విమోచన యుగం నాటి కార్యము వెనుక దాగియున్న నిజమైన కథ

నా సంపూర్ణ నిర్వహణ ప్రణాళిక అనేది ఆరువేల సంవత్సరాల నిర్వహణ ప్రణాళికయైయున్నది. అందులో మూడు దశలు లేదా మూడు యుగాలు భాగమై ఉన్నాయి: అవేమనగా, ఆరంభ ధర్మశాస్త్ర యుగం; కృపా యుగం (ఇదే విమోచన యుగం కూడా); మరియు అంత్య దినాల రాజ్య యుగం. ఈ మూడు యుగాలలో, ఆయా యుగాల రీతిని అనుసరించి, నేను చేయబోయే కార్యము భిన్నంగా ఉంటుంది. అయితే, ప్రతి దశలోనూ నేను చేయబోయే కార్యము మనిషి అవసరాలను తీర్చే విధంగా ఉంటుంది—లేదా, మరింత ఖచ్చితమైన మాటల్లో చెప్పాలంటే, సాతాను మీద నేను ప్రకటించిన యుద్ధంలో అది ప్రయోగించే కుతంత్రాలను ఎదుర్కోవడానికి అనుగుణంగా ఉంటుంది. సాతానును ఓడించడం, నా జ్ఞానమును మరియు సర్వశక్తిని వ్యక్తపరచడం, సాతాను తంత్రాలన్నిటిని బహిర్గతం చేయడం మరియు తద్వారా, సాతాను రాజ్యములో నివసిస్తున్న మానవ జాతినంతటి మొత్తాన్ని రక్షించడమే నేను చేయబోయే కార్యము యొక్క ముఖ్య ఉద్దేశమైయున్నది. నా జ్ఞానం మరియు సర్వశక్తిని ప్రదర్శించడం, భరింపశక్యం కాని సాతాను వికారపు చేష్టలను బహిర్గతం చేయడమూ ఇందులో భాగమే; అంతకుమించి, సృష్టించబడిన జీవములన్నీ మంచి చెడుల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసము గుర్తించేలా చేయడం, సమస్తాన్ని పరిపాలించువాడను నేనే అని తెలుసుకునేలా చేయడం, మానవాళియంతటికి సాతానుడే శత్రువని, నీచమైన దుష్టుడని స్పష్టంగా తెలియజెప్పడం, మంచి చెడుల మధ్యన వ్యత్యాసాన్ని, సత్యా అసత్యముల మధ్య వ్యత్యాసాన్ని, విశ్వాసమునకు పరిశుద్ధతకు మధ్యనున్న వ్యత్యాసాన్ని, ఏది గొప్పదో ఏది గొప్పది కాదో ఖచ్చితంగా చెప్పడానికి మానవాళిని అనుమతించడం కూడా ఇందులో భాగమై ఉంటుంది. తద్వారా, మానవాళిని భ్రష్టు పట్టించేది నేను కాదని, మానవాళిని రక్షించగల సృష్టికర్తను నేనేనని, మనుష్యులు ఆస్వాదించగలిగే వాటిని నేను మాత్రమే వారికి ప్రసాదించగలనని అవగాహన లేనటువంటి మానవాళి నాకు సాక్ష్యమివ్వగలుగుతుంది; సమస్తాన్ని పరిపాలించేవాడను నేనేనని మరియు నేను సృష్టించిన జీవములలో సాతాను కూడా ఒకడని మరియు ఆ తర్వాత అతను నాకు వ్యతిరేకిగా మారాడని వారు గ్రహిస్తారు. నా ఆరు వేల ఏళ్ల నిర్వహణ ప్రణాళిక మూడు దశలుగా విభజించబడింది, మరియు నా ద్వారా సృష్టించబడిన సర్వ జీవులు నాకు సాక్ష్యమివ్వాలని మరియు నా చిత్తమును గ్రహించి మరియు నేనే సత్యమని గ్రహించేలా చేయాలని ఈ విధమైన క్రమంలో నా కార్యములు చేస్తున్నాను. ఆ క్రమంలోనే, నా ఆరు వేల సంవత్సరాల నిర్వహణ ప్రణాళిక ప్రారంభ దశలో యెహోవా ప్రజలను నడిపించగలిగినటువంటి ధర్మశాస్త్ర కార్యమును జరిగించాను. యూదా గ్రామాల్లో కృపా యుగము యొక్క కార్యములో రెండవ దశకు నాంది పలకడం జరిగింది. విమోచన యుగానికి సంబంధించిన కార్యమంతటికీ యేసు ప్రాతినిధ్యం వహించాడు; యేసు శరీరధారిగా వచ్చి, సిలువ వేయబడ్డాడు. మరియు విమోచన యుగాన్ని కూడా ఆయనే ప్రారంభించాడు. ధర్మశాస్త్ర యుగానికి ముగింపు పలికి, కృపా యుగం ప్రారంభించడంలో భాగంగా, విమోచన కార్యమును సంపూర్తి చేయు క్రమములో ఆయన సిలువ వేయబడ్డాడు. అందుకే, ఆయనను “సర్వాధికారియని”, “పాప పరిహారార్థ బలియని” మరియు “విమోచకుడని” పిలుస్తారు. ఆ కారణంగానే, యెహోవా కార్యము మరియు యేసు కార్యము భిన్నమైనవిగా ఉంటాయి, అయినప్పటికీ వారి కార్యాలు ఒకే ఉద్దేశాన్ని కలిగియుంటాయి. భూమి మీద దేవుని కార్యమునకు మూలాధారం—ఆవిర్భావ కేంద్రం స్థాపించి, చట్టాలు మరియు ఆజ్ఞలు జారీ చేయడం ద్వారా యెహోవా ధర్మశాస్త్ర యుగం ప్రారంభించాడు. ఆయన చేసిన ఈ రెండు కార్యములు ధర్మశాస్త్ర యుగాన్ని సూచిస్తాయి. కృపా యుగంలో యేసు చేసిన కార్యము ద్వారా ధర్మశాస్త్ర నియమ నిబంధనలను పునర్ స్థాపించలేదు గానీ వాటిని నెరవేర్చడం జరిగింది. తద్వారా రెండు వేల సంవత్సరాల క్రితం ధర్మశాస్త్ర యుగానికి స్వస్తి చెప్పి, కృపా యుగానికి నాంది పలకడం జరిగింది. ఒక ఆవిష్కర్తగా, కృపా యుగం ప్రారంభించడానికే ఆయన వచ్చినప్పటికీ, ఆయన కార్యములో ప్రధాన భాగం విమోచన కార్యమైయుండెను. ఆకారణంగానే, ఆయన జరిగించిన కార్యము రెండు భాగాలు ఇమిడియున్నాయి: ఒకటి, నూతన యుగం ప్రారంభించడం, మరియు రెండవది, ఆయన సిలువ మరణ పునరుత్థానముల ద్వారా విమోచనా కార్యాన్ని పూర్తి చేయడం. ఆ తర్వాత, అక్కడితో ధర్మశాస్త్ర యుగం ముగిసిపోయింది మరియు అక్కడినుండి కృపా యుగం మొదలైంది.

