దేవుడు తనకు తానే అద్వితీయుడు VIII
సమస్త జీవులకు దేవుడే ప్రాణాధారం (II)
మనం మన చివరి అంశంపై సాంగత్యాన్ని కొనసాగిస్తాము. మనం చివరిసారి సాంగత్యం చేసిన విషయాన్ని మీరు గుర్తు చేసుకోగలరా? (సమస్త జీవులకు దేవుడే ప్రాణాధారం.) “సమస్త జీవులకు దేవుడే ప్రాణాధారం” అనే ఈ విషయం, మీకు చాలా వరకు తెలియని విషయంగా అనిపిస్తుందా? లేదా మీకు ఇప్పటికే మీ మనస్సులలో దాని గురించి ఒక భావన ఉందా? ఈ విషయంపై మన చివరి సాంగత్యంలో చర్చించిన ముఖ్యమైన అంశం గురించి ఎవరైనా ఒక్క క్షణం మాట్లాడగలరా? (దేవుడు సమస్తాన్ని సృష్టించడం ద్వారా, ఆయన సమస్త జీవులను మరియు మానవాళిని పోషించడాన్ని నేను చూస్తున్నాను. గతంలో, దేవుడు మనిషికి ఏర్పాటు చేసినప్పుడు, ఆయన తన మాటలను తాను ఎంచుకున్న వ్యక్తులకు మాత్రమే ఇస్తాడని నేను ఎప్పుడూ అనుకునేవాడిని; సమస్త జీవులను పాలించే చట్టాల ద్వారా, దేవుడు సమస్త మానవాళిని పోషిస్తున్నాడని నేను ఎప్పుడూ చూడలేదు. ఈ సత్యం గురించి దేవుడు తెలియజెప్పడంతోనే, ఆయనే సమస్తానికి మూలమని, ఆయనే సమస్త జీవులకు జీవాన్ని అందించాడని, దేవుడే ఈ చట్టాలను ఏర్పాటు చేసి, సమస్తాన్ని పోషిస్తున్నాడని నేను తెలుసుకున్నాను. దేవుడి సమస్త జీవుల సృష్టి నుండి, నేను ఆయన ప్రేమను చూశాను.) చివరిసారి, దేవుడు సమస్త జీవులను సృష్టించడం మరియు వాటి కోసం చట్టాలు మరియు సూత్రాలను ఏర్పాటు చేయడం గురించి మనం ప్రాథమికంగా సాంగత్యము చేశాము. అలాంటి చట్టాలు మరియు సూత్రాల ప్రకారం, సమస్త జీవులు దేవుని ఆధిపత్యంలో, దేవుని చూపు కింద మనిషితో కలిసి జీవిస్తాయి, మరణిస్తాయి మరియు సహజీవనం చేస్తాయి. దేవుడు సమస్త జీవులను సృష్టించడం మరియు అవి అభివృద్ధిచెందే చట్టాలను, అలాగే వాటి అభివృద్ధి పథాలు మరియు నమూనాలను నిర్ణయించడానికి ఆయన సొంత పద్ధతులను ఉపయోగించడం గురించి మనం మొదట మాట్లాడాము. సమస్త జీవులు పెరుగుతూ, అభివృద్ధి చెందుతూ, ఒకదానిపై మరొకటి ఆధారపడి జీవిస్తూ మనుగడ సాగించగలిగేలా, అవి ఈ భూమిలో మనుగడ సాగించే మార్గాలను కూడా ఆయన నిర్ణయించాడు. అలాంటి పద్ధతులు మరియు చట్టాలతో, ఈ భూమిపై సమస్త జీవులు హాయిగా, ప్రశాంతంగా బతుకగలుగుతాయి మరియు అభివృద్ధి చెందగలుగుతాయి, అలాంటి వాతావరణంతో మాత్రమే మానవాళికి స్థిరమైన ఇల్లు మరియు జీవించడానికి స్థిరమైన పరిస్థితి ఉంటుంది, దేవుని మార్గదర్శకత్వంలో ఎల్లప్పుడూ ముందుకు సాగుతుంది-ఎప్పుడూ ముందుకే.
చివరిసారి, సమస్త జీవులకు దేవుడు సమకూర్చే ప్రాథమిక భావన గురించి చర్చించాము: దేవుడు ఈ విధంగా మానవాళి ప్రయోజనం కోసం సమస్త జీవులు ఉనికిలో ఉండటానికి మరియు జీవించడానికి సమస్త జీవులకు సమకూరుస్తాడు. మరోలా చెప్పాలంటే, దేవుడు ఏర్పాటు చేసిన చట్టాల మూలంగానే అలాంటి వాతావరణం ఉంటుంది. అలాంటి చట్టాలను దేవుడు నిర్వహించడం మరియు నడిపించడం కారణంగా మాత్రమే మానవాళికి ప్రస్తుత జీవన వాతావరణం ఉంది. ఇది మనం చివరిసారి మాట్లాడిన దానికి మరియు మనం గతంలో మాట్లాడిన దేవుని జ్ఞానానికి మధ్య ఒక గొప్ప ముందడుగు. ఆ ముందడుగుకు కారణం ఏమిటి? మనం గతంలో దేవుణ్ణి తెలుసుకోవడం గురించి మాట్లాడినప్పుడు, దేవుడు మానవాళిని రక్షించడం మరియు నిర్వహించడం పరిధి వరకే మాట్లాడుతూ ఉండేవాళ్లం-అంటే దేవుడు ఎంచుకున్న ప్రజల రక్షణ మరియు నిర్వహణ-ఆ పరిధిలో, దేవుణ్ణి తెలుసుకోవడం, దేవుని పనులు, ఆయన స్వభావం, ఆయన కలిగి ఉన్నవి, ఆయనంటే ఏమిటో, ఆయన చిత్తం మరియు మనిషికి సత్యాన్ని మరియు జీవితాన్ని ఆయన ఎలా సమకూరుస్తాడనే దాని గురించి మాట్లాడాము. కానీ చివరిసారి, మనం ప్రారంభించిన అంశం బైబిల్ విషయాలకు మరియు దేవుడు ఆయన ఎంచుకున్న ప్రజలను రక్షించే దాని పరిధికి మాత్రమే పరిమితం కాలేదు. బదులుగా, బైబిల్ పరిమితుల నుండి మరియు దేవుడు ఆయన ఎంచుకున్న ప్రజలపై చేసే కార్యపు మూడు దశల నుండి, దేవునికి బదులుగా చర్చిస్తూ ఆ అంశం ఈ పరిధి దాటి పోతుంది. కాబట్టి, నీవు నా సాంగత్యపు ఈ భాగాన్ని విన్నప్పుడు, దేవుని గురించిన నీ జ్ఞానాన్ని, బైబిల్‌కు మరియు దేవుని కార్యపు మూడు దశలకు నీవు పరిమితం చేయకూడదు. బదులుగా, నీవు నీ దృష్టికోణాన్ని తెరిచి ఉంచాలి; నీవు దేవుని పనులను మరియు సమస్త జీవులలో ఆయన ఏమి కలిగి ఉన్నాడు మరియు ఏమై ఉన్నాడు, సమస్తాన్ని ఆయన ఎలా నిర్దేశిస్తాడు, ఎలా నిర్వహిస్తాడో చూడాలి. ఈ పద్ధతి ద్వారా, ఈ ఆధారంతో, సమస్త జీవులకు దేవుడు ఎలా సమకూరుస్తాడో నీవు చూడవచ్చు, ఇది సమస్త జీవులకు దేవుడే నిజమైన ప్రాణాధారమనీ, వాస్తవానికి, దేవునికి నిజమైన గుర్తింపు ఇదేనని మానవాళి అర్థం చేసుకునేలా చేస్తుంది. అంటే, దేవుని గుర్తింపు, హోదా మరియు అధికారం, ఆయన సమస్తం, ప్రస్తుతం ఆయనను అనుసరించే వారికి మాత్రమే ఉద్దేశించినవి కావు-మీ కోసం, ఈ వ్యక్తుల సమూహం కోసం మాత్రమే కావు-సమస్త జీవులకు ఉద్దేశించబడినవి. కాబట్టి, సమస్త జీవులు అనే పరిధి చాలా విస్తృతమైనది. అన్నింటిపై దేవుని పాలన పరిధిని వివరించడానికి నేను “సమస్త జీవులు” అనే పదాన్ని ఉపయోగిస్తాను, ఎందుకంటే దేవుడు నిర్దేశించిన విషయాలు అంటే కేవలం మీరు మీ కళ్లతో చూడగలిగేవి మాత్రమే కాదని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను-దానిలో అందరూ చూడగలిగే భౌతిక ప్రపంచం మాత్రమే కాకుండా, భౌతిక ప్రపంచానికి అవతల మనిషి కళ్లతో చూడలేని మరొక ప్రపంచం కూడా ఉంది, దానిని అవతల మానవాళి నివసించలేని గ్రహాలు మరియు బాహ్య అంతరిక్షం కూడా ఉన్నాయి. సమస్త జీవులపై దేవుని ఆధిపత్యం పరిధి ఇదే. ఆయన ఆధిపత్యం పరిధి చాలా విస్తృతమైనది; మీకు సంబంధించినంత వరకు, మీలో ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది, అర్థం చేసుకోవాలి, చూడాలి మరియు మీరు ఏమి అర్థం చేసుకోవాలి, మీరు ఏమి చూడాలి మరియు మీకు ఏ విషయాల గురించి జ్ఞానం ఉండాలి అనేవాటి పట్ల మీకు స్పష్టత ఉండాలి. వాస్తవానికి “సమస్త జీవులు” అనే పదం పరిధి చాలా విస్తృతమైనది అయినప్పటికీ, ఆ పరిధిలోని మీరు చూసే అవకాశం లేని లేదా మీరు వ్యక్తిగతంగా సంప్రదించలేని విషయాల గురించి నేను మీకు చెప్పను. “సమస్త జీవులకు దేవుడే ప్రాణాధారం” అనే వాక్యపు నిజమైన అర్థాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోగలిగేలా, మానవులు సంప్రదించగల, అర్థం చేసుకోగల మరియు గ్రహించగల ఆ పరిధిలోని విషయాల గురించి మాత్రమే నేను మీకు చెబుతాను. ఈ రకంగా, నా సాంగత్యపు ఏ పదాలు కూడా మీకు నిష్పలంగా ఉండవు.
చివరిసారి, సమస్త జీవులకు దేవుడు ఎలా సమకూరుస్తాడనే దానిపై ప్రజలు ప్రాథమిక అవగాహన పొందగలిగేలా, “సమస్త జీవులకు దేవుడే ప్రాణాధారం” అనే అంశపు సాధారణ అవలోకనాన్ని అందించడానికి కథ చెప్పే పద్ధతిని ఉపయోగించాము. ఈ ప్రాథమిక భావనను మీకు బోధించడానికి గల ఉద్దేశం ఏమిటి? దేవుని కార్యము, బైబిల్ మరియు ఆయన కార్యపు మూడు దశలను దాటి చేరుతుందని ప్రజలకు అర్థమయ్యేలా చేయడం. ఆయన మానవులు చూడలేని మరియు వారు సంప్రదించలేని చాలా ఎక్కువ కార్యాన్ని, ఆయన వ్యక్తిగతంగా హాజరయ్యే కార్యాన్ని చేస్తున్నాడు. ఒకవేళ దేవుడు తన నిర్వహణపై మరియు తాను ఎంచుకున్న ప్రజలను ముందుకు నడిపించడంపై మాత్రమే పని చేస్తుంటే, ఇద కాక మరే ఇతర పనిలో నిమగ్నమై ఉండకపోతే, మీ అందరితో సహా ఈ మానవాళికి ముందుకు సాగడమనేది చాలా కష్టమయ్యి ఉండేది. ఈ మానవాళి మరియు ఈ ప్రపంచం అభివృద్ధిని కొనసాగించగలిగి ఉండేవి కావు. ఈ రోజు నేను మీతో నిర్వహించబోయే సాంగత్యానికి సంబంధించిన అంశంలో, “సమస్త జీవులకు దేవుడే ప్రాణాధారం” అనే పదబంధం ప్రాముఖ్యత ఉంటుంది.
మానవాళి కోసం దేవుడు సృష్టించిన జీవితానికి ప్రాథమిక పర్యావరణం
“సమస్త జీవులకు దేవుడే ప్రాణాధారం” అనే పదాలకు సంబంధించిన అనేక అంశాలు మరియు చాలా విషయాన్ని మనం చర్చించాము, అయితే దేవుడు మీకు తన మాటలను అందించడం మరియు మీపై శిక్ష మరియు తీర్పు కార్యాన్ని చేయడమే కాకుండా, మానవాళికి దేవుడు ఏమి ప్రసాదిస్తాడో మీ మనస్సులలో మీకు తెలుసా? కొంతమంది, “దేవుడు నాపై కృప మరియు దీవెనలు కురిపిస్తాడు; ఆయన నాకు క్రమశిక్షణ మరియు సౌకర్యాన్ని ఇస్తాడు, సాధ్యమైనన్ని రకాలుగా ఆయన నాకు సంరక్షణను మరియు రక్షణను ఇస్తాడు” అని చెప్పవచ్చు. ఇంకొందరు, “దేవుడు నాకు రోజూ ఆహారం మరియు పానీయాలు ప్రసాదిస్తాడు” అని అంటారు, మరికొందరు “దేవుడు నాకు ప్రతిదీ ప్రసాదించాడు” అని కూడా అంటారు. ప్రజలు వారి దైనందిన జీవితంలో ఎదుర్కునే సమస్యలకు మీరు మీ సొంత, శారీరక జీవితానుభవం పరిధికి సంబంధించిన విధంగా ప్రతిస్పందించవచ్చు. దేవుడు ప్రతి వ్యక్తికి అనేక విషయాలను ప్రసాదిస్తాడు, మనం ఇక్కడ చర్చిస్తున్నది ప్రజల రోజువారీ అవసరాల పరిధికి మాత్రమే పరిమితం కానప్పటికీ, ప్రతి వ్యక్తి దృష్టికోణాన్ని విస్తరించడానికి మరియు మీరు స్థూల దృక్కోణం నుండి విషయాలను చూసేలా చేస్తుంది. సమస్త జీవులకు దేవుడే ప్రాణాధారం కాబట్టి, ఆయన సమస్త జీవుల జీవితాన్ని ఎలా నిర్వహిస్తాడు? మరోలా చెప్పాలంటే, దేవుడు తన సృష్టిలోని సమస్త జీవులకు వాటి ఉనికిని మరియు వాటికి ఆధారమైన చట్టాలను నిర్వహించడానికి ఏమి ఇస్తాడు? ఈరోజు మన చర్చలోని ప్రధానాంశం ఇదే. నేను చెప్పింది మీకు అర్థమైందా? ఈ అంశం మీకు అస్సలు తెలియనిది కావచ్చు, కానీ నేను చాలా లోతైన ఎలాంటి సిద్ధాంతాల గురించి మాట్లాడను. మీరు నా మాటలను వినగలిగేలా మరియు వాటి నుండి అవగాహన పొందగలిగేలా చూడటానికి నేను కృషి చేస్తాను. మీరు ఎలాంటి భారంగా భావించాల్సిన అవసరం లేదు-మీరు చేయాల్సిందల్లా జాగ్రత్తగా వినండి. అయితే, ఈ సమయంలో, నేను మరొకసారి నొక్కి చెప్పాలి: నేను మాట్లాడుతున్న అంశం ఏమిటి? చెప్పండి. (సమస్త జీవులకు దేవుడే ప్రాణాధారం.) అలాంటప్పుడు దేవుడు సమస్త జీవులకు ఎలా సమకూరుస్తాడు? “సమస్త జీవులకు దేవుడే ప్రాణాధారం” అని చెప్పగలిగేలా ఆయన సమస్త జీవులకు ఏమి సమకూరుస్తాడు? దీని గురించి మీకేమైనా భావనలు లేదా ఆలోచనలు ఉన్నాయా? మీ హృదయాలలో, మీ మనస్సులలో దాదాపు మీకు పూర్తిగా తెలియని ఒక అంశాన్ని నేను చర్చిస్తున్నట్లు అనిపిస్తుంది. అయినా మీరు ఈ అంశాన్ని, ఏదైనా జ్ఞానం, మానవ సంస్కృతి లేదా పరిశోధనకు బదులుగా, దేవుని పనులను గురించి నేను చెప్పబోయేదానితో కలిపి అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. నేను దేవుని గురించి, దేవుని గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ఇది మీకు నా సలహా. మీరు ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు!
దేవుడు మానవాళికి ఎన్నో విషయాలను ప్రసాదించాడు. ప్రజలు ఏమి చూడగలరు, అంటే వారు ఏమి అనుభూతి చెందగలరు అనే దాని గురించి మాట్లాడటంతో నేను ప్రారంభిస్తాను. ప్రజలు తమ హృదయాలలో అంగీకరించగల మరియు అర్థం చేసుకోగల విషయాలు ఇవే. కాబట్టి ముందుగా, భౌతిక ప్రపంచం గురించి చర్చతో దేవుడు మానవాళికి అందించిన వాటి గురించి మాట్లాడడంతో ప్రారంభిద్దాం.
1. గాలి
మొదట, దేవుడు గాలిని సృష్టించాడు, దాంతో మనిషి శ్వాసించవచ్చు. గాలి అనేది మానవాళి రోజువారీ సంబంధాన్ని కలిగి ఉండే పదార్ధం, మనష్యులు క్షణక్షణం, వారు నిద్రిస్తున్నప్పుడు కూడా ఆధారపడదగిన విషయం. దేవుడు సృష్టించిన గాలి మానవాళికి అత్యంత ప్రాముఖ్యమైనది: ఇది వారి ప్రతి శ్వాసకు మరియు జీవితానికే ఎంతో అవసరం. ఈ పదార్ధం, అనుభూతి చెందగలిగేది కానీ చూడలేనిది, దేవుడు తన సృష్టిలోని సమస్త జీవులకు మొదటగా ఇచ్చిన బహుమతి. అయితే గాలి సృష్టించిన తర్వాత, దేవుడు తన కార్యాన్ని ముగించినట్లు భావించి ఆపివేశాడా? లేదా గాలి ఎంత దట్టంగా ఉంటుందో ఆయన ఆలోచించాడా? గాలిలో ఏమి ఉంటుందో అతను ఆలోచించాడా? దేవుడు గాలిని తయారు చేసినప్పుడు ఏమి ఆలోచిస్తున్నాడు? దేవుడు గాలిని ఎందుకు సృష్టించాడు, దానిలోని ఆయన తర్కం ఏమిటి? మానవులకు గాలి కావాలి—వారు పీల్చుకోవాలి. ముందుగా, గాలి సాంద్రత మానవుని ఊపిరితిత్తులకు సరిపోయేలా ఉండాలి. గాలి సాంద్రత ఎవరికైనా తెలుసా? నిజానికి, ప్రజలకు ప్రత్యేకంగా అంకెలు లేదా డేటా పరంగా ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాల్సిన అవసరం లేదు, వాస్తవానికి, సమాధానం తెలుసుకోవడమనేది అస్సలు అవసరం లేదు-దాని గురించి తెలిసి ఉంటే సరిపోతుంది. మనిషి ఊపిరితిత్తులు పీల్చుకోవడానికి అనువుగా ఉండే సాంద్రతతో దేవుడు గాలిని సృష్టించాడు. అంటే, గాలి మానవ శరీరాలలోకి వారి శ్వాస ద్వారా తక్షణమే ప్రవేశించగలిగేలా ఆయన దానిని తయారు చేశాడు, దాంతో శ్వాసించినప్పుడు అది శరీరానికి హాని కలిగించదు. దేవుడు గాలిని సృష్టించినప్పుడు ఆయన పరిగణనలోకి తీసుకున్నవి ఇవి. తరువాత, గాలిలో ఏముంటుంది అనేదాని గురించి మనం మాట్లాడుదాం. దానిలో ఉన్నవి మనష్యులకు విషపూరితమైనవి కావు మరియు ఊపిరితిత్తులు లేదా శరీరంలోని ఏ భాగాన్ని పాడుచేయవు. దేవుడు వీటన్నింటిని పరిగణించాల్సి వచ్చింది. మనుష్యులు పీల్చే గాలి సజావుగా శరీరంలోకి ప్రవేశించి బయటికి రావాలని, పీల్చిన తర్వాత, గాలిలోని పదార్థాల స్వభావం మరియు పరిమాణంలో రక్తం, అలాగే ఊపిరితిత్తులలోని వ్యర్థ గాలి ఉండాలని, శరీరం మొత్తంగా, సరిగ్గా జీవక్రియ చేయబడాలని భావించాల్సి వచ్చింది. అంతేకాకుండా, గాలిలో ఎలాంటి విషపూరిత పదార్థాలు ఉండకూడదని ఆయన భావించాల్సి వచ్చింది. గాలికి సంబంధించిన ఈ రెండు ప్రమాణాల గురించి మీకు చెప్పడంలో నా ఉద్దేశం, మీకు ఏదైనా ప్రత్యేక జ్ఞానాన్ని అందించాలని కాదు, కానీ దేవుడు తన సృష్టిలోని ప్రతిదాన్ని తన సొంత పరిగణనలకు అనుగుణంగా సృష్టించాడని మరియు ఆయన సృష్టించిన ప్రతిదీ అత్యత్తమంగా ఉండదగినదని మీకు చూపించడానికే. అంతేగాకుండా, గాలిలోని దుమ్ము; భూమిపై ఉన్న దుమ్ము, ఇసుక మరియు ధూళి; అలాగే ఆకాశం నుండి భూమిపై పడే దుమ్ము కోసం-ఈ విషయాలను నిర్వహించడానికి దేవుడికి తన మార్గాలు ఉన్నాయి, వాటిని తొలగించడానికి లేదా వాటిని విచ్ఛిన్నం చేయడానికి కూడా మార్గాలు ఉన్నాయి. ఒక నిర్దిష్ట పరిమాణంలో దుమ్ము ఉన్నప్పటికీ, దుమ్ము మనిషి శరీరానికి హాని కలిగించకుండా లేదా మనిషి శ్వాసకు ప్రమాదం కలిగించకుండా దేవుడు దానిని సృష్టించాడు మరియు శరీరానికి హాని కలిగించని పరిమాణంలో దుమ్ము కణాలను తయారు చేశాడు. దేవుడు గాలిని సృష్టించడం అనేది ఒక అద్భుతం కాదా? ఇది ఆయన నోటి నుండి గాలి పీల్చడం లాంటి సాధారణ విషయమా? (లేవు.) ఆయన చిన్నచిన్న విషయాలను సృష్టించడంలో కూడా, దేవుని అద్భుతం, ఆయన మనస్సు పనితీరు, ఆయన ఆలోచనా విధానం మరియు ఆయన జ్ఞానం అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. దేవుడు అనుభవజ్ఞుడు కాదా? (అవును, అనుభవజ్ఞుడే.) దీని అర్థం ఏమిటంటే, చిన్నచిన్న వస్తువులను సృష్టించడంలో కూడా, దేవుడు మనష్యుల గురించి ఆలోచిస్తున్నాడు. మొదటిగా, మనష్యులు పీల్చే గాలి శుభ్రంగా ఉంటుంది మరియు దానిలోని అంశాలు మానవులు పీల్చుకోవడానికి అనువుగా ఉంటాయి, విషపూరితమైనవి కావు, మానవులకు ఎటువంటి హాని చేయవు; అదే విధంగా, గాలి సాంద్రత మానవాళి శ్వాసకు సరిపోతుంది. మానవులు నిరంతరం పీల్చి వదులుతున్న ఈ గాలి మానవ శరీరానికి, మానవ దేహానికి చాలా అవసరం. అందుకే మానవులు ఆటంకము లేదా ఆందోళన లేకుండా స్వేచ్ఛగా పీల్చుకోవచ్చు. కాబట్టి వారు సాధారణంగా శ్వాస తీసుకోగలరు. గాలి అనేది ప్రారంభంలో దేవుడు సృష్టించినది మరియు మానవాళి శ్వాసకు అనివార్యమైనది.
2. ఉష్ణోగ్రత
మనం చర్చించే రెండవ అంశం ఉష్ణోగ్రత. ఉష్ణోగ్రత అంటే ఏమిటో అందరికీ తెలుసు. మానవ మనుగడకు అనువైన పర్యావరణానికి ఉష్ణోగ్రత అత్యాశ్యకం. ఉష్ణోగ్రత చాలా ఎక్కువ ఉంటే-ఉదాహరణకు, ఉష్ణోగ్రత నలభై డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉందనుకోండి-ఇది మానవాళిని హరించి ఉండేది కాదా? అలాంటి పరిస్థితుల్లో జీవించడమనేది మానవాళిని నిస్సత్తువకు గురిచేసేది కాదా? అలాగే ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంటే ఏమి జరిగి ఉండేది? ఉష్ణోగ్రత మైనస్ నలభై డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంటుందని అనుకుందాం-మానవాళి ఈ పరిస్థితులను కూడా తట్టుకోగలిగేది కాదు. అందువల్ల, ఉష్ణోగ్రతల పరిధిని ఏర్పాటు చేయడంలో దేవుడు చాలా జాగ్రత్త తీసుకున్నాడు, అంటే, మానవ శరీరం తట్టుకోగల ఉష్ణోగ్రత పరిధి, ఇది మైనస్ ముప్పై డిగ్రీల సెల్సియస్ మరియు నలభై డిగ్రీల సెల్సియస్ మధ్య ఎక్కువ లేదా తక్కువ ఉంటుంది. ఉత్తరం నుండి దక్షిణం వరకు ఉన్న ప్రదేశాలలో ఉష్ణోగ్రతలు తప్పనిసరిగా ఈ పరిధిలో ఉంటాయి. శీతల ప్రాంతాలలో, బహుశా ఉష్ణోగ్రతలు మైనస్ యాభై లేదా అరవై డిగ్రీల సెల్సియస్‌కు పడిపోవచ్చు. అలాంటి ప్రాంతాలలో మనుషులు నివసించాలని దేవుడు అనుకోడు. అయితే, ఈ గడ్డకట్టే ప్రాంతాలు ఎందుకు ఉన్నాయి? దేవునికి ఆయన సొంత జ్ఞానము ఉంది, దీని కోసం ఆయనకు సొంత ఉద్దేశాలు ఉన్నాయి. ఆయన నిన్ను ఆ ప్రదేశాల దగ్గరికి వెళ్లనివ్వడు. చాలా వేడిగా మరియు చాలా చల్లగా ఉండే ప్రదేశాలు దేవునిచే సంరక్షించబడ్డాయి, అంటే అక్కడ మనిషి నివసించడానికి ఆయన ప్రణాళిక చేయలేదు. ఈ ప్రదేశాలు మానవాళి కోసం కాదు. అయితే అలాంటి ప్రదేశాలు భూమిపై ఉండేలా దేవుడు ఎందుకు చేశాడు? మానవుడు నివసించకూడదని లేదా మనుగడ సాగించకూడదని దేవుడు అనుకున్న ప్రదేశాలైతే, అప్పుడు దేవుడు వాటిని ఎందుకు సృష్టించాడు? అందులో దేవుని జ్ఞానం ఉంది. అంటే, మానవులు జీవించే పర్యావరణపు ఉష్ణోగ్రత పరిధిని దేవుడు సహేతుకంగా క్రమాంకనం చేశాడు. ఇక్కడ ఒక సహజ చట్టం కూడా పని చేస్తుంది. ఉష్ణోగ్రతను నిర్వహించడానికి మరియు నియంత్రించడానికి దేవుడు కొన్ని అంశాలను సృష్టించాడు. అవి ఏమిటి? మొదటిది, సూర్యుడు ప్రజలకు వెచ్చదనాన్ని తీసుకురాగలడు, కానీ అది చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ప్రజలు ఈ వెచ్చదనాన్ని భరించగలరా? సూర్యుని దగ్గరకు వెళ్లే సాహసం చేసేవారు ఎవరైనా ఉన్నారా? సూర్యుని దగ్గరకు వెళ్లగల ఏదైనా శాస్త్రీయ పరికరం భూమిపై ఉందా? (లేవు.) ఎందుకు లేదు? సూర్యుడు చాలా వేడిగా ఉంటాడు. చాలా దగ్గరకు వచ్చిన ఏదైనా ఇట్టే కరిగిపోతుంది. కాబట్టి, దేవుడు తన ఖచ్చితమైన లెక్కల ప్రకారం మరియు ఆయన ప్రమాణాలకు అనుగుణంగా మనిషికి పైన సూర్యుని ఎత్తును మరియు అతని నుండి దూరాన్ని ఎర్పాటు చేయడానికి ప్రత్యేకంగా పనిచేశాడు. కాబట్టి, భూమికి రెండు ధ్రువాలు, దక్షిణ మరియు ఉత్తర ధ్రువాలు ఉన్నాయి. ఈ ప్రాంతాలు పూర్తిగా ఘనీభవించి హిమనదీయమై ఉన్నాయి. మానవాళి హిమనదీయ ప్రాంతాలలో నివసించగలదా? అలాంటి ప్రదేశాలు మానవ మనుగడకు సరియైనవేనా? కావు, కాబట్టి ప్రజలు ఈ ప్రదేశాలకు వెళ్లరు. ప్రజలు దక్షిణ మరియు ఉత్తర ధ్రువాలకు వెళ్లరు కాబట్టి, వారి హిమనీనదాలు సంరక్షించబడతాయి మరియు ఉష్ణోగ్రతను నియంత్రించే వాటి ఉద్దేశాన్ని అందించగలవు. మీకు అర్థమైంది, అవునా? దక్షిణ ధ్రువం, ఉత్తర ధ్రువం లేకపోతే, సూర్యుని స్థిరమైన వేడి భూమిపై ఉన్న ప్రజలను నాశనం చేసేది. అయితే ఈ రెండు అంశాల ద్వారా మాత్రమే దేవుడు ఉష్ణోగ్రతను మానవ మనుగడకు అనుకూలమైన పరిధిలో ఉంచుతాడా? కాదు. సూర్యుని వేడిని గ్రహించే, మైదానంలోని గడ్డి, అనేక రకాల చెట్లు, అడవుల్లోని అన్ని రకాల మొక్కలు వంటి అన్ని రకాల జీవులు కూడా ఉన్నాయి, అలా చేయడం వల్ల, మానవజాతి నివసించే పర్యావరణపు ఉష్ణోగ్రతను నియంత్రించే విధంగా సూర్యుని ఉష్ణశక్తిని తటస్థీకరిస్తాయి. నదులు మరియు సరస్సుల వంటి నీటి వనరులు కూడా ఉన్నాయి. నదులు మరియు సరస్సులు ఆక్రమించే పరిధిని ఎవరూ నిర్ణయించలేరు. భూమిపై ఎంత నీరు ఉందో లేదా ఆ నీరు ఎక్కడ ప్రవహిస్తుందో, దాని ప్రవాహ దిశను, దాని పరిమాణం లేదా దాని వేగాన్ని ఎవరూ నియంత్రించలేరు. దేవునికి మాత్రమే తెలుసు. భూగర్భ జలాల నుండి మొదలు భూమిపై కనిపించే నదులు మరియు సరస్సుల వరకు ఈ అనేక రకాల నీటి వనరులు కూడా మనిషి నివసించే పర్యావరణం ఉష్ణోగ్రతను నియంత్రించగలవు. నీటి వనరులతో పాటు, పర్వతాలు, మైదానాలు, లోయలు మరియు చిత్తడి నేలలు వంటి అన్ని రకాల భౌగోళిక నిర్మాణాలు కూడా ఉన్నాయి, ఇవన్నీ వాటి భౌగోళిక పరిధి మరియు ప్రాంతానికి తగిన మేరకు ఉష్ణోగ్రతలను నియంత్రిస్తాయి. ఉదాహరణకు, ఒక పర్వతానికి వంద కిలోమీటర్ల చుట్టుకొలత ఉంటే, ఆ వంద కిలోమీటర్లు వంద కిలోమీటర్లకు తగిన ప్రయాజనానికి తోడ్పడతాయి. దేవుడు భూమిపై ఎన్ని పర్వత శ్రేణులు మరియు లోయలను సృష్టించాడు అనే విషయానికి వస్తే, అది దేవుడు పరిగణించిన సంఖ్య. మరోలా చెప్పాలంటే, దేవుడు సృష్టించిన ప్రతి వస్తువు ఉనికి వెనుక, ఒక కథ ఉంది మరియు ప్రతి దానిలో దేవుని జ్ఞానం మరియు ప్రణాళికలు ఉన్నాయి. ఉదాహరణకు, అడవులు మరియు అనేక రకాల వృక్షసంపదలను తీసుకోండి-అవి ఉన్న మరియు పెరిగే ప్రాంతం పరిధి, విస్తీర్ణం ఏ మనిషి నియంత్రణలో లేనిది అలాగే ఈ విషయాల గురించి చెప్పడానికి ఎవరికీ ఎలాంటి మాటలు లేవు. అదేవిధంగా, అవి ఎంత నీటిని గ్రహిస్తాయో లేదా సూర్యుని నుండి ఎంత ఉష్ణ శక్తిని గ్రహిస్తాయో ఎవరూ నియంత్రించలేరు. ఈ విషయాలన్నీ దేవుడు అన్నింటినీ సృష్టించినప్పుడు చేసిన ప్రణాళిక పరిధిలోకి వస్తాయి.
ఇదంతా మనిషి అంత అనువైన ఉష్ణోగ్రతతో పర్యావరణంలో జీవించగలిగేలా, దేవుడు జాగ్రత్తగా చేసిన ప్రణాళిక, పరిశీలన మరియు అన్ని విషయాలలో ఏర్పాటు చేయడం వల్ల మాత్రమే. అందువల్ల, మనిషి తన కళ్లతో చూసే ప్రతి వస్తువు, అంటే సూర్యుడు, దక్షిణ మరియు ఉత్తర ధ్రువాల గురించి ప్రజలు తరచుగా వింటారు, అలాగే భూమిపై, లోపల మరియు నీటిలో ఉన్న అనేక రకాల జీవులు మరియు అడవులు, ఇతర రకాల వృక్షసంపద, నీటి వనరులు, వివిధ జలవనరులు, సముద్రపు నీరు, మంచినీటి పరిమాణాలు మరియు విభిన్న భౌగోళిక పరిసరాలతో కప్పబడి ఉన్న ప్రదేశం-ఇవన్నీ మనిషి మనుగడ కోసం సాధారణ ఉష్ణోగ్రతలను నిర్వహించడానికి దేవుడు ఉపయోగించేవి. ఇది ఖచ్చితమైనది. దేవుడు వీటన్నింటి గురించి లోతుగా ఆలోచించడం వల్లనే మనిషి ఇంత అనుకూలమైన ఉష్ణోగ్రతలున్న పర్యావరణంలో జీవించగలుగుతున్నాడు. ఇది అతి చల్లగా లేదా అతి వేడిగా ఉండకూడదు: అతి వేడిగా ఉండే ప్రదేశాలు, మానవ శరీరం భరించగలిగే దానికంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉండే ప్రదేశాలను దేవుడు ఖచ్చితంగా నీ కోసం పక్కకు పెట్టడు. అతి చల్లగా ఉండే ప్రదేశాలు, ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉన్న ప్రదేశాలు, అక్కడికి చేరుకున్న తర్వాత, మానవులు కేవలం కొన్ని నిమిషాల్లోనే పూర్తిగా గడ్డకట్టిపోతారు, దాంతో వారు మాట్లాడలేరు, వారి మెదళ్ళు స్తంభించి పోతాయి, వారు ఆలోచించలేరు మరియు వెంటనే వారికి శ్వాస స్తంభిస్తుంది-అలాంటి ప్రదేశాలను కూడా దేవుడు మానవాళి కోసం పక్కకు పెట్టడు. మానవులు ఎలాంటి పరిశోధనలు కొనసాగించాలనుకున్నా లేదా అలాంటి పరిమితులను ఆవిష్కరించాలనుకున్నా లేదా అధిగమించాలనుకున్నా- మనుషులకు ఎలాంటి ఆలోచనలు ఉన్నా, వారు మానవ శరీరం తీసుకునే పరిమితులను ఎప్పటికీ అధిగమించలేరు. దేవుడు మనిషి కోసం సృష్టించిన ఈ పరిమితులను వారు ఎప్పటికీ విడిచిపెట్టలేరు. ఎందుకంటే మానవులను దేవుడు సృష్టించాడు మరియు మనిషి శరీరం ఎలాంటి ఉష్ణోగ్రతలకు అనుగుణంగా ఉండగలదో దేవునికి బాగా తెలుసు. కానీ మనుష్యులకే తెలియదు. మనుష్యులకు తెలియదని నేను ఎందుకు అంటున్నాను? మనుష్యులు ఎలాంటి మూర్ఖపు పనులు చేశారు? అనేక మంది నిరంతరం ఉత్తర మరియు దక్షిణ ధ్రువాలను సవాలు చేయడానికి ప్రయత్నించలేదా? అలాంటి వ్యక్తులు భూమిని ఆక్రమించుకోవడానికి ఆ ప్రదేశాలకు వెళ్లాలని ఎల్లప్పుడూ అనుకున్నారు, దాంతో వారు అక్కడ మూలాలను నాటుకోవచ్చు. ఇది అర్ధంలేని చర్య అవుతుంది. ఒకవేళ నువ్వు ధ్రువాలను క్షుణ్ణంగా పరిశోధించినప్పటికీ, అప్పుడు ఏమవుతుంది? నీవు ఉష్ణోగ్రతలను తట్టుకోగలిగి, అక్కడ నివసించగలిగినప్పటికీ, నీవు దక్షిణ మరియు ఉత్తర ధ్రువాల జీవనానికి ప్రస్తుత పర్యావరణాన్ని “మెరుగు పరిచి” ఉంటే, అది మానవాళికి ఏ విధంగానైనా ప్రయోజనం చేకూర్చగలదా? మనుష్యులకు వారు అది జీవించగలిగే పర్యావరణం ఉంది, అయినప్పటికీ వారు అక్కడ నిమ్మలంగా, లోబడి ఉండరు, బదులుగా వారు జీవించలేని ప్రదేశాలకు వెళ్లే సాహసం కోసం పట్టదలతో ఉంటారు. దీని అర్థం ఏమిటి? వారు ఈ అనుకూలమైన ఉష్ణోగ్రతలోని జీవితంతో విసుగు, అసహనం చెందారు మరియు ఎన్నో ఆశీర్వాదాలను అనుభవించారు. అంతేకాకుండా, ఈ సాధారణ జీవన పర్యావరణాన్ని మనుష్యులు దాదాపు పూర్తిగా నాశనం చేశారు, కాబట్టి ఇప్పుడు వారు మరింత వినాశనం కలిగించడానికి దక్షిణ ధ్రువం మరియు ఉత్తర ధ్రువానికి కూడా వెళ్లవచ్చనీ లేదా ఏదైనా “కారణాన్ని”, అంటే “ప్రకాశించే ఒక కొత్త బాటకు” ఏదైనా మార్గాన్ని అణ్వేషించవచ్చని వారు అనుకుంటున్నారు. ఇది మూర్ఖత్వం కాదా? అంటే, ఈ మానవజాతి వారి పూర్వీకుడైన సాతాను నాయకత్వంలో, ఒకదాని తర్వాత మరొకటి అర్ధంలేని పనిని చేస్తూనే ఉంది, దేవుడు వారి కోసం సృష్టించిన అందమైన ఇంటిని నిర్లక్ష్యంగా మరియు కావాలని నాశనం చేస్తుంది. ఇది సాతాను చేస్తున్న పని. అదీగాక, భూమిపై మానవాళి మనుగడ కొంతవరకు ప్రమాదంలో పడిందని చూసి, అనేక మంది చంద్రుడిపై జీవించడానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేయాలని కోరుకుంటూ, అక్కడికి వెళ్లడానికి మార్గాలను అన్వేషిస్తారు. కానీ తుదకు, చంద్రుడిపై ఆక్సిజన్ లేదు. ఆక్సిజన్ లేకుండా మనుష్యులు జీవించగలరా? చంద్రుడిపై ఆక్సిజన్ లేకపోవడం వల్ల, అది మనిషి ఉండగలిగే ప్రదేశం కాదు, అయినప్పటికీ మనిషి అక్కడికి వెళ్లాలనే కోరికను విడిచిపెట్టలేదు. ఈ ప్రవర్తనను ఏమని పిలవాలి? ఇది స్వీయ విధ్వంసం కూడా, కాదంటారా? చంద్రుడు గాలి లేని ప్రదేశం, దాని ఉష్ణోగ్రత మానవ మనుగడకు తగినది కాదు-కాబట్టి, అది దేవుడు మనిషి కోసం పక్కన ప్రదేశం కాదు.
మన ప్రస్తుత అంశం, ఉష్ణోగ్రత, ప్రజలు వారి దైనందిన జీవితాలలో ఎదుర్కొనే విషయం. ఉష్ణోగ్రత అనేది మానవ శరీరాలన్నీ గ్రహించగలిగేది, కానీ ఉష్ణోగ్రత ఎలా వచ్చిందనే దాని గురించి లేదా దానికి ఎవరు బాధ్యత వహిస్తారు మరియు దానిని మానవ మనుగడకు తగినట్లుగా ఎవరు నియంత్రిస్తారు అనేదాని గురించి ఎవరూ ఆలోచించరు. ఇప్పుడు మనం తెలుసుకుంటున్నది ఇదే. దీనిలో దేవుని జ్ఞానం ఉందా? దీనిలో దేవుని చర్య ఉందా? (అవును.) మనిషి మనుగడకు అనువైన ఉష్ణోగ్రతతో కూడిన వాతావరణాన్ని దేవుడు సృష్టించడాన్ని పరిగణనలోకి తీసుకుంటే, దేవుడు సమస్త జీవులకు సమకూర్చే మార్గాలలో ఇది ఒక మార్గమా? అవును.
3. శబ్దం
మూడవ అంశం ఏమిటి? ఇది కూడా మనిషి అస్థిత్వం కోసం సాధారణ పర్యావరణంలో ఒక ముఖ్యమైన భాగం, ఇది దేవుడు సమస్త జీవులను సృష్టించినప్పుడు తప్పక ఏర్పాట్లు చేయాల్సి వచ్చిన ఒక అంశం. ఇది దేవునికి మరియు ప్రతి ఒక్క మనిషికి చాలా ముఖ్యమైనది. ఒకవేళ దేవుడు ఈ విషయంలో శ్రద్ధ తీసుకొని ఉండకపోతే, అది మానవాళి మనుగడకు ఎంతో అవరోధం కలిగించేది, అంటే ఇది మనిషి జీవితంపై మరియు అతని శరీరంపై చాలా ముఖ్యమైన ప్రభావాన్ని చూపి ఉండేది, మానవజాతి అలాంటి పర్యావరణంలో మనుగడ సాగించగలిగి ఉండేది కాదు. అలాంటి పర్యావరణంలో ఏ ప్రాణి కూడా మనుగడ సాగించగలిగి ఉండేది కాదని చెప్పవచ్చు. కాబట్టి, నేను మాట్లాడే ఈ అంశం ఏమిటి? నేను మాట్లాడుతున్న అంశం శబ్దం. దేవుడే సమస్తాన్ని సృష్టించాడు, సమస్తం దేవుని చేతుల్లోనే జీవిస్తుంది. దేవుని సృష్టిలోని సమస్త జీవులు ఆయన చూపులో జీవిస్తున్నాయి మరియు స్థిరమైన చలనంతో తిరుగుతున్నాయి. అంటే నా ఉద్దేశం, దేవుడు సృష్టించిన ప్రతి వస్తువుకు దాని ఉనికిలో విలువ మరియు అర్థం ఉన్నాయి; అంటే, ప్రతిదాని ఉనికికి సంబంధించి ఏదో ఒక ఆవశ్యకత ఉంటుంది. దేవుని దృష్టిలో, ప్రతి వస్తువు సజీవంగా ఉంది, ప్రతీది సజీవంగా ఉన్నందు వల్ల, వాటిలో ప్రతి ఒక్కటి శబ్దాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఉదాహరణకు, భూమి నిరంతరం తిరుగుతూ ఉంటుంది, సూర్యుడు నిరంతరం తిరుగుతూ ఉంటాడు మరియు చంద్రుడు కూడా నిరంతరం తిరుగుతూనే ఉంటాడు. సమస్త జీవులు పెరుగుతాయి, అభివృద్ధి చెందుతాయి మరియు కదులుతాయి కాబట్టి, అవి నిరంతరం శబ్దాన్ని విడుదల చేస్తాయి. భూమిపై ఉన్న దేవుని సృష్టిలోని సమస్త జీవులు నిరంతరం పెరుగుతాయి, అభివృద్ధి చెందుతాయి మరియు చలనంలో ఉంటాయి. ఉదాహరణకు, పర్వతాల ఆధారాలు కదులుతున్నాయి మరియు మారుతున్నాయి, సముద్రాల లోతులో ఉన్న సమస్త జీవులు ఈదుతున్నాయి, కదులుతున్నాయి. అంటే, ఈ ప్రాణులు, దేవుని దృష్టిలోని సమస్త జీవులు, నిర్ణయించిన నమూనాల ప్రకారం నిరంతరం, క్రమమైన చలనంలో ఉంటాయని అర్థం. కాబట్టి, చీకటిలో పెరిగే, అభివృద్ధి చెందే మరియు రహస్యంగా కదిలే ఈ విషయాలన్నింటి ద్వారా ఉనికిలోకి వచ్చినది ఏమిటి? ధ్వనులు-గొప్ప, శక్తివంతమైన శబ్దాలు. భూమి గ్రహానికి అవతల, అన్ని రకాల గ్రహాలు కూడా స్థిరమైన చలనంలో ఉంటాయి మరియు ఈ గ్రహాలపై ఉండే ప్రాణులు మరియు జీవులు కూడా నిరంతరం పెరుగుతూ, అభివృద్ధి చెందుతూ, కదులుతూ ఉంటాయి. అంటే, ప్రాణంతో ఉన్న మరియు ప్రాణం లేని అన్ని వస్తువులు నిరంతరం దేవుని చూపుతో ముందుకు కొనసాగుతున్నాయి, అవి కొనసాగుతున్నాయి కాబట్టి, వాటిలో ప్రతి ఒక్కటి కూడా శబ్దాన్ని విడుదల చేస్తాయి. దేవుడు ఈ ధ్వనుల కోసం కూడా ఏర్పాట్లు చేశాడు, ఆయన చేయడానికి గల కారణం మీకు ఇప్పటికే తెలుసునని నేను నమ్ముతున్నాను, మీకు తెలియదా? నీవు విమానానికి దగ్గరగా వచ్చినప్పుడు, దాని యంత్రం మోత మీపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? మీరు దాని దగ్గర ఎక్కువసేపు ఉంటే, మీ చెవులకు చెవుడు వస్తుంది. మీ హృదయం విషయమేమిటి-అలాంటి కఠినపరీక్షను అది తట్టుకోగలదా? బలహీనమైన హృదయం ఉన్న కొందరు తట్టుకోలేరు. నిజానికి, గట్టి హృదయం గలవారు కూడా ఎక్కువసేపు తట్టుకోలేరు. అనగా, మానవ శరీరంపై శబ్ద ప్రభావం, అవి చెవులు కావచ్చు లేదా హృదయం కావచ్చు, ప్రతి మనిషికి చాలా ముఖ్యమైనది, చాలా బిగ్గరగా ఉండే శబ్దాలు ప్రజలకు హాని కలిగిస్తాయి. కాబట్టి, దేవుడు అన్నింటినీ సృష్టించినప్పుడు మరియు అవి సాధారణంగా పనిచేయడం ప్రారంభించిన తర్వాత, దేవుడు ఈ ధ్వనులకు, చలనంలో ఉన్న అన్ని వస్తువుల ధ్వనులకు తగిన ఏర్పాట్లు చేశాడు. మానవాళి కోసం పర్యావరణాన్ని సృష్టించేటప్పుడు దేవుడు పరిగణించాల్సి వచ్చిన సమస్యలలో ఇది కూడా ఒకటి.
మొదటిది, భూమి ఉపరితలం పైన ఉన్న వాతావరణం ఎత్తు శబ్దంపై ప్రభావం చూపుతుంది. అదనంగా, నేలలోని ఖాళీల పరిమాణం కూడా శబ్దాన్ని మార్చుతుంది మరియు ప్రభావితం చేస్తుంది. శబ్దాన్ని ప్రభావితం చేసే అనేక రకాల భౌగోళిక పర్యావరణాల సంగమాలు కూడా ఉన్నాయి. అనగా, మానవులు తమ చెవులు మరియు హృదయాలు తట్టుకోగలిగే వాతావరణంలో మనుగడ సాగించగలిగేలా, కొన్ని ధ్వనులను తొలగించడానికి దేవుడు కొన్ని పద్ధతులను ఉపయోగిస్తాడు. లేకపోతే, ధ్వనులు మనుష్యుల జీవితాల్లో పెద్ద ఇబ్బందిగా మారుతూ, వారికి తీవ్రమైన సమస్యగా మారుతూ, వారి మనుగడకు ఒక భారీ అడ్డంకిని కలిగిస్తాయి. అంటే, భూమి, వాతావరణం మరియు అనేక రకాల భౌగోళిక పర్యావరణాలను సృష్టించడంలో దేవుడు చాలా శ్రద్ధ చూపాడని మరియు వీటిలోని ప్రతి ఒక్కదానిలో దేవుని జ్ఞానం ఉందని దీనర్థం. దీని గురించి మానవజాతికి చాలా సవివరమైన అవగాహన ఉండవలసిన అవసరం లేదు-దీనిలో దేవుని చర్యలు ఉన్నాయని ప్రజలు తెలుసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మీరు నాకు చెప్పండి, దేవుడు చేసిన ఈ పని-మానవజాతి జీవన పర్యావరణాన్ని మరియు వారి సాధారణ జీవితాలను నిర్వహించడానికి శబ్దాన్ని ఖచ్చితంగా క్రమాంకనం చేయడమనేది-అవసరమేనంటారా? (అవును.) ఈ పని అవసరమైంది కాబట్టి, ఈ దృష్టికోణం నుండి, ఈ పనిని అన్నింటికీ సమకూర్చే మార్గంగా దేవుడు ఉపయోగించాడని చెప్పవచ్చా? దేవుడు మానవజాతి సౌలభ్యం కోసం అలాంటి ప్రశాంత పర్యావరణాన్ని సృష్టించాడు, తద్వారా మనిషి శరీరం ఎటువంటి ఆటంకానికి గురికాకుండా, దానిలో చాలా సాధారణంగా జీవించగలదు, దాంతో ఈ మానవజాతి ఉనికిలో ఉండగలదు, సాధారణంగా జీవించగలదు. దేవుడు మానవాళికి సమకూర్చే మార్గాలలో ఇది ఒకటి కాదా? ఇది దేవుడు చేసిన ఎంతో ముఖ్యమైన పని కాదా? (అవును.) దాని అవసరం చాలా ఉండేది. కాబట్టి దీనిని మీరు ఎలా అభినందిస్తారు? ఇది దేవుని చర్య అని మీరు భావించలేకపోయినప్పటికీ లేదా ఆ సమయంలో దేవుడు ఈ చర్యను ఎలా నిర్వహించాడో మీకు తెలియకపోయినప్పటికీ, దేవుడు ఈ పని చేయాల్సిన ఆవశ్యకతను మీరు గ్రహించగలరా? మీరు దేవుని జ్ఞానం, శ్రద్ధ మరియు ఆయన దానిలో పెట్టిన ఆలోచనను అనుభూతి చెందగలరా? (అవును, చెందగలము.) మీరు దీనిని అనుభూతి చెందగలిగితే చాలు. దేవుడు తాను సృష్టించిన వస్తువులలో చేసిన చర్యలు అనేకం ఉన్నాయి, వాటిని ప్రజలు అనుభూతి చెందలేరు లేదా చూడలేరు. మీరు దేవుని గురించి తెలుసుకునేలా, దేవుని చర్యల గురించి మీకు తెలియజేయడానికి మాత్రమే నేను దీన్ని చెప్పాను. ఇవి మీరు దేవుణ్ణి తెలుసుకోవడం మరియు అర్థం చేసుకోవడాన్ని మెరుగుపర్చే ఆధారాలు.
4. వెలుగు
నాలుగవ విషయం ప్రజల కళ్ళకు సంబంధించినది: వెలుగు. ఇది కూడా చాలా ముఖ్యమైనదే. మీరు ప్రకాశవంతమైన వెలుగును చూసినప్పుడు, దాని ప్రకాశం ఒక నిర్ణీత బలాన్ని చేరుకున్నప్పుడు, అది మనిషికి కళ్లు కనిపించకుండా చేయగలదు. అన్నింటికీ మించి, మనిషి కళ్ళు దేహానికే కళ్ళు. అవి చికాకును భరించలేవు. ఎవరైనా నేరుగా సూర్యుని వైపు చూసే సాహసం చేస్తారా? కొంతమంది దీనిని ప్రయత్నించారు, వారు సన్‌గ్లాసెస్ ధరించినట్లయితే, బాగానే చూడవచ్చు-కానీ దానికోసం ఒక సాధనాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. సాధనాలు లేకుండా, మనిషి ఉత్త కళ్ళు సూర్యుడిని ఎదుర్కోలేవు మరియు దానిని నేరుగా చూడలేవు. అయినప్పటికీ, మానవాళికి వెలుగును ఇవ్వడానికి దేవుడు సూర్యుణ్ణి సృష్టించాడు మరియు ఈ వెలుగు కూడా ఆయన శ్రద్ధ తీసుకున్నదే. దేవుడు సూర్యుణ్ణి సృష్టించడం పూర్తి చేసి, ఎక్కడో ఉంచి, ఆపై దానిని మరిచిపోలేదు; దేవుడు వస్తువులను చేసే విధానం అది కాదు. ఆయన తన చర్యలలో చాలా జాగ్రత్తగా ఉంటాడు, వాటి గురించి పూర్తిగా ఆలోచిస్తాడు. దేవుడు మనుష్యులకు కళ్లను సృష్టించాడు, తద్వారా వారు చూడగలరు మరియు మనిషి వస్తువులను చూసే వెలుగు ప్రమాణాలను కూడా ఆయన ముందుగానే ఏర్పాటు చేశాడు. వెలుగు మరీ తక్కువగా ఉండి ఉంటే సరిగా ఉండేది కాదు. చాలా చీకటిగా ఉన్నప్పుడు, ప్రజలు వారి ముందున్న వారి వేళ్లను కూడా చూడలేరు, అప్పుడు వారి కళ్ళు వాటి పనితీరును కోల్పోతాయి, ఉపయోగం లేకుండా పోతాయి. అంతేగాకుండా మరీ ఎక్కువ ప్రకాశవంతమైన వెలుగు మనిషి కళ్ళు వేటినీ చూడలేనట్లుగా చేయగలవు, ఎందుకంటే ఆ ప్రకాశం తట్టుకోలేనిది. కాబట్టి, దేవుడు మనిషి కళ్లకు కావాల్సినంత వెలుగుతో మానవజాతి ఉనికికి సంబంధించిన పర్యావరణాన్ని సమకూర్చాడు-ఇది ప్రజల కళ్లకు హాని కలిగించే లేదా నష్టం చేసే మాట అటుంచి కనీసం వాటి పనితీరు కోల్పోయేలా కూడా చేయదు. కాబట్టే దేవుడు సూర్యుడు మరియు భూమి చుట్టూ మేఘాల పొరలను ఏర్పర్చాడు మరియు గాలి సాంద్రత ప్రజల కళ్ళు లేదా చర్మానికి హాని చేయగలిగే వెలుగు రకాలను సరిగ్గా వేరుచేయగలిగేలా చేశాడు-ఇవి ఒకదానికొకటి అనుగుణ్యమైనవి. అంతేగాకుండా, దేవుడు సృష్టించిన భూమి రంగులు సూర్యరశ్మిని, అన్ని రకాల ఇతర వెలుగులను ప్రతిబింబిస్తాయి మరియు మనిషి కళ్ళు స్వీకరించడానికి చాలా ప్రకాశవంతంగా ఉండే వివిధ రకాల వెలుగును తొలగించగలవు. అందువల్ల, ప్రజలు చాలా ముదురు రంగు సన్‌గ్లాసెస్ ధరించాల్సిన అవసరం లేకుండా బయట నడవగలుగుతారు మరియు వారి జీవితాన్ని కొనసాగించలుగుతారు. సాధారణ పరిస్థితులలో, మనిషి కళ్ళు వెలుగుతో ఇబ్బంది పడకుండా, వారి చూపు వెళ్లగలిగే పరిధిలో వస్తువులను చూడగలవు. అంటే వెలుగు మరీ తీక్షణంగా ఉండి ఉంటే లేదా మరీ మసకగా ఉండి ఉంటే బాగుండేది కాదు. అది చాలా మసకగా ఉండి ఉంటే, మనుష్యుల కళ్ళు దెబ్బతిని, కొంతకాలం తర్వాత, పాడైపోయేవి; అది చాలా ప్రకాశవంతంగా ఉండి ఉంటే, మనుష్యుల కళ్ళు దానిని తట్టుకోగలిగేవి కావు. ప్రజలకున్న ఈ వెలుగు మనిషి కళ్లు చూడడానికి అనువుగా ఉండాలి మరియు దేవుడు అనేక రకాల పద్ధతుల ద్వారా వెలుగు వల్ల మనిషి కళ్ళకు కలిగే నష్టాన్ని తగ్గించాడు; ఈ వెలుగు మనుష్యుల కళ్లకు ప్రయోజనం కలిగించినా లేదా బాధించినా, ప్రజలు తమ కళ్లను ఉపయోగించుకుంటూనే వారి జీవితపు చివరి అంకానికి చేరుకోవడానికి ఇది సరిపోతుంది. దీనిని పరిగణించడంలో దేవుడు నిశితంగా లేడా? అయినప్పటికీ దెయ్యం, సాతాను, అలాంటి పరిగణనలు దాని మనస్సులోకి ఎప్పుడూ రాకుండా ప్రవర్తిస్తుంది. సాతానుతో, వెలుగు ఎల్లప్పుడూ మరీ ప్రకాశవంతంగానైనా లేదా మరీ మసకగానైనా ఉంటుంది. సాతాను పని చేసేది ఇలాగే.
