శరీరావతారపు రహస్యము (1)
కృపా కాలంలో, యోహాను యేసుకు మార్గము సరాళము చేశాడు. యోహాను తన స్వయంగా దేవుని కార్యాన్ని చేయలేకపోయాడు కానీ మానవ కర్తవ్యాన్ని మాత్రమే నెరవేర్చాడు. ప్రభువుకు ముందుగా నడిచిన వ్యక్తిగా యోహాను ఉన్నప్పటికీ, అతడు దేవునికి ప్రాతినిధ్యం వహించలేకపోయాడు; అతడు పరిశుద్ధాత్మచేత వాడబడిన ఒక వ్యక్తి మాత్రమే. యేసు బాప్తీస్మము పొందిన తరువాత, పరిశుద్ధాత్మ పావురమువలె ఆయన మీదికి దిగి వచ్చాడు. అప్పుడు ఆయన తన కార్యాన్ని ప్రారంభించాడు, అంటే, ఆయన క్రీస్తు పరిచర్యను నిర్వహించడం ప్రారంభించాడు. అందుకే ఆయన దేవుని గుర్తింపును పొందాడు, ఎందుకంటే ఆయన దేవుని దగ్గర నుండి వచ్చాడు. దీనికి ముందు అతని విశ్వాసము ఎలా ఉన్నప్పటికీ—అది కొన్ని సార్లు బలహీనంగా లేదా కొన్నిసార్లు బలముగా ఉండవచ్చు—అంటే, ఆయన తన పరిచర్యను నిర్వహించడానికి ముందు జీవించిన జీవితమంతా సామాన్య మానవ జీవితానికి సంబంధించినదే. ఆయన బాప్తీస్మము పొందిన తరువాత (అంటే, అభిషేకించబడిన), దేవుని శక్తి మరియు మహిమ తక్షణమే ఆయనతో ఉన్నాయి, అందువలన ఆయన తన పరిచర్యను ప్రారంభించాడు. ఆయన నేరుగా స్వయంభవుడైన దేవుని తరపున పని చేస్తున్నందున, ఆయన సూచక క్రియలు మరియు ఆశ్చర్య కార్యాలు చేయగలడు, అద్భుతాలు జరిగించగలడు, మరియు ఆయన శక్తిని అధికారాన్ని కలిగి ఉన్నాడు; ఆయన తనకు బదులుగా తన స్థానములో ఆత్మ కార్యాన్ని చేస్తూ ఆత్మ స్వరాన్ని వ్యక్త పరుస్తున్నాడు. అందువలన, ఆయనే స్వయంభవుడైన దేవుడు; ఇది నిర్వివాదమైన విషయం. యోహాను పరిశుద్ధాత్మ చేత వాడబడిన వ్యక్తి. అతడు దేవునికి ప్రాతినిథ్యం వహించలేకపోయాడు, మరియు అలా దేవునికి ప్రాతినిథ్యం వహించడం కూడా అతనికి సాధ్యపడదు. ఒకవేళ అతడు అలా చేయాలని అనుకొని ఉంటే, పరిశుద్ధాత్మ దానిని ఒప్పుకునేవాడు కాదు, ఎందుకంటే స్వయంభవుడైన దేవుడు నెరవేర్చాలని ఉద్దేశించిన కార్యాన్ని అతడు చేయలేడు. బహుశా అతనిలో మానవ చిత్తము ఎక్కువగా ఉండి ఉండవచ్చు, లేదా అతిరిక్త ప్రవర్తన ఏదైనా ఉండి ఉండొచ్చు; ఎట్టి పరిస్థితుల్లోనూ అతడు నేరుగా దేవునికి ప్రతినిధిగా ఉండలేడు. అతని తప్పిదాలు మరియు తనను మాత్రమే సూచిస్తాయి, కానీ అతని పని పరిశుద్ధాత్మ సూచనగా వున్నది. అయినప్పటికీ, అతనికి చెందినవన్నీ దేవునికి ప్రాతినిధ్యం వహించాయని నీవు చెప్పలేవు. అతని వక్రమార్గము మరియు తప్పిదం కూడా దేవుణ్ణి కనుపరచగలవా? మానవునికి ప్రాతినిథ్యం వహించడంలో తప్పిదము జరగటం సాధారణం, కానీ నీ దేవునికి ప్రాతినిథ్యం వహించడంలో అవ్యక్తతను కనుబరిస్తే, దేవుణ్ణి అవమానించడం కాదా? అది పరిశుద్ధాత్మ దూషణ కాదా? మనిషి ఇతరులచే ఎంత ఘనపరచబడినా గాని, అతన్ని దేవుని స్థానంలో నిలబెట్టడానికి పరిశుద్ధాత్మ అంత తేలికగా అనుమతించడు. ఒకవేళ అతడు దేవుడు కాకపోతే, అంతము వరకు అతడు స్థిరముగా ఉండలేడు. మనిషి మనిషికి ఇష్టమొచ్చినట్లుగా దేవునికి ప్రాతినిథ్యం వహించడానికి పరిశుద్ధాత్మ అనుమతించడు! ఉదాహరణకు, యోహానుకు సాక్ష్యమిచ్చింది పరిశుద్ధాత్మయే మరియు యేసు కొరకు మార్గము సరాళము చేసే వానిగా అతన్ని వెల్లడిచేసింది కూడా పరిశుద్ధాత్మయే, కానీ పరిశుద్ధాత్మ ద్వారా అతనిపై జరిగించబడిన కార్యమే బాగా ఎంచబడింది. యోహానును అడిగిందల్లా యేసుకు మార్గాన్ని సరాళము చేసి, ఆయనకు మార్గాన్ని సిద్ధం చేయమని మాత్రమే. అంటే, మార్గము సరాళము చేయటంలో పరిశుద్ధాత్మ అతని పనిని మాత్రమే సమర్థిస్తూ అలాంటి పని చేయడానికి మాత్రమే అతన్ని అనుమతించాడు—మరో పని చేయటానికి అతనికి అనుమతి లేదు. యోహాను ఏలియాకు సూచనగా ఉన్నాడు, మరియు అతడు మార్గము సరాళము చేసిన ఒక ప్రవక్తకు ప్రాతినిథ్యం వహించాడు. ఈ విషయంలో పరిశుద్ధాత్మ అతన్ని ఎత్తి పట్టుకున్నాడు; మార్గము సరాళము చేసే పనిని అతడు చేస్తున్నంత కాలం, పరిశుద్ధాత్మ అతన్ని ఎత్తి పట్టుకున్నాడు. అయితే, ఒకవేళ అతడు తనను తానే దేవుడని ప్రకటించుకుని, విమోచన కార్యాన్ని పూర్తి చేయడానికి వచ్చానని చెప్పుకుంటే, అప్పుడు పరిశుద్ధాత్మ అతన్ని క్రమశిక్షణలో పెట్టేవాడు. యోహాను చేసిన పని ఎంత గొప్పదైనా, అది పరిశుద్ధాత్మచేత ఎత్తబడినప్పటికీ, అతని పనికి హద్దులు కలవు. పరిశుద్ధాత్మ అతని పనిని నిజంగా ఎత్తిపట్టుటకు అనుమతించినప్పటికీ, ఆ సమయంలో అతనికి ఇచ్చిన అధికారం అతని మార్గము సరాళము చేయడానికే పరిమితం చేయబడింది. అతడు ఇక, ఇతర పని, ఏదీ చేయలేడు, ఎందుకంటే అతడు మార్గాన్ని సరాళము చేసిన యోహాను మాత్రమే, యేసు కాదు. అందుచేత, పరిశుద్ధాత్మ సాక్ష్యము కీలకమైనది, కానీ మనిషి చేయడానికి పరిశుద్ధాత్మ అనుమతించే పని ఇంకా ఎంతో కీలకమైనది. ఆ కాలంలో యోహాను అద్భుత సాక్ష్యాన్ని పొందలేదా? అతని పని కూడా గొప్పది కాదా? అయితే అతడు చేసిన పని యేసు చేసిన అధిగమించలేదు, ఎందుకంటే అతడు పరిశుద్ధాత్మ చేత వాడబడిన ఒక వ్యక్తి కంటే ఎక్కువేమీ కాదు మరియు దేవునికి నేరుగా ప్రాతినిథ్యం వహించలేదు, కాబట్టి అతడు చేసిన పని పరిమితమైనది. అతడు మార్గాన్ని సరాళము చేసే పని పూర్తి చేసిన తర్వాత, పరిశుద్ధాత్మ ఇక అతని సాక్ష్యాన్ని ఎన్నడూ ఎత్తిపట్టలేదు, కొత్త పని ఏమీ అతన్ని అనుసరించలేదు, మరియు స్వయంభవుడైన దేవుని కార్యము ప్రారంభమవ్వగానే అతడు వెళ్ళిపోయాడు.
