శరీరావతారపు రహస్యము (4)
బైబిల్ మరియు దాని రూపకల్పన వెనుక ఉన్నటువంటి నేపథ్యమును గురించి మీరు తప్పక తెలుసుకోవాలి. ఈ జ్ఞానము దేవుని నూతన కార్యాన్ని అంగీకరించని వారికి సంబంధించినది కాదు. వారికి తెలియదు. నీవు ఈ గుణగణాలకు సంబంధించిన విషయాల గురించి వారితో స్పష్టంగా మాట్లాడినట్లయితే, వారు ఇకపై బైబిల్ గురించి నీతో పీకులాడుతూ మాటిమాటికి వాదించేవారుగా ఉండరు. ప్రవచించబడిన వాటిని వారు నిరంతరం తవ్వుతూనే ఉంటారు: ఈ మాట నెరవేరిందా? ఆ మాట నెరవేరిందా? అని అన్వేషిస్తూనే ఉంటారు. వారు బైబిల్ ప్రకారము సువార్తను అంగీకరించి, బైబిల్ ప్రకారం వారు సువార్తను బోధిస్తారు. దేవునిపై వారికున్న విశ్వాసము బైబిల్ వాక్యాల మీద ఆధారపడి ఉంటుంది; బైబిల్ లేకుండా వారు దేవుణ్ణి నమ్మరు, బైబిల్‌ను చిన్నపాటి పరీక్షకు గురిచేస్తూ జీవిస్తూ ఉంటారు. ఇదే వారి జీవన విధానము. వారు మరోసారి బైబిల్లో లోతుగా తవ్వి, నిన్ను వివరణలు అడగడానికి వచ్చినప్పుడు, “మొదట, ప్రతి మాటను మనము ధృవీకరించవద్దు. బదులుగా, పరిశుద్ధాత్మ ఎలా కార్యము చేస్తాడో చూద్దాం. మనం నడిచే మార్గాన్ని తీసుకుని ఈ మార్గం నిజంగా పరిశుద్ధాత్మ కార్యమేనా కాదా అని చూడటానికి దాన్ని సత్యంతో సరిపోల్చి, అటువంటి మార్గము సరైనదేనా అని పరిశీలన చేయడానికి పరిశుద్ధాత్మ కార్యాన్ని ఉపయోగించుకుందాం. ఈ మాట, లేదా ఆ మాట ముందు చెప్పబడినట్టుగానే జరిగిందా అని, మానవులుగా మనము మన ఉద్దేశాలను వాటిలోనికి రుద్దకూడదు. మనము పరిశుద్ధాత్మ కార్యానికి మరియు దేవుడు చెస్తూ వస్తున్న అధునాతన కార్యానికి బదులుగా మాట్లాడటం మంచిది” అని నీవు చెప్తావు. బైబిల్‌లోని ప్రవచనాలు ఆ కాలంలోని ప్రవక్తల ద్వారా ప్రవచించబడిన దేవుని వాక్యాలు మరియు దేవుడు వాడుకొనిన వ్యక్తులు ప్రేరేపణ పొంది వ్రాసిన వాక్కులు; ఆ వాక్కులను దేవుడు మాత్రమే వివరించగలడు, పరిశుద్ధాత్మ మాత్రమే ఆ వాక్కుల భావాన్ని తెలియజేయగలడు మరియు దేవుడు మాత్రమే ఏడు ముద్రలను విప్పి గ్రంథపు చుట్టలను తెరవగలడు. నీవు: “నీవు దేవుడు కాదు, నేను కూడా కాదు, మరి దేవుని వాక్కులను అంత తేలికగా వివరించడానికి ఎవరు సాహసిస్తారు? ఆ వాక్కులను వివరించే ధైర్యం నీకుందా? ఒకవేళ యిర్మియా, యోహాను, మరియు ఏలియా ప్రవక్తలు వచ్చినా కూడా, వారు గొర్రె పిల్ల కాదు కాబట్టి, ఆ వాక్కులను వివరించే ప్రయత్నం చేయడానికి సాహసించరు. గొర్రెపిల్ల మాత్రమే ఏడు ముద్రలు విప్పి గ్రంథపు చుట్టను తెరవగలడు మరియు ఆయన వాక్కులను మరెవరూ వివరించలేరు. నేను దేవుని నామాన్ని బలవంతంగా లాక్కోవడానికి ధైర్యము చేయను, దేవుని వాక్కులను వివరించే ప్రయత్నమూ చేయను. నేను దేవునికి విధేయునిగా మాత్రమే ఉండగలను. నీవు దేవుడివా? దేవుని జీవులలో ఎవ్వరూ గ్రంథపు చుట్టను తెరవడానికి, లేదా ఆ వాక్కులను వివరించే ధైర్యం చేయరు, కాబట్టి నేను కూడా వాటిని వివరించే దైర్యం చేయను. వాటిని వివరించడానికి ప్రయత్నించకపోవడమే నీకు మంచిది. ఎవ్వరూ వాటిని వివరించడానికి ప్రయత్నించకూడదు. పరిశుద్ధాత్మ కార్యము గురించి మనం మాట్లాడుకుందాం; మనిషి చేయగలిగింది ఇంతే. యెహోవా కార్యము గురించి మరియు యేసు కార్యము గురించి నాకు కొంచెమే తెలుసు, కానీ అటువంటి కార్యము పట్ల నాకు వ్యక్తిగత అనుభవం లేనందున, నేను దాని గురించి కొంతవరకు మాత్రమే మాట్లాడగలను. యెషయా గాని, లేక యేసు గానివారి కాలంలో మాట్లాడిన వాక్కుల భావం విషయానికొస్తే, నేను ఎలాంటి వివరణ ఇవ్వను. నేను బైబిల్ ధ్యానం చేయను, కానీ నేను ప్రస్తుతం జరుగుచున్న దేవుని కార్యాన్ని అనుసరిస్తాను. నిజానికి బైబిల్‌ను నీవు ఒక చిన్నపాటి గ్రంథపు చుట్టగా పరిగణిస్తావు, అయితే అది గొర్రెపిల్ల మాత్రమే తెరవగలిగినది కాదా? గొర్రెపిల్ల కాకుండా, మరింకెవరు దాన్ని తెరవగలరు? నీవు గొర్రె పిల్లవు కాదు మరియు నేనే దేవుడని చెప్పుకునే ధైర్యమూ చేయలేను, కాబట్టి మనము బైబిల్‌ను విశ్లేషించడానికి, లేదా అల్పమైన పరిశీలనకు దాన్ని గురి చేయవద్దు. పరిశుద్ధాత్మ చేసిన కార్యాన్ని, అనగా, ప్రస్తుతం స్వయాన దేవుడే చేసిన కార్యమును గురించి చర్చించడం ఎంతో ఉత్తమం. దేవుడు కార్యము జరిగించే నియమాలు ఏమిటో మరియు ఆయన కార్యపు ఉద్దేశం ఏమిటో మనం చూసి, నేడు మనం నడిచే మార్గము సరైనదా కాదా అని ధృవీకరించడానికి వీటిని ఉపయోగించుకుంటూ, ఈ విధముగా మనం దాన్ని నిర్ధారించుదాం” అని నీవు అంటావు. మీరు సువార్తను ప్రకటించాలనుకుంటే, ప్రత్యేకించి ధార్మిక లోకంలోని ఉన్న వారికి ప్రకటించాలి అనుకుంటే, మీరు బైబిల్‌ను తప్పనిసరిగా అర్థం చేసుకోవాలి మరియు దాని అంతర్గత కథనంపై పట్టు కలిగి ఉండాలి; లేకపోతే, నీవు సువార్త ప్రకటించే అవకాశమే లేదు. ఒకసారి నీవు బైబిల్ మీద పట్టు సాధించిన తర్వాత, బైబిల్‌లోని అనవసరమైన వాక్కులను స్వల్పమైన విధానంలో పరిశీలించటం మానేసి, దేవుని కార్యము మరియు జీవిత సత్యం గురించి మాత్రమే మాట్లాడితే, యదార్థ హృదయంతో వెదకు మీరందరూ వాటిని పొందుకుంటారు.
యెహోవా కార్యము, ఆయన స్థిరపరచిన న్యాయ విధులు మరియు మనుషులు వారి జీవితాలను జీవించడంలో ఆయన మార్గనిర్దేశనం చేసిన సూత్రాలు, ధర్మశాస్త్ర కాలములో ఆయన చేసిన కార్యపు పరిమాణము, ఆయన తన న్యాయ విధులను అమలు చేయడంలోని ఆయన ప్రాముఖ్యత, కృపా కాలం వరకు ఉన్న ఆయన కార్యపు ప్రాధాన్యత మరియు ఈ చివరి దశలో దేవుడు చేస్తున్న కార్యము అనే విషయాలన్నిటిని మీరు అర్థం చేసుకోవాలి. మొదటి దశ ధర్మశాస్త్ర కాలపు కార్యము, రెండవది కృపా కాలపు కార్యము, మరియు మూడవది అంత్య దినముల కార్యము. దేవుని కార్యపు ఈ దశల గురించి మీరు స్పష్టంగా ఉండాలి. మొదటి నుండి చివరి వరకు, మొత్తం మూడు దశలు ఉన్నాయి. కార్యపు ప్రతి దశ యొక్క ముఖ్యాంశము ఏమిటి? ఆరువేల సంవత్సరాల నిర్వహణ ప్రణాళిక కార్యములో ఎన్ని దశలు జరిగించబడతాయి? ఈ దశలు ఎలా జరిగించబడతాయిమరియు ఎందుకు ప్రతి ఒక్కటి దాని ప్రత్యేకమైన పద్ధతిలో నిర్వహించబడుతుంది? ఇవన్నీ అతి ప్రధానమైన ప్రశ్నలు. ప్రతి యుగపు కార్యానికి ప్రాతినిధ్య విలువ ఉంటుంది. యెహోవా ఏ కార్యాన్ని జరిగించాడు? ఆయన దాన్ని ఆ ప్రత్యేక పద్ధతిలోనే ఎందుకు చేశాడు? ఆయన యెహోవా అని ఎందుకు పిలవబడ్డాడు? తిరిగి, కృపా కాలంలో యేసు ఏ కార్యాన్ని జరిగించాడు, మరియు ఏ పద్ధతిలో ఆయన దాన్ని చేశాడు? కార్యము యొక్క ప్రతి ఒక్క దశ ద్వారా మరియు ప్రతి ఒక్క యుగం ద్వారా దేవుని స్వభావమునకు సంబంధించి ఏ ఏ అంశాలు సూచించబడ్డాయి? ధర్మశాస్త్ర కాలంలో ఆయన స్వభావానికి చెందిన ఏ ఏ అంశాలు వెల్లడి చేయబడ్డాయి? మరియు కృపా కాలంలో ఏ ఏ అంశాలు వెల్లడి చేయబడ్డాయి? మరియు అంత్య కాలంలో ఏ ఏ అంశాలు వెల్లడి చేయబడ్డాయి? ఇవన్నీ మీరు ఖచ్చితంగా స్పష్టత కలిగి ఉండాల్సిన ప్రాముఖ్యమైన ప్రశ్నలు. ఆరు వేల సంవత్సరాల నిర్వహణ ప్రణాళికలో దేవుని సంపూర్ణ స్వభావము వెల్లడి చేయబడింది. ఇది కృపా కాలంలో మాత్రమే, లేదా ధర్మశాస్త్ర కాలంలో మాత్రమే బయలుపరచబడలేదు, అంత్య దినాలైన ఈ కాలములోనూ బయలుపరచబడలేదు. అంత్య దినాల్లో జరిగింపబడిన కార్యము న్యాయతీర్పును, ఉగ్రతను మరియు శిక్షను సూచిస్తుంది. అంత్య దినాల్లో చేయబడిన కార్యము ధర్మశాస్త్ర కాలములో జరిగిన కార్యాన్ని, లేదా కృపా కాలములో జరిగిన కార్యాన్ని కార్యాన్ని భర్తీ చేయలేదు. ఏదేమైనప్పటికీ, మూడు దశలు, ఒక దానితో ఒకటి అనుసంధానమవడం, ఒకే అస్తిత్వాన్ని ఏర్పరచడంమరియు ఇవన్నీ ఒకే దేవుడు జరిగించిన కార్యమైయున్నది. సహజంగానే ఈ కార్యమును అమలు చేయడమనేది ప్రత్యేక యుగాలుగా విభజించబడింది. అంత్య దినాలలో