దేవుడి కార్యము, దేవుడి స్వభావము మరియు స్వయంగా దేవుడు III

మన గత సహవాసాల్లో కొన్ని మీలోని ప్రతిఒక్కరి మీద పెద్ద ప్రభావం చూపాయి. ప్రస్తుతానికైతే, దేవుని నిజమైన ఉనికిని మరియు దేవుడు నిజంగానే మనిషికి చాలా దగ్గరగా ఉన్నాడని ఎట్టకేలకు మనుష్యులు అనుభూతి చెందగలిగారు. మనుష్యులు అనేక ఏళ్లుగా దేవుణ్ణి విశ్వసిస్తూనే ఉన్నప్పటికీ, వారు ఇప్పుడు ఆయన భావనలను మరియు ఆలోచనలను అర్థము చేసుకుంటున్నట్లుగా మునుపు అర్థము చేసుకోలేదు, అలాగే వారు ఇప్పుడు ఆయన ఆచరణాత్మక కార్యాలను నిజంగా అనుభవిస్తున్నట్లుగా వారు నిజంగా అనుభవించలేదు. అది జ్ఞానమైనప్పటికీ లేదా వాస్తవ అభ్యాసమైనప్పటికీ, చాలా మంది ఏదోఒక కొత్త విషయం నేర్చుకోవడంతో పాటు అత్యున్నత అవగాహనను సాధించారు. అలాగే, గతంలో వారి సొంత అన్వేషణల్లోని లోపాన్ని గ్రహించారు. తమ అనుభవంలోని మిడిమిడి జ్ఞానంతోపాటు తమ అనుభవమనేది చాలా వరకు దేవుని చిత్తానికి అనుగుణంగా లేదని గుర్తించారు. అలాగే, దేవుని స్వభావం గురించిన పరిజ్ఞానమనేది మనిషికి బొత్తిగా లోపించదని గ్రహించారు. మనిషిలోని ఈ జ్ఞానమనేది ఒక రకమైన అవగాహన-ఆధారిత జ్ఞానం మాత్రమే; హేతుబద్ధమైన జ్ఞానం స్థాయికి ఎదగాలంటే, ఒక వ్యక్తి తన అనుభవాల ద్వారా కలిగే క్రమేపి లోతైన స్థితిని మరియు బలపరిచే స్థితిని పొందుకోవాలి. దేవుణ్ణి మనిషి నిజంగా అర్థం చేసుకునే ముందు, వ్యక్తిగతంగా వారు తమ హృదయాల్లో దేవుని ఉనికిని విశ్వసిస్తున్నారని చెప్పవచ్చు. అయితే, నిజానికి, ఆయన ఎలాంటి దేవుడు, ఆయన సంకల్పం ఏమిటి, ఆయన స్వభావం ఏమిటి, మనిషిపట్ల ఆయన నిజమైన వైఖరి ఏమిటి అనేటువంటి నిర్దిష్టమైన ప్రశ్నల గురించి వారికి అసలు అవగాహన లేదు. ఈ విధంగా ఉండటమువలన దేవుని మీద మనుష్యులుకున్న విశ్వాసములో బాగా రాజీపడేలా చేయడంతోపాటు పవిత్రతను గానీ, లేదా పరిపూర్ణతను గానీ సాధించకుండా అడ్డుకుంటుంది. దేవుని వాక్కుతో నీవు ముఖాముఖిగా ఉన్నప్పటికీ, లేదా నీ అనుభవాలతో దేవుణ్ణి ఎదుర్కొన్నట్లుగా నీవు భావించినప్పటికీ, నీవు ఆయన్ని పూర్తిగా అర్థం చేసుకున్నావని చెప్పలేము. ఎందుకంటే, దేవుని ఆలోచనలేమిటో నీకు తెలియదు, లేదా ఆయన దేనిని ప్రేమిస్తాడో మరియు దేనిని ద్వేషిస్తాడో, ఆయనకు ఏది కోపం తెప్పిస్తుందో మరియు ఏది సంతోషం కలిగిస్తుందో నీకు తెలియదు. కాబట్టే, ఆయన గురించి నీకు నిజమైన అవగాహన లేదు. నీ విశ్వాసం అనేది నీ వ్యక్తిగత కోరికల ఆధారంగా అస్పష్టత మరియు ఊహలనే పునాది మీద నిర్మించబడింది. అందుకే, ఇది ఇప్పటికీ ఒక ప్రామాణిక విశ్వాసం నుండి దూరంగానే ఉంది. అలాగే, మీరు ఇప్పటికీ ఒక నిజమైన అనుచరుడిగా ఉండలేకపోవుచున్నారు, ఆ స్థితికి దూరంగానే ఉన్నారు. ఈ బైబిలు కథల్లోని ఉదాహరణలకు సంబంధించిన వివరణలనేవి దేవుని హృదయాన్ని తెలుసుకోవడానికి, ఆయన తన కార్యములో అడుగడుగునా ఏమి ఆలోచిస్తున్నాడు మరియు ఆయన ఎందుకు ఈ కార్యాన్ని చేశాడు, ఆయన ఈ కార్యమును జరిగించినప్పుడు ఆయనకున్న నిజమైన ఉద్దేశమేమిటి మరియు ఆయన ప్రణాళిక ఏమిటి, ఆయన తన ఆలోచనలను ఎలా సాధించాడు, ఆయన తన ప్రణాళికను ఎలా సిద్ధం చేశాడు మరియు దానిని ఎలా అభివృద్ధి చేసాడనే విషయాలు తెలుసుకోవడానికి మనుష్యులకు అనుమతిస్తాయి. ఈ కథల ద్వారా దేవుని ఆరువేల సంవత్సరాల నిర్వహణా కార్యములో దేవుని ప్రతి నిర్దిష్ట ఉద్దేశ్యం మరియు ప్రతి నిజమైన ఆలోచనతోపాటు విభిన్న సమయాల్లో మరియు విభిన్న యుగాల్లో మానవులపట్ల ఆయన వైఖరి గురించి సువివరమైన, నిర్దిష్టమైన అవగాహనను మనం పొందుకోవచ్చు. దేవుడు ఏమి ఆలోచించాడో, ఆయన వైఖరి ఏమిటో మరియు ప్రతి పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు ఆయన వెల్లడించిన ఆయన స్వభావం గురించి మనుష్యులు అర్థం చేసుకోగలిగితే, దేవుని నిజమైన ఉనికి గురించి మరింత లోతుగా గ్రహించడంలో మరియు ఆయన ఆచరణాత్మకత మరియు ప్రామాణికత గురించి మరింత లోతుగా అనుభూతి చెందడంలో అది ప్రతి మనిషికి సహాయపడుతుంది. ప్రజలు బైబిలు చరిత్రను అర్థం చేసుకోవాలనే లక్ష్యంతో నేను ఈ కథలు చెప్పడం లేదు. బైబిలులోని వాక్యాలకు లేదా అందులోని వ్యక్తులకు వారు సుపరిచితులయ్యేలా చేయడంలో వారికి సహాయం చేయడం కూడా నా లక్ష్యం కాదు. మరీ ముఖ్యంగా, ధర్మశాస్త్ర యుగంలో దేవుని కార్యపు నేపథ్యాన్ని అర్థం చేసుకోవడంలో ప్రజలకు సహాయం చేయడం కూడా నా లక్ష్యం కాదు. వీటన్నింటికీ బదులుగా, దేవుడి చిత్తం, ఆయన స్వభావం మరియు ఆయనలోని ప్రతి చిన్న భాగాన్ని అర్థం చేసుకోవడంలో మరియు దేవుని గురించి మరింత ప్రామాణికమైన మరియు మరింత ఖచ్చితమైన అవగాహనను మరియు జ్ఞానమును పొందడంలో ప్రజలకు సహాయం చేయడమే నా లక్ష్యం. ఈ క్రమంలో, ప్రజల హృదయాలు కొద్దికొద్దిగా దేవుని వైపు తెరుచుకుంటాయి, దేవునికి మరింత సన్నిహితమవుతాయి మరియు ఆయన్ని, ఆయన స్వభావాన్ని, ఆయన గుణగణాలను వారు బాగా అర్థం చేసుకోగలరు మరియు నిజమైన దేవుణ్ణి మరింత మెరుగ్గా తెలుసుకోగలరు.

దేవుని స్వభావం యొక్క జ్ఞానము మరియు ఆయన ఏమైయున్నాడు మరియు ఆయన ఏమి కలిగియున్నాడు అనే జ్ఞానం ప్రజల మీద సానుకూల ప్రభావం చూపుతుంది. దేవుని మీద మరింత విశ్వాసం కలిగి ఉండటానికి మరియు ఆయనపట్ల వారు నిజమైన విధేయతను మరియు భయమును కలిగియుండటానికి వారికి ఇది సహాయపడుతుంది. ఆ తర్వాత, వారు ఇక మీదట ఆయన్ని గుడ్డిగా అనుసరించరుదేవుని, లేదంటే ఆయనను గుడ్డిగా ఆరాధించరు. మూర్ఖులనో లేదా గుడ్డిగా గుంపును అనుసరించేవారినో దేవుడు కోరుకోడు. బదులుగా, దేవుని స్వభావం గురించి తమ హృదయాల్లో స్పష్టమైన అవగాహనను మరియు జ్ఞానమును కలిగిన వారిని మరియు దేవునికి సాక్షులుగా ఉండగలిగే వ్యక్తుల సమూహాన్ని, దేవుడి ప్రేమను బట్టి, ఆయన కలిగియున్న సభావమునుబట్టి మరియు ఆయన నీతి స్వభామునుబట్టి, దేవుణ్ణి ఎప్పుడూ విడిచిపెట్టని వ్యక్తులను దేవుడు కోరుకుంటాడు. దేవుడి అనుచరుడిగా, నీ హృదయంలో ఇప్పటికీ స్పష్టత లేకుంటే, లేదా దేవుని నిజమైన ఉనికిని, ఆయన స్వభావమును, ఆయన గుణగణాలను మరియు మానవాళిని రక్షించే ఆయన ప్రణాళికను గురించి మీలో అస్పష్టత లేదా గందరగోళం నెలకొని ఉన్నట్లయితే, అలాంటప్పుడు నీ విశ్వాసానికి దేవుని మెప్పు లభించదు. ఈ రకమైన వ్యక్తి దేవుణ్ణి వెంబడించడానికి దేవునికి ఇష్టము లేదు మరియు ఈ రకమైన వ్యక్తి ఆయన ముందుకు రావడం ఆయనకు ఇష్టం ఉండదు. ఎందుకంటే, ఈ రకమైన వ్యక్తి దేవుణ్ణి అర్థం చేసుకోడు కాబట్టి, అలాంటివాళ్లు వారి హృదయాన్ని దేవునికి ఇవ్వలేరు, వారి హృదయం దేవుని కోసం మూసివేయబడి ఉంటుంది. కాబట్టి, వారి విశ్వాసం పూర్తిగా మలినాలతో నిండినదై ఉంటుంది. వారు దేవుణ్ణి గుడ్డిగా అనుసరిస్తున్నారని మాత్రమే చెప్పవచ్చు. దేవుని గురించిన నిజమైన అవగాహన మరియు నిజమైన జ్ఞానం ఉన్నప్పుడే ప్రజలు నిజమైన విశ్వాసమును కలిగియుండగలరు మరియు నిజమైన అనుచరులుగా ఉండగలరు, ఇది మాత్రమే వారిలో దేవుని కొరకైన నిజమైన విధేయతను మరియు దేవునియుందు నిజమైన భయాన్ని పుట్టిస్తుంది. ఈ విధంగా మాత్రమే వారు తమ హృదయాన్ని దేవునికి ఇవ్వగలరు మరియు ఆయన కోసం దానిని తెరవగలరు. దేవుడు కోరుకునేది కూడా ఇదే. ఎందుకంటే, అలాంటి వ్యక్తులు చేసే మరియు ఆలోచించే ప్రతీది దేవుని పరీక్షను తట్టుకోగలదు మరియు దేవునికి సాక్ష్యమివ్వగలదు. దేవుని స్వభావానికి సంబంధించి, లేదా ఆయన ఏమైయున్నాడో మరియు ఆయన ఏమి కలిగియున్నాడో అనేదానికి సంబంధించి, లేదా ఆయన చేసే ప్రతిదానిలో ఆయన చిత్తము మరియు ఆయన ఆలోచనలకు సంబంధించి మరియు వాటి గురించి నేను మీతో ఏ దృష్టికోణం నుండి మాట్లాడినప్పటికీ, దాని గురించి ఏ కోణంలో చెప్పినప్పటికీ, అదంతా దేవుని నిజమైన ఉనికి గురించి మీకు మరింత స్పష్టంగా చెప్పడమేనని గుర్తుంచుకోండి. మానవజాతి పట్ల ఆయన ప్రేమను మీరు మరింత నిజంగా అర్థం చేసుకోండి మరియు ప్రశంసించండి. అలాగే, ప్రజల పట్ల దేవుడి శ్రద్ధను మరియు మానవజాతిని కొనసాగించాలనే మరియు రక్షించాలనే ఆయన హృదయపూర్వక కోరికను మీరు మరింత నిజంగా అర్థం చేసుకోండి మరియు అభినందించండి.

లోకాన్ని సృష్టించినప్పటి నుండి దేవుని ఆలోచనలు, ప్రణాళికలు మరియు చర్యల యొక్క సమీక్ష

ఈ రోజు మనం ముందుగా దేవుని భావనలను, ఆలోచనలను మరియు మానవజాతిని సృష్టించినప్పటి నుండి ఆయన ప్రతి కదలికను సంగ్రహించనున్నాము. ఈ ప్రపంచాన్ని సృష్టించడం మొదలుకొని కృపా యుగాన్ని అధికారికంగా ప్రారంభించే వరకు ఆయన ఏ కార్యము చేసాడో మనం పరిశీలిద్దాము. అప్పుడే, మనిషి ఎరుగని దేవుని భావనలు మరియు ఆలోచనలు ఏమిటో మనం కనుగొనవచ్చు మరియు అక్కడ నుండి దేవుడి నిర్వహణా ప్రణాళిక క్రమాన్ని మనం వివరించవచ్చు మరియు దేవుడి నిర్వహణ కార్యం, అభివృద్ధి ప్రక్రియ మూలం మరియు దానిని సృష్టించిన సందర్భం గురించి క్షుణ్ణంగా అర్థం చేసుకోవచ్చు. ఆయన నిర్వహణ కార్యము నుండి ఆయన ఎలాంటి ఫలితాలు కోరుకుంటున్నాడంటే ఆయన నిర్వహణ కార్యపు మూలం మరియు ఉద్దేశ్యం గురించి అర్థం చేసుకోవచ్చు. ఈ విషయాలు అర్థం చేసుకోవాలంటే, అప్పటికింకా మనుష్యులులేని సుదూరమైన, నిశ్చలమైన మరియు నిశ్శబ్ధమైన కాలానికి మనం చేరుకోవాలి …

దేవుడు స్వయంగా మొట్టమొదటి జీవముగల వ్యక్తిని సృష్టించాడు

దేవుడు తన మంచము నుండి లేచినప్పుడు, ఆయనలో మెదిలిన మొదటి ఆలోచన: జీవము కలిగిన ఒక నిజమైన మనిషిని, అంటే జీవించే వ్యక్తిని సృష్టించి, అతనితోపాటు జీవించే మరియు అతనికి నిరంతర సహచరిగా ఉండే ఇంకొకరిని సృష్టించాలి అని ఆలోచించాడు; అలా సృష్టించబడిన వ్యక్తి ఆయన మాట వినేలా ఉండాలి మరియు ఆయన అతనిపట్ల విశ్వాసం కలిగి ఉండడంతోపాటు అతనితో మాట్లాడేలా ఉండాలి అని తలంచాడు. ఆ ఆలోచన తర్వాత, మొదటిసారిగా, దేవుడు ఒక పిడికెడు ధూళిని పట్టుకుని, దానితో తన మనస్సులో ఊహించుకున్న ప్రతిరూపానికి అనుగుణంగా మొట్టమొదటి జీవముగల వ్యక్తిని సృష్టించాడు. ఆ తర్వాత, ఈ జీవముగల వ్యక్తికి ఆదాము అని పేరు పెట్టాడు. ఇలా జీవము కలిగిన మరియు శ్వాసను కలిగియున్న మనిషిని సృష్టించిన సమయంలో ఆయన ఎలాంటి అనుభూతిని కలిగి ఉంటాడు? మొదటిసారిగా, తనకంటూ ఒక ప్రియమైన వ్యక్తి, ఒక సహచరుడు ఉండడంలోని ఆనందాన్ని ఆయన అనుభూతి చెందాడు. అలాగే, ఒక తండ్రిగా మరియు దానితోపాటుగా వచ్చే బాధ్యతను కూడా ఆయన మొదటిసారిగా అనుభూతి చెందాడు. జీవము కలిగిన మరియు శ్వాసను కలిగిన ఈ వ్యక్తి దేవునికి ఆనందాన్ని మరియు సంతోషాన్ని తీసుకువచ్చాడు; ఆయన మొట్టమొదటిసారిగా ఆదరణ పొందాడు. దేవుని ఆలోచనలతో, లేదా మాటలతో కాకుండా, ఆయన స్వంత చేతులతో పూర్తి చేయబడిన మొట్టమొదటి విషయమిది. ఈ విధమైన ఒక జీవి, అనగా జీవము కలిగిన, శ్వాస కలిగిన మనిషి, అంటే రక్తమాంసాలతో, దేహము కలిగి, తనదైన రూపంతో మరియు దేవునితో మాట్లాడగలిగే మనిషి దేవుని ముందు నిలబడినప్పుడు, అదివరకు ఎప్పుడూ అనుభవించని ఆనందాన్ని దేవుడు అనుభవించాడు. దేవుడు నిజంగానే ఆ వ్యక్తిని తన బాధ్యతగా భావించాడు మరియు ఈ జీవుడు ఆయన మనస్సును ఆకట్టుకోవడమే కాకుండా అతడి ప్రతి చిన్న కదలిక సైతం ఆయన మనస్సుకి సంతోషం అందించింది మరియు ఆయన మనస్సును కదిలించింది. ఈ మనిషి దేవుని ముందు నిలబడ్డప్పుడు, అలాంటి మనుష్యులను మరింత మందిని పొందాలనే ఆలోచన ఆయనలో మొదటిసారిగా రేకెత్తింది. దేవునికి మొదటిసారిగా వచ్చిన ఆలోచన తర్వాత జరిగిన సంఘటనల క్రమం ఇది. దేవునికి సంబంధించినంతవరకు, ఈ సంఘటనలన్నీ మొట్టమొదటిసారిగా జరుగుతున్నాయి. అయితే, ఈ మొట్టమొదటిసారిగా జరుగుతున్న ఈ సంఘటనల సమయంలో ఆయన అనుభవించిన ఆనందం, బాధ్యత, ఆందోళనలాంటి అనుభూతులను పంచుకోవడానికి ఆయనతో ఎవరూ లేరు. సరిగ్గా ఆ క్షణం నుండి, నిజంగా మునుపెన్నడూ అనుభవించని ఒంటరితనాన్ని మరియు విచారాన్ని దేవుడు అనుభవించాడు. ఆయన ప్రేమను మరియు ఆయన శ్రద్ధను, లేదా మనిషిపట్ల ఆయనకున్న ఉద్దేశాలను మనిషి అంగీకరించలేడని లేదా అర్థం చేసుకోలేడని ఆయన భావించాడు. అందుచేత, ఆయన తన హృదయంలో దుఃఖాన్ని మరియు బాధను అనుభవించాడు. మనిషి కోసమే ఆయన ఇదంతా చేసినప్పటికీ, దాని గురించి మనిషికి తెలియదు మరియు మనిషికి అర్థం కాలేదు. సంతోషం సంగతి పక్కన పెడితే, మనిషివల్ల కలిగిన ఆనందం మరియు ఆదరణతోపాటే, మొదటిసారిగా దుఃఖం మరియు ఒంటరితనం కూడా ఆ వెంటనే ఆయన అనుభవంలోకి వచ్చేశాయి. ఆ సమయంలో దేవునిలో చోటుచేసుకున్న ఆలోచనలు మరియు భావాలు ఇవే. దేవుడు ఇవన్నీ చేస్తున్నప్పుడే, ఆయన తన హృదయములో ఆనందం నుండి దుఃఖానికి మరియు దుఃఖం నుండి బాధకు వెళ్ళాడు. ఈ భావాలన్నీ ఆందోళనతో మిళితమై ఉన్నాయి. ఆయన మనసులో ఏముందో ఆ వ్యక్తి, ఆ మనిషి త్వరగా తెలుసుకోవాలి మరియు తన ఉద్దేశాలను అతను త్వరగా అర్థం చేసుకోవాలని మాత్రమే దేవుడు కోరుకున్నాడు. అలా జరిగినప్పుడే, వాళ్లు ఆయన అనుచరులుగా మారగలరు మరియు ఆయన ఆలోచనలను పంచుకోవడంతోపాటు ఆయన చిత్తానికి అనుగుణంగా ఉండగలరు. వారు అటుపై దేవుడు చెప్పేది మాత్రమే వింటు, మాటలు లేకుండా ఉండిపోరు; దేవుని పనిలో ఎలా భాగం కావాలో తెలియనివారుగా ఉండిపోరు; అన్నింటినీ మించి, దేవుని అవసరాలపట్ల ఉదాసీనంగా ఉండిపోరు. దేవుడు చేసిన ఈ మొదటి పనులన్నీ అత్యంత అర్థవంతమైనవి మరియు ఆయన నిర్వహణ ప్రణాళికకు మరియు నేటి మానవులకు సంబంధించి గొప్ప విలువ కలిగినవి.

సమస్తమును మరియు మానవజాతిని సృష్టించిన తర్వాత, దేవుడు విశ్రాంతి తీసుకోలేదు. ఆయన విశ్రాంతి రహితంగా మరియు తన నిర్వహణ కార్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మరియు మానవజాతిలో తాను ఎంతగానో ఇష్టపడే వారిని పొందుకోవడానికి ఆయన ఉత్సాహంగా ఉన్నాడు.

ధర్మశాస్త్ర యుగంలో దేవుడు ఎన్నో అపూర్వమైన క్రియలు చేసాడు

ఆ తర్వాత, దేవుడు మనుష్యులను సృష్టించిన కొద్ది కాలానికే, ప్రపంచమంతటా ఒక గొప్ప జలప్రళయం సంభవించినట్లు మనం బైబిలులో చూస్తున్నాం. ఈ జలప్రళయం జరిగినప్పుడు నోవహు ప్రస్తావన కనిపిస్తుంది మరియు దేవునికి సంబంధించిన ఒక కార్యమును పూర్తి చేయడం కోసం ఆయనతో కలిసి పనిచేయడానికి దేవుని పిలుపు పొందుకున్న తొలి వ్యక్తి నోవహు అని ఇక్కడ చెప్పవచ్చు. సరిగ్గా చెప్పాలంటే, దేవుడు తన ఆజ్ఞ మేరకు పని చేయాల్సిందిగా భూమి మీది ఒక మనిషిని పిలవడం కూడా ఇదే మొదటిసారి. నోవహు ఓడను తయారు చేయడం పూర్తిచేసిన తర్వాత, దేవుడు మొట్టమొదటిసారిగా భూమిని జలప్రళయానికి గురిచేశాడు. జలప్రళయంతో దేవుడు ఈ భూమిని ధ్వంసం చేయడం ద్వారా, మనుష్యులను సృష్టించిన తర్వాత, వారిపట్ల అసహ్యంతో ఆయన వారిని శిక్షించాలనుకోవడం అదే మొదటిసారి; ఆ కారణంగానే, జలప్రళయంతో ఈ మానవజాతిని సమూలంగా నాశనం చేయాలనే బాధాకర నిర్ణయం దేవుడు తీసుకోవాల్సి వచ్చింది. జలప్రళయంతో ఈ భూమి నాశనమైన తర్వాత, దేవుడు మొట్టమొదటిసారిగా మనుష్యులతో నిబంధన చేసుకున్నాడు. ఇకపై, ఎప్పుడూ ఇలా జలప్రళయంతో ప్రపంచాన్ని నాశనం చేయనని చూపించే నిబంధన అది. ఈ నిబంధనకు సంకేతంగా ఇంద్రధనస్సు ఏర్పడింది. మానవజాతితో దేవుడు చేసుకున్న మొట్టమొదటి నిబంధన ఇదే కాబట్టి, ఈ నిబంధనకు మొదటి సంకేతంగా దేవుడు మేఘములో ధనస్సును ఇచ్చాడు; ధనస్సు అనేది ఉనికిలో ఉన్న ఒక నిజమైన, భౌతిక అంశం. ఈ ధనస్సు ఉనికి అనేది తాను కోల్పోయిన మునుపటి మానవ జాతి గురించి దేవుడు తరచూ బాధపడేలా చేస్తుంది మరియు ఆ మానవజాతికి జరిగిన దాని గురించి అది ఆయనకు నిరంతరం గుర్తు చేస్తుంది…. దేవుడు తన వేగాన్ని తగ్గించడు—ఆయన అవిశ్రాంతంగా ఉన్నాడు మరియు తన నిర్వహణలోని తదుపరి అడుగు వేయడానికి ఆయన ఆసక్తిగా ఉన్నాడు. ఆ తర్వాత, ఇశ్రాయేలు వ్యాప్తంగా తన కార్యము కోసం అబ్రాహామును దేవుడు తన మొదటి ఎంపికగా ఎంచుకున్నాడు. దేవుడు అలాంటి వ్యక్తిని ఎంపిక చేయడం కూడా అదే తొలిసారి. ఈ వ్యక్తి ద్వారా మానవాళిని రక్షించే తన కార్యమును ప్రారంభించాలని మరియు ఈ వ్యక్తి యొక్క వారసులతో తన కార్యమును కొనసాగించాలని దేవుడు నిర్ణయించుకున్నాడు. అబ్రాహాము విషయంలో దేవుడు ఇలా చేయడాన్ని మనం బైబిలులో చూడవచ్చు. ఆ తర్వాత, దేవుడు ఇశ్రాయేలును మొట్టమొదటగా ఎంచుకున్న దేశంగా చేసాడు మరియు తాను ఎంచుకున్న ఇశ్రాయేలీయుల ద్వారా ధర్మశాస్త్ర యుగపు కార్యము ప్రారంభించాడు. మొట్టమొదటిసారిగా మరోసారి, మానవజాతి తప్పక అనుసరించాల్సిన స్పష్టమైన నియమాలు మరియు చట్టాలను ఇశ్రాయేలీయులకు దేవుడు అందించాడు మరియు వాటి గురించి ఆయన సవివరంగా వివరించాడు. మనుష్యులు ఏవిధంగా బలులు అర్పించాలి, వాళ్లు ఏవిధంగా జీవించాలి, వాళ్లు వేటిని తప్పక చేయాలి, వేటిని చేయకూడదు, వాళ్లు ఏ పండుగలను ఆచరించాలి, ఎలాంటి ప్రత్యేక రోజులును జరుపుకోవాలి, వాళ్లు చేసే ప్రతి పనిలోనూ పాటించాల్సిన సూత్రాలులాంటి నిర్దిష్టమైన, ప్రామాణికమైన నియమాలను మనుష్యులకు దేవుడు మొట్టమొదటిసారిగా అందించాడు. మానవాళి వారి జీవితాలను ఎలా జీవించాలనే దానికి సంబంధించి ఇంత వివరణాత్మకమైన, ప్రామాణికమైన నిబంధనలు మరియు సూత్రాలను దేవుడు అందించడం ఇదే మొదటిసారి.

“మొదటిసారిగా” అని నేను చెప్పే ప్రతిసారీ అది దేవుడు అంతకు ముందెన్నడూ చేపట్టని కార్యమును సూచిస్తుంది. అంటే, అంతకుముందు ఎప్పుడూ జరగని కార్యాన్ని అది సూచిస్తుంది. అలాగే, దేవుడు మానవజాతిని మరియు అన్ని రకాల జీవజాతులను మరియు జీవులను దేవుడు సృష్టించినప్పటికీ, ఆయన అంతకు ముందెన్నడూ చేయని పనిని అది సూచిస్తుంది. ఈ కార్యము మొత్తం మానవజాతికి సంబంధించి దేవుని నిర్వహణలో భాగమై ఉంటుంది; మనుష్యులతోను మరియు ఆయన అందించే రక్షణతోను మరియు వారి కార్య నిర్వహణతోను ఇదంతా ముడిపడి ఉంటుంది. అబ్రహాము తర్వాత, దేవుడు మరోసారి మొట్టమొదటి కార్యమును చేశాడు, ధర్మశాస్త్రానికి లోబడి జీవించేవాడు మరియు దేవునికి భయపడుతూ, చెడును విస్మరిస్తూ మరియు దేవునికి సాక్ష్యమివ్వడం కొనసాగించే క్రమంలో సాతాను ప్రలోభాలను తట్టుకునే వ్యక్తిగా యోబును ఎంచుకున్నాడు. ఒక వ్యక్తిని ప్రలోభపెట్టడానికి సాతానుని దేవుడు అనుమతించడం కూడా ఇదే మొదటిసారి. అలాగే, సాతానుతో ఆయన పందెం కాయడం కూడా అదే మొదటిసారి. చివర్లో, సాతానుని ఎదుర్కొనే క్రమంలో తనకు సాక్ష్యమివ్వగల మరియు ఆ సామర్థ్యం కలిగిన వ్యక్తిని మరియు సాతానుని పూర్తిగా అవమానపరచగల వ్యక్తిని ఆయన మొట్టమొదటిసారిగా పొందుకున్నాడు. మానవజాతిని దేవుడు సృష్టించిన తర్వాత, ఆయన కోసం సాక్ష్యమివ్వగలిగిన మొట్టమొదటి వ్యక్తిని ఆయన పొందుకోవడం ఇదే మొట్టమొదటిసారి. ఈ వ్యక్తిని పొందుకున్న తర్వాత, తన నిర్వహణను కొనసాగించడానికి మరియు తన కార్యములో తదుపరి దశను నిర్వహించడానికి దేవుడు మరింత ఆసక్తి పొందాడు మరియు తన కార్యపు తదుపరి దశ కోసం స్థలాన్ని మరియు వ్యక్తులను సిద్ధం చేశాడు.

వీటన్నింటి గురించి సహవాసం చేసిన తర్వాత, దేవుని చిత్తం గురించి మీలో నిజమైన అవగాహన వచ్చిందా? మానవజాతి కార్య నిర్వహణకు, మానవాళి రక్షణకు సంబంధించిన ఈ అంశాన్ని అన్నిటికంటే ముఖ్యమైనదిగా దేవుడు భావిస్తాడు. ఈ పనులన్నింటినీ ఆయన తన మనస్సుతోనే కాకుండా, తన మాటలతోనే కాకుండా, ఖచ్చితంగా ఒక సాధారణ వైఖరితోనే కాకుండా, ఈ కార్యములన్నిటిని ఆయన ఒక ప్రణాళికతో, ఒక లక్ష్యంతో, విలువలతో మరియు తన చిత్తంతో జరిగిస్తాడు. తద్వారా, మానవాళిని రక్షించే ఈ కార్యమనేది దేవునికి మరియు మనిషికి గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉన్నట్లుగా స్పష్టమవుతోంది. ఈ కార్యము ఎంత కష్టమైనదైనప్పటికీ, ఈ క్రమంలో ఎంత పెద్ద అడ్డంకులు వచ్చినప్పటికీ, మనుష్యులు ఎంత బలహీనంగా ఉన్నప్పటికీ, లేదా మానవజాతి తిరుగుబాటు ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ, అవేవీ దేవునికి కష్టమైనవి కావు. దేవుడు ఎల్లప్పుడూ స్వయంగా తీరికలేకుండా ఉంటాడు, ఆయన ఎంతో ప్రయాసతో కూడిన తన ప్రయత్నాన్ని విస్తరింపజేస్తుంటాడు మరియు తాను పూర్తి చేయాలనుకుంటున్న కార్యమును నిర్వహిస్తాడు. అలాగే, ఆయన ప్రతి ఒక్కటీ ఏర్పాటు చేస్తాడు మరియు తాను ఎవరి మీద కార్యము చేయాలనుకుంటున్నాడో మరియు తాను పూర్తి చేయాలనుకుంటున్న కార్యముల మీద తన సార్వభౌమాధికారమును అమలు చేస్తాడు. అంటే, గతంలో ఎప్పుడూ జరగని వాటన్నింటి మీద ఆయన తన సార్వభౌమాధికారం అమలు చేస్తాడు. మానవజాతిని నిర్వహించడం మరియు మానవజాతిని రక్షించడమనే ఈ ప్రధాన కార్యము కోసం దేవుడు ఈ పద్ధతులు ఉపయోగించడం మరియు ఇంత గొప్ప మూల్యం చెల్లించడం ఇదే మొట్టమొదటిసారిగా ఉంటుంది. దేవుడు ఈ కార్యము కొనసాగిస్తున్నప్పుడు, ఆయన మానవాళికి నిరభ్యంతరంగా, తన శ్రమతో కూడిన ప్రయత్నాన్ని, తాను కలిగి ఉన్న వాటి గురించి, ఆయన వివేకం మరియు పరాక్రమం గురించి మరియు ఆయన స్వభావంలోని ప్రతి అంశం గురించి వ్యక్తీకరిస్తున్నాడు మరియు బట్టబయలు చేస్తున్నాడు. ఆయన ఇదివరకెప్పుడూ చేయని విధంగా ఈ విషయాలను బహిరంగపరుస్తాడు మరియు వ్యక్తీకరిస్తాడు. కాబట్టే, ఈ పూర్తి విశ్వంలో, దేవుడు నిర్వహించాలనుకునే మరియు రక్షించాలని లక్ష్యంగా పెట్టుకున్న మనుష్యులను పక్కన పెడితే, దేవునికి అత్యంత సాన్నిహిత్యం కలిగిన, ఆయనతో సన్నిహిత బంధం కలిగిన జీవులనేవి ఎన్నడూ లేవు. ఆయన హృదయంలో, ఆయన నిర్వహించాలనుకునే మరియు రక్షించాలనుకునే మానవజాతి మాత్రమే అత్యంత ముఖ్యమైనది; ఈ మానవజాతినే ఆయన అన్నిటికంటే విలువైనదిగా భావిస్తాడు; వారి కోసం ఆయన గొప్ప మూల్యం చెల్లించినప్పటికీ, అలాగే, వారి ద్వారా ఆయన నిరంతరం బాధించబడినప్పటికీ మరియు వారి అవిధేయతకు గురైనప్పటికీ, ఆయన మాత్రం వారిని ఎప్పుడూ వదులుకోడు మరియు ఎలాంటి ఫిర్యాదులు చేయకుండా, లేదా పశ్చాత్తాపం లేకుండా ఆయన తన పనిలో అవిశ్రాంతంగా కొనసాగుతున్నాడు. ఎందుకంటే, త్వరగానో లేదా ఆలస్యంగానో, మనుష్యులు ఆయన పిలుపునకు మేల్కొంటారనీ మరియు ఆయన మాటలతో కదిలించబడుతారని, ఆయనే ఈ సృష్టికి ప్రభువు అని గుర్తించి, ఆయన వైపునకు తిరిగి వస్తారని ఆయనకు తెలుసు …

ఈ రోజున ఇవన్నీ విన్న తర్వాత, దేవుడు చేసే ప్రతి ఒక్కటీ సర్వసాధారణమే అని మీకు అనిపించవచ్చు. మనుష్యుల మీద దేవుని ఉద్దేశ్యాలను ఆయన వాక్కుల నుండి మనుష్యులు కొంతమేర గ్రహించినప్పటికీ, వారి భావాలు లేదా వారి జ్ఞానం మరియు దేవుడు ఆలోచనలకు మధ్య ఎల్లప్పుడూ కొంత దూరం ఉంటుందని అనిపిస్తుంది. ఆ కారణంగానే, మానవాళిని దేవుడు ఎందుకు సృష్టించాడు మరియు ఆయన ఆశించిన మానవాళిని పొందాలనే ఆయన కోరిక వెనుకున్న నేపథ్యం గురించి ప్రజలందరికీ తెలియజేయడం అవసరమని నేను భావిస్తున్నాను. ప్రతి ఒక్కరూ వారి హృదయంలో స్పష్టంగా ఉండాలంటే, దీన్ని అందరితో పంచుకోవడం చాలా అవసరం. ఎందుకంటే, దేవుని ప్రతి భావన మరియు ఆలోచనతో పాటు ఆయన కార్యములోని ప్రతి దశ మరియు ప్రతి కాల వ్యవధి అనేది ఆయన మొత్తం నిర్వహణా కార్యంతో ముడిపడి ఉంటాయి మరియు సన్నిహిత బంధం కలిగి ఉంటాయి కాబట్టి, దేవుని భావనలు, ఆలోచనలు మరియు ఆయన సంకల్పం గురించి ఆయన ప్రతి అడుగులోనూ మీరు అర్థం చేసుకుంటే, ఆయన నిర్వహణా ప్రణాళిక కార్యము ఎలా జరిగిందో కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ పునాది మీదనే దేవుని గురించిన మీ అవగాహన మరింతగా పెరుగుతుంది. నేను ఇదివరకు చెప్పినట్లు, మొట్టమొదటిసారిగా ఈ ప్రపంచాన్ని సృష్టించిన సమయంలో దేవుడు చేసినదంతా “సమాచారం” మాత్రమే అని ఇప్పుడు మీకు అనిపించినప్పటికీ, సత్యాన్వేషణతో సంబంధం లేకుండానే, మీరు అనుభవం గడించే కొద్దీ, ఇదంతా కొన్ని సమాచార భాగాల కలయిక మాత్రమే అని గానీ, ఒక విధమైన రహస్యం అని గానీ మీరు భావించలేని ఒకరోజు వస్తుంది. మీ జీవితం ముందుకు సాగేకొద్దీ, మీ హృదయంలో దేవుడికి కొంత స్థానం లభించినప్పుడు, లేదా ఆయన చిత్తం గురించి మీరు మరింత క్షుణ్ణంగా మరియు లోతుగా అర్థం చేసుకున్నప్పుడు, ఈ రోజున నేను మాట్లాడుతున్న దాని గురించిన ప్రాముఖ్యతను మరియు ఆవశ్యకతను మీరు అర్థం చేసుకుంటారు. మీరు ఎంతకాలం తర్వాత దీన్ని అంగీకరిస్తారనే దానితో సంబంధం లేకుండా, ఈ విషయాల గురించి మీరు అర్థం చేసుకోవడం మరియు తెలుసుకోవడం అనేది ఎప్పటికీ అవసరమే. దేవుడు ఏదైనా చేసినప్పుడు, ఆయన తన కార్యము నిర్వర్తిస్తున్నప్పుడు, అది ఆయన ఆలోచనలతో చేస్తున్నదా లేదంటే ఆయన స్వయంగా చేస్తున్నదా అనే దానితో సంబంధం లేకుండా, అది ఆయన మొట్ట మొదటిసారిగా చేస్తున్నదా లేదంటే, చివరిసారిగా చేస్తున్నదా అనే దానితో సంబంధం లేకుండా, అంతిమంగా, దేవునికంటూ ఒక ప్రణాళిక ఉంటుంది మరియు ఆయన చేసే ప్రతి కార్యములోనూ ఆయన ప్రయోజనాలు మరియు ఆలోచనలు ఉంటాయి. ఈ ప్రయోజనాలు మరియు ఆలోచనలనేవి దేవుని స్వభావాన్ని సూచిస్తాయి మరియు ఆయనంటే ఏమిటో అవి వ్యక్తీకరిస్తాయి. దేవుని స్వభావం మరియు ఆయన ఏమి కలిగియున్నాడో, ఆయన ఏమైయున్నాడో అనే ఈ రెండు విధయాల గురించి ప్రతి ఒక్క వ్యక్తి అర్థం చేసుకోవాలి. ఆయన స్వభావమును గూర్చి మరియు ఆయన ఏమి కలిగియున్నాడో మరియు ఆయన ఏమైయున్నాడో అనే విషయాలను ఒక వ్యక్తి అర్థం చేసుకుంటే, దేవుడు తాను చేయాలనుకున్నది ఎందుకు చేస్తాడు మరియు తాను చెప్పేది ఎందుకు చెప్పాడో ఆ వ్యక్తి క్రమంగా అర్థం చేసుకోగలడు. అక్కడి నుండి, దేవుణ్ణి అనుసరించడంలోను, సత్యాన్ని వెంబడించడంలోను, అలాగే, వారి స్వభావములో మార్పును కలిగియుండడంలోను మరింత విశ్వాసంతో ఉంటారు. దీన్నిబట్టి, మనిషిలో దేవుని గురించిన అవగాహన మరియు దేవునిపట్ల తను కలిగియుండె విశ్వాసం అనేవి విడదీయలేనివని అర్థమవుతుంది.

దేవుని స్వభావమును గురించిన జ్ఞానాన్ని మనుష్యులు సముపార్జన చేయడముతోపాటు అవగాహన కూడా పొంది, దేవుడంటే ఎవరో, ఆయన ఏమి కలిగియున్నాడనే విషయాలను తెలుసుకోగలిగితే, అప్పుడు వారు దేవుని నుండి వచ్చేటువంటి జీవితాన్ని వారు పొందుకుంటారు. ఒకసారి ఇటువంటి జీవితం నీలోపల రూపొందించబడితే, దేవునిపట్ల నీకున్న భయం మరింత ఎక్కువగా మారుతుంది. ఇది అత్యంత సహజంగా లభిస్తుంది. ఒకవేళ నువ్వు దేవుని స్వభావం గురించి గానీ, లేదా ఆయన గుణగణాల గురించి గానీ అర్థం చేసుకోవడానికి ఇష్టం లేకపోయినట్లయితే, లేదా తెలుసుకోవడానికి ఇష్టం లేకపోయినట్లయితే, అసలు ఈ విషయాల గురించి ఆలోచించడమో లేదా వీటి మీద దృష్టి పెట్టడమో సైతం మీకు అయిష్టమైతే, ప్రస్తుతం దేవుని మీద మీరు కొనసాగిస్తున్న మీ విశ్వాసం అనేది ఆయన చిత్తానికి అనుగుణంగా మీరు మారడానికో లేదా ఆయన ప్రశంసలు పొందడానికో మిమ్మల్ని ఎప్పటికీ అనుమతించదని నేను నిశ్చయముగా చెప్పగలను. అంతకుమించి, మీరు నిజంగా రక్షణ పొందలేరు, ఇవన్నీ అంతిమ పరిణామాలుగా ఉంటాయి. మనుష్యులు దేవుణ్ణి అర్థం చేసుకోనప్పుడు మరియు ఆయన స్వభావం తెలుసుకోనప్పుడు, వారి హృదయాలు నిజంగా ఆయన కోసం తెరవబడవు. వారు ఒకసారి దేవుణ్ణి అర్థం చేసుకున్నట్లయితే, వారు ఆసక్తితోను మరియు విశ్వాసంతోను ఆయన హృదయంలోని ఉన్నవాటిని అభినందించడం మరియు ఆస్వాదించడం ప్రారంభిస్తారు. దేవుని హృదయంలో ఉన్నవాటిని నీవు మెచ్చుకుని, ఆస్వాదిస్తే, నీ హృదయం క్రమక్రమంగా, కొంచెం కొంచెంగా, ఆయన కోసం తెరవబడుతుంది. నీ హృదయం ఆయన కోసం తెరవబడినప్పుడు, దేవునితో మీరు పంచుకునే విషయాలు, దేవుని ముందు మీరు చేసే విన్నపాలు మరియు మీ స్వంత విపరీత కోరికలు ఎంతటి అవమానకరమైనవిగా మరియు ఎంతటి ధిక్కారపూరితమైనవిగా ఉన్నాయో నీవు గ్రహిస్తావు. నీ హృదయం నిజంగా దేవుని కోసం తెరవబడినప్పుడు, ఆయన హృదయం ఎంతటి అనంతమైన ప్రపంచమో నీవు చూస్తావు మరియు నీకు ఇదివరకు ఎన్నడూ అనుభవంలోకి రానటువంటి ఒక రాజ్యంలోకి నీవు ప్రవేశిస్తావు. ఈ రాజ్యంలో మోసం ఉండదు, వంచన ఉండదు, చీకటి ఉండదు, చెడు ఉండదు. నిజాయితీ మరియు విశ్వసనీయత మాత్రమే ఉంటాయి; కేవలము వెలుగు మరియు యథార్థత మాత్రమే ఉంటాయి; నీతి మరియు దయ మాత్రమే ఉంటాయి. ఇక్కడంతా ప్రేమ మరియు సంరక్షణలతో నిండి ఉంటుంది, కనికరం మరియు సహనములతో నిండి ఉంటుంది మరియు వాటి ద్వారా నీవు జీవము కలిగి ఉండటంలోని ఆనందాన్ని మరియు సంతోషాన్ని అనుభూతి చెందుతావు. నీవు దేవుని కోసం నీ హృదయాన్ని తెరిచినప్పుడు దేవుడు నీకు వీటినే వెల్లడి చేస్తాడు. ఈ అనంతమైన ప్రపంచం అనేది దేవుని జ్ఞానముతోను మరియు సర్వశక్తితోను నిండి ఉంటుంది; అందులో ఆయన ప్రేమ మరియు ఆయన అధికారం కూడా నిండి ఉంటుంది. దేవుడు కలిగి ఉన్నవి ఏమిటో, ఆయనకు ఏవి సంతోషం కలిగిస్తాయో, ఆయన్ని ఏవి ఆందోళనపరుస్తాయో, ఆయన ఎందుకు విచారిస్తాడో, ఆయన ఎందుకు కోపం చేసుకుంటాడో ఇక్కడ మీరు చూడవచ్చు…. తమ హృదయాన్ని తెరిచి దేవుడిని అందులోకి అనుమతించే ప్రతి ఒక్క వ్యక్తి చూడగలిగేది ఇదే. నీవు నీ హృదయాన్ని దేవుని కోసం తెరచినప్పుడు మాత్రమే ఆయన నీ హృదయంలోకి రాగలడు. అప్పుడు మాత్రమే ఆయన ఏమైయున్నాడో, ఆయన ఏమి కలిగియున్నాడో నీవు చూడగలవు మరియు ఆయన నీ హృదయం లోపలికి వచ్చినప్పుడు మాత్రమే నీ కొరకు ఆయన కలిగియున్న ఉద్దేశాలను నీవు చూడగలవు. ఆ సమయంలో, దేవుని గురించిన ప్రతి ఒక్కటీ చాలా విలువైనదనీ, ఆయన కలిగి ఉన్నవి అత్యంత విలువైన నిధితో సమానమనీ నీవు గుర్తిస్తావు. దానితో పోలిస్తే, నీ చుట్టూ ఉన్న వ్యక్తులు, నీ జీవితంలోని అంశాలు మరియు సంఘటనలు మరియు చివరకు నీ ప్రియమైనవారు, నీ భాగస్వామి మరియు నీవు ప్రేమించే విషయాలు సైతం ప్రస్తావించ అర్హమైనవి కావు. అవి చాలా చిన్నవి మరియు చాలా అల్పమైనవి; ఏ భౌతిక వస్తువు నిన్ను మళ్లీ ఆకర్షించలేదనీ లేదా ఏ భౌతిక వస్తువూ దాని కోసం ఎంత మూల్యమైనా చెల్లించేలా నిన్ను మళ్లీ ప్రలోభపెట్టలేదని నీవు భావిస్తావు. దేవుడు తగ్గించుకోవడములో నీవు ఆయన గొప్పతనాన్ని మరియు ఆయన ఆధిపత్యాన్ని చూస్తావు. అంతకుమించి, దేవునికి సంబంధించిన ఏదైనా ఒక కార్యంలో నీవు అదివరకు అత్యంత చిన్నదిగా భావించిన ఆయన అనంతమైన జ్ఞానం మరియు ఆయన సహనం మరియు ఆయన ఓర్పు, ఆయన క్షమాగుణం మరియు నీ గురించిన ఆయన అవగాహనను మీరిప్పుడు అత్యంత స్పష్టంగా చూస్తారు. ఇది నీలో ఆయనపట్ల ఆరాధన భావన కలిగిస్తుంది. ఆ రోజున మానవజాతి ఎలాంటి మురికి ప్రపంచంలో జీవిస్తోందో, నీ పక్కన ఉండే వ్యక్తులు మరియు నీ జీవితంలో జరిగే విషయాలు మరియు నీవు ప్రేమించే వ్యక్తులు, నీపట్ల వారి ప్రేమను వ్యక్తీకరించే వ్యక్తులు మరియు వారివల్ల మీకు లభిస్తున్నట్లుగా భావించే సంరక్షణ, లేదా నీపట్ల వారి శ్రద్ధ సైతం ప్రస్తావన అర్హమైనదిగా అనిపించదు, దేవుడు మాత్రమే నీకు ప్రియమైనవాడుగా మరియు నీ అత్యంత విలువైన నిధి దేవుడు మాత్రమే అన్నట్లుగా అనిపిస్తుంది. అలాంటి రోజు వచ్చినప్పుడు, కొందరు వ్యక్తులు ఈ విధంగా చెబుతారు: దేవుని ప్రేమ చాలా గొప్పది మరియు ఆయన గుణగణాలు అత్యంత పవిత్రమైనవి, దేవునిలో మోసం, చెడు, అసూయ మరియు కలహం అనేవి లేవు. ఆయనలో ఉన్నదంతా నీతి మరియు ప్రామాణికతలే మరియు దేవుడు కలిగి ఉన్నది మరియు ఆయన వద్ద ఉన్నదంతా మనుష్యులు కోరుకోవాల్సిన అంశాలు మాత్రమే అని చెబుతారని నేను విశ్వసిస్తున్నాను. మనుష్యులు దాని కోసం ప్రయత్నించాలి మరియు ఆశించాలి. దీన్ని సాధించగల మానవజాతి సామర్థ్యం ఏ ప్రాతిపదికన నిర్మించబడింది? దేవుని స్వభావం గురించిన మనిషి అవగాహన మరియు దేవుని గుణగణాల మీద వారి అవగాహన ఆధారంగా ఇది నిర్మించబడింది. కాబట్టి, దేవుని స్వభావం అర్థం చేసుకోవడం మరియు ఆయన కలిగి ఉన్నవాటిని అర్థం చేసుకోవడమనేది ప్రతి వ్యక్తికి ఒక జీవితకాలపు పాఠం; తమ స్వభావం మార్చుకోవడానికి మరియు దేవుణ్ణి తెలుసుకోవాలని ప్రయత్నించే ప్రతి వ్యక్తికి ఇదే ఒక జీవిత కాలపు లక్ష్యం.

