమా? మీరు తెలివిలేనివారు; నీవు అలాంటి అల్పమైన విషయాన్ని కూడా స్పష్టంగా చూడలేవా? నీకు ఎవరి నుండి ఏ సంతానము వచ్చిందొ తెలియదు, కానీ అది నాకు స్పష్టంగా ఉంది, మరియు నేను మీకు చెప్తున్నాను. ఈ రోజు దానిని గుర్తించగలగడం మంచిది. ఎల్లప్పుడూ అంత న్యూనతగా భావించవద్దు. నీవు ఎంత ప్రతికూలంగా ఉండి, తిరుగుబాటు చేస్తే, అంత నీవు సాతాను యొక్క సంతానం అని అది నిరూపిస్తుంది. నీవు వారికి కీర్తనలు వినిపించినప్పుడు, “మోయాబు సంతతి వారు కీర్తనలు వినగలరా? నేను వినను; నేను అర్హతలేని వాన్ని!” అని కొంతమంది అంటారు. నీవు వాళ్ళని పాడించినట్లయితే, వారు, “మోయాబు యొక్క సంతతి పాడినట్లయితే, దేవుడు వినడానికి సిద్ధంగా ఉన్నాడా? దేవుడు నన్ను తిరస్కరిస్తాడు. నేను దేవుని ఎదుటకి వెళ్లడానికి చాలా సిగ్గుపడుతున్నాను మరియు నేను అతని కొరకు సాక్షాన్నిఇవ్వలేను. అది ఆయన విన్నప్పుడు దేవుడు చిరాకు పడతాడేమోనని నేను మాత్రం పాడను” అంటారు. ఇది దానితో వ్యవహరించడానికి ప్రతికూలమైన మార్గం కాదా? సృష్టించబడిన జీవిగా, నీవు విచ్చలవిడితనం యొక్క రాజ్యంలో జన్మించావు, మరియు నీవు మహా ఘట సర్పం యొక్క సంతానమైయున్నావు, మోయాబు యొక్క సంతతివైయున్నావు: నీవు నీ పితరుడికి వెన్ను చూపాలి, మరియు వృద్ధ సాతానుకి వెన్ను చూపాలి. అలా చేసే వ్యక్తి మాత్రమే దేవుని నిజంగా కోరుకునే వ్యక్తిగా పరిగణించబడతాడు.