జరిగిన కార్యము ప్రతి దాన్ని ఒక ముగింపుకు తీసుకొస్తుంది; ధర్మశాస్త్ర యుగములో జరిగింది ప్రారంభ కార్యము; మరియు కృపా యుగములో జరిగింది విమోచన కార్యము. ఈ ఆరు వేల సంవత్సరాల నిర్వహణ ప్రణాళిక అంతటిలో కార్యపు దర్శనాల విషయానికొస్తే, ఎవరూ ఆలోచనను గాని, లేదా అవగాహనను గాని పొందుకోలేకపోవుచున్నారు మరియు ఈ దర్శనాలు గూఢార్థమైన దర్శనాలుగానే మిగిలిపోయాయి. అంత్య దినాల్లో, దేవుని రాజ్య యుగానికి నాంది పలికేందుకు వాక్యపు కార్యము మాత్రమే జరిగించబడుతుంది, అయితే ఇది అన్ని యుగాలకు ప్రాతినిధ్యం వహించదు. అంత్య దినాలకంటే మరే ఇతర అంత్య దినాలు ఉండవు, ఇవి దేవుని రాజ్యపు యుగముకంటే ఇతర ఏ అంత్య దినాలు ఉండవు మరియు అవి కృపా యుగాన్ని, లేదా ధర్మశాస్త్ర యుగాన్ని సూచించవు. ఇది కేవలం, అంత్య దినాల్లో, ఆరు వేల సంవత్సరాల నిర్వహణ ప్రణాళికలోని కార్యమంతా మీకు బయలుపరచబడింది. దీనినే రహస్యాన్ని బయలుపరచడం అంటారు. ఈ రకమైన రహస్యము ఏ మనిషి బట్టబయలు చేయలేని విషయం. బైబిల్ గురించి మనిషి ఎంత గొప్ప అవగాహన కలిగి ఉన్నా, అది కేవలము మాటలవరకే పరిమితమై ఉంటుంది, ఎందుకంటే మనిషి బైబిల్ ముఖ్యాంశమును అర్థం చేసుకోలేడు. బైబిల్‌ను చదివేటప్పుడు మనిషి కొన్ని సత్యాలను అర్థం చేసుకోవచ్చు, కొన్ని వాక్కులను వివరించవచ్చు, లేదా కొన్ని విశేషమైన భాగాలు మరియు అధ్యాయాలు అతని స్వల్ప పరిశీలనలో అర్థము కావచ్చు, కానీ ఆ వాక్కులలో ఇమిడి ఉన్న భావాన్ని అతడు ఎప్పటికీ వెలికి తీయలేడు, ఎందుకంటే మనిషి చూసేదంతా నిర్జీవమైన మాటలనే గాని, యెహోవా మరియు యేసు కార్యములకు సంబంధించిన దృశ్యాలను కాదు మరియు మనిషికి ఈ కార్యపు రహస్యాన్ని చేధించే మార్గమే లేదు. కాబట్టి, ఆరువేల సంవత్సరాల నిర్వహణ ప్రణాళిక మర్మము అనేది అత్యంత నిగూఢంగా మరుగు చేయబడినటువంటి, మనిషికి అస్సలు అర్థం కానటువంటి ఎంతో గొప్ప రహమైయున్నది. దేవుడే స్వయంగా మనిషికి వివరించి వెల్లడి చేస్తేనే తప్ప, దేవుని చిత్తాన్ని ఎవ్వరూ నేరుగా గ్రహించలేరు; లేకపోతే, ఈ విషయాలు మనిషికి ఎప్పటికీ అర్థమవ్వని గూఢమైన సంగతులుగానే ఉండిపోతాయి, శాశ్వతంగా మూయబడిన రహస్యాలుగా మిగిలిపోతాయి. ధార్మిక ప్రపంచంలో ఉన్న వారిని పట్టించుకోవద్దు; ఈ రోజు మీకు చెప్పకపోతే, మీరు దాన్ని గ్రహించి ఉండేవారు కాదు. ఆరువేల సంవత్సరాల ఈ కార్యము ప్రవక్తల ప్రవచనాలన్నిటికంటే ఎంతో రహస్యమైనది. ఇది సృష్టి నుండి ఇప్పటివరకు ఉన్న అతి గొప్ప రహస్యము, మరియు యుగాలలోని ప్రవక్తలలో ఎవ్వరూ దీన్ని ఎన్నడూ గ్రహించలేకపోయారు, ఎందుకంటే ఈ రహస్యము అంత్య కాలంలో మాత్రమే ఆవిష్కృతమైంది మరియు ఇంతకు మునుపెన్నడూ బహిర్గతం కాలేదు. మీరు ఈ రహస్యాన్ని గ్రహించగలిగితే, మరియు మీరు దీని సంపూర్ణత్వాన్ని పొందగలిగితే, అప్పుడు మతపరమైన వ్యక్తులందరూ ఈ రహస్యము ద్వారా ఓటమి చెందుతారు. ఇదంతా దర్శనాల గొప్పతనమైయున్నది; మనిషి గ్రహించాలని ఎంతో ఆశగా ఎదురు చూసేది ఇదే కానీ అతనికి ఎంతో అస్పష్టంగా ఉండేది కూడా ఇదే. మీరు కృపా యుగములో ఉన్నప్పుడు, యెహోవా జరిగించిన కార్యము గురించి, లేదా యేసు జరిగించిన కార్యము గురించి మీకు తెలియదు. యెహోవా న్యాయ విధులను ఎందుకు రూపొందించాడో, కట్టడలు పాటించమని జనసమూహాన్ని ఆయన ఎందుకు అడిగాడో, లేదా ఎందుకు ఆలయాన్ని నిర్మించాలో ప్రజలకు అర్థం కాలేదు మరియు ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి అరణ్యములోనికి ఆ తర్వాత కనానుకు ఎందుకు నడిపించబడ్డారో ప్రజలు ఇంకా అర్థం చేసుకోలేదు. ఇటువంటి విషయాలు నేటి వరకు వెల్లడి కాలేదు.
అంత్య దినాల్లో జరిగించబడే కార్యమే మూడు దశలలోని చివరి దశయైయున్నది. ఇది మరొక కొత్త యుగపు కార్యము మరియు ఇది నిర్వహణ కార్యపు సమస్తాన్ని సూచించదు. ఆరు వేల సంవత్సరాల నిర్వహణ ప్రణాళిక కార్యము యొక్క మూడు దశలుగా విభజించబడింది. ఏ ఒక్క దశ కూడా మూడు యుగాల కార్యమునకు ప్రాతినిధ్యం వహించదు, కానీ ఒక యుగములో జరిగే కార్యమునంతటిని మాత్రమే సూచిస్తుంది. యెహోవా అనే పేరు దేవుని స్వభావమునంతటిని సూచించదు. ధర్మశాస్త్ర యుగములో ఆయన కార్యము జరిగించియున్నాడనే వాస్తవం ధర్మశాస్త్రము క్రింద దేవుడు మాత్రమే దేవుడు కాగలడని నిరూపించదు. యెహోవా మనిషి కోసం న్యాయ విధులను ఏర్పాటు చేసి, మందిరాన్ని మరియు బలిపీఠాలను నిర్మించమని మనిషిని కోరుతూ అతనికి ఆజ్ఞలు అందజేశాడు; ఆయన జరిగించిన కార్యము ధర్మశాస్త్ర యుగాన్ని మాత్రమే సూచిస్తుంది. ఆయన జరిగించిన ఈ కార్యము, దేవుడు మనిషిని ధర్మ శాస్త్రాన్ని మాత్రమే పాటించమని అడిగే దేవుడని, లేదా ఆయన మందిరములో ఉండే దేవుడని, లేదా ఆయన బలిపీఠము యెదుటనున్న దేవుడని నిరూపించలేదు. ఇలా చెబితే అవాస్తవం అవుతుంది. ధర్మశాస్త్రము క్రింద జరిగిన కార్యము ఒక యుగాన్ని మాత్రమే సూచిస్తుంది. కాబట్టి, దేవుడు ధర్మశాస్త్ర యుగములో మాత్రమే కార్యము చేసినట్లయితే, అప్పుడు మనిషి, “దేవుడు దేవాలయంలో ఉన్న దేవుడు మరియు దేవుణ్ణి సేవించడానికి మనము యాజక వస్త్రాలు తప్పనిసరిగా ధరించి మందిరములోనికి ప్రవేశించాలి” అనే నిర్వచనానికి దేవుణ్ణి కట్టి పడేస్తాడు. కృపా యుగములో కార్యము జరగకుండా ధర్మశాస్త్ర యుగములోని కార్యము ఇప్పటివరకు కొనసాగి ఉన్నట్లయితే, దేవుడు దయామయుడని మరియు ప్రేమగలవాడని కూడా మనిషి తెలుసుకునేవాడు కాదు. ధర్మశాస్త్ర యుగములో కార్యము జరగకుండా, కేవలము కృపా యుగములో కార్యము మాత్రమే జరిగి ఉంటే, అప్పుడు దేవుడు మనిషిని విమోచించి మానవ పాపాలను క్షమించగలడని మాత్రమే మానవులందరికీ తెలిసేది. ఆయన పరిశుద్ధుడు మరియు నిర్దోషి అని మరియు మనిషి కొరకు ఆయన తనను తాను త్యాగము చేసుకుని సిలువ వేయబడగలడని మాత్రమే మనిషికి తెలిసేది. మనిషికి ఈ విషయాలు మాత్రమే తెలిసేవి కానీ ఇతర విషయాలను గూర్చిన అవగాహన ఉండేది కాదు. కాబట్టి ప్రతి యుగము దేవుని స్వభావములోని ఒక భాగాన్ని సూచిస్తుంది. దేవుని స్వభావానికి చెందిన ఎటువంటి అంశాలు ధర్మశాస్త్ర యుగములో సూచించబడ్డాయి, ఆయన స్వభావమును గూర్చిఎటువంటి అంశాలు కృపా యుగములో సూచించబడ్డ్డాయి, మరియు ప్రస్తుత దశలో ఆయన స్వభావమును గూర్చి ఎటువంటి అంశాలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి: అని అంటే, ఆ మూడు దశలు ఒక కార్యముగా ఏకీకృతమైనప్పుడు మాత్రమే సంపూర్ణ దేవుని స్వభావమును బయలుపరచగలవు. మనిషి మూడు దశలను తెలుసుకున్నప్పుడు మాత్రమే దాన్ని పూర్తిగా అర్థం చేసుకోగలడు. మూడు దశలలో దేనినీ విస్మరించలేము. ఈ మూడు దశల కార్యాన్ని నీవు తెలుసుకున్న తర్వాత మాత్రమే దేవుని దేవుని సంపూర్ణ స్వభావాన్ని చూస్తావు. ధర్మశాస్త్ర యుగములో దేవుడు తన కార్యాన్ని పూర్తి చేశాడన్న వాస్తవం ఆయన ధర్మశాస్త్రము క్రిందున్న దేవుడని మాత్రమే రుజువు చేయట్లేదు మరియు ఆయన తన విమోచన కార్యాన్ని సంపూర్తి చేశాడు అంటే దేవుడు మానవ జాతిని ఎప్పటికీ విమోచిస్తాడని దాని భావం కాదు. ఇవన్నీ మనిషి గీసుకున్న నిర్ధారణలు. కృపా యుగము ముగింపుకు వచ్చేసింది కాబట్టి, దేవుడు సిలువకు మాత్రమే చెందిన వాడని మరియు ఆ సిలువ మాత్రమే దేవుని రక్షణ సూచిస్తుందని నీవు చెప్పలేవు. అలా చేయటం దేవుని నిర్వచించడమే అవుతుంది. ప్రస్తుతమందున్న దశలో దేవుడు ప్రధానంగా వాక్యపు కార్యాన్ని చేస్తున్నాడు, అయితే, దేవుడు మనుష్యులపట్ల దయ చూపే దయామయుడు కాదని మరియు ఆయన తీసుకువచ్చినదంతా శిక్ష మరియు తీర్పు అనే వాటినేనని నీవు చెప్పలేవు. మానవాళి మధ్యన రక్షణ కార్యమును ముగించుటకు, మానవజాతికి అంతమును మరియు గమ్యస్థానాన్ని బయలుపరచుటకు అంత్య దినాల్లో జరిగించబడే