ప్రారంభంలో క్రీస్తు పలుకులు—88 వ అధ్యాయము

నా వేగం ఎంత మేరకు పెరిగిందో జనులు సులభంగా ఊహించలేరు. మనిషికి అంతు చిక్కకుండా సంభవించిన అద్భుతం ఇది. ప్రపంచం సృష్టించబడిన నాటి నుండి నా వేగం కొనసాగుతూనే ఉంది, మరియు నా పని ఎప్పుడూ ఆగలేదు. రోజు రోజుకీ ఈ మొత్తం విశ్వ ప్రపంచం మారుతూనే ఉంది, మరియు జనులు కూడా నిరంతరంగా మారుతూ ఉన్నారు. ఇవన్నీ నా కార్యములో భాగం, అన్నీ నా ప్రణాళిక లో భాగం, మరియు అంతేకాకుండా, అవి నా నిర్వహణకు చెందినవి, ఏ మనిషీ ఈ విషయాలను తెలుసుకోలేడు లేదా అర్దం చేసుకోలేడు. నా అంతట నేను మీకు చెప్పినప్పుడు మాత్రమే, నేను మీతో ముఖాముఖిగా సంభాషించినపుడు మాత్రమే, మీకు కనీసం కాస్త ముక్కయినా తెలుస్తుంది; లేకపోతే, ఖచ్చితంగా ఏ ఒక్కరికీ నా నిర్వహణా ప్రణాళిక నమూనా పట్ల ఎలాంటి ఆలోచనా ఉండేది కాదు. నా గొప్ప శక్తి ఇలాంటిది, మరియు అంతేకాక నా అద్భుతమైన కార్యాలు ఇలాంటివి. ఈ విషయాలు ఎవరూ మార్చలేనివి. కాబట్టి, ఈ రోజు నేను చెప్పేది జరుగుతుంది, మరియు ఇది సులభంగా మారదు. మనుషుల అభిప్రాయాలు నా పట్ల కనీస జ్ఞానాన్ని కూడా కలిగి ఉండవు, అవన్నీ వ్యర్థ ప్రేలాపనలు! మీకు తగినంత ఉంది అని లేదా మీరు తృప్తి చెందారు అని అనుకోవద్దు. నేను నీకు ఇది చెప్తాను: నువ్వు ఇంకా చాలా దూరం వెళ్ళాలి. నా మొత్తం నిర్వహణ ప్రణాళికలో మీకు తెలిసింది కొంత మాత్రమే, కాబట్టి నేను చెప్పేది మీరు తప్పకుండా వినాలి మరియు నేను మీకు ఏం చెయ్యమని చెప్తే అది చెయ్యాలి. ప్రతి విషయంలోనూ నా కోరికలకు అనుగుణంగా వ్యవహరించండి, మీకు నా ఆశీర్వాదాలు తప్పకుండా ఉంటాయి. ఎవరైతే నన్ను నమ్ముతారో వారు పొందుకోగలరు, ఎవరైతే నమ్మరో వారికి, వారు ఊహించుకున్న “శూన్యం” తమలో నింపబడుతుంది. ఇది నా నీతి, అంత కంటే ఎక్కువగా ఇది నా మహిమ, నా క్రోధం, మరియు నా దండన. ఏ ఒక్క ఆలోచనా లేదా చర్యతో కూడా ఏ ఒక్కరినీ నేను తప్పించుకొని పోనివ్వను.

