ప్రారంభంలో క్రీస్తు పలుకులు—15 వ అధ్యాయము
అన్ని సంఘాలలో దేవుని స్వరూపం ఇప్పటికే ఉద్భవించింది. పరిశుద్ధాత్మడు ఇలా చెప్పాడు; ఆయన రగులుతున్న అగ్నియై ఉన్నాడు, మహిమను కలిగి ఉన్నాడు, ఆయన తీర్పు తీరుస్తున్నాడు. ఆయన మనుష్య కుమారుడు, ఆయన పాదాల వరకూ క్రిందకు వ్రేలాడుచున్న వస్త్రం ధరించాడు, ఆయన ఛాతీకి చుట్టూ బంగారు దట్టి కట్టబడియున్నది. ఆయన తల, వెంట్రుకలూ ఉన్నిలా తెల్లగా ఉన్నాయి, ఆయన కళ్ళు అగ్ని జ్వాలల వలె ఉన్నాయి; ఆయన పాదాలు శ్రేష్టమైన ఇత్తడితో సమానంగా ఉన్నాయి, అవి కొలిమిలో చేయబడినట్లుగా ఉన్నాయి, ఆయన స్వరం విస్తార నీటి ధ్వనిలా ఉంది. ఆయన తన కుడిచేతిలో ఏడు నక్షత్రాలు, నోటిలో పదునైన రెండంచుల ఖడ్గం కలిగి ఉన్నాడు. ఆయన ముఖం మండుతున్న సూర్యుడిలా ప్రకాశవంతంగా ప్రకాశిస్తుంది!
మనుష్య కుమారుని గురించి సాక్ష్యం ఇవ్వబడింది. దేవుడు తానే బహిరంగంగా బయలుపరచాడు. మండుతున్న సూర్యునిలా ప్రకాశిస్తూ దేవుని మహిమ బయలుపడింది! ఆయన మహిమాన్వితమైన ముఖం మిరుమిట్లు గొలిపే కాంతితో ప్రకాశిస్తుంది; ఆయనను ప్రతిఘటనతో ఎదిరించడానికి ఎవరి కళ్ళు ధైర్యం చెయ్యగలవు? ప్రతిఘటన మరణానికి దారితీస్తుంది! మీరు మీ హృదయంలో ఆలోచించే దేనికైనా, మీరు పలికే ఏమాటకైనా లేదా మీరు చేసే దేనికైనా స్వల్పమైన జాలి చూపించబడదు. మీరు అందరూ అర్థం చేసుకుంటారు, మీరు ఏమి పొందారో చూడడానికి వస్తారు—అది నా తీర్పు తప్ప మరేమీ కాదు! మీరు నా మాటలను తినడానికీ, త్రాగడానికీ మీ ప్రయత్నాన్ని మీరు చెయ్యనప్పుడు, దానికి బదులు యధేచ్ఛగా అడ్డగించి నా కట్టడను నాశనం చేసినప్పుడు నేను దానిని పాటించగలనా? అటువంటి వ్యక్తితో నేను సున్నితంగా వ్యవహరించను! మీ ప్రవర్తన మరింత తీవ్రంగా దిగజారిన యెడల, మీరు అగ్ని జ్వాలలలో దహించిపోతారు! సర్వశక్తిమంతుడైన దేవుడు ఆత్మీయ దేహంలో ప్రత్యక్షమవుతాడు, శిరస్సు నుండి కాలి వేలు వరకూ ఎటువంటి మాంసం లేదా రక్తం చేత సంబంధపరచబడలేదు. మూడవ ఆకాశంలో మహిమ గల సింహాసనం మీద కూర్చుండి, సమస్త కార్యములను నిర్వహిస్తూ ఆయన విశ్వ ప్రపంచాన్ని అధిగమిస్తాడు! ఈ విశ్వము, సమస్త కార్యములూ నా హస్తాలలో ఉన్నాయి. నేను దానితో మాట్లాడిన యెడల అది ఆ విధంగా ఉంటుంది. నేను దానిని నియమించిన యెడల అది ఆ విధంగా ఉంటుంది. సాతాను నా పాదాల క్రింద ఉన్నాడు; ఆధారం లేని గోతిలో ఉన్నాడు! నా స్వరం వెలుపలికి వచ్చినప్పుడు, ఆకాశము, భూమి గతించిపోతాయి, ఏమీ లేకుండా పోతాయి! సమస్త కార్యములు పునరుద్ధరించబడతాయి; ఇది ఒక మార్పులేని సత్యం, అది సంపూర్ణంగా వాస్తవమైనది. నేను ఈ లొకాన్నీ, దుర్మార్గులందరినీ జయించాను. నేను, మీతో మాట్లాడుతున్నాను, చెవులు ఉన్నవారందరూ వినాలి, జీవముతో ఉన్న వారందరూ అంగీకరించాలి.
