ఆచరణ (2)

గతకాలంలో, ప్రతి క్షణం దేవునితో ఉండటానికి మరియు ఆత్మలో జీవించడానికి ప్రజలు వారికివారే శిక్షణ పొందారు. నేటి ఆచరణతో పోలిస్తే, అది ఆధ్యాత్మిక శిక్షణకు సరళ రూపం; ప్రజలు సరైన జీవన మార్గంలోకి ప్రవేశించే ముందు ఇది లోతులేని మరియు సరళమైన అభ్యాస మార్గం, ఇది ప్రజల విశ్వాసపు ఆచరణలో మొట్ట మొదటి దశ. ప్రజలు వారి జీవితంలో ఎల్లప్పుడూ ఈ రకమైన ఆచరణపై ఆధారపడినట్లయితే, వారికి చాలా భావాలు కలుగుతాయి మరియు వారు తప్పులు చేసే అవకాశం ఉంటుంది మరియు వారు నిజమైన జీవిత అనుభవాలలోకి ప్రవేశించలేరు; వారు కేవలం తమ ఆత్మలకు మాత్రమే శిక్షణ ఇవ్వగలుగుతారు, వారి హృదయాలలో దేవునికి సాధారణంగా చేరువ కాగలరు మరియు తమతో దేవుడు ఉండటంలో ఎప్పుడూ అంతులేని ఆనందాన్ని అనుభవిస్తారు. వారు దేవునితో తామ కలిసి ఉండే చిన్న పరిధికి మాత్రమే తమను పరిమితం చేసుకుంటారు మరియు మరింత లోతైన దానిని దేనినీ పొందలేరు. ఈ సరిహద్దుల లోపల జీవించే ప్రజలు ఎటువంటి గొప్ప పురోగతిని సాధించలేరు. ఏ సమయంలోనైనా, వారు “అయ్యో! ప్రభువైన యేసు. ఆమేన్!” అని ఏడ్చే అవకాశం ఉంటుంది. వారు ఆచరణలో ప్రతిరోజూ ఇలాగే ఉంటారు-ఇది ప్రతి క్షణం ఆత్మలో జీవించే గడిచిపోయిన కాలాల ఆచరణ. ఇది అసభ్యమైనది కాదా? ఈరోజు, దేవుని వాక్యముల గురించి ఆలోచించాల్సిన సమయం వచ్చినప్పుడు, దేవుని వాక్యముల గురించి ఆలోచించడంపై మాత్రమే దృష్టి పెట్టండి; సత్యాన్ని ఆచరణలో పెట్టాల్సిన సమయం వచ్చినప్పుడు, సత్యాన్ని ఆచరణలో పెట్టడంపై మాత్రమే దృష్టి పెట్టండి; మీ కర్తవ్యాన్ని నిర్వర్తించే సమయం వచ్చినప్పుడు, మీ కర్తవ్యాన్ని మాత్రమే నిర్వర్తించండి. ఈ రకమైన ఆచరణ వాస్తవానికి చాలా స్వేచ్ఛనిచ్చేది; ఇది మిమ్మల్ని విముక్తులను చేస్తుంది. ఇది పాతకాలపు మతపరమైన వ్యక్తులు ప్రార్థించినట్లు కాదు మరియు కృప గురించి మాట్లాడినట్లు కాదు. అయితే, గతంలో, ఇది విశ్వాసం ఉన్న వ్యక్తుల ఆచరణ, కానీ ఇప్పుడు ఈ విధంగా ఆచరించడమనేది చాలా వెనుకబడిన విధానం. దేవుని కార్యము ఇప్పుడు ఉన్నత స్థాయిలో ఉంది; “దేవుడిని నిజ జీవితంలోకి తీసుకురావడం” అని ఈ రోజు మాట్లాడడం అనేది ఆచరణలో అత్యంత ముఖ్యమైన అంశం. ప్రజలు తమ నిజ జీవితంలో సాధారణ మానవత్వం కలిగి ఉండాలని ఇది ఆశిస్తుంది, అయితే, ప్రజలు తమ సాధారణ మానవత్వంలో కలిగి ఉండాల్సింది ఈరోజు దేవుడు చెబుతున్న అన్ని వాక్యములనే. దేవుని ఈ వాక్యములను నిజ జీవితంలోకి తీసుకురావడమనే దానికి ఆచరణాత్మక అర్ధం “దేవుడిని నిజ జీవితంలోకి తీసుకురావడమే.” ఈరోజు, ప్రజలు ప్రధానంగా కింది వాటితో తమను తాము సంసిద్ధం చేసుకోవాలి: ఒక రకంగా, వారు తమ సామర్థ్యాన్ని మెరుగుపరచుకోవాలి, చదువుకోవాలి మరియు తమ పఠన మరియు గ్రహణ నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలి; మరో రకంగా, వారు ఒక సాధారణ వ్యక్తిగా జీవితం గడపాలి. నీవు లోకం నుండి ఇప్పుడే దేవుని యెదుటకు వచ్చావు; నీవు మొదటగా నీ హృదయానికి దేవుని యెదుట శాంతంగా ఉండేలా శిక్షణ ఇవ్వాలి. ఇది ఆచరణలో మొట్టమొదటి అడుగు మరియు ఇది మీ జీవిత స్వభావములో మార్పును సాధించడంలో కూడా మొదటి అడుగు. ఇతరులతో పోల్చినప్పుడు కొంతమంది తమ ఆచరణలో అనుగుణంగా మారగల స్వభావంతో ఉంటారు; వారు పని చేస్తున్నప్పుడు, వాస్తవానికి వారు అర్థం చేసుకోవలసిన సత్యాలు మరియు ఆచరణ నియమాలను తెలుసుకుంటూ సత్యం గురించి ఆలోచిస్తారు. ఒక కోణంలో, మీకు సాధారణ మానవ జీవితం ఉండాలి మరియు మరొక కోణంలో సత్యంలోకి తప్పకుండా ప్రవేశం ఉండాలి. ఈ విషయాలన్నీ నిజ జీవితంలో అత్యత్తమ ఆచరణ అవుతాయి.

