యవ్వనులు మరియు వయోవృద్ధుల కోసం వాక్యములు
నేను ఈ భూమి పైన విస్తారమైన కార్యాన్ని చేశాను, మరియు మానవాళి మధ్య నేను చాలా సంవత్సరాల పాటు నడిచాను, అయినప్పటికీ నా ప్రతిరూపం మరియు నా స్వభావం గురించి జనులకు జ్ఞానం అరుదుగానే ఉంది, మరియు కొద్దిమంది జనులు మాత్రమే నేను చేసే కార్యాన్ని లోతుగా వివరించగలరు. జనులకు అర్థం కాని విషయాలు చాలా ఉన్నాయి. నేను చేసే దానిపై వారికి ఎప్పుడూ అవగాహన ఉండదు, నేను వారిని మరొక పరిస్థితిలో వదలివేసి, ఇకపై మనసు నిలపనేమో అని తీవ్రంగా భయపడుతున్నట్లుగా వారి హృదయాలు ఎల్లప్పుడూ అప్రమత్తతతో ఉంటాయి. అందువలన, నా పట్ల జనుల దృక్పదాలు ఎల్లప్పుడూ ఒక మోస్తరు బలమైన జాగ్రత్తతో ఉంటాయి. ఎందుకంటే నేను చేసే కార్యాన్ని అర్థం చేసుకోకుండానే జనులు వర్తమానానికి వచ్చారు. మరీ ముఖ్యంగా, నేను వారితో మాట్లాడే మాటలకు వారు బిక్క చచ్చి పోయారు. వారు నా వాక్యాలను తమ చేతుల్లో ఉంచుకుంటారే తప్ప, వారు వాటిపై ఉన్న అచంచలమైన విశ్వాసానికి కట్టుబడి ఉండాలా లేదా వారు అనిశ్చితిని ఎంచుకొని వాటిని మర్చిపోవాలా అనేది వారికి తెలియదు. వారు వాటిని ఆచరణలో పెట్టాలా, లేదా వేచి చూడాలా, వారు అన్నిటినీ పక్కనబెట్టి దైర్యంగా వెంబడించాలా, లేదా మునుపటిలా ప్రపంచం పట్ల స్నేహాన్ని కొనసాగించాలా అనేది వారికి తెలియదు. ప్రజల అంతర్గత ప్రపంచాలు చాలా క్లిష్టమైనవి, మరియు అవి చాలా మోసపూరితమైనవి. జనులు నా మాటలను స్పష్టంగా లేదా పూర్తిగా చూడలేరు కాబట్టే, వారిలో చాలామందికి వాటిని ఆచరించడం చాలా కష్టతరం అవుతుంది మరియు వారి హృదయాలను నా ముందు పరచడం ఇబ్బందిగానే తోస్తుంది. నేను మీ ఇబ్బందులను లోతుగా అర్థం చేసుకున్నాను. శరీరంతో జీవిస్తున్నప్పుడు అనేక బలహీనతలు అనివార్యమైనవి, మరియు అనేక వాస్తవికమైన కారణాలు మీకు ఇబ్బందులను కలుగజేస్తాయి. మీరు మీ కుటుంబాన్ని పోషిస్తారు, కష్టపడి పని చేస్తూ మీ రోజులను గడుపుతారు, మరియు నెలలు, సంవత్సరాలు కష్టాల్లో గడిచిపోతాయి. శరీరంతో జీవించడంలోనే చాలా ఇబ్బందులు ఉన్నాయి—నేను దీన్ని తిరస్కరించడం లేదు, మరియు మీ నుండి నేను కోరినవి సహజంగానే మీ ఇబ్బందులకు అనుగుణంగా తయారు చేయబడ్డాయి. నేను చేసే కార్యంలో అవసరాలన్నీ మీ వాస్తవ స్థాయి మీద ఆధారపడి ఉన్నాయి. బహుశా గతంలో, జనులు తమ పనిలో మీ దగ్గర నుండి కోరినవి మితిమీరిన అంశాలతో మిళతమై ఉండవచ్చు, కానీ నాకు ఎప్పుడూ మీ నుండి ఎక్కువ కోరికలు లేవు అని మీకు తెలియాలి. కోరికలన్నీ జనుల స్వభావం, శరీరం మరియు వారికి ఏది అవసరం అనే