దినములు ఒక ముగింపునకు వస్తాయి; ఈ లోకంలోని సమస్త కార్యములు నిరుపయోగమవుతాయి. సమస్త కార్యములు నూతనపరచబడతాయి. దీనిని జ్ఞాపకం ఉంచుకోండి! మరచి పోవద్దు! ఎటువంటి అస్పష్టత ఉండకూడదు! ఆకాశము, భూమి గతించిపోతాయి, అయితే నా మాటలు నిలిచి ఉంటాయి! నేను మిమ్మల్ని మరోసారి హెచ్చరిస్తాను. వ్యర్థంగా పరుగెత్తకండి! మేల్కొనండి! పశ్చాత్తాపపడండి, రక్షణ సమీపంలోనే ఉంది! నేను ఇప్పటికే మీమధ్య ప్రత్యక్షం అయ్యాను. నా స్వరం ఉదయించింది. నా స్వరం మీ ముందు లేచింది; ప్రతిదినం అది మిమ్మల్ని ముఖాముఖిగా ఎదుర్కొంటుంది, ప్రతి దినం అది తాజాగానూ, నూతనంగానూ ఉంటుంది. నువ్వు నన్ను చూడు, నేను నిన్ను చూస్తాను; నేను నీతో నిరంతరం మాట్లాడుతాను. నీతో ముఖాముఖీగా ఉంటాను. అయినప్పటికీ, నువ్వు నన్ను తిరస్కరించావు, నన్ను తెలిసుకొనలేదు. నా గొర్రెలు నా స్వరాన్ని వినగలవు, అయినప్పటికీ మీరు సంకోచించారు! మీరు సంకోచించారు! మీ హృదయం మొద్దుబారి ఉంది, మీ కళ్ళు సాతాను చేత గ్రుడ్డిగా చేయబడ్డాయి, మీరు నా మహిమగల ముఖాన్ని చూడలేరు—మీరు ఎంత దయనీయంగా ఉన్నారు! ఎంత దీనస్థితిలో ఉన్నారు!
నా సింహాసనం ముందు ఉన్న ఏడు ఆత్మలు భూమి మీది అన్ని మూలలకు పంపబడ్డారు, సంఘాలతో మాట్లాడటానికి నేను నా దూతను పంపుతాను. నేను నీతిమంతుడను, నమ్మదగినవాడను; నేను మనిషి హృదయంలోని లోతైన భాగాలను పరిశీలించే దేవుణ్ణి. పరిశుద్ధాత్మ సంఘాలతో మాట్లాడుతున్నాడు. నా కుమారుని లోపల నుండి బయటికి వచ్చేవి నా మాటలే; చెవులు ఉన్నవారందరూ వినాలి! జీవించుచున్న వారందరూ అంగీకరించాలి! కేవలం వాటిని తినండి, త్రాగండి, సందేహించకండి. నా మాటలకు లోబడి, వాటిని జాగ్రత్తగా ఆలకించేవారు అందరూ గొప్ప ఆశీర్వాదాలను పొందుతారు! నా ముఖాన్ని యధార్ధతతో వెదకువారందరూ ఖచ్చితంగా నూతన వెలుగునూ, నూతన జ్ఞానాన్ని, నూతన అంతర్దృష్టి కలిగి ఉంటారు; సమస్తమూ తాజాగానూ నూతనంగానూ ఉంటాయి. నా మాటలు నీకు ఏ సమయములోనైనా ప్రత్యక్షం అవుతాయి. అవి నీ ఆత్మ కళ్ళు తెరుస్తాయి, తద్వారా నువ్వు ఆత్మీయ రాజ్యపు అన్ని రహస్యాలను చూడగలవు, రాజ్యం మనిషి మధ్య ఉందని చూడగలవు. ఆశ్రయంలోనికి ప్రవేశించండి, సమస్త కృప, ఆశీర్వాదాలు అన్ని నీ మీద ఉంటాయి; కరువు, ప్లేగు వ్యాధి నిన్ను తాకలేవు, తోడేళ్ళు, పాములు, పులులు, చిరుతపులులు నీకు హాని చేయలేవు. నువ్వు నాతో వస్తావు, నాతో నడుస్తావు, నాతో మహిమలో ప్రవేశిస్తావు!
