సత్యం ఆచరించని వారికి ఒక హెచ్చరిక

ఈ సహోదర మరియు సహోదరీలలో ఎల్లప్పుడూ తమ ప్రతికూలతకు దారి ఇచ్చేవారు సాతాను బానిసలై ఉంటారు, మరియు వారు సంఘమును కలవరపెడతారు. అలాంటి వ్యక్తులను ఏదో ఒకరోజు తప్పనిసరిగా బహిష్కరించాలి మరియు పరిత్యజించాలి. దేవుని పట్ల వారి నమ్మకంలో, మనుష్యులకు వారి హృదయాలలో దేవుని పట్ల భక్తి భావం లేనట్లయితే, వారి హృదయాలలో దేవుని పట్ల విధేయత లేనట్లయితే, అలాంటప్పుడు వారు ఆయన కోసము ఎటువంటి కార్యము చేయకపోవడమే కాకుండా దానికి విరుద్ధంగా వారు ఆయన కార్యమును భంగపరిచే వారుగా మరియు ఆయనను తిరస్కరించేవారుగా మారతారు. దేవుని పట్ల నమ్మకం ఉండి కూడా, ఆయన పట్ల విధేయత లేకపోవడం లేదా గౌరవించకపోవడం మరియు వాటికి బదులుగా ప్రతిఘటించడం, అనేది విశ్వాసికి గొప్ప అవమానం. విశ్వాసులు వారి మాటలలో ఒక పద్ధతి లేకుండా మరియు నిరంకుశంగా ఉన్నట్లయితే, అవిశ్వాసుల వలె ప్రవర్తించినట్లయితే వారు అవిశ్వాసుల కంటే ఎక్కువ దుష్టత్వం ఉన్నవారు; వారు పూర్వ రూప దయ్యములుగా పరిగణించబడుతారు. ఎవరైతే సంఘము లోపల విషపూరితమైన మరియు ద్వేషపూరితమైన మాటలకు దారి ఇస్తారో, ఎవరైతే పుకార్లను వ్యాపింప చేస్తారో, అసమ్మతి రేకేతిస్తారో మరియు సహోదర మరియు సహోదరీల మధ్య గుంపులను ఏర్పరుస్తారో, వారిని సంఘము నుండి బహిష్కరించాలి. ఎందుకంటే, ఇప్పుడు దేవుని కార్యమునకు సంబంధించి భిన్నమైన శకము కాబట్టి, ఇలాంటి మనుష్యులు వెలివేయబడడానికి తీర్మానించబడిన వారు. సాతాను చేత భ్రష్టుపట్టిన వారందరూ భ్రష్ట స్వభావాలు కలిగి ఉంటారు. కొంతమంది చెడు స్వభావాన్ని తప్ప ఏదీ కలిగి ఉండరు మరికొంతమంది భిన్నంగా ఉంటారు; వారు సాతాను చెడ్డ స్వభావాలను కలిగి ఉండటం మాత్రమే కాకుండా, వారి గుణము కూడా చాలా హానికరంగా ఉంటుంది. వారి మాటలు చర్యలు వారిలోని చెడ్డ మరియు సాతాను స్వభావాలను బహిర్గతం చేయడమే కాకుండా, అన్నిటికంటే ముఖ్యంగా, ఈ మనుష్యులు నిజమైన సాతాను దయ్యములై ఉంటారు. వారి ప్రవర్తన దేవుని కార్యాన్ని ఆటంక పరిచి ఇబ్బంది కలిగిస్తుంది, అది సహోదర సహోదరీల జీవన ప్రవేశాన్ని బలహీనపరిచి, సంఘము యొక్క సాధారణ జీవితాన్ని పాడు చేస్తుంది. తక్షణం లేదా ఆ తర్వాత అయినా, ఈ గొర్రె తోలు ధరించిన తోడేళ్లను ఏరిపారేయాల్సిందే; సాతాను బానిసలైన వీరి పట్ల ఒక కనికరం లేని వైఖరి, ఒక తిరస్కరణ వైఖరిని అవలంబించాలి. ఇలా చేయడం మాత్రమే దేవుని పక్షాన నిలిచినట్లుగా అవుతుంది మరియు ఆవిధంగా చేయడంలో విఫలమైన వారు సాతానుతో కలిసి బురదలో పొర్లుతుంటారు. దేవుని యదార్ధంగా విశ్వసించిన మనుష్యులు ఎల్లప్పుడూ వారి హృదయాలలో దేవుని కలిగి ఉంటారు మరియు వారి హృదయంలో దేవుని పట్ల భక్తిని, దేవుడు ప్రేమించే హృదయాన్ని కలిగిఉంటారు. దేవుని విశ్వసించినవారు చాలా జాగ్రత్తగా మరియు వివేకంతో పనులను చేయాలి మరియు వారు చేసేదంతా దేవుని అవసరాలకు అనుగుణంగా ఉండాలి మరియు ఆయన హృదయాన్ని సంతృప్తి పరిచేలా ఉండాలి. వారు మూర్ఖంగా ఉండకూడదు, వారికి నచ్చింది చేయకూడదు; అది వారి మర్యాదకు తగదు. మనుష్యులు ప్రతిచోటా డంబాలు పలుకుతూ మరియు వంచన చేస్తున్నప్పుడు, ఉన్మాదం ఆవహించినట్లు దేవుని జెండా ఊపుతూ ప్రతిచోటుకూ పరిగెత్తరాదు; ఇది అత్యంత తిరుగుబాటు ప్రవర్తన. కుటుంబాలు తమకంటూ నియమాలు కలిగి ఉంటాయి మరియు దేశాలు వాటికంటూ చట్టాలు కలిగి ఉంటాయి—అలాంటప్పుడు, దేవుని గృహంలో అంతకంటే ఎక్కువ ప్రమాణాలు ఉండవా దానిలో అంతకన్నా ఎక్కువ కఠిన ప్రమాణాలు ఉండవా? దానిలో అంతకన్నా ఎక్కువ పరిపాలనా శాసనాలు ఉండవా? మనుష్యులు వారికి నచ్చింది చేయటానికి స్వేచ్ఛ ఉంది, కానీ దేవుని పరిపాలన శాసనాలను ఇష్టప్రకారం మార్చలేం. దేవుడు మానవుల నుండి అపరాధములను సహించని దేవుడై ఉన్నాడు; ఆయన ప్రజలకు మరణాన్ని కలిగించే దేవుడు. మనుష్యులకు ఇప్పటి వరకు ఈ సంగతి తెలియదా?

