రాజ్యపు యుగమంటే వాక్కుల యుగమని అర్థం

రాజ్యపు యుగములో దేవుడు క్రొత్త యుగానికి నాంది పలకడానికి, ఆయన చేసే కార్యముల విధానాలను మార్చడానికి మరియు యుగమంతటిలో కార్యము జరిగించడానికి దేవుడు తన వాక్కులను ఉపయోగిస్తాడు. దేవుడు ఈ సూత్రాన్ని ఆధారము చేసుకొని వాక్యపు యుగములో పని చేస్తాడు. విభిన్నమైన దృక్పథముల నుండి మాట్లాడడానికి ఆయన శరీరధారిగా వచ్చాడు, అందుచేత శరీరములో కనిపిస్తున్నటువంటి వాక్యమైయున్న దేవుణ్ణి మానవుడు నిజంగా చూస్తాడు మరియు ఆయన జ్ఞానాన్ని, ఆయన అద్భుతమును గట్టిగా పట్టుకుంటాడు. మనిషిని జయించడానికి, మనిషిని పరిపూర్ణం చేయడానికి మరియు మనిషిని పరిత్యజించడానికి గల లక్ష్యాలను చేరుకునే క్రమములో అటువంటి కార్యము జరిపించబడింది, ఇదే వాక్యపు యుగములో పని చేయడానికి ఉపయోగించే వాక్కుల నిజమైన అర్థము. ఈ వాక్కుల ద్వారా ప్రజలు దేవుని కార్యమును, దేవుని స్వభావమును, మనిషి గుణాన్ని మరియు మనిషి ఎందులోనికి ప్రవేశించవలసినవాడైయున్నాడనే విషయాలను తెలుసుకొనుచున్నారు. ఈ వాక్కుల ద్వారానే వాక్యపు యుగములో తాను చేయాలని ఇష్టపడిన పనిని సంపూర్ణముగా చేసి ముగించాలని దేవుడు ఇష్టపడుచున్నాడు. ఈ వాక్కుల ద్వారా ప్రజలు బహిర్గతం చేయబడతారు, పరిత్యజించబడుతారు మరియు పరీక్షించబడతారు. ప్రజలు దేవుని వాక్కులను చూశారు, ఆ వాక్కులను విన్నారు మరియు ఆ వాక్కులు ఉనికిలో ఉన్నాయని గుర్తించారు. దీనికి ఫలితంగా, వారు దేవుని అస్తిత్వములో, దేవుని జ్ఞానము మరియు సర్వశక్తియందు, అలాగే మనిషిపట్ల దేవుడు చూపిన ప్రేమయందు, మనిషిని ఆయనకున్న ఆసక్తి యందు నమ్మిక ఉంచియున్నారు. “వాక్కులు” అనే పదము బహుశా చాలా సాధారణముగా ఉండవచ్చు గానీ, శరీరధారిగా వచ్చిన దేవుని నోట నుండి వచ్చిన మాటలు విశ్వమును కదలించాయి, అవి మనుష్యుల హృదయాలను మార్చాయి, అవి మనుష్యుల ఆచారములను మరియు మనుష్యుల పాత స్వభావములను మార్చివేశాయి మరియు కనిపించే లోకపు విధానమును రూపాంతరము చేశాయి. యుగ యుగాలలో ఈ రోజున్న దేవుడు మాత్రమే ఈ విధంగా పని చేసియున్నాడు. ఆయన మాత్రమే ఇలా మాట్లాడియున్నాడు మరియు మనిషిని ఇలా రక్షించియున్నాడు. ఈ సమయము మొదలుకొని మనిషి దేవుని మాటల మార్గదర్శనములో, ఆయన మాటల ప్రకారముగా మరియు ఆయన మాటల కాపుదలలో జీవిస్తాడు. మనుష్యులు దేవుని మాటల ప్రపంచములో, దేవుని మాటల ఆశీర్వాదములు మరియు శాపాల మధ్యన జీవిస్తారు. దేవుని మాటల తీర్పు మరియు శిక్షల క్రింద జీవించడానికి వచ్చిన ప్రజలు అనేకులున్నారు. మనిషి రక్షించబడుట కొరకే, దేవుని చిత్తమును నెరవేర్చుట కొరకే, పాత సృష్టి యొక్క ప్రపంచపు అసలు రూపాన్ని మార్చుట కొరకే ఈ మాటలు మరియు ఈ కార్యములన్నియు జరుగుచున్నవి. దేవుడు ఈ సృష్టిని తన వాక్కుల ద్వారా సృష్టించాడు, ఆయన తన ఈ సమస్త విశ్వమును తన మాటల ద్వారా నడిపించుచున్నాడు మరియు ఆయన తన మాటలను ఉపయోగించుట ద్వారానే వారిని జయించి, రక్షించుచున్నాడు. చివరికి, ఈ పాత ప్రపంచానికి ముగింపు పలకడానికి కూడా ఆయన తన వాక్కులను ఉపయోగించును, తద్వారా ఆయన అనుకున్న నిర్వహణ ప్రణాళిక మొత్తాన్ని పూర్తి చేయును. రాజ్యపు యుగమంతటిలో దేవుడు తన కార్యమును జరిగించుటకు మరియు తన కార్యము తగిన ఫలితాలను పొందుటకు ఆయన తన వాక్కులను ఉపయోగించాడు. ఆయన అద్భుతాలను లేక మహత్కార్యాలను చేయడు గానీ, ఆయన తన మాటల ద్వారా తన కార్యమును జరిగించుకొనును. ఈ మాటల బట్టియే మనుష్యుడు పోషించబడుచున్నాడు, అతని అవసరతలు తీర్చబడుచున్నాయి, జ్ఞానమును మరియు నిజమైన అనుభువమును పొందుకొనుచున్నాడు. వాక్యపు యుగములో మనుష్యుడు అత్యధికముగా ఆశీర్వదించబడ్డాడు. అతనికి భౌతికపరమైన బాధ ఉండదు మరియు కేవలము దేవుని వాక్కుల నుండి వచ్చే సమృద్ధికరమైన ఆశీర్వాదాలను ఆనందంగా అనుభవిస్తాడు; గ్రుడ్డిగా వెదికే అవసరత లేకుండా, గ్రుడ్డిగా ప్రయాణం చేయకుండా, అనుకూలమైన పరిస్థితులలో తానుండి దేవుని ముఖ దర్శనమును చేసుకుంటాడు, ఆయన నోటి మాటలను వింటాడు. ఆయన అందించే ప్రతి ఆశీర్వాదమును పొందుకుంటూ ఉంటాడు. ఆయన చేసే కార్యమును దగ్గరగా ఉండి చూస్తుంటాడు. ఇవన్నియూ గత యుగాలలోని ప్రజలు ఆనందించలేకపోయిన విషయాలు మరియు ఇవి వారు పొందుకోలేని ఆశీర్వాదాలు.