మొదట్లో, నేను మీకు దేవుని జనుల స్థానాన్ని ఇచ్చినప్పుడు, మీరు ఇతరులకంటే గొప్ప ఆనందంతో ఎక్కువ పైకి క్రిందికి దుమికారు. అయితే నేను మీరు మోయాబు వారసులు అని నేను చెప్పిన వెంటనే, మీరు ఎలా అయిపోయారు? మీరందరూ కింద పడిపోయారు! మీ స్థాయి ఎక్కడ ఉంది? మీ స్థానాన్ని గూర్చిన భావన మీలో చాలా బలంగా ఉంది! చాలా మంది తమంతట తాము పైకి లేవలేరు. కొందరు వ్యాపారం చేయడానికి వెళతారు, మరి కొందరు పనికి వెళతారు. మీరు మోయాబు వారసులు అని నేను చెప్పిన వెంటనే, మీరందరూ పారిపోవాలని కోరుకుంటున్నారు. మీరు రోజంతా మీరు దేవుని కోస౦ అరిచి చెప్పే సాక్ష్యము ఇదేనా? సాతాను ఈ విధ౦గా ఒప్పి౦పబడతాడా? ఇది అవమానానికి గుర్తు కాదా? మిమ్మల్ని కలిగి ఉండటమువలన ఉపయోగం ఏమిటి? మీరందరూ వ్యర్ధముగా ఉన్నారు! మీరు అంత తప్పు జరిగినట్టుగా భావించడానికి మీరు ఎటువంటి బాధను భరించారు? దేవుడు మిమ్మల్ని కొంత మేరకు హింసించిన తరువాత, అతను మిమ్మల్ని ఖండించాలనే ఉద్దేశ్యంతో వచ్చినట్లు, మరియు మిమ్మల్ని ఖండించి నాశనం చేయడం తో ఆయన పని పూర్తయిందని మీరు అనుకుంటారు. నేను చెప్పినది అదేనా? మీ గుడ్డితనము కారణంగా మీరు అలా అనుకోవట్లేదా? మీ అంతట మీరు బాగా చేయడానికి ప్రయత్నం చేయలేదా, లేదా సహజంగానే నేను మిమ్మల్ని ఖండిస్తున్నానా? నేను ఎప్పుడూ అలా చేయలేదు, ఇదంతా మీకు మీరే ఆలోచించుకున్నారు. నేను జరిగించే కార్యము అలా ఉండదు, నాకు ఆ ఉద్దేశం కూడా లేదు. నేను నిజంగా మిమ్మల్ని నాశనం చేయాలనుకుంటే, నేను అలాంటి కష్టాలకి గురి కావాల్సిన అవసరం ఉందా? నా చిత్తము ఇది: నేను మిమ్మల్ని రక్షించినప్పుడు మాత్రమే, నేను విశ్రాంతి తీసుకోగలిగినట్లుగా ఉంటుంది. ఒక వ్యక్తి ఎంత తక్కువ స్థాయిలో ఉంటే, అంత ఎక్కువగా వారు నా రక్షణకు లక్ష్యం అవుతారు. మీరు ఎంత చురుకుగా లోపలికి ప్రవేశించగలిగితే, నేను అంత సంతోషంగా ఉంటాను. మీరు ఎంత ఎక్కువగా వేరు పడితే, నేను అంతగా కలత చెందుతాను. మీరు ఎల్లప్పుడూ సింహాసనము నుండి అడ్డుకునే దండము రావాలని కోరుకుంటారు—నేను మీకు చెబుతున్నాను, మిమ్మల్ని