నిజ హృదయముతో దేవునికి విధేయత చూపువారందరూ ఖచ్చితంగా దేవుని నుండి లాభాన్ని పొందుకుంటారు
పరిశుద్ధాత్ముని కార్యము రోజు రోజుకు మారుతూ ఉంటుంది. ఈ రోజు ఉన్నటువంటి ప్రత్యక్షత కంటె రేపటి రోజున ప్రత్యక్షత ఎక్కువగా ఉంటుంది, అడుగడుగున అధికమవుతూనే ఉంటుంది. ఇటువంటి కార్యము ద్వారానే దేవుడు మనిషిని పరిపూర్ణునిగా చేస్తాడు. ఈ మార్గంలో మనుష్యులు కొనసాగకపోతే, వారు ఏ సమయములోనైనా వెలివేయబడతారు. వారికి విధేయత చూపించే హృదయం లేకపోతే, వారు పూర్తి చివర వరకు అనుసరించడం అసాధ్యము. ముందున్న కాలం గతించిపోయింది; ఇదిప్పుడు క్రొత్త యుగం. ఈ క్రొత్త యుగములో తప్పక క్రొత్త పని చేయవలసి ఉంటుంది. మరింత ముఖ్యంగా, మనుష్యులందరూ పరిపూర్ణులయ్యే చివరి కాలమందు దేవుడు త్వరత్వరగా క్రొత్త పనులను చేస్తాడు, అందుచేత మనుష్యులు వారి హృదయాలలో విధేయత లేకుండా దేవుని అడుగు జాడలలో నడవడం, లేక అనుసరించడం చాలా కష్టం. దేవుడు ఎలాంటి నియమాలకు కట్టుబడి ఉండడు, లేక ఆయన చేసే పని ఏదైనా ఏ దశలో ఉన్నను దానిని మార్పులేనిదిగా పరిగణించడు. బదులుగా, ఆయన చేసే కార్యము ఎల్లప్పుడు క్రొత్తదిగాను, ఉన్నతమైనదిగాను ఉంటుంది. ప్రతి స్థాయిలోను ఆయన చేసే కార్యము మరింత ఎక్కువ ఆచరణాత్మకముగా మారుతూ ఉంటుంది మరియు మనుష్యుల వాస్తవిక అవసరతలకు అనుగుణంగా దాని తీవ్రత పెరుగుతూ ఉంటుంది. మనుష్యులు అటువంటి కార్యమును అనుభవించిన తరువాత మాత్రమే వారి నడతలో చివరి మార్పును సాధించగలరు. జీవితానికి సంబంధించిన మనుష్య జ్ఞానము ఎల్లప్పుడూ ఉన్నత స్థాయికి చేరు విధంగానే దేవుని కార్యము కూడా ఉన్నత స్థాయిలకు చేరుకుంటూ ఉంటుంది. ఈ విధంగానే మనుష్యుడు పరిపూర్ణుడు కాగలడు మరియు దేవుడు ఉపయోగించుకునే పరిపూర్ణమైన పాత్రగా ఉండగలడు. దేవుడు ఒక వైపు, మనిషి ఆలోచనలను ఎదుర్కొని వాటిని మార్చును, మరియొక వైపు, మనిషిని వాస్తవమైన లేక నిజమైన సంగతుల వైపుకు త్రిప్పి, దేవునియందు నమ్మిక ఉంచే హెచ్చయిన స్థాయిలోనికి నడిపించును. తద్వారా అంతిమంగా దేవుని చిత్తము నెరవేర్చబడుతుంది. ఇష్టపూర్వకంగా ఎదిరించే అవిధేయత స్వభావము కలిగియున్న ప్రతియొక్కరూ వేగంగా, అత్యంత దృఢముగా జరుగుచున్న దేవుని పనిలో నుండి వెలివేయబడతారు; ఎవరైతే ఇష్టపూర్వకముగా విధేయత చూపుతారో, తమ్మును తాము తగ్గించుకుంటారో వారు మాత్రమే ఈ మార్గంలో చివరి వరకు చేరుతారు. ఇటువంటి కార్యములో మిమ్మల్ని మీరు ఎలా సమర్పించుకోవాలో మరియు మీకున్న అనేకమైన భావాలను ఎలా తీసివేసుకోవాలో మీరందరూ తప్పకుండ నేర్చుకోవాలి. మీరు వేసే ప్రతి అడుగులో చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండవలసిన అవసరత ఉంది. మీరు అప్రమత్తంగా లేకపోయినట్లయితే, మీరు ఖచ్చితంగా పరిశుద్ధాత్ముని ద్వారా తృణీకరించబడతారు, దేవుని కార్యమునకు భంగము చేసినవారవుతారు. ఈ దశలోనికి మనిషి ప్రవేశించక మునుపు అతడు పురాతనమైన విస్తారమైన మానవ నియమ నిబంధనలలో నిమగ్నమైయుండి తనను తాను మర్చిపోయి అహంకారముతో విర్రవీగుచుంటాడు. దేవునికి సంబంధించిన క్రొత్త పనిని ఒక వ్యక్తి అంగీకరించకుండ చేయడానికి ఇవన్నీ అడ్డంకులుగా ఉంటాయి; ఇవన్నీ ఆ వ్యక్తికున్న దేవుని గూర్చిన జ్ఞానానికి శత్రువులే. ప్రజలు తమ హృదయాలలో విధేయత కలిగియుండడానికైనా లేక సత్యము కొరకు ఆరాటము కలిగియుండడానికైనా ఈ అడ్డంకులన్నీ ప్రమాదకరమైనవే. నీవు తేలికపాటి పనికి, తేలికపాటి మాటలకు మాత్రమే కట్టుబడి, లోతైన విషయాలను స్వీకరించుటకు అసమర్థులుగా ఉంటే మీరు ఇంకా పాత పద్ధతులను హత్తుకొని, పరిశుద్ధాత్మ జరిగించు కార్యములలో సహకరించువారుగా ఉండలేరు. దేవుని ద్వారా జరిగించబడిన కార్యము ఒక కాలము నుండి మరొక కాలానికి విభిన్నముగా ఉంటుంది. మీరు ఒక దశలో దేవుని పనికి గొప్ప విధేయత చూపించి, మరొక దశలో ఆయన పని విషయమై విధేయతను కోల్పోయినట్లయితే, లేక విధేయత చూపించే సామర్థ్యము లేకపోయినట్లయితే, దేవుడు నిన్ను వదిలిపెడతాడు. ఆయనతోపాటు మీరు అడుగులు వేయుచున్నప్పుడు, ఆయన ఒక మెట్టు ఎక్కితే, మీరు కూడా ఆయనతోపాటు ఒక మెట్టు ఎక్కాలి. అప్పుడే మీరు పరిశుద్ధాత్మకు విధేయత చూపించినవారవుతారు. నీవు దేవునియందు విశ్వాసముంచినందున, నీవు ఎల్లప్పుడూ విధేయత చూపిస్తూ ఉండాలి. మీకిష్టమైనప్పుడు విధేయత చూపించి, ఇష్టము లేనప్పుడు అవిధేయతను చూపించడానికి వీల్లేదు. ఇటువంటి విధేయత దేవునిని మెప్పించదు. మీరు క్రొత్త పనిలో లేక క్రొత్త సహవాసములో ఉన్నప్పుడు అడుగులో అడుగు వేయకుండా పాత విధానాలను పట్టుకొని జీవిస్తున్నట్లయితే, మీ జీవితములో అభివృద్ధి ఎలా జరుగుతుంది? దేవుని మాటల ద్వారా మీకు అవసరమైన ప్రతీది అందించడమే దేవుని కార్యమైయున్నది. నీవు దేవుని మాటలను స్వీకరించి, వాటికి విధేయత చూపించినప్పుడు పరిశుద్ధాత్ముడు నీలో తప్పకుండ పని చేస్తాడు. నేను చెప్పినట్లుగానే పరిశుద్ధాత్ముడు తప్పకుండ పని చేస్తాడు; నేను చెప్పినట్లుగా చేసినట్లయితే, పరిశుద్ధాత్ముడు తప్పకుండా నీలో పని చేస్తాడు. మీరు స్థిరముగా నిలువబడుటకు మరియు ప్రస్తుత వర్తమానపు వెలుగులోనికి తీసుకు రావడానికి నేను మీ కోసం ఒక క్రొత్త వెలుగును విడుదల చేస్తున్నాను. ఈ వెలుగులోనికి నీవు ప్రవేశించిన వెంటనే పరిశుద్ధాత్ముడు నీలో పనిచేస్తాడు. తిరుగుబాటుదారులైన అనేకులు, “మీరు చెప్పిన మాటలను బట్టి నేను నడుచుకోను” అని చెబుతుంటారు. అటువంటి సందర్భములో, మీరు దారి చివరికి వచ్చేసారని; మీరు ఎండిపోయారని; మీలో జీవము లేదని నేను మీతో చెప్పుచున్నాను. అందుచేత, మీ స్వభావమును మార్చుకునే రూపాంతర అనుభవములో ప్రస్తుతం వెలుగుతో పాటు వేగంగా నడవడం కంటే అతి ప్రాముఖ్యమైన విషయం మరొకటి లేదు. దేవునిచేత వాడబడే కొంతమంది ప్రజలలోనే పరిశుద్ధాత్ముడు పనిచేయడు గానీ సంఘములో కూడా ఆయన పని చేస్తాడు. ఆయన ఎవరిలోనైనా పని చేస్తాడు. ప్రస్తుతం ఆయన నీలో కూడా పని చేస్తూ ఉండవచ్చు మరియు ఈ కార్యమును నీవు అనుభవిస్తూ ఉండవచ్చు. తరువాత కాలములో ఆయన మరొకరిలో పని చేయవచ్చు, ఇటువంటి సందర్భములో మీరు తప్పకుండా అనుసరించడానికి త్వరపడాలి; ప్రస్తుతమందున్న ఈ వెలుగును సమీపంగా అనుసరించి నడుచుకుంటారో అంత ఎక్కువగా మీ జీవితము అభివృద్ధి చెందుతుంది. మీరు ఎలాంటి వ్యక్తిత్వమున్న వ్యక్తియైన సరే, పరిశుద్ధాత్ముడు కార్యము జరిగించాడంటే నీవు తప్పకుండ ఆయనను అనుసరించాల్సిందే. నీవు వారి అనుభవాల ద్వారా వెళ్ళినప్పుడు మరి ఎక్కువ ఉన్నత విషయాలను నీవు పొందుకుంటావు. మీరు అలా నడుచుకుంటున్నప్పుడు మరింత త్వరగా ప్రగతి పథంలో సాగిపోతారు. ఈ మార్గములోనే మనిషి పరిపూర్ణుడవుతాడు మరియు ఈ విధంగా బ్రతకడం ద్వారానే జీవితము అభివృద్ధి చెందుతుంది. పరిశుద్ధాత్ముని కార్యానికి మీ విధేయతను చూపుట ద్వారానే మీరు నడిచే మార్గం పరిపూర్ణతగా చేయబడియున్నది. నిన్ను పరిపూర్ణతలోనికి నడిపించడానికి దేవుడు ఎటువంటి వ్యక్తి ద్వారా పని చేస్తాడో నీకు తెలియదు, లేక మీరు క్షేమాభివృద్ధిని పొందుట కొరకు లేక కార్యాలను చూచుట కొరకు ఆయన ఉపయోగించుకునే వ్యక్తి గానీ, సందర్భము గానీ, ఏదైనా విషయము గానీ నీకు తెలియదు. అయితే, నీవు ఇటువంటి సరియైన మార్గములోనికి అడుగుపెట్టగలిగితే, నీవు వేసిన అడుగు ద్వారా దేవునిచేత పరిపూర్ణుడవగుటకు నీవు గొప్ప నిరీక్షణను కలిగియున్నావని చెప్పుచున్నావు. ఒకవేళ ఇటువంటి మార్గములోనికి నీవు అడుగుపెట్టకపోతే నీ భవిష్యత్తు అంధకారంగాను, కాంతి లేనిదిగాను ఉంటుందని చెప్పుచున్నావు. ఒక్కసారి నీవు సరియైన మార్గములో అడుగు పెడితే, అన్ని విషయాలలో ప్రత్యక్షతను పొందుకుంటావు. పరిశుద్ధాత్ముడు ఇతరులకు ఏమి బయలుపరస్తాడనే విషయాలతో సంబంధము లేకుండా, నీవు స్వంతంగా అనుభవం గడించడానికి వారి జ్ఞానాన్ని ఆధారం చేసుకొని ముందుకు సాగినట్లయితే, నీవు పొందిన ఈ అనుభవాన్ని ఇతరులకు అందించగలుగుతావు. చిలుక పలుకులు పలుకుతూ ఇతరులకు చెప్పే ప్రజలకు ఎటువంటి అనుభవాలు ఉండవు; మీకున్న మీ స్వంత జ్ఞానమును గురించి, మీ అనుభవాలను గురించి ఇతరులతో పంచుకొనుటకు ముందుగా ఇతరులకు కలిగిన జ్ఞానోదయం, ప్రత్యక్షతల ద్వారా అభ్యాసము చేసే ఒక మార్గాన్ని నీవు తప్పకుండ కనుగొనవలసి ఉంటుంది. ఇది మీ జీవితానికి గొప్ప ప్రయోజనకరముగా ఉంటుంది. దేవుని నుండి వచ్చిన ప్రతి మాటకు లోబడి, నీవు ఆ అనుభవం పొందుకోవడం ద్వారా, నీవు అన్ని విషయాలలో దేవుని చిత్తాన్ని వెదకాలి మరియు అన్ని విషయాలలో పాఠాలను నేర్చుకోవాలి, అప్పుడే నీ జీవితము ఎదుగుతుంది. అటువంటి అభ్యాసమును చేసినప్పుడు వేగవంతమైన అభివృద్ధిని కలుగజేస్తుంది.