మనిషిని సంపూర్ణునిగా చేయాలని దేవుడు సంకల్పించాడు. ఆయన ఏమి మాట్లాడుచున్నాడనే మాటలతో నిమిత్తం లేకుండా, ఆయన మాట్లాడునదంతయు ప్రజలను పరిపూర్ణులనుగా చేయడానికే మాట్లాడుచున్నాడు. ఆత్మ దృష్టి కోణములో నుండి మాట్లాడిన మాటలను అర్థము చేసుకోవడం ప్రజలకు చాలా కష్టంగా ఉంటుంది; ఎందుకంటే, ఆచరించడానికి మార్గమును కనుగొనలేని స్థితిలో వారున్నారు, అర్థము చేసుకోవడానికి వారికున్న సామర్థ్యము పరిమితమైనది. దేవుని కార్యము విభిన్నమైన పరిణామాలకు దారి తీస్తుంది. ఆయన చేస్తున్న కార్యములోని ప్రతి అడుగులో ఒక ఉద్దేశమును కలిగియుంటాడు. అంతేగాకుండా, విభిన్నమైన కోణాల నుండి ఆయన మాట్లాడడం అనేది కూడా చాలా అత్యవసరం, ఈ విధంగా చేయడం ద్వారానే మనిషి పరిపూర్ణుడగుటకు సాధ్యము. ఆత్మ దృష్టి కోణము నుండి మాత్రమే ఆయన మాట్లాడినట్లయితే, దేవుని కార్యము యొక్క ఈ స్థాయిని సంపూర్తి చేయడానికి ఎటువంటి అవకాశము ఉండదు. ఆయన మాట్లాడే కంఠ స్వరమును బట్టియే ఈ ప్రజలందరినీ పరిపూర్ణులనుగా చేయాలనే నిశ్చయతతో ఆయన ఉన్నాడని మీరు చూడవచ్చు. అందుచేత, పరిపూర్ణులవ్వాలని కోరుకునే ప్రతియొక్కరి కొరకు తీసుకునే మొదటి అడుగు ఏమై ఉండాలి? పైన చెప్పిన విషయాలను పరిగణనలోనికి తీసుకొని, మీరు తప్పకుండ దేవుని కార్యమును గురించి తెలుసుకోవాలి. ఈ రోజున ఒక క్రొత్త విధానము దేవుని కార్యములో ఆరంభించబడింది; యుగము మారిపోయింది, దేవుడు కార్యము చేసే విధానము కూడా మారిపోయింది. దేవుడు మాట్లాడే విధానము విభిన్నంగా ఉంది. ఈ రోజున ఆయన పని చేసే విధానము మారిపోవడం మాత్రమే కాదు గానీ, యుగము కూడా మారిపోయింది. ఇప్పుడు రాజ్య సంబంధమైన యుగము ఉంది. దీనిని దేవుణ్ణి ప్రేమించే యుగమని కూడా పిలువవచ్చు. ఇది వాక్యపు యుగమైన వెయ్యేండ్ల రాజ్యపు యుగమును ముందుగానే రుచి చూడడము లాంటింది, ఈ కాలములో దేవుడు మనిషి పరిపూర్ణము చేయడానికి అనేక విధాలుగా మాట్లాడుతాడు మరియు మనిషి ప్రతి అవసరతను తీర్చడానికి దేవుడు విభిన్నమైన కోణాలనుండి మాట్లాడుతాడు. వెయ్యేండ్ల పరిపాలనతో ఉండే రాజ్య యుగములోనికి ప్రవేశించుట కోసం మనిషిని పరిపూర్ణము చేయడానికి దేవుడు తన వాక్కులను ఉపయోగించుట ప్రారంభిస్తాడు, మనిషి అతని నిజ జీవితములోనికి ప్రవేశించునట్లు అనుమతించి, అతడిని సరియైన మార్గములోనికి నడిపిస్తాడు. దేవుని కార్యములోని కొంత అనుభవమును పొందిన తరువాత, దేవుని కార్యము మార్పు చెందదు గానీ, ఎడతెగకుండా అభివృద్ధి చెందుతుందని మరియు లోతైనదిగా ఉంటుందని మనిషి గ్రహిస్తాడు. ప్రజలు ఎంతో కాలము వరకు ఇటువంటి అనుభవము పొందిన తరువాత, కార్యము పదే పదే పునరావృతమవుతుంది, పదే పదే మారుతూ ఉంటుంది. అయితే, అది ఎంత మారినప్పటికీ మనుష్యులకు రక్షణ తీసుకొని వచ్చే దేవుని ఉద్దేశము నుండి మాత్రం అది ప్రక్కకు వెళ్ళిపోదు. పది వేల మార్పులు జరిగినప్పటికీ, దేవుని కార్యములోని నిజమైన ఉద్దేశము నుండి ప్రక్కకు వెళ్ళిపోదు. దేవుడు చేసే కార్యము విధానము మారుతుందన్న విషయముతో సంబంధము లేదు గానీ, ఈ కార్యము జీవము నుండి లేక సత్యము నుండి ప్రక్కకు వెళ్ళిపోదనే విషయము గ్రహించాలి. కార్యము జరిగించు విధానములో మార్పులు కలగడమనేది పని జరిగించు విధానములో స్వల్ప మార్పును కలిగియుంటుంది మరియు దేవుడు మాట్లాడే దృష్టికోణము మారుతుంది గానీ, దేవుని కార్యములోని కీలక ఉద్దేశములో ఎటువంటి మార్పులు ఉండవు. దేవుడు జరిగించు కార్యము విధానములోను మరియు ఆయన మాట్లాడే స్వరములో మార్పులు కలగడం అనేది గొప్ప ప్రభావమును సాధించడానికే జరిగాయి. మాట్లాడే స్వరములో మార్పు అనేది కార్యమునకు సంబంధించిన నియమములోను లేక ఉద్దేశములోను మార్పుగా ఉంటుందని అర్థం కాదు. జీవమును పొందుకునే దిశగా ప్రజలు దేవుని యందు నమ్మిక ఉంచుతారు; మీరు దేవుని యందు నమ్మిక ఉంచి, దేవుని జ్ఞానమును లేక సత్యమును పాటించకపోతే, జీవమును వెదకకపోతే దానిని దేవునిలో నమ్మిక ఉంచడమని అనరు! రాజుగా ఉండడానికి రాజ్యములోనికి ప్రవేశించాలనే నిజమైన కోరిక ఉందంటారా? జీవమును వెదకడం ద్వారా దేవుని కొరకు నిజమైన ప్రేమను కలిగియుండడం అనేదే వాస్తవిక జీవితము; సత్యమును ఆచరించి, వెంబడించడం అనేదే నిజమైన జీవితము. దేవుని మాటలను చదవడం, ఆ మాటలను అనుభవించడం ద్వారా పొందే నిజమైన అనుభవము ద్వారానే మీరు దేవుని జ్ఞానాన్ని గ్రహిస్తారు. దీనినే నిజంగా వెంబండించడం అని అంటారు.