కొంతమంది దురాత్మల చేత పట్టుబడి, “నేనే దేవుడను!” అని పెద్దగా కేకలు వేస్తున్నారు. అయితే, చివరికి, వారు బయలుపరచబడతారు, ఎందుకంటే వారు ప్రాతినిథ్యం వహిస్తున్న దానిలోనే వారు తప్పుగా ఉన్నారు. వారు సాతానుకు ప్రాతినిథ్యం వహిస్తారు, మరియు పరిశుద్ధాత్మ వారిపట్ల శ్రద్ధ చూపడు. నిన్ను నీవు ఎంత గొప్పగా ఘనపరుచుకున్నా లేదా ఎంత గట్టిగా అరిచినా, నీవు ఇప్పటికీ ఒక జీవివి మరియు సాతానుకు సంబంధించిన వాడవు. “నేనే దేవుడను, నేను దేవుని ప్రియ కుమారుడను!” అని నేనెప్పుడూ కేకలు వేయలేదు. కానీ నేను చేసే పని దేవుని పనే. నేను అరవడం అవసరమా? గొప్ప చేసుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు తన కార్యాన్ని తానే స్వయంగా చేస్తాడు మరియు ఆయనకు ఒక స్థాయిని ఇవ్వడానికి లేదా గౌరవప్రదమైన ఒక బిరుదును ఇవ్వడానికి మనిషి అవసరం లేదు: ఆయన కార్యము ఆయన గుర్తింపును మరియు స్థాయిని తెలియజేస్తుంది. ఆయన బాప్తీస్మానికి ముందు, యేసు స్వయంభవుడైన దేవుడు కాదా? ఆయన మానవావతారి అయిన దేవుని దేహము కాదా? సాక్ష్యాన్ని పొందిన తరువాత మాత్రమే ఆయన దేవుని అద్వితీయ కుమారునిగా అయ్యాడని ఖచ్చితంగా చెప్పలేమా? ఆయన తన కార్యాన్ని ప్రారంభించడానికి చాలాకాలం ముందు, అప్పటికే యేసు అనే పేరుతో ఏ మానవుడు లేడా? నీవు కొత్త మార్గాలను ముందుకు తీసుకురాలేకపోతున్నావు లేదా ఆత్మకు ప్రాతినిథ్యం వహించలేకపోతున్నావు. ఆత్మ కార్యాన్ని, లేదా ఆయన మాట్లాడే వాక్కులను నీవు వ్యక్తపరచలేవు. స్వయంభవుడైన దేవుని కార్యాన్ని నీవు చేయలేవు, మరియు ఆత్మ కార్యాన్నీ నీవు చేయలేవు. దేవుని జ్ఞానము, అద్భుతము, అపరిమితమైన వివేకము, మరియు దేవుడు మానవుని దండించే పూర్తి స్వభావము అనే ఈ వ్యక్తీకరించడానికి ఇవన్నీ మీ సామర్థ్యానికి మించినవి. అందువల్ల దేవుడని చెప్పుకోడానికి ప్రయత్నించడం నిరుపయోగం; నీకు పేరు మాత్రమే ఉంటుంది గాని ఏదీ ఉండదు. దేవుడే స్వయంగా వచ్చాడు, కానీ ఎవరూ ఆయనను గుర్తించలేదు, అయినప్పటికీ ఆయన తన కార్యములో మరియు ఆత్మకు ప్రాతినిథ్యం వహించడంలో అలా కొనసాగాడు. నీవు ఆయనను మానవుడు లేదా దేవుడు ప్రభువు అని లేదా క్రీస్తు అని పిలిచినా, లేక ఆమెను సోదరి అని పిలిచినా, అది అంత పట్టించుకొనవలసిన విషయం కాదు. కానీ ఆయన చేసే కార్యము స్వయంభవుడైన దేవుని మరియు ఆత్మ కార్యమని సూచిస్తుంది. మానవుడు తనను పిలిచే పేరు గురించి ఆయన పట్టించుకోడు. ఆ పేరు ఆయన కార్యాన్ని నిర్ధారించగలదా? నీవు ఆయనను ఏమని పిలిచినా సరే, దేవునికి సంబంధించినంతవరకు, ఆయన దేవుని ఆత్మను కలిగిన మానవావతారపు దేహమై యున్నాడు; ఆయన ఆత్మకు ప్రాతినిధ్యం వహిస్తూ, ఆత్మ ద్వారా ఆమోదించబడ్డాడు. నీవు కొత్త యుగానికి దారి చూపలేక, లేదా పాత దానికీ ముగింపు పలకక, లేదా క్రొత్త యుగములో ప్రవేశించక, లేదా క్రొత్త కార్యాన్ని చేయలేకపోతే, అప్పుడు నీవు దేవుడని పిలవబడలేవు!
పరిశుద్ధాత్మ చేత వాడబడిన వ్యక్తి కూడా దేవునికి ప్రాతినిథ్యం వహించలేడు. అటువంటి వ్యక్తి దేవునికి ప్రాతినిథ్యం వహించలేడని చెప్పటం మాత్రమే కాదు, గాని అతడు చేసే పని కూడా దేవునికి నేరుగా ప్రాతినిథ్యం వహించలేదు. మరో మాటలో చెప్పాలంటే, మానవ అనుభవం దేవుని నిర్వహణలో నేరుగా భాగమై ఉండదు, మరియు ఇది దేవుని నిర్వహణకు ప్రాతినిధ్యం వహించలేదు. స్వయంభవుడైన దేవుడు చేసే కార్యమనేది పూర్తిగా తన స్వంత నిర్వహణ ప్రణాళికలో తానే చేయాలని ఉద్దేశించిన మరియు గొప్ప నిర్వహణకు సంబంధించిన కార్యమునైయున్నది. మనిషి ద్వారా జరిగించబడిన కార్యము వారి వ్యక్తిగత అనుభవాన్ని అందిస్తుంది. అది ఇంతకుముందు వెళ్లిన వారికి అతీతంగా కొత్త అనుభవ మార్గం కనుగొనడాన్ని, మరియు పరిశుద్ధాత్మ నడిపింపులో ఉన్న వారి సహోదర సహోదరీలకు మార్గసూచకం చేయడాన్ని కలిగి ఉంటుంది. ఈ వ్యక్తులు వారి వ్యక్తిగత అనుభవమునైనా లేదా ఆధ్యాత్మిక ప్రజల ఆధ్యాత్మిక రచనలనైనా అందిస్తారు. ఈ వ్యక్తులు పరిశుద్ధాత్మచేత వాడబడినప్పటికీ, వారు చేసే పనికి ఆరువేల సంవత్సరాల ప్రణాళికలోని గొప్ప నిర్వహణ కార్యానికి ఎలాంటి సంబంధం లేదు. వారు తాము నిర్వహించగలిగే విధులు ముగిసే వరకు, లేదా వారి జీవితాలు అంతమయ్యేవరకు, వివిధ కాలాల్లోని ప్రజలను పరిశుద్ధాత్మ సహవాసంలో నడిపించడానికి పరిశుద్ధాత్మ ద్వారా లేవనెత్తబడినవారైయున్నారు. వారు చేసే పని స్వయంభవుడైన దేవుని కొరకు సరియైన మార్గాన్ని సిద్ధపరచడం లేదా స్వయంభవుడైన దేవుని నిర్దిష్టమైన నిర్వహణ దశను భూమి మీద కొనసాగించటం మాత్రమే. తమలో తాము, ఆయన నిర్వహణ మహత్కార్యాన్ని ఈ వ్యక్తులు చేయలేరు, లేదా కొత్త మార్గాలనూ తెరవలేరు, వారిలో ఎవ్వరూ గత యుగము నుండి ఉన్న దేవుని కార్యమంతటినీ ఒక ముగింపుకు కూడా తీసుకురాలేరు. కాబట్టి, వారు చేసే పని తన విధిని నిర్వర్తించే సృష్టించబడిన వ్యక్తికి మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తుంది మరియు ఆయన పరిచర్యను నిర్వహిస్తున్న స్వయంభవుడైన దేవునికి ప్రాతినిథ్యం వహించలేదు. ఇది ఎందుకంటే వారు చేసే పని స్వయంభవుడైన దేవుడు చేసిన కార్యానికి భిన్నంగా ఉంటుంది. కొత్త యుగములో నాంది పలికే కార్యము మానవుడు దేవుని స్థానంలో ఉండి చేసేది కాదు. ఇది స్వయంభవుడైన దేవుడు తప్ప మరి ఎవరూ చేయలేనిది. మానవుడు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడటం లేదా వెలిగించబడటం జరిగినప్పుడు, అతడు చేసే పని అంతా సృజించబడిన వానిగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించడమే. ఈ వ్యక్తులు అందించే మార్గదర్శకత్వములో పూర్తిగా