సంఘాన్ని ఇబ్బంది పెట్టే మరియు సంఘ కార్యకలాపాల్లో జోక్యం చేసుకునే ప్రజలు ప్రతి సంఘంలో ఉంటారు. వారందరూ మారువేషాలతో అక్రమంగా దేవుని గృహంలో ప్రవేశించిన సాతానులు. అలాంటి ప్రజలు బాగా నటిస్తారు; వారు గొప్ప భక్తిభావంతో నా ముందుకు వస్తారు, వంగి నమస్కరిస్తారు, గజ్జి పట్టిన కుక్కల వలె జీవిస్తారు మరియు తమ స్వంత ఉద్దేశ్యాలను నెరవేర్చుకోవడానికి తమ “అంతటిని” సమర్పిస్తారు. కానీ, సహోదరుడు మరియు సహోదరీల మధ్య వారి వికారమైన పార్శ్వాన్ని చూపిస్తారు. వారు సత్యం ఆచరించే ప్రజలను చూసినప్పుడు వారిపై దాడి చేసి వారిని ప్రక్కకు నెట్టివేస్తారు మరియు వారి కంటే శక్తివంతులను చూసినప్పుడు వారి ముఖస్తుతి చేస్తూ నక్క వినయం ప్రదర్శిస్తారు. వారు సంఘంలో అనాగరికంగా పరిగెత్తుతారు. అలాంటి “స్థానిక ఆకతాయిలు” మరియు “ముద్దు కుక్కలు” ఎక్కువ శాతం సంఘాల్లో ఉంటారని చెప్పవచ్చు. వారందరూ కలిసి చెడుగా వ్యవహరిస్తారు, ఒకరికొకరు కన్నులతో మరియు రహస్య సంకేతాలు పంపుకుంటారు, ఒక్కరు కూడా సత్యమును ఆచరించరు. ఎవరైతే ఎక్కువ విషాన్ని కలిగి ఉంటారో వారు “ప్రధాన దయ్యము” గా ఉంటారు, ఎవరైతే అత్యున్నత ప్రతిష్ఠ కలిగి ఉంటారో వారి జెండాను పైకి మోస్తూ వారిని నడిపిస్తారు. వీరు సంఘం ద్వారా దాడి చేస్తారు, వారి ప్రతికూలతను వ్యాప్తి చేస్తారు, మరణాన్ని ప్రకటిస్తారు, వారికి నచ్చిందే చేస్తారు, వారికి నచ్చినట్లుగా మాట్లాడతారు మరియు ఎవరు కూడా వారిని ఆపే సాహసం చేయరు. వారు సాతాను స్వభావంతో నిండి ఉంటారు. అందుకే, త్వరలోనే ఒక విధమైన అంతరాయనికి వారు కారణమవుతారు, అప్పుడు సంఘం లోనికి మరణపు గాలి ప్రవేశిస్తుంది. సంఘం లోపల సత్యమును అనుసరించేవారు తృణీకరించబడతారు, వారు వారి సర్వస్వాన్ని ఇవ్వలేకపోతారు, సంఘం లోపల భంగం కలిగించేవారు మరణపు వార్తను వ్యాప్తి చేసి దాడి చేస్తారు—అది చాలదన్నట్లు, చాలా మంది మనుష్యులు వారిని అనుసరిస్తారు. అటువంటి సంఘములు సాతానుచే పాలించబడతాయి, ఇక చెప్పేదేముంది; సాతాను