మీద ఆధారపడి తయారు చేయబడ్డాయి. నేను మానవాళి సహజసిద్దమైన స్వభావాన్ని వ్యతిరేకించనని, జనులు కలిగివుండే నిర్దిష్టమైన సహేతుక ఆలోచన విధానాలను నేను వ్యతిరేకించని మీకు తెలియాలి, మరియు మీకు చాలా స్పష్టంగా చెప్పగలను. నా మాటల పట్ల ప్రజలు ఇప్పటివరకు సందేహాస్పదంగానే ఉండడానికి కారణం, నిజానికి నేను పెట్టిన ప్రమాణాలు ఏమిటో వారికి అర్థం కాలేదు, మరియు వారికి నా వాక్యాల నిజమైన భావం కూడా అర్ధం కాలేదు, మరియు సగం కంటే తక్కువ మంది నా మాటలు విశ్వసిస్తున్నారు. మిగిలిన వారు అవిశ్వాసులు, మరియు నేను “కథలు చెప్పడం” ఇష్టపడేవారు ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. అంతేకాకుండా ఈ వేడుకను ఆస్వాదించే వారు చాలామంది ఉన్నారు. నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను: నా యందు విశ్వాసముంచిన వారికి నా చాలా మాటలు ఇప్పటికే తెరవబడి ఉన్నాయి. రాజ్యపు అందమైన దృశ్యాన్ని ఆస్వాదించినా, దాని ద్వారం వెలుపల బంధింపడి ఉన్నవారు ఇప్పటికే నా చేత వెలివేయబడ్డారు. మీరు కేవలం నాచే అసహ్యించుకోబడిన మరియు తిరస్కరించబడిన కలుపు మొక్కలు కాదా? నేను వెళ్లిపోవడాన్ని చూస్తూ తిరిగి నా రాకను ఆనందంగా మీరు ఎలా స్వాగతించగలరు? నేను మీకు చెప్తున్నాను, నినివే జనులు యెహోవా కోపంతో కూడిన మాటలు విన్న తర్వాత, వారు వెంటనే గోనెపట్ట మరియు బూడిదలో పశ్చాత్తాప పడ్డారు. వారు ఆయన మాటలను విశ్వసించారు కాబట్టే వారు భయంతో, దిగులుతో నిండిపోయారు అందువలన వారు గోనె పట్ట మరియు బూడిదలో పశ్చాత్తాప పడ్డారు. నేటి జనుల విషయంలో, మీరు కూడా నా మాటలను విశ్వసించకపోవడమే కాకుండా, అంతకన్నా ఎక్కువగా, నేడు యెహోవా మరొకమారు ఈరోజు మీ మధ్యకు వచ్చాడని విశ్వసించినట్లయితే, మీ వైఖరి అగౌరవకరమైనదే తప్ప మరొకటి కాదు. వేల సంవత్సరాల క్రితం, యూదాలో జన్మించిన యేసు ఇప్పుడే మీ మధ్యకు రావడం మీరు గమనించినట్లుగా మీరు ప్రవర్తిస్తున్నారు. మీ హృదయాల్లో ఉన్న వంచనను నేను లోతుగా అర్థం చేసుకున్నాను; మీలో చాలామంది నన్ను కేవలం కుతూహలంతో వెంబడిస్తారు మరియు ఖాళీతనం వల్ల నన్ను వెతకడానికి వచ్చారు. మీ మూడో కోరిక—శాంతియుతమైన మరియు ఆనందకరమైన జీవితం పట్ల మీ కోరిక—తునాతునకలైనపుడు, మీ కుతూహలం కూడా చెదిరిపోతుంది. మీ ప్రతి ఒక్కరి హృదయాలలో ఉన్న వంచన మీ మాటలు మరియు పనుల ద్వారా బయలు పరచబడుతుంది. నిర్మొహమాటంగా చెప్పాలంటే, మీరు కేవలం నా పట్ల కుతూహలంతో ఉన్నారే తప్ప, నాకు భయపడడం లేదు; మీరు మీ నాలుకలను పట్టించుకోరు, మీ ప్రవర్తనలో మీరు