విజయ కార్యపు అంతర్గత సత్యము (2)

మీరు రాజుల వలె పరిపాలించాలని ఎదురుచూసేవారు, అయితే ఈ రోజుకూ మీరు ఇంకా దాన్ని పూర్తిగా వదలలేదు; మీరు ఇప్పటికీ రాజులవలె పరిపాలించాలనీ, పరలోకాన్ని పట్టుకోవాలనీ మరియు భూమికి తోడ్పాటు అందించాలనీ కోరుకుంటున్నారు. ఇప్పుడు, ఈ ప్రశ్న గురించి ఆలోచించండి: నీకు అలాంటి అర్హతలు ఉన్నాయా? మీరు పూర్తిగా బుద్దిహీనులు కాదా? మీరు కోరుకునేది మరియు మీ దృష్టి ఉంచేది వాస్తవికమైనదేనా? మీరు సాధారణ మానవత్వాన్ని కూడా పొందలేదు—ఇది దయనీయమైన పరిస్థితి కాదా? కాబట్టి, నేను ఈరోజు జయించిన వారిగా ఉండడం గూర్చి, సాక్ష్యమిచ్చువారుగా ఉండడం గూర్చి, మీ సామర్థ్యాన్ని మెరుగుపరచడం గూర్చి మరియు పరిపూర్ణముగా చేయబడిన మార్గంలో ప్రవేశించడం గురించి మాత్రమే మాట్లాడుతాను గానీ మరింకేమీ మాట్లాడను. కొంతమంది నిష్కల్మషమైన సత్యము విషయమై విసుగు చెందుతారు, వారు ఈ సాధారణ మానవత్వం, ప్రజల సామర్థ్యాన్ని మెరుగుపరచడం గురించి మాట్లాడటం చూసినప్పుడు, వారు ఆయిష్టంగా ఉంటారు. సత్యాన్ని ప్రేమించని వారిని పరిపూర్ణులుగా చేయడం అంత సులువు కాదు. మీరు ఈ రోజు ప్రవేశించి, దేవుడి చిత్తం ప్రకారం అంచెలంచెలుగా పనిచేసినంత కాలం, నీవు వెలివేయబడగలవా? చైనా ప్రధాన భూభాగంలో దేవుడు ఎంతో కార్యము చేసిన తరువాత—అంత గొప్ప స్థాయి కార్యము జరిగిన తర్వాత, ఆయన ఎన్నో మాటలు చెప్పిన తర్వాత, ఆయన సగ భాగములో వదిలేస్తాడా? ఆయన ప్రజలను అగాథములోనికి నడిపిస్తాడా? ఈ రోజు కీలక అంశం ఏమిటంటే, మీరు మనిషి గుణగణాలను తప్పక తెలుసుకోవాలి, మీరు దేనిలోకి ప్రవేశించాలో తప్పక తెలుసుకోవాలి; మీరు జీవములోనికి ప్రవేశించడమును గూర్చి మరియు స్వభావంలో మార్పులు కలుగుటను గూర్చి, వాస్తవంగా జయించబడినవారుగా ఎలా ఉండాలి మరియు దేవునికి పూర్తిగా ఎలా విధేయత చూపాలి, దేవునికి అంతిమ సాక్ష్యం ఎలా ఇవ్వాలి మరియు మరణించేంత వరకు విధేయతను ఎలా కలిగియుండాలి అనే విషయాల గురించి మీరు తప్పక మాట్లాడాలి. నీవు ఈ విషయాలపై తప్పక దృష్టి పెట్టాలి మరియు ముందుగా అవాస్తవికమైన లేదా అప్రధానమైన వాటిని పక్కన పెట్టాలి మరియు వాటిని ఉపేక్షించాలి. ఈ రోజు, ఎలా జయించబడాలో నీవు అవగాహన కలిగియుండాలి మరియు ప్రజలు జయించిన తరువాత వారు ఎలా ప్రవర్తించాలో కూడా నీవు తెలుసుకోవాలి. నీవు జయించబడ్డావని నీవు చెప్పవచ్చు, కానీ నీవు మరణించేంతవరకు విధేయత చూపగలవా? అవకాశాలు ఏవైనా ఉన్నాయా లేవా అనే దానితో సంబంధం లేకుండా నీవు తప్పక చివరి వరకు అనుసరించగలగాలి మరియు ఏ పరిస్థితిలోనైనా తప్పక నీవు దేవుడిపై విశ్వాసాన్ని కోల్పోకూడదు. అంతిమంగా, నీవు