మార్పులేని స్వభావాన్ని కలిగి ఉండటమంటే దేవునితో శత్రుత్వంలో ఉండటమే
అనేక వేల సంవత్సరాల దుర్నీతి తర్వాత, మనిషి నిస్తేజంగా, తెలివితక్కువగా ఉన్నాడు; దేవుని పట్ల మానవుని తిరుగుబాటు చరిత్ర పుస్తకాలలో నమోదు చేయబడేంతగా అతడు దేవుణ్ణి వ్యతిరేకించే దయ్యం అయ్యాడు మరియు మనిషి కూడా అతని తిరుగుబాటు ప్రవర్తన గురించి పూర్తి వివరణ ఇవ్వలేడు—ఎందుకంటే మనిషి సాతాను ద్వారా తీవ్రంగా దుర్నీతి కి గురయ్యాడు, మరియు ఎక్కడకు తిరగాలో తెలియనంతగా సాతాను చే త్రోవ తప్పించబడ్డాడు. ఈ రోజుకీ, మనిషి ఇంకా దేవునికి ద్రోహం చేస్తున్నాడు: మనిషి దేవుడిని చూసినప్పుడు, అతను ఆయనకి ద్రోహం చేస్తున్నాడు, మరియు అతను దేవుడిని చూడలేనప్పుడు కూడా ఆయనకి ద్రోహం చేస్తు న్నాడు. దేవుని శాపాలను మరియు దేవుని కోపాన్ని చూసిన వారు కూడా ఇప్పటికీ ఆయనకు ద్రోహం చేస్తున్నారు. అందుకే మనిషి బుద్ది దాని అసలైన పనితీరును కోల్పోయిందని మరియు మనిషి మనస్సాక్షి కూడా దాని అసలైన బాధ్యత విస్మరించిందని నేను చెప్తున్నాను. నేను చూసే మనిషి మానవ వేషధారణలో ఉన్న మృగం, అతను విషపూరిత పాము, అతను నా కళ్ళ ఎదుట ఎంత దీనంగా కనిపించాలని ప్రయత్నించినా, నేను ఎన్నటికీ అతని పట్ల దయతో ఉండను, ఎందుకంటే మనిషికి నలుపు, తెలుపుల మధ్య వ్యత్యాసం, మరియు సత్యాసత్యాల మధ్య వ్యత్యాసం పట్ల ఎటువంటి గ్రహింపు లేదు. మనిషి బుద్ది అచేతనమవ్వబడింది, అయినప్పటికీ ఇంకా అతను ఆశీర్వాదాలను పొందాలని కోరుకుంటున్నాడు; అతని మానవత్వం అత్యంత అల్పమైనది అయినప్పటికీ ఇంకా అతను రాజు యొక్క సార్వభౌమాధికారాన్ని కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. అటువంటి బుద్ది కలిగినవాడు ఎవరికి రాజు కావచ్చు? అటువంటి మానవత్వంతో ఉన్న అతను సింహాసనంపై ఎలా కూర్చోగలడు? మనిషికి నిజంగా సిగ్గు లేదు! అతను ఒక గర్వించే దౌర్భాగ్యుడు! మీలో ఆశీర్వాదాలు పొందాలని ఎవరైతే అనుకుంటున్నారో, ముందుగా మీరు ఒక అద్దాన్ని వెతికి, మీ స్వంత అసహ్యకరమైన ప్రతిబింబాన్ని చూడమని నేను మీకు సూచిస్తున్నాను—మీకు రాజుగా ఉండడానికి అర్హమైనవి కలిగి ఉన్నారా? మీరు ఆశీర్వాదాలు పొందగల వ్యక్తి యొక్క ముఖం కలిగి ఉన్నారా? మీ స్వభావంలో కొద్దిపాటి మార్పు లేదు మరియు మీరు ఎటువంటి సత్యాన్ని ఆచరణలో పెట్టలేదు, అయినప్పటికీ ఇంకా మీరు అద్భుతమైన రేపటిని కోరుకుంటున్నారు. మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు! అటువంటి మురికి నేలలో జన్మించి, మనిషి సమాజంచే