పని చేయడానికి దేవుడు మొట్టమొదటిసారిగా మనిషిగా మారడం

దేవుడు చేసిన కార్యములన్నిటిని గురించి, ఆయన చేసిన అసమానమైన కార్యముల పరంపర గురించి మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం. వీటిలో ప్రతి ఒక్కటీ దేవుని కార్య నిర్వహణా ప్రణాళికకు మరియు దేవుని చిత్తానికి సంబంధించినవే. అలాగే, అవన్నీ దేవుని స్వభావానికి మరియు ఆయన గుణగణాలకు సంబంధించినవి కూడా. దేవుడు ఏమి కలిగియున్నాడు మరియు దేవుడు ఏమైయున్నాడనే దాని గురించి మనం మరింతగా అర్థం చేసుకోవాలనుకుంటే, మనం పాత నిబంధన, లేదా ధర్మశాస్త్ర యుగము వద్దే ఆగిపోకూడదు, దేవుడు తన కార్యములో కొనసాగించిన దశలను అనుసరిస్తూ మనం ముందుకు సాగిపోవాలి. దేవుడు ధర్మశాస్త్ర యుగం ముగించి, కృపా యుగం ప్రారంభించాడు కాబట్టి, మన అడుగులు ఆయన్ని అనుసరించినప్పుడు, మనం కూడా కృపా యుగంలోకి చేరుతాము. ఇది పూర్తిగా కృపతోను మరియు విమోచనముతోను నిండిన యుగమై ఉంటుంది. ఈ యుగంలో ఇంతకు ముందెన్నడూ చేయని చాలా ముఖ్యమైన కార్యాన్ని దేవుడు మరోసారి చేసాడు. ఈ కొత్త యుగంలో చేసిన కార్యమనేది దేవునికి మరియు మానవ జాతికి ఒక కొత్త ప్రారంభ బిందువైయున్నది. అంటే, దేవుడు అదివరకు ఎప్పుడూ చేయని మరొక కొత్త కార్యమునకు ఇది ఒక ప్రారంభ బిందు అని చెప్పవచ్చు. ఈ కొత్త కార్యము అపూర్వమైనది, మనుష్యులు మరియు సృష్టించబడిన జీవుల ఊహాశక్తికి మించిన విషయమిది. అయితే, ఇప్పుడు మాత్రం మనుష్యులందరికీ ఇది బాగా తెలిసిన విషయమే. ఈ యుగంలో, దేవుడు మొట్టమొదటిసారిగా, మనిషిగా మారాడు మరియు మొట్టమొదటిసారిగా ఆయన మనిషి రూపంలో, మనిషి అస్తిత్వంతో సరిక్రొత్త కార్యమును ప్రారంభించాడు. ఈ క్రొత్త కార్యము అనేది ధర్మశాస్త్ర యుగంలో దేవుడు తన కార్యమును పూర్తి చేసాడనీ మరియు ఆయన ఇక మీదట ధర్మశాస్త్ర ప్రకారం ఏమీ చేయడు, లేదా ధర్మశాస్త్ర ప్రకారము ఏమీ చెప్పడనీ మరియు ధర్మశాస్త్రం ప్రకారం లేదా ఆ ధర్మశాస్త్ర సూత్రాలు లేదా నియమాలకు అనుగుణంగా ఆయన ఏమీ చెప్పడు లేదా ఏమీ చేయడు అని ఇది సూచిస్తుంది. అంటే, ధర్మశాస్త్రం మీద ఆధారపడిన ఆయన కార్యము అంతా మొత్తం శాశ్వతంగా నిలిపివేయబడింది మరియు ఇకపై కొనసాగించబడదు అని అర్థము. ఎందుకంటే, క్రొత్త కార్యమును ప్రారంభించాలనీ మరియు క్రొత్త కార్యాలను చేయాలనీ దేవుడు కోరుకున్నాడు. అంటే, ఆయన ప్రణాళిక మరోసారి కొత్త ప్రారంభ బిందువు వద్దకు చేరింది. దాని ప్రకారం, మానవాళిని దేవుడు తదుపరి యుగంలోకి నడిపించాల్సి వచ్చింది.

ఈ విషయం మనుష్యులకు సంతోషకరమైనదా లేదంటే అరిష్టమైన వార్తలాంటిదా అనేది ప్రతి వ్యక్తికి సంబంధించిన గుణగణాల మీద ఆధారపడి ఉంటుంది. కొందరికి ఇది సంతోషకరమైన వార్త కాదు, అరిష్ట సూచకమైన వార్తలాంటిది. ఎందుకంటే, దేవుడు తన క్రొత్త కార్యము ప్రారంభించినప్పుడు, శాస్త్రాలు మరియు నియమాలు మాత్రమే అనుసరించే వ్యక్తులు, సిద్ధాంతాలు మాత్రమే అనుసరిస్తూ, దేవునికి భయపడని వ్యక్తులు దేవుని క్రొత్త కార్యమును ఖండించడానికి ఆయన పాత కార్యమును ఉపయోగించడానికి మొగ్గు చూపారు. ఇలాంటి వ్యక్తులకు సంబంధించి ఇది అరిష్ట వార్త అని చెప్పక తప్పదు; అయితే, నిర్దోషిగా మరియు నిష్కపటంగా ఉన్న ప్రతి వ్యక్తికి, దేవునిపట్ల నిజాయితీ కలిగి మరియు ఆయన విమోచన కార్యము స్వీకరించడానికి ఇష్టపడే ప్రతి వ్యక్తికి దేవుడు మొట్టమొదటిగా శరీరధారుడు కావడమనేది అత్యంత సంతోషకరమైన వార్తగా ఉంటుంది. ఎందుకంటే, మనుష్యులు ఉనికిలోకి వచ్చినప్పటి నుండి, అప్పటివరకు దేవుడు మానవాళికి ఆత్మ రూపంలో కాకుండా, శరీరధారిగా రావడంతోపాటు వారి మధ్యన జీవించడం అదే మొదటిసారి; ఈసారి, ఆయన మనిషి నుండి జన్మించాడు మరియు మనుష్య కుమారుడిగా మనుష్యుల మధ్య జీవించాడు మరియు వారి మధ్యలోనే కార్యము చేశాడు. ఈ “మొట్టమొదటి” కార్యము మనుష్యుల ఆలోచనలను పటాపంచలు చేసింది; ఇది అన్ని ఊహలకు అతీతమైనది. అంతకుమించి, దేవుని అనుచరులందరూ ఈ సమయంలో ప్రత్యక్ష ప్రయోజనం పొందారు. దేవుడు పాత యుగాన్ని అంతం చేయడమే కాకుండా, ఆయన తన పాత కార్యము యొక్క పద్ధతులకు మరియు ఆ కార్యము యొక్క శైలికి కూడా ముగింపు పలికాడు. ఆయన తన చిత్తాన్ని తెలియజేయాలని తన దూతలను కోరలేదు. ఆయన మేఘాల్లో దాగి ఉండలేదు మరియు అటుపై ఆయన ఉరుము రూపంలో మనుష్యులకు కనిపించడమో లేదా మాట్లాడడమో చేయలేదు. మునుపటివలె కాకుండా, మనుష్యులు అర్థం చేసుకోవడానికి లేదా అంగీకరించడానికి కష్టతరమైనది మరియు వారి ఊహకు అందని విధంగా ఆయన శరీరధారిగా, అంటే మనుష్య కుమారుడిగా వచ్చాడు. ఆ యుగపు కార్యము ప్రారంభించడం కోసమే ఆయన అలా చేశాడు. దేవుని ఈ చర్యను అర్థం చేసుకోవడానికి మానవాళి పూర్తి సంసిద్ధం కాలేదు; అది వారికి ఇబ్బందికరమైనదిగా అనిపించింది. ఎందుకంటే, దేవుడు అదివరకు ఎన్నడూ చేయని విధంగా క్రొత్త కార్యము ప్రారంభించడమే అందుకు కారణం. ఈ రోజు, మనం క్రొత్తయుగంలో దేవుడు ఎటువంటి క్రొత్త కార్యము చేసి ముగించాడో మరియు ఈ క్రొత్త కార్యము నుండి మనం ఏం నేర్చుకోవాలో మరియు దేవుని స్వభావం మరియు ఆయన ఏం కలిగి ఉన్నాడు మరియు ఆయన ఏమై ఉన్నాడో అనే మాటలను పరిశీలిద్దాము.

బైబిలులోని కొత్త నిబంధనలో ఈ క్రింది వాక్యములు నమోదు చేయబడ్డాయి:

1. యేసు విశ్రాంతిదినమున తినడానికి వెన్నులు త్రుంచాడు

మత్తయి 12:1 ఆ కాలమందు యేసు విశ్రాంతిదినమున పంట చేలలో పడి వెళ్లుచుండగా ఆయన శిష్యులు ఆకలిగొని వెన్నులు త్రుంచి తినసాగిరి.

2. మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువైయున్నాడు

మత్తయి 12:6-8 దేవాలయముకంటె గొప్ప వాడిక్కడ నున్నాడని మీతో చెప్పుచున్నాను. మరియు, కనికరమునే కోరుచున్నాను గాని బలిని నేను కోరను అను వాక్యభావము మీకు తెలిసియుంటే నిర్దోషులను దోషులని తీర్పు తీర్చకపోదురు. కాగా మనుష్య కుమారుడు విశ్రాంతిదినమునకు ప్రభువైయున్నాడనెను.

ముందుగా మనం ఈ వాక్య భాగం పరిశీలిద్దాం: ఆ కాలమందు యేసు విశ్రాంతిదినమున పంట చేలలో పడి వెళ్లుచుండగా ఆయన శిష్యులు ఆకలిగొని వెన్నులు త్రుంచి తినసాగిరి.

నేను ఈ భాగాన్నే ఎందుకు ఎంచుకున్నాను? దేవుని స్వభావానికి, దీనికి ఉన్న సంబంధమేమిటి? ఈ వచనంలో మనకు తెలిసిన మొదటి విషయం ఏమిటంటే, అది విశ్రాంతి దినము అయినప్పటికీ, యేసు ప్రభువు బయటకు వెళ్లి తన శిష్యులను మొక్కజొన్న పొలాల వెంబడి నడిపించాడు. అదిమాత్రమే కాకుండా, ఇక్కడ “ద్రోహులు” అనిపించేలా వారు “వెన్నులు త్రుంచి తినసాగిరి.” ధర్మశాస్త్ర యుగంలో యెహోవా దేవుని చట్టం ప్రకారం, విశ్రాంతి దినమున ప్రజలు సాధారణంగా బయటకు వెళ్లకూడదు లేదా ఏ కార్యకలాపాల్లోనూ పాల్గొనకూడదు, ఈ విధంగా విశ్రాంతి దినమున చేయకూడనివి చాలానే ఉన్నాయి. అందుకే, ప్రభువైన యేసు ద్వారా జరిగిన ఈ చర్య అనేది సుదీర్ఘ కాలంగా ధర్మశాస్త్రానికి లోబడి జీవించిన వారికి తికమకగా అనిపించింది. అలాగే, ఆ చర్య విమర్శలను కూడా రేకెత్తించింది. వారిలో చెలరేగిన ఆ తికమక మరియు యేసు చేసిన ఆ పని గురించి వాళ్లు ఏం మాట్లాడారనే దానిని మనం ప్రస్తుతం పక్కన పెట్టి, మిగిలిన దినముల్లో కాకుండా విశ్రాంతి దినమునే ఈ పని చేయడానికి యేసు ప్రభువు ఎందుకు ఎంచుకున్నాడు మరియు ధర్మశాస్త్రము క్రింద జీవిస్తున్న ప్రజలకు ఈ చర్య ద్వారా ఏం తెలియజేయాలనుకున్నాడనే దాని గురించి మనం ఇప్పుడు మరియు ముందుగా చర్చిద్దాము. ఈ వచన భాగానికి మరియు నేను మాట్లాడాలనుకుంటున్న దేవుని స్వభావానికి మధ్య ఉన్న సంబంధం ఇదే.

ప్రభువు యేసు వచ్చినప్పుడు, దేవుడు ధర్మశాస్త్ర యుగాన్ని విడిచిపెట్టి, కొత్త కార్యము ప్రారంభించాడని మరియు ఈ కొత్త కార్యములో విశ్రాంతి దినమును పాటించాల్సిన అవసరం లేదని మనుష్యులకు చెప్పడం కోసం ఆయన తన ఆచరణాత్మక చర్యలను ఉపయోగించాడు. విశ్రాంతి దినము యొక్క పరిమితుల నుండి దేవుడు బయటకు రావడమనేది ఆయన చేపట్టిన కొత్త కార్యము గురించి కొద్దిగా రుచి చూపించడం మాత్రమే; వాస్తవమైన మరియు గొప్ప కార్యము ఇంకా జరగాల్సి ఉంది. ప్రభువైన యేసు తన కార్యమును ప్రారంభించినప్పుడు, ఆయన అప్పటికే ధర్మశాస్త్ర యుగపు “సంకెళ్ళు” తెంచుకున్నాడు మరియు ఆ యుగపు నిబంధనలను మరియు సూత్రాలను విచ్ఛిన్నం చేసేశాడు. ఆయనలో ధర్మశాస్త్ర యుగానికి సంబంధించిన జాడ ఏదీ లేదు; ఆయన దానిని పూర్తిగా విస్మరించాడు మరియు మరెప్పుడూ దానిని అనుసరించలేదు మరియు మానవజాతి కూడా ఇకపై దానిని అనుసరించాల్సిన అవసరం లేదని ఆయన అన్నాడు. కాబట్టే, విశ్రాంతి దినమున ప్రభువు యేసు మొక్కజొన్న పొలాల వెంబడి వెళ్లడాన్ని మరియు ఆ విధంగా ఆయన విశ్రాంతి తీసుకోకపోవడాన్ని నీవు చూడవచ్చు; ఆయన కార్యము చేయడానికి బయటకు వచ్చాడు మరియు విశ్రాంతి తీసుకోలేదు. ఆయన జరిగించిన ఈ చర్య ప్రజల ఆలోచనలకు దిగ్భ్రాంతిని కలిగించింది మరియు ఆయన ధర్మశాస్త్రానికి లోబడి జీవించడం లేదని మరియు ఆయన విశ్రాంతి దినము యొక్క పరిమితులను విడిచిపెట్టి, మానవజాతి ముందు మరియు వారి మధ్యలో కొత్త మార్గంలో పని చేయడం ద్వారా, ఆయన సరికొత్త రూపంతో కనిపిస్తున్నాడని వారికి అర్థమైంది. ఆయన జరిగించిన ఈ చర్య అనేది ఆయన తనతో కొత్త కార్యము తీసుకొచ్చాడని, ధర్మశాస్త్రానికి లోబడి ఉండడం నుండి బయటపడడం మరియు విశ్రాంతి దినమున వెలుపలికి రావడంతో ఈ కార్యము మొదలైందని ప్రజలకు తెలియజేసింది. దేవుడు తన కొత్త కార్యము ప్రారంభించినప్పుడు, ఆయన ఇక గతంతో సంబంధాన్ని కలిగియుండడు మరియు ఇకపై ఆయన ధర్మశాస్త్ర యుగపు నిబంధనల గురించి ఆందోళన చెందడు. గడచిన యుగంలోని ఆయన కార్యము ఆయనను ప్రభావితం చేయలేదు. బదులుగా ప్రతిరోజూ చేసినట్టుగానే ఆయన విశ్రాంతి దినమున పనిచేశాడు మరియు ఆయన శిష్యులు విశ్రాంతి దినమున ఆకలి వేయగానే తినడం కోసం మొక్కజొన్నలు తెంపుకున్నారు. దేవుని దృష్టిలో ఇదంతా సర్వసాధారణమైనది. దేవునికి సంబంధించినంతవరకు, ఆయన చేయాలనుకునే అత్యంత కొత్త కార్యము మరియు ఆయన చెప్పాలనుకునే కొత్త వాక్కుల కోసం క్రొత్త ప్రారంభం అనుమతించబడుతుంది. ఎందుకంటే, దేవుడు క్రొత్త కార్యము ప్రారంభించాలనుకున్నప్పుడు, మానవాళిని తన కార్యపు క్రొత్త దశలోనికి తీసుకురావాలనుకున్నప్పుడు మరియు ఆయన కార్యము అత్యున్నత దశలోకి ప్రవేశించినప్పుడల్లా, ఆయన తన కార్యములో తనదైన సూత్రాలు కలిగి ఉంటాడు. ఒకవేళ, మనుష్యులు పాత సూక్తులు లేదా పాత నిబంధనల ప్రకారం ప్రవర్తించడం కొనసాగిస్తే లేదా వాటికి గట్టిగా కట్టుబడి ఉండడం కొనసాగిస్తే, ఆయన దానిని గుర్తుంచుకోడు లేదా ఆమోదించడు. ఎందుకంటే, ఆయన అప్పటికే క్రొత్త కార్యమును తీసుకువచ్చాడు మరియు ఆయన తన కార్యములోని క్రొత్త దశలోకి ప్రవేశించాడు. ఆయన క్రొత్త పని ప్రారంభించినప్పుడు, మానవాళికి ఆయన పూర్తిగా సరికొత్త రూపంతో, పూర్తిగా సరికొత్త కోణం నుండి మరియు పూర్తిగా సరికొత్త మార్గంలో కనిపిస్తాడు. తద్వారా, మనుష్యులు ఆయన స్వభావంలో మరియు ఆయన ఏమి కలిగియున్నాడు మరియు ఆయన ఏమైయున్నాడనే విషయములో విభిన్నమైన అంశాలను చూడగలరు. ఆయన క్రొత్త కార్యములోని లక్ష్యాల్లో ఇదీ ఒకటి. దేవుడు పాత అంశాలకు కట్టుబడి ఉండడు, లేదా బాగా తొక్కిన మార్గంలో నడవడు; ఆయన కార్యము జరిగించునప్పుడు మరియు మాట్లాడేటప్పుడు, ప్రజలు ఊహించిన పరిధిలో ఉండేవాడు కాదు. దేవునిలో ప్రతి ఒక్కటీ స్వేచ్ఛగాను మరియు స్వాతంత్ర్యము పొందినవిగాను ఉంటాయి మరియు ఎటువంటి నిషేధం ఉండదు, ఎటువంటి అడ్డంకులు ఉండవు, అంటే మానవాళి కోసం ఆయన స్వేచ్ఛను మరియు విముక్తిని తీసుకొస్తాడు. ఆయన సజీవుడైన దేవుడు. యథార్థంగా, నిజంగా ఉనికిలో ఉండే దేవుడాయన. ఆయన ఒక తోలుబొమ్మో, లేదా మట్టి బొమ్మో కాదు. అలాగే, మనుష్యులు ప్రతిష్టించే మరియు ఆరాధించే విగ్రహాల నుండి ఆయన పూర్తిగా భిన్నమైనవాడు. ఆయన సజీవుడు మరియు శక్తివంతమైనవాడు మరియు ఆయన వాక్కులు మరియు ఆయన కార్యము మానవాళికి సంపూర్ణ జీవితాన్ని మరియు వెలుగును, సంపూర్ణమైన స్వేచ్ఛను మరియు విముక్తిని అందిస్తుంది. ఎందుకంటే, ఆయన సత్యమును, జీవమును మరియు మార్గమును కలిగి ఉన్నాడు, ఆయన జరిగించే ఎటువంటి కార్యములోనైనా దేనిచేతనైనా నిర్భంధించబడడు. మనుష్యులు ఏం చెప్పినప్పటికీ మరియు వాళ్లు ఆయన కొత్త కార్యమును ఏవిధంగా చూసినప్పటికీ లేదా ఏ విధంగా అంచనా వేసినప్పటికీ, ఆయన తన కార్యమును ఎటువంటి సందేహం లేకుండా నిర్వహిస్తాడు. ఎవరి ఆలోచనల గురించి ఆయన ఆందోళన చెందడు, లేదా ఆయన కార్యము మరియు వాక్కులపట్ల ఎవరు వేలు చూపినా, లేదా ఆయన క్రొత్త కార్యముపట్ల ఎదురయ్యే బలమైన వ్యతిరేకత మరియు ప్రతిఘటనలను గురించి ఆయన చింతించడు. దేవుడు చేసే కార్యమును కొలవడానికి లేదా నిర్వచించడానికి, ఆయన కార్యమునకు అపఖ్యాతి కలిగించడానికి, అంతరాయం కలిగించడానికి లేదా విధ్వంసం చేయడానికి ఈ పూర్తి సృష్టిలోని ఏ ఒక్కరూ మానవ హేతువునో లేదా మానవ కల్పననో, జ్ఞానమునో లేదా నైతికతనో ఉపయోగించలేరు. ఆయన కార్యములో మరియు ఆయన చేసే వాటిలో నిషేధం ఉండదు; ఏ ఒక్క వ్యక్తి ద్వారానైనా, ఏ ఒక్క సంఘటన లేదా అంశము ద్వారానైనా అది నిర్బంధించబడదు లేదా ఏ శత్రు శక్తుల ద్వారానూ భంగపరచబడదు. ఆయన కొత్త కార్యమునకు సంబంధించినంతవరకు, ఆయనే ఎల్లప్పుడూ విజయం సాధించే రాజుగా మరియు ఏవైనా శత్రు శక్తులు మరియు మానవజాతి అనుసరించే అన్ని భ్రష్ట మతాలు మరియు తప్పుడు విధానాలు ఆయన పాదపీఠం క్రింద తొక్కివేయబడుతాయి. ఆయన తన కార్యములోని ఏ కొత్త దశను నిర్వహిస్తున్నప్పటికీ, అది ఖచ్చితంగా మానవజాతి మధ్యలోనే వృద్ధి చెందుతుంది మరియు విస్తరించబడుతుంది మరియు ఆయన గొప్ప కార్యము పూర్తయ్యే వరకు అది ఖచ్చితంగా ఈ పూర్తి విశ్వంలో ఎటువంటి ఆటంకం లేకుండా నిర్వహించబడుతుంది. ఇదే దేవుని సర్వశక్తిమంతత్వము మరియు జ్ఞానమైయున్నది, ఇదే ఆయన అధికారం మరియు శక్తియైయున్నది. ఈ విధంగా, యేసు ప్రభువు విశ్రాంతి దినమున బయటకు వెళ్లి పని చేయగలడు. ఎందుకంటే, మానవజాతి నుండి ఉద్భవించిన నియమాలు, పరిజ్ఞానం లేదా సిద్ధాంతంలాంటివేవీ ఆయన హృదయంలో ఉండవు. దేవుని కొత్త కార్యము మరియు దేవుని మార్గము మాత్రమే ఆయనలో ఉంటాయి. మానవాళిని విమోచించడం, మనుష్యులను విడుదల చేయడం, వెలుగులో వారుండునట్లు చేయడం మరియు వారిని జీవింపజేయడం అనేది ఆయన మార్గమైయుండెను. అదే సమయంలో, విగ్రహారాధికులు లేదా అబద్ధపు దేవుళ్లను ఆరాధించే వారు ప్రతి రోజూ సాతానుకు కట్టుబడి, అన్ని రకాల నియమాలు మరియు నిషేధాల ద్వారా నియంత్రించబడుతుంటారు, అంటే, వాళ్లకి ఈ రోజు ఒక విషయం నిషేధించబడి ఉంటుంది, రేపు మరొకటి నిషేధించబడి ఉంటుంది, ఇలా వారి జీవితాలలో స్వాతంత్ర్యము అనేదే ఉండదు. వాళ్లు సంకెళ్లు వేయబడిన ఖైదీల్లా, మాట్లాడడానికి కూడా ఆనందములేటువంటి జీవితం గడుపుతుంటారు. “నిషేధం” అనేది దేనిని సూచిస్తుంది? అడ్డంకులు, బంధాలు మరియు చెడును అది సూచిస్తుంది. ఒక వ్యక్తి విగ్రహారాధన మొదలుపెట్టగానే, వాళ్లు ఒక అబద్ధపు దేవుడిని, దుష్టాత్మను ఆరాధిస్తున్నారంతే. అలాంటి కార్యకలాపాల్లో నిమగ్నమైనప్పుడే నిషేధం అనేది మొదలవుతుంది. మీరు ఇది తినలేరు, లేదా అది తినలేరు, ఈ రోజు మీరు బయటకు వెళ్లలేరు, రేపు మీరు వంట చేయలేరు, ఆ మరుసటి రోజు మీరు కొత్త ఇంటికి మారలేరు, వివాహాలు మరియు అంత్యక్రియలకే కాకుండా, బిడ్డకు జన్మనివ్వడానికి కూడా మీరు ఒక నిర్ధిష్ట రోజును ఎంచుకోవాలి. ఇలాంటి ఆంక్షలను ఏమని పిలుస్తారు? దీనినే నిషేధం అని పిలుస్తారు; దీనినే మానవజాతి యొక్క బంధకం అని అంటారు మరియు దీనినే సాతాను మరియు దుష్టశక్తుల సంకెళ్లు అని, ప్రజలను నియంత్రించడమని మరియు వారి హృదయాలను మరియు శరీరాలను నియంత్రించడం అని అంటారు. ఈ నిషేధాలు అన్ని దేవునితోపాటు ఉనికిలో ఉన్నాయా? దేవుని పరిశుద్ధత గురించి మాట్లాడినప్పుడు, నీవు మొదటగా దీని గురించే ఆలోచించాలి: దేవునివద్ద ఎటువంటి నిషేధాలు ఉండవు. దేవుడు తన వాక్కులు మరియు కార్యములో నిబంధనలు కలిగి ఉన్నాడే తప్ప నిషేధాలు లేవు, ఎందుకంటే దేవుడే సత్యము, మార్గము మరియు జీవమునైయున్నాడు.

ఇప్పుడు మనం లేఖనాల నుండి క్రింది భాగాన్ని చూద్దాం: “దేవాలయముకంటె గొప్ప వాడిక్కడనున్నాడని మీతో చెప్పుచున్నాను. మరియు కనికరమునే కోరుచున్నాను గాని బలిని నేను కోరను అను వాక్యభావము మీకు తెలిసియుంటే నిర్దోషులను దోషులని తీర్పు తీర్చకపోదురు. కాగా మనుష్య కుమారుడు విశ్రాంతిదినమునకు ప్రభువైయున్నాడనెను” (మత్తయి 12:6-8). “దేవాలయము” అనే పదం ఇక్కడ దేనిని సూచిస్తుంది? సరళంగా చెప్పాలంటే, అదొక అద్భుతమైన, ఎత్తైన భవనాన్ని సూచిస్తుంది మరియు ధర్మశాస్త్ర యుగంలో, ఈ దేవాలయము అనేది యాజకులు దేవుణ్ణి ఆరాధించే ఒక స్థలంగా ఉండేది. “దేవాలయముకంటె గొప్ప వాడిక్కడనున్నాడని” మీతో చెప్పుచున్నాను అని యేసు ప్రభువు చెప్పినప్పుడు, అందులో “గొప్పవాడు” అనే మాట ఎవరిని సూచిస్తుంది? స్పష్టంగా చెప్పాలంటే, శరీరధారిగా ఉన్న ప్రభువు యేసే ఆ “గొప్పవాడు”. ఎందుకంటే, ఆయన మాత్రమే దేవాలయముకంటే గొప్పవాడు. ఆ వాక్కులు ప్రజలకు ఏమి తెలియజేస్తున్నాయి? దేవాలయము నుండి బయటకు రావాలని ఆ వాక్కులు ప్రజలకు చెప్తున్నాయి, దేవుడు ఇప్పటికే దేవాలయం నుండి వచ్చేశాడు మరియు ఇకపై ఆయన అందులో ఎటువంటి కార్యము చేయడం లేదు కాబట్టి, ప్రజలు దేవాలయం వెలుపల దేవుని అడుగుజాడలు వెదకాలి మరియు ఆయన క్రొత్త కార్యములో ఆయన అడుగుజాడలను అనుసరించాలి. ప్రభువు యేసు ఇలా చెప్పినప్పుడు, ఆయన వాక్కుల వెనుక ఒక పూర్వ సిద్ధాంతం ఉంది. అంటే, ధర్మశాస్త్రం ప్రకారం దేవాలయం అనే దానిని దేవునికంటే కూడా గొప్పదిగా జనులు చూడాలి. అంటే, దేవుణ్ణి ఆరాధించడంకంటే, దేవాలయాన్నే జనులు ఆరాధించారు. అందుకే, విగ్రహాలను పూజించవద్దని ప్రభువు యేసు హెచ్చరించాడు. విగ్రహాలను పూజించుటకు బదులుగా దేవుణ్ణి ఆరాధించాలన్నాడు. ఎందుకంటే, ఆయన మాత్రమే సర్వోన్నతుడు. అందుకే, ఆయన: “నేను కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను” అన్నాడు. ప్రభువైన యేసు దృష్టిలో ధర్మశాస్త్రానికి లోబడి జీవించే చాలామంది ప్రజలు ఇకపై యెహోవాను ఆరాధించలేదనీ, బలులు అర్పించే మార్గంలో మాత్రమే వెళ్ళారని స్పష్టంగా అర్థమవుతుంది మరియు అలా చేయడమనేది విగ్రహారాధన అని ప్రభువు యేసు ఖచ్చితంగా చెప్పాడు. ఎందుకంటే, ఈ విగ్రహారాధికులు దేవునికంటే దేవాలయాన్నే గొప్పదిగా మరియు ఉన్నతంగా భావించారు. వారి హృదయాల్లో ఉన్నది దేవాలయమే తప్ప దేవుడు కాదు మరియు వారు ఆ దేవాలయాన్ని కోల్పోతే, వారు తమ నివాస స్థలం కోల్పోతారు. దేవాలయం లేకపోతే మరెక్కడా ఆరాధనలు చేయలేరు, వారి బలిదానాలు అర్పించలేరు. తమ “నివాస స్థలంగా” పేర్కొంటూ, ఆ దేవాలయంలోనే ఉంటూ, తమ సొంత వ్యవహారాలు నిర్వహించుకోవడానికే వారు అక్కడ యెహోవా దేవుణ్ణి ఆరాధిస్తున్నట్లుగా తప్పుడు ప్రచారం చేస్తుంటారు. వారు “బలి అర్పించుట” అని పేర్కొంటూ, ఆ దేవాలయంలో వారి సేవను నిర్వర్తించే ముసుగులో వారి సొంత, వ్యక్తిగత అవమానకర వ్యవహారాలు మాత్రమే నిర్వహించారు. ఆ సమయంలో జనులు దేవాలయాన్ని దేవునికంటే గొప్పగా భావించడానికి కారణం ఇదే. అందుకే, ప్రభువు యేసు ఈ మాటలను ప్రజలకు హెచ్చరికగా చెప్పాడు. ఎందుకంటే, వారు దేవాలయాన్ని ఒక ముందు భాగంగా ఉపయోగించారు మరియు ప్రజలను మోసం చేయడానికి మరియు దేవుణ్ణి మోసం చేయడానికి బలులను ఒక ముసుగులా ఉపయోగించారు. ఈ మాటలను మీరు ప్రస్తుతానికి వర్తింపజేస్తే, నేటికీ అవి సమానంగా చెల్లుబాటు అయ్యేవిగాను మరియు అంతే సమానంగా సంబంధితంగాను ఉన్నాయి. ధర్మశాస్త్ర యుగంలో ప్రజలు అనుభవించినదానికంటే భిన్నమైన దేవుని కార్యాన్ని ప్రజలు నేడు అనుభవించినప్పటికీ, వారి స్వభావం మరియు గుణగణాలు మాత్రం ఒకేలా ఉన్నాయి. నేడు జరిగించబడుచున్న కార్యపు వెలుగులో “దేవునికంటే దేవాలయం గొప్పది” అనే మాటలకు ప్రాతినిధ్యం వహించే విధంగానే జనులు ఇప్పటికీ అదే విధమైన పనులు చేస్తున్నారు. ఉదాహరణకు, ప్రజలు తమ కర్తవ్యము జరిగించడమును తమ ఉద్యోగంగా చూస్తున్నారు; దేవునికి సాక్ష్యమివ్వడం మరియు యెఱ్ఱని మహాఘటసర్పముతో పోరాడడాన్ని ప్రజా ప్రభుత్వము కొరకు మరియు స్వాతంత్ర్యము కొరకు మానవ హక్కుల సంరక్షణలోని రాజకీయ ఉద్యమాలుగా చూస్తున్నారు; వారు తమ నైపుణ్యాలను వృత్తిగా మలచుకోవడాన్ని మాత్రమే తమ కర్తవ్యంగా చూస్తున్నారే తప్ప, దేవునికి భయపడడం మరియు చెడును విస్మరించడం అనే వాటిని మతపరమైన సిద్ధాంతంగా తప్ప ఇంకేమీ కానట్లుగా మాత్రమే చూస్తున్నారు; వాళ్ల ఆలోచనలన్నీ ఈ విధంగానే సాగుతున్నాయి. ఇలాంటి ప్రవర్తనలన్నీ ప్రధానంగా “దేవునికంటే దేవాలయమే గొప్పది” అనేవి కావా? ఇక్కడ వ్యత్యాసం ఏమిటంటే, రెండు వేల ఏళ్ల క్రితం, ప్రజలు వారి వ్యక్తిగత కార్యకలాపాలను భౌతిక దేవాలయంలో నిర్వహించేవారు. కానీ, నేడు, ప్రజలు వారి వ్యక్తిగత కార్యకలాపాలను భౌతిక దేవాలయాలు కాని వాటిలో నిర్వహిస్తున్నారు. నియమాలకు విలువనిచ్చే వ్యక్తులు ఆ నియమాలనే దేవునికంటే గొప్పవైనట్లుగా చూస్తారు. హోదాను ఇష్టపడే వ్యక్తులు ఆ హోదాను దేవునికంటే గొప్పదైనట్లుగా చూస్తారు. వృత్తిని ఇష్టపడే వారు వారి వృత్తిని దేవునికంటే గొప్పగా చూస్తారు. వీళ్లందరి వైఖరి ఇలాగే సాగుతుంది, వాళ్ల వ్యక్తీకరణలన్నీ నేను ఇలా చెప్పడానికి దారితీస్తాయి: “మనుష్యులు వారి మాటలతో దేవుణ్ణి గొప్పగా స్తుతించినప్పటికీ, వారి దృష్టిలో ప్రతి ఒక్కటీ దేవునికంటే గొప్పదిగా ఉంటుంది.” ఎందుకంటే, మనుష్యులు వారి సొంత ప్రతిభను ప్రదర్శించే క్రమములో, లేదా వారి సొంత వ్యాపారం చేసుకునే క్రమములో, లేదా వారి సొంత వృత్తిని నిర్వహించే క్రమంలో దేవుణ్ణి అనుసరించే మార్గంలోకి వచ్చినప్పటికీ, అవకాశం దొరికిన వెంటనే, వారు దేవునికి దూరంగా వెళ్తారు మరియు తమ ప్రియమైన వృత్తిలోకి ప్రవేశిస్తారు. దేవుడు వారికి అప్పగించిన దాని గురించి మరియు ఆయన చిత్తం గురించిన విషయాలన్ననీ చాలాకాలం విస్మరించబడుతాయి. రెండు వేల ఏళ్ల క్రితం దేవాలయంలో సొంత వ్యాపారాలు నిర్వహించిన అప్పటివారి స్థితికి, ఇప్పటి వీరి స్థితికి మధ్య తేడా ఏముంది?

తర్వాత, ఈ వాక్య భాగంలోని చివరి వాక్యం పరిశీలిద్దాం: “మనుష్య కుమారుడు విశ్రాంతిదినమునకు ప్రభువైయున్నాడనెను” ఈ వాక్యానికి ఆచరణాత్మక కోణం ఏమైనా ఉందా? మీరు ఇందులో ఆచరణాత్మక కోణాన్ని చూడగలరా? దేవుడు చెప్పే ప్రతి విషయము ఆయన హృదయం నుండి వస్తుంది. మరి, ఆయన ఎందుకిలా చెప్పాడు? మీరు దీనిని ఎలా అర్థం చేసుకున్నారు? మీరిప్పుడు, ఈ వాక్యపు అర్ధం గ్రహించి ఉండవచ్చు. కానీ, ఆ మాట చెప్పబడిన సమయంలో చాలా మంది మనుష్యులు ఆ విధంగా చేయలేదు. ఎందుకంటే, మానవాళి అప్పుడప్పుడే ధర్మశాస్త్ర యుగం నుండి బయట పడుతోంది. కాబట్టి, విశ్రాంతి దినము నుండి బయటకు రావడమనేది వారికి అత్యంత కష్టమైన పని. అలాంటప్పుడు, నిజమైన విశ్రాంతి దినము గురించి ఇక ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

“మనుష్య కుమారుడు విశ్రాంతిదినమునకు ప్రభువైయున్నాడనెను” అనే వాక్యం దేవుని గురించిన ప్రతి ఒక్క విషయం భౌతిక స్వభావం కలిగియుండదని మనుష్యులకు చెబుతోంది. అలాగే, నీ భౌతిక అవసరాలన్నింటినీ దేవుడు సమకూర్చగలడనీ, నీ భౌతిక అవసరాలన్నీ తీర్చబడిన తర్వాత, ఆ విషయాల నుండి లభించిన సంతృప్తి అనేది నిన్ను నీ సత్యాన్వేషణను బదిలీ చేయగలదా? అది స్పష్టంగా సాధ్యం కాదు! దేవుని స్వభావము మరియు ఆయన ఏమి కలిగియున్నాడో మరియు ఆయన ఏమై ఉన్నాడనే విషయములో మనము చేసిన సహవాసములో రెండూ సత్యమే. వాటి విలువను ఎటువంటి భౌతిక వస్తువులతోనూ కొలవబడదు. అది ఎంత విలువైనదైనప్పటికీ, దాని విలువను డబ్బు పరంగా లెక్కించే అవకాశమున్నప్పటికీ, వాటితో దానిని లెక్కించలేము. ఎందుకంటే, అది భౌతిక అంశం కాదు మరియు అది ప్రతి వ్యక్తి హృదయ అవసరాలను తీర్చేది. ప్రతివ్యక్తి విషయంలోనూ, నీవు విలువైనదిగా భావించే ఎటువంటి భౌతిక వస్తువు యొక్క విలువ కంటే కూడా ఈ అగోచరమైన సత్యాల విలువ ఎక్కువగానే ఉండాలి, కాదనగలరా? ఈ ప్రకటనను మీరు ఎప్పటికీ మర్చిపోకూడదు. నేను చెప్పిన దానిలో కీలకాంశం ఏమిటంటే, దేవుడు ఏమి కలిగియున్నాడో మరియు దేవుడు ఏమైయున్నాడో మరియు దేవునికి సంబంధించిన ప్రతి ఒక్కటీ అనేవి ప్రతి వ్యక్తికీ అత్యంత ముఖ్యమైనదిగా ఉంటాయి మరియు అవి ఎటువంటి భౌతిక వస్తువు ద్వారా బదిలీ చేయలేనివి. నేను నీకొక ఉదాహరణ చెబుతాను: నీకు ఆకలిగా ఉన్నప్పుడు, నీకు ఆహారం అవసరం. ఆ ఆహారం అనేది ఎక్కువైనా కావొచ్చు, లేదా తక్కువైనా కావొచ్చు, లేక మంచిదైనా కావచ్చు, లేక ఎక్కువైనా కావచ్చు, లేదా తక్కువ సంతృప్తి కలిగించవచ్చు కానీ కడుపు నిండుతున్న కొలది ఆ ఆకలిగా ఉండే ఇబ్బందికర భావన ఇకపై ఉండదు, అంటే అది తొలగిపోతుంది. నీవు ప్రశాంతంగా కూర్చోవచ్చు మరియు నీ శరీరం విశ్రాంతిగా ఉంటుంది. మనుష్యుల ఆకలి ఆహారంతో పరిష్కరించబడుతుంది. అయితే, నీవు దేవుణ్ణి అనుసరిస్తున్నప్పుడు మరియు ఆయన గురించి నీకేమీ అవగాహన లేదని నీవు భావించినప్పుడు, నీ హృదయంలోని శూన్యతను నీవెలా పోగొట్టగలవు? అది ఆహారంతో పరిష్కరించబడుతుందా? లేదంటే, నీవు దేవుణ్ణి అనుసరిస్తున్నప్పుడు మరియు ఆయన చిత్తాన్ని అర్థం చేసుకోనప్పుడు, నీ హృదయంలో ఆ ఆకలి పోగొట్టుకోవడానికి నీవు దేనిని ఉపయోగించగలవు? దేవుడి ద్వారా వచ్చే రక్షణను నీవు అనుభవించే ప్రక్రియలో, మీ స్వభావంలో మార్పును అనుసరిస్తూ, నీవు ఆయన చిత్తం అర్థం చేసుకోలేకపోతే లేదా సత్యం ఏమిటో నీకు తెలియకపోతే, దేవుని స్వభావం అర్థం చేసుకోకపోతే, అప్పుడు నీకు అత్యంత అసౌకర్యంగా అనిపించదా? నీ హృదయంలో నీకు తీవ్రమైన ఆకలి మరియు దాహంలాంటి భావన చెలరేగదా? ఈ భావాలనేవి నీవు నీ హృదయంలో విశ్రాంతి పొందకుండా నిన్ను నిరోధించవా? మరి, నీ హృదయంలోని ఆ ఆకలిని నీవు ఎలా తీర్చుకోగలవు, దీన్ని పరిష్కరించడానికి ఏదైనా మార్గం ఉందంటారా? ఇందుకోసం, కొందరు వ్యక్తులు షాపింగ్‌కు వెళతారు, కొందరేమో వారి స్నేహితుల్లోని నమ్మకాన్ని వెతుక్కుంటారు, మరికొందరు సుదీర్ఘ నిద్రలో మునిగిపోతారు, మరికొందరు దేవుడి వాక్కులను ఎక్కువగా చదువుతారు, లేదంటే వారు మరింతగా కష్టపడి పని చేస్తూ, వారి విధులను పూర్తి చేయడానికి మరింత ప్రయత్నాన్ని వెచ్చిస్తారు. ఈ విషయాలన్నీ నీకున్న కష్టాలను పరిష్కరించగలవా? ఈ రకమైన అభ్యాసాలను మీరందరూ సంపూర్ణంగా అర్థం చేసుకున్నారు. నిన్ను నీవు శక్తిహీనుడివిగా భావించినప్పుడు, సత్యం వాస్తవికతను మరియు దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం కోసం నిన్ను నీవు అనుమతించే క్రమంలో, దేవుని నుండి జ్ఞానోదయం పొందుకోవాలనే బలమైన కోరిక నీలో కలిగినప్పుడు, నీకు అత్యావశ్యకంగా కావలసినది ఏమిటి? నీకు కావలసింది పూర్తిస్థాయి భోజనం కాదు. అలాగే, దయతో కూడిన కొన్ని మాటలు కాదు, శరీరానికి కావలసిన క్షణికమైన ఓదార్పు మరియు తృప్తి మాత్రమే కాదు గాని మీకు కావలసిందల్లా, నీవు ఏం చేయాలి మరియు నీవు దానిని ఎలా చేయాలి, సత్యం అంటే ఏమిటో అనే విషయాలను దేవుడే నేరుగా మరియు స్పష్టంగా నీకు చెప్పాలి. నీవు దీన్ని అర్థం చేసుకున్న తర్వాత, మీరు కొద్దిపాటి అవగాహన మాత్రమే పొందినప్పటికీ, ఒక మంచి భోజనం తిన్నప్పటికంటే నీ హృదయంలో ఎక్కువ సంతృప్తినికలిగియుండరా? నీ హృదయం సంతృప్తి చెందినప్పుడు, నీ హృదయం మరియు నీ పూర్తి జీవము నిజమైన విశ్రాంతి పొందదా? ఈ సారూప్యత మరియు విశ్లేషణ ద్వారా, “మనుష్య కుమారుడు విశ్రాంతిదినమునకు ప్రభువైయున్నాడనెను” అనే వాక్యాన్ని నేను మీతో ఎందుకు పంచుకోవాలనుకుంటున్నానో మీకు ఇప్పుడు అర్థమైందా? దీని అర్థం ఏమిటంటే, దేవుని నుండి వచ్చినవి, ఆయన ఏమి కలిగియున్నాడు మరియు ఆయన ఏమైయున్నాడు మరియు ఆయన గురించిన ప్రతి ఒక్క విషయం అనే ఈ అంశాలన్నీ నీవు ఒకప్పుడు అత్యంత విలువైనదిగా విశ్వసించిన అంశముకంటే లేదా వ్యక్తితో సహా మరే ఇతర అంశం కంటే కూడా చాలా గొప్పగా ఉంటాయని అర్థం. సరిగ్గా చెప్పాలంటే, దేవుని నోట నుండి వచ్చిన వాక్కులను ఒక వ్యక్తి పొందుకోకలేకపోతే, లేదా వారు ఆయన చిత్తం అర్థం చేసుకోలేకపోతే, వారు విశ్రాంతిని పొందుకోలేరు. మీరు ఈ రోజున ఈ వాక్య భాగాన్ని చూడాలని నేను ఎందుకు కోరుకున్నానో మీరు మీ భవిష్యత్తు అనుభవాల్లో అర్థం చేసుకుంటారు, ఎందుకంటే, ఇది చాలా ముఖ్యమైనది. దేవుడు చేసేదంతా సత్యము మరియు జీవమునైయున్నది. సత్యము అనేది మనుష్యులు వారి జీవితాల్లో కొరత కలిగియుండేది కాదు మరియు అది లేకుండా వారు ఏది కూడా చేయలేనిది; అదొక గొప్ప విషయం అని కూడా మీరు చెప్పవచ్చు. నీవు దానిని చూడలేనప్పటికీ లేదా స్పృశించలేనప్పటికీ, నీకది నీవు విస్మరించలేనంత ప్రాముఖ్యమైనది; ఈ ఒక్కటి మాత్రమే నీ హృదయానికి విశ్రాంతిని కలుగజేయగలదు.

