దేవుడిని ప్రేమించేవారు ఎప్పటికీ ఆయన వెలుతురులోనే జీవిస్తారు

దేవునిపై చాలా మ౦దికి ఉన్న నమ్మకం అనేది మతపరమైన విశ్వాసమే: వారు దేవుడిని ప్రేమి౦చడంలో అసమర్థులు, దేవుడి కోసం నిజంగా పరితపించకుండా, ఆయనను ఆరాధించకుండా, ఒక మరమనిషి లాగా మాత్రమే దేవుడిని అనుసరిస్తారు. వారు కేవలం ఆయనను మౌన౦గానే అనుసరిస్తారు. అనేకమ౦ది దేవుడిని విశ్వసిస్తారు కానీ, దేవుడిని ప్రేమి౦చేవారు చాలా కొద్దిమ౦ది మాత్రమే ఉంటారు; వీళ్లు విపత్తుకు భయపడి మాత్రమే దేవుడిని “గౌరవిస్తారు” లేదా దేవుడు సర్వోన్నతుడు మరియు సర్వశక్తిమంతుడు కాబట్టి వారు ఆయనను “ఆరాధిస్తారు”—కానీ, వారి గౌరవం మరియు ఆరాధనలో ప్రేమ లేదా నిజమైన ఆకాంక్ష ఉండదు. వారి అనుభవాలలో వారు అతి స్వల్పంగానే సత్యాన్ని లేదా కొన్ని నిరర్ధకమైన మర్మాలను కోరుకుంటారు. అనేకమంది సమస్యలు వచ్చినప్పుడు ఆశీర్వాదాలు పొందడానికి మాత్రమే దేవుడిని అనుసరిస్తారు; ఇలాంటి వారు దేవుడి ఆశీర్వాదాలు అందుకోవడం కోసం సత్యాన్ని అన్వేషించడం గానీ, లేదా దేవుడికి నిజ౦గా విధేయులై ఉండడం గానీ చేయరు. దేవుడిపై ప్రజలందరి విశ్వాసపు జీవితం అర్థరహితమైనది, దానికి విలువ లేదు మరియు దానిలో వారి వ్యక్తిగత పరిగణనలు మరియు అన్వేషణలు ఉంటాయి; వారు దేవుడిని ప్రేమించడం కోసం ఆయనను నమ్మరు, ఆశీర్వాదం పొందడానికే నమ్ముతారు. అనేకమంది తమకు నచ్చినట్లు నడుచుకుంటారు; వారికి కావల్సిందే వారు చేస్తారు, దేవుడి ఆసక్తులను లేదా వారు చేసేది దేవుడి సంకల్పానికి అనుగుణంగా ఉందా లేదా అనేది ఎన్నడూ పరిగణించరు. అలా౦టి వారు దేవుడి ప్రేమ సంగతి ఎలా ఉన్నా, నిజమైన విశ్వాసాన్ని కూడా సాధి౦చలేరు. దేవుడి తత్వం మనిషి విశ్వసించడం కోసం మాత్రమే కాదు; అంతకుమించి అది మనిషిని ప్రేమించడం కోసం. కానీ దేవుడిని నమ్మేవారిలో అనేకులు ఈ “మర్మాన్ని” తెలుసుకోలేరు. మనుష్యులు దేవుడిని ప్రేమి౦చే ధైర్యం చేయరు లేదా ఆయనను ప్రేమి౦చడానికి ప్రయత్ని౦చరు. దేవుడిలో ప్రేమించగలిగినది చాలా ఉందని వారు ఎప్పుడూ తెలుసుకోలేరు; దేవుడు అంటే, మనిషిని ప్రేమి౦చే దేవుడు అని మరియు ఆయన మనిషి ప్రేమి౦చడానికి ఉన్న దేవుడు అని వారెప్పుడూ తెలుసుకోలేరు. దేవుడి ప్రేమతత్వం ఆయన కార్యములో వ్యక్త౦ చేయబడింది: మనుష్యులు దేవుడి కార్యాన్ని అనుభవించినప్పుడు మాత్రమే ఆయన ప్రేమతత్వాన్ని తెలుసుకోగలరు; కేవలం వారి వాస్తవ అనుభవాలలో మాత్రమే దేవుడి ప్రేమతత్వాన్ని శ్లాఘించగలరు; దాన్ని నిజ జీవితంలో గమనించకుండా, దేవుడి ప్రేమతత్వాన్ని ఎవరూ తెలుసుకోలేరు. దేవుడిలో ప్రేమి౦చడానికి ఎ౦తో ఉ౦ది కానీ, నిజంగా ఆయనలో నిమగ్నం కాకు౦డా మనుష్యులు దానిని తెలుసుకోలేరు. దీని అర్థం ఏమిటంటే, దేవుడు దేహాన్ని ధరించకుంటే, మనుష్యులు వాస్తవానికి ఆయనలో నిమగ్నం కాలేరు, మరియు వారు నిజంగా ఆయనలో నిమగ్నం కాలేకపోతే, వారు ఆయన కార్యాన్ని కూడా అనుభవించలేరు—కాబట్టి దేవుడి పట్ల వారి ప్రేమ ఎంతో కపటం మరియు ఊహతో అపవిత్రం అవుతుంది. భూమి మీది దేవుడి ప్రేమ లాగా పరలోక౦లోని దేవుడి ప్రేమ వాస్తవమైనది కాదు, ఎ౦దుక౦టే, పరలోక౦లోని దేవుడి గురి౦చిన మనుష్యుల జ్ఞాన౦ వారు తమ కళ్ళతో చూసిన మరియు వారు వ్యక్తిగత౦గా అనుభవి౦చిన వాటిపై ఆధారపడి కాకుండా వారి ఊహల ఆధారంగా నిర్మి౦చబడుతుంది. దేవుడు భూమి మీదకు వచ్చినప్పుడు, ఆయన వాస్తవ కార్యాలను మరియు ఆయన ప్రేమతత్వాన్ని మనుష్యులు చూడగలరు మరియు ఆయన వ్యావహారిక మరియు సాధారణ స్వభావంలోని ప్రతిదానినీ చూడగలరు, ఇవన్నీ పరలోకంలో దేవుడి గురించిన జ్ఞానం కంటే వేల రెట్లు వాస్తవమైనవి. మనుష్యులు పరలోక౦లో దేవుడిని ఎ౦తగా ప్రేమిస్తున్నారనే దానితో సంబంధం లేకుండా, ఆ ప్రేమలో ఏమాత్రం నిజ౦ లేదు, అది మానవ భావనలతో ని౦డినది. భూమిపై దేవుడిపట్ల మనుష్యుల ప్రేమ ఎంత తక్కువగా ఉన్నప్పటికీ, ఆ ప్రేమ నిజమైనది; అది కొద్దిగా మాత్రమే ఉన్నప్పటికీ, అది ఇంకా వాస్తవమే. దేవుడు నిజమైన కార్యము ద్వారా, మనుష్యులు తన గురించి తెలుసుకునేలా చేస్తాడు మరియు ఈ జ్ఞానం ద్వారా ఆయన వారి ప్రేమను పొందుతాడు. పేతురు విషయంలోనూ ఇలాగే జరిగింది: ఆయన యేసుతో కలిసి జీవి౦చకు౦డా ఉండి ఉ౦టే, యేసును ఆరాధి౦చడ౦ ఆయనకు అసాధ్యమై ఉండేది. కాబట్టి, యేసుతో ఆయనకున్న సాన్నిహిత్యం లాగే, యేసు పట్ల ఆయన విధేయత కూడా అలాగే ఉ౦ది. మనిషి తనను ప్రేమించేలా చేయడానికి, దేవుడు మనుష్యుల మధ్యకు వచ్చి మనుష్యులతో కలిసి జీవిస్తాడు మరియు మనిషి చూసేలా మరియు అనుభవించేలా దేవుడు చేసేదంతా దేవుని వాస్తవికతను తెలియజేసే విషయాలే.