ఇది రాజ్యపు యుగము. మీరు ఈ క్రొత్త యుగములోనికి ప్రవేశించారనేది మీరు దేవుని మాటలను ఆచరించే వాస్తవిక జీవితములోనికి ప్రవేశించారా లేదా అనే దాని మీద, ఆయన మాటలే మీ నిజ జీవితముగా మారాయా లేదా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. దేవుని మాటలు ప్రతి వ్యక్తికి తెలియజేయబడతాయి. తద్వారా, చివరిలో దేవుని వాక్కుల ప్రపంచములోనే ప్రజలందరూ జీవించవలసి ఉంటుంది. ఆయన వాక్కులుప్రతి ఒక్కరికీ జ్ఞానోదయమును కలుగజేస్తాయి మరియు ప్రతి ఒక్కరిని వెలిగిస్తాయి. ఈ సమయములో దేవుని మాటలను చదవడాన్ని నిర్లక్ష్యము చేసినట్లయితే, ఆయన మాటల విషయములో ఆసక్తిని కనపరచకపోయినట్లయితే, అప్పుడు అలాంటి ధోరణి అనేది మీ స్వభావము సరియైనది కాదని చూపిస్తుంది. మీరు ఈ వాక్యపు యుగములోనికి ప్రవేశించకపోయినట్లయితే, పరిశుద్ధాత్ముడు మీలో కార్యము చేయడు; మీరు ఈ యుగములోనికి ప్రవేశించినట్లయితే, ఆయన తన కార్యమును జరిగించుకుంటాడు. పరిశుద్ధాత్మ కార్యమును పొందే క్రమములో వాక్యపు యుగములో మీరు ఏమి చేస్తారు? ఈ యుగములో దేవుడు ప్రజల మధ్యన ఇక్కడ చెప్పబడిన వాస్తవ అంశాన్ని అనుసరిస్తాడు: దేవుని మాటల ప్రకారముగా ప్రతి ఒక్కరూ జీవించవలసి ఉంటుంది, సత్యాన్ని ఆచరణలో పెట్టాలి మరియు దేవుణ్ణి అమితంగా ప్రేమించాలి; ప్రజలందరూ తమ జీవితానికి దేవుని మాటలనే పునాదిగాను, తమ నిజ తత్వానికి ఆధారముగాను ఉపయోగించవలసి ఉంటుంది, దేవుణ్ణి పూజించే హృదయాలను కలిగియుండాలి; దేవుని మాటలను ఆచరణలో పెట్టి, జీవించేటప్పుడు మనిషి దేవునితోపాటు రాజ్యాధికారమును కలిగి ఉంటాడు. ఇటువంటి కార్యము దేవుని ద్వారా మాత్రమే పొందడానికి సాధ్యము. మీరు దేవుని మాటలను చదవకుండ ఉండగలరా? దేవుని మాటలను చదవకుండ ఉండలేమని చెప్పేవారు ఈ రోజుకి అనేకమంది ఉన్నారు. వారు ప్రతి రోజు దేవుని మాటలను తప్పకుండా చదువుతారు. ఒకవేళ, చదవడానికి సమయము అనుకూలించని సందర్భములో వారు దేవుని మాటలను వింటారు. అటువంటి అనుభూతిని పరిశుద్ధాత్ముడు ప్రజలకు అనుగ్రహిస్తాడు. ఈ విధంగా ఆరంభించి ఆయన ప్రజలను కదలిస్తాడు. ఈ విధంగా, ఆయన తన మాటల ద్వారా ప్రజలను ఏలుతాడు. తద్వారా వారు దేవుని మాటల ప్రపంచములోనికి ప్రవేశిస్తారు. దేవుని మాటలను తినకుండా, త్రాగకుండా ఒక రోజు గడిచినా సరే, మీకు చీకటిగాను మరియు దాహంగాను అనిపించి, మీరు నిలవబడని ఈ స్థితి మీరు పరిశుద్ధాత్ముని ద్వారా కదలించబడ్డారని మరియు ఆయన మీ నుండి వెళ్లిపోలేదని స్పష్టంగా చూపిస్తోంది. అప్పుడు మీరు దేవుని వాక్యపు ప్రపంచములో ఉన్నారని నిర్ధారించవచ్చును. ఏదిఏమైనప్పటికీ, దేవుని వాక్యాన్ని తిని, త్రాగకుండా ఉండిన ఒకటి లేక రెండు రోజుల తరువాత కూడా మీకు దాహము లేకపోతే, మీరు కదలించబడకపోయినట్లయితే, మీ నుండి పరిశుద్ధాత్ముడు వెళ్లిపోయాడని ఆ పరిస్థితి చూపిస్తోంది. ఈ మాటలకు అర్థము ఏమిటంటే, మీలోని స్వభావము సరిగ్గా లేదని అర్థం; మీరు దేవుని వాక్యపు యుగములోనికి ప్రవేశించకపోయినట్లయితే, వెనక్కి జారిపోయిన వారిలో మీరూ ఒకరిగా ఉంటారు. ప్రజలను పరిపాలించడానికి దేవుడు తన మాటలను ఉపయోగించుకుంటాడు; మీరు దేవుని మాటలను తిని, త్రాగుచున్నట్లయితే మీరు ఆనందంగా ఉంటారు, అలా దేవుని మాటలను తిని త్రాగకపోయినట్లయితే మీరు అనుసరించడానికి ఎటువంటి మార్గము ఉండదు. దేవుని వాక్కులనేవి ప్రజలకు ఆహారముగాను మరియు వారిని నడిపించే బలముగాను మారిపోయాయి. “అందుకాయన, మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదుగాని దేవుని నోటనుండి వచ్చు ప్రతిమాటవలనను జీవించును అని వ్రాయబడియున్నదనెను” అని (మత్తయి 4:4) బైబిలు చెప్పుచున్నది. ఈ రోజున దేవుడు ఈ కార్యమును సంపూర్తి చేయనున్నాడు మరియు ఆయన ఈ వాస్తవ సంగతిని మీలో పూర్తి చేయనున్నాడు. గతములోని ప్రజలు దేవుని మాటలను చదవకుండానే ఆహారమును తిని, త్రాగి పనిచేయగలిగారు కానీ, నేటి కాలములో అటువంటి పరిస్థితి ఎందుకు లేదు? ఎందుకంటే, ఈ యుగములో దేవుడు తన ప్రజలను పరిపాలించడానికి తన మాటలను ఉపయోగించుచున్నాడు. దేవుని మాటల ద్వారా మనిషి తీర్పు తీర్చబడి, పరిపూర్ణుడవుచున్నాడు, ఆతరువాత చివరిగా రాజ్యములోనికి చేర్చబడుచున్నాడు. దేవుని మాటలు మాత్రమే మనిషి జీవితానికి కావలసినవన్నిటిని అందిస్తాయి మరియు దేవుని మాటలు మాత్రమే మనిషికి వెలుగును, అనుసరించడానికి మార్గమును అనుగ్రహిస్తాయి, ముఖ్యంగా రాజ్యపు యుగములో ఇవి అనుగ్రహించబడుతాయి. మీరు దేవుని మాటలకు దూరము కానంత కాలము, ప్రతి రోజు ఆయన మాటలను తిని, త్రాగినంత కాలము, దేవుడు మిమ్మల్ని పరిపూర్ణులనుగా చేస్తూనే ఉంటాడు.

