మీరు జీవము లోనికి వచ్చిన వారిలో ఒకరిగా ఉన్నారా?

మీరు మీ అవినీతి స్వభావాలను విడిచిపెట్టి, సహజ మానవత్వపు ఉనికి నుండి జీవించడం మొదలు పెట్టినపుడే మీరు పరిపూర్ణులుతారు. నువ్వు ప్రవచనాలు పలుకలేకపోయినప్పటికీ, లేదా ఏ నిగూఢమైన సంగతుల గురించి మాట్లాడలేకపోయినప్పటికీ, నువ్వు సగటు మానవుని యొక్క ఉనికిని ప్రదర్శిస్తే చాలు. దేవుడు మనిషిని సృజించారు, కానీ ఆ తర్వాత మనిషి సాతాను చేత చెరపబడ్డాడు, ఆవిధంగా మనుష్యులు “మృత మనుష్యులు” అయ్యారు. కాబట్టి, నువ్వు మార్పు చెందిన తర్వాత, మీరు ఈ “మృత మనుష్యులుగా” ఉండవు. దేవుని వాక్కులు మాత్రమే మనుష్యుల ఆత్మలను ఇలా వెలిగించి, వారి పునర్జన్మకు కారణమవుతాయి, కనుక మనుష్యుల ఆత్మలు తిరిగి జన్మించినప్పుడు, వారు జీవానికి వస్తారు. నేను “మృత మనుష్యులు” గురించి మాట్లాడుతున్నప్పుడు, ఆత్మ లేకుండా బ్రతికి ఉన్న శరీరాల గురించి, లోలోపల ఆత్మలు మరణించిన వ్యక్తుల ను గురించి మాట్లాడుతున్నాను. ఎప్పుడైతే మనుష్యుల ఆత్మల్లో జీవపు మెరుపు వెలిగింపబడుతుందో, అప్పుడు మనుష్యులు జీవానికి వస్తారు. ఇంతకు ముందు చెప్పబడిన పరిశుద్ధులు ఒకప్పుడు సాతాను ప్రభావంలో ఉన్నప్పటికీ, ఇప్పుడు జీవానికి వచ్చిన ప్రజలుగా ఉండి, సాతానును ఓడించిన వారిగా ఉన్నారు. చైనాలోని ఎంపిక చేయబడిన మనుష్యులు యెర్రని మహా ఘట సర్పము యొక్క క్రూరమైన మరియు అమానవీయమైన వేధింపులను మరియు మోసాలను భరించారు. ఇది వారిని మానసికంగా నాశనం చేసి, జీవించడానికి కొంచెం కూడా ధైర్యం లేకుండా చేసింది. అందువలన, వారి ఆత్మల మేల్కొలుపు అనేది వారికున్న కొద్దిపాటి సారముతోనే ప్రారంభం కావాలి: కొంచెము కొంచెము గా, వారి కున్న ఆ సారములో నుండే, వారి ఆత్మలు మేల్కొలపబడాలి. వారు ఒకానొక రోజున జీవం పోసుకున్నప్పుడు, ఇక అటుపై వారికి ఎటువంటి అడ్డంకులు ఉండవు, అన్నీ సజావుగా సాగుతాయి. అయితే, ప్రస్తుతానికి మాత్రం, ఇది సాధించలేనిదిగానే ఉంది. చాలా మంది మనుష్యులు అనేక మరణ ప్రవాహాలను తెచ్చే విధంగా జీవిస్తూ ఉంటారు; వారు మరణం యొక్క రంగుతో కప్పబడి ఉంటారు, అంతేకాకుండా వారికి ఎంతో కొరత ఉంటుంది. కొందరి మాటలు మరణాన్ని కలిగి ఉంటాయి, వారి చర్యలు మరణాన్ని కలిగి ఉంటాయి, అలానే వారు జీవించే విధానంలో వారు బయటకు తెచ్చే దాదాపు ప్రతి అంశము మరణాన్ని కలిగి ఉంటుంది. నేడు, ఒకవేళ అటువంటి మనుష్యులు బహిరంగంగా దేవునికి సాక్ష్యమిస్తుంటే, వారు ఈ పనిలో విఫలమవుతారు, ఎందుకంటే వారు ఇంకా పూర్తిగా జీవాన్ని పొందలేదు మరియు మీలో చాలా మంది ఇలాంటి మరణించిన స్థితిలో ఉన్నారు. ఈ రోజులలో ఇంకొందరు ఇలా అంటారు—దేవుడు తన పనిని అన్యజనుల మధ్య త్వరగా వ్యాప్తి చేయడానికి కొన్ని సూచనలు మరియు అద్భుతాలను ఎందుకు చూపించటంలేదు అని అడుగుతారు. చనిపోయినవారు దేవునికి సాక్ష్యమివ్వలేరు; జీవించి ఉన్నవారు మాత్రమే చేయగలిగిన పని అది, అయితే ఈ రోజులలో చాలామంది మరణించిన వారిగానే ఉన్నారు. చాలా మంది సాతాను ప్రభావంతో మృత్యువు ముసుగులో జీవిస్తున్నారు, ఇంకా విజయం సాధించలేనివారిగా ఉన్నారు. ఇలాంటి స్థితిలో ఉండగా, వారు దేవునికి ఎలా సాక్ష్యమివ్వగలరు? వారు సువార్త పనిని ఎలా వ్యాప్తి చేయగలరు?