అపవిత్రమైన కూపం నుండి రక్షించే మార్గం అది కాదు. సింహాసనంపై కూర్చున్నట్లు కలగనడం ద్వారా మీరు పరిపూర్ణులవ్వలేరు; అది వాస్తవికమైనది కాదు. నీవు మోయాబుకి వారసుడవు అని నేను చెబుతున్నాను, ఇంకా నీవు సంతోషంగా ఉండలేవు. “నీవు నన్ను అగాధములోనికి పంపితే, నేను నీపట్ల సాక్ష్యమివ్వను లేదా నీ కోసం శ్రమపడను” నువ్వు అంటుంటావు. నీవు అలా చేయడం నాకు వ్యతిరేకంగా ఉండదా? దీనిని చేయడం నీకు ప్రయోజనం చేకూరుస్తుందని అనుకుంటున్నావా? నేను నీకు ఎంతో కృపను ఇచ్చాను కదా, నువ్వు మర్చిపోయావా? ప్రేమగల మాతృ మూర్తిలా ఉన్న దేవుని హృదయాన్ని మీరు తిరస్కరించారు మరియు అవమానించారు; దాని పర్యవసానాలు మీకు ఎలా ఉంటాయి? నీవు నా గురించి సాక్ష్యమివ్వకపోతే నేను నిన్ను బలవంతం చేయను కానీ నీవు చివరికి వినాశనానికి గురి అవుతావని నీవు తెలుసుకోవాలి. నేను నీలో సాక్ష్యం పొందలేకపోతే, నేను దానిని ఇతర వ్యక్తులలో పొందుతాను. అది నాకు ముఖ్యం కాదు, కానీ చివరికి, నీవు చింతిస్తావు, అప్పటికే, నీవు చాలా కాలంగా చీకటిలో పడి ఉంటావు. అప్పుడు నిన్ను ఎవరు కాపాడగలరు? నీవు లేకుండా కార్యము జరగదని అనుకోవద్దు. నిన్ను కలిగి ఉండటం అనేది ఎక్కువ కలిగియున్నట్లు కాదు మరియు నీవు కోల్పోవడం అనేది ఎక్కువ కోల్పోయినట్లు కాదు. నిన్ను నువ్వు ఎక్కువ గౌరవంతో పరిగణించుకోవద్దు. నీవు నన్ను అనుసరించడానికి ఇష్టపడకపోతే, అది నిన్ను తిరుగుబాటుదారునిగా చూపిస్తుంది. మరియు నీలో కోరదగినది ఏమీ లేదు.” నీవు మంచిగా మాట్లాడే వ్యక్తివి అయితే, అది నా కార్యము ద్వారా నేను తెచ్చిన వాక్కుల ద్వారా నిన్ను సంసిద్ధపరిచినది కాదా? నీలో మెచ్చుకోదగినది ఏముంది? నీతోనే నీ ఊహలను పరిగెట్టనివ్వవద్దు! మోయాబు వారసులైన మీ ను౦డి నేను మహిమను పొ౦దలేకపోతే, నేను మహిమపొ౦దే వరకు నా కార్యము కోసం మోయాబు వారసుల రె౦డవ గు౦పును, మూడవ గు౦పును ఎ౦పిక చేసుకుంటాను. నువ్వు నా కోసం సాక్ష్యం ఇవ్వడానికి ఇష్టపడకపోతే, అప్పుడు బయటకు వెళ్లిపో! నేను మిమ్మల్ని బలవంతం చేయను! మీరు లేకుండా నేను ఒక అడుగు కూడా కదలలేనని