జీవితమును అనుసరించడమనంటే, పరుగులు తీస్తూ జీవించడం అని అర్థం కాదు; జీవితములో అభివృద్ధి అనేది ఒకటి రోజు లేక రెండు రోజుల్లో రాదు. దేవుని కార్యము అనేది చాలా సాధారణముగాను మరియు ఆచరణాత్మకముగాను ఉంటుంది. ఇది తప్పనిసరిగా అంతర్లీనముగా జరిగించబడే ప్రక్రియ. యేసు తన సిలువ కార్యమును సంపూర్తి చేయడానికి ఆయనకు ముప్పై మూడున్నర సంవత్సరాలు పట్టింది. అయితే, మనిషిని శుద్ధీకరణ చేయాలంటే, అతని జీవితాన్ని పూర్తిగా మార్చివేయాలంటే, అలాంటి ఒక గొప్ప కార్యానికి మరింత ఎక్కువ సమయం పట్టదా? దేవుణ్ణి కనుబరిచే ఒక సాధారణ మనిషిని తయారు చేయడమంటే అంత సులభమైన విషయమేమీ కాదు. మరీ ముఖ్యంగా, గొప్ప ఎరుపు డ్రాగన్ దేశములో పుట్టి, తక్కువ సామర్థ్యముతో, దేవుని మాటలను మరియు ఆయన కార్యమును అర్థం చేసుకోవడానికి ఎక్కువ కాలము తీసుకునే ప్రజలందరికీ ఇది చాలా కష్టంగా ఉంటుంది. అందుచేత, ఫలితాలను చూడడానికి అసహనము చూపకండి. మీరు దేవుని మాటలను తిని, త్రాగుతూ ఉండడములో చురుకుగా ఉండాలి మరియు దేవుని వాక్యాల విషయమై ఎక్కువ ప్రయాసను కనుపరచాలి. మీరు ఆయన మాటలను చదివి ముగించినప్పుడు, మీరు తప్పకుండ వాటిని ఆచరణలో పెట్టగలగాలి, ఆయన జ్ఞానములోను, ఆలోచనలోను, వివేకములోను మరియు దేవుని వాక్యపు జ్ఞానములో ఎదగాలి. దీని ద్వారా మీరు మీకు తెలియకుండానే మార్పు చెందియుంటారు. మీరు ప్రధానంగా దేవుని వాక్యాని తిని, త్రాగాలని, ఆయన మాటలను చదవాలని, వాటిని తెలుసుకోవాలని, వాటిని అనుభవించాలని మరియు వాటిని ఆచరణలో పెట్టాలనే నిర్ణయము తీసుకోగలిగితే, మీకు తెలియకుండానే మీరు పరిపక్వతలోనికి వస్తారు. దేవుని మాటలను చదివిన తరువాత వాటిని ఆచరణలో పెట్టలేకపోవుచున్నామని చెప్పేవారు ఎందరో ఉన్నారు. మీకున్న హడావిడి ఏమిటి? మీరు ఒక స్థాయికి చేరుకున్న తరువాత, మీరు ఆయన మాటలను ఆచరణలో పెట్టే స్థితికి వస్తారు. నాలుగు లేక ఐదేళ్ల పిల్లలు తమ తల్లిదండ్రులకు సహకరించలేకపోవుచున్నారనో, వారిని గౌరవించలేకపోవుచున్నారనో చెప్పుచున్నారంటే మీ స్థాయి ఎంత గొప్పగా ఉందో మీరే తెలుసుకోవాలి. మీరు ఆచరణలో పెట్టగలిగిన ప్రతి దానిని ఆచరణలో పెట్టండి మరియు దేవుని కార్య నిర్వహణను అడ్డగించే ప్రతి ఒక్కరినీ ప్రక్కన పెట్టండి. కేవలము దేవుని వాక్యాన్ని తిని, త్రాగండి మరియు ఇప్పటినుండి ఈ నియమాన్ని మాత్రమే పాటించండి. దిగులు చెందకండి, దేవుడు మిమ్మల్ని పరిపూర్ణులనుగా చేయునంతవరకు స్వల్ప కాలము ఓర్పు కలిగియుండండి. దానిని గురించి లోతుగా ఆలోచించవద్దు. దేవుని మాటలు మీ వద్దకు వచ్చే కొలది, వాటిని తిని త్రాగుతూ ఉండండి, దేవుడు ఒకానొక సమయములో మిమ్మల్ని సంపూర్ణులనుగా చేస్తాడు. ఏది ఏమైనా, ఒక నియమము ద్వారా మీరు తప్పకుండా దేవుని మాటలను తిని, త్రాగాలి. ఈ పనిని గ్రుడ్డిగా చేయవద్దు. మరొక విధంగా చెప్పాలంటే, దేవుని మాటలను తిని, త్రాగడములో మీరు తెలుసుకోవాలనే మాటల కోసం వెదకండి, అంటే, దర్శనాలకు సంబంధించిన వాటి కొరకు వెదకండి. మరొక విధంగా చెప్పాలంటే, మీరు ఎందులోకైతే ప్రవేశించాలనుకున్నారో, ఏ మాటలనైతే ఆచరించాలనుకున్నారో ఆ మాటల కొరకు వెదకండి. ఏదైనా ఒక విషయము జ్ఞానానికి సంబంధము కలిగియుంటుంది మరియు ఆ విషయములోనికి ప్రవేశించడానికి సంబంధము కలిగియుంటుంది. ఆ రెండింటిని మీరు ఒక్కసారి అర్థము చేసుకున్నారంటే, అనగా ఏమీ తెలుసుకోవాలో మరియు ఏమి ఆచరించాలో తెలుసుకున్నప్పుడు దేవుని మాటలను ఎలా తినాలో, ఎలా త్రాగాలో మీరు తెలుసుకుంటారు.

ముందుకు సాగుతూ ఉండగా, దేవుని మాటలను గూర్చి మాట్లాడుట అనేది మీరు మాట్లాడుటకు ఒక నియమంగా ఉండాలి. సర్వసాధారణంగా, మనుష్యులుగా మీరు కూడి వచ్చినప్పుడు, మీరు దేవుని మాటలను గూర్చి, మీ సంభాషణలలో ఆయన మాటలనే అంశాలుగా తీసుకొని, ఈ మాటల విషయమై మీకు ఏమి తెలుసో దానిని గురించే మాట్లాడుతూ, ఆ మాటలను ఎలా ఆచరణలో పెట్టాలనే దానిని గూర్చి మరియు పరిశుద్ధాత్ముడు ఎలా పని చేస్తాడనే విషయాన్ని గూర్చి మాట్లాడే సహవాసముగా మీరు ఉండిపోవాలి. దేవుని మాటలతో మీరు సహవాసము చేయునంత కాలము పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని వెలిగిస్తాడు. దేవుని వాక్కుల ప్రపంచాన్ని సంపాదించుకోవాలంటే మనిషి సహకారము తప్పనిసరిగా ఉండాలి. మీరు ఇందులోనికి ప్రవేశించకపోతే, దేవుడు పని చేయడానికి ఎటువంటి అవకాశము ఉండదు; మీరు ఆయన మాటలను గూర్చి మాట్లాడక, మౌనంగా ఉండిపోతే, ఆయన మిమ్మల్ని ఏ విధంగానూ వెలిగించలేడు. మీకు ఖాళీ సమయము దొరికిన ప్రతిసారి ఆయన మాటలను గూర్చి మాట్లాడండి గానీ, ఊరకనే పనికిరాని కబుర్లు చెప్పుకుంటూ కాలాక్షేపం చేయకండి! మీ జీవితము దేవుని మాటలతో నింపబడును కాబట్టి, అప్పుడు మాత్రమే మీరు భక్తిగల విశ్వాసిగా ఉండటానికి సాధ్యమగును. మీరు చేసే సహవాసము భక్తి లేనిదిగా ఉందా లేదా అనేదానితో సంబంధము లేదు. లోతైన స్థితి లేకుండా లోతు అనేది ఉండదు. తప్పకుండ ప్రక్రియ అనేది ఉండాలి. మీరు తీసుకునే తర్ఫీదు ద్వారా పరిశుద్ధాత్ముడు మీ మీద కలిగియున్న వెలుగును, దేవుని వాక్కులను ప్రభావితంగా ఎలా తినాలో ఎలా త్రాగాలో అనే సంగతిని గ్రహించగలుగుతారు. ఈ తర్ఫీదు కాలమైన తరువాత, మీరు దేవుని వాక్కుల ప్రపంచములోనికి ప్రవేశిస్తారు. మీరు సహకరించడానికి సంకల్పము చేసుకోవడం ద్వారా మాత్రమే మీరు పరిశుద్ధాత్మ కార్యము పొందుకోగలుగుతారు.

