108 వ అధ్యాయము

నాలో, అందరూ విశ్రాంతిని పొందగలరు, మరియు అందరూ స్వతంత్రాన్ని సంపాదించవచ్చు. నా నుండి బయటనున్న వారితో నా ఆత్మ లేనందున, వారు స్వతంత్రాన్ని లేదా సంతోషాన్ని పొందలేరు. అలాంటి వారు ఆత్మలేని మృతులని పిలువబడతారు, అయితే నా యందు ఉన్నవారిని నేను “ఆత్మను కలిగియున్న సజీవులు” అని పిలుస్తాను. వారు నాకు సంబంధించిన వారు, మరియు వారు నా సింహాసనానికి తిరిగి రావడానికి నిశ్చయింపబడియున్నారు. సేవ చేసేవారు మరియు దుష్టునికి సంబంధించిన వారు ఆత్మలేని మృతులవుతారు, వారందరూ అంతం చేయబడి శూన్యమై పోతారు. ఇది నా నిర్వహణ ప్రణాళికకు సంబంధించిన ఒక రహస్యము, మరియు మానవజాతికి ఊహకందని నా నిర్వహణ ప్రణాళికలోని ఒక భాగమై ఉన్నది; అయితే, అదే సమయానికి, దీనిని నేను ప్రతిఒక్కరికీ బహిరంగపరిచాను. నా వారు కాని వారు నాకు విరోధులుగా ఉంటారు; నాకు చెందిన వారు నాకు అనుకూలముగా ఉంటారు. ఇది పూర్తిగా నిర్వివాదమైనది, మరియు ఇది నేను సాతాను పట్ల తీర్పు తీర్చడం వెనకున్న నియమమైయున్నది. వారు నా నీతిని మరియు యధార్ధతను చూడగలుగునట్లుగా ఈ నియమము అందరికీ తెలియపరచబడాలి. సాతాను నుండి వచ్చిన వారందరూ తీర్పు తీర్చబడి, కాలి, బూడిదవుతారు. ఇదికూడా, నా ఉగ్రతే, మరియు ఇక నుండి నా స్వభావము ఇంకా స్పష్టమవుతుంది. ఇకపై, నా విధానము బహిరంగంగానే తెలియజేయబడుతుంది; క్రమక్రమముగా ఇది సమస్త ప్రజలు మరియు దేశాలన్నిటికీ, మతాలన్నిటికీ, మత శాఖలన్నిటికీ, మరియు జీవన రంగాలన్నిటిలోని ప్రజలకు బయలుపరచబడుతుంది. మరుగైనది ఏదీ ఉండదు; సమస్తము బయలుపరచబడుతుంది. నా వ్యవహారపు శైలి మరియు నా క్రియల వెనకున్న నియమము అనేవి మానవాళికి అంత్యంత మరుగైన మర్మాలు అయినందున నేను దీనిని ఖచ్చితంగా చేయవలసి ఉన్నది (దాన్ని బట్టి జ్యేష్ఠ కుమారులు నా పాలనా కట్టడలను అతిక్రమించకుండా, అలాగే బయలుపరచబడిన నా స్వభావాన్ని ఉపయోగించి యావత్ ప్రజానికానికి మరియు దేశాలన్నిటికీ తీర్పుతీర్చడం కొరకై ఉన్నది). ఇదే నా నిర్వాహణ ప్రణాళిక, మరియు ఇవే నా కార్యపు దశలై ఉన్నవి. ఎవరూ దానిని చులకన చేయకూడదు. నేను నా మానవ జీవితంలో నా దైవిక స్వభావాన్ని ఇప్పటికే సంపూర్ణంగా జీవించాను, కాబట్టి ఎవరూ నా మానవ స్వభావాన్ని అపహసించడాన్ని నేను ఒప్పుకోను. (నేను జీవించిన ప్రతిదీ దైవిక స్వభావమైయున్నది; అందుకని నేను సామాన్య మానవ స్వభావాన్ని అధిగమించిన దేవుడను అని ఇదివరికే చెప్పియున్నాను.) నన్ను అపహసించే వారెవరినీ నేను నిశ్చయంగా క్షమించను, అతడిని నిత్యత్వపు నాశనానికి అనుమతిస్తాను! గుర్తుపెట్టుకో! నేను నిశ్చయించుకున్నది ఇదే; మరో మాటలో చెప్పాలంటే, నా పరిపాలనా కట్టడలలో ఇది ఒక అనివార్యమైన అంశమై ఉన్నది. ఉన్నవాడు అనే వ్యక్తి దేవుడని, అంతేకాకుండా, స్వయంభవుడైన దేవుడు: అందరూ దీనిని తప్పక చూడాలి. ఇప్పటికైనా ఇది స్పష్టమవ్వాలి! నేనేమీ బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం లేదు. నీవు సంపూర్ణంగా అర్ధం చేసుకునే దాకా, ప్రతి దాన్ని నేను స్పష్టంగా చెప్తూ ఉదహరిస్తాను.

