దేవుని పట్ల నీ అవగాహన ఏమిటి?

జనులు చాలా కాలంగా దేవునిని విశ్వసిస్తున్నారు, అయినప్పటికీ వారిలో చాలామందికి “దేవుడు” అనే పదానికి అర్థమేమిటనే అనే దానిపైన ఏ మాత్రామూ అవగాహన ఉండదు, కేవలం సంభ్రమాశ్చర్యంలోనే అనుసరిస్తారు. మనిషి ఖచ్చితంగా దేవునిని ఎందుకు నమ్మాలి, దేవుడు అంటే ఏమిటి అనే విషయాలపై వారికి కొద్దిపాటి అవగాహన కూడా లేదు. దేవునిని నమ్మడం మరియు అనుసరించడం మాత్రమే ప్రజలకు తెలిసి, దేవుడు అంటే ఏమిటో తెలియకపోతే, అది పెద్ద అపహాస్యం కాదా? ఇంత దూరం వచ్చినప్పటికీ, ప్రజలు అనేక పరలోక మర్మాలను చూసినప్పటికీ, మనిషి ఇంతకుమునుపెన్నడూ అర్థం చేసుకోని చాలా లోతైన జ్ఞానాన్ని మనిషి విన్నప్పటికీ, ఇంతకు ముందెన్నడూ మానవుడి ఆలోచనకు రానటువంటి కొన్ని ప్రాథమిక సత్యాల గురించి వారికి తెలియదు. కొందరు ఇలా అనవచ్చు, “మేము చాలా సంవత్సరాలుగా దేవునిని నమ్ముతున్నాము. దేవుడు అంటే ఏమిటో మాకు తెలియకుండా ఎలా ఉంటాము? ఇటువంటి ప్రశ్న మమ్మల్ని తక్కువ చెయ్యడం లేదా?” అయితే, వాస్తవానికి, ఏదేమైనా ఈ రోజు ప్రజలు నన్ను అనుసరిస్తున్నప్పటికీ, వారికి ఈనాటి పని గురించి ఏమీ తెలియదు ఇంకా చాలా స్పష్టమైన మరియు సులభమైన ప్రశ్నలను గ్రహించడంలో కూడా విఫలమయ్యారు, దేవునికి సంబంధించిన అత్యంత సంక్లిష్టమైన ప్రశ్నలను అసలుకే వదిలేయండి. మీకు అవసరత లేనివి, నీవు గమనించని ప్రశ్నలే నీవు అర్థం చేసుకోవడానికి అత్యంత ముఖ్యమైనవని తెలుసుకో, ఎందుకంటే నీకు గుంపును అనుసరించడం మాత్రమే తెలుసు, నిన్ను నువ్వు సన్నద్ధం చేసుకోవాల్సిన వాటిపై శ్రద్ధ చూపడం గానీ గమనించడం గానీ చేయడం లేదు. నీవు దేవునిపై ఎందుకు విశ్వాసం కలిగి ఉండాలో నీకు నిజంగా తెలుసా? దేవుడు అంటే ఏమిటో నీకు నిజంగా తెలుసా? మనిషి అంటే ఏమిటో నీకు నిజంగా తెలుసా? దేవునిపై విశ్వాసం ఉన్న వ్యక్తిగా, నీవు ఈ విషయాలను అర్థం చేసుకోవడంలో విఫలమైతే, నీవు దేవుని నమ్మిన వ్యక్తి గా గౌరవాన్ని కోల్పోవడం లేదా? ఈ రోజు నా పని: ప్రజలు వారి గుణమును అర్థం చేసుకునేలా, నేను చేసేదంతా అర్థం చేసుకునేలా మరియు దేవుని నిజమైన ముఖాన్ని తెలుసుకునేలా చేయడం. ఇది నా నిర్వహణ ప్రణాళిక యొక్క ముగింపు చర్య, నా పని యొక్క అంత్య దశ. అందుకే నేను మీకు జీవిత రహస్యాలన్నింటినీ ముందుగానే చెబుతున్నాను, తద్వారా మీరు వాటిని నా నుండి అంగీకరించగలరు. ఇది అంతిమ యుగపు పని కాబట్టి, మీరు ఇప్పటివరకు అర్థం చేసుకోలేక పోయినట్టి, సరియైన సిద్ధపాటు