దేవుని మాటలను తిని, త్రాగే నియమాలలో ఒకటి జ్ఞానానికి సంబంధించింది మరియు మరొకటి ప్రవేశానికి సంబంధించింది. మీరు ఎటువంటి మాటలు తెలుసుకోవాలి? దర్శనాలకు సంబంధించిన మాటలనే మీరు తెలుసుకోవాలి (అంటే, ఇప్పుడు దేవుని కార్యము ప్రవేశించిన యుగానికి సంబంధించిన మాటలను, ఇప్పుడు దేవుడు శరీరధారిగా వచ్చి, సాధించాలనుకున్న మాటలను, మొదలగువాటిని తెలుసుకోవాలి; దర్శనాలకు సంబంధించిన మాటలను తెలుసుకోవాలి). మనిషి ప్రవేశించవలసిన మార్గము అంటే ఏమిటి? ఇది మనిషి ఆచరించి, అందులోనికి ప్రవేశించే దేవుని మాటలను సూచించుచున్నది. పైన దేవుని మాటలను తిని, త్రాగమని రెండు విషయాలు చెప్పబడియున్నవి. ఇప్పటి నుండి ఈ విధంగా దేవుని మాటలను తిని, త్రాగాలి. మీరు దర్శనాలకు సంబంధించి ఆయన మాటలను స్పష్టంగా అర్థము చేసికొనినట్లయితే, ఎల్లప్పుడూ వాటిని చదవవలసిన అవసరము లేదు. దేవుని వైపుకు మీ హృదయాన్ని ఎలా తిప్పాలి, దేవుని ఎదుట మీ హృదయాన్ని ఎలా విప్పాలి మరియు శరీరాన్ని ఎలా త్యజించాలనే విషయాలన్నీ ఈ మార్గములోనికి ప్రవేశించినప్పుడు దేవుని మాటలను ఎక్కువ తిని, త్రాగడములో ప్రాథమిక ప్రాముఖ్యతను కలిగియుంటాయి. అందుచేత, మీరు వీటిని తప్పకుండ ఆచరించాలి. దేవుని మాటలను ఎలా తిని, త్రాగాలో తెలియకుండా నిజమైన సహవాసము చేయడమనేది అసాధ్యము. మీకు దేవుని మాటలను తిని, త్రాగడం అర్థమైపోతే, ముఖ్య విషయాన్ని మీరు అర్థము చేసుకున్నట్లయితే మీకు సహవాసము చాలా సులువుగా ఉంటుంది. అప్పుడు ఎటువంటి సమస్య వచ్చినప్పటికీ మీరు సహవాసము చేయగలుగుతారు మరియు నిజ తత్వాన్ని అర్థము చేసుకుంటారు. దేవుని మాటలతో సహవాసము చేస్తున్నప్పుడు, మీకు నిజ అనుభవము అనేది లేకపోతే, మీకు ముఖ్యాంశము అర్థము కాలేదన్నమాట. అంటే, దీనినిబట్టి మీకు దేవుని మాటలను ఎలా తినాలో, ఎలా త్రాగాలో అర్థము కాలేదని తెలుస్తోంది. కొందరికి దేవుని మాటలను చదవడమంటేనే విసుగు, ఇలాగుండడం సరియైన స్థితి కాదు. సరియైన స్థితిని కలిగియున్నవారు దేవుని మాటలను చదవడానికి ఎప్పుడూ విసుగు చెందరు, ఆ మాటల కొరకు ఎల్లప్పుడూ దాహముగొని ఉంటారు మరియు దేవుని మాటలను మంచివని ఎల్లప్పుడు చెబుతుంటారు. ఈ విధంగానే ఒకరు నిజంగా దేవుని మాటలను తిని, త్రాగడములోనికి ప్రవేశిస్తారు. దేవుని మాటలు ఆచరణాత్మకమైనవని మరియు ఖచ్చితంగా మనిషి ఈ మాటల మార్గములోనికి ప్రవేశించాలని మీరు భావించినప్పుడు; ఈ మాటలు మనిషికి ఎంతగానో సహకరిస్తాయని మరియు ప్రయోజనముకరముగా ఉంటాయని మీరు భావించినప్పుడు మరియు మనిషి జీవితానికి ఆధారమైయున్నవని మీరు భావించినప్పుడు, అలాంటి ఒక భావనను పరిశుద్ధాత్ముడే మీకు ఇచ్చుచున్నాడు. ఆవిధంగా పరిశుద్ధాత్ముడే మిమ్ములను కదిలించుచున్నాడు. దేవుడు మీ నుండి దూరమవ్వలేదని, పరిశుద్ధాత్ముడు మీలో పనిచేయుచున్నాడని ఈ కార్యము నిరూపించుచున్నది. దేవుడు ఎల్లప్పుడూ మాట్లాడుతూ ఉండుటను చూచి విసిగిపోతుంటారు, ఆయన మాటలను చదివినా చదవకపోయినా ఎటువంటి పరిణామాలు ఉండవని కొంతమంది ఆలోచిస్తుంటారు గానీ అది సాధారణ స్థితి కాదు. నిజతత్వములోనికి ప్రవేశించడానికి వారికి మనసు లేదు మరియు అటువంటి ప్రజలు దాహము గొనరు లేక పరిపూర్ణులమవుదామనే ప్రాముఖ్యత మీద దృష్టి సారించరు. దేవుని మాటల కొరకు దాహముగొనని స్థితిలో ఉన్నట్లుగా మీకు ఎప్పుడైనా అనిపిస్తే, అప్పుడు మీరు సాధారణ స్థితిలో లేరని అర్థం. గతములో దేవుడు మీకు దూరమయ్యాడనే విషయమును తెలుసుకొనుటకు మీలో మీరు సమాధానము కలిగియున్నారా లేదా, మీరు ఆనందమును అనుభవించారా లేదా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. మీరు దేవుని మాటల కొరకు దాహముగొనుచున్నారా లేదా, ఆయన మాటలు మీకు నిజతత్వముగా ఉన్నాయా లేదా, మీరు నమ్మకంగా ఉన్నారా లేదా, మీరు దేవుని కొరకు చేయగలిగినవన్ని చేస్తున్నారా లేదా అనేవే ఇప్పుడు మన ముందున్న ముఖ్య విషయాలు. మరొక విధంగా చెప్పాలంటే, దేవుని మాటల వాస్తవికత ద్వారానే మనిషి తీర్పు తీర్చబడతాడు. దేవుడు మనుష్యులందరిని తన మాటల ద్వారానే నడిపిస్తాడు. మీరు వాటిని చదవడానికి ఇష్టపడినట్లయితే, ఆయన మిమ్మల్ని వెలిగిస్తాడు. మీరు ఆయన మాటలను చదవడానికి ఇష్టపడకపోయినట్లయితే, ఆయన మిమ్మల్ని వెలిగించడు. నీతి కొరకు ఆకలిదప్పులు గలవారిని మరియు దేవుడిని వెదకువారిని ఆయన వెలిగిస్తాడు. కొంతమంది దేవుని మాటలను చదివినప్పటికీ దేవుడు వారిని వెలిగించడని కొంతమంది చెబుతుంటారు. మీరు దేవుని మాటలను ఏ విధంగా చదువుచున్నారు? గుడ్డెద్దు చేలో పడినట్లుగా దేవుని మాటలను చదువుకుంటూ వెళ్ళిపోతే, ఆ మాటలకు నిజ జీవితములో ఎటువంటి ప్రాముఖ్యతను ఇవ్వకపోతే, దేవుడు మిమ్మల్ని ఎలా వెలిగిస్తాడు? దేవుని మాటల నిధిని కలిగియుండని వ్యక్తి దేవునిచేత ఎలా పరిపూర్ణుడవుతాడు? మీరు దేవుని మాటల నిధిని కలిగియుండపోతే మీలో సత్యముండదు లేక నిజ స్థితి ఉండదు. ఆయన మాటల నిధి మీ దగ్గర ఉన్నట్లయితే, అప్పుడు మీరు సత్యాన్ని ఆచరణలో పెట్టి, ఆచరించగలరు, అప్పుడు మాత్రమే మీరు వాస్తవిక స్థితిని కలిగియుంటారు. అందుచేతనే, మీరు మీ పని బాటలలో ఎంతగా నిమగ్నమై ఉన్నప్పటికీ, లేకపోయినప్పటికీ, పరిస్థితులు అనుకూలించినప్పటికీ, అనుకూలించకపోయినప్పటికీ, మీరు అలసిపోయినప్పటికీ, అలసిపోకపోయినప్పటికీ, ఎల్లప్పుడూ దేవుని మాటలను తిని, త్రాగాలి. మొత్తం మీద, దేవుని మాటలు మనిషి అస్తిత్వానికి పునాదియైయున్నవి. ఆయన మాటల నుండి ఎవరు తప్పించుకోలేరు, అయితే, వారు రోజుకు మూడు పూటల భోజనము ఎలా తింటారో అలాగే ఆయన మాటలను కూడా తినాలి. దేవుని ద్వారా మెప్పు పొందడం మరియు పరిపూర్ణులవడం సులభమేనా? ప్రస్తుతం మీకు అర్థమైనప్పటికీ, అర్థము కాకపోయినప్పటికీ, దేవుని కార్యమును గమనించినప్పటికీ, గమనించకపోయినప్పటికీ, సాధ్యమైనంతవరకు దేవుని మాటలను తిని, త్రాగాలి. ఇది క్రియాశీలాత్మకమైన మార్గములో ప్రవేశించడమని చెప్పవచ్చు. దేవుని మాటలను చదివిన తరువాత, ఆమార్గములోనికి ప్రవేశించిన తరువాత, వాటిని ఆచరించడానికి త్వరపడండి. మీరు ఆచరించలేని వాటిని ప్రక్కన పెట్టండి. ఆరంభములో మీరు అర్థము చేసుకోలేని దేవుని మాటలు చాలా ఉంటాయి, అయితే రెండు లేక మూడు నెలలైన తరువాత, కొన్నిమార్లు ఒక సంవత్సరమైన తరువాత ఆయన మాటలను చదివినప్పుడు వాటిని మీరు అర్థము చేసుకుంటారు. ఇలా ఎందుకు జరుగుతుంది? ఇలా ఎందుకు జరుగుతుందంటే, దేవుడు ప్రజలను రెండు లేక మూడు రోజుల్లోనే పరిపూర్ణులనుగా చేయలేడు. ఎక్కువ శాతం, మీరు ఆయన మాటలను చదివినప్పుడు, అప్పటికప్పుడే మీరు ఆ మాటలను అర్థము చేసుకొలేరు. ఆ సమయములో మీకు అక్కడున్న వాక్యము తప్ప వేరే ఏమి కనిపించకపోవచ్చు; వాటిని మీరు అర్థము చేసికొనుటకు ముందుగా కొంత సమయము వాటిని అనుభవించాలి. దేవుడు చాలా ఎక్కువగా మాట్లాడియున్నాడు, మీరు ఆయన మాటలను తిని, త్రాగడానికి మీ వంతు కృషి మీరు చేయాలి. అప్పుడు మీకు తెలియకుండానే మీరు ఆ మాటలను అర్థము చేసుకుంటారు, అప్పుడు మీకు తెలియకుండానే పరిశుద్ధాత్ముడు మిమ్ములను వెలిగిస్తాడు. పరిశుద్ధాత్ముడు ఒక మనిషిని వెలిగించినప్పుడు, ఈ కార్యము ఆ మనిషి ప్రమేయం లేకుండానే జరిగిపోతుంది. మీరు దేవుని మాటల కొరకు దాహముగొని వెదకడానికి ఇష్టపడినప్పుడే ఆయన మిమ్ములను వెలిగించి, నడిపిస్తాడు. పరిశుద్ధాత్ముడు పని చేసే ఈ సూత్రము మీరు తిని, త్రాగే దేవుని మాటలకు కేంద్రమై ఉంటుంది. దేవుని వాక్యాలకు ప్రాధాన్యత ఇవ్వని వారందరూ దేవుని మాటలపట్ల విభిన్నమైన ధోరణిని కలిగియుంటారు. ఇటువంటివారిలో నిజాయితీ ఉండదు. ఇటువంటి వ్యక్తిలో పరిశుద్ధాత్ముని కార్యముగానీ, ఆయన వెలిగించిన జ్ఞానోదయముగానీ కనిపించదు. ఇలాంటి ప్రజలందరూ శ్రీ నాన్గూ గారి ఉపమానము[ఎ] వలె నిజమైన అర్హతలు లేకుండా నటిస్తుంటారు.

