దేవుడు తనకు తానే అద్వితీయుడు X
దేవుడు సమస్తమైన వాటికి జీవనాధారమై ఉన్నాడు(IV)
ఈ రోజు మనం ఒక ప్రత్యేకమైన అంశం పై సంభాషించు కుంటున్నాము. ప్రతీ ఒక్క విశ్వాసికి తెలుసుకోవాల్సిన, అనుభవించవల్సిన, అర్దం చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు రెండు మాత్రమే ఉన్నాయి. ఏమిటా రెండు విషయాలు? మొదటిది జీవములోకి ఒకరి వ్యక్తిగత ప్రవేశం, రెండవది దేవుడిని తెలుసుకోవడానికి చెందినది. దేవుడిని తెలుసుకోవడం అనే విషయం పై మనం ఇటీవల సంభాషిస్తున్న అంశానికి సంబందించి, మీరు అది సాధించదగినది అని భావిస్తున్నారా? అది చాలా మంది ప్రజలకు చేరువలో లేదు అని చెప్పడం సబబు. మీరు నా మాటల ద్వారా ఒప్పించబడక పోవచ్చు, కానీ నేను ఇది ఎందుకు చెప్తున్నాను? ఇది ఎందుకు చెప్తున్నాను అంటే నేను ఎలాంటి మాటల ద్వారా చెప్పాను లేదా ఎలా చెప్పాను అనే దానితో సంబందం లేకుండా మీరు ఇంతకు ముందు నేను చెప్తున్నది వింటున్నారు, ఈ మాటలు దేనికి సంబందించినవి అనేవి మీరు వాక్యపరంగా, సిద్దాంతపరంగా తెలుసుకోగలరు. ఏదేమైనా, నేను ఇలాంటి విషయాలు ఎందుకు చెప్పాను, ఇలాంటి అంశాలపై ఎందుకు మాట్లాడాను అనేది మీకు అర్దం కాకపోవడం, మీ అందరికీ, చాలా తీవ్రమైన సమస్య. ఇది విషయం యొక్క సారాంశం. ఆ విధంగా, ఈ విషయాలను విని ఉండటం అనేది దేవుని పట్ల మరియు ఆయన కార్యాల పట్ల అవగాహనను సుసంపన్నం చేసినప్పటికీ, దేవుడిని తెలుసుకోవడం కష్టతరమైన కృషితో కూడినది అని మీరు ఇప్పటికీ భావిస్తున్నారు. అంటే, నేను చెప్పినది విన్న తర్వాత, నేను అది ఎందుకు చెప్పానో లేదా దేవుడిని తెలుసుకోవడానికి దానికీ సంబందం ఏమిటో మీలో చాలా మందికి అర్దం కాలేదు. దేవుడిని తెలుసుకోవడానికి దానికి ఉన్న సంబందం మీరు అర్దం చేసుకోలేకపోవడానికి కారణం మీ జీవనానుభవం చాలా ఉపరితలంగా ఉండటం. ప్రజల జ్ణానం మరియు దేవుని మాటల అనుభవం చాలా తక్కువ స్తాయిలోనే ఉండిపోతే, ఆయన గురించిన వారి జ్ణానం చాలా వరకూ అస్పష్టంగా మరియు నైరూప్యంగా ఉంటుంది; అదంతా సహజంగా, శాస్త్రీయంగా, సైద్దాంతికంగా ఉంటుంది. సైద్దాంతికంగా, అది గొప్ప తార్కికతతో మరియు హేతుబద్దతతో కనబడవచ్చు, కానీ చాలా మంది ప్రజల నోళ్లలో నుండి బయటకు వచ్చే దేవుని గురించిన జ్ణానం నిజానికి శూన్యం. అది శూన్యం అని నేను ఎందుకు అన్నాను? ఎందుకంటే దేవుడిని తెలుసుకోవడానికి సంబందించి నీ అంతట నువ్వు చెప్పే దానిలో వాస్తవికత మరియు ఖచ్చితత్వం గురించి నిజానికి నీకు స్పష్టమైన అవగాహన లేదు. దేవుడిని తెలుసుకోవడానికి సంబందించి చాలా సమాచారాన్ని మరియు అంశాలను చాలా మంది ప్రజలు విన్నప్పటికీ కూడా, దేవుని గురించిన వారి జ్ణానం ఇంకా అస్పష్టమైన, నైరూప్యమైన శాస్త్రీయతకు, సైద్దాంతికతకు మించి వెళ్ల వలసి ఉంది. అలాంటప్పుడు, ఈ సమస్య ఎలా పరిష్కరించబడుతుంది? మీరు ఎప్పుడైనా దాని గురించి ఆలోచించారా? ఎవరైనా సత్యాన్ని వెంబడించకపోతే, వారు వాస్తవికతను కలిగి ఉండగలరా? ఎవరైనా సత్యాన్ని వెంబడించకపోతే, అప్పుడు వారు నిస్సందేహంగా వాస్తవికత లేకుండా ఉన్నారు, ఆ విధంగా వారికి కచ్చితంగా దేవుని వాక్యాల పట్ల ఎటువంటి జ్ణానమూ లేదా అనుభవమూ లేదు. దేవుని వాక్యాల పట్ల ఎటువంటి అవగాహనా లేని వారు దేవుడిని తెలుసుకోగలరా? అస్సలు తెలుసుకోలేరు; ఆ రెండూ అనుసంధానించబడినవి. కాబట్టి, “దేవుడిని తెలుసుకోవడం ఎందుకు అంత కష్టం? నన్ను నేను తెలుసుకోవడం గురించి మాట్లాడినప్పుడు నేను గంటల తరబడి మాట్లాడగలను, కానీ దేవుడిని తెలుసుకోవడమనే విషయానికి వస్తే, నాకు మాటలు దొరకడం లేదు. నేను విషయంపై కాస్త చెప్పినప్పటికీ, నా మాటలు బలవంతంగా నిస్సత్తువగా ధ్వనిస్తున్నాయి. నేను చెప్తున్న వాటిని నేను వింటున్నప్పుడు కూడా వికారంగా అనిపిస్తున్నాయి.” అని చాలా మంది ప్రజలు అంటారు. ఇది మూలం. దేవుడిని తెలుసుకోవడం చాలా కష్టతరం, ఆయన తెలుసుకోవడానికి చాలా కృషి కావాలి అని నువ్వు భావిస్తే, లేదా ముందుకు తీసుకురావడానికి ఎలాంటి అంశాలు లేవు, మరియు నీకు మరియు ఇతరులకు అందించడానికి, సంభాషించడానికి ఎలాంటి వాస్తవికత గురించి ఆలోచించలేకపోతే, అప్పుడు అది నిన్ను దేవుని మాటలను అనుభవించనివాడు అని నిరూపిస్తుంది. దేవుని మాటలు ఏమిటి? ఆయన మాటలు దేవుడు కలిగిఉన్న మరియు దేవుడు ఎవరు అనే దాని వ్యక్తీకరణలు కావా? నువ్వు దేవుని మాటలను అనుభవించకపోతే, దేవుడు కలిగిఉన్న మరియు దేవుడు ఎవరు అనే వాటిపై నీకు అవగాహన ఉంటుందా? ఖచ్చితంగా ఉండదు. ఈ విషయాలన్నీ ఒకదానితో ఒకటి అనుసంధానిచబడి ఉన్నాయి. నీకు దేవుని మాట్లా పట్ల ఎటువంటి అనుభవమూ లేకపోతే, అప్పుడు నువ్వు దేవుని చిత్తాన్ని గ్రహించలేవు, ఆయన స్వభావం ఏమిటో, ఆయన దేన్ని ఇష్టపడతాడో, ఆయన దేన్ని అసహ్యించుకుంటాడో, ప్రజల నుండి ఆయన ఏం ఆశిస్తాడో, మంచి వారి పట్ల ఆయనకున్న వైఖరి ఏమిటో, దుష్టుల పట్ల ఆయన వైఖరి ఏమిటో కూడా నువ్వు తెలుసుకోలేవు; ఖచ్చితంగా ఇదంతా నీకు సంధిగ్దంగా, అస్ఫష్టతగా ఉంటుంది. ఈ అస్పష్టత లో నువ్వు దేవుడిని విశ్వసిస్తే, అప్పుడు నువ్వు సత్యాన్ని వెంబడించే దేవుడిని అనుసరించేవాడిగా చెప్పుకుంటే, ఆ వాదనలు వాస్తవికంగా ఉంటాయా? ఉండవు! అందుకే దేవుడిని తెలుసుకోవడం గురించి సంభాషించడం కొనసాగిద్దాము.
సహవాసం లో నేటి అంశం గురించి వినడానికి మీరంతా ఉత్సుకతతో ఉన్నారు, అవునా? ఈ అంశం మనం ఇటీవల చర్చించుకుంటున్న” దేవుడు సమస్తమైన వాటికి జీవ మూలమై ఉన్నాడు” అనే విషయానికి చెందినది కూడా. ఎలా దేవుడు అన్నిటినీ పాలిస్తాడు, ఏ మార్గం ద్వారా ఆయన అలా చేస్తాడు, మరియు దేవుడు సృష్టించిన ఈ గ్రహంలో ఉనికిలో ఉండేలా ఆయన సమస్తమైన వాటిని ఏ సూత్రాల ద్వారా నిర్వహిస్తున్నాడు అనేది ప్రజలకి తెలియజేయడానికి వివిధ సాధనాలను, దృక్పధాలను వాడుకుంటూ ఎలా “ దేవుడు సమస్తమైన వాటి జీవ మూలమై ఉన్నాడు” అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం. దేవుడు మానవాళికి ఎలా పోషణనిస్తాడు: ఏ మార్గం ద్వారా ఆయన ఇలాంటి సదుపాయాన్ని ఇస్తాడు, ప్రజలకి ఆయన ఎలాంటి జీవావరణాలను అందిస్తాడు మరియు ఏ మార్గం ద్వారా ఇస్తాడు మరియు ఏ ప్రారంభ స్తానాల నుండి మనిషికి ఆయన స్థిర జీవన వాతావరణాన్ని అందిస్తాడు అనే దాని గురించి కూడా మనం చాలా మాట్లాడుకున్నాం. సమస్తమైన వాటిపై దేవుని ఆధిపత్యం మరియు పరిపాలన మరియు ఆయన నిర్వహణ గల సంబందం గురించి నేను నేరుగా మాట్లాడనప్పటికీ, ఈ మార్గం గుండా ఆయన సమస్తమైన వాటిని నిర్వహించే కారణాల గురించి, అలాగే ఆయన మానవాళికి పోషణనిచ్చే, వృద్దిపరిచే కారణాల గురించి నేను పరోక్షంగా మాట్లాడాను. ఇదంతా ఆయన నిర్వహణకు చెందినది. మనం మాట్లాడిన విషయం యొక్క పరిధి చాలా విస్తృతమైనది: స్తూల వాతావరణం మొదలుకొని, ప్రజల ప్రాధమిక అవసరాలు మరియు ఆహారం వంటి అతి చిన్న విషయాల వరకూ: దేవుడు సమస్తమైన వాటిని ఎలా పాలిస్తాడు మరియు వాటిని క్రమ పద్దతిలో పని చేసేలా ఎలా చేస్తాడు మొదలుకొని, ప్రతీ జాతి కి చెందిన ప్రజల కొరకు ఆయన సృష్టించిన సరైన, తగిన జీవన వాతావరణం వరకూ; ఇంకా అనేకమైనవి. ఈ విస్తారమైన అంశం మనుషులు శరీరంలో ఎలా జీవిస్తారు అనే దానికి సంబందించినది- అంటే, అది కంటికి కనిపించే భౌతిక ప్రపంచానికి చెందిన విషయాలకు, ప్రజలు అనుభూతి చెందగలిగే పర్వతాలు, నదులు, సముద్రాలు, మైదానాలు, మరియు అనేకమైన వాటికి సంబందించినది. వీటన్నిటినీ చూడవచ్చు మరియు తాకవచ్చు. గాలి మరియు ఉష్ణోగ్రత గురించి నేను మాట్లాడినపుడు, మీరు మీ శ్వాస ద్వారా గాలి యొక్క ఉనికిని నేరుగా అనుభూతి చెందవచ్చు, మీ శరీరం ద్వారా ఉష్ణోగ్రత ఎక్కువగా ఉందా లేదా తక్కువగా ఉందా అనేది గ్రహించవచ్చు. చెట్లు, గడ్డి, పక్షులు మరియు అరణ్యాలలోని మృగాలు, మరియు గాలిలో ఎగిరేవి, భూమిపై నడిచేవి, మరియు బొరియల నుండి బయటకి వచ్చే చిన్న జంతువులు అన్నిటినీ ప్రజల స్వంత నేత్రాలతో చూడవచ్చు మరియు స్వంత చెవులతో వినవచ్చు. దేవుడు సృష్టించిన వాటన్నిటిలోనూ ఇవన్నీ తాకిన పరిధి చాలా పెద్దదైనప్పటికీ, అవి కేవలం భౌతిక ప్రపంచాన్ని మాత్రమే సూచిస్తాయి. భౌతిక విషయాలను ప్రజలు చూడగలరు మరియు అనుభూతి చెందగలరు, అంటే నువ్వు వాటిని పట్టుకున్నపుడు నువ్వు వాటిని గ్రహించగలవు, నీ కళ్ళు వాటిని చూసినపుడు, నీ మెదడు నీకు ఒక చిత్రాన్ని ఇస్తుంది, ఒక చాయా చిత్రం. అవి యదార్డమైనవి మరియు వాస్తవమైనవి; నీకు అవి నైరూప్యమైనవి కావు, వాటికి ఒక ఆకారం ఉంది. అవి చతురస్రంగా లేదా గుండ్రంగా లేదా పొడవుగా లేదా పొట్టిగా ఉండవచ్చు, ప్రతీ వస్తువు నీకొక భిన్నమైన మనోభావాన్నిస్తుంది. ఈ విషయాలన్నీ సృష్టి యొక్క భౌతిక కోణాన్ని సూచిస్తాయి. కాబట్టి దేవునికి” సమస్తమైన వాటిపై దేవుని ఆధిపత్యం” అనే వాక్యంలో “సమస్తమైనవి” అనే దాంట్లో ఏమేమి ఉంటాయి? కేవలం మనుషులు చూడగలిగి తాకగలిగే విషయాలు మాత్రమే అందులో ఉండవు, అదనంగా కనపడని, స్పృశించలేనివన్నీ వాటిలో ఉంటాయి. సమస్తమైన వాటిపై దేవుని ఆధిపత్యం యొక్క నిజమైన అర్దాలలో ఇది ఒకటి. ఇలాంటి వస్తువులు మనుషులకి కనపడనివి, స్పృశించలేనివి అయినప్పటికీ, దేవునికి- ఆయన కంటితో గమనింపబడినంత కాలం మరియు ఆయన సార్వాభౌమాధికారాపు పరిధిలో ఉన్నంత కాలం- అవి యదార్దంగా ఉనికిలో ఉంటాయి. అవి నైరూప్యమైనవి మరియు ఊహాతీతమైనవి, అంతేకాక అవి వాస్తవానికి మనుషులు చూడలేనివి, స్పృశించలేనివి అయినప్పటికీ, దేవునికి అవి వాస్తవంగా, నిజంగా ఉనికిలో ఉన్నాయి. ఆయన పాలించే సమస్త విషయాలలో ఇది మరొక ప్రపంచం, ఇది ఆయన ఆధిపత్యం వహించే సమస్తమైన వాటి పరిధి యొక్క మరొక భాగం. ఈ రోజు సహవాసపు అంశం ఇదే: దేవుడు ఆధ్యాత్మిక ప్రపంచాన్ని ఎలా పాలిస్తాడు మరియు నిర్వహిస్తాడు. దేవుడు సమస్తమైన వాటిని ఎలా పాలిస్తాడు నిర్వహిస్తాడు అనే దాన్ని ఈ అంశం పూర్తి చేస్తుంది కాబట్టి ఇది భౌతిక ప్రపంచానికి వెలుపల ఉన్న ప్రపంచానికి- ఆధ్యాత్మిక ప్రపంచానికి- చెందినది- అందువలన మనకి ఇది అర్దం చేసుకోవడం ఎంతో అవసరం. ఈ విషయం గురించి సంభాషించిన మరియు అర్దం చేసుకున్న తర్వాత మాత్రమే ప్రజలు “దేవుడు సమస్తమైన వాటి జీవ మూలమై ఉన్నాడు.” అనే మాటల నిజమైన అర్దాన్ని యదార్దంగా గ్రహించగలరు. మనం ఈ అంశాన్ని చర్చించబోవడానికి గల కారణం ఇదే; “దేవుడు సమస్తమైన వాటిని పాలిస్తాడు మరియు దేవుడు సమస్తమైన వాటిని నిర్వహిస్తాడు” అనే విషయాన్ని పూర్తి చేయడమే దీని ప్రయోజనం. బహుశా, మీరు ఈ విషయాన్ని విన్నప్పుడు ఇది మీకు వింతగా అర్దం కానిదిగా అనిపించవచ్చు, కానీ మీరు ఏం అనుకున్నా, ఆధ్యాత్మిక ప్రపంచం అనేది దేవునిచే పరిపాలించ బడే వాటిలో ఒక భాగం కాబట్టి, మీరు ఈ అంశం పై కొంత అవగాహన పొందాలి. ఒకసారి మీకు అది వచ్చిన తర్వాత, “దేవుడు సమస్తమైన వాటికి జీవనాధారమై ఉన్నాడు” అనే పదబంధం పట్ల మీకు మరింత లోతైన ప్రశంసాభావం, అవగాహన ఉంటుంది.
దేవుడు ఆధ్యాత్మిక ప్రపంచాన్ని ఎలా పాలిస్తాడు మరియు నడిపిస్తాడు
భౌతిక ప్రపంచానికి, ఎప్పుడైనా ప్రజలు ఏదైనా నిర్దిష్టమైన విషయాలను లేదా దృగ్విషయాలను అర్దం చేసుకోలేనపుడు, వారు సంబందిత సమాచారం కొరకు వెతకవచ్చు లేదా ఆ విషయాలను, మూలాలను మరియు నేపధ్యాన్ని తెలుసుకోవడానికి వివిధ మార్గాలను వాడవచ్చు. కానీ మనం ఈ రోజు మాట్లాడుకుంటున్న ఇంకో ప్రపంచం- భౌతిక ప్రపంచానికి వెలుపల ఉండే ఆధ్యాత్మిక ప్రపంచం- విషయానికి వస్తే, ప్రజలకు దాని గురించి నేర్చుకోవడానికి ఎటువంటి సాధనాలు లేదా మార్గాలు లేవు. నేను ఇది ఎందుకు చెప్తున్నాను? నేనెందుకు ఇది చెప్తున్నానంటే, మానవాళి ప్రపంచంలో, భౌతిక ప్రపంచంలోని ప్రతీదీ మనిషి యొక్క భౌతిక ఉనికి నుండి విడదీయరానిది, ప్రజలు భౌతిక ప్రపంచంలోని ప్రతీదీ వారి భౌతిక జీవనం మరియు భౌతిక జీవితాల నుండి విడదీయరానిది అని భావిస్తారు కాబట్టి, చాలా మంది ప్రజలు తమకి కనపడే తమ కళ్ల ఎదురుగా ఉన్న విషయాల పట్ల మాత్రమే అవగాహన తో ఉంటారు లేదా చూస్తారు. ఏదేమైనా, ఆధ్యాత్మిక ప్రపంచం విషయానికి వస్తే- చెప్పాలంటే, వేరే ప్రపంచానికి చెందిన ప్రతీదీ- చాలా మంది ప్రజలు దాన్ని విశ్వసించరు అని చెప్పడం సబబు. ప్రజలు దానిని చూడలేరు మరియు దానిని అర్దం చేసుకోవాల్సిన అవసరం లేదు లేదా, ఆధ్యాత్మిక ప్రపంచం భౌతిక ప్రపంచానికి పూర్తిగా ఎలా భిన్నం అని తెలుసుకోవడానికి ఏమీ లేదు అని విశ్వసిస్తారు, దేవుని దృష్టిలో ఇదంతా బహిర్గతం- అయినప్పటికీ మనుషులకు అది రహస్యం మరియు మూసివేయబడినది- కాబట్టి ఈ ప్రపంచం లోని వివిధ విషయాలను అర్దం చేసుకోవడానికి ఒక మార్గాన్ని కనుగొనడం ప్రజలకి చాలా కష్టతరమైన పని. నేను మాట్లాడబోయే ఆధ్యాత్మిక ప్రపంచంలోని వివిధ విషయాలు దేవుని పరిపాలన మరియు సార్వభౌమాధికారానికి సంబంధించినవి; నేను ఎటువంటి రహస్యాలను బహిర్గతం చెయ్యడం లేదు, లేదా నేను మీరు నేర్చుకోవాలి అనుకుంటున్న ఎటువంటి రహస్యాలను నేను మీకు చెప్పడం లేదు. ఎందుకంటే ఇది దేవుని సార్వభౌమాధికారానికి, దేవుని పరిపాలనకి, దేవుని ఏర్పాటుకి చెందినది, అందువలన నేను మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్న భాగం గురించి మాత్రమే మాట్లాడాలి.
ముందుగా, మిమ్మ్లల్ని ఒక ప్రశ్న అడగనివ్వండి: మీ మనసులో, ఆధ్యాత్మిక ప్రపంచం అంటే ఏమిటి? స్టూలంగా చెప్పాలంటే, అది భౌతిక ప్రపంచానికి వెలుపల ఉన్న ప్రపంచం, అది ప్రజలకు అగోచరం మరియు అస్పృశ్యం రెండూ అయినది. అయితే, మీ ఊహలలో, ఆధ్యాత్మిక ప్రపంచం ఎలాంటి ప్రపంచమై ఉండాలి?బహుశా, దాన్ని చూడలేరు కాబట్టి, మీరు దాని గురించి ఆలోచించలేరు. ఏదేమైనా మీరు కొన్ని పూర్వ గాధలను విన్నప్పుడు, మీరు ఇంకా దాని గురించే ఆలోచిస్తున్నారు, మరియు దాని గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నారు. నేను ఇది ఎందుకు చెప్తున్నాను? చాలా మంది ప్రజలకి వారు యవ్వనస్తులుగా ఉన్నపుడు ఏదో ఒకటి జరుగుతుంది: వారికి ఎవరైనా ఒక భయం గొల్పే కథ చెప్పినపుడు- దయ్యాలు లేదా ఆత్మల గురించి- వారు బాగా భయపడతారు. కచ్చితంగా వారు ఎందుకు భయపడతారు? ఎందుకంటే వారు ఆ విషయాలను ఊహించుకుంటున్నారు; వారు వాటిని చూడలేనప్పటికీ, అవి ఎక్కడో రహస్య చీకటి మూలలో తమ గదుల చుట్టూ ఉన్నాయని భావిస్తారు, వారు నిద్రపోలేనంతగా భయపడతారు. మరీ ముఖ్యంగా రాత్రి పూట, వారు తమ గదుల్లో వంటరిగా ఉండటానికి లేదా వారి ప్రాంగణాల్లోకి వంటరిగా రావడానికి వారు విపరీతంగా భయపడతారు. అది మీ ఊహాత్మక ఆధ్యాత్మిక ప్రపంచం, ప్రజలు దాన్ని భయం గొలిపే ప్రపంచం అని అనుకుంటారు. వాస్తవం ఏమిటంటే, ప్రతీ ఒక్కరూ దాన్ని కొంత మేరకు ఊహిస్తారు, మరియు ప్రతీ ఒక్కరూ దాన్ని కొంత మేర అనుభూతి చెందుతారు.