తీవ్రంగా చెడిపోయాడు, అతను భూస్వామ్య నైతికతలతో ప్రభావితమయ్యాడు మరియు అతను “ఉన్నత విద్యా సంస్థలలో” బోధించబడ్డాడు. పురోగమన ఆలోచనా విధానం, భ్రష్ట నీతి, జీవితంపై క్రూరమైన దృక్పథం, జీవించడానికి జుగుప్సాకరమైన తత్వశాస్త్రం, పూర్తిగా పనికిరాని ఉనికి, మరియు చెడిపోయిన జీవనశైలి మరియు ఆచారాలు—ఇవన్నీ మనిషి హృదయంలోకి తీవ్రంగా చొచ్చుకొని పోయి అతని మనస్సాక్షిని తీవ్రంగా కృంగదీశాయి మరియు దాడి చేశాయి. దాని ఫలితంగా, మనిషి దేవునికి ఎప్పటికన్నా దూరంగా ఉన్నాడు మరియు ఆయనకు మరింత వ్యతిరేకంగా ఉన్నాడు. మనిషి స్వభావం రోజురోజుకు మరింత దుర్మార్గంగా మారుతుంది మరియు దేవుని కొరకు దేన్నయినా ఇష్టపూర్వకంగా వదులుకునే వ్యక్తి ఒక్కడు కూడా లేడు, ఇష్టపూర్వకంగా దేవునికి విధేయత చూపే వ్యక్తి ఒక్కడు కూడా లేడు, అంతేగాక, దేవుని రూపాన్ని ఇష్టపూర్వకంగా కోరుకునే వ్యక్తి కూడా ఒక్కడైనా లేడు. దానికి బదులు, సాతాను ఆధీనంలో, మనిషి ఆనందాన్ని వెంబడించడం తప్ప మరేమీ చేయడు, బురద నేలలో శరీరపు దుర్నీతికి తనను తాను అప్పగిస్తున్నాడు. అంధకారంలో జీవించేవారు, వారు సత్యాన్ని విన్నప్పుడు కూడా దానిని ఆచరణలో పెట్టడం గురించి ఆలోచించరు, వారు ఆయన రూపాన్ని చూసినప్పటికీ దేవుని వెతకడానికి కూడా ఇష్టపడరు. ఇంతగా చెడిపోయిన మానవజాతి విమోచనకి ఎలా అవకాశం ఉంటుంది? ఇంతగా క్షీణించిన మానవజాతి వెలుగులో ఎలా జీవించగలదు?
మానవ స్వభావాన్ని మార్చడం అనేది అతని గుణము యొక్క జ్ఞానంతో మరియు అతని ఆలోచన, స్వభావం మరియు మానసిక దృక్పథంలో మార్పుల ద్వారా—ప్రాథమిక మార్పుల ద్వారా మొదలవుతుంది. ఈ విధంగా మాత్రమే మానవ స్వభావంలో నిజమైన మార్పులు సాధించబడతాయి. మనిషిలో పుట్టే దుర్నీతి స్వభావాలకి మూల కారణం సాతాను వంచన, దుర్నీతి మరియు విషం. మనిషి సాతాను అదుపులో ఉండి దానిచే నియంత్రించబడుతున్నాడు. తన ఆలోచన, నైతికత, అంతఃదృష్టి మారియు విచక్షణ మీద సాతాను చేసిన భయంకరమైన హాని వలన మనిషి బాధపడుతున్నాడు. ఇది ఖచ్చితంగా ఎందుకు అంటే మనిషి ప్రాథమిక విషయాలు సాతానుచే బ్రష్టు పట్టించబడడం వలన, మరియు దేవుడు వాటిని మొదట ఎలా సృష్టించాడో దానికి పూర్తి భిన్నంగా ఉన్నందున, అంటే, మనిషి దేవున్ని వ్యతిరేకిస్తాడు మరియు సత్యాన్ని అర్థం చేసుకోలేడు. ఆ విధంగా, మానవుని స్వభావంలో మార్పులు అతని ఆలోచన, అంతర్దృష్టి మరియు దేవుని గురించిన అతని జ్ఞానాన్ని మార్చే బుద్ది, సత్యం పట్ల అతని జ్ఞానం తో మొదలు కావాలి. అన్ని దేశాల్లో