విశ్వాసము గురించి నీకు ఏమి తెలుసు?
మానవునిలో విశ్వాసము అనేది అనిశ్చిత పదము మాత్రమే, అయినప్పటికి మానవునికి విశ్వాసము అంటే ఏమిటో తెలియదు, విశ్వాసము ఎందుకు కలిగియున్నాడో కూడా తనకు తెలియదు. మానవునికి గ్రహింపు చాలా తక్కువ, మరియు మానవుడు స్వయంగా చాలా కొరతలో వున్నాడు; నాపై అతని విశ్వాసం బుద్ధిహీనమైనది మరియు అజ్ఞానమైనది. విశ్వాసం అంటే ఏమిటో అతనికి తెలియకపోయినా, నాపై అతనికి ఎందుకు విశ్వాసం ఉందో తెలియకపోయినప్పటికీ, అతను నన్ను గుడ్డిగా విశ్వసిస్తూనే ఉన్నాడు. మానవుని నేను అడిగేది ఈ విధంగా గ్రుడ్డిగా ప్రార్థించాలనో, లేక నిలకడలేని వైఖరితో నన్ను విశ్వసించాలనో కాదు గాని, నేను చేసే కార్యమును మానవుడు చూసి తెలుసుకోవాలని, అయితే క్రొత్త కోణంలో నన్ను చూడాలనో, మనిషి మెప్పించబడతాడనో కాదు. నేను ఒకసారి అనేక సూచనలను మరియు అద్భుతాలను ప్రదర్శించాను మరియు అనేక మహాత్కార్యాలను చేసాను, మరియు ఆ కాలంలోని ఇశ్రాయేలీయులు నా మీద గొప్ప అభిమానాన్ని చూపించారు మరియు రోగులను స్వస్తపరచుట మరియు దయ్యాలను వెళ్ళగొట్టే నా అసాధారణ సామర్థ్యాన్ని గొప్పగా గౌరవించారు. ఆ సమయంలో, యూదులు నేను స్వస్థపరిచే శక్తులు అద్భుతంగా, అసాధారణంగా ఉన్నాయని భావించారు. నా అనేక కార్యముల కారణంగా, వారందరూ నన్ను గౌరవించారు మరియు నా శక్తులన్నింటిపై గొప్ప అభిమానాన్ని కనుపరిచారు. ఆ విధంగా, నేను అద్భుతాలు చేయడాన్ని చూసిన వారందరూ నన్ను దగ్గరగా వెంబడించారు, నేను రోగులను స్వస్థపరచడాన్ని చూడటానికి వేలాది మంది నా చుట్టూ చేరారు. నేను చాలా సూచనలు మరియు అద్భుతాలను చేసాను, అయినప్పటికీ ప్రజలు కేవలం ఒక నైపుణ్యం కలిగిన వైద్యునిగా మాత్రమే నన్ను చూసారు; అలాగే, ఆ సమయంలో ప్రజలకు అనేక మాటలు బోధించాను, అయినప్పటికీ వారు నన్ను తన శిష్యులకు గొప్ప గురువన్నట్లుగానే భావించారు. నేటికిని, మానవులు నా కార్యమును గూర్చి చారిత్రాత్మకంగా దాఖలు చేయబడిన సంఘటనలను చూసిన తర్వాత కూడా, నన్ను రోగులను స్వస్థపరిచే గొప్ప వైద్యునిగాను, అజ్ఞానులకు బోధకునిగాను, మరియు వారు నన్ను దయగల ప్రభువైన యేసుక్రీస్తుగా మాత్రమే నిర్వచిస్తున్నారు. లేఖనాలను అనువదించేవారు వైద్యం చేయడంలో నా నైపుణ్యతలను అధిగమించి ఉండవచ్చు, లేదా ఇప్పుడు వారి గురువును మించిపోయిన శిష్యులు కూడా అయ్యుండవచ్చు, అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన గొప్ప ప్రఖ్యాతి పొందిన వ్యక్తులు నన్ను కేవలం ఒక వైద్యునిగా చాలా తక్కువగా భావిస్తారు. నా