లేక, మరియు లోపభూయిష్టంగా ఉన్నందుచేత ఒడిసిపట్టలేనట్టి, ఇంతకు ముందెన్నడూ మీరు స్వీకరించని జీవపు సత్యాలు అన్నీ మీకు చెప్పాలి. నేను నా పనిని ముగించి తీరాలి; నేను చేయవలసిన పనిని నేను పూర్తి చేయాలి మరియు చీకటి కమ్మినప్పుడు మీరు మరలా దారి తప్పి దుష్టుల పన్నాగాలకు లోనవకుండా ఉండేందుకు గాను నేను మీకు అప్పగించినదంతా చెబుతాను. మీరు అర్థం చేసుకోలేని మార్గాలు చాలా ఉన్నాయి, మీకు తెలియని అనేక విషయాలు ఉన్నాయి. మీరు చాలా అజ్ణానులుగా ఉన్నారు; మీ స్థాయి మరియు మీ లోపాలు నాకు చాలా బాగా తెలుసు. అందువల్ల, మీరు అర్థం చేసుకోలేని అనేక పదాలు ఉన్నప్పటికీ, మీరు ఇంతకు ముందెన్నడూ అంగీకరించని ఈ సత్యాలన్నింటినీ మీకు చెప్పడానికి నేను ఇప్పటికీ సిద్ధంగా ఉన్నాను, ఎందుకంటే మీకు నా ప్రస్తుత స్థాయిలో మీరు నాకు ఇచ్చే సాక్ష్యములో స్థిరముగా నిలబడగలరో లేదో అని నేను ఇప్పటికీ చింతిస్తున్నాను. నేను మీ గురించి తక్కువగా ఆలోచించడం లేదు; మీరందరూ ఇంకా నా అధికారిక శిక్షణ పొందని మృగాలై యున్నారు గనుక ఖచ్చితంగా మీలో ఎంత మహిమ ఉందో నేను చూడలేను. మీపై పని చేయడంలో నేను ఎక్కువ శక్తిని వెచ్చించినప్పటికీ, మీలో సానుకూల అంశాలు ఆచరణాత్మకంగా లేనట్లే కనిపిస్తున్నాయి మరియు ప్రతికూల అంశాలు ఒకరి వేళ్లపై లెక్కించవచ్చు ఇంకా సాతానుకు అవమానం కలిగించే సాక్ష్యాలుగా మాత్రమే పనికి వస్తాయి. మీలో ఉన్న ప్రతిదీ సాతాను విషమే. మీరు రక్షణకు ఆవల ఉన్న వారిలా నాకు కనపడుతున్నారు. విషయాలిలా ఉండటం బట్టి, నేను మీ వివిధ వ్యక్తీకరణలు మరియు ప్రవర్తనలను చూస్తున్నాను మరియు ఆఖరికి, మీ నిజమైన స్థాయిని నేను తెలుసుకున్నాను. అందుకే నేను ఎప్పుడూ మీ గురించి చింతిస్తూనే ఉంటాను. తమ స్వంతంగా జీవితాన్ని గడపడానికి వదిలేస్తే, మానవులు ఈరోజు వారు ఉన్నదానికంటే నిజంగా మెరుగ్గా ఉంటారా, ఉండరా? శిశువు లాంటి మీ స్థాయి మిమ్మల్ని ఆందోళనకు గురి చేయట్లేదా? మీరు నిజంగా ఎన్నుకోబడిన ఇశ్రాయేలు ప్రజల వలె—నాకు, కేవలం నాకు మాత్రమే అన్ని సమయాలలో విధేయులుగా ఉండగలరా? మీలో వెల్లడైనది తల్లిదండ్రులకు దూరమైన చిన్నపిల్లల అల్లరి ప్రవర్తన వంటిది కాదు, కానీ వారి యజమానుల కొరడాలకు అందనటువంటి జంతువులలో నుండి విరుచుకుపడే క్రూరత్వం లాంటిది. మీరు మీ స్వభావాన్ని తెలుసుకోవాలి, ఇది మీ అందరికీ ఉన్న బలహీనత; ఇది మీ అందరికీ సాధారణముగా ఉన్న వ్యాధి. కాబట్టి, ఈ రోజు మీకొరకు నా వద్ద ఉన్న ఏకైక ప్రబోధం