అత్యంత తీవ్ర అవినీతిలో పుట్టిన వారు దేవుడు అంటే ఏంటి, లేదా దేవుణ్ణి విశ్వసించడం అంటే ఏంటి అనే దాని గురించి మరింత అజ్ఞానులుగా ఉంటారు. జనులు ఎంతగా అవినీతిమయమైతే, వారికి దేవుని ఉనికి అంత తక్కువగా తెలుస్తుంది మరియు వారి జ్ఞానం మరియు అంతర్దృష్టి దయనీయంగా ఉంటుంది. దేవునికి వ్యతిరేకంగా మనిషి యొక్క విరోధం మరియు తిరుగుబాటుకు మూలం అతను సాతాను చేత బ్రష్టుపట్టడం. సాతాను దుర్నీతి కారణంగా, మనిషి మనస్సాక్షి మొద్దుబారిపోయింది; అతను అనైతికంగా ఉన్నాడు, అతని ఆలోచనలు దిగజారి పోయాయి మరియు అతను వెనుకబడిన మానసిక దృక్పథాన్ని కలిగి ఉన్నాడు. అతడు సాతానుచే పాడుచేయబడక ముందు, మానవుడు సహజంగానే దేవునిని అనుసరించాడు, మరియు ఆయన మాటలు విన్న తర్వాత వాటికి లోబడ్డాడు. అతను సహజంగా మంచి బుద్ది మరియు మనస్సాక్షి మరియు సాధారణ మానవత్వం కలిగి ఉన్నాడు. సాతానుచే బ్రష్టుపడిన తర్వాత, మనిషి అసలైన బుద్ది, మనస్సాక్షి మరియు మానవత్వం మందకొడిగా మారి సాతాను చేత క్షీణింపబడింది. ఆ విధంగా, అతను దేవుని పట్ల తన విధేయతను మరియు ప్రేమను కోల్పోయాడు. మనిషి బుద్ది అసహజంగా మారింది, అతని స్వభావం జంతువు మాదిరిగా మారింది మరియు దేవుని మీద అతని తిరుగుబాటు మరింత తరచుగా, దారుణంగా ఉంది. అయినప్పటికీ, మనిషికి ఇప్పటికీ ఈ విషయం తెలియదు, గుర్తించడు కూడా, మరియు కేవలం గుడ్డిగా వ్యతిరేకిస్తాడు మరియు తిరుగుబాటు చేస్తాడు. మనిషి స్వభావం అతని వ్యక్తీకరణలైన బుద్ది, అంతర్దృష్టి మరియు మనస్సాక్షిలలో వెల్లడి అవుతుంది; అతని బుద్ది మరియు అంతర్దృష్టి బలహీనంగా ఉన్నాయి మరియు అతని మనస్సాక్షి చాలా మందకొడిగా మారింది కాబట్టి, ఆ విధంగా అతని స్వభావం దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తుంది. మనిషి బుద్ది మరియు అంతర్దృష్టి మారలేకపోతే, దేవుని చిత్తానికి అనుగుణంగా ఉండటం, అతని స్వభావంలో మార్పు అనే ప్రశ్నఉండదు. ఒక వేళ మనిషి బుద్ది అల్పంగా ఉంటే, అప్పుడతడు దేవునిని సేవించలేడు మరియు దేవునిచే వాడుకోబడటానికి అనర్హుడవుతాడు. “సాధారణమైన జ్ఞానం” అనేది దేవునికి విధేయత చూపడం మరియు విశ్వాసంగా ఉండడం, దేవుని కోసం ఎదురుచూడటం, దేవుని పట్ల సంపూర్ణంగా ఉండడం మరియు దేవుని పట్ల మనస్సాక్షి కలిగి ఉండడాన్ని సూచిస్తుంది. ఇది దేవుని పట్ల ఏక హృదయంతో మరియు ఏక మనస్సుతో ఉండటాన్ని మరియు ఉద్దేశపూర్వకంగా దేవుణ్ణి వ్యతిరేకించకపోవడాన్ని సూచిస్తుంది. అసహజమైన బుద్ది కలిగి ఉండటం అనేది ఇలా