మానవజాతి మనుగడకు అనుకూలతను పెంచడానికి, వారు సాధారణంగా జీవించడానికి, అలాగే కొనసాగడానికి దేవుడు మానవ శరీరం అన్ని అంశాలకు-అంటే దాని చూపు, వినికిడి, రుచి, శ్వాస, భావాలు మొదలగువాటి కోసం వీటిని చేశాడు. మరోలా చెప్పాలంటే, దేవుడు సృష్టించిన ప్రస్తుత జీవన పర్యావరణం, మనుష్యుల మనుగడకు అత్యంత అనుకూలమైన మరియు ప్రయోజనకరమైన పర్యావరణం. ఇది పెద్ద విషయమనే పట్టింపు లేదని, ఇదంతా చాలా సాధారణమైన విషయమని కొందరు అనుకోవచ్చు. శబ్దం, వెలుగు మరియు గాలి అనేవి ప్రజలు తమ జన్మహక్కుగా భావించే విషయాలు, వారు పుట్టిన క్షణం నుండి వీటిని వారు అనుభవించారు. కానీ నీవు అనుభవించగలిగే ఈ విషయాల వెనుక దేవుడు పని చేస్తూనే ఉన్నాడు; ఇది మనుష్యులు అర్థం చేసుకోవలసిన విషయం, వారు తెలుసుకోవలసిన విషయం. ఈ విషయాలను అర్థం చేసుకోవడం లేదా వాటిని తెలుసుకోవడం అవసరం లేదని నీవు భావించినప్పటికీ, క్లుప్తంగా, దేవుడు వాటిని సృష్టించినప్పుడు, ఆయన వాటి గురించి చాలా ఆలోచించాడు, ఆయనకు ఒక ప్రణాళిక ఉంది, ఆయనకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ఆయన అల్పబుద్ధితో లేదా ఊరికే, మానవజాతిని జీవించడం కోసం, రెండవ ఆలోచన కూడా లేకుండా, అలాంటి పర్యావరణంలోకి తీసుకురాలేదు. ఈ చిన్న విషయాలలోని ప్రతిదాని గురించి నేను చాలా ఆర్భాటంగా మాట్లాడానని మీరు అనుకోవచ్చు, కానీ నా దృష్టిలో, మానవాళి కోసం దేవుడు సమకూర్చిన ప్రతి వస్తువు మానవాళి మనుగడకు అవసరమైనవే. దీనిలో దేవుని చర్య ఉంది.
5. గాలి ప్రవాహం
ఐదవ అంశం ఏమిటి? ఈ అంశం ప్రతి వ్యక్తి జీవితంలోని ప్రతి రోజుకు దగ్గరి సంబంధాన్ని కలిగి ఉంటుంది. మానవ జీవితానికి దానితో ఎంత దగ్గరి సంబంధం ఉందంటే, అది లేకుండా మానవ శరీరం ఈ భౌతిక ప్రపంచంలో జీవించలేదు. ఆ అంశమే గాలి ప్రవాహం. “గాలి ప్రవాహం” అనే నామవాచకాన్ని ఇప్పుడే విన్న ఎవరైనా అర్థం చేసుకోగలరు. అయితే, గాలి ప్రవాహం అంటే ఏమిటి? “గాలి ప్రవాహం” అనేది గాలి అలా ప్రవహించే కదలిక అని మీరు చెప్పవచ్చు. గాలి ప్రవాహం అనేది మానవ కన్ను చూడలేని గాలి. ఇది వాయువులు కదలడానికి ఒక మార్గం కూడా. అయినప్పటికీ, ఈ చర్చలో, “గాలి ప్రవాహం” ప్రాథమికంగా దేనిని సూచిస్తుంది? నేను దానిని చెప్పిన వెంటనే, మీరు అర్థం చేసుకుంటారు. ఈ భూమి భ్రమణం చెందినప్పుడు తనతోపాటు పర్వతాలు, సముద్రాలు మరియు సృష్టిలోని సమస్త వస్తువులను తీసుకెళ్తుంది, అది తిరిగినప్పుడు, వేగంగా తిరుగుతుంది. నీవు ఈ తిరగడాన్ని ఏమాత్రం అనుభూతి చెందనప్పటికీ, భూమి భ్రమణం ఉంటుంది. దాని భ్రమణం దేనిని కలిగిస్తుంది? నీవు పరిగెత్తేటప్పుడు, గాలి ప్రవహించి వేగంగా మీ చెవులను తాకదా? నీవు పరిగెత్తేటప్పుడు గాలి ఉత్పత్తికాగలిగితే, భూమి తిరిగేటప్పుడు గాలి ఎందుకు ఉత్పత్తి కాదు? భూమి తిరిగేటప్పుడు, సమస్త వస్తువులు చలనంలో ఉంటాయి. స్వయంగా భూమే చలనంలో ఉంటుంది మరియు ఒక నిర్దిష్ట వేగంతో తిరుగుతుంది, దానిపై ఉన్న సమస్త వస్తువులు కూడా నిరంతరం పెరుగుతూ మరియు అభివృద్ధి చెందుతూ ఉంటాయి. కాబట్టి, ఒక నిర్దిష్ట వేగంతో ఉండే కదలిక సహజంగానే గాలి ప్రవాహాన్ని పెంచుతుంది. “గాలి ప్రవాహం” అంటే నా ఉద్దేశం అదే. ఈ గాలి ప్రవాహం మనిషి శరీరాన్ని కొంతమేరకు ప్రభావితం చేయదా? టైపూన్లను తీసుకోండి: సాధారణ టైఫూన్లు ప్రత్యేకించి శక్తివంతమైనవి కావు, కానీ అవి తాకినప్పుడు, ప్రజలు కనీసం స్థిరంగా నిలబడలేరు అలాగే గాలిలో నడవడం వారికి కష్టంగా ఉంటుంది. ఒక్క అడుగు వేయడం కూడా కష్టంగా ఉంటుంది, కొందరు వ్యక్తులు గాలితో ఏదైనా ఒకదానిపై నెట్టివేయబడవచ్చు, కదలలేరు. గాలి ప్రవాహం మానవాళిని ప్రభావితం చేసే మార్గాలలో ఇది ఒకటి. భూమి మొత్తం మైదానాలతో కప్పబడి ఉంటే, భూమి మరియు సమస్త వస్తువులు తిరిగినప్పుడు, దాని వల్ల ఉత్పన్నమయ్యే గాలి ప్రవాహాన్ని మనిషి శరీరం అస్సలు తట్టుకోలేకపోయేది. అలాంటి పరిస్థితికి స్పందించడం మహాకష్టమై ఉండేది. నిజంగా ఇదే జరిగి ఉంటే, అలాంటి గాలి ప్రవాహం మనుష్యులకు హాని కలిగించడమే కాకుండా, మొత్తం విధ్వంసం చేసేది. అలాంటి పర్యావరణంలో మానవులు మనుగడ సాగించలేకపోయేవారు. అందుకే దేవుడు అలాంటి గాలి ప్రవాహాలను పరిష్కరించడానికి వివిధ భౌగోళిక పర్యావరణాలను తయారు చేశాడు—వివిధ పర్యావరణాలలో, గాలి ప్రవాహాలు బలహీనమవుతాయి, వాటి దిశ, వేగాన్ని మార్చుకుంటాయి మరియు వాటి ఉధృతిని మార్చుకుంటాయి. అందుచేతనే ప్రజలు పర్వతాలు, ఎత్తైన పర్వత శ్రేణులు, మైదానాలు, కొండలు, పరివాహక ప్రాంతాలు, లోయలు, పీఠభూములు మరియు మహా నదులు వంటి విభిన్న భౌగోళిక లక్షణాలను చూడవచ్చు. ఈ విభిన్న భౌగోళిక లక్షణాలతో, దేవుడు గాలి ప్రవాహ వేగం, దిశ మరియు ఉధృతిని మారుస్తాడు. మనుష్యులు జీవించగలిగే సాధారణ పర్యావరణం ఉండేలా, వేగం, దిశ మరియు ఉధృతి తగినవిధంగా ఉండేలా గాలి ప్రవాహాన్ని ప్రశాంతంగా వీచే గాలిలాగ తగ్గించడానికి లేదా మార్చడానికి ఆయన ఉపయోగించే పద్ధతి ఇదే. ఇది చేయవలసిన అవసరం ఉందా? (అవును.) ఇలాంటివి చేయడం మనుష్యులకు కష్టమైనవిగా అనిపించవచ్చు, కానీ దేవునికి ఇది సులువు, ఎందుకంటే ఆయన సమస్త విషయాలను గమనిస్తాడు. అతనికి సంబంధించినంత వరకు, మనుష్యులకు తగిన గాలి ప్రవాహంతో కూడిన పర్యావరణాన్ని సృష్టించడం అంత సులభం లేదా తేలిక కాదు. కాబట్టి, దేవుడు సృష్టించిన అలాంటి పర్యావరణంలో, ఆయన సృష్టిలోపల ప్రతి వస్తువు అనివార్యమైనది. ప్రతి వస్తువు అస్థిత్వానికి విలువ మరియు ఆవశ్యకత ఉంది. అయితే, ఈ సూత్రాన్ని సాతాను లేదా చెడగొట్టబడిన మానవజాతి అర్థం చేసుకోలేదు. నిష్పలమైన కలలతో, పర్వతాలను చదును చేస్తూ, లోయలను పూడుస్తూ మరియు సిమెంటు, కంకరతో కూడిన అరణ్యాలను సృష్టించడానికి చదునైన భూమిలో ఆకాశహర్మ్యాలను నిర్మిస్తూ వారు వినాశనాన్ని, అభివృద్ధిని మరియు దోపిడీని కొనసాగిస్తున్నారు. దేవుడు తాను తయారు చేసిన అత్యంత అనుకూలమైన పర్యావరణంలో మానవాళి సంతోషంగా జీవించగలదని, ఆనందంగా ఎదగగలదని మరియు ప్రతిరోజును సంతోషంగా గడపగలదని దేవుడు ఆశించాడు. అందుచేతనే మానవాళి జీవించే ఈ పర్యావరణాన్ని పరిగణించడంలో దేవుడు ఎలాంటి నిర్లక్ష్యాన్ని ఎప్పుడూ చూపలేదు. మనుష్యుల శరీరాలు మరియు వారి జీవన పర్యావరణం ప్రకృతి పరిస్థితుల నుండి ఎలాంటి జోక్యానికి లోనుకాకుండా మరియు దానికి బదులుగా, మానవాళి సహజంగా జీవించగలిగేలా, వృద్ధి చెందేలా మరియు సమస్త సృష్టితో సామరస్యపూర్వక సహజీవనం చేయగలిగేలా, ఉష్ణోగ్రత నుండి గాలి వరకు, శబ్దం నుండి వెలుగు వరకు దేవుడు సంక్లిష్టమైన ప్రణాళికలు మరియు ఏర్పాట్లు చేశాడు. ఇవన్నీ దేవుడు సమస్త సృష్టికి మరియు మానవాళికి అందించాడు.
మానవ మనుగడ కోసం దేవుడు ఈ ఐదు ప్రాథమిక పరిస్థితులను ఏర్పాటు చేసిన విధానంలో, ఆయన మానవాళికి ఎలా సమకూరుస్తున్నాడో మీరు చూడగలరా? (అవును.) అంటే, మనిషి మనుగడకు అత్యవసర ప్రాథమిక పరిస్థితులన్నింటిని సృష్టించినవాడు దేవుడు మరియు వీటిని దేవుడు నిర్వహించడం మరియు నియంత్రించడం కూడా చేస్తున్నాడు; వేల సంవత్సరాల మానవ అస్థిత్వం తర్వాత, ఇప్పుడు కూడా, వారి జీవితాలు క్రమబద్ధంగా కొనసాగేలా చూడడానికి దేవుడు వారి జీవన పర్యావరణంలో నిరంతర మార్పులు చేస్తూ, వారికి అత్యుత్తమమైన మరియు అత్యంత అనుకూలమైన పర్యావరణాన్ని కల్పిస్తున్నాడు. అలాంటి పరిస్థితిని ఎంతకాలం నిర్వహించవచ్చు? మరోలా చెప్పాలంటే, దేవుడు అలాంటి పర్యావరణాన్ని సమకూర్చడం ఎంతకాలం కొనసాగించవచ్చు? దేవుడు తన నిర్వహణ కార్యాన్ని సంపూర్ణంగా పూర్తి చేసే వరకు ఇది కొనసాగుతుంది. ఆతర్వాత, దేవుడు మానవాళి జీవన పర్యావరణాన్ని మారుస్తాడు. ఆయన ఈ మార్పులను అవే పద్ధతులతో చేయవచ్చు లేదా వేరే పద్ధతులతో చేయవచ్చు, కానీ ప్రజలు ఇప్పుడు తెలుసుకోవలసింది ఏమిటంటే, దేవుడు మానవజాతి అవసరాలను నిరంతరం తీరుస్తున్నాడు; మానవజాతి జీవించే పర్యావరణాన్ని నిర్వహిస్తున్నాడు; మరియు ఆ పర్యావరణాన్ని సంరక్షిస్తున్నాడు, కాపాడుతున్నాడు మరియు నిర్వహిస్తున్నాడు అనేవే. అలాంటి పర్యావరణంలో, దేవుడు ఎంచుకున్న ప్రజలు క్రమ పద్ధతిలో జీవించగలరు మరియు దేవుని రక్షణ, శిక్ష మరియు తీర్పును అంగీకరించగలరు. దేవుని సార్వభౌమాధిపత్యం వల్ల సమస్త జీవులు మనుగడ సాగిస్తూనే ఉంటాయి మరియు దేవుని అలాంటి ఏర్పాట్ల కారణంగా సమస్త మానవాళి ముందుకు సాగుతూనే ఉంటుంది.