సత్యం గురించిన మీ అవగాహన మీ స్వంత స్థితిగతులతో ఏకీకృతం చేయబడిందా? నిజ జీవితంలో, నీవు ఎదుర్కొన్న వ్యక్తులు, సంఘటనలు మరియు విషయాలతో ముడిపడిన సత్యాలు గురించి నీవు ముందుగా ఆలోచించాలి; ఈ సత్యాల్లో నీవు దేవుని చిత్తం కనుగొనగలవు మరియు మీరు ఎదుర్కొన్న వాటిని ఆయన చిత్తంతో అనుసంధానము చేయగలరు. నీవు ఎదుర్కొన్న విషయాలకు సత్యంలోని ఎటువంటి అంశాలు సంబంధము కలిగియున్నాయో నీకు తెలుసుకోకుండా నీవు నేరుగా దేవుని చిత్తాన్ని అన్వేషించడానికి వెళ్తే, అది ఫలితాలు సాధించలేని గుడ్డి విధనమవుతుంది. సత్యాన్ని అన్వేషించడంతోపాటు దేవుని చిత్తం అర్థం చేసుకోవాలని మీరు భావిస్తే, ఎలాంటి అనుభవాలు నీకు అనుభవంలోకి వచ్చాయి, అవి సత్యములోని ఎటువంటి అంశాలకు సంబంధించినవోననిపరిశీలించడంతోపాటు దేవుని వాక్యంలోని నిర్దిష్ట సత్యం కోసం ముందుగా మీరు అన్వేషించాలి. ఆ తర్వాత, ఆ సత్యములోని మీకు తగిన, అభ్యసించే మార్గము కోసం మీరు ఎదురు చూస్తారు; ఈ విధంగా, దేవుని చిత్తాన్ని నీవు పరోక్షంగా అర్థం చేసుకోవచ్చు. సత్యాన్ని శోధించడం మరియు ఆచరించడం అనేది యాంత్రికంగా ఒక సిద్ధాంతాన్ని వర్తింపజేయడమో లేదంటే సూత్రాన్ని అనుసరించడమో కాదు. సత్యం అనేది సూత్రీకరణో, లేదంటే శాస్త్రమో కాదు. అది మరణం లేనిది, అది స్వతఃగా జీవం కలిగినది, అదొక జీవము కలిగినది మరియు సృష్టించబడిన జీవి దాని జీవితంలో తప్పక అనుసరించాల్సిన నియమం అది మరియు మనిషి తన జీవితంలో తప్పక కలిగి ఉండాల్సిన నియమం అది. వీలైనంత వరకు నీవు తప్పక నీ అనుభవం ద్వారా అర్థం చేసుకోవలసిన విషయం అది. నీవు నీ అనుభవంలోని ఏ దశకు చేరుకున్నప్పటికీ, దేవుని వాక్యము నుండి, లేదా సత్యము నుండి నీవు విడదీయలేని వ్యక్తిగానే ఉంటావు మరియు దేవుని స్వభావం గురించి నీవు ఏ మేరకు అర్థం చేసుకున్నావో మరియు దేవుడు ఏమి కలిగియున్నాడు మరియు ఆయన ఏమై ఉన్నాడనే దాని గురించి నీకు తెలిసినవన్నీ దేవుని మాటల్లో వ్యక్తీకరించబడుతాయి; అవన్నీ సత్యంతో విడదీయలేని బంధాన్ని కలిగి ఉన్నాయి. దేవుని స్వభావము మరియు ఆయన ఏమి కలిగియన్నాడో మరియు ఆయన ఏమై ఉన్నాడనేవి సత్యములో భాగమై ఉన్నాయి; సత్యం అనేది దేవుని స్వభావానికి మరియు ఆయన ఏమి కలిగియున్నాడో మరియు ఆయన ఏమై ఉన్నాడనే దానికి అధికారిక ప్రత్యక్షతయైయున్నది. ఆయన ఏమి కలిగియున్నాడో మరియు ఆయన ఏమైయున్నాడో అనే వాటిని సత్యం పటిష్టం చేస్తుంది మరియు ఆయన ఏమి కలిగియున్నాడో మరియు ఆయన ఏమై ఉన్నాడనే వాటిని ఇది స్పష్టంగా ప్రకటిస్తుంది; దేవుడు దేనిని ఇష్టపడతాడు, వేటిని ఇష్టపడడు, నీవేమి చేయాలని ఆయన కోరుకుంటున్నాడు మరియు నీవు ఏమి చేయడానికి ఆయన అనుమతించడు, ఎలాంటి మనుష్యులను ఆయన తృణీకరిస్తాడు మరియు ఏ రకమైన మనుష్యులను ఆయన ఇష్టపడతాడు అనే వాటినన్నిటిని ఇది తెలియజేస్తుంది. దేవుడు వ్యక్తపరిచే స్సత్యాల వెనుక, ఆయన ఆనందం, కోపం, దుఃఖం మరియు సంతోషాలతోపాటు ఆయన గుణలక్షణాలను మనుష్యులు చూడవచ్చు, ఇదే ఆయన స్వభావాన్ని బహిర్గతం చేస్తుంది. దేవుడు ఏమి కలిగి ఉన్నాడు మరియు ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకోవడం మరియు ఆయన వాక్కుల నుండి ఆయన స్వభావం అర్థం చేసుకోవడాన్ని పక్కన పెడితే, ఆచరణాత్మక అనుభవం ద్వారా ఈ అవగాహన సాధించడమే అత్యంత కీలకమైనది. దేవుణ్ణి తెలుసుకునే క్రమములో ఒక వ్యక్తి తన నిజ జీవితం నుండి తనను దూరం చేసుకుంటే, అతను దానిని సాధించలేడు. దేవుని వాక్యము నుండి కొంత అవగాహన పొందగలిగే వ్యక్తులు ఉన్నప్పటికీ, వారి అవగాహన అనేది సిద్ధాంతాలకు మరియు మాటలకు పరిమితం చేయబడుతాయి మరియు దేవుడు నిజంగా ఎలా ఉంటాడనే విషయంలో తారతమ్యం తలెత్తుతుంది.

మనం ఇప్పుడు దేని గురించి చెప్పుకుంటున్నామో అది బైబిలులో నమోదు చేయబడిన కథల పరిధిలోనే ఉంది. ఈ కథల ద్వారాను మరియు జరిగిన ఈ సంఘటనలను గురించి విశ్లేషించడం ద్వారా, దేవుని స్వభావం మరియు ఆయన ఏమి కలిగియున్నాడో మరియు ఆయన వ్యక్తము చేసిన వాటినుండి ఆయన ఏమైయున్నాడో అనే వాటిని గురించి మనుష్యులు అర్థం చేసుకోగలరు. దేవునికి సంబంధించిన ప్రతి అంశాన్ని మరింత విస్తృతంగా, మరింత లోతుగా, మరింత సమగ్రంగా మరియు మరింత క్షుణ్ణంగా తెలుసుకునేలా ఇది వారిని అనుమతిస్తుంది. కానీ, దేవునికి సంబంధించిన ప్రతి అంశం తెలుసుకోవడానికి ఈ కథలు మాత్రమే మార్గమా? కాదు, ఇదొక్కటే మార్గం కాదు! ఎందుకంటే, రాజ్యపు యుగంలో ఆయన చేసే కార్యము మరియు దేవుడు ఏం చెప్పాడు అనేవి ఆయన స్వభావమును తెలుసుకోవడంలో మరియు దాని గురించి మరింత సంపూర్తిగా తెలుసుకోవడంలో మరింత మెరుగ్గా సహాయపడతాయి. అయితే, మనుష్యులకు చిరపరిచితమైన బైబిలులోని కొన్ని ఉదాహరణలు లేదా కథల ద్వారా దేవుని స్వభావం గురించి తెలుసుకోవడం మరియు ఆయన ఏం కలిగి ఉన్నాడు మరియు ఆయన ఏమై ఉన్నాడు అనే దాని గురించి అర్థం చేసుకోవడం కొంచెం సులభంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. ఈ విధంగా నీవు ఆయన గురించి తెలుసుకునేలా చేయడం కోసం తీర్పు, శిక్ష మరియు ఈ రోజున దేవుడు వ్యక్తపరిచే సత్యాలను, పదానికి పదం తీసుకున్నట్లయితే, అప్పుడు నీకు అత్యంత నీరసమైన మరియు అత్యంత దుర్భరమైన భావన కలుగుతుంది. అలాగే, దేవుని వాక్కులన్నీ సూత్రాలలె ఉన్నాయని కూడా కొందరు భావిస్తారు. అయితే, దేవుని స్వభావం తెలుసుకోవడంలో మనుష్యులకు సహాయపడడం కోసం నేను ఈ బైబిలు కథనాలను ఉదాహరణలుగా తీసుకుంటే, అప్పుడు వారు దానిని విసుగ్గా భావించరు. ఈ ఉదాహరణలను వివరిస్తున్నప్పుడు, ఆ సమయంలో దేవుని హృదయంలో ఉన్న వాటి గురించి, అంటే ఆయన మానసిక స్థితి లేదా భావాలు, లేదా ఆయన తలంపులన్నియు మరియు ఆలోచనలన్నియు, మానవ భాషలో మనుష్యులకు చెప్పబడుతాయి. దేవుడు ఏమి కలిగియున్నాడో మరియు ఆయన ఏమై ఉన్నాడనే దానిని మెచ్చుకోవడంతోపాటు ఇదేమీ సూత్రప్రాయమైనది కాదని, ఇదేమీ కాల్పానికమో, లేదంటే మనుష్యులు చూడలేనిదో లేదా తాకలేనిదో కాదని భావించేలా మనుష్యులను అనుమతించడమే దీనంతోటి యొక్క లక్ష్యం. ఇది నిజంగా ఉనికిలో ఉన్నటువంటి విషయమై ఉన్నది. దీనిని మనుష్యులు అనుభూతి చెందవచ్చు మరియు అభినందించవచ్చు. ఇదే దీని అంతిమ లక్ష్యం. ఈ యుగంలో జీవించే మనుష్యులు ధన్యులని మీరు చెప్తారు. దేవుని మునుపటి కార్యమును విస్తృతంగా అర్థం చేసుకోవడానికి వారు బైబిలు కథలు ఉపయోగించగలరు; ఆయన చేసిన కార్యము ద్వారా వారు ఆయన స్వభావం చూడగలరు; మానవాళిపట్ల దేవుని చిత్తాన్ని ఆయన వ్యక్తం చేసిన ఈ స్వభావాల ద్వారా వారు అర్థం చేసుకోగలరు మరియు ఆయన పరిశుద్ధత మరియు మనుష్యులపట్ల ఆయన శ్రద్ధకు సంబంధించిన నిర్దిష్ట వ్యక్తీకరణలను వారు అర్థం చేసుకోగలరు మరియు ఈ విధంగా వారు దేవుని స్వభావం గురించి మరింత వివరంగా తెలుసుకోగలరు మరియు లోతైన జ్ఞానం సాధించగలరు. మీరందరూ ఇప్పుడు దీనిని అనుభూతి చెందుతారని నేను విశ్వసిస్తున్నాను!

కృపా యుగంలో ప్రభువైన యేసు పూర్తి చేసిన కార్యపు పరిధిలో, దేవుడు కలిగి ఉన్నదేమిటి మరియు ఆయన ఏమై ఉన్నాడనే దానికి సంబంధించిన మరొక కోణం నీవు చూడవచ్చు. ఆయన ధరించిన శరీరము ద్వారా ఇది వ్యక్తీకరించబడింది మరియు ఆయన మనిషిగా అవతరించిన కారణంగా మనుష్యులు దీనిని చూడగలిగారు మరియు అభినందించగలిగారు. దేవుడు శరీరధారిగా మనుష్య కుమారునిలో ఎలా జీవిస్తున్నాడో మనుష్యులు చూశారు మరియు శరీరము ద్వారా వ్యక్తీకరించబడిన దేవుని దైవత్వాన్ని వారు చూశారు. ఈ రెండు రకాల వ్యక్తీకరణలనేవి మనుష్యులు నిజమైన దేవుణ్ణి చూసేందుకు అనుమతించాయి మరియు దేవుని గురించిన భిన్నమైన భావనను ఏర్పరచుకోవడానికి అవి మనుష్యులను అనుమతించాయి. అయినప్పటికీ, ప్రపంచపు సృష్టి మొదలుకొని ధర్మశాస్త్ర యుగం అంతమయ్యే వరకు ఉన్నటువంటి కాల వ్యవధిలో, అంటే కృపా యుగానికి ముందు వరకు దేవుడు చేసిన కార్యములు మరియు ఆయన చెప్పినవన్నీ ఒక భౌతికేతర రూపంలోనే మనుష్యులు చూశారు, వాటిని గురించి విన్నారు మరియు అనుభూతి చెందారు. అలాగే, ఆయన ఒక మనిషి రూపంలో వ్యక్తీకరించిన వేటినీ మనుష్యులు అప్పటివరకు వీక్షించలేదు లేదా స్పృశించలేదు. తరచుగా, ఈ విషయాల కారణంగానే, దేవుడు తనదైన గొప్పతనంలో అత్యంత మహోన్నతంగా ఉంటాడని భావించేటటువంటి మనుష్యులు ఆయనను సమీపించలేకపోయారు. దీంతో, దేవుణ్ణి గ్రహించే వారి సామర్థ్యంలో ఆయన లోపల మరియు బయట మెరిసిపోతుంటాడని దేవుని గురించి మనుష్యుల్లో ఏర్పడిన అభిప్రాయం. అలాగే, ఆయన భావనలు మరియు ఆలోచనలు ప్రతి ఒక్కటీ అత్యంత రహస్యంగా మరియు అంతుచిక్కనివిగా ఉంటాయనీ, వాటిని చేరుకునే మార్గమే లేదనీ, వాటిని అర్థం చేసుకోవడానికి మరియు అభినందించడానికి కూడా కొద్దిమందే ప్రయత్నించారని కూడా మనుష్యులు భావించారు. మనుష్యుల దృష్టిలో దేవుని గురించిన ప్రతిదీ సుదూరమైనది. మనుష్యులు దానిని చూడలేనంతగా, తాకలేనంతగా దూరమైనది. ఆయన ఆకాశంలో చాలా ఎత్తులో ఉన్నట్లుగా కనిపిస్తాడు మరియు అస్సలు ఉనికిలోనే లేనట్లుగా అనిపిస్తాడు. కాబట్టి మనుష్యుల దృష్టిలో దేవుని హృదయం మరియు మనస్సును లేదా ఆయన ఆలోచనల్లోని దేనినైనా అర్థం చేసుకోవడం సాధ్యం కానిది మరియు అది వారి పరిధికి మించినది. ధర్మశాస్త్ర యుగంలో దేవుడు కొంత నిర్దిష్ట కార్యము చేసినప్పటికీ, కొన్ని నిర్దిష్ట వాక్యములు ఉచ్ఛరించినప్పటికీ, తన గురించిన వాస్తవ జ్ఞానాన్ని మెచ్చుకునేలా మరియు అందులో కొంత గ్రహించేలా మనుష్యులను అనుమతించడం కోసం దేవుడు కొన్ని నిర్దిష్ట స్వభావాలు వ్యక్తం చేసినప్పటికీ, దేవుడు ఏం కలిగి ఉన్నాడు మరియు ఆయన ఏమై ఉన్నాడనే ఈ వ్యక్తీకరణలనేవి చివరకు పదార్థము కానటువంటి ప్రపంచం నుండి వచ్చినవిగానే ఉండడంతోపాటు దేవుడు ఏం కలిగి ఉన్నాడు మరియు ఆయన ఏమై ఉన్నాడనే దానికి సంబంధించి మనుష్యులు అర్థం చేసుకున్నది మరియు వారికి తెలిసినదంతా దైవాంశంగానే ఉండిపోయింది. ఆయన ఏమి కలిగియున్నాడు మరియు ఆయన ఏమై ఉన్నాడనే దానికి సంబంధించిన ఈ వ్యక్తీకరణ నుండి వాళ్లు ఒక నిర్దిష్ట భావనను పొందలేకపోయారు మరియు దేవుడు గురించిన వారి అభిప్రాయం అనేది ఇప్పటికీ, “అది సమీపించడానికి కష్టతరమైన ఒక ఆత్మ సంబంధిత అంశం, జ్ఞానానికి లోపల మరియు వెలుపల అది ప్రకాశిస్తూ ఉంటుంది” అనే స్థాయిలోనే చిక్కుకుపోయింది. మనుష్యులకు కనిపించడం కోసం భౌతిక ప్రపంచానికి చెందిన ఒక నిర్దిష్ట వస్తువునో ప్రతిమనో దేవుడు ఉపయోగించని కారణంగా, మనుష్యలు మానవ భాషతో ఆయన్ని నిర్వచించలేకపోయారు. మనుష్యుల హృదయాల్లో మరియు ఆలోచనల్లో వారు ఎల్లప్పుడూ వారి సొంత భాషతో దేవుని కోసం ఒక విలువను వ్యవస్థాపించడానికి, ఆయన్ని ప్రత్యక్షంగా మార్చడానికి మరియు ఆయన్ని మానుష్య రూపంలోకి మార్చడానికి కోరుకుంటారు. అంటే, ఆయన ఎంత ఎత్తుగా ఉంటాడో, ఎంత పెద్దగా ఉంటాడో, నిజంగా ఆయనకి ఏమి ఇష్టమో మరియు ఆయన వ్యక్తిత్వము ఎలా ఉంటుందో వర్ణించాలనుకుంటారు. నిజానికి, మనుష్యులు ఈ విధంగానే ఆలోచిస్తున్నారని దేవునికి తన హృదయములో తెలుసు. మనుష్యుల అవసరాల విషయంలో ఆయన చాలా స్పష్టంగా ఉన్నాడు మరియు తానేం చేయాలో కూడా ఆయనకు తెలుసు. కాబట్టే, కృపా యుగంలో ఆయన తన కార్యాన్ని మరొక విధంగా నిర్వహించాడు. ఈ కొత్త మార్గం అనేది దైవత్వము మరియు మానవత్వము అనే ఈ రెండింటికి సంబంధించినదిగా ఉండెను. ప్రభువైన యేసు కార్యమును జరిగించు కాలంలో, దేవుడు అనేకమైన మానవ వ్యక్తీకరణలను కలిగియున్నాడని మనుష్యులు చూడగలిగారు. ఉదాహరణకు, ఆయన నర్తించగలడు, ఆయన వివాహాలకు హాజరుకాగలడు, ఆయన ప్రజలతో మాట్లాడగలడు, వారితో ఇతరత్రా విషయాల గురించి చర్చించగలడు. దానికితోడు, ప్రభువైన యేసు తన దైవత్వానికి ప్రాతినిధ్యం వహించే కార్యమును కూడా ఎంతో ఎక్కువగా పూర్తి చేసాడు మరియు నిజానికి ఈ కార్యమంతా దేవుని స్వభావపు వ్యక్తీకరణ మరియు ప్రత్యక్షతయైయుండెను. ఇదే సమయంలో, జనులు చూడగలిగే మరియు స్పర్శించగలిగేలా సాధారణ శరీర రూపంలో దేవుని దైవత్వం కనిపించడంతో, లోపల మరియు బయట మాత్రమే దేవుడు ప్రకాశిస్తున్నట్లుగా వారు భావించలేదు, లేక తాము ఆయన్ని సమీపించలేమనే భావన కూడా వారికి అనిపించలేదు. దానికి బదులుగా, మనుష్య కుమారుడి ప్రతి కదలిక ద్వారా, మాటల ద్వారా మరియు జరిగించు కార్యము ద్వారా దేవుని చిత్తం గ్రహించడానికి లేదా ఆయన దైవత్వాన్ని అర్థం చేసుకోవడానికి వారు ప్రయత్నం చేయవచ్చు. శరీరధారియైన మనుష్య కుమారుడు తన మానవత్వం ద్వారా దేవుని దైవత్వమును వ్యక్తమును వ్యక్తం చేశాడు మరియు మానవాళికి దేవుని చిత్తాన్ని తెలియజేసాడు. దేవుని చిత్తాన్ని మరియు స్వభావాన్ని తన వ్యక్తీకరణతో తెలియజేయడం ద్వారా, ఆధ్యాత్మిక ప్రపంచములో నివసించే దేవుణ్ణి, అంటే కంటికి కనబడని, ముట్టుకోవడానికి కానటువంటి దేవుణ్ణి కూడా ఆయన ప్రజలకు బయలుపరిచాడు. తద్వారా, ప్రత్యక్షమైన రూపంలోని దేవుణ్ణి, రక్త మాంసములు కలిగిన శరీరధారియైన దేవుణ్ణి ప్రజలు చూశారు. ఈ విధంగా, దేవుని గుర్తింపును, దేవుని హోదా, స్వరూపం, స్వభావం మరియు ఆయన ఏమి కలిగియున్నాడు మరియు ఆయన ఏమై ఉన్నాడు మరియు వాస్తవమైన మానవ జీవితమనే అంశాలను శరీరధారియైన మనుష్య కుమారుడు నిర్దిష్టంగా తెలియజేశాడు. దేవుని స్వరూపం, ఆయన గుణగణాలు మరియు ఆయన కలిగి ఉన్నవేమిటి మరియు ఆయన ఏమై ఉన్నాడనే వాటికి సంబంధించి మనుష్యకుమారునికి కొన్ని పరిమితులు ఉన్నప్పటికినీ, దేవుని గుర్తింపును మరియు ఆయన హోదాకు సంపూర్ణంగా ప్రాతినిధ్యం వహించగలిగాడు. అయితే, అవన్నీ వ్యక్తీకరణ రూపంలోని కొన్ని తేడాలు మాత్రమే కలిగి ఉన్నాయి. అయినప్పటికీ, మనుష్య కుమారుడు తన మానవత్వంలోను మరియు దైవత్వంలోను రెండింటి విషయంలోనూ దేవుని గుర్తింపును మరియు హోదాను సూచించడాన్ని మనం తిరస్కరించలేము. అయితే, ఇదే సమయంలో, దేవుడు శరీరము ద్వారా కార్యము చేశాడు, శరీర దృక్పథం నుండే మాట్లాడాడు మరియు మనుష్య కుమారుడనే గుర్తింపు మరియు స్థాయితోనే మానవజాతి ఎదుట నిలిచాడు. ఈ విధంగా ఉండడం ద్వారా మనుష్యుల మధ్యలో చెప్పబడిన దేవుని నిజమైన మాటలను మరియు జరిగించబడిన ఆయన కార్యమును చూసే అవకాశము మరియు వాటిని అనుభవించే అవకాశం ప్రజలకు దక్కింది. ఆయన తగ్గింపులో ఆయన దైవత్వం మరియు ఆయన గొప్పతనం గురించిన అంతర్దృష్టిని కూడా ఇది మనుష్యులకు అందించింది. అలాగే, దేవునికి సంబంధించిన ప్రామాణికత మరియు వాస్తవికత గురించి ఒక ప్రాథమిక అవగాహనను మరియు నిర్వచనాన్ని పొందుకొవడానికి కూడా ఇది అనుమతించింది. ప్రభువైన యేసు ద్వారానే కార్యము పూర్తయినప్పటికీ, ఆయన పని చేసిన మార్గాలు, ఆయన ఏ దృక్పథంతో మాట్లాడాడు అనేవి ఆత్మ సంబంధిత ప్రపంచంలోని దేవుని వాస్తవిక వ్యక్తి నుండి భిన్నంగా ఉన్నప్పటికీ, ఆయన గురించిన ప్రతి ఒక్కటీ మానవజాతి అదివరకు ఎప్పుడూ చూడని దేవునికే నిజమైన ప్రాతినిధ్యం వహిస్తాయి, ఈ విషయాన్ని ఉపేక్షించలేము! సరిగ్గా చెప్పాలంటే, దేవుడు ఏ రూపంలో కనిపించినప్పటికీ, ఆయన ఏ దృష్టికోణంతో మాట్లాడినప్పటికీ, లేదంటే మానవాళికి ఆయన ఏ రూపంలో కనిపించినప్పటికీ, దేవుడు తనకు తప్ప ఇక దేనికీ ప్రాతినిధ్యం వహించడు. ఆయన ఏ ఒక్క మనిషికో, లేదంటే భ్రష్టుపట్టిన మానవజాతికో ప్రాతినిధ్యం వహించడు. దేవుడు దేవుడే. మరియు ఇది ఉపేక్షించలేనిది.

తదుపరి, కృపా యుగంలో యేసు ప్రభువు చెప్పిన ఒక ఉపమానమును మనం పరిశీలిద్దాం.

3. తప్పిపోయిన గొర్రెపిల్లకు సంబంధించిన ఉపమానము

మత్తయి 18:12-14 మీకేమి తోచును? ఒక మనుష్యునికి నూరు గొఱ్ఱెలుండగా వాటిలో ఒకటి తప్పిపోయినయెడల తొంబదితొమ్మిదింటిని కొండల మీద విడిచివెళ్లి తప్పిపోయినదానిని వెదకడా? వాడు దాని కనుగొనినయెడల తొంబదితొమ్మిది గొఱ్ఱెలను గూర్చి సంతోషించు నంతకంటె దానిని గూర్చి యెక్కువగా సంతోషించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆలాగుననే ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు.

ఈ వాక్య భాగము ఒక ఉపమానమైయున్నది, ఇది జనులకు ఎలాంటి భావనను అందిస్తుంది? ఇక్కడ ఈ ఉపమానములో ఉపయోగించిన వ్యక్తీకరణ విధానము అనేది మానవ భాషలో అలంకార భాషయైయున్నది మరియు ఇది మానవ పరిజ్ఞానం పరిధిలోకి వస్తుంది. ధర్మశాస్త్ర యుగంలో దేవుడు ఇలాంటిదే ఏదైనా ఒకటి చెప్పినట్లయితే, ఆ మాటలనేవి నిజంగా ఉన్నటువంటి దేవునికి అనుగుణంగా లేవని మనుష్యులు భావించేవారు. అయితే, కృపా యుగంలో మనుష్య కుమారుడు ఈ మాటలు చెప్పినప్పుడు, అది జనులకు ఆదరణను, ఓదార్పును మరియు వారికి సన్నిహితమైనదనే భావనను కలిగించింది. దేవుడు శరీరధారిగా అయినప్పుడు, ఆయన ఒక మనిషి రూపంలో కనిపించినప్పుడు, ఆయన తన గుండెల్లోని స్వరాన్ని వ్యక్తీకరించడం కోసం తన స్వంత మానవత్వం నుండి వచ్చిన అత్యంత సముచితమైన ఉపమానమును చెప్పాడు. ఈ స్వరం దేవుని స్వంత స్వరాన్ని మరియు ఆ యుగంలో ఆయన చేయాలనుకున్న కార్యమును సూచిస్తుంది. కృపా యుగంలో మనుష్యులపట్ల దేవుడు కలిగియున్న ధోరణిని కూడా ఇది సూచిస్తుంది. జనులపట్ల దేవుడు కలిగియున్న దృక్పథం నుండి చూస్తే, ఆయన ప్రతి వ్యక్తిని ఒక గొర్రెతో పోల్చాడు. ఆ గొర్రెల్లో ఒకటి తప్పిపోతే, దాన్ని కనుగొనడం కోసం ఆయన ఎంతైనా చేస్తాడు. మానవజాతి మధ్యలో, ఆ సమయంలో, దేవుడు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన కార్యపు నియమాన్ని ఇది సూచిస్తుంది. ఆ కార్యములో ఆయన సంకల్పమును మరియు స్వభావమును గురించి వివరించడం కోసం దేవుడు ఈ ఉపమానమును ఉపయోగించాడు. దేవుడు శరీరము ధరించడంవల్ల కలిగే ప్రయోజనం ఇది: మానవజాతి జ్ఞానాన్ని ఆయన ఉపయోగించుకోగలడు మరియు జనులతో మాట్లాడటానికి మరియు తన చిత్తాన్ని వ్యక్తీకరించడానికి ఆయన మానవ భాష ఉపయోగించగలడు. మనుష్యులు అర్థం చేసుకోవడానికి కష్టపడిన తన గాఢమైన, దైవిక భాషను మానవ భాషలో, మానవుల మార్గంలో ఆయన మనిషికి వివరించాడు లేదా “అనువదించాడు”. మనుష్యులు ఆయన చిత్తం అర్థం చేసుకోవడానికి మరియు ఆయన ఏం చేయాలనుకుంటున్నాడో తెలుసుకోవడానికి ఇది సహాయపడింది. ఆయన మానవ దృష్టికోణము నుండి జనులతో సంభాషించగలడు, మానవ భాషను ఉపయోగించుకొని, వారు అర్థం చేసుకునే రీతిలో జనులకు వివరించి చెప్పగలడు. ఆయన మానవ భాషను మరియు మానవ జ్ఞానం ఉపయోగించి మాట్లాడగలడు మరియు పని చేయగలడు. తద్వారా, మనుష్యులు దేవుని దయను మరియు దేవుని స్నేహమును అనుభవించగలరు. తద్వారా, వారు ఆయన హృదయాన్ని చూడగలరు. మీరు ఇందులో ఏం చూస్తున్నారు? దేవుని మాటలలో మరియు ఆయన క్రియలలో ఏదైనా నిషేధించబడినట్లుగా ఉందా? మనుష్యులు దానిని ఎలా చూస్తారంటే, దేవుడు స్వయంగా ఏం చెప్పాలనుకుంటున్నాడో, ఆయన చేయాలనుకునే పని గురించి లేదా తన స్వంత చిత్తం వ్యక్తీకరించడానికి మనిషి జ్ఞానం, భాష లేదా మాట్లాడే తీరును దేవుడు ఉపయోగించలేడనే విధంగా చూస్తారు. కానీ, ఇది తప్పుడు ఆలోచన. దేవుడు ఈ రకమైన ఉపమానమును ఉపయోగించడం ద్వారా, దేవుని వాస్తవికతను మరియు నిజాయితీని మనుష్యులు అనుభూతి చెందగలిగారు మరియు ఆ సమయంలో మనుష్యులపట్ల ఆయన వైఖరిని చూడగలిగారు. ఈ ఉపమానము అనేది చాలా కాలంగా ధర్మశాస్త్రం ప్రకారం జీవిస్తున్న ప్రజలను వారి కల నుండి మేల్కొల్పింది మరియు కృపా యుగంలో నివసించిన తరం తర్వాత తరానికి ఇది స్ఫూర్తిని అందించింది. ఈ ఉపమానము భాగం చదవడం ద్వారా, మానవాళిని రక్షించడంలో దేవుని చిత్తశుద్ధిని మనుష్యులు తెలుసుకుంటారు మరియు దేవుని హృదయంలో మానవాళికి ఇవ్వబడిన భారము మరియు ప్రాముఖ్యతను వారు అర్థం చేసుకుంటారు.

ఈ భాగంలోని చివరి వాక్యాన్ని మనం పరిశీలిద్దాం: “ఆలాగుననే ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు” ఇది యేసు ప్రభువు స్వంత వాక్కులా లేదంటే పరలోకంలోని తండ్రి మాటలా? పైపైన చూసినప్పుడు, ఈ మాటలు యేసు ప్రభువు మాట్లాడుతున్నట్లుగా అనిపిస్తుంది. కానీ, ఆయన చిత్తం అనేది దేవుని చిత్తాన్ని సూచిస్తుంది. ఆ కారణంగానే, ఆయన: “ఆలాగుననే ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు” అని అన్నాడు. ఆ కాలంలోని ప్రజలు పరలోకములోని తండ్రిని మాత్రమే దేవునిగా అంగీకరించారు మరియు వారి కళ్ల ముందు కనిపించిన ఈ వ్యక్తిని ఆయన ద్వారా పంపబడినట్లుగానే చూశారు. అలాగే, పరలోకమందున్న తండ్రికి ఆయన ప్రాతినిధ్యం వహించలేడని విశ్వసించారు. అందుకే, ఈ ఉపమానము చివర్లో ఈ వాక్యాన్ని యేసు ప్రభువు జోడించాల్సి వచ్చింది. తద్వారా, మానవజాతిపట్ల దేవుని నిజమైన చిత్తాన్ని మనుష్యులు అనుభూతి చెందుతారు మరియు ఆయన చెప్పిన దాని ప్రామాణికతను మరియు ఖచ్చితత్వాన్ని అనుభూతి చెందుతారు. నిజానికి, ఈ వాక్యం చెప్పడమనేది అత్యంత సులభమైన విషయమే అయినప్పటికీ, ఇది శ్రద్ధతో మరియు ప్రేమతో చెప్పబడింది మరియు ప్రభువైన యేసు వినయాన్ని మరియు తనను తాను మరుగుపరచుకునే తత్వాన్ని బహిర్గతం చేసింది. దేవుడు మానవ రూపం ధరించాడా లేదంటే ఆయన ఆత్మ సంబంధిత ప్రపంచంలో పనిచేశాడా అనే దానితో సంబంధం లేకుండా, మానవ హృదయం గురించి ఆయనకు బాగా తెలుసు మరియు ప్రజలకు ఏం అవసరమో ఆయన బాగా అర్థం చేసుకున్నాడు, మనుష్యులు దేని గురించి ఆందోళన చెందుతున్నారో మరియు వారిని గందరగోళపరుస్తున్నదేమిటో ఆయనకు తెలుసు. అందుకే, ఆయన ఈ వాక్యం జోడించాడు. మానవజాతిలో దాగివున్న ఒక సమస్యను ఈ వాక్యం ఎత్తి చూపింది: మనుష్య కుమారుడు చెప్పినదాని గురించి మనుష్యులు సందేహించారు. అందుకే, యేసు ప్రభువు మాట్లాడుతున్నప్పుడు ఆయన: “ఆలాగుననే ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తముకాదు” అని చెప్పాల్సి వచ్చింది మరియు ఈ నేపథ్యంలో మాత్రమే, ప్రజలు వారి ఖచ్చితత్వాన్ని విశ్వసించేలా చేయడంలో మరియు వారి విశ్వసనీయతను మెరుగుపరచడంలో ఆయన మాటలు ఫలించగలవు. దేవుడు ఒక సాధారణ మనుష్య కుమారుడిగా మారినప్పుడు, దేవుడు మరియు మానవజాతి మధ్య బంధం అత్యంత సంక్లిష్టంగా ఉందనీ మరియు మనుష్య కుమారుడి పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉందనీ ఇది చూపిస్తుంది. అలాగే, ఆ సమయంలో ప్రభువైన యేసు హోదా అనేది మనుష్యుల మధ్యలో ఎంతటి అల్పమైనదిగా ఉందో కూడా ఇది చూపిస్తుంది. ఆయన ఇలా చెప్పినప్పుడు, నిజానికి, ఆయన మనుష్యులతో: మీరు నిశ్చింతగా ఉండవచ్చు, ఈ వాక్కులు నా స్వంత హృదయంలో ఉన్నదానిని సూచించవు. కానీ, ఇవి మీ హృదయాల్లోని దేవుని చిత్తాన్ని సూచిస్తాయి అని చెప్పాల్సి వచ్చింది. మానవాళికి సంబంధించి ఇదొక పరిహాసమైన విషయం కాదా? దేవుడు శరీరధారిగా కార్యము చేసినప్పుడు, తన వ్యక్తిత్వంలోలేని అనేక ప్రయోజనాలను ఆయన కలిగి ఉన్నప్పటికీ, వారి సందేహాలు మరియు తిరుగుబాటుతోపాటు వారి మొద్దుబారిపోయిన తీరును మరియు మందబుద్ధిని సైతం ఆయన భరించాల్సి వచ్చింది. మనుష్య కుమారుని కార్యము యొక్క ప్రక్రియ అనేది మానవజాతి యొక్క తిరుగుబాటును అనుభవించే మరియు ఆయన మీద వారి పోటీని అనుభవించే ప్రక్రియ అని చెప్పవచ్చు. అంతకుమించి, మానవజాతి విశ్వాసాన్ని నిరంతరం గెలుచుకోవడానికి మరియు ఆయన ఏమి కలిగియున్నాడో మరియు ఆయన ఏమై ఉన్నాడనే దాని ద్వారా, ఆయన స్వంత గుణగణాల ద్వారా మానవాళిని జయించడానికి నిరంతరం కృషి చేసే ప్రక్రియ అని చెప్పవచ్చు. శరీరధారియైన దేవుడు భూమి మీద సాతానుకు వ్యతిరేకంగా యుద్ధం చేయడం కూడా కాదు; దేవుడు ఒక సాధారణ మనిషి రూపం ధరించాడు మరియు తనను అనుసరించే వారితో పోరాటం ఆరంభించాడు మరియు ఈ పోరాటంలో మనుష్య కుమారుడు తన వినయంతో, ఆయన ఏమి కలిగియున్నాడనే మరియు ఆయన ఏమై ఉన్నాడనే దానితో మరియు ఆయన ప్రేమ మరియు ఆయన జ్ఞానంతో తన కార్యము పూర్తి చేశాడు. తాను కోరుకున్న వ్యక్తులను ఆయన పొందుకున్నాడు. తాను అర్హమైన గుర్తింపును మరియు స్థాయిని ఆయన గెలుచుకున్నాడు మరియు తన సింహాసనానికి తిరిగి “చేరుకున్నాడు”.

తరువాత, మనం పవిత్ర గ్రంథంలోని క్రింది రెండు భాగాలు గురించి చూద్దాం.

4. డెబ్బది ఏళ్ల మారుల మట్టుకని క్షమించు

మత్తయి 18:21-22 ఆ సమయమున పేతురు ఆయనయొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నాయెడల తప్పిదము చేసినయెడల నేనెన్నిమారులు అతని క్షమింపవలెను? ఏడు మారులమట్టుకా? అని అడిగెను. అందుకు యేసు అతనితో ఇట్లనెను, ఏడుమారులుమట్టుకే కాదు, డెబ్బది ఏళ్ల మారులమట్టుకని నీతో చెప్పుచున్నాను.

5. ప్రభువు ప్రేమ

మత్తయి 22:37-39 అందుకాయన, నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణమనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననునదియే. ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దానివంటిదే.

ఈ రెండు భాగాల్లో, ఒకటి క్షమాగుణం గురించి మరియు మరొకటి ప్రేమ గురించి చెబుతుంది. కృపా యుగంలో యేసు ప్రభువు నిజంగా చేయాలనుకున్న పనిని ఈ రెండు అంశాలు ప్రముఖంగా పేర్కొంటాయి.