పనులు సముద్రతీరములలోని ఇసుక రేణువులకంటే చాలా ఎక్కువ, మరియు నా జ్ఞానం సొలొమోను కుమారులందరికంటే మించినది, అయినప్పటికీ ప్రజలు నన్ను తక్కువ అనుభవముగల వైద్యుడిగాను మరియు మనిషికి బోధించే తెలియని గురువుగా భావిస్తున్నారు. చాలామంది నేను వారిని బాగు చేయగలనని మాత్రమే నన్ను విశ్వసిస్తారు. చాలామంది వారి శరీరాల నుండి అపవిత్రాత్మలను తరిమివేయుటకు నేను నా శక్తులను ఉపయోగిస్తానని మాత్రమే నన్ను విశ్వసిస్తారు, మరియు చాలా మంది నా నుండి శాంతి మరియు సంతోషాన్ని పొందుకోవచ్చని నన్ను విశ్వసిస్తారు. చాలామంది నా నుండి అధిక వస్తు సంపదను పొందడానికి మాత్రమే నన్ను విశ్వసిస్తారు. చాలా మంది ఈ జీవితాన్ని శాంతితో గడపడానికి మరియు రాబోయే ప్రపంచంలో క్షేమంగా మరియు సురక్షితంగా గడపాలని నన్ను విశ్వసిస్తారు. చాలా మంది నరక బాధ నుండి తప్పించుకొని మరియు పరలోకపు దీవెనలు పొందాలని నన్ను విశ్వసిస్తారు. చాలా మంది నన్ను తాత్కాలిక సుఖం కోసం మాత్రమే విశ్వసిస్తారు, అయితే రాబోయే లోకంలో దేనినైనా పొందాలని వెదకరు. మానవునిపై నా కోపాన్ని చూపి, అతను ఒకప్పుడు కలిగి ఉన్న సంతోషాన్నిమరియు శాంతిని తీసివేసినప్పుడు, మానవుడు అనేక సందేహాలతో మిగిలిపోతాడు. మానవునికి నరక బాధను ఇచ్చి, పరలోకం యొక్క దీవెనలను వెనక్కి తీసికున్నప్పుడు, మానవునికి కలిగిన అవమానం కోపంగా మారింది. అతనిని బాగు చేయమని మానవుడు నన్ను అడిగినప్పుడు, నేను అతనిని పట్టించుకోలేదు మరియు అతని పట్ల నాకు అసహ్యం కలిగింది; నా మార్గాన్ని వెదకటానికి బదులు దుష్ట వైద్యం మరియు శకునం అనే మార్గాన్ని వెతకడానికి బయలుదేరాడు. మానవులు నా నుండి కోరినదంతా ఇవ్వకుండా నేను బిగబట్టినప్పుడు, అందరూ జాడ లేకుండా అదృశ్యమయ్యారు. ఎందుకంటే నేను అధికమైన కృప చూపుచున్నందున, ఎక్కువ లాభాన్ని పొందుచున్నందున మనిషి నాయందు విశ్వాసం కలిగియున్నాడని నేను చెప్పుచున్నాను. యూదులు నా కృప కొరకు నన్ను విశ్వసించి మరియు నేను ఎక్కడికి వెళ్లినా నన్ను అనుసరించారు. పరిమిత జ్ఞానం మరియు పరిమిత అనుభవం ఉన్న ఈ అజ్ఞానులు నేను కనుపరిచిన సూచనలను మరియు అద్భుతాలను చూడడానికి మాత్రమే నన్ను అనుసరించారు. యూదుల ఇంటికి నన్ను గొప్ప మహాత్కార్యాలు చేసే అధిపతిగా వారు భావించారు. కాబట్టి నేను మనుష్యుల నుండి దయ్యాలను వెళ్ళగొట్టినప్పుడు, అది వారి మధ్య చర్చకు దారితీసింది: నేను ఏలియాను అని, మోషేను అని, ప్రవక్తలందరిలో అత్యంత ప్రాచీనుడనని, వైద్యులందరిలో గొప్పవాడి నని వారు చెప్పారు. నేనే మార్గం, సత్యం మరియు జీవం అని నేను చెబితే తప్ప, నా ఉనికిని గాని, నా గుర్తింపును గాని ఎవరూ తెలుసుకోలేదు. పరలోకం అనేది నా తండ్రి నివసించే నివాస స్థానమని నేను చెబితే తప్ప, నేనే దేవుని కుమారుడననియు మరియు దేవుడననియు వారు తెలిసికోనలేదు. నేను సర్వ మానవాళికి విమోచకుడినని మరియు విమోచనా క్రయధనమునని నేను చెబితే తప్ప, నేను మానవుల విమోచకుడినని ఎవరికీ తెలియదు, మరియు మానవులు నన్ను జాలిగలవానిగా, దయగలవానిగా మాత్రమే ఎరిగియున్నారు. నన్ను గూర్చి నేనే వివరించి చెప్పానుగాని, ఎవరూ నన్ను తెలుసుకోలేదు. మరియు నేను సజీవుడైన దేవుని కుమారుడనని ఎవరూ విశ్వసించలేదు. ఇటువంటి విశ్వాసాన్ని ప్రజలు నాపై కలిగియున్నారు మరియు వారు నన్ను మోసం చేయడానికి ప్రయత్నించిన విధానమిది. వారు నా గురించి ఇలాంటి అభిప్రాయాలను కలిగి ఉన్నప్పుడు వారు నా గురించి ఎలా సాక్ష్యమివ్వగలరు?
ప్రజలు నన్ను విశ్వసిస్తారు గాని, నాకు సాక్ష్యులుగా ఉండలేరు, మరియు నా గురించి నేను పరిచయం చేసుకునేందుకు ముందుగా వారు నా కొరకు సాక్ష్యులుగా ఉండలేరు. సకల జీవులకు మరియు పరిశుద్ధులందరికి నేను అతీతుడనైయున్నానని మాత్రమే ప్రజలు చూస్తారు, నేను చేయు కార్యమును మానవులు చేయలేరనియు చూస్తారు. ఆ విధముగా, నాటి యూదుల నుండి నేటి ప్రజల వరకు, నా అద్భుత కార్యాలు చూసిన వారందరూ నా పట్ల కుతూహలముతో నిండిపోయారు తప్ప మరేమీ చేయలేదు, మరియు ఏ ఒక్క జీవి నోరు కూడా నన్ను గురించి సాక్ష్యమియ్యలేదు. నా తండ్రి మాత్రమే నన్ను గురించి సాక్ష్యమిచ్చి సమస్త జీవుల మధ్య నాకొక మార్గాన్ని ఏర్పాటు చేశాడు; ఆయనే లేకపోతే, నేను ఎంత శ్రమించినప్పటికి, మానవునికి నేనే సృష్టికి ప్రభువునని ఎప్పటికి తెలిసేదికాదు, ఎందుకంటే మానవునికి నా నుండి తీసుకోవడం మాత్రమే తెలుసు గాని నేను చేసే కార్యమునకు ఫలితంగా నన్ను విశ్వసించడం లేదు. నాలో ఏ పాపము లేదని మరియు నేను నిర్దోషినని మానవుడు ఎరిగి, నేను అసంఖ్యాకమైన మర్మములను వివరించగలనని, నేను జనసమూహములకన్నా పైనున్నవాడనని, లేక మానవుడు నా నుండి ఎక్కువ ప్రయోజనాన్ని పొందియున్నాడని మాత్రమే మనిషికి తెలుసు, అయినా కొందరు మాత్రమే నన్ను సృష్టికి ప్రభువువని విశ్వసిస్తారు. ఇందుచేత మానవునికి నా యందు ఎందుకు విశ్వాసము ఉందో తనకి తెలియదని నేను చెప్పుచున్నాను; నా యందు విశ్వాసము ఉంచడానికిగల ఉద్దేశ్యము లేక విశ్వాసము యొక్క ప్రాధాన్యత గురించి తనకు తెలియదు. నా కొరకు సాక్షిగా ఉండుటకు మానవునిలో యధార్ధత లోపించింది. మీలో