అనుకోవద్దు. చైనాలోని ఈ భూమిలో నా పనికి తగిన వారిని కనుగొనడం పెద్ద ప్రయాస కాదు. ఈ దేశములో అపవిత్రత, అవినీతిపరులు ప్రతిచోటా తగినంతగా ఉన్నారు గనుక నా కార్యము ఎక్కడైనా చేయవచ్చు. అంత గర్వపడవద్దు! నువ్వు ఎంత గర్వపడుతున్నా, నువ్వు ఇప్పటికీ జారత్వము నుండి పుట్టిన బిడ్డ కాదా? నీ విలువను గమనించు, అంటే నీకు వేరే ఏ ఎంపిక ఉ౦ది? నిన్ను జీవించడానికి అనుమతించడం అనేదే నీకిచ్చే గొప్ప హెచ్చింపు, కాబట్టి నువ్వు ఇంకా దేనిని బట్టి గర్విస్తావు? యుగమును అంతం చేయడం అనే నా కార్యము కొరకు కాకపొతే నువ్వు ఎప్పుడో స్వాభావికమైన మరియు మానవ నిర్మిత విపత్తుల మధ్యలో పడేవాడివి కాదా? నీవు ఇంకా అంత సౌకర్యవంతంగా జీవించగలవా? ఈ విషయంపై నీవు ఎప్పటికీ వాదిస్తూనే ఉంటావు. నీవు మోయాబు యొక్క వారసుడవు అని నేను చెప్పినప్పటి నుండి నువ్వు ఎల్లప్పుడూ దూషిస్తూనే ఉంటావు. మిమ్మల్ని మీరు మెరుగుపరచుకోరు, మీరు దేవుని మాటలను చదవరు, కనీసం మీరు అటువంటి వ్యక్తి కనుసన్నల్లో నిలువబడరు. ఇతర వ్యక్తులు మెరుగుపడటాన్ని నువ్వు చూసినప్పుడు, నువ్వు వారిని భంగపరచి, నిరుత్సాహపరిచే విషయాలు చెబుతావు. నీకు ఒక విధమైన తెగింపు ఉంది! “మోయాబు స౦తానానికి ఎటువంటి విద్య ఉంటుంది? నాకు ఏ బాధ లేదు” అని నువ్వు అంటావు. ఇది ఒక మృగం చెప్పే విషయం కాదా? నీవు ఒక మనిషిగానైనా లెక్కింపబడతావా? నేను చాలా చెప్పాను, కానీ అది నీలో ఏమీ సాధించలేదు. నేను ఈ పని అంతా వ్యర్థంగా చేశానా? ఈ మాటలన్నీ వ్యర్థంగా చెప్పానా? కుక్క కూడా తన తోకను ఊపేది; అటువంటి వ్యక్తి కుక్కలాంటివాడు కూడా కాదు! మీరు మానవులు అని పిలవబడటానికి అర్హులా? నేను మోయాబు వారసుల గురించి మాట్లాడేటప్పుడు, కొంతమంది ఉద్దేశపూర్వకంగా తమను తాము కించపరుచుకుంటారు. వారు మానవుల్లా కనిపి౦చకు౦డా మునుపెన్నడూ లేనట్లుగా వస్త్రధారణ చేసి, ఎ౦త చిందరవందరగా ఉ౦టారు, వారు గొణుగుతున్నారు: “నేను మోయాబు స౦తానాన్ని. నాలో మంచి లేదు. ఏదైనా ఆశీర్వాదాలు పొందాలనే ఆలోచన పగటికల వంటిది. మోయాబు సంతానమంతా పరిపూర్ణులవుతారా?” నేను