పరిస్థితి ఎంతో ఉద్విగ్నతగా ఉన్నది; మీరు నా ఇంటిలో మాత్రమే కాదు, కానీ మరి ఎక్కువగా, నా ఇంటి బయట, నా నామాన్ని బట్టి సాక్ష్యమిచ్చి, నన్ను జీవింపజేయాలని, అన్ని విషయాలలో నాకు సాక్షిగా ఉండాలని నేను ఆశిస్తున్నాను. ఇవి అంత్య కాలాలు అయినందున, ప్రతిఒక్కటీ సిద్దపడి ప్రతిదీ దాని మూల స్వరూపాన్ని పొందుకున్నదై, దీనిలో ఏదీ ఎన్నడూ మారకుండా ఉంటుంది. తీసివేయబడవలసినవి తీసివేయబడతాయి, కొనసాగించబడవలసినవి కొనసాగించబడతాయి. బలవంతంగా పట్టుకోడానికో లేక దూరంగా త్రోసివేయడానికో ప్రయత్నించకూడదు; నా నిర్వహణను ఆటంకపరచడానికో లేక నా ప్రణాళికను నాశనం చేయడానికో ప్రయత్నించకూడదు. మానవుని దృష్టిలో, మానవజాతి పట్ల నేను ఎల్లపుడూ ప్రేమ కనికరాలను కలిగిన వాడను, కానీ నా దృష్టిలో, నా కార్యపు దశలకు అనుగుణంగా నా స్వభావము వేరు చేయబడింది, ఎందుకంటే, నేను స్వయానా ఆచరణీయమైన దేవుడను; నేనే స్వయానా అద్వితీయ దేవుడనైయున్నాను! నేను రెండూ మార్పు లేని వాడను మరియు ఎన్నడూ మారని వాడనై ఉన్నాను. ఇది ఎవరికీ అంతుచిక్కని విషయమై ఉన్నది. దాని గురించి నేను మీతో మాట్లాడి మీకు విశదపరచినప్పుడు మాత్రమే మీరు దాని పట్ల ఒక స్పష్టమైన అర్ధాన్ని కలిగి దానిని గ్రహించగలుగుతారు. నా కుమారుల పట్ల, నేను ప్రేమ, కనికరము, యధార్ధతను కనుపరుస్తూ క్రమపరచుచున్నాను, కానీ తీర్పు తీర్చుటలేదు (అంటే, నేను జ్యేష్ట పుత్రులను నాశనము చేయనని భావమై ఉన్నది). నా పుత్రులు కానటువంటి వారి పట్ల, యుగాల గమనాన్ని బట్టి నేను ఏ సమయంలోనైనా మారతాను: నేను ప్రేమామయునిగా, కనికర పూర్ణునిగా, ఘనునిగా, తీర్పరిగా, ఉగ్రునిగా, శపించేవానిగా, దహించు వానిగా ఉండగలను, మరియు, చివరికి వారి శరీరాన్ని నాశనం చేసేవానిగా