అనుదిన జీవితంలోని అనుసరణ మార్గాన్ని మనిషికి చూపడాన్ని మరియు దేవుని చిత్తానుసారంగా అతడు ఎలా ప్రవర్తించాలి అనేదాన్ని కలిగి ఉంటుంది. మానవ కార్యము దేవుని నిర్వహణలో జోక్యం చేసుకోదు మరియు ఆత్మ కార్యానికి ప్రాతినిధ్యం వహించదు. ఒక ఉదాహరణగా, విట్నెస్ లీ మరియు వాచ్ మెన్ ల పని దారిలో నడిపించడమే. మార్గము కొత్తదైనా లేదా పాతదైనా, కార్యము అనేది బైబిల్లో నిలిచి ఉండాలనే నియమం మీద ఆధారపడి ఉన్నది. అది స్థానిక సంఘాన్ని పునరుద్ధరించడమైనా లేదా నూతన స్థానిక సంఘాన్ని నిర్మించడమైనా, వారి పని సంఘాలను స్థాపించడమై ఉన్నది. యేసు మరియు ఆయన అపోస్తలులు పూర్తి చేయకుండా వదిలిపెట్టిన లేదా కృపా కాలంలో ఇంకా అభివృద్ధి చెందని కార్యము మీద వారు చేసిన పని కొనసాగించబడింది. తమ పనిలో వారు చేసిందల్లా యేసు తన కార్యపు సమయంలో చేసిన దానిని పునరుద్ధరించాలని ఆయన తరువాత రాబోవు తరాలు చేయాలని ఆజ్ఞాపించబడ్డారు, అంటే వారి తలలను కప్పుకోవడం, బాప్తీస్మము పొందటం, రొట్టె విరవడం, లేదా ద్రాక్ష రసాన్ని త్రాగడం పాటించాలని ఆజ్ఞాపించబడ్డారు. బైబిల్ అనుసరించటం మరియు బైబిల్లోని మార్గాలను అన్వేషించడమే వారి పని అని చెప్పవచ్చు. వారు ఏ రకమైన కొత్త పద్ధతులను సృష్టించలేదు. కాబట్టి, వారి పని బైబిల్లోని నూతన మార్గాలను కనుగొనడం, అలాగే మెరుగైన మరింత వాస్తవికమైన ఆచరణలను ఆవిష్కరించడమే అని ఎవరైనా చూడగలరు. కానీ వారి పనిలో ఏ ఒక్కరూ దేవుని ప్రస్తుత చిత్తాన్ని కనిపెట్టలేరు, అంత్య దినాల్లో దేవుడు చేయాలనుకుంటున్న నూతన కార్యాన్ని అసలు కనుగొనలేరు. ఎందుకంటే వారు నడిచే మార్గము ఇంకా పాతదే—ఎలాంటి పునరుద్ధరణ లేదు మరియు పురోగతి లేదు. యేసు సిలువ వేయబడిన వాస్తవానికి కట్టుబడి, పశ్చాత్తాపపడి తమ పాపాలను ఒప్పుకోమని ప్రజలను కోరే ఆచరణను పాటిస్తూ, అంతము వరకు సహించువాడు రక్షింపబడతాడు మరియు పురుషుడు స్త్రీకి శిరస్సై ఉన్నాడు, మరియు స్త్రీ తన భర్తకు లోబడాలి, మరియు సహోదరీలు కేవలం లోబడాలి కానీ, ప్రసంగించకూడదనే సాంప్రదాయబద్దమైన భావనని మరింత ఎక్కువగా విశ్వసించడం కొనసాగించారు. ఒకవేళ అలాంటి నాయకత్వపు విధానాన్ని ఆచరించడం కొనసాగించబడి ఉంటే, పరిశుద్ధాత్మ నూతన కార్యాన్ని జరిగించడాన్ని, కట్టడల నుండి ప్రజలను విడిపించడాన్ని, లేదా వారిని సుందరమైన స్వతంత్ర రాజ్యంలోనికి నడిపించడాన్ని చేయగలిగేవాడు కాదు. అందుచేత, యుగాన్నే మార్చేసే ఈ కార్యపు దశకు, దేవుడే స్వయంగా కార్యము జరిగించి మాట్లాడవలసి ఉన్నది; లేకపోతే ఆయన స్థానంలో ఎవరూ అలా చేయలేరు ఇప్పటిదాకా, ఈ సహవాసపు వెలుపల ఉన్న పరిశుద్ధాత్మ కార్యమంతా నిలిచిపోయింది, మరియు పరిశుద్ధాత్మ ద్వారా వాడబడిన వారు తమ ఆధ్యాత్మిక వైఖరులను కోల్పోయారు. కాబట్టి, పరిశుద్ధాత్మ ద్వారా వాడబడిన ప్రజల పని స్వయంభవుడైన దేవుడు చేసిన కార్యానికి భిన్నంగా ఉన్నందున, వారు ఎవరి తరపున వ్యవహరిస్తున్నారో వారి గుర్తింపులు మరియు గుణగణాలు కూడా అలాగే భిన్నంగా ఉంటాయి. ఎందుకంటే పరిశుద్ధాత్మ చేయాలని ఉద్దేశించిన కార్యమూ విభిన్నంగా ఉంటుంది, మరియు ఈ లెక్కలో ఒకే విధంగా పని చేసేవారికి వేర్వేరు గుర్తింపులు మరియు హోదాలు ఇవ్వబడతాయి. పరిశుద్ధాత్మ చేత వాడబడిన వ్యక్తులు కొంత కొత్త పని కూడా చేయవచ్చు మరియు మునుపటి యుగంలో చేసిన కొంత పని కూడా తొలగించవచ్చు, కానీ వారు చేసేది కొత్త యుగంలో దేవుని చిత్తాన్ని మరియు స్వభావాన్ని వ్యక్తపరచబడదు. వారు మునుపటి యుగపు పనిని తొలగించడానికి మాత్రమే పని చేస్తారు, స్వయంభవుడైన దేవుని స్వభావానికి నేరుగా ప్రాతినిధ్యం వహించే ఉద్దేశంతో కొత్త కార్యమును జరిగించు క్రమములో వారు పని చేస్తారు. అందువల్ల, వాడుకలోలేని పద్ధతులను వారు ఎన్ని తొలగించినా లేదా నూతన ఆచరణలను వారు ఎన్ని ప్రవేశపెట్టినా, ఇప్పటికీ వారు మనుష్యునికి మరియు సృష్టించబడిన జీవులకే ప్రాతినిధ్యం వహిస్తారు. అయితే, స్వయంభవుడైన దేవుడు కార్యాన్ని జరిగించేటప్పుడు, పాత యుగపు ఆచరణల తొలగింపును బహిరంగముగా ప్రకటించడు లేదా కొత్త యుగపు ప్రారంభాన్ని నేరుగా ప్రకటించడు. ఆయన తను చేసే కార్యములో నేరుగా మరియు ముక్కు సూటిగా ఉంటాడు. ఆయన చేయాలనుకున్న కార్యాన్ని చేయడంలో నిష్పక్షపాతంగా ఉంటాడు; అంటే, ఆయన తెచ్చిన కార్యాన్ని సూటిగా వ్యక్తపరుస్తాడు, తన అస్తిత్వాన్ని మరియు స్వభావాన్ని వ్యక్తపరుస్తూ, తన కార్యాన్ని నేరుగా మొదట ఉద్దేశించినట్లుగానే చేస్తాడు. మనిషి చూస్తున్నట్లుగా, ఆయన స్వభావము మరియు ఆయన కార్యము కూడా గత కాలాల్లో ఉన్నదానికి భిన్నంగానే ఉంటుంది. అయితే, స్వయంభవుడైన దేవుని దృష్టిలో, ఇది ఆయన కార్యపు ఒక కొనసాగింపుగా మరియు తదుపరి పురోభివృద్దిగా మత్రమే ఉన్నది. స్వయంభవుడైన దేవుడు కార్యము చేసినప్పుడు, ఆయన తన వాక్యాన్ని వ్యక్తపరుస్తూ కొత్త కార్యాన్ని నేరుగా తీసుకొస్తాడు. మనిషి పని చేసేటప్పుడు, అంటే అది ఒక చర్చయైనా మరియు అధ్యయనము ద్వారానైనా, లేదా అది ఇతరుల పని మీద స్థాపించబడిన ఒక జ్ఞాన వ్యాప్తియైనా మరియు ఆచరణ యొక్క క్రమబద్ధీకరణయైనా దేవుని కార్యానికి విభిన్నంగా ఉంటుంది. అంటే, మనిషి ద్వారా జరిగించబడిన కార్యపు లక్షణపు స్థాపించబడిన క్రమాన్ని అనుసరించడం మరియు “కొత్త పాదరక్షలు ధరించి పాత మార్గాల్లో నడుచుటయైయున్నది.” అంటే పరిశుద్ధాత్మ చేత వాడబడిన ప్రజలు నడిచిన మార్గం కూడా స్వయంభవుడైన దేవుడు ప్రారంభించిన దానిపైనే కట్టబడిందని అర్థము. కాబట్టి, సమస్తమని చెప్పి, జరిగించిన తరువాత మనిషి మనిషిగాను, మరియు దేవుడు దేవుడుగానే ఉంటాడు.