మోయాబు సంతతి గురి౦చి మాట్లాడిన వె౦టనే చాలామ౦ది జనులకి ఇక నిరీక్షణ ఉ౦డదు; అందుకు వారు, “మన౦ మోయాబు స౦తానమని దేవుడు చెబుతున్నాడు, అంటే అది దేనిని సూచిస్తు౦ది? ఆయన అలవర్చుకున్న స్వరాన్ని చూడ౦డి— అది తిరుగులేనిది! అతని మాటల్లో ప్రేమ లేదు. మనం వినాశనానికి లక్ష్యాలు కాదా?” ఇంతకు ముందు చెప్పిన విషయాలు నువ్వు మర్చిపోయావా? “మోయాబు సంతతి” అనే పదం ఒక్కటే ఇప్పుడు నీకు గుర్తుందా? వాస్తవానికి, అనేక పదాలు ఒక ప్రభావాన్ని సాధించడానికి ఉద్దేశించబడ్డాయి, కానీ అవి వాస్తవాల సత్యాన్ని కూడా వెల్లడిస్తాయి. చాలా మంది దీనిని నమ్మరు. నువ్వు నా కోసం అలా శ్రమపడటానికి సిద్ధంగా లేవు. నువ్వు మరణానికి భయపడతావు ఇంకా ఎల్లప్పుడూ తప్పించుకోవాలని కోరుకుంటావు. నువ్వు వెడలి వెళ్లాలనుకుంటే, నేను నిన్ను ఉండమని బలవంతం చేయను, కానీ నేను నీకు ఇది స్పష్టంగా చెప్పాలి: జీవితకాలం మొత్తం వ్యర్థంగా జీవించవద్దు, మరియు గతంలో నేను నీకు చెప్పిన విషయాలను మరచిపోవద్దు. సృష్టించబడిన వ్యక్తిగా, సృష్టించబడిన వ్యక్తి యొక్క విధిని నువ్వు నిర్వర్తించాలి. నీ మనస్సాక్షికి విరుద్ధంగా వ్యవహరించవద్దు; నువ్వు ఏమి చేయాలంటే సృష్టికి ప్రభువైన వానికి నిన్ను నీవు అంకితం చేసుకోవడం. మోయబు వంశస్థులు కూడా సృష్టి౦చబడిన వారు, కానీ వారు కేవలం మెరుపు కాగితాలు లాంటివారు, వారు శాపగ్రస్తులు. ఏది ఏమైనా, నీవు ఇప్పటికీ ఒక సృష్టించబడిన వ్యక్తివి. “నేను మోయాబు సంతతిని అయినప్పటికీ, నేను దేవుని కృపను ఎంతగా ఆస్వాదించాను అంటే, నాకు కొంత మనస్సాక్షి తప్పక ఉంటుంది. నేను దానిని అంగీకరిస్తాను కాని దానిపై ఊగిసలాడను. నేను ఈ ప్రవాహంలో బాధపడినప్పటికీ, నేను చివరి వరకు బాధపడతాను, మరియు నేను మోయాబు వారసుడిని అయితే, అప్పుడు అలానే కానివ్వండి. నేను ఇప్పటికీ చివరి వరకు అనుసరిస్తాను!” అని నువ్వు చెప్పినట్లయితే, నువ్వు ఎంతో దూరములో లేవు. నువ్వు చివరి వరకు అనుసరించాలి. నువ్వు పారిపోతే, నీకు నిజంగా అవకాశాలు ఉండవు, అంటే నువ్వు వినాశన మార్గంలో అడుగు పెట్టావు.