దేవుడు శరీరధారిగా మారినప్పుడు, ఆయన తన కార్యపు ఒక దశను తనతోపాటు తీసుకొచ్చాడు. నిర్దిష్ట కార్యము కోసం చేయాల్సిన పనులు మరియు ఈ యుగంలో ఆయన వ్యక్తీకరించాలనుకున్న స్వభావం అందులో భాగమై ఉన్నాయి. ఆ కాలంలో, మనుష్య కుమారుడు చేసిన ప్రతి ఒక్కటీ ఆ యుగంలో దేవుడు చేయాలనుకున్న కార్యము చుట్టూ తిరుగుతుంది. అంతకుమించి ఆయన ఎక్కువ కార్యము గాని మరియు తక్కువ కార్యము గాని చేయడు. ఆయన చెప్పిన ప్రతి విషయం మరియు ఆయన నిర్వహించే ప్రతి పని ఆ యుగానికి సంబంధించినది. ఆయన దానిని మానవ భాషతో లేదా దైవిక భాష ద్వారా వ్యక్తీకరించాడా లేదా అనే దానితో సంబంధం లేకుండా, మరియు ఆయన ఏ మార్గంలో చేసినప్పటికీ, లేదా ఏ దృష్టికోణము నుండి అది చేసినప్పటికీ, ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు, ఆయన చిత్తం ఏమిటి, మనుష్యుల నుండి ఆయనకు అవసరమైనది ఏమిటి అనేది అర్థం చేసుకోవడంలో మనుష్యులకు సహాయం చేయడమే ఆయన లక్ష్యం. ఆయన చిత్తాన్ని మనుష్యులు అర్థం చేసుకునేలా మరియు తెలుసుకునేలా సహాయపడడానికి మరియు మానవాళిని రక్షించే ఆయన పనిని వారు అర్థం చేసుకోవడానికి ఆయన వివిధ మార్గాలు మరియు విభిన్న దృష్టికోణాలను ఉపయోగించవచ్చు. కాబట్టే, కృపా యుగంలో మానవజాతికి తెలియజేయాలనుకుంటున్న విషయాన్ని వ్యక్తీకరించడానికి యేసు ప్రభువు ఎక్కువ సమయం మానవ భాషను ఉపయోగించడం మనం చూస్తాము. అంతకుమించి, ఆయన ప్రజలతో మాట్లాడడం, వారి అవసరాలు తీర్చడం మరియు వారు కోరిన విధంగా సహాయం చేయడాన్ని బట్టి, ఆయన్ని మనం ఒక సాధారణ మార్గదర్శి కోణంలో చూస్తాము. కృపా యుగానికి ముందునాటి ధర్మశాస్త్ర యుగంలో ఇలాంటి పని విధానం కనిపించలేదు. మానవజాతితో ఆయన మరింత సన్నిహితంగా మరియు మరింత కనికరంతో ఉన్నాడు. అలాగే, రూపం మరియు పద్ధతి రెండింటిలోనూ ఆయన ఆచరణాత్మక ఫలితాలు సాధించగలిగాడు. మనుష్యులను డెబ్బది ఏళ్ల మారుల మట్టుకని క్షమించడమనే ఉపమానము నిజంగా ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది. యేసు ప్రభువు ఈ విధంగా చెప్పిన సమయంలో ఆయన ఉద్దేశం అర్థం చేసుకునేలా మనుష్యులను అనుమతించడమే ఈ ఉపమానములోని సంఖ్య ద్వారా సాధించబడిన ఉద్దేశ్యం. మనుష్యులు ఇతరులను క్షమించాలనేదే ఆయన ఉద్దేశం, అంటే అది ఒకసారో, లేదా రెండుసార్లో కాదు, ఏడుసార్లు కూడా కాదు. డెబ్బది ఏళ్ల మారుల మట్టుకు క్షమించాలి. “డెబ్బది ఏళ్ల మారుల మట్టుకు క్షమించాలి” అనే ఆలోచనలో ఎలాంటి ఆలోచన ఉంది? క్షమించడాన్ని మనుష్యులు వారి స్వంత బాధ్యతగా భావించేలా చేయడం, వారు నేర్చుకోవలసినది మరియు వారు కట్టుబడి ఉండవలసిన “విధానం” ఇదే. ఇది కేవలం ఉపమాన అలంకారమైనప్పటికీ, కీలకమైన అంశానికి ప్రాముఖ్యత అందించడానికి ఇది ఉపయోగపడింది. మనుష్యులు ఆయన ఉద్దేశ్యాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి మరియు అభ్యాసానికి సరైన మార్గాలు మరియు అభ్యాస సూత్రాలు మరియు ప్రమాణాలను కనుగొనడంలో ఇది సహాయపడింది. మనుష్యులు స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ఈ ఉపమానము సహాయపడింది మరియు వారికి సరైన భావనను అందించింది, వారు క్షమించడం నేర్చుకోవాలి మరియు బేషరతుగా ఎన్నిసార్లు అయినా క్షమించాలి. అయితే, అది ఇతరులపట్ల సహనంతోను మరియు వారిని అర్థం చేసుకునే వైఖరితో ఉండాలి. ప్రభువైన యేసు ఇలా చెప్పినప్పుడు, ఆయన హృదయంలో ఏముంది? ఆయన నిజంగానే “డెబ్బది ఏళ్లు” అనే సంఖ్య గురించి ఆలోచిస్తున్నాడా? లేదు, ఆయన అలా ఆలోచించలేదు. దేవుడు మనిషిని ఇన్నిసార్లు మాత్రమే క్షమించాలనే సంఖ్య ఏదైనా ఉందా? ఇక్కడ పేర్కొనబడిన “ఎన్నిసార్లు అనే సంఖ్య” పట్ల చాలా ఆసక్తి కలిగిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. వాళ్లంతా ఈ సంఖ్య మూలాన్ని మరియు అర్థాన్ని అవగతం చేసుకోవాలనుకునేవారు. ప్రభువైన యేసు నోటి నుండి ఈ సంఖ్య ఎందుకు వచ్చిందో వారు అర్థం చేసుకోవాలనుకుంటున్నారు; ఈ సంఖ్యకు లోతైన అంతరార్థం ఉందనేది వారి విశ్వాసం. అయితే, నిజానికి, ఇది దేవుడు ఉపయోగించిన మానవ భాష రూపం మాత్రమే. అయితే, ప్రభువైన యేసు అవసరాలతోపాటు ఏదైనా తాత్పర్యం లేదా అర్థాన్ని మానవాళి తప్పక తీసుకోవాలనుకుంటుంది. దేవుడు ఇంకా శరీరధారి కానప్పుడు, ఆయన చెప్పిన చాలా వాటిని మనుష్యులు అర్థం చేసుకోలేదు. ఎందుకంటే, ఆయన వాక్కులన్నీ పూర్తి దైవత్వంగా వచ్చాయి. ఆయన చెప్పిన దానికి సంబంధించిన దృక్పథం మరియు సందర్భం అనేది మానవాళికి కనిపించనిది మరియు చేరుకోలేనిది; మనుష్యులు చూడలేని ఆత్మ సంబంధిత ప్రపంచం నుండి అది వ్యక్తీకరించబడింది. మనుష్యులకు శరీరంలో ఉన్న మనుష్యులకు సంబంధించినంతవరకు వారు ఆత్మ సంబంధిత లోకం గుండా వెళ్ళలేరు. అయితే, దేవుడు శరీరధారిగా వచ్చిన తర్వాత, ఆయన మానవాళి దృక్కోణం నుండి మానవాళితో మాట్లాడాడు మరియు ఆయన ఆత్మ సంబంధిత ప్రపంచం నుండి బయటికి వచ్చి, దాని పరిధిని అధిగమించాడు. ఆయన ఇప్పుడు మానవులు ఊహించగలిగే విషయాల ద్వారా, వారి జీవితంలో చూసిన మరియు ఎదుర్కొన్న విషయాల ద్వారా మరియు మానవులు అంగీకరించగలిగే పద్ధతుల ఉపయోగించి, వారు అర్థం చేసుకోగలిగే భాషలో మరియు వారు గ్రహించగలిగే జ్ఞానంతో ఆయన తన దైవత్వ స్వభావం, చిత్తం మరియు గుణగణాలను వ్యక్తపరచగలడు. మానవజాతి దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి మరియు తెలుసుకోవడానికి, ఆయన ఉద్దేశం మరియు ఆయనకు అవసరమైన ప్రమాణాలను మనుష్యులు వారి సామర్థ్యపు పరిధిలో మరియు వారు చేయగలిగే స్థాయిలో అర్థం చేసుకోవడానికి ఆయన ఇలా చేస్తాడు. మానవుల మధ్యన జరిగే దేవుని కార్యము యొక్క పద్ధతి మరియు సూత్రం ఇదే. మానవత్వం రూపంలో లేదా మానవత్వం ద్వారానే దేవుని మార్గాలు మరియు ఆయన నియమాలు ఎక్కువగా సాధించబడినప్పటికీ, దైవత్వంలో నేరుగా పనిచేయడం ద్వారా సాధించలేని ఫలితాలను ఇదే నిజంగా సాధించింది. మానవత్వంలో దేవుని కార్యము మరింత దృఢంగా, ప్రామాణికంగా మరియు లక్ష్యంగా ఉంటుంది. ఈ పద్ధతులు చాలా సరళమైనవి మరియు రూపంలో ఇది ధర్మశాస్త్ర యుగంలో నిర్వహించిన కార్యమును అధిగమించింది.

తర్వాత, ప్రభువును ప్రేమించడం గురించి మరియు నిన్ను నీవు ప్రేమించుకున్నట్లుగానే నీ పొరుగువారిని ప్రేమించడం గురించి మాట్లాడుకుందాం. ఇది దైవత్వంలో ప్రత్యక్షంగా వ్యక్తమయ్యే విషయమేనా? కాదు, ఖచ్చితంగా కాదు! ఇవన్నీ మనుష్య కుమారుడు మానవ రూపంలో మాట్లాడిన విషయాలు; మనుష్యులు మాత్రమే “నిన్నువలె నీ పొరుగు వానిని ప్రేమించు. నీవు నీ స్వంత జీవితాన్ని ప్రేమించినట్లే ఇతరులనూ ప్రేమించండి” అని అంటారు. ఇలా మాట్లాడడం అనేది పూర్తిగా మానవ సంబంధితమైనది. దేవుడు ఎప్పుడూ ఈ విధంగా మాట్లాడలేదు. దేవుని దైవత్వంలో ఈ రకమైన భాష కనీసంగానైనా లేదు. ఎందుకంటే, మానవజాతిపట్ల తన ప్రేమను నియంత్రించడం కోసం, “నిన్నులాగే నీ పొరుగు వానిని ప్రేమించు” అనే సిద్ధాంతమేదీ ఆయనకు అవసరం లేదు. ఎందుకంటే, మానవజాతిపట్ల దేవునికున్న ప్రేమ అనేది ఆయన కలిగి ఉన్న మరియు ఆయన ఏమై ఉన్నాడనే దానికి సంబంధించిన ఒక సహజ ప్రత్యక్షతగా ఉంటుంది. “నన్ను నేను ప్రేమించినట్లుగానే మానవాళిని ప్రేమిస్తున్నాను” అని దేవుడు చెప్పినట్లుగా మీరు ఎప్పుడైనా విన్నారా? మీరెప్పుడూ వినలేదు. ఎందుకంటే, ప్రేమ అనేది దేవుని గుణగణాల్లో మరియు ఆయన కలిగి ఉన్న దానిలో మరియు ఆయన ఏమై ఉన్నాడనే దానిలోనే ఉంది. మానవజాతిపట్ల దేవునికున్న ప్రేమ మరియు ఆయన ధోరణి మరియు ఆయన మనుష్యులతో వ్యవహరించే విధానం లాంటివన్నీ ఆయన స్వభావంలో సహజమైన వ్యక్తీకరణ మరియు ప్రత్యక్షతగా ఉంటాయి. ఆయన ఉద్దేశపూర్వకంగా, ఒక నిర్దిష్ట మార్గంలో ఇదంతా చేయాల్సిన అవసరం లేదు లేదా ఉద్దేశపూర్వకంగా, ఒక నిర్దిష్ట పద్ధతి లేదా నైతిక నియమావళి అనుసరిస్తూ, తనలాగే తన పొరుగువారిని ప్రేమించడమును సాధించాల్సిన అవసరం లేదు, ఆయన ఇదివరకే ఇలాంటి గుణగణాలు కలిగి ఉన్నాడు. ఇందులో నీకు ఏం కనిపిస్తోంది? దేవుడు మానవ రూపంలో పనిచేసినప్పుడు, ఆయన అనేక పద్ధతులు, మాటలు మరియు సత్యాలు మానవ మార్గంలో వ్యక్తీకరించబడ్డాయి. అయితే, అదే సమయంలో, దేవుని స్వభావం, ఆయన ఏం కలిగి ఉన్నాడు మరియు ఆయన ఏమై ఉన్నాడు మరియు ఆయన చిత్తం అనేవి మనుష్యులు గ్రహించడం కోసం మరియు అర్థం చేసుకోవడం కోసం వ్యక్తీకరించబడ్డాయి. తద్వారా, ఆయన గుణగణాలు మరియు ఆయన కలిగి ఉన్న వాటిని మరియు మరియు ఆయన ఏమై ఉన్నాడనే వాటిని వారు స్పష్టంగా తెలుసుకున్నారు మరియు అర్థం చేసుకున్నారు. ఇది దేవుని స్వాభావిక గుర్తింపు మరియు స్థాయిని సూచిస్తుంది. సరిగ్గా చెప్పాలంటే, శరీరధారిగా ఉన్న మనుష్య కుమారుడు దేవుని సహజ స్వభావం మరియు గుణగణాలను సాధ్యమైనంత గొప్పగా మరియు సాధ్యమైనంత ఖచ్చితత్వంతో వ్యక్తీకరించాడు. పరలోకములోని దేవునితో మనిషి పరస్పరతకు మరియు సంభాషించే చర్యకు మనుష్య కుమారుడి మానవత్వం ఒక అడ్డంకి కాదు, లేదా అవరోధం కాదు. కానీ, నిజానికి సృష్టికర్తకు మానవాళికి అనుసంధానమయ్యేందుకు అదే ఏకైక వాహిక మరియు ఏకైక వంతెన. కృపా యుగంలో యేసు ప్రభువు చేసిన కార్యము యొక్క స్వభావం మరియు పద్ధతులు మరియు ప్రస్తుత కార్యము దశకు మధ్య చాలా సారూప్యతలు ఉన్నట్లుగా ఇప్పుడు, ఈ సమయంలో, మీకు అనిపించడం లేదా? ఈ కార్యపు ప్రస్తుత దశ అనేది దేవుని స్వభావమును వ్యక్తీకరించడం కోసం అనేక మానవ భాషలను ఉపయోగిస్తుంది మరియు దేవుని చిత్తం వ్యక్తీకరించడం కోసం మానవజాతి రోజువారీ జీవితంలోని మరియు మానవ జ్ఞానం నుండి ఎంచుకున్న అనేక భాషలు మరియు పద్ధతులను ఉపయోగిస్తుంది. దేవుడు శరీరధారిగా అవతరించిన తర్వాత, ఆయన మానవ దృక్పథం నుండి లేదా దైవిక దృక్పథం నుండి మాట్లాడినప్పటికీ, ఆయన భాష మరియు వ్యక్తీకరణ పద్ధతులన్నీ మానవ భాష మరియు పద్ధతుల మాధ్యమం ద్వారానే వస్తాయి. అంటే, దేవుడు శరీరధారిగా మారినప్పుడు, దేవుని సర్వశక్తిని మరియు ఆయన జ్ఞానాన్ని చూడడానికి మరియు దేవునికి సంబంధించిన ప్రతి వాస్తవిక అంశాన్ని తెలుసుకోవడానికి ఇది నీకు అత్యుత్తమ అవకాశం. దేవుడు శరీరధారిగా మారినప్పుడు, ఆయన మానవుడిగా పెరిగి పెద్దవుతున్నప్పుడు, మానవజాతి జ్ఞానం, ఇంగితజ్ఞానం, భాష మరియు మానవజాతిలోని వ్యక్తీకరణ పద్ధతులను ఆయన అర్థం చేసుకున్నాడు, నేర్చుకున్నాడు మరియు గ్రహించాడు. తాను సృష్టించిన మనుష్యుల నుండి వచ్చిన వీటన్నింటినీ శరీరధారుడైన దేవుడు కలిగి ఉన్నాడు. తన స్వభావం మరియు దైవత్వం వ్యక్తీకరించడానికి శరీరధారుడైన దేవుకి ఇవి సాధనాలుగా మారాయి మరియు మానవజాతి మధ్య కార్యము చేస్తున్నప్పుడు, మానవ దృష్టికోణం నుండి మరియు మానవ భాషను ఉపయోగిస్తున్నప్పుడు ఆయన కార్యమును మరింత సంబంధితంగా, మరింత ప్రామాణికంగా మరియు మరింత ఖచ్చితమైనదిగా చేయడానికి ఇవి అనుమతించాయి. ఇది ఆయన కార్యమును మరింత అందుబాటులోకి తెచ్చింది మరియు మనుష్యులకు మరింత సులభంగా అర్థమయ్యేలా చేసింది. తద్వారా, దేవుడు కోరుకున్న ఫలితాలు సాధించబడ్డాయి. ఈ విధంగా దేవుడు శరీరధారుడిగా పనిచేయడమనేది మరింత ఆచరణాత్మకమైనది కాదా? ఇది దేవుని జ్ఞానం కాదా? దేవుడు శరీరధారిగా మారినప్పుడు, దేవుని శరీరము తాను చేయదలచిన కార్యమును చేపట్టగలిగినప్పుడు, ఆయన తన స్వభావమును మరియు తన కార్యమును ఆచరణాత్మకంగా వ్యక్తీకరిస్తాడు మరియు అదేసమయంలో, మనుష్య కుమారుడిగా ఆయన తన పరిచర్యను అధికారికంగా ప్రారంభించగలడు. అంటే, దేవునికి మరియు మనిషికి మధ్య ఇకపై “తరాల అంతరం” ఉండదని దీని అర్థం. అంటే, దూతల ద్వారా విషయాన్ని తెలియజేసే తన కార్యమును దేవుడు త్వరలో నిలిపివేస్తాడు మరియు దేవుడే వ్యక్తిగతంగా అన్ని వాక్కులను వ్యక్తీకరించగలడు మరియు ఆయన కోరుకున్నట్లుగా శరీరధారుడై కార్యమును చేయగలడు. అంటే, దేవుడు రక్షించే వ్యక్తులు ఆయనకు సన్నిహితంగా ఉన్నారనీ, ఆయన నిర్వహణ కార్యము కొత్త భూభాగంలోకి ప్రవేశించిందనీ మరియు సమస్త మానవాళి కొత్త శకంలోకి వెళ్లనుందని కూడా దీని అర్థం.

యేసు ప్రభువు పుట్టినప్పుడు ఎన్నో సంఘటనలు జరిగాయని బైబిలు చదివిన ప్రతి ఒక్కరికీ తెలుసు. దయ్యముల చక్రవర్తి ఆయన్ని వేటాడడమనేది వీటిలో అత్యంత ముఖ్యమైనది. ఇదొక అత్యంత తీవ్రమైన ఘటన. ఇందులో భాగంగా, ఆ నగరంలోని రెండేళ్లు మరియు అంతకంటే తక్కువ వయస్సు చిన్నారులందరూ చంపివేయబడ్డారు. మనుష్యుల మధ్యలోకి శరీరధారిగా రావడం ద్వారా దేవుడు గొప్ప ప్రమాదాన్ని ఎదుర్కొన్నాడని దీనిద్వారా స్పష్టంగా తెలుస్తుంది; మానవాళిని రక్షించే తన నిర్వహణ పూర్తి చేసినందుకు ఆయన గొప్ప మూల్యం చెల్లించడం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మనుష్యుల మధ్యలో తన కార్యము కోసం దేవుడు పెట్టుకున్న గొప్ప ఆశలు కూడా ఇందులో స్పష్టంగా కనిపిస్తాయి. శరీరధారిగా మానవుల మధ్యలో దేవుడు తన కార్యమును జరిగించినప్పుడు, ఆయనలో కలిగిన భావమేమిటి? దాని గురించి మనుష్యులు కొంత మేరకైనా అర్థం చేసుకోగలగాలి కదా? మానవజాతి మధ్యలో తన కొత్త పనిని ప్రారంభించగలిగినందుకు దేవుడు కనీసంగానైనా సంతోషించాడు. యేసు ప్రభువు బాప్తిస్మం తీసుకుని, అధికారికంగా తన పరిచర్యను నెరవేర్చడం కోసం తన కార్యము ప్రారంభించినప్పుడు, దేవుని హృదయం ఆనందంతో ఉప్పొంగిపోయింది. ఎందుకంటే, అనేక సంవత్సరాల నిరీక్షణ మరియు సంసిద్ధత తర్వాత, ఆయన ఎట్టకేలకు ఒక సాధారణ మనిషి రూపం ధరించి, తన రూపంలో తన కొత్త కార్యము ప్రారంభించగలిగాడు. శరీరధారిగా ఉన్న దేవుణ్ణి మనుష్యులు చూడగలిగారు మరియు తాకగలిగారు. అందుకే, ఆయన చివరకు ఒక మనిషి యొక్క గుర్తింపుతో మనుష్యులతో ముఖాముఖీగా మరియు హృదయపూర్వకంగా మాట్లాడగలిగాడు. మానవులు ఉపయోగించే మార్గాలు మరియు మానవ భాష అనే మాధ్యమం ద్వారా, దేవుడు చివరకు మానవజాతితో ముఖాముఖీ రాగలిగాడు; ఆయన ఇప్పుడు మానవజాతి అవసరాలను తీర్చగడు, వారికి జ్ఞానోదయం కలిగించగలడు మరియు మానవ భాష ఉపయోగించి వారికి సహాయం చేయగలడు; ఆయన వారితో కలసి ఒకే బల్ల మీద భోజనము చేయగలడు మరియు వారితో కలసి ఒకే ప్రదేశంలో నివసించగలడు. ఆయన మనుష్యులను చూడగలడు, పరిస్థితులను చూడగలడు మరియు మనుష్యులు వాటిని ఎలా చూస్తారో, అదే విధంగా మనుష్యుల దృష్టికోణం నుండి ఆయన ప్రతి ఒక్కటీ చూడగలడు. దేవునికి సంబంధించినంతవరకు, శరీరధారిగా ఆయన జరిగించిన కార్యములో ఇది ఆయన మొదటి విజయం. ఒక గొప్ప కార్యములో సాఫల్యంగా కూడా దీన్ని చెప్పవచ్చు, ఖచ్చితంగా దేవుడు సంతోషించే విషయం ఇది. ఇక అప్పటినుండి, దేవుడు మొదటిసారిగా, మానవజాతి మధ్యలో నిర్వహించే తన కార్యములో దేవుడు ఒక విధమైన ఆదరణను అనుభవించాడు. వరుసగా జరిగిన సంఘటనలన్నీ అత్యంత ఆచరణాత్మకమైనవి మరియు అత్యంత సహజమైనవి మరియు ఈ సందర్భంగా దేవుడు భావించిన ఆదరణ అత్యంత నిజమైనది. మానవాళికి సంబంధించినంతవరకు, ఈ క్రమంలో ప్రతిసారీ దేవుని కార్యములోని కొత్త దశ పూర్తవుతుంది మరియు ప్రతిసారీ దేవుడు సంతృప్తి చెందినట్లుగా భావిస్తాడు. అలాంటప్పుడు మానవ జాతియంత దేవునికి మరియు రక్షణకు దగ్గరగా రాగలదు. దేవునికి సంబంధించి, ఇది ఆయన క్రొత్త పనిని ప్రారంభించడం, తన నిర్వహణ ప్రణాళికలో ముందుకు సాగడమే కాకుండా ఆయన ఉద్దేశాలు సంపూర్ణంగా నెరవేరే స్థాయికి చేరుకునే సమయాలుగా కూడా ఉంటాయి. మానవాళికి సంబంధించి, అలాంటి అవకాశం రావడమనేది అదృష్టంతోపాటు చాలా మంచి విషయం కూడా; దేవుని రక్షణ కోసం ఎదురుచూసే వారందరికీ, ఇది అపూర్వమైన మరియు సంతోషం కలిగించే వార్త. దేవుడు ఒక క్రొత్త దశకు సంబంధించిన కార్యము నిర్వహించినప్పుడల్లా, ఆయనకి ఒక క్రొత్త ప్రారంభం ఉంటుంది మరియు ఈ క్రొత్త పని మరియు కొత్త ప్రారంభం అనేవి మానవజాతిలో ప్రారంభించబడి మరియు పరిచయం చేయబడినప్పుడు, ఈ దశకు సంబంధించిన కార్యపు ఫలితం అప్పటికే నిర్ణయించబడి మరియు అది సాధించబడినప్పుడు మరియు దాని అంతిమ ప్రభావమును మరియు దాని ఫలితమును దేవుడు ముందుగానే చూసి ఉంటాడు. దేవుని హృదయం సంతోషంగా ఉన్నప్పుడే, ఈ ప్రభావాలు ఆయనకి సంతృప్తిని కలిగిస్తాయి. దేవుడు తన దృష్టిలో తాను వెదకుతున్న వ్యక్తులను అప్పటికే చూసేశాడు మరియు నిర్ణయించాడు మరియు అప్పటికే ఆ సమూహాన్ని పొందుకున్నాడు. ఇది ఆయన పనిని విజయవంతం చేయగల మరియు ఆయనకి సంతృప్తి కలిగించే సమూహంగా ఉంటుంది. కాబట్టి, ఆయన తన చింతలన్నీ పక్కన పెట్టాడు మరియు ఆయన సంతోషంగా ఉంటాడు. మరోమాటలో చెప్పాలంటే, శరీరధారియైన దేవుడు మనిషిలో క్రత్త కార్యమును ప్రారంభించగలిగినప్పుడు మరియు అడ్డంకులేవీ లేకుండా ఆయన చేయాల్సిన కార్యము చేయడం ప్రారంభించినప్పుడు మరియు ప్రతి ఒక్కటీ సాధించినట్లు ఆయన భావించినప్పుడు, ఆయనకు సంబంధించినంతవరకు, ముగింపు అనేది అప్పటికే ఆయన దృష్టిలో ఉంటుంది. ఈ కారణంగానే ఆయన సంతృప్తి చెందాడు మరియు ఆయన హృదయం సంతోషంగా ఉంది. మరి, దేవుని సంతోషం ఎలా వ్యక్తమవుతుంది? దీనికి సమాధానమేమిటో మీరు ఊహించగలరా? దేవుడు అరుస్తాడా? దేవుడు అరవగలడా? దేవుడు తన చేతులతో చప్పట్లు కొట్టగలడా? దేవుడు నాట్యం చేయగలడా? దేవుడు పాడగలడా? అదే నిజమైతే, ఆయన ఏం పాడతాడు? నిజానికి, తన హృదయంలోని ఆనందం మరియు సంతోషం వ్యక్తం చేయగల ఒక అందమైన, కదిలే పాట పాడగలడు. మానవజాతి కోసం, తన కోసం మరియు అన్నింటి కోసం ఆయన ఆ పాట పాడగలడు. దేవుని సంతోషం ఏ విధంగానైనా వ్యక్తీకరించబడవచ్చు, ఇదంతా సర్వసాధారణమే. ఎందుకంటే, దేవునికి సంతోషాలు మరియు దుఃఖాలు ఉన్నాయి మరియు ఆయన తన విభిన్న భావాలను వివిధ విధానాల్లో వ్యక్తం చేయవచ్చు. ఇది ఆయన హక్కు మరియు ఇందులో ఏదీ అత్యంత సాధారణమైనదిగాను మరియు సరైనదిగాను ఉండదు. మనుష్యులు ఇది తప్ప ఇంకేమీ ఆలోచించకూడదు. దేవుని మీద మీరు “తలకట్టును బిగించే మంత్రాన్ని”[ఎ] ఉపయోగించే ప్రయత్నం చేయకూడదు. ఇది చేయకూడదు, అది చేయకూడదని, లేక ఇలా చేయకూడదు, అలా చేయకూడదని మీరు ఆయనకు చెప్పకూడదు. అలాగే, ఆయన కలిగియున్న ఆనందాన్ని లేదా ఇతర ఏ విధమైన భావాన్ని మీరు ఈ విధంగా పరిమితం చేయకూడదు. మనుష్యుల హృదయాల్లో దేవుడు సంతోషంగా ఉండలేడు, కన్నీళ్లు పెట్టలేడు, శోకించలేడు, అంటే ఏ భావాన్నీ ఆయన వ్యక్తం చేయలేడు. ఈ రెండు సహవాసాల సమయంలో, మనం పరస్పరం పంచుకున్న వాటి ద్వారా, మీరు ఇకమీదట దేవుణ్ణి ఈ విధంగా చూడరనీ, దేవుడు కొంత స్వేచ్ఛను మరియు విడుదలను కలిగి ఉండేందుకు అనుమతిస్తారనీ నేను విశ్వసిస్తున్నాను. ఇది చాలా మంచి విషయం. భవిష్యత్తులో మీరు దేవుని దుఃఖం గురించి విన్నప్పుడు మీరు నిజంగానే దేవుని దుఃఖాన్ని అనుభవించగలిగితే మరియు ఆయన సంతోషంగా ఉన్నాడని మీరు విన్నప్పుడు మీరు నిజంగానే ఆయన ఆనందాన్ని అనుభవించగలిగితే, అప్పుడు మీరు దేవుణ్ణి ఏది సంతోషపరుస్తుంది మరియు ఏది బాధపెడుతుందో కనీసంగానైనా స్పష్టంగా తెలుసుకోగలరు మరియు అర్థం చేసుకోగలరు. దేవుడు విచారంగా ఉన్నప్పుడు మీరు దుఃఖం అనుభవించగలిగినప్పుడు మరియు దేవుడు సంతోషంగా ఉన్నప్పుడు మీరు సంతోషం అనుభవించగలిగినప్పుడు, ఆయన మీ హృదయాన్ని సంపూర్ణముగా పొందుకొని ఉంటాడు మరియు మీకు మరియు ఆయనకు మధ్య ఎలాంటి అవరోధం ఉండదు. కాబట్టి, మానవ కల్పనలు, తలంపులు మరియు జ్ఞానంతో దేవుణ్ణి నిర్బంధించడానికి మీరు ఇకపై ప్రయత్నించరు. ఆ సమయంలో, దేవుడు మీ హృదయంలో సజీవంగా మరియు ప్రస్ఫుటంగా ఉంటాడు. మీ జీవితానికి ఆయనే దేవునిగాను ఉంటాడు మరియు మీకు సంబంధించిన ప్రతి ఒక్కదానికి ఆయనే యజమానిగా ఉంటాడు. ఇలాంటి ఆకాంక్ష మీకు ఉందా? దీన్ని సాధించగలరనే నమ్మకం మీలో ఉందా?

తర్వాత, లేఖనాల నుండి క్రింది భాగాలు చదువుదాం:

6. కొండ మీది ప్రసంగం

ధన్యతలు (మత్తయి 5:3-12)

ఉప్పు మరియు వెలుగు (మత్తయి 5:13-16)

ధర్మశాస్త్రము (మత్తయి 5:17-20)

కోపం (మత్తయి 5:21-26)

వ్యభిచారము (మత్తయి 5:27-30)

పరిత్యజించుట (మత్తయి 5:31-32)

ఒట్టుపెట్టుకొనుట (మత్తయి 5:33-37)

కంటికి కన్ను (మత్తయి 5:38-42)

మీ శత్రువులను ప్రేమించండి (మత్తయి 5:43-48)

ఇచ్చుటను గురించిన సూచన (మత్తయి 6:1-4)

ప్రార్థన (మత్తయి 6:5-8)

7. యేసు ప్రభువు ఉపమానములు

విత్తుట గురించిన ఉపమానము (మత్తయి 13:1-9)

గురుగులు గురించిన ఉపమానము (మత్తయి 13:24-30)

ఆవగింజ గురించిన ఉపమానము (మత్తయి 13:31-32)

పులిసిన పిండి గురించిన ఉపమానము (మత్తయి 13:33)

గురుగులు గురించిన ఉపమానము వివరించబడింది (మత్తయి 13:36-43)

దాచబడిన ధనము గురించిన ఉపమానము (మత్తయి 13:44)

ముత్యము గురించిన ఉపమానము (మత్తయి 13:45-46)

వల గురించిన ఉపమానము (మత్తయి 13:47-50)

8. ఆజ్ఞలు

మత్తయి 22:37-39 అందుకాయన, నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణమనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననునదియే. ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దానివంటిదే.

మనం ముందుగా “కొండ మీద ప్రసంగము” లోని విభిన్న భాగాలను ఒక్కొక్కటిగా పరిశీలిద్దాం. ఈ విభిన్న భాగాలన్నీ దేని గురించి పేర్కొంటాయి? ఈ విభిన్న భాగాల్లోని విషయాలన్నీ ధర్మశాస్త్ర యుగపు నిబంధనలకంటే మరింత ఉన్నతమైనవిగా, మరింత దృఢమైనవిగా మరియు మనుష్యుల జీవితాలకు సామీప్యంగా ఉన్నాయని నిశ్చయంగా చెప్పవచ్చు. ఆధునిక పరిభాషలో చెప్పాలంటే, ఈ విషయాలన్నీ మనుష్యుల వాస్తవ ఆచరణకు అత్యంత సంబంధితంగా ఉంటాయి.

క్రింద పేర్కొనిన నిర్దిష్ట విషయం గురించి మనం చదువుదాం: ధన్యతలను నీవెలా అర్థం చేసుకోవాలి? ధర్మశాస్త్రం గురించి నీవేమి తెలుసుకోవాలి? కోపాన్ని ఎలా నిర్వచించాలి? వ్యభిచారులతో ఏవిధంగా వ్యవహరించాలి? పరిత్యజించడం గురించి ఎలా మాట్లాడాలి మరియు దానికి సంబంధించి ఎలాంటి నియమాలు ఉన్నాయి? ఎవరు విడిపోవచ్చు మరియు ఎవరు విడిపోకూడదు? ఒట్టుపెట్టుకోవడం, కంటికి కన్ను, శత్రువులను ప్రేమించడం, ఇచ్చుట అనే విషయాలన్నిటిని గురించి ఎలా అర్థం చేసుకోవాలి? మరియు ఇలాంటివన్నీ ఇందులోకే వస్తాయి. ఈ విషయాలన్నీ దేవుని మీద మానవజాతి విశ్వాసం మరియు వారు దేవుడిని అనుసరించే తీరు అనేటువంటి ప్రతి అంశానికి సంబంధించినవై ఉంటాయి. ఈ అభ్యాసాల్లో కొన్ని నేటికీ వర్తించినప్పటికీ, ప్రస్తుతం మనుష్యులకు అవసరమైన దానికంటే అవి తక్కువ స్థాయినే కలిగి ఉన్నాయి, ఇవన్నీ అత్యంత ప్రాథమిక సత్యాలు. దేవునిపట్ల తమ విశ్వాసంలో భాగంగా మనుష్యులు వీటిని ఎదుర్కొంటారు. యేసు ప్రభువు కార్యమును చేయడం ప్రారంభించినప్పటి నుండి, మనుష్యుల జీవిత స్వభావం మీద పనిని చేపట్టడం ఆయన అప్పటికే ప్రారంభించాడు. అయితే, ఆయన కార్యానికి సంబంధించిన ఈ అంశాలనేవి ధర్మశాస్త్రపు పునాది మీద ఆధారపడి ఉన్నాయి. ఈ అంశాల గురించి పేర్కొనే నియమాలకు మరియు విధానాలకు సత్యంతో ఏమైనా సంబంధం ఉందా? నిజం చెప్పాలంటే, ఉంది! గతంలోని ఈ అన్ని నిబంధనలు మరియు నియమాలతోపాటు కృపా యుగంలోని ఈ ప్రసంగాలనేవి దేవుని స్వభావం మరియు ఆయన ఏమి కలిగియున్నాడో మరియు ఆయన ఏమై ఉన్నాడనే దానితోనే కాకుండా, సత్యంతోనూ ముడిపడి ఉన్నాయి. దేవుడు ఏది వ్యక్తపరిచినప్పటికీ మరియు ఆయన ఏ విధమైన వ్యక్తీకరణను లేదా భాషను ఉపయోగించినప్పటికీ, ఆయన వ్యక్తీకరించే విషయాలన్నింటి పునాది, మూలం మరియు ప్రారంభ స్థానం అనేవి ఆయన స్వభావపు నియమాలలోను మరియు ఆయన కలిగి ఉన్నవాటిలో మరియు ఆయన ఏమై ఉన్నాడనే వాటిలో ఉంది. ఇది ఖచ్చితమైన వాస్తవం. కాబట్టి, ఆయన చెప్పిన ఈ విషయాలన్నీ ఇప్పుడు కొంచెం నిస్సారంగానే అనిపించినప్పటికీ, అవేవీ సత్యం కాదని మీరు ఇప్పటికీ చెప్పలేరు. ఎందుకంటే, కృపా యుగంలో దేవుడి చిత్తాన్ని జరిగించి మెప్పించడానికి మరియు మనుష్యుల జీవన విధానంలో మార్పు సాధించడానికి అవి వారికి అనివార్యమైనవి. ఈ ప్రసంగాలలో ఏదైనా సత్యానికి అనుగుణంగా లేదని నీవు చెప్పగలవా? లేదు, నువ్వలా చెప్పలేవు! వాటిలో ప్రతి ఒక్కటీ సత్యమే. ఎందుకంటే, అవన్నీ మానవాళి కోసం దేవుడు కలిగియున్న అవసరాలు; అవన్నీ దేవుడు ఇచ్చిన నియమాలు మరియు పరిమితులు. ఒక వ్యక్తి తాను ఎలా ప్రవర్తించాలో అవి చూపుతాయి మరియు అవి దేవుని స్వభావాన్ని సూచిస్తాయి. అయితే, అప్పటికి మనుష్యులు వారి జీవితంలో ఎదిగి ఉన్న స్థాయిని బట్టి, ఇవి మాత్రమే అంగీకరించగలిగేవి మరియు గ్రహించగలిగేవిగా ఉంటాయి. ఎందుకంటే, మానవజాతి పాపం ఇంకా పరిష్కరించబడని కారణంగా, యేసు ప్రభువు జారీ చేయగల ఏకైక వాక్కులు ఇవి మాత్రమే. అలాగే, ఈ రకమైన పరిధిలోని సాధారణ బోధనలు మాత్రమే ఉపయోగించుకుని, వారు ఎలా ప్రవర్తించాలి, ఏమి చేయాలి, వారు ఏ నియమాల పరిధిలో మరియు అవకాశాల పరిధిలో పనులు చేయాలి మరియు వారు దేవుడిని ఎలా విశ్వసించాలి మరియు ఆయన అవసరాలను ఎలా తీర్చాలి అని మనుష్యులకు ఆయన చెప్పగలిగాడు. ఇవన్నీ అప్పటి మానవజాతి స్థాయిని బట్టి నిర్ణయించబడ్డాయి. అప్పటికింకా ధర్మశాస్త్రానికి లోబడి జీవించే మనుష్యులకు ఈ బోధనలు అంగీకరించడమనేది అంత సులభమైన విషయమేమీ కాదు. కాబట్టే, యేసు ప్రభువు ప్రబోధించిన బోధనలన్నీ ఈ పరిధిలోనే ఉండాలి.

తర్వాత, “యేసు ప్రభువు ఉపమానాలు” యొక్క వివిధ విషయాలను మనం పరిశీలిద్దాం.

మొదటిది విత్తుట గురించిన ఉపమానం. ఇది అత్యంత ఆసక్తికరమైన ఉపమానం; విత్తనాలు విత్తడమనేది మనుష్యుల జీవితంలో ఒక సాధారణ ఘటన. రెండవది గురుగులు గురించిన ఉపమానం. పంటలు వేసే ఎవరికైనా మరియు వయోజనులు అందరికీ “గురుగులు” అంటే ఏమిటో ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. మూడవది ఆవగింజ గురించిన ఉపమానం. ఆవగింజలు అంటే ఏమిటో మీ అందరికీ తెలుసు కదా? మీకు తెలియకపోతే, మీరు బైబిలులో పరిశీలించవచ్చు. నాల్గవ ఉపమానం పులిసిన పిండి గురించిన ఉపమానం. పులియబెట్టడం కోసం పులిసిన పిండిని ఉపయోగిస్తారని ఇప్పుడు దాదాపు ప్రజలందరికీ తెలుసు. అలాగే, జనులు వారి రోజువారీ జీవితంలో ఉపయోగించే విషయం ఇదని కూడా తెలుసు. తదుపరి ఉపమానాలన్నీ, దాచబడిన ధనం గురించిన ఆరవ ఉపమానం; ముత్యం గురించిన ఏడవ ఉపమానం; వల గురించిన ఎనిమిదవ ఉపమానంతో సహా, ఉపమానాలన్నీ మనుష్యుల నిజ జీవితాల నుండి తీసుకోబడ్డాయి మరియు సేకరించబడ్డాయి. ఈ ఉపమానాలన్నీ ఎలాంటి చిత్రాన్ని చిత్రీకరిస్తున్నాయి? దేవుడు ఒక సాధారణ మనిషిగా మారి, మానవజాతితో కలసి జీవించడం, మనుష్యులతో సంభాషించడం కోసం జీవితపు భాష, మానవ భాష ఉపయోగించడం మరియు వారికి అవసరమైన వాటిని అందించడమనే చిత్రాన్ని చిత్రీకరిస్తున్నాయి. దేవుడు శరీరధారిగా మానవాళి మధ్య చాలా కాలం జీవించినప్పుడు, ఆయన మనుష్యుల విభిన్న జీవనశైలులు అనుభవించి మరియు దానికి సాక్ష్యంగా నిలిచిన తర్వాత, ఈ అనుభవాలనేవి ఆయన బోధనా సామగ్రిగా మారాయి. దాని ద్వారా, ఆయన తన దైవిక భాషను మానవ భాషగా మార్చాడు. నిజం చెప్పాలంటే, తన జీవితంలో చూసిన మరియు విన్న ఈ విషయాలన్నీ కూడా మనుష్య కుమారుడి మానవ అనుభవాన్ని సంపన్నం చేశాయి. దేవుని చిత్తంలోని కొన్నింటిని అర్థం చేసుకోవడం కోసం మనుష్యులు కొన్ని సత్యాలు అర్థం చేసుకోవాలని ఆయన కోరుకున్నప్పుడు, దేవుని చిత్తం మరియు మానవజాతి నుండి ఆయన అవసరాల గురించి మనుష్యులకు చెప్పడానికి పైన పేర్కొన్న ఉపమానాలను పోలిన వాటిని ఆయన ఉపయోగించాడు. ఈ ఉపమానాలన్నీ మనుష్యుల జీవితాలకు సంబంధించినవి; వీటిలో మానవ జీవితాలతో సంబంధం లేనిది ఒక్కటి కూడా లేదు. ప్రభువైన యేసు మానవజాతితో కలసి జీవించినప్పుడు, రైతులు వారి పొలాలను దున్నుచున్నట్లుగా చూశాడు మరియు గురుగులు అంటే ఏమిటో మరియు పులియబెట్టడమంటే ఏమిటో ఆయన తెలుసుకున్నాడు; దాచబడిన ధనాన్ని మానవులు ఇష్టపడుతారని ఆయన అర్థం చేసుకున్నాడు. కాబట్టే, దాచబడిన ధనం మరియు ముత్యం అనే రెండు రకాల ఉపమానాలను ఆయన ఉపయోగించాడు. ఆయన జీవితంలో జాలర్లు వలలు వేయడాన్ని ఆయన తరచుగా చూశాడు; దీంతోపాటు మానవ జీవితానికి సంబంధించిన ఇతర కార్యకలాపాలనూ యేసు ప్రభువు చూశాడు మరియు అలాంటి జీవితాన్ని ఆయన కూడా అనుభవించాడు. ఒక సాధారణ మనిషికిలాగే, ఆయన కూడా మానవ దైనందిన దినచర్యలను మరియు వారిలా రోజూ మూడు పూటలు భుజించడాన్ని అనుభవించాడు. సగటు మనిషి జీవితాన్ని ఆయన వ్యక్తిగతంగా అనుభవించాడు మరియు ఇతరుల జీవితాలను గమనించాడు. వీటన్నింటిని గమనించిన సమయంలో మరియు వ్యక్తిగతంగా అనుభవించిన సమయంలో, మంచి జీవితాన్ని ఎలా గడపాలి లేదా మరింత స్వేచ్ఛగా మరియు హాయిగా జీవించడం ఎలా అని ఆయన ఆలోచించలేదు. దానికి బదులుగా, ప్రామాణికమైన తన మానవ జీవిత అనుభవాల నుండి, ప్రజల జీవితాల్లోని కష్టాలను ప్రభువైన యేసు చూశాడు. సాతాను అధికారం క్రింద జీవిస్తున్న, సాతాను అవినీతిలో పాపపు జీవితం గడుపుతున్న ప్రజల కష్టాలను, దౌర్భాగ్యాన్ని, దుఃఖాన్ని ఆయన చూశాడు. ఆయన వ్యక్తిగతంగా మానవ జీవితం అనుభవించిన సమయంలో, అవినీతి మధ్య జీవిస్తున్న మనుష్యులు ఎంతటి నిస్సహాయతలో ఉన్నారో కూడా ఆయన అనుభవించాడు మరియు పాప కూపములో జీవించే మనుష్యుల దయనీయ పరిస్థితులు చూశాడు మరియు అనుభవించాడు. సాతానునుబట్టి మరియు కీడునుబట్టి అనుభవించిన హింసల మధ్యలో వారు అన్ని దిశలు కోల్పోయారు. ప్రభువైన యేసు వీటిని చూసినప్పుడు, ఆయన వాటిని తన దైవత్వంతో చూశాడా లేక తన మానవత్వంతో చూశాడా? ఆ సమయంలో, ఆయన మానవత్వం నిజంగా ఉనికిలో ఉంది మరియు అత్యంత సజీవంగా ఉంది; ఆయన వాటన్నిటినీ అనుభవించాడు, చూడగలిగాడు. కానీ, నిజానికి ఈ విషయాలన్నింటినీ ఆయన తన దైవత్వం అనే తన గుణగణాల్లోనూ చూశాడు. ఎందుకంటే, క్రీస్తు స్వయంగా, మానవుడి రూపంలోని యేసు ప్రభువుగా ఇదంతా చూశాడు మరియు ఆయన చూసిన ఈ ప్రతి ఒక్కటీ, ఆయన శరీరధారిగా జీవించిన ఈ సమయంలో ఆయన ఎంచుకున్న పని ప్రాముఖ్యతను మరియు ఆవశ్యకతను ఆయనకు అందించింది. శరీరం ధరించిన సమయంలో, తాను చేపట్టాల్సిన బాధ్యత బాగా అపారమైనదని ఆయనకు తెలిసినప్పటికీ, పాప కూపంలో నిస్సహాయంగా ఉన్న మానవాళిని చూసినప్పుడు, వారి జీవితాల దౌర్భాగ్యం చూసినప్పుడు, తాను ఎదుర్కొబోయే శ్రమ ఎంత క్రూరంగా ఉండబోతోందో ఆయనకు తెలుసు. అలాగే, ధర్మశాస్త్రం క్రింద వారి బలహీనమైన పోరాటాలు, ఆయన్ని మరింత బాధపెట్టాయి. అందుకే, పాపం నుండి మానవాళిని రక్షించాలని మరింత ఆత్రుతకు గురయ్యాడు. తాను ఎంతటి ఇబ్బందులు ఎదుర్కొబోతున్నప్పటికీ, ఏ స్థాయి శ్రమను అనుభవించబోతున్నప్పటికీ, పాప కూపంలోని మానవాళిని విమోచించాలని ఆయన గట్టి సంకల్పముతో ఉన్నాడు. ఈ ప్రక్రియలో, ప్రభువైన యేసు తాను చేయవలసిన కార్యమును మరియు తనకు అప్పగించబడిన వాటిని మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడం ప్రారంభించాడని మీరు చెప్పగలరు. తాను ప్రారంభించబోయే కార్యమును పూర్తి చేయాలనే ఆసక్తి కూడా ఆయనలో తీవ్రమైంది, అంటే మానవజాతి ఇకపై పాపంలో జీవించకుండా ఉండడం కోసం, మానవజాతి పాపాలన్నింటినీ వహించడం, వారికి ప్రాయశ్చిత్తం అందించడానికిగల ఆసక్తి తీవ్రమయ్యింది మరియు అదేసమయంలో, పాప పరిహారార్థ బలినిబట్టి దేవుడు మనుష్యుల పాపాలను క్షమిస్తాడు, అదేవిధంగా మానవజాతిని రక్షించే తన కార్యమును కొనసాగించడానికి ఆయనకు ఆ తీవ్రత అనుమతినిస్తుంది. యేసు ప్రభువు తన హృదయంలో, స్వీయ త్యాగానికి మరియు పాపపరిహారార్థ బలికి, సిలువకు వ్రేలాడడానికి కూడా సిద్ధంగా ఉన్నాడని చెప్పవచ్చు. నిజానికి, ఈ కార్యము పూర్తి చేయడానికి ఆయన అత్యంత ఆసక్తితో ఉన్నాడు. ఆయన మానవ జీవితంలోని దుర్భర పరిస్థితులు చూసినప్పుడు, ఒక్క నిమిషం లేదా ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా, వీలైనంత త్వరగా తన లక్ష్యం పూర్తి చేయాలని ఆయన కోరుకున్నాడు. అలాంటి ఆవశ్యకత కారణంగానే, తనకు కలగబోయే బాధ ఎంత తీవ్రంగా ఉంటుందనే దాని గురించి ఆయన ఆలోచించలేదు, లేదా తాను ఎంతటి అవమానం భరించాల్సి వస్తుందనే దాని గురించి ఆయన తీవ్రంగా ఆందోళన చెందలేదు. ఆయన తన హృదయంలో ఒకే ఒక నమ్మకానికే కట్టుబడియున్నాడు: అదేమనగా, తనను తాను అర్పించుకుంటే, పాపపరిహారార్థ బలిగా సిలువకు వ్రేలాడదీయబడితే, దేవుని చిత్తం నెరవేరుతుంది మరియు క్రొత్త పనిని చేయడానికి దేవుడు ఆదేశిస్తాడు. మానవజాతి యొక్క జీవితం మరియు పాపంలో వారి ఉనికి అనేది పూర్తిగా మారిపోతుంది. ఆయన దృఢనిశ్చయం మరియు ఆయన చేయాలని నిశ్చయించుకున్నది మనిషిని రక్షించడానికి సంబంధించినవి. ఆయన ఒకే ఒక లక్ష్యాన్ని కలిగియున్నాడు. దేవుని చిత్తం నేరవేర్చినట్లయితే, దేవుడు తన కార్యపు తదుపరి దశను విజయవంతంగా ప్రారంభించగలడు. ఆ సమయంలో యేసు ప్రభువు మనస్సులో ఉన్నది ఇదొక్కటి మాత్రమే.