ప్రజల నిజ జీవితాల్లోకి దేవుడిని తీసుకురావడానికి ప్రధానంగా కావలసినవి వారు దేవుడిని ఆరాధించడం, దేవుడిని తెలుసుకోవాలనుకోవడం మరియు సాధారణ మానవత్వానికి లోబడి దేవుడి సృష్టిలోని ఒక జీవి కర్తవ్యాన్ని నిర్వహించడం. వారు ఏదైనా చేస్తున్న ప్రతిసారీ దేవుడిని ఖచ్చితంగా ప్రార్థించాలని కాదు, అది ఫర్వాలేదని కాదు మరియు వారు ప్రార్థించకపోతే ఆయనకు రుణపడి ఉన్నట్లు భావించాలి. ఈనాటి ఆచరణ అలా లేదు; ఇది నిజంగా ప్రశాతంగా మరియు సరళంగా ఉంది! దీనికి ప్రజలు సిద్ధాంతాలకు కట్టుబడాల్సిన అవసరం లేదు. అలా కాకుండా, ప్రతి వ్యక్తి తన వ్యక్తిగత స్థాయిని బట్టి వ్యవహరించాలి: మీ కుటుంబ సభ్యులు దేవుడిని విశ్వసించకపోతే, వారిని అవిశ్వాసులుగా భావించండి మరియు వారు విశ్వసిస్తే, వారిని విశ్వాసులుగా భావించండి. ప్రేమ, సహనాన్ని ఆచరించకండి, బదులుగా వివేకాన్ని ఆచరించండి. కొంతమంది కూరగాయలు కొనడానికి బయటికి వెళ్తారు మరియు నడుచుకుంటూ వెళుతున్నప్పుడు వారు గొణుగుతారు: “ఓ దేవుడా! ఈరోజు నేను కొనడానికి నీవు ఏ కూరగాయలు ఇస్తున్నావు? నేను నీ సహాయాన్ని వేడుకుంటున్నాను. అన్ని విషయాలలో ఆయన నామమును మహిమపరచాలని మరియు మనమందరం సాక్ష్యం చెప్పాలని దేవుడు కోరుతాడు, కాబట్టి అమ్మేవాడు నాకు ఏదైనా కుళ్ళినది ఇచ్చినప్పటికీ, నేను అప్పుడు కూడా దేవునికి ధన్యవాదాలు తెలుపుతాను-నేను సహిస్తాను. మనం దేవుడిని విశ్వసించినప్పుడు కూరగాయలను ఏరుకుని ఎంచుకోలేము.” ఇలా చేయడమనేది సాక్ష్యం ఇచ్చినట్టుగా వారు భావిస్తారు, ఫలితంగా వారు కొన్ని కుళ్ళిన కూరగాయలను కొనడానికి డబ్బు వెచ్చిస్తారు, కానీ అప్పుడు కూడా వారు ప్రార్థిస్తారు మరియు ఇలా అంటారు: “ఓ దేవుడా! నీకు ఆమోదయోగ్యం అయినంత వరకు నేను ఈ కుళ్ళిన కూరగాయలనే తింటాను.” అలాంటి ఆచరణ మూర్ఖత్వం కాదా? ఇది సిద్ధాంతాన్ని అనుసరించడం కాదా? గతంలో, ప్రజలు ప్రతి క్షణం ఆత్మలో జీవించడానికి శిక్షణ పొందారు-ఇది గతంలో కృపా యుగములో చేసిన కార్యానికి సంబంధించినది. భక్తి, వినయం, ప్రేమ, సహనం, అన్నింటికీ ధన్యవాదాలు చెప్పడం-ఇవి కృపా యుగములో విశ్వాసి అయిన ప్రతి ఒక్కరూ చేయవసినవి. ఆ కాలములో, ప్రజలు అన్ని విషయాలలో దేవుడిని ప్రార్థించారు; వారు దుస్తులు కొనేటప్పుడు ప్రార్థిస్తారు, మరియు ఒక కూటమి గురించి తెలియజేసినప్పుడు, కూడా వారు ప్రార్థిస్తారు: “ఓ దేవుడా! నీవు నన్ను వెళ్ళమంటావా లేక వద్దంటావా? నీవు నన్ను వెళ్ళమంటే, నా కోసం ఒక సునాయాసమైన మార్గాన్ని సిద్ధం చెయ్యి. నీవు నన్ను వెళ్ళవద్దంటే, నన్ను తట్టుకుని