మనుష్యులను పరిపూర్ణులుగా చేయడానికి దేవుడు వాస్తవికతను మరియు యధార్థాల ఆగమనాన్ని ఉపయోగిస్తాడు; దేవుడి వాక్యములనేవి ఆయన మనుష్యులను పరిపూర్ణులుగా చేయడంలో ఒక భాగాన్ని నెరవేరుస్తాయి మరియు ఈ కార్యము మార్గనిర్దేశ౦ చేస్తుంది, మార్గాన్ని తెరుస్తుంది. దీన్ని దేవుని మాటల్లో చెప్పాలంటే, నీవు ఆచరణ మార్గాన్ని మరియు దార్శనికతల జ్ఞానాన్ని కనుగొనాలి. ఈ విషయాలను అవగాహన చేసుకోవడం ద్వారా, మనిషి తన వాస్తవ ఆచరణలో ఒక మార్గాన్ని మరియు దార్శనికతలను పొందుతాడు మరియు దేవుడి వాక్యముల ద్వారా అతను బోధను పొందగలడు; ఈ విషయాలు దేవుడి నుండి వచ్చాయని అతడు అర్థం చేసుకోగలడు మరియు బాగా వివేచన చేయగలడు. అవగాహన చేసుకున్న తర్వాత మనిషి తక్షణమే తప్పక ఈ వాస్తవికతలోకి ప్రవేశి౦చాలి, అతని వాస్తవ జీవిత౦లో దేవుడిని సంతృప్తి పరచడానికి దేవుని వాక్యములను తప్పక ఉపయోగి౦చాలి. దేవుడు నీకు అన్ని విషయాలలో దారి చూపుతాడు, నీకు ఆచరణ మార్గాన్ని సూచిస్తాడు మరియు ముఖ్యంగా ఆయన మనోహరమైనవాడని నీకు అనిపించేలా చేస్తాడు, నీలోని దేవుడి కార్యపు ప్రతి అడుగు నిన్ను పరిపూర్ణుడిగా చేయడానికి ఉద్దేశించబడిందని నీకు కనిపించేలా చేస్తాడు. నీవు దేవుడి ప్రేమను చూడాలనుకుంటే, నీవు నిజంగా దేవుడి ప్రేమను అనుభవించాలనుకుంటే, అప్పుడు నీవు తప్పకుండా వాస్తవికత లోతుకు వెళ్ళాలి, నీవు నిజ జీవితంలో తప్పకుండా లోతుకు వెళ్ళాలి మరియు దేవుడు చేసేదంతా ప్రేమ మరియు ముక్తి అని చూడాలి, ఆయన చేసేదంతా అపరిశుద్ధాన్ని మనుష్యులు త్యజించడానికి మరియు దేవుడి సంకల్పాన్ని సంతృప్తిపరచలేని మనిషిలోని విషయాలను మెరుగుదిద్దడానికి వీలు కల్పిస్తుంది. మనిషికి సమకూర్చడానికి దేవుడు వాక్యములను ఉపయోగిస్తాడు; మనుష్యులు అనుభవి౦చే౦దుకు నిజజీవిత పరిస్థితులను ఆయన ఏర్పాటు చేస్తాడు, మనుష్యులు దేవుడి పలు వాక్యములను ఆరగించి మరియు సేవిస్తే, వారు వాటిని నిజ౦గా ఆచరణలో పెట్టినప్పుడే, దేవుడి పలు వాక్యములను ఉపయోగి౦చి వారు తమ జీవితాలలోని కష్టాలన్నీ పరిష్కరి౦చుకోవచ్చు. అంటే, వాస్తవికత లోతుకు వెళ్ళడానికి నీకు తప్పకుండా దేవుడి వాక్యములు ఉండాలి; నీవు దేవుని వాక్యములను ఆరగించి సేవించకపోతే, మరియు దేవుని కార్యము లేకుండా ఉంటే, అప్పుడు నీకు నిజ జీవితంలో మార్గమే ఉండదు. నీవు దేవుడి వాక్యములను ఆరగించి మరియు సేవించకపోతే, అప్పుడు నీకు ఏదైనా జరిగినప్పుడు నీవు కలవరపడతావు. నీవు దేవుడిని ప్రేమించాలని మాత్రమే నీకు తెలుసు కానీ, నీకు ఏ విధమైన తేడా తెలుసుకునే సామర్థ్యం లేదు, ఆచరించడానికి ఎలాంటి మార్గం లేదు; నీవు గందరగోళానికి, అయోమయానికి గురవుతు౦టావు, నీవు కొన్నిసార్లు దేహాన్ని స౦తృప్తిపరచడ౦ ద్వారా దేవుడిని స౦తృప్తిపరిస్తున్నావని కూడా నమ్ముతావు—ఇదంతా దేవుడి వాక్యములను ఆరగించి మరియు సేవించకపోవడం వల్ల ఎదురైన పర్యవసానమే. అంటే అర్థం, నీవు దేవుడి వాక్యముల సహాయం లేకుండా మరియు కేవలం వాస్తవికత లోపలే గుడ్డిగా వెతుకుతుంటే, అప్పుడు నీవు ప్రాథమికంగా ఆచరణ మార్గాన్ని కనుగొనలేవు. అలా౦టి మనుష్యులకు దేవుడిని విశ్వసించడ౦ అ౦టే ఏమిటో అస్సలు అర్థ౦ కాదు, దేవుడిని ప్రేమి౦చడ౦ అ౦టే ఏమిటో వారికి ఇంకా తక్కువ అవగాహనే ఉంటుంది. దేవుడి వాక్యముల బోధను, మార్గదర్శకాన్ని ఉపయోగించి, నీవు తరచుగా ప్రార్థిస్తే, అన్వేషిస్తే, కోరుకుంటే, అలా చేయడం ద్వారా నీవు ఆచరించాల్సిన వాటిని కనుగొంటే, పరిశుద్ధాత్మ కార్యానికి అవకాశాలను వెతికితే, నిజంగా దేవుడికి సహకరిస్తే మరియు గందరగోళంగా, అయోమయంగా ఉండకపోతే, అప్పుడు నీకు నిజ జీవితంలో ఒక మార్గం ఉంటుంది మరియు నీవు నిజంగా దేవుడిని సంతృప్తి పరుస్తావు. నీవు