ఉండదు. మనిషి సాతాను దుర్నీతికి లోనైనప్పటి నుండి, అతను దేవుని గురించిన తలంపులతో ముందుకు వచ్చాడు, అతనికి దేవుని పట్ల విధేయత లేదా ఆయన కొరకు ఆరాటం లేదు, మరియు దేవుని పట్ల మనస్సాక్షి గురించి చెప్పడానికి ఏమీ లేదు. మనిషి ఉద్దేశపూర్వకంగా దేవుణ్ణి వ్యతిరేకిస్తాడు మరియు ఆయనపై తీర్పులు తీరుస్తాడు, అంతేకాకుండా, ఆయన వెనుక ఆయనపై దూషణలతో దాడిచేస్తాడు. ఆయనే దేవుడు అనే స్పష్టమైన జ్ఞానంతో మనిషి దేవుని వెనుక ఆయనకు తీర్పు తీరుస్తాడు; మనిషికి దేవునికి విధేయత చూపే ఉద్దేశమే లేదు, కేవలం గుడ్డి షరతులు మరియు అభ్యర్థనలు చేస్తాడు. అలాంటి ప్రజలు—అసహజమైన బుద్ది కలిగి ఉన్న ప్రజలు—వారి స్వంత అసహ్యకరమైన ప్రవర్తనను తెలుసుకోలేరు లేదా వారి తిరుగుబాటుకు చింతించలేరు. ప్రజలు తమను తాము తెలుసుకోగలిగితే, వారు తమ బుద్దిని కొద్దిగా తిరిగి పొందినట్టే; తమను తాము ఇప్పటికీ తెలుసుకోలేని వ్యక్తులు దేవునికి వ్యతిరేకంగా ఎంత ఎక్కువ తిరుగుబాటు చేస్తారో, వారు అంత బుద్దిహీనంగా ఉంటారు.
మనిషి అవినీతి స్వభావం బహిర్గతపు మూలం మనిషి మొద్దుబారిన మనస్సాక్షి, అతని హానికరమైన స్వభావం మరియు అతని బుద్దిహీనతలో తప్ప మరి దేనిలోనూ లేదు; మనిషి మనస్సాక్షి మరియు బుద్ది మళ్లీ సాధారణ స్థితికి చేరుకోగలిగితే, అప్పుడతను దేవుని ఎదుట వాడుకోబడటానికి తగిన వ్యక్తి అవుతాడు. మనిషి మనస్సాక్షి ఎప్పుడూ మొద్దుబారి ఉండడమే దీనికి కారణం, మరియు ఎన్నడూ వివేకవంతంగా లేని మనిషి బుద్ది మరింత మందకొడిగా మారుతూ క్రమేపీ దేవుని మీద తిరుగుబాటు చేసింది, అతను యేసును సిలువకు వ్రేలాడదీశాడు కూడా మరియు అంత్యదినాల్లో దేవుని అవతారానికి తన ఇంట్లోకి ప్రవేశాన్ని తిరస్కరించడం, మరియు దేవుని శరీరాన్ని ఖండిచడం మరియు దేవుని శరీరాన్ని అల్పంగా చూడడం. మనిషికి కాస్తయినా మానవత్వం ఉంటే, అతను అవతార దేవుని శరీరంతో ప్రవర్తించడంలో అంత క్రూరంగా ఉండడు; అతను కాస్తయినా బుద్ది కలిగి ఉంటే, అతను అవతారమైన దేవుని శరీరంతో ప్రవర్తించడంలో అంత దుర్మార్గంగా ఉండడు; అతనికి కాస్తయినా మనస్సాక్షి ఉంటే, అతను అవతరించిన దేవునికి ఈ విధంగా “కృతజ్ఞతలు” చూపడు. మానవుడు దేవుడు శరీరధారిగా మారే యుగంలో జీవిస్తున్నాడు, అయినప్పటికీ తనకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు చెప్పలేకుండా ఉన్నాడు, దానికి బదులు దేవుని రాకడను శపిస్తాడు లేదా దేవుని అవతార వాస్తవాన్ని పూర్తిగా విస్మరిస్తాడు మరియు దానికి వ్యతిరేకంగా, విసుగు