విజయ కార్యపు అంతర్గత సత్యము (1)
దేవుడు ఉన్నాడని తెలియనంత మరియు దేవుడిని ఆరాధించడం మానేసేంత విపరీతంగా మానవజాతి సాతాను చేత చెరపబడింది. ప్రారంభంలో, ఆదాము మరియు హవ్వ సృష్టించబడినప్పుడు, యెహోవా మహిమ మరియు సాక్ష్యం ఎప్పుడూ ఉండేవి. కానీ చెరపబడిన తర్వాత, మనిషి మహిమ మరియు సాక్ష్యాన్ని కోల్పోయాడు, ఎందుకంటే ప్రతి ఒక్కరూ దేవుడికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు, ఆయనను గౌరవించడం పూర్తిగా మానేశారు. సృష్టించబడిన వారిలో సాక్ష్యం ఉండేలా అన్ని సాక్ష్యాలను మరియు అన్ని మహిమలను తిరిగి పొందడం మరియు మానవులందరూ దేవుడిని ఆరాధించేలా చేయడమే ఈనాటి విజయ కార్యపు ఉద్దేశం; ఈ దశలో చేయవలసిన కార్యము ఇదే. మానవజాతిని సరిగ్గా ఎలా జయించాలి? మానవుడిని పూర్తిగా ఒప్పించడానికి ఈ దశలోని వాక్యముల కార్యమును ఉపయోగించడం ద్వారా; అతనికి సంపూర్ణంగా నచ్చజెప్పడానికి బహిర్గతం చేయడం, తీర్పునివ్వడం, శిక్షించడం మరియు కనికరం లేకుండా శపించడం ద్వారా; మానవజాతి తన అవినీతిని, అశుద్ధతను తెలుసుకునేలా మరియు ఆవిధంగా వీటిని దేవుడి నీతిమంతమైన స్వభావాన్ని ప్రతిఫలింపజేసే మెరుపు కాగితంగా ఉపయోగించే మానవుని తిరుగుబాటును బహిర్గతం చేయడం మరియు అతని ప్రతిఘటనకు తీర్పునివ్వడం ద్వారా జయించాలి. ఈ వాక్యముల ద్వారానే ప్రధానంగా మానవుడు జయించబడతాడు మరియు పూర్తిగా ఒప్పించబడతాడు. మానవజాతిని అంతిమంగా జయించటానికి వాక్యములే సాధనాలు మరియు దేవుడి విజయాన్ని అంగీకరించే వారందరూ ఆయన వాక్యముల దండన మరియు తీర్పును తప్పక అంగీకరించాలి. ఈరోజు మాట్లాడే విధాన క్రమం ఖచ్చితంగా జయించే విధాన క్రమమే. అయితే, అసలు ప్రజలు ఎలా సహకరించాలి? ఈ వాక్యములను ఎలా తినాలో మరియు తాగాలో తెలుసుకోవడం మరియు వాటిని గురించి అవగాహన సాధించడం ద్వారా. ప్రజలు ఎలా జయించబడతారనేది వారే స్వయంగా చేయగలిగినది కాదు. ఈ వాక్యములను తినడం మరియు తాగడం, నీ చెరుపు మరియు నీ అశుద్ధతను, నీ తిరుగుబాటు మరియు మీ అవినీతిని తెలుసుకొని, దేవుడి యెదుట సాగిలపడటం ద్వారా మాత్రమే నీవు ఇదంతా చేయగలవు. దేవుడి చిత్తాన్ని గ్రహించిన తర్వాత, నీవు దానిని ఆచరించగలిగితే, నీకు దర్శనాలు ఉండి, ఈ వాక్యములకు సంపూర్ణంగా సమర్పించుకోగలిగితే మరియు నీవే స్వయంగా ఎలాంటి ఎంపికలు చేయకపోతే, అప్పుడు నీవు జయించబడినట్లే మరియు ఈ వాక్యముల ఫలితంగానే ఇది జరిగి ఉంటుంది. మానవజాతి సాక్ష్యాన్ని ఎందుకు కోల్పోయింది? ఎందుకంటే, దేవుడిపై ఎవరికీ నమ్మకం లేదు. ఎందుకంటే, దేవుడికి ప్రజల హృదయాల్లో స్థానం లేదు. మానవజాతిని జయించడమంటే, మానవజాతి విశ్వాసాన్ని పునరుద్ధరించడమే. ప్రజలు ఎల్లప్పుడూ భౌతిక ప్రపంచంలోకి వడివడిగా పరుగెత్తాలని అనుకుంటారు, వారు మరీ ఎక్కువ ఆశలను పెంచుకుంటారు, వారి భవిష్యత్తు కోసం అతిగా కోరుకుంటారు మరియు అనేక విపరీత కోరికలను కలిగి ఉంటారు. వారెప్పుడూ దేహాన్ని గురించే ఆలోచిస్తూ ఉంటారు, దేహం కోసం ప్రణాళిక చేస్తుంటారు మరియు దేవుడి గురించిన విశ్వాసపు మార్గాన్ని అన్వేషించడానికి ఆసక్తి కలిగి ఉండరు. వారి హృదయాలను సాతాను దోచుకుంది, వారు దేవుడి యందు తమ గౌరవాన్ని కోల్పోయారు మరియు వారు సాతానుపై స్థిరపరచబడ్డారు. కానీ, మానవుడిని దేవుడు సృష్టించాడు. ఆవిధంగా, మానవుడు సాక్ష్యాన్ని కోల్పోయాడు, అనగా అతడు దేవుడి మహిమను కోల్పోయాడు. దేవుడి పట్ల మానవుని గౌరవపు మహిమ తిరిగి పొందడమే మానవజాతిని జయించే ఉద్దేశం. దీన్ని ఈ విధంగా కూడా చెప్పవచ్చు: జీవితాన్ని అన్వేషించని మనుష్యులు అనేకులు ఉన్నారు; జీవితాన్ని అన్వేషించేవారు కొందరు ఉన్నప్పటికీ, అలాంటి వారు అతి కొద్దిమంది మాత్రమే. ప్రజలు ఎల్లప్పుడూ వారి భవిష్యత్తు గురించిన ఆలోచనలలోనే నిమగ్నమై ఉన్నారు మరియు జీవితం గురించి ఎలాంటి శ్రద్ధ చూపరు. కొంతమంది దేవుడికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తారు, ప్రతిఘటిస్తారు మరియు ఆయన వెనుక ఆయనను విమర్శిస్తారు మరియు సత్యాన్ని ఆచరించరు. ప్రస్తుతానికి వీరు ఉపేక్షించబడ్డారు; ఈ క్షణంలో, ఈ తిరుగుబాటు కుమారులకు ఏమీ చేయబడలేదు, కానీ భవిష్యత్తులో నీవు అంధకారంలో, రోధిస్తూ మరియు కోపంతో నీ పండ్లను కొరుకుతూ జీవిస్తావు. నీవు వెలుగులో జీవిస్తున్నప్పుడు దాని విలువ నీకు తెలియదు, కానీ నీవు చీకటి రాత్రిలో జీవిస్తున్నప్పుడు దాని విలువ నీవు తెలుసుకుంటావు, అప్పుడు నీవు చింతిస్తావు. ఇప్పుడు నీకు