కూడా ఉండగలను. నాశనమైన వారు తమ ప్రాణ, ఆత్మలతో సహా నశిస్తారు. అయితే, సేవకుల కొరకు, వారి ప్రాణ ఆత్మలు మాత్రమే నిలిచి ఉంటాయి (మరియు దీనిని ఎలా ఆచరించాను అనే దాని గూర్చిన విశిష్టతలకు సంబంధించి మీరు అర్ధం చేసుకోగలిగే విధంగా మీకు నేను తరువాత చెప్తాను). అయితే, వారు నా ప్రజలకు దిగువన, నా ప్రజల స్వాధీనంలో ఉన్నారు కాబట్టి, వారికి ఎప్పటికీ స్వతంత్రత ఉండదు మరియు ఎన్నటికీ విడిపించబడరు. పరిచారకులను నేను బహుగా ఛీత్కరించుకోడానికి గల కారణమేమంటే వారందరూ ఎర్రని మహా ఘట సర్పం సంతానమైయున్నారు, మరియు పరిచారకులు కాని వారు కూడా ఎర్రని మహా ఘట సర్పం సంతానమే. ఇంకా చెప్పాలంటే, జ్యేష్ట పుత్రులు కాని వ్యక్తులందరూ ఎర్రని మహా ఘట సర్పం సంతానమై ఉన్నారు. పాతాళములో ఉన్నవారు నాకు నిరంతరం స్తుతిని చెల్లిస్తారని నేను చెప్పానంటే, చిరకాలము వారు నాకు పరిచారము చేస్తారనేది నా ఉద్దేశ్యమై ఉన్నది. ఇది బండపై స్థిరపరచబడినది. ఆ వ్యక్తులు ఎల్లప్పుడూ దాసులుగా, పశుప్రాయులుగా, మరియు గుర్రముల వలె ఉంటారు. వారు ఎర్రని మహా ఘట సర్పం సంతానమై నా స్వభావాన్ని కలిగి లేరు కాబట్టి, నేను వారిని ఏ సమయంలోనైనా సంహరించగలను, మరియు వారిపై నా ఇష్టమొచ్చినట్లు అధికారం చెలాయించగలను. అంతేగాక వారు ఎర్రని మహా ఘట సర్ప సంతానమైనందున, వారు దాని స్వభావాన్ని కలిగి ఉంటారు; అనగా, వారు పశువుల స్వభావాన్ని కలిగి ఉంటారు. ఇదే నిత్యము మారని, సంపూర్ణ సత్యము! ఇది మొత్తం నాచే ముందుగా నిర్ణయించబడటమే దీనికి కారణమై ఉన్నది. ఎవరూ దీనిని మార్చలేరు (అంటే ఈ నిబంధనకు విరోధంగా ప్రవర్తించడానికి ఎవరినీ అంగీకరించనని నా భావం); ఒకవేళ నీవు ప్రయత్నిస్తే, నేను నిన్ను కొట్టివేస్తాను!