వారి రాజు అవుతాడు. ఒకవేళ, సంఘస్తులు తిరగబడి, ప్రధాన దయ్యాలను తిరస్కరించనట్లయితే, వెంటనే లేదా తర్వాతైనా అవి నాశనమైపోతాయి. ఇప్పటినుండి, అలాంటి సంఘములకు వ్యతిరేకంగా తప్పక చర్యలు తీసుకోవాలి. ఒకవేళ, కొద్దిగా సత్యమును ఆచరించు సామర్ధ్యము ఉన్నవారు సైతం ప్రయత్నించకుండా ఉండిపోతే, అప్పుడు ఆ సంఘము నిర్మూలించబడుతుంది. ఒక సంఘములో సత్యమును ఆచరించేవారు ఎవరు లేనట్లయితే, దేవుని కొరకు సాక్షిగా నిలబడే వారు ఎవరు లేనట్లయితే, అప్పుడు ఆసంఘము పూర్తిగా ఒంటరి చేయబడాలి మరియు ఇతర సంఘాలతో దాని సంబంధాలు తప్పనిసరిగా తెంచి వేయాలి. దీనినే “మరణాన్ని పూడ్చిపెట్టడం” అని అంటారు, సాతానుని తృణీకరించడంఅని దీని అర్థం. ఒక సంఘములో అనేకమంది స్థానిక ఆకతాయిలు ఉంటే, వారిని చిన్న ఈగలు అనుసరిస్తే, అది పూర్తిగా వివేచన లేని పనే అవుతుంది, సత్యమును చూసిన తర్వాత కూడా సంఘస్తులు వారి బంధకాలను మరియు అవకతవకలను తిరస్కరించగలిగే సామర్ధ్యము లేనట్లయితే, చివరకు ఈ మూర్ఖులందరూ పరిత్యజించబడుతారు. ఈ చిన్న ఈగలు భయంకరమైన పనులేవి చేయకపోవచ్చు కానీ, అవి చాలా మోసపూరితమైనవి ఇంకా మృదువైనవి మరియు తప్పించుకొనేవి, ఇలాంటి వారందరినీ పరిత్యజించాలి. ఒక్కరు కూడా మిగిలి వుండరాదు. ఎవరైతే సాతానుకు చెందినవారో వారు తిరిగి సాతాను దగ్గరకే వస్తారు, దేవునికి చెందినవారు తప్పకుండా సత్యాన్వేషణ వైపు వెళతారు; వారి వారి స్వభావాల్ని బట్టే ఇది నిర్ణయించబడుతుంది. సాతానుని అనుసరించేవారందరినీ నాశనము అవ్వనివ్వండి! అటువంటి వారిపై ఎటువంటి దయ చూపించబడదు. ఎవరైతే సత్యం కొరకు అన్వేషిస్తారో వారికి అది అందించబడుతుంది, వారు దేవుని వాక్యమును హృదయ పూర్వకముగా ఆనందిస్తారు. దేవుడు నీతిమంతుడు; ఆయన ఎవరి పట్లా పక్షపాతము చూపించడు; నువ్వు ఒక దెయ్యమైతే, అప్పుడు నీకు సత్యాన్ని ఆచరించే సామర్ధ్యం ఉండదు. మీరు సత్యమును అన్వేషించేవారైతే, మీరు నిశ్చయంగా సాతానుచే బందీగా పట్టబడరు. ఇది అన్ని సందేహాలకు అతీతమైనది.