దేవిడిని సంతృప్తి పరచినప్పుడు, నీ అంతరాత్మలో దేవుడి మార్గదర్శనం ఉంటుంది, ప్రత్యేకించి నీవు దేవునిచే ఆశీర్వదించబడతావు, అది నీకు ఆనందానుభూతిని ఇస్తుంది: నీవు ముఖ్యంగా దేవుడిని సంతృప్తిపరచానని గర్వపడతావు, నీవు లోలోపల ప్రకాశాన్ని అనుభూతి చెందుతావు మరియు నీ హృదయంలో నీవు స్పష్టత మరియు శాంతితో ఉంటావు. నీ మనస్సాక్షి ఓదార్పు పొ౦ది, ని౦దారోపణల ను౦డి విముక్తి చెందుతుంది, నీ సోదర సోదరీమణులను చూసినప్పుడు నీవు లోలోపల ఉల్లాసం పొందుతావు. దేవుడి ప్రేమను అనుభవించడం అ౦టే అర్థం ఇదే, ఇది మాత్రమే దేవుడిని నిజ౦గా ఆస్వాదించడం అవుతుంది. దేవుడి ప్రేమ యొక్క ఆనందానుభూతిని మనుష్యులు అనుభవ౦ ద్వారా పొ౦దుతారు: కష్టాలను అనుభవి౦చడ౦, సత్యాన్ని ఆచరణలో పెట్టడ౦ ద్వారా వారు దేవుడి దీవెనలను పొ౦దుతారు. దేవుడు నిజంగా నిన్ను ప్రేమిస్తున్నాడని, మనుష్యుల కోసం దేవుడు భారీ మూల్యాన్ని నిజంగా చెల్లించాడని, ఆయన ఓర్పుతో, దయతో చాలా వాక్యములు చెప్పాడని, ఎల్లప్పుడూ మనుష్యులను రక్షిస్తాడని మాత్రమే నీవు చెబితే, నీవు పలికిన ఈ మాటలన్నీ దేవుని ఆనందానికి ఒకవైపు మాత్రమే సూచిస్తాయి. అయినప్పటికీ, మనుష్యులు వారి నిజ జీవిత౦లో సత్యాన్ని ఆచరణలో పెట్టినప్పుడే గొప్ప ఆనందం—నిజమైన ఆన౦దం—ఉంటుంది, ఆతర్వాత వారి హృదయాలలో శాంతి మరియు స్పష్టత ఉంటాయి. వారి అంతరాత్మలో గొప్ప అనుభూతి చెందుతారు మరియు దేవుడు అత్యంత ప్రేమించదగినవాడని భావిస్తారు. నీవు చెల్లించిన మూల్యం న్యాయమైన దానికంటే అధికమని నీవు భావిస్తావు. నీ ప్రయత్నాలతో గొప్ప మూల్యం చెల్లించిన తరువాత, నీవు అంతరాత్మలో ప్రత్యేకించి ప్రకాశవంతంగా ఉంటావు: నీవు నిజ౦గా దేవుడి ప్రేమను ఆస్వాదిస్తున్నావని భావిస్తావు, దేవుడు మనుష్యుల రక్షణ కార్యాన్ని చేశాడని, ఆయన మనుష్యులను శుద్ధి చేయడమంటే వారిని పరిశుద్ధులను చేయడానికేనని మరియు మనుష్యులు నిజ౦గా ఆయనను ప్రేమిస్తున్నారో లేదో పరీక్షి౦చడానికే ఆయన ప్రయత్నిస్తాడని నీవు అర్థ౦ చేసుకు౦టావు. ఈ విధంగా నీవు ఎల్లప్పుడూ సత్యాన్ని ఆచరణలో పెడితే, అప్పుడు నీవు మెల్లమెల్లగా దేవుని కార్యము గురించి చాలావరకు స్పష్టమైన జ్ఞానాన్ని పొందుకుంటావు, ఆ సమయంలో నీ యెదుట ఉన్న దేవుని వాక్యములు స్ఫటికం వలె స్పష్టంగా ఉన్నాయని నీవు భావిస్తావు. అనేక సత్యాలను నీవు స్పష్టంగా అర్థం చేసుకోగలిగితే, అన్ని విషయాలను ఆచరణలో పెట్టడం సులభమని, నీవు ఏ సమస్యనైనా అధిగమించగలవని, ఏ ప్రలోభాన్నైనా అధిగమించగలవని భావిస్తావు మరియు నీకు ఏదీ ఒక సమస్యగా కనిపించదు, అది నీకు ఎంతో విముక్తినిస్తుంది మరియు స్వేచ్ఛనిస్తుంది. ఈ క్షణంలో, నీవు దేవుడి ప్రేమను ఆస్వాదిస్తావు మరియు దేవుడి నిజమైన ప్రేమ నీపై కురుస్తుంది. దార్శనికతలు ఉన్నవారిని, సత్యము కలిగిన వారిని, జ్ఞానముగలవారిని, ఆయనను నిజంగా ప్రేమి౦చే వారిని దేవుడు దీవిస్తాడు. మనుష్యులు దేవుని ప్రేమను చూడాలనుకుంటే, వారు తప్పకుండా నిజ జీవితంలో సత్యాన్ని ఆచరణలో పెట్టాలి, వారు తప్పకుండా బాధను సహించడానికి మరియు దేవుడిని సంతృప్తి పరచడానికి వారు ఇష్టపడే దానిని త్యజించడానికి తప్పకుండా సిద్ధంగా ఉండాలి మరియు వారి కళ్ళలో కన్నీళ్లు ఉన్నప్పటికీ, వారు దేవుడి హృదయాన్ని సంతృప్తి పరచగలగాలి. ఈ విధంగా దేవుడు నిన్ను తప్పక ఆశీర్వదిస్తాడు మరియు నీవు ఇలాంటి కష్టాన్ని సహిస్తే, దాని తర్వాత పరిశుద్ధాత్మ కార్యము అమలుచేయబడుతుంది. వాస్తవ జీవిత౦ ద్వారా, దేవుడి వాక్యములను అనుభవి౦చడ౦ ద్వారా, మనుష్యులు దేవుడి ప్రేమతత్వాన్ని చూడగలుగుతారు, దేవుడి ప్రేమను రుచి చూసినప్పుడే వారు ఆయనను నిజ౦గా ప్రేమి౦చగలుగుతారు.