నా నిర్వహణ ప్రణాళిక మరియు నా కార్యము ఎంత భాగానికి చేరుకున్నాయో చూడాలంటే నేను బయలుపరచిన మర్మాలను మీరు తప్పక చూడవలసియున్నది. నేను నా హస్తాలతో ఏం చేస్తానో చూసి, నా న్యాయతీర్పులు మరియు నా ఉగ్రత ప్రజల మీదికి ఎలా దిగివస్తుందో చూడండి. ఇదే నా నీతి. నేను బయలుపరచిన మర్మాల ప్రకారంగా నేను నా కార్యాన్ని సిద్దపరచి నా ప్రణాళికను నిర్వహిస్తాను. ఎవరూ దీనిని మార్చలేరు; అది నా ఇష్టానికి అనుగుణంగా దశల వారీగా జరిగించబడాలి. మర్మములు అనేవి నా కార్యాన్ని నడిపించే మార్గమైయున్నవి, మరియు అవి నా కార్యపు దశలను సూచించే సూచనలై ఉన్నాయి. నా మర్మముల నుండి ఎవరూ దేనినీ కలుపకూడదు లేక తీసివేయకూడదు, ఎందుకంటే ఒకవేళ మర్మమే సరియైనది కాకపోతే, అప్పుడు మార్గమూ సరియైనదిగా ఉండదు. నేనెందుకు నా మర్మములను మీకు బయలుపరుస్తున్నాను? కారణం ఏమై ఉంటుంది? మీలో ఎవరు స్పష్టంగా చెప్పగలుగుతారు? దానికి తోడు, మర్మములు అనేవి మార్గమై ఉన్నదని నేను అన్నాను, కాబట్టి ఈ మార్గము దేనిని సూచిస్తుంది? ఇది మీరు మాంసము నుండి దేహములోనికి పయనించే ఒక విధానముగా, మరియు ఇదొక ముఖ్యమైన దశగా ఉన్నది. నేను నా మర్మములను బయలుపరచిన తరువాత, ప్రజల భావనలు నెమ్మదిగా తీసివేయబడి వారి మనోభావనలు క్రమక్రమంగా బలహీనమవుతాయి. ఇదే ఆధ్యాత్మిక రాజ్యంలోనికి ప్రవేశించే పద్దతియై ఉన్నది. అందుకని, నా కార్యము దశల వారీగా, మరియు అది ఎలాంటి సందిగ్ధం లేకుండా జరుగుతుందని నేను చెప్పుచున్నాను; ఇది యదార్ధము, మరియు ఇది నేను కార్యము జరిగించే విధానమై ఉన్నది. ఎవరూ దీనిని మార్చలేరు, మరియు ఇంకెవ్వరూ దీనిని సాధించలేరు, ఎందుకనగా నేను స్వయానా అద్వితీయ దేవుడనైయున్నాను! నా కార్యాన్ని నేనే వ్యక్తిగతంగా సంపూర్తి చేశాను. విశ్వ లోకమంతా నా ఒక్కడి వశములోనే ఉంటూ, నా ఒక్కడి ద్వారానే క్రమపరచబడినది. నా మాటను నిర్లక్ష్యం చేసే ధైర్యం ఎవరికుంటుంది? (“నా ద్వారానే తప్ప,” అంటే స్వయానా దేవుడే, ఎందుకంటే ఉన్నవాడు అనే వ్యక్తి స్వయానా దేవుడు మాత్రమే—కాబట్టి మీ సొంత భావనలకు మాత్రమే గట్టిగా అంటిపెట్టుకుని ఉండకండి.) నాకు విరోధముగా వెళ్ళే సాహసం ఎవరు చేస్తారు? వారు కఠిన శిక్షను పొందుతారు! ఎర్రని మహా ఘట సర్పము ద్వారా కలిగే పరిణామాలను మీరు చూశారు! అదే దాని అంతము, అయితే అది ఒక నిశ్చయతగా కూడా ఉన్నది. ఎర్రని మహా ఘట సర్పము అవమానపడేలా ఆ కార్యాన్ని నేనే స్వయంగా జరిగించాలి. అది ఇక ఎన్నటికీ పైకెదగకుండా, అది నిత్యత్వమంతటి కొరకై నాశనం చేయబడుతుంది! ప్రస్తుత్తం నేను మర్మములను బయలుపరచడం మొదలుపెట్టాను. (చాలా వరకు బయలు పరచబడిన మర్మములు తరచుగా మీరు వినే విషయాలైనప్పటికీ ఎవరూ గ్రహించరని గుర్తుంచుకో!) పుర్తికానట్టుగా