ఇస్సాకు అబ్రహాముకు జన్మించినట్లే, యోహాను వాగ్దానాన్ని బట్టి జన్మించాడు. అతడు యేసు కోసం మార్గాన్ని సరాళము చేసి ఎంతో పని చేశాడు, కానీ అతడు దేవుడు కాదు. అయితే, అతడు ప్రవక్తలలో ఒకడు ఎందుకంటే అతడు మాత్రమే యేసుకు మార్గాన్ని సరాళం చేశాడు. అతని పని కూడా గొప్పది, మరియు అతడు మార్గాన్ని సరాళము చేసిన తర్వాత మాత్రమే యేసు తన కార్యాన్ని లాంఛనంగా ప్రారంభించాడు. సారాంశంగా చెప్పాలంటే, అతడు యేసు కొరకు పని మాత్రమే చేశాడు, యేసు కార్యానికి సేవ చేయడమే అతని పనియైయుండెను. అతడు మార్గము సరాళము చేయడాన్ని పూర్తి చేసిన తర్వాత, నూతన కార్యమైన, పటిష్టమైన మరియు ఎంతో వివరణాత్మకమైన తన కార్యాన్ని జరిగించుటను యేసు ప్రారంభించాడు. కార్యములో మొదటి భాగాన్ని మాత్రమే యోహాను చేశాడు; నూతన కార్యములోని అధిక భాగము యేసు ద్వారా జరిగించబడింది. యోహాను ఒక కొత్త పని కూడా చేశాడు, కానీ కొత్త యుగంలో నాంది పలికింది అతడు కాదు. యోహాను వాగ్దానాన్ని బట్టి జన్మించాడు, మరియు అతని పేరు దేవదూత ద్వారా పెట్టబడింది. ఆ సమయంలో, కొంతమంది అతని తండ్రి అయిన జకర్యా పేరును అతనికి పెట్టాలనుకున్నారు, కానీ తన తల్లి మాట్లాడుతూ, “ఈ బిడ్డను ఆ పేరు పెట్టి పిలవలేము. అతడు యోహాను అని పిలవాలి,” అని చెప్పింది. ఇదంతా పరిశుద్ధాత్మ ఆజ్ఞానుసారం జరిగింది. యేసు కూడా పరిశుద్ధాత్మ ఆజ్ఞానుసారమే పేరు పెట్టబడ్డాడు, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడు, మరియు ఆయన పరిశుద్ధాత్మ ద్వారా వాగ్దానము చేయబడ్డాడు. యేసు దేవుడును, క్రీస్తును, మరియు మనుష్య కుమారుడైయుండెను. అయితే, యోహాను చేసిన పని కూడా గొప్పది అయినప్పుడు, ఎందుకు అతడు దేవుడని పిలవబడలేదు? యేసు చేసిన కార్యానికి మరియు యోహాను చేసినదానికి మధ్యగల ఖచ్చితమైన వ్యత్యాసం ఏమిటి? యేసుకు మార్గాన్ని సరాళము చేసిన వాడు యోహాను అనేది కేవలం కారణమేనా? లేక ఇది దేవుడు ముందుగానే నిర్ణయించినందుకా? “పరలోకరాజ్యము సమీపించియున్నది: మీరు మారుమనస్సు పొందుడని,” యోహాను చెప్పినప్పటికీ కూడా, అతడు పరలోక రాజ్య సువార్తను సైతం ప్రకటించాడు, అతని పని మరింతగా అభివృద్ధి చెందింది కాదు కేవలం ఒక ఆరంభం మాత్రమే. దీనికి భిన్నంగా, యేసు కొత్త యుగానికి నాంది పలికి అలాగే పాతదాన్ని ముగించాడు, అయితే ఆయన పాత నిబంధన ధర్మశాస్త్రాన్ని కూడా నెరవేర్చాడు. ఆయన చేసిన కార్యము యోహాను చేసిన దాని కంటే గొప్పది, మరియు ఇంకా ఏమిటంటే ఆయన సర్వ మానవాళిని విమోచించడానికి వచ్చాడు—ఆ కార్యపు దశను ఆయన నెరవేర్చాడు. యోహాను విషయానికొస్తే, అతడు మార్గాన్ని మాత్రమే సిద్దపరిచాడు. అతని పని గొప్పదిగాను, అతని మాటలు అనేకంగాను, అతన్ని అనుసరించిన శిష్యులు అనేకమంది ఉన్నప్పటికీ, క్రొత్త ఆరంభాన్ని మనిషికి తీసుకురావడముకంటే ఆయన కార్యము ఎక్కువ చేసిందేమీ లేదు. మనిషి అతని నుండి జీవాన్ని, మార్గాన్ని, లేక లోతైన సత్యాలను ఎన్నడూ పొందలేదు లేదా అతని నుండి ఏ మనిషి దేవుని చిత్తాన్ని గ్రహించలేదు. యోహాను యేసు కార్యము కోసం కొత్త స్థలాన్ని ఆవిష్కరించి ఎన్నుకొనబడిన వారిని సిద్ధపరచిన ఒక గొప్ప ప్రవక్తయైయుండెను (ఏలియా); అతడు కృపా యుగానికి ముందుగా నడిచినవాడు. అలాంటి విషయాలను వారి సాధారణ మానవ పై రూపాన్ని గమనించడం ద్వారా గుర్తించలేము. యోహాను కూడా గణనీయమైన పని చాలానే చేసినందున ఇదంతా ఎంతో యోగ్యమై ఉన్నది మరియు, అంతేకాకుండా, అతడు పరిశుద్ధాత్మ ద్వారా వాగ్దానము చేయబడ్డాడు, మరియు అతని పని పరిశుద్ధాత్మ చేత ఎత్తిపట్టబడింది. ఇదిలా ఉంటే, వారు చేసే కార్యాన్ని బట్టి మాత్రమే ఎవరైనా వారి వారి గుర్తింపుల మధ్య వ్యత్యాసాలను గుర్తించవచ్చు, ఎందుకంటే ఒక వ్యక్తి అంతరంగాన్ని అతని బాహ్య రూపాన్ని బట్టి చెప్పే అవకాశమే లేదు, మరియు పరిశుద్ధాత్మ సాక్ష్యం ఏమిటో తెలుసుకునే మార్గమేదీ మనిషికి లేదు. యోహాను చేసిన పని మరియు యేసు చేసినదానికి భిన్నంగా ఉన్నాయి మరియు వేర్వేరు స్వభావాలను కలిగి ఉన్నాయి. దీన్నిబట్టే యోహాను దేవుడా కాదా అనేది నిర్ధారించవచ్చు. యేసు చేసిన కార్యము మొదలుపెట్టడం, కొనసాగించటం, ముగించడం, మరియు ఫలవంతము చేయడం. ఆయన ఈ దశలోని ప్రతి ఒక్క దానిని చేశాడు, అయితే యోహాను చేసిన పని ప్రారంభించడం తప్ప ఎక్కువేమీ కాదు. ఆరంభములో, యేసు సువార్తను విస్తరింపజేసి పశ్చాత్తాప మార్గాన్ని ప్రకటించాడు, ఆపై మనిషికి బాప్తీస్మము ఇవ్వడానికి, రోగులను స్వస్థ పరచడానికి, మరియు దెయ్యాలు వెళ్లగొట్టడానికి వెళ్ళాడు. చివర్లో, ఆయన మానవాళిని పాపము నుండి విమోచించి యుగమంతటి కొరకు జరిగించవలసిన ఆయన కార్యాన్ని పూర్తి చేశాడు. ఆయన ప్రతి చోటుకు కూడా తిరుగుతూ, మనిషికి బోధిస్తూ పరలోక రాజ్య సువార్తను వ్యాప్తి చేశాడు. ఈ విషయంలో ఆయన మరియు యోహాను ఒకేలా ఉన్నారు, తేడా ఏమిటంటే యేసు కొత్త యుగానికి నాంది పలికి మానవునికి కృపా కాలాన్ని తెచ్చాడు. మానవుడు అనుసరించవలసిన మార్గము మరియు కృపా కాలంలో మానవుడు వెంబడించవలసిన దానిని గురించి ఆయన నోటి వెంట వాక్యము వచ్చింది, చివరికి, ఆయన విమోచన కార్యాన్ని ముగించాడు. యోహాను ఈ కార్యాన్ని ఎన్నటికీ జరిగించలేడు. కాబట్టి స్వయంభవుడైన దేవుని కార్యాన్ని యేసు జరిగించాడు, మరియు ఆయనే స్వయంభవుడైన దేవుడు, మరియు నేరుగా దేవునికి ప్రాతినిధ్యము వహించువాడునైయున్నాడు. వాగ్దానము ద్వారా జన్మించి, ఆత్మ మూలముగా జన్మించిన, పరిశుద్ధాత్మ ద్వారా బలపరచబడిన, నూతన మార్గాలను ఆవిష్కరించే వారందరూ దేవుడని మనిషి తలంపులు చెప్తాయి. ఈ హేతువును బట్టి, యోహాను కూడా దేవుడై ఉంటాడు, అలాగే మోషే, అబ్రహాము, మరియు దావీదు…, వారందరూ కూడా దేవునిగా ఉండొచ్చు. ఇది పక్కా వేళాకోళం కాదా?