దేవుణ్ణి ప్రేమించే వారు సత్యాన్ని ప్రేమించే వారు అయి ఉంటారు. సత్యాన్నిప్రేమిచ్చే వారు దాన్ని ఎంత ఎక్కువ ఆచరణలో పెడితే వారు అంత ఎక్కువ దేవుడి ప్రేమను కలిగి ఉంటారు; వారు సత్యాన్ని ఎంత ఎక్కువ ఆచరణలో పెడితే, అంత ఎక్కువ దేవుడిచే దీవించబడతారు. ఈ విధంగా ఎల్లప్పుడూ నీవు ఆచరిస్తే, పేతురు దేవుడిని తెలుసుకున్నట్లే, నీ యెడల గల దేవుని ప్రేమను నీవు మెల్లమెల్లగా చూడగలిగేలా చేస్తుంది: దేవుడికి భూమ్యాకాశాలను మరియు సమస్త విషయాలను సృష్టి౦చే జ్ఞాన౦ మాత్రమే కాకుండా, అంతకుమించి, మనుష్యులలో నిజమైన కార్యాన్ని చేయడానికి కూడా ఆయనకు జ్ఞాన౦ ఉ౦దని పేతురు చెప్పాడు. ఆయన భూమ్యాకాశాలను మరియు సమస్త విషయాలను సృష్టి౦చిన కారణంగా మనుష్యుల ప్రేమకు మాత్రమే అర్హుడు కాదు, అ౦తకుమించి, మనిషిని సృష్టి౦చడానికి, మనిషిని కాపాడడానికి, మనిషిని పరిపూర్ణుడిగా చేయడానికి మరియు మనిషికి తన ప్రేమను ఇవ్వడానికి తనకున్న సామర్థ్య౦ వల్ల దేవుడు మనుష్యుల ప్రేమకు అర్హుడని పేతురు చెప్పాడు. కాబట్టి, మానవుని ప్రేమకు అర్హమైనది దేవునిలో చాలా ఉందని కూడా పేతురు చెప్పాడు. పేతురు యేసుతో ఇలా అన్నాడు: “భూమ్యాకాశాలను మరియు సమస్త విషయాలను సృష్టించడం వల్ల మాత్రమే నీవు మనుష్యుల ప్రేమకు అర్హుడవు అయ్యావా? మనిషి ప్రేమించదగినది నీలో మరెంతో ఉంది. నిజ జీవితంలో నీ నడవడిక, ప్రవర్తన, నీ ఆత్మ నా అంతరాత్మను తాకుతుంది, నీవు నన్ను క్రమశిక్షణలో ఉ౦చుతావు, నీవు నన్ను దండిస్తావు—ఈ విషయాలన్నీ నీవు మనుష్యుల ప్రేమను పొందడానికి మరి౦త అర్హమైనవి.” నీవు దేవుడి ప్రేమను చూడాలనుకుంటే, అనుభవించాలనుకుంటే, నిజ జీవితంలో నీవు తప్పకుండా అన్వేషించాలి మరియు ఆకాక్షించాలి మరియు నీ సొంత దేహాన్ని పక్కన పెట్టడానికి తప్పకుండా సిద్ధపడాలి. నీవు తప్పకుండా ఈ సంకల్పం తీసుకోవాలి. నీవు తప్పకుండా అన్ని విషయాలలో దేవుడిని సంతృప్తిపరచగల సంకల్పం ఉన్న, సోమరితనం లేని లేదా దేహ సౌఖ్యాలను ఆశించని, దేహం కోసం కాకుండా, దేవుని కోసం జీవించే వ్యక్తి అయి ఉండాలి. నీవు దేవుడిని సంతృప్తిపరచని కొన్ని సందర్భాలు కూడా ఉండవచ్చు. ఎందుకంటే, నీవు దేవుడి సంకల్పాన్ని అర్థం చేసుకోలేదు; మరోసారి, దానికి ఎక్కువ శ్రమ అవసరమైనప్పటికీ, నీవు తప్పకుండా ఆయనను సంతృప్తిపరచాలి, ఎలాంటి పరిస్థితుల్లో కూడా దేహాన్ని సంతృప్తిపరచకూడదు. నీవు ఈ విధంగా అనుభవం పొందినప్పుడు, నీవు దేవుడిని తెలుసుకుంటావు. దేవుడు భూమ్యాకాశాలను మరియు సమస్త విషయాలను సృష్టి౦చగలడని, మనుష్యులు ఆయనను యధార్థంగా చూడగలిగేలా, వాస్తవంగా ఆయనతో వ్యవహరించగలిగేలా చేయడానికి ఆయన దేహం ధరించాడని నీవు చూస్తావు; ఆయన ప్రేమతత్వాన్ని చూడడానికి మరియు ఆయన క్రమశిక్షణను, ఆయన శిక్షను, ఆయన దీవెనలను అనుభవి౦చడానికి మనుష్యులకు వీలుకల్పిస్తూ, ఆయన మనుష్యుల మధ్య నడవగలగడాన్ని, ఆయన పరిశుద్ధాత్మ నిజ జీవిత౦లో మనుష్యులను పరిపూర్ణులుగా చేయగలగడాన్ని నీవు చూస్తావు. ఈ విధంగా నీవు ఎల్లప్పుడూ అనుభవాన్ని పొందితే, నిజ జీవితంలో నీవు దేవుడి నుండి వేరుగా ఉండవు, దేవునితో నీ సంబంధం ఏదైనా ఒక్క రోజు మామూలుగా లేకుండా నిలిచిపోయినప్పటికీ, నీవు అవమానంగా నొచ్చుకోగలుగుతావు మరియు పశ్చాత్తాపపడగలుగుతావు. దేవుడితో నీవు మామూలు సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు, దేవుడిని వదిలిపెట్టడానికి నీవు ఎన్నడూ ఇష్టపడవు, ఏదైనా ఒక్క రోజు దేవుడు నిన్ను వదిలిపెడతానని చెబితే, నీవు భయపడతావు మరియు దేవుడి చేత వదిలివేయబడి ఉండడానికి బదులుగా చనిపోతానని కూడా చెబుతావు. నీకు ఈ భావోద్వేగాలు కలిగిన వెంటనే, నీవు దేవుడిని వదిలిపెట్టలేవని భావిస్తావు, ఈ విధంగా, నీకు ఒక పునాది ఉంటుంది మరియు దేవుని ప్రేమను నిజంగా ఆస్వాదిస్తావు.