సాక్ష్యములో రెండు విషయాలను తప్పక సాధించాలి: యోబు ఇచ్చిన సాక్ష్యం ఏమనగా మరణించేంత వరకు విధేయత చూపడం; మరియు పేతురు ఇచ్చిన సాక్ష్యం ఏమనగా దేవుడి సర్వోన్నత ప్రేమ. ఒక విషయంలో, నీవు తప్పక యోబు లాగా ఉండాలి: అతను అన్ని భౌతిక సంపదలను కోల్పోయాడు మరియు విపరీతమైన శారీరక బాధను పొందాడు, అయినా అతను యెహోవా నామాన్ని వదిలి పెట్టలేదు. ఇది యోబు ఇచ్చిన సాక్ష్యం. పేతురు మరణించేంత వరకు దేవుడిని ప్రేమించగలిగాడు. సిలువ వేయబడినప్పుడు మరియు తన మరణాన్ని ఎదుర్కొన్నప్పుడు కూడా అతను దేవుణ్ణి ప్రేమించాడు; అతను తన సొంత అవకాశాల గురించి యోచించలేదు లేదా అందమైన ఆశలను లేదా మితిమీరిన ఆలోచనలను అనుకరించలేదు మరియు అతను దేవుణ్ణి ప్రేమించడాన్ని మరియు దేవుని నిర్వహణ కార్యములన్నిటికి విధేయుడై ఉండటాన్ని మాత్రమే కోరుకున్నాడు. నీవు సాక్ష్యమిచ్చావని భావించబడటానికి ముందు, నీవు జయించబడిన తర్వాత పరిపూర్ణుడిగా మారడానికి ముందు నీవు తప్పక కలిగియుండవలసిన ప్రమాణం ఇలాగే ఉంటుంది. ఈనాడు, ప్రజలకు తమ సొంత గుణగణాలను గూర్చి మరియు స్థితిని గూర్చి నిజంగా తెలిసి ఉంటే, వారు ఇప్పటికీ తమకుండే అవకాశాలను మరియు ఆశలను కోరుకుంటారా? నీవు తెలుసుకోవలసింది ఇదే: దేవుడు నన్ను పరిపూర్ణుడిగా చేసినా చేయకపోయినా, నేను తప్పక దేవుడిని అనుసరించాలి; ఇప్పుడు ఆయన చేసే ప్రతి ఒక్కటీ మంచిది, మరియు నా కోసమే చేసియున్నాడు. తద్వారా మన స్వభావం మారుతుంది మరియు మనకు మనమే సాతాను ప్రభావమును నుండి విడిపించుకుంటాం, మనం అశుద్ధమైన భూమిలో పుట్టినప్పటికీ, అశుద్ధతను అంటించుకోకుండా మనముండవచ్చు, అశుద్ధత మరియు సాతాను ప్రభావాన్ని విదుల్చుకొని, దానిని వెనకాలకు నెట్టివేయవచ్చు. నిజమే, నీ నుండి కావలసినది ఇదే, కానీ ప్రజలు విధేయులై ఉండటానికి సంకల్పమును కలుగజేసేలా మరియు దేవుని నిర్వహణ కార్యములన్నిటికీ సమర్పించుకునేలా చేసే విజయం మాత్రమే దేవునికి కావలసినది. ఈ విధంగా, విషయాలు పూర్తిచేయబడతాయి. ఈనాడు, అత్యధిక ప్రజలు ఇప్పటికే జయించబడ్డారు, అయినా వారిలో తిరుగుబాటుతనం మరియు అవిధేయత ఇంకా ఉంది. ప్రజల నిజమైన స్థాయి ఇప్పటికీ మరీ సంకుచితంగానే ఉంటుంది, వారు నిరీక్షణలు మరియు అవకాశాలు కలిగియుంటే మాత్రమే వారు పూర్తి శక్తితో ఉరకలెత్తగలరు; నిరీక్షణలు మరియు అవకాశాలు లేకపోవడంవల్ల, వారు ప్రతికూలంగా మారతారు మరియు వారు దేవుణ్ణి వదిలేయాలని కూడా ఆలోచిస్తారు. అంతేగాకుండా, ప్రజలకు సాధారణ మానవత్వంతో జీవించాలనే గొప్ప కోరిక ఉండదు. ఇది ఆమోదయోగ్యం కాదు. కాబట్టి, నేను విజయం గురించి ఇంకా తప్పక మాట్లాడాలి. వాస్తవానికి, విజయం సంభవించిన