103 వ అధ్యాయము

ఉరుముల శబ్దం విశ్వమంతటిని వణికిస్తుంది. మార్గము మధ్యలో వెళ్తున్న జనులు తప్పించుకొని వెళ్ళడానికి ప్రక్కకు జరగలేనంతగా చెవులు దద్దరిల్లిపోయి చెవుడు వచ్సెంతగా ఆ శబ్దం ఉంటుంది. కొందరు చనిపోతారు, ఇంకొందరు నశించిపోతారు మరియు మరికొందరు తీర్పు తీర్చబడతారు. ఇది నిజంగా ఎవరూ ఎప్పుడూ చూడనటువంటి రమణీయ దృశ్యం. నిశితంగా వినండి: ఉరుముల మహాధ్వనులకు విలపించే ధ్వని తోడవుతుంది, మరియు ఈ ద్వని పాతాళము నుండి వస్తుంది; ఇది నరకము నుండి వస్తుంది. అది నాచే తీర్పు తీర్చబడ్డ తిరగబడిన కుమారుల ఆక్రోశించే ధ్వని. నేను చెప్పేది ఎవరైతే వినలేదో మరియు నా వాక్యాలను ఎవరైతే ఆచరణలో పెట్టలేదో వారు నాచే తీవ్రంగా తీర్పు తీర్చబడియున్నారు, మరియు నా ఉగ్రత శాపాన్ని పొందారు. నా స్వరమే తీర్పు మరియు ఉగ్రతలైయున్నవి; నేను ఎవరితోనూ సున్నితంగా వ్యవహరించను మరియు ఎవరి పట్లా కనికరము చూపను, ఎందుకంటే నేను నీతివంతమైన దేవుణ్ణి, మరియు నేను ఉగ్రతను కలిగి ఉన్నాను. నేను దహనాన్ని, ప్రక్షాళనను, మరియు వినాశనాన్ని కలిగి ఉన్నాను. నాలో ఏదీ దాచబడి ఉండదు లేదా భావోద్వేగానికి గురి కాను, కానీ దానికి విరుద్ధంగా ప్రతీదీ తెరువబడి, నీతిగా, నిష్పక్షపాతంగా ఉంటుంది. ఇప్పటికే నా జ్యేష్ట కుమారులు నాతో కలిసి సింహాసనంపై ఉన్నారు కాబట్టి, దేశాలన్నిటిని మనుష్యులందరిని పాలిస్తున్నారు, అవినీతిపరులను మరియు అవినీతి విషయాలను తీర్పు తీర్చబడడం ఇప్పుడు మొదలవుతుంది. ఏదీ విడిచిపెట్టకుండా ఒక్కొక్కటిగా నేను వాటిని విచారిస్తాను, మరియు వాటిని పూర్తిగా బహిర్గతం చేస్తాను. ఎందుకంటే నా తీర్పు పూర్తిగా బహిర్గతమైంది మరియు పూర్తిగా తెరవబడింది, మరియు నేను ఏదీ దాచి ఉంచలేదు; నా చిత్తానికి అనుగుణంగా లేని ప్రతీ దాన్ని నేను వెలుపలికి విసిరి వేస్తాను, మరియు శాశ్వతముగా అగాధములో నశించేలా చేస్తాను. అక్కడ నేను దానిని శాశ్వతముగా దహిస్తాను. ఇదే నా నీతి, మరియు ఇదే నా యథార్థత. దీన్ని ఎవరూ మార్చలేరు, మరియు సమస్తమూ నా అధీనంలో ఉండాలి.