పురోగతి కొరకు ప్రయత్నించని వారు, మిగతా వారు కూడా తమలాగే ప్రతికూలంగా మరియు సోమరులుగా ఉండాలని అనుకుంటారు. సత్యమును ఆచరించని వారు, ఆలా చేసే వారిని చూసి అసూయపడతారు మరియు గడబిడగా ఉన్నవారిని, వివేకము లేనివారిని ఎల్లప్పుడూ మోసం చెయ్యాలని ప్రయత్నిస్తుంటారు. ఈ వ్యక్తులు ఇచ్చే అవకాశము మీరు భ్రష్టులు అవడానికి, క్రిందకు పడిపోవడానికి, ఒక అసాధారణ స్థితి పొందుకోవడానికి మరియు చీకటిచే నింపబడటానికి కారణము అవుతుంది. అవి మిమ్మల్ని దేవుని నుంచి దూరము చేస్తాయి, మీరు మీ శరీరాన్ని కాపాడుకోవడం మరియు మీ యందు మాత్రమే ఆనందిస్తారు. సత్యమును ప్రేమించని మనుష్యులు మరియు ఎల్లప్పుడూ దేవుని పట్ల అశ్రద్ధ వున్న వారు స్వంత అవగాహన కలిగి వుండరు మరియు అటువంటి మనుష్యుల స్వభావమనేది ఇతరులకు పాపం చేసేలా మరియు దేవుని మోసగించేలా ప్రలోభపెడుతుంది. వారు సత్యమును ఆచరించరు మరియు ఇతరులను ఆచరించనివ్వరు. వారు పాపమును మనసులో ఉంచుకుంటారు మరియు వారి పట్ల వారికి అసహ్యము ఉండదు. వారికి వారి గురించి తెలియదు మరియు వారి గురించి ఇతరులు తెలుసుకోకుండా వారు ఆపుతారు; సత్యాన్ని కోరుకోకుండా ఇతరులను ఆపుతారు, మరియు దేవుని నుండి ఇంకా ఎక్కువ దూరం అవుతారు. వారు సత్యమును ఆచరించరు మరియు ఇతరులను ఆచరించనివ్వరు, మూర్ఖులందరిని వారు ముందుకు తీసుకొస్తారు. వారు దేవుని నమ్ముతారని చెప్పటం కంటే, వారు వారి పూర్వీకులను నమ్ముతారని చెప్పడం మంచిది లేదా వారి హృదయాలలో విగ్రహాలను నమ్ముతారని చెప్పవచ్చు. దేవుని నమ్ముతున్నామని చెప్పుకునే అలాంటి వ్యక్తులకు, కళ్ళు తెరిచి వారు ఎవరిని నమ్ముతున్నారో చూడమని చెప్పడం మంచిది: వారు నిజంగా నమ్మేది దేవుడినా లేక సాతానునా? వారు నమ్మేది దేవుని కాదు కానీ వారి హృదయాల్లోని విగ్రహాలను అని తెలుసుకున్నప్పుడు వారు విశ్వాసులం అని చెప్పుకోకపోవడమే మంచిది. వారు ఎవరిని నమ్ముతున్నారో నిజంగా తెలియనప్పుడు, వారు విశ్వాసులం అని చెప్పుకోకపోవటం మంచిది. ఆవిధంగా చెప్పడం అనేది దైవదూషణ అవుతుంది. మీరు దేవుణ్ణి నమ్మాలని ఎవరూ బలవంతం చేయడం లేదు. నాయందు నమ్మిక ఉంచమని చెప్పవద్దు; నేను అలాంటి మాటలను చాలా విన్నాను మరియు మరలా వినమని కోరవద్దు, ఎందుకంటే మీరు నమ్మేది మీ హృదయాల్లో ఉన్న విగ్రహాలను మరియు మీలో ఉన్న స్థానిక ఆకతాయిలను. సత్యమును విన్నప్పుడు తల ఆడించేవారు మరియు మరణం గురించిన వార్త విన్నప్పుడు నవ్వే వారందరూ సాతాను సంతతిగా ఉంటారు, మరియు వీరందరూ పరిత్యజించబడే వారుగానే ఉంటారు. సంఘంలో చాలామందికి వివేకము లేదు. ఏదైనా