చీకటి ప్రభావంలో జీవించే వారందరూ మృత్యువు మధ్య జీవించే వారై, సాతాను ఆవహించినవారిగా ఉన్నారు. దేవునిచే రక్షించబడకుండా మరియు దేవుని తీర్పులచే తీర్చిదిద్దబడకుండా, క్రమపరచబడకుండా, మనుష్యులు మరణం యొక్క ప్రభావం నుండి తప్పించుకోలేరు; వారు జీవం కలిగినవారుగా మారలేరు. ఇట్టి “మరణించిన స్థితిలో ఉన్న మనుష్యులు” దేవునికి సాక్ష్యమివ్వలేరు, వారు దేవునిచే కూడా ఉపయోగించబడలేరు, దేవుని రాజ్యంలోకి అంత కంటే ప్రవేశించలేరు. దేవుడు జీవించి ఉన్నవారి సాక్ష్యాన్ని కోరుకుంటున్నాడు కానీ మరణించిన స్థితిలో ఉన్న వారిది కాదు. మరియు మరణించిన స్థితిలో ఉన్న వారిని కాదు కానీ, జీవించి ఉన్న స్థితిలో ఉన్న వారు తన కోసం పని చేయాలని ఆయన కోరుతున్నాడు. “మరణించిన స్థితిలో ఉన్న వారు” అంటే, దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేవారు; వారు ఆత్మలో మొద్దుబారినట్లుగా ఉండి దేవుని మాటలను అర్థం చేసుకోలేని వారు; వారు సత్యాన్ని ఆచరణలో పెట్టని వారుగా మరియు దేవుని పట్ల కనీస విధేయత లేని వారై సాతాను ఆధిపత్యం క్రింద జీవించేవారు మరియు సాతానుచే దోపిడీ చేయబడేవారుగా ఉన్నారు. మరణ స్థితిలో ఉన్న వారు సత్యానికి వ్యతిరేకంగా నిలబడటం ద్వారా, దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం ద్వారా మరియు అణకువ లేకుండా, ధిక్కారంగా, ద్వేషపూరితంగా, క్రూరంగా, మోసపూరితంగా మరియు కృత్రిమంగా ఉండటం ద్వారా తమను తాము వ్యక్తపరుస్తారు. అలాంటి వారు దేవుని వాక్కులను తిని త్రాగినప్పటికీ, వారు దేవుని మాటలను బట్టి జీవించటం మాత్రం చేయలేరు; వారు సజీవంగా ఉన్నప్పటికీ, వారు కేవలం నడుస్తున్న, ఊపిరి పీల్చుకుంటున్న శవాలుగా ఉంటారు. మరణించిన స్థితిలో ఉన్న వారు దేవునికి పూర్తి అవిధేయులుగా ఉన్నారు అని పేర్కొనడం అనేది చాలా చిన్నవిషయం ఎందుకంటే అట్టి వారు ఆయనను సంతృప్తిపరచడంలో పూర్తి అసమర్థులు గా ఉంటారు. వారు ఆయనను కేవలం మోసగించుట మాత్రమే చేయగలరు, ఆయనకు వ్యతిరేకంగా దూషిస్తారు, ఆయనకు ద్రోహం చేస్తారు మరియు వారు జీవించే విధానం ద్వారా వారిలోనుండి బయటకు తెచ్చేవన్నీకూడా సాతాను స్వభావాన్ని వెల్లడిస్తాయి. మనుష్యులు ఒకవేళ తాము సజీవులుగా మారాలని, దేవుని పట్ల సాక్ష్యము కలిగి ఉండాలని మరియు దేవునిచే ఆమోదించబడాలని కోరుకున్నట్లయితే, దేవుడు ఇచ్చే రక్షణను వారు స్వీకరించాలి; వారు ఆయన తీర్పుకు మరియు మందలింపుకు సంతోషముగా లొంగిపోవాలి మరియు దేవుని తగ్గింపును ఇంకా ఆయనతో వ్యవహరించబడడాన్ని