నిజమైన విశ్వాసము చాల తక్కువ మరియు బహు తక్కువ ప్రయోజనము పొందారు, కాబట్టి మీరు చిన్న సాక్ష్యము కలిగి ఉన్నారు. అంతేగాక, మీకు గ్రహింపు చాల తక్కువ మరియు మీరు చాల కొదువ కలిగి ఉన్నారు, అంటే మీరు నా క్రియలకు సాక్ష్యులై ఉండుటకు దాదాపుగా అనర్హులు. మీ తీర్మానం నిజానికి ఆలోచించదగినది, కాని మీరు ఖచ్చితంగా దేవుని స్వభావమునకు అనుకూలమైన సాక్ష్యమివ్వగలరని మీరు అనుకుంటున్నారా? మీరు అనుభవించినవి మరియు చూసినవి అన్ని యుగాలకు చెందిన పరిశుద్దులను మరియు ప్రవక్తలను మించిపోయాయి, అయితే మీరు ఈ పరిశుద్దులు మరియు పూర్వపు ప్రవక్తల మాటల కంటే గొప్ప సాక్ష్యాన్ని అందించగలరా? నేను ఇప్పుడు మీకు అనుగ్రహించేది మోషేను మించినది మరియు దావీదును మరుగు చేస్తుంది, కాబట్టి మీ సాక్ష్యం మోషే సాక్ష్యంను అధిగమించాలని మరియు మీ మాటలు దావీదు మాటల కంటే గొప్పవిగా ఉండాలని నేను అడుగుతున్నాను. నేను మీకు వంద రెట్లు ఇస్తాను. కాబట్టి మీరు కూడా తిరిగి నాకు అలాగే చెల్లించమని అడుగుతున్నాను. మానవాళికి జీవితాన్ని ప్రసాదించేది నేనేనని మీరు తప్పక తెలుసుకొని మరియు నా నుండి జీవాన్ని పొందినది మీరే గనుక మీరు నా గురించి సాక్ష్యమివ్వాలి. మీపైకి నేను పంపినది మరియు మీరు నా కోసం చేయవలసిన కర్తవ్యము ఇదే. నా మహిమ అంతా మీకు ఇచ్చాను, ఏర్పరచబడిన ప్రజలైన ఇశ్రాయేలీయులు ఎన్నడూ పొందని జీవమును నేను మీకు ఇచ్చాను. వాస్తవానికి మీరు నాకు సాక్ష్యార్ధమై వుండాలి, మరియు మీ యవ్వనాన్ని నాకు అంకితం చేయాలి మరియు మీ జీవితాన్ని అర్పించాలి. ఎవరికి నా మహిమను అనుగ్రహిస్తానో వారు నాకు సాక్షిగా ఉంటారు మరియు నా కోసం వారి జీవితాన్ని ఇస్తారు. ఇది అనాది కాలంగా నా ద్వారా ముందుగా నిర్ణయించబడింది. నేను మీకు నా మహిమను ప్రసాదించడం మీ అదృష్టం, మరియు నా మహిమ నిమిత్తము నాకు సాక్ష్యార్ధమై యుండుట మీ కర్తవ్యము. మీరు ఆశీర్వాదం పొందడం కోసం మాత్రమే నన్ను విశ్వసిస్తే, నా కార్యమునకు తక్కువ ప్రాముఖ్యత ఉంటుంది మరియు మీరు మీ కర్తవ్యాన్ని నెరవేర్చలేరు. ఇశ్రాయేలీయులు నా దయను, ప్రేమను మరియు గొప్పతనాన్ని మాత్రమే చూశారు మరియు యూదులు నా సహనం మరియు విమోచనను మాత్రమే చూశారు. వారు నా ఆత్మ కార్యమును చాలా చాలా తక్కువగా చూశారు, మీరు విన్న మరియు చూసిన వాటిలో వారు అర్థం చేసుకున్నది పదివేలలో ఒక వంతు మాత్రమే. మీరు చూసినది వారి మధ్యలో ఉండే ప్రధాన యాజకులను కూడా మించిపోయింది. ఈ రోజు మీరు అర్ధం చేసుకున్న సత్యాలు వారిని మించిపోయాయి; ఈ రోజు మీరు చూసినది ధర్మశాస్త్రము యుగములో చూసినదానికంటే మించిపోయింది, అలాగే కృపా కాలములో చూసిన దానికంటేను మించిపోయింది, మరియు మీరు అనుభవించినవి మోషే మరియు ఏలియాల అనుభవాలను కూడా అధిగమించాయి. ఎందుకంటే ఇశ్రాయేలీయులు అర్థం చేసుకున్నది కేవలం యెహోవా ధర్మశాస్త్రం మాత్రమే, మరియు వారు చూసినది యెహోవా యొక్క వెనుక భాగము మాత్రమే; యూదులు అర్థం చేసుకున్నది యేసు యొక్క విమోచన మాత్రమే, వారు పొందింది కేవలం యేసు ప్రసాదించిన కృపను మాత్రమే, మరియు వారు చూసినది యూదుల ఇంటిలోని యేసు యొక్క రూపము మాత్రమే. ఈ రోజు మీరు యెహోవా యొక్క మహిమ, యేసు యొక్క విమోచన మరియు నేటి వరకు జరిగిన క్రియలన్నీ చూస్తున్నారు. అలాగే, మీరు నా ఆత్మను గురించి కూడా విన్నారు, నా జ్ఞానాన్ని అభినందించారు, నా అద్భుతాన్ని తెలుసుకున్నారు, మరియు నా స్వభావాన్ని తెలుసుకొని నేర్చుకొనియున్నారు. నా నిర్వహణ ప్రణాళిక అంతటిని నేను మీకు చెప్పాను. మీరు చూసినది కేవలం ప్రేమగల మరియు దయగల దేవుణ్ణి కాదు కాని, నీతితో నింపబడిన దేవుణ్ణి చూశారు. మీరు నేను చేసిన అద్భుత కార్యాలను చూశారు మరియు నేను ఘనతతోను, ఉగ్రతతోను నిండినవాడనని మీకు తెలుసు. ఇంకా, నేను ఒకప్పుడు ఇశ్రాయేలు ఇంటివారిపై నా ఉగ్రతను కురిపించానని, ఈ రోజు అది మీపైకి వచ్చిందని మీకు తెలుసు. మీరు యెషయా మరియు యోహానుకంటే పరలోకములోని నా మర్మాలను ఎక్కువగా అర్థం చేసుకున్నారు; పూర్వ కాలపు పరిశుద్దులందరి కంటే మీకు నా మనోహరత మరియు పరిశుద్దత గురించి ఎక్కువ తెలుసు. మీరు పొందుకున్నది కేవలం నా సత్యం, నా మార్గం మరియు నా జీవం మాత్రమే కాదు గాని, యోహానుకంటే గొప్ప దర్శనం మరియు ప్రత్యక్షతను పొందారు. మీరు ఇంకా చాలా మర్మాలను అర్థం చేసుకున్నారు మరియు నా నిజమైన ముఖాన్ని కూడా చూశారు; మీరు నా తీర్పును ఎక్కువగా అంగీకరించారు మరియు నా న్యాయబద్ధమైన వైఖరి గురించి మరింత తెలుసుకున్నారు. కాబట్టి, మీరు అంత్య దినాలలో జన్మించినప్పటికీ, మీ అవగాహన గతానికి సంబంధించింది, మరియు మీరు కూడా ఈనాటి సంగతులను అనుభవించారు, మరియు ఇదంతా నేనే స్వయంగా చేసాను. నేను మిమ్మల్ని మీకు మితిమీరినవి అడుగుట లేదు, ఎందుకంటే నేను మీకు చాలా ఇచ్చాను మరియు మీరు నాలో చాలా చూశారు. కాబట్టి, గత కాలాలలో పరిశుద్దులకు తగినట్లుగా నా నిమిత్తము సాక్ష్యమివ్వమని నేను మిమ్మల్ని అడుగుతున్నాను మరియు ఇదే నా హృదయపు ఏకైక వాంఛ.