ఆధ్యాత్మిక ప్రపంచం గురించి మాట్లాడడం తో మొదలు పెడదాం. అది ఏంటి? మీకొక చిన్న క్లుప్తమైన వివరణను ఇవ్వనివ్వండి: ఆధ్యాత్మిక ప్రపంచం అనేది ఒక ముఖ్యమైన స్తలం, అది భౌతిక ప్రపంచం నుండి భిన్నమైనది. ఇది ముఖ్యమైనది అని నేను ఎందుకు చెప్తున్నాను? దీని గురించి మనం వివరంగా చర్చించబోతున్నాం. ఆధ్యాత్మిక ప్రపంచపు ఉనికి మానవాళి యొక్క భౌతిక ప్రపంచం తో విడదీయలేనంతగా ముడిపడి ఉంది. ఇది సమస్తమైన వాటిపైన దేవుని ఆధిపత్యంలో, మనిషి జీవన్మరణాల చక్రంలో ఒక ముఖ్య పాత్ర పోషిస్తుంది; ఇది దాని పాత్ర, దాని ఉనికి ముఖ్యమైనది అవడానికి ఇది ఒక కారణం. ఎందుకంటే ఇది పంచేంద్రియాలకు అంతుచిక్కని ప్రదేశం, ఆధ్యాత్మిక ప్రపంచం ఉనికిలో ఉందా లేదా అనేది ఎవరూ కచ్చితంగా చెప్పలేరు. దాని వివిధ శక్తులు మనిషి ఉనికి కి సన్నిహితంగా అనుసంధానించబడి ఉన్నాయి, దీని ఫలితంగా మానావాళి జీవిత క్రమం కూడా ఆధ్యాత్మిక ప్రపంచం చేత గొప్పగా ప్రభావితం అయింది. దీనిలో దేవుని సార్వభౌమాధికారం ఉందా లేదా? ఉంది. నేను ఇది చెప్పినపుడు, నేను ఈ అంశాన్ని ఎందుకు చర్చిస్తూన్నానో మీకు అర్దం అవుతుంది: ఎందుకంటే ఇది దేవుని సార్వభౌమాధికారానికి, అలాగే ఆయన పరిపాలనకి చెందినది. ప్రజలకు కనపడని- ఇలాంటి ప్రపంచంలో- దాని ప్రతీ పరలోక ప్రకటన, శాసనం, మరియు పరిపాలనా వ్యవస్త భౌతిక ప్రపంచపు ఏదైనా దేశపు చట్టాలు, వ్యవస్తల కంటే చాలా ఉన్నతంగా ఉంటుంది, ఈ ప్రపంచంలో నివసించే ఏ వ్యక్తీ కూడా దాన్ని ఉల్లంగించే లేదా అతిక్రమించే దైర్యం చేయడు. ఇది దేవుని సార్వభౌమాధికారానికి మరియు పరిపాలనకి చెందినదా? ఆధ్యాత్మిక ప్రపంచంలో, స్పష్టమైన పరిపాలనా శాసనాలు, స్పష్టమైన పరలోక ప్రకటనలు, మరియు స్పష్టమైన లిఖిత శాసనాలు ఉన్నాయి. వివిధ విభాగాలలో, వివిధ స్తాయిలలో పరిచారకులు తమ విధులకు నిక్కచ్చిగా కట్టుబడి ఉంటూ నియమ నిబంధనలను పాటిస్తారు, ఎందుకంటే స్వర శాసనాన్ని అతిక్రమిస్తే పర్యవసానం ఏమిటో వారికి తెలుసు; దేవుడు చెడును ఎలా శిక్షిస్తాడు, మంచికి ఎలాంటి ప్రతిఫలాన్ని ఇస్తాడు, మరియు ఆయన సమస్త మైన వాటిని ఎలా పాలిస్తాడు, నిర్వహిస్తాడు అనే వాటి పట్ల వారు స్పష్టమైన అవగాహనతో ఉన్నారు. అంతేకాక, ఆయన పరలోక ప్రకటనలను, శాసనాలను ఎలా అమలు చేస్తాడో వారు స్పష్టంగా చూస్తారు. మానవాళి నివసించే భౌతిక ప్రపంచానికి ఇవి భిన్నంగా ఉన్నాయా? వాస్తవానికి అవి చాలా భిన్నంగా ఉన్నాయి. ఆధ్యాత్మిక ప్రపంచం అనేది భౌతిక ప్రపంచానికి పూర్తిగా భిన్నమైన ప్రపంచం. పరలోక ప్రకటనలు, శాసనాలు ఉన్నాయి కాబట్టి ఇది దేవుని సార్వభౌమాధికారాన్ని, నిర్వహణను, అంతేకాక, ఆయన స్వభావాన్ని, అలాగే ఆయన ఏమి కలిగి ఉన్నాడు, ఆయన ఎవరు అనేవి తాకుతుంది. ఇది విన్నాక, నేను ఈ అంశం గురించి మాట్లాడటం అత్యంత ఆవశ్యకం అని మీరు భావించడం లేదా?మీకు దానిలో అంతర్లీనంగా ఉన్న రహస్యాలను తెలుసుకోవాలని లేదా? ( ఔను, మాకు తెలుసుకోవాలని ఉంది.) ఆధ్యాత్మిక ప్రపంచానికి చెందిన విషయం ఇలాంటిది. అది భౌతిక ప్రపంచంతో కలిసి ఉన్నప్పటికీ, ఏక కాలంలో దేవుని పరిపాలనకు, సార్వభౌమత్వానికి కట్టుబడి ఉంటుంది, ఈ ప్రపంచపు దేవుని పరిపాలన మరియు సార్వభౌమాధికారం భౌతిక ప్రపంచపు వాటి కంటే మరింత కటినంగా ఉంటుంది. వివరాల్లోకి వెళ్తే, మానవాళి జనన మరణ చక్రపు పనికి ఆధ్యాత్మిక ప్రపంచం ఎలా భాద్యత వహిస్తుందో అనే దాని గురించి మనం మొదలుపెట్టాలి, ఎందుకంటే ఆధ్యాత్మిక ప్రపంచపు వాసుల పనిలో ఇది ఒక ముఖ్య భాగం.
మానవాళిలో, నేను ప్రజలందరినీ మూడు రకాలుగా వర్గీకరిస్తాను. మొదటి వారు ఏ విధమైనటువంటి మత విశ్వాసాలు లేని అవిశ్వాసులు. వారు అవిశ్వాసులు అని పిలువబడతారు. అధిక సంఖ్యాకులైన అవిశ్వాసులకు కేవలం డబ్బుపై మాత్రమే నమ్మకం ఉంటుంది; వారు తమ స్వంత ప్రయోజనాలను మాత్రమే పట్టించుకుంటారు, వారు భౌతికవాదులు, కేవలం భౌతిక ప్రపంచాన్ని మాత్రమే నమ్ముతారు- వారు జనన మరణ చక్రమందు నమ్మిక ఉంచరు లేదా దేవతలు మరియు దయ్యాల గురించి చెప్పిన దాని పట్ల నమ్మిక ఉంచరు. వీరిని నేను అవిశ్వాసులుగా వర్గీకరిస్తున్నాను మరియు వీరు మొదటి రకం. రెండవ రకం లో అవిశ్వాసులు కాకుండా విశ్వాసములో అనేక రకములైన వారున్నారు. మానవాళిలో, ఈ విశ్వాస ప్రజలను నేను వివిధ ముఖ్య సమూహాలుగా విభజిస్తాను. మొదటి వారు యూదులు, రెండవ వారు క్యాథలిక్కులు, మూడవ వారు క్రైస్తవులు, నాలుగవ వారు ముస్లీము లు, మరియు అయిదవ వారు బుద్దిస్టులు; ఐదు రకాలున్నాయి. అనేక రకాలైన విశ్వాసపు ప్రజలున్నారు. మూడవ రకం వారిలో దేవుడిని విశ్వసించేవారున్నారు, మరియు దానిలో మీరున్నారు. దేవుడిని ఈ రోజు అనుసరించేది ఇలాంటి విశ్వాసులే. ఈ ప్రజలు రెండు రకాలుగా విభజించబడ్డారు: దేవుడు ఎన్నుకున్న ప్రజలు, సేవ చేసేవారు. ఈ ముఖ్యమైన రకాలు స్పష్టంగా వేరు చేయబడ్డాయి. అందువలన మీరు మీ మనసులలో మనుష్యులలో రకాలు మరియు శ్రేణులను స్పష్టంగా వేరుచేయగలుగుతున్నారా, చేయలేరా? మొదటి రకం అవిశ్వాసులను కలిగి ఉంది, మరియు వారెవరో నేను చెప్పాను. ఆకాశంలో వృద్దుడిని విశ్వసించేవారిని అవిశ్వాసులుగా లెక్కించవచ్చా? చాలా మంది అవిశ్వాసులు ఆకాశంలో వృద్దుడిని మాత్రమే విశ్వసిస్తారు; వారు గాలి, వర్షం, మెరుపులు, మొదలగునవన్నీ వారు పంటలు వేయడానికి, కోయడానికి ఆధారపడే ఈ వ్యక్తి చేత నియంత్రించబడతాయని వారు విశ్వసిస్తారు- అయినప్పటికీ దేవుని యందు విశ్వాసాన్ని ప్రస్తావించినపుడు, వారు ఆయన యందు విశ్వాసం ఉంచడానికి ఇష్టపడరు. దీనిని విశ్వాసం కలిగిఉండటం అనవచ్చా? ఇలాంటి వారు అవిశ్వాసులలో కలసి ఉన్నారు. మీకు ఇది అర్దమవుతుంది, కదా? ఈ వర్గాలను తప్పుగా అర్దం చేసుకోకండి. రెండవ రకం వారిలో నమ్మిక ఉంచేవారు, మూడవ రకం వారు ప్రస్తుతం దేవుడ్ని అనుసరిస్తున్న వారు. మరి, అలాంటప్పుడు మనుషులందరినీ ఈ రకాలుగా ఎందుకు విభజించాను?(ఎందుకంటే వివిధ రకాల ప్రజలకు భిన్నమైన ముగింపు మరియు గమ్యస్తానాలు ఉన్నాయి.) అది దానిలో ఒక కోణం. ఈ వివిధ జాతుల రకాల ప్రజలు ఆధ్యాత్మిక ప్రపంచానికి తిరిగి వచ్చినపుడు, వారిలో ప్రతీఒక్కరూ ఒక భిన్నమైన ప్రదేశానికి వెళ్తారు జనన మరణ చక్రం యొక్క వివిధ చట్టాలను ఎదుర్కొంటారు, అందుకే నేను మనుషులను ఈ ముఖ్య రకాలుగా వర్గీకరించాను.
1. అవిశ్వాసుల జనన మరణ చక్రం
అవిశ్వాసుల జనన మరణ చక్రం తో మొదలు పెడదాము. మరణించిన తర్వాత, ఆ వ్యక్తి ఆధ్యాత్మిక ప్రపంచం నుండి వచ్చిన ఒక సహాయకుని ద్వారా తీసుకొని పోబడతాడు. వ్యక్తి నుండి అసలు ఏం తీసుకోబడుతుంది? శరీరం కాదు, ఆత్మ. ఒకరి ఆత్మ తీసుకొని పోబడినపుడు, అది ప్రత్యేకంగా ఇప్పుడే మరణించిన ఆత్మలను స్వీకరించే ఒక ఆధ్యాత్మిక ప్రపంచపు ప్రతినిధి సంస్త దగ్గరకి వెళ్తుంది.( గమనిక: ఎవరైనా మరణించిన తర్వాత వెళ్ళే మొదటి చోటు ఆత్మకు వింతగా ఉంటుంది.) వారు ఈ ప్రదేశానికి తీసుకొనిపోబడినపుడు, ఒక అధికారి వారి పేరు, చిరునామా, వయసు మరియు వారి అనుభవాలను నిర్దారిస్తూ ఒక అధికారి మొదట తనిఖీ నిర్వహిస్తాడు. వారు బ్రతికి ఉన్నప్పుడు చేసినదంతా ఒక పుస్తకంలో నమోదు చేయబడి, ఖచ్చితత్వం కొరకు దృవీకరించబడుతుంది. అదంతా తనిఖీ చేయబడిన తర్వాత, ఒక వ్యక్తి శిక్షించబడతాడా లేదా మళ్ళీ మనిషిగా పునర్జన్మిస్తాడా అనేది తేల్చడానికి ఆ వ్యక్తి తన జీవిత కాలమంతటా ఉన్న ప్రవర్తనను, చర్యలను పరిగణిస్తారు, ఇది మొదటి దశ. ఈ మొదటి దశ భయానకంగా ఉందా? ఇది మరీ అంతా భయానకంగా లేదు, ఎందుకంటే ఇక్కడ జరిగింది కేవలం ఒక మనిషి చీకటి గా ఉన్న అపరిచిత ప్రదేశానికి రావడమే.
రెండవ దశలో, ఈ వ్యక్తి తన జీవిత కాలమంతటిలోనూ చాలా చెడ్డ పనులు చేసి, అనేక దుర్మార్గాలకు పాల్పడితే, అప్పుడు వారు శిక్షను ఎదుర్కోవాల్సిన ప్రదేశానికి తీసుకుపోబడతారు. అది అచ్చంగా ప్రజలను శిక్షించడానికి వాడే స్తలం. వారు ఎలా ప్రత్యేకంగా శిక్షించబడతారు అనేది చనిపోయే ముందు వారు చేసిన పాపాల మీద, అలాగే వారు పాల్పడిన దుర్మార్గాల మీద ఆధారపడి ఉంటుంది- రెండవ దశలో ఎదురయ్యే మొదటి సంఘటన ఇది. చనిపోయే ముందు వారు చేసిన చెడ్డ పనులకు, వారు పాల్పడిన దుష్టత్వానికి గానూ, మళ్ళీ వారు శిక్ష తర్వాత పునర్జన్మించినపుడు- మళ్ళీ వారు మరొక సారి భౌతిక ప్రపంచంలో జన్మించినపుడు- కొంత మంది మనుషులుగా కొనసాగుతారు, మరికొంతమంది జంతువులుగా మారతారు. చెప్పాలంటే, ఒక వ్యక్తి ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తిరిగి వచ్చాక, వారు పాల్పడిన దుష్టత్వానికి గాను శిక్షకు గురవుతారు; అంతేకాక వారు పాల్పడిన దుర్మార్గాల వలన, వారి పునర్జన్మలో మనుషులు గా కాక జంతువులుగా తిరిగి వస్తారు. ఆ జంతువుల శ్రేణిలో ఆవులు, గుర్రాలు, పందులు, కుక్కలుగా ఉంటాయి. వారు జంతువులుగా పునర్జన్మ పొందిన తర్వాత కొంతమంది పక్షులుగా, బాతులుగా, నీటి బాతులుగా పుట్టవచ్చు.. వారు మరలా మరణించాక, వారు ఆధ్యాత్మిక ప్రపంచానికి తిరిగి వస్తారు. అక్కడ, మునపటిలా, చావుకి ముందు వారి ప్రవర్తన ఆధారంగా వారు మానవులుగా పునర్జన్మిస్తారా లేదా అనేది ఆధ్యాత్మిక ప్రపంచం నిర్ణయిస్తుంది. చాలా మంది ప్రజలు ఎక్కువ చెడును చేస్తారు, వారి పాపాలు అతి ఘోరమైనవి, కాబట్టి వారు ఏడు నుండి పన్నెండు సార్ల వరకూ జంతువులుగా పునర్జన్మిస్తారు- ఇది భయానకంగా లేదా?( ఇది భయానకంగా ఉంది.) మిమ్మ్లల్ని ఏది భయపెడుతుంది? ఒక మనిషి జంతువుగా మారడం- ఇది భయానకంగా ఉంది. ఒక మనిషికి జంతువుగా మారడం గురించి ఉండే అత్యంత భాదాకరమైన విషయాలు ఏమిటి? భాష లేకపోవడం, కేవలం సాధారణమైన ఆలోచనలు కలిగి ఉండటం, కేవలం జంతువులు మాత్రమే చేయగలిగే పనులు చేయడం మరియు జంతువులు తినేది తినడం, జంతువు యొక్క సాధారణమైన మనస్తత్వం మరియు శరీర భాష కలిగి ఉండటం, తిన్నగా నడవలేకపోవడం, మనుషులతో సంభాషించలేకపోవడం, మనుషుల చర్యలు లేదా ప్రవర్తనతో దేనితోనూ జంతువులకి ఎలాంటి సంబంధం లేదు అనే వాస్తవం. అంటే, అన్ని విషయాలలో, జంతువుగా ఉండటం అనేది మిమ్మల్ని అంత్యంత హీన జీవిగా చేస్తుంది మరియు మనిషి కన్నా ఎక్కువ వేదన ఉంటుంది. చాలా చెడుకు పాల్పడిన మరియు ఘోరమైన పాపాలు చేసిన వారికి అధ్యాత్మిక ప్రపంచం విధించే శిక్ష యొక్క ఒక కోణం. శిక్ష యొక్క తీవ్రత విషయానికి వస్తే, అది వారు ఎలాంటి జంతువు అవుతారు అనేదానిపైన ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు, పంది అవ్వడం కుక్క అవ్వడం కన్నా మెరుగైనదా? పంది కుక్క కన్నా మెరుగ్గా జీవిస్తుందా లేక అద్వాన్నంగానా? అద్వాన్నంగా, అవునా? మనుషులు ఆవులు లేదా గుర్రాలు అయితే వారు పందులుగా కన్నా మెరుగ్గా జీవిస్తారా లేక అద్వాన్నంగానా? (మెరుగ్గా.) ఒక వ్యక్తికి పిల్లిగా పునర్జన్మించడం సౌకర్యంగా ఉంటుందా? అతను జంతువుగానే ఉంటాడు, పిల్లిగా ఉండటం ఆవు లేదా గుర్రంగా ఉండటం కన్నా సులభం, ఎందుకంటే పిల్లులు చాలా మట్టుకు తమ సమయాన్ని బద్దకంగా గడుపుతాయి. ఆవు లేదా గుర్రం అవడం అనేది శ్రమతో కూడుకున్నది. అందువలన, ఒక వ్యక్తి ఆవు లేదా గుర్రంగా పునర్జన్మిస్తే, వారు కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది- అది కటినమైన శిక్ష కి సమానం. ఆవు లేదా గుర్రం అవ్వడం కన్నా కుక్క అవ్వడం కాస్త మెరుగైనది, ఎందుకంటే కుక్క కి తన యజమానితో దగ్గర సంబందం ఉంటుంది. కొన్ని కుక్కలు, అనేక సంవత్సరాల పాటు పెంపుడు జంతువులుగా ఉన్న తర్వాత, వాటి యజమానులు చెప్పే వాటిలో చాలా వరకు అర్దం చేసుకోగలుగుతున్నాయి. కొన్ని సార్లు, ఒక కుక్క తన యజమాని మానసిక స్థితి మరియు అవసరాలకు అనుగుణంగా నడుచుకుంటుంది మరియు యజమాని కుక్కను మెరుగ్గా చూస్తాడు, కుక్క బాగా తింటుంది మరియు తాగుతుంది, అది నొప్పితో ఉన్నప్పుడు ఇంకా బాగా చూసుకోబడుతుంది. మరి అప్పుడు కుక్క ఒక ఆనందకరమైన జీవితాన్ని ఆస్వాదించడంలేదా? అలా, కుక్క అవ్వడం అనేది ఆవు లేదా గుర్రం అవ్వడం కన్నా మెరుగైనది. దీనిలో, ఒక వ్యక్తి యొక్క శిక్ష తీవ్రత, అతను ఎన్ని సార్లు, అలాగే ఏ విధమైన జంతువుగా పునర్జన్మిస్తాడు అనే దాన్ని నిర్దారిస్తుంది.
వారు జీవించి ఉన్నప్పుడు చాలా పాపాలు చేశారు కాబట్టి, కొంత మంది ప్రజలు ఏడు నుండి పన్నెండు జీవిత కాలాలు జంతువులుగా పునర్జన్మించడం ద్వారా శిక్షింపబడతారు. తగినన్ని సార్లు శిక్షింపబడినందున, ఆధ్యాత్మిక ప్రపంచానికి తిరిగి వచ్చిన తర్వాత, వారు మరొక చోటుకి తీసుకొని పోబడతారు-అనేక ఆత్మలు ఇప్పటికే శిక్షించబడి, మనుషులుగా పునర్జన్మించడానికి సిద్ద పడుతున్న వారు ఉన్న స్తలం. ఈ స్తలంలో, ప్రతీ ఆత్మ, వారు ఎటువంటి కుటుంబంలో పుట్టబోతున్నారు, వారు పునర్జన్మించిన తర్వాత ఎలాంటి పాత్ర పోషిస్తారు మొదలగు వాటి బట్టి వర్గీకరించబడుతుంది. ఉదాహరణకు, కొంతమంది ఈ ప్రపంచానికి వచ్చిన తర్వాత గాయకులు అవుతారు, కాబట్టి వారు గాయకుల మధ్యన ఉంచబడతారు; కొంతమంది ఈ ప్రపంచానికి వచ్చిన తర్వాత వ్యాపారవేత్తలు అవుతారు, కాబట్టి వారు వ్యాపారవేత్తల నడుమ ఉంచబడతారు; ఎవరైనా మనిషిగా మారిన తర్వాత శాస్త్రీయ పరిశోధకుడు అవ్వాలైతే అప్పుడు వారిని శాస్త్రీయ పరిశోధకుల మధ్యన ఉంచుతారు. వారు వర్గీకరింపబడిన తర్వాత, ఈ రోజుల్లో ప్రజలు ఈ- మెయిల్ పంపినట్లుగా, ప్రతీ ఒక్కరూ విభిన్నసమయంలో, నిర్ణీత తేదీ ప్రకారం పంపబడతారు. ఇందులో ఒక జీవన్మరణ చక్రం పూర్తవుతుంది. ఒక వ్యక్తి ఆధ్యాత్మిక ప్రపంచానికి వచ్చిన దగ్గర నుండి వారి శిక్ష ముగిసే వరకూ, లేదా అనేక సార్లు జంతువుగా పునర్జన్మించి, మనిషిగా పునర్జన్మించడానికి సిద్దమయ్యే వరకూ, ఈ ప్రక్రియ పూర్తవుతుంది.
శిక్ష అనుభవించి జంతువులుగా పునర్జన్మించని వారి విషయానికొస్తే, వారు మనుషులుగా అవతరించడానికి త్వరితంగా భౌతిక ప్రపంచానికి పంపబడతారా? లేదా, వారు మనుషుల మధ్యకి రావడానికి ఎంత కాలం పడుతుంది? ఇది ఎంత తరచుగా జరుగుతుంది? దానికి తాత్కాలిక పరిమితులు ఉన్నాయి. ఆధ్యాత్మిక ప్రపంచంలో ప్రతీదీ నిర్ధిష్టమైన తాత్కాలిక పరిమితులకు కట్టుబడి ఉంటుంది- నేను సంఖ్యలతో వివరిస్తే, మీరు దాన్ని అర్దం చేసుకుంటారు. అతి తక్కువ సమయంలో పునర్జన్మించిన వారు, మరణించినపుడు, మనుషులుగా పునర్జన్మించడానికి అప్పటికే ఏర్పాట్లు పూర్తయి ఉంటాయి. అది జరగగలిగే అతి తక్కువ వ్యవధి మూడు రోజులు. కొంతమందికి అది మూడు నెలలు పడుతుంది, కొంతమందికి అది మూడు సంవత్సరాలు పడుతుంది, కొంతమందికి ముప్పై సంవత్సరాలు పడుతుంది, కొంతమందికి మూడు వందల సంవత్స్రరాలు, ఇలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ తాత్కాలిక నియమాల గురించి ఏం చెప్పవచ్చు, మరియు వాటి ప్రత్యేకతలు ఏమిటి? అవి మనిషి యొక్క ప్రపంచం- భౌతిక ప్రపంచం- ఆత్మ నుండి కోరే దాని మీద, మరియు ఈ ప్రపంచంలో ఈ ఆత్మ ఏ పాత్ర పోషించబోతుంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. మనుషులు సాధారణ మానవులుగా పునర్జన్మించినపుడు, వారిలో చాలా మంది అతి త్వరగా పునర్జన్మిస్తారు, ఎందుకంటే మనిషి ప్రపంచంలో ఇలాంటి సాధారణ మానవుల అవసరం చాలా ఉంది- కాబట్టి, మూడు రోజుల తర్వాత, వారు చనిపోవడానికి ముందు ఉన్న కుటుంబానికి పూర్తిగా భిన్నమైన కుటుంబానికి తిరిగి పంపబడతారు. ఏదేమైనా, ఈ ప్రపంచంలో ప్రత్యేకమైన పాత్రను పోషించే వారు కొందరున్నారు. “ప్రత్యేకమైన” అంటే ఈ ప్రజలకి మనిషి ప్రపంచంలో ఎక్కువ డిమాండ్ లేదు అని అర్దం; ఎక్కువ మంది ఈ పాత్ర పోషించాల్సిన అవసరం లేదు, కాబట్టి అది మూడు వందల సంవత్స్రరాలు పడుతుంది. ఇది ఎందుకు? ఎందుకంటే మూడు వందల లేదా మూడు వేల సంవత్సరాల వరకూ మనిషి ప్రపంచంలో ఇలాంటి పాత్ర అవసరం లేదు, కాబట్టి వారు ఆధ్యాత్మిక ప్రపంచంలో ఎక్కడో ఒకచోట ఉంచబడతారు అనే వాస్తవం వలన. ఉదాహరణకు కన్ఫ్యూషియస్ ని తీసుకోండి: సంప్రదాయ చైనీయుల సంస్కృతి పై ఆయన ప్రభావం లోతుగా ఉంది, ఆయన రాకడ ఆ కాలపు ప్రజల సంస్కృతిని, జ్ణానాన్ని, సాంప్రదాయాన్ని, భావజాలాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. ఏదేమైనా, ఇలాంటి వ్యక్తి ప్రతీ యుగంలోనూ అవసరం లేదు, అందుకే ఆయన పునర్జన్మించడానికి మూడు వందలు లేదా మూడు వేల సంవత్సరాల పాటు ఆధ్యాత్మిక ప్రపంచంలో వేచి ఉండవలసి వచ్చింది. మనిషి ప్రపంచానికి ఇలాంటి వ్యక్తి అవసరం లేదు కాబట్టి, ఆయన ఖాళీగా ఎదురు చూడాల్సి వచ్చింది, ఎందుకంటే అతని వంటి పాత్రలు చాలా తక్కువ ఉన్నాయి, అతను చేయవలసింది చాలా తక్కువ. ఇలా, ఆయనను చాలా కాలం పాటు, ఖాళీగా, మనిషి ప్రపంచానికి ఆయన అవసరం వచ్చిన తర్వాత బయటకు పంపడానికి ఆధ్యాత్మిక ప్రపంచంలో ఒకచోట పెట్టవలసి వచ్చింది. చాలా మంది ప్రజలు పునర్జన్మ ఎంత తరచుగా అనే దానికి ఆధ్యాత్మిక రాజ్యపు తాత్కాలిక నియమాలు ఇలాంటివి. మనుషులు సాధారణమైన వారు అయినా లేదా ప్రత్యేకమైనవారు అయినా, వారి పునర్జన్మలను క్రమబద్దీకరించడానికి ఆధ్యాత్మిక ప్రపంచానికి తగిన నియమాలు మరియు సరైన ఆచరణలు ఉన్నాయి. ఈ నియమాలు, ఆచరణలు దేవుని నుండి విడుదల చేయబడ్డాయి, ఇవి ఆధ్యాత్మిక ప్రపంచపు వ్యక్తి లేదా సహాయకుడి ద్వారా నిర్ణయించబడవు లేదా నియంత్రించబడవు. మీకు ఇప్పుడు ఇది అర్దమైంది. అవునా?