సంతోషంగా అంగీకరించాలి. అప్పుడు మాత్రమే వారు దేవునికి కావలసిన అన్ని సత్యాలను ఆచరణలో పెట్టగలుగుతారు మరియు అప్పుడే వారు దేవుని రక్షణ ను పొంది నిజంగా సజీవులుగా మారతారు. సజీవులు దేవునిచే రక్షించబడతారు; వారు దేవునిచే తీర్పు తీర్చబడ్డారు మరియు శిక్షణ చేయబడ్డారు, వారు తమను తాము అంకితం చేసుకోవడానికి సిద్ధంగా ఉంటారు మరియు దేవుని కొరకు తమ జీవితాలను సమర్పించడానికి సంతోషంగా ఉంటారు ఇంకా వారు ఆనందముతో తమ జీవితమంతా దేవునికి అంకితం చేస్తారు. సజీవులు దేవునికి సాక్ష్యమిచ్చినప్పుడే సాతాను సిగ్గుపడగలడు; సజీవ స్థితిలో ఉన్న వారు మాత్రమే దేవుని సువార్త పనిని వ్యాప్తి చేయగలరు, సజీవులుగా ఉన్నవారు మాత్రమే దేవుని హృదయాన్ని అనుసరిస్తారు మరియు సజీవముగా ఉన్నవారు మాత్రమే నిజమైన వ్యక్తులు. నిజానికి దేవుడు సృష్టించిన మనిషి జీవించే ఉన్నాడు, కానీ సాతాను చెరిపిన కారణంగా మనిషి మరణం మధ్య జీవిస్తాడు, సాతాను ప్రభావంతో జీవిస్తాడు. కనుక, ఈ విధంగా, మనుష్యులు ఆత్మ లేని మృతులుగా మారారు, వారు దేవుణ్ణి వ్యతిరేకించే శత్రువులుగా మారారు, వారు సాతాను ఉపకరణాలుగా మారారు ఇంకా వారు సాతాను బంధీలుగా మారారు. దేవుని చే సృష్టించబడిన సజీవులందరూ మృతులుగా మారారు కనుక దేవుడు తన సాక్ష్యాన్ని కోల్పోయాడు మరియు ఆయన సృష్టించిన మరియు ఆయన ఊపిరి ని కలిగి ఉన్న ఏకైక విషయం అయిన మానవాళిని కోల్పోయాడు. దేవుడు తన సాక్ష్యాన్ని తిరిగి తీసుకోవాలంటే, తన స్వహస్తముతో చేయబడినప్పటికీ సాతాను చేత బంధించబడిన వారిని తిరిగి తీసుకోవాలంటే, ఆయన వారిని పునరుత్థానం చేయాలి, తద్వారా వారు సజీవులుగా మారతారు, మరియు వారు ఆయన కాంతి యందు జీవించేలా ఆయన వారిని సంస్కరించాలి. మరణించిన స్థితిలో ఉన్న వారు ఆత్మ లేనివారుగా, తీవ్రస్థాయిలో మొద్దుబారిన వారిగా మరియు దేవునిని వ్యతిరేకించే వారుగా ఉన్నారు. ఇలాంటివారు దేవుని ఎరుగని వారిలో అగ్రగణ్యులు. ఇటువంటి మనుష్యులకు దేవునికి విధేయత చూపాలనే కనీస ఉద్దేశం కూడా ఉండదు; వారు ఆయనకు వ్యతిరేకంగా తిరుగుబాటు మాత్రమే చేస్తారు, ఆయనను వ్యతిరేకిస్తారు, అలానే కనీస విధేయతను కూడా కలిగి ఉండరు. సజీవులు అనగా వారి ఆత్మలు తిరిగి జన్మించిన స్థితిలో ఉండి, దేవునికి లోబడుట తెలిసిన వారై ఉండి దేవునికి విధేయముగా ఉంటారు. వారు సత్యమును, సాక్ష్యమును కలిగియున్నారు, మరియు ఇటువంటి ప్రజలు మాత్రమే దేవుని గృహములో ఆయనకు ప్రీతికరమైనవారు. ఎవరైతే జీవము లోకి వస్తారో, దేవుని రక్షణను