కార్యము యెహోవా మరియు యేసు కార్యములను మరియు మానవుడు గ్రహించలేని రహస్యాలన్నిటినీ బట్టబయలు చేస్తుంది. అంత్య దినాల్లోని కార్యపు ఈ దశ ప్రతి దాన్ని ఒక ముగింపుకు తీసుకొస్తుంది. మనిషికి అర్థంకాని రహస్యాలన్నిటినీ తమ అంతరంగాల్లో స్థిరపరిచేందుకు మరియు తన హృదయ మందు సంపూర్ణంగా స్పష్టమైన అవగాహన కలిగి ఉండేందుకు అనుమతించడానికి వాటిని బహిర్గతం చేయాలి. అప్పుడు మాత్రమే మానవ జాతిని పద్ధతి ప్రకారం వర్గీకరించవచ్చు. ఆరువేల సంవత్సరాల నిర్వహణ ప్రణాళిక పూర్తయిన తర్వాత మాత్రమే, మానవుడు పరిపూర్ణమైన దేవుని స్వభావాన్ని అర్థం చేసుకుంటాడు, ఎందుకంటే ఆయన నిర్వహణ అప్పటికి ముగుస్తుంది. ఇప్పుడు మీరు చివరి యుగములో దేవుని కార్యాన్ని అనుభవించారు కాబట్టి, దేవుని స్వభావము అంటే ఏమిటి? దేవుడు కేవలం మాటలు చెప్పే దేవుడే తప్ప ఇంకేమీ కాదని చెప్పే ధైర్యం నీకుందా? అలాంటి నిర్ధారణ చేసే సాహసం నీవు చేయవు. కొంతమంది దేవుడు రహస్యాలను బహిర్గతం చేసే దేవుడని, దేవుడు గొర్రెపిల్ల అని, మరియు ఏడు ముద్రలను విప్పే వాడని చెప్తారు. కానీ అలాంటి నిర్ధారణ చేయడానికి మాత్రం ఎవరూ సాహసించరు. దేవుడు శరీరావతారమని ఇతరులు చెప్పవచ్చు, కానీ ఇది ఇంకా సరైనది కాదు. ఇంకా కొందరు శరీరధారి అయిన దేవుడు కేవలం వాక్యాలు చెప్తూ సూచక క్రియలు మరియు అద్భుతాలు చేయడని అంటారు, కానీ ఈ విధంగా మాట్లాడటానికి నీవైతే సాహసించవు, ఎందుకంటే యేసు శరీరునిగా మారి సూచక క్రియలు మరియు అద్భుతాలు చేశాడు, కాబట్టి దేవుణ్ణి అంత చులకనగా నిర్వహించే ధైర్యం నీవు చేయవు. ఆరువేల సంవత్సరాల నిర్వహణ ప్రణాళికలో జరిగిన సమస్త కార్యము ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంది. ఈ కార్యమంతా మానవునికి బయలుపరచబడి మానవజాతి మధ్య జరిగించబడిన తర్వాత మాత్రమే దేవుని సంపూర్ణ స్వభావాన్ని మరియు ఆయన ఏమి కలిగి ఉన్నాడో మరియు ఆయన ఏమై ఉన్నాడని మానవజాతి తెలుసుకుంటుంది. ఈ దశలో జరిగించబడే కార్యము పూర్తిగా ముగిశాక, మనిషికి అర్థం కాని రహస్యాలన్నీ వెల్లడి చేయబడతాయి, ఇంతకుముందు అర్థం కాని సత్యాలన్నీ స్పష్టమవుతాయి, మానవజాతికి తమ భవిష్యత్తు మార్గము మరియు గమ్యము గురించి చెప్పబడుతుంది. ప్రస్తుత దశలో చేయాల్సిన కార్యమంతా ఇదే. నేడు మానవుడు నడిచే మార్గం కూడా సిలువ మార్గము మరియు శ్రమల మార్గం అయినప్పటికీ, మానవుడు ఆచరించేవి మరియు అతడు నేడు తినుచూ, తాగుచూ ఆనందించేది ధర్మశాస్త్రానికి లోబడి కృపా యుగములో ఉన్న మానవుని పట్ల కొట్టివేయబడిన దానికి ఎంతో భిన్నంగా ఉంటాయి. గతంలోను మరియు ధర్మశాస్త్ర యుగములోను మానవుని అడిగినట్లుగా ఈ రోజున మనిషిని అడగడం లేదు. ఇప్పుడు, ఇశ్రాయేలులో దేవుడు తన కార్యాన్ని చేస్తున్నప్పుడు ధర్మశాస్త్ర ప్రకారం మానవుని ఏమి అడిగాడు? మానవుడు విశ్రాంతి దినాన్ని మరియు యెహోవా కట్టడలను పాటించాలనే దానికంటే ఎక్కువేమీ అడగలేదు. విశ్రాంతి దినమున ఎవరూ పని చేయకూడదని, లేదా యెహోవా కట్టడలను అతిక్రమించకూడదని అడిగాడు. కానీ ఇప్పుడు అలా కాదు. విశ్రాంతి దినమందు, మానవుడు పని చేస్తాడు, సమావేశమవుతాడు మరియు ఎప్పటి లాగానే ప్రార్థిస్తాడు, అతనిపై ఎలాంటి ఆంక్షలు విధించబడవు. కృపా యుగములో ఉన్నవారు బాప్తీస్మము పొంది మరియు ఉపవాసముండి, రొట్టె విరవాలని, ద్రాక్షరసం త్రాగాలని, తలలు కప్పుకోవాలని మరియు వారి కొరకు ఇతరుల పాదాలు కడగాలని కోరడమైనది. ఇప్పుడు ఈ నియమాలు రద్దు చేయబడ్డాయి, కానీ దేవుని కార్యము మరింత లోతుగా పెరుగుతున్న కొలది మరియు మానవుని ప్రవేశము ఇంకా ఉన్నత స్థాయికి చేరుకుంటున్న కొలది మనిషి నుండి ఎక్కువ కోరడం జరుగుతుంది. గతంలో యేసు మనిషి మీద చేతులు ఉంచి ప్రార్థించాడు, కానీ ఇప్పుడు అంతా చెప్పిన తరువాత, చేతులు ఉంచడంవల్ల ఉపయోగం ఏమిటి? వాక్కులు మాత్రమే ఫలితాలను సాధించగలవు. గతంలో ఆయన మనిషిపై తన చేతులుంచినప్పుడు, అది మనిషిని ఆశీర్వదించడానికి, అలాగే అతని వ్యాధుల నుండి అతన్ని స్వస్థపరచడానికి ఉంచడం జరిగింది. ఈ విధంగా ఆ కాలంలో పరిశుద్ధాత్మ కార్యము చేశాడు, కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు కార్యము చేయడానికి మరియు ఫలితాలను సాధించడానికి పరిశుద్ధాత్మ వాక్కులను ఉపయోగిస్తాడు. ఆయన వాక్కులు మీకు స్పష్టం చేయబడ్డాయి, మీకు చెప్పబడినట్లు మీరు వాటిని ఆచరించాలి. ఆయన వాక్కులే ఆయన చిత్తము; అవే ఆయన చేయాలనుకున్న కార్యమైయున్నది. ఆయన వాక్కుల ద్వారా నీవు ఆయన చిత్తాన్ని గ్రహిస్తావు మరియు దీనినే ఆయన నిన్ను నెరవేర్చమని అడుగుచున్నాడుమరియు నీవు చేతులు వేయించుకోవాల్సిన అవసరం లేకుండానే నేరుగా ఆయన వాక్కులను అనుసరించవచ్చు. “నీ చేతులు నా మీద ఉంచండి! నేను మీ ఆశీర్వాదాన్ని పొందేలా మరియు మీతో పాలి భాగస్తులయ్యేలా మీ చేతులు నా మీద ఉంచండి” అని కొంతమంది అనవచ్చు. ఇవన్నీ కాలం చెల్లిన గతకాలపు పద్ధతులు, ప్రస్తుతం వాడుకలో లేవు, ఎందుకంటే యుగం మారింది. పరిశుద్ధాత్మ యుగానికి అనుగుణంగా పని చేస్తాడు, యాదృచ్ఛికంగానో లేదా అమలు చేయబడిన నియమాలకు అనుగుణంగా కాదు. యుగము మారింది మరియు ఒక నూతన యుగము దానికి సంబంధించిన నూతన కార్యాన్ని తప్పక తెస్తుంది. ఇది కార్యపు ప్రతి దశకు వర్తించే వాస్తవ సంగతి, కాబట్టి ఆయన కార్యము ఎప్పుడూ పునరావృతం కాదు. కృపా యుగములో యేసు రోగాన్ని స్వస్థపరచడం, దెయ్యాలను వెళ్లగొట్టడం, మనిషి మీద చేతులుంచి అతని కొరకు ప్రార్థించడం మరియు మనిషిని ఆశీర్వదించడంవంటి కార్యాన్ని చాలా వరకు చేశాడు. అయితే, ప్రస్తుత దినాల్లో మళ్లీ అలా చేయడం అర్థ రహితం అవుతుంది. ఆ కాలంలో పరిశుద్ధాత్మ ఆ విధంగా పని చేశాడు ఎందుకంటే ఇది కృపా కాలము, మానవుడు ఆనందించడానికి చాలినంత కృప ఉండేది. అనుభవించిన కృపను తిరిగి చెల్లించాలని అతనిని అడగలేదు, అందుచేత అతడు విశ్వాసం కలిగి ఉన్నంత కాలం అతడు కృపను పొందుతూ ఉంటాడు. అందరూ కృపనుబట్టి బాగుగా చూడబడ్డారు. ఇప్పుడు కాలం మారింది, దేవుని కార్యము మరింతగా పురోగతి చెందింది; శిక్ష మరియు న్యాయతీర్పు ద్వారా మానవుని తిరుగుబాటుతనము మరియు మానవునిలోని అపవిత్రమైన విషయాలు ప్రక్షాళన చేయబడతాయి. ఆ దశ విమోచన దశ అయినందున, అది మానవుడు ఆనందించటానికి చాలినంత కృపను చూపుతూ ఆ విధంగా కార్యము చేయడం దేవునికి అభీష్ఠమైంది, తద్వారా మానవుడు పాపము నుండి విమోచింపబడతాడు మరియు కృప ద్వారా అతని పాపాలు క్షమించబడతాయి. ఈ ప్రస్తుత దశలో శిక్షించుట ద్వారా, తీర్పు తీర్చుట ద్వారా, వాక్కుల ద్వారా ఖండించడం, అలాగే క్రమశిక్షణ మరియు వాక్కుల ప్రత్యక్షత ద్వారా మానవునిలోని దుర్నీతిని బట్టబయలు చేయడం జరుగుతుంది. తద్వారా మానవజాతి ఆపై రక్షించబడుతుంది. ఇది విమోచన కంటే ఎంతో నిగూఢమైన కార్యము. మానవుని ఆనందించడానికి కృపా కాలంలోని కృప సరిపోయింది; ప్రస్తుత మానవుడు ఈ కృపను ఇప్పటికే అనుభవించాడు, ఇకపై అతడు దాన్ని అనుభవించలేడు. ఇప్పుడు ఈ కార్యము దాన్ని సమయాన్ని మించిపోయింది ఇకపై జరిగింపబడదు. ఇప్పుడు మానవుడు వాక్యపు తీర్పు ద్వారా రక్షింపబడవలసి ఉన్నది. మానవుడు తీర్పు తీర్చబడి, శిక్షించబడి మరియు శుద్ధి చేయబడిన తర్వాత అతని స్వభావం మారుతుంది. ఇదంతా నేను మాట్లాడిన మాటలను బట్టి కాదా? కార్యపు ప్రతి దశ సమస్త మానవ జాతి అభివృద్ధికి అనుసారముగా మరియు కాలానుగుణంగా జరుగుతుంది. ఈ కార్యము ఎంతో ప్రాముఖ్యమైనది మరియు ఇదంతా అంతిమ రక్షణ కొరకు జరుగుతుంది, కాబట్టి భవిష్యత్తులో మానవజాతికి మంచి గమ్యస్థానమును కలిగి, అంతిమంగా మానవాళి ఆయా విధాలుగా వర్గీకరించబడుతుంది.