బాగా ఉన్నట్లే అనిపిస్తుంది, కానీ నీవు చింతించే రోజు వస్తుంది. ఆ రోజు వచ్చినప్పుడు, అంధకారం అలుముకుంటుంది మరియు వెలుగు ఇక కనిపించదు అప్పుడు పశ్చాత్తాపం చెందడానికి చాలా ఆలస్యం అవుతుంది. దీని కారణం, నేటి కార్యమును నీవు ఇప్పటికీ అర్థం చేసుకోలేకపోవడం, ఫలితంగా ఇప్పుడు నీకున్న సమయాన్ని ఆనందించడంలో విఫలమవుతున్నావు. సమస్త విశ్వపు కార్యము మొదలైన తర్వాత, అనగా ఈనాడు నేను చెప్పేదంతా సాకారమైనప్పుడు, అనేకమంది ప్రజలు తమ తలలు పట్టుకుంటారు మరియు ఆర్తితో కన్నీళ్లు కార్చుతారు. అలా చేయడం ద్వారా, వారు ఏడుస్తూ, కోపంతో పండ్లు నూరుతూ అంధకారంలో పడిపోరా? నిజంగా జీవితాన్ని అన్వేషించే మరియు పరిపూర్ణులుగా చేయబడిన వారందరూ ఉపయోగించుకోబడగలరు, కానీ ఉపయోగించుకోవడానికి అనర్హులైన తిరుగుబాటు కుమారులందరూ అంధకారంలో పడిపోతారు. వారు పరిశుద్ధాత్మ కార్యమును కోల్పోతారు మరియు దేనినీ అర్థం చేసుకోలేని వారు అవుతారు. ఆవిధంగా వారు శిక్షలోనికి తోయబడి వెక్కివెక్కి ఏడుస్తూ తల్లడిల్లుతారు. నీవు కార్యపు ఈ దశలో బాగా సర్వసన్నద్ధమైతే మరియు నీవు నీ జీవితంలో ఎదిగితే, అప్పుడు నీవు ఉపయోగించుకోవడానికి యోగ్యుడివి అవుతావు. నీవు సరిగ్గా సన్నద్ధం కాకపోతే, అప్పుడు నిన్ను తరువాతి దశ కార్యము కోసం పిలిచినప్పటికీ, నీవు ఉపయోగించుకోవడానికి అనర్హుడివిగా ఉంటావు—ఈ క్షణంలో నీవు స్వయంగా సన్నద్ధమవ్వాలనుకున్నా నీకు మరో అవకాశం ఉండదు. దేవుడు వెళ్లిపోయి ఉంటాడు; అప్పుడు నీ ముందున్న అవకాశం లాంటిదాన్ని అన్వేషించడానికి నీవు ఎక్కడికి వెళ్ళగలవు? దేవుడు స్వయంగా అందించిన అభ్యాసాన్ని అందుకోవడానికి నీవు ఎక్కడికి వెళ్ళగలవు? ఆ సమయానికి, దేవుడు స్వయంగా మాట్లాడుతూ లేదా తన స్వరాన్ని వినిపిస్తూ ఉండడు; నీవు చేయగలిగినదంతా ఈరోజు మాట్లాడుతూ ఉన్న విషయాలను చదవడమే—అప్పుడు అవగాహన చేసుకోవడం ఎలా సులభం అవుతుంది? ఈరోజు కంటే భవిష్యత్ జీవితం ఎలా బాగుండగలదు? ఆ సమయంలో, నీవు ఏడుస్తూ, కోపంతో పండ్లు నూరుతూ బతికున్న శవంగా బాధ పడతూ ఉండవా? నీకు ఇప్పుడు ఆశీర్వాదాలు ఇవ్వబడుతూ ఉన్నాయి, కానీ వాటిని ఎలా అనుభవించాలో నీకు తెలియదు; నీవు ఆశీర్వాదంలో జీవిస్తున్నావు, అయినా అది నీకు తెలియదు. నీవు బాధపడాలని రాసి ఉన్నట్లు ఇది రుజువు చేస్తుంది! ఈరోజు, కొందరు ప్రతిఘటిస్తారు, కొందరు తిరుగుబాటు చేస్తారు, కొందరు అదీ ఇదీ చేస్తారు, కానీ నేను దానిని పట్టించుకోను—కానీ నీవు చేస్తున్నదేమిటో నాకు తెలియదని అనుకోకు. మీ గుణగణాలు నాకు అర్థం కావా? నాతో ఎందుకు సంఘర్షణ పడుతూనే ఉన్నారు? నీ కోసం జీవితాన్ని మరియు ఆశీర్వాదాలను అన్వేషించడం కోసం నీవు దేవుడిని విశ్వసించవా? విశ్వాసం కలిగి ఉండటం అనేది నీ కోసమే కాదా? ప్రస్తుత తరుణంలో, నేను మాట్లాడటం ద్వారా మాత్రమే విజయపు కార్యమును చేస్తున్నాను మరియు ఈ విజయ కార్యము ముగిశాక, నీ అంతం తథ్యం. ఇది నేను నీకు స్పష్టంగా చెప్పాల్సి ఉందా?
ఈనాటి విజయ కార్యము మానవుని అంతం ఎలా ఉంటుందో స్పష్టంగా చెప్పడానికి ఉద్దేశించబడింది. నేటి శిక్ష మరియు తీర్పు అంత్యకాలములో గొప్ప శ్వేత సింహాసనం ముందు తీర్పు అని ఎందుకు చెప్పబడింది? నీకు ఇది కనిపించదా? విజయ కార్యము ఎందుకు అంతిమ దశగా ఉంది? ఇది ప్రతి వర్గపు మానవుడు ఎలాంటి అంతము పొందుతాడో ఉన్నదున్నట్లుగా సాక్షాత్కారం చేయించడం కోసం కాదా? ఇది ప్రతి ఒక్కరినీ, శిక్ష మరియు తీర్పునకు సంబంధించి విజయ కార్యపు క్రమంలో వారి నిజమైన రంగులను చూపించి, ఆ తర్వాత వారి రకాన్ని బట్టి వర్గీకరించడానికి అనుమతించడం కోసం కాదా? దీన్ని మానవజాతిని జయించడం అని చెప్పడానికి బదులు, ప్రతి వర్గపు వ్యక్తికి ఎలాంటి అంతం ఉండబోతుందో చూపించడం అని చెప్పడం బాగుంటుంది. ఇది ప్రజల పాపాలకు తీర్పునివ్వడం, ఆ తర్వాత వివిధ వర్గాల వ్యక్తులను బహిర్గతం చేయడం, తద్వారా వారు చెడ్డవారా లేదా నీతిమంతులా అని నిర్ణయించడం కోసం. విజయ కార్యము తర్వాత, మంచికి ప్రతిఫలమిచ్చే మరియు చెడును శిక్షించే కార్యము వస్తుంది. సంపూర్ణంగా విధేయత చూపే వ్యక్తులు—అంటే పూర్తిగా జయించబడినవారు—దేవుడి కార్యాన్ని విశ్వమంతా వ్యాపింపజేసే తర్వాతి దశలో ఉంచబడతారు; జయించబడనివారు విపత్తును ఎదుర్కోవడానికి అంధకారంలో ఉంచబడతారు. ఆవిధంగా మనిషి రకాన్ని బట్టి వర్గీకరించబడతాడు, మళ్లీ ఎప్పుడూ సూర్యకాంతి లేకుండా, దుష్టులు చెడు సమూహంగా వర్గీకరించబడతారు మరియు వెలుతురును