మన సాంగత్యములోని ఈ చివరి భాగం మీలో ఏవైనా కొత్త ఆలోచనలు కలిగించిందా? దేవుడు మరియు మనిషి మధ్య ఉన్న ఈ అతిగొప్ప తేడాను ఇప్పుడు మీరు తెలుసుకున్నారా? అంతిమంగా, సమస్త జీవులకు ప్రభువు ఎవరు? మనిషా? (కాదు.) అలాంటప్పుడు సమస్త సృష్టితో దేవుడు మరియు మనష్యులు ఎలా వ్యవహరిస్తారు అనే దాని మధ్య తేడా ఏమిటి? (దేవుడు సమస్త జీవులను పాలిస్తాడు మరియు సమస్తాన్ని ఏర్పాటు చేస్తాడు, అదే మనిషి అయితే వాటిని అనుభవిస్తాడు.) మీరు దీనితో ఏకీభవిస్తారా? దేవుడు మరియు మానవాళి మధ్యగల గొప్ప తేడా, దేవుడు సమస్త సృష్టిని పరిపాలిస్తాడు మరియు దానికోసం సమకూరుస్తాడు. సమస్తానికీ ఆయనే మూలం మరియు దేవుడు సమస్త సృష్టికి సమకూరుస్తుండగా, మానవాళి దానిని అనుభవిస్తుంది. అంటే, దేవుడు అన్నింటికి ప్రసాదించిన జీవితాన్ని స్వీకరించినప్పుడు మనిషి సృష్టిలోని అన్నింటినీ అనుభవిస్తాడు. దేవుడే ప్రభువు మరియు మానవజాతి దేవుని సృష్టిలోని సమస్త వస్తువుల ఫలాలను అనుభవిస్తుంది. అలాంటప్పుడు, దేవుని సృష్టిలోని సమస్త విషయాల దృష్టికోణంలో చూస్తే, దేవునికి మరియు మానవాళికి మధ్య తేడా ఏమిటి? దేవుడు సమస్త జీవులు పెరిగే చట్టాలను స్పష్టంగా చూడగలడు మరియు ఆయన ఈ చట్టాలను నియంత్రిస్తాడు మరియు వాటి ఆధిపత్యం వహిస్తాడు. అంటే, సమస్త జీవులు దేవుని కనుచూపులో మరియు ఆయన పరిశీలన పరిధిలో ఉన్నాయి. మానవాళి సమస్త విషయాలను చూడగలదా? మనష్యులు చూడగలిగేది నేరుగా వారి ఎదురుగా ఉన్న వాటికే పరిమితం. నీవు ఒక పర్వతాన్ని అధిరోహిస్తే, నీవు చూసేది కేవలం ఆ పర్వతాన్నే. పర్వతానికి మరోవైపు ఏముందో నీవు చూడలేవు. నీవు సముద్ర తీరానికి వెళితే, నీవు చూసేది సముద్రపు ఒక అంచును మాత్రమే, సముద్రపు మరో వైపు ఎలా ఉందో నీవు తెలుసుకోలేవు. నీవు అడవిలోకి వెళితే, నీవు మీ ముందు మరియు నీ చుట్టుపక్కల ఉన్న వృక్షసంపదను మాత్రమే చూడగలవు, కానీ ఇంకా ముందు ఏముందో నీవు చూడలేవు. మనష్యులు ఎత్తైన, దూరంగా ఉన్న, లోతైన ప్రదేశాలను చూడలేరు. వారు చూడగలిగేది వారి ఎదురుగా ఉన్న, దృష్టి పరిధి లోపలి, వాటికే పరిమితం. మనష్యులకు ఏడాదిలో వచ్చే నాలుగు రుతువులను శాసించే చట్టం లేదా సమస్త జీవులు పెరగడానికి సంబంధించిన చట్టాలు తెలిసినప్పటికీ, వారు సమస్త విషయాలను నిర్వహించలేరు లేదా శాసించలేరు. అయినప్పటికీ, దేవుడు తన సృష్టి యావత్తును తానే నిర్మించిన యంత్రాన్ని చూసినట్టే చూస్తాడు. ఆయనకు ప్రతి భాగం మరియు ప్రతి సంబంధం గురించి, వాటి సూత్రాలను గురించి, వాటి తీరుల గురించి మరియు వాటి ఉద్దేశాల గురించి లోతుగా తెలుసు- దేవునికి ఇవన్నీ అత్యున్నత స్థాయి స్పష్టతతో తెలుసు. కాబట్టి దేవుడు దేవుడే, మనిషి మనిషే! మనిషి విజ్ఞానశాస్త్రం మరియు అన్ని విషయాలను నియంత్రించే చట్టాలను గురించి తన పరిశోధనలో లోతుగా వెళ్ళినప్పటికీ, ఆ పరిశోధన పరిధి పరిమితంగా ఉంటుంది, అదే దేవుడు ప్రతిదాన్నీ నియంత్రిస్తాడు. మనిషిపై, దేవుని నియంత్రణ అంతులేనిది. ఒక మనిషి తన జీవితమంతా దేవుని ఒక అతిచిన్న పనిని పరిశోధిస్తూ గడపవచ్చు, కానీ నిజమైన ఫలితాలు ఏవీ సాధించలేడు. కాబట్టే, నీవు జ్ఞానాన్ని మరియు నీవు దేవుడిని అధ్యయనం చేయడానికి నేర్చుకున్న వాటిని మాత్రమే ఉపయోగిస్తే, నీవు ఎప్పటికీ దేవుణ్ణి తెలుసుకోలేవు లేదా అర్థం చేసుకోలేవు. కానీ నీవు సత్యాన్ని అన్వేషించే మరియు దేవుణ్ణి అన్వేషించే మార్గాన్ని ఎంచుకుంటే, దేవుడిని తెలుసుకోవాలనే దృష్టికోణం నుండి చూస్తే, ఒక రోజు, దేవుని చర్యలు మరియు జ్ఞానం ప్రతిచోటా ఉన్నాయని ఒక్కసారిగా నీవు గుర్తిస్తావు మరియు దేవుడిని సమస్త విషయాలకు ప్రభువనీ, సమస్త జీవులకు ప్రాణాధారమనీ ఎందుకు పిలుస్తారో నీవు తెలుసుకుంటావు. నీవు అలాంటి అవగాహన ఎంత ఎక్కువ పొందుతావో, దేవుడు సమస్త విషయాలకు ప్రభువని ఎందుకు పిలుస్తారో నీవు అంత ఎక్కువ అర్థం చేసుకుంటావు. సమస్త విషయాలు మరియు ప్రతి ఒక్కటీ, నీతో సహా, నిరంతరం దేవుడు సమకూర్చే స్థిర ప్రవాహాన్ని పొందుతున్నాయి. ఈ ప్రపంచంలో మరియు ఈ మానవాళి మధ్య, అందరినీ పరిపాలించే, నడిపించే మరియు నిర్వహించే సామర్థ్యం మరియు గుణగణాలుగల వారు దేవుడు కాకుండా మరొకరు ఎవరూ లేరని కూడా నీవు స్పష్టంగా గ్రహించగలవు. నీకు ఈ అవగాహన కలిగినప్పుడు, దేవుడు నీ దేవుడేనని నీవు నిజంగా గుర్తిస్తావు. నీవు ఈ స్థితికి చేరుకున్నప్పుడు, నీవు దేవుడిని నిజంగా అంగీకరించి, ఆయనను నీ దేవుడిగా మరియు నీ ప్రభువుగా అనుమతించి ఉంటావు. నీవు అలాంటి అవగాహన పొందినప్పుడు, నీ జీవితం అలాంటి స్థితికి చేరుకున్నప్పుడు, దేవుడు ఇకపై నిన్ను పరీక్షించడు మరియు నీకు తీర్పునివ్వడు లేదా ఆయన నీ నుండి ఎలాంటి కోరిక కోరడు, ఎందుకంటే నీవు దేవుణ్ణి అర్థం చేసుకుంటావు, ఆయన హృదయాన్ని తెలుసుకుంటావు మరియు నీ హృదయంలో దేవుణ్ణి నిజంగా అంగీకరించి ఉంటావు. సమస్త విషయాలపై దేవుని ఆధిపత్యం మరియు నిర్వహణకు సంబంధించిన ఈ అంశాలపై సాంగత్యము చేయడానికి ఇది ఒక ముఖ్యమైన కారణం. అలా చేయడమనేది ప్రజలకు మరింత జ్ఞానం మరియు అవగాహన అందించడానికి ఉద్దేశించబడింది-కేవలం నీవు గుర్తించడం కోసమే కాకుండా, నీవు మరింత ఆచరణాత్మక మార్గంలో దేవుని చర్యలను తెలుసుకోవడం మరియు అర్థం చేసుకోవడం కోసం.
మానవాళి కోసం దేవుడు తయారుచేసే దైనందిన అన్నపానీయాలు
ఇప్పుడే మనం పర్యావరణంలో కొంత భాగం గురించి సాధారణంగా మాట్లాడుకున్నాము, మరీ ముఖ్యంగా, దేవుడు ప్రపంచాన్ని సృష్టించినప్పుడు సిద్ధం చేసిన, మానవ మనుగడకు అవసరమైన పరిస్థితుల గురించి. మనం ఐదు విషయాలు, పర్యావరణంలోని పంచభూతాల గురించి మాట్లాడుకున్నాము. మన తర్వాతి అంశం ప్రతి మనిషి భౌతిక జీవితంతో దగ్గరి సంబంధం కలిగి ఉంటుంది, ఇది ఆ జీవితానికి మరింతగా సంబంధించినదై మరియు మునుపటి ఐదు అంశాల కంటే అవసరమైన ఎక్కువ షరతులను నెరవేర్చవలసినదై ఉంటుంది. అంటే, ఇది ప్రజలు తినే ఆహారానికి సంబంధించినది. దేవుడు మనిషిని సృష్టించి అతన్ని జీవించడానికి తగిన పర్యావరణంలో ఉంచాడు; ఆతర్వాత మనిషికి ఆహారం, నీరు అవసరమయ్యాయి. మనిషికి ఈ అవసరం ఏర్పడింది, కాబట్టి దేవుడు అతని కోసం తగిన ఏర్పాట్లు చేశాడు. కాబట్టి, దేవుని కార్యపు ప్రతి దశ మరియు ఆయన చేసే ప్రతి పని ఊరికే చెబుతున్న మాటలు కాకుండా నిజమైన, ఆచరణాత్మకమైన చర్య తీసుకోబడుతున్నది. ప్రజల దైనందిన జీవితంలో ఆహారం తప్పనిసరియైనది కాదా? గాలి కంటే ఆహారం ముఖ్యమైనదా? అవి రెండూ సమానంగా ముఖ్యమైనవి. మనిషి మనుగడకు మరియు మానవ జీవితపు కొనసాగింపు పరిరక్షణకు రెండూ అవసరమైన పరిస్థితులు మరియు పదార్థాలు. ఏది ఎక్కువ ముఖ్యమైనది-గాలా లేదా నీరా? ఉష్ణోగ్రతా లేదా ఆహారమా? అవన్నీ సమానంగా ముఖ్యమైనవి. ప్రజలు వాటిలో కొన్నింటిని ఎంచుకోలేరు, ఎందుకంటే వాటిలో ఏదీ లేకపోయినా వారు ఉండలేరు. ఇది నిజమైన, ఆచరణాత్మకమైన సమస్య, నీవు వీటిలో ఒకదానిని ఎంచుకోవడం కాదు. నీకు తెలియదు, కానీ దేవునికి తెలుసు. నీవు ఆహారాన్ని చూసినప్పుడు, “నేను ఆహారం లేకుండా ఉండలేను!” అని అనుకుంటావు. కానీ నీవు సృష్టించబడిన వెనువెంటనే, నీకు ఆహారం అవసరమని నీకు తెలుసా? నీకు అప్పడు తెలియదు, కానీ దేవునికి తెలుసు. నీకు ఆకలి వేసినప్పుడు, నీవు తినడానికి చెట్లపై పండ్లను మరియు నేలపై ధాన్యాన్ని చూసినప్పుడు మాత్రమే నీకు ఆహారం అవసరమని నీవు తెలుసుకున్నావు. నీకు దాహం వేసి, నీటి ఊటను చూసినప్పుడు మాత్రమే-నీవు తాగినప్పుడు మాత్రమే నీకు నీరు అవసరమని నీవు తెలుసుకున్నావు. దేవుడు మానవాళి కోసం ముందుగానే నీటిని సిద్ధం చేశాడు. ఆహారం, ఎవరైనా రోజూ మూడు పూటలు లేదా రెండు పూటలు లేదా అంతకంటే ఎక్కువ తిన్నా, ఆహారమనేది క్లుప్తంగా, వారి దైనందిన జీవితంలో మనుష్యులకు తప్పనిసరియైనది. మానవ శరీర సాధారణ, నిరంతర మనుగడను కొనసాగించడానికి అవసరమైన వాటిలో ఇది ఒకటి. అయితే, అత్యధిక ఆహారం ఎక్కడ నుండి వస్తుంది? మొదట, ఇది మట్టి నుండి వస్తుంది. మానవజాతి కోసం దేవుడు ముందుగానే మట్టిని సిద్ధం చేశాడు, ఇది చెట్లు లేదా గడ్డి మాత్రమే కాకుండా అనేక రకాల మొక్కలు జీవించడానికి అనుకూలమైనది. మానవాళి కోసం దేవుడు అన్ని రకాల ధాన్యాల విత్తనాలను, అనేక రకాల ఇతర ఆహారాల విత్తనాలను సిద్ధం చేశాడు మరియు ఆయన మానవాళి విత్తడానికి తగిన మట్టి మరియు నేలను ఇచ్చాడు, వీటితో మానవాళి ఆహారం పొందుతుంది. అనేక రకాల ఆహారాలు ఏమిటి? బహుశా మీకు ఇప్పటికే తెలిసి ఉండవచ్చు. మొదట, అనేక రకాల ధాన్యాలు ఉన్నాయి. ఏ వివిధ రకాల ధాన్యాలు ఉన్నాయి? గోధుమ, కొర్రలు, గ్లూటిన్ గల చిరుధాన్యాలు, వరిగలు మరియు ఇతర రకాల పొట్టు ధాన్యాలు. దక్షిణం నుండి ఉత్తరం వరకు గల అన్ని రకాల తృణధాన్యాలు కూడా ఉన్నాయి: బార్లీ, గోధుమలు, ఓట్లు, బుక్వీట్ మొదలైనవి. వివిధ ప్రాంతాలలో సాగు చేయడానికి వివిధ జాతులు అనుకూలమైనవి. అనేక రకాల బియ్యం కూడా ఉన్నాయి. దక్షిణ ప్రాంతానికి దాని సొంత రకాలు ఉన్నాయి, అవి పొడవైన ధాన్యం, ఇవి దక్షిణాది ప్రజలకు అనుకూలమైనవి, ఎందుకంటే అక్కడ వేడి వాతావరణం ఉంటుంది, అంటే స్థానిక ప్రజలు, జిగురు ఎక్కువ లేని ఇండికా బియ్యం వంటి రకాలను తినాలి. వారి అన్నం చాలా జిగురుగా ఉండకూడదు, అలా ఉంటే వారికి ఆకలి వేయదు కాబట్టి వాటిని తినలేరు. ఉత్తరాది ప్రజలు జిగురుగా ఉండే అన్నం తింటారు, ఎందుకంటే ఉత్తర ప్రాంతం ఎప్పుడూ చల్లగా ఉంటుంది, కాబట్టి అక్కడి ప్రజలు ఎక్కువగా జిగురుగా ఉండే వాటిని తినాలి. తరువాత, అనేక రకాల నేల మీద పెరిగే బీన్స్ మరియు భూమి లోపల పెరిగే బంగాళదుంపలు, చిలగడదుంపలు, చామదుంపలు మరియు అనేక ఇతర రకాల వంటి దుంప కూరగాయలు కూడా ఉన్నాయి. ఉత్తరాదిన చాలా నాణ్యమైన బంగాళాదుంపలు పెరుగుతాయి. ప్రజలకు తినడానికి ధాన్యం లేనప్పుడు, ప్రధాన ఆహారంగా బంగాళదుంపలు, వారు రోజు మూడు పూటలా తినేలా చేయగలవు. బంగాళాదుంపలు ఆహార నిల్వగా కూడా ఉపయోగించబడవచ్చు. చిలగడదుంపల నాణ్యత బంగాళాదుంపల నాణ్యత కంటే కొంత తక్కువగా ఉంటుంది, అయినా రోజుకు మూడు పూటలా భోజనం చేయడానికి వీటిని కూడా ప్రధాన ఆహారంగా ఉపయోగించవచ్చు. ధాన్యం దొరకడం కష్టమైనప్పుడు, చిలగడదుంపలతో ప్రజలు ఆకలి తీర్చుకోవచ్చు. దక్షిణాది ప్రజలు ఎక్కువగా తినే చామదుంపలను కూడా అదే విధంగా ఉపయోగించవచ్చు, దీనిని కూడా ప్రధాన ఆహారంగా ఉపయోగించవచ్చు. ఇలాంటి అనేక విభిన్న పంటలు ఉన్నాయి, ఇవి ప్రజల రోజువారీ ఆహారం మరియు పానీయాలలో ఆవశ్యమైన భాగాలు. నూడుల్స్, ఉడికించిన బన్నులు, బియ్యం మరియు బియ్యపు నూడుల్స్ తయారు చేయడానికి ప్రజలు అనేక రకాల ధాన్యాలను ఉపయోగిస్తారు. ఈ రకరకాల ధాన్యాలను దేవుడు మానవాళికి విస్తారంగా ప్రసాదించాడు. అన్ని రకాలు ఎందుకు ఉన్నాయి అనేది దేవుని చిత్తానికి సంబంధించిన విషయం: అవి ఉత్తరం, దక్షిణం, తూర్పు మరియు పడమరలలోని విభిన్న నేలలు మరియు వాతావరణాలలో పెరగడానికి అనుకూలమైనవి; వాటిలోని అనేక రకాల మిశ్రమాలు మరియు పదార్థాలు మనిషి శరీరంలోని అనేక రకాల మిశ్రమాలు మరియు పదార్థాలకు అనుగుణంగా ఉంటాయి. ఈ ధాన్యాలు తినడం వల్ల మాత్రమే ప్రజలు వారి శరీరానికి అవసరమైన అనేక రకాల పోషకాలు మరియు పదార్థాలను పొందగలరు. ఉత్తరాది ఆహారం మరియు దక్షిణాది ఆహారం భిన్నంగా ఉంటుంది, కానీ దానిలో తేడాల కంటే ఎంతో ఎక్కువ సారూప్యతలు ఉన్నాయి. ఆ రెండు రకాలు కూడా మనిషి శరీరపు సాధారణ అవసరాలను తీర్చగలవు మరియు దాని సాధారణ మనుగడకు సహాయపడగలవు. కాబట్టి, ప్రతి ప్రాంతంలో ఉత్పత్తి చేయబడిన జాతులు విస్తారంగా ఉన్నాయి, ఎందుకంటే మనషి భౌతిక శరీరానికి ఈ విభిన్న ఆహారాలలో ఉన్న పదార్థాలు అవసరం-శరీరపు సాధారణ అస్థిత్వాన్ని కాపాడడానికి మట్టి నుండి పెరిగిన ఈ అనేక రకాల ఆహారాలతో అవి సరఫరా చేయబడాలి, అవి మనిషి సాధారణ జీవితం గడపడానికి దారితీస్తాయి. క్లుప్తంగా, దేవుడు మానవాళి పట్ల చాలా దయతో ఉన్నాడు. దేవుడు ప్రజలకు ప్రసాదించిన అనేక రకాల ఆహారాలు వైవిధ్యం లేనివి కావు-దానికి బదులుగా, అవి ఎంతో ఎంచుకోదగినవి. ప్రజలు తృణధాన్యాలు తినాలనుకుంటే, వారు తృణధాన్యాలు తినవచ్చు. కొంతమంది గోధుమల కంటే బియ్యాన్ని ఇష్టపడతారు, గోధుమలను ఇష్టపడరు, వారు బియ్యం తినవచ్చు. అన్ని రకాల బియ్యం-పొడవు ధాన్యం, పొట్టి ధాన్యం-ఉన్నాయి, అన్నీ ప్రజల ఆకలిని తీర్చగలవు. అందువల్ల, ప్రజలు ఈ ధాన్యాలను తింటే-వారు తమ ఆహారం పట్ల మరీ ప్రత్యేకంగా ఉండనంత కాలం-వారికి పోషకాహార కొరత ఉండదు అలాగే వారు మరణించేంత వరకు ఆరోగ్యంగా జీవిస్తారని భరోసా ఇవ్వబడుతుంది. దేవుడు మానవాళికి ఆహారాన్ని ప్రసాదించినప్పుడు ఆయన మనసులో ఉన్న ఆలోచన అది. ఇవి లేకుండా మనిషి శరీరం ఉండలేదు-ఇది వాస్తవం కాదా? ఇవి మనిషి స్వయంగా పరిష్కరించుకోలేని ఆచరణాత్మక సమస్యలు, కానీ దేవుడు వారి కోసం సిద్ధంగా ఉన్నాడు: ఆయన వారి గురించి ముందే ఆలోచించి మానవజాతి కోసం ఏర్పాట్లు చేశాడు.