ఏ ఆత్మకైనా, దాని పునర్జన్మ, ఈ జీవితంలో దాని పాత్ర ఏమిటి, అది ఏ కుటుంబంలో జన్మించింది, దాని జీవితం ఎలా ఉంటుంది అనేవి ఆత్మ యొక్క గత జీవితకాలంతో దగ్గర సంబంధం కలిగి ఉంటాయి. అన్ని రకాల మనుషులు మనిషి ప్రపంచంలోకి వస్తారు, వారు పోషించే పాత్రలు మారతాయి, అలాగే వారు చేసే పనులు కూడా. ఇవి ఏ పనులు? కొంత మంది రుణాలను తిరిగి చెల్లించడానికి వస్తారు: వారు తమ గత జన్మలలో ఇతరులకు చాలా డబ్బు బాకీ ఉంటే, ఈ జీవితంలో ఆ అప్పు తిరిగి చెల్లించడానికి వచ్చారు. అదే సమయంలో కొంతమంది ప్రజలు, రుణాలు వసూలు చేసుకోవడానికి వస్తారు: వారు తమ గత జీవితకాలాల్లో చాలా విషయాలు మరియు చాలా డబ్బు విషయంలో మోసగించబడ్డారు; దాని ఫలితంగా, వారు ఆధ్యాత్మిక ప్రపంచానికి వచ్చిన తర్వాత, అది వారికి న్యాయం చేసి, వారిని ఈ జీవిత కాలంలో తమ రుణాలు వసూలు చేసుకునేలా అనుమతిస్తుంది. కొంతమంది ప్రజలు తమ కృతజ్ణతా రుణాలను తీర్చుకోవడానికి వచ్చారు: గత జన్మకాలంలో- అంటే వారి పూర్వజన్మ లో- ఎవరో వారిపట్ల దయతో ఉన్నారు, ఈ జన్మలో పునర్జన్మించే గొప్ప అవకాశం ఉన్నందున, వారు ఆ కృతజ్ణతా రుణాలను తిరిగి చెల్లించడానికి మరలా పుట్టారు. అదే సమయంలో, మిగిలిన వారు, ప్రాణాలు తీయడానికి మరలా ఈ జీవితంలో తిరిగి జన్మించారు. వారు ఎవరి ప్రాణాలు తీస్తారు? వారిని తమ గత జన్మలలో చంపిన వారి ప్రాణాలు తీస్తారు. మొత్తానికి, ప్రతీ వ్యక్తి యొక్క ప్రస్తుత జీవితం వారి గత జనమలతో బలమైన సంబందం కలిగి ఉంటుంది; ఈ సంబందం విడదీయరానిది. చెప్పాలంటే, ప్రతీ వ్యక్తి యొక్క ప్రస్తుత జీవితం గత జన్మతో తీవ్రంగా ప్రభావితం అవుతుంది. ఉదాహరణకు, జాంగ్ అనే వ్యక్తి లీ అనే వ్యక్తి ని తను చనిపోబోయే ముందు పెద్ద మొత్తంలో మోసం చేశాడనుకుందాం. జాంగ్ అప్పుడు లీ కి ఋణపడి ఉన్నాడా? ఉన్నాడు, అప్పుడు లీ, జాంగ్ నుండి రుణం వసూలు చెయ్యడం సహజమేనా? దాని ఫలితంగా, వారు మరణించిన తర్వాత, వారిద్దరి మధ్య ఉన్న రుణం తీరిపోవాలి. వారు పునర్జన్మించినపుడు, జాంగ్ మనిషిగా మారినపుడు లీ తన రుణాన్ని అతని నుండి ఎలా వసూలు చేస్తాడు? జాంగ్ కి కుమారునిగా జన్మించడం ఒక పద్దతి; జాంగ్ పెద్ద మొత్తంలో డబ్బు సంపాదిస్తే, అదంతా లీ వృధా చేస్తాడు. జాంగ్ ఎంత డబ్బు సంపాదించినప్పటికీ, అతని కుమారుడు లీ దాన్ని వృధా చేస్తాడు. జాంగ్ ఎంత సంపాదించినా, అది ఎన్నటికీ సరిపోదు; అదే సమయంలో, అతని కుమారుడు, ఏదో కారణం చేత తన తండ్రి డబ్బును రకరకాలుగా ఖర్చు చేస్తాడు. జాంగ్ ఆశ్చర్యపోతూ, “ఎందుకు ఈ నా కుమారుడు ఎప్పుడూ దురదృష్టాన్ని తీసుకువస్తాడు? మిగతవారి కుమారులు ఎందుకు అంతా బాగా ప్రవర్తిస్తారు? నా సొంత కుమారునికి ఎందుకు ఏ లక్ష్యమూ లేదు, అతనెందుకు అంత పనికిమాలిన వాడు, డబ్బు సంపాదించడం చేతకానివాడు, నేనెందుకు ఎల్లప్పుడూ అతనికి మద్దతునివ్వాలి? అతనికి మద్దతునివ్వాలి కాబట్టి, నేను ఇస్తాను- కానీ నేను అతనికి ఎంత డబ్బిచ్చినా, అతనికెందుకు ఇంకా ఎక్కువ కావాలి? అతను నిజాయితీ తో కూడిన రోజువారీ పనిని ఎందుకు చేయలేడు, బదులుగా బేవార్సుగా తిరుగుతూ, తింటూ, తాగుతూ, వ్యభిచారం, జూదం లాంటివన్నీ చేస్తాడెందుకు? అసలేం జరుగుతుంది?” జాంగ్ అప్పుడు కొద్ది సేపు ఆలోచిస్తాడు “నేను గత జన్మలో అతనికి రుణపడి ఉన్నానేమో. మంచిది. నేను అతనికి చెల్లిస్తాను. నేను మొత్తం చెల్లించే దాకా ఇది ముగియదు!” లీ నిజంగా రుణాన్ని తిరిగి పొందే రోజు రావచ్చు, అతను నలభైల్లో, లేదా యాభైల్లో ఉన్నప్పుడు, అతను అకస్మాత్తుగా స్పృహలోకి వచ్చి, “నేను నా మొత్తం జీవితపు ప్రధమ భాగంలో ఒక్క మంచి పని కూడా చేయలేదు! నా తండ్రి సంపాదించిన డబ్బంతటినీ వృధా చేశాను. కాబట్టి నేను ఒక మంచి వ్యక్తిగా ఉండటం మొదలు పెట్టాలి. నేనే కష్టపడతాను. నేను నిజాయితీ గల వ్యక్తిగా, మంచిగా బ్రతుకుతాను. నేను నా తండ్రికి బాధను మరలా కలుగజేయను!” అతనెందుకు ఇలా ఆలోచించాడు? అతనెందుకు అకస్మాత్తుగా మంచిగా మారాడు? దీనికి ఏదైనా కారణం ఉందా? ఏమిటా కారణం?(ఎందుకంటే లీ తనకు రావలసిన రుణాన్ని వసూలు చేసుకున్నాడు; జాంగ్ తన రుణాన్ని చెల్లించాడు.) దీనిలో కార్యాకారణాలు ఉన్నాయి. ఈ కథ ఎప్పుడో, వారి ప్రస్తుత జన్మల కన్నా చాలా కాలం కిందట మొదలైంది; గత జన్మలలోని వారి కథ వర్తమానానికి తీసుకురాబడింది. ఎవర్నీ ఎవరూ నిందించలేరు. జాంగ్ తన కుమారునికి ఏమి నేర్పినప్పటికీ, అతని కుమారుడు ఎన్నడూ వినలేదు నిజాయితీగా రోజు వారీ పని కూడా చేయలేదు. కానీ రుణం తిరిగి చెల్లించబడిన రోజున, అతని కుమారునికి నేర్పవల్సిన అవసరం లేదు- అతను సహజంగానే అర్దం చేసుకున్నాడు. ఇది సులువైన ఉదాహరణ. ఇంకా ఇలాంటి ఉదాహరణలు అనేకం ఉన్నాయా? (అవును, ఉన్నాయి.) అది ప్రజలకు ఏం చెప్తుంది?(వారు మంచిగా ఉండాలి చెడు చేయకూడదు అని.) వారు ఎటువంటి చెడూ చేయకూడదు, వారి తప్పుడు పనులకు ప్రతిఫలం ఉంటుంది! చాలా మంది అవిశ్వాసులు చెడు చేస్తారు, వారి తప్పుడు పనులకు ప్రతిఫలాన్ని ఎదుర్కుంటారు, అవునా? అలాంటి ప్రతీకారం ఏకపక్షంగా ఉంటుందా? ప్రతీ చర్యకు, ఒక నేపథ్యం, మరియు దాని ప్రతీకారానికి ఒక కారణం ఉంటుంది. ఎవర్నైనా డబ్బు విషయంలో మోసం చేస్తే నీకు ఏమీ అవ్వదు అని నువ్వు అనుకుంటున్నావా? నువ్వు ఆ డబ్బును కాజేసిన తర్వాత, నువ్వు ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవు అని నువ్వు అనుకుంటున్నావా? అలా జరగడం అసంభవం; కచ్చితంగా పరిణామాలు ఉంటాయి! వారు ఎవరు, వారు దేవుడు ఉన్నాడా లేడా అనేది నమ్ముతారా అనే దానితో సంబంధం లేకుండా, ప్రతీ ఒక్కరూ తమ స్వంత ప్రవర్తనకి తప్ప్క బాధ్యత వహించి, వారి చర్యల పరిణామాలను భరించాలి. ఈ చిన్న ఉదాహరణను చూస్తే- జాంగ్ శిక్షించబడ్డాడు, లీ కి తిరిగి చెల్లించబడింది- ఇది న్యాయం కాదా? ప్రజలు ఇలాంటి పనులు చేసినపుడు, ఇలాంటి ఫలితమే వస్తుంది. ఇది ఆధ్యాత్మిక ప్రపంచపు పరిపాలన నుండి విడదీయరానిది. వారు అవిశ్వాసులు అయినప్పటికీ, దేవుడ్ని నమ్మని వారి అస్తిత్వం ఇటువంటి పరలోకపు శాసనాలు, ప్రకటనలపై ఆధారపడి ఉంటుంది. వీటి నుండి ఎవరూ తప్పించుకోలేరు, ఈ వాస్తవికతను ఎవరూ తప్పించుకోలేరు.
విశ్వాసం లేనివారు తరచుగా మనుషులకు కనపడేదంతా ఉనికిలో ఉందని, అదే కళ్ళతో చూడలేని ప్రతీదీ, ప్రజలకు చాలా దూరంలో ఉండేది, లేదని నమ్ముతారు. “జనన మరణ చక్రం” అనేది లేదని నమ్మడానికి వారు ఇష్టపడతారు; అందువలన వారు కనికరం లేకుండా పాపం చేసి, దుష్టత్వానికి పాల్పడతారు. ఆ తర్వాత, వారు శిక్షించబడతారు, లేదా జంతువులుగా పునర్జన్మిస్తారు. అవిశ్వాసులలో అనేక రకములైన ప్రజలు ఈ విష వలయంలో చిక్కుకుంటారు. ఎందుకంటే ఆధ్యాత్మిక ప్రపంచం అన్ని జీవుల నిర్వహణలో కఠినంగా ఉంటుందని వారికి తెలియదు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా, ఈ వాస్తవం ఉనికిలో ఉంది, దేవుడు తన కంటితో చూసే పరిధి నుండి ఏ ఒక్క వ్యక్తి లేదా వస్తువూ తప్పించుకోలేవు, ఏ ఒక్క వ్యక్తీ లేదా వస్తువూ ఆయన పరలోకపు శాసనాల, ప్రకటనల నియమాలను మరియు పరిమితులను తప్పించుకోలేవు. ఆ విధంగా ఈ సులువైన ఉదాహరణ ప్రజలకు చెప్పేది ఏమిటంటే నువ్వు దేవుడ్ని నమ్మినా నమ్మకపోయినా, పాపం చెయ్యడం, దుష్టత్వానికి పాల్పడటం ఆమోదయోగ్యం కాదు, మరియు ప్రతీ చర్యకు పర్యవసానాలు ఎదుర్కోవాలి. ఎవరైనా ఇంకొకరికి డబ్బు ఇవ్వకుండా మోసం చేసిన వ్యక్తి శిక్షించబడినప్పుడు, అలాంటి శిక్ష న్యాయమైనది. సాధారణంగా కనిపించే ఇలాంటి ప్రవర్తన ఆధ్యాత్మిక ప్రపంచంలో శిక్షార్హమైనది, మరియు ఇటువంటి శిక్ష దేవుని నుండి వచ్చిన పరలోకపు శాసనాలు, ప్రకటనల ద్వారా పూర్తి చేయబడుతుంది. అందువలన, తీవ్రమైన నేరం మరియు దుర్మార్గ ప్రవర్తన- అత్యాచారం మరియు దోపిడీ, మోసం మరియు వంచన, దొంగతనం మరియు దోచుకోవడం, హత్య మరియు దహనం ఇలా- ఇలాంటివి మరింత వేర్వేరు తీవ్రత లతో కూడిన శిక్షా శ్రేణిలో ఉంటాయి. వేర్వేరు తీవ్రతలతో కూడిన శిక్షలలో ఏం ఉంటాయి? కొన్ని శిక్షలు కాలాన్ని వాడుకొని తీవ్రత స్తాయిని నెల్కొల్పుతాయి, కొన్ని విభిన్న పద్దతుల ద్వారా అలా చేస్తాయి; కానీ మరికొందరు పునర్జన్మ పొందిన తర్వాత ఎక్కడికి వెళ్లాలో నిర్ణయించడం ద్వారా చేస్తారు. ఉదాహరణకు, కొంత మంది దుర్భాషలాడుతూ ఉంటారు. ఈ “దుర్భాషలాడటం” దేనిని సూచిస్తుంది? అది ఇతరులను తరచుగా దూషించడం మరియు ఇతరులను శపించడానికి ద్వేషపూరిత భాష ను వాడుకోవడం అని అర్దం. ద్వేషపూరిత భాష దేనిని సూచిస్తుంది? అది ఆ వ్యక్తికి ద్వేషపూరిత హృదయం ఉందని తెలుపుతుంది. ఇతరులను శపించే అసభ్యకరమైన భాష తరచుగా అలాంటి వ్యక్తుల నోటి నుండి వస్తుంది మరియు అలాంటి ద్వేషపూరిత భాష తీవ్ర పరిణామాలను తీసుకువస్తుంది. ఆ మనుషులు మరణించి, తగిన శిక్షను అనుభవించాకా, వారు తిరిగి మూగవారిగా జన్మించవచ్చు. కొంత మంది బ్రతికి ఉండగానే ఎక్కువ లెక్కలు వేస్తూ ఉంటారు; వారు ఇతరులను తమ ప్రయోజనాల కోసం వాడుకుంటారు, వారి అల్ప ఎత్తుగడలు మరీ ముఖ్యం బాగా ప్రణాళికా బద్దంగా ఉంటాయి, మరియు వారు ప్రజలకు చాలా హాని చేస్తారు. వారు తిరిగి జన్మించాకా, వారు మంద బుద్ధి లేదా మానసిక వైకల్యం గల వారిగా అవ్వచ్చు. కొంత మంది పక్క వారి విషయాల్లోకి తొంగి చూస్తుంటారు; వారి కళ్ళు వారికి తెలియకూడని వాటిని చూస్తాయి, వారు తెలుసుకోకూడనివి వారు చాలా తెలుసుకుంటారు. దాని ఫలితంగా, వారు తిరిగి జన్మించినపుడు వారు గుడ్డివారవ్వచ్చు. కొంతమంది జీవించి ఉన్నప్పుడు చాలా చురుకుగా ఉంటారు; వారు తరచుగా కొట్లాడుతూ చాలా చెడుకి పాల్పడతారు. దీని వలన, వారు వికలాంగులుగా, కుంటిగా, లేదా ఒక చెయ్యి కోల్పోయి తిరిగి జన్మించవచ్చు; లేదా వారు గూని వారిగా, మెడ వంకరతో, కుంటుతూ నడుస్తూ, ఒక కాలు కన్నా ఇంకో కాలు తక్కువ పొడవుతో, ఇలా పునర్జన్మించవచ్చు. దీనిలో, వారు జీవించి ఉన్నప్పుడు చేసిన చెడు స్థాయిల ఆధారంగా వివిధ శిక్షలకు గురవుతారు. కొంతమందికి మెల్లకన్ను ఎందుకు ఉంటుందని మీరు అనుకుంటున్నారు? అలాంటి వారు చాలా మంది ఉన్నారా? ఈ రోజుల్లో కొద్ది మంది కాకుండా చాలా మందే ఉన్నారు. కొంతమందికి మెల్లకన్ను ఎందుకు ఉంటుందంటే వారి గత జన్మలలో వారి కళ్ళను తీవ్రంగా వాడి, చాలా చెడ్డ పనులు చేశారు, కాబట్టి ఈ జన్మలో వారు మెల్లకన్నుతో పుట్టారు, తీవ్రమైన సంధార్భాలలో వారు గుడ్డి వారిగా కూడా పుట్టారు. ఇది ప్రతీకారం! కొంతమంది చనిపోయే ముందు ఇతరులతో మంచిగా ఉంటారు; వారి బంధువులు, స్నేహితులు, సహోద్యోగులు లేదా వారితో సంబందం ఉన్న వారి కొరకు చాలా మంచి పనులు చేస్తారు. వారు ఇతరులకు విరాళం, రక్షణ ఇస్తారు, లేదా వారికి ఆర్దికంగా సహాయం చేస్తారు, మరియు ప్రజలు వారి గురించి గొప్పగా అనుకుంటారు. ఇలాంటి వ్యక్తులు ఆధ్యాత్మిక ప్రపంచానికి తిరిగి వచ్చినపుడు, వారు శిక్షించబడరు. ఒక అవిశ్వాసి ఏ రకంగానూ శిక్షించబడలేదు అంటే అతను చాలా మంచి వ్యక్తి అయి ఉంటాడు. దేవుని ఉనికిని విశ్వసించకుండా, వారు కేవలం ఆకాశంలో వృద్దుడిని విశ్వసించారు. ఇలాంటి వ్యక్తి తమకన్నా గొప్పగా ఒక ఆత్మ ఉందని, వారు చేసేదంతా చూస్తుందని మాత్రమే విశ్వసిస్తారు- ఆ వ్యక్తి నమ్మేదంతా ఇదే. ఫలితంగా ఈ వ్యక్తి మరింత మంచిగా ప్రవర్తిస్తాడు. ఇలాంటి వ్యక్తులు దయ గల హృదయంతో, దాతృత్వం కలిగి ఉంటారు, వారు అంతిమంగా ఆధ్యాత్మిక ప్రపంచానికి తిరిగి వచ్చినపుడు, అది వారిని మంచిగా చూస్తుంది, వారు అతి త్వరలోనే పునర్జన్మిస్తారు. వారు తిరిగి జన్మించినపుడు, వారు ఎటువంటి కుటుంబాలలోకి వస్తారు? ఇలాటి కుటుంబాలు సంపన్నమైనవి కాకపోయినప్పటికీ, వారు ఎటువంటి హాని నుంచైనా విముక్తితో ఉంటారు, వారి సభ్యులతో సామరస్యంగా ఉంటారు; అక్కడ, ఈ పునర్జన్మించిన ప్రజలు సురక్షితమైన, ఆనందదాయక దినాలు గడుపుతారు, ప్రతీ ఒక్కరూ సంతోషంతో మంచి జీవితాలను జీవిస్తారు. ఈ మనుషులు యుక్త వయసుకి వచ్చాక,వారికి పెద్ద, పెద్ద కుటుంబాలు ఉంటాయి, వారి పిల్లలు ప్రతిభావంతులై విజయాన్ని ఆస్వాదిస్తారు, మరియు వారి కుటుంబాలు గొప్ప సంపదను అనుభవిస్తాయి- ఇలాంటి ఫలితం ఈ ప్రజల గత జన్మలతో తీవ్రంగా ముడిపడి ఉంటుంది. అంటే, వారు చనిపోయి పునర్జన్మ పొందిన తర్వాత ఎక్కడికి వెళతారు, వారు మగవారా లేదా ఆడవారా, వారి లక్ష్యాలు ఏమిటి, వారు జీవితంలో ఏమి చేస్తారు, వారు ఎలాంటి ఒడిదుడుకులను ఎదుర్కొంటారు, వారు ఎలాంటి ఆశీర్వాదాలను అనుభవిస్తారు, వారు ఎవరిని కలుస్తారు, వారికి ఏమవుతుంది- ఇవన్నీ ఎవరూ ఊహించలేరు, తప్పించుకోలేరు, లేదా వాటి నుండి దాక్కోలేరు. చెప్పాలంటే, ఒకసారి నీ జీవితం స్తిరపడిన తర్వాత, నీకు ఏం జరిగినా- నువ్వు దాన్ని ఎలా తప్పించుకోవాలని, ఏ విధంగా చూసినా- ఆధ్యాత్మిక ప్రపంచంలో దేవుడు నీ కొరకు నిర్దేశించిన జీవన గమనాన్ని ఉల్లంఘించే దారి నీకు లేదు. ఎందుకంటే నువ్వు పునర్జన్మ పొందే టప్పటికే, నీ జీవితం యొక్క విధి స్తిర పరచబడింది. ఇది మంచిదైనా, చెడ్డదైనా ప్రతి ఒక్కరూ దీనిని ఎదుర్కొంటూ ముందుకు సాగాలి. ఇది ఈ ప్రపంచంలో నివసించే ఎవ్వరూ తప్పించుకోలేని సమస్య, ఏ సమస్యా దీనంత వాస్తవం కాదు. నేను చెప్పేదంతా మీరందరూ అర్దం చేసుకున్నారు, అవునా?
ఈ విషయాలను అర్దం చేసుకున్నాక, అవిశ్వాసుల జనన మరణ చక్రం కోసం దేవుడు చాలా ఖచ్చితమైన మరియు కఠినమైన తనిఖీలు మరియు పరిపాలనను కలిగి ఉన్నాడని మీరు ఇప్పుడు చూశారా? మొదటగా ఆయన అనేక పరలోకపు శాసనాలు, ప్రకటనలు, మరియు ఆధ్యాత్మిక రాజ్యపు వ్యవస్తలను ఏర్పాటు చేశాడు, ఒకసారి ఇవి ప్రకటించబడిన తర్వాత, దేవుని ద్వారా నిర్దేశించబడినట్టు, ఆధ్యాత్మిక ప్రపంచంలోని వివిధ అధికారక స్తానాల్లో ఉన్న వ్యక్తుల ద్వారా అవి చాలా నిక్కచ్చిగా అమలు చేయబడతాయి, వాటిని ఉల్లంఘించే సాహసం ఎవరూ చేయరు, వాటిని ఎవరూ అతిక్రమించలేరు. అందువలన, మనిషి ప్రపంచంలోని మానవజాతి జనన మరణ చక్రంలో, ఎవరైనా జంతువుగా లేదా మానవుడిగా పునర్జన్మ పొందినా, ఇరువురికీ చట్టాలున్నాయి. ఈ చట్టాలు దేవుని నుండి వచ్చినందున, వాటిని ఉల్లంఘించడానికి ఎవరూ సాహసించరు లేదా ఎవరూ వాటిని ఉల్లంఘించలేరు. ఇటువంటి చట్టాలు ఉన్నాయి కాబట్టే, ప్రజలు చూసే భౌతిక ప్రపంచం క్రమబద్దంగా, పద్దతిగా ఉంది; కేవలం దేవుని సార్వభౌమత్వం వలన మాత్రమే మనుషులు తమకు పూర్తిగా అగోచరమైన మరో ప్రపంచంతో శాంతియుతంగా సహజీవనం చేయగలుగుతున్నారు, దానితో సామరస్యంగా జీవించగలుగుతున్నారు- ఇదంతా దేవుని సార్వభౌమత్వం నుండి విడదీయరానిది. ఒక మనిషి శారీరక జీవితం ముగిశాక, ఆత్మకు ఇంకా ప్రాణం ఉంటుంది, అది దేవుని పరిపాలన కింద లేకపోతే ఏమవుతుంది? ఆత్మ ప్రతీ చోటుకి తిరుగుతుంది, ప్రతీచోట చొరబడుతుంది, మనిషి ప్రపంచంలో ని జీవులకు హాని కూడా తలపెడుతుంది. ఇలాంటి హాని మానవాళికి మాత్రమే కాదు జంతువులకు, మొక్కలకు కూడా కలగవచ్చు- ఏదేమైనా, మొదట హాని కలిగేది మాత్రం మనుషులకే. ఇదే జరిగితే- ఇలాంటి పాలన లేని ఆత్మ, నిజంగా ప్రజలకి హాని చేస్తే, దుర్మార్గమైన పనులకు పాల్పడితే- అలాంటప్పుడు ఈ ఆత్మ కూడా ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా సరిగా వ్యవహరించబడుతుంది: విషయాలు తీవ్రమైతే, ఆత్మ త్వరలోనే ఉనికిలో లేకుండా పోతుంది, మరియు నాశనమవుతుంది. చెప్పాలంటే, వివిధ ఆత్మల ఆధ్యాత్మిక ప్రపంచం యొక్క పరిపాలన క్రమబద్దమైనది, మరియు దశలు మరియు నియమాలకు అనుగుణంగా నిర్వహించబడుతుంది. కేవలం ఇలాంటి పాలన వల్ల మాత్రమే మనిషి భౌతిక ప్రపంచం అరాచకత్వం లోకి వెళ్లలేదు, ఎందుకంటే భౌతిక ప్రపంచంలోని మనుషులు సాధారణ మనస్తత్వాన్ని, ఒక సాధారణ హేతుబద్దతను, ఒక క్రమబద్దమైన శారీరక జీవితాన్ని కలిగి ఉంటారు. మానవాళి ఇలాంటి సాధారణ జీవితాన్ని గడిపిన తర్వాత మాత్రమే శరీరంలో జీవించేవారు తరాల పాటు వృద్ధి చెందుతూ పునరుత్పత్తి చేయగలరు.