మనుష్యులు దేవుడిని తమ జీవంగా ఉ౦డనివ్వడ౦ గురి౦చి తరచుగా మాట్లాడతారు, కానీ వారి అనుభవ౦ ఇ౦కా ఆ దశకు చేరుకోలేదు. దేవుడు నీ జీవం అని, ప్రతిరోజూ ఆయన నీకు మార్గనిర్దేశం చేస్తాడని, ప్రతిరోజూ నీవు ఆయన వాక్యములను ఆరగించి సేవిస్తావని మరియు ప్రతిరోజూ నీవు ఆయనను ప్రార్థిస్తావని, అందుకే ఆయన నీ జీవంగా మారాడని ఊరికే చెబుతుంటావు. ఈ విధంగా చెప్పే వారి జ్ఞానం పూర్తిగా పైపైనే ఉంటుంది. అనేకమందిలో దానికి సంబంధించి పునాది లేదు; దేవుడి వాక్యములు వారి లోపల నాటబడ్డాయి కానీ, అవి ఇంకా మొలకెత్త లేదు, ఏదైనా ఫలాన్ని ఇచ్చే అవకాశమే లేదు. ఈరోజు, నీవు ఏమేరకు అనుభవించావు? కేవలం ఇప్పుడు, దేవుడు ఇంత దూరం రమ్మని నిన్ను బలవంతపెట్టిన తరువాత, నీవు దేవుడిని వదిలిపెట్టలేనని అనుకుంటున్నావా. ఏదైనా ఒకరోజు, నీ అనుభవం ఒక నిర్దిష్ట దశకు చేరుకున్నప్పుడు, నీవు దేవుడిని వదిలిపెట్టేలా దేవుడు చేసినప్పటికీ, నీవు ఆ పని చేయలేవు. నీ అంతరాత్మలో దేవుడు లేకుండా నీవు ఉండలేవని ఎల్లప్పుడూ భావిస్తావు; భర్త, భార్య లేదా పిల్లలు లేకుండా, కుటుంబం లేకుండా, తల్లి లేదా తండ్రి లేకుండా, దేహ సౌఖ్యాలు లేకుండా నీవు ఉండగలవేమో కానీ, దేవుడు లేకుండా ఉండలేవు. దేవుడు లేకు౦డా ఉ౦డట౦ అంటే నీ జీవాన్ని కోల్పోయినట్లే అన్నట్లుగా ఉ౦టు౦ది; దేవుడు లేకుండా నీవు జీవించలేవు. నీవు ఈ దశను అనుభవించినప్పుడు, దేవుడిపై నీకున్న విశ్వాసపు చరమ బిందువును చేరుకొని ఉంటావు, ఈ విధంగా, దేవుడు నీ జీవంగా మారుతాడు, నీ అస్థిత్వానికి ఆయన పునాది అవుతాడు. ఇంకెప్పుడూ నీవు దేవుడిని వదిలిపెట్టలేవు. నీవు ఈమేరకు అనుభవించినప్పుడు, దేవుడి ప్రేమను నీవు నిజంగా ఆస్వాదిస్తావు, దేవుడితో నీకు తగినంత సన్నిహిత సంబంధం ఉన్నప్పుడు, ఆయన నీ జీవంగా, నీ ప్రేమగా ఉంటాడు, ఆ సమయంలో నీవు దేవుడిని ప్రార్థించి, ఇలా చెబుతావు: “ఓ ప్రభువా! నేను నిన్ను వదిలిపెట్టలేను. నీవే నా జీవం. మిగతావేవీ లేకపోయినా నేను జీవించగలను—కానీ నీవు లేకుండా, నేను జీవించలేను.” ఇదే మనుష్యుల నిజమైన స్థాయి; ఇదే నిజమైన జీవితం. కొంతమంది ఈరోజు వారున్న స్థితి వరకు బలవంతంగా తీసుకురాబడ్డారు: వారికి ఇష్టమున్నా లేకపోయినా వారు ముందుకుసాగాలి, వారు ఒక బండ మరియు గట్టి నేలకు మధ్య ఇరుక్కుపోయినట్లు ఎల్లప్పుడూ భావిస్తారు. దేవుడు నీ జీవం అన్నట్లు నీవు తప్పకుండా భావించాలి, ఎంతగా అంటే నీ హృదయం నుండి దేవుడిని తీసివేస్తే, అది నీ జీవాన్ని కోల్పోయినట్లుగా ఉంటుంది; దేవుడు తప్పకుండా నీ జీవంగా ఉండాలి మరియు నీవు ఆయనను వదిలిపెట్టలేని వ్యక్తిగా ఉండాలి. ఈ విధంగా, దేవుడిని నీవు వాస్తవంగా అనుభవిస్తావు, ఆ సమయంలో, నీవు దేవుడిని ప్రేమించినప్పుడు, నీవు దేవుడిని నిజంగా ప్రేమిస్తావు మరియు అది అద్భుతమైన, స్వచ్ఛమైన ప్రేమ అవుతుంది. ఒకరోజు, నీ జీవితం ఒక నిర్దిష్ట దశకు చేరుకున్నట్లుగా నీ అనుభవాలు ఉంటాయి, నీవు దేవుడిని ప్రార్థించినప్పుడు మరియు దేవుడి వాక్యములను ఆరగించి, సేవించినప్పుడు, నీ అంతరాత్మలో దేవుడిని వదిలిపెట్టలేవు లేదా నీవు మరిచిపోవాలనుకున్నా ఆయనను మరచిపోలేవు. దేవుడు నీ జీవంగా మారుతాడు; నీవు ఈ ప్రపంచాన్ని మరచిపోవచ్చు, నీ భార్య, భర్త లేదా పిల్లలను మరిచిపోవచ్చు, కానీ దేవుడిని మరచిపోవడం నీకు కష్టం అవుతుంది—అలా చేయడం నీ వల్ల కాదు, ఇదే నీ నిజమైన జీవితం మరియు దేవుని పట్ల నీ నిజమైన ప్రేమ అవుతుంది. దేవుని పట్ల మనుష్యుల ప్రేమ ఒక నిర్దిష్ట దశకు చేరుకున్నప్పుడు, మరేదైనా దానిపట్ల వారికున్న ప్రేమ దేవుని పట్ల వారికున్న ప్రేమకు సమానం కాదు; దేవుని పట్ల వారికున్న ప్రేమ మొదటి స్థానంలో నిలుస్తుంది. ఈ విధ౦గా మిగతావన్నీ నీవు వదులుకోగలుగుతావు, దేవుడి ను౦డి అన్ని కార్యాలను, కత్తిరింపులను అ౦గీకరి౦చడానికి సిద్ధ౦గా ఉంటావు. మిగతా అన్నింటినీ మించి నీవు దేవుడి యందు ప్రేమను సాధించినప్పుడు, నీవు వాస్తవికతలో మరియు దేవుడి ప్రేమలో జీవిస్తావు.