సర్వశక్తిగల దేవుడు! ఆయన మహిమాన్వితమైన దేహం బహిరంగంగా ప్రత్యక్షం అవుతుంది. పరిశుద్ధమైన ఆత్మీయ శరీరం ఉదయిస్తుంది. ఆయనే సంపూర్ణమైన దేవుడు! లోకము, శరీరము రెండూ మార్చబడ్డాయి, పర్వతం మీద ఆయన రూపాంతరం దైవికమైన వ్యక్తి. ఆయన తన శిరస్సు మీద బంగారు కిరీటాన్ని ధరించాడు, ఆయన వస్త్రములు స్వచ్ఛమైన తెల్లనివిగా ఉన్నాయి, రొమ్ము భాగం చుట్టూ బంగారు దట్టీ ఉంది. లోకమూ, సమస్త కార్యములూ ఆయన పాద పీఠంగా ఉన్నాయి. ఆయన కళ్ళు అగ్నిజ్వాలలు లాంటివి, ఆయన తన నోటిలో పదునైన రెండంచుల ఖడ్గము కలిగి ఉన్నాడు. ఆయన కుడిచేతిలో ఏడు నక్షత్రాలు కలిగి ఉన్నాడు. రాజ్యానికి మార్గం అనంతమైన ప్రకాశవంతంగా ఉంది, ఆయన మహిమ ఉదయిస్తుంది, ప్రకాశిస్తుంది; పర్వతాలు ఆనందంగా ఉన్నాయి, జలాలు నవ్వుతున్నాయి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు తమ క్రమబద్ధమైన అమరికలో తిరుగుతూ ఉన్నాయి, అసమానమైన, నిజమైన దేవుణ్ణి స్వాగతిస్తూ ఉన్నాయి, ఆయన విజయవంతమైన రాకడ ఆయన ఆరు వేల సంవత్సరాల నిర్వహణ ప్రణాళికను సంపూర్తిని ప్రకటిస్తుంది. అందరూ ఆనందంతో గెంతుతూ నాట్యం చేస్తారు! సంతోషం! సర్వశక్తిమంతుడైన దేవుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడుగా ఉన్నాడు! పాడండి! సర్వశక్తిగల దేవుని విజయవంతమైన ధ్వజం వైభవోపేతమైన, ఘనమైన సీయోను పర్వతం మీద ఉన్నతంగా ఎగురవేయబడింది! అన్ని దేశాలు ఉల్లాసంగా ఉన్నాయి, మనుష్యులు అందరూ పాడుతున్నారు, సీయోను పర్వతం ఆనందంగా నవ్వుతోంది, దేవుని మహిమ ఉదయించింది! నేను దేవుడి ముఖాన్ని చూస్తానని కలలో కూడా ఊహించలేదు, అయినా ఈరోజు దానిని చూశాను. ప్రతిరోజూ ఆయనను ముఖాముఖిగా చూస్తున్నాను, నా హృదయాన్ని ఆయన యెదుట స్పష్టంగా ఉంచాను. ఆహారం, పానీయాలను సమృద్ధిగా అందిస్తాడు. జీవం, మాటలు, చర్యలు, తలంపులు, ఆలోచనలు—ఆయన మహిమగల వెలుగు వాటన్నింటినీ ప్రకాశింపచేస్తుంది. మార్గం యొక్క ప్రతి అడుగును అయన నడిపిస్తాడు, ఆయన తీర్పు ఎటువంటి తిరుగుబాటు హృదయానికైనా వెంటనే తటస్థిస్తుంది.
భోజనం చేయడం, కలిసి నివసించడం మరియు దేవునితో కలిసి జీవించడం, ఆయనతో కలిసి ఉండటం, కలిసి నడవడం, కలిసి ఆనందించడం, కలిసి మహిమను, ఆశీర్వాదాలనూ పొందడం, ఆయనతో రాజ్యాధికారము పంచుకోవడం, రాజ్యంలో కలిసి ఉండటం—ఓహ్, ఇది ఎంత ఆనందముగా ఉంది! ఓహ్, ఇది ఎంత మధురమైనది! మనం ప్రతిరోజూ ఆయనతో ముఖాముఖిగా ఉంటాము, ప్రతిరోజూ ఆయనతో మాట్లాడుతున్నాము, నిరంతరం మాట్లాడుతున్నాము, ప్రతిరోజూ నూతన జ్ఞానం, నూతన అంతర్దృష్టులు అనుగ్రహించబడతాయి. మన ఆత్మీయ కళ్ళు తెరవబడ్డాయి, మనం ప్రతి దానిని చూస్తున్నాము, ఆత్మ యందలి అన్ని మర్మాలు మనకు బయలు పరచబడ్డాయి. పరిశుద్ధ జీవితం నిజంగా నిరంతరాయంగా ఉంది. వేగంగా పరుగెత్తండి, ఆగకండి, నిరంతరంగా ముందుకు సాగండి—ముందు మరింత అద్భుతమైన జీవితం ఉంది. కేవలం తీపి రుచితో సంతృప్తిచెందకండి; దేవుని లోనికి ప్రవేశించడానికి నిరంతరం వెదకండి. ఆయన సర్వసమగ్రుడు, ఔదార్యవంతుడు, మనం కొదువుగా ఉన్న వాటన్నిటినీ ఆయన కలిగి ఉన్నాడు. చురుకుగా ఆయనకు సహకరించండి, ఆయనలోనికి ప్రవేశించండి, ఏదీ కూడా తిరిగి అదే విధంగా ఉండదు. మన జీవితాలు అతీతంగా ఉంటాయి, ఏ వ్యక్తి, విషయము లేదా వస్తువు మనలను ఆటంకపరచవు.
శ్రేష్ఠత! శ్రేష్ఠత! నిజమైన శ్రేష్ఠత! దేవుని సర్వోత్కృష్టత జీవితం లోపల ఉంది, సమస్త కార్యములు తెప్పరిల్లాయి. మనం లోకాన్నీ, లోకసంబంధమైన విషయాలనూ అధిగమించాము, భర్తలు లేదా పిల్లలతో అనుబంధంలేనట్టు భావిస్తున్నాము. అనారోగ్యం, పర్యావరణాల నియంత్రణను అధిగమించాము. సాతాను మనలను ఆటంకపరచడానికి సాహసించడు. మనము అన్ని విపత్తులను పూర్తిగా అధిగమించాము. రాజ్యాధికారం తీసుకోవడానికి ఇది దేవుణ్ణి అనుమతిస్తుంది! మనము సాతానును పాదాల క్రింద తొక్కాము, సంఘం సాక్ష్యము కొరకు నిలబడతాము, సాతాను వికారమైన ముఖాన్ని పూర్తిగా బహిర్గతం చేస్తాము. సంఘం నిర్మాణం క్రీస్తులో ఉంది, మహిమకరమైన శరీరం ఉదయించింది—ఇది సంఘం ఎత్తబడడంలో కనిపిస్తుంది.