ఆ యుగంలోని యేసు కార్యము మనుష్యుని అవసరాలకు అనుగుణంగా ఉండేది. ఆయన కార్యము మానవాళి విమోచించడం, వారి పాపములు క్షమించడమైయుండెను, అందుకే, ఆయన స్వభావం పూర్తిగా వినయం, ఓర్పు, ప్రేమ, భక్తి, సహనం, దయ, మరియు ప్రేమపూర్వకంగా ఉండేది. మానవాళి కోసం ఆయన సమృద్ధియైన కృపను మరియు ఆశీర్వాదములను తీసుకువచ్చాడు, మరియు ప్రజలు ఆస్వాదించడానికి అవసరంకాగల అన్నింటినీ ఆయన వారి ఆనందం కోసం అందించాడు: శాంతి మరియు సంతోషం, ఆయన ప్రదర్శించిన సహనం మరియు ప్రేమ, ఆయన క్షమాగుణం మరియు ప్రేమపూర్వక ఆదరణలాంటివన్నీ అందులో భాగమే. ఆ సమయంలో, ప్రజలకు వారి హృదయాల్లో శాంతి భద్రతా భావం, వారి ఆత్మలలో భరోసా అనే అనుభూతి, మరియు యేసుని రక్షకుడిగా భావించి ఆయన మీద ఆధారపడటం లాంటివి ఆ యుగంలో జీవించిన మనుష్యులకు సమృద్ధిగా అవసరమైన విషయాలుగా ఉండేవి. కృపా యుగంలో, మనుషి అప్పటికే సాతాను చేత భ్రష్టుడయ్యాడు, కాబట్టి, మానవాళిని విమోచించే కార్యము సాధించడానికి సమృద్ధిగా దయ, అనంతమైన సహనం మరియు ఓర్పు అవసరమైంది, మరియు అంతకంటే ఎక్కువగా, మానవాళి పాపాలకు ప్రాయశ్చిత్తానికి ప్రభావం చూపగల స్థాయిలో బలి అవసరమైంది. కృపా యుగములో సర్వ మానవాళి చూసినదంతా సర్వ మానవుల పాపముల కొరకు యేసు అనే నేను ప్రాయశ్చిత్త బలిగా అవ్వడమే చూశారు. దేవుడు దయగలవాడు మరియు సహనశీలుడు అని మాత్రమే వారికి తెలుసు, మరియు యేసు దయ మరియు ప్రేమపూర్వక తత్వాన్ని మాత్రమే వాళ్లు కళ్లారా చూశారు. వారు కృపా యుగంలో జన్మించడమే దీనంతటికీ కారణం. కాబట్టి, వారు విమోచన పొందడానికి ముందు, యేసు వారికి ప్రసాదించిన అనేక రకాల కృపను వారు ఆస్వాదించారు. ఈ విధంగా, కృపను ఆస్వాదించడం ద్వారా వారు వారి పాపాల నుండి క్షమాపణ పొందగలరు, మరియు యేసు వారి మీద చూపిన ఓర్పు మరియు సహనం ఆస్వాదించడం ద్వారా విమోచనం పొందే అవకాశం కూడా దక్కించుకోగలరు. ఎందుకంటే, యేసు వహించిన ఓర్పు మరియు సహనం ద్వారా మాత్రమే వారు క్షమాపణ పొందే హక్కును గెలుచుకున్నారు మరియు యేసు ప్రసాదించిన