ఆచరణాత్మకమైన అనుభవాల ద్వారా నీవు వెళ్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు నిన్ను వెలిగింపజేస్తాడు మరియు నీవు కలిగియున్న విశ్వాసము ద్వారా నిన్ను పరిపూర్ణునిగా చేస్తాడు. నీవు నిజంగానే పరిపూర్ణుడవు కావాలని కోరుకుంటున్నావా? నీవు నిజంగానే దేవుడి ద్వారా పరిపూర్ణునిగా అవ్వాలని ఇష్టపడుచున్నట్లయితే, నీ శరీర కార్యములన్నిటిని ప్రక్కకు పెట్టడానికి ధైర్యము కలిగియుండాలి, అప్పుడే నీవు దేవుని మాటలను మోసుకు వెళ్ళగల సామర్థ్యమును పొందుకుంటావు మరియు నీవు పనిచేయని వ్యక్తిగానో లేక బలహీనమైన వ్యక్తిగానో ఉండవు. దేవుని నుండి వచ్చే ప్రతి మాటకు లోబడగల సామర్థ్యమును పొందుకుంటావు. మీ క్రియలు అనగా బహిరంగ క్రియలైనా లేక వ్యక్తిగత క్రియలైన అవన్నీ దేవునికి యోగ్యమైనవిగానే ఉంటాయి. నీవు యథార్థవంతుడవైతే, అన్ని విషయాలలో సత్యమును అభ్యసించినప్పుడు నీవు పరిపూర్ణుడవవుతావు. ఇతరుల ఎదుట ఒక విధంగా ప్రవర్తించి, వారి వెనకాల మరియొక విధంగా ప్రవర్తించే మోసగాళ్ళు పరిపూర్ణులవ్వాలనే కోరికను కలిగియుండరు. వారందరు నాశన పుత్రులు లేక ఆధ్యాత్మిక భ్రష్టత్వపు పుత్రులు అని చెప్పవచ్చు; వారు దేవునికి సంబంధించినవారు కాదు గానీ, సాతానుకు సంబంధించినవారు. వారు దేవునిచేత ఎన్నికైనవారు కారు! మీ క్రియలు లేక ప్రవర్తన దేవునికి ఇష్టమైన రీతిలో ప్రదర్శించకపోయినట్లయితే, లేక పరిశుద్ధాత్ముని ఆధ్వర్యములో జరిగించకపోయినట్లయితే, మీలో ఏదో తప్పిదముందని చెప్పడానికి అదే నిదర్శనయైయున్నది. దేవుని తీర్పు మరియు శిక్ష అనేవి ఉన్నాయని మీరు ఒప్పుకున్నట్లయితే, మీ వైఖరిని మార్చుకొని రూపాంతరము చెందు విషయమై జాగ్రత్తపడండి, అప్పుడు మీరు పరిపూర్ణులయ్యే మార్గములోనికి అడుగుపెట్టగలరు. నీవు నిజంగా దేవుని ద్వారా పరిపూర్ణుడివవ్వాలని ఆశించినట్లయితే, ఏ ఒక్క కారణం చెప్పకుండానే, దేవుని కార్యాన్ని తీర్పు తీర్చడానికి లేక అంచనా వేయడానికి ఎటువంటి ఊహాగానాలు లేకుండా దేవుని కార్యాలన్నిటికి తప్పకుండ విధేయత చూపాలి. దేవుని ద్వారా పరిపూర్ణత చెందాలంటే, కొన్ని కనీసపు అర్హతలను కలిగియుండాలి. అన్ని విషయాలలో దేవునిని ప్రేమించే హృదయముతో నడుచుకోవడమే దేవుని ద్వారా పరిపూర్ణులవ్వాలని ఎదురుచూసే వారందరికీ ఉండవలసిన అర్హత. దేవుడిని ప్రేమించే హృదయముతో నడుచుకోవడం అంటే ఏమిటి? నీ సమస్త క్రియలన్నియు మరియు ప్రవర్తనయంతయు దేవునికి ఇష్టముగా ఉండునట్లు చూసుకోవడమే దేవునిని ప్రేమించే హృదయముతో నడుచుకోవడమని అర్థం. నీ క్రియలు ఒప్పైనా, తప్పైనా నీవు సరియైన ఉద్దేశాలను కలిగియుండు దానినిబట్టి వాటిని దేవునికి గానీ లేక మీ సహోదరీ సహోదరులకు గానీ కనుపరచుకోవడానికి భయపడనక్కరలేదు మరియు మీరు దేవుని ఎదుట ప్రమాణము చేయడానికైనా నిర్భయముగా ఉంటారు. దేవుడు పరిశీలన చేయుట కొరకు మీరు తప్పకుండ మీ ప్రతి ఉద్దేశాన్ని, ఆలోచనను, తలంపులను దేవుని ఎదుట ఉంచవలసియున్నది; నీవు అభ్యసించి, ఈ మార్గములోనికి ప్రవేశించినట్లయితే, మీ జీవితములో అభివృద్ధి చాలా త్వరగా జరుగుతుంది.