మోసపూరితమైన సంఘటన జరిగినప్పుడు వారు ఊహించని రీతిలో సాతాను పక్షాన నిలబడతారు; సాతాను బానిసలం అని పిలిపించుకోవడం ద్వారా కూడా వారు తప్పు చేస్తారు. వారికి వివేచన లేదని ఇతరులు చెప్పినప్పటికీ, వారు ఎల్లప్పుడూ సత్యం లేని వైపు నిలబడతారు, క్లిష్ట సమయంలో వారు సత్యం వైపు నిలబడరు, ఎప్పుడూ కూడా సత్యం కొరకు నిలబడి వాదించరు. అలాంటప్పుడు, వారికి నిజంగానే వివేచన కొరతగా ఉన్నట్లే కదా? ఎందుకు వారు అకస్మాత్తుగా సాతాను పక్షము తీసుకుంటారు? ఎందుకని వారు ఎప్పుడూ సత్యానికి మద్దతుగా ఒక న్యాయమైన లేదా సహేతుకమైన మాటను మాట్లాడరు? తాత్కాలిక గందరగోళం ఫలితంగానే ఈ పరిస్థితి నిజంగా తలెత్తిందా? ప్రజలు ఎంత తక్కువ వివేచన కలిగి ఉంటే, అంత తక్కువగా సత్యం వైపు నిలబడతారు. ఇది ఏమి చూపిస్తుంది? వివేచన లేని ప్రజలు చెడుతనమును ప్రేమిస్తున్నారని ఇది చూపడం లేదా? వారు సాతానుకు నమ్మకమైన సంతతి అని ఇది చూపదా? సాతాను పక్షాన నిలబడి దాని భాషను వారు ఎల్లప్పుడూ ఎలా మాట్లాడగలుగుతున్నారు? వారు సత్యం యొక్క ప్రేమికులు కాదని రుజువు చేయడానికి, వారి ప్రతి మాట మరియు కార్యము, వారి ముఖములలో అగుపడే భావము లాంటివన్నీ సరిపోతాయి; సరిగ్గా చెప్పాలంటే, వారు సత్యాన్ని అసహ్యించుకునే మనుష్యులు. సాతాను కొరకు పోరాడటానికి జీవితాన్ని గడిపే, చిన్న దెయ్యాలను సాతాను నిజంగా ప్రేమిస్తున్నాడని ఋజువు చేయటానికి వారు సాతాను పక్షాన నిలబడతారని చెప్పడం వారి విషయంలో సరిపోతుంది. ఈ నిజాలు సమృద్ధిగా, స్పష్టంగా లేవా? మీరు నిజంగా సత్యాన్ని ప్రేమించే నిజమైన వ్యక్తి అయితే, సత్యమును ఆచరించే వ్యక్తుల పట్ల ఎందుకు గౌరవం కలిగి వుండరు మరియు సత్యమును ఆచరించని వారు ఒక చిన్నచూపు చూడగానే వారిని వెంటనే ఎందుకు అనుసరిస్తారు? ఇది ఎటువంటి సమస్య? మీకు వివేచన వుందా లేదా అనే దానిని నేను లెక్క చేయను. మీరు ఎంత గొప్ప వెల చెల్లించారనే దానిని నేను లెక్క చేయను. మీ శక్తులు ఎంత గొప్పవో మరియు మీరు స్థానిక ఆకతాయిలా లేదా జెండా మోసే నాయకుడా అనే దానిని నేను లెక్క చేయను. మీ ప్రతిష్ట గొప్పదైతే అది కేవలం మీ చుట్టూ సత్యమును ఆచరించని వారు చాలా మంది ఉండుట వలనే అని మర్చిపోకండి. మీరు బహిష్కరించబడనట్లయితే, ఇప్పుడు బహిష్కరణకు సమయం కాదు ఎందుకంటే, ఇప్పుడు నిర్మూలన కార్య సమయం. మిమ్మల్ని బహష్కరించడానికి ఇప్పుడు ఎటువంటి హడావిడి లేదు. మీరు పరిత్యజించబడిన తరువాత మిమ్మల్ని శిక్షించే రోజు కొరకు నేను ఎదురు చూస్తున్నాను. ఎవరైతే సత్యమును ఆచరించరో వారందరు పరిత్యజించబడుతారు.