కృపను ఆస్వాదించారు. యేసు చెప్పినట్లుగా: నేను నీతిమంతులను కాకుండా పాపులకు విమోచన అందించడానికి వచ్చాను, పాపులు వారి పాపాల నుండి క్షమాపణ పొందడానికి అనుమతించాను. ఒకవేళ, యేసు శరీరధారిగా ఉన్న సమయంలో, మనిషి నేరాలకు తీర్పు, శాపం మరియు అసహనం ప్రదర్శించే స్వభావంతో ఉండి ఉంటే, అప్పుడు మనిషికి విముక్తి పొందే అవకాశం ఎప్పటికీ ఉండేది కాదు మరియు మనిషి ఎప్పటికీ పాపాత్ముడిగానే ఉండిపోయేవాడు. ఆవిధంగా జరిగి ఉంటే, ఆరు వేల సంవత్సరాల నిర్వహణ ప్రణాళిక ధర్మశాస్త్ర యుగంలోనే ఆగిపోయేది మరియు ఆరు వేల సంవత్సరాలూ ధర్మశాస్త్ర యుగమే నడిచేది. ఫలితంగా, మనిషి పాపాలు మరింత ఎక్కువగా మరియు మరింత బాధాకరమైనవిగా మారేవి మరియు మానవాళి సృష్టి నిష్ఫలంగా మారేది. అలాంటి పరిస్థితిలో ధర్మశాస్త్రానికి లోబడి మాత్రమే మనుష్యులు యెహోవాను సేవించేవారు. అయితే, అలాంటప్పుడు వారి పాపాలనేవి మొదటగా సృష్టించబడిన మానవుల కంటే పెద్ద సంఖ్యలో ఉంటాయి. అందుకే, యేసు మానవాళిని ఎంతగా ప్రేమించి, వారి పాపాలను క్షమించి, వారికి తగినంత క్షమాపణ మరియు దయ అందించాడో, అంత ఎక్కువగా యేసు ద్వారా రక్షింపబడటానికి మానవజాతి అర్హమైనది కావడంతో పాటు, వారిని తప్పిపోయిన గొర్రె పిల్లలను యేసు ఒక గొప్ప వెలకు వెనక్కి తీసుకువచ్చియున్నాడని పిలుస్తారు. అయితే, ఈ కార్యంలో సాతాను జోక్యం చేసుకోలేదు. ఎందుకంటే, ప్రేమగల తల్లి తన పసిబిడ్డను ఒడిలో పెట్టుకుని సంరక్షించినట్లుగా యేసు తన అనుచరులను చూసుకున్నాడు. వారి పట్ల ఆయన కోపం ప్రదర్శించలేదు లేదా అసహ్యించుకోలేదు. నిజానికి, పూర్తి ఓదార్పును ప్రదర్శించాడు; వారి మధ్య ఆయన ఎప్పుడూ కోపంతో చిందులేయలేదు. కానీ, “ఇతరులను డెబ్బై ఏడుసార్లు క్షమించు” అని చెప్పే స్థాయిలో ఆయన వారి పాపాలను విస్మరించాడు మరియు వారి మూర్ఖత్వం మరియు అజ్ఞానం చూడకుండా కళ్ళు మూసుకున్నాడు. ఆ విధంగా, ఆయన హృదయం ద్వారా ఇతరుల హృదయాలు రూపాంతరం చెందాయి మరియు ఆయన సహనం ద్వారా మనుష్యులు వారి పాపాలకు క్షమాపణ పొందారు.