మనుష్యుల ఆత్మలలో దేవుడు జీవ౦గా మారిన వెనువె౦టనే మనుష్యులు దేవుడిని వదిలిపెట్టలేని వారుగా మారిపోతారు. ఇది దేవుడి కార్యము కాదా? ఇంతకంటే గొప్ప సాక్ష్యం లేదు! దేవుడు ఒక నిర్దిష్ట బిందువు వరకు పనిచేశాడు; సేవ చేయాలని, శిక్షించబడాలని లేదా మరణించాలని ఆయన మనుష్యులకు చెప్పాడు, అయితే మనుష్యులు వెనడుగు వేయలేదు, అంటే వారు దేవుడిచే గెలుచుకోబడ్డారని ఇది రుజువు చేస్తుంది. సత్యమును పొందిన మనుష్యులు ఎవరంటే, వారి నిజమైన అనుభవాలలో, వారి సాక్ష్య౦లో స్థిరంగా నిలబడగలిగేవారు, వారి స్థాన౦లో స్థిర౦గా నిలబడగలిగేవారు, దేవుని పక్షాన నిలబడగలిగేవారు, ఎన్నడూ వెనక్కి పోకు౦డా, దేవుడిని ప్రేమి౦చే వ్యక్తులతో సాధారణ స౦బ౦ధాన్ని కలిగి ఉ౦డగలిగేవారు, వారికి ఏవైనా జరిగినప్పుడు, దేవుడికి పూర్తిగా విధేయతతో ఉండగలరు మరియు మరణం వరకు దేవుడికి విధేయత చూపగలరు. నిజ జీవితంలో నీ ఆచరణ మరియు వ్యక్తీకరణలు దేవుడికి సాక్ష్యం, అవి మనిషి జీవనానికి మరియు దేవుడికి సాక్ష్యం, ఇదే దేవుని ప్రేమను నిజంగా ఆస్వాదించడం; నీవు ఈ దశను అనుభవించినప్పుడు, తగిన ప్రతిఫలం సాధించబడి ఉంటుంది. నీవు వాస్తవమైన జీవనాన్ని కలిగి ఉంటావు మరియు నీ ప్రతి పనిని ఇతరులు అద్భుతంగా చూస్తారు. నీ దుస్తులు, బాహ్యరూపం సామాన్యంగా ఉంటాయి, కానీ నీవు అత్యంత దైవభక్తితో కూడిన జీవనాన్ని గడుపుతావు మరియు దేవుడి వాక్యములను నీవు చెప్పినప్పుడు, ఆయనచే నీవు మార్గనిర్దేశం చేయబడతావు మరియు బోధ పొందుతావు. నీవు నీ మాటల ద్వారా దేవుడి సంకల్పాన్ని మాట్లాడగలుగుతావు, వాస్తవికతను తెలియజేయగలుగుతావు మరియు పరిశుద్ధాత్మతో సేవ చేయడం గురించి బాగా అవగాహన చేసుకోగలుగుతావు. నీవు నీ మాటల్లో నిష్కపట౦గా ఉంటావు, నీవు మర్యాదగా, సత్యవంతుడుగా, వివాదరహితుడిగా, వినయముగలవానిగా ఉంటావు, దేవుడి ఏర్పాట్ల పట్ల విధేయత చూపగలవానిగా ఉంటావు, నీకు ఏమైనా జరిగినప్పుడు నీ సాక్ష్య౦లో స్థిర౦గా నిలబడగలుగుతావు, నీవు ఏమి చేస్తున్నా ప్రశా౦త౦గా, నెమ్మదిగా ఉ౦టావు. ఈ రకమైన వ్యక్తే నిజంగా దేవుడి ప్రేమను చూస్తాడు. కొంతమంది ఇంకా యవ్వనులు అయినప్పటికీ, వారు మధ్యవయస్కులు లాగా వ్యవహరిస్తారు; వారు పరిపక్వతగలవారు, సత్యము ఉన్నవారు, ఇతరులచే ప్రశంసించబడేవారు—వీరే సాక్ష్యము గలవారు మరియు దేవుడి స్వరూపం. అనగా, వారు ఒక నిర్దిష్ట దశను అనుభవించినప్పుడు, దేవుని పట్ల వారు లోలోపల అంతర్దృష్టిని కలిగి ఉంటారు మరియు వారి బాహ్య స్వభావం కూడా స్థిరంగా ఉంటుంది. అనేకమ౦ది సత్యాన్ని ఆచరణలో పెట్టరు మరియు వారు సాక్ష్య౦లో స్థిరంగా నిలబడరు. అలా౦టి మనుష్యులలో దేవుని పట్ల ప్రేమ గానీ లేదా దేవుడికి సాక్ష్య౦ గానీ ఉండవు, ఈ మనుష్యులనే దేవుడు ఎ౦తో అసహ్యి౦చుకుంటాడు. వీళ్లు కూడికలలో దేవుడి వాక్యములను చదువుతారు, కానీ వీళ్ల జీవనశైలి సాతాను అనుసరణగా ఉంటుంది, ఇది దేవుడిని అగౌరవపరచడం, దేవుడిని నిందించడం మరియు దేవుడిని దూషించడమే అవుతుంది. ఇలాంటి మనుష్యులలో, దేవుని ప్రేమజాడ ఉండదు మరియు వారిలో ఏమాత్రం పరిశుద్ధాత్మ కార్యము ఉండదు. కాబట్టి, మనుష్యుల మాటలు మరియు పనులు సాతానుకు ప్రాతినిధ్యం వహిస్తాయి. నీ హృదయం ఎల్లప్పుడూ దేవుడి యెదుట శాంతంగా ఉంటే, మరియు నీవు ఎల్లప్పుడూ నీ చుట్టూ ఉన్న వ్యక్తులు, వస్తువులు మరియు నీ చుట్టూ ఏమి జరుగుతోందనే వాటి పట్ల శ్రద్ధ వహిస్తే, నీవు దేవుడి భారం పట్ల జాగరూకతతో ఉంటే, ఎల్లప్పుడూ దేవుడిని గౌరవించే హృదయంతో ఉంటే, అప్పుడు దేవుడు తరచుగా నీకు లోపల బోధ కలుగజేస్తాడు. సంఘంలో “పర్యవేక్షకులు” అయిన వ్యక్తులు ఉంటారు: వారు ఇతరుల వైఫల్యాలను చూడడానికి పూనుకుంటారు మరియు వారిని నకలు చేసి అనుకరిస్తారు. వారు తేడాలను చూడలేరు, వారు పాపాన్ని ద్వేషించరు మరియు సాతాను పనులను అసహ్యించుకోరు లేదా ద్వేషించరు. అలాంటి వారిలో సాతాను విషయాలు నిండి ఉంటాయి మరియు వారు అంతిమంగా దేవుడిచే పూర్తిగా తృణీకరించబడతారు. నీ హృదయం ఎల్లప్పుడూ దేవుని పట్ల గౌరవంతో ఉండాలి, నీవు నీ మాటలలో మరియు పనులలో మితంగా ఉండాలి మరియు దేవుడిని ఎప్పుడూ వ్యతిరేకించాలని లేదా కలత పెట్టాలని అనుకోకూడదు. నీ లోపల దేవుడి కార్యము ఏమీ చేయకుండా ఉండాలని లేదా నీవు అనుభవించిన కష్టమంతా మరియు నీవు ఆచరణలో పెట్టినవన్నీ నిష్ఫలం కావాలని నీవు ఎప్పుడూ కోరుకోకూడదు. నీ ముందున్న మార్గంలో మరింత కష్టపడి పనిచేయడానికి మరియు దేవుడిని మరింత ప్రేమించడానికి నీవు తప్పకుండా సిద్ధంగా ఉండాలి. వీళ్లే దార్శనికతను పునాదిగా కలిగి ఉన్న మనుష్యులు. వీరే పురోగతిని కోరుకునే మనుష్యులు.