నా గురించి మొట్ట మొదటగా సాక్ష్యమిచ్చినది నా తండ్రి, అయితే నేను ఘనమైన మహిమను పొందాలనుకుంటున్నాను, మరియు సృష్టించబడిన ప్రతి జీవి నోట నుండి సాక్ష్యపు మాటలు రావాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి నేను నా సర్వస్వాన్ని మీకు ఇస్తున్నాను, మీరు మీ కర్తవ్యాన్ని నెరవేర్చండి, మానవుల మధ్య నా పనిని చేసి ముగించండి. మీరు నన్ను ఎందుకు నమ్ముతున్నారో మీరు అర్థం చేసుకోవాలి; మీరు కేవలం నా శిష్యులుగానో, లేక నా అనుచరులుగానో లేదా పరలోకములో ఉండే నా పరిశుద్ధులలో ఒకరిగానో కావాలని మాత్రమే కోరుకుంటే, మీరు నన్ను అనుసరించడం అర్థరహితం అవుతుంది. అటువంటి పద్ధతిలో నన్ను అనుసరించడం కేవలం వృధా ప్రయాస అవుతుంది; నాపై ఈ విధమైన విశ్వాసం కలిగి ఉండడమంటే కేవలం మీ రోజులను వెళ్ళబుచ్చటం, మీ యవ్వనాన్ని వృధా చేయడమే అవుతుంది. మరియు చివరికి, దాని నుండి మీరు ఏమీ పొందలేరు. అది వ్యర్థమైన ప్రయాస కాదా? నేను చాలా కాలం క్రిందట యూదుల మధ్య నుండి వెళ్లిపోయాను మరియు ఇకపై నేను మానవునికి వైద్యునిగా లేదా మానవునికి ఔషధంగా ఉండను. మానవుని ఇష్టానుసారంగా మోయడానికి గాడిదను కాను లేక కషాయివాని వద్ద మౌనంగా ఉండటానికి నేనిప్పుడు గొర్రెపిల్లను కాను; దానికి బదులుగా, నేను మనుష్యులకు తీర్పు తీర్చడానికి, మనుష్యులను శిక్షించడానికి మనుష్యుల మధ్యకు వచ్చియున్నాను, తద్వారా మనుష్యులు నన్ను తెలుసుకోవాలి. నేను ఒకప్పుడు విమోచన కార్యమును చేశానని నువ్వు తెలుసుకోవాలి; నేను ఒకప్పుడు యేసుగా ఉన్నాను, కానీ నేను ఎల్లప్పుడూ యేసుగా ఉండలేను, నేను ఒకప్పుడు యెహోవాగా ఉన్నాను, తర్వాత యేసుగా మారాను. నేను మానవజాతికి దేవుడను, సృష్టికి ప్రభువును, కానీ నేను ఎల్లప్పుడూ యేసుగా లేదా యెహోవాగా ఉండలేను. మానవుడు నన్ను వైద్యుడిగా పరిగణించేవాడు, కానీ దేవుడు మానవాళికి కేవలం వైద్యుడు అని చెప్పలేము. కాబట్టి, మీరు మీ విశ్వాసంలో నాపై పాత అభిప్రాయాలను కలిగి ఉంటే, మీరు ఏమీ సాధించలేరు. ఈ రోజు మీరు నన్ను ఎలా స్తుతించినా; “దేవుడు మానవునిపట్ల ఎంత ప్రేమగలవాడు; అతను నన్ను స్వస్థపరుస్తాడు మరియు నాకు ఆశీర్వాదమును, శాంతిని మరియు ఆనందాన్ని ఇస్తాడు, దేవుడు మానవుని పట్ల ఎంత మంచివాడు; మనకు ఆయనపై విశ్వాసము ఉంటే, డబ్బు మరియు సంపద గురించి మనం చింతించనవసరం లేదు…,” నా అసలు కార్యానికి ఆటంకం ఎప్పటికీ కలిగించలేను. మీరు ఈ రోజు నాయందు విశ్వసిస్తే, మీరు నా మహిమను మాత్రమే పొందుతారు మరియు నాకు సాక్ష్యమివ్వడానికి అర్హులు అవుతారు మరియు మిగతావన్నీ ద్వితీయమైనవి. ఇది మీరు స్పష్టంగా తెలుసుకోవాలి.