వాక్కులను చెప్పడమే అంత్య దినములయందు జరిగే కార్యమై ఉన్నది. వాక్కుల ద్వారా మానవునిలో గొప్ప మార్పులు కలుగవచ్చు. ఈ వాక్యాలను అంగీకరించిన మీదట ఈ వ్యక్తులలో ఇప్పుడు కలిగిన మార్పులు, కృపా యుగములో సూచక క్రియలు మరియు అద్భుతాలను అంగీకరించడాన్ని బట్టి ప్రజలలో కలిగిన వాటికంటే ఎంతో గొప్పవి. ఎందుకంటే, కృపా యుగములో చేతులుంచి ప్రార్థించడంతో మనిషి నుండి దయ్యాలు వెళ్లగొట్టబడ్డాయి, కానీ మనిషిలోని భ్రష్టుపట్టిన స్వభావాలు ఇంకా అలానే ఉన్నాయి. మానవుడు తన వ్యాధి నుండి స్వస్థత పొందాడు మరియు తన పాపాలు క్షమించబడ్డాయి, కానీ మనిషి తనలోని సాతాను భ్రష్ట స్వభావాల నుండి ఎలా ప్రక్షాళన చేయబడాలన్న, ఈ కార్యము మాత్రం ఇంకా జరగవలసి ఉన్నది. మానవుడు రక్షించబడింది మరియు తన పాపాలు క్షమించబడింది తన విశ్వాసాన్ని బట్టి మాత్రమే, అయితే మానవుని పాపపు స్వభావము పూర్తిగా నిర్మూలన కాకుండా ఇంకా అతనిలోనే ఉండిపోయింది. మానవ పాపాలు శరీరధారియైన దేవుని మధ్యవర్తిత్వము ద్వారా క్షమించబడ్డాయి, అయితే దీనర్ధం మానవుడు తనలో అసలు పాపాన్నే కలిగి లేడని కాదు. మానవ పాపాలు పాపపరిహారార్ధబలి ద్వారా క్షమించబడవచ్చు, కానీ మానవుడు ఇకపై పాపం చేయకుండా ఎలా ఉండగలడుమరియు ఎలా అతని పాపపు స్వభావము పూర్తిగా నిర్మూలించబడి పరివర్తన చెందుతుందనే ఈ సమస్యను పరిష్కరించే మార్గం అతనికి లేదు. మానవుని పాపాలు క్షమించబడ్డాయి, దీనికి దేవుని సిలువ కార్యము కారణమై ఉన్నది, అయితే మానవుడు తన పాత సాతాను భ్రష్ట స్వభావంలోనే జీవించడాన్ని కొనసాగించాడు. ఇది ఇలా ఉండగా, మానవుడు తన భ్రష్ట సాతాను స్వభావం నుండి పూర్తిగా రక్షించబడాలి, తద్వారా తన పాపపు స్వభావము పూర్తిగా నిర్మూలించబడి, మరల ఎన్నటికీ పెరగకుండా ఉండే విధంగా మానవ స్వభావము రూపాంతరము చెందడానికి తోడ్పడుతుంది. దీనికి మానవుడు జీవితంలో వృధ్ధి చెందే మార్గాన్ని గ్రహించడం, జీవన విధానాన్ని అవలంబించడం మరియు తన స్వభావాన్ని మార్చుకునే పద్ధతిని తెలుసుకోవటం అవసరం. అంతేగాకుండా, మానవుడు ఈ మార్గానికి అనుగుణంగా ప్రవర్తించవలసి ఉన్నది, తద్వారా అతని స్వభావము క్రమముగా మార్పుచెంది అతడు కాంతి వెలుగులో జీవించగలడు, తద్వారా అతడు చేసేదంతా దేవుని చిత్తానికి అనుగుణంగా ఉంటుంది, అందువల్ల అతడు తన భ్రష్ట సాతాను సంబంధమైన స్వభావాన్ని విసర్జించవచ్చు మరియు తద్వారా అతడు సాతాను అంధకార ప్రభావము నుండి విడుదల పొందవచ్చు, దాని ఫలితంగా పాపం నుండి పూర్తిగా బయటపడగలడు. అప్పుడు మాత్రమే మానవుడు సంపూర్ణ రక్షణను పొందుకుంటాడు. యేసు తన కార్యమును జరిగించిన కాలంలో, ఆయన గురించి మనిషికున్న జ్ఞానము సందిగ్ధంగాను మరియు అస్పష్టంగానే ఉండేది. మానవుడు ఎల్లప్పుడూ ఆయనను దావీదు కుమారుడని నమ్మి, ఆయనను ఒక గొప్ప ప్రవక్తగాను, మానవ పాపాలను విమోచించిన దయగల ప్రభువుగా ప్రకటించాడు. కొంతమంది, తమ విశ్వాస బలముతో, కేవలం ఆయన వస్త్రపు చెంగును తాకటం వలన స్వస్థత పొందారు; గుడ్డివారు చూడగలిగారు మరియు చనిపోయినవారు కూడా తిరిగి జీవించగలిగారు. అయినప్పటికీ, మానవుడు తనలో లోతుగా పాతుకుపోయిన చెడ్డ సాతాను స్వభావాన్ని కనుగొనలేకపోయాడు, అలాగే దాన్ని ఎలా విసర్జించాలో కూడా అతను తెలుసుకోలేకపోయాడు. మానవుడు శరీర సంబంధమైన శాంతి సమాధానమును, ఒక ఇంటి సభ్యుని విశ్వాసము ద్వారా కుటుంబం మొత్తం మీదకి ఆశీర్వాదాన్ని తీసుకురావడమును, వ్యాధికి స్వస్థతను మరియు మొదలగు ఎంతో కృపను పొందుకున్నాడు. మిగిలినవి మానవుని సత్క్రియలు మరియు తన దైవిక స్వరూపము; ఒకవేళ ఎవరైనా వీటి ఆధారంగా జీవించగలిగితే, వారు ఒక అంగీకరించదగిన విశ్వాసిగా పరిగణించబడతారు. ఈ రకమైన విశ్వాసులు మాత్రమే మరణించిన తరువాత పరలోకంలో ప్రవేశిస్తారు, అంటే వారు రక్షించబడ్డారని అని అర్థం. అయితే, ఈ వ్యక్తులు తమ జీవిత కాలంలోని తమ జీవన విధానాన్ని అస్సలు అర్థం చేసుకోలేదు. వారు చేసిందల్లా పాపాలు చేయడం, ఆపై వారి స్వభావాన్ని మార్చుకోడానికి ఎలాంటి దారి లేని ఒక నిత్య పునరావృత ధోరణిలో వారు తమ పాపాలను ఒప్పుకోవడం: కృపా కాలంలో మానవుని పరిస్థితి ఇలా ఉండేది. మానవునికి సంపూర్ణ రక్షణ లభించిందా? లేదు! అందువల్ల, ఆ కార్యపు దశ ముగించబడిన తర్వాత, తీర్పు మరియు శిక్ష అనే కార్యము ఇంకా మిగిలి ఉంది. ఈ దశలో వాక్యము ద్వారా మానవుని పరిశుద్ధపరచి, అతడు అనుసరించడానికి ఒక మార్గాన్ని అందిస్తుంది. ఒకవేళ దయ్యాలను వెళ్లగొట్టడంతోనే ఈ దశ కొనసాగి ఉంటే ఇది ఫలభరితంగా లేదా అర్థవంతంగా ఉండేది కాదు, ఎందుకంటే అది మానవుని పాపపు స్వభావాన్ని నిర్మూలించడంలో విఫలమైయ్యేది మరియు మానవుడు తన పాపాల క్షమాపణ వద్దనే ఇంకా నిలిచి ఉండేవాడు. పాపపరిహారార్ధ బలి ద్వారా మానవుడు చేసిన తన పాపాల కొరకు క్షమించబడ్డాడు, ఎందుకంటే సిలువ కార్యము ఇప్పటికే ముగించబడి దేవుడు సాతానుపై విజయాన్ని సాధించాడు. అయితే మానవుని భ్రష్ట స్వభావము తనలో ఇంకా అలానే ఉంది, మానవుడు ఇప్పటికీ పాపము చేసి దేవుణ్ణి ఎదిరించగలడు మరియు దేవుడు మానవాళిని సంపాదించుకోలేదు. అందుకే ఈ కార్యపు దశలో మానవుని భ్రష్ట స్వభావాన్ని బట్టబయలు చేయడానికి, సరైన మార్గానికి తగినట్టుగా అతన్ని అనుసరింప చేయడానికి దేవుడు వాక్కును ఉపయోగిస్తాడు. ఈ దశ మునుపటి దశకంటే మరింత అర్థవంతమైనది, అలాగే మరింత ఫలభరితమైనది, ఎందుకంటే ఇప్పుడిది మానవునికి నేరుగా జీవాన్ని అందించే మరియు మానవ స్వభావాన్ని సంపూర్ణంగా పునరుద్ధరింపజేసే వాక్యమైయున్నది; ఇది మరింత ఎక్కువగా కార్యమును జరిగించే సమగ్రమైన దశయైయున్నది. కాబట్టి, అంత్య దినాల్లోని శరీరావతారము అనేది శరీరధారియైన దేవుని ప్రాధాన్యతను పూర్తి చేసియున్నది మరియు మానవ రక్షణ కొరకైన దేవుని కార్య నిర్వహణ ప్రణాళికను పూర్తిగా ముగించింది.