వాక్కులు కేవలం వాక్కులేనని మరియు వాస్తవాలు వాస్తవాలే అని అనుకొని చాలా మంది జనులు నా మాటలను విస్మరిస్తారు. వారు అంధులు! నమ్మదగిన దేవుడు నేనే అని వారికి తెలియదా? నా వాక్కులు, వాస్తవాలు ఒకేసారి సంభవిస్తాయి. ఇది వాస్తవమైన విషయం కాదా? జనులు అసలు నా మాటల్ని గ్రహించలేరు. వివేకవంతులు మాత్రమే నిజంగా అర్దం చేసుకోగలరు. ఇది వాస్తవం. జనులు నా వాక్కులను చూసిన వెంటనే వారు తమ బుద్ధి విషయమై భయపడి, దాగుకొనడానికి అంతటా తిరుగుతారు. నా తీర్పు వెలువడినప్పుడు ఇది మరింత ఎక్కువగా జరుగుతుంది. నేను సమస్తాన్ని సృష్టించినపుడు, నేను ప్రపంచాన్ని నాశనం చేసినపుడు, నా జ్యేష్ట కుమారులను పరిపూర్ణులుగా చేసినప్పుడు జరుగుతాయి—ఇవన్నీ నా నోట నుండి వచ్చిన ఒక్క మాట ద్వారా మాత్రమే జరుగుతాయి. ఎందుకంటే నా వాక్కు దానికదే అధికారాన్ని కలిగి ఉంటుంది; ఇదే తీర్పు. తీర్పును, మహిమను అయి ఉన్న వాడిని నేనే అని చెప్పవచ్చు; ఇది మార్పులేని శాశ్వత అంశం. ఇది నా పరిపాలనా శాసనాలలో ఒక అంశం. ఇది నేను జనులకు తీర్పు తీర్చుటలో ఒక విధానమైయున్నది. నా దృష్టిలో ప్రతిదీ—అంటే ప్రజలు, అన్ని సంబంధాలు, సమస్త విషయాలు నా చేతుల్లో ఉంటాయి మరియు నా తీర్పుకి లోబడి ఉన్నాయి. ఆటవికంగా, ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి ఏదీ, ఎవరూ దైర్యం చెయ్యరు, మరియు నేను వెల్లడి చేసే వాక్కుల అనుసారమే సమస్తము జరిగించబడాలి. మనిషి భావనలలో ఆ వాక్కులను పలికిన వ్యక్తిని నేనేనని ప్రతి ఒక్కరూ నమ్ముతారు. నా ఆత్మ గొంతు విప్పినపుడు, ప్రతి ఒక్కరూ సందేహిస్తారు. నా సర్వశక్తిని గురించి జనులకు కనీస జ్ఞానం లేదు, మరియు వారు నాకు వ్యతిరేకంగా ఆరోపణలు చేస్తారు. నేను ఇప్పుడు నీకు చెప్తున్నాను, నా వాక్కులను ఎవరైతే సందేహిస్తారో, నా వాక్కులను ఎవరైతే తక్కువ చేస్తారో, వారందరూ నాశనమవ్వడానికి పాత్రులు. వారందరూ వినాశనానికి శాశ్వత కుమారులు. దీని నుంచి మనం అతి కొద్ది మంది జేష్ఠ కుమారులు మాత్రమే ఉన్నారని చూడవచ్చు. ఎందుకంటే నేను పని చేసే విధానం ఇలాగే ఉంటుంది. నేను ఇంతకు ముందు చెప్పినట్టు నేను ప్రతీదీ నా వేలును కదపకుండా జరిగిస్తాను. నేను కేవలం నా వాక్కులను మాత్రమే వాడుతాను. ఇప్పుడు ఇక్కడే నా సర్వ శక్తి ఉంది. నా వాక్కుల్లో నేను చెప్పే దాని ఉద్దేశం మరియు మూలం కనుగొనలేరు. జనులు దీనిని సాధించలేరు. నా నడిపింపును అనుసరిస్తూ మాత్రమే వారు నడుచుకుంటారు. నా నీతికి అనుగుణంగా నా చిత్తాన్ని అనుసరించి, నా కుటుంబానికి నీతిని, శాంతిని కలిగిస్తూ, ఎప్పటికీ జీవించి ఉండేలా శాశ్వతంగా, దృఢంగా, స్తిరంగా ప్రతీదీ చేస్తారు.

ప్రతి ఒక్కరికీ నా తీర్పు వస్తుంది. నా పరిపాలనా శాసనాలు ప్రతి ఒక్కరినీ తాకుతాయి, మరియు నా వాక్కులు మరియు నా వ్యక్తిత్వము ప్రతి ఒక్కరికీ బహిర్గతం చేయబడింది. నా ఆత్మ యొక్క గొప్ప కార్యానికి ఇదే సరియైన సమయం. (ఈ సమయంలో, ఆశీర్వదింపబడేవారు, దుర్గతిని అనుభవించబోయేవారు ఒకరి నుండి మరొకరు వేరు చేయబడతారు). నా మాటలు వెలువడిన వెంటనే, నేను ఆశీర్వదింపబడేవారిని, దుర్గతిని అనుభవించబోయే వారిని వేరు చేశాను. ఇదంతా స్పష్టంగానే ఉంది, దీనినంతటిని నేను ఒకేసారి చూడగలను. (నాకున్న మానవత్వాన్నిబట్టి ఇదంతా నేను చెప్తున్నాను; కావున, ఈ వాక్కులు నా నిర్ణీత గమ్యస్థానాన్ని మరియు ఎంపికను వ్యతిరేకించడం లేదు.) నేను పర్వతాలు మరియు నదులు మరియు అన్నిటి గుండా, విశ్వాంతరాళాల గుండా సంచరిస్తూ, ప్రతి ప్రదేశాన్ని గమనిస్తూ, ప్రక్షాళన చేస్తూ దాని వలన ఆఅపరిశుద్ద ప్రదేశాలు మరియు ఆ అపవిత్రమైన భూములన్నీ ఉనికిలో లేకుండా పోయి, నా వాక్కు ఫలితంగా భస్మమైపోతాయి. నాకు, ప్రతీదీ తేలికే. నేను ఈ ప్రపంచపు వినాశనానికి ముందుగా నిర్ణయించుకొని ఉన్న సమయం ఇదే అయితే, ఒకే ఒక్క మాట చెప్పి దీన్ని మింగి వేయగలను. ఏదేమైనా, ఇది సమయం కాదు. నా ప్రణాళికకు ఆటంకం రాకుండా మరియు నా నిర్వహణకు అంతరాయం కలగకుండా, నేను ఈ పని చేయబోవడానికి ముందే సమస్తమూ సిద్ధంగా ఉండాలి. దీనిని సహేతుకంగా ఎలా చెయ్యాలో నాకు తెలుసు. నాకు నా జ్ఞానం ఉంది ఉంది మరియు నా సొంత ఏర్పాట్లు నాకు ఉన్నాయి. జనులు ఒక్క వేలును కూడా కదప కూడదు; నా హస్తముచే సంహరింపబడకుండా, జాగ్రత్తగా ఉండండి. ఇది ఇప్పటికే నా పరిపాలనా శాసనాలను తాకింది. నా పారిపాలనా శాసనాల యొక్క కఠినత్వాన్ని, అలాగే వాటి వెనుక ఉన్న రెండు పార్శ్వాలు కలిగిన సూత్రాలను కూడా చూడవచ్చు: ఒక వైపు, నా చిత్తానికి అనుగుణగా లేకుండా, నా పరిపాలనా శాసనాలను ఉల్లంఘించే వారిని నేను సంహరిస్తాను; మరో వైపు, నా పరిపాలనా శాసనాలను ఉల్లంఘించే వారందరినీ నా క్రోధంతో శపిస్తాను. ఈ రెండు అంశాలు అనివార్యమైనవి, మరియు ఇవి నా పరిపాలనా శాసనాల వెనుక వున్న కార్యనిర్వాహక సూత్రాలు. ఒక వ్యక్తి ఎంత విధేయుడైనప్పటికీ, భావోద్వేగరహితంగా, ప్రతి ఒక్కరూ ఈ రెండు సూత్రాల ప్రకారం నిర్వహించబడతారు. నా నీతిని, నా మహిమను, భూసంబంధమైన వాటన్నిటినీ, ప్రాపంచికమైన వాటన్నిటినీ, మరియు నా చిత్తానికి అనుగుణంగాలేని వాటన్నిటినీ భస్మం చేసే నా క్రోధాన్ని చూపడానికి ఇది సరిపోతుంది. నా వాక్యాలలో ఎప్పటికీ దాగివుండే మర్మాలు ఉన్నాయి, అలాగే నా వాక్యాలలో బహిర్గతం కాబడిన మర్మాలు ఉన్నాయి. కావున, మనుషుల భావాలు మరియు మనుషుల మనసు ప్రకారం నా వాక్యాలు ఎన్నటికీ అర్దం చేసుకోలేనివి, నా హృదయము ఎప్పటికీ లోతుచిక్కనిది. అంటే నేను మనుషులను వారి భావాలు మరియు ఆలోచనల నుండి విముక్తుల్ని చెయ్యాలి. నా నిర్వహణ ప్రణాళికలో ఇది అత్యంత ముఖ్యమైన అంశం. నా జ్యేష్ట కుమారులను పొందడానికి మరియు నేను చేయాలనుకున్నవి సాధించడానికి ఈ విధానంలోనే చెయ్యాలి.

