శరీరావతారపు రహస్యము (3)

దేవుడు తన కార్యాన్ని జరిగించేటప్పుడు, ఆయన వచ్చేది తన పరిచర్యను నెరవేర్చడానికే గాని, ఏదైనా నిర్మాణంలోనో లేదా ఉద్యమంలోనో పాల్గొనడానికి కాదు. ఆయన శరీరునిగా మారిన ప్రతిసారి, అది ఒక కార్యపు దశను సాధించి, కొత్త యుగాన్ని ప్రారంభిస్తాడు. రాజ్యపు శిక్షణలాగ, ఇప్పుడు దేవుని రాజ్యపు యుగము వచ్చియున్నది. ఈ కార్యపు దశ కేవలం దేవుని కార్యములో కొంత భాగాన్ని పూర్తి చేయడం మాత్రమే గాని, ఇది మానవ కార్యము కాదు మరియు ఒక నిర్దిష్ట స్థాయి వరకు మానవుడు పని చేయడమూ కాదు. ఆయన జరిగించేది మానవ కార్యము కాదు, భూమిని విడిచిపెట్టే ముందు మానవుడు కార్యము జరిగించడములో ఒక ఖచ్చితమైన ఫలితాన్ని సాధించడమూ కాదు; ఇది ఆయన పరిచర్యను నెరవేర్చి ఆయన జరిగించాల్సిన కార్యాన్ని ముగించడం, అదే భూమిపై తన కార్యానికి తగిన ఏర్పాట్లు చేసి, దాన్నిబట్టి మహిమను పొందడం. శరీరధారియైన దేవుని కార్యము పరిశుద్ధాత్మచేత వాడబడిన వ్యక్తుల కార్యానికి విభిన్నంగా ఉంటుంది. దేవుడు భూమి మీద తన కార్యాన్ని జరిగించడానికి వచ్చినప్పుడు, ఆయన తన పరిచర్య నెరవేర్పును గురించి మాత్రమే పట్టించుకుంటాడు. తన పరిచర్యకి భిన్నంగా ఉన్న ఇతర సంగతులన్నిటికి సంబంధించినంత వరకు, ఆయన పట్టించుకునే దాకా కూడా, దాదాపుగా ఏ భాగాన్నీ తీసుకోడు. ఆయన చేయాల్సిన కార్యాన్ని మాత్రమే ఆయన జరిగిస్తాడు, మానవుడు చేయాల్సిన కార్యము మీద ఆయన అసలు శ్రద్ధ చూపడు. మిగతా విషయాలన్నీ తన దృష్టికి అతీతంగా ఉన్నట్లుగా, ఆయన జరిగించే కార్యమనేది కేవలం ఆయన ఉన్న కాలానికి మరియు ఆయన నెరవేర్చవలసిన పరిచర్యకు సంబంధించినదిగానే ఉంటుంది. ఆయన మానవజాతిలో ఒకనిగా జీవించడానికి కావాల్సిన మరింత ప్రాథమిక పరిజ్ఞానాన్ని తనకు తానుగా సమకూర్చుకోడు, లేదా ఆయన ఎక్కువ సామాజిక విద్యలనూ నేర్చుకోడు, లేదా మానవునికి అర్థమయ్యే దేనితోనూ తనను తాను సిద్ధపరచుకోడు. మానవుడు కలిగి ఉండవలసినదంతా ఆయనకు చెందినది కానే కాదు మరియు ఆయన జరిగించవలసిన బాధ్యతాయుతమైన కార్యాన్ని మాత్రమే చేస్తాడు. కాబట్టి, శరీరధారియైన దేవుడు ఎంత అసంపూర్ణంగా ఉన్నాడంటే, మానవుడు కలిగి ఉండవలసిన అనేక విషయాలపట్ల ఆయన శ్రద్ధ వహించడు మరియు అలాంటి విషయాలపై ఆయనకు అవగాహన కూడా ఉండదు. జీవితాన్ని గూర్చిన సాధారణ అవగాహన, అదేవిధంగా వ్యక్తిగత నడవడిక మరియు ఇతరులతో సంభాషణను జరిగించే నియమాలకు, ఆయనతో ఎలాంటి సంబంధము లేనట్టుగానే కనబడతాయి. అయితే శరీరధారియైన దేవుని నుండి క్రమ విరుద్దానికి చెందిన చిన్నపాటి జాడనైనా నీవు అసలు గ్రహించలేవు. మరొక విధంగా చెప్పాలంటే, ఆయన మానవ స్వభావము తన జీవితాన్ని ఒక సామాన్యమైన వ్యక్తిగా మరియు ఆయన మెదుడు సాధారణమైనదిగాను తన జీవితాన్ని నిర్వహిస్తుంది, మంచి చెడులను వివేచించే సామర్థ్యాన్ని ఆయనకు ఇస్తుంది. ఏదేమైనప్పటికీ, ఆయన వేరే ఇతర దేనిని సమకూర్చుకోలేదు గాని, మానవుడు (సృజించబడిన జీవులు) మాత్రమే కలిగియుండవలసిన వాటినే కలిగియున్నాడు. దేవుడు తన స్వంత పరిచర్యను