తన హృదయానుసారులను దేవుడు పరిపూర్ణులుగా చేయును
దేవుడితో సహకరించాలని శ్రమపడే, ఆయన కార్యము పట్ల విధేయత చూపగల, దేవుడు పలికే వాక్కులు సత్యమని విశ్వసించే మరియు దేవుడి అవసరాలను ఆచరణలో పెట్టే వారితో ఉన్న ఒక నిర్ధిష్టమైన వ్యక్తుల సమూహమును పొందుకోవాలని దేవుడు ఇప్పుడు కోరుకుంటున్నాడు; ఆ వ్యక్తులు వారి హృదయముల యందు సత్యపూర్వకమైన జ్ఞానము గలవారై, పరిపూర్ణత కొరకు సిద్దపడినవారై, పరిపూర్తియైన మార్గములో రూఢీగా నడచువారై ఉండవలెను. దైవ కార్యము గూర్చి నిశ్చితమైన జ్ఞానము లేనివారు, దేవుని వాక్కులను భుజించి మరియు పానము చేయనివారు, ఆయన వాక్కుల యందు లక్ష్యముంచనివారు, దేవుని కొరకు హృదయమందు ఏ విధమైన ప్రేమ లేని వారు ఎన్నటికీ పరిపూర్ణపరచబడలేరు. మనుష్య శరీరముతో వచ్చిన దేవుని సందేహించువారెల్లరూ ఎల్లపుడూ ఆయనను గూర్చి అనిశ్చితి గలవారై, ఆయన వాక్కులను ఎప్పుడూ అలక్ష్యము చేస్తూ, ఎల్లప్పుడూ ఆయనను వ్యతిరేకించే వారుగా ఉంటూ, దేవుడిని ప్రతిఘటించి, సాతాను సంబంధులుగా ఉంటారు; ఇలాంటి వ్యక్తులను పరిపూర్ణపరిచే మార్గమే లేదు.
ఒకవేళ నీవు పరిపూర్ణుడైయుండగోరితే, నీవు మొదట దేవుని దయను పొందాలి, ఎందుకనగా తన దయను పొందిన వారిని మరియు తన హృదయానుసారులను ఆయన పరిపూర్ణపరచును. నీవు దేవుని హృదయానుసారునిగా ఉండాలని ఆశిస్తే, ఆయన కార్యమును అనువర్తించు హృదయము కలిగియుండి, సత్యాన్వేషణ కొరకై శ్రమిస్తూ, సమస్త విషయములలో దేవుని పరిశీలనకు అంగీకరించు వానిగా ఉండవలెను. నీవు చేయువన్నీ దేవుని పరిశీలనలో జరుగుచున్నవా? నీ ఉద్దేశ్యము సరియైనదిగా ఉన్నదా? నీ ఉద్దేశ్యము సరైనదైతే దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు. నీ ఉద్దేశ్యము సరైనదిగా లేకపోతే, అది నీ హృదయము దేవుని కాకుండా శరీరమును మరియు సాతానును ప్రేమించుచున్నదని కనుపరుచును. కాబట్టి, సమస్త విషయములలో దేవుని పరిశీలనను అంగీకరించుటకు నీవు ప్రార్థనను ఒక మార్గముగా ఉపయోగించాలి. నీవు ప్రార్ధించునప్పుడు, నీ ఎదుట నేను వ్యక్తిగా నిలువబడనప్పటికీ, పరిశుద్ధాత్మ నీతోనే ఉంటుంది, అలాగే నీవు నాకు మరియు దేవుని ఆత్మకు ప్రార్థించుచున్నావు. నీవు ఈ శరీరమును ఎందుకు నమ్ముచున్నావు? ఈ వ్యక్తి దేవుని ఆత్మను కలిగియున్నందున నీవు నమ్ముచున్నావు. ఒకవేళ ఈ వ్యక్తి దేవుని ఆత్మను