యేసు శరీరధారిగా ఉన్నప్పుడు ఎలాంటి భావోద్వేగమూ ప్రదర్శించనప్పటికీ, ఆయన ఎల్లప్పుడూ తన శిష్యులను ఓదార్చాడు, వారికి అవసరమైనవి అందించాడు, వారికి సహాయం చేశాడు మరియు వారికి మద్దతుగా నిలిచాడు. ఆయన ఎంతటి కార్యము చేసినప్పటికీ, లేదా ఎంతటి బాధను ఓర్చుకున్నప్పటికీ, ఆయన ఎప్పుడూ మనుష్యుల నుండి దేనినీ పెద్ద మొత్తంలో కోరుకోలేదు. ఎల్లప్పుడూ సహనంతో ఉంటూ, వారి పాపాలను సహించాడు. అందుకే, కృపా యుగంలోని ప్రజలు ఆయనను “ప్రేమ స్వరూపంతో రక్షకుడైన యేసు” అని ప్రేమగా పిలిచారు. ఆ కాలపు మనుష్యులకు—మనుష్యులందరికి—యేసు అంటే, దయ మరియు ప్రేమపూర్వక దయ కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. ప్రజల అతిక్రమములను ఆయన ఎన్నడూ గుర్తుంచుకోలేదు మరియు వారి పట్ల ఆయన వ్యవహరించే తీరు వారి అతిక్రమాల మీద ఆధారపడి ఉండేది కాదు. అదొక విభిన్నమైన యుగమైయుండెను, ఆయన తరచుగా మనుష్యులకు సమృద్ధిగా ఆహారం అందించాడు. తద్వారా వారు కడుపునిండా తినేవారు. ఆయన తన అనుచరులందరినీ దయతో చూశాడు, రోగులను స్వస్థపరిచాడు, దయ్యాలను పారద్రోలాడు, చనిపోయిన వారిని తట్టి లేపాడు. మనుష్యులు ఆయన్ని విశ్వసించడం కోసం మరియు ఆయన ఆ కార్యములన్నింటినీ శ్రద్ధగా మరియు మనఃపూర్వకముగా చేశాడని మనుష్యులు గ్రహించేలా చేయడం కోసం కుళ్ళిన శవాన్ని సహితం జీవముగల వ్యక్తిగా చేయునంత స్థాయికి వెళ్ళాడు. తద్వారా, తన స్పర్శతో చనిపోయిన వారు సైతం మళ్లీ జీవం పోసుకుంటారని చూపించాడు. ఈ విధంగా, ఆయన అన్నింటినీ మౌనంగా సహిస్తూ, వారి మధ్య తన విమోచన కార్యమును నిర్వహించాడు. తాను సిలువలో వ్రేలాడదీయబడక ముందే, యేసు మానవాళి పాపాలను స్వయంగా స్వీకరించాడు మరియు మానవజాతి పాప పరిహారార్థం కోసం తాను బలి అయ్యాడు. సిలువ వేయబడడానికి ముందే, మానవాళికి విమోచనం కోసం ఆయన సిలువకెక్కడానికి మార్గం చూపాడు. అంతిమంగా, ఆయన సిలువలో వ్రేలాడదీయబడ్డాడు. సిలువలో ప్రాణం అర్పించుట కోసం తనను తానే త్యాగం చేసాడు మరియు తన కరుణ, ప్రేమపూర్వక దయ మరియు పరిశుద్ధతను మానవాళికి ప్రసాదించాడు. మానవాళి పట్ల, ఆయన ఎల్లప్పుడూ సహనంతో, ఏమాత్రం పగ కార్పణ్యాలు లేకుండా, వారి పాపాలను క్షమిస్తూ, పశ్చాత్తాప పడుట కొరకు వారిని ప్రోత్సహించాడు మరియు ఓర్పు, సహనం మరియు ప్రేమ కలిగి ఉండాల్సిందిగా వారికి బోధించాడు. తన అడుగుజాడల్లో నడవాలని మరియు సిలువ కోసం తమను తాము త్యాగం