విజయ కార్యపు అంతర్గత సత్యము (3)
విజయ కార్యపు ఉద్దేశిత ప్రభావమనేది అన్నింటినీ మించి, మానవ దేహం ఇకపై తిరుగుబాటు చేయకుండా చేయడమే; అంటే, మానవుని మనస్సు దేవుడి గురించి నూతన జ్ఞానాన్ని పొందేలా, మానవ హృదయం పూర్తిగా దేవుడి పట్ల విధేయత చూపేలా మరియు మానవుడు దేవుడి కోసమే ఉండాలా చేయడమే. ప్రజల స్వభావం లేదా దేహం మారినంతమాత్రాన వారు జయించబడినట్లు లెక్కించబడరు; మానవుని ఆలోచన, మానవుని చైతన్యం మరియు మానవుని ఇంద్రియ జ్ఞానం మారినప్పుడు, అంటే నీ సమస్త మానసిక ధోరణి మారినప్పుడు—అప్పుడే నీవు దేవుడిచే జయించబడిన వాడివి అవుతావు. నీవు విధేయతతో ఉండాలని నిర్ణయించుకున్నప్పుడు మరియు నూతన మనస్తత్వాన్ని అలవర్చుకున్నప్పుడు, నీవు ఇకపై నీ సొంత ఆలోచనలు లేదా ఉద్దేశాలను దేవుడి వాక్కులు మరియు కార్యములోనికి తీసుకురానప్పుడు, నీ మెదడు మామూలుగా ఆలోచించగలిగినప్పుడు—అనగా, నీవు హృదయపూర్వకంగా దేవుడి కోసం ప్రయాస పడగలిగినప్పుడు—అప్పుడు, నీవు పూర్తిగా జయించబడిన వ్యక్తివి అవుతావు. మతంలో, అనేకమంది తమ జీవితాంతం ఎన్నో బాధలు పడతారు: వారు తమ దేహాలను అణచివేస్తారు, తమ శిలువను మోస్తారు మరియు వారు మరణం అంచుకు చేరుకున్నప్పుడు కూడా బాధపడుతూ మరియు సహిస్తూనే ఉంటారు! కొందరు వారు చనిపోయే రోజు ఉదయం కూడా ఉపవాసం చేస్తున్నారు. జీవితాంతం వారు మంచి ఆహారాన్ని, దుస్తులను తమకు తామే నిరాకరించుకొని, బాధలు సహించడంపై మాత్రమే దృష్టి పెడుతున్నారు. వారు తమ దేహాన్ని అణచివేయగలరు మరియు వారి దేహాన్ని పరిత్యజించగలరు. బాధలను సహించడానికి వారికున్న స్ఫూర్తి అభినందనీయం. కానీ వారి ఆలోచనలు, వారి ఉద్దేశాలు, వారి మానసిక ధోరణి మరియు వారి పాత స్వభావం నిజంగా కొద్దిగా కూడా మార్చబడలేదు. వారికి తమను గూర్చి తమకు ఎలాంటి నిజమైన జ్ఞానం లేదు. దేవుడి గురించి వారి మనస్సులో ఉన్న రూపం సాంప్రదాయకమైన ఒక అస్పష్టమైన దేవుడు మాత్రమే. దేవుడి కోసం బాధలు సహించాలనే వారి సంకల్పం వారి ఉత్సాహం మరియు వారి మంచి మానవత్వపు స్వభావం నుండి వచ్చింది. వారు దేవుడిని విశ్వసించినప్పటికీ, వారు ఆయనను అర్థం చేసుకోవడం గానీ లేదా ఆయన చిత్తాన్ని తెలుసుకోవడం గానీ చేయరు. వారు దేవుడి కోసం కేవలం పని చేస్తారు మరియు గుడ్డిగా బాధలు సహిస్తారు. వారు వివేచనకు ఎలాంటి విలువ ఇవ్వరు, వారి సేవ దేవుడి చిత్తాన్ని నెరవేరుస్తున్నట్లు దృఢపర్చుకోవడానికి నిజానికి ఎలాంటి శ్రద్ధ చూపరు మరియు దేవుడి జ్ఞానాన్ని ఎలా సాధించాలో వారికి అతి కొద్దిగానే తెలుసు. వారు సేవించే దేవుడు ఆయన సహజ స్వరూపంలో ఉన్న దేవుడు కాదు, ఆయన వారు ఊహించుకున్న దేవుడు, వారు కేవలం విన్న లేదా కేవలం పురాణ రచనలలో చదివిన దేవుడు. అప్పుడు వారు దేవుడి కోసం బాధలు సహించడానికి తమ బలమైన ఊహలను మరియు దైవభక్తిని ఉపయోగిస్తారు మరియు దేవుడు చేయాలనుకునే కార్యాన్ని చేపడతారు. వారి సేవ మరీ తప్పైనది, ఎంతగా అంటే వారిలో ఏ ఒక్కరూ వ్యవహారికంగా దేవుడి చిత్తం ప్రకారం నిజంగా సేవ చేయలేరు. వారు ఎంత సంతోషంగా బాధలు సహిస్తున్నారనే దానితో సంబంధం లేకుండా, సేవ పట్ల వారి అసలైన దృష్టికోణం మరియు దేవుడి గురించి వారి మనస్సులో ఉన్న రూపం మారలేదు, ఎందుకంటే వారు దేవుడి తీర్పు, శిక్ష, శుద్ధీకరణ మరియు పరిపూర్ణతను పొందలేదు మరియు సత్యాన్ని ఉపయోగించి ఎవరూ వారికి మార్గనిర్దేశం చేయలేదు. రక్షకుడైన యేసును వారు విశ్వసించినప్పటికీ, వారిలో ఎవరూ రక్షకుడిని ఎప్పుడూ చూడలేదు. పురాణాలు మరియు అక్కడ ఇక్కడ విన్నదాని ద్వారా మాత్రమే వారికి ఆయన గురించి తెలుసు. ఫలితంగా, వారి సేవ అనేది ఒక అంధుడు తన సొంత తండ్రికి సేవ చేస్తున్నట్లుగా కళ్ళు మూసుకుని అనాలోచితంగా చేసే సేవ కంటే ఎక్కువేమీ కాదు. అలాంటి సేవతో అంతిమంగా ఏమి సాధించగలము? దానిని ఎవరు ఆమోదిస్తారు? తొలి నుండి తుది వరకు, వారి సేవ యావత్తు ఒకేలా ఉంటుంది; వారు మానవ—నిర్మిత పాఠాలను మాత్రమే పొందుతారు మరియు వారి స్వాభావికత, వారి సొంత ప్రాధాన్యతల ఆధారంగా మాత్రమే వారు సేవ చేస్తారు. ఇది ఏ ప్రతిఫలాన్ని తీసుకురాగలదు? యేసును దర్శించిన పేతురుకు కూడా దేవుడి చిత్తం ప్రకారం సేవ చేయడం ఎలాగో తెలియదు; అతను చివరిలో, తన వృద్ధాప్యంలో మాత్రమే దీనిని తెలుసుకున్నాడు. ఎలా వ్యవహరించాలో లేదా క్రమపరచుకోవాలో కొంచెం కూడా అనుభవించని మరియు మార్గనిర్దేశం చేయడానికి ఎవరూ లేని అంధుల గురించి ఇది ఏమి చెబుతుంది? ఈరోజు మీలో అనేక మంది చేస్తున్న సేవ ఈ అంధుల సేవ లాంటిది కాదా? తీర్పును పొందని, క్రమపరుచుటను, వ్యవహారాన్ని పొందని మరియు పరివర్తన చెందని వారందరూ—అందరు కూడా అసంపూర్ణంగా జయించబడ్డవారు కాదా? అలాంటి వారితో ఉపయోగం ఏమిటి? నీ ఆలోచన, జీవితం గురించి నీ జ్ఞానం, దేవుడి గురించి నీ ఎరుక నూతన పరివర్తన ఏదీ చూపకపోతే మరియు నీవు నిజంగా ఏమీ పొందకపోతే, అప్పుడు నీవు నీ సేవలో విశేషమైనది ఏదీ ఎప్పటికీ సాధించలేవు! దేవుడి కార్యము గురించి ఒక దర్శనం మరియు నూతన జ్ఞానం లేకుండా, నీవు జయించబడినవాడివి కాదు. అప్పుడు నీవు దేవుడిని అనుసరించే విధానం బాధలు సహించే మరియు ఉపవాసం చేసే వారిలా ఉంటుంది: దానికి విలువ ఏమీ ఉండదు! ఎందుకంటే, ఇది ఖచ్చితంగా వారు చేసే దానిలో ఎలాంటి సాక్ష్యం లేదు, అందుకే వారి సేవ నిరర్థకమని నేను చెబుతున్నాను! జీవితాంతం, వారు బాధలను సహిస్తారు మరియు జైలులో గడుపుతారు; వారెప్పుడూ సహనంతో, ప్రేమతో ఉండరు మరియు వారెప్పుడూ సిలువను మోయరు, వారు ప్రపంచంచే హేళన చేయబడతారు మరియు తిరస్కరించబడతారు, వారు కష్టాలన్నీ అనుభవిస్తారు మరియు చివరి వరకు వారు విధేయులుగా ఉన్నప్పటికీ, వారు జయించబడరు మరియు జయించబడినట్లు ఎలాంటి సాక్ష్యం ఇవ్వలేరు. వారు ఎంతో బాధ సహించారు, కానీ అంతరంగంలో వారికి దేవుడి గురించి అసలేమీ తెలియదు. వారి పాత ఆలోచనలు, పాత ఉద్దేశాలు, మతపరమైన ఆచరణలు, మానవ—నిర్మిత జ్ఞానం మరియు మానవ ఆలోచనలు ఏవీ పరిష్కారం చేయబడలేదు. వారిలో నూతన జ్ఞానం ఉన్నట్లు లేశమాత్రమైనా సూచన లేదు. దేవుడి గురించి వారి జ్ఞానంలో రవ్వంత కూడా నిజం లేదా ఖచ్చితత్వం లేదు. వారు దేవుడి చిత్తాన్ని అపార్థం చేసుకున్నారు. ఇది దేవుడికి సేవ చేస్తుందా? దేవుడి గురించి గతంలో నీ జ్ఞానం ఏదైనప్పటికీ, నేటికీ అది అలాగే ఉంటే మరియు దేవుడు ఏమి చేసినప్పటికీ నీ సొంత ఉద్దేశాలు మరియు ఆలోచనలపై ఆధారపడి దేవుడి గురించి నీవు నీ జ్ఞానాన్ని కొనసాగిస్తే, అనగా నీకు దేవుడి గురించి నూతనమైన, నిజమైన జ్ఞానం లేకపోతే మరియు నీవు దేవుడి నిజ స్వరూపం మరియు స్వభావాన్ని తెలుసుకోవడంలో విఫలుడవైతే, దేవుడి గురించి నీ జ్ఞానం ఇప్పటికీ భూస్వామ్య, మూఢనమ్మకపు ఆలోచనలచే మార్గనిర్దేశం చేయబడితే మరియు ఇప్పటికీ మానవుడి ఊహ మరియు ఉద్దేశాల నుండి పుట్టినట్లయితే, అప్పుడు నీవు జయించబడినట్టు కాదు. ఇప్పుడు నేను నీకు చెప్పిన అనేక మాటలన్నీ నీవు సరికొత్త, ఖచ్చితమైన జ్ఞానం వైపు నడవడానికి ఈ జ్ఞానాన్ని పొందేలా నీకు తెలియజేయడానికి