కలిగియుండని పక్షమున నీవు ఈ వ్యక్తిని నమ్మగలవా? నీవు ఈ వ్యక్తిని నమ్మినపుడు, నీవు దేవుని ఆత్మను నమ్ముచున్నావు. నీవు ఈ వ్యక్తికి భయపడినప్పుడు, నీవు దేవుని ఆత్మకు భయపడుచున్నావు. దేవుని ఆత్మను విశ్వసించడము అనగా ఈ వ్యక్తిని విశ్వసించడమే, అలాగే ఈ వ్యక్తిని విశ్వసించడము అనగా కుడా దేవుని ఆత్మను విశ్వసించుటయే. నీవు ప్రార్ధించునప్పుడు దేవుని ఆత్మ నీతో ఉన్నదని, దేవుడు నీ ఎదుట ఉన్నాడని భావించుటను బట్టి, నీవు ఆయన ఆత్మను ప్రార్థించుచున్నావు. నేడు, అనేకమంది తమ క్రియలను దేవుని యెదుట ఉంచుటకు బహు భయపడుచున్నారు; నీవు ఆయన దేహమును మోసపుచ్చగలవేమో గానీ ఆయన ఆత్మను మోసపుచ్చలేవు. దేవుని పరిశీలనను భరించలేని ఏ విషయమైనా సత్యవిరుద్ధమైనది, అలాగే దానిని ప్రక్కనబెట్టాలి; ఆలా చేయని పక్షాన అది దేవునికి విరోధముగా పాపము చేయుటయే. కావున, ఎల్లపుడూ నీవు ప్రార్థన చేయునప్పుడు, నీవు మాట్లాడునప్పుడు అలాగే నీ సహోదర సహోదరీలతో నీకున్న సహవాసమందు, నీ భాధ్యతలు నేరవేర్చునపుడు అలాగే నీ వ్యాపారమునకు వెళ్ళు సమయములన్నిటిలో దేవుని యెదుట నీ హృదయమును ఉంచాలి. నీ వృత్తి ధర్మమును నేరవేర్చునప్పుడు, దేవుడు నీతో కుడా ఉంటాడు, నీ ఉద్దేశ్యము సరైనదై అది దేవుని గృహ కార్యము కోరకైనదైతే, నీవు చేయు పనులన్నింటినీ ఆయన సమ్మతిస్తాడు; నీ వృత్తి ధర్మమును నెరవేర్చుట యందు నీవు త్రికరణశుద్ధితో కూడిన శ్రద్ధ వహించాలి. నీవు ప్రార్థించునపుడు, నీ హృదయమందు దేవుని కొరకైన ప్రేమ, దేవుని సంరక్షణ, ఆశ్రయమును మరియు పరిశీలనను కనిపెట్టునటువంటి ఉద్దేశ్యములు కలిగి ఉన్నయెడల, నీ ప్రార్థనలు కార్యసాధకములై యుండును. ఉదాహరణకు, నీవు కూడికలలో ప్రార్ధించునప్పుడు, నీ హృదయమును తెరచి దేవుని ప్రార్థిస్తూ అబద్దములాడకుండా నీ హృదయమందు ఉన్నది ఆయనతో పంచుకొనిన యెడల, నీ ప్రార్ధనలు తప్పక సఫలములగును. నీ హృదయమందు నీవు దేవుని యధార్ధముగా ప్రేమించుచున్న యెడల, దేవునితో ఈ నిభందన చేసుకో; “భూమ్యాకాశములయందు సమస్తములలో ఉన్న దేవా, నేను చేయు పనులన్నిటినీ నీ ఆత్మ పరిశీలించి, ఎల్లప్పుడూ నీ తోడు మరియు కాపుదల నాతో ఉంచి, నేను చేయు పనులన్నీ నీ సన్నిధిలో నిలిచేందుకు సఫలపరుచుము: నీతో ప్రమాణము చేయుచున్నాను. నాహృదయము నిన్ను ప్రేమించక ఎడబాసినపుడు లేక నిన్ను వంచించినప్పుడు, నీ మహోగ్రమైన శిక్ష మరియు శాపము నాకు ప్రాప్తించును గాక. ఈలోకములోనైనను అటుపిమ్మటయైనను నన్ను ఎడబాయవద్దు!” ఇటువంటి తీర్మానము చేసే ధైర్యము నీకున్నదా? అలా కాని యెడల, నీవు పిరికివానివని, ఒక స్వార్ధపరుడవని తేటపరచబడుచున్నది. మీకు ఈ నిశ్చయత ఉన్నదా? నిజముగా ఇది మీ నిశ్చయత అయితే, మీరు ఈ ప్రమాణము తప్పక చేయవలసియున్నది. దేవునితో నిశ్చయముగా ఈ తీర్మానము నీవు కలిగియున్నట్లయితే, దేవుడు నీ సంకల్పమును నేరవేరుస్తాడు. నీకు దేవునితో తీర్మానము చేయునపుడు ఆయన ఆలకిస్తాడు. నీ ప్రార్థన మరియు అనుభవము ప్రమాణమును బట్టి నీవు నీతిమంతుడవా లేక పాపాత్మునివా అని దేవుడు తీర్పు తీర్చును. ఇప్పుడు ఇది మిమ్మును పరిపూర్ణులుగా చేయు విధమై ఉన్నది, పరిపూర్ణత పొందుట యందు నిజమైన విశ్వాసము నీకున్న యెడల, నీవు చేయు పనులన్నీ దేవుని యెదుట ఉంచి ఆయన పరిశీలనకు అంగీకరిస్తావు; నీవు దౌర్జన్యమైన తిరుగుబాటునకు లేక దైవ ద్రోహమునకు పాల్పడితే, అప్పుడాయన నీవు చేసిన ప్రమాణమును నేరవేరుస్తాడు, నీకు ప్రాప్తించే నాశనమైనా లేక శిక్షయైనా, ఏదైనా సరే అది నీ కర్మ ఫలమైయున్నది. నీవు తీర్మానము చేసుకొన్నావు కాబట్టి నీవు దానికి కట్టుబడి ఉండాలి. కాని నీవు తీర్మానము చేసికొని దానికి కట్టుబడియుండని పక్షమున నీవు నాశనమును చవిచూస్తావు. తీర్మానము చేసినది నీవు కనుక దేవుడు నీ తీర్మానమును నెరవేర్పులోనికి తెస్తాడు. కొందరైతే ప్రార్థించిన పిమ్మట భయపడుతూ; “ఇక అంతా అయిపోయింది! నేను శరీర కోర్కెలు తీర్చుకునే యోగము పోగొట్టుకున్నాను; నాకు పాపకార్యములు చేసే అవకాశము తీరిపోయింది; ఇక లోక ఆశలు అనుభవించు ప్రాప్తి నాకు లేదు!” అని ప్రలాపిస్తారు. ఇటువంటి వ్యక్తులు ఇంకా ప్రాపంచిక అంశాలనే ప్రేమించుచున్నారు కనుక వారు నాశనపాత్రులవుతారు.
దేవుని యందు విశ్వాసిగా ఉండుటకు నీవు చేయు పనులన్నీ ఆయన పరిశీలనకు లోబరుచుటకై ఆయన యొద్దకు తోడ్కొనిరావలెను. ఒకవేళ, మీయొక్క పనులు దేవ శరీరము యెదుట కాక దేవుని ఆత్మ యెదుట కనుబరచిన యెడల, అది మీరు దేవుని ఆత్మ ద్వారా పరీక్షింపబడలేదని తేటపరచుచున్నది. దేవుని ఆత్మ అనగా ఎవరు? దేవుడు సాక్ష్యమిచ్చు వ్యక్తి ఎవరు? వారు ఒక్కరు కారా? అనేకమంది వారిని ఇరువురని అనగా, దేవుని ఆత్మను నమ్ముటయే దేవుని ఆత్మ అని, దేవుడు ఎవరిగూర్చి సాక్ష్యమిచ్చునో