నిగ్రహాన్ని అసలే పాటించరు. అలాంటప్పుడు మీకు నిజానికి ఎలాంటి విశ్వాసం ఉంది? అది యదార్థమైనదేనా? మీరు కేవలం మీ చింతలను దూరం చేయడానికి మరియు మీ విసుగును తగ్గించడానికి, మీ జీవితంలో మిగిలి ఉన్న ఖాళీ స్థలాలను పూరించడానికి నా వాక్యాలను ఉపయోగిస్తారు. మీలో ఎవరు నా వాక్యాలను ఆచరణలో పెట్టారు? ఎవరికి నిజమైన విశ్వాసం ఉంది? మీరు జనుల హృదయాలలోకి లోతుగా చూసే దేవుడే దేవుడు అని అరుస్తూ ఉంటారు కానీ, మీరు మీ హృదయాలలో అరిచే దేవుడు నాకు అనుకూలంగా ఎలా ఉంటాడు? మీరు ఇలా అరుస్తున్నపుడు, మీరు అలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? మీరు నాకు తిరిగి ఇవ్వాలనుకుంటున్న ప్రేమ ఇదేనా? మీ పెదవులపై చిన్నపాటి అంకితభావం లేదు, మరి మీ త్యాగాలు, మీ మంచి పనులు ఎక్కడ ఉన్నాయి? మీ మాటలు నా చెవికి చేరడం వల్ల కాకపోతే, నేను నిన్ను మిమ్మల్ని అంతలా ఎలా ద్వేషించగలను? మీరు నిజంగా నా యందు విశ్వాసముంచితే, మీరు అటువంటి వ్యాకుల స్థితిలో ఎలా పడగలరు? మీరు నరకంలో విచారణ ఎదుర్కొంటున్నట్టు మీ ముఖాలపై నిస్పృహ నిండిన చూపులతో ఉన్నారు. మీలో లేసమంతైనా తేజస్సు లేదు, మరియు మీరు మీ అంతర్గత స్వరం గురించి బలహీనంగా మాట్లాడతారు; మీరు ఫిర్యాదులు మరియు శాపాలతో కూడా నిండి ఉన్నారు. చాలా కాలం క్రితమే నేను చేసే కార్యంపై మీరు విశ్వాసం కోల్పోయారు మరియు మీ అసలైన విశ్వాసం కూడా అదృశ్యమైంది, కాబట్టి మీరు చివరి వరకు ఎలా అనుసరించగలరు? ఇది అలా ఉంటే, మీరు ఎలా రక్షించబడతారు?
మీకు నా పని చాలా సహాయకరంగా ఉన్నప్పటికీ, నా పదాలు ఎల్లప్పుడూ మీలో కోల్పోతాయి మరియు మీలో ఏ విధమైన ప్రభావమూ చూపవు. నాచేత పరిపూర్ణం అవ్వగలిగే వస్తువులను కనుగొనడం చాలా కష్టం, మరియు ఈ రోజు నేను మీపై ఆశను దాదాపుగా కోల్పోయాను. నేను చాలా సంవత్సరాలుగా మీ మధ్య వెతికాను కానీ, నాకు నమ్మకస్తుడుగా ఉండే వ్యక్తిని కనుగొనడం కష్టతరంగానే మారింది. మీ లోపల కార్యం చేయడం కొనసాగించాలనే విశ్వాసం నాకు లేదు, మరియు మిమ్మల్ని ప్రేమించడం కొనసాగించడానికి ఎలాంటి ప్రేమ లేదు అని నేను భావిస్తున్నాను. ఇది ఎందుకంటే, నేను చాలా కాలం క్రితమే మీ “విజయాలు” చూసి అసహ్యించుకున్నాను, అవి అల్పమైనవి మరియు దయనీయమైనవి; నేను మీ మధ్య ఎప్పుడూ మాట్లాడనట్లు మరియు మీలో ఎప్పుడూ కార్యము చేయనట్లుగా అనిపిస్తుంది. మీ విజయాలు చాలా వికారమైనవి. మీరు ఎల్లప్పుడూ మీపై నాశనాన్ని మరియు అవమానాన్ని గొని తెచ్చుకుంటారు మరియు మీకు దాదాపుగా ఏ విలువా లేదు. మీలో నేను బొటాబొటిగా