ఉద్దేశించబడ్డాయి; అంతేగాకుండా నీవు నూతన జ్ఞానాన్ని పొందేలా అవి నీలోని పాత ఉద్దేశాలను మరియు పాత జ్ఞానాన్ని నిర్మూలించడానికి కూడా ఉద్దేశించబడ్డాయి. నీవు నిజంగా నా మాటలను తిని, సేవిస్తే, నీ జ్ఞానం చాలా వరకు మారుతుంది. విధేయత నిండిన హృదయంతో నీవు దేవుడి మాటలను తిని, సేవించినంత కాలం, నీ దృష్టికోణం తలకిందులవుతుంది. మళ్లీ మళ్లీ వేసే శిక్షలను నీవు అంగీకరించగలిగినంత కాలం, నీ పాత మనస్తత్వం క్రమేణా మారుతుంది. నీ పాత మనస్తత్వం పరిపూర్ణంగా కొత్తదానితో భర్తీ చేయబడినంత కాలం, తదనుగుణంగా నీ ఆచరణ కూడా మారుతుంది. ఈవిధంగా, నీ సేవ వేగంగా లక్ష్య—నిర్దేశితం అవుతుంది, వేగంగా దేవుడి చిత్తాన్ని నెరవేర్చగలుగుతుంది. నీవు నీ జీవితాన్ని, నీ మానవ జీవిత జ్ఞానాన్ని మరియు దేవుడి గురించిన నీ అనేక ఉద్దేశాలను మార్చుకోగలిగితే, క్రమక్రమంగా నీ స్వాభావికత తగ్గిపోతుంది. ప్రజలను దేవుడు జయించినప్పుడు ఇదే మరియు దీనికి ఏమాత్రం తగ్గకుండా ప్రజలలో కలిగే మార్పు. దేవుడి పట్ల నీకున్న విశ్వాసంతో, నీకు తెలిసినదంతా నీ దేహాన్ని అణచివేయడం మరియు భరించడం మరియు బాధలు సహించడం మాత్రమే అయితే, నీవు ఎవరి కోసం ఇదంతా చేస్తున్నావు అనేది అటుంచి, అది ఒప్పో లేదా తప్పో నీకు తెలియకపోతే, అప్పుడు అలాంటి ఆచరణ మార్పునకు ఎలా దారితీయగలదు?
నేను మిమ్మల్ని అడుగుతున్నది మీరు మీ దేహాన్ని బానిసత్వంలో ఉంచమని కాదు లేదా మీ మెదడు ఏకపక్షంగా ఆలోచించడం ఆపివేయమని కాదని గ్రహించండి. ఇది కార్యపు లక్ష్యం గానీ లేదా ఇప్పటికిప్పుడు చేయవలసిన కార్యము గానీ కాదు. ఇప్పటికిప్పుడు, మీకై మీరు మారడానికి వీలుగా మీకు సకారాత్మక ధోరణితో కూడిన జ్ఞానం తప్పక ఉండాలి. దేవుడి వాక్కులతో మిమ్మల్ని మీరు సన్నద్ధం చేసుకోవడం అనేది అత్యంత అవసరమైన చర్య, అనగా సత్యం మరియు ప్రస్తుత దర్శనంతో మిమ్మల్ని మీరు సంసిద్ధం చేసుకోవడం, ఆతర్వాత ముందుకు సాగి, వాటిని ఆచరణలో పెట్టడం. ఇదే మీ బాధ్యత. ఇంకా గొప్ప వెలుగును కోరుకోవాలని లేదా పొందాలని నేను మిమ్మల్ని కోరడం లేదు. ప్రస్తుతం, మీకు దానికి తగిన స్థాయి లేనే లేదు. మీరు చేయవలసిందల్లా, దేవుడి వాక్యములను తినడం మరియు సేవించడం. మీరు తప్పక దేవుడి కార్యమును అర్థం చేసుకోవాలి మరియు మీ స్వభావం, మీ గుణగణాలు మరియు మీ పాత జీవితాన్ని తెలుసుకోవాలి. మరీ ముఖ్యంగా, మీరు తప్పుడు మరియు అర్ధంలేని గత ఆచరణలను మరియు మీరు చేస్తూ ఉండిన మానవ క్రియలను తెలుసుకోవాలి. మారడానికి, మీరు తప్పక మీ ఆలోచించే విధానాన్ని మార్చుకోవడంతో ప్రారంభించాలి. మొదటగా, మీ పాత ఆలోచన స్థానంలో కొత్తదాన్ని నింపండి మరియు మీ మాటలు మరియు చర్యలు మరియు మీ జీవితాన్ని మీ కొత్త ఆలోచన నడిపేలా చేయండి. ఈరోజున మీలో ప్రతి ఒక్కరినీ కోరేది ఇదే. గుడ్డిగా ఆచరించవద్దు లేదా గుడ్డిగా అనుసరించవద్దు. మీకు ఒక ఆధారం మరియు ఒక లక్ష్యం ఉండాలి. మిమ్మల్ని మీరు మోసగించుకోకండి. దేవుడి పట్ల మీ విశ్వాసం ఎందుకో, దాని నుండి ఏమి పొందాలో మరియు మీరు ప్రస్తుతం దేనిలోనికి ప్రవేశించాలో ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. మీరు ఇదంతా తెలుసుకోవడం తప్పనిసరి.