మీరు ఇప్పుడు విన్న మాటలను గురించి ఏమనుకుంటున్నారు? ఇవి మీకు కొత్తగా ఉన్నాయా? ఈ రోజు సహవాసం మీకు ఎలాంటి అనుభవాలను మిగిల్చింది? కొత్తదనం కాకుండా, మీకు ఇంకేమైనా అనిపించిందా? (ప్రజలు మంచిగా ప్రవర్తించాలి, దేవుడు గొప్పవాడు మరియు ఆరాధించ వలసినవాడు అని మనం చూడవచ్చు.) (దేవుడు వివిధ రకాలైన వ్యక్తుల ముగింపులను ఎలా ఏర్పాటు చేస్తాడనే దాని గురించి దేవుని భోధను ఇప్పుడు విన్నాక, ఒక విషయంలో ఆయన స్వభావం ఎటువంటి నేరాన్ని అనుమతించదని, నేను ఆయన్ని ఆరాధించాలని నేను భావిస్తున్నాను. ఇంకో విషయంలో, దేవుడు ఎలాంటి ప్రజలను ఇష్టపడతాడు, ఎలాంటి ప్రజలను ఇష్టపడడు అనేది నాకు తెలిసింది, కాబట్టి ఆయన ఇష్టపడేవారిలో ఒకనిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను.) ఈ విభాగంలో దేవుడు తన చర్యలలో సూత్రప్రకారం ఉన్నాడని మీరు గమనించారా? ఆయన ఏ సూత్రాల ప్రకారం పనిచేస్తాడు? (ప్రజలు చేసే వాటన్నిటి ప్రకారం ఆయన ప్రజల ముగింపులను నిర్దేశిస్తాడు.) ఇది మనం ఇప్పుడే మాట్లాడిన అవిశ్వాసుల వివిధ ముగింపుల గురించినది. అవిశ్వాసుల విషయానికి వస్తే, దేవుని చర్యల వెనుక ఉన్న సూత్రం మంచివారికి ప్రతిఫలమివ్వడం మరియు చెడ్డవారిని శిక్షించడమేనా? ఏమైనా మినహాయింపులు ఉన్నాయా? (లేవు.) దేవుని చర్యల వెనుక ఒక సూత్రం ఉందని మీరు గమనిస్తున్నారా? అవిశ్వాసులు దేవుడ్ని నిజంగా విశ్వసించరు, ఆయన ఏర్పాట్లకు కూడా కట్టుబడరు. పైగా, వారు ఆయన సార్వభౌమత్వం గురించి ఎరుకలో ఉండరు, వారు ఆయనను అసలే గుర్తించరు. మరింత తీవ్రంగా దేవునికి వ్యతిరేకంగా వారు అపచారం చేస్తారు, ఆయనను శపిస్తారు, దేవుడ్ని విశ్వసించే వారి పట్ల శతృత్వం కలిగి ఉంటారు. వారికి దేవుని పట్ల ఈ వైఖరి ఉన్నప్పటికీ, వారి పట్ల ఆయన పరిపాలన ఇప్పటికీ ఆయన సూత్రాల నుండి వైదొలగలేదు; ఆయన వారిని ఆయన నియమాలు మరియు ఆయన స్వభావానికి అనుగుణంగా ఒక క్రమ పద్దతిలో పరిపాలిస్తాడు. వారి శతృత్వాన్ని ఆయన ఎలా చూస్తాడు? అజ్ణానం గా! దాని ఫలితంగా, ఆయన ఈ ప్రజలను- అంటే, అవిశ్వాసులలో అత్యధికులైన వారిని- గతంలో జంతువులుగా పునర్జన్మించేలా చేశాడు. కాబట్టి, దేవుని దృష్టిలో, ఖచ్చితంగా అవిశ్వాసులు అంటే ఏమిటి? వారందరూ మృగాలు. దేవుడు మనుషులను అలాగే మృగాలను కూడా పరిపాలిస్తాడు, ఇలాంటి ప్రజల కొరకు ఆయన దగ్గర అవే నియమాలు ఉన్నాయి. ఈ ప్రజల పట్ల ఆయన పరిపాలనలో కూడా, ఆయన స్వభావం, అలాగే సమస్తమైన వాటిపైన ఆయన ఆధిపత్యం వెనుక ఉన్న ఆయన నియమాలు కూడా ఇప్పటికీ కనపడతాయి. కాబట్టి, నేను ఇప్పుడే ప్రస్తావించిన అవిశ్వాసులను ఆయన పాలించే సూత్రాలలో దేవుని సార్వభౌమత్వాన్ని మీరు చూస్తున్నారా? మీరు దేవుని నీతివంతమైన స్వభావాన్ని చూస్తున్నారా? (మేము చూస్తున్నాము.) మరో విధంగా చెప్పాలంటే, ఆయన వ్యవహరించే అన్ని విషయాలలో దేనినైనా, దేవుడు తన స్వంత సూత్రాలు మరియు స్వభావం ప్రకారం వ్యవహరిస్తాడు. ఇది దేవుని గుణం; ఆయన నిర్దేశించిన శాసనాలు లేదా పరలోకపు ప్రకటనలను ఆయన అంత తేలికగా అతిక్రమించడు ఎందుకంటే ఆయన ఇలాంటి ప్రజలను మృగాలుగా పరిగణిస్తాడు. దేవుడు అంతిమంగా ఒక నియమం ప్రకారం వ్యవహరిస్తాడు, అలక్ష్యంగా అస్సలు ఉండడు, ఆయన చర్యలు ఏ కారణం తోనూ ప్రభావితం చెందవు. ఆయన చేసే ప్రతీదీ ఆయన స్వంత నియమాలకు కట్టుబడి ఉంటుంది. ఇది ఎందుకంటే దేవుడు స్వయంగా దేవుని గుణాన్ని కలిగి ఉంటాడు; ఆయన గుణంలోని ఈ విషయం సృష్టించబడిన ఏ జీవీ కలిగి ఉండలేదు. దేవుడు తాను సృష్టించిన సమస్తమైన వాటిలో ప్రతి వస్తువు, వ్యక్తి మరియు జీవిని నిర్వహించడంలో, సంప్రదించడంలో, పర్యవేక్షణలో, నిర్వహణలో మరియు పాలించడంలో ఎరుకతో, బాధ్యతతో ఉంటాడు, మరియు ఇందులో ఆయన ఎప్పుడూ అజాగ్రత్తగా ఉండడు. మంచిగా ఉన్నవారికి, ఆయన దయాళువై, కృపతో ఉంటాడు; దుర్మార్గులకి, ఆయన పశ్చాత్తాపం లేని శిక్షను విధిస్తాడు; మరియు వివిధ జీవుల కొరకు, వివిధ సమయాలలో మానవ ప్రపంచం యొక్క వివిధ అవసరాలకు అనుగుణంగా ఆయన సకాలంలో మరియు క్రమ పద్ధతిలో తగిన ఏర్పాట్లు చేస్తాడు, దాని వలన ఈ వివిధ జీవులు తాము క్రమపద్దతిలో పోషించే పాత్రల ప్రకారం పునర్జన్మ పొందుతాయి మరియు ఆధ్యాత్మిక ప్రపంచానికి, భౌతిక ప్రపంచానికి ఒక క్రమ మార్గంలో చలిస్తూ ఉంటాయి.
జీవి మరణం- భౌతిక జీవితపు ముగింపు- జీవి భౌతిక ప్రపంచం నుండి ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్లిందని తెలుపుతుంది, అదే ఒక కొత్త జీవి పుట్టుక, ఒక జీవి అధ్యాత్మిక ప్రపంచం నుండి భౌతిక ప్రపంచానికి వచ్చి దాని పాత్రను పోషించడానికి, చేపట్టడానికి సిద్దమయ్యింది అని తెలుపుతుంది. జీవి యొక్క నిష్క్రమణ లేదా రాకడ ఏదైనా సరే, రెండూ ఆధ్యాత్మిక ప్రపంచపు పని నుండి విడదీయరానివి. ఎవరైనా భౌతిక ప్రపంచంలోకి వచ్చే సమయానికి, ఆ వ్యక్తి ఏ కుటుంబానికి వెళ్తాడు, వారు ఏ యుగంలో చేరుకుంటారు, వారు ఏ గంటకు చేరుకుంటారు మరియు వారు ఏ పాత్ర పోషిస్తారు అనే విషయాలపై ఆధ్యాత్మిక ప్రపంచంలో దేవుని చేత అప్పటికే తగిన ఏర్పాట్లు నిర్వచనాలు రూపొందించబడి ఉంటాయి. ఎలాంటివంటే, ఈ వ్యక్తి మొత్తం జీవితం- వారు చేసే పనులు, వారు ఎంచుకునే దారులు-ఆధ్యాత్మిక ప్రపంచంలో చేసిన ఏర్పాట్ల ప్రకారం, కొంచెం కూడా తప్పిపోకుండా కొనసాగుతుంది. ఇంకా ముందుకు వెళ్తే, భౌతిక జీవితం ముగిసే కాలం, అది ముగిసే విధానం మరియు స్తలం ఆధ్యాత్మిక ప్రపంచానికి స్పష్టంగా మరియు గుర్తించదగినవిగా ఉంటాయి. దేవుడు భౌతిక ప్రపంచాన్ని పాలిస్తాడు మరియు ఆయన ఆధ్యాత్మిక ప్రపంచాన్ని కూడా పాలిస్తాడు మరియు ఆయన ఒక ఆత్మ యొక్క సాధారణ జనన మరణ చక్రాన్ని ఆలస్యం చేయడు, ఆ చక్రం యొక్క ఏర్పాట్లలో ఆయన ఎలాంటి తప్పులు చేయడు కూడా. ఆధ్యాత్మిక ప్రపంచపు అధికారక హోదాలో ఉన్న ప్రతీ ఒక్క సహాయకుడు దేవుని నియమాలు మరియు ఆదేశాలకు అనుగుణంగా తమ వ్యక్తిగత పనులను నిర్వహిస్తారు, వారు చేయవలసినది చేస్తారు. ఆ విధంగా, మనిషి ప్రపంచంలో, మనిషి తలపెట్టే ప్రతీ భౌతిక క్రియ క్రమముగా, ఎటువంటి గందరగోళం లేకుండా ఉంటుంది. ఇదంతా సమస్తమైన వాటిపైనా దేవుని క్రమబద్దమైన పాలన, అలాగే ఆయన ఆధిపత్యం అన్నిటినీ పాలిస్తుంది అనే వాస్తవం వలన జరుగుతుంది. ఆయన ఆధిపత్యం మనిషి జీవించే భౌతిక ప్రపంచం, ఇంకా ఎక్కువగా మానవాళి వెనుక ఉన్న అగోచరమైన ఆధ్యాత్మిక ప్రపంచం పైన ఉంటుంది. కాబట్టి, మనుషులు మంచి జీవితం కావాలని కోరుకుంటే, ఆహ్లాదకరమైన పరిసరాలలో నివశించాలని ఆశిస్తే, మొత్తం కనపడే భోతుయిక ప్రపంచం తోపాటు, వారికి ఆధ్యాత్మిక ప్రపంచం కూడా అందించబడాలి, దాన్ని ఎవరూ చూడలేరు, అది మానవాళి తరపున ప్రతీ జీవిని పాలిస్తుంది, మరియు అది క్రమబద్దంగా ఉంటుంది. ఆ విధంగా, దేవుడు సమస్తమైన వాటి జీవానికి మూలం అని చెప్పిన తరువాత, మనం “సమస్తమైన” వాటిపై మన ఎరుక మరియు అవగాహనను పెంచుకోలేదా? (అవును.)
2. వివిధ రకాలైన విశ్వాసుల జనన మరణ చక్రం
మనం ఇప్పుడే మొదటి వర్గంలోని, ప్రజల జనన మరణ చక్రం గురించి చర్చించాము. వారు అవిశ్వాసులు. ఇప్పుడు, రెండవ వర్గం గురించి చర్చిద్దాం, వారు అనేక రకములైన విశ్వాసులు. “ వివిధ రకములైన విశ్వాసుల జనన మరణ చక్రం” అనేది మరొక ముఖ్యమైన అంశం, మీరు అర్దం చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. మొదటగా, “విశ్వాసులైన ప్రజలు” అనే దాంట్లో విశ్వాసం అనేది ఏ రకమైన విశ్వాసాన్ని సూచిస్తుంది: జుడాయిజం, క్రైస్తవ్యం, కాథలికిజమ్, ఇస్లాం, మరియు బుద్దిజం. అవిశ్వాసులకు అదనంగా, ఈ ఐదు మతాలను విశ్వసించే వారు ప్రపంచ జనాభాలో అధిక శాతం వారు ఉన్నారు. ఈ ఐదు మతాలలో, వారి విశ్వాసాన్ని వృత్తిగా చేసుకున్న వారు చాలా తక్కువ, అయినప్పటికీ ఈ మతాలకు చాలా మంది అనుచరులు ఉన్నారు. వారు మరణించిన తర్వాత వారు ఒక విభిన్నమైన చోటుకి వెళ్తారు. ఎవరికన్నా “విభిన్నం”? అవిశ్వాసుల కన్నా- ఏ విశ్వాసమూ లేని ప్రజలు- మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న వారు. వారు మరణించిన తర్వాత, ఈ ఐదు మత విశ్వాసులు అవిశ్వాసులకు భిన్నంగా మరోచోటకి వెళ్తారు. ఏదేమైనా, అది ఇంకా అదే ప్రక్రియ. ఆధ్యాత్మిక ప్రపంచం వారు మరణించే ముందు చేసినదానంతటినీ తీర్పు తీరుస్తుంది, దాని తర్వాత వారు దానికి అనుగణంగా క్రమబద్దీకరించబడతారు. మరి ఎందుకు ఈ ప్రజలు క్రమబద్దీకరించబడుటకు వేరొక చోటుకి పంపబడతారు? దీనికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. ఏమిటది? నేను దీనిని ఒక ఉదాహరణతో వివరిస్తాను. అయితే, నేను వివరించే ముందు “బహుశా వారికి దేవుని యందు కొద్దిగా విశ్వాసం ఉంది! వారు పూర్తిగా అవిశ్వాసులు కారు.” అని మీరు అనుకుంటూ ఉండి ఉంటారు. ఏదేమైనా, ఇది కారణం కాదు. వారు ఇతరుల నుండి దూరంగా పెట్టబడటానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది.
ఉదాహరణకు బౌద్దమతాన్ని తీసుకోండి. నేను మీకోక వాస్తవాన్ని చెప్తాను. మొదటగా, ఒక బౌద్ద మతస్తుడు అంటే బౌద్ద మతంలోనికి మారినవాడు, ఈ వ్యక్తికి తన విశ్వాసం ఏంటో తెలుసు. బౌద్ద మతస్తులు తమ జుట్టు కత్తిరించుకొని సన్యాసులు లేదా సన్యాసినులుగా మారినపుడు, మానవ ప్రపంచపు ఘోషని విడిచి వారు లౌకిక ప్రపంచం నుండి తమని తాము వేరు పరుచుకున్నారు అని అర్దం. ప్రతిరోజూ, వారు సూత్రాలను పఠిస్తారు మరియు బుద్ధుని నామాలను జపిస్తారు, శాకాహారం మాత్రమే భుజిస్తారు, సన్యాసి జీవితాలను గడుపుతారు మరియు వెన్న దీపం యొక్క చల్లని, అల్పమైన కాంతితో మాత్రమే వారి రోజులు గడుపుతారు. వారి జీవితాంతం ఇలానే గడుపుతారు. ఒక బౌద్ద మతస్తుని భౌతిక జీవితం ముగిశాక, వారు తమ జీవితం గురించిన ఒక సారాంశాన్ని తయారు చేస్తారు, కానీ వారి హృదయంలో వారు మరణించిన తర్వాత వారు ఎక్కడికి వెళ్తారో, ఎవర్ని కలుస్తారో, ఫలితం ఎలా ఉంటుందో వారికి తెలియదు: లోలోపల, ఇలాంటి విషయాల పట్ల వారికి ఒక స్పష్టమైన అవగాహన ఉండదు. వారు తమ జీవితమంతా గుడ్డిగా ఒక విధమైన విశ్వాసాన్ని కలిగి ఉండటం తప్ప మరేమీ చేయలేరు, దాని తర్వాత వారు తమ గుడ్డి కోరికలు మరియు ఆదర్శాలతో పాటు మానవ ప్రపంచం నుండి విడిపోతారు. బౌద్ధులు జీవించే ప్రపంచాన్ని విడిచిపెట్టినప్పుడు బౌద్దుల భౌతిక జీవితపు ముగింపు ఇలా ఉంటుంది; దాని తర్వాత, ఆధ్యాత్మిక ప్రపంచంలోని వారి అసలైన స్తానమ్లోకి తిరిగి వస్తారు. ఈ వ్యక్తి భూమికి తిరిగి రావడానికి మరియు వారి స్వీయ-సాగును కొనసాగించడానికి పునర్జన్మ పొందాడా లేదా అనేది వారి మరణానికి ముందు వారి ప్రవర్తన మరియు ఆచరణపై ఆధారపడి ఉంటుంది. వారు తమ జీవితకాలంలో ఏ తప్పు చేయకపోతే, వారు త్వరగా పునర్జన్మ పొంది తిరిగి భూమి పైకి పంపబడతారు. అక్కడ ఈ వ్యక్తి మరొకసారి సన్యాసి లేదా సన్యాసిని అవుతారు. అంటే, వారు తమ భౌతిక జీవితంలో మొదటిసారిగా స్వయంకృషిని ఎలా అభ్యసించారో దానికి అనుగుణంగా స్వయంకృషిని అభ్యసిస్తారు, ఆపై వారి భౌతిక జీవితం ముగిసిన తర్వాత ఆధ్యాత్మిక రంగానికి తిరిగి వస్తారు, అక్కడ వారు పరీక్షించబడతారు. ఆ తర్వాత, ఏ సమస్యలు లేకపోతే, వారు మరొకసారి మనిషి ప్రపంచానికి తిరిగి వచ్చి మరలా బౌద్ద మతంలోకి మార్పు చెందుతారు, అలా వారి అభ్యాసాన్ని కొనసాగిస్తారు. మూడు నుండి ఏడు సార్లు పునర్జన్మ పొందిన తర్వాత, వారు మరొకసారి ప్రతీ భౌతిక ప్రపంచం ముగిసిన తర్వాత వెళ్ళే ఆధ్యాత్మిక ప్రపంచానికి తిరిగి వస్తారు. మానవ ప్రపంచంలో వారి వివిధ అర్హతలు మరియు ప్రవర్తన ఆధ్యాత్మిక ప్రపంచంలోని స్వర్గపు శాసనాలకు అనుగుణంగా ఉంటే, అప్పటి నుండి, వారు అక్కడే ఉంటారు; వారు ఇకపై మానవులుగా పునర్జన్మ పొందరు, అలాగే వారు చేసిన చెడు పనులకి శిక్ష అనుభవించే ప్రమాదం కూడా ఉండదు. వారు మరొకసారి ఈ ప్రక్రియ గుండా వెళ్లాల్సిన అవసరం లేదు. బదులుగా, వారి పరిస్తితులకు అనుగుణంగా వారు ఆధ్యాత్మిక రాజ్యంలోని ఒక స్తానాన్ని తీసుకుంటారు. దీన్నే బౌద్ద మతస్తులు “బౌద్దత్వాన్ని పొందడం” అంటారు. బౌద్దత్వాన్ని పొందడం అనే దానికి ప్రధానార్దం ఆధ్యాత్మిక ప్రపంచంలోని అధికారిగా ఫలాన్ని పొందడం మరియు దాని తర్వాత, ఇకపై పునర్జన్మ పొందే లేదా శిక్షించబడే ప్రమాదం ఉండదు. అంతేకాక, పునర్జన్మ తర్వాత మానవునిగా పడే బాధలను ఇకపై అనుభవించకూడదని దీని అర్థం. కాబట్టి, వారు జంతువుగా పునర్జన్మ పొందే అవకాశం ఇంకా ఉందా?(లేదు.) వారు ఆధ్యాత్మిక రాజ్యంలోని ఒక స్తానాన్ని చేపడతారు మరియు ఇకపై పునర్జన్మ పొందరు అని దీనర్దం. బౌద్దామతంలోని బౌద్దత్వ ఫలాన్ని పొందడం అనే దానికి ఇది ఒక ఉదాహరణ. ఫలాన్ని పొందని వారికి, ఆధ్యాత్మిక ప్రపంచానికి తిరిగి వచ్చిన తర్వాత, వారు సంబందిత అధికారి పరీక్షను, తనీఖీని ఎదుర్కొంటారు, వారు జీవించి ఉన్నప్పుడు, వారు స్వయంకృషిని శ్రద్ధగా అభ్యసించలేదని లేదా పఠించడంలో మనస్సాక్షిగా ఉండలేదని తెలుసుకుంటారు. బౌద్ధమతం సూచించిన విధంగా సూత్రాలు మరియు బుద్ధుల పేర్లను జపించడానికి బదులుగా అనేక దుష్ట చర్యలకు పాల్పడ్డారు మరియు చాలా దుష్ట ప్రవర్తనలో నిమగ్నమై ఉన్నారు. అప్పుడు ఆధ్యాత్మిక ప్రపంచంలో, వారి చెడ్డ పనులకి ఒక తీర్పు తీర్చబడుతుంది, దాని తర్వాత, వారు తప్పక దీనిలో శిక్షించబడతారు, మినహాయింపులు ఏమీ లేవు. ఇలా ఉన్నప్పుడు, ఇలాంటి వ్యక్తి ఫలాన్ని ఎప్పుడు పొందుతాడు? వారు ఎటువంటి చెడూ చేయని జీవిత కాలంలో- ఆధ్యాత్మిక ప్రపంచానికి తిరిగి వచ్చినప్పుడు, వారు చనిపోయే ముందు ఎలాంటి తప్పు చేయలేదని చూస్తారు. వారు అప్పుడు తిరిగి పునర్జన్మించడం కొనసాగిస్తారు, సూత్రాలను పఠించడం మరియు బుద్ధుని నామాలను జపించడం, వెన్న దీపం యొక్క చల్లని, అల్పమైన కాంతితో వారి రోజులు గడిచిపోతాయి, ఏ జీవినైనా చంపడం లేదా ఏదైనా మాంసం తినడం మానుకుంటారు. వారు మనిషి ప్రపంచం లో పాలు పంచుకోరు, దాని సమస్యలను విడిచి పెట్టి ఇతరులతో ఎటువంటి విభేదాలు కలిగి ఉండరు. ఈ ప్రక్రియలో, వారు ఎటువంటి చెడుకి పాల్పడకపోతే, అప్పుడు వారు ఆధ్యాత్మిక ప్రపంచానికి తిరిగి వచ్చిన తర్వాత, వారి చర్యలన్నీ మరియు ప్రవర్తన పరీక్షించపడిన తర్వాత, వారు మరొక సారి మానవ రాజ్యంలోకి పంపబడతారు, ఆ చక్రం మూడు నుండి ఏడు సార్ల వరకూ కొనసాగుతుంది. ఈ కాలంలో ఎటువంటి చెడు ప్రవర్తన లేకపోతే, వారు బౌద్దత్వాన్ని పొందడం అనేది ప్రభావితం కాదు మరియు ఆలస్యం కాదు. ఇది విశ్వాసం ఉన్న ప్రజలందరి జనన మరణ చక్రం యొక్క లక్షణం: వారు “ఫలాన్ని సాధించగలరు” మరియు ఆధ్యాత్మిక ప్రపంచంలో ఒక స్థానాన్ని చేపట్టగలరు; ఇది వారిని అవిశ్వాసుల నుండి వేరు చేస్తుంది. మొదటగా, వారు భూమి మీద జీవించి ఉన్నప్పుడు, ఆధ్యాత్మిక ప్రపంచంలో ఒక స్తానాన్ని ఊహించుకునే వారు ఎలా ప్రవర్తిస్తారు? వారు ఖచ్చితంగా ఎటువంటి చెడుకూ పాల్పడకూడదు: వారు హత్య చేయకూడదు, దహనానికి, అత్యాచారానికి, దోపిడీకి పాల్పడకూడదు, వారు మోసం, వంచన, దొంగతనం లేదా దోపిడీలో నిమగ్నమైతే, వారు ఫలాన్ని సాధించలేరు. మరో విధంగా చెప్పాలంటే, వారికి ఏదైనా దుష్ప్రవర్తనతో ఏదైనా సంబంధం లేదా అనుబంధం ఉంటే, వారు ఆధ్యాత్మిక ప్రపంచం వారికి విధించే శిక్ష నుండి తప్పించుకోలేరు. బౌద్దత్వం పొందిన బుద్దుల కొరకు ఆధ్యాత్మిక ప్రపంచం తగిన ఏర్పాట్లను చేస్తుంది. బౌద్ధమతంలో విశ్వాసం ఉన్నట్లు కనిపించే వారిని, ఆకాశంలో వృద్దుడిని విశ్వసించే వారిని నిర్వహించడానికి—వారికి అధికార పరిధిని కేటాయించవచ్చు. వారు కేవలం అవిశ్వాసులకు మాత్రమే బాధ్యత వహించవచ్చు లేదా చిన్న బాధ్యతలు ఉన్న స్తానాలు కలిగి ఉండవచ్చు. వారి ఆత్మల యొక్క విభిన్న స్వభావాలానుసారం ఇలాంటి ఏర్పాటు జరుగుతుంది. బౌద్దమతానికి ఇది ఒక ఉదాహరణ.