మాత్రమే మానవుని పోలికలు కనుగొనగలను లేదా మనిషి జాడను పసిగట్టగలను. మీ తాజా పరిమళం ఎక్కడ? అనేక సంవత్సరాలుగా మీరు చెల్లించిన వెల ఎక్కడ మరియు ఫలితాలు ఎక్కడ? మీరు ఎన్నడూ ఏదీ కనుగొనలేదా? నా పనికి ఇప్పుడు ఒక కొత్త ఆరంభం ఉంది, ఒక కొత్త ప్రారంభం. నేను గొప్ప ప్రణాళికలను అమలు చేయబోతున్నాను అంతకంటే గొప్ప కార్యాన్ని సాధించాలని కోరుకుంటున్నప్పటికీ, అయినప్పటికీ మీరు ఇంకా గతంలోని మరుగు నీటిలో జీవిస్తూ మునుపటిలా బురదలో పొర్లాడుతున్నారు, మరియు మీ అసలైన దురవస్థ నుండి మిమ్మల్ని మీరు విడిపించుకోవడంలో ఆచరణాత్మకంగా విఫలమయ్యారు. కాబట్టి, మీరు ఇప్పటికీ నా వాక్యాల నుండి ఏదీ పొందలేదు. మీరు ఇప్పటికీ మరుగు నీటి నుండి మరియు మీ అసలైన బురద ప్రదేశం నుండి మిమ్మల్ని మీరు విడిపించుకోలేదు, మరియు మీకు మాత్రమే నా వాక్యాలు తెలుసు, కానీ వాస్తవానికి మీరు నా వాక్యాల స్వేచ్ఛారాజ్యం లోనికి ప్రవేశించలేదు, కాబట్టి మీకు నా వాక్యాలు ఎప్పుడూ తెరవబడలేదు; అవి వేల సంవత్సరాలుగా మూసి ఉన్న ప్రవచన గ్రంథం లాంటివి. నేను మీ జీవితాలలో మీకు అగుపిస్తాను కానీ, మీరు ఎల్లప్పుడూ దాని గురించి ఎరుకలో ఉండరు. మీరు నన్ను గుర్తించలేరు కూడా. నేను చెప్పే వాక్యాలలో సగానికి దగ్గరగా మీ పట్ల తీర్పు తీర్చడంలో ఉన్నాయి మరియు అవి చూపవల్సిన ప్రభావంలో సగం మాత్రమే చూపుతాయి. అవి మీలోపల లోతైన భయాన్ని కలిగించడమే అందుకు కారణం. మిగిలిన సగం వాక్యాలు జీవితం గురించి మరియు మిమ్మల్ని మీరు ఎలా క్రమశిక్షణలో ఉంచుకోవాలో నేర్పేలా ఉంటాయి. ఏదేమైనా, మీకు సంబంధించినంతవరకు ఈ వాక్యాలు కనీసం ఉనికిలో లేనివని, లేదా మీరు ఎప్పుడూ చర్య తీసుకోకుండా ఎల్లప్పుడూ ముసుగుతో కూడిన చిరునవ్వు చిందిస్తూ వినే చిన్నపిల్లల మాటల్లా అనిపించవచ్చు. మీరు ఈ విషయాల గురించి ఎప్పుడూ పట్టించుకోలేదు; ఎందుకంటే, ఎల్లప్పుడూ ప్రధానంగా కుతూహలం పేరుతో మీరు నా చర్యలను గమనించారు, దాని ఫలితంగా మీరు ఇప్పుడు చీకటిలో పడిపోయారు మరియు వెలుగుని చూడలేరు, కాబట్టి మీరు చీకటిలో దయనీయంగా ఏడుస్తున్నారు. నాకు కావలసింది మీ విధేయత, మీ షరతులు లేని విధేయత, మరియు అంతకంటే ఎక్కువగా, మీరు నేను చెప్పే ప్రతిదాని గురించి పూర్తి నిశ్చయతతో ఉండాలని నేను కోరుతున్నాను. మీరు నిర్లక్ష్య ధోరణిని అలవరచుకోకూడదు మరియు ప్రత్యేకించి మీరు నేను చెప్పే విషయాలను ఎంచుకొని వ్యవహరించకూడదు, లేదా మీరు నా వాక్యాలు మరియు నా కార్యము పట్ల ఉదాసీనంగా ఉండకూడదు. నా కార్యము మీ మధ్యలో జరిగింది మరియు నేను