నీవు దేవునియందు విశ్వసించుచున్నందున నీవు తప్పకుండా దేవుడు పలికిన ప్రతి మాటయందు విశ్వాసముంచాలి. మరొక విధంగా చెప్పాలంటే, నీవు దేవుని యందు విశ్వాసముంచుచున్నావు గనుక ఆయనకు నీవు తప్పకుండ లోబడాలి. ఇలా నీవు దేవునికి లోబడనప్పుడు, నీవు దేవునిని నమ్మినా నమ్మకపోయిన అర్థముండదు. అనేక సంవత్సరాలనుండి నీవు దేవునిని నమ్మి, ఆయనకు లోబడక, ఆయన మాటలను స్వీకరించక, దేవుడే నీకు లోబడాలని, నీ నియమ నిబంధనలనుసారముగా నడుచుకోవాలని అడుగుచున్నట్లయితే సమస్త ప్రజలందరిలో నీవే ప్రధాన తిరుగుబాటుదారునిగా పరిగణించబడతావు, అప్పుడు నీవు అవిశ్వాసివి. ఇటువంటివారు మానవ నియమ నిబంధలను ఆమోదించని దేవుని మాటలకు మరియు ఆయన చేసే కార్యాలకు ఎలా లోబడుతారు? అందరిలో ఎక్కువగా తిరుగుబాటు చేసేవారు దేవుణ్ణి ఉద్దేశ పూర్వకంగా ఎదిరించి, ధిక్కరిస్తుంటారు. వారు దేవునికి శత్రువులు మరియు వారే క్రీస్తు విరోధులు. దేవుడు చేసే క్రొత్త కార్యాల విషయమై వారు ఎల్లప్పుడు శత్రు వైఖరిని చూపిస్తుంటారు; వారు లోబడుటకు వారికి ఒక చిన్న కారణం కూడా ఉండదు, లేదా వారు లోబడుటకు సంతోషంగా ఉండనే ఉండరు లేదా తమ్మును తాము తగ్గించుకోరు. వారు ఇతరుల ఎదుట తమ్మును తాము హెచ్చించుకుంటారు గానీ ఎవరికీ లోబడరు. దేవుని ఎదుట వాక్యమును బాగుగా బోధిస్తున్నామని మరియు ఇతరుల విషయములో చాలా నైపుణ్యముగా పని చేస్తున్నామని తమ్మును తాము పరిగణించుకుంటారు. వారి స్వాధీనములో ఉన్నటువంటి “నిధులను లేక డబ్బులను” ఎంత మాత్రము బయటకు తీయరు గానీ వాటిని ఆరాధనకు, ఇతరులకు బోధించుట కొరకు కుటుంబ వారసత్వ సంపదగా ఉపయోగించుకుంటారు. తమను ఆరాధించే మూర్ఖులకు బోధించడానికి వారు వాటిని ఉపయోగించుకుంటారు. వాస్తవానికి, ఈ విధంగా ఉండే కొంతమంది ప్రజలు సంఘములో ఉన్నారు. ఇలాంటివారిని “తిరుగులేని వీరులని” పిలుస్తుంటారు, ఇలాంటివారు తరము వెంబడి తరము దేవుని ఇంటిలో పుట్టుకు వస్తూనే ఉంటారు. వారు దేవుని వాక్యాన్ని (సిద్ధాంతమును) ప్రసంగించడమే ప్రధాన కార్యంగా పరిగణిస్తారు. సంవత్సరాల తరబడి, తరతరాల వరకు వీరు, “పవిత్రమైన మరియు ఉల్లంఘించలేని” విధిని తీవ్ర స్థాయిలో అమలుపరుస్తుంటారు. వారిని ముట్టడానికి ఏ ఒక్కరు సాహసం చేయరు; వారిని బహిరంగంగా నిలదీయడానికి ఏ ఒక్క వ్యక్తి కూడా ధైర్యము చేయడు. వారు దేవుని ఇంటిలో “రాజులుగా” మారిపోయి, ఏండ్ల తరబడి అందరి మీద దౌర్జన్యము చేస్తుంటారు. ఈ దయ్యాల సమూహమంతా ఏకమై, నా పనిని నాశనము చేయాలని చూస్తున్నారు; ఈ దెయ్యాలన్నిటిని నా కన్నుల ఎదుట ఎలా ఉండనిచ్చేది? అరకొర విధేయతను కనుపరచువారు సహితం చివరి వరకు కొనసాగించడమే కష్టమంటే, తమ హృదయాలలో ఇసుమంత కూడ విధేయతలేని వీరి గతి ఏమౌనో! మనుష్యుడు దేవుని కార్యమును అంత సులభంగా సంపాదించుకోలేడు. ప్రజలు తమకున్న బలమునంతటిని ఉపయోగించినప్పటికీ వారు దేవుని కార్యములోని కొంతమట్టుకు మాత్రమే సంపాదించుకోవచ్చు, చివరికి వారు పరిపూర్ణులు కావడానికి అనుమతిస్తుంది. అయితే, దేవుని కార్యమును నాశనము చేయాలనుకున్న ప్రధాన దేవదూత