మనం మాట్లాడుకున్న ఐదు మతాలలో, క్రైస్తవ్యం ప్రత్యేకమైనది. క్రైస్తవులను అంత ప్రత్యేకం గా చేసేది ఏమిటి? ఈ ప్రజలు నిజమైన దేవుడిని విశ్వసిస్తారు. నిజ దేవుడిని విశ్వసించేవారు ఇక్కడ జాబితాలో ఎందుకు ఉన్నారు? క్రైస్తవ్యం ఒక రకమైన విశ్వాసం అని చెప్పడంలో, అది నిస్సందేహంగా విశ్వాసంతో మాత్రమే సంబంధం కలిగి ఉంటుంది; అది కేవలం ఒకవిధమైన వేడుక, ఒక విధమైన మతం, నిజముగా దేవుణ్ణి అనుసరించే వారి విశ్వాసానికి పూర్తిగా భిన్నమైన విషయం. క్రైస్తవ్యాన్ని ఐదు పెద్ద మతాలతో పాటు ప్రస్తావించడానికి కారణం అది జుడాయిజం, బౌద్ద మతం మరియు ఇస్లాం ల స్తాయికి పడిపోయింది. ఇక్కడ చాలా మంది ప్రజలు దేవుడు ఉన్నాడు అని, లేదా ఆయన అన్నిటినీ పాలిస్తాడు అని విశ్వసించరు; ఆయన ఉనికిని అసలే విశ్వసించరు. బదులుగా, వారు కేవలం వేదాంతాన్ని చర్చించడానికి లేఖనాలను ఉపయోగిస్తారు మరియు ప్రజలకు దయగా ఉండటం, బాధలను సహించడం మరియు మంచి పనులు చేయడం బోధించడానికి వేదాంతశాస్త్రాన్ని ఉపయోగిస్తారు. క్రైస్తవ్యం ఇలాంటి రకమైన మతంగా మారింది. అది వేదాంత సిద్ధాంతాలపై మాత్రమే దృష్టి పెడుతుంది, మనిషిని నిర్వహించడం మరియు రక్షించడం అనే దేవుని పనితో ఎటువంటి సంబంధం లేకుండా ఉంది. ఇది దేవుడిని విశ్వసించే ప్రజల మతంగా మారింది కానీ వారు వాస్తవానికి దేవునిచే గుర్తింపు పొందలేదు. అయితే, ఇలాంటి ప్రజలను చేరుకొనే విషయంలో దేవుడు కూడా ఒక నియమాన్ని కలిగి ఉన్నాడు. ఆయన అవిశ్వాసులతో చేసినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా తేలికగా వ్యవహరించడు. ఆయన బౌద్దులతో వ్యవహరించినట్టుగా వీరితో వ్యవహరించడు. జీవించి ఉన్నప్పుడు, ఒక క్రైస్తవుడు స్వీయ క్రమశిక్షణను పాటించి, పది ఆజ్ణలకు నిక్కచ్చిగా లోబడి, శాస్త్రాలు మరియు ఆజ్ణ లకు అనుగుణంగా తమ స్వంత ప్రవర్తన ఉండాలని కోరి, వాటికి తమ జీవితాంతం కట్టుబడి ఉంటే, అప్పుడు వారు కూడా “పారవశ్యం” అని పిలువబడే దాన్ని పొందడానికి ముందు జనన మరణ చక్రాల గుండా అదే కాలం వెచ్చించాలి. ఈ పారవశ్యాన్ని సాధించిన తర్వాత వారు ఆధ్యాత్మిక ప్రపంచంలోనే ఉండిపోతారు, వారు అక్కడ ఒక స్తానాన్ని తీసుకుని దాని అధికారులలో ఒకరు అవుతారు. అలానే, వారు భూమిపై చెడుకు పాల్పడితే- వారు పాపబూయిష్టమై అనేకమైన పాపాలకు పాల్పడితే- అప్పుడు వారు అంతిమంగా శిక్షించబడి, వేర్వేరు తీవ్రతలతో క్రమశిక్షణలో పెట్టబడతారు. బౌద్దమతంలో, ఫలాన్ని పొందమ్ అంటే అత్య్తంత ఆనందాన్ని ఇచ్చే స్వచ్చమైన నేలలోకి వెళ్ళడం, క్రైస్తవ్యం లో దీనిని ఏమని పిలుస్తారు? అది “పరలోకం లోకి ప్రవేశించడం” మరియు “పారవశ్యం” చెందడం. నిజంగా పారవశ్యం చెందిన వారు కూడా మూడు నుండి ఏడు సార్ల వరకూ ఈ జనన మరణ చక్రం గుండా వెళతారు, ఆ తర్వాత, మృతి చెందిన తర్వాత, వారు నిద్ర పోయినట్టుగా ఆధ్యాత్మిక ప్రపంచంలోకి వస్తారు. వారు ప్రామాణికంగా ఉన్నట్లయితే, వారు ఒక స్థానాన్ని చేపట్టడానికి అక్కడే ఉండవచ్చు మరియు భూమిపై ఉన్న వ్యక్తుల వలె కాకుండా, సాధారణ పద్ధతిలో లేదా సంప్రదాయం ప్రకారం పునర్జన్మ పొందరు.
ఈ మతాలన్నిటిలో, చివరికి వారు మాట్లాడేది, పోరాడేది బౌద్దామతంలో ఫలించడాన్ని సాధించడం వంటి దానికోసమే; కేవలం ఈ “ఫలించడం” అనేది వేర్వేరు మార్గాల ద్వారా సాధించబడుతుంది. వారందరూ ఒక గూటి పక్షులే. ఈ మతాల అనుచరుల యొక్క ఈ భాగానికి, వారి ప్రవర్తనలో మతపరమైన సూత్రాలకు ఖచ్చితంగా కట్టుబడి ఉండే వారికి, దేవుడు తగిన గమ్యాన్ని, వెళ్ళడానికి తగిన స్థలాన్ని అందిస్తాడు మరియు వారితో తగిన విధంగా వ్యవహరిస్తాడు. ఇదంతా సహేతుకమే, కానీ ఇది ప్రజలు ఊహించినట్టుగా కాదు, అవునా? ఇప్పుడు, క్రైస్తవ్యం లో ప్రజలకు ఏం జరుగుతుంది అనేది విన్నాకా, మీకు ఏం అనిపిస్తుంది? వారు స్తితి అన్యాయమనా? వారి పట్ల మీరు సానుభూతి చూపిస్తున్నారా?(కొద్దిగా.) చేయగలిగింది ఏమీ లేదు; తమని తామే నిందించుకోవాలి. నేను ఇది ఎందుకు చెప్తున్నాను? దేవుని కార్యము నిజము; ఆయన సజీవుడు మరియు యదార్డమైన వాడు, ఆయన కార్యము మానవాళి అంతటి పట్లా మరియు ప్రతీ వ్యక్తిని లక్ష్యముగా చేసుకొని ఉంది. మరి అలాంటప్పుడు వారు ఎందుకు దీనిని అంగీకరించరు? ఎందుకు అంతా ఆవేశంగా దేవుడ్ని ఎదురించి శిక్షిస్తున్నారు? ఇలాంటి ఫలితం రావడానికి కూడా తమని తాము అదృష్టవంతులుగా పరిగణించుకోవాలి, కాబట్టి మీరు వారి కొరకు ఎందుకు జాలి పడుతున్నారు? వారు ఇలా వ్యవహరించబడడం గొప్ప సహనాన్ని చూపుతుంది. వారు దేవుడ్ని ఎదురించిన స్తాయికి, వారు నాశనం కాబడాలి, అయినప్పటికే దేవుడు ఇలా చేయడు; బదులుగా ఆయన క్రైస్తవ్యాన్ని ఒక సాధారణ మతం మాదిరిగానే వ్యవహరిస్తాడు. ఆ విధంగా, మిగతా మతాల గురించి మరిన్ని వివరాల్లోకి వెళ్లాల్సిన అవసరం ఏమైనా ఉందా? ఈ మతాలన్నింటి తత్వమేమిటంటే, ప్రజలు ఎక్కువ కష్టాలను అనుభవించడం, చెడు చేయకూడదు, మంచి పనులు చేయడం, ఇతరులను తిట్టకూడదు, ఇతరులపై తీర్పు చెప్పకూడదు, వివాదాలకు తమని తాము దూరంగా ఉంచుకోవాలి మరియు మంచి వ్యక్తులుగా ఉండాలి—చాలా మతపరమైన బోధనలు ఇలా ఉంటాయి. కాబట్టి, ఈ విశ్వాసపు ప్రజలు- వివిధ మతాల తెగల అనుచరులు—వారి మతపరమైన కట్టుబాట్లకు లోబడి ఉండగలిగితే, వారు భూమిపై ఉన్నప్పుడు ఎలాంటి గొప్ప తప్పిదాలకు లేదా పాపాలకు పాల్పడరు; మరియు, ఈ ప్రజలు మూడు నుండి ఏడు సార్ల వరకూ పునర్జన్మించిన తర్వాత—మతపరమైన కట్టుబాట్లకు నిక్కచ్చిగా లోబడి ఉండగలిగిన వారు—పెద్ద మొత్తంలో ఆధ్యాత్మిక ప్రపంచంలో స్తానాన్ని చేపట్టడానికి ఉండిపోతారు. ఇలాంటి ఆరు చాలా మండి ఉన్నారా? (లేదు, లేరు.) మీ సమాధానం దేనిని ఆధారం చేసుకొని ఉంది? మంచి చెయ్యడం మరియు మతపరమైన నియమాలకు శాస్త్రాలకు కట్టుబడి ఉండటం తేలిక కాదు. బౌద్దమతం ప్రజలను మాంసం తినడానికి అనుమతించదు— నువ్వు అది చేయగలవా? నువ్వు బూడిద రంగు వస్త్రాలు దరించి రోజంతా బుద్దుని ఆలయంలో సూత్రాలను పటిస్తూ, బుద్దుని నామాలను జపిస్తూ ఉండవలసి వస్తే, నువ్వు అది చెయ్యగలవా? అది అంత తేలిక కాదు. క్రైస్తవ్యానికి పది ఆజ్ణలు ఉన్నాయి, ఆజ్ణలు మరియు శాస్త్రాలు; వాటికి కట్టుబడి ఉండటం తేలికా? కాదు! ఉదాహరణకు ఇతరులను తిట్టకూడదు అనే దాన్ని తీసుకోండి: ప్రజలు కేవలం ఈ నియమానికి కట్టుబడి ఉండలేరు. తమని తాము నియంత్రించుకోలేరు, వారు దూషిస్తారు- దూషించిన తర్వాత, వారి మాటలను వెనక్కి తీసుకోలేరు, కాబట్టి వారేం చేస్తారు? రాత్రి పూట, వారి పాపాలను వారు ఒప్పుకుంటారు. కొన్ని సార్లు వారు ఇతరులను దూషించిన తర్వాత, వారి హృదయాల్లో ద్వేషాన్ని ఇంకా మోస్తారు, ఆ ప్రజలకు మరింత హాని కలిగించడానికి సమయం కోసం ఎత్తులు వేస్తూ పోయేంత దూరం వెళ్తారు. క్లుప్తంగా, ఈ చనిపోయిన సిద్దాంతం మధ్య జీవించే వారికి, పాపం చేయకుండా లేదా చెడుకు పాల్పడకుండా ఉండటం అంత తేలిక కాదు. కాబట్టి, ప్రతీ మతం లోనూ, కేవలం అతి కొద్ది మంది ప్రజలు మాత్రమే ఫలాన్ని పొందగలరు. చాలా మంది ప్రజలు ఈ మతాలను అనుసరిస్తారు కాబట్టి, పెద్ద మొత్తం వారు ఆధ్యాత్మిక రాజ్యంలో స్తానం పొందడానికి ఉండవచ్చు అని నీవు అనుకుంటావు.అయితే, అక్కడ అంత మంది లేరు; నిజానికి కేవలం కొద్ది మంది మాత్రమే దీనిని సాధించగలరు. విశ్వాసులైన ప్రజలకు చెందిన జనన మరణ చక్రం గురించినది సాధారణంగా ఇదే. వారిని వేరు పరిచేది ఏమిటంటే వారు ఫలాన్ని పొందగలరు, ఇది వారిని అవిశ్వాసుల నుండి వేరు చేస్తుంది.
3. దేవుని అనుచరుల జనన మరణ చక్రం
తర్వాత, దేవుడ్ని అనుసరించేవారి జనన మరణ చక్రం గురించి మనం మాట్లాడుకుందాం. ఇది మీకు చెందినది, కాబట్టి శ్రద్ద వహించండి: ముందుగా, దేవుని అనుచరులను వర్గీకరించవచ్చో ఆలోచించండి. (దేవుడు ఎన్నుకున్న వారు, మరియు సేవకులు.) వాస్తవానికి ఇక్కడ ఇద్దరున్నారు: దేవుడు ఎన్నుకున్నవారు, సేవకులు. ముందు, దేవుడు ఎన్నుకున్న వారి గురించి మనం మాట్లాడుకుందాం, వారిలో అతి కొద్ది మంది మాత్రమే ఉన్నారు. “దేవుడు ఎన్నుకున్న వారు” అనేది ఎవరిని సూచిస్తుంది? దేవుడు సమస్తాన్నీ సృష్టించాక, మానవాళి ఉనికి లోకి వచ్చాక, దేవుడు ఆయనను అనుసరించే ఒక ప్రజల సమూహాన్ని ఎంచుకున్నాడు; వీరు సాధారణంగా “దేవుడు ఎన్నుకున్న వారు” అని పిలువబడతారు. దేవుడు ఈ వ్యక్తులను ఎంచుకోవడంలో ఒక ప్రత్యేకమైన ఉద్దేశం మరియు ప్రాముఖ్యత ఉంది. అది కొద్ది మందికి మాత్రమే పరిమితం అవ్వడంలోనే ఈ ఉద్దేశం ప్రత్యేకమైనది అయ్యింది, ఆయన ముఖ్యమైన కార్యాన్ని చేస్తున్నపుడు వారు తప్పక రావాలి. ఈ ప్రాముఖ్యత ఏమిటి? వారు దేవుని చేత ఎంపిక కాబడిన సమూహం కాబట్టి, ప్రాధాన్యత గొప్పది. అంటే, దేవుడు ఈ వ్యక్తులను పూర్తి చేయాలని, పరిపూర్ణం చేయాలని కోరుకుంటాడు, ఆయన నిర్వహణా కార్యం ముగిశాక, ఆయన ఈ ప్రజలను పొందుతాడు. ఈ ప్రాధాన్యత గొప్పది కాదా?ఆ విధంగా, ఈ ఎన్నుకోబడిన వారు దేవునికి గొప్ప ప్రాముఖ్యత కలిగిన వారు, ఎందుకంటే దేవుడు పొందాలని చూసేది వారినే. సేవకుల విషయానికి వస్తే, దేవుని “ముందుగా నిర్ణయించడడం” అనే అంశం నుండి మనం ఒక క్షణం పాటు విరామం తీసుకుందాం, ముందుగా వారి మూలాల గురించి మాట్లాడుకుందాం. సేవకుడు అంటే సేవ చేసే వాడు అని. సేవ చేసేవారు తాత్కాలికం. వారు దీర్ఘ కాలం పాటు లేదా నిరంతరంగా అలా చేయరు, కానీ తాత్కాలికంగా తీసుకోబడతారు లేదా నియామకం కాబడతారు. వారిలో చాలా మంది మూలం ఏమిటంటే వారు అవిశ్వాసుల నుండి ఎంపిక చేయబడతారు. దేవుని కార్యములో సేవ చేసేవారి పాత్రను వారు స్వీకరించాలని నిశ్చయించబడినప్పుడు వారు భూమిపైకి వచ్చారు. వారు గత జన్మలో జంతువులు అయి ఉండవచ్చు, వారు అవిశ్వాసులు కూడా అయి ఉండవచ్చు. సేవకుల మూలాలు ఇలా ఉన్నాయి.
దేవుడు ఎన్నుకున్న ప్రజల గురించి మరింతగా మాట్లాడదాం. వారు చనిపోయినపుడు, వారు అవిశ్వాసులకు మరియు వివిధ విశ్వాస ప్రజలకు పూర్తిగా భిన్నమైన ప్రదేశానికి వెళ్తారు. ఆ ప్రదేశంలో వారు దేవదూతలు మరియు దేవుని వార్తాహరుల తో కలిసి ఉంటారు; అది దేవునిచే వ్యక్తిగతంగా నిర్వహించబడే స్తలం. దేవుడు ఎన్నుకున్న ప్రజలు కూడా దేవుడిని ఈ ప్రదేశంలో తమ స్వంత కళ్ళతో చూడలేరు, ఇది ఆధ్యాత్మిక రాజ్యంలో ఎక్కడా లేని చోటు; ఈ విభాగపు ప్రజలు వారు చనిపోయిన తర్వాత వెళ్ళే ఒక భిన్నమైన ప్రదేశం. వారు మృతి చెందిన తర్వాత, వారు కూడా, దేవుని సందేశకులతో కటినమైన విచారణను ఎదుర్కొంటారు. ఏమి విచారిస్తారు? దేవుని సందేశకులు, ఈ ప్రజలు తమ జీవిత కాలమంతటి లోనూ దేవుని యందు తమ విశ్వాసంలో తీసుకున్న మార్గాలను, ఆ సమయంలో ఎప్పుడైనా వారు దేవుడ్ని ఎదురించారా లేదా శపించారా, వారు పాపాలకు లేదా చెడుకి పాల్పడ్డారా లేదా అనేది విచారిస్తారు. ఈ విచారణ ఆ వ్యక్తి ఉండాలా లేదా తప్పక విడిచి పోవాలా అనేది నిర్దారిస్తుంది. “వెళ్లిపోవడం” అంటే ఏమిటి? “ఉండటం” అంటే ఏమిటి? “వెళ్లిపోవడం” అంటే, వారి ప్రవర్తన ఆధారంగా, దేవుడు ఎన్నుకున్న వ్యక్తుల హోదాలో ఉంటారు; “ఉండటం” కి అనుమతించబడటం అంటే అంత్య దినాల్లో దేవుని చేత పరిపూర్ణం కాబడటానికి ఉన్న వ్యక్తుల మధ్య ఉండవచ్చు. ఉండే వారి కొరకు, దేవునికి ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉన్నాయి. ఆయన కార్యపు ప్రతీ దశలోనూ, ఇలాంటి ప్రజలను అపోస్తులుగా వ్యవహరించడానికి లేదా చర్చిలను పునరుద్దరించడానికి లేదా చూసుకోవడానికి పంపుతాడు. అయితే, ఇలాంటి పని చేయగలిగిన వారు అవిశ్వాసులంత తరచుగా పునర్జన్మ పొందరు, వారు ప్రతీ తరం లోనూ తిరిగి జన్మిస్తూనే ఉంటారు; బదులుగా,దేవుని కార్యపు దశల అవసరాలకు అనుగుణంగా వారు భూమికి తిరిగి వస్తారు, వారు తరచుగా పునర్జన్మ పొందరు. వారు ఎప్పుడు పునర్జన్మించాలి అనే దానికి ఏమైనా నియమాలు ఉన్నాయా? వారు కొన్ని సంవత్స్రరాలకు ఒకసారి వస్తారా? వారు అంత తరచుగా వస్తారా? వారు రారు. ఇదంతా దేవుని కార్యం పైన, దాని దశలు మరియు ఆయన అవసరాల పైన ఆధారపడి ఉంటుంది, అక్కడ నిర్దిష్ట నియమాలు ఏమీ లేవు. ఏకైక నియమం ఏమిటంటే దేవుడు ఆయన కార్యపు అంతిమ దశను చేస్తున్నపుడు, ఈ ఎన్నుకున్న ప్రజలందరూ వస్తారు, ఈ రాకడ వారి చివరి పునరుత్తానం అవుతుంది. మరి అది ఎందుకు? ఇది దేవుని కార్యపు అంతిమ దశలో సాధించవలసిన ఫలితం మీద ఆధారపడి ఉంటుంది- ఎందుకంటే ఆయన కార్యపు ఈ అంతిమ దశలో, దేవుడు ఈ ఎన్నుకున్న వారిని మొత్తంగా పూర్తి చేస్తాడు. దీనర్దం ఏమిటి? ఒక వేళ, ఈ చివరి దశలో, ఈ ప్రజలు పరిపూర్ణులుగా మరియు పూర్తి చేయబడితే, అప్పుడు వారు ఇంతకు ముందు లాగా పునర్జన్మ పొందరు; వారు మనిషిగా ఉండే ప్రక్రియ పూర్తి ముగింపుకు రావాలి, అలాగే వారి పునర్జన్మ ప్రక్రియ కూడా. ఇది ఉండేవారికి చెందినది. ఉండకూడని వారు ఎక్కడికి వెళ్తారు? ఉండటానికి అనుమతి లేని వారికి తగిన స్వంత గమ్యస్తానం ఉంటుంది. మొదటగా, వారు చేసిన చెడు, వారు చేసిన తప్పులు, వారు పాల్పడిన పాపాలకు ఫలితంగా, వారు కూడా శిక్షింపబడతారు. వారు శిక్షించబడిన తర్వాత, దేవుడు వారిని పరిస్థితులకు తగినట్లుగా అవిశ్వాసుల మధ్యకు పంపించే ఏర్పాట్లు చేస్తాడు, లేదా విశ్వాసం ఉన్న వివిధ వ్యక్తుల మధ్యకు వెళ్లేలా ఏర్పాటు చేస్తాడు. మరో విధంగా చెప్పాలంటే, వారికి రెండు రకాల ఫలితాలు ఉన్నాయి: ఒకటి శిక్షించబడటం మరియు పునర్జన్మ పొందిన తర్వాత బహుశా ఏదో ఒక నిర్దిష్ట మతప్రజల మధ్య జీవించడం, మరొకటి అవిశ్వాసులుగా మారడం. వారు అవిశ్వాసులుగా మారితే అవకాశమంతటినీ కోల్పోతారు; అయితే విశ్వాసులైన ప్రజల గా మారితే- ఉదాహరణకు, వారు ఒకవేళ క్రైస్తవులుగా మారితే- అప్పుడు వారు దేవుడు ఎన్నుకున్న ప్రజల శ్రేణిలో తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది; దీనికి చాలా క్లిష్టమైన సంబంధాలు ఉన్నాయి. క్లుప్తంగా, దేవుడు ఎన్నుకున్న ప్రజలలో ఎవరైనా దేవుడ్ని అవమానపరిచేలా ఏమైనా చేస్తే, వారు మిగితా వారిలానే శిక్షించబడతారు. మనం ఇంతకు ముందు మాట్లాడుకున్న పౌలు ను ఉదాహరణగా తీసుకోండి. శిక్ష అనుభవించిన వ్యక్తికి పౌలు ఒక ఉదాహరణ. నేను దేని గురించి మాట్లాడుతున్నానో మీకు ఆలోచన వస్తుందా?(అవును, చాలా వరకూ.) దానిలో చాలా వరకూ స్తిర పరచబడి ఉంది, కానీ దానిలో కొంత భాగం మాత్రం స్తిరముగా లేదు. ఇక్కడ నేను చాలా స్పష్టమైన కారణాన్ని సూచించాను: చెడు చేయడం. ప్రజలు చెడు చేసినప్పుడు, దేవుడు వారిని కోరుకోడు, మరియు దేవుడు వారిని కోరనప్పుడు, ఆయన వారిని వివిధ జాతుల మరియు రకాల వ్యక్తుల మధ్య విసిరివేస్తాడు. ఇది వారిని నిరాశకి గురి చేసి వారు తిరిగి రావడాన్ని కష్టతరం చేస్తుంది. ఇదంతా దేవుడు ఎన్నుకున్న ప్రజల జనన మరణ చక్రానికి చెందినది.