నా కొరకు మీ సాక్ష్యంలో స్థిరంగా నిలబడటమే. ఎట్టిపరిస్థితుల్లోనూ పాత జబ్బు మళ్లీ చెలరేగడానికి అనుమతించవద్దు. సాక్ష్యం చెప్పడం చాలా ముఖ్యమైనది—ఇది నా పని అంతటిలో గుండె కాయ వంటిది. మరియ తనకు కలలో వచ్చిన యెహోవా ప్రత్యక్షతను అంగీకరించినట్లే మీరు కూడా నా మాటలను అంగీకరించాలి: మొదట నమ్మాలి, ఆపై కట్టుబడాలి. ఇది మాత్రమే పరిశుద్ధమైనదిగా అర్హత పొందుతుంది. ఎందుకంటే, మీరు నా మాటలను ఎక్కువగా వినే వారు, నా చేత ఎక్కువగా ఆశీర్వదించబడిన వారు. నేను మీకు నా విలువైన సంపదలన్నిటినీ ఇచ్చాను, నేను మీకు ప్రతిదానిని అనుగ్రహించాను, అయినప్పటికీ మీరు ఇజ్రాయేలు ప్రజలకు చాలా భిన్నమైన స్థితిని కలిగి ఉన్నారు; మీరు భిన్న ప్రపంచాలుగా ఉన్నారు. కానీ వారితో పోలిస్తే, మీరు చాలా అధికముగా పొందారు; వారు నా దర్శనం కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నప్పుడు, మీరు నా అనుగ్రహాన్ని పంచుకుంటూ నాతో ఆహ్లాదకరమైన రోజులు గడుపుతారు. ఈ వ్యత్యాసాన్ని దృష్టిలో ఉంచుకుని, నా సంపదలో మీ వాటాను కోరుకోవడానికి ఇంకా నాతో గొడవ పడే హక్కు మీకు ఎలా వస్తుంది? మీరు చాలా సంపాదించలేదా? నేను మీకు చాలా ఇస్తున్నాను, కానీ మీరు నాకు ప్రతిఫలంగా ఇచ్చేది కేవలం హృదయ విదారకమైన మీ విచారం మరియు ఆందోళన, అణచి వేయలేని ఆగ్రహం మరియు అసంతృప్తి మాత్రమే. మీరు చాలా అసహ్యంగా ఉన్నారు—అయినా కూడా మీరు జాలిపడదగినట్లుగా ఉన్నారు, కాబట్టి నా ఆగ్రహాన్ని మింగేయడం మరియు మీ పట్ల నా అభ్యంతరాలను మళ్లీ మళ్లీ చెప్పడం తప్ప నాకు వేరే మార్గం లేదు. వేల సంవత్సరాల పనిలో, నేను మానవజాతితో ఎన్నడూ ఆక్షేపణ చెయ్యలేదు, ఎందుకంటే మానవాళి అభివృద్ధిలో, మీలో ఉన్న “వంచనలు” మాత్రమే పురాతన కాలం నాటి ప్రసిద్ధ పూర్వీకులచే మీకు మిగిల్చిన విలువైన వారసత్వం వలె అత్యంత ప్రసిద్ధి చెందినవని నేను కనుగొన్నాను. నేను ఆ మానవ జాతీకతీతమైన పందులు మరియు కుక్కలను ఎంతో ద్వేషిస్తాను. మీరు మనస్సాక్షిలో చాలా తక్కువగా ఉన్నారు! మీరు చాలా సామాన్యమైన వ్యక్తిత్వం కలిగి ఉన్నారు! మీ హృదయాలు చాలా కఠినంగా ఉన్నాయి! నేను అలాంటి మాటలను మరియు పనిని ఇశ్రాయేలీయులకు తీసుకువెళ్లినట్లయితే, నేను చాలా కాలం క్రితమే ఘనతను పొంది ఉండేవాడిని. కానీ మీలో మాత్రం ఇది సాధించలేనిది; మీలో క్రూరమైన నిర్లక్ష్యం, మీ అమిత్రత్వం మరియు మీ సాకులు మాత్రమే ఉన్నాయి. మీరు ఎంతో అనుభూతి లేనివారు మరియు పూర్తిగా పనికిరానివారు!