ప్రస్తుతం మీరు మీ జీవితాన్ని ఉద్ధరించే మరియు మీ సామర్థ్యాన్ని పెంచే దానిలోకి ప్రవేశించాలి. అంతేగాకుండా, మీరు మీ గతంలోని ఆ పాత దృష్టికోణాలను మార్చుకోవలసిన, మీ ఆలోచనను మార్చుకోవలసిన మరియు మీ ఉద్దేశాలను మార్చుకోవలసిన అవసరముంది. మీ మొత్తం జీవితాన్ని తిరిగి నూతనంగా తయారు చేయవలసిన అవసరం ఉంది. దేవుడి కార్యములను గురించి నీ జ్ఞానం మారినప్పుడు, దేవుడు చెప్పే ప్రతి ఒక్కదాని గురించి నీకు నూతన జ్ఞానం ఉన్నప్పుడు మరియు నీ లోపలి జ్ఞానం ఉన్నతమైనప్పుడు, అప్పుడు నీ జీవితం మంచి వైపు మలుపు తిరుగుతుంది. ఇప్పుడు ప్రజలు చేసే మరియు చెప్పే పనులన్నీ వ్యవహారికమైనవి. ఇవి సిద్ధాంతాలు కాకుండా, ప్రజల జీవితాల కోసం వారికి అవసరమైనవి మరియు వారికి ఉండవలసినవి. ఇది విజయపు కార్యము సమయంలో ప్రజలలో జరిగే మార్పు, ఇదే ప్రజలు అనుభవించవలసిన మార్పు మరియు ఇదే వారు జయించబడిన తర్వాత కలిగే ప్రభావం. నీవు నీ ఆలోచనను మార్చుకున్నప్పుడు, నూతన మానసిక ధోరణిని ఆచరించినప్పుడు, నీ ఆలోచనలను, ఉద్దేశాలను మరియు నీ గత తార్కిక కారణాలను తలకిందులు చేసినప్పుడు, నీ అంతరంగంలో లోతుగా నాటుకు పోయిన ఆ విషయాలను పరిత్యజించినప్పుడు మరియు దేవుడి పట్ల విశ్వాసపు నూతన జ్ఞానాన్ని పొందినప్పుడు, నీవిచ్చే సాక్ష్యాలు ఉన్నతమవుతాయి మరియు నీ అస్థిత్వం మొత్తం నిజంగా మారిపోయి ఉంటుంది. ఇవన్నీ అత్యంత వ్యవహారికమైనవి, అత్యంత వాస్తవికమైనవి మరియు అత్యంత ప్రాథమికమైనవి—గతంలో ప్రజలు గ్రహించలేనివి మరియు వారు నిమగ్నం కాలేనివి. అవి ఆత్మ నిజమైన కార్యము. నీవు గతంలో బైబిల్‌ను సరిగా ఎలా అర్థం చేసుకున్నావు? ఈనాటి పోలికకు లోబడి దీనిని చూడు, నీకు తెలుస్తుంది. గతంలో నీవు మోషే, పేతురు, పౌలు లేదా ఆ బైబిల్ ప్రకటనలు మరియు దృష్టికోణాలన్నింటినీ మానసికంగా ఉన్నత పరిచావు మరియు వాటిని ఒక ఆధారపీఠంపై ఉంచావు. ఇప్పుడు, బైబిల్‌ను ఆధారపీఠంపై పెట్టాల్సిందిగా నిన్ను అడిగితే, నీవు అలా చేస్తావా? బైబిల్‌లో మానవుడు రాసిన అనేక రికార్డులు ఉన్నాయని నీవు తెలుసుకుంటావు మరియు బైబిల్ అనేది దేవుడి కార్యపు రెండు దశల గురించి మానవుడి అభిప్రాయం మాత్రమే. ఇది ఒక చరిత్ర పుస్తకం. దీనర్థం దాని గురించి నీ జ్ఞానం మారిందని కాదా? నీవు ఈరోజు మత్తయి సువార్తలోని యేసు వంశక్రమాన్ని చూస్తే, ఇది “యేసు వంశావళేనా? అర్థరహితం! ఇది యోసేపు వంశక్రమం, యేసుది కాదు. యేసు మరియు యోసేపు మధ్య ఎలాంటి సంబంధం లేదు” అని నీవు అంటావు. ఇప్పుడు నీవు బైబిల్‌ను చూసినప్పుడు, దానిపై నీకున్న జ్ఞానం భిన్నమైనది, అంటే నీ దృష్టికోణంలో మార్పు వచ్చింది మరియు మతంలోని అనుభవజ్ఞులైన పండితుల కంటే నీవు దానికి ఉన్నత స్థాయి జ్ఞానాన్ని తీసుకువస్తావు. ఈ వంశక్రమానికి సంబంధించి ఏదైనా ఉందని ఎవరైనా చెబితే, “దీనిలో ఏముంది? ఇంకాస్త వివరించండి. యేసు మరియు యోసేపు మధ్య సంబంధం లేదు. నీకు అది తెలియదా? యేసుకు ఒక వంశక్రమం ఉండగలదా? యేసుకు పూర్వీకులు ఎలా ఉండగలరు? ఆయన మానవునికి ఎలా వారసుడు కాగలడు? ఆయన శరీరం మేరీకి పుట్టింది; ఆయన ఆత్మ దేవుడి ఆత్మ, మానవుడి ఆత్మ కాదు. యేసు దేవుడి ప్రియమైన కుమారుడు, కాబట్టి ఆయనకు ఒక వంశక్రమం ఉండగలదా? భూమి మీద ఉన్నప్పుడు ఆయన మానవాళిలో సభ్యుడు కాదు, కాబట్టి ఆయనకు వంశక్రమం ఎలా ఉండగలదు?” అని నీవు అంటావు. నీవు వంశక్రమాన్ని విశ్లేషించి, లోపలి సత్యాన్ని స్పష్టంగా వివరించినప్పుడు, నీవు అర్థం చేసుకున్న దానిని వారితో పంచుకున్నప్పుడు, ఆ వ్యక్తికి నోరు పెగలదు. కొంతమంది బైబిల్‌ను ప్రస్తావించి, “యేసుకు వంశక్రమం ఉంది. ఈనాటి నీ దేవుడికి వంశక్రమం ఉందా?” అని నిన్ను అడుగుతారు. అప్పుడు అన్నింటికంటే అత్యంత నిజమైన నీ జ్ఞానాన్ని నీవు వారికి