తదుపరి అంశం సేవకుల జనన మరణ చక్రానికి చెందినది. మనం ఇప్పుడే సేవకుల మూలాల గురించి మాట్లాడుకున్నాము; అది, వారు తమ గత జీవితకాలంలో అవిశ్వాసులుగా మరియు జంతువులుగా ఉన్న తర్వాత పునర్జన్మ పొందారనే వాస్తవం గురించి. కార్యము యొక్క చివరి దశ రాకతో, దేవుడు అవిశ్వాసుల నుండి అటువంటి వ్యక్తుల సమూహాన్ని ఎన్నుకున్నాడు మరియు ఈ సమూహం ప్రత్యేకమైనది.దేవుడు ఈ ప్రజలను ఎన్నుకోవడం వెనుక ఉన్న లక్ష్యం వారు ఆయన కార్యానికి ఉపయోగపడతారు అని. “సేవ” అనేది మరీ అంత వినసొంపైన పదం కాదు, అది అందరి కోరికలకు కూడా అనుగుణంగా ఉండదు. కానీ అది ఎవరిని లక్ష్యముగా చేసుకుని ఉంది అనేది మనం చూడాలి. దేవుని సేవకుల ఉనికికి ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. వారి పాత్రను వేరెవరూ పోషించలేరు, ఎందుకంటే వారు దేవుని చే ఎన్నుకోబడిన వారు. ఈ సేవకుల పాత్ర ఏమిటి? అది దేవుడు ఎన్నుకున్న వారిని సేవించడం. చాలా వరకూ, వారి పాత్ర దేవుని కార్యానికి సేవను అందించడం, దేవుడు ఎన్నుకున్న వారిని పూర్తి చేయడం లో ఆయనకు సహకరించడం. వారు శ్రమిస్తున్నా, కార్యములో కొంత భాగాన్ని నిర్వహిస్తున్నా లేదా కొన్ని పనులు చేపట్టినా, ఈ సేవ చేసేవారి నుండి దేవుడు కోరుతున్నది ఏమిటి? ఆయన వారి నుండి కోరెవాటిలో బాగా షరతులు ఉన్నాయా?(లేదు, ఆయన కేవలం వారిని విధేయులుగా ఉండమని అడుగుతున్నాడు.) సేవకులు కూడా, విధేయులుగా ఉండాలి. నీ మూలాలకు లేదా దేవుడు నిన్ను ఎందుకు ఎన్నుకున్నాడు అనే దానితో సంబందం లేకుండా నువ్వు తప్పక దేవునికి, దేవుడు నీకు అప్పగించే పనులకు, నువ్వు బాధ్యత వహించే పనికి మరియు నువ్వు నిర్వర్తించే విధులకి నువ్వు విధేయునిగా ఉండాలి. ఎందుకంటే విధేయులుగా ఉండగలిగి దేవుణ్ణి తృప్తిపరిచే వారి ఫలితాలు ఎలా ఉంటాయి? వారు అక్కడే ఉండగలుగుతారు. ఉండటం అనేది సేవకులకి ఆశీర్వాదమా? ఉండటం అంటే ఏమిటర్దం? ఈ ఆశీర్వాదం యొక్క ప్రాముఖ్యత ఏమిటి? హోదా పరంగా, వారు దేవుడు ఎన్నుకున్న వారిలా కాదు; వారు ప్రత్యేకమైన వాళ్లలా కనిపిస్తారు. కానీ వాస్తవానికి, వారు ఈ జీవితంలో ఆనందించేది దేవుడు ఎన్నుకున్న వారు ఆనందించే దానితో సమానం కాదా? హీనపక్షం, ఈ జీవిత కాలం లో అది సమానమే. మీరు దీనిని ఖండించలేరు, ఖండించగలరా? దేవుని వాక్కులు, దేవుని దయ, దేవుని ఏర్పాటు, దేవుని ఆశీర్వాదాలు-వీటిని ఆనందించని వారెవరు? ప్రతి ఒక్కరూ అలాంటి సమృద్ధిని అనుభవిస్తారు. సేవ చేసే వ్యక్తి యొక్క గుర్తింపు అనేది సేవ చేసే వ్యక్తి అనే, కానీ దేవునికి, ఆయన సృష్టించిన అన్ని విషయాలలో వారు కేవలం ఒక్కరు; అది కేవలం వారి పాత్ర సేవకుడు అయింది. వారిరువురూ దేవుని జీవులు అయి ఉన్నప్పుడు, సేవకునికి మరియు దేవుడు ఏనుకున్న వారిలో ఒకరికి మధ్య ఏమైనా వ్యత్యాసం ఉందా? ప్రభావవంతంగా ఏమీ లేదు. నామమాత్రంగా చెప్పాలంటే, ఒక తేడా ఉంది; గుణం లోనూ వారు పోషించే పాత్రల పరంగాను, ఒక తేడా ఉంది- కానీ దేవుడు ఈ ప్రజల సమూహాన్ని అన్యాయంగా చూడడు. మరి ఎందుకని ఈ ప్రజలు సేవకులుగా నిర్వచించబడ్డారు? మీకు తప్పక దీని గురించి కొంత అవగాహన ఉండాలి! సేవకుల అవిశ్వాసుల నుండి వస్తారు. వారు అవిశ్వాసుల నుండి వస్తారు అని మనం ప్రస్తావించగానే, వారు చెడ్డ నేపథ్యాన్ని కలిగి ఉన్నారు అని స్పష్టమవుతుంది: వారందరూ నాస్తికులు, గత జన్మలో కూడా వారు దేవుని యందు విశ్వాసముంచలేదు, మరియు ఆయనతో, సత్యముతో, అన్నీ సానుకూల విషయాలతో శత్రుత్వము కలిగి ఉన్నారు. వారు దేవుని యందు లేదా ఆయన ఉనికి యందు విశ్వాసముంచలేదు. ఇలాంటి వారు, దేవుని వాక్యాలను అర్దం చేసుకోగలరా? చాలా వరకూ అర్దం చేసుకోలేరు అని చెప్పడం సమంజసం. జంతువులు మనిషి మాటలను అర్దం చేసుకోలేనట్టుగా, సేవకులు దేవుడు ఏం చెప్తున్నాడు, ఆయన ఏం కొరుతున్నాడు, ఆయన ఎందుకు ఇలాంటివి కోరతాడు అనేది అర్దం చేసుకోలేరు. వారు అర్దం చేసుకోలేరు; ఇలాంటి విషయాలు వారికి గోచరమవ్వవు, వారు అజ్ణానంలోనే ఉండిపోతారు. ఈ కారణం వల్లనే, ఈ ప్రజలు మనం మాట్లాడుకున్న జీవితాన్ని కలిగి ఉండరు. జీవితం లేకుండా, ప్రజలు సత్యాన్ని అర్దం చేసుకోగలరా? వారు సత్యం తో సన్నిద్దంగా ఉన్నారా? వారికి దేవుని వాక్యాల అనుభవం మరియు జ్ణానం ఉందా?(లేదు.) సేవకుల మూలాలు ఇలాంటివి. ఏదేమైనా, ఈ ప్రజలను దేవుడు సేవకుల్గా చేశాడు కాబట్టి, ఆయన వారి నుండి కోరే ప్రమాణాలు ఉన్నాయి; ఆయన వారిని తక్కువగా చూడడు, లేదా వారి పట్ల ఉపేక్ష లేకుండా ఉండడు. వారు ఆయన మాటలను అర్థం చేసుకోకపోయినా మరియు జీవితాన్ని కలిగిఉండకపోయినా, దేవుడు ఇప్పటికీ వారి పట్ల దయతో వ్యవహరిస్తాడు, మరియు వారి నుండి ఆయన కోరుకునే విషయంలో ప్రమాణాలు ఇంకా ఉన్నాయి. మీరు ఇప్పుడే ఈ ప్రమాణాల గురించి మాట్లాడారు: దేవునికి విధేయంగా ఉండటం మరియు ఆయన చెప్పింది చేయడం. మీ సేవలో, నువ్వు అవసరమైన చోట సేవ చెయ్యాలి, మరియు నువ్వు చివరి వరకూ సేవ చెయ్యాలి. నువ్వు ఒక విధేయుడైన సేవకునివైతే, నమ్మకంగా, చివరి వరకూ సేవ గలిగి దేవుడు నీకు అప్పగించిన బాధ్యతలను నెరవేర్చగలిగితే, అప్పుడు నువ్వు ఒక విలువైన జీవితాన్ని జీవిస్తావు. నువ్వు ఇది చెయ్యగలిగితే, నువ్వు ఉండిపోగలుగుతావు. నువ్వు మరింత కృషి చేస్తే, నువ్వు ఇంకొంచెం ఎక్కువ కష్టపడితే, దేవుణ్ణి తెలుసుకోవాలనే నీ ప్రయత్నాలను రెట్టింపు చేయగలిగితే, దేవుణ్ణి తెలుసుకోవడం గురించి కొంచెం మాట్లాడగలిగితే, ఆయనకు సాక్ష్యంగా ఉండగలిగితే, అంతేకాక, ఆయన చిత్తంలో కొంత నువ్వు అర్దం చేసుకోగలిగితే, దేవుని కార్యంలో సహకరించగలిగితే, దేవుని ఉద్దేశాల పట్ల జాగరూకతతో ఉండగలిగితే, అప్పుడు ఒక సేవకునిగా, నీ అదృష్టంలో ఒక మార్పుని అనుభవిస్తావు. ఈ అదృష్టంలో మార్పు ఏమిటి? నువ్వు ఇకపై కేవలం మిగిలిపోవు. నీ ప్రవర్తన మరియు నీ వ్యక్తిగత ఆకాంక్షలు మరియు కోరికల ఆధారంగా, దేవుడు నిన్ను ఎన్నుకున్నవారిలో ఒకరిగా చేస్తాడు. ఇది మీ అదృష్టం లో మార్పు అవుతుంది. సేవకులకు, దీనిలో ఉత్తమమైన విషయం ఏమిటి? వారు అలా చేస్తే, వారు ఇకపై అవిశ్వాసులలాగా జంతువులుగా పునర్జన్మించరు అని అర్దం. ఇది మంచిదేనా? అవును మంచిదే, మరియు అది మంచి వార్తా కూడా: సేవకులను మలచవచ్చు అని దీని అర్దం. ఒకసారి దేవుడు వారు సేవ చేయాలాని ముందుగా నిర్ణయించాకా, వారు ఎప్పటికీ అలా చేస్తూనే ఉండవలసిన అవసరం లేదు: సేవకుల విషయంలో అది అలా జరగదు. దేవుడు వారితో వ్యవహరిస్తాడు, మరియు ఆ వ్యక్తి వ్యక్తిగత ప్రవర్తన కి తగినట్టుగా వారితో ప్రతిస్పందిస్తాడు.
అయితే, చివరి వరకూ సేవ చేయలేని సేవకులు కొందరున్నారు; కొంతమంది వారి సేవలో, మధ్యలోనే వదిలేసి దేవుడ్ని విడిచి పెడతారు అనేక తప్పిదాలను చేసే ప్రజలు ఉన్నారు. దేవుని కార్యానికి విపరీతమైన హానిని చేసి, విపరీతమైన నష్టాలు తెచ్చే వారు కూడా కొందరున్నారు, దేవుడ్ని శపించే సేవకులు కూడా ఉన్నారు, ఇలా అనేకం. ఈ సరిదిద్దలేని పర్యవసానాలు ఏం సూచిస్తున్నాయి? ఇలాంటి చెడు చర్యలు ఏమైనా వారి సేవలను తొలగించడాన్ని బలపరుస్తున్నాయి. నీ సేవలో నీ ప్రవర్తన అత్యంత అల్పంగా ఉన్నందున, మరియు నువ్వు చాలా దూరం వెళ్లినందున, దేవుడు నీ సేవ ప్రమాణాలకి తగినట్టు లేదని చూసాకా, ఇకపై నువ్వు సేవ చేయడానికి ఆయన అనుమతించడు; ఆయన నిన్ను తన స్వంత నేత్రాల ముందు నుండి మరియు దేవుని గృహము నుండి తొలగిస్తాడు. నువ్వు సేవ చేయకూడదని అనుకోవడం లేదా? నువ్వు నిరంతరం చెడు చేయాలని అనుకోవడం లేదా? నువ్వు నిరంతరం అవిధేయుడిగా లేవా? మంచిది, అప్పుడు ఒక సులభమైన పరిష్కారం ఉంది: నువ్వు సేవ చేసే అర్హత నుండి తొలగించ బడతావు. దేవునికి చెందినంతవరకూ, సేవ చేసే వ్యక్తికి సేవ చేయడానికి వారి అర్హతను తీసివేయడం అంటే ఈ సేవ చేసే వ్యక్తి యొక్క ముగింపు ప్రకటించబడింది మరియు వారు ఇకపై దేవుణ్ణి సేవించడానికి అర్హులు కాలేరు. దేవునికి ఈ వ్యక్తి యొక్క సేవ ఇకముందు అవసరం లేదు, మరియు వారు ఎలాంటి మంచి మాటలు చెప్పినా, ఆ మాటలు నిష్ఫలమవుతాయి. విషయాలు ఈ స్తాయికి చేరుకున్న తర్వాత, పరిస్తితి చక్కదిద్దలేనిదిగా మారుతుంది; ఇలాంటి సేవకులు వెనక్కి మరలలేరు. దేవుడు ఇలాంటి సేవకులతో ఎలా వ్యవహరిస్తాడు? ఆయన కేవలం వారిని సేవ చేయడం నుండి ఆపుతాడా? లేదు. ఆయన కేవలం వారిని ఉండిపోవడం నుండి అడ్డుకుంటాడా? లేదా, ఆయన వారిని ఒక పక్కకి పెట్టి వారు మార్పు చెందే వరకూ వేచి చూస్తాడా? ఆయన అలా చేయడు. నిజానికి, సేవకుల విషయానికొస్తే దేవుడు అంత ప్రేమపూర్వకంగా ఉండడు. దేవుని చేసే సేవ విషయంలో ఏ వ్యక్తైనా ఇలాంటి వైఖరి కలిగి ఉన్నట్లయితే, ఆ వైఖరి కి ఫలితంగా, సేవ చేసే అర్హత నుండి దేవుడు వారిని తొలగిస్తాడు, మరొకసారి వారిని అవిశ్వాసుల మధ్యకు విసిరి వేస్తాడు. అవిశ్వాసుల మధ్యకు విసిరి వేయబడిన సేవకుని భవిష్యత్తు ఏమిటి? వారిది అవిశ్వాసుల పరిస్తితి లాంటిదే: ఒక అవిశ్వాసి మాదిరి గానే వారు ఒక జంతువుగా పునర్జన్మ పొంది ఆధ్యాత్మిక ప్రపంచంలో అదే శిక్షను అనుభవిస్తారు. అంతేకాక, ఈ వ్యక్తి శిక్షలో దేవుడు ఎలాంటి వ్యక్తిగత ఆసక్తీ చూపడు, ఎందుకంటే ఇలాంటి వ్యక్తికి ఇకపై దేవుని కార్యముతో ఎటువంటి సంబంధమూ ఉండదు. ఇది దేవునిపై వారి విశ్వాస జీవితపు ముగింపు మాత్రమే కాదు, వారి స్వంత భవిష్యత్తుకి ముగింపు, అలాగే వారి భవిష్యత్తు ప్రకటనకి కూడా. ఆ విధంగా, సేవకులు హీనంగా సేవిస్తే, దాని పర్యవసానాలను తామంతటాము ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒక సేవకుడు చివరి వరకూ సేవ చేయలేకపోతే, లేదా సేవ చేసే అర్హత మధ్యలో తొలగించబడితే, అప్పుడు వారు అవిశ్వాసుల మధ్యకి విసిరివేయబడతారు- ఒకవేళ ఇది జరిగితే, అలాంటి వ్యక్తి జంతువుల మాదిరిగా, తెలివితక్కువగా లేదా హేతుబద్దత లేని వారి మాదిరిగా వ్యవహరించ బడతాడు. నేను దీన్ని ఇలా చెప్పినపుడు, మీరు అర్దం చేసుకోగలుగుతున్నారు, అవునా?
పైన పేర్కొన్నది, దేవుడు తను ఎన్నుకున్న వారి మరియు సేవ చేసేవారి జనన మరణ చక్రాన్ని ఎలా నిర్వహిస్తాడు అని. ఇది విన్న తర్వాత, మీకు ఎలా అనిపిస్తుంది? నేను ఇంతకు ముందు ఎప్పుడైనా ఈ అంశం గురించి మాట్లాడానా? దేవుడు ఎన్నుకున్న వారి గురించి, సేవ చేసేవారి గురించి నేను ఎప్పుడైనా మాట్లాడానా? నిజానికి నేను మాట్లాడాను, కానీ మీరు గుర్తుంచుకోలేదు. దేవుడు ఆయన ఎన్నుకున్న వ్యక్తుల పట్ల మరియు సేవకుల పట్ల నీతివంతముగా ఉంటాడు. అన్నీ విశ్యాలలోనూ, ఆయన నీతిమంతుడు. నేను సరిగానే చెప్పానా? దీంట్లో మీరు ఏదైనా తప్పు వెతకగలరా? “ఎన్నుకున్న వారి పట్ల దేవుడు ఎందుకు అంత సహనం చూపుతున్నాడు? మరియు ఆయన సేవ చేసేవారి పట్ల ఎందుకు కాస్త తక్కువ సహనం చూపుతున్నాడు?” ఎవరైనా సేవ చేసేవారికి అండగా నిలబడాలనుకుంటున్నారా? “దేవుడు సేవ చేసేవారికి మరింత సమయం ఇవ్వగలడా మరియు వారి పట్ల మరింత సహనం మరియు సంయమనంతో ఉండగలడా?” ఇలాంటి ప్రశ్న లేవనెత్తడం సరైనదేనా?( కాదు. అది సరికాదు.) ఎందుకు కాదు?(ఎందుకంటే సేవకుల చేయబడడం అనే చర్య ద్వారా నిజానికి మనకి ఇక్కడ మేలు జరిగింది) సేవ చేసేవారికి సేవ చేయడానికి అనుమతించడం ద్వారా వాస్తవానికి మేలు జరిగింది! “సేవ చేసేవారు” అనే పేరు లేకుండా, వారు చేసే పని లేకుండా, ఈ ప్రజలు ఎక్కడ ఉంటారు? వారు అవిశ్వాసుల మధ్య, జంతువులతో కలిసి జీవిస్తూ, చనిపోతూ ఉంటారు. ఈ రోజు వారు ఎంత గొప్ప కృపను అనుభవిస్తున్నారు, దేవుని యెదుటకి రావడానికి మరియు దేవుని గృహానికి రావడానికి అనుమతించబడ్డారు! ఇది ఎంత గొప్ప కృప! దేవుడు నేకు ఈ సేవ చేసే అవకాశం ఇవ్వనట్లయితే, ఆయన ముందుకు రావడానికి నీకు ఎన్నటికీ అవకాశం ఉండేది కాదు. హీనంగా చెప్పాలంటే, నువ్వు ఒక బౌద్దుడివి అయ్యి ఫలాన్ని సాధించినా, మహా అయితే నువ్వు ఆధ్యాత్మిక ప్రపంచంలో గుమాస్తా వి అవుతావు; నువ్వు దేవుణ్ణి ఎన్నటికీ కలవలేవు, ఆయన స్వరాన్ని ఆయన మాటలను వినలేవు, లేదా ఆయన ప్రేమను ఆశీర్వాదాలను అనుభవించలేవు, ఆయనతో ఎన్నడూ ముఖా ముఖీ గా ఎదురవలేవు. బౌద్దుల కి కేటాయించినవి చిన్న పనులు. వారికి దేవుడు ఎవరో తెలియక పోవచ్చు, వారు కేవలం కట్టుబడి, విధేయులుగా ఉంటారు, అదే సేవ చేసేవారు ఈ దశలో చాలా ఎక్కువ పొందుతారు! మొదటిగా, వారు దేవునితో ముఖాముఖిగా ఎదురుపడగలరు, ఆయన స్వరాన్ని వినగలరు, ఆయన మాటలను వినగలరు మరియు ఆయన ప్రజలకు అందించే కృపలను మరియు ఆశీర్వాదాలను అనుభవించగలరు. ఇంకా, దేవుడు అందించిన మాటలను, సత్యాలను వారు ఆస్వాదించగలరు. సేవకులు నిజంగా ఎంతగానో పొందుతారు! ఆ విధంగా, ఒకవేళ, ఒక సేవకునిగా, నువ్వు సరైన ప్రయత్నం కూడా చేయకపోతే, అప్పుడు దేవుడు నిన్ను ఇంకా ఉంచుకుంటాడా? ఆయన నిన్ను ఉంచుకోలేడు. ఆయన నీ నుండి ఎక్కువగా కోరడం లేదు, అయినప్పటికీ ఆయన కోరేది నువ్వు సరిగా చేయడం లేదు; నువ్వు నీ విధికి కట్టుబడి లేవు. ఇలా ఉంటే, ఏ మాత్రం సందేహం లేకుండా, దేవుడు నిన్ను ఉంచుకోలేడు. దేవుని నీతి వంతమైన స్వభావం ఇలాంటిది. దేవుడు నిన్ను గారం చేయడు, ఆయన నీ పట్ల వివక్ష కూడా చూపడు. ఈ నియమాల ప్రకారం దేవుడు పని చేస్తాడు. దేవుడు మనుషులు మరియు ప్రాణులన్నిటితోనూ ఈ విధంగానే వ్యవహరిస్తాడు.
ఆధ్యాత్మిక ప్రపంచం విషయానికి వస్తే, దానిలో ఉండే వివిధ జీవులు ఏదైనా తప్పు చేసినా లేదా వారు విధులు సరిగా నిర్వర్తించకపోయినా, వారితో వ్యవహరించడానికి దేవునికి తగిన పరలోకపుప్రకటనలు మరియు శాసనాలు కూడా ఉన్నాయి; ఇది సంపూర్ణమైనది. కాబట్టి, దేవుని అనేక-వేల-సంవత్సరాల నిర్వహణా కార్యంలో, కొంతమంది తప్పు చేసిన సేవకులు తొలగించబడ్డారు. మరికొందరు-ఈ రోజు వరకు-ఇప్పటికీ నిర్బంధించబడ్డారు మరియు శిక్షించబడ్డారు. ఆధ్యాత్మిక ప్రపంచంలోని ప్రతి జీవి ఇది తప్పక ఎదుర్కొంటుంది. వారు ఏదైనా తప్పు చేస్తే లేదా చెడు చేసినట్లయితే, అప్పుడు వారు శిక్షించబడతారు—మరియు ఇది దేవుడు తాను ఎన్నుకున్న వారి పట్ల మరియు సేవ చేసేవారి పట్ల చూపే విధానం వలెనే ఉంటుంది. ఆ విధంగా, ఆధ్యాత్మిక ప్రపంచం మరియు భౌతిక ప్రపంచం రెండిటిలోనూ, దేవుడు వ్యవహరించే నియమాలు మారవు. నువ్వు దేవుని చర్యలను చూడగలిగినా చూడలేకపోయినా, వారి నియమాలు మారవు. అంతటిలోనూ, దేవుడు ప్రతిదానిని చేరుకొనే విధానంలో మరియు అన్ని విషయాల నిర్వహణలో ఒకే నియమాలను కలిగి ఉన్నాడు. ఇది మార్పులేనిది. అవిశ్వాసులలో సాపేక్షంగా సరైన పద్దతిలో జీవించే వారిపట్ల దేవుడు దయతో ఉంటాడు, ప్రతి మతంలోనూ మంచిగా ప్రవర్తించే మరియు చెడు చేయని వారికి అవకాశాలను కాపాడతాడు, దేవుడు నిర్వహించే అన్ని విషయాలలో వారి పాత్రలను పోషించడానికి మరియు వారు చేయవల్సింది చేయడానికి వీలు కల్పిస్తాడు. ఆ విధంగానే, దేవుడ్ని అనుసరించే వారిలో, మరియు ఆయన ఎన్నుకున్న ప్రజలలో ఆయన కున్న ఈ నియమాల ఆధారంగా ఏ వ్యక్తి పట్లా వివక్ష చూపడు. ఆయనను నిజాయితేగా అనుసరించే ప్రతీ వ్యక్తి పట్ల ఆయన దయతో ఉంటాడు, మరియు ఆయనను నిజాయితీగా అనుసరించే ప్రతీ ఒక్కరినీ ఆయన ప్రేమిస్తాడు. ఈ అనేక రకములైన ప్రజలకు- అవిశ్వాసులు, అనేకరకములైన విశ్వాసుము గల ప్రజలు, దేవుడు ఎన్నుకున్న వారు- ఆయాన వారికి అందించేది మారుతుంది. ఉదాహరణకు, అవిశ్వాసులను తీసుకోండి: వారు దేవుడ్ని విశ్వసించక పోయినప్పటికీ, దేవుడు వారిని మృగాల్లా చూస్తాడు, అన్నిటిలోనూ ప్రతీదానికి తినడానికి ఆహారం, వాటికంటూ స్వంత స్తలం, ఒక సాధారణ జనన మరణ చక్రం ఉంటాయి. చెడు చేసిన వారు శిక్షించబడతారు, మంచి చేసిన వారు ఆశీర్వదించబడతారు, మరియు దేవుని దయను పొందుతారు. ఇది అలా లేదా? విశ్వాసులైన ప్రజలకు, ప్రతీ పునర్జన్మ తర్వాత పునర్జన్మ గుండా, వారు తమ ఆచారాలకు కట్టుబడి ఉంటే, ఆ పునర్జన్మలన్నిటి తర్వాత, దేవుడు చివరికి వారికి తమ ప్రకటనను చేస్తాడు. ఆ విధంగా, ఈ రోజు మీరు, దేవుడు ఎన్నుకున్న వారిలో లేదా సేవకులలో ఒకరైతే, దేవుడు మిమ్మల్ని కూడా ఒక దారిలోకి తీసుకు వస్తాడు మరియు ఆయన నిర్దేశించిన నియమాలు మరియు నిర్వహణా శాసనాలకు అనుగుణంగా నీ ఫలితాన్ని నిర్దారిస్తాడు. ఈ రకమైన ప్రజలలో, అనేక రకములైన విశ్వాసులైన ప్రజలలో- అంటే వివిధ మతాలకి చెందిన వారు- దేవుడు వారికి జీవించడానికి ఏదైనా చోటు ఇచ్చాడా? యూదులు ఎక్కడ ఉన్నారు? దేవుడు వారి విశ్వాసంలో జోక్యం చేసుకున్నాడా? లేదు కదా, అవునా? క్రైస్తవుల సంగతి ఏమిటి? వారి విషయంలో కూడా ఆయన జోక్యం చేసుకోలేదు. తమ స్వంత విధానాలకు కట్టుబడి ఉండటానికి అనుమతిస్తాడు, ఆయన వారితో మాట్లాడడు లేదా వారికి ఎలాంటి జ్ణానాన్ని ఇవ్వడు, అంతేకాక, ఆయన వారికే ఏదీ వ్యక్తం చేయడు. నువ్వు అది సరైనది అని భావిస్తే, అప్పుడు ఈ విధంగా విశ్వసించు. కాథలిక్కులు మేరీని నమ్ముతారు, ఆమె ద్వారా యేసుకి వార్త చేరింది అని నమ్ముతారు; వారి విశ్వాస రూపం ఇలాంటిది. దేవుడు వారి విశ్వాసాన్ని ఎప్పుడైనా సరి చేశాడా? ఆయన వారికి పూర్తి నియంత్రణను ఇచ్చాడు; ఆయన వారిని పట్టించుకోడు మరియు వారు జీవించడానికి ఒక నిర్దిష్ట స్తలాన్ని ఇస్తాడు. ముస్లీములు మరియు బౌద్దుల విషయంలో, ఆయన అలాగే లేడా? ఆయన వారికి కూడా సరిహద్దులు ఏర్పాటు చేశాడు, వారి సంబందిత విశ్వాసాలలో జోక్యం చేసుకోకుండా వారికి కూడా తమ సొంత నివాస స్తలం కలిగి ఉండేలా చేశాడు. ప్రతీదీ చక్కగా క్రమ బద్దీకరించబడింది. దీనంతటిలో మీరు ఏం చూస్తున్నారు? దేవుడు అధికారాన్ని కలిగి ఉన్నాడు, కానీ ఆయన దాన్ని దుర్వినియోగపరచడు అని. దేవుడు సమస్తమైన వాటినీ పరిపూర్ణ క్రమంలో ఏర్పాటు చేస్తాడు మరియు దాన్నిక్రమ పద్దతిలో చేస్తాడు, ఇక్కడే ఆయన వివేకం మరియు సర్వశక్తిమత్వం ఉన్నాయి.