మీరు మీ సర్వస్వాన్ని నా పనికి అంకితం చేయాలి. మీరు నాకు ఉపయోగపడే పని చేయాలి. మీరు అర్థం చేసుకోని ప్రతిదాన్ని మీకు వివరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను, తద్వారా మీకు లేనివన్నీ నా దగ్గర నుండి పొందగలరు. మీ లోపాలు లెక్కించలేనంత ఎక్కువగా ఉన్నప్పటికీ, నేను మీపై చేయవలసిన పనిని కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నాను, మీరు నా నుండి ప్రయోజనం పొందగలిగేలా మరియు మీలో లేని, ప్రపంచం ఎన్నడూ చూడని మహిమను పొందుకోగలిగేలా మీకు నా చివరి దయను ప్రసాదిస్తున్నాను. నేను చాలా సంవత్సరాల పాటు పనిచేశాను, అయినప్పటికీ ఏ మనిషి నన్ను ఎరుగడు. నేను ఇంకెవరికీ ఎన్నడూ చెప్పని రహస్యాలను మీకు చెప్పాలనుకుంటున్నాను.

మానవుల మధ్యలో, నేను వారు చూడలేని ఆత్మగా, వారు ఎన్నటికీ నిమగ్నవని ఆత్మగా ఉన్నాను. భూమిపై నా యొక్క మూడు దశల పని (ప్రపంచ సృష్టి, విమోచన మరియు విధ్వంసం) కారణంగా, నేను వారి మధ్య నా పనిని చేయడానికి (ఎన్నటికీ బహిరంగము కాని) వివిధ సమయాల్లో వారి మధ్యలో కనిపిస్తాను. నేను మొదటిసారిగా మానవుల మధ్యకి వచ్చినది విమోచన యుగంలో. నిజమే, నేను యూదుల కుటుంబములో వచ్చాను; అలాగే, దేవుడు భూమిపైకి రావడాన్ని మొదట చూసినవారు యూదులు. నేను ఈ పనిని స్వయంగా చేయడానికి కారణం ఏమిటంటే, నా విమోచన పనిలో పాపపరిహారార్థ బలిగా నా అవతార శరీరాన్ని ఉపయోగించాలనుకున్నాను. ఆ విధంగా, నన్ను మొదటగా చూసింది కృపా యుగంలో ఉన్న యూదులు. నేను శరీర రీతిగా పని చేయడం అదే మొదటిసారి. రాజ్య యుగంలో, నా పని జయించడం మరియు పరిపూర్ణం చేయడం, కాబట్టి నేను మళ్ళీ శరీర రీతిగా నా గొర్రెల కాపరి పని చేస్తాను. శరీరధారిగా పని చేయడం ఇది నా రెండోసారి. పని యొక్క చివరి రెండు దశలలో, ఇంకను అదృశ్య రూపియైన అస్పృశ్యుమైన ఆత్మతో కాకుండా, శరీరముగా గ్రహించబడిన ఆత్మ స్వరూపియైన వ్యక్తితో ప్రజలు నిమగ్నమై ఉంటారు. ఆ విధంగా, దేవుడు అనే రూపాన్నిగాని ఉనికి అనేది ఏదీ లేకుండా మానవుని దృష్టిలో, నేను మళ్లీ మనిషిగా మారతాను. అంతేకాదు, మనుషులు చూసే దేవుడు కేవలం మగవాడే కాదు, స్త్రీగా కూడా ఉండటం వారికి అత్యంత ఆశ్చర్యకరంగానూ, అయోమయంగానూ ఉంటుంది. పదే పదే, నా అసాధారణ పని అనేక సంవత్సరాలుగా ఉన్న పురాతన విశ్వాసాలను బద్దలు కొట్టింది. జనం నిశ్చేష్టులయ్యారు! దేవుడు కేవలం పరిశుద్ధాత్మ, ఆత్మ, ఏడు రెట్లు ఉధృతమైన ఆత్మ లేదా అన్నింటినీ చుట్టుముట్టే ఆత్మ మాత్రమే కాదు, మానవుడు—సాధారణ మానవుడు, అతిసాధారణమైన సామాన్య మానవుడు కూడా. ఆయన పురుషుడు మాత్రమే కాదు, స్త్రీ కూడా. వారు ఇరువురూ ఒకేలా ఉంటారు, వారు ఇరువురూ మానవులకు జన్మించారు మరియు ఆత్మ నుండి నేరుగా ఉద్భవించినప్పటికీ పోలికలో వ్యత్యాసముగా ఒకరు పరిశుద్ధాత్మ ద్వారా గర్భం దాల్చబడ్డారు మరియు మరొకరు మానవునికి జన్మించారు, దేవుని అవతార శరీరాలుగా ఇరువురూ తండ్రి అయిన దేవుని పనిని నిర్వర్తించడంలో మాత్రం వారు ఒకేలా ఉంటారు కానీ ఒకరు విమోచన పనిని నిర్వహిస్తున్నప్పుడు మరొకరు జయించే పనిని చేస్తూ వ్యత్యాసము కలిగి ఉంటారు. ఇరువురూ తండ్రి అయిన దేవునికి ప్రాతినిధ్యం వహిస్తారు, కానీ ఒకరు విమోచకునిగా, దయావాత్సల్యముతోను మరియు కనికరముతోను నిండి ఉన్నారు, మరియు మరొకరు ఉగ్రత తోను మరియు తీర్పుతో నిండిన నీతిమంతుడైన దేవుడై యున్నారు. ఒకరు విమోచన పనిని ప్రారంభించిన సర్వోన్నత సేనాధిపతి అయితే, మరొకరు విజయ కార్యాన్ని నెరవేర్చే నీతిమంతుడైన దేవునిగా ఉన్నారు. ఒకరు ప్రారంభం అయితే, మరొకరు ముగింపుగా ఉన్నారు. ఒకరు పాపం లేని శరీరంగా, మరొకరు విమోచనను పూర్తి చేసే పనిని కొనసాగించే మరియు ఎన్నడూ పాపం చేయని శరీరమై ఉన్నారు. ఇద్దరూ ఒకే ఆత్మ, కానీ వారు వేర్వేరు శరీరాలలో నివసిస్తారు మరియు వేర్వేరు ప్రదేశాలలో జన్మిస్తారు మరియు వారు అనేక వేల సంవత్సరాల ద్వారా వేరు చేయబడ్డారు. అయినప్పటికీ, వారి పని అంతా పరస్పర పరిపూరకమైనది, ఎన్నడూ విరుద్ధమైనది కాదు మరియు ఒకే శ్వాస ద్వారా వెల్లడింపబడగలిగినది. ఇద్దరూ మానవులే, ఒకరు మగశిశువు, మరొకరు ఆడ శిశువు. ఇన్ని సంవత్సరాలుగా, ప్రజలు చూసినది కేవలం ఆత్మను మాత్రమే కాదు, మానవుని మాత్రమే కాదు, పురుషునిని, ఆలాగే మానవ ఆలోచనలతో ఏకీవభవించని అనేక విషయాలను కూడా; అలాగే, మానవులు నన్ను పూర్తిగా గ్రహించలేరు. వారు నన్ను సగం విశ్వసిస్తూ, సగం అనుమానిస్తూనే ఉన్నారు—నేను ఉనికిలో ఉన్నట్టు, కానీ నేను ఒక భ్రమ కలిగించే కలలా కూడా అని—అందుకే, ఈ రోజు వరకు, దేవుడు అంటే ఏమిటో ప్రజలకు తెలియదు. నీవు నిజంగా నన్ను ఒక సాధారణ వాక్యంలో సంక్షిప్తీకరించగలవా? “యేసు దేవుడు కాక ఇంకెవరో కాదు, దేవుడు యేసు తప్ప మరెవరో కాదు” అని చెప్పడానికి నీకు నిజంగా ధైర్యం ఉందా? “దేవుడు ఆత్మ తప్ప మరెవరో కాదు, మరియు ఆత్మ దేవుడు తప్ప మరెవరో కాదు” అని చెప్పడానికి నీవు నిజంగా ధైర్యంగా ఉన్నావా? “దేవుడు కేవలం శరీరాన్ని ధరించిన మానవుడు” అని చెప్పడానికి సుముఖంగా ఉన్నావా? “యేసు ప్రతిరూపం దేవుని యొక్క గొప్ప ప్రతిరూపం” అని చెప్పడానికి నీకు నిజంగా ధైర్యం ఉందా? నీవు నీ వాక్చాతుర్యాన్ని ఉపయోగించి దేవుని స్వభావాన్ని మరియు ప్రతిరూపాన్ని పూర్తిగా వివరించగలవా? “దేవుడు తన సొంత ప్రతిరూపంలో ఆడవారిని చేయకుండా మగవారిని మాత్రమే సృష్టించాడు” అని చెప్పడానికి నీకు నిజంగా ధైర్యం ఉందా? నీవు ఇలా చెబితే, నేను ఎంపిక చేసుకున్న వారిలో ఏ స్త్రీ కూడా ఉండదు, స్త్రీలు మానవజాతిలోనే ఒక తరగతిగా అసలే ఉండరు. ఇప్పుడు దేవుడు అంటే ఏమిటో నీకు నిజంగా తెలుసా? దేవుడు మానవుడా? దేవుడు ఆత్మా? దేవుడు నిజంగా మగవాడా? నేను చేయవలసిన పనిని యేసు మాత్రమే పూర్తి చేయగలడా? నీవు నా సారాంశాన్ని సంక్షిప్తీకరించడానికి పైవాటిలో ఒకదానిని మాత్రమే ఎంచుకుంటే, నీవు అంత్యంత అమాయకుడైన విధేయ విశ్వాసుడవు. నేను ఒకసారి, మరియు ఒకే ఒక్కసారి అవతార శరీరముగా పని చేస్తే, మీరు నన్ను పరిమితం చేస్తారా? నీవు నిజంగా నన్ను ఒక్క చూపులో పూర్తిగా అర్థం చేసుకోగలవా? నీ జీవితకాలంలో నీకు బహిర్గతం కాబడిన వాటి ఆధారంగా నీవు నిజంగా నన్ను పూర్తిగా సంక్షిప్తీకరించగలవా? నా రెండు అవతారాలలో నేను ఒకే విధమైన పని చేస్తే, మీరు నన్ను ఎలా గ్రహిస్తారు? నన్ను శాశ్వతంగా సిలువపై వ్రేలాడదీసి వదిలేస్తావా? మీరు ప్రకటన చేసినంత సులభంగా దేవుడు ఉండగలడా?