ప్రజలు చూసే విషయాలన్నీ నా దృష్టిలో ఇప్పటికే సంపూర్తి అయ్యాయని, మరియు నేను ఇప్పుడే మొదలుపెట్టినట్టుగా చూసే విషయాలేమో, ఇప్పటికే సంపూర్తి అయినట్లుగా ప్రజలకు అనిపించినట్లు నేను చెప్పాను. ఇదేమైనా వైరుధ్యముగా ఉన్నదా? ఇది అలా లేదు. ప్రజలకు తమ సొంత భావనలు మరియు తలంపులు ఉంటాయి కాబట్టి వారు ఆ విధంగా అనుకుంటారు. నేను ఉద్దేశించిన పనులు నా వాక్కుల ద్వారా నేరవేరతాయి (నేను పలికినప్పుడు అవి స్థిరపరచబడతాయి, మరియు నేను పలికినప్పుడు మాత్రమే అవి సంపూర్ణమవుతాయి). అయితే, నేను పలికిన విషయాలు నేరవేరినట్లుగా నాకేమీ అనిపించడం లేదు. నేను చేసే పనులకు ఒక కాలపరిమితి ఉన్న కారణాన్ని బట్టి ఇలా ఉంటుంది. అందువల్ల, ప్రజల భౌతికమైన దృష్టిలో (వారి సమయ భావనలోని వ్యత్యాసాల కారణాన్ని బట్టి), ఈ విషయాలు ఇప్పటికే సంపూర్ణమైనప్పటికీ, నాకు మాత్రం ఈ విషయాలు అసంపూర్ణంగానే ఉన్నట్టు కనబడుతున్నాయి. నేటి దినాల్లో అనేకమంది ప్రజలు నేను బయలుపరిచే మర్మముల కారణంగా నన్ను సందేహిస్తున్నారు. వాస్తవికత పైబడటం వలన, మరియు నా తలంపులు ప్రజల భావనలతో సరిపోలట్లేదు కాబట్టి, వారు నన్ను ఎదిరించి నన్ను నిరాకరించారు. ఇది సాతాను తనకు తానుగానే తన సొంత కుయుక్తులలో చిక్కబడటం వంటిది. (వారు దీవెనలు పొందుకోవాలని ఆశిస్తారు, కానీ తమ సొంత భావనలకు దేవుడు అంత ఎడమగా ఉంటాడని వారు అనుకోలేదు, కాబట్టి వారు వెనుతిరిగారు.) ఇది కూడా నా కార్యానికి చెందిన ఒక పర్యవసానమే. సమస్త ప్రజలు నన్ను స్తుతించి, నన్ను కీర్తించి, నన్ను మహిమపరచాలి. నిశ్చయంగా ప్రతిఒక్కటి నా హస్తాల్లోనే ఉన్నది, మరియు సమస్తము సంపూర్ణంగా నా న్యాయతీర్పులోనే ఇమిడియున్నది. ఎప్పుడు సకల ప్రజలు నా పర్వతానికి వస్తారో, మరియు ఎప్పుడు జ్యేష్ట పుత్రులు జయమొందుతారో, అదే నా నిర్వహణ ప్రణాళికకు ముగింపు సంకేతమవుతుంది. ఇది ఆరు వేల సంవత్సరాల నా నిర్వాహణ ప్రణాళిక పూర్తయిన తరుణముగా ఉండబోతుంది. సమస్తాన్ని నేనే స్వయంగా ఏర్పాటు చేశాను; ఇప్పటికే దీనిని నేను అనేకసార్లు చెప్పాను. ఇంకా మీరు మీ తలంపులలోనే జీవిస్తున్నారు కాబట్టి, నా ప్రణాళికను ఆటంకపరిచే ఎటువంటి తప్పిదాలు మీరు చేయకుండు నిమిత్తము నేను దీనిని మీకు మళ్ళీ మళ్ళీ నొక్కి చెప్పవలసి వస్తుంది. మీరు ప్రస్తుతం రక్తమాంసాలతో ఉన్న కారణాన్ని బట్టి (మీరు నా వారు అయినప్పటికీ, ఇప్పటికీ మీరు శరీరమందే జీవిస్తున్నారు), జనులు నాకు సహకరించలేరు, మరియు వారు నా నిర్వహణలో పాలిభాగస్తులు కాలేరు. అందుకని, రక్తమాంసాలు కలిగి ఉన్నవారు నా వారసత్వాన్ని పొందుకోలేరని నేను చెప్పుచున్నాను. ఆధ్యాత్మిక రాజ్యములోనికి మీరు ప్రవేశించడానికి ఇది కూడా ప్రధానమైన కారణమైయున్నది.