అయితే దేవుడు మానవాళికి ఇచ్చినది అంతే కాదు-ఆయన మానవాళికి కూరగాయలు కూడా ఇచ్చాడు! అన్నంతో, నీవు తినేదంతా అన్నమే అయితే, ఇంకేమీ తినకపోతే, నీకు తగినన్ని పోషకాలు లభించకపోవచ్చు. మరోవైపు, మీరు కొన్ని కూరగాయలను వేయించి లేదా మీ భోజనంతో పాటు సలాడ్‌ను తింటే, కూరగాయలలోని విటమిన్లు, వాటిలోని అనేక రకాల సూక్ష్మ మూలకాలు మరియు ఇతర పోషకాలు సహజంగానే నీ శరీర అవసరాలను తీర్చగలవు. ప్రజలు భోజనాల మధ్య కొన్ని పండ్లను కూడా తినవచ్చు, తినకూడదా? కొన్నిసార్లు, ప్రజలకు ఎక్కువ ద్రవాలు లేదా ఇతర పోషకాలు లేదా విభిన్న రుచులు కావాలి, ఈ కోరికలను తీర్చడానికి పండ్లు మరియు కూరగాయలు ఉన్నాయి. ఉత్తరం, దక్షిణం, తూర్పు మరియు పడమర దిక్కున వేరువేరు నేలలు మరియు వాతావరణాలు ఉన్నందున, అవి వివిధ రకాల కూరగాయలు మరియు పండ్లను ఉత్పత్తి చేస్తాయి. దక్షిణాన వాతావరణం విపరీతంగా వేడిగా ఉన్నందున, అక్కడి చాలా పండ్లు మరియు కూరగాయలు చల్లదనం కలిగించే రకానికి చెందినవి, వీటిని తిన్నప్పుడు, అవి మనిషి శరీరంలో చలిని మరియు వేడిని సమతుల్యం చేయగలవు. దీనికి విరుద్ధంగా, ఉత్తరాదిలో తక్కువ రకాల కూరగాయలు మరియు పండ్లు ఉన్నాయి, అయినప్పటికీ స్థానిక ప్రజలు ఆస్వాదించడానికి సరిపోతాయి. అయినప్పటికీ, ఇటీవలి కాలంలో సమాజంలో వచ్చిన మార్పులు మరియు సామాజిక పురోగతి అని చెప్పబడే దాని కారణంగా, అలాగే ఉత్తరం, దక్షిణం, తూర్పు మరియు పశ్చిమ ప్రాంతాలను కలిపే కమ్యూనికేషన్ మరియు రవాణాలో అభివృద్ధి కారణంగా, ఉత్తరాది ప్రజలు కూడా కొన్ని దక్షిణాది పండ్లు మరియు కూరగాయలను లేదా దక్షిణాది ప్రాంతీయ ఉత్పత్తులను తినగలుగుతున్నారు, వారు సంవత్సరంలోని నాలుగు రుతువులలో అలా చేయవచ్చు. ఇవి ప్రజల ఆకలిని మరియు భౌతిక కోరికలను తీర్చగలిగినప్పటికీ, తెలియకుండానే వారి శరీరాలు రకరకాల స్థాయిలలో ప్రమాదానికి గురవుతాయి. ఎందుకంటే, దేవుడు మానవాళి కోసం తయారు చేసిన ఆహారాలలో, దక్షిణాది ప్రజల కోసం ఉద్దేశించిన ఆహారాలు, పండ్లు మరియు కూరగాయలు, అలాగే ఉత్తరాది ప్రజల కోసం ఉద్దేశించిన ఆహారాలు, పండ్లు మరియు కూరగాయలు ఉన్నాయి. అంటే, నీవు దక్షిణాదిన జన్మించి ఉంటే, దక్షిణాది ఆహారాలను తినడం నీకు అనువుగా ఉంటుంది. దక్షిణాన ప్రత్యేకమైన వాతావరణం ఉంటుంది కాబట్టి, దేవుడు ప్రత్యేకంగా ఈ ఆహారాలు, పండ్లు మరియు కూరగాయలను తయారు చేశాడు. ఉత్తరాది ప్రజల శరీరాలకు అవసరమైన ఆహారం ఉత్తరాదిన ఉంది. అయినప్పటికీ ప్రజలకు అమితమైన ఆకలి ఉన్నందున, వారికి తెలియకుండానే కొత్త సామాజిక పోకడల ఆటుపోట్లలో కొట్టుకుపోవడానికి వారు అలవాటుపడ్డారు మరియు వారు తెలియకుండానే ఈ నియమాలను ఉల్లంఘిస్తున్నారు. గతంలో కంటే వారి జీవితాలు మెరుగ్గా ఉన్నట్లు ప్రజలు భావించినప్పటికీ, ఈ రకమైన సామాజిక పురోగతి ఎక్కువ మందిలో శరీరాలకు కనిపించని రీతిలో హాని కలిగిస్తుంది. దేవుడు చూడాలనుకుంటున్నది ఇది కాదు, ఆయన మానవాళికి ఈ ఆహారాలు, పండ్లు మరియు కూరగాయలను సమకూర్చినప్పుడు ఆయన ఉద్దేశించినది ఇది కాదు. దేవుని నియమాలను ఉల్లంఘించడం ద్వారా మనష్యులు తమంతతామే ప్రస్తుత పరిస్థితికి కారణమయ్యారు.
అవన్నీ కాకుండా, దేవుడు మనుష్యులకు ప్రసాదించిన అనుగ్రహం నిజంగా విస్తారమైనది మరియు ప్రతి ప్రాంతంలో స్థానిక ఉత్పత్తి ఉంది. ఉదాహరణకు, కొన్ని ప్రాంతాలలో ఎర్రని ఖర్జూరాలు (జుజుబ్స్ అని కూడా అంటారు), మరికొన్ని ప్రాంతాలలో వాల్‌నట్‌లు అలాగే ఇంకొన్ని ప్రాంతాలలో వేరుశెనగలు లేదా అనేక రకాల ఇతర గింజలు సమృద్ధిగా ఉంటాయి. ఈ భౌతిక పదార్ధాలన్నీ మనిషి శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. కానీ దేవుడు మానవాళికి సరైన పరిమాణంలో, సరైన సమయంలో, సంవత్సరంలోని రుతువు మరియు కాలం ప్రకారం పదార్థాలను అందిస్తాడు. మానవజాతి భౌతిక ఆనందాన్ని ఆకాంక్షిస్తుంది, ఇది దేవుడు మానవాళిని సృష్టించినప్పుడు ఏర్పాటు చేసిన మానవ పెరుగుదల సహజ నియమాలను ఉల్లంఘించడాన్ని, నష్టం కలిగించడాన్ని సులభం చేస్తూ, విపరీతమైన తిండిపోతుతనాన్ని కలిగిస్తుంది. ఒక చెర్రీని ఉదాహరణగా తీసుకుందాం. అవి సుమారు జూన్ నాటికి పక్వానికి వస్తాయి. సాధారణ పరిస్థితుల్లో, ఆగస్టు నాటికి, చెర్రీలు ఇక ఉండవు. వాటిని కేవలం రెండు నెలలు మాత్రమే తాజాగా ఉంచవచ్చు, కానీ, శాస్త్రీయ పద్ధతులను ఉపయోగించి, ఇప్పుడు ప్రజలు ఆ కాలాన్ని వచ్చే ఏడాది చెర్రీల కాలం వరకు, పన్నెండు నెలలకు కూడా పొడిగించగలుగుతున్నారు. అనగా ఏడాది పొడవునా చెర్రీలు ఉంటాయని అర్థం. ఈ విషయం సాధారణమేనా? (కాదు.) అయితే చెర్రీస్ తినడానికి ఉత్తమ సీజన్ ఎప్పుడు? ఇది జూన్ నుండి ఆగస్టు వరకు ఉంటుంది. ఈ సమయం దాటితే, నీవు వాటిని ఎంత తాజాగా ఉంచినప్పటికీ, వాటి రుచి అలాగే ఉండదు లేదా అవి మానవ శరీరానికి అవసరమైన వాటిని అందించవు. గడువు తేదీ దాటిన తర్వాత, నీవు ఎలాంటి రసాయనాలను ఉపయోగించినప్పటికీ, సహజంగా పెరిగినప్పుడు వాటిలో ఉండే ప్రతిదాన్ని వాటిలో నీవు నింపలేవు. అంతేగాకుండా, రసాయనాలు మానవులకు చేసే హాని, వారు ఏమి ప్రయత్నించినా, ఎవరూ పరిష్కరించలేనిది లేదా మార్చలేనిది. కాబట్టి, ఈనాటి మార్కెట్ ఆర్థిక వ్యవస్థ ప్రజలకు ఏమి అందిస్తుంది? ప్రజల జీవితాలు మెరుగ్గా ఉన్నట్లు అనిపిస్తాయి, ప్రాంతాల మధ్య రవాణా చాలా సౌకర్యవంతంగా తయారైంది మరియు ప్రజలు నాలుగు రుతువులలో ఎప్పుడైనా అన్ని రకాల పండ్లు తినవచ్చు. ఉత్తరాది ప్రజలు అరటిపండ్లను, అలాగే దక్షిణాదికి చెందిన ఏవైనా ప్రాంతీయ వంటకాలు, పండ్లు లేదా ఇతర ఆహారాలను రోజూ తినవచ్చు. అయితే మానవాళికి దేవుడు ఇవ్వాలనుకునే జీవితం ఇది కాదు. ఈ రకమైన మార్కెట్ ఆర్థిక వ్యవస్థ వలన ప్రజల జీవితాలకు కొంత ప్రయోజనం కలుగవచ్చు, కానీ ఇది హాని కూడా కలిగిస్తుంది. మార్కెట్‌లో విస్తారంగా లభ్యత ఉన్నందున, అనేక మంది వారు ఏమి తింటున్నారో ఆలోచించకుండా తింటారు. ఈ ప్రవర్తన ప్రకృతి నియమాలను ఉల్లంఘిస్తుంది మరియు ఇది ప్రజల ఆరోగ్యానికి హానికరమైనది. కాబట్టి, మార్కెట్ ఆర్థిక వ్యవస్థ ప్రజలకు నిజమైన ఆనందాన్ని అందించలేదు. మీరే స్వయంగా చూడండి. మార్కెట్లో ద్రాక్షను నాలుగు రుతువులలోనూ విక్రయించడం లేదా? వాస్తవానికి, ద్రాక్ష కోసిన తర్వాత చాలా తక్కువ వ్యవధి వరకు మాత్రమే తాజాగా ఉంటుంది. మీరు వాటిని వచ్చే ఏడాది జూన్ వరకు ఉంచితే, వాటిని ఇంకా ద్రాక్ష అనే అనవచ్చా? లేదా వాటికి “చెత్త” అనే పేరు బాగుండదా? వాటిలో తాజా ద్రాక్షలో ఉండాల్సిన పదార్థం ఉండకపోవడం ఒక్కటే కాకుండా-వాటిలో రసాయన ఉత్పత్తులు ఎక్కువగా ఉంటాయి. ఒక ఏడాది తర్వాత, అవి ఇక ఏమాత్రం తాజాగా ఉండవు మరియు వాటిలో ఉన్న పోషకాలు ఎప్పుడో నశించిపోయి ఉంటాయి. ప్రజలు ద్రాక్షను తిన్నప్పుడు, వారికి ఈ అనుభూతి కలుగుతుంది: “మనం ఎంత అదృష్టవంతులం! ముప్పై ఏళ్ల కిందట ఈ రుతువులో మనం ద్రాక్ష తినగలిగేవారిమా? నీవు కావాలనుకున్నా, నీకు దొరికేవి కాదు! జీవితం ఇప్పుడు ఎంతో బాగుంది!” ఇది నిజంగా ఆనందమా? మీకు ఆసక్తిగా ఉంటే, రసాయనాలలో నిల్వచేయబడిన ద్రాక్ష గురించి మీ సొంత పరిశోధన చేయవచ్చు, అవి దేనితో తయారు చేయబడ్డాయో మరియు ఆ పదార్థాలు మనుష్యులకు ఉపయోగపడతాయో లేదో చూడవచ్చు. ధర్మశాస్త్ర యుగములో, ఇశ్రాయేలీయులు ఈజిప్టును వదిలి ప్రయాణిస్తున్నప్పుడు, దేవుడు వారికి కౌజు పిట్టలు మరియు మాన్నా ఇచ్చాడు. అయితే దేవుడు ఈ ఆహారాలను వారు నిల్వ చేసుకోవడానికి అనుమతించాడా? వారిలో కొందరు సంకుచిత స్వభావం గలవారు, తర్వాతి రోజు తినడానికి ఉండవని భయపడి, కొన్నింటిని పక్కన పెట్టారు. అప్పుడేమైంది? మరుసటి రోజు, అవి కుళ్ళిపోయాయి. నీవు ఆకలితో ఉండకుండా చూసేందుకు దేవుడు సన్నాహాలు చేశాడు కాబట్టి, నీవు కొన్నింటిని పక్కన పెట్టుకోవడాన్ని ఆయన అనుమతించడు. కానీ మనుష్యులకు అలాంటి విశ్వాసం లేదు లేదా వారికి దేవునిపై నిజమైన విశ్వాసం లేదు. వారు ఎల్లప్పుడూ తమ తెలివిని ఉపయోగించుకునే అవకాశం కోసం చూస్తారు మరియు మానవాళి కోసం దేవుని సన్నాహాల వెనుక ఉన్న అన్ని జాగ్రత్తలు మరియు ఆలోచనలను ఎప్పుడూ చూడలేరు. వారు అలా భావించలేరు, కాబట్టి వారు దేవునిపై పూర్తి విశ్వాసాన్ని ఉంచలేరు, వారు ఎప్పుడూ ఇలా ఆలోచిస్తుంటారు: “దేవుని చర్యలు విశ్వసనీయమైనవి కావు! దేవుడు మనకు కావాల్సినవి ఇస్తాడో లేదో, ఎప్పుడు ఇస్తాడో ఎవరికి తెలుసు! నేను ఆకలితో ఉన్నప్పుడు, దేవుడు ఇవ్వకపోతే, నేను ఆకలితో అలమటించనా? నాకు పోషకాహార లోపం రాదా? మనిషి విశ్వాసం ఎంత బలహీనంగా ఉందో చూడండి!
ధాన్యాలు, పండ్లు, కూరగాయలు మరియు అన్ని రకాల గింజలు-ఇవన్నీ శాఖాహార ఆహారాలు. అవి శాఖాహారాలు అయినప్పటికీ, వాటిలో మానవ శరీరానికి అవసరమైన తగినన్ని పోషకాలు ఉన్నాయి. అయినప్పటికీ, దేవుడు ఇలా చెప్పలేదు: “నేను మానవాళికి ఈ ఆహారాలను మాత్రమే ఇస్తాను. వారు వీటిని మాత్రమే తినాలి!” దేవుడు అక్కడితోనే ఆగిపోకుండా, మానవాళి కోసం ఇంకా ఎక్కువ రుచికరమైన అనేక ఆహారాలను సిద్ధం చేశాడు. మరి ఈ ఆహారాలు ఏమిటి? అవి మీలో ఎక్కువ మంది చూడగలిగే మరియు తినగలిగే వివిధ రకాల మాంసాలు మరియు చేపలు. ఆయన మనిషి కోసం అనేకానేక రకాల మాంసాలు మరియు చేపలను సంసిద్ధం చేశాడు. చేపలు నీటిలో జీవిస్తాయి, నీటిలో జీవించే చేపల మాంసం భూమిపై నివసించే జంతువుల మాంసం కంటే భిన్నంగా ఉంటుంది మరియు ఇది మనిషికి వివిధ రకాల పోషకాలను అందించగలదు. మనిషి శరీరంలో చలి మరియు వేడిని క్రమబద్ధం చేసే గుణాలు కూడా చేపలలో ఉన్నాయి, ఇవి మనిషికి ఎంతో ప్రయోజనకరమైనవి. కానీ రుచిగా ఉండే ఆహారాన్ని మరీ ఎక్కువగా తినకూడదు. నేను ఇంతకుముందే చెప్పినట్లుగా, ఆయన ప్రసాదించిన దాన్ని ప్రజలు సహజంగా, రుతువు మరియు కాలానుగుణంగా ఆస్వాదించగలిగేలా దేవుడు మానవాళికి సరైన సమయంలో సరైన పరిమాణంలో ప్రసాదిస్తాడు. ఇప్పుడు, పక్షుల ఉత్పత్తుల వర్గంలో ఏ రకమైన ఆహారాలు ఉన్నాయి? కోడి, కౌజు పిట్ట, పావురం మొదలైనవి. చాలా మంది బాతులు మరియు పెద్ద బాతులను కూడా తింటారు. దేవుడు ఇన్ని రకాల మాంసాలను అందించినప్పటికీ, ఆయన తాను ఎంచుకున్న ప్రజలకు కొన్ని నిబంధనలను విధించాడు మరియు ధర్మశాస్త్ర యుగములో వారి ఆహారంపై కొన్ని పరిమితులను విధించాడు. ఈ రోజుల్లో, ఈ పరిమితులు వ్యక్తిగత రుచి మరియు వ్యక్తిగత అవగాహనపై ఆధారపడి ఉన్నాయి. ఈ వివిధ మాంసాలు ప్రొటీన్లు, ఐరన్ అవసరాలను సంతృప్తిపరుస్తూ, రక్తాన్ని సమృద్ధం చేస్తూ, కండరాలు మరియు ఎముకలను బలోపేతం చేస్తూ మరియు శరీర బలాన్ని పెంచుతూ, మనిషి శరీరానికి వైవిధ్యభరితమైన పోషకాలను అందిస్తాయి. వీటిని ప్రజలు ఎలా వండుతారు, తింటారు అనేదాంతో సంబంధం లేకుండా, ఈ మాంసాలు ప్రజల కడుపులను నింపడంతోపాటు, వారి ఆహార రుచిని మెరుగుపరచడంలో మరియు వారి ఆకలిని పెంచడంలో సహాయపడగలవు. మరీ ముఖ్యంగా, ఈ ఆహారాలు మనిషి శరీరానికి అవసరమైన రోజువారీ పోషకాలను అందించగలవు. మానవాళి కోసం దేవుడు ఆహారాన్ని సిద్ధం చేసినప్పుడు ఆయన దీనిని పరిగణనలోకి తీసుకున్నాడు. కూరగాయలు ఉన్నాయి, మాంసం ఉంది-ఇది సమృద్ధికరంగా లేదా? అయితే, దేవుడు మానవాళి కోసం ఆహారాలన్నింటినీ సిద్ధం చేసినప్పుడు ఆయన ఉద్దేశం ఏమిటో ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇది మానవజాతి ఈ ఆహారాలలో అతిగా మునిగితేలడం కోసమా? ఈ భౌతిక వాంఛలను తీర్చుకునే ప్రయత్నంలో మనిషి చిక్కుకపోయినప్పుడు ఏమవుతుంది? అతనికి మితిమీరిన పోషణ అందదా? మితిమీరిన పోషణ మానవ శరీరానికి అనేక విధాలుగా నష్టం కలిగించదా? (అవును.) అందుకోసమే దేవుడు సరైన సమయంలో సరైన పరిమాణంలో పంచిపెడతాడు మరియు ప్రజలు వివిధ కాలాలు మరియు రుతువులకు అనుగుణంగా వివిధ ఆహారాలను ఆస్వాదిస్తారు. ఉదాహరణకు, ఎంతో వేడిగల వేసవి తర్వాత, ప్రజల శరీరాలలో చాలా వేడి చేరడంతోపాటు, రోగకారక పొడిదనం మరియు తేమ కూడా చేరుతుంది. శరదృతువు వచ్చినప్పుడు, ఎన్నో రకాల పండ్లు పండుతాయి, ప్రజలు ఈ పండ్లను తిన్నప్పుడు, వారి శరీరంలోని తేమ బయటకు పంపబడుతుంది. ఈ సమయంలో, పశువులు మరియు గొర్రెలు కూడా బలంగా పెరుగుతాయి, కాబట్టి ప్రజలు పోషకాహారం కోసం ఎక్కువ మాంసం తినాల్సిన సమయం ఇదే. రకరకాల మాంసం తినడం ద్వారా, చలికాలంలో చలిని తట్టుకోవడానికి అవసరమైన శక్తి మరియు వెచ్చదనాన్ని వ్యక్తుల శరీరాలు పొందుతాయి, ఫలితంగా వారు చలికాలాన్ని సురక్షితంగా మరియు ఆరోగ్యవంతంగా దాటగలుగుతారు. అత్యంత జాగ్రత్త మరియు ఖచ్చితత్వంతో, మానవాళికి ఏమి అందించాలో, ఎప్పుడు అందించాలో, ఆయన వివిధ ఆహారాలను ఎప్పుడు పెంచాలో, ఎప్పుడు కాయలు కాయలో, పండ్లుగా మారాలో దేవుడు నియంత్రిస్తాడు మరియు సమన్వయపరుస్తాడు. ఇది “మనిషికి దైనందిన జీవితంలో అవసరమైన ఆహారాన్ని దేవుడు ఎలా సిద్ధం చేస్తాడు” అనేదానికి సంబంధించినది. అనేక రకాల ఆహారాలకు అదనంగా, దేవుడు మానవాళి కోసం నీటి వనరులను కూడా అందిస్తాడు. తిన్న తర్వాత కూడా ప్రజలకు నీరు తాగాల్సిన అవసరం ఉంటుంది. దీనికి పండ్లు మాత్రమే సరిపోతాయా? కేవలం పండ్లతో మాత్రమే ప్రజలు జీవించలేరు, అంతేగాకుండా కొన్ని రుతువులలో పండ్లు ఏవీ ఉండవు. కాబట్టి, మానవాళికున్న నీటి సమస్యను ఎలా పరిష్కరించవచ్చు? సరస్సులు, నదులు మరియు నీటి ఊటలతో సహా భూమి పైన, లోపల అనేక నీటి వనరులను సిద్ధం చేసి దేవుడు దానిని పరిష్కరించాడు. ఈ నీటి వనరులు కలుషితం కానంత వరకు, ప్రజలు వాటిని చెడగొట్టనంత వరకు లేదా పాడుచేయనంత వరకు తాగడానికి పనికొస్తాయి. మరోలా చెప్పాలంటే, ప్రజల జీవితాలు సమున్నతంగా, సమృద్ధిగా ఉండేలా మరియు దేనిలోనూ లోటు లేకుండా ఉండేలా చేయడానికి, మానవజాతి భౌతిక శరీరాల మనుగడను నిలబెట్టడానికి ఆహార వనరులకు సంబంధించి, దేవుడు చాలా సూక్ష్మమైన, చాలా ఖచ్చితమైన మరియు ఎంతో అనువైన సన్నాహాలు చేశాడు. ఇది ప్రజలు అనుభూతి చెందగలిగిన మరియు చూడగలిగిన విషయం.