దేవుని వాక్యాన్ని ఆచరణలో పెట్టడానికి ఎవరు ఇష్టపూర్వకంగా వుంటారో మరియు ఎవరు ఇష్టపూర్వకంగా సత్యమును ఆచరిస్తారో వారు నిజముగా దేవుని విశ్వసించే ప్రజలుగా ఉంటారు. దేవునికి ఇచ్చిన వారి సాక్ష్యములో నిజంగా, స్థిరముగా నిలబడగలిగే మనుష్యులు మరియు అయన వాక్యమును ఇష్టపూర్వకంగా ఆచరణలో పెట్టగలిగే వారు మాత్రమే సత్యము వైపు నిజంగా నిలబడగలుగుతారు. సత్యము లేకపోవటం వలన మోసమును మరియు అన్యాయాన్ని ఆశ్రయించే ప్రజలు దేవుని నామానికి అవమానము తీసుకొస్తారు. సంఘములో వివాదాలకు కారణమైన వారు సాతాను బానిసలు, వారు సాతాను అవతారములు. అట్టి మనుష్యులు అపరాధ బుద్ధి కలవారు. దానికంటే, వారు సాతాను ప్రారంభ రాక్షసుల ప్రతినిధులు. వారు విమోచనకు అతీతమైనవారు మరియు వారు సహజంగానే పరిత్యజించబడతారు. సత్యాన్ని ఆచరించని వారు అలానే ఉండటానికి లేదా ఉద్దేశ్యపూర్వకంగా సంఘాన్ని కూల్చివేసే వారిని దేవుని కుటుంబం అంగీకరించదు. అయితే, బహిష్కరణ కార్యమునకు ఇదే సరైన సమయం; అలాంటివారు బహిర్గతం చేయబడతారు మరియు చివరలో పరిత్యజించబడుతారు. ఈ మనుష్యులు మీద ఇక ఎటువంటి వ్యర్ధమైన కార్యముల బట్టి ఖర్చు చేయకూడదు; సాతానుకు చెందిన వారు సత్యం పక్షమున నిలబడలేరు, అయితే సత్యాన్ని అన్వేషించేవారు నిలబడగలుగుతారు. సత్యమును ఆచరించని ప్రజలు సత్య మార్గము గురించి వినటానికి అనర్హులు మరియు సత్యానికి సాక్షిగా ఉండటానికి అనర్హులు. సత్యము అనేది కేవలం వారి చెవుల కొరకు కాదు; దానికంటే, దానిని ఆచరించే వారి కొరకు నిర్దేశించబడింది. ప్రతి వ్యక్తి అంతము బహిర్గతం చేయబడక మునుపు, సంఘమును భంగపరచిన వారు మరియు దేవుని కార్యమునకు అంతరాయము కలిగించిన వారిని మొదట ప్రక్కన పెడతారు, వారితో తరువాత మాట్లాడతారు. ఒకసారి కార్యము పూర్తయిన తరువాత, ఈ ప్రజలు ఒకొక్కరిగా బహిర్గతం చేయబడతారు మరియు వారు పరిత్యజించబడతారు. ప్రస్తుతానికి, సత్యము అందించబడేటప్పుడు వారు ఉపేక్షించబడతారు. మానవాళికి పూర్తి సత్యం బహిర్గతం చేయబడిన తరువాత, ఆ ప్రజలు పరిత్యజించబడతారు; ప్రజలందరూ వారి రీతి ప్రకారం వర్గీకరించబడే సమయం అది. వివేకం లేని వారి చిన్న చిన్న యుక్తులు, దుష్టుల చేతిలో నాశనానికి దారి తీస్తాయి, వారు వారిచే ఆకర్షితులవుతారు, తిరిగి మరల రారు. ఇటువంటి విచారణ వారికి అర్హమైనది, ఎందుకంటే వారు సత్యమును ప్రేమించరు, ఎందుకంటే, సత్యం పక్షమున నిలబడటానికి వారు సామర్థ్యం కలిగి వుండరు, ఎందుకంటే వారు దుష్ట ప్రజలను అనుసరిస్తారు మరియు దుష్ట ప్రజల పక్షాన నిలబడతారు మరియు వారు దుష్ట ప్రజలతో కుమ్మకై దేవుని ధిక్కరిస్తారు. ఆ దుష్ట ప్రజలు ప్రసరించేది దుషత్వమని వారికి