దేవుని కార్యము మరియు మానవుని ఆచరణ
మానవుల మధ్య దేవుని కార్యము మానవుని నుండి విడదీయలేనిది, ఎందుకంటే మానవుడు ఈ కార్యము కొరకైన సాధనము, మరియు దేవుని సృష్టిలో దేవుని గూర్చి సాక్ష్యమిచ్చే ఏకైక ప్రాణి తానే. మానవుని జీవితం మరియు మానవుని కార్యకలాపాలన్నీ దేవుని నుండి విడదీయలేనివి, మరియు సమస్తమూ దేవుని హస్తముల ద్వారా నియంత్రించబడతాయి, అలాగే దేవుని నుండి వేరుపడి ఎవరూ జీవించలేరని కూడా చెప్పవచ్చు. ఎవరూ దీనిని కాదనలేరు, ఎందుకంటే ఇది నిజం. దేవుడు చేసేదంతా సాతాను కుయుక్తులకు విరోధముగా, మానవజాతికి ప్రయోజనకరమైనదిగా యున్నది. మానవునికి కావలసిన సమస్తం దేవుని నుండి వస్తుంది, మరియు దేవుడే మానవ జీవితానికి మూలాధారం. కాబట్టి, దేవుడిని విడిచిపెట్టడం మానవుడికి అంత సులభం కాదు, అలాగే దేవుడికైతే, మానవుని విడిచే ఉద్దేశ్యము ఎన్నడూ లేదు. దేవుడు చేసే కార్యము సమస్త మానవాళి కోసం, మరియు ఆయన తలంపులు ఎప్పుడూ దయగలవి. కాబట్టి, దేవుని కార్యము మరియు దేవుని తలంపులు (అంటే, దేవుడి కోరిక) అనే రెండు “దర్శనాలు” గురించి మానవుడు తెలుసుకోవలసియున్నది. అటువంటి దర్శనాలు కూడా దేవుని నిర్వహణలే మరియు అది మానవుడు చేయలేని కార్యము. అదే సమయములో, దేవుడు కార్యము చేసే సమయములో మనిషి కోసం ఆయన సంపూర్ణము చేసే అవసరాలనేవి, మానవుని “ఆచరణ” గా పిలువబడుతాయి. దర్శనాలనేవి స్వయముగా దేవుని కార్యము, లేదా మానవజాతి కొరకైన ఆయన చిత్తము, లేదా ఆయన కార్యము లక్ష్యాలు లేక ప్రాధాన్యతలుగా ఉన్నాయి. దర్శనాలను కూడా దేవుని నిర్వహణలో ఒక భాగమని చెప్పవచ్చు, ఎందుకంటే ఈ నిర్వహణ అనేది దేవుని కార్యము, మరియు అది మానవుని కోసం ఉద్దేశించబడింది, అంటే, ఇది మానవుని యందు దేవుడు చేసే కార్యము. ఈ కార్యము మానవుడు దేవుని తెలుసుకునే ఒక మార్గము మరియు సాక్ష్యము, మరియు ఇది మానవునికి అత్యంత ప్రాముఖ్యమైనది. మనుష్యులు దేవుని కార్యము గురించిన జ్ఞానము పట్ల శ్రద్ధ చూపే బదులు, దేవునిపై విశ్వాస సిద్దాంతాల వంటి అల్పమైన పనికిరాని వివరాల పట్ల శ్రద్ధ వహిస్తే, వారు అంత సులభముగా దేవుని తెలుసుకోలేరు, మరియు దేవుని హృదయాన్ని కూడా అనుసరించలేరు. దేవుని గురించి మానవునికున్న జ్ఞానానికి అత్యంత సహాయకారిగా ఉన్న దేవుని కార్యాన్ని దర్శనాలు అంటారు. ఈ దర్శనాలు దేవుని కార్యము, దేవుని