పొందడానికి మరియు వెలుతురులో శాశ్వతంగా జీవించడానికి, నీతిమంతులు మంచి సమూహంగా వర్గీకరించబడతారు. అన్నింటికీ అంతం సమీపించింది; మనిషి అంతం అతని కళ్ళకే స్పష్టంగా చూపబడింది మరియు అన్నీ రకాన్ని బట్టి వర్గీకరించబడతాయి. అలాంటప్పుడు, ఒక్కొక్కరు ఒక్కో రకంగా వర్గీకరించబడడం వలన కలిగే క్షోభను మనుష్యులు ఎలా తప్పించుకోగలరు? అన్నింటికీ అంతం సమీపించినప్పుడు ప్రతి రకమైన వ్యక్తి అంతం బహిర్గతమవుతుంది మరియు ఇది సమస్త విశ్వపు విజయ కార్యము సమయంలో జరుగుతుంది (ప్రస్తుత కార్యముతో ప్రారంభించి, సమస్త విజయ కార్యముతో సహా). మొత్తం మానవజాతి అంతానికి సంబంధించి ప్రత్యక్షత, శిక్ష విధించే క్రమంలో మరియు అంత్యకాలములో విజయ కార్యము క్రమంలో తీర్పు పీఠం యెదుట జరుగుతుంది. మానవులను రకమును బట్టి వర్గీకరించడమంటే, ప్రజలను వారి అసలు వర్గాలకు తిరిగి తీసుకెళ్లడం కాదు, ఎందుకంటే సృష్టి సమయంలో మానవుడు సృష్టించబడినప్పుడు, కేవలం ఒకే రకమైన మానవుడు ఉన్నాడు, ఉన్న తేడా అంతా పురుషుడు మరియు స్త్రీ మధ్య మాత్రమే. అప్పుడు అనేక రకాల వ్యక్తులు లేరు. అనేక వేల యేండ్లు చెడిపోయిన తర్వాత మాత్రమే మానవులలోని విభిన్న వర్గాలు, కొందరు అశుద్ధ దయ్యాల ఆధిపత్యంలో, కొందరు దుష్ట దయ్యాల ఆధిపత్యంలో, జీవన విధానాన్ని అన్వేషించే మరికొందరు సర్వశక్తివంతుడి ఆధిపత్యంలో పుట్టుకొచ్చారు. ఈవిధంగా మాత్రమే ప్రజల మధ్య క్రమంగా వర్గాలు ఏర్పడతాయి మరియు ఈవిధంగా మాత్రమే పెద్ద మానవ కుటుంబంలోని ప్రజలు వర్గాలుగా విడిపోతారు. వ్యక్తులందరికీ వేరువేరు “తండ్రులు” ఉంటారు; ఇందులో ప్రతి ఒక్కరూ సర్వశక్తిమంతుడి ఆధిపత్యంలో ఉన్నారని కాదు, ఎందుకంటే మనిషికి మరీ ఎక్కువ తిరుగుబాటుతనం ఉంటుంది. నీతిమంతమైన తీర్పు దేనినీ దాచకుండా, ప్రతి రకం వ్యక్తి నిజ స్వభావాన్ని వెల్లడి చేస్తుంది. వెలుగులో ప్రతి ఒక్కరి అసలు ముఖం కనిపిస్తుంది. ఈ సమయంలో, మానవుడు ఆదిలో ఉన్నట్లుగా ఇకపై లేడు, అతని పూర్వీకుల అసలు పోలిక ఎప్పుడో కనుమరుగైంది, ఎందుకంటే లెక్కలేనంతమంది ఆదాము మరియు హవ్వల వారసులను సాతాను చాలా కాలంగా చెరబట్టింది, వారు ఇక ఎప్పటికీ పరలోక సూర్యుడిని తెలుసుకోలేరు, ఎందుకంటే ప్రజలలో అన్ని రకాల సాతాను విషం నిండిపోయింది. ఈవిధంగా, ప్రజలకు వారికి అనువైన గమ్య స్థానాలు ఉన్నాయి. అంతేకాకుండా, వారి విభిన్నమైన విషాల ఆధారంగా, రకాన్ని బట్టి వారు వర్గీకరించబడ్డారు, అంటే వారు ఈరోజు ఎంతమేరకు జయించబడ్డారు అనేదానిని బట్టి వేరుచేయబడ్డారు. ప్రపంచం సృష్టించబడినప్పటి నుండి మానవుని అంతం ముందుగా నిర్ణయించబడింది కాదు. ఎందుకంటే, ఆదిలో ఉమ్మడిగా “మానవజాతి” అని పిలవబడే ఒకేఒక వర్గం ఉండేది మరియు మానవుడు మొదట్లో సాతానుచే చెరపబడలేదు మరియు ప్రజలందరూ దేవుడి వెలుతురులో జీవించారు, వారిని ఎలాంటి అంధకారం కమ్ముకోలేదు. కానీ ఆ తర్వాత మానవుడు సాతానుచే చెడగొట్టబడ్డాడు, అన్ని రకాల మరియు స్వభావాల ప్రజలు—పురుషులు మరియు స్త్రీలతో కూడిన, ఉమ్మడిగా “మానవజాతి” అని పేరు పెట్టబడిన కుటుంబం నుండి వచ్చిన అన్ని రకాల మరియు స్వభావాల ప్రజలు భూగోళమంతా వ్యాపించారు. వారంతా వారి అతి ప్రాచీన పూర్వీకుల నుండి తప్పిపోయేలా వారి పూర్వీకులు—పురుషులు మరియు స్త్రీలతో కూడిన మానవజాతిచే (అనగా, ఆదిలో ఆదాము మరియు హవ్వలు, వారి అతిప్రాచీన పూర్వీకులు) నడిపించబడ్డారు. ఆ సమయంలో, భూమిపై యెహోవా చేత జీవితాలు నడిపించబడిన ప్రజలుగా ఇశ్రాయేలీయులు మాత్రమే ఉన్నారు. ఇశ్రాయేలు యావత్తు నుండి (అనగా అసలు కుటుంబ వంశం నుండి) ఉద్భవించిన విభిన్న రకాల ప్రజలు ఆతర్వాత యెహోవా మార్గదర్శకత్వాన్ని కోల్పోయారు. మానవ ప్రపంచ విషయాలను గురించి పూర్తిగా తెలియని ఈ ప్రారంభ కాలపు ప్రజలు, తదనంతరం వారి పూర్వీకులతో కలిసి వారు ఆక్రమించుకున్న భూభాగాలలో నివసించడానికి వెళ్లారు, అది ఈనాటికీ కొనసాగుతుంది. ఆవిధంగా వారు యెహోవాకు ఎలా దూరమయ్యారో మరియు వారు ఈరోజు వరకు అశుద్ధమైన దయ్యాలు మరియు దుష్ట ఆత్మలచే అన్ని రకాలుగా ఎలా చెడగొట్టబడ్డారో తెలియని అజ్ఞానులుగా ఉన్నారు. ఈనాటి వరకు విపరీతంగా చెడగొట్టబడిన మరియు విషతుల్యం చేయబడిన వారికి—అంతిమంగా రక్షించబడలేని వారికి—వారిని చెడగొట్టిన అశుద్ధ దయ్యాలైన వారి పూర్వీకులతో కలిసి వెళ్లడం తప్ప వేరే మార్గం ఉండదు. అంతిమంగా రక్షింపబడగలిగిన వారు మానవజాతి సముచిత గమ్య స్థానానికి వెళ్తారు, అనగా రక్షింపబడిన