ప్రారంభంలో క్రీస్తు పలుకులు—2 వ అధ్యాయము

ఫిలడెల్ఫియా సంఘము పూర్తిగా దేవుని కృప మరియు దయ వలన రూపుదిద్దుకుంది. తమ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఊగిసలాడకుండా ఉండే అనేకులైన పరిశుద్ధుల హృదయాలలో దేవుడి పట్ల ప్రేమ కలుగుతుంది. నిజమైన దేవుడు ఒక్కడే శరీరధారిగా మారాడని, ఆయన ఈ విశ్వానికి అధిపతి అని, ఆయనే అన్నిటినీ ఆజ్ఞాపించే వాడనే వాళ్ల నమ్మకాన్ని వాళ్ళు గట్టిగా పట్టుకున్నారు: ఇది పరిశుద్ధాత్మ చేత స్థిరపరచబడినది, అది పర్వతముల వలె స్థిరమైనది! మరియు అది ఎప్పటికీ మారనిది!

ఓ, సర్వ శక్తివంతుడవైన దేవా! ఈ దినము గుడ్డివారు చూడగలిగేలా, కుంటివారు నడవగలిగేలా, మరియు కుష్టురోగులు స్వస్థత పొందేలా చేస్తూ మా ఆధ్యాత్మికమైన నేత్రాలను తెరచిన వాడవు నీవే. ఆధ్యాత్మిక రాజ్యపు మర్మాలను గ్రహించడానికి మమ్మల్ని అనుమతిస్తూ పరలోకానికి కిటికీ తెరిచిన వాడవు నీవే, నీ పరిశుద్ధమైన వాక్యాల చేత విస్తరింప చేయబడుతూ, సాతాను చేత కుళ్ళిపోయిన మా మానవత్వం నుండి రక్షించబడ్డాము—నీ అమూల్యమైన గొప్ప కార్యము మరియు నీ వెలకట్టలేని గొప్ప కరుణ ఇలాంటిది. మేము నీ సాక్ష్యులము!

చాలా కాలంగా నువ్వు వినయంగా మరియు మౌనంగా దాగి ఉన్నావు. నువ్వు మరణం నుండి పునరుత్థానం, సిలువ వేయబడిన వేదన, మానవ జీవితపు ఆనందాలు మరియు బాధలు, మరియు పీడన మరియు ప్రతికూలతలకు గురిఅయ్యావు; నీవు మానవ ప్రపంచపు బాధని అనుభవించావు మరియు రుచి చూసావు, మరియు నువ్వు యుగం చేత విడిచిపెట్టబడి ఉన్నావు. దేవుని అవతారం స్వయంగా దేవుడే. దేవుని చిత్తము కొరకు నీ కుడి చేతితో మమ్మల్ని పైకి పట్టుకుని, మరియు నీ కృపను మాకు ఉచితంగా ఇస్తూ, నీవు మమ్మల్ని పెంటకుప్ప నుండి రక్షించావు. కష్టాలకు వెరవకుండా, నీ జీవితాన్ని మాలోకి మలచుకున్నావు; నీ రక్తం, చెమట, మరియు కన్నీళ్ళతో నీవు చెల్లించిన వెల పరిశుద్ధుల పైన స్థిరపరచబడింది; నీ శ్రమతో కూడిన ప్రయత్నాల ఫలితం[ఎ] మేము; నువ్వు చెల్లించిన మూల్యం మేము.

ఓ, సర్వశక్తివంతుడవైన దేవా! నీ ప్రేమపూర్వక దయ మరియు కరుణ, నీ నీతి మరియు మహిమ, నీ పరిశుద్ధత మరియు నిగర్వము వల్లనే జనులందరూ నీ ముందు మోకరిల్లి, ఎల్లప్పటికీ నిన్ను ఆరాధిస్తారు.