మీ నిజ జీవితములో దేవుని మాటలు లేకుండా మీరు నిజాయితితో కూడిన స్థాయిని కలిగియుండలేరు. అలిసిపోయే సమయము వచ్చినప్పుడు, మీరు ఖచ్చితంగా పడిపోతారు, అప్పుడు మీకున్న నిజ స్వభావము బయటకు పడుతుంది. అయితే, నిజాయితితో కూడిన మార్గములోనికి ప్రవేశించాలని నిరంతరం కోరుకునేవారు, తమకు శ్రమలు వచ్చినప్పటికీ, దేవుని కార్యములోని ఉద్దేశాన్ని తెలుసుకుంటారు. మనస్సాక్షి కలిగినవారు, దేవుని కొరకు తృష్ణ కలిగినవారు దేవుడు చూపించిన ప్రేమ కొరకు ఆయనకు తిరిగి చెల్లించడానికి ఆచరణాత్మకమైన క్రియను చేపట్టాలి. నిజాయితీ లేనివారందరూ ఎన్నిక చేయబడని చిన్న చిన్న విషయాలలో కూడా నిలువలేరు. నిజాయితీగల స్వభావమున్నవారికి మరియు నిజాయితీగల స్వభావము లేనివారికి ఉన్నటువంటి వ్యత్యాసము ఇదే. ఇలా ఎందుకుంటుంది? చాలామంది దేవుని మాటలను తిని, త్రాగినప్పటికీ, కొంతమంది మాత్రమే శ్రమలలో స్థిరముగా నిలువబడుతారు, మరికొంతమంది శ్రమలలో నిలువలేక పారిపోతారు. ఈ వ్యత్యాసానికి స్పష్టమైన తేడా ఏమిటంటే, ఉండవలసిన నిజమైన స్థాయి లేకపోవడమే; వారు నిజమైన సేవ చేయడానికి వారిలో దేవుని మాటలు లేకపోవడమే. దేవుని మాటలు వారిలో వేళ్లూనుకోలేదు. వారు అలసినపోయిన తరువాత, వారు తమ మార్గము యొక్క అంతానికి చేరుకున్నారు. అయితే కొంతమంది వారి శ్రమలలో సహితము ఎలా నిలబడ్డారు? ఎందుకంటే, వారు సత్యాన్ని అర్థము చేసుకున్నారు మరియు దర్శనము కలిగియున్నారు. వారు దేవుని చిత్తాన్ని మరియు ఆయనకు కావలసిన అవసరతలను అర్థము చేసుకున్నారు. అందుచేతనే, వారు శ్రమలలో సహితము నిలబడ్డారు. ఇదే నిజమైన స్థితి. ఇదే నిజమైన జీవితము. కొంతమంది దేవుని మాటలను చదువుతారు గానీ వాటిని ఆచరణలో పెట్టరు. నిజ స్థితి లేకుండా సేవ చేయడానికి దేవుని మాటలను తెలియనివారు శ్రమలలో ఎంత మాత్రము నిలవలేరు.