కింద పడిపోయేలా చెయ్యి.” వారు ప్రార్థించేటప్పుడు దేవుడిని వేడుకుంటారు మరియు ప్రార్థన చేసిన తర్వాత వారు ఇబ్బందికరంగా భావిస్తారు మరియు వెళ్ళరు. కొంతమంది సోదరీమణులు, కూటముల నుండి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, అవిశ్వాసులైన వారి భర్తలు వారిని కొడతారేమోనని భయపడి, వారు ప్రార్థన చేసినప్పుడు ఇబ్బందికరంగా భావిస్తారు, కాబట్టి కూటములకు వెళ్లరు. ఇది దేవుని చిత్తమని వారు విశ్వసించారు, వాస్తవంలోనైతే, వారు వెళ్లి ఉంటే, ఏమీ జరిగి ఉండేది కాదు. ఫలితంగా వారు ఒక కూటమిని తప్పిపోయారు. ఇదంతా ప్రజల అజ్ఞానం ఫలితంగానే జరిగింది. ఈ విధంగా ఆచరించే వ్యక్తులందరూ తమ సొంత భావాలతోనే జీవిస్తారు. ఈ విధంగా ఆచరించడం అనేది చాలా తప్పు మరియు అర్థరహితం మరియు అస్పష్టతతో నిండి ఉంటుంది. వారి వ్యక్తిగత భావాలు మరియు ఆలోచనలు మరీ ఎక్కువగా ఉన్నాయి. నీకు ఒక కూటమి గురించి చెప్పడం జరిగితే, వెళ్లండి; దానికోసం ఇంకా దేవుడిని ప్రార్థించాల్సిన అవసరం లేదు. ఇది సులభం కాదా? నీవు ఈరోజు ఏవైనా దుస్తులు కొనాల్సి వస్తే, వెంటనే బయటకు వెళ్లి వాటిని కొనండి. దేవుడిని ప్రార్థించి ఇలా చెప్పకండి: “ఓ దేవుడా! నీవు నన్ను వెళ్ళమంటావా లేక వద్దంటావా? నేను బయటికి వెళ్లినప్పుడు సోదరసోదరీమణులలో ఎవరైనా వస్తే ఏమి చేయాలి?” ఒక సోదరుడు లేదా సోదరి వస్తారని నీవు భయపడుతున్నావు కాబట్టి నీవు వెళ్లవు, అయితే వాస్తవానికి జరిగింది ఏమిటంటే సాయంత్రం అయినప్పటికీ ఎవరూ రాలేదు. కృపా యుగములో కూడా, ఈ విధంగా ఆచరించడం అనేది విపరీతంగా మరియు తప్పుగా ఉండేది. కాబట్టి, గత కాలంలో చేసినట్టు ప్రజలు ఆచరిస్తే, వారి జీవితంలో ఎలాంటి మార్పు ఉండదు. వారు కేవలం అజ్ఞానంతో ఏది జరిగినా దానిని అంగీకరిస్తారు, వివేచనతో ఆలోచించడాన్ని పట్టించుకోరు మరియు గుడ్డిగా విధేయత చూపడం మరియు భరించడం మినహా ఇంకేమీ చేయరు. ఆ కాలములో, దేవుడిని మహిమపరచడంపై ప్రజలు దృష్టి పెట్టారు-అయితే దేవుడు వారి నుండి ఎలాంటి మహిమను పొందలేదు, ఎందుకంటే వారు ఏమాత్రం ఆచరణాత్మకంగా జీవించలేదు. వారు తమ వ్యక్తిగత ఆలోచనల ప్రకారం తమను తాము నిగ్రహించుకున్నారు మరియు పరిమిత పరుచుకున్నారు, అనేక సంవత్సరాలు ఆచరించినప్పటికీ వారి జీవితంలో ఎలాంటి మార్పు రాలేదు. వారికి సహించడం, వినయంగా ఉండటం, ప్రేమించడం మరియు క్షమించడం మాత్రమే తెలుసు, కానీ వారిలో పవిత్రాత్మ నుండి లేశమాత్రమైనా జ్ఞానోదయం లేదు. ఆ విధంగా ప్రజలు దేవుడిని ఎలా తెలుసుకోగలరు? వారు దేవుడిని మహిమపరచగల అవకాశం ఎలా ఉంటుంది?