చేయాలని బోధించాడు. సోదరులు మరియు సోదరీల మీద ఆయనకున్న ప్రేమ మరియ మీద ఉన్న ప్రేమకంటే మించిపోయింది. తాను తలపెట్టిన విమోచనం అనే ప్రధాన కార్యము కొరకు వ్యాధిగ్రస్తులను స్వస్థపరచడం మరియు దయ్యాలను తరిమికొట్టడం అంటూ ఆయన ఎంచుకున్న కార్యములన్నీ ఒక నియమముగా ఎంచుకున్నాడు. ఆయన ఎక్కడికి వెళ్లినా, తనను అనుసరించే వారందరినీ దయతో చూసుకున్నాడు. పేదలను ధనవంతులగా, కుంటి వారిని నడిచేలా, అంధులను చూడగలిగేలా, చెవిటి వారిని వినగలిగేలా చేశాడు. తాను కూర్చున్న బల్ల మీద తనతో పాటు కూర్చోవాల్సిందిగా ఆయన అధములను, నిరుపేదలను, పాపులను సైతం ఆహ్వానించాడు, అలాంటి వారిని ఆయన ఎప్పుడూ దూరంగా ఉంచలేదు. కానీ, ఎల్లప్పుడూ వారి పట్ల సహనం ప్రదర్శించడమే కాకుండా, ఒక గొర్రెల కాపరి తాను కాపు కాసే వంద గొర్రెల్లో ఒకటి తప్పిపోయినా సరే, దానిని వెతకడం కోసం, మిగిలిన తొంభై తొమ్మిదింటిని వదలి వెళ్తాడు. ఆ గొర్రె దొరికినప్పుడు అతడు ఎంతగానో సంతోషిస్తాడని చెప్పేవాడు. ఒక గొర్రె దాని పిల్లలను ప్రేమించినట్లుగా ఆయన తన అనుచరులను ప్రేమించాడు. వారు మూర్ఖులు మరియు అజ్ఞానులు మాత్రమే కాకుండా, ఆయన దృష్టిలో పాపులు కూడా అయినప్పటికీ, మరియు సమాజంలో అత్యంత దీనులుగా ఉన్నప్పటికిని, ఇతరులు తృణీకరించిన ఈ పాపులను తన కంటికి రెప్పలాగా భావించాడు. వారి మీద దయ చూపించాడు. బలిపీఠం మీద గొర్రెపిల్ల లాగా, వారి కోసం తన ప్రాణం అర్పించాడు. ఒక సేవకుడిగా ఆయన వారి మధ్యకు వెళ్లాడు. వారు తనను ఉపయోగించుకోవడానికి మరియు తనను వధించడానికి సైతం, వారికి బేషరతుగా లొంగిపోయాడు. అనుచరులకు ఆయన ప్రేమగల రక్షకుడైన యేసు. కానీ, ఉన్నత పీఠం నుండి ప్రజలకు ఉపన్యాసాలు ఇచ్చే పరిసయ్యుల పట్ల ఆయన దయ మరియు ప్రేమపూర్వక దయ చూపలేదు. కానీ, అసహ్యం మరియు ఆగ్రహాన్ని ప్రదర్శించాడు. ఆయన పరిసయ్యుల మధ్య ఉంటూ ఎక్కువ కార్యములు చేయలేదు. అప్పుడప్పుడు మాత్రమే ఉపన్యాసాలు ఇస్తూ, వారిని మందలించాడు; ఆయన వారి మధ్య విమోచన కార్యము చేయలేదు. సూచక కార్యములు మరియు అద్భుతాలు చేయలేదు. అనుచరులకు మాత్రమే ఆయన తన దయను మరియు ప్రేమపూర్వక దయను ప్రసాదించాడు. సిలువ మీద వ్రేలాడదీయబడిన చివరి క్షణం వరకు ఆయన ఈ పాపుల కోసమే అన్నింటినీ సహించాడు మరియు మానవాళి మొత్తాన్ని పూర్తిగా విమోచించే వరకు ఆయన ప్రతి అవమానాన్ని చవి చూశాడు. ఆయన కార్యము మొత్తం ఈ విధంగానే సాగింది.