చెందినట్లు కనిపిస్తున్నాడు. అది దేవుని రాకడను మానవుడు ఎలా పరిగణిస్తాడనే దానితో సంబంధం లేకుండా, దేవుడు, సంక్షిప్తంగా, ఎల్లప్పుడూ తన పనిని సహనంతో కొనసాగించాడు—మనిషి ఆయన పట్ల కొంచెం కూడా స్వాగతించకుండా ఆయనకు గుడ్డిగా అభ్యర్థనలు చేస్తున్నాడు. మనిషి స్వభావం అత్యంత దుర్మార్గంగా మారింది, అతని బుద్ది మరింతగా మాంద్యమైంది మరియు అతని మనస్సాక్షి పూర్తిగా దుష్టునిచే అణగదొక్కబడింది మరియు చాలా కాలం క్రితమే మనిషి యొక్క అసలైన మనస్సాక్షిగా లేకుండా పోయింది. మానవాళికి ఎంతో జీవితాన్ని మరియు దయను ప్రసాదించినందుకు మానవుడు అవతరించిన దేవునికి కృతజ్ఞత లేనివాడై ఉండటమే కాక అతనికి సత్యాన్ని ఇచ్చినందుకు దేవుని పట్ల కోపిష్టిగా కూడా మారాడు; మనిషికి సత్యం పట్ల కనీస ఆసక్తి లేకపోవడం వల్లనే అతడు దేవుని పట్ల కోపిష్టి అయ్యాడు. మానవుడు అవతరించిన దేవుని కోసం తన జీవితాన్ని అర్పించలేకపోవడమే కాక అతను ఆయన నుండి మేళ్ళని పొందేందుకు ప్రయత్నిస్తాడు, మరియు మనిషి దేవునికి ఇచ్చిన దానికంటే డజన్ల కొద్దీ రెట్లు ఎక్కువ వడ్డీని పొందుతాడు. అటువంటి మనస్సాక్షి మరియు బుద్ది గల వ్యక్తులు ఇది గొప్ప విషయం కాదు అని అనుకుంటారు, మరియు ఇప్పటికీ వారు దేవుని కొరకు తమను తాము చాలా వెచ్చించామని, మరియు దేవుడు తమకు చాలా తక్కువ ఇచ్చారని నమ్ముతారు. నాకు ఒక గిన్నె నీరు ఇచ్చిన తర్వాత, వారి చేతులు చాచి, వారికి రెండు గిన్నెల పాలకి చెల్లించమని కోరే వ్యక్తులు ఉన్నారు, లేదా, నాకు ఒక రాత్రికి గది ఇచ్చిన తర్వాత, చాలా రాత్రులకి అద్దె చెల్లించాలని కోరే వ్యక్తులు ఉన్నారు. ఇలాంటి మానవత్వం మరియు ఇలాంటి మనస్సాక్షితో మీరు ఇంకా జీవాన్ని ఎలా పొందాలనుకుంటున్నారు? మీరు ఎంత హేయమైన దౌర్భాగ్యులు! మనిషిలోని ఈ విధమైన మానవత్వం మరియు మనిషిలోని ఈ విధమైన మనస్సాక్షి అవతరించిన దేవునిని, ఆశ్రయానికి చోటు దొరకక భూమి అంతటా సంచరించేలా చేస్తుంది. నిజంగా మనస్సాక్షి మరియు మానవత్వం కలిగి ఉన్నవారు అవతరించిన దేవునిని ఆరాధించాలి మరియు హృదయపూర్వకంగా సేవ చేయాలి, ఆయన ఎంతగానో పని చేసినందుకు కాదు, ఆయన ఏ పనీ అసలు చేయకపోయినా సరే. బుద్ధిమంతులు చేయవలసినది ఇదే, అది మనిషి కర్తవ్యం. చాలా మంది ప్రజలు దేవునికి చేసే సేవలో షరతుల గురించి కూడా మాట్లాడతారు: ఆయన దేవుడా లేదా మనిషా అనే విషయాన్ని వారు పట్టించుకోరు మరియు వారు తమ స్వంత పరిస్థితుల గురించి మాత్రమే మాట్లాడతారు మరియు వారి స్వంత కోరికలను