అంతేగాకుండా, మానవ శరీరానికి కలిగే గాయాలను నయం చేయడానికి లేదా అనారోగ్యానికి చికిత్స చేయడానికి ప్రత్యేకంగా ఉద్దేశించబడిన కొన్ని మొక్కలు, జంతువులు మరియు వివిధ మూలికలను దేవుడు అన్నింటితోపాటు సృష్టించాడు. ఉదాహరణకు, ఎవరికైనా శరీరం కాలితే లేదా ప్రమాదవశాత్తు బొబ్బలు ఏర్పడితే ఏమి చేయాలి? నీవు కాలిన గాయాలను ఊరికే అలా నీటితో శుభ్రం చేయగలవా? నీవు ఏదైనా పాత గుడ్డ పీలికతో ఊరికే అలా చుట్టగలవా? నీవు అలా చేస్తే, గాయంలో చీము చేరవచ్చు లేదా ఇన్ఫెక్షన్ ఏర్పడవచ్చు. ఉదాహరణకు, ఎవరికైనా జ్వరం వస్తే లేదా జలుబు చేస్తే; పని చేసేటప్పుడు గాయపడితే; చెడు ఆహారం తినడం వలన కడుపులో రుగ్మత ఏర్పడితే; లేదా రక్తనాళాల వ్యాధులు, మానసిక పరిస్థితులు లేదా శరీర అంతర్గత అవయవాల వ్యాధులతో సహా జీవనశైలి కారకాలు లేదా భావోద్వేగ సమస్యల వల్ల కొన్ని వ్యాధులు కలిగితే, అప్పుడు వారి పరిస్థితులను నయం చేసే సంబంధిత మొక్కలు ఉన్నాయి. రక్త ప్రసరణను మెరుగుపరిచే మరియు రక్తప్రవాహపు అడ్డంకులను తొలగించే, నొప్పిని తగ్గించే, రక్తస్రావాన్ని తగ్గించే, నొప్పిలేకుండా చేసే మత్తు అందించే, చర్మాన్ని నయం చేసి, సాధారణ స్థితికి తీసుకువచ్చే, నిలిచిపోయిన రక్తాన్ని ప్రవహింపజేసే మరియు శరీరం నుండి విషపదార్థాలను తొలగించే మొక్కలు ఉన్నాయి-సంక్షిప్తంగా చెప్పాలంటే, ఈ మొక్కల వల్ల దైనందిన జీవితంలో ఉపయోగాలున్నాయి. ప్రజలు వాటిని ఉపయోగించవచ్చు మరియు అవసరమైనప్పుడు మానవ శరీరం కోసం ఉపయోగించడానికి వీటిని దేవుడు సిద్ధం చేశాడు. వాటిలో కొన్నింటిని మనిషి అనుకోకుండా కనుగొనడానికి దేవుడు అనుమతించాడు, మరికొన్ని అన్వేషించడానికి దేవుడు ఎంచుకున్న వ్యక్తులచే కనుగొనబడ్డాయి లేదా ఆయన రూపొందించిన ప్రత్యేక దృగ్విషయాల ఫలితంగా కనుగొనబడ్డాయి. ఈ మొక్కలను కనుగొన్న తర్వాత, మానవజాతి వాటిని తరువాతి తరాలకు అందిస్తుంది, ఈవిధంగా అనేకమంది వాటి గురించి తెలుసుకుంటారు. ఈ మొక్కలను దేవుడు సృష్టించడానికి విలువ మరియు అర్థం ఉంది. సంక్షిప్తంగా చెప్పాలంటే, ఇవన్నీ దేవుని నుండే వచ్చాయి, మానవజాతి జీవన పర్యావరణాన్ని సృష్టించినప్పుడే వాటిని ఆయన సిద్ధం చేశాడు మరియు నాటాడు. అవి అత్యవసరమైనవి. దేవుని ఆలోచనా ప్రక్రియలు మానవజాతి ఆలోచనా ప్రక్రియల కంటే ఎక్కువ పరిపూర్ణంగా ఉన్నాయా? దేవుడు చేసినదంతా నీవు చూసినప్పుడు, నీకు దేవుని ఆచరణాత్మక కోణం గురించి అవగాహన ఉందా? దేవుడు రహస్యంగా పనిచేస్తాడు. మనిషి ఈ లోకంలోకి ఇంకా రాకమునుపే, ఆయనకు మానవజాతితో సంబంధం లేనప్పుడే, దేవుడు వీటన్నింటిని సృష్టించాడు. దేవుడు మానవాళి కోసం సిద్ధం చేసిన ఈ సుసంపన్నమైన మరియు సమృద్ధమైన భౌతిక ప్రపంచంలో మానవజాతి ఆహారం లేదా దుస్తుల గురించి విచారించకుండా, దేనికీ కొరత లేకుండా, సంతోషంగా జీవించడానికి వీలుగా మానవజాతిని దృష్టిలో ఉంచుకుని, మానవజాతి ఉనికి కోసం మరియు వారి మనుగడ గురించి ఆలోచనతో ప్రతి ఒక్కటి చేయబడింది. అలాంటి పర్యావరణంలో, మానవజాతి పునరుత్పత్తి చేయగలదు మరియు మనుగడ కొనసాగించగలదు.
దేవుడు చేసిన పెద్ద మరియు చిన్న పనులన్నింటిలో, విలువ లేదా అర్థం లేనివి ఏవైనా ఉన్నాయా? ఆయన చేసే ప్రతిదానికీ విలువ మరియు అర్థం ఉంటాయి. ఒక సాధారణ విషయంతో మన చర్చను ప్రారంభిద్దాం. ప్రజలు తరచూ ఇలా అడుగుతారు: కోడి ముందా, గుడ్డు ముందా, ఏది ముందు వచ్చింది? (కోడి.) కోడి ముందు వచ్చింది, ఇందులో ఎలాంటి సందేహం లేదు! కోడి ముందు ఎందుకు వచ్చింది? గుడ్డే ముందు ఎందుకు రాలేకపోయింది? కోడి గుడ్డు నుండి పొదగబడలేదా? ఇరవై ఒక్క రోజులు పొదిగిన తర్వాత, కోడి వస్తుంది, ఆ కోడి తర్వాత ఎక్కువ గుడ్లు పెడుతుంది మరియు ఆ గుడ్ల నుండి ఎక్కువ కోళ్లు వస్తాయి. కాబట్టి, కోడి ముందు వచ్చిందా, గుడ్డు ముందు వచ్చిందా? మీరు పూర్తి ఖచ్చతత్వంతో “కోడి” అని జవాబు ఇచ్చారు. కానీ మీ జవాబు ఇదే ఎందుకని? (దేవుడు పక్షులను మరియు జంతువులను సృష్టించాడని బైబిల్ చెబుతుంది.) కాబట్టి, మీ జవాబు బైబిల్‌పై ఆధారపడి ఉంది. అలాకాకుండా మీరు మీ సొంత అవగాహన గురించి చెప్పాలని నేను కోరుకుంటున్నాను, మీరు అలా చెబితే మీకు దేవుని చర్యల గురించి ఏదైనా ఆచరణాత్మక జ్ఞానం ఉందా అని నేను చూడగలను. ఇప్పుడు, మీ జవాబు ఖచ్చితంగా సరైనదేనని మీరనుకుంటున్నారా? (దేవుడు కోడిని సృష్టించాడు, ఆపై దానికి పునరుత్పత్తి సామర్థ్యాన్ని, అంటే గుడ్లను పొదిగే సామర్థ్యాన్ని ఇచ్చాడు.) ఈ వివరణ అంతో ఇంతో సరైనది. ముందు కోడి వచ్చింది, ఆపై గుడ్డు వచ్చింది. ఇది ఖచ్చితం. ఇది ప్రత్యేకించి లోతైన రహస్యమేమీ కాదు, అయితే ప్రపంచంలోని ప్రజలు దీనిని రహస్యమైనదిగా పరిగణించి, ఎప్పటికీ ఒక నిర్ధారణకు రాకుండా, తాత్విక సిద్ధాంతాలతో పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు. ఇది ఎలా ఉందంటే, వాటిని దేవుడు సృష్టించాడని ప్రజలకు తెలియనట్లుగా ఉంది. వారికి ఈ ప్రాథమిక సూత్రం తెలియదు లేదా గుడ్డు ముందా లేదా కోడి ముందా అనేదాని గురించి స్పష్టమైన ఆలోచన కూడా వారికి లేదు. వారికి ఏది ముందు రావాల్సిందో తెలియదు, కాబట్టి వారు ఎప్పటికీ జవాబు కనుక్కోలేరు. కోడి ముందు రావడమనేది చాలా సహజం. కోడి కంటే ముందు గుడ్డు వచ్చి ఉంటే, అది అసాధారణమై ఉండేది! ఇది చాలా చిన్న విషయం-ఖచ్చితంగా కోడే ముందు వచ్చింది. ఇది అత్యున్నత పరిజ్ఞానం అవసరమైన ప్రశ్నే కాదు. మనిషి అనుభవించాలనే ఉద్దేశంతో దేవుడు ప్రతిదాన్ని సృష్టించాడు. కోడి ఉనికిలోకి వచ్చిన తర్వాత, గుడ్డు మామూలుగానే వస్తుంది.ఇది ఒక సిద్ధంగా ఉన్న జవాబు కాదా? ఒకవేళ గుడ్డు ముందు సృష్టించబడితే, మరి దానిని పొదగడానికి కోడి అవసరం లేదా? కోడిని నేరుగా సృష్టించడం అనేదే ఎంతో సిద్ధంగా ఉంచబడిన పరిష్కారం. ఈ విధంగా, కోడి గుడ్లు పెట్టగలదు, గుడ్డు లోపల నుండి కోడిపిల్లలను పొదగగలదు, దీంతో తినడానికి ప్రజలు కోడిమాంసాన్ని పొందగలరు. ఎంత సౌకర్యవంతంగా ఉందో! దేవుడు పనులు చేసే విధానం చక్కగా మరియు స్పష్టంగా ఉంటుంది, అస్సలు మెలికలు ఉండవు. గుడ్డు ఎక్కడ నుండి వస్తుంది? ఇది కోడి నుండి వస్తుంది. కోడి లేకుండా గుడ్డు లేదు. దేవుడు సృష్టించినది ఒక ప్రాణిని! మానవజాతి అర్థహీనమైనది మరియు హాస్యాస్పదమైనది, ఎప్పుడూ అలాంటి చిన్నచిన్న విషయాలలో చిక్కుకుపోతుంది మరియు అనేక అర్థంలేని అపోహలతో ముగుస్తుంది. మనిషి ఎంత పిల్లతనంగా ఉన్నాడు! గుడ్డు మరియు కోడి మధ్య సంబంధం స్పష్టంగా ఉంది: కోడే ముందు వచ్చింది. ఇది అత్యంత ఖచ్చితమైన వివరణ, దానిని అర్థం చేసుకోవడానికి ఇదే అత్యంత ఖచ్చితమైన మార్గం మరియు అత్యంత ఖచ్చితమైన జవాబు. ఇది నిజం.