చెబుతావు, ఈవిధంగా, నీ జ్ఞానం ఒక ప్రభావాన్ని కలగజేసి ఉంటుంది. నిజానికి, అబ్రహాము మాట అటుంచి, యేసుకు యోసేపుతో ఎలాంటి సంబంధం లేదు; ఆయన ఇశ్రాయేలులోనే జన్మించాడు. అయితే, దేవుడు ఇశ్రాయేలీయుడు లేదా ఇశ్రాయేలీయుల వారసుడు కాదు. ఇశ్రాయేలులో జన్మించడం అంటే అర్థం, దేవుడు ఇశ్రాయేలీయుల దేవుడు మాత్రమే అని కాదు. ఆయన తన కార్యము కోసమే శరీరధారిగా అవతరించే తన కార్యాన్ని కొనసాగించాడు. దేవుడు అంటే విశ్వమంతటా సమస్త సృష్టికి దేవుడు. ఆయన ఇశ్రాయేలులో మొదట తన కార్యపు ఒక దశను కొనసాగించాడు, ఆతర్వాత ఆయన అన్య దేశాలలో పని చేయడం ప్రారంభించాడు. అయినా, యేసును ప్రజలు ఇశ్రాయేలీయుల దేవుడిగానే భావించారు మరియు ఇంకాస్త ముందుకెళ్లి, ఆయనను ఒక ఇశ్రాయేలీయుడిగా మరియు దావీదు వారసుడిగా ఉంచారు. అంత్యకాలము ముగింపులో, యెహోవా నామం అన్య దేశాలలో గొప్ప పేరు పొందుతుందని బైబిల్ చెబుతుంది, అంటే అంత్యకాలములో దేవుడు అన్య దేశాలలో తన కార్యము చేస్తాడు. దేవుడు యూదయలో అవతరించడం అనేది ఆయన యూదులను మాత్రమే ప్రేమిస్తాడని సూచించదు. అది కేవలం దానికి అవసరమైన కార్యము కారణంగానే జరిగింది; దీనర్థం దేవుడు ఇశ్రాయేలులోనే (ఎందుకంటే ఇశ్రాయేలీయులు ఆయన ఎంచుకున్న ప్రజలు కాబట్టి) అవతరించగలిగి ఉండేవాడని కాదు. దేవుడు ఎంచుకున్న ప్రజలు అన్య దేశాలలో కూడా కనిపించలేదా? యేసు యూదయలో కార్యము ముగించిన తర్వాతనే, ఆ కార్యము అన్య దేశాలకు విస్తరించింది. (ఇశ్రాయేలును తప్ప మిగతా దేశాలన్నింటినీ ఇశ్రాయేలీయులు “అన్య దేశాలు” అని పిలిచారు.) నిజానికి, ఆ అన్య దేశాలలో కూడా దేవుడు ఎంచుకున్న ప్రజలు ఉండేవారు; ఆ సమయంలో అక్కడ కార్యము ఇంకా చేయబడుతూ ఉండలేదు అంతే. కార్యపు మొదటి రెండు దశలు ఇశ్రాయేలులోనే జరిగాయి, అదే సమయంలో అన్య దేశాలలో ఎలాంటి కార్యము చేయబడుతూ ఉండలేదు కాబట్టి ప్రజలు ఇశ్రాయేలుకు అంత ప్రాధాన్యత ఇచ్చారు. అన్య దేశాలలో కార్యము ఇప్పుడే ప్రారంభమవుతున్నది, అందుచేతనే దీనిని అంగీకరించడం ప్రజలకు ఎంతో కష్టమైంది. నీవు వీటన్నింటిని స్పష్టంగా అర్థం చేసుకోగలిగితే, నీవు దానిని గ్రహించగలిగితే మరియు సరిగ్గా భావించగలిగితే, నీకు ఈనాటి మరియు గతకాలపు దేవుడి గురించి ఖచ్చితమైన జ్ఞానం కలుగుతుంది, ఈ నూతన జ్ఞానం చరిత్రంతా దేవుడి గురించి సాధువులందరూ కలిగి ఉండిన జ్ఞానం కంటే ఉన్నతంగా ఉంటుంది. నీవు నేటి కార్యమును అనుభవించి, ఈరోజు దేవుడి వ్యక్తిగత పలుకులను విన్నప్పటికీ, దేవుడి పరిపూర్ణత గురించి తెలియకపోతే మరియు నీ అన్వేషణ ఎప్పటిలాగే ఉండిపోతే మరియు కొత్తదానితో భర్తీ చేయబడకపోతే, మరీ ముఖ్యంగా నీవు విజయపు కార్యమునంతా అనుభవించినప్పటికీ, అంతిమంగా నీలో ఎలాంటి మార్పు కనిపించకపోతే, అప్పుడు నీ విశ్వాసం తమ ఆకలిని తీర్చుకోవడానికి రొట్టెల కోసం వెతుకులాడే వారి లాగా మాత్రమే ఉండదా? అలా జరిగినప్పుడు, విజయపు కార్యము నీలో ఎలాంటి ప్రభావాన్ని చూపించదు. అప్పుడు నీవు పరిత్యజించవలసిన వారిలో ఒకడివిగా మారవా?