దేవుని మాటలు మీ వద్దకు వచ్చినప్పుడు, మీరు వాటిని తక్షణమే పొందుకొని, వాటిని తిని త్రాగాలి. మీరు వాటిని ఎంతగా అర్థము చేసుకున్నారన్న విషయముతో సంబంధములేదు, ఆయన మాటలను అభ్యసించడం, ఆ మాటలను తెలుసుకోవడం, ఆ మాటలను తిని త్రాగుతూ ఉండడమే మీరు తెలుసుకోవలసిన అతి ప్రాముఖ్యమైన విషయం. ఇదియే మీరు చేయవలసిన పనియైయున్నది. మీ స్థాయి లేక మీ స్థితి ఎంత గొప్పగా మారినప్పటికీ పట్టించుకోవద్దు; మీరు కేవలము ఆయన మాటలను తిని, త్రాగడము విషయమై మీ దృష్టిని కేంద్రీకరించండి. ఈ విధంగానే ఒక మనిషి సహకరించాలి. మీ ఆధ్యాత్మిక జీవితము ముఖ్యంగా దేవుని మాటలను తిని, త్రాగే నిజ జీవితములోనికి ప్రవేశించడానికి మరియు వాటిని ఆచరించే జీవితములోనికి ప్రవేశించడానికి ప్రయత్నించడమే. ఇది కాకుండా మీరు వేరే విషయాలను పట్టించుకోకూడదు. సంఘ నాయకులు వారి సహోదరి సహోదరులందరిని నడిపించగలగాలి. తద్వారా, వారు దేవుని మాటలను ఎలా తిని, త్రాగాలో తెలుసుకుంటారు. ఇలాంటి బాధ్యతను సంఘములో ప్రతి యొక్క నాయకుడు తీసుకోవాలి. వారు పెద్దలైనా, చిన్నలైనా, ప్రతియొక్కరూ దేవుని మాటలను తిని, త్రాగడమును ప్రాధాన్యతగా ఎంచాలి మరియు వారి హృదయాలలో ఆయన మాటలు ముద్రించబడాలి. ఇటువంటి నిజ జీవితములోనికి ప్రవేశించడమునే రాజ్యపు యుగములోనికి ప్రవేశించడం అని అంటారు. ఈ రోజున చాలామంది దేవుని మాటలను తిని, త్రాగకుండా జీవించలేమని భావిస్తుంటారు, కాలానికి సంబంధము లేకుండా ఆయన మాటలు ఎల్లప్పుడూ తాజాగా ఉంటాయని భావిస్తుంటారు. అంటే, వారు సరియైన మార్గమును ఏర్పాటు చేసుకొనుట ఆరంభించారని అర్థము. మనిషి అవసరతలను తీర్చడానికి, కార్యమును జరిగించడానికి దేవుడు తన వాక్యములను ఉపయోగించుకుంటాడు. ప్రతియొక్కరు దేవుని మాటల కొరకు దాహముగొని, ఆరాటపడినప్పుడే మానవాళి ఆయన వాక్యముల ప్రపంచములోనికి ప్రవేశిస్తుంది.

దేవుడు చాలా గొప్ప వాక్యములు చెప్పాడు. అందులో మీరు ఎంత తెలుసుకున్నారు? ఆ మాటల ప్రపంచములోనికి మీరు ఎంతగా ప్రవేశించారు? దేవుని మాటల ప్రపంచములోనికి ప్రవేశించే దిశగా సంఘ నాయకుడు తన సహోదరి సహోదరులను నడిపించకపోయినట్లయితే, వారు వారి కర్తవ్యాన్ని నిర్లక్ష్యము చేస్తారు మరియు వారి బాధ్యతలను నెరవేర్చడములో విఫలమైపోతారు! మీరు దేవుని మాటలను అర్థము చేసుకునే స్థితి గంభీరంగా ఉందా లేదా అనే దానితో సంబంధము లేకుండా, మీరు అర్థము చేసుకునే స్థాయితో సంబంధము లేకుండా మీరు తప్పకుండ ఆయన మాటలను ఎలా తిని, త్రాగాలో తెలుసుకోవాలి, మీరు ఆయన మాటల విషయమై శ్రద్ధ చూపాలి మరియు దేవుని మాటలను తిని, త్రాగడము యొక్క ప్రాముఖ్యతను అర్థము చేసుకోవాలి. దేవుడు ఎన్నో వాక్యములను పలికాడు, మీరు ఆయన మాటలను తిని త్రాగకపొతే, లేక ఆయన మాటలను వెదకకపోతే, లేక ఆయన మాటలను ఆచరించకపోతే, మీరు ఆయన యందు విశ్వాసముంచలేదని అర్థము. మీరు దేవుని యందు విశ్వాసముంచినట్లయితే, మీరు తప్పకుండ ఆయన మాటలను తిని త్రాగాలి, ఆయన మాటలను అనుభవించాలి, ఆయన మాటల ప్రకారముగా జీవించాలి. దీనిని మాత్రమే దేవుని యందు విశ్వాసం ఉంచడం అని అంటారు! దేవుని యందు విశ్వసముంచామని మీ నోటితో ఒప్పుకొని, ఆయన మాటలను ఆచరించని స్థితిలో ఉన్నట్లయితే, లేక నిజ జీవితాన్ని కలిగి జీవించకపోయినట్లయితే, దానిని దేవుణ్ణి విశ్వసించడం అని అనరు. అలాంటప్పుడు దానిని “ఆకలిని తీర్చుకోవడానికి రొట్టెను వెదకడం” అని అంటారు. జీవితములో ఇసుమంతైనా నిజ తత్వము అనేదే లేకుండా గొప్ప గొప్ప సాక్ష్యాలు, పనికిరాని విషయాలు చెబుతున్నారు: ఇలా చేయడము వలన మీరు దేవుని యందు విశ్వాసము కలిగియున్నారని నిరూపించలేరు మరియు మీరు దేవునియందు విశ్వాసముంచే గొప్ప మార్గాన్ని గ్రహించలేదని స్పష్టంగా చెప్పవచ్చు. సాధ్యమైనన్ని దేవుని మాటలను మీరు ఎందుకు తిని త్రాగాలి? మీరు దేవుని మాటలను తిని త్రాగకుండ, కేవలము పరలోకానికి ఎక్కిపోవాలని ఇష్టపడితే, దానిని దేవుని యందు విశ్వాసముంచడమని అంటారా? దేవుని యందు విశ్వాసముంచే వ్యక్తి తీసుకోవలసిన మొదటి మెట్టు ఏమిటి? ఎటువంటి మార్గములో మనిషిని దేవుడు పరిపూర్ణునిగా చేస్తాడు? దేవుని మాటలను తిని త్రాగకుండగ మీరు పరిపూర్ణులవుతారా? మీరు నిజంగా జీవించడానికి దేవుని మాటలు లేకుండా రాజ్యపు వ్యక్తిగా పరిగణించబడగలరా? ఖచ్చితంగా దేవుని యందు విశ్వాసముంచడం అని అంటే ఏమిటి? దేవుని యందు విశ్వాసముంచినవారు తుదకు బయట ప్రపంచములో కూడా గొప్పగా ప్రవర్తించాలి; అన్నింటికంటే మిన్నగా దేవుని మాటలను కలిగి జీవించాలి. ఎలాంటి పరిస్థితిలోనైనా, మీరు దేవుని మాటల నుండి దూరమైపోకూడదు. దేవుని గురించి తెలుసుకోవడం మరియు ఆయన ఉద్దేశాలను నెరవేర్చడం అనేది ఆయన మాటల ద్వారానే జరగాలి. భవిష్యత్తులో ప్రతి దేశం, ప్రతి శాఖ, ప్రతి భక్తి, ప్రతి ప్రాంతం దేవుని మాటల ద్వారానే జయించబడతాయి. దేవుడు నేరుగా మాట్లాడుతాడు మరియు ప్రతియొక్కరూ తమ చేతులలో దేవుని వాక్యమును పట్టుకుంటారు, అప్పుడు మనుష్యులందరూ పరిపూర్ణులవుతారు. లోపల, వెలుపల, అంతటా దేవుని వాక్యాలు వ్యాపిస్తాయి: మనుష్యులందరూ తమ నోళ్ళతో దేవుని మాటలు పలుకుతారు, దేవుని మాటల ప్రకారంగానే జీవిస్తారు, దేవుని మాటలను తమలో భద్రపరుచుకుంటారు మరియు తమ అంతరంగములోను బహిరంగముగాను దేవుని మాటలపైన నిలిచి ఉంటారు. ఈ విధంగా మనుష్యులందరూ పరిపూర్ణత చెందుతారు. ఎవరైతే దేవుని ఉద్దేశాలను నెరవేర్చి, ఆయనకు సాక్ష్యులుగా నిలుస్తారో వారే దేవుని మాటలను కలిగి నిజంగా బ్రతుకుచున్నవారని అర్థం.

