నిజమైన మనిషిగా ఉండటానికి అర్థం
మనిషిని నిర్వహించడం ఎప్పూడూ నా కర్తవ్యమే. అంతేకాకుండా, సృజించినపుడు మానవుని గెలుపు కోసమే నేను వానిని అభిషేకించింది. అంత్య దినాల్లో నేను మనిషిని సంపూర్తిగా గెలుస్తానని ప్రజలకు తెలియకపోవచ్చు లేదా, మానవజాతి మధ్య ఉన్న తిరుగుబాటుచేసేవారిని ఓడించడమే సాతాను మీద నా విజయానికి సూచన. అయితే, నా శత్రువు నాతో యుద్ధానికి దిగినప్పుడు, సాతాను ఎవరినైతే బంధించి తన సంతానంలాగా మార్చుకొని, తన ఇంటిని కాపు కాసే నమ్మకమైన పనివారిగా మార్చుకున్నాడో, వారినందరినీ తిరిగి నేను గెలుచుకుంటానని నేను దానికి అప్పుడే చెప్పాను. గెలుపుకు అసలైన అర్థం ఓడించడం, అవమానపరచడం; ఇశ్రాయేలీయుల భాషలో ఆ మాటకు అర్థం—పరిపూర్ణంగా ఓడించడం, నాశనం చేయడం, నాకు వ్యతిరేకంగా ఉండకుండా దానిని నిర్వీర్యం చేయడం. కానీ నేడు, మీ మధ్య ఆ మాటను ఉపయోగించినపుడు, దాని అర్థం గెలవడం. మీకు తెలుసు నా ఉద్ధేశం ఏమిటో. మానవజాతిలోని సాతాను అంశాలను సంపూర్ణంగా నాశనం చేసి, వాటిని మట్టి కరిపించడం ద్వారా, వారు ఇంకెన్నడూ నాకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయకుండా, నా కార్యాన్ని ఆటంకపరచకుండా లేదా విఘ్నపరచకుండా ఉంచడమే దాని మఖ్య ఉద్దేశం. ఆవిధంగా, మనిషి పరంగా పరిగణనలోకి తీసుకుంటే, ఈ పదానికి జయించడం అనే అర్థం వస్తుంది. ఈ పదానికి ఎలాంటి అర్థాలు ఉన్నప్పటికీ, నా కార్యము మాత్రం మనుష్యులను ఓడించడమే. నా నిర్వహణకు మానవజాతితో అనుబంధం కీలకమనే మాట కొంతవరకు నిజమే అయినప్పటికీ, ఖచ్చితంగా చెప్పాలంటే, మానవులు నాకు శత్రువులు అనేమాట నిశ్చితము. మానవులు నన్ను వ్యతిరేకించి, నాకు అవిధేయత చూపించే దుష్టత్వం కలిగినవాళ్లు. నా చేత శపించబడిన దుర్మార్గుని సంతానమే ఈ మానవులు. నన్ను వంచించిన దేవదూత వారాసులే మానవులు. పూర్వము నా చేత విసర్జించబడిన దుష్టుని వారసత్వమే మానవులు. అప్పటి నుండి మానవులు నా బద్ధ శత్రువు. మానవుల పైన ఉన్న ఆకాశమంతా కలుషితముగా, చీకటిగా ఉంది. కొంచెం కూడా స్పష్టత లేకుండా, మానవ ప్రపంచం చిమ్మ చీకటిలో ఉంది. వారు తమ ముఖం ముందు చాపిన చేతిని లేదా తలపైకెత్తినపుడు సూర్యుడిని కూడా చూడలేరు. మనిషి కాళ్ళ క్రింద నేల బురదగా, గుంటలతో నడవడానికి యాతనగా ఉంటుంది; అతను ఉండే ప్రదేశమంతా శవాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. చీకటి మూలలన్నీ చనిపోయిన వారి అవశేషాలతో నిండి ఉన్నాయి. చల్లటి మసకబారిన మూలల్లో దయ్యాల గుంపులు నివాసాలు ఏర్పాటు చేసుకున్నాయి. మానవుని లోకంలో ప్రతిచోటా దయ్యాలు గుంపులు గుంపులుగా