నెరవేర్చడానికి మాత్రమే శరీరునిగా మారాడు. ఆయన కార్యము ఏ ఒక్క వ్యక్తికి, లేదా ప్రదేశానికి సంబంధించింది కాదు, కానీ యుగమంతటిని, విశ్వమంతటిని నిర్దేశించే కార్యమైయున్నది. ఇది ఆయన కార్యపు నిర్దేశనమైయున్నది మరియు ఆయన కార్యమును జరిగించే నియమమైయున్నది. ఎవరూ దీన్ని సవరించలేరుమరియు మానవుడు దీనిలో జోక్యం చేసుకునే అవకాశమే లేదు. దేవుడు శరీరునిగా మారిన ప్రతిసారీ, ఆ యుగపు కార్యాన్ని ఆయన తనతో పాటు తోడుకొని వస్తాడు మరియు మానవుడు ఆయనను బాగా అవగాహన చేసుకుని వివేకాన్ని పొందడానికి, ఇరవై, ముప్పై, నలభై, లేదా డెబ్బై లేదా ఎనభై సంవత్సరాలు అతడితో కలిసి జీవించాలనే ఉద్దేశ్యం లేదు. దాని అవసరమూ లేదు! ఆ విధంగా చేయడాన్ని బట్టి దేవుని సహజమైన స్వభావంపట్ల మానవునికి ఉన్న పరిజ్ఞానము ఏ రకంగానూ హెచ్చించబడదు; బదులుగా, అది కేవలం అతడి భావనలకు జోడించబడి, అతని ఉద్దేశాలను మరియు ఆలోచనలను నిర్జీవమయ్యేలా చేస్తుంది. అందుకని శరీరధారి యైన దేవుని కార్యమేమిటో మీరందరూ సరిగ్గా అర్థంచేసుకోవాల్సిన అవసరముంది. నిశ్చయంగా: “నేను వచ్చింది సాధారణ మానవ జీవితాన్ని గడపడానికి కాదు కదా?” అని నేను మీతో మాట్లాడిన మాటలను మీరు అర్థం చేసుకోకుండా ఉండలేరు. “దేవుడు భూమి పైకి వచ్చింది సామాన్య మానవ జీవితాన్ని జీవించడానికి కాదు” అనే మాటలను మర్చిపోయారా? శరీరునిగా మారడంలోనున్న దేవుని ఉద్దేశాన్ని మీరు గ్రహించరుమరియు “సృజించబడిన ఒక జీవి యొక్క జీవితాన్ని అనుభవించే ఉద్దేశంతో దేవుడు భూమి మీదికి ఎలా వస్తాడు?” అనే దాని భావమూ మీకు తెలీదు. తన కార్యాన్ని సంపూర్తి చేయడానికి మాత్రమే దేవుడు భూమికి వస్తాడు, కాబట్టి భూమి మీద ఆయన కార్యమనేది తాత్కాలికమై ఉన్నది. ఆయన భూమికి వచ్చేది సంఘాన్ని నడిపించే ఒక ఉన్నతమైన మనిషిగా తన శరీర సంబంధమైన దేహాన్ని వృద్ది చేయడానికి దేవుని ఆత్మను ప్రేరేపించాలనే ఉద్దేశ్యంతో కాదు. దేవుడు భూమిపైకి వచ్చినప్పుడు, వాక్యము శరీరధారిగా మారడమైయున్నది; అయితే, ఆయన కార్యము గురించి మానవుడు తెలుసుకోకుండా పరిస్థితులను బలవంతంగా ఆయనకు ఆపాదిస్తాడు. అయితే శరీరునిగా మారింది వాక్యమైయున్న దేవుడని, ఏదో ఆ క్షణానికి దేవుని పాత్రను పోషించడం కోసం దేవుని ఆత్మ ద్వారా వృద్ది చేయబడిన ఒక శరీర సంబంధమైన దేహము మాత్రం కాదని మీరందరూ గుర్తించాలి. దేవుడు తనకు తానుగా వృద్ధి చేయబడిన ఉత్పాదన కాదు, కానీ వాక్యమే శరీరునిగా మారి, ఈ రోజు అధికారికంగా మీ అందరి మధ్య ఆయన తన కార్యాన్ని నిర్వహిస్తున్నాడు. దేవుని శరీరావతారం అనేది వాస్తవికమైన ఒక సత్యమని మీరందరూ తెలుసుకొని, గుర్తించారు, అయినా మీరు అర్థం చేసుకున్నట్లుగా ప్రవర్తిస్తారు. శరీరధారియైన దేవుని కార్యం నుండి ఆయన శరీరావతారపు ప్రాధాన్యత మరియు గుణగణాల వరకు, వీటిని మీరు కొంచెము కూడా గ్రహించలేక కేవలం జ్ఞాపకశక్తి నుండి సరళముగా వాక్యములను కంఠస్థం చేయడంలో మాత్రం ఇతరులను వెంబడిస్తారు. శరీరధారియైన దేవుడు మీరు ఊహించిన విధంగా ఉండాలని మీరు విశ్వసిస్తున్నారా?