వాక్యపు యుగములోనికి లేక వెయ్యేండ్ల పరిపాలన రాజ్యపు యుగములోనికి ప్రవేశించడం అనే కార్యము ఈ రోజున ముగించబడుచున్నది. ఇప్పటి నుండి దేవుని మాటలను గూర్చి చేసే సహవాసములో నిమగ్నమై ఉండడమును అభ్యాసము చేయాలి. దేవుని మాటలను తిని త్రాగడము వలన, ఆయన మాటలను అనుభవించడము వలన మీరు ఆయన మాటల ప్రకారముగా జీవించగలుగుతారు. ఇతరులను ఒప్పించే క్రమములో మీరు తప్పకుండ కొంత ఆచరణాత్మకమైన అనుభవాన్ని గడించాలి. మీరు దేవుని మాటల ప్రకారముగా జీవించకపోతే, మీరెవరూ ఒప్పించబడరు! దేవుడు వాడుకున్న ప్రతియొక్కరూ దేవుని మాటల ప్రకారంగా జీవించగలిగేవారే. ఇటువంటి నిజ జీవితాన్ని, దేవుని కొరకైన సాక్ష్యాన్ని మీరు కలిగియుండకపోతే పరిశుద్ధాత్ముడు మీలో పని చేయలేదని, మీరు ఇంకా పరిపూర్ణులవలేదని స్పష్టంగా చూపిస్తోంది. ఇదే దేవుని మాటల యొక్క ప్రాముఖ్యత. దేవుని మాటల కొరకు దాహముగొనే హృదయము మీకుందా? దేవుని మాటల కొరకు దాహముగొనువారందరూ సత్యము కొరకు దాహము కలిగియుంటారు. ఇలాంటివారే దేవుని చేత ఆశీర్వదించబడతారు. భవిష్యత్తులో దేవుడు శాఖలన్నిటికి మరియు మతాలన్నిటికి చెప్పే మాటలు ఎన్నో ఉంటాయి. అన్యులను జయించుట కొరకు వారి మధ్యన ఆయనను గురించి మాట్లాడుటకు మరియు ఆయన స్వరమును ఎలుగెత్తి ప్రకటించుటకు ముందుగా మిమ్మల్ని పరిపూర్ణము చేయుటకు మీ మధ్యన ఆయన మొదటగా తన స్వరమును వినిపిస్తాడు మరియు మీతో మాట్లాడుతాడు. ఆయన మాటల ద్వారా ప్రతియొక్కరు నిజాయితిగా ఒప్పించబడతారు. దేవుని మాటల ద్వారా, ఆయన ప్రత్యక్షతల ద్వారా మనిషిలోని భ్రష్టుపట్టిన స్వభావము మారుతుంది, మళ్లీ మనిషి రూపాన్ని పొందుకుంటాడు. అతనికి ఉన్న తిరుగుబాటు స్వభావము సంపూర్ణముగా తగ్గిపోతుంది. దేవుని మాటలు మనిషి మీద అధికారికంగా పని చేస్తాయి మరియు దేవుని వెలుగులోనే మనిషిని జయిస్తాయి. ప్రస్తుత యుగములో దేవుడు చేసే కార్యము, ఆయన చేసే కార్యములోని మలుపులన్నియు ఆయన మాటలలోనే కనిపిస్తాయి. మీరు ఆయన మాటలను చదవకపోతే, మీరు దేనిని అర్థము చేసుకోలేరు. మీరు మీ స్వంతంగా దేవుని మాటలను తిని త్రాగితేనే, మీ సహోదరీ సహోదరులతో సహవాసము చేయుటలో నిమగ్నమైయున్నట్లయితేనే, స్వంత అనుభవాలను గడించినట్లయితేనే దేవుని వాక్యములలోని సంపూర్ణ జ్ఞానాన్ని పొందుకుంటారు. అప్పుడే మీరు దేవుని వాక్యముల వెలుగులో నిజమైన జీవితాన్ని జీవించగలరు.

ఫుట్‌నోట్:

ఎ. మూల వచనములో “ఉపమానము” అనే పదము లేదు.

మునుపటి:  నిజ హృదయముతో దేవునికి విధేయత చూపువారందరూ ఖచ్చితంగా దేవుని నుండి లాభాన్ని పొందుకుంటారు

తరువాత:  దేవుని వాక్యము ద్వారా సమస్తము సాధించబడుతుంది

సెట్టింగులు

  • వచనం
  • థీమ్స్

ఘన రంగులు

థీమ్స్

అక్షరశైలి

అక్షరశైలి పరిమాణం

గీతల మధ్య దూరం

గీతల మధ్య దూరం

పేజీ వెడల్పు

విషయ సూచిక

శోధించండి

  • ఈ వచనాన్ని శోధించండి
  • ఈ పుస్తకాన్ని శోధించండి

Connect with us on Messenger