దేవుడు మానవుని రక్షించడమనేది ఆత్మ పద్ధతిని మరియు ఆత్మ గుర్తింపును నేరుగా ఉపయోగించి జరిగించడు, ఎందుకనగా ఆయన ఆత్మను మనిషి స్పర్శించలేడు, లేక ఆయన ఆత్మను మనిషి చూడలేడు, అలాగే మానవుడు ఆయన ఆత్మను సమీపించలేడు. ఒకవేళ ఆయన ఆత్మ దృష్టికోణాన్ని ఉపయోగించి నేరుగా మానవుని రక్షించడానికి ప్రయత్నిస్తే, మానవుడు ఆయన రక్షణను పొందలేడు. ఒకవేళ దేవుడు సృష్టించబడిన మానవుని బాహ్య స్వరూపాన్ని ధరించకపోతే, మానవుడు రక్షణ పొందడానికి ఆస్కారమే ఉండదు. ఎలాగైతే యెహోవా మేఘము దగ్గరికి ఎవరూ వెళ్ళనట్లుగానే, మనిషికీ ఆయనను చేరుకునే ఆస్కారమే లేదు. సృజించబడిన మానవునిగా మారడం ద్వారా మాత్రమే, అనగా, ఆయన మారబోతున్న మాంసపు దేహములో తన వాక్యాన్ని ఉంచడం ద్వారా మాత్రమే, తనను అనుసరించు వారందరిలో ఆయన వ్యక్తిగతముగా వాక్యాపు కార్యాన్ని చేయగలడు. అప్పుడు మాత్రమే మానవుడు ఆయన వాక్కును వ్యక్తిగతంగా చూడగలడు మరియు వినగలడు, అంతేకాకుండా ఆయన వాక్యపు అధీనంలోనికి ప్రవేశించి, ఈ విధంగా సంపూర్ణంగా రక్షింపబడతాడు. ఒకవేళ దేవుడు శరీరధారిగా మారకపోతే, రక్త మాంసాలు కలిగిన ఏ ఒక్కరూ ఇంత గొప్ప రక్షణను పొందియుండేవారు కాదు, లేదా ఒక్క వ్యక్తి కూడా రక్షించబడియుండేవాడే కాదు. ఒకవేళ దేవుని ఆత్మ మానవాళి మధ్యలో నేరుగా కార్యమును జరిగించినట్లయితే, మానవాళి మొత్తం నాశనం చేయబడుతుంది, లేకపోతే, దేవునితో సన్నిహితంగా మెలిగే అవకాశమే ఉండదు, వారు పూర్తిగా సాతాను చేత బందీలుగా ఉండిపోయేవారు. మొట్ట మొదటి శరీరావతారము అనేది మనుష్యులను తమ పాపముల నుండి విమోచించడం, యేసు మాంసపు దేహము ద్వారా మనుష్యులను విమోచించడం, అంటే, ఆయన సిలువ నుండి మనుష్యులను రక్షించాడు, కానీ దుష్ట సాతాను స్వభావం మనుష్యులలో ఇంకా అలానే ఉండిపొయింది. రెండవ శరీరావతారము అనేది ఇకపై పాపము నుండి విమోచింపబడిన వారిని పూర్తిగా రక్షించడానికే గాని పాపపరిహారార్ధ బలిగా పనిచేయడానికి కాదు. క్షమించబడిన వారు తమ పాపాల నుండి విడుదల పొంది పూర్తిగా పరిశుద్ధపరచబడి, మార్పు చెందిన స్వభావాన్ని పొందడం ద్వారా సాతాను అంధకార ప్రభావము నుండి విడిపించబడి, దేవుని సింహాసనము ఎదుటకు తిరిగి రావాలని ఇది జరిగించబడుతుంది. ఈ విధంగా మాత్రమే మానవుడు పూర్తిగా పవిత్రీకరించబడగలడు. ధర్మశాస్త్ర యుగము ముగింపుకు వచ్చి, కృపా యుగాన్ని ప్రారంభించిన తర్వాత, దేవుడు రక్షణ కార్యాన్ని ప్రారంభించాడు, మానవ జాతి తిరుగుబాటుతనాన్ని బట్టి వారిని తీర్పు తీర్చి శిక్షించడంలో, ఆయన మానవజాతిని సంపూర్ణముగా శుద్దీకరించే అంత్య దినాల వరకు ఇది కొనసాగుతుంది. అప్పుడు మాత్రమే దేవుడు తన రక్షణ కార్యాన్ని ముగించి, విశ్రాంతిలోనికి ప్రవేశిస్తాడు. కాబట్టి, కార్యపు మూడు దశలలో, మనుషుల మధ్య తన కార్యాన్ని జరిగించడానికి దేవుడు కేవలం రెండుసార్లు మాత్రమే శరీరధారిగా మారాడు. అది ఎందుకంటే కార్యపు మూడు దశలలో ఒక్కటి మాత్రమే వారి జీవితాలను నడిపించడంలో మనుషులుకు మార్గనిర్దేశనం చేస్తుంది, మిగిలిన రెండు రక్షణ కార్యాన్ని కలిగి ఉంటాయి. శరీరధారిగా మారడం ద్వారా మాత్రమే దేవుడు మానవునితో కలిసి జీవించి, లోక బాధను అనుభవించి మరియు ఒక సాధారణ మాంసపు దేహములో జీవించగలడు. ఈ విధంగా మాత్రమే సృజించబడిన జీవులైన మనుషులుకు అవసరమైన అనుసరణ మార్గాన్ని ఆయన అందించగలడు. మానవుడు దేవుని నుండి సంపూర్ణ రక్షణను శరీరధారియైన దేవుని ద్వారా మాత్రమే పొందుతాడు గాని, అతని ప్రార్థనలకు సమాధానంగా పరలోకము నుండి నేరుగా పొందడు. మానవుడు రక్త మాంసాలతో ఉన్నాడు కాబట్టి, అతడు దేవుని ఆత్మను చూసే అవకాశం లేదు, ఆయన ఆత్మను వద్దకు కూడా సమీపించలేడు. మానవుడు సాన్నిహిత్యంతో మెలిగేదంతా దేవుని శరీరావతారముతో మాత్రమే మరియు దీని ద్వారా మాత్రమే మానవుడు మార్గాలన్నిటినీ మరియు సత్యాలన్నిటినీ గ్రహించి, సంపూర్ణ రక్షణను పొందుకుంటాడు. రెండవ శరీరావతారము మానవుని పాపాలను పోగొట్టి, అతన్ని సంపూర్ణంగా శుద్ధి చేయడానికి సరిపోతుంది. అందువలన, రెండవ శరీరావతారముతో శరీరమందున్న దేవుని సమస్త కార్యము ముగింపునకు తీసుకురాబడి, దేవుని అవతారపు ప్రాముఖ్యత సంపూర్తి చేయబడుతుంది. ఇక నుండి శరీరమందు దేవుని కార్యము పూర్తిగా ముగింపుకు వస్తుంది. రెండవ శరీరావతారము తర్వాత ఆయన తన కార్యము కోసం మూడవసారి శరీరావతారిగా మారడు. ఎందుకంటే ఆయన కార్య నిర్వహణ అంతా ముగింపుకు వచ్చి ఉంటుంది. అంత్య దినాల్లోని శరీరావతారము ఎన్నుకోబడిన తన ప్రజలను పూర్తిగా సంపాదించుకుంటుంది మరియు అంత్య దినాల్లోని మానవ జాతి మొత్తం ఆయా విధాలుగా వర్గీకరించబడుతుంది. ఆయన ఇకపై రక్షణ కార్యాన్ని జరిగించడు, లేదా ఏదైనా కార్యాన్ని జరిగించడానికి ఆయన శరీరావతారిగా తిరిగి రాడు. అంత్య దినముల కార్యములో సూచక క్రియలు మరియు అద్భుతా జరుగుటకంటే వాక్యము ఎంతో శక్తివంతంగా ఉంటుంది మరియు ఈ వాక్యపు అధికారము సూచక క్రియలు మరియు అద్భుతాలకంటే మించినదై ఉంటుంది. వాక్యము మానవుని హృదయ లోతుల్లో పాతిపెట్టబడిన భ్రష్ట స్వభావాలన్నిటిని బట్టబయలు చేస్తుంది. నీవు స్వతహాగా వాటిని గుర్తించే అవకాశమే లేదు. వాక్యము ద్వారా అవి నీ ముందు తెరిచి ఉంచబడినప్పుడు, సహజంగానే నీవు వాటిని కనుగొనడానికి వస్తావు; నీవు వాటిని ఉపేక్షించలేవుమరియు నీవు పూర్తిగా ఒప్పించబడతావు. ఇది వాక్యాధికారము కాదా? ఇది నేటి వాక్యపు కార్యము ద్వారా సాధించిన ఫలితము. కాబట్టి, వ్యాధిని స్వస్థపరచడం మరియు దయ్యాలను వెళ్ళగొట్టడం ద్వారా మానవుడు తన పాపాల నుండి పూర్తిగా రక్షించబడడు, లేదా సూచక క్రియలు మరియు అద్భుతాలు జరగడం ద్వారా అతడు సంపూర్ణుడు కాలేడు. వ్యాధిని స్వస్థ పరచడానికి మరియు దెయ్యాలను వెళ్లగొట్టడానికి అధికారమును మానవునికి కృపయే అనుగ్రహించింది, కాని మానవుని శరీరం ఇప్పటికీ సాతానుకే చెందినది మరియు భ్రష్టుపట్టిన సాతాను స్వభావము ఇంకా మనవునిలో అలానే ఉంది. మరో మాటలో చెప్పాలంటే, శుద్ధి చేయబడనిది ఇప్పటికీ పాపానికి మరియు అపవిత్రతకు సంబంధించినదే. వాక్య ప్రాతినిధ్యం ద్వారా మానవుడు శుద్ధి చేయబడిన తర్వాత మాత్రమే అతడు దేవుని ద్వారా సంపాదించబడి పవిత్రీకరించబడతాడు. మానవుని నుండి దెయ్యాలు వెళ్లగొట్టబడి అతడు విమోచించబడినప్పుడు, దీనర్ధం అతడు సాతాను చేతిలో నుండి విడిపించబడి దేవుని యొద్దకు తిరిగి వచ్చాడంతే. ఏదేమైనా, దేవుని చేత పవిత్ర పరచబడకుండా లేదా మార్చబడకుండా, అతడు భ్రష్ట మానవుడిగానే ఉంటాడు. మానవునిలో అపవిత్రత, వ్యతిరేకత మరియు తిరుగుబాటుతనము ఇంకా ఉన్నాయి; మానవుడు ఆయన విమోచన ద్వారా