ప్రపంచపు విపత్తులు రోజు రోజుకీ మరింతగా పెరుగుతున్నాయి, మరియు నా గృహం లో అనివార్యమైన విపత్తులు ఎప్పటికన్నా శక్తివంతంగా పెరుగుతున్నాయి. ప్రజలకు నిజంగా దాక్కోవడానికి ఎక్కడా చోటు లేదు. వారిని వారు మరుగుపరుచుకునే స్థలం లేదు. ఇప్పుడే పరివర్తన జరుగుతుంది కాబట్టి, వారి తర్వాతి అడుగు ఎక్కడ వేయాలో జనులకు తెలియదు. ఇది నా తీర్పు తర్వాత మాత్రమే స్పష్టమవుతుంది. గుర్తుంచుకోండి! ఇవి నా కార్యములోని దశలు, నేను పని చేసే మార్గము ఇదే. ఒక్కొక్కరిగా నా జ్యేష్ట కుమారులందరినీ నేను ఓదారుస్తాను, మరియు వారిని ఒక్కోసారి ఒక్కో మెట్టు పైకి ఎక్కిస్తాను. ఇక సేవ చేసే వారి విషయానికి వస్తే, నేను వారందరినీ ఒక్కొక్కరిగా తొలగించి, విడిచి పెడతాను. ఇది నా నిర్వహణ ప్రణాళికలో ఒక భాగం. సేవ చేసే వారందరూ బహిర్గతం చేయబడ్డాక, నా జ్యేష్ట కుమారులు కూడా బహిర్గతం చేయబడతారు. (ఇది నాకు చాలా తేలిక. నా మాటలు విన్నాక, సేవ చేసే వారందరూ తీర్పుకు ముందుగా, నా వాక్కుల హెచ్చరికకు ముందుగా, క్రమంగా ఉపసంహరించుకుంటారు, మరియు నా జ్యేష్ట కుమారులు మాత్రమే మిగులుతారు. ఇది స్వచ్ఛందమైంది కాదు. లేదా మానవ సంకల్పం మార్చ గలిగింది కాదు; అయితే, వ్యక్తిగతంగా నా ఆత్మ జరిగించుచున్న కార్యమిది.) ఇది ఎక్కడో జరిగే సుదూర సంఘటన కాదు, మరియు మీరు కొంత మేరకు దీన్ని నా పని యొక్క ఈ దశలో నుండి మరియు నా వాక్కుల నుండి గ్రహించగలగాలి. నేను ఎందుకు చాలా చెప్తానో, అలాగే నా ప్రకటనలలో ఉండే అనూహ్యమైన స్వభావం ప్రజలకు అంతుపట్టదు. నేను నా జేష్ట కుమారులతో నిమ్మళమైన స్వరముతో, దయతో మరియు ప్రేమతో మాట్లాడుతాను. (ఎందుకంటే నేను ఈ జనులను ఎప్పుడూ వివేకవంతులను చేస్తూ ఉంటాను మరియు వారిని నేను ముందుగానే నిర్ణయించుకున్నాను కనుక నేను వారిని ఎప్పటికీ విడువను). అయితే నా జేష్ట కుమారులు కాకుండా మిగిలిన ప్రజలను తీవ్రమైన తీర్పుతో, హెచ్చరికలతో, బెదిరింపులతో, మరియు ఒక దశలో వారి నరాలు ఎల్లప్పుడూ ఒత్తిడికి లోనయ్యేలా నిరంతరం భయానికి గురి చేస్తూ వ్యవహరిస్తాను. ఒకసారి పరిస్థితి కొంత మేరకు అభివృద్ధి చెందితే వారు ఈ స్థితి నుండి తప్పించుకుంటారు (నేను ప్రపంచాన్ని నాశనం చేసినప్పుడు ఈ జనులు అగాధములో ఉంటారు), అయినప్పటికీ వారు ఎప్పటికీ తీర్పు తీర్చే నా చేతి నుండి తప్పించుకోలేరు లేదా ఈ పరిస్థితి నుండి విడుదల చెందలేరు. అయితే, ఇదే వారి తీర్పు; ఇది వారి యొక్క దండన. వెలుపటివారు వచ్చిన రోజున, నేను ఈ జనులను ఒక్కొక్కరిగా బయట పెడతాను. ఇవి నా కార్యములోని దశలు. ఇప్పుడు మీకు నా పూర్వపు ఆ వాక్కుల ప్రకటనల వెనుక ఉన్న ఉద్దేశం అర్థమైందా? నా అభిప్రాయంలో, కొంతమట్టుకు నెరవేరనివి కూడా కొంత నెరవేరినట్టే కానీ కొంత నెరవేరినది ఏదైతే ఉందో అది కొంతమట్టుకు సాధించబడినదైతే కాదు. ఎందుకంటే మానవులకు అంతుపట్టని జ్ఞానము నాకు ఉంది మరియు నేను పని చేసే విధానం నా దగ్గర ఉంది. ఒకసారి నేను ఈ దశతో ఫలితాలు సాధించాక (నేను నన్ను ఎదిరించిన దుష్టులను బహిర్గతం చేశాక), నేను తదుపరి దశను మొదలు పెడతాను, ఎందుకంటే నా చిత్తానికి ఆటంకం ఉండదు మరియు నా నిర్వహణ ప్రణాళికను అడ్డుకోవడానికి ఎవరూ సాహసించరు మరియు ఏ విధమైన ఆటంకాలు కలిగించడానికి ఏదీ సాహసించదు—వారందరూ దారి నుండి వైదొలగాలి! మహా ఘట సర్పము యొక్క సంతానమా, నేను చెప్పేది విను! నేను సీయోను నుండి వచ్చాను మరియు ఈ ప్రపంచంలోకి శరీరధారినై నా జేష్ఠ కుమారులను పొందడానికి, మీ తండ్రిని అవమానించడానికి (ఈ మాటలు మహా ఘట సర్పము యొక్క సంతతిని ఉద్దేశించి చెప్పబడినవి), నా జేష్ఠ కుమారులకు మద్దతు ఇవ్వడానికి, నా జేష్ట కుమారుల పట్ల జరిగిన తప్పులను ఒప్పు చేయడానికి వచ్చాను. కావున, మరలా మూర్ఖంగా ఉండకండి; నేను నా జేష్ట కుమారులను మీతో వ్యవహరించేలా చేస్తాను. గతంలో, నా కుమారులు వేధించబడ్డారు మరియు అణిచి వేయబడ్డారు, మరియు తండ్రి తన కుమారులకు అధికారాన్ని సిద్దపరిచినందున, ఇకపై వేధింపబడకుండా, అణచివేయబడకుండా నా కుమారులు తిరిగి నా ప్రేమపూర్వకమైన కౌగిలిలోకి వస్తారు. నేను నీతి లేని వాడిని కాదు; ఇది నా నీతిని సూచిస్తుంది, మరియు ఇది నిజంగా “నేను ప్రేమించే వారిని ప్రేమించడమును మరియు నేను ద్వేషించే వారిని ద్వేషించడమును” సూచిస్తుంది. ఒకవేళ నేను అవినీతిపరుణ్ణి అని గనుక మీరు అంటే, అప్పుడు మీరు త్వరపడి బయటకు వెళ్లాలి. సిగ్గులేకుండా నా ఇంట్లో తేరగా ఉండకండి. నేను నిన్ను ఇంకా చూడవలసిన అవసరం లేకుండా నువ్వు నీ ఇంటికి త్వరగా తిరిగి వెళ్లాలి. అగాధం మీ గమ్యస్థానం, మీరు విశ్రాంతి తీసుకునేది అక్కడే. మీరు ఒకవేళ నా ఇంట్లో ఉంటే, మీకు అక్కడ చోటులేదు, ఎందుకంటే మీరు భారభరితమైన మృగాలు; మీరు నేను ఉపయోగించే పరికరాలు. నాకు మీతో ఇకపై పని లేనపుడు, నేను మిమ్మల్ని దహించుకుపోయేలా అగ్నిలో వేస్తాను. ఇది నా పరిపాలన శాసనం; నేను తప్పక ఈ ప్రకారంగా చేయాలి. నేను నా కార్యాన్ని ఇలాగే చేస్తాను, ఈ విధంగా మీరు నా నీతిని మరియు నా మహిమను చూస్తారు. మరీ ముఖ్యంగా, కేవలం ఈ మార్గంలోనే నా జేష్ట కుమారులు నాతో కలిసి అధికారం చేయడానికి అనుమతించబడతారు.

మునుపటి:  88 వ అధ్యాయము

తరువాత:  108 వ అధ్యాయము

సెట్టింగులు

  • వచనం
  • థీమ్స్

ఘన రంగులు

థీమ్స్

అక్షరశైలి

అక్షరశైలి పరిమాణం

గీతల మధ్య దూరం

గీతల మధ్య దూరం

పేజీ వెడల్పు

విషయ సూచిక

శోధించండి

  • ఈ వచనాన్ని శోధించండి
  • ఈ పుస్తకాన్ని శోధించండి

Connect with us on Messenger