తను నరుడు అని వర్ణిస్తారు. అయితే నీవు పొరపాటుపడడం లేదా? ఎవరి పక్షమున ఈ వ్యక్తి పనిచేస్తాడు? ఎవరైతే దేవుని మానవ అవతారము గూర్చి ఎరుగరో వారికి ఆత్మ జ్ఞానముండదు. దేవుని ఆత్మ శరీరముగా రుపుదిద్దుకొన్నందున దేవుని ఆత్మ మరియు తన అవతార శరీరము ఏకమైయున్నవి. ఒకవేళ ఈ వ్యక్తి నీపట్ల దయచూపని యెడల దేవుని ఆత్మ దయ చూపునా? నీకు దిగ్ర్భాంతిగా లేదా? నేడు, దేవుని పరిశీలనను స్వీకరించలేని వారెవ్వరూ ఆయన అంగీకారమును పొందలేరు, అలాగే దేవుని శరీరవతారమును ఎరుగానివారు పరిపూర్ణులు కానేరరు. నీవు చేయు పనులన్నీ, దేవుని ఎదుట కనుపరచదగినవో కానివో చూసుకో. ఒకవేళ నీవు చేయు పనులన్నీ దేవుని ఎదుట కనుపరచలేని పక్షాన నీవు ఒక దుష్టునిగా అగుపడుదువు. దుష్టులు పరిపూర్ణపరచబడగలరా? నీవు చేసే ప్రతి పని, ప్రతి క్రియ, ప్రతి ఆలోచన, ప్రతి ప్రతిక్రియను దేవుని ఎదుట ఉంచవలెను. నీ అనుదిన ఆత్మీయ జీవితం అనగా—నీ ప్రార్ధనలు, దేవునితో నీకున్న సాన్నిహిత్యం, దేవుని వాక్కులను నీవు భుజించి పానము చేయు విధానము, నీ సహోదర సహోదరీలతో నీవు కలిగియున్న సహవాసము, నీ సంఘ జీవితము—మరియు సంసార జీవితములో నీ కృషి అన్నింటినీ దేవుని పరిశీలన కొరకు ఆయన ఎదుట ఉంచవలసియున్నది. ఇటువంటి అనుభవము జీవితములో గొప్ప వృద్ధిని సాధించుటకు దోహదపడుతుంది. దేవుని పరిశీలనను అంగీకరించు క్రమము పరిశుద్దతను పొందు విధానమైయున్నది. దైవ పరిశీలనను నీవు ఎంత ఎక్కువగా స్వీకరించగలవో అంత ఎక్కువగా నీవు పరిశుద్దపరచబడతావు. నీవు దేవుని చిత్తమునకు ఎంతగా కట్టుబడియుందువో అంతగా లోక ఆశలకు విముఖుడవై యుందువు, అలాగే నీ హృదయము ఆయన సన్నిధిలో నివసించును. ఆయన పరిశీలనకు నీవు చూపే మక్కువ కొలది సాతానుకు అవమానమును, మరియు నీకు శరీరాశలను జయించు సామర్థ్యమును కలుగును. కావున, దేవుని పరిశీలనకు స్వీకరించడము నరులు వెంబడించవలసిన మార్గమైయున్నది. మీరు ఏమి చేయుచున్నప్పటికీ, నీ సహోదర సహోదరీలతో భుజించునపుడుకుడా నీ క్రియలను దేవుని యెదుట ఉంచి దేవ దేవునికి విధేయత చూపే మనస్సు కలిగి ఆయన పరిశీలన కొరకు కనిపెట్టాలి; ఇది నీ అనుభవమును మరింత ఎక్కువ నిశ్చయపరచును. ఎప్పుడైతే నీవు చేయు పనులన్నీ దేవుని ఎదుట ఉంచి ఆయన పరిశీలనకు అంగీకరిస్తావో అప్పుడు నీవు దేవుని ఉనికి యందు నివసించే వ్యక్తిగా ఉండగలవు.