మాత్రమే దేవుని యొద్దకు తిరిగి వచ్చాడు, కానీ అతనికి దేవుని గురించిన కనీస జ్ఞానం లేదు, అయినప్పటికీ ఆయనకు ఎదురాడగలడు మరియు ద్రోహం చేయగలడు. మానవుడు విమోచింపబడక ముందు, అప్పటికే సాతాను విష బీజాలు అతనిలో నాటబడ్డాయి మరియు సాతాను చేత వేల సంవత్సరాలుగా చెరచబడిన తర్వాత, అతడు దేవుని ఎదిరించే స్థిరమైన స్వభావాన్ని తనలో కలిగి ఉన్నాడు. కాబట్టి, మానవుడు విమోచించబడినప్పుడు, అది మానవుడిని అధిక మూల్యానికి కొన్న విమోచన దృష్టాంతము తప్ప మరేమీ కాదు, కానీ అతనిలో ఉన్న విషపూరిత స్వభావము మాత్రము తొలగిపోలేదు. అంతటి భ్రష్టుడైన మానవుడు దేవుని సేవ చేయడానికి అర్హుడయ్యే ముందు తప్పనిసరిగా మార్పు చెందాలి. ఈ తీర్పు మరియు శిక్ష కార్యము ద్వారా, మానవుడు తనలోని అపవిత్రమైన మరియు భ్రష్టుపట్టిన గుణగణాలను తెలుసుకుంటాడు, అతడు పూర్తిగా మార్పుచెంది పవిత్రుడు కాగలడు. ఈ విధంగా మాత్రమే మానవుడు దేవుని సింహాసనం ఎదుటకు తిరిగి రావడానికి అర్హుడు కాగలడు. ఈనాడు చేయబడిన కార్యమంతా మానవుని పవిత్ర పరిచి మార్చగలదు; తీర్పు ద్వారా మరియు వాక్యము యొక్క శిక్ష ద్వారా, అలాగే శుద్దీకరణ ద్వారా, మానవుడు తన భ్రష్టత్వాన్ని ప్రక్షాళన చేసుకుని పవిత్రుడు కాగలడు. ఈ దశ కార్యము రక్షణకు సంబంధించినదిగా భావించే బదులు, శుద్దీకరణ కార్యము అని చెప్పడం ఇంకా సముచితంగా ఉంటుంది. వాస్తవానికి ఈ దశ విజయానికి సంబంధించినది, అలాగే రక్షణ కార్యములోని రెండవ దశయైయున్నది. న్యాయతీర్పు ద్వారా మరియు వాక్యపు శిక్ష ద్వారా మానవుడు దేవుని చేత సంపాదించబడ్డాడు అనే స్థితికి చేరుకుంటాడు మరియు ఇది మానవుని హృదయంలోని సమస్త మలినాలను, భావనలను, ఉద్దేశాలను మరియు వ్యక్తిగత కాంక్షలను శుద్ధిచేసి, తీర్పు తీర్చి, బహిర్గతం చేయడానికి వాక్యాన్ని ఉపయోగించడం ద్వారా సంపూర్ణంగా బయలుపరచబడుతుంది. మానవుడు విమోచింపబడి తన పాపాలు క్షమించబడినదంతా, అది కేవలం దేవుడు మానవుని అతిక్రమాలను గుర్తుపెట్టుకోకుండా మరియు అతని అతిక్రమాలకు అనుగుణంగా మానవునిపట్ల ప్రవర్తించకుండా ఉండటానికి అన్నట్లుగానే పరిగణించబడుతుంది. అయితే, మాంసపు దేహంలో నివసించే మానవుడు, పాపము నుండి విడుదల పొందనప్పుడు, అతడు కేవలం పాపం చేయడమును కొనసాగిస్తూ, తన భ్రష్ట సాతాను స్వభావాన్ని నిరంతరం వెల్లడి చేస్తుంటాడు. ఇటువంటి జీవితాన్ని మనిషి జీవిస్తున్నాడు, పాపము చేయడం, క్షమించబడటం అనేది ఒక ఇతి వృత్తంగా మారిపోయింది. మానవజాతిలో అధిక భాగం పగటిపూట పాపము చేసేది కేవలం సాయంత్రం ఒప్పుకోడానికే. ఈ విధంగా, పాపపరిహారార్ధ బలి మానవునికి ఎప్పటికీ ఉపయోగకరంగా ఉన్నప్పటికీ కూడా, అది మానవుడిని పాపము నుండి రక్షించలేదు. మానవుడు భ్రష్ట స్వభావాన్ని ఇప్పటికీ కలిగి ఉన్నందున, రక్షణ కార్యము సగం మాత్రమే పూర్తి చేయబడింది. ఉదాహరణకు, తాము మోయాబు వంశస్థులని ప్రజలు గ్రహించినప్పుడు, వారు అభియోగపు మాటలు ముందుపెట్టి, జీవితాన్ని కొనసాగించటం మానేసి, పూర్తిగా ప్రతికూలంగా మారిపోయారు. మానవజాతి ఇంకా పూర్తిగా దేవుని ఆధిపత్యానికి లోబడలేకపోతుందని ఇది చూపడం లేదా? కచ్చితంగా ఇది వారి భ్రష్ట సాతాను స్వభావం కాదా? నీవు శిక్షకు లోబడనప్పుడు, నీ చేతులు అందరికంటే, యేసు కంటే కూడా ఎత్తుగా ఎత్తబడ్డాయి. “దేవుని ప్రియ కుమారునిగా ఉండండి! దేవుని సన్నిహితునిగా ఉండండి! సాతానుకు మొక్కడం కంటే మనం చనిపోవడమే మంచిది! పాత సాతాను పై తిరగబడండి! ఎర్రని మహా ఘట సర్పానికి విరోధముగా తిరగబడండి! ఎర్రని మహా ఘట సర్పము అధికారము నుండి దారుణంగా పడిపోవును గాక! దేవుడు మనల్ని సంపూర్ణులనుగా చేయును గాక!” అని మీరు పెద్ద స్వరముతో కేకలు వేశారు. మీ కేకలు అందరికంటే బిగ్గరగా ఉన్నాయి. కానీ అప్పుడు శిక్షించే సమయము వచ్చింది, మరోసారి, మానవజాతి భ్రష్ట స్వభావం బహిర్గతమైంది. అప్పుడు, వారి కేకలు ఆగిపోయాయి మరియు వారి తీర్మానము విఫలమయింది. ఇదీ మానవుని భ్రష్టత్వము; పాపముకంటే లోతుగా వెళుతూ, ఇది సాతానుచే నాటబడి మానవునిలో లోతుగా పాతుకుపోయింది. తన పాపాలు గురించి తెలుసుకోవటం మానవునికి అంత సులభం కాదు; అతనికి లోతుగా పాతుకుపోయిన తన స్వంత స్వభావాన్ని గుర్తించే దారి లేదు మరియు దీని ఫలితాన్ని సాధించడానికి అతడు వాక్యపు తీర్పుపై తప్పక ఆధారపడాలి. ఆ విధంగా మాత్రమే మానవుడు ఈ క్షణం నుండి క్రమంగా మార్పు చెందగలడు. మానవుడు తన స్వాభావికమైన భ్రష్ట స్వభావం గురించి అతనికి అవగాహన లేనందున గతంలో అలా అరిచాడు. ఈ మాలిన్యాలన్ని మానవుని లోపలి నుండే ఉద్భవిస్తాయి. తీర్పు మరియు శిక్షలు అమలయ్యే సుదీర్ఘ వ్యవధిలో, మానవుడు ఉద్రిక్త పూరితమైన వాతావరణంలో నివసించాడు. ఇదంతా వాక్యపు కార్యము ద్వారా సాధించబడలేదా? సేవకుల శ్రమకు ముందు నీవు కూడా పెద్ద స్వరంతో, “దేవుని రాజ్యంలోనికి ప్రవేశించండి! ఈ నామాన్ని అంగీకరించే వారందరూ దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు! అందరూ దేవునితో పాలుపంచుకుంటారు!” అని కేకలు వేయలేదా? సేవకులకు శ్రమ వచ్చినప్పుడు మాత్రం మీరు ఏడవరు. మొట్ట మొదట్లో, అందరూ, “ఓ దేవా! నీవు నన్ను ఎక్కడ ఉంచినా సరే, నీ నడిపింపుకు నేను లోబడతాను” అని ఏడ్చి ప్రార్థించారు. దేవుని వాక్కులు చదివిన తర్వాత, “నాకు పౌలుగా ఎవరు ఉంటారు?” అని అడిగినప్పుడు ప్రజలు, “నేను సిద్దంగా ఉన్నాను!” అని చెప్పారు. తరువాత వారు, “మరి యోబు విశ్వాసం సంగతి ఏంటి?” అనే వాక్కులు చూసినప్పుడు, “యోబు విశ్వాసాన్ని నాపై స్వీకరించడానికి నేను ఇష్టపడుతున్నాను. దేవా, దయచేసి నన్ను పరీక్షించు!” అని అన్నారు. సేవకులకు శ్రమ వచ్చినప్పుడు, వారు ఒక్కసారిగా కుప్పకూలి మరల లేచి నిలబడలేకపోయారు. ఆ తర్వాత, కొద్ది కొద్దిగా, వారి హృదయంలోని మాలిన్యాలు క్రమంగా తగ్గాయి. ఇది వాక్యము ద్వారా జరిగించబడింది కాదా? కాబట్టి, ఈ రోజు మీరు అనుభవించినవి వాక్యము ద్వారా సాధించబడిన ఫలితాలు, సూచక క్రియలు మరియు అద్భుతాలు చేయడం ద్వారా యేసు సాధించిన వాటికంటే కూడా గొప్పవి. నీవు చూసే దేవుని మహిమ మరియు నీవు చూసే దేవుని అధికారము సిలువ వేయబడటం ద్వారా, వ్యాధిని స్వస్థపరచడం మరియు దయ్యాలను వెళ్లగొట్టడం ద్వారా మాత్రమే కాదుకానీ ఆయన వాక్యపు తీర్పు ద్వారా మరింత ఎక్కువగా కనిపిస్తుంది. దేవుని అధికారం మరియు దేవుని శక్తి అనేది కేవలం సూచక క్రియలు చేయడం, వ్యాధిని స్వస్థపరచడం, మరియు దెయ్యాలను వెళ్లగొట్టడం మాత్రమే ఉండదని, అయితే దేవుని వాక్యము తీర్పు ద్వారా దేవుని అధికారాన్ని మరియు ఆయన సర్వశక్తిని బాగుగా వెల్లడి చేయగలదు.