తీర్చుకునేందుకు వెతుకుతారు. మీరు నా కోసం వంట చేసినప్పుడు, మీరు సేవా రుసుము కోరతారు, మీరు నా కోసం పరిగెత్తినప్పుడు, మీరు పరుగెత్తినందుకు రుసుము అడుగుతారు, మీరు నా కోసం పని చేసినప్పుడు మీరు పని రుసుము కోరతారు, మీరు నా బట్టలు ఉతికినప్పుడు మీరు చాకలి రుసుము అడుగుతారు, మీరు సంఘానికి సమకూర్చినపుడు మీరు పునరుద్ధరణ ఖర్చులను కోరతారు, మీరు మాట్లాడినపుడు మీరు వక్త రుసుము అడుగుతారు, మీరు పుస్తకాలు ఇచ్చినప్పుడు మీరు పంపిణీ రుసుము అడుగుతారు మరియు మీరు రచించినపుడు మీరు రచనా రుసుము కోరతారు. నేను వ్యవహరించిన వారు నా నుండి ప్రతిఫలాన్ని కూడా అడిగారు, ఇంటికి పంపబడిన వారు తమ పేరుకు జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని అడుగుతారు; పెళ్లికాని వారు కట్నం లేదా వారి కోల్పోయిన యవ్వనానికి పరిహారం అడుగుతారు; కోడిని చంపే వారు కసాయి రుసుము కోరతారు, ఆహారం వేయించే వారు వేయించడానికి రుసుము కోరతారు, మరియు పులుసు చేసే వారు దానికి కూడా వెల చెల్లించాలని కోరతారు…. ఇది మీ ఉదాత్తమైన మరియు మహోన్నతమైన మానవత్వం, మరియు ఇవి మీ వెచ్చని మనస్సాక్షి నిర్దేశించే చర్యలు. మీ బుద్ది ఎక్కడ ఉంది? మీ మానవత్వం ఎక్కడ ఉంది? నన్ను మీకు చెప్పనివ్వండి! మీరు ఇలాగే కొనసాగితే, నేను మీ మధ్య పనిచేయడం మానేస్తాను. మనుష్య వేషధారణలో ఉన్న మృగాల గుంపు మధ్య నేను పని చేయను, ఆటవికమైన హృదయాలను దాచిపెట్టే అందమైన ముఖాలు గల ఇటువంటి వ్యక్తుల సమూహం కోసం నేను ఈ విధంగా బాధపడను, రక్షణకి కనీస అవకాశం లేని ఇటువంటి జంతువుల సమూహాన్ని నేను భరించను. నేను మీకు వెన్నుచూపిన రోజు, మీరు మృతిచెందే రోజు, అది మీ పైకి చీకటి వచ్చే రోజు, మరియు మీరు వెలుగుచే విడిచిపెట్టబడిన రోజు. నన్ను మీకు చెప్పనివ్వండి! జంతువుల కన్నా అధమంగా ఉండే మీ వంటి సమూహానికి నేను ఎప్పటికీ ఉపకారిగా ఉండను! నా మాటలు మరియు చర్యలకు పరిమితులు ఉన్నాయి మరియు ఇలా ఉన్న మీ మానవత్వం మరియు మనస్సాక్షితో, నేను ఇకపై పని చేయను, ఎందుకంటే మీకు మనస్సాక్షి చాలా లోపించింది, మీరు నాకు విపరీతమైన బాధను కలిగించారు, మరియు మీ తుచ్ఛమైన ప్రవర్తన నన్ను చాలా అసహ్యించునేలా చేసింది. మానవత్వం మరియు మనస్సాక్షి లోపించిన జనులకు విమోచన అవకాశం ఎన్నటికీ ఉండదు; అలాంటి హృదయం లేని మరియు కృతజ్ఞత లేని వ్యక్తులను నేను ఎప్పటికీ రక్షించను. నా దినము వచ్చినప్పుడు, ఒకప్పుడు నా తీవ్ర క్రోధాన్ని, రెచ్చగొట్టిన అవిధేయ పిల్లలపై నిత్యం