నా మాటలు వినగానే, చాలా మంది మనుష్యులు భయపడతారు మరియు వణికిపోతారు, వారి ముఖాలు ఆందోళనతో చిట్లి పోయి ముడతలు పడతాయి. వాస్తవానికి నేను నీకు అన్యాయం చేశానా? నిజానికి, నువ్వు గొప్ప ఎర్ర డ్రాగన్ సంతానం కాకపోవచ్ఛా? నువ్వు మంచివాడిలా కూడా నటిస్తావు! నా జ్యేష్ఠ కుమారునిలా కూడా నటిస్తావు! నేను గుడ్డి వాడిని అని నువ్వు అనుకుంటున్నావా? నేను మనుషుల మధ్య తేడాలను గుర్తించలేను అనుకుంటున్నావా? జనుల హృదాయంతరాలను వెతికే దేవుడ్ని నేను. నేను నా కుమారులకు చెప్పేది ఇదే, గొప్ప ఎర్ర డ్రాగన్ పిల్లలారా, మీకూ కూడా నేను ఇదే చెప్తాను. నేను చిన్న తప్పు కూడా చెయ్యకుండా ప్రతీదీ స్పష్టంగా చూస్తాను, నేను ఏం చేస్తానో నాకు తెలియకుండా ఎందుకు ఉంటుంది? నేను చేసే దాని పట్ల నేను పూర్తి స్పష్టతతో ఉన్నాను! విశ్వాన్ని మరియు అన్నిటినీ సృష్టించిన దేవుడ్ని నేనే అని నేను ఎందుకు చెప్తాను? జనుల హృదయంతరాలని పరిశీలించే దేవుడ్ని నేనే అని నేను ఎందుకు చెప్తాను? నాకు ప్రతి ఒక్కరి పరిస్థితి గురించి బాగా అవగాహన ఉంది. ఏం చెయ్యాలో లేదా ఏం చెప్పాలో నాకు తెలియదని మీరు అనుకుంటున్నారా? ఇది మీకు సంబందించినది కాదు. నా హస్తముచే చంపబడకుండా జాగ్రత్త పడండి; ఆ విధంగా మీకు నష్టం కలుగుతుంది. నా పరిపాలన శాసనాలు క్షమించవు. మీకు అర్దం అవుతోందా? పై వన్నీ నా పరిపాలన శాసనాలలో భాగాలు. నేను మీకు చెప్పిన నాటి నుండి, మీరు ఇంకా ఏదైనా అతిక్రమణలకి పాల్పడితే, ప్రతీకారం ఉంటుంది, ఎందుకంటే గతంలో మీరు అర్దం చేసుకోలేదు.

ఇప్పుడు నేను నా పరిపాలన శాసనాలను మీ కొరకు ప్రకటిస్తున్నాను. (వాటిని ప్రకటించిన నాటి నుండి అమలు లోకి వస్తాయి, వివిధ రకాల జనులకి వివిధ రకమైన దండలను కేటాయిస్తాయి):

నేను నా వాగ్దానాలను నిలబెట్టుకుంటాను, మరియు ప్రతీదీ నా చేతుల్లో ఉంది: ఎవరైతే సందేహిస్తారో వారు తప్పకుండా చంపబడతారు. ఎటువంటి పరిశీలనకు ఎలాంటి ఆస్కారమూ లేదు. వారు వెంటనే నిర్మూలించబడతారు, తద్వారా నా హృదయం నుండి ద్వేషాన్ని తొలగిస్తారు. (ఇప్పటి నుండి ఎవరైతే చంపబడతారో వారు తప్పకుండా నా రాజ్యపు సభ్యులు అవ్వరు మరియు తప్పకుండా సాతాను సంతతికి చెందిన వారు అయి ఉంటారు అని నిర్దారించబడింది.)

జ్యేష్ట కుమారులుగా, మీరు మీ సొంత స్థానాలను నిలుపుకోవాలి మరియు మీ సొంత విధుల్ని బాగా నిర్వర్తించాలి, మరియు అత్యుత్సాహంతో ఉండకండి. నా నిర్వహణ ప్రణాళిక కొరకు మిమ్మల్ని మీరు అర్పించుకోవాలి; మరియు మీరు వెళ్ళే ప్రతిచోట, మీరు నాకు మంచి సాక్ష్యంగా ఉండాలి మరియు నా నామాన్ని ఘన పరచాలి. సిగ్గుమాలిన పనులు చేయకండి, నా కుమారులందరికీ మరియు నా జనులకు ఉదాహరణగా ఉండండి. ఒక్క క్షణం కూడా అశ్లీలంగా ఉండకండి. మీరు ఎల్లపుడూ తప్పక జ్యేష్ట కుమారుల గుర్తింపుతో అందరి ముందూ కనబడాలి, బానిసలా ఉండకూడదు. బదులుగా, మీరు తలలు ఎత్తుకొని ముందుకు నడవాలి. నేను మిమ్మల్ని నా నామాన్ని ఘనపరచమని అడుగుతున్నాను, నా నామాన్ని కించపరచమని కాదు. ఎవరైతే జ్యేష్ట కుమారులుగా ఉంటారో వారిలో ప్రతి ఒక్కరికీ వారి స్వంత వ్యక్తిగత విధి ఉంది, మరియు అన్నిటినీ చేయలేరు. నేను మీకు ఇచ్చిన బాధ్యత ఇది, ఇది తప్పించుకోవడానికి కాదు. నేను మీకు అప్పగించిన దాన్ని నెరవేర్చడానికి హృదయపూర్వకంగా, మీ పూర్ణ మనసుతో, మీ పూర్తి శక్తి తో మిమ్మల్ని మీరు మిమ్మల్ని అంకిత మిచ్చుకోవాలి.

ఈ రోజు మొదలుకొని, విశ్వ ప్రపంచం అంతటా, నా కుమారులందరినీ మరియు నా జనులందరినీ కాపు కాసే బాధ్యత నెరవేర్చడానికి నా జ్యేష్ట కుమారులకు అప్పగించబడుతుంది, ఎవరైతే దాన్ని పూర్తి చెయ్యడానికి వారి పూర్తి హృదయాన్ని మరియు మనస్సును అంకితమివ్వరో నేను వారిని దండిస్తాను. ఇది నా నీతి. నా జ్యేష్ట కుమారులైనా కూడా నేను వదిలి పెట్టను లేదా తేలికగా తీసుకోను.

నా కుమారులలో లేదా నా జనులలో ఎవరైనా నా జ్యేష్ట కుమారులలో ఒకరిని ఎగతాళి చేసి, అవమానం చేస్తే, నేను వారిని తీవ్రంగా శిక్షిస్తాను. ఎందుకంటే నా జ్యేష్ట కుమారులు నాకు ప్రాతినిధ్యం వహిస్తారు; వారికి ఎవరైనా ఏదైనా చేస్తే, నాకు కూడా చేసినట్లే. ఇది నా పరిపాలనా శాసనాల్లో అతి తీవ్రమైనది. నా కుమారులలో మరియు నా జనులలో ఈ శాసనాన్ని ధిక్కిరించిన వారిపట్ల, నా జ్యేష్ట కుమారులను తమకి నచ్చినట్టుగా నా నీతిని అమలు చెయ్యడానికి నేను అనుమతిస్తాను.

ఎవరైతే నన్ను అల్పముగా భావించి నా ఆహారం, దుస్తులు మరియు నిద్ర మీద మాత్రమే దృష్టి ఉంచుతారో, నా భారం పట్ల ఎటువంటి విచారణా లేకుండా, నా బాహ్య వ్యవహారాలకు మాత్రమే వస్తారో, మరియు వారి సొంత విధులను సక్రమంగా నిర్వర్తించడానికి ఎటువంటి శ్రద్ద చూపరో వారిని నేను క్రమంగా విడిచి పెడతాను. చెవులున్న వారందరికీ ఇది ఉద్దేశించబడింది.

నా కొరకు సేవను పూర్తి చేసిన వారు ఎవరైనా తప్పక ఎటువంటి విసుగూ లేకుండా విధేయతతో ఉపసంహరించుకోవాలి. జాగ్రత్త, లేదా నేను నిన్ను బయటకి పంపుతాను. (ఇది అనుబంధ శాసనం.)