మీకు అనేకమైన నా వాక్యాలను అందజేసాను, కానీ మీరు నాతో ఈ విధంగా వ్యవహరిస్తే, మీరు పొందని లేదా ఆచరణలో పెట్టని వాటిని నేను అన్య కుటుంబాలకు మాత్రమే ఇవ్వగలను. సృష్టించబడిన జీవులన్నిటిలో నాద్వారా నా చేతుల్లో పట్టుకోబడనిది ఎవరు? మీలోని చాలా మంది “పండు ముసలి వయసు” వారు, మరియు నాకు ఉన్న ఈ విధమైన కార్యాన్ని అంగీకరించే శక్తి మీకు లేదు. మీరు హన్‌హావో[ఎ] పక్షి వంటి వారు, ఇప్పుడే అంతంతమాత్రంగా వెళ్తున్నారు, మరియు మీరు నా వాక్యాలను ఎన్నడూ గంభీరంగా పరిగణించలేదు. యువకులు అత్యంత నిష్ఫలంగా మరియు అతిభోగవంతంగా ఉన్నారు మరియు నా కార్యము పట్ల తక్కువగానే మనసు లగ్నం చేస్తారు. నా విందులోని రుచికరమైన వంటకాలను ఆరగించడంలో వారికి ఎటువంటి ఆసక్తి లేదు; వారు దూరాలకు తరలి వెళ్ళడానికి పంజరం నుండి బయటకు ఎగిరిన చిన్న పక్షి వంటి వారు. ఈ రకమైన యువకులు మరియు వృద్ధులు నాకు ఎలా ఉపయోగపడగలరు? వయసు మళ్ళిన వారు, వారు చనిపోయిన తర్వాత వారి ఆత్మలు స్వర్గానికి వెళ్లేలా తమ సమాధులలో ఉండేంత వరకు నా పదాలను పింఛనుగా ఉపయోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు; వారికి ఇది సరిపోతుంది. ఈ వృద్ధులు ఇప్పుడు ఎల్లప్పుడూ “గొప్ప ఆకాంక్షలు” మరియు “అచంచలమైన విశ్వాసాన్ని” ఆశ్రయిస్తారు. వారు నా కార్యము పట్ల గొప్ప సహనము కలిగి ఉన్నప్పటికీ, వృద్ధులు కలిగి ఉండే నిటారైన మరియు లొంగని గుణం అనేది, ఎవరి చేతనైనా లేదా దేనిచేతనైనా లాగివేయబడటానికి లేదా ఓడించబడటానికి నిరాకరించినప్పటికీ—నిజానికి, వారు ఒక అజేయమైన కోట వంటివారు—కానీ అంధ విశ్వాసపు వ్యాధిగ్రస్త ముసుగులో కప్పబడి ఉన్నది ఈ వ్యక్తుల విశ్వాసం కాదా? వారి మార్గం ఎక్కడ ఉంది? వారికి, వారి మార్గం చాలా పెద్దది లేదా చాలా దూరమైనది కాదా? నా చిత్తం వారికి ఎలా తెలుస్తుంది? వారి విశ్వాసం మెచ్చుకోదగినదే అయినప్పటికీ, ఈ పెద్దలలో ఎంతమంది వాస్తవానికి జీవితాన్ని వెంబడిస్తూ అయోమయ మార్గంలో అనుసరించడం లేదు? నా కార్యపు అసలైన ప్రాముఖ్యతను ఎంతమంది నిజంగా అర్థం చేసుకున్నారు? సమీప భవిష్యత్తులో వారు నరకంలోకి పోకుండా, నా ద్వారా మరొక రాజ్యానికి తీసుకురాబడటానికి కాకుండా ఈ ప్రపంచంలో నేడు నన్ను అనుసరించడం ఎవరి ఉద్దేశ్యం? మీరు మీ గమ్యస్థానం అంత సులువైన విషయం అని అనుకుంటున్నారా? మీ యువకులందరూ యవ్వన సింహాల వలె ఉన్నప్పటికీ, మీ హృదయాలలో మీకు నిజమైన మార్గం చాలా అరుదుగా ఉంటుంది. మీ యవ్వనం మీకు ఎక్కువగా నా కార్యంలో అర్హత కల్పించదు; దీనికి విరుద్ధంగా, మీరు