మీరు నన్ను ఎందుకు నమ్ముతున్నారో ఇప్పుడు మీకు నిజంగా తెలుసా? నా కార్యము యొక్క ఉద్దేశ్యం మరియు ప్రాముఖ్యత మీకు నిజంగా తెలుసా? మీకు మీ కర్తవ్యం నిజంగా తెలుసా? నా సాక్ష్యం గురించి మీకు నిజంగా తెలుసా? మీరు కేవలం నన్ను విశ్వసించినప్పటికీ, మీలో నా మహిమ లేదా సాక్ష్యం యొక్క సంకేతం లేకుంటే, నేను చాలా కాలం క్రితమే మిమ్మల్ని నా నుండి పరిత్యజించానని అర్థం. ఇవన్నీ తెలిసిన వారి విషయానికొస్తే, వారు నా కంటిలో పడిన ముళ్ళులాంటివారు, మరియు వారు నా ఇంట్లో, నా మార్గంలో అడ్డంకులు తప్ప మరేమీ కాదు, వారు నా పనిలో పూర్తిగా తూర్పారబట్టినప్పుడు ప్రక్కకు వేయబడిన గురుగుల వంటివారు, వారి వలన ప్రయోజనం లేదు, వారు పనికిరానివారు, మరియు నేను వారిని ఎప్పుడో అసహ్యించుకున్నాను. సాక్ష్యం లేని వారందరి మీదకి తరచుగా నా కోపం వస్తుంది మరియు నా దండము వారి నుండి ఎన్నటికీ దూరంగా ఉండదు. నేను చాలా కాలం క్రితమే వారిని దుష్టుని చేతికి అప్పగించాను; వారు నా దీవెనలు కోల్పోయారు. ఆ రోజు వచ్చినప్పుడు, బుద్దిలేని కన్యకలకంటే కూడా వారి శిక్ష చాలా ఘోరంగా ఉంటుంది. ఈ రోజు నేను చేయవలసిన పనిని మాత్రమే చేస్తాను; నేను గోధుమలన్నిటినీ ఆ గురుగులతో కలిపి కట్టలు కడతాను. ఇదే నేను ఈ రోజు జరిగించే కార్యము. నేను గోధుమలను దుళ్ళగొట్టు సమయములో ఆ గురుగులన్ని దుళ్ళగొట్టబడతాయి, అప్పుడు గోధుమ గింజలు కొట్టులో పోగుచేయబడతాయి, మరియు ఆ దుళ్ళగొట్టిన గురుగులన్ని అగ్నిలో వేయబడి కాల్చబడతాయి. ఇప్పుడు మనుష్యులందరినీ కట్టలుగా కట్టడం మాత్రమే నా పని; అంటే వాటిని పూర్తిగా జయించడం. అప్పుడు నేను దుళ్ళగొట్టుట ద్వారా మనుష్యులందరి అంతాన్ని బయలుపరుస్తాను. కాబట్టి మీరు ఇప్పుడు నన్ను ఎలా సంతృప్తి పరచాలి మరియు నాపై మీకున్న విశ్వాసంలో మీరు సరైన మార్గంలో ఎలా వెళ్లాలి అని మీరు తెలుసుకోవాలి. నేను కోరేది మీ వినయము, మరియు మీ ఇప్పటి విధేయత, మీ ప్రేమ మరియు మీ ప్రస్తుత సాక్ష్యం. సాక్ష్యం అంటే ఏమిటి లేదా ప్రేమ అంటే ఏమిటి అనే విషయాలు మీకు ఈ క్షణంలో తెలియకపోయినా, మీరు మీకున్న సమస్తాన్నీ నా దగ్గరకు తీసుకురావాలి మరియు మీ వద్ద ఉన్న ఏకైక సంపదను నాకు అప్పగించాలి: అవే మీ వినయము మరియు మీ విధేయత. నేను మనిషిని సంపూర్ణముగా జయించిన సాక్ష్యమువలె సాతానుపై నా విజయము మనిషి చూపించే వినయము మరియు విధేయతలో ఉందని నువ్వు తెలుసుకోవాలి. నాపై మీ విశ్వాసం యొక్క కర్తవ్యము నా నిమిత్తము సాక్ష్యమివ్వడం, మరెవ్వరికి కాక నా పట్ల