శరీరములో నివసిస్తున్నప్పుడు, శరీరధారియైన దేవుడు సాధారణ మానవ స్వభావమును కలిగి ఉన్నాడు; సాధారణ వ్యక్తిలోని భావోద్వేగాలను మరియు జ్ఞాన వివేకములను ఆయన కలిగి ఉన్నాడు. సంతోషం అంటే ఏమిటో, బాధ అంటే ఏమిటో ఆయనకు తెలుసు మరియు మానవజాతి ఈ రకమైన జీవితం గడపడం చూసినప్పుడు, మనుష్యులను పాపం నుండి బయటకు తీసుకురావడానికి వారికి కొన్ని బోధనలు అందించడం, వారికి ఏదైనా ఇవ్వడం లేదా వారికి ఏదైనా బోధించడం మాత్రమే సరిపోదని, ఆజ్ఞలు పాటించేలా చేయడం ద్వారా వారిని పాపం నుండి విముక్తి చేయడం సాధ్యం కాదని ఆయన లోతుగా భావించాడు, అంటే మానవాళి పాపాలు స్వీకరించి, పాపపు దేహంగా మారినప్పుడు మాత్రమే మానవజాతి స్వేచ్ఛను మరియు మానవజాతి కోసం దేవుని క్షమాపణను ఆయన గెలుచుకోగలడు. కాబట్టే, మనుష్యుల జీవితాల్లోని పాపాలు అనుభవించి, వాటిని చూసిన తర్వాత, యేసు ప్రభువు హృదయంలో ఒక తీవ్రమైన కోరిక ఆయన హృదయంలో వ్యక్తమైంది, పాపంలో పోరాడుతున్న తమ జీవితాల నుండి తమను తాము విడిపించుకోవడానికి మనుష్యులను అనుమతించాలి. ఈ కోరిక వల్లే, తాను తప్పక సిలువనెక్కాలనీ మరియు మానవాళి పాపాలను శీఘ్రంగా మరియు వీలైనంత త్వరగా తీసుకోవాలనీ ఆయన మరింత తీవ్రంగా ఆలోచించేలా చేసింది. మనుష్యులతో నివసించడం మరియు పాపంలోని వారి జీవితాలు చూడడం, వినడం మరియు అనుభవించడం జరిగిన సమయంలో యేసు ప్రభువులో ఈ ఆలోచనలే కలిగాయి. శరీరధారియైన దేవుడు మానవజాతిపట్ల ఈ విధమైన సంకల్పం కలిగి ఉన్నాడు, ఆయన ఈ విధమైన స్వభావం వ్యక్తీకరించాడు మరియు బహిర్గతం చేయగలడు, ఒక సగటు మనిషి ఇలాంటివి కలిగి ఉండగలడా? ఇలాంటి వాతావరణంలో నివసించే సగటు మనిషి చూసేదేమిటి? వారు ఎలాంటి భావనకు గురవుతారు? ఒక సగటు మనిషి ఇలాంటివన్నీ ఎదుర్కొంటే, వాళ్లు సమస్యలను ఉన్నత కోణంలో చూడగలరా? ఖచ్చితంగా చూడలేరు! శరీరధారియైన దేవుని బాహ్య రూపం అచ్చంగా మనిషిలాగే ఉన్నప్పటికీ, ఆయన మానవ జ్ఞానం నేర్చుకుని, మానవ భాషలో మాట్లాడినప్పటికీ, కొన్ని సందర్భాల్లో ఆయన మానవజాతి స్వంత పద్ధతుల ద్వారా లేదా మాట్లాడే మార్గాల ద్వారా తన ఆలోచనలు వ్యక్తీకరించినప్పటికీ, ఆయన మనుష్యులను చూసే దృష్టి కోణం మరియు వారి గుణగణాలు చూసే తీరు అనేది ఖచ్చితంగా భ్రష్టుపట్టిన మనుష్యులు మానవాళిని మరియు అంశాల గుణగణాలను చూసే తీరులాగా ఉండదు. ఆయన దృక్పథం మరియు ఆయన నిలిచి ఉండే ఔన్నత్యం అనేవి అవినీతిపరుడైన మనిషి ఎప్పటికీ సాధించలేనివిగా ఉంటాయి. ఎందుకంటే, దేవుడు అంటేనే సత్యం. ఆయన ధరించిన దేహం సైతం దేవుని గుణగణాలను కలిగి ఉంటుంది కాబట్టి, ఆయన ఆలోచనలు మరియు ఆయన మానవ రూపం ద్వారా వ్యక్తీకరించబడేవి కూడా సత్యంగా ఉంటాయి. భ్రష్టుపట్టిన ప్రజలకు సంబంధించి, ఆయన శరీరములో వ్యక్తము చేసేవన్నీ సత్యమునకు మరియు జీవమునకు సంబంధించిన నియమాలుగా ఉన్నాయి. ఈ నియమాలన్నీ ఒక వ్యక్తికి మాత్రమే కాకుండా, సమస్త మానవాళికి సంబంధించినవిగా ఉన్నాయి. భ్రష్టుపట్టిన ఎటువంటి వ్యక్తి హృదయంలోనైనా, అతడితో సంబంధం కలిగినవారు కొద్దిమందే ఉంటారు. ఆ కొద్దిమంది వ్యక్తుల కోసమే వారు శ్రద్ధ వహిస్తారు మరియు ఆందోళన చెందుతారు. విపత్తు సంభవిస్తుందనే పక్షంలో, వాళ్లు ముందుగా వారి సొంత పిల్లలను, జీవిత భాగస్వామిని లేదా తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తారు. గరిష్ట స్థాయిలో చూసినప్పుడు, ఎక్కువ దయ కలిగిన వ్యక్తి తన బంధువు గురించో లేదా మంచి స్నేహితుడి కోసమో కొంచెం ఆలోచిస్తాడు. అయితే, అలాంటి దయగల వ్యక్తి ఆలోచనలు సైతం అంతకంటే మరింతగా విస్తరించగలవా? లేదు, ఎప్పటికీ విస్తరించవు! ఎందుకంటే, మనుష్యులు ఎప్పటికీ మనుష్యులే. వాళ్లు మనిషి స్థాయి నుండి మరియు మనిషి యొక్క దృష్టికోణము నుండి మాత్రమే ప్రతిదానినీ చూడగలుగుతారు. అయితే, భ్రష్టుపట్టిన మనిషికంటే శరీరధారియైన దేవుడు పూర్తిగా భిన్నమైనవాడు. శరీరధారియైన దేవుడు ఎంత సామాన్యంగా ఉన్నప్పటికీ, ఎంతటి సాధారణ స్థితిలో ఉన్నప్పటికీ, ఎంతటి తక్కువ స్థితిని కలిగి ఉన్నప్పటికీ, లేదా మనుష్యులు ఆయన్ని ఎంతగా చిన్నచూపు చూసినప్పటికీ, మానవజాతిపట్ల ఆయన కలిగియున్న ఆలోచనలను మరియు దృక్పథాన్ని ఏ మనిషి కలిగియుండలేడు. అవి ఏ మనిషి అనుకరించలేనివి. మానవాళిని ఆయన ఎల్లప్పుడూ దైవత్వపు దృష్టికోణము నుండి, సృష్టికర్తగా తన స్థానపు ఔన్నత్యం నుండి పరిశీలిస్తాడు. మానవజాతిని ఆయన ఎల్లప్పుడూ దేవుని గుణగణాలతోను మరియు దేవుని మనస్సుతోను చూస్తాడు. మానవజాతిని ఆయన ఎప్పుడూ కూడా ఒక సగటు మనిషి అనే అథమ స్థాయి నుండి గాని లేదా ఒక భ్రష్టుపట్టిన మనుష్య కోణము నుండి గాని చూడడు. మనుష్యులు మానవాళిని చూసినప్పుడు, వాళ్లు మానవ దృష్టి కోణంతోనే చూస్తారు మరియు అంచనా కోసం వారు మానవ జ్ఞానాన్ని మరియు మానవ నియమాలను మరియు సిద్ధాంతాలను ప్రమాణాలుగా ఉపయోగిస్తారు. ఇదంతా మనుష్యులు వారి కళ్లతో చూడగలిగే పరిధికి మరియు భ్రష్ట ప్రజలు సాధించగలిగే పరిధికి పరిమితమై ఉంటుంది. దేవుడు మానవాళిని చూసినప్పుడు, ఆయన దైవిక దృష్టితో చూస్తాడు మరియు దానికి కొలమానంగా ఆయన తన గుణగణాలను మరియు తాను ఏమి కలిగియున్నాడో మరియు తాను ఏమై ఉన్నాడనే విషయాలను ఉపయోగిస్తాడు. ఇటువంటి దృష్టికోణంలో మనుష్యులు చూడలేని అంశాలు ఉంటాయి. ఈ విధంగా, శరీరధారియైన దేవుడు మరియు భ్రష్టుపట్టిన మానవులు పూర్తి విభిన్నంగా ఉంటారు. ఈ వ్యత్యాసమే మనుష్యుల గుణగణాలను మరియు దేవుని విభిన్న గుణగణాలను నిర్ణయిస్తాయి, ఈ విభిన్న గుణగణాలే వారి గుర్తింపులు మరియు స్థాయిలతోపాటు వారు విషయాలను చూసే దృక్పథమును మరియు ఔన్నత్యాన్ని నిర్ణయిస్తాయి. ప్రభువైన యేసులో మీరు దేవుని వ్యక్తీకరణను మరియు ప్రత్యక్షతను చూస్తున్నారా? యేసు ప్రభువు చేసినది మరియు చెప్పినది ఆయన పరిచర్యకు మరియు దేవుని స్వంత కార్య నిర్వహణ పనికి సంబంధించినదనీ, అదంతా దేవుని గుణగణాల వ్యక్తీకరణ మరియు ప్రత్యక్షత అని మీరు చెప్పగలరు. ఆయన మానవ ప్రత్యక్షతను కలిగి ఉన్నప్పటికీ, ఆయన దైవిక గుణగణాలను మరియు ఆయన దైవత్వపు ప్రత్యక్షతను ఉపేక్షించలేము. ఈ మానవ ప్రత్యక్షత అనేది నిజంగా మానవ ప్రత్యక్షత కాదా? ఆయన మానవ ప్రత్యక్షతే, మానవ గుణగణాలతో కూడిన ప్రత్యక్షతే, అయితే భ్రష్ట ప్రజల మానవ ప్రత్యక్షతకు పూర్తిగా విభిన్నమైనది. యేసు ప్రభువు శరీరధారియైన దేవుడైయుండెను. ఆయన కూడా ఒక సాధారణ, భ్రష్టుపట్టిన వారిలో ఒకడైతే, పాపంలో ఉన్న మానవజాతి జీవితాన్ని ఆయన దైవిక దృష్టికోణము నుండి చూడగలడా? ఖచ్చితంగా చూడలేడు! మనుష్య కుమారునికి మరియు సాధారణ ప్రజలకు మధ్య ఉన్న తేడా ఇదే. భ్రష్ట ప్రజలందరూ పాపంలో జీవిస్తారు మరియు ఎవరైనా పాపాన్ని చూసినప్పుడు, వారికి దాని గురించి ప్రత్యేకమైన భావన ఏదీ ఉండదు; వారందరూ ఒకేలా ఉంటారు. బురదలో నివసించే పందికి అది అస్సలు అసౌకర్యంగానో లేదా మురికిగానో అనిపించదు, దానికి విరుద్ధంగా, అది బాగా తింటుంది మరియు గాఢంగా నిద్రపోతుంది. ఎవరైనా ఆ పందుల దొడ్డిని శుభ్రం చేస్తే, ఆ పంది నిజంగానే అనారోగ్యంతో బాధపడుతుంది మరియు అది శుభ్రంగా ఉండడానికి ఇష్టపడదు. అంతేకాకుండా, అది మరోసారి బురదలో దొర్లాడుతుంది, ఆవిధంగా, అది పూర్తి హాయిగా ఉంటుంది. ఎందుకంటే, అది మురికిలో ఉండే జీవి. మనుష్యులు పందులను మురికిగా చూస్తారు. అయితే, పందుల దొడ్డిని నీవు శుభ్రం చేస్తే, అది ఎంతమాత్రమూ ఆనందించదు, అందుకే ఎవరూ పందిని వారి ఇంట్లో ఉంచుకోరు. మనుష్యులు పందులను చూసే దృష్టికోణం అనేది ఎల్లప్పుడూ ఎలా ఉంటుందంటే పందులు వాటికవి ఎలా భావిస్తాయో దానికి భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే, మనుష్యులు మరియు పందులు ఒకే రకమైనవి కావు. అదేవిధంగా, శరీరధారియైన మనుష్య కుమారుడు కూడా భ్రష్టుపట్టిన మనుష్యులకు సమానమైన వ్యక్తి కాదు కాబట్టే, శరీరధారియైన దేవుడు మాత్రమే దేవుని స్థాయిలో నిలబడగలడు, అక్కడి నుండి ఆయన మానవాళిని మరియు ప్రతిదానిని చూడగలడు.

దేవుడు శరీరధారిగా మారి, మానవజాతి మధ్య జీవించినప్పుడు ఆయన అనుభవించే శ్రమల సంగతేమిటి? ఈ శ్రమ ఎలాంటిది? ఎవరైనా నిజంగా అర్థం చేసుకుంటారా? దేవుడు చాలా శ్రమలు పడుతాడనీ, ఆయన దేవుడు అయినప్పటికీ, ఆయన గుణగణాలను మనుష్యులు అర్థం చేసుకోరనీ, ఎల్లప్పుడూ ఆయన్నీ ఒక మనిషిలాగే చూసేందుకు మొగ్గు చూపుతారనీ, తద్వారా ఆయన బాధింపబడిన వ్యక్తిగా మరియు తప్పు చేసిన వ్యక్తిగా భావించే విధంగా కొందరు గురి చేస్తుంటారు, ఈ కారణాలవల్లే దేవుని శ్రమలు నిజంగా తీవ్రమైన స్థితిలో ఉంటాయని వారు అంటారు. దేవుడు నిర్దోషియని మరియు పాపం లేనివాడని మరికొందరు అని చెప్పినప్పటికీ, ఆయన మానవజాతిలాగే బాధను అనుభవిస్తాడని, మానవజాతితోపాటు ఆయన హింసను, నిందను మరియు అవమానాలను భరిస్తాడని మరికొందరు అంటారు; తన అనుచరుల అపార్థాలను మరియు అవిధేయతను కూడా ఆయన సహిస్తున్నాడని వారు చెబుతారు, కాబట్టే, దేవుని శ్రమను కొలవడం నిజంగా సాధ్యం కాదని వారు అంటారు. ఇప్పుడు, మీరు నిజంగా దేవుణ్ణి అర్థం చేసుకోలేదని అనిపిస్తోంది. నిజానికి, మీరు మాట్లాడే ఈ శ్రమ అనేది దేవుని విషయంలో నిజమైన శ్రమగా పరిగణించబడదు. ఎందుకంటే, దీనికంటే తీవ్రమైన శ్రమ ఉంది. అలాంటప్పుడు, దేవుని ప్రకారముగా నిజమైన శ్రమ ఏమిటి? శరీరధారియైన దేవుని విషయంలో నిజమైన శ్రమ ఏది? మానవజాతి తనను అర్థం చేసుకోకపోవడమనేది దేవుని విషయంలో శ్రమగా పరిగణించబడదు. మనుష్యులు దేవుని గురించి కొంత అపార్థం కలిగి ఉండి, ఆయన్ని దేవునిగా చూడకపోవడం కూడా శ్రమగా పరిగణించబడదు. అయినప్పటికీ, దేవుడు చాలా అన్యాయాన్ని చవిచూశాడనీ, దేవుడు శరీరధారిగా ఉన్న సమయంలో, ఆయన తన వ్యక్తిత్వాన్ని మానవాళికి చూపించలేడనీ మరియు ఆయన గొప్పతనం చూసేందుకు ప్రజలను అనుమతించలేడనీ మరియు దేవుడు ఎటువంటి ప్రాముఖ్యతలేని శరీరములో దీనంగా ఉన్నాడని మరియు ఇదంతా ఆయనకు గొప్ప హింసగా ఉండేదనీ మనుష్యులు తరచుగా భావిస్తారు. మనుష్యులు వారు అర్థం చేసుకోగలిగే వాటిని మరియు దేవుని శ్రమల గురించి వారు చూడగలిగే వాటిని హృదయపూర్వకంగా తీసుకుంటారు మరియు దేవుని మీద అన్ని రకాల సానుభూతిని ప్రదర్శిస్తారు మరియు అన్ని శ్రమలు పడినందుకు తరచుగా ఆయన మీద కొంచెం ప్రశంసలు కూడా కురిపిస్తారు. అయితే, వాస్తవానికి, ఇందులో ఎంతో వ్యత్యాసం ఉంది; దేవుని శ్రమలు గురించి మనుష్యులు అర్థం చేసుకునే దానికి మరియు ఆయన నిజంగా అనుభవించే వాటికి మధ్య అంతరం ఉంది. నేను మీకు నిజం చెప్తున్నాను, దేవునికి సంబంధించి, అది దేవుని ఆత్మ అయినప్పటికీ, లేదా శరీరధారియైన దేవుడైప్పటికి, పైన పేర్కొన్న శ్రమ అనేది నిజమైన శ్రమ కాదు. అలాంటప్పుడు దేవుడు నిజంగా పడిన శ్రమ ఏది? శరీరధారియైన దేవుని దృష్టికోణం నుండి మాత్రమే మనం దేవుని శ్రమలు గురించి మాట్లాడుకుందాం.

దేవుడు శరీరధారిగా మారినప్పుడు, సగటు, సాధారణ వ్యక్తిగా మారినప్పుడు, మానవజాతి మధ్యలో మనుష్యుల ప్రక్కనే జీవిస్తున్నప్పుడు, జీవించడం కోసం మనుష్యుల పద్ధతులు, నియమాలు మరియు తత్వాలను ఆయన చూడలేడా మరియు అనుభూతి చెందలేడా? జీవించడం కోసం ఉద్దేశించిన ఈ పద్ధతులు మరియు నియమాలు ఆయనకి ఎలాంటి అనుభూతి కలిగిస్తాయి? ఆయన తన హృదయంలో అసహ్యంగా భావిస్తున్నాడా? ఆయన ఎందుకు అసహ్యంగా భావించాడు? జీవించడం కోసం మానవజాతి పద్ధతులు మరియు నియమాలు ఏవిధంగా ఉంటాయి? ఏ నియమాల్లోకి వాళ్లు వేళ్లూనుకుపోయారు? అవి దేని మీద ఆధారపడి ఉన్నాయి? మానవజాతి పద్ధతులు, నియమాలు మరియు అలాంటివన్నీ జీవించే విధానానికి సంబంధించినవిగా ఉన్నాయి, ఇవన్నీ సాతాను తర్కం, జ్ఞానం మరియు తత్వం ఆధారంగా సృష్టించబడ్డాయి. ఈ రకమైన నియమాల క్రింద జీవించే మానవులకు మానవత్వం ఉండదు, సత్యం తెలియదు, వీళ్లందరూ సత్యాన్ని ధిక్కరిస్తారు మరియు దేవునితో శత్రుత్వం కలిగి ఉంటారు. మనం దేవుని గుణగణాలను పరిశీలిస్తే, ఆయన గుణగణాలన్నీ సాతాను తర్కానికి, జ్ఞానానికి మరియు తత్వానికి పూర్తి వ్యతిరేకంగా ఉండడాన్ని మనం చూస్తాము. ఆయన గుణగణాలన్నీ పూర్తిగా నీతి, సత్యం మరియు పరిశుద్ధత మరియు అన్ని సానుకూల విషయాలకు సంబంధించిన ఇతర వాస్తవాలతో నిండి ఉంటుంది. ఈ గుణగణాలు కలిగి ఉండి, అలాంటి మానవజాతి మధ్య నివసించే దేవునిలో ఎలాంటి భావన ఉంటుంది? ఆయన తన హృదయంలో ఎలాంటి అనుభూతిని కలిగి ఉంటాడు? ఆయన హృదయం నొప్పితో నిండిపోయి ఉండదా? ఆయన హృదయంలో ఉండే బాధ ఏ వ్యక్తి అర్థం చేసుకోలేనిది లేదా అనుభవించలేని బాధగా ఉంటుంది. ఎందుకంటే, ఆయన ముఖాముఖిగా ఎదుర్కొనే, వినే, చూసే మరియు అనుభవించే ప్రతి ఒక్కటీ మానవజాతి యొక్క భ్రష్టత్వము, చెడు మరియు సత్యానికి వ్యతిరేకంగా వారి తిరుగుబాటు మరియు ప్రతిఘటన అనే విషయాలే ఉంటాయి. మానవుల నుండి వచ్చేదంతా ఆయన శ్రమలకు ఆధారంగా ఉంది. అంటే, ఆయన గుణగణాలనేవి అవినీతిపరులైన మానవులను పోలి ఉండదు కాబట్టి, మానవుల భ్రష్టత్వము అనేది ఆయన గొప్ప శ్రమకి మూలంగా మారుతుంది. దేవుడు శరీరము ధరించినప్పుడు, తనతో సరిపాటిగా సంభాషించగల వ్యక్తిని ఆయన కనుగొనగలడా? మనుష్యుల మధ్యన అటువంటి వ్యక్తిని కనుగొనడం అసాధ్యం. దేవునితో సంభాషించగల వ్యక్తి ఎవరూ ఉండరు, లేదా ఆయనతో ముఖాముఖిగా మాట్లాడే వ్యక్తి ఎవరూ కనిపించరు, ఈ విషయమై దేవుడు ఎలాంటి అనుభూతి కలిగి ఉంటాడో నీవు చెప్పగలవా? ప్రజలు చర్చించే, ప్రేమించే, వెంబడించే మరియు వారందరూ కోరుకునే విషయాలన్నీ పాపముతోను మరియు చెడు ధోరణులతో ముడిపడి ఉంటాయి. దేవుడు వీటన్నింటినీ ఎదుర్కొన్నప్పుడు, ఇవన్నీ ఆయన హృదయానికి కత్తి పోటు లాంటిది కాదా? ఈ విషయాలు ఎదుర్కొన్నప్పుడు, ఆయన తన హృదయంలో ఆనందంగా ఉండగలడా? ఆయన ఆదరణను పొందగలడా? ఆయనతో జీవిస్తున్నవారు తిరుగుబాటుతోను మరియు చెడుతోను నిండిన మనుష్యులే, అలాంటప్పుడు ఆయన హృదయం శ్రమ పడకుండా ఉండగలదా? ఈ శ్రమ నిజంగా ఏ స్థాయిలో ఉంటుంది, దాని గురించి ఎవరు పట్టించుకుంటారు? దాని గురించి ఎవరు శ్రద్ధ వహిస్తారు? మరియు దానిని మెచ్చుకునే సామర్థ్యం ఎవరికి ఉంది? దేవుని హృదయం అర్థం చేసుకునేందుకు మనుష్యులకు ఎలాంటి మార్గం లేదు. ఆయన శ్రమను మనుష్యలు ప్రత్యేకించి అభినందించలేరు మరియు మనుష్యులు స్పందించని స్థితి, పట్టిపట్టరాని ధోరణి అనేవి దేవుని శ్రమలను మరింత తీవ్రం చేస్తుంది.

బైబిలులోని ఒక వాక్య భాగం ఆధారంగా, క్రీస్తు దురవస్థపట్ల కొందరు వ్యక్తులు తరచూ సానుభూతి ప్రదర్శిస్తుంటారు. ఆ వాక్య భాగం ఇలా పేర్కొంటుంది: “నక్కలకు బొరియలును ఆకాశపక్షులకు నివాసములును కలవు గాని మనుష్యకుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలములేదు.” మనుష్యులు దీనిని విన్నప్పుడు, వారు దానిని హృదయంలోకి తీసుకుంటారు మరియు ఇది దేవుడు భరించే గొప్ప శ్రమ అని మరియు క్రీస్తు భరించే గొప్ప శ్రమ అని నమ్ముతారు. ఇప్పుడు, వాస్తవాల దృష్టికోణం నుండి చూస్తే, ఇది అలా అనిపిస్తోందా? లేదు; ఈ కష్టాలను దేవుడు శ్రమలుగా విశ్వసించడు. శరీర సంబంధిత తన కష్టాల కారణంగా ఆయన ఎప్పుడూ అన్యాయానికి వ్యతిరేకంగా కేకలు పెట్టలేదు. అలాగే, మనుషుల నుండి ఆయన దేనికోసమూ తిరిగి చెల్లింపు లేదా ప్రతిఫలము కోరలేదు. అయితే, మానవజాతికి మరియు భ్రష్ట జీవితాలకు మరియు భ్రష్ట మానవుల్లోని చెడుకి ఆయన సాక్ష్యమైనప్పుడు, మానవజాతియంతా సాతాను గుప్పిట్లో ఉందని మరియు సాతానుచేత బంధించబడి ఉందని, మానవజాతి మొత్తం తప్పించుకునే స్థితిలో లేదనే సంగతులకు ఆయన సాక్ష్యమైనప్పుడు, పాపంలో జీవిస్తున్న మనుష్యులకు నిజం ఏమిటో తెలియనప్పుడు, ఈ పాపాలన్నింటినీ ఆయన సహించలేడు. దీంతో, మనుష్యులపట్ల ఆయనకి రోజురోజుకీ ద్వేషం పెరుగుతోంది. కానీ, వీటన్నింటినీ ఆయన భరించాల్సి ఉంటుంది. ఇదే దేవుడు కలిగియున్న గొప్ప శ్రమ. దేవుడు తన హృదయ స్వరాన్ని లేదా ఆయన అనుచరుల మధ్యలో తన భావోద్వేగాలను సైతం సంపూర్ణంగా వ్యక్తీకరించలేడు మరియు ఆయన అనుచరుల్లోని ఎవరూ ఆయన శ్రమలను నిజంగా అర్థం చేసుకోలేరు. ఈ శ్రమను రోజు తర్వాత రోజు, సంవత్సం తర్వాత సంవత్సరం, సమయం తర్వాత సమయం మళ్లీ మళ్లీ భరిస్తున్న ఆయన హృదయాన్ని అర్థం చేసుకోవడానికి లేదా ఓదార్చడానికి కూడా ఏ ఒక్కరూ ప్రయత్నించరు. వీటన్నింటిలో మీరు ఏం చూడగలుగుచున్నారు? తాను ఇచ్చిన దానికి బదులుగా దేవుడు మనుష్యుల నుండి ఏమీ కోరుకోడు. అయితే, దేవుని గుణగణాల కారణంగా, మానవజాతి యొక్క చెడుని, భ్రష్టత్వాన్ని మరియు పాపాన్ని ఆయన ఏమాత్రం సహించలేడు. దానికి బదులుగా తీవ్రమైన అసహ్యాన్ని మరియు ద్వేషాన్ని అనుభవిస్తాడు. ఇది దేవుని హృదయంలో మరియు ఆయన దేహంలో తీరని శ్రమను శాశ్వతంగా ఉంచుతుంది. దీన్ని మీరు చూశారా? చాలావరకు, మీలో ఎవరూ దీన్ని చూడలేరు. ఎందుకంటే, మీలో ఏ ఒక్కరు నిజంగా దేవుణ్ణి అర్థం చేసుకోలేరు. కాలక్రమేణా, మీకు మీరే దీనిని క్రమక్రమంగా అనుభవించాలి.

తర్వాత, గ్రంథంలోని క్రింది భాగాలు చూద్దాం:

9. యేసు అద్భుతాలు ప్రదర్శించెను

1) అయిదు వేల మందికి యేసు ఆహారమును అందించెను

యోహాను 6:8-13 ఆయన శిష్యులలో ఒకడు, అనగా సీమోను పేతురు సహోదరుడైన అంద్రెయ ఇక్కడ ఉన్న యొక చిన్నవానియొద్ద అయిదు యవల రొట్టెలు రెండు చిన్న చేపలు ఉన్నవి గాని, యింత మందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పెను. ఆ చోట చాల పచ్చికయుండెను గనుక లెక్కకు ఇంచుమించు అయిదువేలమంది పురుషులు కూర్చుండిరి. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్నవారికి వడ్డించెను. ఆలాగున చేపలు కూడ వారికిష్టమైనంత మట్టుకు వడ్డించెను; వారు తృప్తిగా తినిన తరువాత ఏమియు నష్టపడకుండ మిగిలిన ముక్కలు పోగుచేయుడని తన శిష్యులతో చెప్పెను. కాబట్టి వారు భుజించిన తరువాత వారి యొద్ద మిగిలిన అయిదు యవలరొట్టెల ముక్కలు పోగుచేసి పండ్రెండు గంపలు నింపిరి.

2) లాజరు పునరుత్థానం దేవుణ్ణి మహిమపరుస్తుంది

యోహాను 11:43-44 ఆయన ఆలాగు చెప్పి, లాజరూ, బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయినవాడు, కాళ్లు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడినవాడై వెలుపలికి వచ్చెను; అతని ముఖమునకు రుమాలు కట్టియుండెను. అంతట యేసు, మీరు అతని కట్లు విప్పి పోనియ్యుడని వారితో చెప్పెను.

యేసు ప్రభువు ప్రదర్శించిన అద్భుతాల్లో, మనము ఈ రెండింటిని మాత్రమే ఎంచుకున్నాము. ఎందుకంటే, నేను ఇక్కడ ఏం మాట్లాడాలనుకుంటున్నానో వాటిని ప్రదర్శించడానికి అవి సరిపోతాయి. ఈ రెండు అద్భుతాలనేవి నిజంగానే ఆశ్చర్యానికి గురి చేస్తాయి మరియు కృపా యుగంలో ప్రభువైన యేసు చేసిన అద్భుతాలకు అవి గొప్పగా ప్రాతినిధ్యం వహిస్తాయి.

ముందుగా, మొదటి భాగం చూద్దాం: అయిదు వేల మందికి యేసు ఆహారము అందించెను.

“అయిదు రొట్టెలు మరియు రెండు చేపలు” అనే దానిలో దాగిన ఆలోచన ఏమిటి? సాధారణంగా, అయిదు రొట్టెలు మరియు రెండు చేపలతో ఎంతమందికి సంతృప్తిగా భోజనం అందించవచ్చు? సగటు వ్యక్తి ఆకలిని మీరు ప్రమాణంగా తీసుకుంటే, అది ఇద్దరు వ్యక్తులకు మాత్రమే సరిపోతుంది. “అయిదు రొట్టెలు మరియు రెండు చేపలు” అనే ఆలోచనలోని అత్యంత ప్రాథమిక అంశం ఇదే. అయితే, ఈ వాక్యభాగములో అయిదు రొట్టెలు మరియు రెండు చేపలతో ఎంత మందికి భోజనం అందించబడింది? పరిశుద్ధ గ్రంథంలో క్రింది విధంగా నమోదు చేయబడింది: “ఆ చోట చాల పచ్చికయుండెను గనుక లెక్కకు ఇంచుమించు అయిదువేలమంది పురుషులు కూర్చుండిరి.” ఐదు రొట్టెలు మరియు రెండు చేపలతో పోలిస్తే, ఐదువేలు మంది అనేది పెద్ద సంఖ్య కాదా? ఈ సంఖ్య చాలా పెద్దదనే విషయం దేన్ని సూచిస్తుంది? ఒక మనిషి దృష్టికోణం నుండి, ఐదు రొట్టెలు మరియు రెండు చేపలను ఐదు వేల మంది వ్యక్తులకు పంచి పెట్టడం అసాధ్యం. ఎందుకంటే, మనుష్యులు మరియు ఆహారం మధ్య వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంది. ప్రతిఒక్కరికీ చాలా చిన్న ముక్క ఇచ్చినప్పటికీ, ఆ ఆహారం అయిదు వేల మందికి సరిపోదు. కానీ, ఇక్కడ, ప్రభువైన యేసు ఒక అద్భుతం చేశాడు, ఆ అయిదు వేల మంది కడుపు నిండుగా తినగలిగేలా మాత్రమే కాకుండా, మరింత ఆహారం మిగిలేలా చేశాడు. పరిశుద్ధ గ్రంథంలో ఇలా ఉంది: “వారు తృప్తిగా తినిన తరువాత ఏమియు నష్టపడకుండ మిగిలిన ముక్కలు పోగుచేయుడని తన శిష్యులతో చెప్పెను. కాబట్టి వారు భుజించిన తరువాత వారి యొద్ద మిగిలిన అయిదు యవలరొట్టెల ముక్కలు పోగుచేసి పండ్రెండు గంపలు నింపిరి.” ఈ అద్భుతం అనేది యేసు ప్రభువు యొక్క గుర్తింపును మరియు ఆయన స్థాయిని చూసేందుకు మరియు దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదని చూసేందుకు మనుష్యులకు అవకాశం కల్పించింది, ఈ విధంగా, వారంతా దేవుని సర్వశక్తి యొక్క సత్యాన్ని చూడగలిగారు. అయిదు రొట్టెలు, రెండు చేపలు అయిదు వేల మందికి సరిపోయాయి. ఒకవేళ అక్కడ ఆహారమేదీ లేకపోతే, దేవుడు అయిదు వేల మందికి ఆహారం ఇవ్వగలిగేవాడా? నిజానికి, ఆయన ఇవ్వగలడు! ఇది ఒక అద్భుతం, కాబట్టి, అనివార్యంగా మనుష్యులు దీనిని అపారమైనది, నమ్మశక్యం కానిది మరియు రహస్యమైనదిగా భావించారు. అయితే, దేవునికి సంబంధించి, అలాంటి పని చేయడమనేది గొప్పేమీ కాదు. ఇది దేవునికి సర్వసాధారణం కాబట్టి, ఇప్పుడు వివరణ కోసం దానిని ప్రత్యేకంగా ఎందుకు పేర్కొనాలి? ఎందుకంటే, ఈ అద్భుతం వెనుక యేసు ప్రభువు సంకల్పం ఉంది. మానవజాతి అంతకు ముందెన్నడూ దానిని గ్రహించలేదు.

ముందుగా, ఈ అయిదు వేల మంది మనుష్యులు ఎలాంటివారో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. వారంతా ప్రభువైన యేసుకి అనుచరులా? వారు ఆయన అనుచరులు కాదని పరిశుద్ధ గ్రంథము ద్వారా మనకు తెలుసు. యేసు ప్రభువు ఎవరన్నది వారికి తెలుసా? ఖచ్చితంగా తెలియదు! కనీసం, వారి ముందు నిలబడిన వ్యక్తి క్రీస్తు అని కూడా వారికి తెలియదు, లేక కొంతమందికి మాత్రం ఆయన పేరు మాత్రమే తెలుసు మరియు ఆయన చేసిన పనుల గురించి కొద్దిమేర తెలిసి ఉండవచ్చు లేదా విని ఉండవచ్చు. యేసు ప్రభువు గురించి వారు విన్న కథలు మాత్రమే వారిలో ఉత్సుకతను ప్రేరేపించాయి. అయితే, వారు ఆయన్ని అనుసరించారనీ, కొంచెమైనా అర్థం చేసుకున్నారనీ మీరు ఖచ్చితంగా చెప్పలేరు. యేసు ప్రభువు ఈ అయిదు వేల మందిని చూసేటప్పటికి వారు ఆకలితో అలమటించి, కడుపు నింపుకోవాలనే ఆలోచనతో ఉన్నారు. కాబట్టి, అలాంటి సందర్భంలోనే యేసు ప్రభువు వారి కోరికను తీర్చాడు. ఆయన వారి కోరిక తీర్చినప్పుడు, ఆయన హృదయంలో ఏం ఉంది? ఆకలి తీర్చుకోవడం మాత్రమే కోరుకునే ఈ వ్యక్తులపట్ల ఆయన వైఖరి ఏమిటి? ఈ సమయంలో, ప్రభువైన యేసు ఆలోచనలు మరియు ఆయన వైఖరి దేవుని స్వభావముకు మరియు ఆయన గుణగణాలకు సంబంధించినదై ఉంది. కడుపు నిండా భోజనం చేయాలనే కోరిక మాత్రమే కలిగి, ఖాళీ కడుపులతో ఉన్న ఈ అయిదు వేల మందిని ఎదుర్కొన్నప్పుడు, తనపట్ల ఆసక్తితోను మరియు ఆశతోను నిండిన ఈ వ్యక్తులను ఎదుర్కొన్నప్పుడు, యేసు ప్రభువు వారి మీద కృపను కురిపించడానికి ఈ అద్భుతం ఉపయోగించాలని మాత్రమే ఆలోచించాడు. అయినప్పటికీ, వారు తన అనుచరులు అవుతారనే ఆశను మాత్రం ఆయన పెంచుకోలేదు. ఎందుకంటే, వారు కేవలం సరదాను మరియు కడుపునిండా తినాలనే కోరికను మాత్రమే కోరుకుంటున్నారని ఆయనకి తెలుసు. కాబట్టే, అక్కడ ఉన్నవాటిని ఆయన ఉత్తమంగా చేశాడు. అయిదు రొట్టెలు మరియు రెండు చేపలతో అయిదు వేల మందికి ఆహారము అందించాడు. ఉత్తేజకరమైన విషయాలు చూసి ఆస్వాదించే, అద్భుతాలకు సాక్ష్యంగా ఉండాలనుకునే ఈ ప్రజల కళ్లను ఆయన తెరిచాడు మరియు శరీరధారియైన దేవుడు పూర్తి చేయగల దానిని వారు తమ కళ్లతో చూశారు. వారి ఉత్సుకతను తీర్చడం కోసం ప్రత్యక్షమైన మహిమనే యేసుప్రభువు ఉపయోగించినప్పటికీ, ఈ అయిదు వేల మంది వ్యక్తులు మంచి భోజనం చేయాలని మాత్రమే కోరుకుంటున్నారని ఆయనకు తన హృదయంలో ముందే తెలుసు. కాబట్టే, ఆయన వారికి బోధించలేదు, లేదా వారికి ఏమీ చెప్పలేదు, జరిగిన అద్భుతాన్ని వారు చూడాలని మాత్రమే ఆయన కోరుకున్నాడు. తనను నిజంగా అనుసరించిన తన శిష్యులతో ప్రవర్తించిన విధంగా ఆయన అస్సలు ఈ వ్యక్తులతో ప్రవర్తించలేదు. అయితే, దేవుని హృదయంలో, సృష్టించబడిన జీవులన్నీ ఆయన పాలనలో ఉన్నాయి మరియు అవసరమైనప్పుడు తన దృష్టిలోని అన్ని జీవులు తన కృపను అనుభవించేలా దేవుడు చేస్తాడు. ఆయన ఎవరో ఈ వ్యక్తులకు తెలియకపోయినప్పటికీ, ఆయన్ని అర్థం చేసుకోకపోయినప్పటికీ, లేదా వారు రొట్టెలు మరియు చేపలు తిన్న తర్వాత కూడా ఆయనపట్ల ప్రత్యేకమైన అభిప్రాయాన్నో లేదా కృతజ్ఞతనో ప్రదర్శించకపోయినప్పటికీ, అదేదీ దేవుడు సమస్యగా భావించలేదు, ఈ వ్యక్తులు దేవుని కృపను ఆస్వాదించడానికి ఒక అద్భుతమైన అవకాశాన్ని ఆయన అందించాడు. దేవుడు తాను చేసే పనుల్లో నియమబద్ధంగా ఉంటాడనీ, అవిశ్వాసులను ఆయన చూడడనీ లేదా రక్షించడనీ, ప్రత్యేకించి, తన కృపను ఆస్వాదించడానికి వారిని ఆయన అనుమతించడనీ కొందరు అంటారు. పరిస్థితి నిజంగానే అలా ఉందా? దేవుని దృష్టిలో, వారంతా తాను స్వయంగా సృష్టించిన జీవముగల జీవులుగా ఉన్నంత కాలం, ఆయన వారిని నిర్వహిస్తాడు మరియు రక్షిస్తాడు మరియు అనేక విధాలుగా ఆయన వారితో వ్యవహరిస్తాడు. వారి కోసం ప్రణాళిక చేస్తాడు మరియు వారిని పరిపాలిస్తాడు. సృష్టించబడిన సమస్తపట్ల దేవుని ఆలోచనలు మరియు ఆయన వైఖరి ఇలాగే ఉంటుంది.

రొట్టెలు మరియు చేపలు తిన్న అయిదు వేల మంది ప్రజలు యేసు ప్రభువును అనుసరించే ప్రణాళిక వేయనప్పటికీ, ఆయన వారి నుండి దేనిని కోరుకోలేదు; వారు కడుపు నిండా తిన్న తర్వాత, యేసు ప్రభువు ఏం చేశాడో మీకు తెలుసా? ఆయన వారికి ఏమైనా బోధించాడా? ఇదంతా చేసిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్లాడు? ప్రభువైన యేసు వారితో ఏదైనా చెప్పాడనట్లుగా పరిశుద్ధ గ్రంధంలో నమోదు కాలేదు. ఆయన అద్భుతం చేసిన తర్వాత, నిశ్శబ్దంగా వెళ్లిపోయాడు. ఈ ప్రజల కోసం ఆయన ఏవైనా అవసరాలు తీర్చాడా? ఆయనలో ఏదైనా ద్వేషం ఉందా? లేదు, ఇక్కడ అవేవీ లేవు. తనను అనుసరించని ఈ వ్యక్తులను ఆయన పట్టించుకోవాలనుకోలేదు మరియు ఈ సమయంలో ఆయన హృదయం బాధలో ఉంది. మానవజాతి దుష్ప్రవర్తనను ఆయన చూశాడు మరియు మానవజాతి తనను తిరస్కరించినట్లుగా ఆయన భావించాడు. ఆయన ఈ ప్రజలను చూసినప్పుడు మరియు ఆయన వారితో ఉన్నప్పుడు, మానవ మూర్ఖత్వం మరియు అజ్ఞానం కారణంగా దుఃఖించడంతో, ఆయన హృదయం బాధలో ఉంది. అందుకే, వీలైనంత త్వరగా ఈ వ్యక్తులను విడిచిపెట్టాలని ఆయన కోరుకున్నాడు. ప్రభువు ఆయన హృదయంలో వారి కోసం ఎలాంటి అవసరాలు చేయాలనుకోలేదు. వారి మీద దృష్టి పెట్టాలని ఆయన కోరుకోలేదు. అంతకుమించి, వారి మీద తన శక్తిని ఖర్చు చేయాలని కూడా ఆయన కోరుకోలేదు. వాళ్లు తనను వెంబడించరని ఆయనకు తెలుసు. అయితే, ఇంత జరిగినప్పటికీ, వారి పట్ల ఆయన వైఖరి ఇప్పటికీ అత్యంత స్పష్టంగానే ఉంది. వారిపట్ల దయతో వ్యవహరించాలనీ, వారి మీద కృపను కురిపించాలనీ ఆయన కోరుకున్నాడు. నిజానికి, తన పాలనలోని ప్రతి జీవిపట్ల దేవుడి వైఖరి అనేది ప్రతి జీవిని దయతో చూడడం, వాటికి కావలసిన ప్రతి అవసరమును తీర్చడం మరియు వాటిని పోషించాలనే ధోరణితోనే ఉంటుంది. ప్రభువైన యేసు శరీరధారియైన దేవుడు కాబట్టి, ఆయన అత్యంత సహజంగానే దేవుని స్వంత గుణగణాలను బయలుపరిచాడు మరియు ఈ ప్రజలపట్ల దయతో వ్యవహరించాడు. కనికరం నిండిన హృదయంతోను మరియు సహనంతోను వారిని ఆదరించాడు. అలాంటి హృదయంతో ఆయన వారి మీద దయ చూపాడు. ప్రభువైన యేసును ఈ ప్రజలు ఎలా చూసినప్పటికీ మరియు ఫలితం ఎలా ఉన్నప్పటికీ, సకల సృష్టికి ప్రభువుగా తన స్థానం ఆధారంగా ఆయన ప్రతి జీవితో వ్యవహరించాడు. ఆయన బహిర్గతం చేసిన ప్రతి ఒక్కటీ, మినహాయింపు లేకుండా, దేవుని స్వభావమును మరియు ఆయన ఏమి కలిగియున్నాడో మరియు ఆయన ఏమై ఉన్నాడనే విషయాలనే వ్యక్తము చేసియున్నాడు. ప్రభువైన యేసు ఈ పనిని నిశ్శబ్దంగా చేశాడు. అటుమీదట నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు, ఇది దేవుని స్వభావంలో ఎలాంటి అంశం? ఇది దేవుని ప్రేమపూర్వక దయ అని మీరు చెప్పగలరా? ఇది దేవుని నిస్వార్థత అని మీరు చెప్పగలరా? ఒక సాధారణ మనిషికి ఇదంతా సాధ్యం కాగలదా? ఖచ్చితంగా సాధ్యం కాదు! అయిదు రొట్టెలు మరియు రెండు చేపలతో యేసు ప్రభువు ఆహారము భుజించిన ఈ ఐదు వేలమంది వ్యక్తులు గుణగణాల్లో ఎలాంటివారు? వారు ఆయనకు అనుకూలమైన వ్యక్తులని మీరు చెప్పగలరా? వారందరూ దేవునికి విరోధులని మీరు చెప్పగలరా? వారంతా దేవునితో సంపూర్ణంగా సరిపోలేరనీ మరియు వారి గుణగణాలు దేవునికి పూర్తిగా విరుద్ధమైనవనీ ఖచ్చితంగా చెప్పవచ్చు. అయితే, దేవుడు వారితో ఎలా ప్రవర్తించాడు? దేవునిపట్ల ప్రజల శత్రుత్వం తగ్గించడం కోసం ఆయన ఒక పద్ధతి ఉపయోగించాడు, ఈ పద్ధతినే “దయ” అని పిలుస్తారు. అంటే, ప్రభువైన యేసు ఈ ప్రజలను పాపులుగా చూసినప్పటికీ, దేవుని దృష్టిలో వారంతా ఆయన సృష్టియైయున్నారు. కాబట్టే, ఆయన ఇప్పటికీ ఈ పాపులతో దయతో వ్యవహరించాడు. ఇదే దేవుని సహనం, మరియు ఈ సహనం అనేది దేవుని స్వంత గుర్తింపు మరియు గుణగణాల ద్వారా నిర్ణయించబడుతుంది. కాబట్టే, దేవుని ద్వారా సృష్టించబడిన మనుష్యులెవరూ ఇలా చేయలేరు, దేవుడు మాత్రమే ఇలా చేయగలడు.