ఎల్లప్పుడూ మీ పట్ల నాకు గల అసహ్యాన్ని రెట్టిస్తారు. మీరు యవ్వనస్తులైనప్పటికీ, మీకు చైతన్యం లేదా ఆశయం ఏదోఒకటి ఉండదు, మరియు మీరు మీ భవిష్యత్తు గురించి ఎల్లప్పుడూ నిబద్ధతతో ఉండరు; మీరు ఉదాసీనంగా మరియు మధనపడుతున్నట్లుగా ఉంటారు. యవ్వనస్తులలో ఉండవలసిన తేజస్సు, ఆదర్శాలు, మరియు ఎంచుకున్న దృక్పధం మీలో ఖచ్చితంగా కనిపించదనే చెప్పవచ్చు; ఎటువంటి వైఖరి లేకుండా, తప్పొప్పుల, మంచి మరియు దుష్టత్వపు, అందం మరియు వికారాల మధ్య తేడాను గుర్తించే సామర్థ్యం మీకు లేదు. మీరు, ఈ రకమైన యవ్వనస్తుడు. మీలో ఏవైనా తాజా అంశాలు కనుగొనడం అసాధ్యం. మీరు దాదాపు పూర్తిగా పాత-పద్దతికి చెందినవారు, మరియు సమూహాన్ని అనుసరించడం, అహేతుకంగా ఉండటం కూడా నేర్చుకున్నారు, మీరు, ఈ రకమైన యువకుడు. మీరు ఎప్పుడూ తొప్పొప్పులను స్పష్టంగా వేరు చేయలేరు, నిజం మరియు అబద్ధాల మధ్య తేడాను గుర్తించలేరు, శ్రేష్ఠత కోసం ఎప్పుడూ ప్రయత్నించలేరు మరియు ఏది సరైనది మరియు ఏది తప్పు, ఏది సత్యం మరియు ఏది వంచన అనేది మీరు చెప్పలేరు. వృద్ధుల కంటే మీలోనే మతం అనే భారమైన మరియు తీవ్రమైన దుర్వాసన ఉంది. మీరు అహంకారంతో మరియు అహేతుకంగా ఉంటారు కూడా, మీరు పోటీతత్వంతో ఉంటారు మరియు అహంకారం పట్ల మీ అభిమానం చాలా బలమైంది—ఈ రకమైన యవ్వనస్తుడు సత్యాన్ని ఎలా కలిగి ఉంటారు? ఒక వైఖరి తీసుకోలేని వ్యక్తి సాక్షిగా ఎలా నిలబడగలడు? తప్పొప్పుల మధ్య తేడాను గుర్తించే సామర్థ్యం లేని వ్యక్తి యవ్వనస్తుడు అని ఎలా పిలువబడతాడు? యవ్వనస్తుడికి ఉండే తేజస్సు, సత్తువ, తాజాదనం, ప్రశాంతత, స్థిరత్వం లేని వ్యక్తిని నా అనుచరుడు అని ఎలా పిలువబడతాడు? సత్యం లేకుండా, న్యాయ భావన లేకుండా, ఆడుకోవడం మరియు పోరాడటం మాత్రం ఇష్టపడే వ్యక్తి నా సాక్షిగా ఉండటానికి ఎలా యోగ్యుడు అవుతాడు? యవ్వనస్తులకు ఉండవలసినవి ఇతరుల పట్ల మోసం మరియు పక్షపాతంతో నిండిన కళ్ళు కావు మరియు యవ్వనస్తులు విధ్వంసకరమైన, అసహ్యకరమైన పనులను చేయకూడదు. వారు ఆదర్శాలు, ఆకాంక్షలు మరియు తమను తాము మెరుగుపరుచుకోవాలనే ఉత్సాహపూరిత కోరిక లేకుండా ఉండకూడదు; వారు తమ అవకాశాల గురించి అధైర్యపడకూడదు, మరియు వారు జీవితంలో ఆశను లేదా భవిష్యత్తులో విశ్వాసాన్ని కూడా కోల్పోకూడదు; వారు ఇప్పుడు ఎంచుకున్న సత్య మార్గంలో కొనసాగే ఓరిమి కలిగి ఉండాలి—నా కొరకు వారి జీవితాలన్నిటినీ వెచ్చించాలనే వారి కోరికను గ్రహించాలి. వారు సత్యం లేకుండా ఉండకూడదు, వంచన మరియు చెరుపుని కూడా ఆశ్రయించకూడదు—వారు సరైన వైఖరిలో స్థిరంగా