సమయంలోనే పరిపూర్ణత సంభవిస్తుంది: నీవు జయించబడినప్పుడే పరిపూర్ణునిగా చేసే మొదటి ప్రభావాలన్నిటినీ పొందుకొనియుంటావు. జయించబడినవానిగాను మరియు పరిపూర్ణుడిగా తయారు చేయబడినవానిగాను ఉండుటకు మధ్య వ్యత్యాసం ఉందంటే, అది ప్రజలలో ఉన్నటువంటి స్థాయిని బట్టియే ఉంటుంది. పరిపూర్ణులనుగా తయారు చేయబడటానికి మొదటి అడుగు జయించబడినవారుగా ఉండడమే, దానర్థం వారు పూర్తిగా పరిపూర్ణులుగా చేయబడ్డారని కాదు లేదా వారిని దేవుడు పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకున్నాడని నిరూపించడం కాదు. ప్రజలు జయించబడిన తర్వాత, వారి స్వభావంలో కొన్ని మార్పులు కలుగుతాయి, కానీ అలాంటి మార్పులు దేవుడు పూర్తిగా ఆధీనం చేసుకున్న వ్యక్తులలోని మార్పుల కంటే చాలా తక్కువగా ఉంటాయి. అయితే ఈ రోజు ప్రజలను జయించడం, వారిని పరిపూర్ణులనుగా చేయడం అనే ప్రథమ కార్యము జరిగింది మరియు నువ్వు విజయాన్ని సాధించకపోయినట్లయితే, నీవు పరిపూర్ణుడిగా చేయబడడానికి మరియు దేవుడిచే పూర్తిగా ఆధీనంలోకి తీసుకోబడటానికి వేరే మార్గం ఏదీ లేదు. నీవు కేవలం శిక్ష మరియు తీర్పుకు సంబంధించిన కొన్ని మాటలను మాత్రమే పొందుతావు, కానీ అవి నీ హృదయాన్ని పూర్తిగా మార్చలేవు. ఆ విధంగా నీవు తొలగించబడినవారిలో ఒకడివి అవుతావు; ఇది బల్లపై ఉండే దివ్యమైన విందు భోజనాన్ని తినకుండా ఊరకే చూడటం కంటే పెద్ద వ్యత్యాసం ఏమీ కాదు. ఇది నీకు శొచనీయమైన సన్నివేశంగా అనిపించడం లేదా? కాబట్టి నీవు తప్పక మార్పులను కోరుకోవాలి: అది జయించబడటమైనా లేదా పరిపూర్ణుడిగా చేయబడటమైనా, ఈ రెండూ నీలో మార్పులు ఉన్నాయా మరియు నీలో విధేయత ఉందా లేదా అనేవాటికి సంబంధించి ఉంటాయి మరియు నీవు దేవుని మెప్పుకు గురి కాగలవా లేదా అనేదాన్ని ఇది నిర్ణయిస్తుంది. “జయించబడడం” మరియు “పరిపూర్ణుడిగా చేయబడటం” మరియు దేవుడి మీద నీ ప్రేమ ఎంత నిష్కల్మషమైనది అనేవి మార్పు మరియు విధేయత స్థాయి మీద మాత్రమే ఆధారపడి ఉంటాయని తెలుసుకోండి. ఈ రోజు కావలసింది ఏమిటంటే, నీవు పూర్తి పరిపూర్ణుడిగా తయారు చేయబడాలి, కానీ ముందుగా నీవు తప్పక జయించబడాలి, అంటే దేవుని శిక్ష మరియు ఆయన తీర్పు గురించి తగినంత జ్ఞానం, అనుసరించడానికి విశ్వాసం నీకు ఉండాలి మరియు నీవు మార్పును కోరుకునే మరియు దేవుడి గురించి జ్ఞానాన్ని కోరుకునే వాడివై ఉండాలి. అప్పుడే నీవు పరిపూర్ణతను కోరుకునే వాడివవుతావు. మీరు పరిపూర్ణులుగా తయారు చేయబడుతున్న క్రమంలో మీరు జయించబడతారనీ మరియు జయించబడుతున్న క్రమంలో మీరు పరిపూర్ణులుగా మార్చబడతారనీ మీరు అర్థం చేసుకోవాలి. ఈ రోజు, నీవు పరిపూర్ణునిగా తయారు చేయబడటాన్ని లేదా