యుగాన్ని నడిపించుటకు మరియు నూతన కార్యానికి శ్రీకారం చుట్టడానికి మాత్రమే దేవుడు శరీరధారి అవుతాడు. మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకోవడం అవసరమై ఉన్నది. ఇది మనిషి క్రియాత్మతకు చాలా భిన్నంగా ఉంటుంది మరియు రెండింటినీ ఒకే విధంగా ప్రస్తావించలేము, లేక రెండూ ఒకదానికొకటి విభిన్నంగా ఉంటాయి. కార్యము జరిగించడానికి మనిషి వాడబడే దానికి ముందు సుదీర్ఘకాలం పాటు సంస్కరించబడి, పరిపూర్ణమావ్వాలసిన అవసరం ఉంది. అవసరమైన ఒక విధమైన మానవత్వము అనేది పత్యేకంగా ఉన్నతమైనది. మానవుడు సాధారణ మానవ స్వభావపు భావనను అంటిపెట్టుకుని ఉండటమే కాకుండా, అతడైతే ఇతరులపట్ల చూపే తన నడవడికను నియంత్రించే అనేక నియమాలను మరియు నిబంధనలపట్ల ఇంకా ఎక్కువ అవగాహన కలిగి ఉండాలి మరియు అంతేగాక, అతడు మానవుని బుద్ధి మరియు నైతిక జ్ఞానం గురించి మరింత అధ్యయనం చేయడానికి తీర్మానాన్ని కలిగి ఉండాలి. ఇదీ మనిషి తప్పకుండ కలిగియుండవలసిన జ్ఞానము. అయితే, దేవుడు శరీరునిగా మారింది ఇందుకు కాదు, ఎందుకంటే ఆయన కార్యము మానవునికి గాని, లేక మానవ కార్యమునకు గాని ప్రాతినిధ్యం వహించదు; కాని, ఇదిఆయన అస్తిత్వాన్ని నేరుగా వెల్లడించడం మరియు ఆయన చేయవలసిన కార్యాన్ని నేరుగా ఆచరణలో పెట్టడమైయున్నది. (సహజంగానే, ఆయన కార్యం ఆకస్మికంగానో లేదా యాదృచ్ఛికంగానో కాకుండా ఖచ్చితమైన సమయంలో జరిగించబడుతుంది మరియు అది ఆయన పరిచర్యను నెరవేర్చే సమయం వచ్చినప్పుడు మొదలవుతుంది.) ఆయన మనిషి జీవితంలోను, లేక మనిషి కార్యములోను పాలుపంచుకోడు, అంటే, ఆయన మానవ స్వభావము వీటిలో (ఇది ఆయన కార్యాన్ని ప్రభావితం చేయనప్పటికీ) దేనితోనూ అమర్చబడియుండలేదు. ఆయన ఆవిధంగా జరిగించాల్సిన సమయం వచ్చినప్పుడు మాత్రమే ఆయన తన పరిచర్యను నెరవేరుస్తాడు; తన స్థాయి ఏమైనా గాని, తాను చేయవలసిన కార్యంతో ఆయన అలా ముందడుగు వేస్తాడు. ఆయన గురించి మానవునికి ఏది తెలిసినా మరియు ఆయన పట్ల మానవుని అభిప్రాయం ఏదైనప్పటికీ, ఆయన కార్యము సంపూర్ణముగా భంగం కాకుండా సహజంగానే ఉంటుంది. ఉదాహరణకు, యేసు తన కార్యాన్ని జరిగించినప్పుడు, ఆయన ఎవరో ఎవరికీ ఖచ్చితంగా తెలీదు, కానీ ఆయన తన కార్యములో మాత్రం ముందుకు కొనసాగాడు. ఇవేవీ ఆయన చేయవలసిన కార్యాన్ని జరిగించడంలో ఆయనను అడ్డుకోలేదు. కాబట్టి, ఆయన తన స్వంత గుర్తింపును గూర్చి చెప్పుకోలేదు, లేదా ప్రకటించకోలేదు, మనిషే ఆయనను వెంబండించాడు. సాధారణంగా ఇది దేవుని తగ్గింపు మాత్రమే కాదుకాని దేవుడు శరీరావతారిగా కార్యం చేసిన విధానం కూడా ఇదే. ఆయన ఈ విధంగా మాత్రమే కార్యాన్ని చేయగలడు, ఎందుకంటే మానవునికి భౌతికమైన కంటితో ఆయనను గుర్తించే అవకాశము లేదు. ఒకవేళ మానవుడు ఆయనను గుర్తించినా కూడా, ఆయన కార్యములో అతడు సహాయపడ లేడు. ఇదిగాక, మానవుడు ఆయన శరీరాన్ని తెలుసుకోవడం కోసం ఆయన శరీరావతారిగా మారలేదు; ఆయన తన కార్యాన్ని జరిగించి ఆయన తన పరిచర్యను నెరవేర్చడం కోసమే శరీరావతారిగా వచ్చాడు. ఈ కారణాన్నిబట్టి, ఆయన తన గుర్తింపును బయటపెట్టడానికి ఎలాంటి ప్రాముఖ్యతను కనుపరచలేదు. ఆయన చేయవలసిన కార్యమంతటిని సంపూర్తి చేసిన తర్వాత, ఆయన గుర్తింపు మరియు స్థితి అంతా సహజంగానే మానవునికి తేటతెల్లమైంది. శరీరధారియైన దేవుడు మౌనంగా ఉంటాడు మరియు ఎప్పుడూ ఎలాంటి ప్రకటనలు చేయడు. ఆయన మానవునిపట్ల గాని తనను వెంబడించే విషయంలో మానవుడు ఎలా ఏకీభవిస్తున్నాడనే దానిపట్ల గాని ఆయన శ్రద్ధ వహించడు, కానీ తన పరిచర్యను నెరవేర్చే విషయంలో మరియు ఆయన చేయవలసిన కార్యాన్ని నిర్వహించడంలో మాత్రమే శ్రద్ధ కలిగి ముందుకు కొనసాగుతాడు. ఆయన జరిగించే కార్యపు మార్గములో ఎవరూ నిలబడలేరు. అతను తన కార్యాన్ని ముగించే సమయం ఆసన్నమైనప్పుడు, అది ఖచ్చితంగా ముగించబడి అంతమునకు తీసుకురాబడుతుంది, మరో విధంగా ఎవరూ ఆజ్ఞాపించలేరు. ఆయన తన కార్యాన్ని సంపూర్తి చేసి మానవుని యొద్ద నుండి నిష్క్రమించిన తర్వాత మాత్రమే, ఆయన చేసిన కార్యము ఇంకా పూర్తి స్పష్టత కలిగి లేనప్పటికీ, మనిషి అర్ధం చేసుకుంటాడు. మొదట ఆయన తన కార్యాన్ని ఏ ఉద్దేశంతో జరిగించాడనే దానిని మనిషి పూర్తిగా గ్రహించడానికి చాలా సమయం పడుతుంది. మరో మాటలో చెప్పాలంటే, శరీరధారియైన దేవుని యుగపు కార్యము రెండు భాగాలుగా విభాగించబడింది. ఒక భాగములో స్వయానా శరీరధారియైన దేవుని శరీరము చేసే కార్యాన్ని మరియు స్వయానా శరీరధారియైన దేవుని శరీరము పలికే వాక్కులను కలిగి ఉంటుంది. ఆయన శరీరమందుండి జరిగించే పరిచర్య సంపూర్ణముగా నెరవేర్చిన తరువాత, మిగిలిన కార్యపు మరో భాగము పరిశుద్దాత్మచేత వాడబడిన వారిచేత జరిగించబడుతుంది. మనిషి తనకు తానుగా నడవాల్సిన మార్గాన్ని దేవుడు ఇప్పటికే తెరిచినందున, ఈ సమయంలోనే మనిషి తన కర్తవ్యాన్ని తప్పక నెరవేర్చాలి. చెప్పాలంటే, శరీరధారియైన దేవుడు మొదటి కార్యపు భాగాన్ని జరిపిస్తే, ఆ తరువాత పరిశుద్దాత్మ మరియు పరిశుద్దాత్మ చేత వాడబడిన వారు ఈ కార్యములో విజయాన్ని పొందుతారు. అందువలన, శరీరధారిగా మారిన దేవుడు ఈ దశలో ప్రధానంగా ఏమి కార్యాన్ని చేశాడో మనిషి తెలుసుకోవాల్సిన అవసరముందిమరియు దేవుడు శరీరధారిగా మారడానికిగల ప్రాధాన్యత ఏమిటో ఆయన చేయవలసిన కార్యమేమిటని అతడు తప్పనిసరిగా గ్రహించి, మనిషిని అజమాయిషీ చేసినట్టుగా దేవుణ్ణి అజమాయిషీ చేయకూడదు. ఇందులో మనిషి తప్పిదం, అతడి భావన, అంతకంటే ఎక్కువగా, అతడి అవిధేయత ఉన్నాయి.