దహించే నా జ్వాలలను కురిపిస్తాను, ఒకప్పుడు నాపై దూషణలతో దాడి చేసి నన్ను విడిచిపెట్టిన జంతువులపై నేను నా శాశ్వతమైన శిక్షను విధిస్తాను. ఒకప్పుడు నాతో కలిసి తిని, జీవించ, నా యందు విశ్వసించని, నన్ను అవమానించి, వంచించిన అవిధేయ కుమారులను నా కోపపు జ్వాలలతో శాశ్వత కాలం పాటు దహిస్తాను. నా కోపాన్ని రెచ్చగొట్టిన వారందరినీ నా శిక్షకు గురిచేస్తాను, ఒకప్పుడు నాతో సమానంగా నా పక్కన నిలబడాలని కోరుకున్నప్పటికీ నన్ను ఆరాధించని లేదా నాకు లోబడని మృగాలపై నా పూర్తి కోపాన్ని కురిపిస్తాను; మనిషిని కొట్టే నా దండం, ఒకప్పుడు నా సంరక్షణను ఆస్వాదించిన మరియు ఒకప్పుడు నేను పలికిన మర్మాలను ఆనందించిన, మరియు ఒకప్పుడు నా నుండి భౌతిక ఆనందాలను తీసుకోవడానికి ప్రయత్నించిన జంతువులపై పడుతుంది. నా స్థానాన్ని ఆక్రమించడానికి ప్రయత్నించే ఏ వ్యక్తినీ నేను క్షమించను; నా నుండి ఆహారాన్ని, బట్టలను లాక్కోవాలని ప్రయత్నించే వారిలో ఎవరినీ నేను విడిచిపెట్టను. ప్రస్తుతానికి, మీరు హాని నుండి విముక్తి పొందారు మరియు మీరు నన్ను కోరే కోరికల్లో మితిమీరుతూ ఉన్నారు. ఉగ్రత దినం వచ్చినప్పుడు, మీరు ఇకపై నన్ను ఎలాంటి కోరికలు కోరలేరు; ఆ సమయంలో, నేను మిమ్మల్ని మీ హృదయానికి తగినట్లుగా “ఆస్వాదించడానికి” అనుమతిస్తాను, నేను మీ ముఖాన్ని భూమిలోకి బలవంతంగా తోస్తాను, మీరు మళ్లీ ఎప్పటికీ లేవలేరు! తొందర్లోనే, నేను మీకు ఈ రుణాన్ని “తిరిగి” చెల్లించబోతున్నాను—మరియు మీరు ఈ రోజు రాక కోసం ఓపికగా ఎదురుచూస్తున్నారని నేను ఆశిస్తున్నాను.
ఈ ధిక్కార ప్రజలు నిజంగా తమ మితిమీరిన కోరికలను పక్కనపెట్టి, దేవుని వద్దకు తిరిగి వెళ్లగలిగితే, వారికి ఇంకా విమోచనకి అవకాశం ఉంది; మనిషికి నిజంగా దేవుని కోసం తహతహలాడే హృదయం ఉంటే, అప్పుడతను దేవునిచే విడిచి పెట్టబడడు. మానవుడు దేవుణ్ణి పొందడంలో విఫలమయ్యాడు ఎందుకంటే దేవునికి భావోద్వేగం ఉండటం వల్లనో లేదా దేవుడు మనిషి ద్వారా పొందటానికి ఇష్టపడడనో కాదు కానీ మనిషి దేవుణ్ణి పొందాలని కోరుకోడు మరియు మనిషి దేవున్నిఅత్యవసరంగా వెతకడు. నిజంగా దేవున్నివెదకుతున్న వారిలో ఎవరైనా దేవునిచే ఎలా శపించబడతారు? మంచి బుద్ది మరియు సున్నిత మనస్సాక్షి ఉన్న వ్యక్తి దేవునిచే ఎలా శపించబడతాడు? దేవున్నినిజంగా ఆరాధించే మరియు సేవించే వ్యక్తి ఆయన క్రోధాగ్నిచే ఎలా దహించబడగలడు? దేవునికి విధేయత చూపడంలో సంతోషించే వ్యక్తి దేవుని గృహం నుండి ఎలా వెళ్లగొట్టబడతాడు? దేవున్నితగినంతగా