నీ బాహ్య స్వభావములో మార్పులను మరియు నీ సామర్థ్యంలో మెరుగుదలలను కోరుకోవచ్చు, కానీ నీవు అర్థం చేసుకోగలిగిన ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ రోజు దేవుడు చేసే ప్రతి కార్యానికి అర్థం ఉంది మరియు వాటి ద్వారా ప్రయోజనం ఉందని నీవు అర్థం చేసుకోవాలి: ఇలా అర్థం చేసుకున్నప్పుడు, అపవిత్రమైన భూమిలో జన్మించిన నిన్ను అపవిత్రత నుండి తప్పించుకోవడానికి మరియు దానిని విదిల్చివేయడానికి నీకు వీలు కల్పిస్తుంది, ఇది సాతాను ప్రభావాన్ని అధిగమించడానికి మరియు సాతాను చీకటి ప్రభావాన్ని వదిలివేసి ముందుకు సాగడానికి నీకు వీలు కల్పిస్తుంది. ఈ విషయాలపై దృష్టి సారించడం ద్వారా, ఈ అపవిత్రమైన భూమిలో నీవు రక్షించబడతావు. అంతిమంగా, ఏ సాక్ష్యం ఇవ్వమని నీవు కోరబడతావు? నీవు అపవిత్రమైన భూమిలో జన్మించావు కానీ మళ్లీ ఎప్పుడూ అపవిత్రత సోకకుండా, సాతాను ఆధిపత్యం క్రింద జీవీస్తున్నప్పటికిని, నీవు సాతాను ప్రభావానికి లోను కాకుండా, సాతాను నిన్ను ఆధీనంలోకి తీసుకోకుండా లేదా వేధించకుండా మరియు సర్వశక్తిమంతుడి చేతిలో జీవించడానికి పరిశుద్ధుడుగా మారగలవు. ఇదే సాక్ష్యం, మరియు సాతానుతో జరిగించే యుద్ధములో విజయము పొందామనుటకు ఇదే నిరూపణ. నీవు సాతానును విడిచిపెట్టగలవు, నీవు జీవించే జీవితములో సాతాను స్వభావాలను ఇకపై ఎప్పుడూ నీవు బహిర్గతము చేయవు, దానికి బదులుగా దేవుడు మానవుడిని సృష్టించినప్పుడు మానవుడు ఏమి పొందాలని ఆయన కోరుకున్నాడో దానిలో జీవిస్తావు; సాధారణ మానవత్వం, సాధారణ జ్ఞానం, సాధారణ అంతర్దృష్టి, దేవుణ్ణి ప్రేమించాలనే సాధారణ సంకల్పం మరియు దేవునిపట్ల నమ్మకత్వము. దేవుడు సృష్టించిన జీవి ఇచ్చే సాక్ష్యం ఇలాగే ఉంటుంది. అప్పుడు నీవు, “మేము అపవిత్ర భూమిలో జన్మించాము, కానీ దేవుని రక్షణ వలన, ఆయన నాయకత్వం వలన మరియు ఆయన మమ్మల్ని జయించినందున, మేము సాతాను ప్రభావం నుండి తప్పించుకున్నాము. ఈ రోజు మేము విధేయులై ఉండగలగటం కూడా దేవుడిచే జయించబడటం యొక్క ప్రభావమే, ఇది మేము మంచి వారమనో లేదా మేము దేవుణ్ణి సహజంగా ప్రేమించినందునో కాదు. దేవుడు మమ్మల్ని ఎంచుకున్నాడు కాబట్టి మరియు మమ్మల్ని ముందుగానే నిర్ణయించాడు కాబట్టి, ఈ రోజు మేము జయించబడ్డాము, ఆయనకు సాక్ష్యం ఇవ్వగలుగుతున్నాము మరియు ఆయనను సేవించగలుగుతున్నాము; అలాగే, ఆయన మమ్మల్ని ఎంచుకున్నాడు మరియు రక్షించాడు కాబట్టి, మేము సాతాను ఆధిపత్యం నుండి రక్షింపబడ్డాము మరియు విముక్తి పొందాము మరియు యెఱ్ఱని మహాఘటసర్పము యొక్క దేశంలో మేము అపవిత్రతను వదిలివేసి, పరిశుద్ధులము అవుచున్నాము” అని చెప్తావు. అంతేగాకుండా, నీవు