మీ విశ్వాసం చాలా నిజాయితీగా ఉన్నప్పటికీ, మీలో ఎవరూ నా గురించి పూర్తి వివరణ ఇవ్వలేరు, మీరు చూసే అన్ని వాస్తవాలకు ఎవరూ పూర్తి సాక్ష్యం ఇవ్వలేరు. దీని గురించి ఆలోచించండి: ఈ రోజు, మీలో చాలా మంది మీ విధులలో అశ్రద్దగా ఉన్నారు, బదులుగా శరీరాన్ని వెంబడిస్తున్నారు, శరీరాన్ని సంతృప్తి పరుస్తున్నారు మరియు అత్యాశతో శరీరాన్ని ఆస్వాదిస్తున్నారు. మీరు కొంచెం మాత్రమే నిజం కలిగి ఉన్నారు. అయితే, మీరు చూసిన వాటన్నిటికీ మీరు ఎలా సాక్ష్యం చెప్పగలరు? మీరు నాకు సాక్షులుగా ఉండగలరని మీకు నిజంగా నమ్మకం ఉందా? ఈరోజు నీవు చూసిన వాటన్నింటికి నీవు సాక్ష్యం చెప్పలేని రోజు వస్తే, అప్పుడు నీవు సృష్టించిన జీవులు విధిని కోల్పోయినట్టే మరియు నీ ఉనికికి ఎటువంటి అర్ధమూ ఉండదు. నీవు మనుషునిగా ఉండేందుకు అనర్హుడవు. నీవు మనుష్యుడవు కాదని కూడా చెప్పవచ్చు! నేను మీపై అపరిమితమైన పని చేసాను, కానీ నీవు ప్రస్తుతం ఏమీ నేర్చుకోకపోవడం వలన, ఏమీ ఎరుగకపోవడం వలన మరియు నీ శ్రమలో అసమర్థతతో ఉండటం వలన, నేను నా పనిని విస్తరించే సమయం వచ్చినప్పుడు, ముడిపడి ఎందుకూ పనికిరాని నాలుకతో శూన్యంగా నీవు చూస్తూ ఊరుకుంటావు. అది నిన్నుఎల్లకాలం పాపిగా చేయదా? ఆ సమయం వచ్చినప్పుడు, నీవు తీవ్రమైన పశ్చాత్తాపాన్ని అనుభవించవా? నీవు నిరుత్సాహంలో మునిగిపోవా? ఈ రోజు నా పని అంతా ఏమీ తోచక ఖాళీగా ఉండటం వలన చేసినది కాదు కానీ ఇది నా భవిష్యత్తు పనికొరకు పునాది వేయడానికి చేసినది. నేను ప్రతిష్టంభనలో ఉన్నానని మరియు కొత్తదాన్ని తీసుకురావాలని చేసినది కాదు. నేను చేసే పనిని నీవు అర్థం చేసుకోవాలి; ఇది వీధిలో ఆడుకునే పిల్లవాడు చేసే పని కాదు, నా తండ్రికి ప్రాతినిధ్యం వహించే పని. ఇది నా అంతట నేనే చేసే పని కాదని బదులుగా, ఇది నేను నా తండ్రికి ప్రాతినిధ్యం వహిస్తున్నానని మీరు తెలుసుకోవాలి; అదే సమయంలో, మీ పాత్ర, నిష్టగా అనుసరించడం, లోబడడం, మారడం మరియు సాక్ష్యమివ్వడం. మీరు అర్థం చేసుకోవాల్సినది ఏమిటంటే, మీరు ఎందుకు నన్ను నమ్మాలి అని; మీలో ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవడానికి ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. నా తండ్రి, తన మహిమ కొరకు, ప్రపంచాన్ని సృష్టించిన క్షణం నుండి మీ అందరినీ నా కోసం ముందుగా నిర్ణయించాడు. ఇది నా పని కొరకు మరియు ఆయన మహిమ కొరకు, ఆయన నిన్ను ముందుగా నిర్ణయించాడు. నా తండ్రి వల్లనే మీరు నా యందు విశ్వసిస్తున్నారు; మీరు నన్ను అనుసరించడానికి నా తండ్రి ముందస్తు నిర్ణయమే కారణం. ఇందులో ఏదీ మీ స్వంత ఎంపిక కాదు. ఇంకా ముఖ్యమైనది ఏమిటంటే, నాకు సాక్ష్యమిచ్చే ఉద్దేశ్యంతో నా తండ్రి నాకు అనుగ్రహించిన వారు మీరేనని మీరు అర్థం చేసుకోవడం. ఆయన మిమ్మల్ని నాకు అనుగ్రహించాడు కాబట్టి, నేను మీకు అందించే మార్గాలకు, అలాగే నేను మీకు బోధించే మార్గాలు మరియు వాక్యాలకు మీరు కట్టుబడి ఉండాలి, ఎందుకంటే నా మార్గాలకు కట్టుబడి ఉండడం మీ కర్తవ్యం. నాపై మీకున్న విశ్వాసం యొక్క అసలు ఉద్దేశ్యం ఇదే. కాబట్టి, నేను మీకు ఇలా చెప్తున్నాను: మీరు కేవలం నా మార్గాలకు కట్టుబడి ఉండటానికి నా తండ్రి నాకు అనుగ్రహించిన వ్యక్తులు. అయితే, మీరు నన్ను మాత్రమే నమ్ముతారు; మీరు నాకు చెందినవారు కాదు ఎందుకంటే మీరు ఇజ్రాయేలు కుటుంబానికి చెందినవారు కాదు బదులుగా పురాతన సర్పానికి చెందినవారు. నేను మిమ్మల్ని అడుగుతున్నది కేవలం నా కోసం సాక్ష్యమివ్వమని, అయితే ఈ రోజు మీరు నా మార్గాల్లో తప్పక నడవాలి. ఇదంతా భవిష్యత్తు సాక్ష్యం కోసమే. మీరు నా మార్గాలను వినే వ్యక్తులుగా మాత్రమే పనిచేస్తే, మీరు విలువ లేకుండా ఉంటారు మరియు నా తండ్రి మిమ్మల్ని నాకు అనుగ్రహించిన ప్రాముఖ్యత పోతుంది. నేను మీకు చెప్పాలని పట్టుబట్టేది ఒక్కటే అది: మీరు నా మార్గాలలో నడవాలి.

మునుపటి:  ఆశీర్వాదాల పట్ల మీ అవగాహన ఎంత?

తరువాత:  నిజమైన మనిషిగా ఉండటానికి అర్థం

సెట్టింగులు

  • వచనం
  • థీమ్స్

ఘన రంగులు

థీమ్స్

అక్షరశైలి

అక్షరశైలి పరిమాణం

గీతల మధ్య దూరం

గీతల మధ్య దూరం

పేజీ వెడల్పు

విషయ సూచిక

శోధించండి

  • ఈ వచనాన్ని శోధించండి
  • ఈ పుస్తకాన్ని శోధించండి

Connect with us on Messenger