యేసు విమోచనా కార్యము లేకపోయినట్లయితే, మానవాళి ఎప్పటికీ పాపంలోనే జీవిస్తూ, పాపపు సంతానంగా, దయ్యాల వారసులుగా మారేవారు. ఇదే కొనసాగి ఉంటే, ప్రపంచం మొత్తం సాతాను నివాసించే భూమిగా, అతని నివాస ప్రదేశంగా మారిపోయి ఉండేది. అయితే, విమోచన కార్యమునకు మానవాళి పట్ల కరుణ మరియు ప్రేమపూర్వక దయ చూపడం అవసరం; అలాంటి మార్గాల ద్వారా మాత్రమే మానవాళి క్షమాపణ పొందగలదు మరియు చివరికి దేవుని కృపను సంపూర్ణంగా మరియు పూర్తిగా పొందుకునే హక్కును పొందగలదు. ఆ క్రమంలో, ఈ దశలో కార్యము జరగకుండ, ఆరు వేల సంవత్సరాల నిర్వహణ ప్రణాళిక ముందుకు సాగదు. యేసు సిలువ వేయబడకపోతే, జబ్బుపడిన మరియు దెయ్యం పట్టిన వారిని మాత్రమే స్వస్థపరస్తూ ఉన్నట్లయితే, మనుష్యులు వారి పాపాల నుండి సంపూర్ణంగా క్షమించబడరు. యేసు ఈ భూమి మీద తన కార్యమును చేస్తూ గడిపిన మూడున్నర సంవత్సరాల్లో, తన విమోచన కార్యములో ఆయన సగం మాత్రమే పూర్తి చేశాడు; ఆ తరువాత, సిలువకు వ్రేలాడదీయబడి, మరియు పాపభూయిష్టమైన మానవ శరీరముగా మారి, దుష్టునికి అప్పగించబడడం ద్వారా, సిలువ వేయబడడం అనే కార్యమును ఆయన పూర్తి చేసాడు మరియు మానవాళి గమ్యస్థానానికి మార్గానికి సుగమం చేశాడు. సాతాను చేతికి అప్పగించబడిన తర్వాత మాత్రమే ఆయన మానవాళిని విమోచించాడు. ముప్పై మూడున్నర సంవత్సరాలు ఆయన ఈ భూమి మీద కష్టాలు అనుభవించాడు. ఎంతో హేళనకు, దుర్భాషలకు గురయ్యాడు మరియు తృణీకరించబడ్డాడు. తలవాల్చుకోవడానికి తలగడ పెట్టుకొని విశ్రాంతి తీసుకోవడానికి స్థలమేలేని స్థితిలో జీవించాడు. తరువాత కొద్ది కాలానికి తనను తాను పూర్తిగా, అనగా ఎటువంటి పాపం ఎరుగని తన పరిశుద్ధ శరీరాన్ని సిలువకు అప్పగించుకున్నాడు, ఆవిధంగా, అక్కడ ఆయన అన్ని రకాల శోధనలు భరించాడు. అధికారంలో ఉన్నవారు ఆయనను హేళన చేశారు మరియు కొరడాలతో కొట్టారు, మరియు సైనికులు సైతం ఆయన ముఖం మీద ఉమ్మివేసారు; అయినప్పటికీ, ఆయన మౌనంగానే నిలిచాడు మరియు చివరి వరకు అన్నింటినీ సహించాడు, బేషరతుగా మరణానికి లొంగిపోయాడు. ఆవిధంగా, మానవాళికి ఆయన విమోచన కలిగించాడు. ఆతర్వాత మాత్రమే ఆయన విశ్రాంతి తీసుకోవడానికి సిద్ధమయ్యాడు. యేసు కార్యము కృపా కృపా యుగానికి మాత్రమే ప్రాతినిధ్యం వహించింది; ఇది ధర్మశాత్ర యుగానికి ప్రాతినిధ్యం కాదు; అలాగే, ఇది అంత్య దినముల కార్యమునకు కూడా ప్రత్యామ్నాయం కాదు. ఇది విమోచనా యుగం ద్వారా మానవాళియంతయు విమోచనము పొందే రెండవ యుగమైన కృపా యుగములో జరిగిన యేసు కార్యమునకు సారమునైయున్నది.

మునుపటి:  న్యాయ కాలములో కార్యము

తరువాత:  యవ్వనులు మరియు వయోవృద్ధుల కోసం వాక్యములు

సెట్టింగులు

  • వచనం
  • థీమ్స్

ఘన రంగులు

థీమ్స్

అక్షరశైలి

అక్షరశైలి పరిమాణం

గీతల మధ్య దూరం

గీతల మధ్య దూరం

పేజీ వెడల్పు

విషయ సూచిక

శోధించండి

  • ఈ వచనాన్ని శోధించండి
  • ఈ పుస్తకాన్ని శోధించండి

Connect with us on Messenger