చిత్తము, మరియు దేవుని కార్యపు లక్ష్యాలు మరియు ప్రాధాన్యతగా ఉంటాయి; ఇవన్నీ మానవునికి మేలు చేకూరుస్తాయి. ఆచరణ అంటే మానవుడు చేయవలసినది, దేవుని అనుసరించే జీవులు చేయవలసినది, మరియు అది మానవుని కర్తవ్యము కూడా. తాను ఆది నుండి చేయవలసిన దానిని మానవుడు అర్ధం చేసుకోలేదు, కానీ దేవుడు మాత్రం తన పని సమయములో మానవుని ఈ అవసరాలు తీరుస్తూనే ఉన్నాడు. ఈ అవసరాలనేవి క్రమక్రమముగా మరింత నిగూఢమై మరియు దేవుడు కార్యము చేస్తున్నపుడు అవి మరింతగా పైకెత్తబడ్డాయి. ఉదాహరణకు, ధర్మశాస్త్ర కాలములో, మానవుడు ధర్మశాస్త్రాన్ని అనుసరించవలసి వచ్చింది, మరియు కృపా కాలములో, మానవుడు సిలువను మోయవలసి వచ్చింది. రాజ్య కాలము భిన్నంగా ఉంటుంది: మానవుని అవసరాలు ధర్మశాస్త్ర కాలము మరియు కృపా కాలములలో కంటే ఎక్కువగా ఉంటాయి. దర్శనాలు ఉన్నతి చెందుతున్న కొద్దీ, మానవుని అవసరాలు అత్యంత అధికమై, మరియు అత్యంత స్పష్టముగా, మరియు మరింత నిజమైనవిగా మారాయి. అదేవిధముగా, దర్శనాలు కూడా వాస్తవికమైనవిగా మారాయి. అనేకమైన ఈ దర్శనాలు మానవుని విధేయతను దేవునికి కనుపరచడమే కాకుండా, అతని దైవ జ్ఞానానికి కూడా అనుకూలముగా ఉన్నాయి.
గడచిన కాలాలతో పోలిస్తే, రాజ్య కాలములోని దేవుని కార్యము మరింత ఆచరణాత్మకముగా, మానవ ధర్మం మరియు తన స్వభావములోని మార్పుల మీద మరింత దృష్టి కలిగి, మరియు ఆయనను వెంబడించే వారిని గురించి స్వయముగా దేవునికే సాక్ష్యమివ్వగలదు. మరో మాటలో చెప్పాలంటే, రాజ్య కాలములో, దేవుడు పని చేస్తున్నప్పుడు, మునుపటి కంటే ఎక్కువగా ఆయన తనను తాను మానవునికి కనుపరచుకొంటాడు, అంటే మానవుడు తెలుసుకోవలసిన దర్శనాలనేవి గతించిన ప్రతి కాలములో కంటే ఎక్కువగా ఉంటాయి. మానవుని మధ్య దేవుని కార్యము ఎల్లలు లేనిదిగా ఉద్భవించినందున, రాజ్య కాలములో మానవునికి తెలిసిన దర్శనాలు, విధి నిర్వహణ మొత్తంలో కెల్లా అత్యధికమైనవి. దేవుని కార్యము ఎల్లలు లేనిదిగా ఉద్భవించింది, కాబట్టి మానవుడు తెలుసుకోవలసిన దర్శనాలు సమస్తమైన దర్శనాలన్నిటి కంటే అత్యున్నతమైయ్యాయి, మరియు మానవుని ఆచరణ ఫలితము కూడా గతించిన ప్రతి కాలములో కంటే ఎక్కువగా ఉన్నది, మానవుని ఆచరణ దర్శనాలకు అనుగుణముగా మారుచున్నందున, దర్శనాల పరిపూర్ణత కూడా మానవుని అవసరాల పరిపూర్ణతను సూచిస్తున్నది. దేవుని నిర్వహణ ఒక కొలిక్కి