ప్రజలు తమ నిజ జీవితాలలోకి, వారి సాధారణ మానవ జీవితాలలోకి దేవుడిని తీసుకువస్తే మాత్రమే వారు దేవునిపై విశ్వాసం గల సరైన మార్గంలోకి ప్రవేశించగలరు. ఈరోజు దేవుని వాక్యములు మిమ్మల్ని నడిపిస్తాయి; గతంలో లాగా వెతుక్కునే, తడుముకునే అవసరం లేదు. నీవు దేవుని వాక్యముల ప్రకారం ఆచరించగలిగినప్పుడు మరియు నేను బహిర్గతము చేసిన మానవ స్థితులకు అనుగుణంగా నిన్ను నీవు పరీక్షించుకోగలిగితే, కొలవగలిగితే, నీవు మార్పును సాధించగలవు. ఇది సిద్ధాంతం కాదు, ఇది దేవుడు మనిషి నుండి కోరుకునేది. ఈ రోజు, పరిస్థితులు ఎలా ఉన్నాయో నేను నీకు చెబుతాను: నా మాటల ప్రకారం నడుచుకోవడంలో మాత్రమే నీవు శ్రద్ధ వహించు. నీ నుండి నా అవసరాలు ఒక సాధారణ వ్యక్తి అవసరాలపై ఆధారపడి ఉంటాయి. నేను ఇప్పటికే నా మాటలు నీకు చెప్పాను; నీవు వాటిని ఆచరించడంపై దృష్టి పెట్టినంత కాలం, నీవు దేవుని ఉద్దేశాలకు అనుగుణంగా ఉంటావు. ఇప్పుడు దేవుని వాక్యములకు లోబడి జీవించే సమయం. దేవుని వాక్యములు ప్రతి ఒక్కటీ వివరించాయి, అన్నీ స్పష్టం చేయబడ్డాయి మరియు నీవు దేవుని వాక్యముల ప్రకారం జీవించినంత కాలం, నీవు పూర్తి స్వేచ్ఛ మరియు విముక్తితో కూడిన జీవితాన్ని గడుపుతావు. గతంలో, ప్రజలు తమ నిజ జీవితాల్లోకి దేవుడిని తీసుకువచ్చినప్పుడు, వారు మరీ ఎక్కువ సిద్ధాంతాలను మరియు ఆచారాలను ఆచరించారు మరియు వాటి గుండా వెళ్ళారు; స్పష్టంగా చెప్పబడిన దేవుని వాక్యములను పక్కన పెట్టి, వాటిని చదవకుండా నిర్లక్ష్యం చేసి, చాలా చిన్న విషయాలలో కూడా వారు ప్రార్థిస్తారు మరియు వేడుకుంటారు. దానికి బదులుగా, వారు అన్వేషించడానికి తమ ప్రయత్నాలన్నింటినీ అంకితం చేస్తారు-ఫలితంగా ఎటువంటి ప్రభావం లేకుండా పోయింది. ఉదాహరణకు, ఆహారం మరియు దుస్తుల విషయాలను తీసుకోండి: నీవు ప్రార్థిస్తావు మరియు దేవుడు నీ కోసం ప్రతిదాన్ని పరిష్కరించాలని కోరుతూ, ఈ విషయాలను దేవుని చేతుల్లో పెడతావు. దేవుడు ఈ మాటలు విన్నప్పుడు, ఇలా అంటాడు: “ఇలాంటి తుచ్ఛమైన వివరాలను గురించి నేను ఆలోచించాల్సిన అవసరం ఉందా? నీ కోసం నేను సృష్టించిన సాధారణ మానవత్వం మరియు సహేతుకత ఎక్కడికి పోయాయి?” కొన్నిసార్లు, ఎవరో ఒకరు తన పనులలో పొరపాటు చేస్తారు; అప్పుడు తాము దేవుడికి అపరాధం చేశామని వారు విశ్వసిస్తారు మరియు వారు అవరోధించబడతారు. కొంతమంది స్థితులు చాలా బాగున్నప్పటికీ, వారు ఏదైనా చిన్న పని తప్పుగా చేసినప్పుడు, దేవుడు తమను శిక్షిస్తున్నాడని విశ్వసిస్తారు. వాస్తవానికి, ఇది దేవుడు చేస్తున్నది కాదు, ఇది ప్రజల సొంత మనస్సుల ప్రభావం. కొన్నిసార్లు, నీవు అనుభవిస్తున్న దాంట్లో ఏ తప్పు ఉండదు, కానీ నీవు సరిగ్గా అనుభవించడం లేదని ఇతరులు చెబుతారు, దానిలో నీవు చిక్కుకుపోతావు-నీవు ప్రతికూలంగా మరియు అంతరంగంలో చీకటిగా తయారవుతావు. అప్పుడప్పుడు, ఈ విధంగా ప్రజలు ప్రతికూలంగా ఉన్నప్పుడు, వారిని దేవుడు శిక్షిస్తున్నాడని విశ్వసిస్తారు, కానీ దేవుడు ఇలా అంటాడు: “నేను నిన్ను శిక్షించడానికి ఏ పని చేయలేదు; నీవు ఆవిధంగా నన్ను ఎలా నిందించగలవు?” ప్రజలు మరీ సులభంగా ప్రతికూలంగా తయారవుతారు. వారు తరచూ అతి సున్నితంగా కూడా ఉంటారు మరియు తరచూ దేవుడిపై ఫిర్యాదు చేస్తారు. నీవు ఆ విధంగా బాధపడాలని కోరుకునే అవసరం దేవుడికి లేదు, అయినప్పటికీ నీకు నీవే ఆ స్థితిలో పడిపోయేలా చేసుకుంటావు. అలాంటి బాధలకు ఏ విలువ లేదు. ప్రజలకు దేవుడు చేసిన కార్యము తెలియదు మరియు అనేక విషయాలలో వారు అజ్ఞానులు మరియు స్పష్టంగా చూడలేరు, కాబట్టి వారు తమ సొంత ఆలోచనలు మరియు ఊహలలో ఇరుక్కుపోయి, నిరంతరం మరింత లోతుగా చిక్కుకుపోతారు. కొంతమంది అన్ని పనులు మరియు విషయాలు దేవుని చేతుల్లోనే ఉన్నాయని అంటారు-అలాంటప్పుడు ప్రజలు ప్రతికూలంగా ఉన్నప్పుడు దేవుడు తెలుసుకోలేడా? అవును, దేవునికి తెలుసు. నీవు మానవ ఆలోచనలలో చిక్కుకు పోయినప్పుడు, నీలో పని చేయడానికి పరిశుద్ధాత్మకు మార్గమేదీ ఉండదు. కొన్నిసార్లు, కొందరు వ్యక్తులు ప్రతికూల స్థితిలో చిక్కుకు పోతారు, కానీ నేను ఇప్పటికీ నా కార్యాన్ని కొనసాగిస్తాను. నీవు ప్రతికూలంగా ఉన్నా లేదా సానుకూలంగా ఉన్నా, నేను నీచేత నిర్బంధించబడలేదు-కానీ నేను మాట్లాడే అనేక వాక్యములు మరియు నేను పెద్దయెత్తున చేసే కార్యము, ప్రజల స్థితిని బట్టి, ఒకదానితో ఒకటి సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్నాయని నీవు తెలుసుకోవాలి. నీవు ప్రతికూలంగా ఉన్నప్పుడు, ఇది పరిశుద్ధాత్మ కార్యాన్ని అడ్డుకోదు. శిక్ష విధించే సమయంలో మరియు మరణ పరీక్షా సమయంలో, ప్రజలందరూ ప్రతికూల స్థితిలో చిక్కుకుపోయి ఉన్నారు, కానీ ఇది నా కార్యాన్ని అడ్డుకోలేదు. నీవు ప్రతికూలంగా ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ ఇతరులలో చేయాల్సిన కార్యాన్ని కొనసాగించింది. నీవు ఒక నెల రోజులు అనుసరించడం ఆపివేయవచ్చు, కానీ నేను పని చేస్తూనే ఉంటాను-ప్రస్తుతం లేదా భవిష్యత్తులో నీవు ఏమి చేసినప్పటికీ, అది పరిశుద్ధాత్మ కార్యాన్ని ఆపలేదు. మానవ బలహీనతల నుండి కొన్ని ప్రతికూల స్థితులు వస్తాయి; దేవుని అవసరాలు తీర్చడంలో లేదా వాటిని గ్రహించడంలో నిజంగా తాము అసమర్థులమని ప్రజలు విశ్వసించినప్పుడు, వారు ప్రతికూలంగా మారుతారు. ఉదాహరణకు, శిక్ష విధించే సమయంలో, శిక్ష మధ్యలో దేవుని వాక్యములు కొంత వరకు దేవుడిని ప్రేమించడం గురించి మాట్లాడుతాయి, కానీ ప్రజలు తమను తాము అసమర్థులమని విశ్వసించారు. తమ దేహానికి సాతాను చాలా లోతుగా చెరుపు చేశాడని మరియు తమ సామర్థ్యం చాలా తక్కువగా ఉందని వారు ముఖ్యంగా విచారం మరియు పరితాపం అనుభవించారు. ఈ వాతావరణంలో పుట్టడం అనేది ఎంతో జాలి పడాల్సిన విషయమని వారు భావించారు. దేవుడిని విశ్వసించడం మరియు దేవుడిని తెలుసుకోవడం చాలా ఆలస్యమైందని మరియు తాము పరిపూర్ణులుగా చేయబడటానికి అనర్హులని కొందరు భావించారు. ఇవన్నీ సాధారణ మానవ స్థితులే.