ఈ రోజు మనం ఒక కొత్త, ప్రత్యేకమైన అంశాన్ని స్పృశించాము, ఆధ్యాత్మిక ప్రపంచానికి చెందిన విషయాలకు సంబంధించినది, ఇది ఆ రాజ్యం పై దేవుని పరిపాలన మరియు ఆధిపత్యం యొక్క ఒక కోణాన్ని సూచిస్తుంది. మీరు ఈ విషయాలను అర్దం చేసుకునే ముందు, మీరు” దీనితో సంబంధించినదంతా ఒక రహస్యం మరియు జీవితంలోకి మన ప్రవేశానికి ఎటువంటి సంబంధమూ లేదు; ఈ విషయాలు ప్రజలు వాస్తవానికి ఎలా జీవిస్తున్నారు అనే దాని నుండి విడిపోయి ఉన్నాయి మరియు మనం వాటిని అర్థం చేసుకోవలసిన అవసరం లేదు, లేదా మేము వాటి గురించి వినాలని కోరుకోము. వాటికి దేవుడ్ని తెలుసుకోవడంతో ఏ సంబంధమూ లేదు.” అని ఉండవచ్చు. ఇప్పుడు, ఇలాంటి ఆలోచనా విధానంలో ఒక సమస్య ఉంది అని మీరు అనుకుంటున్నారా? అది నిజమేనా?(కాదు.) ఇలాంటి ఆలోచన సరైనది కాదు దీనిలో తీవ్రమైన సమస్యలు ఉన్నాయి. దీనికి కారణం ఏమిటంటే, దేవుడు సమస్తమైన వాటిని ఎలా పరిపాలిస్తాడో నువ్వు అర్థం చేసుకోవాలనుకుంటే, నువ్వు కేవలం నువ్వు చూడగలిగే వాటిని మరియు నీ ఆలోచనా విధానం గ్రహించగలిగే వాటిని మాత్రమే అర్థం చేసుకోకూడదు; నువ్వు మరో ప్రపంచంలో కొంత కూడా అర్దం చేసుకోవాలి, అది నీకు కనిపించకపోవచ్చు కానీ నువ్వు చూడగలిగే ఈ ప్రపంచంతో విడదీయలేని విధంగా ముడిపడి ఉంది. ఇది దేవుని సార్వభౌమత్వానికి చెందినది, అది ఈ అంశానికి చెందినది”దేవుడు సమస్తమైన వాటికి జీవనాధారమై ఉన్నాడు.” అది దానికి సంబంధించిన సమాచారం. ఈ సమాచారం లేకుండా, ఎలా దేవుడు సమస్తమైన వాటికి జీవనాధారమై ఉన్నాడు అని విషయంలో ప్రజల జ్ణానంలో తప్పులు, లోపాలు ఉంటాయి. ఆ విధంగా ఈ రోజు మాట్లాడుకుంది మునపటి అంశాలను పూర్తి చేసింది అని, అలాగే “దేవుడు సమస్తమైన వాటికి జీవనాధారమై ఉన్నాడు” అనే విషయానికి ముగింపు ఇచ్చిందని చెప్పవచ్చు. దీని అర్దం చేసుకున్నా తర్వాత, ఈ విషయాల ద్వారా ఇప్పుడు మీరు దేవుడ్ని తెలుసుకోగలుగుతున్నారా? అన్నిటి కంటే ముఖ్యంగా, మీకు ఈ రోజు సేవకులకి సంబంధించి నేనొక కీలకమైన సమాచారాన్ని అందించాను. ఇలాంటి విషయాలు వినడాన్ని మీరు బాగా ఆస్వాదిస్తారని, వీటి గురించి మీరు నిజంగా శ్రద్ద వహిస్తారని నాకు తెలుసు. కాబట్టి నేను ఈ రోజు మాట్లాడిన దాని పట్ల మీరు తృప్తి చెందారా? (ఔవును, మేము చెందాము.) కొన్ని ఇతర విషయాలు మీపై చాలా బలమైన ముద్ర వేయకపోవచ్చు, కానీ నేను సేవ చేసేవారి గురించి చెప్పినది ప్రత్యేకంగా బలమైన ముద్ర వేసింది, ఎందుకంటే ఈ అంశం మీలో ప్రతి ఒక్కరి ఆత్మను తాకుతుంది.
దేవుడు మానవాళి నుండి కోరేది
1. దేవుని గుర్తింపు మరియు స్తాయి
“దేవుడే సమస్తమైన వాటికి జీవనాధారమై ఉన్నాడు” అలాగే “దేవుడు ప్రత్యేకమైన దేవుడై ఉన్నాడు” అనే అంశపు ముగింపునకు మనం చేరుకున్నాం. ఇది పూర్తి చేశాము కనుక, మనం విషయాలను సంక్షిప్తీకరించాలి. మనం ఎలాంటి సారాంశాన్ని తయారు చేయాలి? ఇది స్వయంగా దేవుని గురించిన ముగింపుయై ఉన్నది. అదలా ఉండగా, దానికి మరియు దేవునికి సంబంధించిన ప్రతి అంశానికి, అలాగే ప్రజలు దేవునిని ఎలా విశ్వసిస్తారు అనే దానికి అనివార్య సంబందాన్ని కలిగి ఉండాలి. అందుకే, నేను మొదట మిమ్మ్లల్ని అడగాలి: మీ మనసు దృష్టిలో దేవుడు ఎవరు?(సృష్టికర్త). మీ మనసు దృష్టిలో దేవుడు ఎవరంటే సృష్టికర్త. ఇంకా ఏమైనా ఉందా? దేవుడు సమస్తమైన వాటికి ప్రభువై ఉన్నాడు. ఈ వాక్యాలు సరైనవేనా? (ఔను.) అన్నిటినీ శాసించేది మరియు అన్నిటినీపరిపాలించేది దేవుడే. ఉన్నదంతటినీ సృష్టించినవాడు ఆయనే, ఉన్నదాననంతటిని పరిపాలించేది ఆయనే, మరియు ఉన్నదానంతటికి పోషణ అందించేది ఆయనే. ఇదీ దేవుని స్థాయి మరియు ఇదీ ఆయన గుర్తింపు. అన్నిటికీ మరియు ఉన్న వాటన్నిటికీ, దేవుని నిజమైన గుర్తింపు ఏమనగా సమస్త సృష్టికి సృష్టికర్తయైయున్నాడు మరియు సమస్త సృష్టిని పరిపాలించు అధిపతియైయున్నాడు. దేవుడు కలిగి ఉన్న గుర్తింపు ఇలాంటిది, మరియు అన్నిటిలోనూ ఆయన ప్రత్యేకమైనవాడు. దేవుడు సృష్టించిన జీవులలో ఏవీ కూడా, అంటే అవి మనుషుల మధ్యనున్నా లేక అధ్యాత్మిక ప్రపంచానికి చెందినవైనా దేవుని గుర్తింపును మరియు ఆయన స్థాయిని అనుకరించడానికి ఎలాంటి మాధ్యమాన్ని మరియు సాకుని వాడుకోలేవు, ఎందుకంటే సమస్తమైన వాటిలో ఈ గుర్తింపును, శక్తిని, అధికారాన్ని, మరియు సృష్టిని పాలించే సామర్ధ్యాన్ని కలిగి ఉంది ఒకే ఒక్కడు: ఆయనే మన ప్రత్యేకతమైన దేవుడు. ఆయన సమస్తమైన వాటి మధ్యన జీవిస్తూ, చలిస్తూ ఉంటాడు; అన్నిటికంటే పైకి ఉన్నత స్థానానికి ఆయన ఎదగగలడు. ఆయన మానవునిగా మారడం ద్వారా, రక్త మాంసములగల వారి మధ్యన ఒకనిగా మారడం ద్వారా, ప్రజలను ముఖాముఖీగా ఎదుర్కొని వారితో సాధక బాధకాలను పంచుకోవడం ద్వారా తననుతాను తగ్గించుకోగలడు, అదే సమయంలో, ఆయన ఉన్నవాటన్నిటినీ అజ్జ్ఞాపిస్తూ, ఉన్నవాటన్నిటి విధిని, మరియు అవన్నీ ఏ దిశగా కదలాలో నిర్ణయిస్తాడు. అంతేకాక, ఆయన సమస్త మానవాళి విధిని నడిపిస్తాడు మరియు మానవాళి దిశను నిర్దేశిస్తాడు. ఇలాంటి దేవుడిని జీవ రాశులన్నీ ఆరాధించాలి, ఆయనకు లోబడాలి మరియు ఆయనను తెలుసుకోవాలి. ఆ విధంగా, నువ్వు మానవాళికి చెందిన ఏ సమూహానికి సంబంధించినవాడవన్న దానితో సంబంధము లేకుండా, లేదా తెగకు చెందిన వాడివి అనే దానితో సంబందం లేకుండా, దేవునిని విశ్వసించడం, దేవునిని అనుసరించడం, దేవునిని ఆరాధించడం, ఆయన నియమాన్ని అనుసరించడం, మరియు నీ విధి కొరకు ఆయన ఏర్పాట్లను అంగీకరించడమన్నది ఒక్కటే మార్గం, అంటే, ఇది ఏ మనిషికైనా, ఏ జీవికైనా అవసరమైన ఎంపిక. దేవుని ప్రత్యేకతలో, ప్రజలు ఆయన అదికారాన్ని, ఆయన నీతివంతమైన స్వభావాన్ని, ఆయన గుణగణాలను, ఆయన సమస్తమైన వాటికి అందించే మాధ్యమాలను పూర్తిగా ప్రత్యేకమైనవని చూస్తారు; ఈ ప్రత్యేకత స్వయంగా దేవుని నిజమైన గుర్తింపును నిర్దారిస్తుంది, అంతేకాక అది ఆయన స్థాయిని కూడా నిర్దారిస్తుంది. ఆ విధంగా, ప్రాణులన్నిటిలోనూ, ఆధ్యాత్మిక ప్రపంచంలో లేదా మానవాళిలో ఎవరైనా దేవుని స్థానములో నిలవాలని కోరుకుంటే, విజయం పొందడం అనేది అసాధ్యం, అలాగే దేవునిలా ఉండాలనే చేసే ఎలాంటి ప్రయత్నమైనా రాణించదు. ఇది వాస్తవం. ఇటువంటి గుర్తింపును, శక్తిని, దేవుని స్థాయిని కలిగి ఉన్న సృష్టికర్త మరియు పాలకునిపట్ల మానివాళి నెరవేర్చవలసినవి ఏమిటి? ఇది ప్రతిఒక్కరికి స్పష్టమవ్వాలి, మరియు ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి; ఇది దేవునికి మరియు మానవునికి ఎంతో ఆవశ్యకం.
2. దేవుని పట్ల మానవాళి యొక్క వివిధ వైఖరులు
ప్రజలు దేవుడితో ఎలా ప్రవర్తిస్తారు అనేది వారి భవిష్యత్తును, అలాగే దేవుడు వారితో ఎలా ప్రవర్తిస్తాడు మరియు వ్యవహరిస్తాడు అనేది నిర్ణయిస్తుంది. ఈ సమయంలో, ప్రజలు దేవునితో ఎలా ప్రవర్తిస్తారు అనే దానికి నేను కొన్ని ఉదాహరణలు ఇస్తాను. దేవుని ముందు వారి ప్రవర్తనా విధానాలు మరియు వైఖరులు సరైనవో కాదో మనం విందాము మరియు చూద్దాం. కింది ఏడు రకాల వ్యక్తుల ప్రవర్తనను పరిశీలిద్దాం.
1) దేవుని పట్ల ప్రత్యేకంగా అసంబద్దమైన వైఖరి ఉన్న వ్యక్తి ఒకరున్నారు. ఈ ప్రజలు దేవుడు బోధిసత్వుని వంటి వాడు లేదా మానవ విజ్ణానం లో ఒక పరిశుద్దుడు మరియు మనుషులు ఒకరినొకరు కలిసినప్పుడల్లా మూడు సార్లు వంగి నమస్కరించడం మరియు భోజనం తర్వాత ధూపం వెలిగించడం అవసరం అని అనుకుంటారు. దాని ఫలితంగా, వారు ఆయన కృప పట్ల అత్యంత కృతజ్ఞతగా మరియు ఆయన పట్ల కృతజ్ఞతా భావాన్ని అనుభవించినప్పుడల్లా, వారు తరచుగా ఈ విధమైన ప్రేరణను కలిగి ఉంటారు. నేడు తాము విశ్వసించే దేవుడు, వారి హృదయాలలో ఎన్నో సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్న దేవుని వలె, వారు కలిసినప్పుడల్లా రోజుకి మూడు సార్లు వంగి నమస్కరించడాన్ని మరియు ప్రతీ భోజనం తర్వాత ధూపం వెలిగించడాన్ని అంగీకరించాలని కోరుకుంటారు.
2) కొంత మండి దేవుడ్ని జీవులన్నిటినీ వేదన నుండి విడిపించి రక్షించే సజీవ బుద్దునిగా చూస్తారు; వారు ఆయనను కష్టాల సముద్రం నుండి తమని దూరంగా తీసుకోపోగలిగే సజీవ బుద్దునిగా చూస్తారు. దేవుని పై ఈ ప్రజల విశ్వాసం ఆయనను బుద్దునిగా ఆరాధించడంలో పరిమితమై ఉంది. వారు ధూపాన్ని వెలిగించకపోయినప్పటికీ, కౌటౌ, లేదా అర్పణలు ఇవ్వడం, లోలోపల, వారిని దయతో, దాతృత్వము తో ఉండాలని, జీవించే ఏ ప్రాణినీ చంపకూడదని, ఇతరులను దూషించడం మానుకొమ్మని, నిజాయితీ గా కనపడే జీవితాన్ని జీవించమని, ఏ తప్పులూ చేయకూడదని కోరే బుద్దుడు లాంటి వాడే దేవుడు అని వారు భావిస్తారు. ఆయన వారిని అడిగేదంతా ఇవేనని వారు విశ్వసిస్తారు; ఇది వారి హృదయాలలో ఉన్న దేవుడు.
3) కొంతమంది ప్రజలు దేవుడ్ని ఆయన ఏదో ప్రముఖుడు లేదా ప్రఖ్యాతి గాంచినవాడిగా ఆరాధిస్తారు. ఉదాహరణకు, ఈ గొప్ప వ్యక్తి ఏ విధంగా మాట్లాడతాడో, ఆయన ఏ స్వరంతో మాట్లాడతాడో, ఆయన ఎలాంటి పదాలు మరియు పదజాలం ఉపయోగిస్తాడు, ఆయన స్వరం, ఆయన చేతి సంజ్ఞలు, ఆయన అభిప్రాయాలు మరియు చర్యలు, ఆయన ఓర్పు- అన్నిటినీ వారు అనుకరిస్తారు మరియు ఇవి దేవుని యందు వారికున్న విశ్వాసం లో వారు తప్పక పూర్తిగా పుట్టించే విషయాలు ఇవి.
4) కొంతమంది దేవుడ్ని ఒక చక్రవర్తిగా చూస్తారు, ఆయన అందరికంటే ఉన్నతమైనవాడని మరియు ఆయనను అవమానించడానికి ఎవరూ సాహసించరని మరియు ఎవరైనా అలా చేస్తే, ఆ వ్యక్తి శిక్షకి గురవుతాడు అని భావిస్తారు. వారు ఇలాంటి చక్రవర్తిని ఆరాధిస్తారు ఎందుకంటే చకవర్తులు వారి హృదయాలలో ఒక నిర్దిష్ట స్తానం కలిగి ఉంటారు. వారి ఆలోచనలు, ప్రవర్తనా విధానం, అధికారం, మరియు స్వభావం- వారి ఆసక్తులు మరియు వ్యక్తిగత జీవితం కూడా- ఇవన్నీ వారు తప్పక అర్దం చేసుకోవాలని వారు భావిస్తారు; అవి వారు పట్టించుకునే సమస్యలు మరియు విషయాలుగా మారాయి. దాని ఫలితంగా, వారు దేవుడ్ని ఒక చక్రవర్తిగా ఆరాధిస్తారు. ఈ విశ్వాస విధానం హాస్యాస్పదం.
5) కొంతమంది ప్రజలకి దేవుని ఉనికిపై ప్రత్యేకమైన విశ్వాసం ఉంటుంది, ఈ విశ్వాసం లోతుగా, చెదరిపోకుండా ఉంటుంది. ఎందుకంటే దేవుని పట్ల వారి జ్ణానం చాలా ఉపరితలమైనది, అయితే, వారికి ఆయన మాటల యందు ఎక్కువ అనుభవం లేదు, వారు ఆయనను ఒక విగ్రహం గా ఆరాధిస్తారు; అది వారు తప్పక భయపడవలసినదిగా మరియు మోకరిల్లవలసినదిగా, వారు తప్పక అనుసరించవల్సినదిగా, అనుకరించవలసినదిగా భావిస్తారు. వారు దేవుడ్ని తమ జీవితాంతం అనుసరించవల్సిన విగ్రహముగా చూస్తారు. వారు దేవుడు మాట్లాడే స్వరాన్ని అనుకరిస్తారు, బాహ్యముగా, వారు దేవుడు ఇష్టపడే వారిని అనుకరిస్తారు. వారు తరచుగా అమాయకంగా, స్వచ్ఛంగా మరియు నిజాయితీగా కనిపించే పనులను చేస్తారు, మరియు వారు ఈ విగ్రహాన్ని అది వారు ఎప్పటికీ విడిచిపోలేని భాగస్వామి లేదా సహచరుడిగా అనుసరిస్తారు. ఇది వారి విశ్వాస విధానం.
6) అనేకమైన దేవుని వాక్యాలను చదివి, చాలా భోధను విని ఉన్నప్పటికీ, లోలోపల దేవుని పట్ల తమ ప్రవర్తన వెనుక ఉన్న ఏకైక నియమం వారు ఎల్లప్పుడూ అతివినయముతో, మర్యాదపూర్వకంగా ఉండాలని లేదా దేవుణ్ణి అవాస్తవికంగా స్తుతిస్తూ మెచ్చుకోవాలని భావించే వ్యక్తులు ఒక రకం. అలా ప్రవర్తించమని కోరే దేవుడే దేవుడు అని వారు నమ్ముతారు. అంతేకాక, వారు అలా చేయకపోతే, అప్పుడు ఏ సమయంలోనైనా ఆయనకు కోపాన్ని కలిగించవచ్చు లేదా ఆయనకు వ్యతిరేకంగా పాపంలోకి పడిపోతారని, పాపం చేసినందు వలన దేవుడు వారిని శిక్షిస్తాడని వారు భావిస్తారు. వారి హృదయాలలో ఉంచుకునే దేవుడు ఇలాంటి వాడు.
7) దేవునిలో ఆధ్యాత్మిక పోషణను వెతికే ప్రజలు అధిక సంఖ్యలో ఉన్నారు. ఇది ఎందుకంటే వారు ఈ ప్రపంచంలో నివసిస్తున్నారు, వారు శాంతి లేదా ఆనందం లేకుండా ఉన్నారు, మరియు వారు ఎక్కడా ఓదార్పుని పొందలేరు; వారు ఒకసారి దేవుడ్ని కనుగొన్నాక, ఆయన వాక్యాలను చూసిన మరియు విన్న తర్వాత, తమ హృదయాలలో రహస్య ఆనందాన్ని, ఉల్లాసాన్ని దాచుకోవడం మొదలుపెడతారు. ఇది ఎందుకంటే వారు చివరకి వారి ఆత్మలను సంతోష పరచే స్తలాన్ని కనుగొన్నారు మరియు వారికి ఆధ్యాత్మిక పోషణను ఇచ్చే దేవుడ్ని కనుగొన్నారు. వారు దేవుడ్ని అంగీకరించి, ఆయనను అనుసరించడం మొదలు పెట్టాకా, వారు సంతోషంగా ఉన్నారు, వారి జీవితాలు పరిపూర్ణమయ్యాయి. వారు జంతువులలాగా నిద్రలో నడిచే అవిశ్వాసుల లాగా ఇకపై ప్రవర్తించరు, మరియు జీవితంలో ఎదురు చూడవల్సినది కొంత ఉంది అని అనుకుంటారు. ఆ విధంగా, ఈ దేవుడు వారి ఆధ్యాత్మిక అవసరాలను బాగా తృప్తి పరచగలడని, వారి మనసుకు, ఆత్మకు గొప్ప ఆనందాన్ని తీసుకువస్తాడని అనుకుంటారు. తెలియకుండానే, ఇలాంటి ఆధ్యాత్మిక పోషణను ఇచ్చే, వారి ఆత్మలకు, వారి కుటుంబ సభ్యులందరికీ ఆనందాన్నిచ్చే దేవుడ్ని విడిచి ఉండలేకపోతారు. దేవుని యందు విశ్వాసం ఆధ్యాత్మిక పోషణ కన్నా ఏదీ ఇవ్వవల్సిన అవసరం లేదని వారు విశ్వసిస్తారు.