మరియు జయించబడిన వారి కోసం సురక్షితం చేయబడిన అంతిమ గమ్యానికి వెళ్తారు. రక్షింపబడగలిగిన వారందరినీ రక్షించడానికి ప్రతీది చేయబడుతుంది—కానీ మొద్దు స్వభావం గల మరియు నయం చేయలేని వ్యక్తులకున్న ఏకైక మార్గం, శిక్షతో కూడిన అగాథములోకి వారి పూర్వీకుల వెనక వెళ్లడమే. నీ అంతం ఆదిలోనే నిర్ణయించబడిందని, ఇప్పుడే బహిర్గతము చేయబడిందని అనుకోకు. నీవు ఆవిధంగా అనుకుంటే, మానవజాతి సృష్టి ప్రారంభ సమయంలో, ప్రత్యేకమైన సాతాను వర్గం సృష్టించబడలేదని నీవు మరచిపోయావా? ఆదాము మరియు హవ్వలతో కూడిన ఒకే మానవజాతి (అనగా పురుషుడు మరియు స్త్రీ మాత్రమే సృష్టించబడ్డారు) సృష్టించబడిందని నీవు మరచిపోయావా? ఒకవేళ నీవు ప్రారంభంలో సాతాను వారసుడివై ఉంటే, యెహోవా మనిషిని సృష్టించినప్పుడు, ఆయన తన సృష్టిలో సాతాను సమూహాన్ని కూడా చేర్చాడని దీని అర్థం కాదా? ఆయన అలాంటిది ఏదైనా చేసి ఉండగలడా? ఆయన తన సాక్ష్యం కోసం మనిషిని సృష్టించాడు; ఆయన తనను మహిమ పర్చుకోవడానికి మనిషిని సృష్టించాడు. ఆయన కావాలని తనను ప్రతిఘటించడానికి సాతాను సంతతి వర్గాన్ని ఉద్దేశపూర్వకంగా ఎందుకు సృష్టిస్తాడు? అలాంటి కార్యమును యెహోవా ఎలా చేయగలడు? ఆయన అలా చేసి ఉంటే, ఆయనను నీతిమంతుడైన దేవుడని ఎవరు అంటారు? మీలో కొంతమంది అంతంలో సాతానుతో వెళ్తారని నేను ఇప్పుడు చెప్పినప్పుడు, నీవు తొలి నుండి సాతానుతో ఉన్నావని కాదు; అలాగాకుండా, నీవు ఎంత దిగజారిపోయావంటే నిన్ను రక్షించాలని దేవుడు ప్రయత్నించినా, నీవు ఆ రక్షణ పొందలేకపోయావు. నిన్ను సాతానుతో కలిపి వర్గీకరించడం తప్ప మరో మార్గం లేదు. దీనికి ఏకైక కారణం నీవు రక్షించబడటానికి అతీతంగా ఉన్నావు, అంతేగానీ, దేవుడు నీ పట్ల అవినీతిమంతుడుగా ఉండటం మరియు ఉద్దేశపూర్వకంగా నీ తలరాతను సాతాను స్వరూపంగా నిర్ణయించడం, ఆపైన నిన్ను సాతానుతో వర్గీకరించడం మరియు ఉద్దేశపూర్వకంగా నిన్ను బాధలలో పడవేయాలని కోరుకోవడం వలన కాదు. అది విజయ కార్యము అంతర్గత సత్యం కాదు. నీవు నమ్మేది అదే అయితే, నీ అవగాహన ఎంతో ఏకపక్షంగా ఉంది! విజయం చివరి దశ ఉద్దేశం ప్రజలను రక్షించటం మరియు వారి అంతములను బహిర్గతం చేయడం. ఇది తీర్పు ద్వారా ప్రజల అధోగతిని వెల్లడించడం, తద్వారా వారు పశ్చాత్తాపం చెందేలా, తిరిగి లేచేలా మరియు జీవితాన్ని మరియు మానవ జీవితపు సరైన మార్గాన్ని అనుసరించేలా చేయడం. ఇది మొద్దుబారిన మరియు స్తబ్ధతతో కూడిన మనుష్యుల హృదయాలను మేల్కొలపడానికి మరియు తీర్పు ద్వారా వారి అంతర్గత తిరుగుబాటును చూపించడానికి. అయినా, ప్రజలు ఇంకా పశ్చాత్తాపం పొందలేకపోతే, మానవ జీవితానికి సరైన మార్గాన్ని అనుసరించలేకపోతే మరియు ఈ చెరుపులను పారద్రోలలేకపోతే, అప్పుడు వారు రక్షణ పొందడానికి అతీతులవుతారు మరియు సాతానుచే కబళించబడతారు. దేవుడి విజయం ప్రాముఖ్యత అలాంటిది: ప్రజలను రక్షించడం మరియు వారి అంతములను చూపించడం కూడా. మంచి అంతములు, చెడు అంతములు—అన్నీ విజయ కార్యము ద్వారా బహిర్గతం చేయబడతాయి. ప్రజలు రక్షింపబడతారా లేక శపించబడతారా అనేదంతా విజయ కార్యము సమయంలో బహిర్గతం చేయబడుతుంది.
అంత్యకాలము అనేది విజయం సాధించడం ద్వారా అన్నింటిని రకం ప్రకారం వర్గీకరించబడినప్పుడే సమీపిస్తుంది. విజయం సాధించడం అనేది అంత్యకాలము కార్యము; మరోలా చెప్పాలంటే, ప్రతి మనిషి పాపాలకు తీర్పునివ్వడమే అంత్యకాలపు కార్యము. లేకపోతే, ప్రజలు ఎలా వర్గీకరించబడగలరు? మీలో నిర్వహించబడిన వర్గీకరణ కార్యము, సమస్త విశ్వంలో అలాంటి కార్యానికి నాంది అవుతుంది. దీని తర్వాత, అన్ని దేశాలు మరియు ప్రజలందరూ కూడా విజయ కార్యానికి లోబడి ఉంటారు. అంటే, సృష్టిలోని ప్రతీ వ్యక్తి రకం ప్రకారం వర్గీకరించబడతారని, తీర్పు పొందడానికి తీర్పునిచ్చే పీఠం యెదుట నిలుపబడతారని అర్థం. ఏ వ్యక్తి మరియు ఏ వస్తువు ఈ శిక్ష మరియు తీర్పు నుండి తప్పించుకోలేవు, లేదా ఏ వ్యక్తి లేదా ఏ వస్తువు రకాన్ని బట్టి వర్గీకరించబడకుండా ఉండదు; ప్రతి వ్యక్తి వర్గీకరించబడతాడు, ఎందుకంటే అన్నింటికి అంతం సమీపిస్తుంది మరియు పరలోకం మరియు భూలోకం అన్నీ తమ అంతానికి చేరుకున్నాయి. మానవ అస్థిత్వపు అంతిమ దినాలను మనిషి ఎలా తప్పించుకోగలడు? ఆవిధంగా, మీ అవిధేయత చర్యలు ఎంతకాలం కొనసాగవచ్చు? మీ అంత్యకాలము సమీపించినట్లు మీకు కనిపించలేదా? దేవుడిని గౌరవించి, ఆయన సాక్షాత్కారం కోసం ఆరాటపడే వారు, దేవుడి నీతి దర్శనమిచ్చే రోజును చూడకుండా ఎలా ఉండగలరు? మంచితనానికి