మీ మూలాన్ని మీరు అర్థం చేసుకోవడం మరియు కార్యానికి ఉపయోగకరమైన వాస్తవిక సత్యాన్ని అర్థం చేసుకోవడంలో మంచి ఉంది. అలా చేయకుండా, ఆశించిన ఫలితం సాధించబడదు. ఇది జయించే కార్యములో ఒక భాగం, మరియు ఇది కార్యములో అవసరమైన దశయైయున్నది. అది వాస్తవం. ఈ కార్యము ద్వారా జనుల ఆత్మలను మేల్కొలపడానికి, వారి మనస్సాక్షి భావాన్ని మేల్కొల్పడానికి మరియు ఈ గొప్ప రక్షణను పొందేలా వారిని అనుమతించడానికి ఉద్దేశించబడింది. ఒకరికి మనస్సాక్షి ఉ౦టే, వారు తక్కువ స్థాన౦లో ఉన్నారని కనుగొన్నప్పుడు వారు మరింత ఎక్కువగా దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. వారు ఆయన వాక్కులను తమ చేతుల్లో తప్పక పట్టుకోవాలి, ఆయన ఇచ్చిన కృపను గట్టిగా పట్టుకొని, తీవ్రంగా విలపించి, “మా స్థితి తక్కువగా ఉంది, మేము ప్రపంచంలో ఏదీ పొందుకోలేదు. తక్కువ స్థాయి వారమని ఎవరూ మా వైపు చూడరు. మా ఇ౦టి వాతావరణములో మేము హి౦సి౦చబడుచున్నాము, మా భర్తలు మమ్మల్ని తిరస్కరి౦చారు, మా భార్యలు మమ్మల్ని దూషి౦చారు, మా పిల్లలు మమ్మల్ని తక్కువగా చూసారు, మేము పెద్దయ్యాక మా కోడళ్ళూ కూడా మమ్మల్ని దూషిస్తారు. మేము నిజ౦గా అనుభవించిన కష్టం చిన్నది ఏమీ కాదు. ఇప్పుడు మేము దేవుని గొప్ప ప్రేమను ఆస్వాదించడం ఎంత గొప్ప భాగ్యం! దేవుడు మమ్మల్ని రక్షించకపోతే, మానవ వేదనలను మేమెలా స్పష్ట౦గా చూడగల౦? ఈ పాపములో మనం ఇంకా క్షీణించకుండా ఉండగలమా? ఇది దేవుడు మనకు కల్పించిన హెచ్చింపు కాదా? అల్పులైన జనులలో నేనూ ఒకడిని, అయినా దేవుడు నన్ను చాలా పైకి లేపాడు. నేను నాశనమైనప్పటికీ, నేను ఆయన ప్రేమను తప్పక తిరిగి చెల్లించాలి. దేవుడు మన గురించి గొప్పగా ఆలోచిస్తాడు మరియు ఆయన మనతో, అటువంటి తక్కువ స్థితిని కలిగిన వ్యక్తులతో ముఖాముఖిగా మాట్లాడతాడు. ఆయన నాకు బోధించడానికి నా చేతిని తీసుకుంటాడు. తన నోటితో, ఆయన నాకు ఆహారం ఇస్తాడు. ఆయన నాతో నివసిస్తాడు మరియు నాతో బాధపడతాడు. ఆయన నన్ను శిక్షించినప్పటికీ కూడా నేను ఏమి అనగలను? శిక్షించబడడం కూడా దేవునిచేత హెచ్చించబడడం కాదా? నేను మందలించబడ్డాను, అయినప్పటికీ నేను ఆయన నీతిని చూడగలను. నేను మనస్సాక్షి లేకు౦డా ఉ౦డలేను, అంటే దేవుని ప్రేమను నేను తిరిగి చెల్లించాలి. ఇక నేను దేవునిమీద తిరుగుబాటు చేయలేను” అని చెబుతావు. దేవుని స్థాయి, ఆయన హోదా అనేవి జనుల స్థాయి మరియు హోదాకి సమానం కావు, అంటే ఆయన వేదన జనుల వేదన ఒకటే, ఆయన ఆహారము మరియు దుస్తులు, జనుల ఆహారము మరియు దుస్తులు ఒకటే, కానీ జనుల౦దరూ ఆయనను గౌరవిస్తారు, ఇదొక్కటే తేడా. ఇవి కాకుండా మనిషిలా ఆయన ఇతర వాటియందు ఆనందించాడా? కాబట్టి, నిన్ను ఒక నిర్దిష్టమైన రీతిలో చూడమని దేవుణ్ణి అడగడానికి మిమ్మల్ని ప్రోత్సహించేది ఏమిటి? దేవుడు అంత గొప్ప శ్రమను సహి౦చి, అలా౦టి గొప్ప కార్యమును