బాహ్యంగా జీవించే విధానం నీవు సాధారణ మానవత్వాన్ని కలిగి ఉన్నావని, నీవు చెప్పేదానికి అర్ధం ఉందని మరియు నీవు ఒక సాధారణ వ్యక్తిలాగా జీవిస్తున్నావని చూపిస్తుంది. ఇతరులు నిన్ను చూసినప్పుడు, నిన్ను వారు “ఇది యెఱ్ఱని మహాఘటసర్పము ప్రతిబింబం కాదా?” అని అనుకునేలా నీవు చేయకూడదు. సహోదరీల ప్రవర్తన సహోదరికి తగినట్లు లేదు, సహోదరుల ప్రవర్తన సహోదరునికి తగినట్లు లేదు మరియు పరిశుద్ధులకు తగిన హుందాతనం నీకు లేదు. అప్పుడు ప్రజలు, “వారు మోయాబు వారసులని దేవుడు చెప్పడంలో ఆశ్చర్యమేమీ లేదు, ఆయన చెప్పింది అక్షరాలా నిజం!” అని అంటారు. “మీరు మోయాబు వారసులని దేవుడు చెప్పినప్పటికీ, మీరు జీవిస్తున్న దాని ప్రకారం మీరు సాతాను ప్రభావాన్ని వదిలివేసినట్లు రుజువైంది; ఆ విషయాలు ఇంకా మీలోపల ఉన్నప్పటికీ, మీరు వాటిని తిరస్కరించగలిగారు, కాబట్టి మీరు పూర్తిగా జయించబడ్డారని ఇది చూపుతుంది” అని మిమ్మల్ని చూసి ప్రజలు అంటారు. “మేము మోయాబు వారసులము అనడం నిజమే, కానీ మమ్మల్ని దేవుడు రక్షించాడు, గతంలో మోయాబు వారసులను ఇశ్రాయేలు ప్రజలు విడిచిపెట్టి, శపించి, అన్యుల మధ్య నుండి బహిష్కరించినప్పటికీ, ఈనాడు దేవుడు మమ్మల్ని రక్షించాడు. మేము ప్రజలందరిలో భ్రష్టుపట్టినవారము అనేది నిజం, ఇది దేవుడు నిశ్చయించినది, ఇది వాస్తవం మరియు ఇది ఎవరూ కాదనలేనిది. కానీ ఈనాడు మేము ఆ ప్రభావాన్ని తప్పించుకున్నాం. మేము మా పూర్వీకులను ద్వేషిస్తాము మరియు దేవుడి చిత్తం ప్రకారం నడుచుకుంటూ, మా నుండి ఆయన కోరిన వాటిని సాధిస్తూ మరియు దేవుడి చిత్తం యొక్క సంతృప్తిని పొందుతూ మా పూర్వీకులను తిరస్కరించడానికి, మా పూర్వీకులను పూర్తిగా త్యజించడానికి మరియు దేవుడి ఏర్పాట్లన్నింటినీ అనుసరించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మోయాబు దేవునికి నమ్మకద్రోహం చేశాడు, అతడు దేవుని చిత్తం ప్రకారం నడుచుకోలేదు మరియు అతడు దేవునిచే ద్వేషించబడ్డాడు. కానీ మనం దేవుని హృదయాన్ని జాగ్రత్తగా పట్టించుకోవాలి మరియు ఈ రోజు మనం దేవుడి చిత్తాన్ని అర్థం చేసుకున్నాము కాబట్టి, మనం దేవునికి నమ్మకద్రోహం చేయలేము మరియు మనం తప్పక మన పూర్వీకులను త్యజించాలి!” అని జయించబడిన మరియు రక్షించబడిన మీరందరూ చెప్తారు. ఇంతకు ముందు నేను యెఱ్ఱని మహాఘటసర్పమును త్యజించడం గురించి మాట్లాడాను మరియు ఈనాడు, ప్రధానంగా ప్రజల పాత పూర్వీకులను త్యజించడం గురించి మాట్లాడుతున్నాను. ఇది ప్రజల విజయానికి ఒక సాక్ష్యం, ఈరోజుకు నీవు ఎలా ప్రవెశించావన్నదానితో సంబంధం లేకుండా, ఈ విషయానికి సంబంధించి మీ సాక్ష్యం కొరత కలిగి ఉండకూడదు.