వచ్చి వెళ్తుంటాయి. అన్ని రకాల మృగాల సంతతి, మురికితో కప్పబడి, యుద్ధంలో నిమగ్నమై, ఆ శబ్ధం హృదయంలో భయం కలిగించేలా ఉంటుంది. అలాంటి సమయాల్లో, అలాంటి లోకంలో, ఆ “భూలోక స్వర్గంలో”, ఒకరు జీవితపు ఆనందాలను ఎక్కడ వెతుక్కోవాలి? ఒక వ్యక్తికి అతని జీవితపు గమ్యము ఎక్కడ దొరుకుతుంది? మానవజాతి, సాతాను కాళ్ళ క్రింద ఎప్పుడో తొక్కివేయబడి, ఇక అప్పటి నుండి మనిషి ఒక గొప్ప నటునిగా సాతానును స్వరూపాన్ని సొంతం చేసుకున్నాడు. అంతకు మించి, మానవజాతి సాతానుకు ప్రతిరూపంగా, సాతానుకు సాక్షిగా, రుజువుగా పనిచేస్తోంది. ఇలాంటి మానవజాతి, ఇలాంటి నీచమైన, ఇలాంటి అనైతికమైన మానవ సంతతిదేవునికి ఎలా సాక్షిగా ఉండగలదు? నా మహిమ ఎక్కడ నుండి వస్తుంది? ఒకరు ఎక్కడ నుండి నాకు సాక్ష్యమివ్వగలరు? మానవజాతిని ఇంతలా పాడు చేసిన ఆ శత్రువు, నాకు వ్యతిరేకముగా నిలబడి, మానవజాతిని ఇప్పటికే తన వైపుకు లాగేసుకున్నాడు. అప్పుడెప్పుడో నేను సృజించిన మానవజాతి, నా మహిమతో నిండినమానవజాతిని అది పూర్తిగా మలినం చేసేసింది. అది నా మహిమను లాగేసుకుంది. మనిషిని పూర్తిగా జుగుప్సతో, దట్టంగా పూసిన విషముతో, మంచి చెడు జ్ఞానం తెలిసే చెట్టు పండు నుండి వచ్చే రసముతో నింపేసింది. ఆదిలో నేను మానవజాతిని సృజించాను; అంటే, మానవజాతి పితరుడైన ఆదామును సృజించాను. అతను రూపము, స్వరూపము కలిగి, బలముతో నింపబడి, తేజముతో నింపబడి, ఇంకా, నా మహిమతో సహవాసము చేశాడు. నేను మనిషిని సృజించిన అద్భుతమైన దినమది. అటు తర్వాత, ఆదాము శరీరము నుండి హవ్వను తీశాను. ఆమె కూడా మానవుని పూర్వీకురాలే. అప్పుడు నేను సృజించిన మనుష్యులునా జీవాయువుతో నింపబడి, నా మహిమతో పొర్లుచున్నారు. ఆదాము నా చేతి నుండి ఉద్భవించాడు. అతను నా స్వరూపానికి సాదృశ్యము. అందుకే, “అదాము” అంటే, నా చేత సృజింపబడిన వాడు అనేది నిజమైన అర్థం. అతను నా జీవపు బలముతో నిండి, నా మహిమతో నిండి, నా రూపమునకు స్వరూపముగా, నా ఆత్మను, నా జీవాయువును కలిగినవాడు. నా చేత సృజించబడినవాడు అతనొక్కడే. అందుకే, నా ఆత్మను కలిగి, నాకు సాదృస్యముగా ఉండి, నా స్వరూపాన్ని భరిస్తూ, నా జీవాయువును స్వీకరించాడు. ఆదిలో, హవ్వ రెండవ మనిషిగా, నా జీవాయువుతో నేను అభిషేకించిన రెండవ సృష్ఠిగా ఉంది. అందుకే, “హవ్వ” అంటే, నా మహిమను కొనసాగించేందుకు సృష్టించబడిన జీవి, నా జీవముతో నింపబడి, ఇంకా నా మహిమతో నింపబడినదని అర్థము. ఆదాము నుండే హవ్వ వచ్చింది. అందుకే ఆమె కూడా నా స్వరూపమే. ఆమె నా స్వరూపములో సృజింపబడిన రెండవ జీవి. “హవ్వ” అనే పదానికి అసలు అర్థం ఆత్మ, శరీరము, ఎముకలతో