వచ్చిన వెంటనే, మానవుని ఆచరణ కూడా ఆగిపోతుంది, ఇక మానవునికి గత కాలాల యొక్క సిద్దాంతాలను అనుసరించడం తప్ప వేరే అవకాశం లేదు, లేకపోతే ఎక్కడా తిరిగే పరిస్థితి ఉండదు. నూతన దర్శనాలు లేకపోతే, మానవునికి నూతన ఆచరణ ఉండదు; సంపూర్ణ దర్శనాలు లేకుండా, మానవునికి సరియైన ఆచరణ ఉండదు; ఉన్నతమైన దర్శనాలు లేకుండా, మానవునికి ఉన్నతమైన ఆచరణ ఉండదు. దేవుని అడుగుజాడలతో పాటు మానవుని ఆచరణ కూడా మారుతుంది, మరియు, అదేవిధంగా, దేవుని కార్యముతో పాటుగా మానవుని జ్ఞానము మరియు అనుభవము కూడా మారుతుంది. మానవుడు ఎంతటి సమర్ధుడైనప్పటికీ, తాను దేవుని నుండి ఇప్పటికీ విడదీయలేని వాడే, దేవుడే గనుక ఒక్క క్షణం పనిచెయ్యకపోతే, ఆయన ఉగ్రతను బట్టి మానవుడు తక్షణమే మరణిస్తాడు. మానవుడు అతిశయించడానికి ఏమీ లేదు, నేడు మానవ జ్ఞానము ఎంత ఉన్నతమైనదైనా, తన అనుభవాలు ఎంత లోతైనవైనా, దేవుని కార్యము నుండి తాను విడదీయలేనివాడు—మానవుని ఆచరణ మరియు దేవునియందున్న విశ్వాసములో తాను కనిపెట్టవలసినవి, దర్శనాల నుండి విడదీయలేనివి. దేవుని కార్యము నందలి ప్రతి సందర్భములో, మానవుడు తెలుసుకోవాల్సిన దర్శనాలు ఉన్నాయి, వీటిని అనుసరించి, తగిన అవసరాలు మానవుని ద్వారా కూర్చబడ్డాయి. ఈ దర్శనాలే పునాదిగా లేకపోతే, మానవుడు అంత సామాన్యముగా ఆచరించలేడు, దేవుని స్థిరముగా అనుసరించలేడు. మానవుడు దేవుని ఎరుగకపోయినా, లేక దేవుని చిత్తాన్ని గ్రహించకపోయినా, మానవుడు చేసేదంతా వ్యర్ధము, మరియు దేవుని ద్వారా మెప్పు పొందలేడు. మానవుని వరాలు ఎంత సమృద్దివైనా, తను ఇప్పటికీ దేవుని కార్యము మరియు దేవుని మార్గనిర్దేశం నుండి విడదీయలేనివాడు. మానవుని పనులు ఎంత మంచివైనా లేక మానవుడు ఎన్ని పనులు చేసినా, ఇప్పటికీ అవి దేవుని కార్యాన్ని భర్తీ చేయలేవు. కాబట్టి, ఎట్టి పరిస్థితులలోనూ మానవుని ఆచరణ అనేది దర్శనాల నుండి వేరుపరచబడదు. నూతన దర్శనాలు అంగీకరించని వారికి నూతన ఆచరణ ఉండదు. వారు సిద్దాంతానికి కట్టుబడి నిర్జీవమైన ధర్మాన్ని అనుసరించుటను బట్టి వారి ఆచరణ సత్యముతో అనుబంధము కలిగి ఉండదు; వారికి నూతన దర్శనాలేవి లేవు, ఫలితముగా, నూతన యుగము నుండి వారు ఏమీ ఆచరించరు. వారు దర్శనాలను కోల్పోయారు, ఆలా చేయుటను బట్టి వారు పరిశుద్ధాత్మ కార్యాన్ని కూడా కోల్పోయారు, అలాగే వారు సత్యాన్ని కోల్పోయారు. సత్యాన్ని