తన పరిచర్యను నిర్వహించడానికి ముందు, యేసు కూడా పరిశుద్ధాత్మునికి అనుగుణంగా ప్రవర్తించిన ఒక సామాన్య వ్యక్తి మాత్రమే. ఆ సమయంలో ఆయన తన ఉనికిని గురించి ఎరిగియున్నాడా లేదా అనే దానితో సంబంధం లేకుండా, దేవుని నుండి వచ్చిన వాటన్నిటికీ ఆయన కట్టుబడ్డాడు. ఆయన పరిచర్య ప్రారంభానికి ముందు పరిశుద్ధాత్మ ఆయన ఉనికిని ఎన్నడూ బయలుపరచలేదు. ఆయన తన పరిచర్యను ప్రారంభించిన తరువాత మాత్రమే ఆ కట్టడలను మరియు ఆ న్యాయ విధులను ఆయన కొట్టివేశాడు, మరియు ఆయన తన పరిచర్యను అధికారికంగా జరిగించడం ప్రారంభించే వరకు ఆయన మాటలు అధికారము మరియు శక్తితో నానబెట్టబడ్డాయి. ఆయన తన పరిచర్యను ప్రారంభించిన తర్వాత మాత్రమే కొత్త యుగాన్ని తీసుకొచ్చే ఆయన కార్యము ఆరంభమైంది. దీనికి ముందు, పరిశుద్ధాత్మ ఆయనలో 29 సంవత్సరాలు మరుగై ఉన్నాడు, ఆ సమయంలో ఆయన, దేవుని గుర్తింపు అనేది లేకుండా ఒక మనిషిగా మాత్రమే సూచించబడ్డాడు. తన కార్యము చేయడం మరియు తన పరిచర్యను నిర్వహించడంతో దేవుని కార్యము ప్రారంభమైంది, మనిషి ఆయన గురించి ఎంతగా తెలుసుకున్నాడనే దాన్ని పట్టించుకోకుండా ఆయన తన అంతర్గత ప్రణాళిక ప్రకారం తన కార్యాన్ని చేశాడు, మరియు ఆయన చేసిన కార్యము స్వయంభవుడైన దేవునికి ప్రత్యక్ష సూచనగా వున్నది. ఆ సమయంలో, “నేను ఎవరని మీరు చెప్పుకొనుచున్నారు?” అని యేసు తన చుట్టూ ఉన్నవారిని అడిగాడు. అందుకు వారు, “నీవు ప్రవక్తలలో గొప్పవాడివి మరియు మా గొప్ప వైద్యుడవు” అని బదులిచ్చారు. మరికొందరు, “నీవు మా ప్రధాన యాజకుడని,” మొదలగు విధంగా బదులిచ్చారు. అన్ని రకాలైన సమాధానాలు ఇవ్వబడ్డాయి, కొంతమందైతే ఆయన యోహాను అని, ఆయన ఏలియా అని కూడా చెప్పారు. అయితే యేసు సీమోను పేతురు వైపు తిరిగి, “నేను ఎవరని నీవు అనుకుంటున్నావు?” అని అడిగాడు. అందుకు పేతురు, “నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని” అని జవాబిచ్చాడు. అప్పటి నుండి, ఆయనే దేవుడని ప్రజలు తెలుసుకున్నారు. ఆయన గుర్తింపు తెలియవచ్చినప్పుడు, ఈ విషయం మొదట పేతురుకు తెలిసింది మరియు అదే అతని నోటి నుండి చెప్పబడింది. అప్పుడు యేసు, “పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచెనే కాని, నరులు నీకు బయలు పరచలేదు” అని చెప్పాడు. యేసు బాప్తీస్మము పొందిన తరువాత, ఈ విషయం ఇతరులకు తెలిసినా తెలియక పోయినా, ఆయన దేవుని పక్షాన కార్యము చేశాడు. ఆయన తన కార్యాన్ని జరిగించడానికి వచ్చాడే గాని, తన గుర్తింపును బయలుపరచడానికి కాదు. దీని గురించి పేతురు మాట్లాడిన తర్వాత మాత్రమే ఆయన గుర్తింపు బహిరంగంగా తెలిసింది. ఆయన స్వయంభవుడైన దేవుడని నువ్వు గ్రహించినా గ్రహించలేకపోయినా, సమయం వచ్చినప్పుడు, ఆయన తన కార్యాన్ని ప్రారంభించాడు. అది నీకు తెలిసినా తెలియక పోయినా, ఆయన మునుపటి లాగానే తన కార్యాన్ని కొనసాగించాడు. ఒకవేళ నీవు దాన్ని తిరస్కరించినా సరే, ఆయన ఇప్పటికీ తన కార్యాన్ని నిర్వహిస్తాడు మరియు అలా చేయాల్సిన సమయం వచ్చినప్పుడు దాన్ని జరిగిస్తాడు. ఆయన తన కార్యాన్ని చేసి తన పరిచర్యను నిర్వహించడానికి వచ్చాడు, తద్వారా మనిషి తన కార్యాన్ని పొందాలనే గాని, మనిషి తన భౌతికతను తెలుసుకోవాలని కాదు. ఈనాటి కార్యపు దశను స్వయంభవుడైన దేవుడు చేసిన కార్యంగా గుర్తించడంలో నీవు విఫలమయ్యావంటే, నీకు దర్శనం కొరతగా ఉందని అర్థం. ఇప్పటికీ, నీవు ఈ కార్యపు దశను తిరస్కరించలేవు; దానిని గుర్తించడంలో నువ్వు విఫలమైతే పరిశుద్ధాత్మ కార్యము చేయడం లేదని, లేక ఆయన కార్యము తప్పని నిరూపించినట్లు కాదు. ప్రస్తుత కార్యము బైబిల్లో యేసు చేసిన దానికి విరుద్దంగా ఉందని పరిశీలిస్తూ కార్యపు దశను తిరస్కరించడానికి ఎలాంటి వైరుధ్యాలనైనా ఉపయోగించేవారు కూడా ఉన్నారు. ఇది గుడ్డివాని పని కాదా? బైబిల్లో సంగతులు పరిమితంగా నమోదు చేయబడ్డాయి; అవి దేవుని కార్యాన్ని పూర్తిగా సూచించలేవు. నాలుగు సువార్తలలో మొత్తం కలిపితే వంద కంటే తక్కువ అధ్యాయాలు ఉన్నాయి, వీటిలో యేసు అంజూరపు చెట్టును శపించడం, పేతురు ప్రభువును మూడుసార్లు తిరస్కరించడం, యేసు సిలువ వేయబడి పునరుత్థానం చెందిన తర్వాత శిష్యులకు కనిపించడం, ఉపవాసం గురించి బోధించడం, ప్రార్థన నేర్పించడం, విడాకుల గురించి బోధించడం, యేసు పుట్టుక మరియు వంశావళి, యేసు శిష్యులను ఎన్నుకోవడం, మొదలైన సంఘటనలు పరిమిత సంఖ్యలో వ్రాయబడ్డాయి. అయితే, మనిషి వాటిని నిధిగా పరిగణిస్తాడు, నేటి కార్యాన్ని కూడా వాటితో విరుద్దంగా పోలుస్తాడు. యేసు తన జీవిత కాలంలో చేసిన కార్యమంతా చాలా తక్కువని, దేవుడు ఇంత మాత్రమే చేయగలడని అంతకు మించి ఏమీ చేయలేడని కూడా వారు నమ్ముతారు. ఇది విడ్డూరం కాదా?
యేసు భూమిపై గడిపిన కాలం ముప్పై మూడున్నర సంవత్సరాలు, అంటే, ఆయన భూమి మీద ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించాడు. కేవలం మూడున్నర సంవత్సరాల కాలము మాత్రమే ఆయన పరిచర్య నిర్వహించడంలో గడిపాడు. మిగిలిన సమయం ఆయన కేవలం ఒక సాధారణ మనిషి జీవితాన్ని జీవించాడు. మొదట్లో, ఆయన యూదుల సమాజ మందిరంలో కూడికలకు పాల్గొంటూ అక్కడ యాజకులు లేఖనాలను వివరించడాన్ని మరియు ఇతరులకు బోధించడాన్ని ఆయన విన్నాడు. ఆయన బైబిల్ గురించి చాలా జ్ఞానాన్ని పొందాడు: ఆయన అటువంటి జ్ఞానంతో పుట్టలేదు, చదవడం మరియు వినడం ద్వారా మాత్రమే దానిని పొందాడు. ఆయన పన్నెండు ఏళ్ల వయసులో యూదుల సమాజ మందిరంలో బోధకులను ప్రశ్నలు అడిగాడని పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా నమోదు చేయబడింది: పూర్వకాలపు ప్రవక్తల ప్రవచనాలు ఏమిటి? మోషే ధర్మ శాస్త్రం అంటే ఏమిటి? పాత నిబంధన గురించి ఏమిటి? మరియు దేవాలయంలో యాజక వస్త్రాలను ధరించి దేవుని పరిచర్య చేసే వ్యక్తి గురించి ఏమిటి? … ఆయన చాలా ప్రశ్నలు అడిగాడు ఎందుకంటే ఆయనకి వాటి గురించి జ్ఞానం గానీ లేదు అవగాహన గానీ లేదు. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించినప్పటికీ, ఆయన పూర్తిగా సాధారణ మానవునిగానే జన్మించాడు; ఆయన కొన్ని ప్రత్యేక లక్షణాలు కలిగి ఉన్నప్పటికీ, ఆయన ఇంకా సామాన్య మానవుడే. ఆయన వయస్సుకు మరియు ఆయన భౌతిక స్థితికి అనుగుణంగా ఆయన జ్ఞానము కూడా పెరుగుతూ వచ్చింది, మరియు సామాన్య మనిషి జీవితములో ఎదుర్కునే ప్రతి ఘటనను ఆయన ఎదుర్కొంటూ వచ్చాడు. ప్రజలు ఊహల్లో, యేసు బాల్యాన్ని మరియు ప్రౌఢ దశను అనుభవించలేదు; ఆయన పుట్టిన వెంటనే ముప్పై ఏళ్ల వ్యక్తి జీవితాన్ని జీవించడం ప్రారంభించాడు, మరియు ఆయన కార్యము పూర్తయిన తర్వాత ఆయన సిలువ వేయబడ్డాడు. బహుశా ఆయన ఒక సాధారణ మనిషి జీవితంలో ఎదురయ్యే దశలను దాటి ఉండకపోవచ్చు; ఆయన ఇతర వ్యక్తులతో తినడం గానీ కలిసి ఉండడం గానీ చేయలేదు, మరియు ప్రజలు ఆయన జాడను పట్టుకోవడం అంత సులభం కాదు. ఆయన దేవుడైనందున బహుశా అయనను చూసినవారు భయపడేంత అసాధారణంగా కనిపించియుండవచ్చు. శరీరునిగా వచ్చిన దేవుడు ఒక సామాన్య వ్యక్తికిలాగ ఖచ్చితంగా జీవించడని ప్రజలు నమ్ముతారు; పళ్ళు తోముకోకుండా ముఖం కడుక్కోకుండా ఆయన పరిశుభ్రంగా ఉన్నాడన్నా వారు నమ్ముతారు, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. ఇవి పూర్తిగా మనిషి తలంపులు కాదా? బైబిల్ ఆయన కార్యం గురించి మాత్రమే తప్ప యేసును ఒక మనిషిగా జీవించిన దాని గురించి ఎలాంటి దాఖలు చేయలేదు, అయితే ఆయన సామాన్య మానవ స్వభావము కలిగిలేడని లేదా ముప్పై సంవత్సరాలకు ముందు ఆయన సామాన్య మానవ జీవితాన్ని గడపలేదని ఇది రుజువు చేయలేదు. 29 సంవత్సరాల వయస్సులో ఆయన తన కార్యాన్ని అధికారికంగా ప్రారంభించాడు, కానీ ఆ వయస్సుకంటే ముందు మనిషిగా ఆయన గడిపిన జీవితం మొత్తాన్ని నీవు వ్రాయలేవు. బైబిల్ మాత్రం తన దాఖలాలు నుండి ఆ కాలాన్ని తప్పించింది; ఇది ఒక సాధారణమైన మనిషిగా ఆయన జీవితమే తప్ప ఆయన దైవిక కార్యపు కాలము కాదు కాబట్టి, అది రాయబడవలసిన అవసరం లేదు. యేసు బాప్తిస్మమునకు ముందు, పరిశుద్ధాత్మ నేరుగా కార్యము చేయలేదు, కానీ యేసు తన పరిచర్యను జరిగించే రోజు వరకు ఆయన కేవలం ఒక సాధారణ మనిషిగా తన జీవితాన్ని కొనసాగించాడు. ఆయన దేవుని అవతారం అయినప్పటికీ, ఆయన సాధారణమైన మనిషివలే పరిపక్వత చెందే ప్రక్రియ గుండా వెళ్ళాడు. పరిపక్వత చెందే ఈ ప్రక్రియ బైబిల్ నుండి తొలగించబడింది. మనిషి జీవితంలో ఎదుగుదలకు పెద్దగా సహకారము అందించనందున ఇది తొలగించబడింది. ఆయన బాప్తిస్మానికి ముందున్న కాలము మరుగైయున్న కాలం, అందులో ఆయన ఎటువంటి సూచక క్రియలు మరియు అద్భుతాలు చేయలేదు. యేసు బాప్తిస్మము పొందిన తరువాత మాత్రమే ఆయన మానవజాతి విమోచన కార్యమంతటినీ ప్రారంభించాడు, ఇది సమృద్దియైన సంపూర్ణమైన కృప, సత్యము, ప్రేమ మరియు దయతో నిండియున్న కార్యము. ఈ కార్యపు ప్రారంభమే ఖచ్చితంగా కృపా కాలపు ఆరంభము కూడా; ఈ కారణంచేత, ఇది వ్రాయబడి, వర్తమాన కాలానికి అందించబడింది. ఇది కృపా యుగంలో ఉన్న వారికి కృపా యుగపు దారిలో మరియు సిలువ దారిలో నడిపించడానికి ఒక మార్గాన్ని ఆవిష్కరించి, అందరిని ఫలభరితం చేసింది. ఇది మనిషిచేత వ్రాయబడిన ప్రతుల నుంచి వచ్చినప్పటికీ, అక్కడక్కడా చిన్న పొరపాటులు కనిపించడం తప్ప అన్ని నిజాలే. అయినప్పటికీ, ఈ ప్రతుల్ని అబద్ధమని చెప్పలేము. నమోదు చేయబడిన సంగతులు పూర్తిగా నిజమైనవి, వాటిని వ్రాయడంలో మాత్రమే వ్యక్తులు పొరపాట్లు చేశారు. యేసు సామాన్యమైన సాధారణ మానవ స్వభావంతో ఉన్నట్లయితే, ఆయన సూచక క్రియలు మరియు అద్భుతాలు చేయగల సామర్థ్యం ఎలా కలిగి ఉంటాడని కొందరు అంటారు? యేసు నలభై రోజుల అనుభవించిన శోధనయే ఒక అద్భుతమైన సూచన, ఒక సాధారణ మానవునికి సాధ్యం కానిది. ఆయన నలభై రోజుల శోధించబడిన పరిశుద్ధాత్మ కార్యపు స్వభావంలో ఉంది; అలాంటప్పుడు ఆయనలో అసాధారణత కొంచెం కూడా లేదని ఎవరైనా ఎలా చెప్పగలరు? సూచనలు అద్భుతాలు చేయగల ఆయన సామర్థ్యం ఆయన అద్భుతమైన వ్యక్తి అని మరియు సాధారణ మానవుడు కాదని నిరూపించదు; పరిశుద్ధాత్మ ఆయన వంటి సాధారణ మనిషిలో కార్యము చేశాడు, అందువల్ల ఆయన అద్భుతాలు మరి ఎక్కువ గొప్ప కార్యాన్ని చేయడం సాధ్యపడుతుంది. యేసు తన పరిచర్యను జరిగించడానికి ముందు, లేదా బైబిల్ చెప్పినట్టుగా, పరిశుద్ధాత్మ ఆయన మీదికి దిగి రావడానికి ముందు, యేసు ఒక సాధారణ మనిషి మరియు ఏ విధంగానూ దైవాంశసంభూతుడు కాదు అని బైబిల్ చెబుతోంది. పరిశుద్ధాత్మ ఆయన పైకి దిగి వచ్చినప్పుడు అనగా ఆయన తన పరిచర్యను జరిగిన చేయడానికి ప్రారంభించినప్పుడు ఆయన అద్భుత శక్తితో నింపబడ్డాడు. ఈ విధంగా, మనిషి దేవుని అవతార దేహానికి సాధారణ మానవ స్వభావం లేదని నమ్ముతాడు; పైగా, శరీరధారియైన దేవునికి దైవత్వం మాత్రమే ఉందని, మానవత్వం లేదని అతడు తప్పుగా అనుకుంటాడు. కచ్చితంగా, దేవుడు తన కార్యమును చేయడానికి భూమి మీదికి వచ్చినప్పుడు మానవుడు చూసేదంతా అద్భుతమైన సంఘటనలే. వారు తమ కళ్లతో చూసేవి మరియు తమ చెవులతో విన్నవన్నీ అధ్భుతమైన సంగతులే, ఎందుకంటే ఆయన కార్యము ఆయన వాక్యాలు వారికి అర్థం కానివి మరియు అందనివి. పరలోకంలోనిది ఏదైనా భూమిపైకి తీసుకువస్తే, అది అద్భుతమైనది కాకుండా ఎలా ఉంటుంది? పరలోక రాజ్యపు రహస్యాలు భూమి మీదికి తీసుకురాబడినప్పుడు, మనిషికి అందని అర్థంకాని ఆ రహస్యాలు, ఎంతో ఆశ్చర్యకరంగా మరియు తెలివైనవిగా ఉంటాయి—అవన్నీ అధ్భుతమైనవి కాదా? అయితే, అది ఎంత అద్భుతమైనప్పటికీ, ప్రతిది ఆయన సామాన్య మానవ స్వభావంలోనే జరిగించబడుతుందని నీవు తెలుసుకోవాలి. శరీరధారియైన దేవుని శరీరము మాన స్వభావంతో నిండి ఉంది; అలా ఆయనే లేకపోతే, ఆయన శరీరధారియైన దేవుడుగా ఉండకపోవును. యేసు తన కాలంలో ఎన్నో గొప్ప అద్భుతాలు చేశాడు. ఆ కాలంలోని ఇశ్రాయేలీయులు చూసింది పూర్తిగా అద్భుత కార్యాలే; వారు దేవదూతలను మరియు దూతలను చూశారు, వారు యెహోవా స్వరాన్ని విన్నారు. ఇవన్నీ అతీతమైనవి కాదా? ఖచ్చితంగా, మానవాతీత విషయాలతో మనిషిని మోసం చేసే కొన్ని దురాత్మలు నేడు ఉన్నాయి; ప్రస్తుతం పరిశుద్ధాత్మ ద్వారా జరిగించబడని కార్యముతో మనిషిని మోసం చేయడం, వారి అనుకరణ తప్ప మరొకటి కాదు. చాలా మంది ప్రజలు అద్భుతాలు చేస్తారు రోగులను స్వస్థపరుస్తారు మరియు దయ్యాలను వెళ్లగొడతారు; ఇవి దురాత్మల కార్యము తప్ప ఇంకొకటి కాదు, ఎందుకంటే ఈ రోజుల్లో పరిశుద్ధాత్మ అలాంటి పని చేయడు, మరియు ఆ కాలం నుండి పరిశుద్ధాత్మ కార్యాన్ని అనుకరించిన వారందరూ నిజంగా దురాత్మలే. ఆ కాలంలోని ఇశ్రాయేలులో జరిగించబడిన కార్యమంతా అద్భుత స్వభావంతో కూడిన కార్యము, ఇప్పుడు పరిశుద్ధాత్మ ఆ రీతిలో కార్యము చేయనప్పటికీ, ఇప్పుడు అలాంటి కార్యము ఏదైనా ఉందా అంటే అది అనుకరణ మరియు సాతాను వేషధారణ మరియు దాని అల్లరే. కానీ అతీతమైనది అంతా దురాత్మల నుండి వస్తుందని