నిలబడాలి. వారు కేవలం కొట్టుకుపోకుండా, త్యాగాలు చేయగల దైర్యం గల, మరియు న్యాయం మరియు సత్యం కోసం పోరాడే స్ఫూర్తిని కలిగి ఉండాలి. యవ్వనస్తులు చీకటి శక్తుల అణచివేతకు లొంగిపోని మరియు తమ ఉనికి ప్రాముఖ్యతను మార్చుకునే ధైర్యాన్ని కలిగి ఉండాలి. యవ్వనస్తులు ప్రతికూలతలకు తొలగిపోకూడదు, కానీ తమ సోదర సోదరీమణుల పట్ల క్షమాపణా స్పూర్తితో స్వాగతిస్తూ, నిర్మొహమాటంగా ఉండాలి. నిజమే, ప్రతిఒక్కరి నుండి నేను కోరేవి ఇవే, మరియు ప్రతిఒక్కరికీ నా సలహా. కానీ అంతకంటే ఎక్కువగా, యవ్వనస్తులందరికీ ఇవి నా ఓదార్పు వాక్యాలు. మీరు నా వాక్యాల ప్రకారం ఆచరించాలి. ప్రత్యేకించి, యవ్వనస్తులు సమస్యలపై విచక్షణతో వ్యవహరించే, న్యాయం మరియు సత్యాన్ని కోరుకునే సంకల్పం లేకుండా ఉండకూడదు. మీరు అందమైన మరియు మంచి విషయాలన్నింటిని వెంబడించాలి, మరియు మీరు సానుకూలమైన విషయాలన్నింటి యొక్క వాస్తవికతను పొందుకోవాలి. మీ జీవితం పట్ల మీరు బాధ్యతగా ఉండాలి, మరియు మీరు దానిని అల్పముగా తీసుకోకూడదు. జనులు భూమి మీదకి వస్తారు మరియు నన్ను ఎదుర్కోవడం అరుదు, మరియు సత్యాన్ని వెతకడానికి మరియు పొందుకోవడానికి అవకాశాన్ని కలిగి ఉండడం కూడా అరుదు. మీరు ఈ జీవితంలో వెంబడించడానికి సరైన మార్గంగా ఈ అందమైన సమయాన్ని ఎందుకు బహుకరించుకోరు? మరియు మీరు ఎల్లప్పుడూ సత్యం మరియు న్యాయం పట్ల ఎందుకు తోసిపుచ్చే ధోరణితో ఉంటారు? మీరు ఎల్లప్పుడూ జనులతో ఆడుకునే ఆ చెరుపు మరియు మురికి కోసం మిమ్మల్ని మీరు ఎందుకు అణచివేసుకుని నాశనం చేసుకుంటారు? మీరు చెరుపు వ్యక్తులు చేసే వాటిలో పాల్గొనే ఆ వృద్ధులవలె ఎందుకు ప్రవర్తిస్తారు? మీరు పాత విషయాల యొక్క పాత మార్గాలని ఎందుకు అనుసరిస్తారు? మీ జీవితాలు న్యాయం, సత్యం మరియు పరిశుద్ధతతో నిండి ఉండాలి; మీ జీవితాలు ఈ యవ్వన ప్రాయంలో నరకంలో పడిపోవడానికి మిమ్మల్ని నడిపించేంతలా భ్రష్టుపట్టకూడదు. ఇది ఒక ఘోరమైన విపత్తు కాగలదు అని మీరు భావించట్లేదా? మీరు ఇది ఒక ఘోరమైన అన్యాయం అవుతుందని భావించట్లేదా?
మీరందరూ మీకు చెందిన పూర్తి సంపూర్ణమైన కార్యాన్ని చేయాలి మరియు దానిని మీరు నాకు చేయు అంతిమమైన, సాటిలేని త్యాగంగా చేస్తూ దానిని నా బలిపీఠము మీద అర్పించాలి. మీరందరూ మీ సొంత వైఖరిలో స్ధిరంగా నిలబడాలి మరియు ఆకాశంలోని మేఘాల వలె వీచే ప్రతి గాలికి కొట్టుకుపోకూడదు. మీ సగ జీవితం కష్టపడి పని చేస్తారు, కావున మీరు కలిగి ఉండాల్సిన గమ్య స్థానాన్ని మీరెందుకు వెతకకూడదు? మీరు ఒక సగ జీవితకాలం శ్రమిస్తారు, అయినప్పటికీ, మీరు