ఉన్న మనిషి. మానవజాతిలో ఆమె నా రెండవ సాక్ష్యం, అలాగే నా రెండవ రూపము. వీళ్లు మానవజాతి పూర్వీకులు, మానిషికి చెందిన పవిత్రమైన, అమూల్యమైన సంపద. మొదట్లో జీవములు ఆత్మ సహితంగా ఉండేవి. అయితే, దుష్టుడైన సాతాను మానవజాతి పూర్వీకుల సంతానాన్ని తొక్కిపెట్టి, బంధించి, మానవ ప్రపంచాన్ని పూర్తిగా చీకటిలో ముంచేసి, వాళ్లు ఇంకెన్నడు నా ఉనికిని నమ్మకుండా చేసాడు. ఇంకా అసహ్యకరమైన విషయం ఏమిటంటే, సాతాను మనుష్యులను భ్రష్టు పట్టించి, వారిని తొక్కిపెట్టడమే కాకుండా, నేను మనుష్యుల మీద ప్రసరించిన నా మహిమ, నా సాక్ష్యం, నేను వారి మీద కురిపించిన నా బలం, నేను వారి మీద ఊదిన నా జీవం, జీవాయువుతో సహా, మానవ ప్రపంచంలోని నా మహిమంతటినీ, నేను మానవజాతి కోసం వెచ్చించిన నా హృదయ రక్తాన్నంతటినీ అది దుర్మార్గంగా లాగేసుకుంది. అప్పటినుండి మనిషి ఇంకా వెలుగులోకి రాలేదు, నేను మనుష్యులమీద కురిపించినదంతా వాళ్లు కోల్పోయారు, నేను వారికిచ్చిన మహిమను పారవేశారు. అలాంటప్పుడు, సృజించిన జీవులన్నిటికీ నేనే ప్రభువును అని వారెలా అంగీకరిస్తారు? పరలోకంలో నా ఉనికిని వారు ఎలా నమ్ముతారు? భూమ్మీద నా మహిమా ప్రత్యక్షతలను వారెలా కనుగొంటారు? తమను సృజించిన ప్రభువుగా తమ తాతముత్తాలు నన్ను ఆరాధించినప్పటికీ, ఈ మనవళ్లు, మనవరాండ్రు, నన్ను దేవునిగా ఎలా స్వీకరిస్తారు? జాలిపడాల్సిన స్థితిలో ఉన్న ఈ మనవళ్లు, మనవరాండ్రు నేను ఆదాము, హవ్వ మీద ఉంచిన నా మహిమను, స్వరూపాన్ని, సాక్ష్యాన్ని, వారి ఉనికికి ఆధారమైన నేను సహృదయంతో కురిపించిన జీవితాన్ని దుష్టినికి అర్పించారు; దుష్టుని ఉనికిని అస్సలు గమనించకుండా నా మహిమనంతటినీ దానికి అర్పించారు. “అలగాజనం” అనే మాటకు వీళ్లు ప్రతిరూపాలు కాదా? అలాంటి మానవజాతి, అలాంటి దుష్ట దయ్యాలు, అలాంటి నడిచే శవాలు, అలాంటి సాతాను ప్రతిరూపాలు, అలాంటి నా శత్రువులు నా మహిమను కలిగి ఉండగలరా? నేను నా మహిమను తిరిగి పొందుకుంటాను, మనుషుల మధ్య నా సాక్ష్యాన్ని తిరిగి పొందుకుంటాను, ఒకప్పుడు నేను కలిగి ఉన్నదానిని, ఒకప్పుడు నేను మానవజాతికి ఇచ్చిన దానితో పాటు మానవజాతిని నేను సంపూర్ణంగా గెలుచుకుంటాను. అయితే, నేను సృజించిన మానవులు నా స్వరూపము, నా మహిమను కలిగిన పరిశుద్ధులు అని నీవు తెలుసుకోవాలి. వాళ్లెవరూ సాతను సొంతం కాదు, దాని తొక్కిసలాటకు గురియైన వారు కాదు. వాళ్లు నా ప్రత్యక్షతకు చెందినవారు, సాతాను విషపు మరకలు కొంచెం కూడా లేనివారు. అందుకే, నేను మానవజాతికి ఇవ్వాలనుకుంటున్న సమాచారం ఒక్కటే. అది: నా చేతితో సృజించినవారు, నేను