ప్రజల సామర్థ్యం మరీ తక్కువ, వారిలో సాధారణ మానవత్వం మరీ ఎక్కువగా లోపించింది, వారి ప్రతిస్పందనలు మరీ నెమ్మదిగా, మరీ మందకొడిగా ఉన్నాయి, సాతాను భ్రష్టత్వము వారిని మొద్దుబారిన వారిగాను మరియు తెలివితక్కువ వారిగాను తయారు చేసింది, వారు ఒకటి లేదా రెండు యేండ్లలో పూర్తిగా మారలేకపోయినా, వారిలో సహకరించడానికి సంకల్పాన్ని కలిగియుండాలి. ఇది సాతాను యెదుట కలిగియుండే సాక్ష్యం అని కూడా చెప్పవచ్చును. ఈనాటి సాక్ష్యం, ప్రస్తుత విజయం యొక్క కార్యము సాధించిన ప్రభావం, అలాగే భవిష్యత్తులో అనుసరించే వారికి ఒక మాదిరి మరియు ఆదర్శం. భవిష్యత్తులో, అన్ని దేశాలకు ఇది విస్తరిస్తుంది; చైనాలో జరిగిన కార్యము అన్ని దేశాలకు వ్యాపిస్తుంది. ప్రపంచ ప్రజలందరిలో మోయాబు వారసులు అత్యల్పులు. “హాము వారసులు అందరికంటే అత్యల్పులు కాదా?” అని కొంత మంది అడుగుతారు. యెఱ్ఱని మహాఘటసర్పము సంతానం మరియు హాము వారసులకు మధ్యన భిన్నమైన ప్రాతినిధ్య ప్రాముఖ్యత ఉంది మరియు హాము సంతాన విషయం వేరు: వారు ఎలా శపించబడ్డారనే విషయంతో సంబంధము లేకుండా, వారు ఇప్పటికీ నోవహు సంతానమే; అదే, మోయాబు మూలాలు పవిత్రమైనవి కావు: మోయాబు వ్యభిచారం నుండి వచ్చాడు మరియు తేడా ఇందులోనే ఉంది. ఇద్దరూ శపించబడినప్పటికీ, వారి స్థితులు ఒకేలా లేవు, కాబట్టే మోయాబు వారసులు ప్రజలందరిలో అత్యల్పులు–మరియు ప్రజలందరిలో అత్యల్పులను జయించడం కన్నా విశ్వసించదగిన వాస్తవం మరొకటి ఉండదు. అంత్యకాలపు కార్యము నియమాలన్నింటినీ అతిక్రమిస్తుంది మరియు నీవు శపించబడ్డావా లేదా శిక్షించబడ్డావా అనే దానితో సంబంధం లేకుండా, నీవు నా కార్యానికి తోడ్పడినంత కాలం మరియు ఈనాటి విజయం యొక్క కార్యానికి ప్రయోజనం చేకూర్చినంత కాలం మరియు నీవు మోయాబు వారసుడివైనా లేదా యెఱ్ఱని మహాఘటసర్పము సంతతి అయినా, కార్యపు ఈ దశలో నీవు దేవుడు సృష్టించిన జీవి విధిని నిర్వర్తించగలిగినంత కాలం మరియు నీవు చేయగలిగినంత అత్యుత్తమంగా చేసినంత కాలం, తగిన ప్రభావం సాధించబడుతుంది. నీవు యెఱ్ఱని మహాఘటసర్పము సంతతి మరియు నీవు మోయాబు వారసుడివి; మొత్తం మీద, రక్త మాంసములు కలిగిన