దేవుడు శరీరధారిగా మారింది తన శరీరాన్ని గూర్చి మానవుడిని తెలుసుకోనివ్వాలనో, లేదా శరీరధారియైన దేవుని శరీరానికి మరియు మానవుని దేహానికి మధ్య ఉన్న వ్యత్యాసాలను కనిపెట్టడానికి మనిషిని అనుమతించాలనే ఉద్దేశంతోనో కాదు; మరియు మనిషి వివేచన వరాలను మెరుగుపరచడానికి దేవుడు శరీరధారిగా మారలేదు, అంతమాత్రమే గాకుండా మనిషి శరీరధారియైన దేవుని దేహాన్ని పూజించడానికి అనుమతించి, తద్వారా గొప్ప మహిమను పొందాలనే ఉద్దేశము కూడా ఆయనకు లేదు. దేవుడు శరీరధారిగా రావడంలో ఈ విషయాలేవీ ఆధారము కాదు. దేవుడు శరీరధారిగా మారింది మనిషిని తప్పుబట్టడానికో, లేక కావాలనే మనిషిని బట్టబయలు చేయడానికో, లేక పరిస్థితులను అతడికి కఠినతరం చేయడానికో కూడా కాదు. దేవుడు శరీరధారిగా కావడానికి ఇవేవీ దేవుని ఉద్దేశ్యమే కాదు. దేవుడు శరీరధారియైన ప్రతిసారి, ఇది తిరస్కరించలేని కార్య రూపమైయున్నది. అది ఆయన తన గొప్ప కార్యము మరియు తన గొప్ప నిర్వాహకత్వము కొరకు తనకిష్టమైన విధంగా వ్యవహరిస్తాడే గాని, మనిషి ఊహించుకునే కారణాలను కొరకు కాదు. దేవుడు కేవలము తన కార్యానికి కావల్సినంత వరకు మరియు అవసరమైనంత వరకు మాత్రమే భూమి మీదికి వస్తాడు. ఆయన తాను చేయాల్సిన కార్యాన్ని జరిగించడానికే గాని, వూరికె అటు ఇటు వీక్షించాలనే భావనతో భూమి మీదికి రాడు. మరెందుకు ఆయన ఈ కార్యాన్ని జరిగించడానికి అంత గొప్ప భారాన్ని ఎత్తుకుని అంత గొప్ప ప్రమాదాలను ఎదుర్కోవాలి? తాను కార్యమును చేయవలసి వచ్చినప్పుడు మాత్రమే నిత్యము అపూర్వమైన ప్రాధాన్యత కలిగిన శరీరధారిగా దేవుడు మారతాడు. ఒకవేళ అది కేవలం ప్రజలు ఆయనను చూసి తమ అవగాహన పెంచుకోవడానికి అనుమతించడం కోసమే అయ్యుంటే, అప్పుడాయన, పూర్తి కచ్చితత్వంతో, అంత తేలికగా ఎన్నడూ ప్రజల మధ్యలోకి రాడు. ఆయన తన నిర్వాహకత్వము మరియు తన గొప్ప కార్యము కొరకు మరియు మానవజాతిని అధికంగా సంపాదించుకోవడం కొరకు మాత్రమే ఆయన భూమి మీదికి వస్తాడు. ఆయన యుగానికి ప్రాతినిధ్యము వహించడానికి వస్తాడు, ఆయన సాతానుకు పరాభవం కలిగించడానికి వస్తాడు, మరియు ఆయన సాతానును ఓడించడానికి తనకు తానుగా శరీరాన్ని ధరించాడు. ఇంకా చెప్పాలంటే, సమస్త మానవ జాతి తమ జీవితాలను జీవించడంలో మార్గదర్శనం చేయడానికి ఆయన వస్తాడు. ఇదంతా ఆయన నిర్వాహకత్వానికి సంబంధించినదై, ఇది విశ్వమంతటి కార్యాన్ని సూచిస్తుంది. ఒకవేళ మనిషి ఆయన శరీరాన్ని తెలుసుకోవడాన్ని బట్టి ప్రజల నేత్రాలు తెరవబడాలని మాత్రమే దేవుడు శరీరధారి అయ్యుంటే, మరి అప్పుడు ఆయన ప్రతి దేశానికి ఎందుకు వెళ్ళడు? ఇది చాలా తేలికైన విషయం కాదా? కానీ ఆయన ఆవిధంగా చేయలేదు, అందుకు బదులుగా నిర్ణయాత్మకంగా ఆయన జరిగించవలసిన కార్యాన్ని మొదలుపెట్టడానికి సరైన ప్రదేశాన్ని ఎంపిక చేసుకున్నాడు. ఒక్క ఈ శరీరము మాత్రమే అధికమైన ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయన ఒక యుగమంతటికి ప్రాతినిధ్యం వహిస్తూ, ఒక యుగమంతట కార్యాన్ని కూడా జరిగిస్తాడు; ఆయన పాత యుగాన్ని ముగింపుకు తెచ్చి, నూతన యుగానికి నాంది పలికే ఈ రెండు కార్యాలను చేస్తాడు. ఇదంతా దేవుని నిర్వహణకు చెందిన ఒక ప్రాముఖ్యమైన అంశము మరియు ఇదంతా దేవుడు భూమి మీదికి వచ్చి జరిగించే ఒక కార్యపు దశ యొక్క ప్రాధాన్యతగా ఉన్నది. యేసు భూమి మీదికి వచ్చినప్పుడు, ఆయన కేవలం కొన్ని వాక్కులు పలికి కొంత కార్యాన్ని జరిగించాడు; ఆయన తనకు తానుగా మనిషి జీవితం పట్ల శ్రద్ధ చూపలేదు, ఆయన తన కార్యాన్ని ముగించిన