వారు అంతిమ ప్రతిఫలాన్ని పొందకుండా ఎలా ఉండగలరు? నీవు మంచి చేసే వారిలో ఒకడివా లేక చెడు చేసే వాడివా? నీవు నీతిమంతమైన తీర్పును అంగీకరించి, విధేయత చూపేవాడివా లేక నీతిమంతమైన తీర్పును అంగీకరించి, శాపగ్రస్తుడయ్యేవాడివా? నీవు తీర్పునిచ్చే పీఠం యెదుట వెలుగులో జీవిస్తావా లేక అంధకారం మధ్య పాతాళములో జీవిస్తావా? నీ అంతము ప్రతిఫలంతో కూడుకున్నదిగా ఉంటుందా లేక శిక్షతో కూడుకున్నదిగా ఉంటుందా అని చాలా స్పష్టంగా తెలిసిన వాడివి నీవే కాదా? దేవుడు నీతిమంతుడని చాలా స్పష్టంగా తెలిసిన మరియు అత్యంత లోతుగా అర్థం చేసుకున్న వాడివి నీవే కాదా? కాబట్టి, అసలు నీ నడవడిక మరియు హృదయం ఎలా ఉన్నాయి? ఈరోజు నేను నిన్ను జయించినప్పుడు, నీ ప్రవర్తన మంచిదా లేదా చెడ్డదా అని నేను చెప్పాల్సిన అవసరం నిజంగా నీకు ఉందా? నా కోసం నీవు ఎంత వదులుకున్నావు? నన్ను నీవు ఎంత గాఢంగా ఆరాధిస్తావు? నీవు నా పట్ల ఎలా ప్రవర్తిస్తావో నీకే స్పష్టంగా తెలియదా? నీకు చివరకు ఏ అంతం లభిస్తుందో అందరికంటే నీకే బాగా తెలియాలి! నిజంగా, నేను నీకు చెబుతున్నాను: నేను మానవాళిని మాత్రమే సృష్టించాను, నిన్ను కూడా సృష్టించాను, కానీ మిమ్మల్ని నేను సాతానుకు అప్పగించలేదు; నేను ఉద్దేశపూర్వకంగా మీరు నాపై తిరుగుబాటు చేసేలా లేదా నన్ను ప్రతిఘటించేలా, ఆ కారణంతో నాతో శిక్షించబడేలా చేయలేదు. ఈ విపత్తులు మరియు వ్యధలన్నిటికీ కారణం, మీ హృదయాలు చాలా కఠినంగా ఉండటం మరియు మీ నడవడిక చాలా హేయంగా ఉండటమే కాదా? కాబట్టి మీరు పొందబోయే అంతం మీరే నిర్ణయించుకున్నది కాదా? మీరు ఎలా అంతమవుతారో మరెవరికన్నా బాగా మీ మనస్సుకే తెలియదా? నేను ప్రజలను జయించటానికి కారణం వారికి బహిర్గతము చేయడానికి మరియు నీకు రక్షణ తీసుకురావడాన్ని మెరుగుపర్చడానికి. ఇది నీవు చెడుకు పాల్పడేలా చేయడానికి కాదు లేదా ఉద్దేశపూర్వకంగా నిన్ను వినాశపు నరకంలోకి నడిచి వెళ్లేలా చేయడానికి కాదు. సమయం వచ్చినప్పుడు, నీ అంతులేని బాధలు, నీ ఏడుపు మరియు కోపంతో పండ్లు నూరడం—ఇవన్నీ నీ పాపాల వల్ల కలిగేవి కావా? ఆవిధంగా, స్వయంగా నీ మంచితనం లేదా స్వయంగా నీ చెడుతనమే నీకు అత్యుత్తమ తీర్పు కాదా? నీ అంతం ఎలా ఉండబోతుందో చెప్పడానికి ఇది అత్యుత్తమ రుజువు కాదా?
ఈరోజు, నేను చైనాలో దేవుడు ఎంచుకున్న వ్యక్తులలో వారి తిరుగుబాటు స్వభావాలన్నింటినీ బహిర్గతం చేయడానికి మరియు వారి వికారాలన్నింటి ముసుగు తీయడానికి పని చేస్తున్నాను మరియు నేను చెప్పాల్సిదంతా చెప్పడానికి ఇది సందర్భాన్ని కల్పిస్తున్నది. ఆతర్వాత, నేను సమస్త విశ్వాన్ని జయించే విజయ కార్యపు తదుపరి దశను కొనసాగించినప్పుడు, సమస్త విశ్వంలో ప్రతి ఒక్కరి అవినీతికి తీర్పునివ్వడానికి మీ గురించి నేను నా నిర్ణయాన్ని ఉపయోగిస్తాను, ఎందుకంటే మీరు మానవజాతిలో తిరుగుబాటుదారులకు ప్రతినిధులు. తమను తాము మెరుగుపర్చుకోలేని వారు మెరుపు కాగితాలు మరియు సేవా వస్తువులు మాత్రమే అవుతారు, అదే తమను తాము బాగుపర్చుకోగల వారు ఉపయోగించుకోబడతారు. మెరుగుపర్చుకోలేని వారు మెరుపు కాగితాలుగా మాత్రమే పనిచేస్తారని నేను ఎందుకు చెప్తున్నాను? ఎందుకంటే, నా ప్రస్తుత మాటలు మరియు కార్యము అంతా మీ నేపథ్యాన్ని లక్ష్యంగా చేసుకుంటాయి, ఎందుకంటే మీరు సమస్త మానవాళిలో తిరుగుబాటుదారులకు ప్రతినిధులు మరియు కేంద్రబిందువు. తర్వాత, మిమ్మల్ని జయించే ఈ మాటలను అన్యదేశాలకు తీసుకెళ్తాను మరియు అక్కడి ప్రజలను జయించడానికి వాటిని ఉపయోగిస్తాను, అయినా వాటిని నీవు పొంది ఉండలేవు. అది నిన్ను ఒక మెరుపు కాగితంలా మార్చదా? సమస్త మానవజాతి చెడు స్వభావాలు, మానవుని తిరుగుబాటు చర్యలు మరియు మనిషి వికారమైన స్వరూపాలు మరియు ముఖాలు—ఇవన్నీ ఈనాడు మిమ్మల్ని జయించడానికి ఉపయోగించే వాక్యములలో రికార్డు చేయబడ్డాయి. ఆతర్వాత నేను ప్రతి దేశ మరియు ప్రతి జాతి ప్రజలను జయించటానికి ఈ వాక్యములనే ఉపయోగిస్తాను, ఎందుకంటే మీరు దృష్టాంతమైన ఒకే మూలరూపం. అయినా, నేను మిమ్మల్ని ఉద్దేశపూర్వకంగా వదిలివేయడానికి నిర్ణయించుకోలేదు; నీవు బాగా అన్వేషించడంలో విఫలమైతే, అందుచేత నీవు నయం చేయబడలేని వాడివని నిరూపించుకుంటే, అప్పుడు నీవు కేవలం సేవా వస్తువు మరియు మెరుపు కాగితానివి కాదా? నా జ్ఞానం సాతాను కుట్రలపై ఆధారపడి పని చేస్తుందని నేను ఒకప్పుడు చెప్పాను. నేను ఎందుకు అలా చెప్పాను? ఇప్పుడు నేను చెబుతున్న, చేస్తున్న దాని వెనుక ఉన్న