మాత్రమే వినయము కలిగి, అంతం వరకు విధేయత చూపడమే. నేను నా కార్యము యొక్క తదుపరి దశను ప్రారంభించే ముందు, మీరు నా నిమిత్తము ఎలా సాక్ష్యమిస్తారు? మీరు నా పట్ల వినయులుగాను మరియు విధేయులుగా ఎలా ఉంటారు? మీ సంపూర్ణ వినయమును మీ కర్తవ్యము కొరకు అంకితమిస్తారా లేక నిష్కారణముగా వదిలేస్తారా? మీరు నా ప్రతి ఏర్పాటుకు (అది మరణం లేదా నాశనం అయినా) లోబడతారా లేదా నా శిక్షను తప్పించుకోవడానికి మధ్యలోనే పారిపోతారా? మీరు నా యెడల వినయము మరియు విధేయత కలిగి ఉండుటకు, మరియు మీరు నాకు సాక్ష్యముగా ఉండుటకు నేను మిమ్ములను శిక్షిస్తాను. ఇంకా ఏమిటంటే, నా కార్యము యొక్క తదుపరి దశను వెల్లడి పరచడం మరియు పని నిరాటంకంగా ముందుకు సాగేలా చేయడమే ప్రస్తుత శిక్ష. కాబట్టి, మీరు తెలివిగా ఉండమని మరియు మీ జీవితాన్ని లేదా మీ స్థితి యొక్క ప్రాముఖ్యతను విలువలేని ఇసుకగా పరిగణించవద్దని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. రాబోయే నా కార్యము ఏమిటో మీరు ఖచ్చితంగా తెలుసుకోగలరా? రాబోయే రోజుల్లో నేను ఎలా కార్యము చేస్తానో, నా కార్యము ఎలా సాగుతుందో మీకు తెలుసా? మీరు నా కార్యము యొక్క మీ అనుభవం యొక్క ప్రాముఖ్యతను మరియు ఇంకా, నాపై మీ విశ్వాసం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోవాలి. నేను ఇంతవరకు చాలా చేసాను; మీరు ఊహించినట్లు నేను సగంలో ఎలా వదిలేస్తాను? నేను ఇంత విస్తృతమైన కార్యము చేసాను; నేను దానిని ఎలా నాశనం చేయగలను? నిజానికి, నేను ఈ యుగాన్ని అంతం చేయడానికి వచ్చాను. ఇది వాస్తవం, అయితే నేను కొత్త యుగాన్ని ప్రారంభించబోతున్నానని, కొత్త పనిని ప్రారంభించాలని మరియు అన్నింటికంటే ఎక్కువగా రాజ్య సువార్తను వ్యాప్తి చేయబోతున్నానని మీరు తెలుసుకోవాలి. కాబట్టి ప్రస్తుత కార్యము ఒక యుగాన్ని ప్రారంభించడం మరియు రాబోయే కాలంలో సువార్తను వ్యాప్తి చేయడానికి మరియు భవిష్యత్తులో యుగాన్ని అంతం చేసేందుకు పునాది వేయడానికి మాత్రమే అని మీరు తెలుసుకోవాలి. నా కార్యము మీరు అనుకున్నంత సులభం కాదు, మీరు నమ్ముతున్నంత విలువలేనిదో లేక అర్థరహితమో కాదు. కాబట్టి, నేను ఇంకా మీతో చెప్పవలసినది ఏమిటంటే: మీరు నా కార్యముకై మీ జీవితాన్ని ఇవ్వాలి, అంతేకాకుండా, మీరు నా మహిమ కోసం మిమ్మల్ని అంకితం చేసుకోవాలి. మీరు నా కొరకు సాక్ష్యమివ్వాలని నేను చాలా కాలంగా తహతహలాడుతున్నాను, ఇంకా మీరు నా సువార్తను వ్యాప్తి చేయాలని కోరుకుంటున్నాను. నా హృదయంలో ఏముందో మీరు అర్థం చేసుకోవాలి.