అన్ని దేశాలు మరియు జనులను పాలించడానికి, అన్ని దేశాల మరియు జనుల మధ్య నడవడానికి, నా తీర్పును, నీతిని అమలు చేయడానికి, అన్ని దేశాల మరియు జనుల మధ్య మహిమ పరచడానికి నా జ్యేష్ట కుమారులు ఇప్పటి నుండి ఇనుప దండాన్ని పైకెత్తి నా అధికారాన్ని అమలు చెయ్యాలి. నా కుమారులు మరియు నా జనులు నాకు భయపడాలి, నన్ను కీర్తించాలి, నన్ను ఉత్సాహ పరచాలి, మరియు తప్పకుండా నన్ను ఘన పరచాలి. ఎందుకంటే నా నిర్వహణ ప్రణాళిక పూర్తి అయ్యింది మరియు నా జ్యేష్ట కుమారులు నాతో కలిసి పాలించవచ్చు.

ఇది నా పరిపాలన శాసనాలలో ఒక భాగం. దీని తర్వాత, పని ముందుకు సాగుతున్న కొలదీ మీకు అవి చెప్తాను. పైన ఉన్న పరిపాలన శాసనాల నుండి, నేను ఎంత వేగంతో నా కార్యాన్ని చేస్తానో, దానితో పాటు నా పని ఏ స్థాయికి చేరుకుంది అనేది కూడా మీరు చూస్తారు. ఇది ఒక నిర్ధారణ అవుతుంది.