ప్రతీది దేవుడు సృష్టించిన జీవులే మరియు సృష్టికర్త ద్వారా తయారు చేయబడినవారే. నీవు దేవుడు సృష్టించిన జీవివి, నీకు ఎలాంటి ఎంపిక ఉండకూడదు మరియు ఇది నీ విధి. నిజమే, ఈనాడు సృష్టికర్త కార్యము సమస్త విశ్వం వైపు నిర్దేశించబడింది. నీవు ఎవరి వారసుడివైనా, అన్నింటినీ మించి నీవు దేవుడు సృష్టించిన జీవులలో ఒకడివి, మోయాబు వారసులైన మీరు దేవుడు సృష్టించిన జీవులలో భాగమే, ఉన్న తేడా అంతా మీకు తక్కువ విలువ ఉండటంలోనే ఉంది. ఈనాడు, దేవుడి కార్యము అన్ని జీవుల మధ్య కొనసాగించబడుతూ సమస్త విశ్వాన్ని లక్ష్యం చేసుకుంది కాబట్టి, తన కార్యమును చేయడానికి సృష్టికర్తకు ఏ వ్యక్తులనైనా, విషయాలనైనా లేదా వస్తువులనైనా ఎంచుకునే స్వేచ్ఛ ఉంది. నీవు ఏ వంశం నుండి వచ్చావనే దాన్ని ఆయన పట్టించుకోడు; నీవు ఆయన సృష్టిలోని జీవులలో ఒకరుగా ఉన్నంత కాలం, ఆయన కార్యమునకు–విజయం యొక్క కార్యము మరియు సాక్ష్యం–నీవు ఉపయోగపడేలా ఉన్నంత కాలం–ఆయన ఎలాంటి సంకోచం లేకుండా నీలో తన కార్యాన్ని కొనసాగిస్తాడు. ఇది ప్రజల సాంప్రదాయక ఆలోచనలను చెదరగొడుతుంది, అంటే దేవుడు అన్యుల మధ్య, ప్రత్యేకించి శపించబడిన మరియు అల్పులైన వారి మధ్య పని చేయడనే ఆలోచనలను చెదరగొడుతుంది; శపించబడినవారి విషయములోనైతే, వారి నుండి వచ్చిన భవిష్యత్తు తరాలన్నీ రక్షణకు ఎటువంటి అవకాశం లేకుండా శాశ్వతంగా శపించబడతారు; దేవుడు పరిశుద్ధుడు గనుక ఎప్పటికీ అన్యుల దేశంలో దిగి కార్యము చేయడు, మరియు అపవిత్రమైనభూమిలో ఎప్పుడూ అడుగు పెట్టడు. అంత్య దినాలలో జరిగే దేవుని కార్యము ద్వారా ఈ ఆలొచనలన్నీ పటాపంచలు అయిపోయాయి. దేవుడు సమస్త జీవులకు దేవుడని, ఆయన భూమ్యాకాశములు మరియు సమస్తంపై ఆధిపత్యం కలిగి ఉన్నాడని మరియు ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే దేవుడు కాదని తెలుసుకోండి. కాబట్టి, చైనాలోని ఈ కార్యమునకు అత్యంత ప్రాముఖ్యత ఉంది మరియు ఇది అన్ని దేశాల మధ్య వ్యాపించదా? భవిష్యత్తుకు సంబంధించిన గొప్ప సాక్ష్యం కేవలం చైనాకు మాత్రమే పరిమితం కాదు; దేవుడే నిన్ను జయిస్తే, దయ్యాలు ఒప్పుకోగలవా? వాటికి జయించబడటం గూర్చి లేదా దేవుడి