ప్రేమించలేని వ్యక్తి దేవుని శిక్షలో ఎలా జీవించగలడు? దేవుని కోసం సర్వస్వం త్యజించడానికి సంతోషంగా ఉన్న వ్యక్తి ఏమీ లేకుండా ఎలా మిగిలిపోతాడు? మనిషి దేవుణ్ణి వెంబడించడానికి ఇష్టపడడు, దేవుని కోసం తన ఆస్తులను వెచ్చించడానికి ఇష్టపడడు మరియు జీవితకాల కృషిని దేవునికి అంకితం చేయడానికి ఇష్టపడడు; దానికి బదులు, దేవుడు చాలా దూరం వెళ్లాడని, అంతేగాక దేవుడు మనిషి ఆలోచనలకు విరుద్ధంగా ఉన్నాడు అని చెప్తాడు. ఇలాంటి మానవత్వంతో, మీరు మీ ప్రయత్నాల్లో తిరుగులేకుండా ఉన్నప్పటికీ, మీరు ఇప్పటికీ దేవుని ఆమోదాన్ని పొందలేరు, మీరు దేవుణ్ణి వెతకరు అనే వాస్తవం గురించి చెప్పడానికి ఏమీ లేదు. మీరు మానవాళి యొక్క లోపభూయిష్ట వస్తువులు అని మీకు తెలియదా? మీ మానవత్వం కంటే ఏ మానవత్వమూ తక్కువ కాదని మీకు తెలియదా? మిమ్మల్ని గౌరవించడానికి ఇతరులు మిమ్మల్ని ఏమని పిలుస్తారో మీకు తెలియదా? దేవుణ్ణి నిజంగా ప్రేమించే వారు మిమ్మల్ని తోడేలు తండ్రి, తోడేలు తల్లి, తోడేలు కొడుకు మరియు తోడేలు మనవడు అని పిలుస్తారు; మీరు తోడేలు వారసులు, తోడేలు ప్రజలు, మరియు మీరు మీ స్వంత గుర్తింపును తెలుసుకోవాలి మరియు దానిని ఎప్పటికీ మరచిపోకూడదు. మీరేదో ఉన్నతమైన వ్యక్తి అని అనుకోకండి: మీరు మానవజాతిలో కెల్లా అత్యంత దుర్మార్గమైన మానవేతరుల సమూహం. మీకు ఇవేమీ తెలియదా? మీ మధ్య పని చేయడం ద్వారా నేను ఎంత తెగింపు చేసానో మీకు తెలుసా? మీ బుద్ది మళ్లీ సాధారణం కాలేకపోతే మరియు మీ మనస్సాక్షి సాధారణంగా పని చేయలేకపోతే, మీరు “తోడేలు” అనే పేరు నుండి ఎప్పటికీ విడుదల పొందలేరు, మీరు శాప దినం ఎన్నటికీ తప్పించుకోలేరు మరియు మీ శిక్ష దినాన్ని ఎన్నటికీ తప్పించుకోలేరు. మీరు విలువ లేని వస్తువు వలె హీనంగా జన్మించారు. మీరు స్వభావసిద్ధంగా ఆకలితో ఉన్న తోడేళ్ళ సమూహం, చెత్త మరియు చిల్ల పెంకుల కుప్ప, మరియు మీలా కాకుండా మేళ్ళని పొందడానికి కాదు కానీ పని అవసరం కారణంగా నేను మీపై పని చేస్తాను. మీరు ఈ విధంగా తిరుగుబాటు చేస్తూ ఉంటే, నేను నా పనిని ఆపివేస్తాను మరియు మీపై ఎప్పటికీ పని చేయను; దీనికి విరుద్ధంగా, నేను నా పనిని నన్ను సంతోషపెట్టే మరొక సమూహానికి బదిలీ చేస్తాను మరియు ఈ విధంగా మిమ్మల్ని శాశ్వతంగా వదిలివేస్తాను, ఎందుకంటే నా పట్ల శత్రుత్వంతో ఉన్నవారిని చూడడానికి నేను ఇష్టపడను. కాబట్టి, మీరు నాకు అనుకూలంగా ఉండాలనుకుంటున్నారా లేదా నాకు వ్యతిరేకంగా శత్రుత్వంతో ఉండాలనుకుంటున్నారా?