దేవుని గూర్చి అవగాహన లేని వారు దేవునికి సంపూర్ణంగా విధేయులు కాలేరు. అటువంటి వ్యక్తులు అవిధేయులైన కుమారులు. వారు ఎంతో అత్యాశ కలిగి ఉంటారు, మరియు వారిలో తిరుగుబాటుతనం ఉంటుంది, కాబట్టి వారు తమకు తామే దేవునికి దూరంగా ఉండి మరియు ఆయన పరిశీలనను ఒప్పుకోడానికి అంగీకరించరు. ఇటువంటి ప్రజలు అంత సులభంగా పరిపూర్ణపరచబడరు. కొంతమంది ప్రజలు దేవుని వాక్కులను ఎలా భుజించి త్రాగాలి మరియు వాటిని వారు స్వీకరించే విషయంలో వరణాత్మకంగా ఉంటారు. వారు దేవుని వాక్యాలలో తమ భావనలకు తగినట్టుగా ఉన్న కొన్ని భాగాలనే అంగీకరిస్తారు, అలా లేని వాటిని నిరాకరిస్తారు. ఇది దేవునికి విరోధంగా చేసే మహా ఘోరమైన తిరుగుబాటు మరియు నిరోధము కాదా? ఎవరైనా అనేక సంవత్సరాల పాటు దేవుని పట్ల కాస్తయినా అవగాహన లేకుండా నమ్ముతుంటే, అప్పుడు వారు ఒక అవిశ్వాసి అవుతారు. ఎవరైతే దేవుని పరిశీలనను అంగీకరించాలని అనుకుంటారో వారే ఆయనను అర్ధం చేసుకోడానికి అన్వేషించే వారిగా ఉంటారు, వారే ఆయన వాక్యాలను అంగీకరించడానికి ఇష్టపడతారు. వారే దేవుని వారసత్వాన్ని మరియు దీవెనలను పొందేవారు, మరియు వారు ఎంతో ధన్యులు. తమ హృదయాలలో తనకు స్థానమివ్వని వారిని దేవుడు శపిస్తాడు మరియు అటువంటి ప్రజలను శిక్షించి, ఉపేక్షిస్తాడు. నువ్వు దేవుణ్ణి ప్రేమించలేదంటే, ఆయన నిన్ను విడనాడతాడు, ఒకవేళ నేను చెప్పేది నువ్వు వినలేదంటే, అప్పుడు దేవుని ఆత్మ నిన్ను విడిచి పెడుతుందని నేను ప్రమాణం చేస్తున్నాను. ఒకవేళ దీనిని నువ్వు నమ్మకపోతే దీన్ని ప్రయత్నించి చూడు! నేడు నీ కొరకు నేను ఒక అనుసరణ మార్గాన్ని స్పష్టపరుస్తాను, అయితే నువ్వు దాన్ని అనుసరించాలా, వద్దా అన్నది నీ ఇష్టం. ఒకవేళ దీన్ని నువ్వు నమ్మకుండా, ఆచరణలో పెట్టకుండా ఉన్నట్లయితే, నీలో పరిశుద్ధాత్మ కార్యం చేస్తాడో, లేదో నీకు నువ్వే తెలుసుకుంటావు! నువ్వు దేవుని గూర్చిన జ్ఞానాన్ని అన్వేషించకపోతే, పరిశుద్ధాత్మ నీలో కార్యము చేయడు. తన వాక్కులను నిధిగా ఎంచి అన్వేషించే వారిలో దేవుడు కార్యము చేస్తాడు. దేవుని వాక్యాలకు నీవు ఎంతగా విలువనిస్తావో, ఆయన ఆత్మ నీలో అంత ఎక్కువగా కార్యము చేస్తుంది. ఒక వ్యక్తి దేవుని వాక్యాలను ఎంత విలువైన వాటిగా ఎంచుతాడో, వారికి దేవుని ద్వారా పరిపూర్ణపరచబడే భాగ్యం అంతగా కలుగుతుంది. తనను నిజముగా ప్రేమించు వారిని దేవుడు పరిపూర్ణులుగా చేస్తాడు, మరియు ఎవరి హృదయాలు ఆయన ఎదుట సమాధానంతో ఉంటాయో వారినే పరిపూర్ణ పరుస్తాడు. దేవుని కార్యాలన్నిటినీ సంపదగా ఎంచడం, దేవుని వెలిగింపును విలువైనదిగా భావించడం, దేవుని సముఖమును నిధిగా పరిగణించడం, దేవుని సంరక్షణను మరియు కాపుదలను విలువైనదిగా చూడడం, దేవుని వాక్యాలు నీ వాస్తవికతగా మారి నీ జీవితానికి ఎలా