ప్రస్తుతం మానవుడు సాధించినది ఏమిటి—అతని ప్రస్తుత స్థితి, జ్ఞానము, ప్రేమ, వినయము, విధేయత మరియు బుద్ధి—ఇవన్ని వాక్యపు తీర్పు ద్వారా సాధించబడిన ఫలితాలు. నీవు వినయముతో నేటి వరకు నిలవగలిగి ఉన్నావనే విషయం వాక్యపు ప్రాతినిధ్యము ద్వారానే సాధించబడుతుంది. శరీరధారియైన దేవుని కార్యము నిజంగా అసాధారణమైనదని మరియు మానవుడు సాధించలేనిది ఇందులో ఎంతో ఉన్నదని మరియు అవే రహస్యాలు మరియు అద్భుతాలను మానవుడు ఇప్పుడు చూస్తున్నాడు. అందువల్ల, అనేక మంది విధేయులయ్యారు. కొంతమంది వారి పుట్టిన రోజు నుండి ఎన్నడూ ఏ మనిషికి లోబడలేదు, అయినప్పటికీ నేడు వారు దేవుని వాక్కులను చూసినప్పుడు, వారు అలా చేశారని గమనించకుండానే పూర్తిగా లోబడ్డారు మరియు వారు పరిశీలనకైనా, లేదా మరేదైనా చెప్పడానికైనా సాహసించరు. మానవజాతి వాక్యపు అడుగున పడి, వాక్యపు తీర్పు కింద సాష్టాంగపడి ఉంటుంది. ఒకవేళ దేవుని ఆత్మ మానవుడితో నేరుగా మాట్లాడి ఉంటే, చాలావరకు దమస్కుకు వెళ్లే దారిలో పౌలు నేలపై పడిపోయిన విధంగా, మానవజాతి మొత్తం ప్రత్యక్షత వాక్కులు లేకుండానే పడిపోయి, స్వరానికి లోబడే వారు. ఒకవేళ దేవుడు ఈ విధంగా కార్యము చేస్తూ ఉండి ఉంటే, మానవుడు తన స్వంత భ్రష్టత్వాన్ని వాక్యపు తీర్పు ద్వారా తెలుసుకొని ఉండేవాడే కాదు మరియు రక్షణను పొందియుండేవాడు కాదు. శరీరధారునిగా మారటం ద్వారా మాత్రమే దేవుడు వ్యక్తిగతంగా తన వాక్కులను ప్రతి ఒక్క మానవుని చెవులలోనికి ప్రకటించగలడు, తద్వారా చెవులుగలవారందరూ ఆయన వాక్కులను విని ఆయన తీర్పు కార్యాన్ని వాక్యము ద్వారా పొందగలరు. మనిషి భయపడుతూ లోబడటానికి ఆత్మ సాక్షాత్కారంగా మారకుండా, కేవలం ఆయన వాక్యము ద్వారా సాధించబడిన ఫలితము ఇది. అనేక సంవత్సరాలుగా అంతరంగ లోతులో దాగి ఉన్న, మానవుని పాత స్వభావాన్ని ఈ ఆచరణాత్మకమైన ఇంకా అసాధారణమైన కార్యముద్వారా మాత్రమే పూర్తిగా బహిర్గతం చేయవచ్చు, తద్వారా మానవుడు దాన్ని గుర్తించి దాన్ని మార్చుకోగలడు. ఈ విషయాలన్నీ శరీరధారియైన దేవుని ఆచరణాత్మక కార్యము, దీనిలో, ఆచరణాత్మక విధానములో మాట్లాడటం మరియు తీర్పును అమలు పరచడాన్ని బట్టి, ఆయన వాక్యము ద్వారా మానవుని మీద తీర్పు ఫలితాలను సాధిస్తాడు. ఇదే శరీరధారియైనదేవుని అధికారము మరియు దేవుని శరీరావతారపు ప్రాధాన్యతయైయున్నది. శరీరధారియైన దేవునికి అధికారాన్ని తెలియజేయడానికి, వాక్యపు కార్యము ద్వారా సాధించబడిన ఫలితాలను తెలియజేయడానికి మరియు ఆత్మ శరీరునిగా వచ్చి వాక్యాన్ని బట్టి మానవుడిని తీర్పు తీర్చడం ద్వారా తన అధికారాన్ని వెల్లడి చేస్తాడని తెలియజేయడానికి ఇది జరిగింది. ఆయన శరీరము ఒక సాధారణమైన మరియు సామాన్యమైన మానవ స్వభావపు బాహ్య రూపము అయినప్పటికీ, ఆయన వాక్కులు సాధించే ఫలితాలు మానవునికి ఆయన సంపూర్ణ అధికారముతో నిండి ఉన్నాడని, ఆయనే దేవుడైయున్నాడని మరియు ఆయన వాక్కులు స్వయానా దేవుని వ్యక్తీకరణయై ఉన్నాయని చూపిస్తుంది. దీని ద్వారా ఆయనే దేవుడైయున్నాడని, ఆయనే శరీరధారునిగా మారిన దేవుడని, ఎవరి ద్వారాను ఆయన బాధింపబడడని, వాక్యమును బట్టి ఆయన తీర్పును ఎవరూ అధిగమించలేరనిమరియు ఆయన అధికారంపై ఏ అంధకార శక్తి పనిచేయదని సమస్త మానవజాతికి కనుపరచబడుతుంది. ఆయన శరీరునిగా మారిన వాక్యమైనందున, ఆయన అధికారాన్ని బట్టి, మరియు ఆయన వాక్యపు తీర్పును బట్టి, మానవుడు ఆయనకు పూర్తిగా లోబడతాడు. తన అవతారపు దేహము ద్వారా తీసుకురాబడిన కార్యమే ఆయన కలిగి ఉన్న అధికారము. ఆయన శరీరునిగా మారటానికిగల కారణం ఏమిటంటే శరీరము కూడా అధికారాన్ని కలిగి ఉండగలదు, మరియు ఆయన మానవజాతి మధ్యలో ఆచరణాత్మకమైన విధానంలో, మానవునికి కనిపించే మరియు స్పర్శించే విధంగా కార్యాన్ని జరిగించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు. ఈ కార్యము సర్వాధికారము కలిగియున్న దేవుని ఆత్మ నేరుగా జరిగించిన కార్యము కంటే ఇంకా ఎంతో వాస్తవికమైనది మరియు దాని ఫలితాలు కూడా స్పష్టంగా ఉన్నాయి. ఇది ఎందుకంటే దేవుని శరీరావతారము ఆచరణాత్మకమైన విధానంలో మాట్లాడగలదు మరియు పనిచేయగలదు. ఆయన శరీరపు బాహ్యరూపం ఎలాంటి అధికారాన్ని కలిగి ఉండదు మరియు ఏ మనిషియైనా ఆయన శరీరాన్ని చేరుకోగలడు. అయితే అతని గుణగుణాలు అధికారాన్ని కలిగి ఉంటాయి, కానీ ఆయన అధికారం ఎవరికీ కనబడదు. ఆయన మాట్లాడుతూ కార్యము చేసేటప్పుడు, మానవుడు ఆయన అధికారపు ఉనికిని గుర్తించలేడు; ఇది ఒక ఆచరణాత్మకమైన స్వభావపు కార్యాన్ని చేయడంలో ఆయనకు అనుకూలతను కల్పిస్తుంది. ఈ ఆచరణాత్మకమైన కార్యమంతా ఫలితాలను సాధించగలదు. ఈయన అధికారము కలిగి ఉన్నాడని ఏ మనిషి గుర్తించకపోయినప్పటికీ, లేక ఆయన తృణీకరించబద్దాడని చూడనప్పటికి, లేక ఆయన ఉగ్రతను చూడనప్పటికీ, దాచబడ్డ తన అధికారము, లేదా మరుగై ఉన్న ఆయన ఉగ్రత మరియు ఆయన బహిరంగంగా మాట్లాడే వాక్యాల ద్వారా ఆయన ఉద్దేశించిన ఫలితాలను సాధిస్తాడు. మరో మాటలో చెప్పాలంటే, ఆయన స్వర స్థాయి ద్వారా ఆయన మాటల్లోని దృఢత్వం మరియు ఆయన వాక్కులలోని సమస్త జ్ఞానము ద్వారా మానవుడు పూర్తిగా ఒప్పించబడతాడు. ఈ విధంగా, మానవుడు అధికారము లేనట్టుగా కనబడే, శరీరధారియైన దేవుని వాక్యానికి లోబడతాడు, తద్వారా మానవుని రక్షించాలన్న దేవుని లక్ష్యాన్ని నెరవేరుస్తాడు. ఇది ఆయన శరీర అవతారపు ప్రాముఖ్యత యొక్క మరో అంశమైయున్నది: మరింత వాస్తవికంగా మాట్లాడటం మరియు ఆయన వాక్కుల వాస్తవికతను మానవునిపై ప్రభావం చూపే అనుమతించడం, తద్వారా మానవుడు దేవుని వాక్యపు శక్తిని చూడగలడు. కాబట్టి, శరీరావతారము ద్వారా ఈ కార్యము జరగకపోతే, అది కనీసం ఫలితాలనైనా సాధించదు మరియు పాపాత్ములను సంపూర్ణంగా రక్షించలేదు. ఒకవేళ దేవుడు శరీరునిగా మారకపోతే, ఆయన మానవునికి కనిపించని మరియు స్పర్శించని ఆత్మగా మిగిలిపోతాడు. మానవుడు శరీర సంబంధమైన ఒక జీవి, అతడు మరియు దేవుడు రెండు వేర్వేరు లోకాలకు చెందినవారు మరియు విభిన్న స్వభావాలు కలిగి ఉంటారు. దేవుని ఆత్మ శరీర సంబంధమైన మానవునితో ఏకీభవించడు మరియు వారి మధ్య బంధాలు ఏర్పడటానికి ఎలాంటి అవకాశమే లేదు, మనిషి ఆత్మగా మారలేడని చెప్పనవసరమూ లేదు. ఇదిలా ఉంటే, దేవుని ఆత్మ తన మూల కార్యాన్ని చేయడానికి సృష్టించబడిన జీవిగా మారవలసి ఉన్నది. దేవుడు అత్యున్నత స్థానాన్ని అధిరోహించగలడు మరియు ఒక మానవ జీవిగా మారడానికి తనను తాను తగ్గించుకుని, మానవజాతిలో కార్యాన్ని చేస్తూ వారి మధ్య నివసించగలడు, కానీ మానవుడు అత్యున్నత స్థానాన్ని అధిరోహించలేడు మరియు ఒక ఆత్మగానూ మారలేడు, కనీసం అతి తక్కువ స్థాయికీ దిగజారలేడు. అందుకే దేవుడు తన కార్యాన్ని నిర్వహించడానికి తప్పనిసరిగా శరీరునిగా మారవలసి వచ్చింది. అదే సూచన ద్వారా, మొదటి శరీరావతారిగా వచ్చిన సమయంలో, ఆయన సిలువ కార్యము ద్వారా శరీరధారియైనదేవుని దేహము మాత్రమే మానవుని విమోచింపగలదు, అయితే మానవుని కొరకు పాపపరిహారార్ధ బలిగా దేవుని ఆత్మ సిలువ వేయబడటానికి అవకాశమే లేదు. మానవుని కోసం పాపపరిహారార్ధ బలిగా సేవ చేయడానికి దేవుడు నేరుగా శరీరునిగా మారగలడు, అయితే తన కొరకు దేవుడు సిద్ధపరచిన పాపపరిహారార్ధ బలిని తీసుకోవడానికి మానవుడు నేరుగా పరలోకానికి ఆరోహణము కాలేడు. ఇదిలా ఉండగా, ఇక సాధ్యమయ్యేదల్లా ఏమైనా ఉందా అంటే, అది మనిషి పతనమైనందున ఈ రక్షణను పొందుకోవడానికి మనిషి పరలోకానికి అధిరోహించకుండా, దేవుడే పరలోకానికి భూమికి తరచుగా వచ్చి వెళ్ళమని దేవుణ్ణి అడగడమే. మరియు అంతేగాకుండా, మానవుడు పరలోకాన్ని అంత సులభంగా అధిరోహించ లేడు పాపపరిహారార్ధ బలిని పొందలేడు. కాబట్టి, యేసు మానవజాతి మధ్యకు వచ్చి మానవుడు చేయలేని కార్యాన్ని వ్యక్తిగతంగా చేయడము అవసరమై ఉన్నది. దేవుడు శరీరునిగా మారిన ప్రతిసారి, అది పూర్తిగా అవసరతను బట్టే ఉంటుంది. ఒకవేళ దేవుని ఆత్మ ఏదైనా దశలను నేరుగా నిర్వహించి ఉంటే, శరీరధారి అయినందుకు కలిగిన అవమానానికి ఆయన లోనైయుండేవాడు కాదు.