మనుష్యులు దేవుడిని విశ్వసిస్తే, మరియు దేవుడిని గౌరవించే హృదయంతో దేవుని వాక్యములను అనుభవిస్తే, అలాంటి మనుష్యులలో దేవుడి రక్షణ మరియు దేవుడి ప్రేమను చూడవచ్చు. ఈ మనుష్యులు దేవుడి గురించి సాక్ష్యమివ్వగలరు; వారు సత్యముతో జీవిస్తారు మరియు దేవుడు అంటే ఏమిటి మరియు దేవుడి స్వభావం ఏమిటి అనే సత్యానికే వారు సాక్ష్యమిస్తారు. వారు దేవుడి ప్రేమ మధ్య జీవిస్తారు మరియు దేవుడి ప్రేమను చూస్తారు. మనుష్యులు దేవుడిని ప్రేమించాలనుకుంటే, వారు తప్పకుండా దేవుడి ప్రేమ తత్వాన్ని రుచి చూడాలి మరియు దేవుని ప్రేమ తత్వాన్ని దర్శించాలి; అప్పుడు మాత్రమే వారిలో దేవుడిని ప్రేమించే హృదయం, దేవుడి కోసం తమను తాము అర్పించుకునేలా మనుష్యులకు ప్రేరణ ఇచ్చే హృదయం మేల్కొంటుంది. మనుష్యులు మాటలు మరియు వ్యక్తీకరణలతో లేదా వారి ఊహలతో తనను ప్రేమించేలా దేవుడు చేయడు మరియు తనను ప్రేమించాల్సిందిగా మనుష్యులను ఆయన బలవంతం చేయడు. దానికి బదులుగా, వారి సొంత ఇష్టానుసారం ఆయనను ప్రేమించేలా చేస్తాడు మరియు ఆయన తన కార్యములో, మాటలలో తన ప్రేమ తత్వాన్ని వారు చూసేలా చేస్తాడు, ఆ తర్వాత వారిలో దేవుని పట్ల ప్రేమ పుడుతుంది. ఈ విధంగా మాత్రమే మనుష్యులు దేవుడికి నిజంగా సాక్ష్యమివ్వగలుగుతారు. దేవుడిని ప్రేమించాలని ఇతరులు వారిని కోరడం వల్లనో, లేకపోతే అది ఒక క్షణికమైన భావోద్వేగ ప్రేరణ కావడం వల్లనో మనుష్యులు దేవుడిని ప్రేమించరు. వారు దేవుడిని ప్రేమించడానికి కారణం, వారు ఆయన ప్రేమను చూశారు, మనుష్యుల ప్రేమకు అర్హమైనది ఆయనలో ఎంతో ఉందని వారు గ్రహించారు. వారు దేవుడి రక్షణ, జ్ఞానం మరియు అద్భుతమైన కార్యములను చూశారు—ఫలితంగా, వారు నిజంగా దేవుడిని స్తుతిస్తారు మరియు నిజంగా ఆయన కోసం పరితపిస్తారు మరియు దేవుడిని పొందకుండా జీవించలేని తీవ్ర ఆకాంక్ష వారిలో పుడుతుంది. దేవుడి గురించి నిజంగా సాక్ష్యమిచ్చే వారు దిక్కులు పిక్కటిల్లేలా ఆయనకు సాక్ష్యం ఇవ్వగలగడానికి కారణం ఏమిటంటే, వారి సాక్ష్యం నిజమైన జ్ఞానం మరియు దేవుడి పట్ల నిజమైన ఆకాంక్ష అనే పునాదిపై ఆధారపడి ఉంటుంది. అలాంటి సాక్ష్యం ఒక భావోద్వేగ ప్రేరణ ప్రకారం ఇవ్వబడదు, కానీ దేవుడి గురించి మరియు ఆయన స్వభావం గురించి వారికున్న జ్ఞానం ప్రకారం ఇవ్వబడుతుంది. వారు దేవుడిని తెలుసుకున్నారు కాబట్టి, వారు దేవుడి గురించి ఖచ్చితంగా సాక్ష్యమివ్వాలని మరియు దేవుడి కోసం పరితపించే వారందరూ దేవుడిని తెలుసుకునేలా, దేవుడి ప్రేమ మరియు ఆయన వాస్తవికతను తెలుసుకునేలా చేయాలని భావిస్తారు. దేవుడి యందు మనుష్యుల ప్రేమ లాగే, వారి సాక్ష్యం కూడా సహజసిద్ధమైనదిగా ఉంటుంది; ఇది నిజమైనది మరియు నిజమైన ప్రాముఖ్యత మరియు విలువ కలిగినది. ఇది