సమకూరుస్తాయన్న దానిని ఐశ్వర్యముగా చూడడం—ఇదంతా దేవుని హృదయానికి తగినవై సరిగ్గా ఉంటాయి. నువ్వు దేవుని కార్యాన్ని నిధిగా ఎంచితే, అంటే, ఆయన నీ కొరకు చేసిన కార్యమంతటినీ నువ్వు నిధిగా భావిస్తే, ఆయన నిన్ను దీవించి, నీకున్న సమస్తాన్ని విస్తరింపజేస్తాడు. ఒకవేళ దేవుని వాక్యాలను నీవు విలువైనవిగా భావించకపోతే, ఆయన నీలో కార్యము చేయడు, అయితే నీకున్న విశ్వాసం కొరకు ఆయన నీకు కృపను కొంతవరకు మాత్రమే అనుగ్రహిస్తాడు, లేదా నిన్ను కొద్దిపాటి ఆస్తితో నీ కుటుంబాన్ని కొద్దిపాటి సంరక్షణతో దీవిస్తాడు. దేవుని వాక్యాలను నీ వాస్తవికతగా కనుపరచడానికి నువ్వు ప్రయాసపడి, ఆయనను తృప్తి పరచగలిగి ఆయన హృదయానుసారునిగా ఉండాలి; నువ్వు ఆయన కృపను మాత్రమే అనుభవించడానికి పోరాడకూడదు. విశ్వాసులు దేవుని కార్యాన్ని స్వీకరించి, పరిపూర్ణతను పొంది మరియు దేవుని చిత్తాన్ని జరిపించేవారిలా మారడం కంటే ప్రాముఖ్యమైనది ఏమీ లేదు. నువ్వు సాధించాల్సిన లక్ష్యము ఇదే.
కృపా యుగములో మానవుడు వెంబడించినవన్నీ ఇప్పుడు పురాతనమయ్యాయి, ఎందుకంటే ప్రస్తుతం ఒక ఉన్నతమైన అన్వేషణ ప్రమాణము ఉన్నది; ఏది వెంబడించబడుతుందో అది గొప్పది మరియు ఎంతో ఆచరణ యోగ్యమైనది, ఏది అన్వేషించబడుతుందో అది మానవునికి అంతరంగములో ఏది అవసరమో దాన్ని చక్కగా తృప్తి పరచగలుగుతుంది. గడచిన యుగాలలో, దేవుడు నేడు జరిగించినట్లుగా ఆయన ప్రజల పట్ల కార్యము చేయలేదు; ఆయన ఈనాడు మాట్లాడినంతగా వారితో మాట్లాడలేదు మరియు వారిని గూర్చిన అవసరాలు నేడు ఆయనకు అవసరమైనంత గొప్పవేమీ కాదు. ఈ సంగతులను గురించి ఇప్పుడు దేవుడు మీతో మాట్లాడటమనేది దేవుని అంతిమ భావన నీ మీద, ఈ వ్యక్తుల సమూహము మీద దృష్టి సారించడాన్ని కనుపరుస్తుంది. ఒకవేళ నీవు నిజముగా దేవునిచేత పరిపూర్ణపరచబడాలని అనుకుంటే, అప్పుడు దీనిని నీ ప్రధాన లక్ష్యముగా చేసుకుని అన్వేషించాలి. మీరు అటు ఇటు పరుగెడుతున్నా, నిన్ను నువ్వు వెచ్చిస్తున్నా, ఒక విధిని నిర్వహిస్తున్నా, లేక నువ్వేమైనా దేవుని ఆజ్ఞను పొందావా అనే దానితో పని లేకుండా, ఈ లక్ష్యాలను నెరవేర్చడమనేది, ఎల్లప్పుడూ పరిపూర్ణపరచబడుతూ దేవుని చిత్తాన్ని సంతృప్తి పరచడమే లక్ష్యమై ఉన్నది. ఒకవేళ ఎవరైనా తాము దేవుని చేత ద్వారా పరిపూర్ణపరచబడటాన్ని లేదా జీవిత ప్రవేశాన్ని అన్వేషించకుండా, కేవలం వారు కేవలం శరీర సంబంధమైన శాంతి సంతోషాలను మాత్రమే వెదకుతున్నామని చెబితే, వారు మనుషులలో కెల్లా అత్యంత అంధులవుతారు. జీవిత వాస్తవికతను అన్వేషించకుండా, రాబోవు లోకంలోని నిత్య జీవితాన్ని మరియు ప్రస్తుత లోకంలో బద్రతను అన్వేషించే వారు, మనుషులలో కెల్లా మిక్కిలి అంధులవుతారు. అందుచేత, మీరు చేసేదంతా దేవుని చేత పరిపూర్ణపరచబడి సంపాదించబడాలనే భావనతో చేయాలి.