చూస్తారో, దేవునికి విధేయత చూపిస్తారో మరియు దేవునిని వెదకడానికి ఇష్టపడతారో అట్టి వారినే దేవుడు రక్షిస్తాడు. దేవుడు శరీరధారిగా వచ్చాడని గ్రహించి, ఆయన అవతారాన్ని విశ్వసిస్తారో అట్టి వారినే ఆయన రక్షిస్తాడు. కొంతమంది జీవానికి రావచ్చు; ఇంకొంత మంది రాలేరు; ఇది వారి స్వభావము రక్షింప బడగలదా లేదా అనే దాని పై ఆధారపడి ఉంటుంది. చాలా మంది మనుష్యులు దేవుని వాక్యాన్ని చాలా ఎక్కువగా వింటారు కానీ, వారు దేవుని చిత్తాన్ని ఇంకా అర్థం చేసుకోలేదు కనుక వాటిని ఆచరణలో పెట్టలేరు. అలాంటి వ్యక్తులు ఏ సత్యాన్ని కూడా జీవించలేరు. అంతేకాకుండా, ఉద్దేశపూర్వకంగా దేవుని పనికి అంతరాయం కలుగ చేస్తు ఉంటారు. వారు దేవుని కోసం ఏ పని చేయలేనివారు, వారు ఆయనకు దేనినీ అంకితం చేయలేరు మరియు చర్చిలోని డబ్బును కూడా రహస్యంగా ఖర్చు చేస్తారు మరియు దేవుని మందిరంలో ఉచితంగా భోజనం చేస్తారు. ఇలాంటి మనుష్యులు మరణ స్థితిలో ఉన్నారు కనుక వారు రక్షించబడరు. దేవుడు తన పనిలో ఉన్న వారందరినీ రక్షిస్తాడు, కానీ ఆయన రక్షణను పొందుకోలేని మనుష్యులు కూడా కొంత భాగం ఉన్నారు; కొద్దిమంది మాత్రమే ఆయన రక్షణను పొందగలరు. ఇది ఎందుకంటే, చాలా మంది ప్రజలు చాలా లోతుగా భ్రష్టు పట్టి ఉన్నారు మరియు మరణించిన వారయ్యారు, మరియు వారు రక్షణకు చాలా దూరముగా ఉన్నారు. వారు సాతాను చేత పూర్తిగా దోపిడీ చేయబడ్డారు మరియు వారు వారి స్వభావంలో చాలా హానికరమైనవారు. ఆ అల్పసంఖ్యాకులైన ప్రజలు కూడా దేవునికి పూర్తి విధేయత చూపలేరు. వారు మొదటినుండి కూడా దేవుని పట్ల సంపూర్ణ విశ్వాసపాత్రులుగా ఉన్నవారు కాదు లేదా మొదటి నుండి దేవునిపట్ల అత్యంత ప్రేమను కనపరిచే వారు కాదు; అయితే, వారు దేవుని యొక్క విజయవంతమైన కార్యాచరణ ఆధారముగా మాత్రమే దేవునికి విధేయులయ్యారు, వారు ఆయన అత్యున్నతమైన ప్రేమ కారణంగానే దేవునిని చూసారు, దేవుని యొక్క నీతిని అనుపాదించే దైవ స్వభావం కారణంగానే వారి స్వభావంలో మార్పులు జరిగాయి, వారు కేవలం దేవుని యొక్క క్రియల ద్వారా, అనగా ఆయన చేసే సాధారణ మరియు యదార్ధమైన క్రియల ద్వారానే ఆయనను తెలుసుకుంటారు. దేవుని యొక్క ఇట్టి క్రియలు లేకుండా, ఈ వ్యక్తులు ఎంత మంచివారైనప్పటికీ, వారు ఇంకా సాతాను కు చెందిన వారిగానే ఉంటారు, వారు ఇంకా మరణానికి సంబంధించిన వారిగా ఉండి మృతులుగా ఉండి పోతారు. ఇట్టి మనుష్యులు ఈ రోజు దేవుని రక్షణను పొందగలుగుతున్నారంటే, కేవలం వారు దేవునితో సహకరించడానికి సిద్ధంగా ఉన్నందు వలన మాత్రమే.