మానవుని దేహం సాతానుకు చెందినది, దీనిలో పూర్తిగా తిరుగుబాటు స్వభావాలు ఉన్నాయి, అది దయనీయంగా అశుద్ధమైనది మరియు ఎంతోకొంత అపరిశుభ్రమైనది. ప్రజలు దేహపరమైన ఆనందాన్ని ఎక్కువగా ఇష్టపడతారు మరియు దేహానికి మరీ ఎక్కువ వ్యక్తీకరణలు ఉన్నాయి; అందుకే మనిషి దేహాన్ని దేవుడు కొంత వరకు నిరాకరిస్తాడు. ప్రజలు సాతాను అశుద్ధమైన, చెరుపు విషయాలను త్యజించినప్పుడే, వారు దేవుని రక్షణను పొందుతారు. ఒకవేళ వారు ఇప్పటికీ అశుద్ధత మరియు చెరుపును తమంతట తామే త్యజించకపోతే, వారు ఇప్పటికీ సాతాను ఆధిపత్యం క్రింద జీవిస్తూనే ఉన్నారు. ప్రజల కుట్ర, మోసం, వంకరతనము అన్నీ సాతానుకు సంబంధించినవే. నిన్ను దేవుడు రక్షించడమంటే సాతాను ఈ విషయాల నుండి నిన్ను విడిపించడమే. దేవుని కార్యము తప్పు కానేరదు; ఇదంతా ప్రజలను చీకటి నుండి రక్షించడానికి చేయబడుతుంది. నీవు కొంత స్థాయి వరకు విశ్వసించి, శరీరపరంగా నీకునీవుగా చెరుపునకు దూరంగా ఉండగలిగినప్పుడు మరియు ఈ చెరుపు సంకెళ్లతో ఇకపై బంధించబడనప్పుడు, నీవు రక్షించబడి ఉండేవాడివి కాదా? నీవు సాతాను ఆధిపత్యం క్రింద జీవిస్తున్నప్పుడు నీవు దేవుడిని సాక్షాత్కారం చేయించలేవు, నీవు ఏదో అశుద్ధముగా ఉంటావు మరియు దేవుని వారసత్వాన్ని పొందలేవు. నీవు ప్రక్షాళన చేయబడి మరియు పరిపూర్ణుడివిగా మార్చబడిన తర్వాత, నీవు పరిశుద్ధుడివి అవుతావు, నీవు సాధారణ వ్యక్తిగా ఉంటావు మరియు నీవు దేవుని ఆశీర్వాదం పొందుతావు మరియు దేవునికి ఆనందం కలిగిస్తావు. దేవుడు ఈ రోజు చేసిన కార్యము రక్షణ, దానికి మించి, ఇది తీర్పు, శిక్ష మరియు శపించడం. దీనికి అనేక కోణాలున్నాయి. దేవుని పలుకులలో తీర్పు మరియు శిక్ష, అలాగే శాపాలు ఉన్నాయని మీరందరికీ కనిపిస్తుంది. నేను ఒక ప్రభావాన్ని సాధించడానికి, ప్రజలు తమను తాము తెలుసుకునేలా చేయడానికి మాట్లాడుతాను, అంతేగానీ ప్రజలను మృత్యుబారిన పడవేయటానికి కాదు. నా హృదయం మీ కోసమే ఉంది. నేను కార్యము చేసే విధానాలలో మాట్లాడటం ఒకటి; వాక్యముల ద్వారా నేను దేవుని స్వభావాన్ని వ్యక్తపరుస్తాను మరియు నీవు దేవుని చిత్తాన్ని అర్థం చేసుకునేలా వీలుకల్పిస్తాను. నీ శరీరం చనిపోవచ్చు, కానీ నీకు ఆత్మ మరియు మనస్సు ఉన్నాయి. మనుషులు దేహం మాత్రమే పొంది ఉంటే, అప్పుడు వారి విశ్వాసానికి అర్థం ఉండేది కాదు, అదేవిధంగా, నేను చేసిన ఈ కార్యమంతటికీ ఏ అర్థం ఉండేది కాదు. ఈరోజు, నేను ఒక విధంగా, ఆ తర్వాత మరో విధంగా మాట్లాడుతాను; ఒకసారి నేను ప్రజల పట్ల అతి ద్వేషంతో ఉంటాను, ఆ తర్వాత కొంతకాలం నేను అత్యంత ప్రేమగా ఉంటాను; నేను ఇదంతా నీ స్వభావాలలో మార్పు సాధించడానికి, అలాగే దేవుని కార్యము పట్ల నీ ఆలోచనలలో పరివర్తన తీసుకురావడానికి చేస్తాను.