మానవాళిపట్ల దేవుని ఆలోచనలు మరియు ఆయన వైఖరిని మీరు నిజంగా అభినందించగలిగినప్పుడు, దేవుని భావోద్వేగాలను మరియు సృష్టిలోని ప్రతి జీవిపట్ల ఆయనకున్న శ్రద్ధను మీరు నిజంగా అర్థం చేసుకోగలిగినప్పుడు, సృష్టికర్త ద్వారా సృష్టించబడిన ప్రతి ఒక్క వ్యక్తి మీద ఆయన వెచ్చించే శ్రద్ధను మరియు ప్రేమను మీరు అర్థం చేసుకోగలరు. ఇది జరిగినప్పుడు, దేవుని ప్రేమను వివరించడానికి మీరు రెండు పదాలు ఉపయోగిస్తారు. ఆ రెండు పదాలు ఏమిటి? కొంతమంది “నిస్వార్థం” అని, మరికొందరు “పరోపకారం” అంటారు. ఈ రెండింటిలో, దేవుని ప్రేమను వర్ణించడానికి “పరోపకారం” అనే పదం తక్కువగా మాత్రమే సరిపోతుంది. ఉదాత్తమైన లేదా విశాల మనస్సు కలిగిన వ్యక్తిని వర్ణించడానికి మనుష్యులు ఉపయోగించే పదం ఇది. నేను ఈ పదాన్ని అసహ్యించుకుంటున్నాను. ఎందుకంటే, ఇది యాదృచ్ఛికంగా, విచక్షణారహితంగా, నియమాన్ని పరిగణనలోకి తీసుకోకుండా దాతృత్వం అందించడాన్ని సూచిస్తుంది. ఇది మూర్ఖులకు మరియు గందరగోళ వ్యక్తులకు సాధారణమైన ఈ పదం మితిమీరిన భావుకత వైపు మొగ్గు చూపేదిగా ఉంటుంది. దేవుని ప్రేమను వర్ణించడానికి ఈ పదం ఉపయోగించినప్పుడు, అది అనివార్యంగా దైవదూషణ అర్థాన్ని సూచిస్తుంది. దేవుని ప్రేమను ఎక్కువ సముచితంగా వివరించే రెండు పదాలు ఇక్కడున్నాయి. అవి ఏమిటి? మొదటిది “అపారమైనది.” ఈ పదం అత్యంత ఉద్వేగభరితమైనది కాదా? రెండవది “విశాలమైనది.” దేవుడి ప్రేమను వివరించడం కోసం నేను ఉపయోగించే ఈ రెండు పదాల వెనుక నిజమైన అర్థం ఉంది. అక్షరార్థంగా చూస్తే, “అపారమైనది” అనేది ఒక వస్తువుకు సంబంధించిన పరిమాణాన్ని లేదా సామర్థ్యాన్ని సూచిస్తుంది. అయితే, అది ఎంత పెద్దదైనప్పటికీ, మనుష్యులు స్పర్శించేది మరియు చూడగలిగేదిగా ఉంటుంది. ఇది ఉనికిలో ఉంటుంది కాబట్టి ఇదేమీ అమూర్తమైనది కాదు. అయితే, సాపేక్షంగా ఇది మనుష్యులకు ఖచ్చితమైన మరియు ఆచరణాత్మక మార్గంలో ఆలోచనలు అందించగలదు. దీనిని మీరు రెండు, లేదా మూడు మితీయ దృష్టికోణము నుండి చూసినప్పటికీ, దాని ఉనికిని మీరు ఊహించాల్సిన అవసరమేమీ లేదు. ఎందుకంటే, నిజానికి అది నిజంగా కనిపిస్తున్న ఒక వస్తువు. దేవుని ప్రేమను వర్ణించడానికి “అపారమైనది” అనే పదం ఉపయోగించడమనేది ఆయన ప్రేమను పరిమాణాత్మకంగా చూపే ప్రయత్నంగా అనిపించినప్పటికీ, ఆయన ప్రేమ అపరిమితమైనదనే భావనను కూడా అది అందిస్తుంది. దేవుని ప్రేమను లెక్కించవచ్చునని నేను చెప్తున్నాను. ఎందుకంటే, ఆయన ప్రేమ ఖాళీగా ఉండేది కాదు మరియు అదేమీ పుక్కిట పురాణం కాదు. బదులుగా, దేవుని పాలనలోని అన్ని జీవుల ద్వారా, విభిన్న స్థాయిల్లో మరియు విభిన్న దృష్టికోణాల నుండి అది ఆస్వాదించబడుతుంది. మనుష్యులు దానిని చూడలేనప్పటికీ లేదా స్పర్శించలేనప్పటికీ, ఈ ప్రేమ అనేది వారి జీవితాల్లో కొద్దికొద్దిగా బహిర్గతమైనప్పుడు సమస్త జీవులకు పోషణను మరియు జీవితాన్ని తీసుకొస్తుంది మరియు గడిచే ప్రతి క్షణంలో అవి ఆనందించే దేవుని ప్రేమను అవి లెక్కించి, దేవునికి సాక్ష్యమిస్తారు. దేవుని ప్రేమ లెక్కించలేనిదని నేను చెప్తున్నాను. ఎందుకంటే, సమస్త జీవులపట్ల, ప్రత్యేకించి మానవజాతిపట్ల దేవుని ఆలోచనలు విభిన్నంగా ఉండడంవల్ల సమస్త జీవులకు దేవుడు సమకూర్చి అందించడం మరియు వాటిని పోషించడం అనే రహస్యాన్ని అర్థం చేసుకోవడమనేది మనుష్యులకు కష్టతరమైనది. అంటే, మానవాళి కోసం సృష్టికర్త ధారపోసిన రక్తం, కన్నీళ్లు ఎవరికీ తెలియవు. తన స్వహస్తాలతో సృష్టించిన మానవాళి మీద సృష్టికర్తకు ఉన్న ప్రేమ యొక్క లోతును లేదా బరువును ఎవరూ గ్రహించలేరు, ఎవరూ అర్థం చేసుకోలేరు. దేవుని ప్రేమను అపారమైనదిగా వర్ణించడంవల్ల, మనుష్యులు దాని విస్తృతిని మరియు దాని ఉనికి అనే సత్యాన్ని మెచ్చుకోవడంలో మరియు అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. అలాగే, “సృష్టికర్త” అనే పదానికి సంబంధించిన నిజమైన అర్థాన్ని మనుష్యులు మరింత లోతుగా అర్థం చేసుకోగలరు మరియు తద్వారా, “సృష్టికర్త” అనే పేరుకి సంబంధించిన నిజమైన అర్ధం గురించి లోతైన అవగాహన పొందగలరు. “విశాలమైనది” అనే పదం సాధారణంగా దేన్ని వర్ణిస్తుంది? ఇది సాధారణంగా సముద్రం లేదా విశ్వాన్ని వివరించడానికి ఉపయోగించబడుతుంది, ఉదాహరణకు: “విశాల విశ్వం,” లేదా “విశాలమైన సముద్రం” అని చెబుతుంటారు. విశ్వం యొక్క విస్తరణ మరియు పూర్తిస్థాయి లోతు అనేది మానవ అవగాహనకు అతీతమైనది; ఇది మనిషి ఊహను చేరపట్టే విషయం. కాబట్టే, దానిని వారు గొప్పగా మెచ్చుకుంటారు. దాని రహస్యం మరియు జ్ఞానం కనుచూపు మేరలోనే ఉంటాయి. కానీ, చేరుకోవడమే సాధ్యం కాదు. మీరు సముద్రం గురించి ఆలోచించినప్పుడు, మీరు దాని విస్తృతి గురించి ఆలోచిస్తారు, అది అపరిమితంగా కనిపిస్తుంది మరియు దాని రహస్యతను గురించి మరియు ఎన్నో విషయాలను కలిగియుండె దాని సామర్థ్యాన్ని మీరు అనుభూతి చెందుతారు. కాబట్టే, దేవుని ప్రేమను వర్ణించే క్రమంలో, అది ఎంత విలువైనదో మనుష్యులు అనుభూతి చెందడానికి, ఆయన ప్రేమలోని లోతైన సౌందర్యాన్ని అనుభూతి చెందడానికి మరియు దేవుని ప్రేమలోని శక్తి అనంతమైనది మరియు విస్తృతమైనది అని తెలియజెప్పడానికి నేను “విశాలమైన” అనే పదం ఉపయోగించాను. దేవుని ప్రేమలోని పరిశుద్ధతను మరియు దేవుని ప్రేమ ద్వారా వెల్లడి చేయబడిన గొప్పదనం మరియు నిరపరాధ భావాన్ని అనుభూతి చెందడానికి నేను ఈ పదాన్ని ఉపయోగించాను. దేవుని ప్రేమను వర్ణించడానికి “విశాలమైన” అనే పదం అనువైన పదమని మీరిప్పుడు భావిస్తున్నారా? “అపారమైనది” మరియు “విశాలమైనది” అనే ఈ రెండు పదాలు దేవుని ప్రేమను కొలవగలవా? తప్పకుండా కొలవగలవు! మానవ భాషలోని ఈ రెండు పదాలు మాత్రమే కొంతవరకు సముచితమైనవి మరియు దేవునిప్రేమను వివరించడానికి సాపేక్షంగా దగ్గరగా ఉంటాయి. మీకు అలాంటి భావన కలగడం లేదా? దేవుని ప్రేమను వర్ణించాల్సిందిగా నేను మిమ్మల్ని కోరితే, మీరు ఈ రెండు పదాలు ఉపయోగిస్తారా? చాలావరకు మీరలా చేయరు. ఎందుకంటే, దేవుని ప్రేమను మీరు అర్థం చేసుకోవడం మరియు మెచ్చుకోవడమనేది ద్విమితీయ దృక్పథం పరిధికి పరిమితం చేయబడింది మరియు త్రిమితీయ ప్రదేశపు ఎత్తుకు ఇంకా చేరుకోలేదు. కాబట్టే, దేవుని ప్రేమను వర్ణించాల్సిందిగా నేను మిమ్మల్ని కోరితే, మీ వద్ద మాటలే లేనట్లుగా మీరు భావిస్తారు, లేక, మీరు మాటలు రాని వారుగా కూడా మారిపోతారు. ఈ రోజు నేను పేర్కొన్న ఈ రెండు పదాలను అర్థం చేసుకోవడం మీకు కష్టంగా ఉండవచ్చు, లేక మీరు వాటిని అంగీకరించకపోవచ్చు. ఎందుకంటే, మీరు దేవుని ప్రేమను ప్రశంసించడం మరియు అర్థం చేసుకోవడమనేది మీ మిడిమిడి జ్ఞానానికి మరియు సంకుచిత పరిధికి మాత్రమే పరిమితమైనదని చూపిస్తుంది. దేవుడు నిస్వార్థపరుడు అని నేను ముందే చెప్పాను; “నిస్వార్థపరుడు” అనే ఈ పదాన్ని మీరు గుర్తుంచుకోండి. దేవుని ప్రేమ నిస్వార్థమైనది అని మాత్రమే వర్ణించబడుతుందా? అలా చేస్తే, అది అత్యంత సంకుచితమైన పరిధి కాదా? మీరు ఈ అంశాన్ని మరింత లోతుగా ఆలోచించాలి. తద్వారా, మీరు దాని నుండి ఎంతోకొంత పొందుకోవచ్చు.

పైన మనం మొదటి అద్భుతం నుండి దేవుని స్వభావం మరియు ఆయన గుణగణాలను చూశాం. ఇది అనేక వేల సంవత్సరాలుగా మనుష్యులు చదువుతున్న కథే అయినప్పటికీ, ఈ కథాంశం సరళంగానే ఉంటుంది మరియు ఒక చిన్న అసాధారణ విషయాన్ని చూసేందుకు మనుష్యులను అనుమతిస్తుంది. అయినప్పటికీ, ఈ సాధారణ కథలోనే మనం దేవుని స్వభావం మరియు ఆయన ఏమి కలిగి ఉన్నాడు మరియు ఆయన ఏమై ఉన్నాడనే మరింత విలువైన విషయాన్ని చూడవచ్చు. ఆయన ఏమి కలిగి ఉన్నాడు మరియు ఆయన ఏమై ఉన్నాడనే ఈ విషయాలన్నీ స్వయంగా దేవుణ్ణి సూచిస్తాయి మరియు అవన్నీ దేవుని స్వంత ఆలోచనల వ్యక్తీకరణగా ఉంటాయి. దేవుడు తన ఆలోచనలు వ్యక్తీకరించినప్పుడు, అవన్నీ ఆయన హృదయ స్వరపు వ్యక్తీకరణగా ఉంటాయి. ఆయన్ని అర్థం చేసుకోగలిగే, ఆయన్ని తెలుసుకునే, ఆయన చిత్తాన్ని గ్రహించగల, ఆయన హృదయ స్వరం విని, ఆయన సంకల్పాన్ని సంతృప్తి పరచడంలో చురుగ్గా సహకరించే వ్యక్తులు ఉంటారనేది ఆయన విశ్వాసం. ప్రభువైన యేసు చేసిన ఈ పనులన్నీ దేవుని స్వరరహిత వ్యక్తీకరణలే.

తరువాత, ఈ క్రింది భాగాన్ని చూద్దాం: లాజరు పునరుత్థానం దేవుణ్ణి మహిమపరుస్తుంది.

ఈ భాగం చదివిన తర్వాత మీలో ఎలాంటి భావనలు కలిగాయి? యేసు ప్రభువు చేసిన ఈ అద్భుతం ప్రాముఖ్యత అనేది గతంలో దానికంటే చాలా గొప్పది. ఎందుకంటే, చనిపోయిన వ్యక్తిని సమాధి నుండి తిరిగి తీసుకురావడంకంటే గొప్పదైన అద్భుతం మరేదీ లేదు. ఆ యుగంలో, ప్రభువైన యేసు ఇలాంటి ఒక అద్భుతం చేయడం ద్వారా ఎంతో ప్రాముఖ్యతను నెలకొల్పింది. ఎందుకంటే, దేవుడు శరీరం ధరించడంవల్ల, మనుష్యులు ఆయన భౌతిక రూపాన్ని, ఆయనలోని ఆచరణాత్మక పార్శ్వాన్ని మరియు ఆయనలోని ప్రాముఖ్యంలేని అంశాన్ని మాత్రమే చూడగలిగారు. కొంతమంది మనుష్యులు ఆయన స్వభావాన్ని, లేదా ఆయన కలిగి ఉన్న కొన్ని ప్రత్యేక సామర్థ్యాలను చూసి మరియు వాటిని అర్థం చేసుకున్నప్పటికీ, యేసు ప్రభువు ఎక్కడ నుండి వచ్చాడో, ఆయన తన గుణగణాల్లో నిజంగా ఎవరై ఉన్నాడో, నిజానికి ఆయన చేయగల ఇతర విషయాలేమిటో ఎవరికీ తెలియదు. ఇవేవీ మానవాళికి తెలియనివి. యేసు ప్రభువు గురించిన ఈ ప్రశ్నలకు సమాధానమివ్వడానికి మరియు సత్యాన్ని తెలుసుకోవడానికి రుజువు కనుగొనాలని చాలామంది వ్యక్తులు కోరుకున్నారు. దేవుడు తన స్వంత గుర్తింపును నిరూపించుకోవడానికి ఏదైనా చేయాలా? దేవునికి, అలా నిరూపించుకోవాలంటే ఆయనకు అదెంతో సులభతరమైన విషయం, ఎటువంటి ప్రయాస లేకుండా నిరూపించుకోగలడు. ఆయన తన అస్తిత్వం మరియు గుణగణాలు నిరూపించుకోవడానికి ఆయన ఎక్కడైనా, ఎప్పుడైనా ఏదైనా చేయగలడు. కానీ, దేవుడు తన పనులు చేయడానికి ఒక పద్ధతి కలిగి ఉన్నాడు, అంటే ఒక ప్రణాళికతో మరియు కొన్ని దశల్లో ఆయన ఆ పనులు చేస్తాడు. ఆయన విచక్షణారహితంగా పనులు చేయడు. కానీ, మనిషి చూసేందుకు అనుమతించే, నిజంగా అర్థవంతమైన ఏదైనా చేయడానికి సరైన సమయం మరియు సరైన అవకాశం కోసం ఆయన చూస్తాడు. ఈ విధంగా, ఆయన తన అధికారాన్ని మరియు గుర్తింపును నిరూపించుకున్నాడు. అలాంటప్పుడు, లాజరు పునరుత్థానం ప్రభువైన యేసు యొక్క గుర్తింపును రుజువు చేయగలదా? మనం ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలోని క్రింది లేఖన భాగాన్ని చూద్దాం: “ఆయన ఆలాగు చెప్పి, లాజరూ, బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయినవాడు, కాళ్లు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడినవాడై వెలుపలికి వచ్చెను….” ప్రభువైన యేసు ఇలా చేసినప్పుడు, ఆయన: “లాజరూ, బయటికి రా” అనే ఒక్క మాట మాత్రమే చెప్పాడు. అప్పుడు, లాజరు తన సమాధి నుండి బయటికి వచ్చాడు, ప్రభువు చెప్పిన కొన్ని మాటలతోనే ఇది సాధించబడింది. ఈ సమయంలో, ప్రభువైన యేసు బలిపీఠం ఏర్పాటు చేయలేదు మరియు ఇతర పనులేవీ ఆయన నిర్వహించలేదు. ఈ ఒక్క మాట మాత్రమే చెప్పాడు. దీన్ని అద్భుతం అని పిలవాలా లేక ఆజ్ఞ అని పిలవాలా? లేదంటే, ఇదంతా ఒక విధమైన తాంత్రికమా? పైపైన చూసినప్పుడు, దీనిని ఒక అద్భుతంగా పిలవొచ్చని అనిపిస్తుంది మరియు దీనిని మీరు ఆధునిక కోణం నుండి చూస్తే, అప్పటికీ మీరు దీనిని అద్భుతం అనే పిలవొచ్చు. ఏదేమైనప్పటికీ, ఇదైతే ఖచ్చితంగా చనిపోయినవారి నుండి ఆత్మను వెనక్కు పిలిచేటువంటి మాయాజాలంగా పరిగణించబడదు. అలాగే, ఖచ్చితంగా ఇది ఏ విధమైన తాంత్రికత కాదు. ఈ అద్భుతం అనేది సృష్టికర్త అధికారానికి అత్యంత సాధారణమైన చిన్న ప్రదర్శన మాత్రమే అని చెప్పడం సరైనదిగా ఉంటుంది. ఇదే దేవుని అధికారం మరియు ఆయన శక్తియైయున్నది. ఒక వ్యక్తి చనిపోయి, అతని ఆత్మ అతని శరీరాన్ని విడిచిపెట్టి, పాతాళానికి చేరుకోవాలన్న, లేదంటే అది ఇంకెక్కడికైనా వెళ్లాలాన్న దానిని నిర్ణయించే అధికారం దేవునికి ఉంటుంది. ఒక వ్యక్తి మరణించే సమయం మరియు మరణం తర్వాత వాళ్లు వెళ్ళే ప్రదేశం, ఇవన్నీ దేవుని ద్వారా నిర్ణయించబడతాయి. మనుష్యులు, సంఘటనలు, వస్తువులు, ప్రదేశాలు లేదా భౌగోళికాంశాల నిర్బంధమేదీ లేకుండా ఆయన ఎప్పుడైనా మరియు ఎక్కడైనా ఈ నిర్ణయాలు తీసుకోవచ్చు. ఆయన ఏదైనా చేయాలనుకుంటే, దానిని ఆయన చేయగలడు. ఎందుకంటే, సృష్టించబడిన సమస్తము మరియు జీవులన్నియు ఆయన పాలనలోనే ఉన్నాయి మరియు ఆయన వాక్కు మరియు ఆయన అధికారం ద్వారానే అవన్నీ పుడుతాయి, జీవిస్తాయి మరియు నశిస్తాయి. చనిపోయిన వ్యక్తిని ఆయన తిరిగి లేపగలడు మరియు అది కూడా ఎప్పుడైనా, ఎక్కడైనా ఆయన అలా చేయగలడు. ఇలాంటి అధికారం సృష్టికర్తకు మాత్రమే ఉంటుంది.

లాజరును మరణం నుండి వెనక్కు తీసుకురావడంలాంటి పనులు యేసు ప్రభువు చేసినప్పుడు, మనుష్యులు మరియు సాతానుకు కనిపించేలా సాక్ష్యమివ్వడం మరియు మానవజాతికి సంబంధించిన అన్నింటితో సహా, మానవజాతి జీవితం మరియు మరణంలాంటి ప్రతిఒక్కటీ దేవుని ద్వారా నిర్ణయించబడుతుందని మనుష్యులకు మరియు సాతానుకు తెలియజేయడం మరియు ఆయన శరీరంలో ఉన్నప్పటికీ, ఆయన చూడగలిగే భౌతిక ప్రపంచానికి మరియు మనుష్యులు చూడలేని ఆత్మ సంబంధిత ప్రపంచానికి ఆయనే నాయకత్వం వహిస్తాడని తెలియజేయడమే ఆయన లక్ష్యం. మానవజాతికి సంబంధించిన ప్రతి ఒక్కటీ సాతాను ఆధీనంలో లేదనే విషయాన్ని మానవజాతి మరియు సాతాను తెలుసుకునేలా ఇది చేస్తుంది. ఇది దేవుని అధికారానికి సంబంధించిన ప్రత్యక్షత మరియు ప్రదర్శనయైయున్నది. మానవజాతి యొక్క జీవన్మరణములు దేవుని చేతుల్లోనే ఉందనే సందేశాన్ని దేవుడు సమస్తానికి తెలియజేయడానికి ఇదొక విధానమైయున్నది. లాజరుని ప్రభువైన యేసు మరణము నుండి తిరిగి లేపడమనేది మానవాళికి సృష్టికర్త బోధించే మరియు సూచించే మార్గాల్లో ఒకటి. మానవాళికి బోధించడానికి మరియు సమకూర్చడానికి దేవుడు తన శక్తిని మరియు అధికారాన్ని ఉపయోగించిన ఒక నిర్దిష్ట చర్య ఇది. ఎలాంటి వాక్కులను ఉపయోగించకుండానే, సమస్తాన్ని తానే ఆజ్ఞాపిస్తున్నాడనే సత్యాన్ని చూసేలా మనుష్యులను అనుమతించడానికి సృష్టికర్తకు ఇదొక విధానమైయుండెను. ఆయన ద్వారా తప్ప వేరే రక్షణ లేదని ఆచరణాత్మక చర్యల ద్వారా మానవాళికి చెప్పడానికి ఇది ఒక విధానమైయుండెను. మానవాళికి ఉపదేశించేందుకు ఆయన ఉపయోగించిన ఈ నిశ్శబ్దపు విధానము శాశ్వతమైనది, చెరగనిది, మానవ హృదయాల నుండి ఎప్పటికీ మాసిపోలేని ఒక దిగ్భ్రాంతిని మరియు జ్ఞానోదయాన్ని కలిగిస్తుంది. లాజరు పునరుత్థానం అనేది దేవుణ్ణి మహిమ పరిచింది, ఇది దేవుని అనుచరుల్లోని ప్రతి ఒక్కరి మీద లోతైన ప్రభావం చూపుతుంది. ఈ సంఘటనను లోతుగా అర్థం చేసుకున్న ప్రతి మనిషిలో మానవాళి జీవితం మరియు మరణం అనేవి దేవుడు మాత్రమే ఆజ్ఞాపించగలడనే అవగాహనను, దర్శనాన్ని ఇది దృఢంగా స్థిరపరుస్తుంది. దేవునికి ఈ రకమైన అధికారం ఉన్నప్పటికీ, లాజరు పునరుత్థానం ద్వారా మానవజాతి జీవనం మరియు మరణం మీద ఆయన సార్వభౌమాధికారం గురించిన సందేశం పంపినప్పటికీ, ఇదేమీ ఆయన ప్రాథమిక పని కాదు. దేవుడు ఎప్పుడూ అర్థ రహితమైనది ఏదీ చేయడు. ఆయన చేసే ప్రతి పనికి గొప్ప విలువ ఉంటుంది మరియు సంపదల భాండాగారంలో అదొక అద్భుతమైన ఆభరణంగా ఉంటుంది. ఆయన తన పనిలోని ప్రాథమికంగానో లేదా ఏకైక లక్ష్యంగానో లేదా అంశంగానో “ఒక వ్యక్తి తన సమాధి నుండి బయటకు వచ్చేలా” చేయడు. అర్థరహితమైన ఏ పనినీ దేవుడు చేయడు. లాజరు పునరుత్థానం అనేది దేవుని అధికారం ప్రదర్శించడానికి మరియు ప్రభువైన యేసు యొక్క గుర్తింపును నిరూపించడానికి ఒక సంఘటనగా సరిపోతుంది. కాబట్టే, యేసు ప్రభువు ఈ రకమైన అద్భుతాన్ని పునరావృతం చేయలేదు. దేవుడు తన స్వంత నియమాల ప్రకారమే పనులు చేస్తాడు. మానవ భాషలో చెప్పాలంటే, దేవుడు తన మనస్సును కీలకమైన విషయాలతో మాత్రమే నింపి ఉంచుతాడు. కాబట్టే, దేవుడు పనులు చేసినప్పుడు, తన పని ఉద్దేశ్యం నుండి ఆయన తప్పించుకోడు. ఈ దశలో ఆయన ఏ పనిని చేయాలనుకుంటున్నాడో, ఆయన ఏం సాధించాలనుకుంటున్నాడో ఆయనకు తెలుసు మరియు ఆయన తన ప్రణాళిక ప్రకారమే ఖచ్చితంగా పని చేస్తాడు. భ్రష్టుడైన వ్యక్తికి అలాంటి సామర్థ్యమే ఉంటే, అతడు తన సామర్థ్యాన్ని బహిర్గతం చేయడానికి విధానాల గురించి ఆలోచిస్తాడు. తద్వారా, అతను ఎంతటి బలీయమైనవాడో ఇతరులు తెలుసుకుంటారు. కాబట్టి వారు అతనికి తలొగ్గుతారు. తద్వారా, అతను వారిని నియంత్రించవచ్చు మరియు వారిని నాశనం చేయవచ్చు. ఇలాంటి చెడు అనేది సాతాను నుండి వస్తుంది, దీన్నే భ్రష్టత్వము అని అంటారు. దేవునికి ఇటువంటి స్వభావము లేదు మరియు ఆయనకు ఇటువంటి గుణగణాలు లేవు. ఇలాంటి పనులు చేయడంలో ఆయన ఉద్దేశ్యం తనను తాను ప్రదర్శించుకోవడం కాదు. మానవాళికి మరింత ప్రత్యక్షతను మరియు మార్గదర్శకత్వమును అందించడమే. అందుకే, ఈ రకమైన ఘటనల గురించి మనుష్యులకు బైబిలులో చాలా తక్కువ ఉదాహరణలే కనిపిస్తాయి. అంతమాత్రన, ప్రభువైన యేసుకి శక్తులు పరిమితంగానే ఉన్నాయనీ లేదా అలాంటి వాటికి ఆయన అసమర్థుడనీ చెప్పడం కుదరదు. ప్రభువైన యేసు ప్రకారం, లాజరు పునరుత్థానం చాలా ఆచరణాత్మక ప్రాముఖ్యత కలిగినది కాబట్టి, అలాగే శరీరధారిగా మారిన దేవుని ప్రధానమైన పని అద్భుతాలు చేయడమో, చనిపోయిన వ్యక్తులను తిరిగి తీసుకురావడమో కాకుండా, మానవజాతి కోసం విమోచన కార్యమును చేయడం కాబట్టి, ఆయన మళ్లీ ఆయన ఆ అద్భుతం చేయలేదు. కాబట్టే, ప్రభువైన యేసు పూర్తి చేసిన పనిలో ఎక్కువ భాగం ప్రజలకు బోధించడం, వారికి సమకూర్చడం మరియు వారికి సహాయం చేయడం జరిగింది. అలాగే, లాజరును తిరిగి లేపే సంఘటనలు ప్రభువైన యేసు నిర్వహించిన పరిచర్యలో ఒక చిన్న భాగం మాత్రమే. అంతకంటే, ఎక్కువగా “ప్రదర్శించడం” అనేది దేవుని గుణగణాల్లో భాగం కాదని మీరు చెప్పవచ్చు. కాబట్టే, ఎక్కువ అద్భుతాలు ప్రదర్శించకుండా ఉండుటవలనలేదా ఇదంతా పర్యావరణ పరిమితులవల్ల. అలాగే, ఖచ్చితంగా ఇది శక్తి లేకపోవడంవల్ల యేసు ప్రభువు ఉద్దేశపూర్వకంగా నిర్బంధమును పాటించలేదు,

యేసు ప్రభువు లాజరును మరణం నుండి తిరిగి బయటకు తీసుకువచ్చినప్పుడు, ఆయన: “లాజరూ, బయటికి రా” అనే కొన్ని పదాలను మాత్రమే ఉపయోగించాడు. అంతకుమించి ఆయన ఏమీ మాట్లాడలేదు. కాబట్టి, ఈ మాటలు ఏం ప్రదర్శిస్తున్నాయి? చనిపోయిన వ్యక్తిని పునరుత్థానునిగా చేయడంతో సహా, మాటల ద్వారానే దేవుడు ఏదైనా సాధించగలడని అవి ప్రదర్శిస్తున్నాయి. దేవుడు అన్నింటినీ సృష్టించినప్పుడు, ఆయన ప్రపంచాన్ని సృష్టించినప్పుడు, ఆయన మాటలతోనే చేశాడు, ఉచ్చరించిన ఆజ్ఞలు, అధికారంతో కూడిన వాక్కులతోనే ప్రతిఒక్కటీ సృష్టించబడింది మరియు ఆ విధంగా సమస్తము పూర్తి చేయబడింది. ప్రభువైన యేసు చెప్పిన ఈ కొన్ని మాటలు ఎలాగున్నాయంటే దేవుడు ఆకాశములను మరియు భూమిని మరియు సమస్తమును సృష్టించినప్పుడు చెప్పిన మాటలలాగే ఉన్నాయి; అదే విధంగా, అవన్నీ దేవుని అధికారాన్ని మరియు సృష్టికర్త శక్తిని కలిగి ఉన్నాయి. దేవుని నోటి నుండి వచ్చిన వాక్కులవలనే సమస్తము ఏర్పడి స్థిరముగా నిలిచి ఉన్నాయి. అదే విధంగా, ప్రభువైన యేసు నోటి నుండి వచ్చిన మాటలవలనే లాజరు తన సమాధి నుండి బయటికి వచ్చాడు. ఇది దేవుని అధికారమైయుండెను, ఇది ఆయన అవతారపు శరీరములో ప్రదర్శించబడింది మరియు గ్రహించబడింది. ఈ విధమైన అధికారం మరియు సామర్థ్యం సృష్టికర్తకు మరియు సృష్టికర్తను కలిగియున్న మనుష్య కుమారుడికి మాత్రమే సంబంధించినదై ఉంటుంది. లాజరును మరణం నుండి తిరిగి తీసుకురావడం ద్వారా, మానవాళికి దేవుడు బోధించిన అవగాహన ఇది. ఇప్పుడు, ఇక్కడితో ఈ అంశం మీద మన చర్చను మనము పూర్తి చేద్దాము. తర్వాత, లేఖనాల నుండి మరికొన్నింటిని చదువుకుందాం.

10. యేసు మీద పరిసయ్యులు తీర్పు తీర్చడం

మార్కు 3:21-22 ఆయన ఇంటివారు సంగతి విని, ఆయన మతి చలించియున్నదని చెప్పి ఆయనను పట్టుకొనబోయిరి. యెరూషలేమునుండి వచ్చిన శాస్త్రులు ఇతడు బయల్జెబూలు పెట్టినవాడై దయ్యముల యధిపతిచేత దయ్యములను వెళ్లగొట్టుచున్నాడని చెప్పిరి.

11. పరిసయ్యులకు యేసు గద్దింపు

మత్తయి 12:31-32 కాబట్టి నేను మీతో చెప్పునదేమనగా, మనుష్యులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. మనుష్య కుమారునికి విరోధముగా మాటలాడువానికి పాపక్షమాపణ కలదుగాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాటలాడువానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాపక్షమాపణ లేదు.

మత్తయి 23:13-15 అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుష్యులయెదుట పరలోక రాజ్యమును మూయుదురు; మీరందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనియ్యరు. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టివచ్చెదరు; అతడు కలిసినప్పుడు అతని మీకంటె రెండంతలు నరకపాత్రునిగా చేయుదురు.

పైన పేర్కొన్న రెండు భాగాల్లోని విషయం భిన్నంగా ఉంది. మనం ముందుగా మొదటి భాగం పరిశీలిద్దాం: యేసు మీద పరిసయ్యులు తీర్పు తీర్చడం.

బైబిలులో, యేసును మరియు ఆయన చేసిన పనులను పరిసయ్యులు ఇలా అంచనా వేశారు: “… ఆయన మతి చలించియున్నదని … ఇతడు బయల్జెబూలు పెట్టినవాడై దయ్యముల యధిపతిచేత దయ్యములను వెళ్లగొట్టుచున్నాడని వారు చెప్పిరి.” (మార్కు 3:21-22). యేసు ప్రభువు మీద శాస్త్రులు మరియు పరిసయ్యుల తీర్పు తీర్చడం అనేది కేవలం వారు ఇతరుల మాటలు అనుకరించడం కాదు మరియు అది నిరాధార ఊహాగానాలు కూడా కాదు, అది వారు యేసు ప్రభువును చూసిన మరియు ఆయన చర్యల గురించి విన్న వాటి నుండి వారు ఆ ముగింపుకు వచ్చారు. వారి ముగింపు అనేది న్యాయం పేరుతో అస్పష్టంగా తయారు చేయబడినప్పటికీ, అది బాగానే వ్యవస్థాపించబడినట్లుగా ప్రజలకు కనిపించినప్పటికీ, అహంకారంతో ప్రభువైన యేసును తీర్పు తీర్చడమనేది వారికి సైతం కష్టం కలిగించింది. ప్రభువైన యేసుపట్ల వారి ద్వేషమనే ఉన్మాద శక్తి వారిలోని క్రూరమైన ఆశయాలను మరియు వారిలోని దుష్ట సాతాను సంబంధమైన ముఖభావాలతోపాటు దేవుణ్ణి ఎదిరించిన వారి దుర్మార్గపు స్వభావాన్ని బహిర్గతం చేసింది. ప్రభువైన యేసును గురించిన తీర్పులో వారు చెప్పిన ఈ విషయాలన్నీ వారి క్రూరమైన ఆశయాలు, అసూయ మరియు దేవునిపట్ల మరియు సత్యంపట్ల వారి శత్రుత్వపు వికారమైన మరియు దుర్మార్గపు స్వభావంతో ప్రేరేపించబడినవి. ప్రభువైన యేసు జరిగించిన క్రియల మూలాన్ని వాళ్లు పరిశోధించలేదు, లేక ఆయన చెప్పిన మాటల సారాంశాన్ని లేదా చేసిన వాటి సారాంశమును వాళ్లు పరిశోధించలేదు. దానికి బదులుగా, గుడ్డిగా, విపరీతమైన ఆందోళనా స్థితిలో మరియు ఉద్దేశపూర్వక దురుద్దేశంతో వారు దాడి చేసి, ఆయన చేసిన పనిని కించపరిచారు. వాళ్లు ఉద్దేశపూర్వకంగానే ఆయన ఆత్మను, అంటే, దేవుని ఆత్మ అయిన పరిశుద్ధాత్మను కించపరిచే వరకు వెళ్లారు. ఈ కారణంగానే, వాళ్లు “ఇతడు బయల్జెబూలు పెట్టినవాడై దయ్యముల యధిపతిచేత దయ్యములను వెళ్లగొట్టుచున్నాడని” వారు చెప్పినప్పుడు, వాళ్లు అర్థం చేసుకున్నది అదే. అంటే, దేవుని ఆత్మను బయల్జెబూలు అని మరియు దయ్యముల యధిపతి అని వాళ్లు చెప్పారు. శరీరధారుడైన దేవుని ఆత్మ జరిగించిన పనిని వాళ్లు పిచ్చి పనిగా అభివర్ణించారు. వారు దేవుని ఆత్మను బయల్జెబూలు అని, దయ్యముల యధిపతి అని దూషించడమే కాకుండా, దేవుని పనిని వారు ఖండించారు మరియు ప్రభువైన యేసు క్రీస్తును ఖండించారు మరియు దూషించారు. వారి ప్రతిఘటన మరియు దైవ దూషణ అనేది అచ్చంగా దేవునిపట్ల సాతాను మరియు దయ్యాలు ప్రదర్శించిన ప్రతిఘటన మరియు దైవదూషణలాగే ఉంది. వాళ్లు భ్రష్టుపట్టిన మనుష్యులకు మాత్రమే ప్రాతినిధ్యం వహించడమే కాకుండా, వారు సాతాను రూపమై ఉన్నారు. వాళ్లంతా మానవజాతి మధ్య సాతాను కోసం పని చేస్తున్న ఒక మాధ్యమం లాంటివారు మరియు వారు సాతానుకి తోడు దొంగలు లాంటివారు మరియు బానిసలు లాంటివారు. వారు దైవదూషణ చేసిన గుణం మరియు ప్రభువైన యేసుక్రీస్తును కించపరచిన గుణం అనేది హోదా కోసం దేవునితో చేసిన వారి పోరాటమైయుండెను, దేవునితో వారు చేసే పోటీయైయుండెను మరియు దేవుని గురించి వారి ముగింపులేని పరీక్షకు సంబంధించినదైయుండెను. దేవునితో వారి ప్రతిఘటించిన తీరు మరియు ఆయనపట్ల వాళ్ల శత్రుత్వ వైఖరి, అలాగే వారి మాటలు మరియు వారి ఆలోచనలు నేరుగా దేవుని ఆత్మను దూషించాయి మరియు దేవునికి కోపాన్ని కలిగించాయి. ఆ విధంగా, దేవుడు వారు చెప్పిన వాటికి మరియు చేసిన వాటి ఆధారంగా సహేతుకమైన తీర్పును నిర్ణయించాడు మరియు వారి పనులను పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా దూషణ చేసిన పాపంగా దేవుడు నిర్ణయించాడు. ఈ పాపం అనేది ఈ లోకంలో మరియు రాబోవు లోకంలో కూడా క్షమించరానిది. పరిశుద్ధ గ్రంథంలోని వాక్యంలో ఇలా చెప్పబడింది: “మనుష్యకుమారునికి విరోధముగా మాటలాడువానికి పాపక్షమాపణ కలదుగాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాటలాడువానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాపక్షమాపణ లేదు.” ఈ రోజు మనం దేవుని నుండి వచ్చిన ఈ మాటల నిజమైన అర్ధం గురించి మాట్లాడుకుందాం: “ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాపక్షమాపణ లేదు.” ఇప్పుడు మనం “ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాపక్షమాపణ లేదు” అనే మాటలను దేవుడు ఎలా నెరవేరుస్తాడో సులభంగా అర్థమయ్యేలా చెప్పుకుందాం.