ప్రేమించిన నా పరిశుద్ధులు, వేరెవరికీ చెందని వారినే నేను కోరుకుంటున్నాను. ఇంకనూ, నేను వారియందు ఆనందిస్తూ, వారిని నా మహిమగా పరిగణిస్తాను. అయితే, నేను కోరుకుంటున్నది సాతాను చేత పాడు చేయబడిన మానవజాతిని కాదు, నేడు సాతానుకు చెందిన వారిని కాదు, నా నిజమైన సృష్టిలా లేని వారిని కాదు. ఎందుకంటే, మానవ ప్రపంచంలో ఉన్న నా మహిమను నేను తిరిగి పొందాలని అనుకుంటున్నాను. సాతానును ఓడించడంలో నా మహిమకు సాక్ష్యంగా మానవజాతిలో బ్రతికి బయటపడ్డ వారిని సంపూర్ణంగా గెలుచుకుంటాను. నా ఆత్మ స్ఫటికీకరణగా, నా ఆనందానికి వస్తువుగా నా సాక్ష్యాన్ని మాత్రమే తీసుకుంటాను. ఇదే నా చిత్తము.
నేడు మానవజాతి ఈ స్థితికి రావడానికి లక్షలాది సంవత్సరాల చరిత్ర పట్టింది. అయితే, నేను ఆదిలో సృష్టించిన మానవజాతి చాలా కాలం నుండి శిధిల స్థితికి దిగజారింది. ఇప్పటి మానవజాతి అనేది నేను కోరుకునే మానవజాతి కాదు. కాబట్టి, నా దృష్టిలో, ఈ మనుష్యులు మానవజాతి అనే పేరుకు అర్హులు కారు. సాతాను బంధీగా తీసుకున్న మానవజాతి మలినమై, సాతాను నివాసముండే కుళ్లిపోయిన నడిచే శవాలుగా మారిపోయింది. సాతాను వారికి బట్టలు తొడిగాడు. మనుష్యులకు నా ఉనికి మీద నమ్మకం లేదు, నా రాకను వారు స్వాగతించరు. మానవజాతి నా అభ్యర్థనలకు తృణప్రాయంగా మాత్రమే స్పందిస్తోంది, తాత్కాలికంగానే వాటిని స్వీకరిస్తోంది. వారి జీవితంలోని సంతోషాలను దుఃఖాలను నాతో నిజాయితీగా పంచుకోవడం లేదు. మనుష్యులు నన్ను మర్మమైన అంశంగా చూస్తారు కాబట్టి, వారి చిరునవ్వుల మనస్ఫూర్తిగా ఉండవు. అధికారంలో ఉన్న వారి మెప్పు పొందటానికి అన్నట్లుగా వారి స్వభావము ఉంటుంది. ఎందుకంటే, మనుష్యులకు నా కార్యము గురించి తెలియదు, ప్రస్తుతం నా చిత్తము గురించి అసలేమీ తెలియదు. నేను మీతో నిజాయితీగా ఉంటాను: ఆ దినము వచ్చినప్పుడు, మీ శ్రమకంటే, నన్ను ఆరాధించే ఎవరి శ్రమైనా సులభంగా భరించవచ్చు. నిజానికి, నా మీద మీ విశ్వాసపు స్థాయి యోబును మించదు. చెప్పాలంటే, యూదుల పరిసయ్యుల విశ్వాసం కూడా మీ విశ్వాసాన్ని మించిపోయింది. కాబట్టి, అగ్ని దిగిన దినమున, యేసు క్రీస్తు ప్రభువు చేత మందలించబడిన పరిసయ్యుల శ్రమల కంటే, మోషేను ఎదిరించిన 250 మంది నాయకుల కంటే, నాశనపు అగ్ని జ్వాలల క్రిందున్న సొదొమ కంటే మీ శ్రమ అధికంగా ఉంటుంది. మోషే బండను కొట్టినప్పుడు, యెహోవా దేవుడిచ్చిన నీరు ప్రవహించడానికి కారణం, అతని విశ్వాసమే. యెహోవానైన నన్ను స్తుతిస్తూ, దావీదు వీణ వాయించినప్పుడు, అతని హృదయం సంతోషముతో నిండిపోవడానికి కారణం, అతని విశ్వాసమే. పర్వతాలంతయూ నిండిన పశువులను, చెప్పశక్యము కాని సంపదను యోబు పోగొట్టుకున్నప్పుడు, అతని శరీరం పుండ్లు పడినప్పుడు కూడా అతను వాటిని భరించడానికి కారణం, అది అతని విశ్వాసమే. అతను యెహోవానైన నా స్వరాన్ని వినగలగడం, యెహోవానైన నా మహిమను చూడడానికి కారణం, అతని విశ్వాసమే. పేతురు యేసుక్రీస్తును వెంబడించడానికి కారణం, అతని విశ్వాసమే. నా కోసం అతడు సిలువకు కొట్టబడడం, మహిమాన్వితమైన సాక్ష్యాన్ని ఇవ్వగలగడానికి కారణం కూడా అతని విశ్వాసమే. మనుష్యకుమారుని మహిమాన్విత రూపాన్ని యోహాను చూడడానికి కారణం, అతని విశ్వాసమే. అతను అంత్య దినాల దర్శనాన్ని చూడడానికి కారణం, అతని విశ్వాసమే. అన్యజనుల దేశాల సమూహాలుగా పిలవబడే వారు నా ప్రత్యక్షతను పొందటానికి కారణం, నేను మానవుల మధ్య నా పని చేయడానికి శరీరముతో తిరిగి వచ్చానని తెలుసుకోవటానికి కారణం కూడా వారి విశ్వాసమే. నా కటువైన మాటలకు చలించిపోయినప్పటికీ, ఆ మాటలద్వారా ఉపశమనము పొంది, రక్షింపబడిన వారందరూ వారి విశ్వాసం కారణంగానే అలా చేసిన వారు కాదా? నన్ను నమ్మినప్పటికీ, కష్టాలు అనుభవిస్తున్న వారందరూ ఈ లోకంచే తిరస్కరించబడలేదా? నా మాటకు అతీతంగా జీవించేవారు, శ్రమల బాధ నుండి పారిపోయిన వారందరూ ఈ లోకంలో కొట్టుకుపోలేదా? అలాంటి వారు విశ్రాంతి లేక, నా ఓదార్పు మాటలు లేక, ఇక్కడ, అక్కడ రెపరెపలాడే శరదృతువులో రాలి పడిన ఆకులను పోలి ఉంటారు. నా దండన, శుద్ధీకరణ వారిని అనుసరించనప్పటికీ, వాళ్లంతా పరలోక రాజ్యపు వెలుపలి వీధుల్లో ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి తిరిగే బిచ్చగాళ్ళు కాదా? ఈ ప్రపంచం నిజంగానే మీ విశ్రాంతి స్థలమా? మీరు నిజంగా, నా దండనను తప్పించుకుంటూ, ప్రపంచం నుండి తృప్తి కలిగించే మందమైన చిరునవ్వును పొందగలుగుతున్నారా? మీ హృదయంలోని శూన్యతను, దాచలేని శూన్యతను కప్పడానికీ మీరు నిజంగానే మీ క్షణికమైన ఆనందాన్ని ఉపయోగించగలరా? మీరు మీ కుటుంబంలోని అందరినీ మోసం చేయవచ్చు కానీ, మీరు నన్ను ఎప్పటికీ మోసం చేయలేరు. ఎందుకంటే, మీ విశ్వాసం చాలా తక్కువగా ఉన్నందున, మీరు ఇప్పటికీ, నేటి వరకు, జీవితం అందించే ఏ ఆనందాన్ని కనుగొనే శక్తి లేకుండా ఉన్నారు. నేను మిమ్మల్ని తొందరపెడుతున్నాను: మనిషి భరించలేని బాధలన్నిటినీ భరిస్తూ, శరీరం కోసం మీ జీవితాన్నంతా తీరికలేని సామాన్య జీవితాన్ని గడపడం కంటే, నా కోసం హృదయపూర్వకంగా సగం జీవితాన్ని గడపడం మంచిది. మిమ్మల్ని మీరు చాలా విలువైన వారిగా ఎంచుకుని, నా దండన నుండి పారిపోవడం వలన ఏమి లాభం? నా క్షణిక శిక్ష నుండి మిమ్మల్ని మీరు