లోకంలో భూకంపాలు అనేవి విపత్తుకు ఆరంభమై ఉన్నాయి. మొదటగా, నేను లోకాన్ని—భూమిని, అంటే—మార్పును చేస్తాను, ఆ తర్వాత తెగుళ్లు మరియు కరువులు వస్తాయి. ఇదే నా ప్రణాళిక, మరియు ఇవే నా సోపానాలు, నా నిర్వహణ ప్రణాళికను ముగించి నాకు సేవ చేయడానికి నేను సమస్తాన్ని సిద్దపరచుకుంటాను. ఆలాగే, నేరుగా నేను జోక్యము చేసుకోకుండా కూడా, విశ్వ లోకమంతా నాశనం చేయబడుతుంది. నేను మొదటిసారి శరీరధారియై సిలువ వేయబడినప్పుడు, భూమి భయంకరంగా కంపించింది, అంతము రాబోయేటప్పుడు కూడా ఇది ఇలాగే ఉండబోతుంది. నేను శరీరము నుండి ఆధ్యాత్మిక రాజ్యములోనికి ప్రవేశించిన మరుక్షణమే భూకంపాలు మొదలవుతాయి. ఆ విధంగా, జ్యేష్ట పుత్రులు నిశ్చయముగా ఈ విపత్తు ద్వారా బాధించబడరు, అయితే జ్యేష్ట పుత్రులు కానివారు మాత్రం బాధించబడటానికి విపత్తుల మధ్య విడిచిపెట్టబడతారు. అందుకని, మానవ దృష్టిలో, ప్రతి ఒక్కరూ జ్యేష్ట కుమారునిగా కావాలని కోరుకుంటారు. మానవ ప్రబోధనలలో, ఇది దీవెనలను అనుభవించడం కోసం కాదు, కానీ విపత్తు బాధను తప్పించబడటం కోసమై ఉన్నది. ఇదే ఎర్రని మహా ఘట సర్పము యొక్క కుతంత్రము. అయితే, నేను మాత్రము దానిని వదిలిపెట్టను; నా కటినమైన శిక్షతో నేను దానిని బాధించి, ఆపై నిలబడి నాకు ఉపచారము చేసేలా చేస్తాను (ఇది నా పుత్రులను మరియు నా ప్రజలను సంపూర్ణము చేయడాన్ని నిర్దేశిస్తుంది), ఎప్పటికీ దాని సొంత కుయుక్తుల చేత అదే చిక్కునబడి, ఎన్నటికీ నా న్యాయతీర్పును స్వీకరించి, నాచేత శాశ్వతంగా దహించబడేలా చేస్తాను. సేవకులు నన్ను స్తుతించడాన్ని గురించిన అసలైన భావము ఇదే (అంటే, నా మహాశక్తిని కనుపరచడానికి వారిని వాడుకోవడం). ఎర్రని మహా ఘట సర్పాన్ని దొంగచాటుగా నా రాజ్యంలోనికి ప్రవేశించేందుకు నేను ఒప్పుకోను, లేదా నన్ను సన్నుతించే హక్కును నేను దానికియ్యను! (ఎందుకంటే అది అర్హత గలది కాదు; ఎన్నటికీ అర్హతను పొందలేదు!) ఎర్రని మహా ఘట సర్పాన్ని నేను నిత్యత్వములో నాకు సేవ చేసేలా మాత్రమే చేస్తాను! నేను దానిని నాయెదుట సాగిలపడేలా మాత్రమే చేస్తాను. (నాశనములో ఉన్నవారికంటే నిశించిన వారు ధన్యులు; వనాశనము అనేది భయంకరమైన శిక్షకు ఒక తాత్కాలిక రూపము మాత్రమే, అయితే నాశనములో ఉన్న వ్యక్తులు భయంకరమైన శిక్షచేత నిత్యము బాధించబడతారు. దీన్ని బట్టి, నేను “సాగిలపడటం” అనే పదాన్ని వాడతాను. ఈ వ్యక్తులు నా ఇంటిలోనికి దొంగచాటుగా ప్రవేశించి నా కృపను ఎంతగానో ఆనందిస్తూ, నన్ను గురించిన అవగాహన కొంతమేర కలిగియున్నారు కాబట్టి, నేను భయంకరమైన శిక్షలను ఆపాదిస్తాను. నా ఇంటి బయట ఉన్నవారి విషయానికొస్తే, అవివేకులు శ్రమపడరని మీరు చెప్పవచ్చు.) ప్రజల భావనలలో, నాశనమైపోయిన ప్రజలు నాశనములో ఉన్నవారికంటే చెడ్డవారని అనుకుంటారు, కానీ దానికి భిన్నంగా, తదుపరి వారు నిత్యము భయంకరంగా శిక్షించబడవలసియున్నది, నశించిన వారు నిత్యమంతటి కోసము శున్యానికి తిరిగి వస్తారు.

మునుపటి:  103 వ అధ్యాయము

తరువాత:  4 వ అధ్యాయము

సెట్టింగులు

  • వచనం
  • థీమ్స్

ఘన రంగులు

థీమ్స్

అక్షరశైలి

అక్షరశైలి పరిమాణం

గీతల మధ్య దూరం

గీతల మధ్య దూరం

పేజీ వెడల్పు

విషయ సూచిక

శోధించండి

  • ఈ వచనాన్ని శోధించండి
  • ఈ పుస్తకాన్ని శోధించండి

Connect with us on Messenger