కలిగి లేని వారు దుష్ట సంతానము, వారు సాతాను స్వరూపము గలవారు. ఒకరు ఎలాంటి వ్యక్తి అయినా, వారు దేవుని కార్యము యొక్క దర్శనాలు లేకుండా ఉండకూడదు, మరియు పరిశుద్ధాత్మ సన్నిధిని కోల్పోకూడదు; ఒకరు దర్శనాలు కోల్పోయిన వెనువెంటనే, వారు పాతాళమునకు దిగిపోయి, మరియు అగాధములో నివసిస్తారు. దర్శనాలు లేని జనులు అజ్ఞానముగా దేవుని అనుసరించేవారు, వారు పరిశుద్ధాత్మ కార్యమును పోగొట్టుకొనిన వారు, మరియు వారు నరకములో నివసించే వారు. అలాంటి ప్రజలు సత్యాన్ని అనుసరించరు, కానీ బదులుగా దేవుని నామమును ఒక విలాస ఫలకముగా వేలాడదీస్తారు. పరిశుద్ధాత్మ కార్యాన్ని ఎరుగనివారు, శరీరధారి అయిన దేవుని ఎరుగనివారు, దేవుని నిర్వహణలో మూడంచెల కార్యము గురించి పూర్తిగా ఎరుగనివారు—వారికి దర్శనాలు తెలియవు కాబట్టి వారు సత్యహీనులు. అయితే సత్యము లేనివారు దుర్మార్గులు కాదా? సత్యాన్ని ఆచరించుటకు ఇష్టపడేవారు, దేవుని జ్ఞానాన్ని వెదుకుటకు ఇష్టపడేవారు, మరియు దేవునితో నిజముగా ఏకీభవించేవారు దర్శనాలను పునాదిగా కలిగి పనిచేసే ప్రజలై ఉంటారు. వారు దేవునితో ఏకీభవించారు కాబట్టి దేవుని ద్వారా మెప్పు పొందారు, మరియు ఇదే సహకారాన్ని మానవుడు తప్పక ఆచరణలో పెట్టాలి.
ఆచరించడానికి దర్శనాలలో అనేక మార్గాలున్నాయి. మానవుడు తెలుసుకోవాల్సిన దేవుని కార్యము వలె, మానవుని ఆచరణాత్మక ఆక్షేపణలు కూడా దర్శనాలలో భాగమై ఉన్నాయి. గతములో, వివిధ ప్రదేశాల్లో జరిగే కూడికలు మరియు మహా సభలలో, ఆచరణ మార్గములోని ఒక్క దాని గురించే ప్రసంగించబడింది. దేవుని జ్ఞానముతో ఎటువంటి సంబంధం లేకుండా, ఆ విధమైన అవలంబన కృపాకాలములో ఆచరణలో ఉంచబడింది, ఎందుకనగా కృపాకాలము యొక్క దర్శనమే యేసు సిలువ దర్శనం, మరియు అంతకంటే గొప్ప దర్శనాలు ఏవీ లేవు. సిలువ ద్వారా మానవాళిని ఆయన విమోచించిన కార్యముకంటే మనిషి తెలుసుకోవలసినది ఎంతో ఉంది, అందువలన కృపా కాలములో మనిషి తెలుసుకోవలసిన వేరే దర్శనములు ఏమీ లేవు. ఈ విధముగా, మానవునికి దేవుని గూర్చిన జ్ఞానము అల్పముగానే ఉన్నది, మరియు యేసయ్య ప్రేమ మరియు కనికరమును గూర్చిన జ్ఞానమే కాకుండా, అనుసరించడానికి సుళువైన మరియు కనికరముతో కూడిన సంగతులు మాత్రం కొన్ని ఉన్నాయి, ప్రస్తుతానికి ఆ సంగతులు చాల దూరముగా ఉన్నాయి. గతంలో, తన సహవాసము ఏ రూపములో