నేను ఇప్పటికే సాతాను తీర్పు తీర్చాను. నా చిత్తం అడ్డుకోలేనిది కాబట్టి, నా జ్యేష్ట కుమారులు నాతో కలిసి ఘనతను పొందారు కాబట్టి, నేను ఇప్పటికీ ప్రపంచం పైన మరియు సాతానుకి చెందిన అన్నిటి పైన నా నీతిని, మహిమను ప్రదర్శించాను. నేను సాతాను వైపు అస్సలు వేలెత్తి చూపను లేదా దృష్టి పెట్టను. (ఎందుకంటే దానికి నాతో కనీసం సంభాషించే అర్హత కూడా లేదు). నేను ఏం చెయ్యాలనుకున్నానో అది చేస్తూనే ఉంటాను. నా చిత్తం మొత్తం భూమి అంతటా ఎటువంటి ఆటంకం లేకుండా, అంచెలంచెలుగా నా పని సజావుగా సాగుతుంది. ఇది సాతానుని ఒకింత సిగ్గుపడేలా చేసింది మరియు అది పూర్తిగా నాశనం అయ్యింది; కానీ దీనితోనే నా చిత్తం పూర్తికాలేదు. వారిపై నా పరిపాలన శాసనాలను అమలు చెయ్యడానికి నేను నా జ్యేష్ట కుమారులను కూడా అనుమతిస్తాను. ఒక పక్క నేను సాతానుకి దాని పట్ల నా క్రోధం ఎలాంటిదో చూసేలా చేసాను, మరో పక్క దానిని నా ఘనతను చూసేలా చేసాను (నా జ్యేష్ట కుమారులు సాతాను అవమానానికి అత్యంత మారుమ్రోగే సాక్షులు అని గమనించండి). నేను దానిని వ్యక్తిగతంగా శిక్షించను; బదులుగా, నా జ్యేష్ట కుమారులను నా నీతిని, మహిమను అమలు చేయనిస్తాను. సాతాను నా కుమారులను హింసించేవాడు, నా కుమారులను దుర్భాషలాడే వాడు, మరియు నా కుమారులను అణిచి వేసేవాడు కాబట్టి, ఈ రోజు దాని పని ముగిసిన తర్వాత, నా పరిపక్వత కలిగిన జ్యేష్ట కుమారులను దానిని చక్కదిద్దడానికి అనుమతిస్తాను. పతనం పట్ల సాతాను శక్తిహీనుడై ఉన్నాడు. అన్ని దేశాలలో ఉన్న పక్షవాతం దీనికి ఉత్తమ సాక్ష్యం; జనులు కొట్టుకోవడం, మరియు దేశాలు యుద్ధంలో ఉండటం అనేవి సాతాను రాజ్యం కూలిపోవడానికి స్పష్టమైన వ్యక్తీకరణలు. నేను గతంలో ఎటువంటి సంకేతాలు, అద్భుతాలు చూపకపోవడానికి కారణం అంచలంచెలుగా సాతానుని అవమానిస్తూ, నా నామాన్ని మహిమ పరచాలనుకోడమే. ఎప్పుడైతే సాతాను పూర్తిగా నాశనమవుతాడో, నేను నా శక్తిని చూపడం మొదలు పెడతాను. నేను చెప్పేది ఉనికిలోకి వస్తుంది, మరియు మనిషి భావనలకి అనుగుణంగా లేని అతీంద్రియ విషయాలు నెరవేర్చబడతాయి (ఇవి త్వరలో రాబోయే ఆశీర్వాదాలు సూచిస్తాయి). ఎందుకంటే, నేను ఆచరణాత్మక మైన దేవుడిని మరియు నాకు ఎలాంటి నియమాలు లేవు, ఎందుకంటే నా నిర్వహణ ప్రణాళికలో మార్పులకు అనుగుణంగా నేను మాట్లాడతాను, కాబట్టి నేను గతంలో చెప్పింది ఇప్పుడు వర్తమానంలో వర్తించాల్సిన అవసరం లేదు. మీ సొంత భావాలకు కట్టుబడి ఉండకండి. నేను నియమాలచే కట్టుబడే దేవుడిని కాను. నాతో ప్రతీదీ స్వతంత్రంగా, అతీతంగా మరియు పూర్తిగా విడుదల చేయబడుతుంది. బహుశా నిన్న చెప్పినది ఈ రోజు పాతబడి ఉండచ్చు, లేదా బహుశా ఈ రోజు అది పక్కన పెట్టి ఉండచ్చు (ఏదేమైనా, నా పరిపాలనా శాసనాలు ప్రకటించబడ్డాయి కావున, ఎప్పటికీ మారవు). ఇవి నా నిర్వహణ ప్రణాళికలోని దశలు. నిబంధనలకి వేలాడకండి. ప్రతిరోజూ కొత్త కాంతి ఉంటుంది మరియు కొత్త సాక్షాత్కారాలు ఉంటాయి. ఇది నా ప్రణాళిక. ప్రతి రోజు నా కాంతి నీలో వెల్లడి చెయ్యబడుతుంది. నా వాక్కు విశ్వ ప్రపంచంలోకి విడుదల చేయ బడుతుంది. మీకు అర్దం అవుతోందా? ఇది నీ విధి, నేను నీకు అప్పగించిన బాధ్యత. ఒక్క క్షణం పాటు కూడా దీనిని నిర్లక్ష్యం చెయ్యరాదు. నేను ఆమోదించిన వ్యక్తులను చివరి వరకూ వాడుకుంటాను, మరియు ఇది ఎప్పటికీ మారదు. నేను సర్వ శక్తిమంతుడైన దేవుడ్ని కావున, ఎలాంటి వ్యక్తి ఎలాంటి పనిని చెయ్యాలో నాకు తెలుసు. ఎలాంటి వ్యక్తిలో ఎలాంటి పని చెయ్యగల సామర్థ్యం ఉందో కూడా తెలుసు. ఇది నా అనంతశక్తి.

మునుపటి:  ప్రారంభంలో క్రీస్తు పలుకులు—15 వ అధ్యాయము

తరువాత:  ప్రారంభంలో క్రీస్తు పలుకులు—103 వ అధ్యాయము

సెట్టింగులు

  • వచనం
  • థీమ్స్

ఘన రంగులు

థీమ్స్

అక్షరశైలి

అక్షరశైలి పరిమాణం

గీతల మధ్య దూరం

గీతల మధ్య దూరం

పేజీ వెడల్పు

విషయ సూచిక

శోధించండి

  • ఈ వచనాన్ని శోధించండి
  • ఈ పుస్తకాన్ని శోధించండి

Connect with us on Messenger