సత్యం అది కాదా? నీవు మెరుగుపర్చుకోలేకపోతే, నీవు పరిపూర్ణుడుగా మారకుండా శిక్షించబడితే, నీవు మెరుపు కాగితానివి కావా? నీవు నీ కాలములో చాలా ఎక్కువుగా బాధపడి ఉండవచ్చు, అయినా నీకు ఇప్పటికీ ఏమీ అర్థం కాలేదు; నీకు జీవితంలో ఏదీ తెలియదు. నీవు శిక్షించబడినప్పటికీ, తీర్పు పొందినప్పటికీ, నీవు ఏమాత్రం మారలేదు మరియు నీ అంతరంగపు లోతులలో, నీవు జీవితాన్ని పొందలేదు. నీ పనిని పరీక్షించే సమయం వచ్చినప్పుడు, నీవు అగ్ని లాగా భయంకరమైన విచారణను మరియు అంతకంటే దారుణమైన యాతనను అనుభవిస్తావు. ఈ అగ్ని నీ సమస్తాన్ని కాల్చి బూడిద చేస్తుంది. జీవం లేని వ్యక్తిగా, లోపల ఒక్క ఔన్స్ కూడా స్వచ్ఛమైన బంగారం లేని వ్యక్తిగా, ఇప్పటికీ ఆ పాత చెడు స్వభావంలో చిక్కుకుపోయిన వ్యక్తిగా మరియు మెరుపు కాగితంలా ఉంటూ ఒక్క మంచి పని కూడా చేయలేని వ్యక్తిగా, తొలగించబడకుండా నీవు ఎలా ఉండగలవు? ఒక్క చిల్లిగవ్వ విలువ కూడా లేని, జీవం లేని వ్యక్తి విజయ కార్యమునకు ఏమైనా ఉపయోగపడగలడా? ఆ సమయం వచ్చినప్పుడు, మీ రోజులు నోవహు మరియు సొదొమ కంటే దుర్భరంగా ఉంటాయి! అప్పుడు నీ ప్రార్థనలు నీకు ఎలాంటి మేలు చేయవు. రక్షణ కార్యము అప్పటికే ముగిసిపోయాక, తర్వాత నీవు మళ్లీ వెనక్కు వచ్చి, కొత్తగా ఎలా పశ్చాత్తాపపడగలవు? రక్షణ కార్యమంతా పూర్తయిన తర్వాత, ఇక అక్కడ ఏమీ ఉండదు; అక్కడున్నదల్లా చెడ్డ వారిని శిక్షించే కార్యము మొదలవ్వడం మాత్రమే. నీవు ప్రతిఘటిస్తావు, నీవు తిరుగుబాటు చేస్తావు మరియు చెడ్డవని నీకు తెలిసిన పనులు చేస్తావు. నీవు కఠినమైన శిక్షకు అర్హుడివి కాదా? నేను ఈరోజు నీ కోసం దీనిని చెప్తుతున్నాను. నీవు వినకూడదనుకుంటే, తర్వాత నీకు విపత్తు ముంచుకొచ్చినప్పుడు, అప్పుడు నీవు పశ్చాత్తాపం చెందడం మరియు విశ్వసించడం మొదలుపెడితే చాలా ఆలస్యమై పోదా? పశ్చాత్తాపపడేందుకు నీకు ఈరోజు నేను ఒక అవకాశం ఇస్తున్నాను, కానీ అలా చేయడానికి నీవు సిద్ధంగా లేవు. నీవు ఎంతకాలం వేచి ఉండాలనుకుంటున్నావు? శిక్ష విధించే రోజు వరకా? ఈరోజు నీ గత అతిక్రమణలు నాకు గుర్తులేవు; నేను ప్రస్తుతం చెప్పే మాటలు మరియు కార్యము అన్నీ నిన్ను రక్షించడానికి ఉద్దేశించబడినవే మరియు నీ మీద నాకు ఎలాంటి చెడు ఉద్దేశం లేదు కాబట్టి నేను నీ చెడును చూడకుండా, మంచిని మాత్రమే చూడడానికి నేను నిన్ను పదే పదే క్షమిస్తాను. ఇప్పటికీ నీవు అంగీకరించడానికి నిరాకరిస్తున్నావు; నీవు చెడులో ఉండి మంచిని చెప్పలేవు మరియు కరుణను ఎలా మెచ్చుకోవాలో నీకు తెలియదు. అలాంటి మనుష్యులు కేవలం శిక్ష మరియు నీతివంతమైన ప్రాయశ్చిత్తం కోసం మాత్రమే ఎదురుచూడరా?
మోషే బండను కొట్టినప్పుడు, యెహోవా దేవుడిచ్చిన నీరు ప్రవహించడానికి కారణం, అతని విశ్వాసమే. యెహోవానైన నన్ను స్తుతిస్తూ, దావీదు వీణ వాయించినప్పుడు, అతని హృదయం సంతోషముతో నిండిపోవడానికి కారణం, అతని విశ్వాసమే. పర్వతాలంతయూ నిండిన పశువులను, చెప్పశక్యము కాని సంపదను యోబు పోగొట్టుకున్నప్పుడు, అతని శరీరం పుండ్లు పడినప్పుడు కూడా అతను వాటిని భరించడానికి కారణం, అది అతని విశ్వాసమే. అతను యెహోవానైన నా స్వరాన్ని వినగలగడం, యెహోవానైన నా మహిమను చూడడానికి కారణం, అతని విశ్వాసమే. పేతురు యేసుక్రీస్తును వెంబడించడానికి కారణం, అతని విశ్వాసమే. నా కోసం అతడు సిలువకు కొట్టబడడం, మహిమాన్వితమైన సాక్ష్యాన్ని ఇవ్వగలగడానికి కారణం కూడా అతని విశ్వాసమే. మనుష్యకుమారుని మహిమాన్విత రూపాన్ని యోహాను చూడడానికి కారణం, అతని విశ్వాసమే. అతను అంత్య దినాల దర్శనాన్ని చూడడానికి కారణం, అతని విశ్వాసమే. అన్యజనుల దేశాల సమూహాలుగా పిలవబడే వారు నా ప్రత్యక్షతను పొందటానికి కారణం, నేను మానవుల మధ్య నా పని చేయడానికి శరీరముతో తిరిగి వచ్చానని తెలుసుకోవటానికి కారణం కూడా వారి విశ్వాసమే. నా కటువైన మాటలకు చలించిపోయినప్పటికీ, ఆ మాటలద్వారా ఉపశమనము పొంది, రక్షింపబడిన వారందరూ వారి విశ్వాసం కారణంగానే అలా చేసిన వారు కాదా? తమ విశ్వాసం కారణంగా ప్రజలు చాలా పొందారు మరియు ఇదంతా అన్నివేళలా ఆశీర్వాదం కాదు. వారు దావీదు అనుభవించినంత ఆనందాన్ని మరియు సంతోషాన్ని పొందకపోవచ్చు లేదా మోషే లాగా యెహోవా ప్రసాదించిన జలాన్ని పొందలేకపోవచ్చు. ఉదాహరణకు, యోబు తన విశ్వాసం ప్రకారం యెహోవా చేత ఆశీర్వదించబడ్డాడు, అయినా అతను కూడా విపత్తును అనుభవించాడు. నీవు ఆశీర్వదించబడినా లేక విపత్తును అనుభవించినా, రెండూ ఆశీర్వదించబడిన