విజయపు కార్యమంతా ముగింపునకు వచ్చినప్పుడు, దేవుడు ఇశ్రాయేలీయులకు మాత్రమే దేవుడు కాదు, సమస్త సృష్టికీ దేవుడు అని మీరంతా అర్థం చేసుకోవడం తప్పనిసరి. ఆయన సమస్త మానవజాతిని సృష్టించాడు, కేవలం ఇశ్రాయేలీయులను మాత్రమే కాదు. దేవుడు ఇశ్రాయేలీయుల దేవుడని లేదా ఇశ్రాయేలు బయట మరే దేశంలోనైనా దేవుడు అవతరించడం అసాధ్యమని నీవు చెబితే, అప్పుడు విజయపు కార్యము సాధించే క్రమంలో నీవు ఇంకా ఎలాంటి జ్ఞానాన్ని సంపాదించలేదు మరియు దేవుడు నీ దేవుడేనని సూక్ష్మాతిసూక్ష్మ విధానంలో కూడా నీవు అంగీకరించవు; దేవుడు ఇశ్రాయేలు నుండి చైనాకు వెళ్లాడని మరియు నీ దేవుడిగా బలవంతంగా రుద్దబడ్డాడని మాత్రమే నీవు గుర్తిస్తావు. నీవు ఇప్పటికీ విషయాలను చూసేది ఇలాగే అయితే, నీలో నా కార్యము నిష్ఫలమైంది మరియు నేను చెప్పిన దానిలో ఒక్కటీ నీవు అర్థం చేసుకోలేదు. చివరికి, మత్తయి చేసినట్లుగా నీవు నాకు మరొక వంశక్రమాన్ని రాస్తే, నాకు తగిన పూర్వీకుడిని గుర్తిస్తే, నా సరైన మూలపురుషుడిని కనుగొంటే—అనగా దేవుడు ఆయన రెండు అవతారాలకు రెండు వంశక్రమాలను కలిగి ఉన్నాడని—అది ప్రపంచంలోనే అతి పెద్ద పరిహాసం కాదా? నాకు ఒక వంశక్రమాన్ని కనుగొన్న ఈ “మంచి ఉద్దేశం గల వ్యక్తి” అయిన నీవు దేవుడిని విభజించిన వ్యక్తివి కావా? ఈ పాపపు భారాన్ని నీవు మోయగలవా? ఈ విజయపు కార్యమంతటి తర్వాత, దేవుడు సమస్త సృష్టికి దేవుడని నీవు ఇంకా విశ్వసించకపోతే, దేవుడు ఇశ్రాయేలీయుల దేవుడని మాత్రమే ఇంకా నీవు అనుకుంటే, నీవు బహిరంగంగా దేవుడిని ప్రతిఘటించే వాడివి కావా? ఈరోజు నిన్ను జయించడానికి గల ఉద్దేశం, దేవుడు నీ దేవుడు మరియు ఇతరులకు కూడా దేవుడని మరియు మరీ ముఖ్యంగా ఆయన ఆయనను ప్రేమించే వారందరికీ దేవుడు మరియు సమస్త సృష్టికీ దేవుడని నీవు అంగీకరించేలా చేయడమే. ఆయన ఇశ్రాయేలీయుల దేవుడు మరియు ఈజిప్టు ప్రజల దేవుడు. ఆయన బ్రిటిషు ప్రజల దేవుడు మరియు అమెరికన్ల దేవుడు. ఆయన ఆదాము మరియు హవ్వలకు మాత్రమే దేవుడు కాదు, వారి వారసులందరికీ కూడా దేవుడే. పరలోకంలో ఉన్న మరియు భూమిపై ఉన్న సమస్తానికీ ఆయన దేవుడు. అన్ని కుటుంబాలు, అవి ఇశ్రాయేలీయులవైనా లేదా అన్యులవైనా, అన్నీ ఒక్క దేవుడి చేతిలోనే ఉన్నాయి. ఆయన ఇశ్రాయేలులో అనేక వేల యేండ్లు పనిచేయడం మరియు ఒకానొకప్పుడు యూదయలో జన్మించడం ఒక్కటే కాదు, ఈరోజు ఆయన యెఱ్ఱని మహాఘటసర్పము చుట్టుకొని ఉన్న చైనాకు దిగి వచ్చాడు. ఒకవేళ యూదయలో పుట్టడమనేది ఆయనను యూదులకు రాజుగా చేస్తే, ఈరోజు మీ అందరి మధ్యకు దిగి రావడం అనేది ఆయనను మీ అందరికీ దేవుడుగా చేయదా? ఆయన ఇశ్రాయేలీయులను నడిపించాడు, యూదయలో జన్మించాడు మరియు ఆయన అన్యదేశంలో కూడా జన్మించాడు. ఆయన చేసిన కార్యమంతా ఆయన సృష్టించిన సమస్త మానవాళి కోసమే కాదా? ఆయన ఇశ్రాయేలీయులను వంద రెట్లు ఎక్కువగా ప్రేమిస్తాడా మరియు అన్యులను వెయ్యి రెట్లు ఎక్కువగా ఏవగించుకుంటాడా? మీ ఉద్దేశం అదే కాదా? దేవుడు మీ దేవుడు కాదు అనేది ఎప్పుడూ లేదు, అయితే మీరు ఆయనను అంగీకరించలేదు అంతే; దేవుడు మీ దేవుడుగా ఉండడానికి ఇష్టపడకపోవడమనేది లేదు, అయితే మీరు ఆయనను తిరస్కరించారు అంతే. సృష్టించబడిన వారిలో సర్వశక్తిమంతుడి చేతిలో లేనిది ఎవరు? ఈరోజు నిన్ను జయించడంలో ఉద్దేశం, దేవుడంటే మీ దేవుడు కాకుండా మరొకరు కాదని మీరు అంగీకరించేలా చేయడం కాదా? దేవుడంటే ఇశ్రాయేలీయుల దేవుడేనని మీరు ఇప్పటికీ భావిస్తుంటే మరియు ఇశ్రాయేలులోని దావీదు గృహమే దేవుడి పుట్టుకకు మూలమని మరియు ఏదైనా అన్యుల కుటుంబం వ్యక్తిగతంగా యెహోవా కార్యమును స్వీకరించడం మాట అటుంచి, దేవుడిని “పుట్టించే” అర్హత ఇశ్రాయేలుకు కాకుండా మరే ఇతర దేశానికి లేదని ఇప్పటికీ మీరు అనుకుంటుంటే—నీవు ఇంకా ఇలాగే ఆలోచిస్తే, అది నిన్ను ఒక మూర్ఖపు పట్టుదల గలవాడిగా చేయదా? ఎల్లప్పుడూ ఇశ్రాయేలుపైనే దృష్టి నిలుపకండి. దేవుడు ఈనాడు ఇక్కడే మీ నడుమే ఉన్నాడు. అలాగే నీవు పరలోకం వైపు చూస్తూ ఉండకూడదు. పరలోకంలోని నీ దేవుడి కోసం కృశించి పోవడం ఆపు! దేవుడు మీ మధ్యకు వచ్చాడు, కాబట్టి ఆయన స్వర్గంలో ఎలా ఉండగలడు? నీవు చాలా కాలం దేవుడిని విశ్వసించలేదు, అయినా నీకు ఆయన గురించి అనేక అభిప్రాయాలు ఉన్నాయి, ఎంతగా అంటే ఇశ్రాయేలీయుల దేవుడు తన సమక్షంతో మీకు కృపను కలిగిస్తాడని నీవు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఉండే సాహసం చేయలేవు. మీరు ఎంతగా భరించలేని అశుద్ధముగా ఉన్నప్పటికీ, దేవుడి సాక్షాత్కారాన్ని ప్రత్యక్షంగా ఎలా చూడగలమా అని మీరు ఆలోచించకుండా ఉండటానికి కూడా మీరు సాహసం చేయరు. దేవుడు ప్రత్యక్షంగా అన్య దేశంలోకి ఎలా దిగుతాడనే దాని గురించి కూడా మీరు ఎప్పుడూ ఆలోచించలేదు. ఆయన తప్పక సీనాయి పర్వతం లేదా ఆలివ్ పర్వతంపై దిగి ఇశ్రాయేలీయులకు కనిపించాలి. అన్యులు (అంటే ఇశ్రాయేలు బయటి ప్రజలు) అందరూ ఆయన ఏవగించుకునే వస్తువులు కాదా? ప్రత్యక్షంగా ఆయన వారి మధ్య ఎలా కార్యము చేయగలడు? ఇవన్నీ మీరు ఎన్నో యేండ్లుగా పెంచుకున్న లోతుగా పాతుకుపోయిన ఆలోచనలు. ఈరోజు మిమ్మల్ని జయించడానికి గల ఉద్దేశం మీ ఈ ఆలోచనలను పటాపంచలు చేయడమే. ఈవిధంగా మీరు దేవుడి ప్రత్యక్ష సాక్షాత్కారాన్ని మీ మధ్యలో చూస్తారు—సీనాయి పర్వతం మీద గానీ లేదా ఆలివ్ పర్వతం మీద గానీ కాకుండా, ఆయన ముందెన్నడూ నడిపించని వ్యక్తుల మధ్య చూస్తారు. ఇశ్రాయేలులో దేవుడు తన రెండు దశల కార్యమును కొనసాగించిన తర్వాత, దేవుడు అన్నిటినీ సృష్టించాడనేది నిజమైనప్పటికీ, ఇశ్రాయేలీయులకు మాత్రమే దేవుడిగా ఉండడానికి ఆయన ఇష్టడతాడు, అన్యుల దేవుడిగా కాదనే ఒకేవిధమైన అభిప్రాయాన్ని ఇశ్రాయేలీయులు మరియు అన్యులందరూ ఏర్పర్చుకుంటారు. ఇశ్రాయేలీయులు ఈ కింది దానిని నమ్ముతారు: దేవుడు మాకు మాత్రమే దేవుడిగా ఉండగలడు, మీ అన్యులకు దేవుడిగా కాదు, ఎందుకంటే మీరు యెహోవాను గౌరవించరు, కాబట్టి యెహోవా—మా దేవుడు—మిమ్మల్ని ఏవగించుకుంటాడు. ఆ యూదులు కూడా ఈ కింది దానిని నమ్ముతారు: ప్రభువైన యేసు మా యూదు ప్రజల రూపాన్ని సంతరించుకున్నాడు మరియు దేవుడు యూదు ప్రజల ప్రతీక అయ్యాడు. దేవుడు మా మధ్యనే కార్యము చేస్తాడు. దేవుడి రూపం మరియు మా రూపం ఒక్కటే; మా రూపం దేవుడి రూపానికి దగ్గరగా ఉంటుంది. ప్రభువైన యేసు మా యూదుల రాజు; అలాంటి గొప్ప రక్షణ పొందడానికి అన్యులు అర్హులు కారు. ప్రభువైన యేసు యూదులమైన మా కోసం పాపపరిహారార్థ బలి అనే అభిప్రాయాన్ని ఆ రెండు దశల కార్యముపై ఆధారపడే ఇశ్రాయేలీయులు మరియు యూదులు ఏర్పరచుకున్నారు. దేవుడు అన్యుల దేవుడు కూడా అని అనుమతించకుండా, వారు ఆధిపత్యంతో దేవుడు తమవాడని దావా చేశారు. ఈవిధంగా, దేవుడు అన్యుల హృదయాలలో ఒక అంతరంగా మారాడు. ఎందుకంటే, దేవుడు అన్యుల దేవుడిగా ఉండకూడదనుకున్నాడని మరియు ఆయన ఇశ్రాయేలీయులు—తాను ఎంచుకున్న ప్రజలు—మరియు యూదులు, ప్రత్యేకించి ఆయనను అనుసరించిన శిష్యులను మాత్రమే ఇష్టపడతాడని అందరూ విశ్వసించారు. యెహోవా మరియు యేసు చేసిన కార్యము మానవజాతి మనుగడ కోసమే అని నీకు తెలియదా? దేవుడు ఇశ్రాయేలు బయట జన్మించిన మీ అందరికీ దేవుడని నీవు ఇప్పుడు అంగీకరిస్తావా? ఈరోజు ఇప్పుడు దేవుడు మీ మధ్యే లేడా? ఇది కల కాలేదు, కాగలదా? మీరు ఈ వాస్తవాన్ని అంగీకరించరా? మీరు దీనిని విశ్వసించడానికి లేదా దీని గురించి ఆలోచించడానికి సాహసించరు. మీరు ఎలా చూసినప్పటికీ, దేవుడు ఇక్కడ మీ మధ్యే లేడా? ఈ మాటలు విశ్వసించడానికి మీరు ఇప్పటికీ భయపడుతున్నారా? ఈరోజు