వెనువెంటనే ఆయన వెళ్ళిపోయాడు. ఈ నాడు, నేను మాట్లాడటాన్ని ముగించి, నా వాక్కులు మీకు అందించినప్పుడు, అది మీరు గ్రహించినప్పుడు, మీ బ్రతుకు ఎలా ఉన్నప్పటికీ, నా కార్యంలోని ఈ దశ ముగిసిపోయినట్టే. నా కార్యములో ఈ దశను కొనసాగించడానికి భూమి మీద ఈ వాక్కులతో ఏకీభవించి పని జరిగించడానికి భవిష్యత్తులో కొందరు వ్యక్తులు తప్పనిసరిగా ఉండాలి; అప్పుడే, మానవుని కార్యము మరియు మానవుని నిర్మాణం మొదలవుతుంది. అయితే, ఇప్పుడు దేవుడు కేవలం తన పరిచర్యను నిర్వర్తించి తన కార్యములోని ఒక దశను సంపూర్తి చేయడానికే తన కార్యాన్ని జరిగిస్తాడు. దేవుడు మానవునికి భిన్నమైన పద్దతిలో కార్యము జరిగిస్తాడు. మానవుడు సభలు మరియు చర్చా వేదికలను ఇష్టపడుతూ, ఉత్సవాలకు ప్రాధాన్యతనిస్తాడు, కానీ దేవుడైతే మానవుని సభలు మరియు కూడికలను నిశ్చయంగా మిక్కిలి అసహ్యించుకుంటాడు. మానవునితో దేవుడు మాములుగానే సంభాషిస్తాడు మరియు మామాలుగానే మాట్లాడుతాడు; ఇది మీకు అసాధారణంగా విడుదలనిచ్చి స్వతంత్రతను కూడా ఇచ్చే దేవుని కార్యమైయున్నది. అయినప్పటికీ, మీతో నేను కలవడాన్ని పూర్తిగా చీత్కరించుకుంటున్నాను, మరియు మీలాంటి ఎంతో నియంత్రణతో కూడిన ఒక జీవితాన్ని నేను అలవర్చుకోలేకున్నాను. నిబంధనలను నేను ఎంతగానో ద్వేషిస్తాను; అవి మానవుని ఒక అడుగు వేయడానికి, మాట్లాడటానికి, మరియు పాడటానికి కూడా భయపడేంతగా నిర్భంధించి, తన నేత్రాలు తిన్నగా నిన్నే చూసేలా చేశాయి. మీరు కూడుకునే పద్ధతిని మరియు మహా సభలను కూడా నేను పూర్తిగా అసహ్యించుకుంటున్నాను. ఈ విధంగా అయితే నేను మీతో కలవడాన్ని అసలు అంగీకరించను, ఎందుకంటే ఇలాంటి జీవన విధానము ఎవరికైనా బంధించిన భావన కలిగిస్తుంది మరియు మీరైతే అనేకమైన ఉత్సవాల నియమాలను మరీ ఎక్కువగా పాటిస్తారు. నడిపించడానికి మీకు అనుమతిస్తే ప్రజలందరినీ మీరు నియమాల అధిపత్యములోనికి నడిపిస్తారు మరియు నియమాలను విస్మరించడానికి మీ నాయకత్వములో వారికే అవకాశమే ఉండదు; పైగా మతపరమైన ఉద్రిక్తతలు ఇంకా ఎక్కువ తీవ్రతరమవుతూ, మానవ ఆచారాలు మాత్రము విస్తృతమావుతూనే ఉంటాయి. కొందరు వ్యక్తులైతే తాము కూడుకున్నప్పుడు మాట్లాడుతూనే ఉంటారు వారు అస్సలు అలసట చెందరు, కొంతమందైతే పన్నెండు రోజులైనా సరే ఆపకుండా ప్రసంగించగలరు. ఇవన్నీ మహా సభలుగా మానవుని కూడికలుగా యెంచబడతాయి; వారికి భోంచేయడం మరియు త్రాగడం, అనుభవించడం, మరియు ఆత్మ స్వాతంత్రములతో కూడిన ఒక జీవితముతో అసలు సంబంధమే ఉండదు. ఇవన్నీ కూడికలే! మీ తోటి ఉద్యోగుల కూడికలు, అదే విధంగా పెద్దవైనా మరియు చిన్నవైనా జరుపుకునే సభలు, అన్నీ నాకు అసహ్యాన్ని పుట్టించేవే, నాకు వాటిపట్ల ఎలాంటి ఆసక్తి కలుగలేదు. సభలలో బోధించడం నాకు ఇష్టముండదు, ఏదైనా పెద్ద బహిరంగ కూడికలో ప్రసంగించాలని కూడా నేను అనుకోను, కనీసం మిమ్ములందరినీ కొద్ది రోజులపాటు ప్రత్యేక కూడికలకు ఉండమనీ కూడా ఆదేశించను: ఈ నియమము మూలంగానే నేను పని చేస్తాను. ఒక కూడికలో మీరందరూ, సరిగ్గా మరియు చక్కగా, కూర్చోవాలనేది నాకు అంత సమ్మతంగా అనిపించలేదు; ఏదైనా సూచించబడిన ఉత్సవ ప్రాంగణములో మీరుండటాన్ని చూడటము కూడా నాకు అసహ్యమైనది, అంతేగాక, అలాంటి మీ వేడుకలో పాలుపంచుకోవడాన్ని నేను తోసిపుచ్చుతాను. మీరు దీనిని ఎంత అధికంగా చేస్తారో, నేను దీన్ని అంత దారుణంగా చూస్తాను. ఈ మీ ఉత్సవాలు మరియు నియమాలపట్ల నాకు కాస్తయినా ఆసక్తి లేదు; వాటి కోసం నువ్వెంత బాగా పనిచేసినా సరే, వాటన్నిటినీ నేను