పరిణామాలే. విశ్వాసం లేకుండా, ఈరోజు నీ కంటి ముందు ప్రదర్శించబడిన యెహోవా కార్యములను చూడటం మాట అటుంచి, నీవు ఈ విజయ కార్యమును పొందగలిగి ఉండేవాడివి కూడా కాదు. నీవు పొందగలిగే మాట అటుంచి, అసలు చూడగలిగి ఉండేవాడివే కాదు. ఈ ఆపదలు, ఈ విపత్తులు మరియు ఈ తీర్పులన్నీ—అవి నీకు కలగకపోతే, ఈరోజు నీవు యెహోవా కార్యములను చూడగలిగి ఉంటావా? ఈరోజు, నీవు జయించబడటానికి అనుమతించేది విశ్వాసమే మరియు యెహోవా ప్రతి కార్యమును నీవు విశ్వసించగలిగేలా చేసేది నీవు జయించబడటమే. అలాంటి శిక్ష మరియు తీర్పు నీవు పొందడానికి కారణం విశ్వాసం మాత్రమే. ఈ శిక్ష మరియు తీర్పు ద్వారానే, నీవు జయించబడతావు మరియు పరిపూర్ణుడివి అవుతావు. ఈరోజు నీవు పొందుతున్న ఈ రకమైన శిక్ష మరియు తీర్పు లేకుండా, నీ విశ్వాసం వృధా అవుతుంది, ఎందుకంటే, నీవు దేవుడిని తెలుసుకోవు; నీవు ఎంతగా ఆయనను విశ్వసించినప్పటికీ, నీ విశ్వాసం వాస్తవికత పునాది లేని శూన్యంగా ఉండి పోతుంది. నీవు ఈ విజయ కార్యమును పొందిన తర్వాత, నీ విశ్వాసం నిజం మరియు విశ్వసనీయమైనదిగా అయ్యేలా మరియు నీ హృదయం దేవుడి వైపు మరలేలా నిన్ను పూర్తిగా విధేయులుగా చేసేది ఈ కార్యము మాత్రమే. “విశ్వాసం” అనే ఈ పదం కారణంగా నీవు గొప్ప తీర్పు మరియు శాపం పొందినప్పటికీ, నీకు నిజమైన విశ్వాసం ఉంటే, నీవు అత్యంత సత్యమైన, అత్యంత వాస్తవమైన మరియు అత్యంత అమూల్యమైన దానిని పొందుతావు. ఇది ఎందుకంటే, తీర్పు క్రమంలో మాత్రమే దేవుడు సృష్టించిన జీవుల అంతిమ గమ్య స్థానాన్ని నీవు చూస్తావు కాబట్టి; ఈ తీర్పులో సృష్టికర్త ప్రేమించబడాలని నీవు చూస్తావు కాబట్టి; అటువంటి విజయ కార్యములో నీవు దేవుడి చేతిని పట్టుకుంటావు కాబట్టి; ఈ విజయంలోనే మానవ జీవితాన్ని నీవు సంపూర్ణంగా అర్థం చేసుకుంటావు కాబట్టి; ఈ విజయంలోనే నీవు మానవ జీవితానికి సరైన మార్గాన్ని పొందుతావు మరియు “మానవుడు” అనే మాటకు నిజమైన అర్థాన్ని అవగాహన చేసుకుంటావు కాబట్టి; ఈ విజయంలో మాత్రమే నీవు సర్వశక్తిమంతుడి నీతిమంతమైన స్వభావాన్ని మరియు ఆయన అందమైన, మహిమగల ముఖాన్ని చూస్తావు కాబట్టి; ఈ విజయ కార్యములో మానవుడి మూలం గురించి తెలుసుకుంటావు మరియు మొత్తం మానవజాతి “శాశ్వత చరిత్ర” గురించి అర్థం చేసుకుంటావు కాబట్టి; ఈ విజయంలో నీవు మానవజాతి పూర్వీకులను మరియు మానవజాతి చెడిపోవడానికి సంబంధించిన మూలాన్ని అర్థం చేసుకుంటావు కాబట్టి; ఈ విజయంలో నీవు సంతోషం మరియు సమాధానంతో పాటు అంతులేని శిక్షను, క్రమశిక్షణను మరియు సృష్టికర్త నుండి ఆయన సృష్టించిన మానవాళికి అపవాదులను పొందుతావు కాబట్టి; ఈ విజయ కార్యములోనే నీవు దీవెనలతో పాటు మానవుడికి బాకీ ఉన్న విపత్తులను కూడా పొందుతావు కాబట్టి. ఇదంతా నీకున్న కాస్తంత విశ్వాసం వల్ల కాదా? నీవు వీటిని పొందాక నీ విశ్వాసం పెరగలేదా? నీవు విపరీతమైన మొత్తంలో పొందలేదా? నీ వు దేవుడి వాక్యమును వినడం మరియు దేవుడి జ్ఞానాన్ని చూడడమే కాకుండా, నీవు ఆయన కార్యపు ప్రతి దశను వ్యక్తిగతంగా అనుభవించావు. నీకు విశ్వాసం లేకపోతే, నీవు ఈ రకమైన శిక్ష లేదా ఈ రకమైన తీర్పును అనుభవించి ఉండేవాడివి కాదని నీవు అనవచ్చు. విశ్వాసం లేకుండా, సర్వశక్తిమంతుడి నుండి ఈ రకమైన శిక్షను లేదా సంరక్షణను పొందలేకపోవడమే కాకుండా, నీవు సృష్టికర్తను కలిసే అవకాశాన్ని కూడా శాశ్వతంగా కోల్పోతావని నీవు తెలుసుకోవాలి. మానవజాతి మూలాన్ని ఎన్నటికీ తెలుసుకోవు మరియు మానవ జీవితపు ప్రాముఖ్యతను కూడా నీవు ఎన్నటికీ అర్థం చేసుకోవు. నీ శరీరం మరణించి, నీ ఆత్మ వెళ్ళిపోయినప్పటికీ, మానవజాతిని సృష్టించిన తర్వాత సృష్టికర్త భూమిపై ఇంత గొప్ప కార్యము చేశాడనేది నీవు తెలుసుకోవడం మాట అటుంచి, నీవు ఇంకను సృష్టికర్త అన్ని కార్యములను అర్థం చేసుకోవు. ఆయన సృష్టించిన ఈ మానవజాతిలోని ఒక సభ్యుడిగా, నీవు అజ్ఞానంతో ఈవిధంగా అంధకారంలో పడిపోయి, నిత్య శిక్షను అనుభవించాలనుకుంటున్నావా? ఈనాటి శిక్ష మరియు తీర్పు నుండి నిన్ను నీవు వేరుపర్చుకుంటే, నీవు సాధించబోయేది ఏమిటి? ప్రస్తుతపు తీర్పు నుండి వేరుపడిన తర్వాత, ఈ కష్టతరమైన జీవితం నుండి నీవు తప్పించుకోగలవని అనుకుంటున్నావా? నీవు “ఈ ప్రదేశం” వదిలేస్తే, నీవు ఎదుర్కోబోయేది దయ్యం కలగజేసే బాధాకరమైన యాతన లేదా క్రూరమైన దురాచారం మాత్రమే అనేది నిజం కాదా? నీవు సహించలేని పగళ్లు మరియు రాత్రులను ఎదుర్కోవచ్చా? ఈరోజు నీవు ఈ తీర్పు నుండి