దాచుకుంటూ, చివరికి నిత్యత్వ ఇబ్బందికి, నిత్యత్వ దండనకు లోనవ్వడం వలన లాభమేమిటి? నేను నాకు తోచినట్లుగా ఎవరినీ వంచను. ఎవరైనా నా ప్రణాళికలన్నింటికీ విధేయత కలిగి ఉండటానికి నిజంగా సిద్ధంగా ఉంటే, నేను వారి పట్ల చెడుగా ప్రవర్తించను. అయితే, యెహోవానైన నన్ను యోబు విశ్వసించినట్లు, ప్రజలందరూ నన్ను విశ్వసించాలని నేను కోరుతున్నాను. తోమా విశ్వాసం కంటే, మీ విశ్వాసం ఎక్కువగా ఉంటే, అప్పుడు మీ విశ్వాసం నా ప్రశంసలను పొందుతుంది, మీ విధేయతలో మీరు నా ఆనందాన్ని కనుగొంటారు, మీ దినాల్లో మీరు ఖచ్చితంగా నా మహిమను కనుగొంటారు. అయితే, లోకాన్ని విశ్వసించే వారు, దయ్యాన్ని విశ్వసించే వారు, సొదొమ నగరంలోని ప్రజలలాగా తమ హృదయాలను కఠినపరుచుకున్నారు. వారి కళ్ళలో గాలికి వచ్చిన ఇసుక రేణువులు, వారి నోటిలో దయ్యపు అర్పణలు ఉన్నాయి. ప్రపంచాన్ని ఆక్రమించిన దుష్టుడు చాలా కాలంగా వారి మనస్సులను ఆవహించుకున్నాడు. వారి ఆలోచనలు ప్రాచీన కాలపు దయ్యానికి దాదాపు పూర్తిగా బందీ అయ్యాయి. కాబట్టి, మానవజాతి విశ్వాసం గాలితో వెళ్లిపోయింది. అందుకే, వారు నా పనిని కూడా గమనించలేకపోతున్నారు. వారు చేయగలిగినదల్లా నా పనిని మొక్కుబడిగా చూస్తూ లేదా పైపైన విశ్లేషించడానికి బలహీనమైన ప్రయత్నం చేయడం మాత్రమే. ఎందుకంటే, వారు చాలా కాలంగా సాతాను విషం కలిగి ఉన్నారు.
నేను మానజాతిని జయిస్తాను ఎందుకంటే, ప్రజలు నాచే సృష్టించబడ్డారు, వారు నా సృష్టిలోని విస్తారమైన వస్తువులన్నిటినీ ఆస్వాదించారు. కానీ, మనుష్యులు నన్ను తిరస్కరించారు; నేను వారి హృదయాలకు దూరంగా ఉన్నాను, వారి ఉనికికి నన్ను భారంగా చూస్తున్నారు. ఎంతగా అంటే, నన్ను నిజముగా చూసినప్పటికీ, వారు ఇప్పటికీ నన్ను తిరస్కరించారు. నన్ను ఓడించడానికి సాధ్యమయ్యే ప్రతి మార్గాన్ని ఆలోచిస్తూ వారి మెదడులకు పదునుపెట్టారు. మనుష్యులను నేను తీవ్రంగా పరిగణించడానికి లేదా వారి నుండి కఠినమైన కోరికలను కోరుకోడానికి అనుమతించరు లేదా వారి అవినీతిని తీర్పు తీర్చడానికి లేదా దండించడానికి వారు నన్ను అనుమతించరు. వీటికోసం ప్రయత్నించడానికి బదులుగా, వారు దీనిని చిరాకుగా భావిస్తారు. కాబట్టి, నా కార్యము ఏమిటంటే, తిని, త్రాగి, నాలో ఆనందించినప్పటికీ, నన్ను ఎరుగని మానవజాతిని ఎంచుకుని వారిని ఓడించడమే. నేను మానవజాతిని నిరాయుధుడిని చేసి, అటు తర్వాత నా దేవదూతలను తీసుకొని, నా మహిమను తీసుకొని, నేను నా నివాస స్థలానికి తిరిగి వెళ్తాను. ఎందుకంటే, మనుష్యుల చేష్టలు చాలా కాలం నుండి నా హృదయాన్ని విరగొట్టి, నా కార్యాన్ని ముక్కలుగా