నుండి, జయించబడిన వారందరూ మరియు దేవుడి అనుచరులుగా ఉండాలనుకునే వారందరూ దేవుడు ఎంచుకున్న ప్రజలే కాదా? నేడు అనుచరులైన మీరందరూ, ఇశ్రాయేలు బయట ఎంచుకోబడినవారు కాదా? మీ హోదా ఇశ్రాయేలీయుల హోదాతో సమానం కాదా? మీరు గుర్తించవలసినవి ఇవన్నీ కాదా? ఇది మిమ్మల్ని జయించే కార్యపు లక్ష్యం కాదా? దేవుడిని మీరు చూడగలిగినందున, ఆయన తొలి నుండి మరియు భవిష్యత్తు వరకు, ఎప్పటికీ మీ దేవుడుగానే ఉంటాడు. మీరందరూ ఆయనను అనుసరించాలని, ఆయనకు విశ్వాసపాత్రులైన విధేయులుగా ఉండాలని అనుకున్నంత కాలం, ఆయన మిమ్మల్ని వదిలిపెట్టడు.
ప్రజలు దేవుడిని ప్రేమించాలని ఎంతగా కోరుకున్నా, వారు సాధారణంగా నేటి వరకు ఆయనను అనుసరించడంలో విధేయతతో ఉన్నారు. ముగింపు వరకు కాకుండా, ఈ దశ కార్యము ముగిసినప్పుడు, వారు పూర్తిగా పశ్చాత్తాపడతారు. అప్పుడే ప్రజలు వాస్తవంగా జయించబడతారు. ప్రస్తుతం, వారు జయించబడే ప్రక్రియలో మాత్రమే ఉన్నారు. కార్యము ముగిసిన క్షణంలోనే, వారు పూర్తిగా జయించబడతారు, కానీ ప్రస్తుతం సందర్భం అది కాదు! ప్రతి ఒక్కరూ ఒప్పుకున్నప్పటికీ, వారు పూర్తిగా జయించబడ్డారని కాదు. ఎందుకంటే, ప్రస్తుతం, ప్రజలు వాక్యములను మాత్రమే చూశారు మరియు యథార్థ సంఘటనలను కాదు మరియు వారు ఎంత గాఢంగా విశ్వసించినా వారు అనిశ్చితంగానే ఉన్నారు. అందుచేతనే, వాక్యములు వాస్తవమయ్యే ఆ అంతిమ యథార్థ సంఘటనతో మాత్రమే ప్రజలు పూర్తిగా జయించబడతారు. ప్రస్తుతం, ఈ ప్రజలు జయించబడ్డారు ఎందుకంటే వారు మునుపెన్నడూ వినని అనేక రహస్యాలు విన్నారు. కానీ వారిలో ప్రతి ఒక్కరి లోపల, దేవుడి ప్రతి వాక్కు వాస్తవికతను సంతరించుకోవడం చూడటానికి అవకాశమిచ్చే కొన్ని యథార్థ సంఘటనల కోసం వారు ఇప్పటికీ ఎదురు చూస్తున్నారు మరియు వేచి ఉన్నారు. అప్పుడే వారు పూర్తిగా ఒప్పుకుంటారు. ముగింపులో, అందరూ ఈ వాస్తవికతను సంతరించుకున్న యథార్థాలను చూసినప్పుడు మరియు ఈ వాస్తవికతల వలన రూఢీ అయిన భావన వారికి కలిగినప్పుడు మాత్రమే, వారు తమ హృదయాలలో, వారి మాటలలో మరియు వారి కండ్లలో దృఢ నమ్మకాన్ని చూపిస్తారు మరియు వారి హృదయపు లోతుల నుండి పూర్తిగా ఒప్పించబడతారు. మానవ స్వభావం అలాంటిది: ఈ మాటలన్నీ నిజమవ్వడం మీరు చూడాలి, కొన్ని యథార్థ సంఘటనలు జరుగుతూ ఉండటం మరియు కొంతమందిపై విపత్తులు విరుచుకుపడుతూ ఉండటం మీరు చూడాలి, అప్పుడు మీరు మీ అంతరంగం లోతులలో పూర్తిగా ఒప్పుకుంటారు. యూదుల లాగే, మీరు సంకేతాలు మరియు అద్భుతాలను చూడాలనే భావనతో నిండి ఉన్నారు. అయినా మీరు సంకేతాలు మరియు అద్భుతాలు జరుగుతున్నాయని మరియు మీ కండ్లను బాగా తెరిపించడానికి ఉద్దేశించిన ఆ వాస్తవికతలు చూడటంలో నిరంతరం విఫలమవుతున్నారు. ఆకాశం నుండి లేదా మేఘాల దొంతర నుండి దిగుతూ ఉన్న ఎవరైనా మీతో మాట్లాడుతున్నా లేదా మీలో ఒకరి మీద నేను భూతవైద్యం చేస్తున్నా లేదా మీ మధ్య నా స్వరం ఉరుములా గర్జిస్తున్నా, మీరు ఎల్లప్పుడూ ఇలాంటి సంఘటనను చూడాలనుకున్నారు మరియు ఎల్లప్పుడూ ఇలాంటి సంఘటనను చూడాలనుకుంటారు. దేవుడిని విశ్వసించడంలో ఉద్దేశం, దేవుడు వచ్చి, వ్యక్తిగతంగా మీకు ఒక సంకేతాన్ని చూపించాలనేదే మీ ప్రగాఢ కోరిక అని ఎవరైనా చెప్పవచ్చు. అప్పుడు మీరు సంతృప్తి పొందుతారు. మిమ్మల్ని జయించడానికి, నేను పరలోకం మరియు భూమిని సృష్టించడంతో సమానమైన కార్యాన్ని నిర్వహించాలి, ఆతర్వాత అదనంగా, మీకు ఏదో ఒక రకమైన సంకేతాన్ని చూపించాలి. అప్పుడు, మీ హృదయాలు పూర్తిగా జయించబడతాయి.