పిల్లల పరిస్థితి ఏమిటి? దేవుని ద్వారా పొందుకుంటామనే స్వల్ప నిరీక్షణనైనా వారికుండదా? జయించే పనిని చేయడములో నేను కలిగియున్న ఉద్దేశం కేవలం విజయం సాధించాలని మాత్రమే కాదు గానీ, నీతిని మరియు అవినీతిని బయలుపరచడానికి, మనిషి శిక్షకు రుజువును పొందేందుకు, దుష్టులను శిక్షించడానికి, అంతేగాకుండా, ఇష్టపూర్వకముగా లోబడి పరిపూర్ణులవ్వాలని కోరుకునే ప్రతియొక్కరి కొరకు విజయము పొందుటయైయున్నది. చివరిలో ప్రజలందరూ ఆయా భాగాలుగా విభజించబడుతారు మరియు పరిపూర్ణులైనవారందరూ విధేయతతో కూడిన ఆలోచనలతోను మరియు తలంపులతోను నింపబడియుంటారు. ఇదే అంతిమంగా జరిగే కార్యమైయుండును. మరొక వైపు, తిరుగుబాటు చర్యలు చేసే ప్రతియొక్కరు శిక్షించబడతారు మరియు నిత్య శాపమైన ఆగ్నిగుండములో కాలుటకు పంపబడతారు, సమయము వచ్చినప్పుడు గత కాలములలో ఉన్నటువంటి “తిరుగుబాటు చేసి గొప్ప వీరులని” చెప్పుకున్న ప్రతియొక్కరూ అధములుగాను మరియు “బలహీనులుగాను మరియు పిరికివారుగాను” మారిపోతారు. ఇక్కడ చెప్పబడిన ఈ విషయము దేవుని నీతిలో ప్రతి అంశాన్ని, మనిషి ద్వారా భంగము కానటువంటి దేవుని స్వభావమును వివరిస్తున్నాయి మరియు కేవలము ఈ విషయము మాత్రమే నా హృదయములోని ద్వేషాన్ని శాంతింపజేస్తోంది. ఇదంతా సహేతుకమైన విషయమేనని మీరందరు ఒప్పుకుంటారా?
పరిశుద్ధాత్మ కార్యమును అనుభవించువారందరిలో, లేక ఈ ప్రవాహములో ఉన్నవారందరిలో అందరు కాకుండా కొందరు మాత్రమే జీవితాన్ని పొందుకుంటారు. జీవితం అనేది మనుష్యులందరూ పంచుకునే ఉమ్మడి ఆస్తి కాదు మరియు స్వభావములో మార్పులనేవి అందరు సంపాదించుకునేవి కావు. దేవునికి లోబడడం అనేది నిజముగాను, వాస్తవికముగాను ఉండాలి మరియు తప్పకుండ లోబడి జీవించాలి. వేషధారణతో లోబడడం అనేది దేవుని మెప్పుదలను పొందుకోలేదు మరియు స్వభావములో ఎటువంటి మార్పును కోరుకోకుండా దేవుని వాక్యములో ఇష్టమైన వాక్యాలకు మాత్రమే లోబడడం అనేది దేవుని హృదయాన్ని అనుసరించినట్లు కాదు. దేవునికి విధేయత చూపడం మరియు దేవుని కార్యానికి లోబడి ఉండడం అనేవి ఒక్కటైయున్నవి. దేవునికి మాత్రమే లోబడి, ఆయన పరిచర్యకు లోబడనివారు విధేయత చూపువారుగా ఎంచబడరు, నిజముగా తమ్మును తాము సమర్పించుకొనువారు తక్కువగా ఉంటారు గానీ, అలా బయటకి మాత్రమే నటించేవారు ఎక్కువగానే ఉంటారు. దేవునికి నిజముగా లోబడు వారందరూ తాము చేసిన కార్యము నుండి లాభాన్ని పొందుకుంటారు, తమ స్వభావమును మరియు దేవుని పరిచర్యను అర్థం చేసుకుంటారు. అటువంటి ప్రజలు మాత్రమే నిజముగా దేవునికి సమర్పించుకుంటారు. అటువంటి ప్రజలు క్రొత్త జ్ఞానాన్ని పొందుకుంటారు, క్రొత్త పరిచర్య ద్వారా క్రొత్త మార్పులను పొందుకుంటూ ప్రయాణిస్తారు. ఇటువంటి ప్రజలనే దేవుడు మెచ్చుకుంటాడు, ఇటువంటివారే పరిపూర్ణులైనవారు మరియు ఇటువంటి ప్రజల స్వభావాలే మార్పు చెంది ఉంటాయి. దేవునిచేత మెప్పుదల పొందిన వారందరూ దేవునికి, ఆయన మాటలకు మరియు ఆయన పరిచర్యకు సంతోషంగా లోబడుటకు ఇష్టపడువారుగా ఉంటారు. అటువంటి ప్రజలే సరియైనవారు, అటువంటి ప్రజలే నిజముగా దేవునిని కోరుకునేవారు మరియు నిజముగా దేవునిని వెదకువారు. దేవుని యందు విశ్వాసమును గూర్చి తమ నోళ్ళతో అరుదుగా మాట్లాడేవారు ఆయనను శపించినట్లుగా ఉంటుంది, అయినా ఇటువంటి వారందరు పాము విషాన్ని కలిగి, తమ ముఖాలకు ముసుగు వేసుకొని జీవిస్తుంటారు; వారు అందరికంటే ద్రోహులు. త్వరగానైనా లేక ఆలస్యముగానైనా ఇలాంటి దుష్టులందరు తాము వేసుకున్న నీచమైన ముసుగులన్నిటిని తీసివేస్తారు. ఈ రోజున జరుగుచున్న పని ఇది కాదంటారా? దుష్ట ప్రజలు ఎల్లప్పుడూ దుష్ట ప్రజలుగానే ఉంటారు, శిక్ష పడే ఆ రోజును వీరు తప్పించుకోలేరు. మంచివారు ఎల్లప్పుడూ మంచివారుగానే ఉంటారు, వీరు దేవుని కార్యము చేసి ముగించినప్పుడు వీరు బయలుపరచబడతారు. దుర్మార్గుల్లోని ఏ ఒక్కరూ నీతిమంతులుగా పరిగణించబడరు, నీతిమంతుల్లోని ఏ ఒక్కరూ దుర్మార్గులుగా పరిగణించబడరు. ఏ వ్యక్తి అయినా తప్పుగా ఆరోపించడానికి నేను అనుమతిస్తానా?
మీ జీవితము ప్రగతి పథంలో నడుచుచున్న కొలది మీరు ఎల్లప్పుడూ క్రొత్త ప్రవేశమును కలిగియుండాలి, మీరు వేసే ప్రతి అడుగులో లోతుగా ఎదగడానికి క్రొత్తదైన ఉన్నత ఆలోచనను కలిగియుండాలి. మానవాళియంతయు ఈ మార్గములోనికే ప్రవేశించాలి. సహవాసము చేయుట ద్వారా దేవుని వాక్య ప్రసంగాలను వినడం, దేవుని వాక్యాన్ని చదవడం, లేక కొన్ని సాధనాలను కలిగియుండడం ద్వారా మీరు క్రొత్త ఆలోచనలను మరియు క్రొత్త జ్ఞానోదయాన్ని పొందుకోవచ్చు, పాత కాలాలలోని పాత నియమాలనుబట్టి జీవించరు; మీరు ఎల్లప్పుడు క్రొత్త వెలుగులోనే జీవిస్తారు మరియు దేవుని వాక్యానికి దూరంగా ఉండలేరు. దీనినే సరియైన మార్గములో ఉండడం అని అంటారు. వేషధారణకు వెల చెల్లించడం ద్వారా ఎటువంటి ఉపయోగం ఉండదు; రోజు రోజుకు దేవుని వాక్యము ఉన్నత ప్రపంచములోనికి ప్రవేశిస్తుంటుంది మరియు క్రొత్త విషయాలు ప్రతి రోజు వెలుగులోనికి వస్తాయి మరియు మానవుడు తప్పనిసరిగా ప్రతిరోజూ ఒక క్రొత్త ప్రవేశం చేయాలి. దేవుడు మాట్లాడినట్లుగానే ఆయన చెప్పినదంతా ఫలవంతం చేస్తాడు. మీరు కాపాడుకొనకపోయినట్లయితే మీరు ఖచ్చితంగా వెనక్కి జారిపోతారు. మీ ప్రార్థనలలో మీరు లోతైన అనుభవములోనికి వెళ్ళవలసి ఉంటుంది; దేవుని వాక్యాన్ని తినడం మరియు తాగడం అనేది అప్పుడప్పుడు చేసే పని కాదు. మీరు పొందుకునే జ్ఞానాన్ని మరియు ప్రత్యక్షత మరింత ఎక్కువగా పెంపొందించుకోండి. మీ నియమ నిబంధలను మరియు ఊహా గానాలను క్రమేపి తగ్గించుకోండి. మీరు తప్పకుండ మీ తీర్పును బలపరచుకోవాలి మరియు మీరు ఎదుర్కునేది ఏదైనా దానిని గురించి మీరు మీ స్వంత దృష్టికోణాలు కలిగియుండాలి. ఆత్మలో కొన్నిటిని అర్థం చేసుకొనుట ద్వారా బహిరంగముగా ఎలా ఉండాలనే దాని మీద గొప్ప ఆలోచనను కలిగియుంటారు మరియు ఎటువంటి సమస్యకైనా మూలాన్ని గ్రహిస్తారు. ఇలాంటి విషయాలతో మీరు పెంపొందించబడకపోయినట్లయితే, మీరు సంఘాన్ని ఎలా నడిపిస్తారు? ఎటువంటి నిజతత్వం లేకుండా, ఆచరించే జీవితము లేకుండ పత్రికలను గూర్చి, సిద్ధాంతములను గూర్చి మీరు మాట్లాడితే, మీరు కొద్ది కాలం మాత్రమే నిలువగలరు. క్రొత్త విశ్వాసులను గూర్చి మాట్లాడినప్పుడు ఇది స్వల్పంగా ఆమోదయోగ్యమైనదే కావచ్చు గానీ, కొంత కాలమైన తరువాత కొత్త విశ్వాసులు కొంత వాస్తవికమైన అనుభవాన్ని గడించినప్పుడు, మీరు వారిని ఏ విధంగాను బలపరచలేరు. అలాంటప్పుడు మీరు దేవుని పరిచర్యకు యోగ్యులుగా ఎలా ఉండగలరు? క్రొత్త జ్ఞానోదయం లేకుండా మీరు పరిచర్య చేయలేరు. క్రొత్త జ్ఞానోదయం లేనివారందరు ఎలా అనుభవించాలో తెలియనివారే మరియు అటువంటి ప్రజలు క్రొత్త జ్ఞానాన్ని లేక క్రొత్త అనుభవాన్ని పొందుకోలేరు. జీవితాన్ని వృద్ధి చేసే విషయములో వారు తమ వంతు బాధ్యతను నిర్వర్తించలేదు, లేక దేవుడు వారిని ఉపయోగించుకొనుటకు వారు యోగ్యులు కాలేకపోయారు. ఇటువంటి వ్యక్తి నుండి ఎటువంటి ఉపయోగమూ ఉండదు గానీ, కేవలం సోమరిపోతులుగా ఉంటారు. అటువంటివారు పరిచర్యలో తమ వంతు కృషిని చేయడములో అసమర్థులుగా ఉంటారు, వారి వలన ఎటువంటి ప్రయోజనము ఉండదు. వారు కేవలము తమ వంతు చేయవలసిన కృషిని చేయడంలో విఫలమవడమే కాకుండా, వారు సంఘము మీద అనవసరమైన ఒత్తిడి కలుగజేస్తుంటారు. “గౌరవనీయులైన ఇటువంటి వృద్ధులను” అతి త్వరగా సంఘాన్ని వదిలిపోవాలని హెచ్చరిస్తుంటాను. తద్వారా ఇతరులు మీ వైపు చూడటానికి ఆస్కారమే ఉండదు. అటువంటి వారికి క్రొత్త పరిచర్యను గూర్చి అవగాహన ఉండదు మరియు వారు అంతమే లేనటువంటి నియమ నిబంధనలతో నింపబడియుంటారు. వారు సంఘములో ఎటువంటి పాత్రను పోషించకపోగా, ప్రతిచోట చెడును వ్యాప్తి చేస్తుంటారు, సంఘములో అన్ని రకాలుగా దుష్ప్రవర్తనగా నడుచుకుంటూ ఉంటారు, ఎంతో ఇబ్బందిని కలిగిస్తుంటారు. తద్వారా వివక్షలేని వారిని గందరగోళ అస్తవ్యస్త పరిస్థితిలోనికి నెట్టేస్తుంటారు. ఇటువంటి దయ్యాలు, దురాత్మలు సంఘాన్ని చాలా త్వరగా విడిచిపెట్టి వెళ్లిపోవాలి, నిన్ను బట్టి సంఘము దెబ్బ తినకుండ చూసుకోవాలి. నేటి పరిచర్య విషయమై నీవు భయపడనక్కరలేదు గానీ, రేపటి రోజున ఎదురయ్యే నీతియుతమైన శిక్ష విషయమై భయపడవలసిన అవసరము లేదా? సంఘములో ఎక్కువ శాతపు ప్రజలందరూ ఇతరులను మభ్యపెట్టేవారే ఉంటారు మరియు ఎంతో బాగుగా జరిగే దేవుని పనిని చెడగొట్టాలనే ఎక్కువమంది తోడేళ్ళు సంఘములో ఉన్నారు. చెడగొట్టే వీరందరు దయ్యాలకు అధిపతి ద్వారా పంపించబడిన దయ్యాలు, అమాయక గొర్రె పిల్లలను మింగివేసే క్రూరమైన తోడేళ్ళు. ఇటువంటి ప్రజలనందరిని బయటకు బహిష్కరించకపోయినట్లయితే, వారు సంఘము మీద పరాన్నజీవులుగాను, కానుకలను మింగి వేసే చిమ్మట పురుగులుగా మారిపోతారు. త్వరగానైనా లేక ఆలస్యంగానైనా, ఇటువంటి ధిక్కార స్వభావముగలవారిని, అవివేక ప్రజలను, నీచమైనవారిని మరియు గర్విష్టులను శిక్షించే ఒక రోజు రానే వస్తుంది!