మీ పంది మరియు కుక్క లాంటి తల్లిదండ్రులనే సత్యాన్ని మరియు మీ వ్యక్తిగత ఉనికి ప్రాముఖ్యతను సమాధిలోకి లాగడానికి అనుమతిస్తారు. ఇది నీ పైన జరిగే ఒక గొప్ప అన్యాయంగా నీవు భావించడం లేదా? నీవు ఈ విధంగా జీవితాన్ని జీవించడం పూర్తిగా అర్ధరహితమని భావించడం లేదా? ఈ విధంగా సత్యాన్ని మరియు సరైన మార్గాన్ని వెతకడం సమస్యలకు గురిచేస్తుంది. తద్వారా, పొరుగువారు అసౌకర్యంగా ఉంటారు మరియు కుటుంబం మొత్తం సంతోషంగా ఉండదు, మరియు అది ప్రాణాంతకమైన విపత్తులకు దారితీస్తుంది. నువ్వు ఈ విధంగా జీవిస్తే, అది ఒక అత్యంత అర్ధరహితమైన జీవితానికి దోహదం చెయ్యదా? నీ జీవితం కంటే ఎవరి జీవితం ఎక్కువ అదృష్టవంతంగా ఉండగలదు? ఎవరి జీవితం నీదాని కంటే ఎక్కువ హాస్యాస్పదముగా ఉండగలదు? నీవు నా సంతోషాన్ని మరియు నీ కొరకు ఓదార్పునిచ్చే వాక్యాలను పొందుకోవటానికి నన్ను వెతకవా? కానీ సుమారు ఒక సగ జీవితకాలం నీవు పరిగెత్తిన తరువాత, నీవు నేను కోపంతో నిండిపోయి నీ పట్ల శ్రద్ధ చూపనంత వరకు లేదా నిన్ను ప్రశంసించేంత వరకు నీవు నన్ను రెచ్చగొడతావు—దీనర్ధం నీ జీవితం మొత్తం వ్యర్థమైనదని కాదా? యుగాలుగా నరకం నుండి విడుదల చేయబడిన ఆ పరిశుద్దుల ఆత్మలను దర్శించటానికి నీవు ముఖాన్ని ఎలా కలిగి ఉండగలవు? నీవు నా పట్ల ఉదాసీనంగా ఉంటావు మరియు నీవు చివరిలో ఒక ప్రాణాంతకమైన విపత్తును రెచ్చగొడతావు—ఈ అవకాశాన్ని అదనుగా తీసుకోవడం మరియు విశాలమైన మహాసముద్రం గుండా ఒక ఆహ్లాదకరమైన పర్యటన చేయడం మరియు అప్పుడు నా ‘నియామకం’కు విధేయత చూపడం మేలుగా ఉంటుంది. ఈ దినము, నీవు ఎప్పటిలా ఉదాసీనంగా ఉంటూ తిరిగివెళ్ళడానికి ఇంకా ఇష్టం లేనప్పటికీ, చివరలో నా చేత సృష్టించబడిన అలలకు లొంగిపోతావని మరియు మింగివేయబడతావని చాలా కాలం క్రితమే నేను మీకు చెప్పాను. మిమ్మల్ని మీరు నిజంగా రక్షించుకోగలరా? నీ ప్రస్తుత అన్వేషణ పద్ధతి నీవు పరిపూర్ణుడివని నిర్ధారిస్తుందని నీకు నిజంగా నమ్మకముందా? నీ హృదయం చాలా కఠినంగా లేదా? ఈ రకమైన అనుసరణ, ఈ రకమైన అన్వేషణ, ఈ రకమైన జీవితం, మరియు ఈ రకమైన వ్యక్తిత్వం—ఇది నా ప్రశంసను ఎలా పొందగలదు?
వివరణ:
ఎ. హన్‌హావో పక్షి కథ యోసేపు చెప్పిన చీమ మరియు గొల్లభామ కల్పితగాథకి చాలా దగ్గరగా ఉంటుంది. హన్‌హావో పక్షికి తన పొరుగున ఉన్న కొండకాటి పిట్ట నుండి పదే పదే హెచ్చరికలు వచ్చినప్పటికీ, వాతావరణం వెచ్చగా ఉన్నప్పుడు గూడు కట్టుకోవడానికి బదులుగా నిద్రపోవడాన్ని ఇష్టపడుతుంది. శీతాకాలం వచ్చినప్పుడు, ఆ పక్షి చలికి వణుకుతూ మరణిస్తుంది.