గొప్ప శక్తిని గూర్చి అర్థం కాదు మరియు విశ్వమంతటా దేవుడు ఎంచుకున్న ప్రజలు ఈ కార్యపు అంతిమ ప్రభావాలను చూసినప్పుడు మాత్రమే జీవులన్నీ జయించబడతాయి. మోయాబు వారసుల కంటే వెనుకబడ్డవారు లేదా చెడిపోయిన వారు ఎవరూ లేరు. దేవుడిని అంగీకరించని లేదా దేవుడు ఉన్నాడని విశ్వసించని అత్యంత చెడిపోయిన ఈ ప్రజలే జయించబడగలిగితే మరియు తమ నోళ్లతో దేవుడిని అంగీకరించి, ఆయనను స్తుతించి, ఆయనను ప్రేమించగలిగితే, ఇది విజయానికి సాక్ష్యం అవుతుంది. మీరు పేతురు కానప్పటికీ, మీరు పేతురు ప్రతిబింబంగా జీవిస్తున్నారు, మీరు పేతురు మరియు యోబు సాక్ష్యం పొందుకొనగలరు మరియు ఇది అత్యంత గొప్ప సాక్ష్యం. చిట్టచివరకు నీవు ఇలా అంటావు: “మేము ఇశ్రాయేలీయులము కాదు, త్యజించబడిన మోయాబు వారసులం, మేము పేతురు కాదు, అతని సామర్థ్యానికి మేము సరికాము లేదా మేము యోబు కాదు మరియు దేవుడి కోసం బాధలు సహించాలని మరియు తనను తాను దేవుడికి అంకితం చేసుకోవాలనుకున్న పౌలు సంకల్పంతో మమ్మల్ని పోల్చలేము కూడా, మేము చాలా వెనుకబడ్డ వారిమి, కాబట్టి దేవుడి ఆశీర్వాదాలను పొందేందుకు మేము అనర్హులము. అయినప్పటికీ, ఈనాడు దేవుడు మమ్మల్ని ఉద్ధరించాడు; కాబట్టి మేము తప్పక దేవుడిని సంతృప్తి పరచాలి, మాకు తగినంత సామర్థ్యం లేదా అర్హతలు లేకపోయినప్పటికీ, మేము దేవుడిని సంతృప్తిపరచడానికి సిద్ధంగా ఉన్నాము–మాకు ఈ సంకల్పం ఉంది. మేము మోయాబు వారసులము మరియు మేము శపించబడ్డాము. ఇది దేవుడి నిర్ణయము మరియు మేము దానిని మార్చలేము, కానీ మా జీవనము, మా జ్ఞానము మారగలదు మరియు మేము దేవుడిని సంతృప్తిపరచడానికి నిశ్చయించుకున్నాము.” నీకు ఈ సంకల్పం ఉన్నప్పుడు, నీవు జయించబడినట్లు సాక్ష్యమిచ్చావని ఇది రుజువు చేస్తుంది.

మునుపటి:  విజయ కార్యపు అంతర్గత సత్యము (1)

తరువాత:  విజయ కార్యపు అంతర్గత సత్యము (3)

సెట్టింగులు

  • వచనం
  • థీమ్స్

ఘన రంగులు

థీమ్స్

అక్షరశైలి

అక్షరశైలి పరిమాణం

గీతల మధ్య దూరం

గీతల మధ్య దూరం

పేజీ వెడల్పు

విషయ సూచిక

శోధించండి

  • ఈ వచనాన్ని శోధించండి
  • ఈ పుస్తకాన్ని శోధించండి

Connect with us on Messenger