చేశాడు. చీమలకన్నా, పురుగుకన్నా తక్కువగా ఉన్నటువంటి మీరు నేడు ఎ౦తగానో హెచ్చించబడ్డారు. నీవు దేవుని ప్రేమను తిరిగి చెల్లించలేకపోతే, నీ మనస్సాక్షి ఎక్కడ ఉంది? “నేను దేవుణ్ణి విడిచిపెట్టడ౦ గురి౦చి ఆలోచి౦చిన ప్రతిసారీ నా కళ్లు కన్నీళ్లతో ని౦డిపోతాయి, నా మనస్సాక్షి చివుక్కుమంటుంది. నేను దేవునికి రుణపడి ఉన్నాను. నేను దీన్ని చేయలేను. నేను ఆయనతో అలా వ్యవహరించలేను. నేను చనిపోతే, చనిపోవడం ద్వారా ఆయన కార్యానికి ఘనతని ఇస్తే, ఆ విషయం నా పరిధికి మించినది. లేకపోతే, నేను జీవించినా, నాకు శాంతి ఉండదు” అని కొంతమంది తమ హృదయ లోతుల్లోనుండి మాట్లాడుతారు. ఈ మాటలు వినండి, అంటే సృష్టి౦చబడిన వ్యక్తి నెరవేర్చవలసిన కర్తవ్యాన్ని అవి వివరిస్తున్నాయి. ఒక వ్యక్తి ఎల్లప్పుడూ ఈ దృష్టిని తమలో కలిగి ఉంటే, వారు వారి అంతరంగములో స్పష్టంగా మరియు సమాధానముతో ఉంటారు; ఈ విషయాల్లో వారు స్పష్టంగా ఉంటారు. “దేవుడు నాకు హాని చేయడం లేదు, మరియు ఆయన ఉద్దేశపూర్వకంగా నన్ను చూసి హేళన చేయడం లేదు, లేక అవమానించడం లేదు. ఆయన కొంత కఠినంగా మాట్లాడుతున్నప్పటికీ మరియు అది హృదయానికి తాకినప్పటికీ, అది నా కోసమే మాట్లాడుచున్నాడు. ఆయన చాలా కఠినంగా మాట్లాడుతున్నప్పటికీ, ఆయన ఇప్పటికీ నన్ను కాపాడుతున్నాడు, మరియు ఆయన ఇప్పటికీ నా బలహీనతలను అర్ధం చేసుకుంటాడు. ఆయన నన్ను శిక్షించడానికి వాస్తవాలను ఉపయోగించడం లేదు. దేవుడే రక్షణ అని నేను నమ్ముతున్నాను” అని నువ్వు చెబుతావు. ఒకవేళ నీకు నిజంగా ఈ దృష్టి ఉన్నట్లయితే, నీవు పారిపోయే అవకాశం లేదు. నీ మనస్సాక్షి నిన్ను వెళ్లనివ్వదు, మరియు నువ్వు దేవునితో అలా వ్యవహరించకూడదని అది నిన్ను గద్దిస్తుంది. నీవు పొందుకున్న కృపలన్నిటి గురించి నీవు ఆలోచిస్తావు. మీరు నా మాటలు చాలా విన్నారు, అయితే, మీరు వాటిని వ్యర్థంగా విన్నారా? ఎవరు పారిపోయినప్పటికీ, నీవు అలా చేయకూడదు. ఇతర వ్యక్తులు నమ్మకపోవచ్చు, కానీ నీవు తప్పక నమ్మాలి. ఇతరులు దేవుణ్ణి విడిచిపెడతారు, కానీ నీవు సాక్షిగా నిలబడి దేవుని నామాన్ని మహిమ పరచాలి. ఇతరులు దేవునిని దూషిస్తారు, కానీ నీవు అలా చేయకూడదు. దేవుడు నీకు దయ చూపించుకున్నప్పటికి, నీవు ఆయన ద్వారా సరియైన క్రియలనే చేయాలి. నీవు ఆయన ప్రేమను తిరిగి చెల్లించాలి, మరియు దేవుడు నిర్దోషి కాబట్టి మీకు మనస్సాక్షి అనేది ఉండాలి. మానవాళి మధ్య కార్యము జరిగించడానికి పరలోకం నుండి భూమికి రావడం ద్వారా ఆయన ఇప్పటికే గొప్ప అవమానాన్ని సహించాడు. ఆయన కొద్దిపాటి మాలిన్యం కూడా లేనట్టి పరిశుద్ధుడు. అపరిశుద్ధతగల భూమిపైకి దిగి రావడానికి ఆయన ఎంత అవమానాన్ని భరించాడో? ఆయన మీ కోసం మీ పైన కార్యాన్ని జరిగిస్తాడు. ఒకవేళ నీవు గనుక మనస్సాక్షి లేకుండా ఆయనతో వ్యవహరిస్తే, నీకు త్వరగా మరణం సంభవిస్తే చాలా మంచిది!