మీలో ఎవరైనా పైన చెప్పిన అనేకరకాల వైఖరులను కలిగి ఉన్నారా?(అవును.) దేవుని యందు విశ్వాసములో ఎవరి హృదయమైనా ఆ వైఖరులలో ఏదైనా కలిగి ఉంటే, వారు నిజముగా దేవుని యెదుటకు రాగలరా? అలాంటి వ్యక్తి అద్వితీయుడైన దేవుడ్ని విశ్వసిస్తాడా? (లేదు.) నువ్వు అద్వితీయుడైన దేవుడ్ని విశ్వసించవు కాబట్టి, నువ్వు ఎవర్ని విశ్వసిస్తావు? నువ్వు విశ్వసించేది అద్వితీయుడైన దేవుడ్ని కాకపోతే, నువ్వు విగ్రహాన్ని, లేదా ఒక గొప్ప మనిషిని, లేదా ఒక భోది సత్వుడ్ని, లేదా నీ హృదయంలో నువ్వు ఆరాధించే బుద్దుడిని నమ్మడం సాధ్యమవుతుందా? అంతేకాక, నువ్వు ఒక సాధారణమైన వ్యక్తిని నమ్మడం సాధ్యమవుతుంది. క్లుప్తంగా చెప్పాలంటే, దేవుని పట్ల ప్రజల వివిధ రకాల విశ్వాసాలు మరియు దృక్పథాల కారణంగా, వారు తమ స్వంత ఊహాలలో ఉన్న దేవుణ్ణి వారి హృదయాలలో ఉంచుతారు, వారి ఊహలను దేవునిపై రుద్దుతారు, దేవుని గురించి వారి దృక్పధాలు మరియు ఊహలను అద్వితీయమైన దేవునితో ప్రక్క ప్రక్కన ఉంచుతారు, దాని తర్వాత, వాటిని పవిత్రం చేయడానికి నిలబెడతారు. ప్రజలు దేవునిపట్ల అలాంటి అనుచిత దృక్పథాలను కలిగి ఉన్నట్లయితే దాని అర్థం ఏమిటి? వారు నిజ దేవుడిని తిరస్కరించి తప్పుడు దేవుడ్ని ఆరాధిస్తున్నారు అని అర్దం; వారు దేవుడ్ని విశ్వసిస్తూనే, వారు ఆయన్ని తిరస్కరిస్తూ, వ్యతిరేకిస్తున్నారు, వారు నిజ దేవుని ఉనికిని ఒప్పుకొని వారిలా ఉన్నారు. ప్రజలు ఇలాంటి విశ్వాస విధానాలను అవలంబిస్తే, వారు ఎలాంటి పర్యవసానాలను ఎదుర్కొంటారు? ఇలాంటి విశ్వాస విధానాలతో, దేవుని అవసరతలను నెరవేర్చడానికి దగ్గర కాగలరా? (లేదు, వారు అలా కాలేరు.) బదులుగా, వారు దేవుని మార్గం నుండి మరింత దూరంగా ఉంటారు, ఎందుకంటే వారు కోరుకునేది దేవుడు వారు అందుకోవాలని కోరుకునే దానికి వ్యతిరేక దిశలో ఉంది. మీరు ఎప్పుడైనా “రథాన్ని ఉత్తరాన నడపడం ద్వారా దక్షిణానికి వెళ్ళడం” అనే కథ విన్నారా? ఇది ఉత్తరాన రథాన్ని నడపడం ద్వారా దక్షిణానికి వెళ్లే సందర్భం కావచ్చు. ప్రజలు అలాంటి హాస్యాస్పదమైన పద్ధతిలో దేవుణ్ణి విశ్వసిస్తే, నువ్వు ఎంత కష్టపడితే, దేవునికి నువ్వు అంత దూరం అవుతావు. అందుకు, నేను నిన్ను ఇలా హెచ్చరిస్తున్నాను: మీరు వెళ్ళే ముందు, నువ్వు సరైన దిశలో వెళ్తున్నావో లేదో ముందు ఆలోచించు. నీ ప్రయత్నాల యందు దృష్టి పెట్టు, “ నేను విశ్వసించే దేవుడు సమస్తమైన వాటికి పాలకుడా? నేను విశ్వసించే దేవుడు కేవలం నాకు ఆధ్యాత్మిక పోషణను ఇచ్చేవాడా? ఆయన కేవలం నా విగ్రహమా? నేను విస్వ్సించే ఈ దేవుడు నా నుండి ఏం కోరుతున్నాడు? నేను చేసే ప్రతిదానిని దేవుడు ఆమోదిస్తాడా? నా చర్యలు మరియు అన్వేషణలన్నీ దేవుణ్ణి తెలుసుకోవాలనే కోరికకు అనుగుణంగా ఉన్నాయా? అవి నా గురించి ఆయన కోరిన వాటికి అనుగుణంగా ఉన్నాయా? నేను నడిచే మార్గం దేవునిచే గుర్తించబడి ఆమోదించబడిందా? ఆయన నా విశ్వాసముతో తృప్తి చెందాడా?” నిన్ను నువ్వు తరచుగా మళ్ళీ మళ్ళీఈ ప్రశ్నలు అడగాలి. ఆయను తృప్తి పరచడంలో విజయవంతమవడానికి ముందు దేవుని గురించిన జ్ణానాన్ని తెలుసుకోవాలని అనుకుంటే, అప్పుడు నీకు ఒక స్పష్టమైయన ఎరుక మరియు స్పష్టమైన లక్ష్యాలు ఉండాలి.
ఆయన సహనం ఫలితంగా, నేను ఇప్పుడు ప్రస్తావించిన అనుచిత వైఖరులను దేవుడు ద్వేషిస్తూనే అంగీకరించడం సాధ్యమవుతుందా? దేవుడు ఈ ప్రజల వైఖరులను మెచ్చుకోగలదా?(లేదు.) మానవుల నుండి మరియు ఆయనను అనుసరించే వారి నుండి దేవుడు కోరెవి ఏమిటి? ఆయన ప్రజలకు ఎలాంటి వైఖరి కలిగి ఉండాలి అని కోరుకుంటున్నాడో నీకు ఒక స్పష్టమైన అవగాహన ఉందా? ఈ సంధర్భంలో, నేను చాలా చెప్పాను; నేను దేవుడు అనే అంశం గురించే చాలా మాట్లాడాను, అలాగే ఆయన కార్యాలు మరియు ఆయన ఏమి కలిగి ఉన్నాడు మరియు ఆయన ఏమిటి అన్నది కూడా చెప్పాను. దేవుడు మనుషుల నుండి ఏం పొందాలని అనుకుంటున్నాడో మీకు తెలుసా? ఆయన నీ నుండి ఏం కోరుతున్నాడో నీకు తెలుసా? మాట్లాడు. అనుభవాల నుండి, ఆచరణ నుండి వచ్చిన నీ జ్ణానం ఇంకా తక్కువగా, లేదా ఇంకా ఉపరితలంగా ఉంటే అప్పుడు ఈ మాటల పట్ల మీ జ్ణానం గురించి మీరు కొంత చెప్పవచ్చు. మీకు సారాంశ జ్ణానం ఉందా? దేవుడు మనిషి నుండి ఏం కోరుతున్నాడు?( ఈ అనేక సహవాసాల సమయంలో, మనం ఆయనను తెలుసుకోవాలని, ఆయన కార్యాలను తెలుసుకోవాలని, సమస్తమైన వాటికి ఆయనే జీవనాధారమని తెలుసుకోవాలని మరియు ఆయన స్థితి మరియు గుర్తింపుతో పరిచయం కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు.) ఆయనను తెలుసుకున్న ప్రజలను దేవుడు అడిగినప్పుడు, అంతిమ ఫలితం ఏమిటి( దేవుడే సృష్టికర్త మరియు మానవులు సృష్టించబడినవారు అని వారు అర్దం చేసుకకుంటారు.) ప్రజలు ఇలాంటి జ్ణానాన్ని పొందినపుడు, దేవుని పట్ల వారికున్న వైఖరిలో, వారి విధి నిర్వహణలో, లేదా వారి జీవిత స్వభావాలలో మార్పులు ఏం ఉంటాయి? మీరు ఎప్పుడైనా దీని గురించి ఆలోచించారా? దేవుడ్ని తెలుసుకోవడం మరియు అర్దం చేసుకోవడం ద్వారా వారు మంచి వారు అవుతారు అని చెప్పవచ్చా?(దేవుని యందు విశ్వాసముంచడం మంచి వ్యక్తిగా ఉండాలని కోరదు. బదులుగా, దేవుని జీవితో సమానంగా మారాలనే అన్వేషణ మరియు నిజాయితీ గల వ్యక్తిగా ఉండటం.) అక్కడ ఇంకేదైనా ఉందా? (దేవుడ్ని నిజంగా, సరిగ్గా తెలుసుకున్నాక, మనము ఆయన్ని దేవుడు లాగా చూడగలము; దేవుడు ఎప్పుడూ దేవుడే అని, మేము సృష్టించబడిన జీవులం అని, మేము దేవుడ్ని ఆరాధించాలని, మేము సరైన స్తానాల్లో ఉండాలని మాకు తెలుసు.) చాలా మంచిది! మరి కొంత మంది నుండి విందాము. ( మాకు దేవుడు తెలుసు, అంతిమంగా దేవునికి నిజంగా లొంగిపోయే, దేవుణ్ణి ఆరాధించే మరియు చెడును తోసిపుచ్చే వ్యక్తులుగా ఉండగలుగుతాము.) అది సరైనదే!
3. దేవుడి పట్ల మానవాళి కలిగియుండాల్సిన దృక్పథము గురించి ఆయన కోరుకునేది
వాస్తవానికి, దేవుడు మానవాళి నుండి ఎక్కువగా ఆశించడం లేదు- లేదా, హీనపక్షం ప్రజలు ఊహించుకున్నంతగా ఆయన వారి నుండి కోరడం లేదు. దేవుడు వాక్యాలను పలకకపోతే, తన స్వభావాన్ని లేదా ఆయన చేసిన కార్యాలను వెల్లడించకపోతే మీకు దేవుడిని తెలుసుకోవడం కష్టమైపోతుంది. ఎందుకంటే, ప్రజలు అప్పుడు ఆయన ఉద్దేశాన్ని, చిత్తాన్ని ఊహించవలసి ఉంటుంది. అయితే, దేవుడు తన కార్యపు అంత్య దశలో, ఆయన ఎన్నో వాక్యాలను చెప్పాడు, ఎంతో కార్యము చేశాడు, ప్రజల నుంచి తనకు అవసరమైనవి ఎన్నో స్పష్టం చేసియున్నాడు. ఆయన వాక్యాలలో, ఆయన గొప్ప కార్యములో భాగంగా ఆయన తనకేది ఇష్టమో, ఏది అసహ్యమో, ప్రజలు ఎలా ఉండాలో చెప్పాడు. ఈ విషయాలు అర్థం చేసుకున్న తర్వాత దేవుడి అవసరాల పట్ల ప్రజలు తమ హృదయంలో స్పష్టమైన నిర్వచనం కలిగియుండాలి, ఎందుకంటే వారు అస్పష్టతతో దేవుణ్ణి విశ్వసించరు లేదా ఇకపై అస్పష్ట దేవుణ్ణి విశ్వసించరు, లేదా అస్పష్టత లేదా శూన్యత మధ్య వారు దేవునిపై విశ్వాసం కలిగి ఉండరు. బదులుగా, దేవుని పలుకులని వారు వినగలరు, దేవుని అవసరాల ప్రమాణాలని అర్థం చేసుకుని వాటిని పొందగల సామర్థ్యం వారు కలిగియున్నారు. మరియు దేవుడు మానవాళి తెలుసుకోవాల్సిన, అర్థం చేసుకోవాల్సిన విషయాలన్నిటినీ చెప్పటానికి వారి భాషనే ఉపయోగిస్తాడు. ఈ రోజుకీ, ప్రజలకు దేవుడు అంటే ఏమిటో, ఆయన వారినుండి కోరేది ఏమిటో, ఎవారైనా దేవుడిని ఎందుకు నమ్మాలో, లేదా ఎలా నమ్మాలో, దేవుడితో ఎలా వ్యవహరించాలో తెలియకపోతే- అప్పుడు ఇక్కడ ఒక సమస్య ఉంది.ఇప్పుడే, మీరందరూ ఒక ప్రత్యేకమైన అంశం గురించి మాట్లాడియున్నారు. ఈ విషయాలు ప్రత్యేకమైనవా, సాధారణమైనవా అనేదాని పట్ల మీకు కొంత అవగాహన ఉంది. ఏదైతేనేమి, మీకు దేవుడు మనిషి నుండి కోరే సరైన, సంపూర్ణమైన, ప్రత్యేకమైన కోరికల గురించి మీకు చెప్పాలి అనుకుంటున్నాను. అవి కేవలం కొన్ని పదాలు మాత్రమే, చాలా సాధారణమైనవి; మీకు ముందే తెలిసి ఉండవచ్చు. దేవుడు మానవాళి నుండి మరియు ఆయనను అనుసరించే వారినుండి ఆశిస్తున్న ఆ ఐదు విషయాలు ఇలా ఉన్నాయి: నిజమైన విశ్వాసం, విధేయవంతమైన అనుసరణ, సంపూర్ణ సమర్పణ, నిజమైన జ్ఞానం, మరియు మనస్ఫూర్తిగా చూపే గౌరవం.
ఈ ఐదు విషయాలలోనూ, దేవుడు ప్రజలు ఇకపై ఊహాగానాలను, అస్పష్టమైన దృష్టి కోణాలను వాడుకొని ఆయనను ప్రశ్నించకూడదు, అనుసరించకూడదు అని కోరుతున్నాడు. వారు కచ్చితంగా రకరకాల ఊహలతో, లేదా భావనలతో దేవుడ్ని అనుసరించడానికి వీలులేదు. ఆయన్ని అనుసరించే ప్రతిఒక్కరు విధేయతతో ఆ పని చేయాలి. అసంపూర్ణ మనసుతో, నిబద్ధత లేకుండా కాదు. దేవుడు నీ నుంచి ఏదైనా కోరినపుడు నిన్ను పరీక్షిస్తాడు, నిన్ను తీర్పు తీరుస్తాడు, నీతో వ్యవహరిస్తాడు, నిన్ను క్రమశిక్షణలో పెడతాడు, నిన్ను అలజడికి గురిచేస్తాడు నువ్వు ఆయనకి సంపూర్ణంగా లోబడాల్సిందే. నువ్వు కారణమేంటని అడగకూడదు, నిబంధనలు పెట్టకూడదు. అసలు కారణాల గురించి మాట్లాడనేవద్దు. నీ విధేయత సంపూర్ణంగా ఉండాలి. దేవుడి పట్ల జ్ఞానం అనే విభాగం లోనే ప్రజలు ఎక్కువగా వెనకబడియున్నారు. దేవుడికి సంబంధం లేని పలుకుల మీద, వాక్యాల మీద వారు తరచుగా ఆధారపడతారు, దేవుడి జ్ఞానానికి సంబంధించి అవే కచ్చితమైన నిర్వచనాలు అని వారు నమ్ముతుంటారు. ఆ వాక్యాలు మనిషి ఊహలలోంచి, వారి సొంత హేతువులోంచి, వారి సొంత జ్ఞానంలోంచి వస్తున్నాయని, దేవుని గుణం వాటికి కొద్దిగా కూడా సంబంధం లేదని వారికి తెలియదు. అందువలన, మనుషులు కలిగిఉండాలని దేవుడు కోరుకునే జ్ణానం విషయానికొస్తే, ఆయన నిన్ను కేవలం తన మాటలని, ఆయన్ని మాత్రమే గుర్తించమని అడగటం లేదు, ఆయన పట్ల నీ జ్ఞానం సరైనది అవ్వాలని కోరుతున్నాడు అని మీకు చెప్పాలనుకుంటున్నాను. నువ్వు దేవునికి సంబంధించిన ఒకే ఒక్క వాక్యాన్ని చెప్పినా, లేదా ఒక చిన్న భాగం పట్ల అవగాహన కలిగియున్నా, ఈ చిన్న భాగపు అవగాహన సరైనది, నిజమైనది ఐతే దానికి స్వయంగా దేవుని గుణం తోనే సంబంధం ఉంటుంది. ఎందుకంటే దేవుడు తనపట్ల అసహజమైన, అశుద్ధమైన స్తుతిని తిరస్కరిస్తాడు. అంతకు మించి, ప్రజలు ఆయనను గాలిలా వ్యవహరించటాన్ని ఆయన ద్వేషిస్తాడు. దేవునికి సంబంధించిన విషయాలను చర్చిస్తున్నప్పుడు, ప్రజలు నిజాలను పట్టించుకోకుండా, ఎలాంటి సంశయం లేకుండా, వాళ్లకు నచ్చినట్టు మాట్లాడటాన్ని ఆయన ద్వేషిస్తాడు. అంతేకాక, ఆయన గురించి తమకు తెలుసని నమ్మేవారిని, ఆయనకు సంబంధించిన జ్ఞానం పట్ల గర్వపడేవారిని, ఆయనకు సంబంధించిన విషయాల పట్ల ఎలాంటి అడ్డంకులు, ప్రత్యేకింపులు లేకుండా మాట్లాడేవారిని దేవుడు ద్వేషిస్తాడు. పైన చెప్పబడిన దేవుడు కోరే ఆ ఐదు విషయాలలో చివరిదైన హృదయపూర్వక గౌరవం: ఆయనను అనుసరించే వారణదారి నుండి ఆయన అంతిమ కోరిక ఇదే. ఎవరైనా దేవుని పట్ల సరియైన, నిజమైన జ్ఞానాన్ని కలిగియున్నప్పుడు వారు దేవుడిని గౌరవించి, చెడుకి దూరంగా ఉండగలుగుతారు. ఈ గౌరవం వారి హృదయాంతరాల్లోంచి వస్తుంది; ఈ రకమైన గౌరవం స్వచ్చందంగా వస్తుంది, అది దేవుడి ఒత్తిడి వల్ల వచ్చినది కాదు. నీ నుంచి మంచి స్నేహపూర్వక దృక్పథాన్ని, సత్ప్రవర్తనను, ఆయన పట్ల బయటకు చూపించే ప్రవర్తనను గానీ బహుమతిగా కోరడు. నీ హృదయాంతరాలలో నీవు ఆయన పట్ల గౌరవం, భయం కలిగియుండాలి అని నిన్ను కోరతాడు. ఆ విధమైన గౌరవం నీ జీవిత స్వభావాలలో మార్పుల వలన, దేవుని యొక్క జ్ఞానం తెలుసుకుని, దేవుని కార్యాలను, సారాన్ని అర్థం చేసుకుని, నీవు దేవుడు సృష్టించిన జీవులలో ఒకనివే అని ఒప్పుకోవడం వల్ల వస్తుంది. కాబట్టి, “హృదయపూర్వకంగా” అనే పదం వాడడంలో నా ఉద్దేశం ఏంటంటే దేవుడి పట్ల గౌరవం అనేది మనుషుల హృదయాంతరాలలోంచి రావాల్సి ఉంటుంది వారు అర్దం చేసుకునేలా గౌర్వాన్ని నిర్వచించడం కోసం వాడాను.
ఇప్పుడు ఈ ఐదు అవసరాలని పరిగణించండి: మీలో ఎవరికైనా ఈ మొదటి మూడు విషయాలను సాధించే సామర్థ్యం ఉందా? దీని నుండి, నేను నిజమైన విశ్వాసం, విధేయవంతమైన అనుసరణ, సంపూర్ణ సమర్పణ అనే వాటిని సూచిస్తున్నాను. మీలో ఎవరికైనా ఉందా ఈ సామర్థ్యం? నాకు తెలుసు ఒకేసారి ఐదు విషయాల్ని చెప్తే మీలో వాటిని సాధించగలిగేవారు ఎవరూ ఉండరని, నేను ఆ సంఖ్యను మూడుకి తీసుకురావడం జరిగింది. మీరు వాటిని సాధించారో లేదో ఒకసారి ఆలోచించండి. ముందుగా, “నిజమైన విశ్వాసం” సాధించడం సులభమేనా? (కానే కాదు). ఇదంత సులభం కాదు ఎందుకంటే ప్రజలు తరచూ దేవుడిని ప్రశ్నిస్తారు. మరి “విధేయవంతమైన అనుసరణ” సంగతేంటి? ఇందులో “విధేయత” అంటే అర్థం ఏంటి? (పాక్షిక హృదయంతో కాకుండా సంపూర్ణమైన హృదయంతో ఉండటం). పాక్షిక హృదయంతో కాకుండా సంపూర్ణమైన హృదయంతో ఉండటం. సరిగ్గా చెప్పావు! మరి మీకు ఈ అవసరాన్ని సాధించే సామర్థ్యం ఉందా? ఇందుకోసం ఎంతో కష్టపడాలి, కదా? ఈ క్షణం, మీరింకా ఆ అవసరాన్ని సాధించాల్సి ఉంది. మరి “సంపూర్ణ సమర్పణ” సంగతి- ఆ విషయాన్ని సాధించారా? (లేదు.) మీరు దాన్ని కూడా సాధించింది లేదు. తరచుగా మీరు అవిధేయతతో, తిరగబడతారు. మీరు తరచుగా వినరు, లోబడటానికి, వినడానికి మీరు ఒప్పుకోరు. మనుషులు జీవితంలోకి ప్రవేశించాకా ఎదురయ్యే సాధించాల్సిన మూడు అత్యంత ప్రాధమిక అవసరాలు ఇవి. కానీ మీరింకా వాటిని సాధించాల్సి ఉంది. కాబట్టి, ఈ క్షణం, మీకు గొప్ప సామర్థ్యం ఉందా? ఈ రోజు, నా మాటలు వింటున్న మీకు, ఆందోళనగా ఉందా? (అవును.) మీరు ఆందోళన చెందడం సరైనదే. ఆందోళన చెందాన్ని తప్పించుకోవద్దు. మీ తరపున నేను ఆందోళన చెందుతాను. ఆ మిగిలిన రెండు అవసరాల గురించి నేను మాట్లాడను, నిస్సందేహంగా, ఇక్కడ ఎవరికీ వాటిని సాధించే సామర్థ్యం లేదు. మీరు ఆందోళనలో ఉన్నారు. మరి మీరు మీ లక్ష్యాలని నిర్దారించుకున్నారా? ఎలాంటి లక్ష్యాలతో, ఏ దిశలో మీరు వెళ్తూ, శ్రమించాల్సి ఉంటుంది? మీకంటూ ఒక లక్ష్యం ఉందా? సూటిగా చెప్తున్నాను: ఒక్కసారి మీరా ఐదు అవసరాలని సాధించినట్లైతే, మీరు దేవుడిని సంతృప్తిపరిచిన వారు అవుతారు. జీవితంలోకి ప్రవేశించే పరిపక్వత పొందడానికి అందులో ప్రతీ ఒక్కటి ఒక దిక్సూచి, అలాగే అంతిమ లక్ష్యం కూడా. వీటిలో ఏ ఒక్కదాన్ని నేను ఎంచి, దాని గురించి వివరించి దాన్ని సాధించమని కోరినా, మీకు దాన్ని సాధించడం అంత సులభం కాదు. తప్పకుండా మీరు కొంత కష్టాన్ని భరించాల్సి ఉంటుంది, కొంత ప్రయత్నం చేయవలసి ఉంటుంది. మీకు ఎలాంటి మనస్తత్వం ఉండాలి? మీ మనస్తత్వం శస్త్రచికిత్సకు సిద్ధమైన ఒక కాన్సర్ రోగిలాగే ఉండాలి. నేను ఇలా ఎందుకు చెప్తున్నాను? నువ్వు దేవుణ్ణి నమ్మాలని కోరుకుంటే, దేవుణ్ణి పొందాలని, ఆయనను సంతృప్తిపరచాలని కోరుకుంటే ఎంతో కొంత బాధ భరించకుండా, శ్రమించకుండా నువ్వు ఈ విషయాలను సాధించలేవు. మీరు ఎంతో భోధను విన్నారు. అది విన్నంత మాత్రాన ఈ బోధన నీ సొంతం అయిపోయినట్టు కాదు. నువ్వు కచ్చితంగా దీనిని సంగ్రహించాలి. నీకు చెందిన దానిగా పరివర్తన చెందించాలి. దాన్ని కచ్చితంగా నీ జీవితంలో భాగం చేసుకోవాలి, మరియు దాన్ని నీ ఉనికి లోనికి తీసుకురావాలి. ఈ మాటలు, బోధన నీ జీవనవిధానాన్ని నడిపించేందుకు అనుమతిచ్చి, నీ జీవితానికి అస్థిత్వ విలువను, అర్థాన్ని ఇవ్వాలి. అది జరిగినప్పుడు, నువ్వు ఈ మాటలు వినడానికి ఒక విలువ ఉంటుంది. ఒకవేళ నేను మాట్లాడే మాటలు నీ జీవితాన్ని పైకి మరల్చి, మీ ఉనికికి ఎలాంటి విలువనూ జత చేయకపోతే, నువ్వు వింటూ ఉండటంలో ఎలాంటి అర్థం లేదు. ఇది మీకు అర్థమౌతుంది కదా? దాన్ని అర్థం చేసుకున్నారు కాబట్టి, తర్వాత ఏం జరుగుతుంది అనేది మీకే వదిలేస్తున్నా. కచ్చితంగా మీరు పని మొదలుపెట్టాలి! వెంటనే చేయటానికి సిద్ధపడి ఉండాలి. ఇంకా గందరగోళంలో ఉండకండి. కాలం వేగంగా వెళ్ళిపోతుంది! మీలో చాలామంది ఒక దశాబ్దం పైనే దేవుడిని నమ్మియున్నారు. ఈ పదేళ్లలో ఏం జరిగిందో చూడండి. మీరు ఎంత సాధించారు? ఈ జీవితంలో జీవించడానికి మీకింకా ఎన్ని దశాబ్దాలు మిగిలున్నాయి? మీకెక్కువ సమయం లేదు. దేవుడి కార్యము మీ కోసం ఎదురుచూస్తుందా? ఆయన మీకోసం ఒక అవకాశాన్ని మిగిల్చాడా? లేదా, ఆయన అదే కార్యము మరోసారి చేస్తాడా వంటి విషయాల గురించి మర్చిపోండి- ఈ విషయాల గురించి మాట్లాడకండి. నువ్వు గడిచిన పదేళ్ల కాలక్రమాన్ని వెనక్కి తీసుకురాగలవా? గడిచే ప్రతీరోజు, వేసే ప్రతీ అడుగులో, నీకు మరో రోజు తక్కువవుతుంది. కాలం ఎవరికోసమూ ఆగదు! నీ జీవితంలో అన్నిటికంటే గొప్ప విషయంగా, తిండి, బట్టలు, మరే ఇతర విషయంకన్నా, గొప్ప విషయంగా భావిస్తే తప్ప దేవుని పట్ల విశ్వాసం నుంచి లాభం పొందలేవు. నీకు సమయం ఉన్నప్పుడే దేవుణ్ణి విశ్వసిస్తే, నీ పూర్తి శ్రద్ధని నీ విశ్వాసం కోసం వెచ్చించకపోతే, ఎల్లప్పుడూ అయోమయంలోనే కొట్టుమిట్టాడితే, నీకు దక్కేది ఏమీ ఉండదు. ఇది మీకు అర్థమౌతుంది కదా? ఈరోజుకి ఇక్కడ ఆపేద్దాం. మళ్ళీ కలుద్దాం!
ఫిబ్రవరి 15, 2014