మనం మాట్లాడుకున్న ప్రతి ఒక్కటీ దేవుని స్వభావం మరియు వ్యక్తులు, సంఘటనలు మరియు ప్రజలపట్ల ఆయన వైఖరి అనే విషయాలకు సంబంధించినవే. సహజంగానే, పైన పేర్కొన్న రెండు భాగాలకు కూడా ఆ విషయంలో మినహాయింపు లేదు. పరిశుద్ధ గ్రంథంలోని ఈ రెండు వాక్యభాగాలలో మీరు ఏదైనా గమనించారా? వాటిలో దేవుని కోపాన్ని చూస్తున్నట్లుగా కొందరు చెబుతారు. మానవజాతి అపరాధాన్ని సహించని దేవుని స్వభావాన్ని తాము చూస్తున్నామనీ మరియు దేవుణ్ణి దూషించే పనిని మనుష్యులు చేస్తే, వారు ఆయన క్షమాపణ పొందలేరనీ మరికొందరు అంటారు. ఈ రెండు భాగాల్లోనూ దేవుని కోపాన్ని మరియు మానవజాతి అపరాధాన్ని మనుష్యులు అసహనంతోనే చూస్తున్నప్పటికీ, వాళ్లు ఇప్పటికీ ఆయన వైఖరిని నిజంగా అర్థం చేసుకోలేదు. ఈ రెండు వాక్యభాగాలలో అంతర్లీనంగా దేవుని నిజమైన వైఖరిని మరియు ఆయన్ని దూషించే మరియు కోపగించుకునే వారిని ఆయన సమీపించే తీరుకు సంబంధించిన దాయబడిన అనుబంధ లేఖనాలుగా ఉన్నాయి. ఆయన వైఖరి మరియు సమీపించే తీరు అనే విషయాలు ఈ వాక్యభాగాన్ని నిజమైన అర్థాన్ని ప్రదర్శిస్తాయి: “పరిశుద్ధాత్మకు విరోధముగా మాటలాడువానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాపక్షమాపణ లేదు.” మనుష్యులు దేవుణ్ణి దూషించినప్పుడు మరియు వాళ్లు ఆయనకు కోపం తెప్పించినప్పుడు, ఆయన తీర్పు తీరుస్తాడు మరియు ఈ తీర్పు అనేది ఆయన అందించిన ఫలితంగా ఉంటుంది. బైబిలులో ఈ విషయం ఈ విధంగా వివరించబడింది: మత్తయి 12:31-32 కాబట్టి నేను మీతో చెప్పునదేమనగా, మనుష్యులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు” (మత్తయి 12:31), మరియు అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుష్యులయెదుట పరలోకరాజ్యమును మూయుదురు; (మత్తయి 23:13). అయితే, ఆ శాస్త్రులు మరియు పరిసయ్యులతోపాటు, ప్రభువైన యేసు ఈ విషయాలు చెప్పిన తర్వాత, ఆయన్ని పిచ్చివాడిగా పేర్కొన్న వ్యక్తులకు ఎలాంటి ఫలితం ఎదురయ్యిందో బైబిలులో నమోదు చేయబడిందా? వాళ్లు ఏదైనా శిక్ష అనుభవించినట్లుగా అందులో నమోదు చేయబడిందా? నమోదు చేయబడలేదు అనే ఈ మాటను ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇక్కడ “నమోదు చేయబడలేదు” అని చెప్పడమంటే, అలాంటి విషయం నమోదు చేయబడలేదని చెప్పడం అని అర్థం. అయితే, నిజానికి, మానవ కళ్లతో చూడగలిగే ఫలితం లేదన్నది మాత్రమే నిజం. “అది నమోదు చేయబడలేదు” అని చెప్పడమనేది నిర్ధిష్ట విషయాలను నిర్వహించడంలో దేవుని ధోరణిని మరియు ఆయన నియమాల సమస్యను పరిష్కరిస్తుందని అర్థం. తనను దూషించే వ్యక్తులు, లేదా ఎదిరించే వ్యక్తులు లేదా తనకు అపకీర్తి కలిగించే వ్యక్తులు, అంటే ఉద్దేశపూర్వకంగా దాడి చేసే, దూషించే మరియు శపించే వ్యక్తులపట్ల దేవుడు చూచీ చూడనట్లుగా ఉండిపోవడమూ, లేదంటే వినీ వినకుండా ఉండిపోవడమో చేయడు కానీ, వారిపట్ల ఆయన స్పష్టమైన వైఖరి కలిగి ఉంటాడు. ఆయన ఇటువంటి వ్యక్తులను తృణీకరిస్తాడు మరియు తన హృదయంలో వారిని ఖండిస్తాడు. వారి ఫలితం ఎలా ఉంటుందో కూడా ఆయన బహిరంగంగా ప్రకటిస్తాడు. తద్వారా, దేవుణ్ణి దూషించే వారిపట్ల ఆయన స్పష్టమైన వైఖరి కలిగి ఉన్నాడనీ మరియు అలాంటి వారి ఫలితాన్ని ఆయన ఎలా నిర్ణయిస్తాడో మనుష్యులు తెలుసుకుంటారు. అయినప్పటికీ, దేవుడు ఈ విషయాలన్నిటిని చెప్పిన తర్వాత కూడా, ఆ వ్యక్తులతో దేవుడు ఎలా వ్యవహరిస్తాడనే సత్యాన్ని మనుష్యులు అత్యంత అరుదుగా చూడగలిగారు మరియు దేవుడు వారికి జారీ చేసిన ఫలితం మరియు తీర్పు వెనుక ఉన్న నియమాలను వారు అర్థం చేసుకోలేదు. అంటే, వాటి నిర్వహణ కోసం దేవుడు కలిగి ఉన్న నిర్దిష్ట విధానాలను మరియు పద్ధతులను ప్రజలు చూడలేరు. ఇది చేయబోయే పనుల కొరకు దేవుడు ఉపయోగించే నియమాలకు సంబంధించినది. కొందరు వ్యక్తుల చెడు ప్రవర్తనతో వ్యవహరించడానికి దేవుడు వాస్తవాల సంఘటనలను ఉపయోగిస్తాడు. అంటే, ఆయన వారి పాపాన్ని ప్రకటించడు మరియు వారి ఫలితం నిర్ణయించడు. కానీ, వారి శిక్షను ఖరారు చేయడానికి మరియు ప్రతీకారం తీర్చుకోవడానికి వాస్తవాల సంభవాన్ని నేరుగా ఉపయోగిస్తాడు. ఈ వాస్తవాలు సంభవించినప్పుడు, వ్యక్తుల శరీరం ఆ శిక్షను అనుభవించడం వల్ల, శిక్ష అనేది మానవ కళ్లతో చూడదగినదిగా ఉంటుంది. కొందరి చెడు ప్రవర్తనతో వ్యవహరించేటప్పుడు, దేవుడు వారిని మాటలతో శపిస్తాడు మరియు ఆయన కోపం కూడా వారి మీదకు చేరుతుంది. అయితే, వారు పొందే ఆ శిక్ష మనుష్యులు చూడలేనిదిగా ఉండొచ్చు. అదేసమయంలో, శిక్షించబడడం లేదా చంపబడడంలాంటి మనుష్యులు చూడగలిగే ఫలితాల కంటే, ఈ రకమైన ఫలితమే మరింత తీవ్రంగా ఉండవచ్చు. ఎందుకంటే, దేవుడు ఇలాంటి వ్యక్తులను రక్షించకూడదనీ, వారిపట్ల ఇకపై దయను గాని, లేదా సహనమును గాని చూపకూడదనీ మరియు వారికి ఎలాంటి అవకాశాలు అందించకూడదనీ నిర్ణయించుకున్న పరిస్థితుల్లో, వారిపట్ల ఆయన తీసుకునే వైఖరి అనేది వారిని పక్కన పెట్టాలనే విధంగా ఉంటుంది. ఇక్కడ “పక్కన పెట్టడం” అంటే ఏమిటి? “దేనినైనా ఒక వైపు పెట్టి, ఆ తర్వాత దాని మీద దృష్టి పెట్టకపోవడం” అనేది ఈ మాటకు ప్రాథమిక అర్థాన్ని ఇస్తుంది. అయితే, ఇక్కడ, దేవుడు “ఒకరిని పక్కన పెట్టేయడం” అనే విషయానికి వచ్చినప్పుడు, దాని అర్థానికి సంబంధించి రెండు వేర్వేరు వివరణలు ఉన్నాయి: మొదటి వివరణ ప్రకారం ఆయన ఆ వ్యక్తి జీవితాన్ని మరియు అతని గురించిన ప్రతి అంశాన్ని సాతానుకు అప్పగించాడు మరియు దేవుడు ఇకపై అతనికి బాధ్యత వహించడు. ఇకపై ఆ వ్యక్తికి సంబంధించిన నిర్వహణను పట్టించుకోడు. ఆ వ్యక్తి పిచ్చివాడిగా లేక మూర్ఖుడిగా మారినా, చనిపోయినా లేదా బతికి ఉన్నా, లేదా శిక్ష కోసం నరకంలోకి దిగినా, ఎటువంటి విషయాన్ని గురించియైన దేవునికి సంబంధం ఉండదు. అంటే, అలాంటి ఒక జీవికి మరియు సృష్టికర్తకు మధ్య అటుపై ఎలాంటి సంబంధం ఉండదని అర్థం. రెండవ వివరణ ఏమిటంటే, దేవుడు స్వయంగా, తన స్వంత చేతులతో ఈ వ్యక్తితో ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నాడు. అలాంటప్పుడు, ఈ వ్యక్తి యొక్క సేవను ఆయన ఉపయోగించుకునే అవకాశం ఉంది, లేక ఆయన వారిని అడ్డుపెట్టుకొని ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఈ రకమైన వ్యక్తులతో ఆయన వ్యవహరించే ప్రత్యేక విధానం అనేది ఉదాహరణకు, పౌలుతో వ్యవహరించిన మాదిరిగానే ఉండే అవకాశం ఉంది. ఇది దేవుని హృదయంలోని నియమం మరియు దృక్పథం ద్వారా ఈ రకమైన వ్యక్తితో వ్యవహరించాలని ఆయన నిర్ణయించుకున్నాడు. కాబట్టి, ప్రజలు దేవుణ్ణి ప్రతిఘటించినప్పుడు మరియు కించపరచినప్పుడు మరియు ఆయన్ని దూషించినప్పుడు వారు ఆయన స్వభావమును ప్రకోపించేలా చేస్తే, లేదా దేవుని సహనం హద్దు దాటితే, దాని పర్యవసానాలను ఊహించడం కూడా సాధ్యం కాదు. అత్యంత తీవ్రమైన పర్యవసానమేమిటంటే, దేవుడు వారి జీవితాలను మరియు వారి గురించిన ప్రతిదానిని సాతానుకు శాశ్వతంగా ఒక్కసారే అప్పగించేస్తాడు. వారు శాశ్వతంగా క్షమించబడరు. ఈ వ్యక్తి సాతాను నోటిలో ఆహారంగా మారాడనీ, దాని చేతిలో ఒక బొమ్మగా మారాడనీ, ఇకపై వారితో దేవునికి ఎలాంటి సంబంధం ఉండదనీ దీని అర్థం. యోబును సాతాను శోధించినప్పుడు ఎలాంటి దుస్థితి ఏర్పడిందో మీరు ఊహించగలరా? యోబు జీవితానికి హాని కలిగించడానికి సాతానుకి అనుమతి లేదనే షరతు ఉన్నప్పటికీ, యోబు అత్యంత తీవ్రంగా బాధను అనుభవించాడు. అలాంటి నేపథ్యంలో, పూర్తిగా సాతానుకు అప్పగించబడిన, పూర్తిగా సాతాను అధీనంలో ఉన్న, దేవుని సంరక్షణ మరియు దయను పూర్తిగా కోల్పోయిన, ఇకపై సృష్టికర్త పాలన క్రింద లేకపోయినా, ఆయన్ని ఆరాధించే హక్కును మరియు దేవుని పాలనలోని జీవి అనే హక్కును కోల్పోయిన, సృష్టిక్తర్తతో పూర్తిగా బంధం తెగిపోయిన వ్యక్తి మీద సాతాను విధ్వంసం ఏ స్థాయిలో ఉంటుందో ఊహించడం సాధ్యమా? యోబును సాతాను హింసించడమనేది మానవ కళ్లతో చూడగలిగేది. అయితే, దేవుడు ఒక వ్యక్తి జీవితాన్ని సాతానుకు అప్పగించినప్పుడు, దాని పరిణామాలనేవి మానవ ఊహకు మించినవిగా ఉంటాయి. ఉదాహరణకు, కొందరు వ్యక్తులు ఆవుగా లేదా గాడిదగా మళ్లీ పుట్టవచ్చు, మరికొందరు అపవిత్రమైన, దుష్ట ఆత్మలు మొదలైన వాటితో ఆక్రమించబడి ఉండవచ్చు. దేవుని ద్వారా సాతానుకు అప్పగించబడిన కొంతమంది వ్యక్తుల విషయంలో సంభవించే ఫలితాలు ఈ విధంగానే ఉంటాయి. బయటి నుండి చూసినప్పుడు, యేసు ప్రభువును ఎగతాళి చేసిన, కించపరచిన, ఖండించిన మరియు దూషించిన వ్యక్తులు ఎటువంటి పర్యవసానాలను అనుభవించలేదన్నట్లుగా కనిపిస్తుంది. అయితే, ప్రతిదానితో వ్యవహరించేందు దేవుడు తనదైన విధానం కలిగి ఉన్నాడు. ఆయా రకాల మనుష్యులతో తాను ఎలా వ్యవహరిస్తాడో, దాని ఫలితాలు ఎలా ఉంటాయో అనే విషయాన్ని మనుష్యులకు చెప్పడానికి ఆయన స్పష్టమైన భాష ఉపయోగించకపోవచ్చు. కొన్నిసార్లు ఆయన నేరుగా మాట్లాడడు. కానీ, దానికి బదులుగా నేరుగా వ్యవహరిస్తాడు. ఆయన దాని గురించి మాట్లాడలేదంటే, ఫలితం ఉండదని అర్థం కాదు, నిజానికి, అటువంటి సందర్భంలో ఆ ఫలితం అనేది మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. బయటి నుండి చూస్తే, దేవుడు తన వైఖరి గురించి కొందరికి స్పష్టంగా చెప్పనట్లుగా అనిపించవచ్చు. అయితే, నిజానికి, దేవుడు చాలా కాలం నుండి వారి మీద ఎలాంటి శ్రద్ధ చూపాలని కోరుకోలేదని అర్థం. వారిని ఇకపై అస్సలు చూడకూడదని ఆయన కోరుకుంటున్నాడని అర్థం. వాళ్లు చేసిన పనులు మరియు వారి ప్రవర్తన కారణంగా, వారి స్వభావం మరియు గుణగణాలు కారణంగా, దేవుడు వారిని తన దృష్టి నుండి అదృశ్యం చేయాలని మాత్రమే కోరుకుంటున్నాడు. వారిని నేరుగా సాతానుకు అప్పగించాలనీ, వారి ఆత్మ, మనసు మరియు శరీరాన్ని సాతానుకు అప్పగించాలనీ మరియు వారితో ఏది కావాలంటే అది చేయనిచ్చేలా సాతానుని అనుమతించాలనీ దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు వారిని ఏ మేరకు ద్వేషిస్తున్నాడో, వారిని ఏ మేరకు అసహ్యించుకుంటున్నాడో ఇది మనకు స్పష్టం చేస్తుంది. ఒక వ్యక్తిని మళ్లీ ఇంకెప్పుడూ చూడకూడదని, వారితో ఇకపై వ్యవహరించడానికి కూడా ఇష్టపడకుండా, వారిని పూర్తిగా వదిలివేయాలని దేవుడు నిర్ణయించుకునే స్థాయిలో ఆ వ్యక్తి ఆయనకి కోపం తెప్పిస్తే, వారిని ఏం చేయాలంటే అది చేయవచ్చంటూ సాతానుకు అప్పగించే పరిస్థితి వస్తే, వారిని నియంత్రించడానికి, అనుభవించడానికి మరియు దానికి నచ్చిన విధంగా వారితో ప్రవర్తించడానికి సాతానుని అనుమతించడం జరుగుతుంది, అప్పుడు ఆ వ్యక్తి పరిస్థితి పూర్తిగా అధ్వాన్నమైపోతుంది. మానవునిగా వారికి ఉండే హక్కు శాశ్వతంగా ఉపసంహరించబడుతుంది మరియు దేవుడి సృష్టిలోని ఒక జీవిగా ఉండే వారి హక్కు అక్కడితో ముగిసిపోతుంది. ఇది అత్యంత కఠినమైన శిక్ష కాదా?

పైన పేర్కొన్నవన్నీ ఈ వాక్కుల పూర్తి వివరణగా ఉంటాయి. అవి: “పరిశుద్ధాత్మకు విరోధముగా మాటలాడువానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాపక్షమాపణ లేదు.” మరియు ఇది పరిశుద్ధ గ్రంథాల్లోని ఈ భాగాల మీద ఒక సాధారణ వ్యాఖ్యానంగా కూడా పనిచేస్తుంది. మీ అందరికీ ఇప్పుడు దీని గురించిన అవగాహన ఉందని నేను విశ్వసిస్తున్నాను.

ఇప్పుడు మనం లేఖనాల నుండి క్రింది ప్రకరణాలు చదువుదాం.

12. యేసు పునరుత్థానుడైన తర్వాత తన శిష్యులకు చెప్పిన వాక్కులు

యోహాను 20:26-29 ఎనిమిది దినములైన తరువాత ఆయన శిష్యులు మరల లోపల ఉన్నప్పుడు తోమా వారితోకూడ ఉండెను. తలుపులు మూయబడియుండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగును గాక అనెను. తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము; నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి, అవిశ్వాసివి కాక విశ్వాసివై యుండుమనెను. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా, నా దేవా అనెను. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మినవారు ధన్యులని అతనితో చెప్పెను.

యోహాను 21:16-17 మరల ఆయన, యోహాను కుమారుడవైన సీమోనూ, నన్ను ప్రేమించుచున్నావా? అని రెండవసారి అతనిని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే యెరుగుదువని ఆయనతో చెప్పెను; ఆయన, నా గొఱ్ఱెలను కాయుమని చెప్పెను. మూడవసారి ఆయన, యోహాను కుమారుడవైన సీమోనూ, నన్ను ప్రేమించుచున్నావా? అని అతనిని అడిగెను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తము ఎరిగినవాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే యెరుగుదువని ఆయనతో చెప్పెను.

యేసు ప్రభువు తన పునరుత్థానం తర్వాత తన శిష్యుల కోసం చేసిన మరియు చెప్పిన కొన్ని విషయాలు ఈ భాగాల్లో వివరించబడ్డాయి. ముందుగా, పునరుత్థానానికి ముందు మరియు పునరుత్థానమైన తర్వాత, యేసు ప్రభువులో కనిపించే వ్యత్యాసాలు చూద్దాం. ఆయన ఇప్పటికీ గడచిన రోజులలో ఉన్నటువంటి ప్రభువైన యేసుగానే ఉన్నాడా? పునరుత్థానం తర్వాత యేసు ప్రభువు గురించి వర్ణించే క్రింది పంక్తులను లేఖనాలలో ఉన్నాయి: “తలుపులు మూయబడియుండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగును గాక అనెను.” ఆ సమయంలో ప్రభువైన యేసు ఇక ఎంతమాత్రమూ శరీరంలో లేడనీ, అప్పుడు ఆయన ఆత్మ సంబంధమైన శరీరంలో ఉన్నాడనీ అత్యంత స్పష్టంగా ఉంది. శరీరధారిగా ఉండే పరిమితులను ఆయన అధిగమించిన కారణంగానే అలా జరిగింది; తలుపు మూసి ఉన్నప్పటికీ, ఆయన వ్యక్తుల మధ్యకు రాగలడు తనను చూడటానికి అనుమతించగలడు. పునరుత్థానం తర్వాత యేసు ప్రభువుకు మరియు పునరుత్థానానికి ముందు శరీరధారుడైన యేసు ప్రభువుకు మధ్య ఉన్న గొప్ప వ్యత్యాసం ఇదే. ఆ క్షణంలోని ఆయన ఆత్మ సంబంధిత శరీరపు రూపానికి మరియు గతంలో యేసు ప్రభువుగా కనిపించినప్పటి రూపానికి తేడా లేకపోయినప్పటికీ, ఆ క్షణంలోని యేసు ప్రభువు మనుష్యులకు అపరిచితుడిగా అనిపించాడు. ఎందుకంటే, చనిపోయిన దేహం నుండి పునరుత్థానం చెందిన తర్వాత ఆయన ఒక ఆత్మ సంబంధమైన శరీరంగా మారాడు మరియు ఆయన మునుపటి శరీరంతో పోలిస్తే, ఈ ఆత్మ సంబంధమైన శరీరం మనుష్యులకు మరింత అస్పష్టంగా మరియు గందరగోళంగా అనిపించింది. ఇది యేసు ప్రభువుకు మరియు మనుష్యులకు మధ్య మరింత దూరాన్ని కూడా సృష్టించింది మరియు ఆ క్షణంలో యేసు ప్రభువు మరింత అంతుచిక్కని విధంగా మారాడని కూడా మనుష్యులు తమ హృదయాల్లో భావించారు. మనుష్యుల్లోని ఈ ఆలోచనలు మరియు భావాలనేవి వారిని అకస్మాత్తుగా దేవుడిని చూడలేము లేదా తాకలేము అని విశ్వసించే యుగానికి తీసుకువచ్చాయి. కాబట్టే, యేసు ప్రభువు తన పునరుత్థానం తర్వాత చేసిన మొదటి పని ఏమిటంటే, ప్రతిఒక్కరూ తనను చూడటానికి అనుమతించాడు. తద్వారా, ఆయన ఉన్నాడని నిర్ధారించడంతోపాటు తన పునరుత్థాన వాస్తవాన్ని ధృవీకరించాడు. అంతేకాకుండా, ఈ చర్య అనేది మనుష్యులతో ఆయనకున్న బంధాన్ని పునరుద్ధరించింది. ఆయన శరీరధారిగా పని చేస్తున్నప్పుడు, ఆయన క్రీస్తుగా ఉన్నప్పుడు, వారు చూడగలిగే మరియు తాగగలిగే స్థితికి తీసుకువెళ్లింది. తద్వారా, జరిగిన ఒక పరిణామం ఏమిటంటే, యేసు ప్రభువు సిలువకు వ్రేలాడదీయబడిన తరువాత ఆయన మరణం నుండి పునరుత్థానం చేయబడ్డాడనే విషయంలో మనుష్యులకు ఎటువంటి సందేహం లేకుండా పోయింది మరియు మానవాళిని విమోచించడానికి ప్రభువైన యేసు చేసిన కార్యములో వారికి ఎటువంటి సందేహం లేకపోయింది. మరొక ఫలితం ఏమిటంటే, ప్రభువైన యేసు తన పునరుత్థానం తర్వాత మనుష్యులకు కనిపించడంతోపాటు తనను చూడడానికి మరియు తాకడానికి వారిని అనుమతించడం ద్వారా, యేసు ప్రభువు “అదృశ్యమయ్యాడు” లేదా “మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు” అనే ఊహాజనిత ప్రాతిపదికన మనుష్యులు మళ్లీ గత ధర్మశాస్త్ర యుగానికి తిరిగి వెళ్లకుండా, కృపా యుగంలోనే స్థిరంగా ఉండేలా చేశాడు. ఆ విధంగా, మనుష్యులు ముందుకు మాత్రమే వెళ్లేలా, యేసు ప్రభువు బోధనలను మరియు ఆయన చేసిన కార్యాన్ని అనుసరించేలా ఆయన నిర్ధారించాడు. ఆవిధంగా, కృపా యుగంలోని కార్యములో ఒక కొత్త దశ అధికారికంగా తెరవబడింది మరియు ధర్మశాస్త్ర యుగం క్రింద జీవిస్తున్న మనుష్యులు ఆ క్షణం నుండి, అధికారికంగా కొత్త యుగంలోకి ప్రవేశించారు. అలా వాళ్లు కొత్త ప్రారంభంలోకి అడుగుపెట్టారు. ఈ విధంగా, పునరుత్థానం తర్వాత ప్రభువైన యేసు మానవాళికి కనిపించడంలోని పలువిధమైన అర్థాలు ఉన్నాయి.

యేసు ప్రభువు ఇప్పుడు ఆత్మ సంబంధమైన దేహంలో నివసిస్తున్నాడు కాబట్టి, ప్రజలు ఆయనను ఎలా స్పర్శించగలరు మరియు ఆయనను ఎలా చూడగలరు? ఈ ప్రశ్న ప్రభువైన యేసు ప్రత్యక్షత ప్రాముఖ్యతను మానవాళికి స్పృశిస్తుంది. మనము ఇప్పుడే చదివిన లేఖన వాక్యభాగములలో మీరు ఏదైనా గమనించారా? సాధారణంగా, ఆత్మ సంబంధమైన శరీరాలను చూడలేరు లేదా తాకలేరు మరియు పునరుత్థానం తర్వాత ప్రభువైన యేసు చేపట్టిన పని ఇప్పటికే పూర్తయింది. కాబట్టి సైద్ధాంతికంగా, ఆయన వారితో కలవడానికి తన అసలు రూపంలో మనుష్యుల మధ్యకు తిరిగి రావాల్సిన అవసరం లేదు. అయితే, తోమావంటి వ్యక్తులకు ప్రభువైన యేసు ఆత్మ సంబంధమైన శరీరంలో కనిపించడమనేది ఆయన ప్రత్యక్షత యొక్క ప్రాముఖ్యతను మరింత నిర్దిష్టంగా చేసింది. తద్వారా, ప్రజల హృదయాల్లో అది మరింత లోతుగా చొచ్చుకుపోయింది. తోమా వద్దకు ఆయన వచ్చినప్పుడు, సందేహము కలిగియున్ తోమాను తన చేయి తాకడానికి అనుమతించాడు మరియు అతడితో ఇలా చెప్పాడు: “నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి, అవిశ్వాసివి కాక విశ్వాసివై యుండుమనెను.” ఈ మాటలు మరియు చర్యలనేవి ప్రభువైన యేసు తన పునరుత్థానం తర్వాత మాత్రమే చెప్పాలనుకున్న మరియు చేయాలనుకున్న విషయాలేమీ కావు; నిజానికి, అవన్నీ ఆయన్ని సిలువకు వ్రేలాడదీయక ముందే చేయాలనుకున్న పనులు. యేసు ప్రభువుని సిలువకు వ్రేలాడదీయబడక ముందే, తోమాలాంటి వ్యక్తుల గురించి ఆయన అప్పటికే అవగాహన కలిగి ఉన్నాడని స్పష్టమవుతుంది. కాబట్టి, దీని నుండి మనం ఏమి చూడవచ్చు? పునరుత్థానం తర్వాత కూడా ఆయన ముందున్న ప్రభువైన యేసుగానే ఉన్నాడు. ఆయన గుణగణాలు మారలేదు. తోమాలో సందేహాలు అప్పుడప్పుడే మొగ్గ తొడిగినవి కావు. నిజానికి, ప్రభువైన యేసును వెంబడిస్తున్న సమయమంతా అవి అతనితోనే ఉన్నాయి. అయితే, ఇక్కడ యేసు ప్రభువు మరణం నుండి పునరుత్థానుడై, ఆత్మ సంబంధమైన ప్రపంచం నుండి తన అసలు స్వరూపంతో, తన అసలైన స్వభావంతో మరియు మానవజాతి గురించిన అవగాహనతో తిరిగి వచ్చాడు, కాబట్టే, ఆయన ముందుగా తోమా వద్దకు వెళ్ళాడు మరియు తోమాను తన ప్రక్కటెముకలను తాకనివ్వడం, పునరుత్థానుడైన తర్వాత తన ఆత్మ సంబంధమైన శరీరాన్ని తోమాను చూడనివ్వడమే కాకుండా, ఉనికిలో ఉన్న ఆత్మ సంబంధమైన శరీరాన్ని తాకడానికి మరియు అనుభూతి చెందడానికి అవకాశం ఇవ్వడం ద్వారా, అతడు తన సందేహాలను పూర్తిగా వదిలేయాలని ఆయన కోరుకున్నాడు. ప్రభువైన యేసును సిలువకు వ్రేలాడదీయడానికి ముందు వరకు, క్రీస్తు ఆయనేనా అని అనుమానించేవాడు మరియు ఆయనను విశ్వసించలేదు. అతడు తన కళ్ళతో ఏం చూడగలడు, అతడు తన చేతులతో ఏమి తాకగలడు అనేదాని ఆధారంగా మాత్రమే దేవుని మీద అతని విశ్వాసం స్థాపించబడింది. ప్రభువైన ఈ రకమైన వ్యక్తి విశ్వాసం గురించి యేసుకు మంచి అవగాహన ఉంది. అలాంటివారు పరలోకములోని దేవుణ్ణి మాత్రమే విశ్వసించారు మరియు దేవుడు పంపిన వ్యక్తిని లేదా శరీరంలో ఉండే క్రీస్తును వారు విశ్వసించలేదు మరియు వారు ఆయన్ని అంగీకరించరు. ప్రభువైన యేసు ఉనికిని తోమా గుర్తించి మరియు విశ్వసించటానికి మరియు దేవుడు నిజంగా శరీరధారియై వచ్చాడని తోమా విశ్వసించడం కోసం, తోమా తన చేయిని చాచి, ఆయన పక్కటెముకను తాకడానికి ఆయన అనుమతించాడు. యేసు ప్రభువు పునరుత్థానానికి ముందు మరియు ఆయన పునరుత్థానం తరువాత తోమా సందేహించే విధానంలో ఏదైనా భిన్నత్వం ఉందా? అతడు ఎల్లప్పుడూ సందేహిస్తూనే ఉన్నాడు మరియు యేసు ప్రభువు ఆత్మ సంబంధమైన దేహం అతనికి వ్యక్తిగతంగా కనిపించడం మరియు ఆయన శరీరం మీద మేకుల గుర్తులను తాకి చూడడం తప్ప, అతని సందేహాలను ఎవరైనా పరిష్కరించడమో, వాటిని వదిలించుకునేందుకో అతనికి ఎటువంటి ఆస్కారం లేదు. కాబట్టే, తన పక్కటెముకను తాకడానికి తోమాను యేసు ప్రభువు అనుమతించడంతో మొదలుపెట్టి, దేహం మీది మేకు గుర్తుల ఉనికిని నిజమేనని అనిపించేలా చేయడం ద్వారా తోమాకున్న సందేహం తొలగిపోయింది మరియు యేసు ప్రభువు పునరుత్థానుడై వచ్చాడని అతనికి నిజంగా తెలిసింది మరియు ప్రభువైన యేసే నిజమైన క్రీస్తు అని మరియు దేవుడే శరీరధారిగా వచ్చాడని అతడు అంగీకరించాడు మరియు విశ్వసించాడు. ఈ విధంగా, తోమా సందేహం తొలగిపోయినప్పటికీ, క్రీస్తును కలిసే అవకాశాన్ని మాత్రం అతడు శాశ్వతంగా కోల్పోయాడు. ఆయనతో కలిసి ఉండే అవకాశాన్ని, ఆయన్ని అనుసరించే, ఆయన్ని తెలుసుకునే అవకాశాన్ని అతడు శాశ్వతంగా కోల్పోయాడు. క్రీస్తు తనను పరిపూర్ణం చేసే అవకాశాన్ని అతడు కోల్పోయాడు. ప్రభువైన యేసు స్వరూపం మరియు ఆయన మాటలనేవి సందేహాలతో నిండిన వారి విశ్వాసం మీద ఒక ముగింపు ఇచ్చాయి మరియు తీర్పు తీర్చాయి. ఆయన తన వాస్తవ వాక్కుల మరియు చర్యలను ఇలాంటి సందేహాలతో నిండిన వ్యక్తులకు, పరలోకంలో ఉన్న దేవుణ్ణి మాత్రమే విశ్వసించిన వారికి, క్రీస్తును విశ్వసించలేని వారికి చెప్పడానికి ఉపయోగించాడు: దేవుడు వారి విశ్వాసాన్ని మెచ్చుకోలేదు, లేదా అనుమానిస్తూ తనను అనుసరించినందుకూ వారిని మెచ్చుకోలేదు. దేవుడు తన గొప్ప కార్యమును పూర్తి చేసిన రోజునే వాళ్లు దేవుణ్ణి మరియు క్రీస్తును పూర్తిగా విశ్వసించిన రోజవుతుంది. అయితే, ఆ రోజు అనేది వారి సందేహం మీద తీర్పు తీర్చిన రోజుగా కూడా ఉంటుంది. క్రీస్తుపట్ల వారికున్న వైఖరి అనేది వారి విధిని నిర్ణయించింది మరియు వారి మొండి సందేహం కారణంగా, వారి విశ్వాసం వారికి ఎలాంటి ఫలితం అందించలేదు మరియు వారి కాఠిన్యంతో వారి ఆశలు ఫలించలేదు. పరలోకములో ఉన్న దేవుని మీద వారి విశ్వాసం అనేది భ్రమలతో నిండిపోయింది మరియు క్రీస్తుపట్ల వారి సందేహం అనేది వాస్తవానికి దేవునిపట్ల వారికున్న నిజమైన వైఖరి అని చెప్పవచ్చు. వాళ్లు యేసు ప్రభువు శరీరం మీద ఉన్నటువంటి మేకుల గుర్తులను తాకినప్పటికీ, వారి విశ్వాసం పనికిరానిది మరియు వారు సాధించే ఫలితం అనేది వెదురు బుట్టతో నీటిని తోడినట్లుగా మాత్రమే వర్ణించబడుతుంది, అదంతా, వృధా ప్రయాస మాత్రమే. తోమాతో యేసు ప్రభువు చెప్పినది కూడా చాలా స్పష్టంగా ప్రతి వ్యక్తికి చెప్పే విధానమైయున్నది: పునరుత్థానుడైన యేసు ప్రభువు ముప్పై మూడున్నర ఏళ్లు మానవజాతి మధ్య పనిచేసిన యేసు ప్రభువే. ఆయన సిలువకు వ్రేలాడదీయబడినప్పటికీ మరియు మరణపు ఛాయను ఆయన అనుభవించినప్పటికీ, మరియు ఆయన పునరుత్థానం అనుభవించినప్పటికీ, ఏ విషయములోనూ ఆయన ఎటువంటి మార్పునకు గురికాలేదు. ఆయన ఇప్పుడు తన శరీరం మీద మేకుల గుర్తులు కలిగి ఉన్నప్పటికీ, ఆయన పునరుత్థానుడై, సమాధి నుండి బయటికి వచ్చినప్పటికీ, ఆయన స్వభావం, మానవజాతిపట్ల ఆయన అవగాహన మరియు మానవజాతిపట్ల ఆయన ఉద్దేశాలు కొంచెం కూడా మారలేదు. అలాగే, తాను సిలువ నుండి దిగి వచ్చాననీ, పాపంపై విజయం సాధించాననీ, కష్టాలను అధిగమించాననీ, మరణంపై విజయం సాధించాననీ ఆయన మనుష్యులకు చెబుతున్నాడు. మేకుల గుర్తులనేవి సాతాను మీద ఆయన విజయానికి సాక్ష్యం. మానవజాతి మొత్తాన్ని విజయవంతంగా విమోచించడానికి పాపపరిహారార్థంగా ఆయన బలి అయ్యాడు. తాను ఇప్పటికే మానవజాతి పాపాలను నా మీద మోసికొని ఉన్నానని మరియు విమోచన కార్యాన్ని పూర్తి చేసాననీ ఆయన మనుష్యులకు చెప్పుచుండెను. ఆయన తన శిష్యులను చూడడానికి తిరిగి వచ్చినప్పుడు, తన రూపం గురించి వారికి ఇలా సందేశం ఇచ్చాడు: “నేను ఇంకా సజీవముగానే ఉన్నాను, నేను ఇంకా ఉనికిలోనే ఉన్నాను; ఈ రోజు నేను నిజంగా మీ ముందు నిలబడి ఉన్నాను కాబట్టి, మీరు నన్ను చూడవచ్చు మరియు తాకవచ్చు. నేను ఎల్లప్పుడూ మీతోనే ఉంటాను.” తోమా ఘటనను భవిష్యత్తులోని మనుష్యులకు హెచ్చరికగా ఉపయోగించాలని యేసు ప్రభువు కోరుకున్నాడు: యేసు ప్రభువు మీద మీకున్న విశ్వాసంతో మీరు ఆయన్ని చూడనప్పటికీ లేదా తాకలేనప్పటికీ, మీ నిజమైన విశ్వాసంతో మాత్రమే మీరు ఆశీర్వదించబడుతారు మరియు మీ నిజమైన విశ్వాసం కారణంగానే మీరు యేసు ప్రభువును చూస్తారు మరియు ఇలాంటి వ్యక్తి మాత్రమే ఆశీర్వదించబడుతాడు.

యేసు ప్రభువు తోమాకి ప్రత్యక్షమైనప్పుడు, ఆయన అతనితో మాట్లాడినట్లుగా బైబిలులో నమోదు చేయబడిన ఈ మాటలనేవి కృపా యుగంలోని ప్రజలందరికీ గొప్ప సహాయకరంగా ఉంటాయి. తోమాకు చూపిన ఆయన ప్రత్యక్షత మరియు అతనితో ఆయన మాట్లాడిన మాటలు అనేవి ఆ తర్వాత వచ్చిన తరాల మీద తీవ్ర ప్రభావం చూపాయి; అవి శాశ్వతమైన ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. దేవుని మీద ఎన్నో సందేహాలను కలిగియున్నప్పటికీ, దేవునియందు నమ్మకం కలిగిన వ్యక్తిగా తోమా ప్రాతినిధ్యం వహించాడు. అలాంటివాళ్లు అనుమానముతో కూడిన స్వభావమును కలిగి ఉంటారు, అలాంటివారు దుష్ట హృదయాలను కలిగి ఉంటారు, ఇలాంటివారందరూ నమ్మకద్రోహులు మరియు దేవుడు నెరవేర్చగల వాటియందు నమ్మకం కలిగియుండరు. వీళ్లు దేవుని సర్వాధికారాన్నీ మరియు ఆయన సార్వభౌమత్వాన్నీ విశ్వసించరు మరియు శరీరధారియైన దేవుణ్ణి కూడా వీళ్లు విశ్వసించరు. అయినప్పటికీ, ప్రభువైన యేసు పునరుత్థానం అనేది వారికున్న ఇలాంటి లక్షణాల నేపథ్యంలోనే జరిగింది మరియు వాళ్లు తమ స్వంత సందేహాన్ని కనుగొనడాని, వారి స్వంత సందేహాన్ని గుర్తించడానికి మరియు వారి స్వంత ద్రోహాన్ని అంగీకరించడానికి వారికి అవకాశం కల్పించింది. తద్వారా, ప్రభువైన యేసు ఉనికిని మరియు పునరుత్థానాన్ని వాళ్లు నిజంగా విశ్వసిస్తారు. తోమాతో జరిగినదంతా తరువాతి తరాల వారికి ఒక హెచ్చరికలాంటిది మరియు ముందుజాగ్రత్తలాంటిది. తద్వారా, తోమా లాగా సందేహించవద్దని ఎక్కువ మంది వ్యక్తులు హెచ్చరించబడుతారు మరియు వాళ్లు తమను తాము సందేహంతో నింపుకుంటే, వాళ్లు చీకట్లో మునిగిపోతారు. మీరు దేవుణ్ణి అనుసరించినప్పటికీ, తోమా లాగా ఎల్లప్పుడూ దేవుని పక్కటెముకను తాకాలనీ మరియు ఆయన శరీరం మీది మేకుల గుర్తులను గుర్తించి నిర్ధారణ పొందాలని, దేవుడు ఉన్నాడా లేదా అనే విషయాన్ని నిరూపణ చేయాలని, ధృవీకరించాలనీ ఊహించినట్లయితే దేవుడు నిన్ను విడిచిపెడతాడు. అందుచేత, మనుష్యులు తోమాలాగా ఉండకూడదనీ, తమ కళ్లతో చూడగలిగే వాటినే వాళ్లు మాత్రమే విశ్వసించాలనీ, స్వచ్ఛమైన, నిజాయితీగల వ్యక్తులుగా ఉండాలనీ, దేవునిపట్ల సందేహాలు కలిగి ఉండకూడదనీ, విశ్వాసంతో ఆయన్ని అనుసరించాలనీ యేసు ప్రభువు కోరుకున్నాడు. ఇలాంటి వ్యక్తులే ఆశీర్వాదాలు పొందుతారు. ప్రభువైన యేసు మనుష్యుల నుండి కోరుకునేది ఈ చిన్న కోరిక మాత్రమే. అలాగే, ఆయన అనుచరులకు ఇదొక ఒక హెచ్చరికగా ఉన్నది.

పూర్తిగా సందేహాలతో నిండిన వారిపట్ల ప్రభువైన యేసు వైఖరి అనేది పైవిధంగా ఉంటుంది. కాబట్టి, తనని నిజాయితీగా విశ్వసించగల మరియు అనుసరించగల వారి కోసం యేసు ప్రభువు ఏం చెప్పాడు మరియు ఏం చేసాడు? ప్రభువైన యేసుకు మరియు పేతురుకు మధ్య జరిగిన సంభాషణ ద్వారా మనం తదుపరి ఆ విషయాన్నే తెలుసుకోబోతున్నాం.

ఈ సంభాషణలో, పేతురును యేసు ప్రభువు పదే పదే “యోహాను కుమారుడవైన సీమోనూ, నన్ను ప్రేమించుచున్నావా?” అని అడిగాడు. తన పునరుత్థానం తర్వాత, పేతురువంటి వ్యక్తులనుండి, క్రీస్తును నిజంగా విశ్వసించే మరియు ప్రభువును ప్రేమించడానికి ప్రయత్నించే వ్యక్తుల నుండి యేసు ప్రభువు కోరుకునే ఒక ఉన్నత ప్రమాణం ఇది. ఈ ప్రశ్న ఒక విధమైన పరిశోధన మరియు విచారణలాంటిది. అయితే, అంతకుమించి, పేతురువంటి వ్యక్తులకు ఇది అవసరమైయున్నది మరియు అపేక్షయైయున్నది. యేసు ప్రభువు ప్రశ్నించే పద్ధతిని ఉపయోగించాడు. తద్వారా, మనుష్యులు తమలో తాము ప్రతిబింబిస్తారు మరియు తమలోకి తాము చూసుకుంటారు మరియు ఇలా అడుగుతారు: మనుష్యుల నుండి యేసు ప్రభువు కోరుకునేదేమిటి? నేను ప్రభువును ప్రేమిస్తున్నానా? నేను దేవుణ్ణి ప్రేమించే వ్యక్తినేనా? నేను దేవుణ్ణి ఎలా ప్రేమించాలి? పేతురును మాత్రమే యేసు ప్రభువు ఈ ప్రశ్న అడిగినప్పటికీ, నిజం ఏమిటంటే, పేతురును ఈ ప్రశ్నలు అడగడం ద్వారా, దేవుణ్ణి ప్రేమించాలని కోరుకునే అనేకమందిని ఇదే విధమైన ప్రశ్న అడగడానికి ఈ అవకాశం ఉపయోగించుకోవాలని ఆయన కోరుకున్నాడు. యేసు ప్రభువు నోటి నుండి ఈ ప్రశ్నను స్వీకరించడానికి, ఈ రకమైన వ్యక్తులకు ప్రతినిధిగా వ్యవహరించడానికి పేతురు మాత్రమే ఆశీర్వదించబడ్డాడు.

యేసు ప్రభువు తన పునరుత్థానం తర్వాత, తోమాతో “నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి, అవిశ్వాసివికాక విశ్వాసివై యుండుమనెను.” అలాగే, పేతురును మూడుసార్లు వరుసగా “యోహాను కుమారుడవైన సీమోనూ, నన్ను ప్రేమించుచున్నావా?” అని అడిగాడు. ఈ వాక్యాలనేవి ప్రభువైన యేసు వైఖరిలోని దృఢత్వాన్ని మరియు ఆయన ప్రశ్నించే సమయంలో ఆయన అనుభవించిన ఆవశ్యకతను మనుష్యులు మెరుగ్గా అనుభూతి చెందేలా చేస్తాయి. సందేహంతో నిండిన మనస్సుతో ఉన్న తోమా విషయానికొస్తే, నమ్మకంలేని అతని స్వభావం కారణంగా, అతను తన చేతిని చాచడానికి మరియు ఆయన శరీరంలోని మేకు గుర్తులు తాకడానికి యేసు ప్రభువు అనుమతించాడు. యేసు ప్రభువు పునరుత్థానుడైన మనుష్య కుమారుడని అతడు విశ్వసించడానికి మరియు క్రీస్తుగా ప్రభువైన యేసు యొక్క గుర్తింపును అంగీకరించడానికి ఇది దారితీసింది. అలాగే, తోమాను ప్రభువైన యేసు కఠినంగా మందలించకపోయినా, మరియు అతని గురించి స్పష్టమైన తీర్పును ప్రకటించకపోయినా, ఆయన తోమాను అర్థము చేసుకున్నాడని తోమాకు తెలియజేయడం కోసం ఆయన ఆచరణాత్మక చర్యలు ఉపయోగించాడు. అదే సమయంలో, ఆ రకమైన వ్యక్తిపట్ల ఆయన తన వైఖరిని మరియు దృఢచిత్తాన్ని కూడా ప్రదర్శించాడు. ఆ విధమైన వ్యక్తి నుండి యేసు ప్రభువు కోరుకునేవాటిని మరియు ఎదురుచూచేవాటిని ఆయన చెప్పిన వాటిని నుండి చూడలేము. ఎందుకంటే, తోమావంటి వ్యక్తులకు నిజమైన విశ్వాసం లేశమంత కూడా ఉండదు. ప్రభువైన యేసు కోరుకునేవి అలాంటి వాళ్లకి చాలా దూరంలో ఉంటాయి. అయితే, పేతురువంటి వ్యక్తులపట్ల ఆయన వెల్లడించిన వైఖరి అనేది దీనికి పూర్తి భిన్నమైనది. పేతురు తన చేయి చాచి, ఆయనకు వేసిన మేకుల గుర్తులను తాకలని ఆయన కోరలేదు, లేక పేతురుతో, “అవిశ్వాసివి కాక విశ్వాసివైయుండు” అని అనలేదు. దానికి బదులుగా, ఆయన అదే ప్రశ్నను పేతురును పదే పదే అడిగాడు. ఈ ప్రశ్న ఆలోచింపజేసేది మరియు అర్థవంతమైనది. క్రీస్తును అనుసరించే ప్రతి ఒక్కరికీ ఈ ప్రశ్న పశ్చాత్తాపమును మరియు భయమును కలిగిస్తుంది. అయితే, యేసు ప్రభువు యొక్క విదారమును, దుఃఖకరమైన మానసిక స్థితిని అనుభూతి చెందేలా కూడా చేస్తుంది. మరియు వారు ఎక్కువ బాధలోను మరియు శ్రమలలోను ఉన్నప్పుడు, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క శ్రద్ధను మరియు ఆయన సంరక్షణను వారు మరింతగా అర్థం చేసుకోగలుగుతారు; ఆయన గంభీరమైన బోధనను మరియు పవిత్రమైన యథార్థమైన వ్యక్తుల కఠిన అవసరాలను వాళ్లు గ్రహిస్తారు. ఈ సాధారణ వాక్కులతో వెల్లడి చేయబడిన వ్యక్తులపట్ల ప్రభువు అంచనాలనేవి కేవలం ఆయనను విశ్వసించడం మరియు అనుసరించడం మాత్రమే కాకుండా, ఆయన మీద ప్రేమను కలిగి ఉండడం, నీ ప్రభువు మరియు నీ దేవుణ్ణి ప్రేమించడం అని మనుష్యులు భావించేందుకు ప్రభువైన యేసు యొక్క ప్రశ్న ఉపయోగపడుతుంది. ఈ రకమైన ప్రేమ అనేది సంరక్షణయు మరియు విధేయతయునైయున్నది. ఇది ఎలా ఉంటుందంటే మనుష్యులు దేవుని కోసం జీవించడం, దేవుని కోసం చనిపోవడం, ప్రతి ఒక్కటీ దేవునికి అంకితం చేయడం మరియు దేవుని కోసం ప్రతిఒక్కటీ ఖర్చు చేయడం మరియు ఇవ్వడం అనే విధంగా ఉంటుంది. ఈ రకమైన ప్రేమ దేవునికి ఆదరణను కూడా ఇస్తుంది, సాక్ష్యాన్ని ఆయన ఆస్వాదించడానికి మరియు విశ్రాంతి తీసుకోవడానికి కూడా అనుమతినిస్తుంది. ఇది మానవజాతి అంతా దేవునికి తిరిగి చెల్లించుటయైయున్నద, ఇది మనిషి బాధ్యత, తప్పనిసరిగా చేయవలసిన నిబద్ధత మరియు కర్తవ్యమైయున్నది మరియు ఇది మనుష్యులు వారి జీవితాంతం అనుసరించాల్సిన నిజమైన మార్గమైయున్నది. ఈ మూడు ప్రశ్నలనేవి పేతురు నుండి మరియు పరిపూర్ణులుగా తయారయ్యే మనుష్యులందరి నుండి ప్రభువైన యేసు కోరుకునే ఒక కోరిక మరియు ఆయన వారికి అందించే ఒక ఉపదేశమై ఉన్నాయి. ఈ మూడు ప్రశ్నలే పేతురును అతని జీవితంలో అతని మార్గాన్ని చివరి వరకు అనుసరించడానికి నడిపించాయి మరియు ప్రేరేపించాయి మరియు యేసు ప్రభువు నుండి విడిపోయినప్పుడు ఈ ప్రశ్నలే పేతురును పరిపూర్ణంగా మార్చడానికి దారితీశాయి. అతడిని నడిపించాయి. ఎందుకంటే, ప్రభువు కొరకు అతనికున్న ప్రేమ, ప్రభువు హృదయంపట్ల అతనికున్న శ్రద్ధ, ప్రభువుకు విధేయత చూపడం, ప్రభువుకు ఆదరణను కలిగించడం మరియు ఈ ప్రేమ కారణంగానే అతను తనను సంపూర్ణముగా అర్పించడం మరియు అతని మొత్తం జీవితాన్ని అర్పించడమే ఇందుకు కారణం.