అంత్యకాలము వచ్చేసింది మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు సంక్షోభంలో ఉన్నాయి. రాజకీయ గందరగోళం ఉంది, కరువులు, తెగుళ్ళు, వరదలు మరియు క్షామాలు ప్రతిచోటా కనిపిస్తున్నాయి. మానవ ప్రపంచంలో మారణహోమం ఉంది; పరలోకం కూడా విపత్తును కిందికి పంపింది. అంత్యకాలపు సంకేతాలు ఇవే. కానీ ప్రజలకు, ఇది వేడుక మరియు శోభతో నిండిన ప్రపంచంలా కనిపిస్తుంది; ఇలా కనిపించడం క్రమక్రమంగా పెరుగుతూ ఉంది, ప్రజల హృదయాలన్నీ దానివైపు ఆకర్షించబడతాయి మరియు అనేకమంది చిక్కుకుపోతారు మరియు దాని నుండి తమంతట తాము బయటికి రాలేరు; మోసం మరియు మంత్రవిద్య చేసే వారి చేతిలో చాలా పెద్ద సంఖ్యలో ప్రజలు మోసపోతారు. నీవు పురోగతి కోసం కృషి చేయకపోతే, ఆదర్శాలు లేకపోతే మరియు నీకైనీవు నిజమైన మార్గంలో నిలదొక్కుకోలేక పోతే, నీవు ఎగిసి పడుతున్న పాపపు అలలలో కొట్టుకుపోతావు. చైనా అన్నింటికంటే అత్యంత వెనుకబడిన దేశం; ఇది యెఱ్ఱని మహాఘటసర్పము చుట్టచుట్టుకొని పడుకుని ఉన్న భూమి, ఇక్కడ అత్యధికులు విగ్రహారాధన మరియు మంత్రవిద్య చేస్తారు, ఇక్కడ అత్యధిక దేవాలయాలు ఉన్నాయి మరియు ఇది అశుద్ధమైన ప్రేతాత్మలు నివసించే ప్రదేశం. నీవు దానిలో జన్మించావు, దానిలోనే చదువుకున్నావు మరియు దాని ప్రభావంలో మునిగిపోయావు; అది నిన్ను చెడగొట్టింది మరియు హింసించింది, కానీ మేల్కొన్న తర్వాత నీవు దానిని త్యజించావు మరియు దేవుడు నిన్ను పూర్తిగా పొందాడు. ఇదే దేవుని మహిమ, అందుకే ఈ కార్యపు దశకు గొప్ప ప్రాముఖ్యత ఉంది. దేవుడు అంత గొప్ప స్థాయిలో కార్యము చేశాడు, అనేక వాక్యములు చెప్పాడు, ఆయన అంతిమంగా మిమ్మల్ని పూర్తిగా పొందుతాడు—దేవుని నిర్వహణ కార్యములో ఇది ఒక భాగం మరియు సాతానుతో దేవుని యుద్ధంలో మీరు “విజయాన్ని పాడుచేసేవారు.” మీరు సత్యాన్ని ఎంత ఎక్కువగా అర్థం చేసుకుంటే, మీ చర్చి జీవితం ఎంత బాగా ఉంటే, అంత ఎక్కువగా యెఱ్ఱని మహాఘటసర్పము మోకరిల్లేలా చేయబడుతుంది. ఇవన్నీ ఆధ్యాత్మిక ప్రపంచ విషయాలు-అవి ఆధ్యాత్మిక ప్రపంచపు యుద్ధాలు మరియు దేవుడు విజయం సాధించినప్పుడు, సాతాను సిగ్గుపడి కూలిపోతుంది. దేవుని కార్యపు ఈ దశకు విపరీతమైన ప్రాముఖ్యత ఉంది. దేవుడు అంత గొప్ప స్థాయిలో కార్యము చేస్తాడు మరియు మీరు సాతాను ప్రభావం నుండి తప్పించుకోగలగడానికి, పరిశుద్ధ భూమిలో, దేవుని వెలుగులో జీవించగలగడానికి మరియు వెలుగు నాయకత్వం మరియు మార్గదర్శకత్వం పొందగలగడానికి, ఈ వ్యక్తుల సమూహాన్ని దేవుడు పూర్తిగా