ఉన్నప్పటికీ, దేవుని కార్యపు అనుభవపూర్వకమైన జ్ఞానము గురించి మాట్లాడలేదు, మానవుడు ప్రవేశించడానికి అనువైన అనుసరణ మార్గము గురించి స్పష్టముగా మాట్లాడేవారు ఎవరైనా ఉన్నారా అనుకుంటే ఎవ్వరూ లేరు. మానవుడు ఓర్పు మరియు సహనము పునాదికి కొన్ని మామూలు వివరాలు మాత్రమే జోడించాడు; తన ఆచరణా విధానములో మాత్రం మార్పు లేదు, ఎందుకంటే అదే కాలములో దేవుడు ఎటువంటి నూతన కార్యము చేయలేదు, ఓర్పు మరియు సహనము, లేదా సిలువను మోయడము మాత్రమే మానవుని నుండి ఆయనకు కావలసియున్నవి. అటువంటి ఆచరణలు కాకుండా, యేసు సిలువ వేయబడటము కంటే ఉన్నతమైన దర్శనాలు ఏవీ లేవు. గతములో, దేవుడు గొప్ప కార్యము చేయలేదు కాబట్టి, అలాగే మానవుని పరిమిత కోరికలు మాత్రమే తీర్చేవాడు కాబట్టి, ఇతర దర్శనాల ప్రస్తావన ఉండేది కాదు. ఆ విధంగా, మానవుడు ఏమి చేసినప్పటికీ, తాను హద్దులను అతిక్రమించే సామర్థ్యము కలిగి లేడు, ఎందుకంటే ఈ హద్దులు మానవుడు అనుసరించదగిన సులభమైన మరియు తేలికైన విషయాలు కలిగియున్నాయి. ఈనాడు వేరే దర్శనాల గురించి మాట్లాడతాను ఎందుకంటే నేడు, ధర్మశాస్త్ర కాలము మరియు కృపా కాలములోని కార్యము కన్నా చాలా రెట్లు అధికమైన కార్యము జరిగింది. మానవుని అవసరతలు కూడా గత కాలాలో కంటే అధికమయ్యాయి. మానవుడు గనుక అలాంటి కార్యమును పూర్తిగా గ్రహించలేకపోతే, ఇక దానికి గొప్ప ప్రాధాన్యత ఉండదు; తన జీవితకాలమంతా దాని పట్ల శ్రద్ధ వహించి కృషి చేయకపోతే, అటువంటి కార్యమును గురించి మానవుడు సంపూర్ణముగా తెలుసుకోవడం కష్టతరం అవుతుందని చెప్పవచ్చు. విజయ కార్యములో, అనుసరణ మార్గం గురించి మాట్లాడటమే మానవునికి జయమును ఇవ్వడం అనేది అసాధ్యం. అనుసరణ మార్గము గురించి తప్ప మరేమీ మాట్లాడకపోతే, మానవుని బలహీనత మీద కొట్టడముగానీ, లేదా మానవుని తలంపులు నిర్మూలించడం కానీ అసాధ్యము, అలాగే మానవుని సంపూర్ణముగా జయించడము కూడా అసాధ్యము. మానవుని విజయానికి దర్శనాలు ప్రధాన సాధనము, అయితే దర్శనాలు కాకుండా వేరే ఏ అనుసరణ మార్గము లేకుంటే, మానవుడు అనుసరించడానికి మార్గము ఉండేది కాదు, అలాగే తనకు ప్రవేశమూ ఉండేది కాదు. దర్శనాలలో ఆచరించ తగినది ఉన్నది, అలాగే ఆచరణతోపాటు ఇంకా దర్శనాలు కూడా ఉన్నాయి: ఆది నుండి అంతము వరకు దేవుని కార్యము మూల సూత్రము ఇదే. మానవుని జీవితము మరియు స్వభావమనే రెండింటిలోని మార్పుల