దేవుని పట్ల వారి కున్న విధేయత కారణంగా, జీవం కలిగినవారు దేవునిచే స్వీకరించబడతారు మరియు ఆయన వాగ్దానాల మధ్య జీవిస్తారు; అయితే దేవుని పట్ల వారికున్న వ్యతిరేకత కారణంగా, జీవం లేనివారు దేవునిచే గర్హించబడతారు, విసర్జించబడతారు మరియు ఆయన శిక్షలు మరియు శాపాల తో జీవిస్తారు. దేవుని యొక్క నీతియుక్తమైన ప్రవృత్తి అటువంటిది, ఇది ఏ మనిషి కారణంగానూ మార్చబడదు. వెలుగులో జీవించాలి అనే వారి స్వంత అన్వేషణ కారణంగానే, మనుష్యులు దేవుని ఆమోదాన్ని పొందుతారు; వారి మోసపూరిత పథకాల కారణంగా, ప్రజలు దేవునిచే శపించబడతారు మరియు శిక్షకు లోనవుతారు; వారి దుర్మార్గం కారణంగా, ప్రజలు దేవునిచే శిక్షించబడతారు. అలానే విశ్వసనీయత పట్ల వారికుండే బలీయమైన కోరిక మరియు విధేయత కారణంగా, ప్రజలు దేవుని ఆశీర్వాదాలను పొందుతారు. దేవుడు నీతిమంతుడు; ఆయన జీవం కలిగిన వారిని ఆశీర్వదిస్తాడు మరియు మృత స్థితిలో ఉన్నవారిని శపిస్తాడు, తద్వారా వారు ఎల్లప్పుడూ మరణం మధ్య కాలం గడుపుతూ ఉంటారు. అలానే దేవుని వెలుగులో ఎప్పటికీ జీవించలేరు. దేవుడు సజీవులను తనతో శాశ్వతముగా ఉండటానికి తన రాజ్యంలోకి మరియు ఆయన ఆశీర్వాదాలలోకి తీసుకు వస్తూ ఉంటాడు. కానీ, మరణించిన స్థితిలో ఉన్నవారి ని ఆయన నాశనానికి, శాశ్వతమైన మరణానికి అప్పగిస్తాడు. వారు నాశన పాత్రులుగా ఉండి ఎల్లప్పుడూ సాతానుకు చెందిన వారిగా ఉంటారు. దేవుడు ఎవరికీ అన్యాయంగా తీర్పు తీర్చడు. నిజంగా దేవునిని వెదికేవారందరూ ఖచ్చితంగా దేవుని సన్నిధిలోనే ఉంటారు మరియు దేవునికి అవిధేయులుగా ఉంటూ ఆయనకు ప్రతికూలముగా ఉంటూ జీవిస్తున్న వారందరూ ఖచ్చితంగా ఆయన శిక్షల మధ్య జీవిస్తారు. బహుశా మీరు శరీరంలో ఉండగా దేవుని కార్యాల గురించి మీకు ఖచ్చితంగా తెలియకపోవచ్చు—అయితే ఒకానొక రోజు, దేవుడు ఏర్పరిచిన శరీరం నేరుగా మనిషి యొక్క ముగింపును ఏర్పాటు చేయదు కానీ, దేవుని ఆత్మ మాత్రం మనిషి యొక్క గమ్యాన్ని ఏర్పాటు చేస్తుంది మరియు ఆ సమయంలో మనుష్యులు దేవుని శరీరం ఇంకా ఆయన ఆత్మ ఒక్కటే అని, ఆయన శరీరం తప్పు చేయలేదని మరియు ఆయన ఆత్మ తప్పు పోనివ్వదనియు మరింతగా తెలుసుకుంటారు. అంతిమంగా, ఆయన ఖచ్చితంగా తన రాజ్యంలోకి సజీవులుగా వచ్చిన వారందరినీ తీసుకుంటాడు; ఒకరిని ఎక్కువ కాదు ఒకరిని తక్కువ కాదు. మృతుల విషయానికొస్తే, జీవానికి రాని వారు సాతాను నివాస స్థలములో వదలి వేయబడతారు.

మునుపటి:  సత్యం ఆచరించని వారికి ఒక హెచ్చరిక

తరువాత:  మార్పులేని స్వభావాన్ని కలిగి ఉండటమంటే దేవునితో శత్రుత్వంలో ఉండటమే

సెట్టింగులు

  • వచనం
  • థీమ్స్

ఘన రంగులు

థీమ్స్

అక్షరశైలి

అక్షరశైలి పరిమాణం

గీతల మధ్య దూరం

గీతల మధ్య దూరం

పేజీ వెడల్పు

విషయ సూచిక

శోధించండి

  • ఈ వచనాన్ని శోధించండి
  • ఈ పుస్తకాన్ని శోధించండి

Connect with us on Messenger