రక్షిస్తాడు. అప్పుడు నీ జీవితానికి ఒక అర్థం ఉంటుంది. మీరు తినేవి మరియు ధరించేవి అవిశ్వాసుల కంటే భిన్నంగా ఉంటాయి; మీరు దేవుని వాక్యములను ఆస్వాదిస్తారు మరియు అర్థవంతమైన జీవితాన్ని గడుపుతారు—అయితే వారు ఏమి ఆస్వాదిస్తారు? వారు తమ “పూర్వీకుల వారసత్వాన్ని” మరియు తమ “జాతీయ స్ఫూర్తిని” మాత్రమే ఆస్వాదిస్తారు. వీరిలో లేశమాత్రం కూడా మానవత్వం లేదు! మీ దుస్తులు, మాటలు మరియు పనులన్నీ వారికంటే భిన్నంగా ఉంటాయి. అంతిమంగా, అశుద్ధత నుండి మీరు పూర్తిగా తప్పించుకుంటారు, ఇకపై సాతాను ప్రలోభంలో చిక్కుకోరు మరియు దేవుని రోజువారీ కేటాయింపును పొందుతారు. మీరు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. మీరు అశుద్ధ ప్రదేశంలో జీవిస్తున్నప్పటికీ, మీకు అశుద్ధము అంటుకోదు మరియు మీరు దేవుని గొప్ప రక్షణ పొందుతూ, ఆయనతో కలిసి జీవిస్తారు. ఈ పసుపు భూమిలోని అందరి నుండి దేవుడు మిమ్మల్ని ఎంచుకున్నాడు. మీరు అత్యంత ఆశీర్వాదం పొందిన వారు కాదా? నీవు సృష్టించబడిన జీవివి-అయినప్పటికీ నీవు దేవుడిని ఆరాధించాలి మరియు అర్థవంతమైన జీవితాన్ని అనుసరించాలి. నీవు దేవుడిని ఆరాధించకుండా, నీ అశుద్ధమైన దేహంలో జీవిస్తే, అప్పుడు నీవు మానవ రూపంలో ఉన్న మృగానివి మాత్రమే కాదా? నీవు మానవుడివి కాబట్టి, నీవు దేవుని కోసం మూల్యం చెల్లించాలి మరియు అన్ని బాధలను సహించాలి! ఈరోజు నీకు ఎదురవుతున్న కొద్దిపాటి బాధలను నీవు సంతోషంగా మరియు నిశ్చయముగా అంగీకరించాలి మరియు యోబు, పేతురు లాగా అర్ధవంతమైన జీవితాన్ని గడపాలి. ఈ ప్రపంచంలో, మనిషి అపవాది దుస్తులను ధరిస్తాడు, అపవాది నుండి ఆహారం తింటాడు మరియు దాని అశుద్ధములో పూర్తిగా తొక్కబడుతూ, అపవాది బొటనవేలు క్రింద పని మరియు సేవ చేస్తాడు. నీవు జీవిత అర్థాన్ని గ్రహించకపోతే లేదా నిజమైన మార్గాన్ని పొందకపోతే, ఈ విధంగా జీవించడంలో ప్రాముఖ్యత ఏముంటుంది? మీరు సరైన మార్గాన్ని అనుసరించే, మెరుగుదలను కోరుకునేవారు. మీరు యెఱ్ఱని మహాఘటసర్పము ఉన్న దేశంలో మేల్కొన్న మరియు దేవుడు నీతిమంతులు అని పిలిచే వ్యక్తులు. అది అత్యంత అర్థవంతమైన జీవితం కాదా?

మునుపటి:  బైబిల్ పరిచయం (4)

తరువాత:  శరీరావతారపు రహస్యము (1)

సెట్టింగులు

  • వచనం
  • థీమ్స్

ఘన రంగులు

థీమ్స్

అక్షరశైలి

అక్షరశైలి పరిమాణం

గీతల మధ్య దూరం

గీతల మధ్య దూరం

పేజీ వెడల్పు

విషయ సూచిక

శోధించండి

  • ఈ వచనాన్ని శోధించండి
  • ఈ పుస్తకాన్ని శోధించండి

Connect with us on Messenger