అసహ్యించుకుంటున్నాను. నేను మీ ఏర్పాట్లు తగినట్టుగా లేవని లేదా మీరు చాలా అల్పంగా ఉన్నారని అనుకోలేదు; మీ జీవన గమనాన్ని నేను ద్వేషిస్తున్నాను, అంతకంటే ఎక్కువగా, నేను దానిని అలవర్చుకోలేకపోతున్నాను. నేను తలపెట్టిన కార్యముపట్ల మీకు కనీస అవగాహన కూడా లేదు. అప్పట్లో యేసు తన కార్యాన్ని జరిగించి, ఏదైనా ఒక చోట ప్రసంగించిన తరువాత, ఆయన తన శిష్యులను పట్టణము బయటకు తీసుకువెళ్లి, వారు దానిని అర్ధం చేసుకున్న విధానాల గురించి వారితో సంభాషించేవాడు. ఆయన తరచుగా ఈ పద్ధతిలోనే కార్యము చేసేవాడు. జనసమూహము మధ్యలో ఆయన కార్యము కొద్దిపాటిగా మరియు మధ్యస్థంగా ఉండేది. మీరు ఆయనను అడిగేదాని ప్రకారం, శరీరధారియైన దేవునికి ఒక సామాన్య మానవుని జీవితము ఉండకూడదు; ఆయన తన కార్యాన్ని తప్పనిసరిగా జరిగించాలి మరియు ఒకవేళ ఆయన కూర్చొని ఉన్నా, నిలబడి ఉన్నా, లేక నడుస్తున్నా సరే, ఆయన తప్పనిసరిగా మాట్లాడుతూ ఉండాలి. ఆయన ఎప్పుడూ తన కార్యాన్ని తప్పనిసరిగా చేస్తుండాలి మరియు తన “కార్యాచరణలను” ఎన్నడూ ఆపకూడదు, లేకపోతే ఆయన తన కర్తవ్యాలను విస్మరించినట్టే. మానవుని ఈ కోరికలు మానవ జ్ఞానానికి తగినట్టుగా ఉన్నాయా? మీ యధార్ధత ఎక్కడ? మీరు అతిగా అడగటం లేదా? నేను కార్యము జరిపిస్తుండగా నీవు నన్ను పరిశీలించడం నాకు అవసరమా? నేను నా పరిచర్యను నేరవేరుస్తున్నప్పుడు నీవు నన్ను పర్యవేక్షించడం అవసరమా? నేను ఏ కార్యము చేయాలో దానిని ఎప్పుడు చేయాలో నాకు బాగా తెలుసు; ఇతరులు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. బహుశా నేను ఎక్కువేమీ చేసినట్లు మీకు అనిపించక పోవచ్చు, కానీ అప్పటికే నా కార్యము ముగింపునకు చేరుకుంది. నాలుగు సువార్తలలో యేసు పలికిన వాక్కులను ఉదాహరణగా తీసుకుంటే: అవి కూడా పరిమితమై లేవా? ఆ కాలంలో, యేసు సమాజ మందిరములోనికి ప్రవేశించి, ఒక ప్రసంగాన్ని బోధించినప్పుడు, చాలా వరకు ఆయన కొద్ది నిమిషాల్లోనే ముగించాడు, మరియు ఆయన ప్రసంగించడం అయిన తరువాత, ఆయన తన శిష్యులను దోనె ఎక్కించి, మారు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. చాలా మట్టుకు, ఆ సమాజ మందిరము లోపల ఉన్నవారు వారిలో వారు చర్చించుకున్నారు, కానీ అందులో యేసు పాత్ర ఏమీ లేదు. తాను చేయాల్సిన కార్యాన్ని మాత్రమే దేవుడు చేస్తాడు గాని, దీనికి పైన అతీతంగా ఏదీ చేయడు. ఇప్పుడైతే, అనేకమంది కనీసం రోజుకు కొన్ని గంటలైనా అధికంగా చెప్పాలని మరియు సవిస్తారంగా మాట్లాడాలని నా నుండి ఆశిస్తున్నారు. మీరు చూస్తునట్టుగా, దేవుడు పలికితేనే తప్ప ఆయన దేవుడు కాడుమరియు పలికేవాడు మాత్రమే దేవుడవుతాడు. మీరందరూ అంధులు! అందరూ పశుప్రాయులు! మీరంతా బుద్ధిలేని అజ్ఞానులు! మీరు అనేకమైన భావనలు కలిగి ఉన్నారు! మీ కోరికలు చాలా దూరం వెళ్లాయి! మీరు కిరాతకులైయున్నారు! కనీసం దేవుడంటే ఎవరో కూడా మీకు తెలియదు! బోధకులు మరియు ప్రసంగీకులందరూ దేవుడని మరియు మీకు వాక్కులను అందించడానికి ఇష్టపడే వారెవరైనా మీ తండ్రి అని మీరు నమ్ముతారు. సుందరమైన మీ గుణగణాలు మరియు అద్భుతమైన స్వరూపముతో ఉన్న మీరందరూ, దానికి తోడుగా కాస్తయినా వివేచనను కలిగి ఉన్నారా, నాకు చెప్పండి? ఆకాశపు సూర్యుని గురించి ఇంకా నీకు తెలీదా! మీలో ప్రతి ఒక్కరూ దురాశ మరియు భ్రష్టత్వము కలిగి ఉన్నవారు కాబట్టి మీరు భావనను ఎలా చూడగలరు? మంచి చెడుల మధ్య బేధాన్ని మీరు ఎలా చూపగలరు? నేను మీకు ఎంతో అనుగ్రహించాను, అయితే మీలో ఎంతమంది దానికి విలువనిచ్చారు? ఇది