తప్పించుకోవడం ద్వారా, నీవు ఈ భవిష్యత్తు యాతనను ఎప్పటికీ తప్పించుకోగలనని అనుకుంటున్నావా? నీ మార్గంలో వచ్చేది ఏమిటి? నిజంగా అది నీవు ఆశిస్తున్న షాంగ్రి—లా కాగలదా? నీవు ఇప్పుడు చేస్తున్నట్లు వాస్తవికత నుండి పారిపోవడం ద్వారా మాత్రమే భవిష్యత్తులో శాశ్వతమైన శిక్ష నుండి తప్పించుకోగలనని నీవు అనుకుంటున్నావా? ఈనాటి తర్వాత, నీవు ఇలాంటి అవకాశం మరియు ఇలాంటి ఆశీర్వాదం తిరిగి ఎప్పటికైనా పొందగలవా? నీ నెత్తిన విపత్తు వచ్చి పడినప్పుడు వాటిని నీవు పొందగలవా? సమస్త మానవజాతి విశ్రాంతిలోకి జారుకున్నప్పుడు నీవు వాటిని పొందగలవా? నీ ప్రస్తుతపు ఆనందకరమైన జీవితం మరియు సామరస్యంతో నిండిన నీ చిన్న కుటుంబం—ఇవి నీ భవిష్యత్తులోని శాశ్వత గమ్య స్థానానికి ప్రత్యామ్నాయం కాగలవా? నీకు నిజమైన విశ్వాసం ఉంటే, నీ విశ్వాసం కారణంగా నీవు చాలా ఎక్కువ సాధిస్తే, ఆ సాధించిందంతా ఒక సృష్టించబడిన జీవిగా—నీవు ఏమి పొందాలి మరియు మొదటగా నీకు ఏమి ఉండాలి అనేదే. నీ విశ్వాసానికి మరియు జీవితానికి అలాంటి విజయం కంటే ఏదీ ఎక్కువ ప్రయోజనకరం కాదు.
జయించబడిన వారిని దేవుడు ఏమి అడుగుతాడో, పరిపూర్ణులైన వారి పట్ల ఆయన ధోరణి ఏమిటో మరియు ప్రస్తుతం నీవు దేనిలోకి ప్రవేశించాలో, ఈరోజు నీవు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని విషయాలను నీవు కొంచెం మాత్రమే అర్థం చేసుకోవాల్సి ఉంది. కొన్ని మార్మిక పదాలను నీవు జల్లెడ పట్టాల్సిన అవసరం లేదు; అవి జీవితానికి అంతగా సహాయపడవు మరియు వాటిని అలా త్వరితంగా చూడటం మాత్రమే అవసరం. ఆదాము మరియు హవ్వ మర్మాల వంటి రహస్యాలను నీవు చదవవచ్చు: అప్పుడు ఆదాము మరియు హవ్వ ఎలా ఉండేవారు మరియు ఈ రోజు దేవుడు ఏమి చేయాలనుకుంటున్నాడు లాంటి రహస్యాలు. మానవుడిని జయించడం మరియు పరిపూర్ణుడిగా చేయడంలో, దేవుడు మానవుడిని ఆదాము మరియు హవ్వల మార్గం లోనికి వెనక్కు తీసుకురావాలనుకుంటున్నాడని నీవు అర్థం చేసుకోవాలి. నీవు దేవుడి ప్రమాణాలను సాధించడానికి నీవు తప్పక పొందవలసిన పరిపూర్ణత స్థాయిని గురించి నీ హృదయంలో మంచి ఆలోచన ఉండాలి, ఆతర్వాత నీవు దానిని సాధించడానికి తప్పక కృషి చేయాలి. ఇది నీ ఆచరణకు సంబంధించినది మరియు ఇదే నీవు అర్థం చేసుకోవలసినది. ఈ విషయాలకు సంబంధించి దేవుడి మాటల ప్రకారం ఆచరించడానికి నీవు ప్రయత్నిస్తే సరిపోతుంది. నీవు “నేడు మానవజాతి ఈ స్థితికి రావడానికి లక్షలాది సంవత్సరాల చరిత్ర పట్టింది,” అని చదివినప్పుడు నీకు కుతూహలం కలుగుతుంది, కాబట్టి నీవు సోదరసోదరీమణుల నుండి సమాధానం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తావు. “మానవజాతి అభివృద్ధి ఆరు వేల యేండ్ల వెల్తుందని దేవుడు చెప్పాడు, అవునా? ఈ వేలాది యేండ్లు అంటే ఏమిటి?” ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి ప్రయత్నించడం వలన కలిగే ప్రయోజనం ఏమిటి? దేవుడు వేలాది యేండ్లు లేదా లక్షలాది యేండ్లు స్వయంగా కార్యము చేస్తున్నాడా లేదా—నీవు దీనిని తెలుసుకోవాల్సిన అవసరం నిజంగా ఆయనకు ఉందా? ఒక సృష్టించబడిన జీవిగా నీవు తెలుసుకోవలసింది ఇది కాదు. నీవు ఇలాంటి మాటలను సంక్షిప్తంగా తెలుసుకోవడం మాత్రమే చెయ్యి, అంతేగాని అదేదో దార్శనికత అన్నట్లుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకు. ఈరోజు నీవు ఎందులోకి ప్రవేశించాలో తెలుసుకోవాలి మరియు అర్థం చేసుకోవాలి, ఆపైన నీకు దానిపై దృఢమైన పట్టు ఉండాలి. అప్పుడు మాత్రమే నీవు జయించబడతావు. పై విషయాన్ని చదివిన తర్వాత, నీలో ఒక సాధారణ ప్రతిస్పందన మాత్రమే ఉండాలి: దేవుడు ఆత్రుతతో మండిపోతున్నాడు, ఆయన మనల్ని జయించాలని, మహిమ పొందాలని మరియు సాక్ష్యం పొందాలని అనుకుంటున్నాడు, కాబట్టి మనం ఆయనకు ఎలా సహకరించాలి? ఆయన చేత సంపూర్ణంగా జయించబడటానికి మరియు ఆయనకు సాక్ష్యంగా మారడానికి మనం తప్పక ఏమి చేయాలి? దేవుడు మహిమ పొందేలా చేయడానికి మనం తప్పక ఏమి చేయాలి? స్వయంగా మనం సాతాను ఆధిపత్యంలో కాకుండా దేవుడి ఆధిపత్యంలో జీవించడానికి తప్పక ఏమి చేయాలి? దీనిని గురించే ప్రజలు ఆలోచిస్తూ ఉండాలి. మీలో ప్రతి ఒక్కరూ దేవుడి విజయపు ప్రాముఖ్యతను స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అదే మీ బాధ్యత. ఈ స్పష్టత పొందిన తర్వాతనే మీకు ప్రవేశం లభిస్తుంది, మీరు కార్యపు ఈ దశను తెలుసుకుంటారు మరియు మీరు సంపూర్ణంగా విధేయులు అవుతారు. లేకపోతే, మీరు నిజమైన విధేయతను సాధించలేరు.