ప్రక్రియ, దర్శనాలలోని మార్పులను అనుసరిస్తుంది. మానవుడు గనుక తన స్వంత కృషిపై ఆధారపడితే, ఏదైనా గొప్ప మార్పు ప్రక్రియను సాధించడం తనకు అసాధ్యం. దర్శనాలు దేవుని కార్యము మరియు దేవుని నిర్వహణ గురించి మాట్లాడతాయి. ఆచరణ అనేది మానవుని అనుసరణ మార్గాన్ని మరియు మానవ జీవన విధానమును సూచిస్తుంది; దేవుని నిర్వహణ అంతటిలో, దర్శనాలు మరియు ఆచరణ మధ్య ఉన్న సంబంధమే దేవునికి మరియు మానవునికి మధ్య ఉన్న సంబంధము. ఒకవేళ దర్శనాలు తొలగిపోయి, లేక ఆచరణ సంభాషణ లేకుండానే మాట్లాడినా, ఒకవేళ మానవుని ఆచరణ తొలగించబడిన దర్శనాలైతే, అటువంటివి దేవుని నిర్వహణగా మాత్రం పరిగణించబడవు, అలాగే దేవుని కార్యము మానవజాతి కొరకు జరిపించబడిందని చెప్పలేము; ఈ విధముగా, మానవుని కర్తవ్యము తొలగించబడటము మాత్రమే కాకుండా, అది దేవుని కార్యపు ఉద్దేశ్యాన్ని కూడా తిరస్కరించడం అవుతుంది. ఆది నుండి అంతము వరకు, దేవుని కార్యములో మానవుని ప్రమేయము లేకుండా, కేవలము అనుసరించ వలసివస్తే, అంతేగాక, దేవుని కార్యము గురించి తెలుసుకోవాల్సిన అవసరమే లేకపోతే, అలాంటి కార్యము ఇక దేవుని నిర్వహణగా పిలువబడదు. ఒకవేళ మానవుడు దేవుని ఎరుగక, దేవుని చిత్తము పట్ల నిర్లక్ష్యము కలిగి, అస్థిరమైన మరియు అస్పష్టమైన ధోరణిలో గుడ్డిగా తన ఆచరణను కొనసాగిస్తే, ఇక అతడు ఎన్నటికీ సంపూర్ణ యోగ్యత కలిగిన జీవి కాలేడు. కాబట్టి, ఈ రెండూ విషయాలు తప్పనిసరియైనవి. ఒకవేళ దేవుని కార్యము మాత్రమే ఉండి, అనగా, కేవలము దర్శనాలు మాత్రమే కలిగి, మానవుని సహకారము మరియు ఆచరణ లేకపోతే, అటువంటివి దేవుని నిర్వహణగా పిలువబడలేవు. ఒకవేళ మానవుని ఆచరణ మరియు ప్రవేశము మాత్రమే ఉన్నట్లయితే, మానవుడు ప్రవేశించిన మార్గము ఎంత ఉన్నతమైనదైనా, అది కూడా అంగీకరించ తగినది కాదు. మానవుని ప్రవేశము క్రమక్రమముగా కార్యము మరియు దర్శనాలకు అనుగుణముగా మార్పు చెందాలి; ఇష్టానుసారముగా మార్పు చెందకూడదు. మానవుని ఆచరణ నియమాలు స్వతంత్రమైనవి మరియు నిరాటంకమైనవి కావు కానీ, కొన్ని పరిమితుల్లో అమర్చబడి ఉన్నాయి. అలాంటి నియమాలు కార్యపు దర్శనాలతో పాటు క్రమముగా మారతాయి. కాబట్టి, తుదకు దేవుని నిర్వహణ అనేది దేవుని కార్యము మరియు మానవుని ఆచరణ అనే స్థితికి చేరుతుంది.