బాగా తెలుసు, అయినప్పటికీ వారు వారిని అనుసరించడానికి తమ హృదయాలను కఠినం చేసుకుని సత్యమునకు వారు వెన్ను చూపారు. సత్యమును ఆచరించకుండా నాశనకరమైన మరియు హేయమైన పనుల వలన ఈ ప్రజలు దుష్ట కార్యములు చేయుట లేదా? వారిలో కొంత మంది తమను తాము రాజుల వలె చెప్పుకునే వారు మరియు వారిని అనుసరించే వారు ఉన్నప్పటికీ, దేవుని ధిక్కరించే వారి స్వభావాలన్నీ ఒకే విధంగా లేవా? వారిని దేవుడు రక్షించడు అని చెప్పుకోవడానికి వారికి ఎటువంటి సాకు వుంది? దేవుడు నీతిమంతుడు కాదని చెప్పుకోవడానికి వారికి ఎటువంటి సాకు వుంది? వారి స్వీయ దుష్టత్వం వారిని నాశనము చేయుట లేదా? వారి స్వంత తిరుగుబాటుతనం వారిని నరకంలోనికి లాగడం లేదా? సత్యమును పాటించే ప్రజలు చివరలో సత్యము వలన రక్షించబడతారు మరియు పరిపూర్ణులుగా చేయబడతారు. సత్యమును పాటించని ప్రజలు చివరలో సత్యము వలన వారి మీదకి నాశనమును కొని తెచ్చుకుంటారు. సత్యమును పాటించే మరియు సత్యమును పాటించని వారి అంతములు ఇలాగే ఉంటాయి. సత్యమును అనుసరించాడనికి ప్రణాళిక లేని వారు మరిన్ని పాపములు చేయకుండా వీలైనంత త్వరగా సంఘమును విడిచి పెట్టమని నేను సలహా ఇస్తాను. సమయం వచ్చినప్పుడు, పశ్చాత్తాపపడటానికి చాలా ఆలస్యం అవుతుంది. ప్రత్యేకించి, గుంపులను ఏర్పాటు చేసేవారు, భేదములను సృష్టించే వారు మరియు సంఘం లోపల వున్న స్థానిక ఆకతాయిలు మరింత త్వరగా విడిచి వెళ్ళాలి. దుష్ట తోడేళ్ళ స్వభావం కలిగివున్న అటువంటి ప్రజలు మారటానికి సామర్ధ్యం కలిగినవారు కాదు. అలాంటివారు మరల ఎప్పుడూ సహోదర మరియు సహోదరీల సాధారణ జీవితాల్ని ఇబ్బంది పెట్టకుండా, వీలైనంత త్వరగా వచ్చే అవకాశముతో సంఘమును విడిచిపెడితే చాలా మంచిది, తద్వారా, వారు దేవుని శిక్ష నుండి తప్పించుకుంటారు. వారితో వెళ్ళినవారిలో మీలో ఎవరైనా ఉంటే, మిమ్మల్ని మీరు ప్రతిబించడానికి ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకోండి. మీరు దుష్టులతో పాటు సంఘమును విడిచి పెడతారా లేదా ఉండిపోయి విధేయతతో అనుసరిస్తారా? మీరు ఈ మాటలను చాలా జాగ్రత్తగా పరిగణనలోకి తీసుకోండి. మీరు ఎంపిక చేసుకోవడానికి నేను మరొక అవకాశం ఇస్తున్నాను మరియు మీ సమాధానము కొరకు ఎదురు చూస్తున్నాను.

మునుపటి:  పరిశుద్ధాత్మ కార్యం మరియు సాతాను కార్యం

తరువాత:  మీరు జీవము లోనికి వచ్చిన వారిలో ఒకరిగా ఉన్నారా?

సెట్టింగులు

  • వచనం
  • థీమ్స్

ఘన రంగులు

థీమ్స్

అక్షరశైలి

అక్షరశైలి పరిమాణం

గీతల మధ్య దూరం

గీతల మధ్య దూరం

పేజీ వెడల్పు

విషయ సూచిక

శోధించండి

  • ఈ వచనాన్ని శోధించండి
  • ఈ పుస్తకాన్ని శోధించండి

Connect with us on Messenger