పూర్తిగా ఎవరి స్వాధీనంలో ఉన్నది? నేడు మీరు నడచుకునే మార్గాన్ని విశదపరిచిన వారెవరో మీరు ఎరుగరు, కాబట్టే మీరు నా మీద అజమాయిషీలు చేస్తూ, ఈ బుద్ధిహీనమైన మరియు అనుచితమైన కోరికలు కోరుతున్నారు. సిగ్గుతో మీరు ఎర్రగా కాలేదా? కావలసినంతగా నేను పలకలేదా? సరిపోయినంత నేను జరిగించలేదా? మీలో ఎవరు నా వాక్కులను నిజమైన ఒక సంపదగా పరిగణిస్తారు? మీరు నా సన్నిధిలో ఉన్నప్పుడే నన్ను ముఖ స్తుతి చేస్తారు, కానీ మీరు అలా లేనప్పుడు అబద్ఱమాడుతూ మోసం చేస్తారు! మీ పనులు ఎంతో తుచ్చమైనవి, అవి నన్ను ఎదిరిస్తాయి! మీ బ్రతుకులు మార్చుకోడానికి కాకుండా, కేవలం మీ కన్నుల పండుగ కోసం మీ అవగాహన పెంచుకోడానికి నన్ను మాట్లాడమని, కార్యము చేయమని మీరు అడుగుతారని నాకు తెలుసు. మీతో నేను ఎంతగానో మాట్లాడాను. మీ బ్రతుకులు ఎప్పుడో మార్పు చెంది ఉండాలి, మరి అలాంటప్పుడు ఇప్పటికీ మీరు మీ పూర్వపు స్థితులలోనే ఇంకా ఎందుకు కొట్టుమిట్టాడుతున్నారు? నా వాక్కులు ఏమైనా మీవద్ద నుండి దోచుకోబడటం వలన మీరు వాటిని పొందలేదా? నిజం చెప్పాలంటే, మీలాంటి భ్రష్టులకు ఇక నేనేమీ చెప్పాలనుకోవడం లేదు—అది వ్యర్ధమే అవుతుంది! నేను నిరర్ధకమైన కార్యాన్ని ఎక్కువగా చేయకూడదని అనుకున్నాను! మీరు మీ అవగాహనను పెంపొందించుకోవాలని, లేక కన్నులకు పండగ చేసుకోవాలని ఇష్టపడుతారు గాని, జీవాన్ని పొందాలని ఆశించరు! మీరందరూ మిమ్మల్ని మీరు మోసపుచ్చుకుంటున్నారు! నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీతో నేను ముఖాముఖిగా మాట్లాడిన వాటిలో ఎంతవరకు మీరు అనుసరిస్తున్నారు? మీరు చేసేదల్లా, ఇతరులను మోసగించడానికి కుట్రలు పన్నడమే! మీలో వీక్షకులుగా చోద్యం చూస్తూ సంతోషించే వారిని నేను చీత్కరించుకుంటాను, మీ ఆరాటం నాకు వెగటు పుట్టిస్తుంది. ఒకవేళ సత్య మార్గాన్ని అన్వేషించడానికో లేక సత్యం కోసం దప్పికతోనో మీరిక్కడ ఉండకపోతే, అప్పుడు మీరు నా ద్వేషానికి పాత్రులవుతారు! మీ ఆరాటాన్ని తృప్తిపరచుకోడానికో లేక మీ దురాశలను ఒకొక్కటిగా నేరవేర్చుకోడానికో మాత్రమే మీరు నా వాక్కును ఆలకిస్తారని నాకు తెలిసే ఉన్నది. సత్యపు అస్థిత్వాన్ని అన్వేషించడం, లేక జీవిత ప్రవేశానికి తగిన మార్గాన్ని పరిశోధించడం పట్ల మీకు ఎలాంటి చింతన లేదు; ఈ కోరికలు అసలు మీలోనే ఉండవు. మీరు చేసేదల్లా మీరు చదివి ఆనందించే ఒక బొమ్మగా దేవునిపట్ల ప్రవర్తిస్తారు. జీవితాశయంపట్ల శ్రద్ధ కలిగి ఉండాలనే ఆశ మీకు విస్తారంగా ఉంది గాని, తీవ్రత మాత్రం అతి స్వల్పంగా కలిగియున్నారు. అటువంటి వారికి జీవన గమనాన్ని వివరించడమనేది గాలితో పోట్లాడినట్టే ఉంటుంది; అలా నేను అస్సలు మాట్లాడను! ఒకవేళ మీరు మీ హృదయంలో ఉన్న శూన్యతను నింపుకోడానికే ఎదురు చూస్తుంటే, ఇక మీరు నా వద్దకు రాకపోవడమే ఉత్తమం అని నేను మీకు చెప్తాను! జీవితాన్ని పొందుకునేందుకు మీరు ప్రాముఖ్యతనివ్వాలి! మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి! మీ జీవితాశయం సాధనకు మీ కుతూహలాన్ని ఆధారంగా తీసుకోకపో వడం, లేక మీతో సంభాషించమని నన్ను అడగడానికి దీనిని కారణంగా వాడుకోకపోవడం మీకు ఎంతో ఉత్తమం. ఇవన్నీ మీరు కలిగియున్న అత్యంత నైపుణ్యత కలిగిన కుయుక్తులే! నేను నిన్ను మళ్ళీ అడుగుతున్నాను: నేను నిన్ను ప్రవేశించమని అడిగిన దానిలో వాస్తవంగా నీవు ఎంతవరకు ప్రవేశించావు? నేను నీతో చెప్పిన దాన్ని నీవు ఆలకించావా? నీవు నీతో చెప్పిన వాటన్నిటినీ నీవు అనుసరణలో పెట్టగలిగావా?