ఇంతవరకు మనం చర్చించిన విషయాలు ఏమిటి? మానవజాతి నివసించే పర్యావరణాన్ని, ఆ పర్యావరణం కోసం దేవుడు చేసినదాన్ని మరియు ఆయన చేసిన సన్నాహాల గురించి మాట్లాడటంతో మనం ప్రారంభించాము. ఆయన ఏర్పాటు; మానవాళి కోసం దేవుడు సిద్ధం చేసిన సృష్టిలోని వస్తువుల మధ్య సంబంధాలు; ఆయన సృష్టిలోని వస్తువులు మానవాళికి హాని కలిగించకుండా నిరోధించడానికి దేవుడు చేసిన ఏర్పాటు గురించి మనం చర్చించాము. దేవుడు తన సృష్టిలోని అనేక విభిన్న కారకాలు మానవజాతి పర్యావరణానికి కలిగించి ఉండవచ్చనే హానిని కూడా తగ్గించాడు, ఇది అన్ని వస్తువులు వాటి అత్యున్నత ఉద్దేశాన్ని పూర్తిచేసేలా మరియు ప్రయోజనకరమైన కారకాలతో ప్రయోజనకరమైన పర్యావరణాన్ని మానవాళి కోసం తీసుకురావడానికి వీలు కల్పిస్తూ, మానవజాతి అటువంటి పర్యావరణంలో మానవజాతి ఇమిడిపోయేలా మరియు స్థిరంగా జీవితం మరియు పునరుత్పత్తి క్రమాన్ని కొనసాగించేలా వీలు కల్పిస్తుంది. తర్వాత మనం మానవ శరీరానికి అవసరమైన ఆహారం-మానవజాతి దైనందిన ఆహారం మరియు పానీయం గురించి మాట్లాడాము. మానవాళి మనుగడకు ఇది కూడా ఒక అవసరమైన పరిస్థితి. అంటే, మానవ శరీరం మనుగడ కోసం సూర్యరశ్మి, గాలి లేదా తగిన ఉష్ణోగ్రతలతో కేవలం శ్వాస తీసుకోవడం ద్వారా మాత్రమే జీవించలేదు. మానవులు తమ కడుపులను కూడా నింపుకోవాల్సి ఉంటుంది, దేవుడు దేనినీ విస్మరించకుండా, మానవజాతి కోసం అలా చేయవచ్చనే వస్తువుల మూలాలను, అంటే మానవజాతి కోసం ఆహార మూలాలను సిద్ధం చేశాడు. మీరు అలాంటి సుసంపన్నమైన, సమృద్ధమైన ఉత్పత్తులు-మానవజాతి కోసం ఆహారపానీయాల మూలాలు-చూసినప్పుడు, మానవాళి మరియు ఆయన సృష్టిలోని సమస్త జీవుల కోసం వస్తువుల సరఫరాకు మూలం దేవుడేనని మీరు చెప్పగలరా? సృష్టి కార్యం సమయంలో, దేవుడు చెట్లు, గడ్డి లేదా ఇతర జీవులను మాత్రమే సృష్టించి ఉంటే, ఈ వివిధ జీవులు మరియు మొక్కలు అన్నీ ఆవులు మరియు గొర్రెలు లేదా జీబ్రాలు, జింకలు మరియు అనేక ఇతర జీవులు తినడం కోసం ఉండి ఉంటే, ఉదాహరణకు, జీబ్రాలు మరియు జింకలు తినేవాటినే సింహాలు కూడా తినాల్సి వచ్చేది, గొర్రెలు, పందులు తినేవాటినే పులులు కూడా తినాల్సి వచ్చేది-అయితే మానవులు తినడానికి సరిపోయే ఒక్క వస్తువు కూడా ఉండేది కాదు, అది పని చేసి ఉండేదా? అది పని చేసి ఉండేది కాదు. అలా జరిగి ఉంటే, మానవజాతి ఎక్కువ కాలం జీవించి ఉండేది కాదు. మానవులు ఆకులు మాత్రమే తింటే ఏమయ్యేది? అది పని చేసి ఉండేదా? గొర్రెల కోసం ఉద్దేశించిన గడ్డిని మనుషులు తినగలిగేవారా? కొద్దిగా తింటే అది వారిని బాధించకపోవచ్చు, కానీ ఇలాంటివి ఎక్కువ కాలం తింటే వారి కడుపులు వాటిని తట్టుకోలేవు, మనుషులు ఎక్కువ కాలం బతికి ఉండేవారు కాదు. జంతువులు తినగలిగినా, మనుష్యులకు విషపూరితమైన కొన్ని వస్తువులు కూడా ఉన్నాయి-వాటిని తింటే జంతువులకు ఎలాంటి నష్టం ఉండదు, కానీ మానవులకు అవి సరిపడవు. అంటే, మానవులను దేవుడు సృష్టించాడు, కాబట్టి ఆయనకు మానవ శరీర నియమాలు, నిర్మాణం మరియు మానవులకు అవసరమైనవి బాగా తెలుసు. శరీర కూర్పు మరియు అందులోని పదార్థం, దాని అవసరాలు, దాని అంతర్గత అవయవాల పనితీరు గురించి, అవి వివిధ పదార్ధాలను ఎలా గ్రహిస్తాయో, తొలగిస్తాయో మరియు జీవక్రియ చేస్తాయో దేవునికి ఖచ్చితమైన స్పష్టతతో తెలుసు. మానవులకు ఇది తెలియదు; కొన్నిసార్లు వారు అజాగ్రత్తగా తింటారు లేదా తమ జాగ్రత్తను తాము నిర్లక్ష్యంగా తీసుకుంటారు, ఇది మరీ ఎక్కువైతే అసమతుల్యత ఏర్పడుతుంది. దేవుడు నీకోసం సిద్ధం చేసిన వాటిని సహజ పద్ధతిలో నీవు తిని ఆనందిస్తే, నీకు ఆరోగ్య సమస్యలు ఉండవు. నీకు కొన్నిసార్లు మనోస్థితి బాగా లేకపోయినప్పటికీ మరియు నీ రక్తప్రవాహంలో ఆటంకం ఉన్నప్పటికీ, అది నీకు ఎలాంటి సమస్యను కలిగించదు. నీవు చేయాల్సిందల్లా ఒక నిర్దిష్ట రకం మొక్కను తినడమే, దాంతో ఆటంకం తొలగిపోతుంది. దేవుడు వీటన్నింటి కోసం ముందస్తు ఏర్పాట్లు చేశాడు. కాబట్టి, దేవుని దృష్టిలో, మానవజాతి ఏవైనా ఇతర జీవుల కంటే చాలా ఉన్నతమైనది. దేవుడు ప్రతి రకం మొక్కకు పర్యావరణాన్ని ఏర్పాటు చేశాడు, ఆయన ప్రతి రకం జంతువుకు ఆహారం మరియు పర్యావరణాన్ని ఏర్పాటు చేశాడు, కానీ మానవజాతి పర్యావరణానికి సంబంధించినంత వరకు అత్యంత కఠినమైన ఆవశ్యకతలు ఉన్నాయి మరియు ఆ ఆవశ్యకతలు స్వల్పంగా కూడా విస్మరించలేనివి; విస్మరించి ఉంటే, మానవజాతి సహజంగా అభివృద్ధి చెందడం, జీవించడం మరియు పునరుత్పత్తి చేయడం కొనసాగించలేకపోయేది. ఇది ఆయన హృదయంలో దేవునికే బాగా తెలుసు. దేవుడు దీన్ని చేసినప్పుడు, అన్నిటికంటే ఎక్కువ దీనికే ప్రాధాన్యతనిచ్చాడు. నీ జీవితంలో నీవు చూడగలిగే మరియు ఆనందించగలిగే కొన్ని సాధారణమైన వాటి ప్రాముఖ్యతను నీవు గ్రహించలేకపోవచ్చు లేదా నీవు పుట్టినప్పటి నుండి ఏదైనా ఒకదానిని నీవు చూసి ఆనందించవచ్చు, కానీ దేవుడు నీకోసం ఎప్పుడో లేదా రహస్యంగా ఈ ఏర్పాటు చేశాడు. మానవాళికి ప్రతికూలమైన మరియు మానవ శరీరానికి హానికరమైన ప్రతికూల అంశాలన్నింటినీ దేవుడు వీలైనంతవరకు తొలగించాడు మరియు తగ్గించాడు. ఇది ఏమి చూపుతుంది? మానవాళిని సృష్టించినప్పుడు ఆ సమయంలో దేవునికి వారిపట్ల ఉన్న వైఖరిని అది చూపుతుందా? ఆ వైఖరి ఏమిటి? అప్పుడు దేవుని వైఖరి జాగ్రత్తతో కూడినదిగా, మనస్ఫూర్తిగా ఉంది, అది ఎలాంటి శత్రు శక్తుల లేదా బాహ్య కారకాల లేదా ఆయనవి కాని పరిస్థితుల జోక్యాన్ని సహించలేదు. ఈ సమయంలో మానవజాతిని సృష్టించడంలో మరియు నిర్వహించడంలో దేవుని వైఖరిని ఇందులో చూడవచ్చు. మరి దేవుని వైఖరి ఏమిటి? మానవజాతి అనుభవించే మనుగడ మరియు జీవితం కోసం ఉన్న పర్యావరణం ద్వారా, అలాగే వారి దైనందిన ఆహార పానీయ మరియు దైనందిన అవసరాలలో, మానవజాతి పట్ల దేవుని బాధ్యతాయుతమైన వైఖరిని మనం చూడవచ్చు, ఆయన మనిషిని సృష్టించినప్పటి నుండి, అలాగే మానవజాతిని సంరక్షించాలని ఆయన సంకల్పం చేసుకున్నప్పటి నుండి ఈ వైఖరి ఆయనలో ఉంది. ఈ విషయాలలో దేవుని ప్రామాణికత కనిపిస్తుందా? ఇది ఆయన అద్భుతమా? ఆయన అంతులేనితనమా? ఆయన సర్వాధికారమా? మానవాళికంతటికీ, అలాగే ఆయన సృష్టిలోని సమస్త జీవులకు సమకూర్చడానికి దేవుడు తన వివేకం మరియు సర్వశక్తివంతమైన మార్గాలను ఉపయోగిస్తాడు. ఇంతవరకు నేను మీకు చాలా చెప్పాను, సమస్త జీవులకు దేవుడే ప్రాణాధారం అని ఇప్పుడు మీరు చెప్పగలరా? (అవును.) ఖచ్చితంగా అదే నిజం. మీకేమైనా సందేహాలు ఉన్నాయా? (లేవు.) సమస్త జీవులకు దేవుడే ప్రాణాధారం అని చూపించడానికి ఆయన చేసిన ఏర్పాటు సరిపోతుంది, ఎందుకంటే సమస్త జీవులు ఉనికిలో ఉండటానికి, జీవించడానికి, పునరుత్పత్తి చేయడానికి మరియు కొనసాగడానికి వీలు కల్పించే ఏర్పాటుకు ఆయనే మూలం మరియు దేవుడు తప్ప మరే మూలం లేదు. ప్రజల అత్యంత ప్రాథమిక పర్యావరణ అవసరాలైనప్పటికీ, వారి దైనందిన జీవిత అవసరాలైనప్పటికీ లేదా ప్రజల ఆత్మలకు ఆయన అందించే సత్యం యొక్క అవసారలైనప్పటికీ, దేవుడు సమస్త జీవుల సమస్త అవసరాలను మరియు మానవాళి సమస్త అవసరాలను తీరుస్తాడు. ఏవిధంగానైనా, దేవుని గుర్తింపు మరియు ఆయన హోదా మానవాళికి ఎంతో ముఖ్యమైనవి; సమస్త జీవులకు దేవుడే ప్రాణాధారం. అంటే, ఈ ప్రపంచానికి, ప్రజలు చూడగలిగే మరియు అనుభూతి చెందగలిగే ఈ ప్రపంచానికి దేవుడే పాలకుడు, ప్రభువు మరియు ప్రదాత. మానవాళికి ఇది దేవుని గుర్తింపు కాదా? ఇందులో ఎలాంటి అసత్యం లేదు. కాబట్టి ఆకాశంలో ఎగురుతున్న పక్షులను నీవు చూసినప్పుడు, ఎగురగలిగే ప్రతిదానిని దేవుడే సృష్టించాడని నీవు తెలుసుకోవాలి. నీటిలో ఈత కొట్టే జీవులు ఉన్నాయి మరియు వాటికి మనుగడ కోసం వాటి సొంత మార్గాలు ఉన్నాయి. నేలపై జీవించే చెట్లు మరియు మొక్కలు వసంత రుతువులో మొలకెత్తి, మొగ్గలుతొడిగి, పండ్లు ఇస్తాయి మరియు శరదృతువులో ఆకులు రాలుస్తాయి, శీతాకాలం వచ్చేసరికి ఆ మొక్కలు శీతాకాల వాతావరణానికి సిద్ధమవుతున్నందున ఆకులన్నీ రాలిపోతాయి. అది వాటి మనుగడ సాగించే విధానం. దేవుడు సమస్త జీవులను సృష్టించాడు, ఇందులో ప్రతిదీ విభిన్న రూపాల్లో మరియు విభిన్న మార్గాల్లో జీవిస్తాయి మరియు తమ ప్రాణశక్తిని, అవి జీవించే శరీరరూపాన్ని ప్రదర్శించడానికి వివిధ పద్ధతులను ఉపయోగిస్తాయి. జీవులు ఎలా జీవించినప్పటికీ, అవన్నీ దేవుని పాలన కిందే ఉన్నాయి. జీవం యొక్క అన్ని విభిన్న రూపాలను మరియు జీవులను పరిపాలించడంలో దేవుని ఉద్దేశం ఏమిటి? ఇది మానవాళి మనుగడ కోసమా? ఆయన మానవజాతి మనుగడ కోసం సమస్త జీవ నియమాలను నియంత్రిస్తాడు. మానవజాతి మనుగడకు దేవుడు ఎంత ప్రాముఖ్యతనిస్తాడో ఇది చూపుతుంది.
మానవజాతి మనుగడ సాగించే మరియు సహజంగా పునరుత్పత్తి చేసే సామర్థ్యమే దేవునికి అత్యంత ముఖ్యమైనది. కాబట్టి, దేవుడు మానవాళికి అలాగే ఆయన సృష్టిలోని సమస్త జీవులకు నిరంతరాయంగా సమకూరుస్తూ ఉన్నాడు. ఆయన సమస్త జీవులకు వివిధ మార్గాలలో సమకూరుస్తాడు మరియు సమస్త జీవుల మనుగడ కొనసాగేలా చేయడం ద్వారా, మానవాళి సాధారణ మనుగడను కొనసాగిస్తూ మానవాళి ముందుకు సాగగలిగేలా చేస్తాడు. ఈ రోజు మన సాంగత్యములోని రెండు అంశాలు ఇవే. ఈ రెండు అంశాలు ఏమిటి? (స్థూల దృష్టితో చూస్తే, మనిషి జీవించే పర్యావరణాన్ని దేవుడు సృష్టించాడు. ఇది మొదటి అంశం. మానవాళికి అవసరమైన మరియు చూడగలిగే, తాకగలిగే భౌతిక వస్తువులను కూడా దేవుడు ఏర్పాటు చేశాడు.) మనం ఈ రెండు అంశాల ద్వారా మన ప్రధాన విషయాన్ని సాంగత్యము చేశాము. మన ప్రధాన విషయం ఏమిటి? (సమస్తానికి దేవుడే ప్రాణాధారం.) నా సాంగత్యములోని ఈ విషయంలో అలాంటి అంశాలు ఎందుకు ఉన్నాయో ఇప్పుడు మీకు కొంత అవగాహన ఏర్పడి ఉండాలి. ప్రధాన విషయంతో సంబంధం లేని చర్చ ఏదైనా జరిగిందా? ఏదీ జరగలేదు! ఈ విషయాలను విన్న తర్వాత, బహుశా, మీలో కొందరు కొంత అవగాహన పొందారు మరియు ఈ మాటలకు విలువ ఉందని, అవి చాలా ముఖ్యమైనవని ఇప్పుడు భావిస్తారు, కానీ మరికొందరు పదాలపరంగా మాత్రమే కొంత అవగాహన పొంది ఉండవచ్చు మరియు ఈ మాటలు ముఖ్యమైనవి కావని, తమకు సంబంధించినవి కావని అనుకోవచ్చు. ఈ క్షణంలో మీరు దీనిని ఎలా అర్థం చేసుకున్నప్పటికీ, మీ అనుభవం ఒక నిర్దిష్ట రోజుకు చేరినప్పుడు, మీ అవగాహన ఒక నిర్దిష్ట స్థానానికి చేరినప్పుడే, దేవుని చర్యలు మరియు స్వయంగా దేవుడంటే ఏమిటి అనేదాని గురించి మీ జ్ఞానం ఒక నిర్దిష్ట స్థాయికి చేరుతుంది, అప్పుడు మీరు దేవుని చర్యలకు లోతైన, వాస్తవమైన సాక్ష్యాన్ని అందించడానికి ఆచరణాత్మకమైన మీ సొంత మాటలను ఉపయోగిస్తారు.
మీ ప్రస్తుత అవగాహన ఇంకా చాలా పైపైన మరియు అక్షరతః ఉందని నేను అనుకుంటున్నాను, కానీ, నా సాంగత్యములోని ఈ రెండు అంశాలను విన్నాక, మానవాళికి సమకూర్చడానికి దేవుడు ఏ పద్ధతులను ఉపయోగిస్తాడో లేదా దేవుడు మానవాళికి వేటిని అందిస్తాడో కనీసం మీరు గుర్తించగలరా? మీకు ఒక ప్రాథమిక భావన, ప్రాథమిక అవగాహన ఉందా? (అవును.) అయితే నేను సాంగత్యము చేసిన ఈ రెండు అంశాలు బైబిల్‌కు సంబంధించినవా? అవి రాజ్యపు యుగములో దేవుని తీర్పు మరియు శిక్షకు సంబంధించినవా? (కాదు.) అలాంటప్పుడు నేను వాటిని మీతో ఎందుకు సాంగత్యము చేశాను? ఎందుకంటే దేవుడిని తెలుసుకోవాలంటే ప్రజలు వాటిని అర్థం చేసుకోవాలి కాబట్టా? (అవును.) ఈ విషయాలను తెలుసుకోవడం చాలా అవసరం మరియు వీటిని అర్థం చేసుకోవడం కూడా చాలా అవసరం. మీరు దేవుడిని సంపూర్ణంగా అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నప్పుడు, మిమ్మల్ని మీరు బైబిల్‌కు పరిమితం చేసుకోకండి, అలాగే మనిషికి దేవుడు ఇచ్చే తీర్పు మరియు శిక్షకు మిమ్మల్ని మీరు పరిమితం చేసుకోకండి. దీన్ని చెప్పడంలో నా ఉద్దేశమేమిటి? దేవుడంటే ఆయన ఎంచుకున్న ప్రజల దేవుడు మాత్రమే కాదని ప్రజలకు తెలియజేయడమే నా ఉద్దేశం. నీవు ప్రస్తుతం దేవుడిని అనుసరిస్తన్నావు, ఆయన నీ దేవుడు, అయితే ఆయనను అనుసరించని వారికి కూడా ఆయనే దేవుడా? దేవుడు ఆయనను అనుసరించని ప్రజలందరికి కూడా దేవుడా? దేవుడు సమస్త జీవులకు దేవుడా? (అవును.) అలాంటప్పుడు దేవుని కార్యము మరియు చర్యలు కేవలం ఆయనను అనుసరించే వారికి మాత్రమే పరిమితమా? (కాదు.) ఆయన కార్యము మరియు చర్యల పరిధి ఏమిటి? అత్యల్ప స్థాయిలో, ఆయన కార్యము మరియు చర్యల పరిధిలో మొత్తం మానవాళి మరియు సృష్టిలోని సమస్త జీవులు ఉన్నాయి. అత్యున్నత స్థాయిలో దీని పరిధిలో సమస్త విశ్వం ఉంది, దీనిని ప్రజలు చూడలేరు. కాబట్టి, దేవుడు సమస్త మానవాళిలో తన కార్యాన్ని చేస్తాడని, తన చర్యలను నిర్వహిస్తాడని మనం చెప్పవచ్చు మరియు ప్రజలు దేవుడిని సంపూర్ణంగా తెలుసుకునేలా చేయడానికి ఇది సరిపోతుంది. నీవు దేవుడిని తెలుసుకోవాలని, ఆయనను నిజంగా తెలుసుకోవాలని, ఆయనను నిజంగా అర్థం చేసుకోవాలని అనుకుంటే, కేవలం దేవుని కార్యపు మూడు దశలకు లేదా గతంలో ఆయన చేసిన కార్యానికి సంబంధించిన కథలకు మాత్రమే నిన్ను నీవు పరిమితం చేసుకోవద్దు. నీవు ఆయనను ఆ విధంగా తెలుసుకోవాలని ప్రయత్నిస్తే, నీవు దేవుడిని నిర్భంధిస్తూ, ఆయనకు పరిమితులు విధిస్తున్నావని అర్థం. నీవు దేవుడిని ఏదో చాలా చిన్నవాడిగా చూస్తున్నావు. అలా చేయడమనేది ప్రజలను ఎలా ప్రభావితం చేస్తుంది? నీవు దేవుని అద్భుతాన్ని, సర్వాధిపత్యాన్ని లేదా ఆయన శక్తిని, సర్వాధికారాన్ని మరియు ఆయన అధికార పరిధిని ఎప్పటికీ తెలుసుకోలేవు. అలాంటి అవగాహన, దేవుడు సమస్త జీవులకు పాలకుడనే సత్యాన్ని అంగీకరించే నీ సామర్థ్యంతోపాటు, దేవుని నిజమైన గుర్తింపును మరియు హోదాను గురించి నీ జ్ఞానంపై కూడా ప్రభావం చూపుతుంది. మరోలా చెప్పాలంటే, దేవుని గురించి నీ అవగాహన పరిధి పరిమితంగా ఉంటే, నీవు పొందగలిగేది కూడా పరిమితంగానే ఉంటుంది. కాబట్టి నీవు నీ పరిధిని తప్పక విస్తరించుకోవాలి మరియు మీ పరిధులను పెంచుకోవాలి. నీవు అన్నింటినీ-దేవుని కార్యపు పరిధి, ఆయన నిర్వహణ, ఆయన పాలన మరియు ఆయన నిర్వహించే అన్ని పనులు మరియు ఆయన పాలించే సమస్త జీవులు, అన్నింటినీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఈ విషయాల ద్వారా మాత్రమే నీవు దేవుని చర్యలను అర్థం చేసుకోవాలి. అలాంటి అవగాహనతో, దేవుడు అన్ని విషయాలను పాలిస్తాడు, నిర్వహిస్తాడు మరియు సమకూరుస్తాడని తెలుసుకోకుండానే నీవు అనుభూతి చెందుతావు మరియు నీవు ఒక భాగమని మరియు సమస్త జీవులలో నీవు కూడా ఒక సభ్యుడవని నిజంగా భావిస్తావు. దేవుడు సమస్త జీవులకు సమకూరుస్తున్నందున, నీవు కూడా దేవుని నియమాన్ని మరియు ఏర్పాటును అంగీకరిస్తున్నావు. ఇది ఎవరూ కాదనలేని యథార్థం. దేవుని పాలనలో సమస్త జీవులు తమ సొంత చట్టాలకు లోబడి ఉంటాయి మరియు దేవుని పాలనలో సమస్త జీవులకు మనుగడ కోసం వాటి సొంత నియమాలు ఉంటాయి. మానవాళి తలరాత మరియు అవసరాలు కూడా దేవుని పాలన మరియు ఏర్పాటుకు లోబడి ఉంటాయి. కాబట్టే, దేవుని ఆధిపత్యం మరియు పాలనలో, మానవజాతి మరియు సమస్త జీవులు ఒకదానితో ఒకటి సంబంధంకలిగి, పరస్పరం ఆధారపడి మరియు ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. సమస్త జీవులను సృష్టించడంలో దేవుని ఉద్దేశం మరియు విలువ ఇదే.
ఫిబ్రవరి 2, 2014