నీవు ఈ దినము అన్ని సంఘాలను—పూర్తిగా ఫిలడెల్ఫియా సంఘముగా తయారు చేశావు—మరియు అలా నీ 6,000 సంవత్సరాల నిర్వహణ ప్రణాళికను నెరవేర్చావు. ఆత్మలో అనుసంధానించబడి, ఊట మూలంలో కలిసి, ప్రేమతో అనుసరిస్తూ పరిశుద్ధులు తమని తాము నీ ముందు వినమ్రంగా సమర్పించుకోగలరు. మరోమారు నీ ఆలయాన్ని శుద్ధి చేస్తూ, సంఘములోని బురద మరియు మురికి నీళ్లన్నింటినీ కడుగుతూ, మరియు ప్రక్షాళన చేస్తూ, సజీవమైన జీవజలము ఆగకుండా ప్రవహిస్తుంది. మేము ఆచరణాత్మకమైన నిజ దేవుడిని తెలుసుకున్నాము, ఆయన వాక్యాలలో నడిచాము, మా సొంత కర్తవ్యాలను మరియు విధులను గుర్తించాము. సంఘం కోసం మమల్ని మేము వెచ్చించుకొనడానికి మేము చేయగలిగినదంతా చేసాము, ఎప్పటికీ నీ ముందు మౌనంగా, మేము పరిశుద్ధాత్మ కార్యాన్ని తప్పక లక్ష్యపెట్టాలి, నీ చిత్తం మాలో అడ్డుపడకుండా ఉండుగాక. పరిశుద్ధుల మధ్య పరస్పరమైన ప్రేమ ఉంటుంది, మరియు కొందరి బలాలు ఇతరుల వైఫల్యాలను పూరిస్తాయి. పరిశుద్ధాత్మ చేత వివేచన పొంది మరియు ప్రకాశింపబడినవారు అన్ని వేళల ఆత్మ రూపంలో నడవగలరు. వారు సత్యాన్ని అర్థం చేసుకున్న వెంటనే దానిని ఆచరణలో పెడతారు. వారు కొత్త వెలుగుతో పాటు వేగంగా నడుస్తూ, దేవుడి అడుగుజాడలను అనుసరిస్తారు.

దేవునితో చురుకుగా సహకరించండి; ఆయనని నియంత్రించనివ్వడం అంటే ఆయనతో నడవడం. మన సొంత భావాలు, తలంపులు, అభిప్రాయాలు మరియు లౌకిక చిక్కులన్నీ పొగలా పల్చని గాలిలోకి అదృశ్యమవుతాయి. మనము మన ఆత్మలలో దేవుణ్ణి సర్వోన్నతంగా పరిపాలించనిద్ధాం, ఆయనతో నడుద్దాం మరియు తద్వారా ప్రపంచాన్ని అధిగమిస్తూ, పరమార్ధం పొందుదాం, మరియు మన ఆత్మలు స్వేచ్ఛగా గాలిలో ఎగురుతాయి మరియు విడుదల పొందుతాయి: ఇది సర్వశక్తివంతుడైన దేవుడు రాజు అయినప్పుడు వచ్చే ఫలితం. కొత్త కీర్తనలను చెల్లిస్తూ, మన స్తోత్రాలను చెల్లిస్తూ, స్తుతిస్తూ నృత్యం చేసి పాడకుండా మనం ఎలా ఉండగలం?

దేవుణ్ణి స్తుతించడానికి నిజంగా చాలా మార్గాలు ఉన్నాయి: ఆయన నామాన్ని పిలవడం, ఆయనకి దగ్గరగా జరగడం, ఆయన గురించి ఆలోచించడం, ప్రార్థన చదవడం, సహవాసంలో పాల్గొనడం, తలుచుకోవడం మరియు యోచించడం, ప్రార్థన మరియు స్తుతి గీతాలు. ఈ రకమైన స్తుతులలో ఆనందం ఉంది, మరియు అభిషేకించడం ఉంది; స్తుతి లో శక్తి ఉంది, మరియు ఒక భారం కూడా ఉంది. స్తుతి లో విశ్వాసం ఉంది, మరియు కొత్త అంతర్దృష్టి ఉంది.

దేవునితో చురుకుగా సహకరించండి, సేవలో సమన్వయం పొందండి. మరియు ఏకం అవ్వండి, సర్వశక్తిమంతుడైన దేవుని ఉద్దేశాలను నెరవేర్చండి, పరిశుద్ధాత్మ శరీరంగా మారడానికి త్వరపడండి, సాతానును అణగదొక్కండి, మరియు సాతాను భవితవ్యాన్ని అంతం చేయండి. ఫిలడెల్ఫియా సంఘం దేవుని సన్నిధిలోకి ఆనందభరితమైంది, మరియు ఆయన మహిమలో వ్యక్తం చేయబడింది.

ఫుట్‌నోట్:

ఎ. మూల వచనములో “ఫలితం” అనే పదము లేదు.

మునుపటి:  ప్రారంభంలో క్రీస్తు పలుకులు—1 వ అధ్యాయము

తరువాత:  ప్రారంభంలో క్రీస్తు పలుకులు—3 వ అధ్యాయము

సెట్టింగులు

  • వచనం
  • థీమ్స్

ఘన రంగులు

థీమ్స్

అక్షరశైలి

అక్షరశైలి పరిమాణం

గీతల మధ్య దూరం

గీతల మధ్య దూరం

పేజీ వెడల్పు

విషయ సూచిక

శోధించండి

  • ఈ వచనాన్ని శోధించండి
  • ఈ పుస్తకాన్ని శోధించండి

Connect with us on Messenger