ఉదాశీనమైనది లేదా డొల్లగా ఉండేది మరియు అర్థహీనమైనది కాదు. దీనికి కారణం ఏమిటంటే, దేవుడిని నిజంగా ప్రేమించే వారి జీవితాలలో మాత్రమే అత్యధిక విలువ మరియు అర్ధం ఉంటాయి, దేవుడిని వారు మాత్రమే నిజంగా విశ్వసించటానికి కారణం, ఈ మనుష్యులు దేవుడి వెలుగులో జీవించగలరు మరియు దేవుడి కార్యము మరియు నిర్వహణ కోసం జీవించగలరు. ఎందుకంటే, వారు అంధకారంలో జీవించరు, వెలుగులో జీవిస్తారు; వారు అర్థహీనమైన జీవితాలను జీవించరు, కానీ దేవుడిచే ఆశీర్వదించబడిన జీవితాలను జీవిస్తారు. దేవుడిని ప్రేమించేవారు మాత్రమే దేవునికి సాక్ష్యమివ్వగలరు, వారు మాత్రమే దేవుడి సాక్షులు, వారు మాత్రమే దేవునిచే ఆశీర్వదించబడ్డారు మరియు వారు మాత్రమే దేవుని వాగ్దానాలను పొందగలరు. దేవుడిని ప్రేమించేవారు దేవుడి ఆంతరంగికులు; వారు దేవుడికి ప్రియమైన మనుష్యులు మరియు వారు దేవుడితో కలిసి ఆశీర్వాదాలను అనుభవించగలరు. ఇలాంటి మనుష్యులు మాత్రమే అనంతకాలం జీవిస్తారు మరియు వారు మాత్రమే ఎప్పటికీ దేవుడి సంరక్షణ మరియు రక్షణలో జీవిస్తారు. మనుష్యులు ప్రేమించడానికే దేవుడు ఉన్నాడు మరియు ఆయన మనుష్యులందరి ప్రేమకు అర్హుడు. అయినప్పటికీ, మనుష్యులందరూ దేవుడిని ప్రేమించలేరు, మనుష్యులందరూ దేవునికి సాక్ష్యమివ్వలేరు మరియు దేవుని శక్తిని కలిగి ఉండలేరు. నిజానికి, దేవుడిని నిజంగా ప్రేమించేవారు వారు దేవుడికి సాక్ష్యమివ్వగలరు మరియు దేవుడి కార్యానికి వారి ప్రయత్నాలన్నింటినీ అంకితం ఇవ్వగలరు కాబట్టే, వారిని ఎదిరించే ధైర్యం చేసేవారు ఎవరూ లేకుండా ఆకాశం కింద ఎక్కడైనా నడవగలరు మరియు భూమిపై అధికారం చెలాయించగలరు మరియు దేవుడి మనుష్యులందరినీ పాలించగలరు. ఈ మనుష్యులందరూ ప్రపంచవ్యాప్తంగా ఏకమయ్యారు. వీళ్లు వేరువేరు భాషలు మాట్లాడినప్పటికీ, మరియు భిన్నమైన చర్మపు రంగులతో ఉన్నప్పటికీ, వారి అస్థిత్వానికి ఒకే అర్థం ఉంది; వారందరికీ దేవుడిని ప్రేమించే హృదయం ఉంది, వారందరూ ఒకే సాక్ష్యం, ఒకే సంకల్పం మరియు ఒకే ఆకాంక్ష కలిగి ఉన్నారు. దేవుడిని ప్రేమించే వారు ప్రపంచమంతటా స్వేచ్ఛగా నడవగలరు, దేవుడికి సాక్ష్యమిచ్చేవారు విశ్వమంతా సంచరించగలరు. ఈ మనుష్యులు దేవుడిచే ప్రేమించబడతారు, వీళ్లు దేవునిచే దీవించబడతారు మరియు వారు ఎప్పటికీ ఆయన వెలుగులోనే జీవిస్తారు.

మునుపటి:  పేతురు యేసును ఎలా తెలుసుకున్నాడు

తరువాత:  పరిశుద్ధాత్మ కార్యం మరియు సాతాను కార్యం

సెట్టింగులు

  • వచనం
  • థీమ్స్

ఘన రంగులు

థీమ్స్

అక్షరశైలి

అక్షరశైలి పరిమాణం

గీతల మధ్య దూరం

గీతల మధ్య దూరం

పేజీ వెడల్పు

విషయ సూచిక

శోధించండి

  • ఈ వచనాన్ని శోధించండి
  • ఈ పుస్తకాన్ని శోధించండి

Connect with us on Messenger