కృపా యుగంలో, ప్రధానంగా రెండు రకాల మనుష్యుల కోసం దేవుని కార్యము సాగింది. మొదటిది, ఆయనను విశ్వసించే, అనుసరించే వ్యక్తి, ఆయన ఆజ్ఞలను పాటించగలిగే వ్యక్తి, సిలువను భరించి, కృపా యుగపు మార్గంలో ముందుకు సాగాలి. ఈ రకమైన వ్యక్తి దేవుని ఆశీర్వాదం పొంది దేవుని కృపను ఆనందిస్తాడు. రెండవ రకానికి సంబంధించిన వ్యక్తి ఎవరంటే పరిపూర్ణుడవ్వాలని కోరుకునే పేతురువంటి వ్యక్తి. అందుచేత, ప్రభువైన యేసు పునరుత్థానుడైన తర్వాత, ముందుగా ఆయన ఈ రెండు అత్యంత అర్థవంతమైన పనులను చేశాడు. ఒకటి తోమాతో, మరొకటి పేతురుతో చేశాడు. ఈ రెండు విషయాలు దేనిని సూచిస్తున్నాయి? మానవాళిని రక్షించాలనే దేవుని నిజమైన ఉద్దేశాలను అవి సూచిస్తున్నాయా? మానవజాతిపట్ల దేవుని యథార్థతను అవి సూచిస్తున్నాయా? తోమాతో ఆయన చేసిన పని ఏమిటంటే, అనుమానించడం మానేసి, విశ్వసించండి అని మనుష్యులను హెచ్చరించడం. పేతురుతో ఆయన చేసిన పని ఏమిటంటే, పేతురులాంటి వ్యక్తుల విశ్వాసాన్ని బలోపేతం చేయడం మరియు ఆ రకమైన వ్యక్తి నుండి ఆయన కోరుకున్నవాటిని స్పష్టం చేయడం, వాళ్లు ఏ లక్ష్యాలను అనుసరించాలో చూపించడం.

ప్రభువైన యేసు పునరుత్థానుడైన తర్వాత, వీళ్ళు నాకు అవసరమని భావించిన వ్యక్తులకు ఆయన కనిపించాడు. వారితో మాట్లాడాడు మరియు వారికి కావాలసిన వాటిని తీర్చాడు. మనుష్యులపట్ల ఆయనకున్న ఉద్దేశాలను మరియు తలంపులను ఆయన వదిలివేసాడు. అంటే, శరీరధారియైన దేవునివలె మానవజాతిపట్ల మరియు మనుష్యుల అవసరాలపట్ల ఆయన శ్రద్ధ ఎన్నటికీ మారలేదు; ఆయన శరీరములో ఉన్నప్పుడు, ఆయనను సిలువకు వ్రేలాడదీయబడి మరియు పునరుత్థానుడైన తరువాత ఆయన ఆత్మ సంబంధిత శరీరంలో ఉన్నప్పుడు కూడా అవి అలాగే ఉన్నాయి. ఆయన సిలువ ఎక్కడానికి ముందు ఈ శిష్యుల గురించి ఆందోళన చెందాడు మరియు ఆయన తన హృదయంలో ప్రతి వ్యక్తి స్థితిని గురించి స్పష్టంగా ఉన్నాడు మరియు ప్రతి వ్యక్తి లోపాలను ఆయన అర్థం చేసుకున్నాడు మరియు మరణించిన తర్వాత, పునరుత్థానుడై, ఆత్మ సంబంధిత శరీరం ధరించినప్పుడు కూడా అతను శరీరధారిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో అలాగే ప్రతి వ్యక్తిని అర్థం చేసుకున్నాడు. క్రీస్తుగా తన గుర్తింపును గురించి ప్రజలకు పూర్తిగా తెలియదనే విషయం ఆయనకు తెలుసు. అయినప్పటికీ, శరీరధారిగా ఉన్న సమయంలో మనుష్యుల నుండి ఆయన కఠినమైన కోరికలేవీ కోరలేదు. అయితే, ఆయన పునరుత్థానుడైన తర్వాత, ఆయన వారికి కనిపించాడు మరియు యేసు ప్రభువు దేవుని వద్ద నుండి వచ్చాడనీ మరియు ఆయన శరీరధారిగా వచ్చిన దేవుడనీ వారికి స్పష్టంగా తెలియజేసాడు మరియు ఇందుకోసం ఆయన తన ప్రత్యక్షతను మరియు తన పునరుత్థానాన్ని గొప్ప దర్శనంగా మరియు మానవజాతి జీవితకాల సాధనకు ప్రేరణగా ఉపయోగించాడు. ఆయన మరణం నుండి పునరుత్థానమవ్వడం అనేది ఆయన్ని అనుసరించిన వారందరినీ బలపరచడమే కాకుండా, కృపాయుగంలో ఆయన కార్యమును మానవాళిలో పూర్తిగా అమలు చేసింది. తద్వారా, కృపా యుగంలో ప్రభువైన యేసు యొక్క రక్షణ సువార్త క్రమక్రమంగా మానవాళి నివసించిన ప్రతి మూలకు వ్యాపించింది. పునరుత్థానం తర్వాత, యేసు ప్రభువు ప్రత్యక్షతకు ఏదైనా ప్రాముఖ్యత ఉందని నీవు చెప్పగలవా? ఆ సమయంలో నీవే తోమాగానో లేదా పేతురుగానో అయి ఉండి, నీ జీవితంలో ఈ ఒక్క అత్యంత అర్థవంతమైన విషయాన్ని నీవు ఎదుర్కొంటే, అది నీ మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది? దేవుణ్ణి విశ్వసించేందుకు నీ జీవితంలో ఇది అత్యుత్తమమైన మరియు గొప్ప ప్రత్యక్షతగా దీన్ని నీవు చూస్తావా? నీవు దేవుణ్ణి వెంబడించడం, ఆయనను సంతృప్తి పరచడానికి ప్రయత్నించడం మరియు నీ జీవితాంతం దేవుణ్ణి ప్రేమించడం కోసం ప్రయత్నించడం ద్వారా, ఇది మిమ్మల్ని నడిపించే శక్తి అన్నట్లుగా నీవు చూస్తావా? ఈ గొప్ప దర్శనాలను వ్యాప్తి చేయడానికి నీవు జీవితకాలం అంతా కృషి చేసి ఉండేవారా? ప్రభువైన యేసు రక్షణను దేవుడు అప్పగించిన పనిగా వ్యాప్తి చేయడానికి అంగీకరించేవారా? నీవు దీనిని అనుభవించనప్పటికీ, దేవుడు మరియు ఆయన చిత్తం గురించి స్పష్టమైన అవగాహన పొందడానికి తోమా మరియు పేతురులకు సంబంధించిన రెండు ఉదాహరణలు ఆధునిక మానవులకు ఖచ్చితంగా సరిపోతాయి. దేవుడు శరీరధారిగా మారిన తర్వాత, మానవజాతి మధ్య జీవితాన్ని వ్యక్తిగతంగా అనుభవించిన తర్వాత మరియు మానవ జీవితాన్ని వ్యక్తిగతంగా అనుభవించిన తర్వాత, మానవజాతి దుర్నీతిని మరియు ఆ సమయంలో మానవ జీవిత పరిస్థితిని చూసిన తర్వాత, మానవజాతి ఎంత నిస్సహాయంగా, దౌర్భాగ్యకరంగా మరియు దయనీయంగా ఉందనే విషయాన్ని శరీరధారియైన దేవుడు మరింత లోతుగా తెలుసుకున్నాడని చెప్పవచ్చు. ఆయన శరీరంలో ఉన్నప్పుడు కలిగిన మానవత్వం కారణంగా, ఆయన శరీర ప్రవృత్తి కారణంగా, మానవ దయానీయమైన స్థితిపట్ల దేవుడు మరింత సహానుభూతి పొందాడు. ఇది ఆయన తన అనుచరులపట్ల ఎక్కువ శ్రద్ధ చూపేలా చేసింది. బహుశా, ఇవన్నీ మీరు అర్థం చేసుకోలేని విషయాలు కావచ్చు. కానీ, “తీవ్రమైన ఆందోళన” అనే రెండు పదాలు ఉపయోగించి, శరీరధారియైన దేవుడు తన అనుచరుల్లోని ప్రతి ఒక్కరి గురించి అనుభవించిన ఆందోళనను మరియు శ్రద్ధను నేను వివరించగలను. ఈ మాట మానవ భాష నుండి వచ్చినప్పటికీ మరియు ఇది ఎక్కువ మట్టుకుమానవ సంబంధితం అయినప్పటికీ, ఇది నిజంగానే తన అనుచరులపట్ల దేవుని భావాలను వ్యక్తీకరిస్తుంది మరియు వివరిస్తుంది. మనుష్యుల పట్ల దేవునికున్న తీవ్రమైన శ్రద్ధ విషయానికొస్తే, మీరు అనుభవాలు పొందే సమయములో మీరు క్రమక్రమంగా దీనిని అనుభూతి చెందుతారు మరియు దాని రుచిని మీరు పొందుకుంటారు. అయితే, మీ స్వంత స్వభావములో మార్పు జరిగే దానినిబట్టి దేవుని స్వభావాన్ని క్రమంగా అర్థం చేసుకోవడం ద్వారా మాత్రమే ఇది సాధించబడుతుంది. ప్రభువైన యేసు ఇలా కనిపించినప్పుడు, అది మనుష్యులైన తన అనుచరులపట్ల ఆయనలో తీవ్రమైన ఆందోళన కలిగించింది మరియు అది ఆయన ఆత్మ సంబంధమైన శరీరానికి బదిలీ చేయబడుతుంది, లేక అది ఆయన దైవత్వానికి చెందుతుందని కూడా మీరు చెప్పవచ్చు. ఆయన ప్రత్యక్షతను మరోసారి అనుభవించడానికి మరియు దేవుని కాపుదలను మరియు సంరక్షణను మరోసారి అనుభవించడానికి ఇది మనుష్యులను అనుమతిస్తుంది. అదే సమయంలో దేవుడు యుగాన్ని ప్రారంభించేవాడు, యుగాన్ని ఆవిష్కరించేవాడు మరియు యుగాన్ని ముగించేవాడు కూడా అని శక్తివంతంగా రుజువు చేస్తుంది. తన ప్రత్యక్షత ద్వారా, మనుష్యులందరి విశ్వాసాన్ని ఆయన బలపరిచాడు మరియు తానే దేవుడనే వాస్తవాన్ని ప్రపంచానికి నిరూపించాడు. ఇది ఆయన అనుచరులకు శాశ్వతమైన ధృవీకరణను అందించింది మరియు ఆయన తన ప్రత్యక్షత ద్వారా, కొత్త యుగంలో తన కార్యపు ఒక దశను కూడా ప్రారంభించాడు.

13. యేసు రొట్టెను తినుటమరియు తన పునరుత్థానం తర్వాత లేఖనాలను వివరించుట

లూకా 24:30-32 ఆయన వారితోకూడ భోజనమునకు కూర్చున్నప్పుడు, ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాని విరిచి వారికి పంచి పెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపెట్టిరి; అంతట ఆయన వారికి అదృశ్యుడాయెను. అప్పుడు వారు, ఆయన త్రోవలో మనతో మాటలాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని యొకనితో ఒకడు చెప్పుకొనిరి.

14. యేసు తినడం కోసం శిష్యులు కాల్చిన చేపలు ఇస్తారు

లూకా 24:36-43 వారు ఈలాగు మాటలాడుచుండగా ఆయన వారి మధ్యను నిలిచి, మీకు సమాధానమవుగాకని వారితో అనెను. అయితే వారు దిగులుపడి భయాక్రాంతులై, భూతము తమకు కనబడెనని తలంచిరి. అప్పుడాయన, మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టనేల? నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి; నన్ను పెట్టి చూడుడి, నాకున్నట్టుగా మీరు చూచుచున్న యెముకలును మాంసమును భూతమునకుండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపెను. అయితే వారు సంతోషముచేత ఇంకను నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన, ఇక్కడ మీయొద్ద ఏమైన ఆహారము కలదా అని వారినడిగెను. వారు కాల్చిన చేప ముక్కను ఆయనకిచ్చిరి. ఆయన దానిని తీసికొని వారియెదుట భుజించెను.

తర్వాత, పైన చెప్పబడిన లేఖన భాగాలను మనం పరిశీలిద్దాం. మొదటి వాక్యభాగము అనేది యేసు ప్రభువు రొట్టెలు తినుటను గూర్చి మరియు ఆయన పునరుత్థానం తర్వాత లేఖనాలను వివరించుటను గూర్చి వివరిస్తుంది. రెండవ వాక్యభాగము అనేది కాల్చిన చేపను యేసు ప్రభువు తినుటను గురించి వివరిస్తుంది. దేవుని స్వభావమును తెలుసుకోవడంలో ఈ రెండు భాగాలు మీకు ఎలా సహాయపడతాయి? యేసు ప్రభువు రొట్టెలు తిని, ఆ తర్వాత కాల్చిన చేపను తిన్న ఈ వివరణల నుండి మీరు పొందుకునే ఒక విధమైన చిత్రాన్ని మీరు ఊహించుకోగలరా? యేసు ప్రభువు మీ ముందు నిలబడి రొట్టెలు తింటుంటే, మీరు ఎలాంటి భావన కలిగియుంటారు? లేక, ఆయన మీతో కలిసి ఒకే బల్ల మీద భోజనం చేస్తుంటే, మనుష్యులతో కలిసి కూర్చుని చేపలు మరియు రొట్టెలు తింటుంటే, ఆ క్షణంలో మీరు ఎలాంటి అనుభూతిని కలిగియుంటారు? ప్రభువుకు చాలా సన్నిహితంగా ఉన్నారనే భావనను మీరు కలిగియున్నట్లయితే, ఆయన మీతో చాలా సన్నిహితంగా ఉన్నారనే భావన కలిగితే, ఆ భావన సరైనదే. ఆయన పునరుత్థానం తర్వాత, తనముందు కూడి వచ్చిన మనుష్యులతో కలసి రొట్టెలు మరియు చేపలు తినడం ద్వారా యేసు ప్రభువు తీసుకురావాలనుకున్న ఫలితం కూడా అదే. యేసు ప్రభువు తన పునరుత్థానం తర్వాతే మనుష్యులతో మాట్లాడి ఉంటే, వారు ఆయన మాంసము మరియు ఎముకలు కలిగిన వ్యక్తిగా కాకుండా, ఆయన్ని సమీపించలేని ఆత్మగా భావించి ఉంటే, వారు ఎలాంటి భావనతో ఉండేవారు? వారు నిరాశ చెంది ఉండేవారు కాదా? నిరుత్సాహానికి గురైనప్పుడు, విడిచిపెట్టబడినవారమనే భావనను మనుష్యులు కలిగియుండేవారు కాదా? అలాంటప్పుడు వారు తమకు మరియు ప్రభువైన యేసు క్రీస్తుకు మధ్య దూరాన్ని అనుభవించే వారు కాదా? దేవునితో మనుష్యులకు ఉన్నటువంటి సంబంధం మీద ఈ దూరం ఎలాంటి ప్రతికూల ప్రభావం సృష్టించేది? మనుష్యులు ఖచ్చితంగా భయపడి ఉండేవారు. వారు ఆయన దగ్గరకు వచ్చే సాహసం చేసియుండెవారు కాదు, తద్వారా వారు ఆయనను గౌరవప్రదంగా దూరంగా ఉంచాలనే వైఖరిని కలిగి ఉండేవారు. ఆ తర్వాత వాళ్లు ప్రభువైన యేసు క్రీస్తుతో తమ సన్నిహిత బంధాన్ని తెంచుకుని, కృపా యుగానికి ముందు ఉన్నట్లుగా పరలోకమందున్న దేవునికి మరియు మానవజాతికి మధ్య ఉన్న బంధానికి తిరిగి చేరుకునే వారు. మనుష్యులు తాకలేని, లేదా అనుభూతి చెందలేని ఆత్మ సంబంధమైన శరీరం అనేది దేవునితో వారికున్నటువంటి సాన్నిహిత్యాన్ని నిర్మూలించడానికి దారితీస్తుంది. ఆయనకి మరియు మనుష్యులకు మధ్య ఎలాంటి దూరంలేని విధంగా, యేసుక్రీస్తు శరీరునిగా ఉన్న సమయంలో స్థాపించబడిన సన్నిహిత సంబంధం సైతం ఉనికిని కోల్పోవుటకు దారితీస్తుంది. ఆత్మ సంబంధమైన శరీరం ద్వారా ప్రజల్లో ప్రేరేపించబడేవి భయం, తప్పించుకోవడం మరియు మాటలులేని చూపులు భావాలుగా మాత్రమే ఉంటాయి. కాబట్టి, వారు ఆయనతో సన్నిహితంగా ఉండడానికి లేదా ఆయనతో సంభాషణలో పాల్గొనడానికి ధైర్యం చేయలేరు. ఆయన్ని అనుసరించడం, విశ్వసించడం లేదా ఆయన వైపు చూడటంవంటివి కూడా చేయలేరు. మనుష్యులు తనపట్ల ఈ రకమైన భావాన్ని కలిగి ఉండడం చూడాలని దేవుడు అనుకోలేదు. మనుష్యులు తనను తప్పించుకోవడం లేదా ఆయన నుండి తమను తాము దూరం చేసుకోవడం లాంటివి చూడాలని ఆయన కోరుకోలేదు; ప్రజలు తనను అర్థం చేసుకోవాలనీ, తన దగ్గరికి రావాలనీ మరియు తన కుటుంబంగా ఉండాలనీ మాత్రమే ఆయన కోరుకున్నాడు. నీ స్వంత కుటుంబం, నీ పిల్లలు, నిన్ను చూసినప్పటికీ, నిన్ను గుర్తించకపోయినా, నీ దగ్గరికి వచ్చేందుకు ధైర్యం చేయకపోయినా, ఎల్లప్పుడూ నిన్ను తప్పించుకు తిరిగితే, నీవు వారి కోసం చేసిన ప్రతిదాని గురించి వారికి ఎలాంటి అవగాహనను కలిగించకపోతే, అది నీకు ఎలాంటి భావన కలిగిస్తుంది? అది బాధాకరమైన విషయం కాదా? అది మీకు హృదయ విదారకంగా అనిపించదా? మనుష్యులు ఆయనను తప్పించుకు తిరిగినప్పుడు దేవుడు కూడా ఖచ్చితంగా అలాంటి భావననే కలిగియుంటాడు. అందుచేత, పునరుత్థానం తర్వాత, ప్రభువైన యేసు రక్త మాంసములు కలిగిన శరీరధారిగానే మనుష్యులకు కనిపించాడు మరియు అప్పుడు కూడా వారితో కలసి తిన్నాడు మరియు తాగాడు. మనుష్యులను దేవుడు కుటుంబంగా చూస్తాడు మరియు మానవజాతి ఆయనను అత్యంత ప్రియమైన వ్యక్తిగా చూడాలని దేవుడు కోరుకుంటాడు; ఆ విధంగా మాత్రమే దేవుడు నిజంగా మనుష్యులను పొందగలడు మరియు ఆ విధంగా మాత్రమే మనుష్యులు సైతం దేవుణ్ణి నిజంగా ప్రేమించగలరు మరియు ఆరాధించగలరు. యేసు ప్రభువు తన పునరుత్థానం తర్వాత, రొట్టెలు తిని, శిష్యులు ఇచ్చిన కాల్చిన చేపలను తిన్న తర్వాత, లేఖనాలను వివరించడం గురించి పేర్కొనే ఈ రెండు వాక్యభాగాలను సంగ్రహించడంలో నా ఉద్దేశ్యాన్ని మీరు అర్థం చేసుకోగలిగారా?

యేసు ప్రభువు పునరుత్థానం తర్వాత ఆయన చెప్పిన మరియు చేసిన విషయాల క్రమములో గంభీరమైన ఆలోచన ఉందని చెప్పవచ్చు. ఈ విషయాలనేవి మానవాళిపట్ల దేవుడు కలిగి ఉన్న దయతోను మరియు ఆప్యాయతతోను నిండి ఉన్నాయి మరియు మానవజాతితో ఏర్పరచుకున్న సన్నిహిత సంబంధంపట్ల ఆయన కలిగి ఉన్న ఆదరణ మరియు ఖచ్చితమైన శ్రద్ధతో కూడా నిండి ఉన్నాయి. అంతకుమించి, ఆయన శరీరధారుడిగా ఉన్న సమయంలో తన అనుచరులతో కలిసి తిని జీవించిన తన జీవితం కోసం ఆయన కలిగి ఉన్న చింతతోను మరియు వాంఛతోను నిండి ఉన్నాయి. అందుచేత, దేవునికి మరియు మనిషికి మధ్య దూరం అనేది మనిషి అనుభవంలోకి రావాలని దేవుడు కోరుకోలేదు మరియు దేవుడి నుండి మానవజాతి తమను తాము దూరం చేసుకోవాలని కూడా దేవుడు కోరుకోలేదు. అంతకుమించి, తన పునరుత్థానం తర్వాత యేసు ప్రభువు ప్రజలతో అత్యంత సన్నిహితంగా ఉండే ప్రభువు కాదనీ, ఆయన మళ్లీ ఆత్మ సంబంధమైన ప్రపంచానికి చేరుకున్న కారణంగా, మనుష్యులు ఎప్పుడూ చూడలేని లేదా చేరుకోలేని తండ్రి వద్దకు ఆయన చేరుకున్న కారణంగా, ఆయన ఇకపై మానవజాతితో కలిసి ఉండడనీ మానవాళి భావించకూడదని ఆయన కోరుకున్నాడు. ఆయనకు మరియు మానవజాతికి మధ్య అప్పటివరకు ఉన్న స్థితిలో ఏదైనా వ్యత్యాసం తలెత్తిందనే భావన మనుష్యులకు రాకూడదని ఆయన కోరుకున్నాడు. ఆయనను వెంబడించాలనుకున్నప్పటికీ, ఆయనను ఒక గౌరవప్రదమైన దూరంలో ఉంచే మనుష్యులను చూసినప్పుడు, దేవుని హృదయం బాధకు గురైంది. ఎందుకంటే, వారి హృదయాలు ఆయనకు చాలా దూరంగా ఉన్నాయి మరియు వారి హృదయాలను పొందుకోవడం ఆయనకు చాలా కష్టం కావడమే అందుకు కారణం. కాబట్టే, మనుష్యులు చూడలేని లేదా స్పర్శించలేని ఆత్మ సంబంధమైన శరీరంలో ఆయన కనిపించినట్లయితే, అది మానవుడిని మరోసారి దేవుని నుండి దూరం చేసేదిగా ఉంటుంది. అలాగే, క్రీస్తు పునరుత్థానం తర్వాత మనుష్యులు ఆయన్ని మహోన్నతమైన, భిన్నమైన వ్యక్తిగా తప్పుడు కోణం నుండి చూసేలా చేస్తుంది. మనుష్యులకంటే ఆయన విభిన్నమైన వ్యక్తిగా చేస్తుంది మరియు మానవులు పాపాత్ములు, అపవిత్రులు మరియు దేవుణ్ణి సమీపించలేని వారుగా ఉన్నందున దేవుడు ఇకపై మనుష్యులతో తినడం మరియు బల్లను పంచుకోవడంలాంటివి ఇక ఎన్నడూ చేయని వ్యక్తిగా చూసేలా చేస్తుంది. మానవజాతి ఏర్పరచుకునే ఇటువంటి అపార్థాలను పారద్రోలడం కోసం, యేసుప్రభువు తాను శరీరములో ఉన్నప్పుడు అనేక పనులు చేసాడు, బైబిలులో ఇలా దాఖలు చేయబడింది: “ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాని విరిచి వారికి పంచి పెట్టాడు.” ఆయన గతంలో చేస్తున్న విధంగానే ఆయన లేఖనాలను కూడా వివరించాడు. యేసు ప్రభువు ఈ పనులన్నీ చేశాడు కాబట్టే, ఆయన్ని చూసిన ప్రతి వ్యక్తికి ప్రభువు మారలేదనీ, ఇప్పటికీ ఆయన ప్రభువైన యేసు అని వాళ్లు భావించారు. ఆయన సిలువకు వ్రేలాడదీయబడినప్పటికీ మరియు మరణం అనుభవించినప్పటికీ, ఆయన పునరుత్థానం చెందాడు మరియు ఆయన మానవజాతిని విడిచిపెట్టలేదు. ఆయన మళ్లీ మనుష్యుల మధ్యకు తిరిగి వచ్చాడు మరియు ఆయన గురించిన ఏ ఒక్క అంశమూ మారలేదు. మనుష్యుల ముందు నిలబడిన మనుష్య కుమారుడు ఇప్పటికీ అదే ప్రభువైన యేసుగానే ఉన్నాడు. ఆయన ప్రవర్తన మరియు ఆయన మనుష్యులతో సంభాషించే విధానం అత్యంత సుపరిచితంగానే ఉంది. ఆయన ఇంకా ప్రేమపూర్వకమైన దయతోను, కృపతోను మరియు సహనంతోను నిండి ఉన్నాడు, ఆయన తనను తాను ప్రేమించినట్లుగానే ఇతరులను ప్రేమించే అదే ప్రభువైన యేసుగానే ఆయన ఉన్నాడు. ఆయన మానవజాతిని డెబ్బది ఏళ్ల మారులమట్టుకు క్షమించగలడు. ఆయన ఇప్పటికీ, ఇదివరకు ఉన్నట్లుగానే, మనుష్యులతో కలసి భోజనం చేసాడు. లేఖనాల గురించి వారితో చర్చించాడు మరియు అంతకంటే ముఖ్యంగా, ఆయన మునుపటిలాగే, రక్త మాంసములు కలిగిన శరీరధారిగానే ఉన్నాడు మరియు మనుష్యులు తాకగలిగే మరియు చూడగలిగే వ్యక్తిగానే ఉన్నాడు. ఆయన మునుపు మనుష్య కుమారుడిగా ఉన్నట్లుగానే, సాన్నిహిత్యం అనుభవించడానికి, కోల్పోయిన ఆనందాన్ని తిరిగి పొందుకొని అనుభవించడానికి మరియు నెమ్మదిని అనుభవించడానికి ఆయన మనుష్యులకు అనుమతినిచ్చాడు. ఈ కారణంగా, మనుష్యులు చాలా సులభంగా, ధైర్యంగా మరియు నమ్మకంగా మానవజాతి పాపాలను క్షమించగల ఈ మనుష్య కుమారుడి మీద ఆధారపడడం మరియు ఎదురుచూడడం ప్రారంభించారు. వారు కూడా సంకోచం లేకుండా ప్రభువైన యేసు నామంతో ప్రార్థించడం ప్రారంభించారు, ఆయన కృపను, ఆయన ఆశీర్వాదాన్ని పొందడంతోపాటు ఆయన నుండి వచ్చే శాంతిని మరియు ఆనందాన్ని పొందుకోవాలని, ఆయన నుండి వచ్చే సంరక్షణను మరియు రక్షణను పొందాలని ఆయన్ని ప్రార్థించడం ప్రారంభించారు మరియు వారు రోగులను స్వస్థపరచడం ప్రారంభించారు. ప్రభువైన యేసు నామముతో దయ్యములను వెళ్లగొట్టడం మొదలుపెట్టారు.

ప్రభువైన యేసు శరీరధారిగా పనిచేసిన కాలంలో, ఆయన అనుచరుల్లో చాలామంది ఆయన గుర్తింపును మరియు ఆయన చెప్పిన విషయాలను సంపూర్ణంగా ధృవీకరించలేకపోయారు. ఆయన సిలువను సమీపిస్తున్నప్పుడు, ఆయన అనుచరుల వైఖరి గమనించదగినదిగా ఉంది. ఆ తర్వాత, ఆయన సిలువకు వ్రేలాడదీయబడినప్పటి నుండి ఆయన్ని సమాధిలో ఉంచే వరకు, ఆయనపట్ల మనుష్యుల వైఖరి నిరాశాజనకంగానే ఉంది. ఈ సమయంలోనే, మనుష్యులు వారి హృదయాల్లో చలించటం మొదలుపెట్టారు, ప్రభువైన యేసు శరీరధారిగా ఉన్న సమయంలో చెప్పిన విషయాలను పూర్తిగా తిరస్కరించడాన్ని తలచుకుని సందేహించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత, ఆయన సమాధి నుండి బయటికి వచ్చి మనుష్యుల్లో ఒక్కొక్కరికీ కనిపించినప్పుడు, ఆయన్ని తమ కళ్లతో చూసినవారు, లేదంటే ఆయన పునరుత్థాన వార్త విన్న వారిలో ఎక్కువమంది క్రమంగా తమ వైఖరిని తిరస్కరణ స్థాయి నుండి సంశయవాదానికి మార్చుకున్నారు. తోమా వచ్చి యేసు ప్రభువుని తాకే వరకు, పునరుత్థానం తర్వాత వచ్చిన ఆయన రొట్టెలు విరిచి, ప్రజల ముందు తిని, కాల్చిన చేపను కూడా వారి ముందే తిన్నప్పుడు మాత్రమే, ప్రభువైన యేసు శరీరములో ఉన్న క్రీస్తును వాళ్లు నిజంగా అంగీకరించారు. అప్పటి ఆ మనుష్యుల ముందు నిలబడిన ఆత్మ సంబంధమైన ఆ శరీరం అనేది ప్రతి ఒక్కరినీ ఒక కల నుండి మేల్కొల్పినట్లుగా ఉందని మీరు చెప్పవచ్చు: వారి ముందు నిలబడి ఉన్న మనుష్య కుమారుడు అనాది కాలం నుండి ఉన్నవాడు. ఆయన ఒక రూపాన్ని మరియు రక్త మాంసములతో కలిగియున్న శరీరాన్ని కలిగి ఉన్నాడు మరియు ఆయన ఇప్పటికే చాలాకాలంగా మానవజాతితో కలిసి జీవించాడు మరియు కలసి భుజించాడు. ఆ సమయంలో, ఆయన ఉనికి చాలా వాస్తవమైనదని మరియు చాలా అద్భుతమైనదని మనుష్యులు భావించారు. అదేసమయంలో, వారు కూడా చాలా ఆనందంగా మరియు సంతోషంగా ఉన్నారు మరియు పూర్తి భావోద్వేగంతో నిండిపోయారు. ఆయన మళ్లీ వాళ్ల కళ్ల ఎదుట కనిపించడంతో మనుష్యులు ఆయన వినయాన్ని నిజంగా చూడగలిగారు. మానవజాతిపట్ల ఆయనకున్న అనుబంధం మరియు అనుబంధాన్ని వాళ్లు అనుభవించారు మరియు వారి గురించి ఆయన ఎంతటి ఆలోచనను కలిగియున్నారో వారు అనుభవించారు. ఈ క్లుప్త కలయిక సమయంలో యేసు ప్రభువును చూసిన మనుష్యులకు వారి జీవితకాలం గడిచిపోయిన అనుభూతిని కలిగించింది. కోల్పోయినట్లుగా, గందరగోళంగా, భయంగా, ఆత్రుతతో, ఆరాటంతో మరియు స్తంభించిపోయినట్లుగా ఉండిపోయిన హృదయాలన్నీ ఆదరణ పొందాయి. అటుపై వాళ్లు సందేహాస్పదంగా లేదా నిరాశగా భావించలేదు. ఎందుకంటే, ఇప్పుడు నిరీక్షణ మరియు ఆధారపడడానికి భరోసా ఉందని వాళ్లు భావించారు. ఎందుకంటే, అప్పుడు వారి యెదుట నిలబడిన మనుష్య కుమారుడు ఎల్లకాలమూ వారికి వెనుక కాపలాదారుడిగా ఉంటాడు; ఆయన వారికోసం ఒక బలమైన దుర్గముగా నిలుస్తాడు. వారి కోసం శాశ్వతమైన ఆశ్రయంగా ఉంటాడు.

ప్రభువైన యేసు పునరుత్థానుడై వచ్చినప్పటికీ, ఆయన హృదయం మరియు ఆయన కార్యము మానవజాతిని విడిచిపెట్టలేదు. మనుష్యులకు కనిపించడం ద్వారా, తాను ఏ రూపంలో ఉన్నప్పటికీ, తాను మనుష్యులతోపాటే ఉంటాననీ, వారితోనే నడుస్తాననీ మరియు అన్ని సమయాల్లోనూ మరియు అన్ని ప్రదేశాల్లోనూ వారితోనే ఉంటాననీ ఆయన వారికి చెప్పాడు. అన్ని సమయాల్లోనూ మరియు అన్ని ప్రదేశాల్లోనూ తాను మానవాళికి అవసరమైన వాటిని సమకూరుస్తానని మరియు వారికి కాపుదలగా ఉంటాననీ, తనను చూసేందుకు మరియు తాకేందుకు మనుష్యులకు అనుమతినిస్తాననీ మరియు మనుష్యులు ఇకపై నిస్సహాయంగా భావించే పరిస్థితి రాకుండా చూస్తాననీ ఆయన వారికి చెప్పాడు. తాము ఈ లోకంలో ఒంటరిగా జీవించడంలేదని కూడా మనుష్యులు తెలుసుకోవాలని యేసు ప్రభువు కోరుకున్నాడు. మానవజాతికి దేవుని సంరక్షణ ఉంది; దేవుడు వారితోనే ఉన్నాడు. వారు ఎల్లప్పుడూ దేవుని మీద ఆధారపడగలరు మరియు ఆయన తన అనుచరుల్లోని ప్రతిఒక్కరికీ కుటుంబమై ఉన్నాడు. దేవుని మీద ఆధారపడటంవలన, మానవజాతి ఇకపై ఒంటరిగా ఉండదు, లేదా నిస్సహాయంగా ఉండదు మరియు ఆయన్ని తమ పాపపరిహారార్థంగా అంగీకరించే వారు ఇకపై పాపంలో బంధించబడరు. మానవ దృష్టిలో, యేసు ప్రభువు తన పునరుత్థానం తర్వాత చేసిన ఈ పనులన్నీ చాలా చిన్న విషయాలే కావచ్చు. కానీ, నా దృష్టి కోణంలో, ఆయన చేసిన ప్రతి పని అత్యంత అర్థవంతమైనది, అత్యంత విలువైనది, అత్యంత ముఖ్యమైనది మరియు అత్యంత ప్రాముఖ్యతతో నిండి ఉన్నది.

ప్రభువైన యేసు శరీరములో ఉండి పనిచేసిన సమయం కష్టాలతోను మరియు బాధలతోను నిండి ఉన్నప్పటికీ, ఆయన తన ఆత్మ సంబంధమైన శరీరంతో కనిపించడం ద్వారా, మానవాళిని విమోచించడానికి ఆ సమయంలో తన కార్యమును పూర్తిగా మరియు సంపూర్ణంగా నెరవేర్చాడు. ఆయన శరీరధారిగా మారడం ద్వారా తన పరిచర్యను ప్రారంభించాడు మరియు ఆయన శరీరధారిగా మానవజాతికి కనిపించడం ద్వారా తన పరిచర్యను ముగించాడు. ఆయన కృపా యుగాన్ని ప్రకటించాడు, క్రీస్తు అనే తన గుర్తింపు ద్వారా ఆయన కొత్త యుగాన్ని ప్రారంభించాడు. క్రీస్తు అనే గుర్తింపుతో ఆయన కృపా యుగంలో పని చేసాడు మరియు కృపా యుగంలో ఆయన తన అనుచరులందరిని బలపరిచాడు మరియు వారిని నడిపించాడు. దేవుని కార్యము గురించి చెప్పాలంటే, ఆయన నిజంగా ప్రారంభించిన దానిని పూర్తి చేస్తాడు. అందులో దశలు మరియు ప్రణాళిక ఉన్నాయి మరియు ఆ పనిలో పూర్తిగా ఆయన జ్ఞానం, ఆయన సర్వశక్తి, ఆయన అద్భుతమైన పనులు మరియు ఆయన ప్రేమ మరియు దయ అనేవి ఉన్నాయి. నిజానికి, దేవుని కార్యములో ప్రధానమైన అంశం ఏదంటే మానవజాతిపట్ల ఆయనకున్న శ్రద్ధ; ఆయన ఎప్పటికీ పక్కన పెట్టలేని ఆయన కాపుదలకు సంబంధించిన భావాలతో అది నిండి ఉంటుంది. బైబిలులోని ఈ వచనాల్లో, యేసు ప్రభువు తన పునరుత్థానం తర్వాత చేసిన ప్రతి ఒక్కపనిలో, మానవజాతిపట్ల దేవునికి ఉండే మార్పులేని ఆశలు మరియు శ్రద్ధతోపాటు మానవజాతిపట్ల ఆయనకున్న భరోసా మరియు ప్రేమ వెల్లడి అవుతుంది. వీటిలో ఏదీ ఈ రోజు వరకు ఎప్పుడూ మారలేదు, మీరు అది చూడగలుగుచున్నారా? మీరు దీన్ని చూసినప్పుడు, మీ హృదయాలు మీకు తెలియకుండానే దేవునికి దగ్గర కావా? మీరు ఆ యుగంలో జీవించి ఉంటే మరియు యేసు ప్రభువు తన పునరుత్థానం తర్వాత మీకు ప్రత్యక్షమైన రూపంలో కనిపించినట్లయితే, మీరు చూస్తుండగానే ఆయన మీ ముందు కూర్చుని రొట్టె మరియు చేపలు తింటే మరియు లేఖనాలలోని విషయాలను మీకు వివరిస్తూ, మీతో మాట్లాడుతూ ఉంటే, అప్పుడు మీకు ఎలాంటి భావన కలుగుతుంది? మీరు సంతోషంగా భావిస్తారు కదా? లేదంటే, మీరు అపరాధ భావాన్ని అనుభవిస్తారా? దేవుని విషయమై మీకున్న పూర్వపు అపార్థాలు మరియు తప్పించుకు తిరగడం, దేవునితో విభేదాలు మరియు సందేహాలులాంటివన్నీ పటాపంచలై పోవా? దేవుడు మరియు మనిషి మధ్య సంబంధమనేది మరింత సాధారణమైనదిగా మరియు సరైనదిగా మారిపోదా?

బైబిలులోని ఈ పరిమిత అధ్యాయాలకు అర్థవివరణ చేయడం ద్వారా, దేవుని స్వభావంలోని ఏవైనా లోపాలను మీరు కనుగొన్నారా? దేవుని ప్రేమలో ఏదైనా కల్తీని మీరు కనుగొన్నారా? దేవుని సర్వశక్తిలోనైనా, లేదా ఆయన జ్ఞానంలోనైనా ఏదైనా మోసాన్ని గాని లేదా చెడును గాని మీరు చూడగలిగారా? ఖచ్చితంగా అలాంటిది కనుగొనడం సాధ్యం కాదు! దేవుడు పరిశుద్ధుడని ఇప్పుడు మీరు ఖచ్చితంగా చెప్పగలరా? దేవుని భావోద్వేగాల్లోని ప్రతి ఒక్కటీ ఆయన గుణగణాలని మరియు స్వభావపు ప్రత్యక్షత అని మీరు ఖచ్చితంగా చెప్పగలరా? మీరు ఈ మాటలను చదివిన తర్వాత, మీరు వాటి నుండి పొందే అవగాహన మీకు సహాయపడుతుందని మరియు మీరు మీ స్వభావంలో మార్పుని మరియు దేవునిపట్ల భయాన్ని పెంచుకోవడంలో అది మీకు ప్రయోజనాలు అందిస్తుందని నేను ఆశిస్తున్నాను. మీలో ఈ ఫలితమనేది రోజు పెరిగే ఫలితంగా ఉంటుంది. తద్వారా, ఈ అన్వేషణా ప్రక్రియలో మీరు దేవునికి మరింత దగ్గరవుతారు. దేవుడు కోరుకునే విలువలకు మరింత ఎక్కువ దగ్గరగా వెళ్తారు. మీరు ఇకపై సత్యాన్వేషణలో విసుగు చెందరు మరియు సత్యాన్ని అనుసరించడం మరియు స్వభావములో మార్పు కలగడం అనేవి సమస్యాత్మకముగానో లేదా నిరుపయోగముగానో అయినట్లుగా మీరు ఇకపై భావించరు. దానికి బదులుగా, దేవుని నిజమైన స్వభావం మరియు దేవుని పరిశుద్ధమైన గుణగణాల వ్యక్తీకరణ ద్వారా ప్రేరేపించబడి, మీరు వెలుగును కోరుకుంటారు. న్యాయం కోరుకుంటారు. సత్యాన్ని వెంబడించాలనీ, దేవుని చిత్తం ప్రకారం జీవించి ఆయనను మెప్పించాలని కోరుకుంటారు మరియు మీరు దేవుని ద్వారా సంపాదించబడిన వ్యక్తి అవుతారు. ఒక నిజమైన వ్యక్తిగా మారుతారు.

దేవుడు మొట్ట మొదటిసారిగా శరీరధారిగా వచ్చినప్పుడు, కృపా యుగంలో ఆయన చేసిన కొన్ని పనులను గురించి ఈ రోజు మనం మాట్లాడుకున్నాము. ఈ విషయాలన్నింటి నుండి, ఆయన శరీరధారిగా వచ్చి వ్యక్తము చేసిన మరియు బయలుపరచిన స్వభావాన్ని, అలాగే ఆయన ఏమి కలిగియున్నాడు మరియు ఆయన ఏమై ఉన్నాడనే దానికి సంబంధించిన ప్రతి అంశాన్ని మనం తెలుసుకున్నాము. ఆయన ఏమి కలిగియున్నాడు మరియు ఆయన ఏమై ఉన్నాడనే వాటికి సంబంధించిన ఈ అంశాలన్నీ ఎక్కువగా మానవ సంబంధమైనవిగా కనిపిస్తున్నాయి. అయితే, నిజం ఏమిటంటే, ఆయన బయలుపరిచిన మరియు వ్యక్తము చేసిన గుణగణాలనేవి ఆయన స్వంత స్వభావం నుండి విడదీయరాని సంబంధాన్ని కలిగియున్నాయి. శరీరధారియైన దేవుడు మానవ రూపములో ఆయన స్వభావము నుండి వ్యక్తము చేసినప్రతి పద్ధతి మరియు ప్రతి అంశం ఆయన స్వంత గుణగణాలతో విడదీయలేని విధంగా ముడిపడి ఉంటాయి. కాబట్టే, దేవుడు మనుష్యుల వద్దకు రావడానికి శరీరమును ధరించే విధానం కలిగియుండడం అతి ప్రాముఖ్యం. అలాగే, శరీరధారిగా ఆయన చేసిన పని కూడా ముఖ్యమైనది. అయితే, ఆయన వెల్లడించిన స్వభావం మరియు ఆయన వ్యక్తం చేసిన చిత్తం అనేది శరీరంతో జీవించే ప్రతి వ్యక్తికి, అవినీతిలో జీవించే ప్రతి వ్యక్తికి అంతకంటే ముఖ్యమైనది. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోగలుగుతున్నారా? దేవుని స్వభావం మరియు ఆయన ఏం కలిగి ఉన్నాడు మరియు ఏమై ఉన్నాడనేది అర్థం చేసుకున్న తర్వాత, దేవునితో ఎలా ప్రవర్తించాలనే విషయమై నీవు ఏవైనా తీర్మానాలు చేశావా? చివరగా, ఈ ప్రశ్నకు ప్రతిస్పందనగా, నేను మీకు మూడు సలహాలు ఇవ్వాలనుకుంటున్నాను: మొదటిది, దేవుణ్ణి పరీక్షించకండి. దేవుని గురించి నీవసలు ఎంతగా అర్థం చేసుకున్నప్పటికీ, ఆయన స్వభావం గురించి నీకు ఎంత తెలిసినప్పటికీ, ఆయన్ని అస్సలు పరీక్షించకండి. రెండవది, దేవునితో సమాన స్థాయి కొరకు పోరాడకండి. దేవుడు నీకు ఎలాంటి స్థితిని ఇచ్చినప్పటికీ లేదా ఆయన నీకు ఎలాంటి పని అప్పగించినప్పటికీ, ఎలాంటి కర్తవ్యాన్ని ఆయన నీకు అప్పగించినప్పటికీ మరియు దేవుని కోసం నీవు ఎంతగా నిన్ను వెచ్చించుకొనినప్పటికీ, త్యాగం చేసినప్పటికీ, దేవునితోగల సమాన స్థాయి కోసం ఖచ్చితంగా పోటీ పడకండి. మూడవది, దేవుడితో పోటీ పడకండి. దేవుడు నీతో ఏమి చేస్తాడో, మీకోసం ఆయన ఏం ఏర్పాటు చేస్తాడో మరియు ఆయన నీ కోసం ఎటువంటి అంశాలు తీసుకొస్తాడో అనేవాటిని నీవు ఎంతగా అర్థం చేసుకున్నా అర్థం చేసుకోకపోయినప్పటికీ, దానికి మీరు లోబడగలిగినప్పటికీ, ఖచ్చితంగా దేవునితో పోటీపడకండి. నీవు ఈ మూడు సలహాలు పాటించగలిగితే, నీవు అత్యంత సురక్షితంగా ఉంటావు మరియు నీవు దేవునికి కోపం తెప్పించే అవకాశం ఉండదు. ఇక్కడితో ఈనాటి మన ఈ సహవాసమును ముగిద్దాము.

నవంబర్ 23, 2013

ఫుట్‌నోట్:

ఎ. “తలకట్టును బిగించే మంత్రం” అనేది చైనీస్ నవల జర్నీ టు ది వెస్ట్‌లో టాంగ్ సంజాంగ్ అనే సాధువు ఉపయోగించిన ఒక మంత్రం. సన్ వుకాంగ్‌ను నియంత్రించడానికి ఆయన ఈ మంత్రాన్ని ఉపయోగిస్తాడు. అతని తల చుట్టూ ఒక బంగారపు తలకట్టు పెట్టి బిగించి, అతనికి తీవ్రమైన తలనొప్పి కలిగిస్తాడు మరియు తద్వారా, అతడిని అదుపులోకి తెస్తాడు. అంటే, ఒక వ్యక్తిని బంధించే విషయాన్ని వివరించేందుకు ఇదొక రూపకాలంకారంగా మారింది.

మునుపటి:  దేవుడి కార్యము, దేవుడి స్వభావము మరియు స్వయంగా దేవుడు II

తరువాత:  దేవుడు తనకు తానే అద్వితీయుడు I

సెట్టింగులు

  • వచనం
  • థీమ్స్

ఘన రంగులు

థీమ్స్

అక్షరశైలి

అక్షరశైలి పరిమాణం

గీతల మధ్య దూరం

గీతల మధ్య దూరం

పేజీ వెడల్పు

విషయ సూచిక

శోధించండి

  • ఈ వచనాన్ని శోధించండి
  • ఈ పుస్తకాన్ని శోధించండి

Connect with us on Messenger