కార్యపు ఈ చివరి దశలో, ఫలితాలనేవి వాక్యపు ప్రాతినిధ్యము ద్వారా సాధించబడతాయి. వాక్యము ద్వారా మానవుడు అనేక మర్మాలను మరియు గత తరాల ద్వారా దేవుడు జరిగించిన కార్యాన్ని గ్రహిస్తాడు; వాక్యము ద్వారా మానవుడు పరిశుద్దాత్మ జ్ఞానోదయాన్ని పొందుతాడు; వాక్యము ద్వారా ఇంతకు మునుపెన్నడూ గత తరాల ద్వారా బయలుపరచబడని మర్మాలను, అలాగే గత కాలాల్లో ప్రవక్తలు మరియు అపోస్తలుల ద్వారా జరగని కార్యాన్ని మరియు వారు పని చేసిన నియమాలను మానవుడు అర్థం చేసుకుంటాడు; వాక్యము ద్వారా మానవుడు స్వయాన దేవుని స్వభావాన్ని, అలాగే మానవుని తిరుగుబాటుతనాన్ని మరియు తిరస్కారమును అర్థం చేసుకుంటాడుమరియు అతడు తన సొంత గుణగణాలను తెలుసుకుంటాడు. ఈ కార్యపు దశల ద్వారా మరియు చెప్పబడిన వాక్యాల ద్వారా, మానవుడు ఆత్మ కార్యాన్ని, దేవుని అవతారపు దేహము చేసే కార్యాన్ని మనుష్యుడు తెలుసుకుంటాడు మరియు అంతేగాకుండా, ఆయన సంపూర్ణ స్వభావాన్ని కూడా తెలుసుకుంటాడు. ఆరు వేల సంవత్సరాలకు పైగా ఉన్న దేవుని నిర్వహణ కార్యము గురించిన నీకున్న జ్ఞానము కూడా వాక్యము ద్వారా సంపాదించిందే. మీ పూర్వపు భావనల తాలూకు జ్ఞానము మరియు వాటిని పక్కన పెట్టడంలోని మీ విజయము కూడా వాక్యము ద్వారా పొందినది కాదా? కిందటి దశలో, యేసు సూచక క్రియలు మరియు అద్భుతాలు చేశాడు, అయితే ఈ దశలో సూచక క్రియలు మరియు అద్భుతాలు లేవు. సూచక క్రియలు మరియు అద్భుతాలను దేవుడు ఎందుకు బయలుపరచడం లేదు అనే దాని మీద నీకున్న గ్రహింపు కూడా వాక్యం ద్వారా పొందినది కాదా? కాబట్టి, ఈ దశలో పలుకబడిన వాక్కులు గత తరాలకు చెందిన అపోస్తలులు మరియు ప్రవక్తల ద్వారా చేయబడిన కార్యాన్ని అధిగమించాయి. ప్రవక్తలు పలికిన ప్రవచనాలను కూడా ఈ ఫలితాన్ని సాధించలేకపోయాయి. ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలు కేవలంవారు భవిష్యత్తులో జరగబోయే దాని గురించి చెప్పడానికే గాని ఆ కాలంలో దేవుడు చేయాలనుకున్న కార్యం గురించి కాదు. అలాగే వారు తమ జీవితాల్లో మానవజాతికి ఉపదేశం చేయడానికి గాని, లేదా మానవజాతికి సత్యాలను అనుగ్రహించడానికి గాని, లేదా వారికి మర్మాలను బయలుపరచడానికి గాని చెప్పలేదు, జీవాన్ని అనుగ్రహించడానికి అస్సలే కాదు. ఈ దశలో పలికిన వాక్కులలో ప్రవచనము మరియు సత్యము ఉన్నాయి. అయితే ఈ వాక్కులు ముఖ్యంగా మానవునికి జీవితాన్ని అనుగ్రహిస్తాయి. ప్రస్తుత వాక్కులు ప్రవక్తల ప్రవచనాలకు భిన్నంగా ఉన్నాయి. ఇది ప్రవచనం చెప్పడం కోసం కాదు గాని, మానవుని జీవితానికి, మానవ జీవన విధానాన్ని మార్చే ఒక కార్యపు దశయైయున్నది. మొదటి దశ యెహోవా కార్యము: భూమి మీద మానవుడు దేవుణ్ణి ఆరాధించడానికి ఒక మార్గాన్ని సిద్ధ పరచడమే ఆయన కార్యము. అది భూమి మీద కార్యం జరుగుట కోసం ఒక మూల స్థలాన్ని కనుగొనే ప్రారంభ కార్యమైయున్నది. ఆ కాలంలో, యెహోవా ఇశ్రాయేలీయులకు విశ్రాంతి దినాన్ని ఆచరించాలని, తమ తల్లిదండ్రులను గౌరవించాలని, మరియు ఒకరితో నొకరు శాంతియుతంగా జీవించాలని బోధించాడు. మనిషి ఎందుకు నిర్మించబడ్డాడనే విషయం ఆనాటి ప్రజలకు అర్థం కాలేదు, అలాగే భూమి మీద ఎలా జీవించాలని వారికి గ్రహింపు లేదు. కార్యపు మొదటి దశలో తమ జీవితాలను నడిపించడం గురించి మానవజాతికి ఉపదేశించటం ఆయనకు అవసరమై ఉన్నది. యెహోవా వారితో చెప్పిందంతా ఇంతకుముందు మానవజాతికి తెలిసింది కాదు, లేదా వారి ఆధీనములో ఉండేది కాదు. ఆ కాలంలో, ప్రవచనాలు చెప్పడానికి దేవుడు అనేకమంది ప్రవక్తలను లేవనెత్తాడు మరియు వారందరూ యెహోవా మార్గదర్శనంలోనే ఆ విధంగా చేశారు. ఇది దేవుని కార్యంలో కేవలం ఒక అంశం మాత్రమే. మొదటి దశలో, దేవుడు శరీరావతారిగా రాలేదు, కాబట్టి ఆయన ప్రవక్తల ద్వారా దేశాలు మరియు గోత్రాలన్నిటికీ బోధించాడు. యేసు తన కాలంలో కార్యము చేసినప్పుడు, ఆయన ఈనాడు మాట్లాడినంత ఎక్కువగా ఆనాడు మాట్లాడలేదు. అంత్య దినాల్లోని వాక్యపు ప్రస్తుత కార్యపు దశ గత తరాల్లోను మరియు గత యుగాలలోను ఎన్నడూ జరగలేదు. యెషయా, దానియేలు, మరియు యోహానులు అనేక ప్రవచనాలు పలికినప్పటికీ, వారి ప్రవచనాలు ప్రస్తుతం చెప్పబడిన వాక్కులకు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. వారు చెప్పింది ప్రవచనాలు మాత్రమే, కానీ ఇప్పుడు చెప్పబడిన వాక్కులు కాదు. ఒకవేళ నేను మాట్లాడేదంతా ఇప్పుడు ప్రవచనాల్లోనికి గనుక నేను మారిస్తే, మీరు వాటిని అర్థం చేసుకోగలరా? నేను మాట్లాడింది నేను వెళ్లిపోయిన తరువాత సంగతులు గురించి అని అనుకుంటే, అప్పుడు నీవు ఎలా అర్థం చేసుకుంటావు? వాక్యపు కార్యమనేది యేసు కాలంలోను, లేదా ధర్మశాస్త్ర యుగములోను ఎన్నడూ జరగలేదు. బహుశా కొంతమంది, “యెహోవా కూడా తన కార్యపు సమయంలో వాక్కులను పలకలేదా? యేసు తాను కార్యము చేస్తున్న సమయంలో, రోగాన్ని స్వస్థపరచడం, దయ్యాలు వెళ్లగొట్టడం, సూచక క్రియలు మరియు అద్భుతాలు చేయడంతో పాటుగా, వాక్కులను కూడా మాట్లాడలేదా?” అని అంటారు. చెప్పబడిన సంగతుల మధ్య వ్యత్యాసాలు ఉన్నాయి. యెహోవా ఉపదేశించిన వాక్కులలోని అంతరార్థము ఏమిటి? మానవజాతి తమ జీవితాలను భూమిపై నడిపించుకోవడానికి మాత్రమే ఆయన ఉపదేశిస్తాడు, ఇది జీవితంలోని ఆధ్యాత్మిక సంగతులను తాకలేదు. యెహోవా మాట్లాడినప్పుడు, అది అన్ని ప్రాంతాల ప్రజలకు ఆదేశించబడినట్టుగా, ఎందుకు చెప్పబడింది? “ఆదేశించడం” అనే మాటకు స్పష్టంగా చెప్పడం మరియు నేరుగా ఆజ్ఞాపించడమని భావము. ఆయన మానవునికి జీవాన్ని అందించలేదు; బదులుగా, ఆయన కేవలం మానవుడిని చేతితో పట్టుకుని, ఉపమానాల ధోరణిలో ఎక్కువగా లేకుండా, ఆయనపట్ల ఎలా భయభక్తులు కలిగియుండాలని మానవునికి బోధించాడు. ఇశ్రాయేలులో యెహోవా చేసిన కార్యమనేది, మానవుని నడిపించడానికే గాని, అతనితో వ్యవహరించడానికి, లేదా క్రమశిక్షణలో పెట్టడానికి, లేదా తీర్పు మరియు శిక్షలు రప్పించడానికి కాదు. అరణ్యంలో మన్నాను పోగుచేయడానికి తన ప్రజలకు చెప్పమని యెహోవా మోషేకు ఆజ్ఞాపించాడు. ప్రతి ఉదయము సూర్యోదయానికి ముందు, వారు ఆ రోజు తినడానికి సరిపడా మన్నాను సేకరించాలి. మరుసటి రోజు వరకు మన్నాను ఉంచకూడదు, అప్పుడది బూజు పట్టినట్లు అవుతుంది. ఆయన ప్రజలకు ఉపన్యాసమివ్వలేదు, లేదా వారి స్వభావాలను బట్టబయలు చేయలేదు, లేదా వారి ఆలోచనలను మరియు ఉద్దేశ్యాలను బహిర్గతం చేయలేదు. ఆయన ప్రజలను మార్చలేదు, కానీ వారి జీవితాలను నడిపించుకోవడానికి వారికి ఉపదేశం చేశాడు. ఆ కాలపు ప్రజలు పిల్లలవంటి వారుగా ఉన్నారు, కొన్ని ప్రాథమిక చేతి కదలికలను మాత్రమే తప్ప, ఏమీ అర్థం చేసుకోలేని స్థితిలో ఉండేవారు, కాబట్టి యెహోవా జనసమూహాలకు ఉపదేశించడానికి మాత్రమే కట్టడలను ఆదేశించాడు.
సువార్తను వ్యాప్తి చేసే క్రమములో, యదార్థ హృదయంతో వెదికేవారందరూ ఈ దినాన చేసిన కార్యాన్ని బట్టి జ్ఞానాన్ని పొంది సంపూర్ణముగా ఒప్పించబడతారు, ప్రతి దశలో జరిగిన కార్యపు అంతర్గత కథనము, అంతరార్థము మరియు ప్రాముఖ్యతపట్ల నీవు ఒక స్పష్టమైన అవగాహనకు రావాలి. అలా చేయడాన్ని బట్టి, నీ ప్రసంగాన్ని వినడం ద్వారా, ఇతరులు యెహోవా కార్యాన్ని, యేసు కార్యాన్ని, ఇంకా అధికంగా, నేటి దేవుని సమస్త కార్యాన్ని, అలాగే కార్యపు మూడు దశల మధ్యగల సంబంధాలను మరియు వ్యత్యాసాలను అర్థం చేసుకోగలరు. అలా చేసినప్పుడు, వారు వినడం పూర్తయ్యే సరికి, మూడు దశలు ఒక దానితో ఒకటి అంతరాయాన్ని కలిగించవు, కానీ అవన్నీ ఒకే ఆత్మ కార్యమని ఇతరులు చూస్తారు. వారు వివిధ కాలాల్లో కార్యము చేసినప్పటికీ, అవి చేసే కార్యపు విధానము విభిన్నంగా ఉంటాయి మరియు పలికే వాక్కులు భిన్నంగా ఉంటాయి, అయినప్పటికీ వారు కార్యము చేసే నియమాలు మాత్రము ఒక్కటే మరియు ఒకే విధంగా ఉంటాయి. ఈ విషయాలన్నీ దేవుణ్ణి అనుసరించే ప్రజలందరూ గ్రహించవలసిన గొప్ప దర్శనములైయున్నాయి.