ప్రస్తుతం, చాలా మందికి ఈ దృష్టి కోణం లోపించింది; వారు ఈ కార్యాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేరు, అంతే కాదు చివరకు దేవుడు దానితో ఏమి సాధించాలి అనుకుంటున్నాడో కూడా వారికి తెలియదు. ముఖ్యంగా ఆ గందరగోళములో ఉన్నవారు, అనగా వారు ఒక చక్రబంధంలోకి ప్రవేశించి కొన్ని మలుపుల తరువాత తమ మార్గాన్ని కోల్పోయిన వారిగా ఉన్నారు. దేవుని నిర్వహణ ప్రణాళిక యొక్క లక్ష్యాన్ని గనుక నీవు వారికి క్షుణ్ణంగా వివరిస్తే, వారు కలవరపడరు. చాలామ౦ది దాన్ని అర్థం చేసుకోలేరు, ప్రజలను హి౦సి౦చడమే దేవుని పని అని నమ్ముతారు. ఆయన కార్యము యొక్క జ్ఞానాన్ని, అద్భుతాన్ని వారు అర్థం చేసుకోలేరు. ఆయన కార్యాలు ఆయన గొప్ప శక్తిని వెల్లడి చేస్తున్నాయని, అంతకు మించి వాటి ద్వారా మానవాళిని రక్షించడం కొరకేనని వారు అర్థం చేసుకోలేరు. వారు అదంతా చూడరు; వారికేమైనా అవకాశాలున్నాయా, వారు పరలోక౦లోకి ప్రవేశి౦చగలరా లేదా అనే విషయాన్ని మాత్రమే చూస్తారు. “దేవుని కార్యము ఎల్లప్పుడూ పరోక్షంగానే జరుగుతుంది; ఇది నీ జ్ఞానాన్ని నేరుగా చూసే విధంగా మనల్ని అనుమతించదు. నీవు మమ్మల్ని ఈ విధంగా హింసించకూడదు. మాలో సామర్థ్యం చాలా లోపించింది, మరియు నీ ఇష్టాన్ని మేము అర్థము చేసుకోలేక ఉన్నాము. నువ్వు నేరుగా మాట్లాడి, నేరుగా వ్యవహరిస్తే చాలా బాగుంటుంది. మేము కనిపెట్టాలని నువ్వు కోరుచున్నావు, కానీ మేము కనిపెట్టలేకయున్నాము. నువ్వు త్వరితగతిన మీ మహిమను చూడటానికి మమ్మల్ని అనుమతిస్తే అది చాలా గొప్పగా ఉంటుంది. ఇంత పరోక్షంగా కార్యమును జరిగించాల్సిన చేయాల్సిన అవసరం ఏమిటి?” అని వారు అంటూ ఉంటారు. ఇప్పుడు మీకు ఎక్కువగా మనస్సాక్షి లోపించింది మనస్సాక్షి ఎక్కువగా కలిగి ఉండండి. ఈ కార్యము యొక్క దశలను నిజంగా ఎవరు చేస్తున్నారో చూడటానికిగాను మీ కనులను విశాలంగా తెరవండి. ఒక ముగింపు కోసం తొందరపడకండి. ఇప్పుడు, అత్యుత్తమంగా, నీవు అనుభవించాల్సిన జీవన విధానం యొక్క పైపై కోణాన్ని నీవు అర్థం చేసుకున్నావు. నీవు అనుభవించడానికి ఇంకా చాలా మొత్తంలో సత్యం ఉంది, నీవు దానిని పూర్తిగా అర్థం చేసుకోగల రోజు వచ్చినప్పుడు, నీవు ఇకపై అలా మాట్లాడవు, అలానే ఫిర్యాదు కూడా చేయవు. నీవు విషయాలను నిర్వచించడానికి అంతగా త్వరపడవు. అప్పుడు నువ్వు, “దేవుడు చాలా తెలివైనవాడు, దేవుడు చాలా పరిశుద్ధుడు, దేవుడు చాలా శక్తివంతమైనవాడు!” అని చెబుతావు.

మునుపటి:  ఇశ్రాయేలీయులు సేవించినట్లుగా సేవ చేయండి

తరువాత:  పేతురు అనుభవాలు: శిక్ష మరియు తీర్పుల గూర్చిన అతనికున్న జ్ఞానం

సెట్టింగులు

  • వచనం
  • థీమ్స్

ఘన రంగులు

థీమ్స్

అక్షరశైలి

అక్షరశైలి పరిమాణం

గీతల మధ్య దూరం

గీతల మధ్య దూరం

పేజీ వెడల్పు

విషయ సూచిక

శోధించండి

  • ఈ వచనాన్ని శోధించండి
  • ఈ పుస్తకాన్ని శోధించండి

Connect with us on Messenger