ప్రారంభంలో క్రీస్తు పలుకులు—1 వ అధ్యాయము
సీయోనుకు ప్రశంస వచ్చింది మరియు దేవుని నివాస స్థలం ప్రత్యక్షమైంది. జనులందరి చేత స్తుతించబడే ఘనమైన పరిశుద్ధ నామం వ్యాప్తి చెందుతుంది. ఓ, సర్వశక్తివంతమైన దేవా! విశ్వాధిపతి, అంత్య దినాల క్రీస్తు మహిమ మరియు ఘనత విశ్వమంతటి పైనా ఉన్నతంగా ఉండే సీయోను పర్వతం మీద ఉదయించిన ప్రకాశించే సూర్యుడిగా ఆయన ప్రకాశిస్తాడు…
సర్వశక్తివంతమైన దేవా! హర్షాతిరేకములతో మేము నిన్ను పిలుస్తాము; మేము నృత్యం చేస్తాము మరియు పాడతాము. నువ్వు నిజంగా మా విమోచకునివి, విశ్వానికి గొప్ప రాజువి! నువ్వు అధిగమనించే వారి సమూహాన్ని తయారుచేసి దేవుని నిర్వహణ ప్రణాళికను నెరవేర్చావు. జనులందరూ ఈ పర్వతానికి ప్రవహిస్తారు. జనులందరూ సింహాసనం ముందు మోకరిల్లుతారు! నువ్వు ఏకైక నిజమైన దేవుడివి మరియు ఘనత మరియు గౌరవానికి, ఘనత స్తుతి అంతటికీ మరియు సింహాసనపు ఆధిపత్యానికి నువ్వు అర్హుడివి! అనేకులైన దేవుని జనులకు ఆహారమిస్తూ, తడుపుతూ జీవితపు వసంతం సింహాసనం నుండి బయటకు ప్రవహిస్తుంది. ప్రతిరోజుతో జీవితం మారుతుంటుంది; దేవుని గురించి కొత్త అంతర్దృష్టులను నిరంతరం అందజేస్తూ కొత్త కాంతి మరియు కొత్త సాక్షాత్కారాలు మనల్ని వెంబడిస్తాయి. అనుభవాల మధ్య, మనము దేవుని గురించి పూర్తి నిశ్చయానికి వస్తాము. ఆయన వాక్యాలు నిరంతరం వ్యక్తం చేయబడుతున్నాయి, నిజముగా ఉన్నవారిలో వ్యక్తం చేయబడుతున్నాయి. మనము నిజంగా చాలా దీవించబడ్డాము! ప్రతిరోజు దేవునితో ముఖాముఖిగా కలవడం, అన్ని విషయాల్లోనూ దేవునితో సంభాషించడం, మరియు అన్నింటిపైనా దేవునికి సర్వాధికారం ఇవ్వడం. జాగ్రత్తగా మనం దేవుని వాక్యాన్ని యోచిస్తే, మన హృదయాలు దేవుని యందు ప్రశాంతంగా ఉంటాయి, అలా మనం ఆయన కాంతిని స్వీకరించే చోట మనం దేవుని ఎదుటికి వస్తాము. ప్రతిరోజు మన జీవితాలలో, చర్యలలో, మాటలలో, ఆలోచనలు మరియు తలంపులలో మనము దేవుని వాక్యంలో జీవిస్తాము, అన్ని సమయాల్లోనూ వ్యత్యాసాన్ని చూపగలుగుతాము. దేవుని వాక్యము సూది గుండా దారాన్ని నడిపిస్తుంది; అనుకోకుండా, మనలో దాగిఉన్న విషయాలు ఒకదాని తర్వాత ఒకటిగా వెలుగులోకి వస్తాయి. దేవునితో సహవాసంలో ఎలాంటి ఆలస్యం చేయరాదు; మన ఆలోచనలు మరియు తలంపులు దేవునిచే బట్టబయలు చేయబడి ఉన్నాయి. తీర్పుకి గురయ్యే చోట ప్రతి క్షణం మనము క్రీస్తు స్థానం ముందు జీవిస్తున్నాము. మన శరీరంలో ప్రతి స్థలము ఇంకా సాతాను చేత ఆక్రమించబడి వుంది. ఈరోజు, దేవుని సర్వాధికారాన్ని పునరుద్ధరించాలంటే, తప్పకుండా అయన ఆలయం శుభ్రపరచబడాలి. దేవునిచే పూర్తిగా పొందబడానికి, మనము జీవన్మరణ పోరాటంలో తప్పక నిమగ్నమవ్వాలి. మన పాత ఆత్మలు సిలువ వేయబడినప్పుడు మాత్రమే క్రీస్తు పునరుత్థాన జీవితం సర్వోన్నతంగా ఉంటుంది.
మన పునరుద్ధరణ కోసం యుద్ధం చేయడానికి ఇప్పుడు పరిశుద్ధాత్మ మన ప్రతి మూలలోనూ మోహరిస్తుంది! మనల్ని మనం తిరస్కరించి దేవునితో సహకరించడానికి సిద్ధంగా ఉన్నంతకాలం, దేవుడు అన్ని సమయాల్లోనూ తప్పకుండా మనల్ని ప్రకాశింప చేస్తాడు, మరియు మనల్ని లోపల నుండి పరిశుద్ధం చేస్తాడు, మరియు సాతాను ఆక్రమించిన వాటిని కొత్తగా మారుస్తాడు, దానివల్ల మనము దేవునిచే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సంపూర్ణంగా చేయబడతాము. సమయాన్ని వృధా చేయవద్దు—ప్రతిక్షణం దేవుని వాక్యంలో జీవించండి. పరిశుద్ధులతో కలిసి నిర్మింపబడండి, రాజ్యంలోకి తీసుకురాబడండి, మరియు దేవునితో కలిసి ఘనతలోకి ప్రవేశించండి.