ప్రజల మధ్య దేవుడు జరిగించే కార్యమనేది భిన్నమైన వారి అవసరతల ఆధారంగా వారికి సమకూర్చడమై ఉన్నది. ఒక వ్యక్తి జీవితం ఎంత పెద్దదిగా ఉంటే, వారికి అవసరత ఎంత ఎక్కువగా ఉంటుందో అంతగా వారు అన్వేషిస్తారు. ఒకవేళ ఈ దశలో నీకు ఏ ఆశయం లేకపోతే, పరిశుద్దాత్మ నిన్ను ఎడబాశాడని ఇది నిరూపిస్తుంది. జీవితాన్ని అన్వేషించే వారందరినీ పరిశుద్దాత్మ ఎన్నడూ విడిచిపెట్టడు; అటువంటి వ్యక్తులు ఎప్పుడూ అన్వేషిస్తూనే ఉంటూ, తమ హృదయాలలో ఎల్లప్పుడూ ఆతృతను కలిగి ఉంటారు. అలాంటి వ్యక్తులకు ప్రస్తుత విషయాలను బట్టి ఎన్నడూ వారికి తనివి తీరదు. పరిశుద్దాత్మ కార్యపు ప్రతి దశ నీలో ఒక ప్రభావ ఫలితాన్ని సాధించడమే లక్ష్యంగా చేసుకుంటాడు, కానీ ఒకవేళ మీరు సంపూర్ణ సంతోషంతో, ఇక మీదట నీకు అవసరాలు లేకపోతే, ఇక ఎప్పుడు నీవు పరిశుద్దాత్మ కార్యాన్ని స్వీకరించకపోతే, అప్పుడాయన నిన్ను విస్మరిస్తాడు. దేవుని పరిశీలన అనుదినము ప్రజలకు అవసరమైయున్నది; దేవుని నుండి సమృద్దియైన పోషణ అనుదినము వారికి అవసరమై ఉన్నది. అనుదినమూ దేవుని వాక్యాన్ని తిని, త్రాగకుండా ప్రజలు తట్టుకోగలరా? ఒకవేళ ఎవరైనా తాము ఎల్లప్పుడూ దేవుని వాక్యాన్ని కావల్సినంతగా తిని, త్రాగలేమని భావించి, దాని కోసం ఆకలిదప్పులు గలవారై ఎల్లప్పుడూ వారు దానిని వెతుకుతూ ఉన్నట్లయితే, పరిశుద్దాత్మ వారిలో ఎల్లప్పుడూ కార్యము చేస్తాడు. ఒకరు ఎంత ఎక్కువగా అపేక్షిస్తారో, వారి సహవాసం ద్వారా అంత ఎక్కువ ఆచరణీయమైన సంగతులు బయటపడతాయి. ఒకరు సత్యాన్ని ఎంత కఠోరంగా వెదకుతారో, తమ జీవితంలో వారు అంత త్వరితగతిన వృద్దిని సాధించి, తమ అనుభవములో ధనవంతులుగా మరియు దేవుని ఇంటి ఆస్తిపరులుగా అవుతారు.