నీవు చెప్పలేవు—ఇది దేవుని కార్యపు యుగముపై ఆధారపడి ఉంటుంది. ఈ రోజుల్లో శరీరధారి అయిన దేవుడు చేసిన పనిని పరిశీలించండి: ఇది ఏ కోణములో అతీతమైనది కాదు? ఆయన మాటలు నీకు అర్థం కానివి మరియు అందనివి, ఆయన చేసే కార్యము ఏ మనిషి ద్వారా జరిగించబడదు. ఆయన అర్థం చేసుకున్న దానిని మనిషి అర్థం చేసుకునే అవకాశమే లేదు, ఆయన జ్ఞానం విషయానికొస్తే, అది ఎక్కడి నుండి వస్తుందో మనిషికి తెలియదు. “నేను కూడా నీలాగే మామూలుగానే ఉన్నాను, అయితే నీకు తెలిసినది నాకు తెలియకపోవడం ఏమిటి? నేను అనుభవములో పెద్దవాడిని గొప్పవాడిని అయినా నాకు తెలియని దాని గురించి నీవు ఎలా తెలుసుకోగలవు?” అని చెప్పేవారు కొందరు ఉంటారు, ఇవన్నీ, మనిషికి సంబంధించినంత వరకు, దాన్ని పొందడం మనిషి సాధ్యపడదు. అయితే కొంతమంది, “ఇశ్రాయేలులో జరిగిన కార్యం గురించి ఎవరికీ తెలియదు, బైబిల్ వ్యాఖ్యాన కర్తలు కూడా ఎలాంటి వివరణ ఇవ్వలేరు; మరి నీకు ఎలా తెలుస్తుంది?” ఇవన్నీ అద్భుతమైన విషయాలు కాదా? ఆయనకు అద్భుతాల గురించి అనుభవం లేదు, అయినా ఆయనకు అన్నీ తెలుసు; ఆయన సత్యాన్ని చాలా సులువుగా మాట్లాడి వ్యక్తపరుస్తాడు. ఇది అతీతమైనది కాదా? ఆయన కార్యము శరీరం సాధించగలిగే దానిని మించిపోయింది. శరీరము కలిగిన ఏ మానవుని ఆలోచనకైనా అది అందనిది మరియు మానవ మనస్సులోని హేతువుకు పూర్తిగా అనూహ్యమైనది. ఆయన ఎన్నడూ బైబిల్ చదవనప్పటికీ, ఆయన ఇశ్రాయేలులోని దేవుని కార్యాన్ని అర్థం చేసుకున్నాడు. ఆయన మాట్లాడేటప్పుడు భూమిమీద నిలబడి ఉన్నప్పటికీ, ఆయన మూడవ ఆకాశపు రహస్యాల గురించి మాట్లాడతాడు. మానవుడు ఈ వాక్యాలను చదివినప్పుడు ఈ భావన అతన్ని మించిపోతుంది: “ఇది మూడవ ఆకాశపు భాష కాదా?” ఇవన్నీ సాధారణ మానవుడు సాధించగల సామర్థ్యానికి మించిన అంశాలు కాదా? ఆ సమయంలో, యేసు నలభై రోజులు ఉపవాసం ఉన్నప్పుడు, అది అతీతమైనది కాదా? నలభై రోజులు ఉపవాసం అన్ని సందర్భాల్లోనూ అద్భుతమంటే, అది దురాత్మల కార్యమేనని నీవు చెప్పినట్లయితే, నీవు యేసును ఖండించినట్టు కాదా? యేసు తన పరిచర్యను జరిగించడానికి ముందు ఒక సాధారణ మానవునిలాగానే ఉన్నాడు. ఆయన కూడా పాఠశాలకు వెళ్లాడు; లేకపోతే మరి చదవడం మరియు రాయడం ఆయన ఎలా నేర్చుకున్నాడు? దేవుడు శరీరునిగా మారినప్పుడు ఆత్మ శరీరం లోపల ఇమిడి ఉన్నది. ఏది ఏమైనప్పటికీ, ఒక సాధారణ మానవునిగా, ఆయన ఎదుగుదల మరియు పరిపక్వత ప్రక్రియలో గుండా వెళ్లడం అవసరం, మరియు ఆయన జ్ఞానసామర్థ్యం పరిపక్వత చెందే వరకు, ఆయన విషయాలను గుర్తించగలిగే వరకు ఆయనను ఒక సామాన్య మానవునిగా పరిగణించలేము. ఆయన మాన స్వభావము పరిపక్వత చెందిన తర్వాత మాత్రమే ఆయన తన పరిచర్యను జరిగించగలిగాడు. ఆయన సాధారణ మానవ స్వభావము ఇంకా పరిపక్వత చెందకుండా ఆయన హేతుబద్ధత స్పష్టంగా లేకుండా ఆయన తన పరిచర్యను ఎలా జరిగించగలడు? ఆయన ఆరు లేదా ఏడు సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు తన పరిచర్యను జరిగిస్తాడని ఖచ్చితంగా ఆశించలేము! దేవుడు మొదట శరీరునిగా మారినప్పుడు ఎందుకు తనను తాను బహిరంగంగా ప్రత్యక్షపరచుకోలేదు? ఇది ఎందుకంటే ఆయన శరీరపు మానవ స్వభావము ఇంకా పరిపక్వత చెందలేదు; ఆయన శరీరపు వివేచన ప్రక్రియలు, అలాగే ఈ శరీరపు సాధారణ మానవ స్వభావం, పూర్తిగా ఆయన స్వాధీనంలో లేవు. ఈ కారణంగా, ఆయన తన కార్యాన్ని ప్రారంభించే ముందు—శరీరునిగా తన కార్యాన్ని చేపట్టడానికి తగినట్టుగా సన్నద్ధమవడానికి—ఆయన సాధారణ మానవ స్వభావాన్ని మరియు సామాన్య మానవునికి ఉండే ఇంగిత జ్ఞానాన్ని కలిగి ఉండడం ఖచ్చితంగా అవసరం. ఆయన ఆ పనికి సరిపోకపోతే, తన ఎదుగుదలను మరియు పరిపక్వత చెందడాన్ని కొనసాగించడం అవసరమై ఉండేది. యేసు తన కార్యమును ఏడు లేదా ఎనిమిది సంవత్సరాల వయస్సులో ప్రారంభించి ఉంటే, మనిషి ఆయనను అద్భుతమైన వానిగా భావించేవాడా? ప్రజలందరూ ఆయనను చిన్న పిల్లవాడిగా భావించి ఉండేవారు కాదా? ఆయనను ఎవరు ఒప్పుకునేవారు? ఏడు లేదా ఎనిమిది సంవత్సరాల పిల్లవాడు వేదిక మీద ఉండే బల్లకంటే ఎత్తుగా ఉండడు—అతడు బోధించడానికి సరిపోతాడా? ఆయన సామాన్య మానవ జీవనము పరిపక్వత చెందక ముందు, ఆయన పని చేయడానికి తగిన వాడు కాదు. ఇంకా పరిపక్వత చెందని తన మానవ జీవితానికి సంబంధించినంత వరకు, ఆయన కార్యములో మంచి భాగం మాత్రము సాధించలేనిది. శరీరములో జరిగే దేవుని ఆత్మ కార్యము కూడా తన సొంత నియమాలను బట్టి జరిగించబడుతుంది. ఆయన సామాన్య జీవితపు అనుభవాలతో కూర్చబడినప్పుడు మాత్రమే ఆయన కార్యాన్ని చేపట్టి తండ్రి బాధ్యతను స్వీకరించగలడు. అప్పుడు మాత్రమే ఆయన తన కార్యాన్ని ప్రారంభించగలడు. యేసు తన చిన్నతనంలో, పురాతన కాలంలో జరిగిన చాలా విషయాల గురించి ఏమీ అర్థం చేసుకోలేకపోయాడు, మరియు సమాజ మందిరంలోని బోధకులను అడగడం ద్వారా మాత్రమే ఆయన అర్థం చేసుకున్నాడు. ఆయన మాట్లాడటం నేర్చుకున్న వెంటనే తన కార్యాన్ని ప్రారంభించినట్లయితే, ఆయన తప్పులు చేయకుండా ఉండడం ఎలా సాధ్యం అయ్యేది? దేవుడు తప్పటడుగులు ఎలా వేయగలడు? అందువల్ల, ఆయన కార్యాన్ని చేయగలిగిన తర్వాత మాత్రమే ఆయన తన కార్యాన్ని ప్రారంభించాడు; ఆయన చేపట్టిన దాన్ని పూర్తి చేయగలిగేంత వరకు ఆయన ఏ కార్యాన్నీ జరిగించలేదు. 29 ఏళ్ల వయస్సులో, యేసు అప్పటికే చాలా పరిణతి చెందాడు మరియు ఆయన చేయవలసిన కార్యాన్ని చేపట్టడానికి తనకున్న మానవ స్వభావం చక్కగా సరిపోతుంది. అప్పుడు మాత్రమే దేవుని ఆత్మ అధికారికంగా ఆయనలో పనిచేయడం ప్రారంభించింది. ఆ కాలంలో, యోహాను ఆయనకు మార్గాన్ని సరాళం చేయడానికి ఏడు సంవత్సరాలు సిద్ధపడ్డాడు, అతని పనిని ముగించిన తరువాత అతను చెరసాలలో వేయబడ్డాడు. భారమంతా పూర్తిగా యేసుపై పడింది. అయినా 21 లేదా 22 సంవత్సరాల వయస్సులో, ఆయన మానవ జీవితం ఇంకా తక్కువగా ఉన్న సమయంలో, ఆయన కేవలం అప్పుడే యవ్వనంలోకి ప్రవేశించిన సమయంలో, మరియు ఆయనకు ఇంకా అర్థంకాని అనేక విషయాలు ఉన్నప్పుడు, ఈ కార్యాన్ని తలపెట్టి ఉంటే, నియంత్రించలేకపోయాడు. ఆ కాలంలో, యేసు తన కార్యాన్ని ప్రారంభించడానికి ముందు యోహాను కొంతకాలం కార్యాన్ని జరిగించాడు, ఆ సమయానికి అతను నడి వయస్సు కలిగి ఉన్నాడు. ఆ వయస్సులో, ఆయన చేయాల్సిన కార్యాన్ని చేపట్టడానికి ఆయనకున్న సాధారణ మానవ స్వభావం సరిపోతుంది. ఇప్పుడు, శరీరధారి అయిన దేవుడు కూడా సాధారణ మానవ స్వభావాన్ని కలిగి, మీలోని