ప్రతి యుగపు కార్యము స్వయానా దేవుని ద్వారానే ఆవిష్కరించబడింది, అయితే దేవుడు ఏ రకంగా కార్యము చేసినా, అది ఏదైనా ఉద్యమాన్ని మొదలుపెట్టి, ప్రత్యేక కూడికలు జరిగించడానికో, లేక మీ తరపున ఏదైనా ఒక సంస్థను స్థాపించడానికో ఆయన రాలేదని నీవు తప్పక గ్రహించాలి. ఆయన చేయాల్సిన కార్యాన్ని జరిగించడానికి మాత్రమే ఆయన వస్తాడు. ఆయన కార్యము ఏ మనిషిని బలవంత పెట్టదు. ఆయన తన కార్యాన్ని తనకిష్టమైనట్లు జరిగిస్తాడు; దాని గురించి మానవుడు ఏమనుకున్నా లేక తెలుసుకున్నా పట్టించుకోకుండా, ఆయన తన కార్యాన్ని అమలు చేయడంలో మాత్రమే శ్రద్ధ చూపుతాడు. లోకపు సృష్టి మొదలుకుని నేటి వరకు, మూడు దశల కార్యము ఇప్పటికే జరిగింది; యెహోవా నుండి యేసు దాకా, ధర్మశాస్త్ర యుగము నుండి కృపా యుగము వరకు, మానవుని కొరకు దేవుడు ఎన్నడూ ఒక ప్రత్యేక కూడికను ఏర్పాటు చెయ్యలేదుమరియు సమస్త మానవజాతిని ఒకటిగా సమకూర్చడానికి ఒక ప్రత్యేక అంతర్జాతీయ కార్యాచరణ సదస్సును ఏర్పాటు చేసి తద్వారా తన కార్యపు ఆధిపత్యాన్ని విస్తరింపజేయ లేదు. ఆయన జరిగించేదల్లా, ఒక యుగమంతటికి సంబంధించిన ప్రారంభ కార్యాన్ని సరైన సమయంలో సరైన ప్రదేశంలో అమలు చేసి, అక్కడి నుండి యుగానికి నాంది పలుకుతూ, మానవ జాతి తమ జీవితాలను ఎలా నడిపించుకోవాలో మార్గనిర్దేశం చేయడం జరిగింది. ప్రత్యేక సదస్సులు అనేవి మానవునికి సంబంధించిన కూడికలు; సెలవు దినాలను పండుగలా జరుపుకోడానికి ప్రజలను ఒకటిగా సమకూర్చడమనేది మానవుని కార్యమై ఉన్నది. దేవుడు సెలవు దినాలను ఆచరించడు, పైగా, వాటిని అసహ్యించుకుంటాడు; ఆయన ప్రత్యేక సదస్సులను ఏర్పాటు చెయ్యడు, ఇంకా చెప్పాలంటే, ఆయన వాటిని ద్వేషిస్తాడు. శరీరధారియైన దేవుడు చేసే కార్యమేమిటో మీరిప్పుడు చక్కగా అర్థం చేసుకోవాలి!

మునుపటి:  శరీరావతారపు రహస్యము (2)

తరువాత:  శరీరావతారపు రహస్యము (4)

సెట్టింగులు

  • వచనం
  • థీమ్స్

ఘన రంగులు

థీమ్స్

అక్షరశైలి

అక్షరశైలి పరిమాణం

గీతల మధ్య దూరం

గీతల మధ్య దూరం

పేజీ వెడల్పు

విషయ సూచిక

శోధించండి

  • ఈ వచనాన్ని శోధించండి
  • ఈ పుస్తకాన్ని శోధించండి

Connect with us on Messenger