చేసాయి. నేను సంతోషముగా తిరిగి వెళ్లే ముందు, దుష్టుడు లాక్కున్న నా మహిమను నేను తిరిగి తీసుకోవాలనుకుంటున్నాను. ఆ తర్వాత, మానవజాతి వారి జీవితాలను కొనసాగిస్తూ, “శాంతితో, తృప్తితో జీవిస్తూ, పనిచేయడం” కొనసాగుతూ, “తమ స్వంత పొలాలను సాగు చేయడం” కొనసాగిస్తూ ఉంటే, ఇంకెన్నటికీ నేను వారి జీవితాల్లో జోక్యం చేసుకోను. కానీ, ఇప్పుడు నేను దుష్టుని చేతిలో నుండి నా మహిమను పూర్తిగా తిరిగి పొందాలని అనుకుంటున్నాను, ప్రపంచపు సృష్టిలో నేను మనిషికి ఇచ్చిన మహిమనంతటిని తిరిగి పొందాలనుకుంటున్నాను. భూమి మీదున్న మానవ జాతికి మరలా నేను దానిని ప్రసాదించను. ఎందుకంటే మనుష్యులు నా మహిమను కాపాడుకోవడంలో విఫలమవ్వడమే కాకుండా, దానిని సాతాను స్వరూపంగా మార్చేసుకున్నారు. మనుష్యులు నా రాకను విలువైనదిగా భావించరు, నా మహిమ దినాన్ని కూడా వారు విలువైనదిగా భావించరు. వారు నా దండనను స్వీకరించడానికి సంతోషించరు, నా మహిమను నాకు తిరిగి ఇవ్వడానికి కూడా ఇష్టపడరు. అలాగే, దుష్టుని విషాన్ని విసిరిపారవేయడానికి కూడా వారు ఇష్టపడరు. మానవజాతి అదే పాత పద్ధతిలో నన్ను మోసం చేస్తూనే ఉంది. మనుష్యులు ఇప్పటికీ అదే పాత పద్ధతిలో ప్రకాశవంతమైన చిరునవ్వులను, సంతోషకరమైన ముఖాలను ధరిస్తున్నారు. కానీ, నా మహిమ వారిని విడిచిపెట్టిన తర్వాత మానవజాతి మీదకు దిగివచ్చే చీకటి లోతుల గురించి వారికి తెలియదు. ప్రత్యేకించి, నా దినము మానజాతంతటికీ వచ్చినప్పుడు, నోవాహు కాలంలోని ప్రజల కంటే వారికి మరింత కష్టమవుతుందని వారికి తెలియదు. ఎందుకంటే, నా మహిమ ఇశ్రాయేలును విడిచినపుడు, అది ఎంత చీకటిగా మారిందో వారికి తెలియదు. ఎందుకంటే, చీకటి రాత్రిని గడపడం ఎంత కష్టముగా ఉంటుందో మనిషి తెల్లవారుజామున మర్చిపోతాడు. సూర్యుడు మరల అజ్ఞాతంలోకి వెళ్లి, మనిషిపై చీకటి మరల అలుముకున్నప్పుడు, అతను మరల విలపిస్తూ చీకట్లో పళ్ళు కొరుకుతాడు. నా మహిమ ఇశ్రాయేలు నుండి వెళ్లిపోయినప్పుడు, ఆ బాధలను భరించడం ఇశ్రాయేలీయులకు ఎంత కష్టంగా మారిందో మీరు మరచిపోయారా? ఇప్పుడు మీరు నా మహిమను చూసే సమయం, మీరు నా మహిమ దినాన్ని పంచుకునే సమయం కూడా ఇదే. ఈ మురికి భూమిని నా మహిమ విడిచిపెట్టినప్పుడు మనిషి చీకటి మధ్య విలపిస్తాడు. నేను నా కార్యాన్ని చేస్తున్న ఈరోజేనా మహిమ దినం, మానవజాతిని బాధల నుండి మినహాయించే రోజు కూడా ఇదే. ఎందుకంటే, నేను వారితో శ్రమల, కష్టాల సమయాలను పంచుకోను. నేను మానవజాతిని పూర్తిగా జయించాలనుకుంటున్నాను. మానవజాతిని పీడించే దుష్టుడిని పూర్తిగా ఓడించాలని మాత్రమే కోరుకుంటున్నాను.