పెద్ద వారితో పోలిస్తే పరిణతి చెందనప్పటికీ, ఆయన కార్యాన్ని చేపట్టడానికి ఈ మానవ స్వభావము ఇప్పటికే సరిపోతుంది. ఈనాటి కార్యాన్ని చుట్టుముట్టిన పరిస్థితులు పూర్తిగా యేసు కాలంలో ఉన్నవి కావు. యేసు పన్నెండు మంది అపొస్తులులను ఎందుకు ఎన్నుకున్నాడు? ఇదంతా ఆయన కార్యానికి మద్దతుగా దానితో ఏకీభవించడానికే. ఇది ఒక వైపు, ఆ సమయములో ఆయన కార్యానికి పునాది వేయడానికి, మరోవైపు ఇది రానున్న రోజుల్లో ఆయన కార్యానికి పునాది వేయడానికి ఆయన వారిని ఎన్నుకున్నాడు. ఆ కాలంలోని కార్యానికి అనుగుణంగా, పన్నెండు మంది అపొస్తులులను ఎన్నుకోవడం యేసు చిత్తం, అది స్వయంగా దేవుని చిత్తమే. ఆయన పన్నెండు మంది అపొస్తులులను ఎన్నుకొని ప్రతిచోటా బోధించడానికి వారిని నడిపించాలని ఆయన నమ్మాడు. కానీ ఈ రోజు మీ మధ్యలో దీని అవసరం లేదు! శరీరధారి అయిన దేవుడు దేహమందు కార్యం చేస్తున్నప్పుడు, మానవునికి అర్థంకాని అనేక నియమాలు మరియు అనేక విషయాలు ఉన్నాయి; దేవుణ్ణి అంచనా వేయడానికి, లేక ఆయనను అధికంగా కోరికలను కోరడానికి మనిషి తన స్వంత ఆలోచనలను ఎక్కువగా ఉపయోగిస్తుంటాడు. ఈ రోజు వరకు, చాలా మంది ప్రజలకు వారి జ్ఞానం పూర్తిగా వారి సొంత అభిప్రాయాలతో కూడిందని పూర్తిగా తెలియదు. దేవుడు శరీరధారిగా వచ్చిన కాలము లేదా ప్రదేశము ఏదైనప్పటికీ, శరీరమందు ఆయన కార్యానికి సంబంధించిన నియమాలేవీ మారవు. ఆయన శరీరము దాల్చలేడు, అయినప్పటికీ ఆయన కార్యంలో శరీరాన్ని అధిగమించాడు; ఆయన శరీరునిగా మారగలిగినా కూడా శరీరానికి సంబంధించిన సాధారణ మానవ జీవితాన్ని కలిగి కార్యమును జరిగించలేడు. లేకపోతే, దేవుని శరీరధారణకు ప్రాముఖ్యత ఏమీ లేకుండా పోతుంది, మరియు వాక్యము శరీరముగా మారడం కూడా పూర్తిగా అర్ధరహితంగా మారిపోతుంది. అంతేకాకుండా, పరలోకంలో ఉన్న తండ్రికి (ఆత్మ) మాత్రమే దేవుని శరీరధారణ గురించి తెలుస్తుంది, శరీరునిగా ఉన్న తనకు లేదా పరలోకపు దూతలకు, ఇంకెవరికీ కూడా తెలియదు. ఇది ఇలా ఉండగా, శరీరమందున్న దేవుని కార్యము ఎంతో సాధారణమైనది మరియు వాక్యము నిజానికి శరీరంగా మారిందని, శరీరం అంటే సాధారణమైన మరియు సామాన్యమైన మనిషి అని వెల్లడి చేయగలుగుతుంది.
కొందరు, “ఎందుకు స్వయంభవుడైన దేవుడే ఈ యుగానికి నాంది పలకాలి? ఆయన స్థానంలో సృజించబడిన ఒక జీవి నిలబడలేదా?” అని అనుకోవచ్చు. కొత్త యుగాన్ని ఆవిష్కరించే ఉద్దేశంతోనే దేవుడు శరీరునిగా మారాడని మీ అందరికీ తెలుసు, మరియు, నిజానికి, కొత్త యుగాన్ని ఆవిష్కరించినప్పుడు, అదే సమయంలో పాత యుగాన్ని ముగించి ఉంటాడు. దేవుడు ఆదియు అంతమునై ఉన్నాడు; తన కార్యాన్ని కొనసాగింపులో ఉంచేది ఆయనే మరియు పాత యుగాన్ని ముగించేది కూడా ఆయనే. ఆయన సాతాన్ని ఓడించి లోకాన్ని జయించాడు అనడానికి ఇదే రుజువు. ఆయన మనుషుల మధ్య తనంతట తానే కార్యము చేసిన ప్రతిసారి, అది ఒక కొత్త యుద్ధానికి ఆరంభం. నూతన కార్యము ప్రారంభం కాకుండా, సహజంగానే పాత దానికి ముగింపు ఉండదు. మరియు పాత దానికి ముగింపు లేనప్పుడు, సాతానుతో యుద్ధం ఇంకా ముగింపుకి రాలేదు అనడానికి ఇది రుజువు. దేవుడే స్వయంగా వచ్చి, మనుషుల మధ్య నూతన కార్యాన్ని చేపట్టినప్పుడు మాత్రమే, మనిషి సాతాను ఆధిపత్యం నుండి పూర్తిగా విడుదల పొంది మరియు కొత్త జీవితాన్ని పొందుకొని నూతన ఆరంభాన్ని కలిగియుంటాడు. లేకపోతే, మనిషి ఎప్పటికీ పాత యుగంలోనే జీవిస్తాడు మరియు ఎప్పటికీ సాతాను పాత ప్రభావములోనే జీవిస్తాడు. దేవుని ద్వారా నడిపించబడే ప్రతి యుగంలో, మనిషి కొంత భాగం వరకు విడుదల పొందుతాడు, తద్వారా మనిషి నూతన యుగంవైపు దేవుని కార్యము తోపాటుగా అభివృద్ధి చెందుతాడు. దేవుని విజయం అంటే ఆయనను వెంబడించే వారందరి విజయం అని అర్థం. సృష్టించబడిన మానవ జాతికి యుగాన్ని ముగించాలని ఆదేశించబడితే, అది మనిషి లేక సాతాను దృష్టి నుండైనా ఆరంభించబడాలి, ఇలా జరిగినప్పుడు ఇది దేవుని వ్యతిరేకించడమైనా, లేదా ద్రోహం చేయడమైనా అవుతుందే తప్ప మరేమీ కాదు, అలాంటప్పుడు అది దేవునికి విధేయత చూపడం అనిపించుకోదు, మరియు మానవుని పని సాతానుకు ఒక సాధనంగా మారిపోతుంది. దేవుడే స్వయంగా నాంది పలికిన యుగంలో మనిషి దేవునికి విధేయత చూపించి, వెంబడించినప్పుడు మాత్రమే సాతాను పూర్తిగా ఒప్పించబడుతుంది, ఎందుకంటే అది సృజించబడిన జీవి యొక్క విధి. కాబట్టి, మీరు వెంబడించి, విధేయత చూపించడం మాత్రమే మీ నుండి కోరుకొనుచున్నదని, అంతకంటే మించి ఇంకేమీ లేదని నేను చెప్తున్నాను. ప్రతి ఒక్కరు తమ విధిని పాటించడం మరియు ప్రతి ఒక్కరూ తమ తమ విధులను నిర్వర్తించడం అంటే ఇదే. దేవుడు తన సొంత కార్యమును చేస్తాడు, ఆయన స్థానంలో మనిషి దానిని చేయాల్సిన అవసరం లేదు, లేదా సృజించబడిన జీవుల పనిలో ఆయన పాల్గొననవసరం లేదు. మనిషి తన సొంత కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాడు గాని దేవుని కార్యములో పాల్గొనడు. ఇది మాత్రమే విధేయత, మరియు సాతాను అపజయానికి రుజువు. స్వయంభవుడైన దేవుడే కొత్త యుగానికి నాంది పలికిన తర్వాత, మానవజాతి మధ్యలో కార్యాన్ని చేయడానికి తనకు తానుగా ఇకపై దిగి రాడు. అప్పుడే సృజించబడిన జీవిగా మనిషి తన కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి తన పనిని జరిగించడానికి అధికారికంగా కొత్త యుగంలోకి అడుగుపెడతాడు. దేవుడు జరిగించే కార్యము ద్వారా కలిగిన నియమాలు ఇవే, వీటిని ఏ ఒక్కరూ అతిక్రమించలేరు. ఈ విధంగా కార్యము జరగడమే సరియైనది మరియు సహేతుకమైనది. ఆయన కార్యమును కొనసాగించువాడు మరియు కార్యాన్ని ముగించేవాడు ఆయనే. కార్య ప్రణాళిక చేసేవాడు ఆయనే మరియు దానిని నిర్వహించేదీ అంతేగాకుండా కార్యమును ఫలవంతం చేసేవాడూ ఆయనే. “నేనే ఆదియు అంతమునై యున్నవాడను; నేనే విత్తువాడను కోయువాడను” అని బైబిలు గ్రంథములో చెప్పినట్లుగా, స్వయంభవుడైన దేవుడు తన నిర్వహణ కార్యానికి సంబంధించినదంతా చేస్తాడు. ఆరువేల సంవత్సరాల నిర్వహణ ప్రణాళికకు పాలకుడు ఆయనే; ఆయన స్థానంలో ఎవరు ఆయన కార్యాన్ని చేయలేరు మరియు ఆయన కార్యాన్ని ఎవరూ ముగించలేరు, ఎందుకంటే సమస్తాన్ని తన హస్తగతం చేసుకున్నది ఆయనే. లోకాన్ని సృజించిన తర్వాత, ఆయన సర్వలోకాన్ని తన వెలుగులో జీవించడానికి నడిపిస్తాడు, మరియు ఆయన యుగమంతటినీ కూడా ఆయనే ముగిస్తాడు, తద్వారా ఆయన మొత్తం ప్రణాళికను ఫలవంతం చేస్తాడు!