కార్య నిర్వహణ అనేది కేవలం మానవజాతిని బట్టే వచ్చింది, అంటే ఇది మానవజాతి మనుగడ బట్టే ఉద్భవించింది. ఆది యందు, భూమ్యాకాశములు సృజించబడినప్పుడు గానీ, లేదా మానవజాతికి ముందే గానీ నిర్వహణ అనేది లేదు. ఒకవేళ దేవుని సమస్త కార్యమంతటిలో, మానవునికి ప్రయోజనకరమైన ఆచరణ ఏదీ లేకపోతే, అనగా, అవినీతిమయమైన మానవజాతికి దేవుడు తగిన ఆశయాలు; కలిగించకపోతే (ఒకవేళ, దేవుడు చేసిన కార్యమందు, మానవుడు ఆచరించడానికి తగిన మార్గమేమీ లేకపోతే), అప్పుడు ఈ కార్యము దేవుని నిర్వహణగా పిలువబడదు. ఒకవేళ దేవుని సమస్త కార్యము అవినీతి మయమైన మానవజాతికి వారు ఆచరణలో ఎలా నడవాలో మాత్రమే చెప్తూ, దేవుడు తన కార్యక్రమము ఏది అమలు చేయకుండా, మరియు ఆయన సర్వశక్తిని లేదా జ్ఞానమును కాస్తయినా కనుపరచకపోతే, మానవునికి ఉన్న దేవుని అవసరత ఎంత ఉన్నతమైనదైనా, మానవుని మధ్య దేవుడు ఎంత కాలం నివసించినా, దేవుని స్వభావము గురించి మానవునికి ఏమీ తెలియదు; అదే గనుక జరిగితే, ఈ విధమైన కార్యమునకు దేవుని నిర్వహణ అని పిలువబడే యోగ్యత కూడా ఉండదు. అర్థమయ్యేలా చెప్పాలంటే, దేవుని చేత జయించబడిన వారి ద్వారా దేవుని నడిపింపులో జరిగించబడుచున్న కార్యము, మరియు దేవుడు చేసిన కార్యము అనేది దేవుని కార్య నిర్వహణ అయి ఉన్నది. అటువంటి కార్యమును నిర్వహణగా పరిగణించవచ్చు. మరొక మాటలో చెప్పాలంటే, మానవుని మధ్య దేవుని కార్యము, అదే విధముగా ఆయనను వెంబడించేవారు ఆయనకు అందించే సహకారము సమిష్టిగా నిర్వహణ అని పిలువబడుతుంది. ఇక్కడ, దేవుని కార్యాన్ని దర్శనాలు అంటారు, మరియు మానవుని సహకారాన్ని ఆచరణ అంటారు. దేవుని కార్యము ఎంత అధికముగా ఉంటుందో (అనగా, ఎంత ఎక్కువగా దర్శనాలు ఉంటాయో), మానవునికి దేవుని స్వభావము అంతగా స్పష్టపరచబడుతుంది, మానవుని తలంపులతో అంతగా విరోధిస్తుంది, అలాగే మానవుని ఆచరణ మరియు సహకారము అంత ఎక్కువ అవుతుంది. మానవుని అవసరతలు ఎంత ఎక్కువ అవుతాయో, మానవుని తలంపులకు దేవుని కార్యము అంత విరోధమవుతుంది, ఫలితముగా మానవుని శ్రమలు, మరియు తాను నెరవేర్చవలసిన ప్రమాణాలు, కూడా అంతగా ఎక్కువ అవుతాయి. ఈ కార్యాంతములో, దర్శనాలన్నీ సంపూర్ణమవుతాయి, మానవుడు అనుసరించవలసినది పరిపూర్ణతా శిఖరాన్ని చేరుకుంటుంది. మానవుడు తెలుసుకోవలసినది మానవునికి చూపడానికి, ప్రతి ఒక్కటి జాతి ప్రకారం వర్గీకరించబడే సమయము కూడా ఇదే. దర్శనాలు వాటి లక్ష్యాన్ని చేరుకున్నపుడు, మానవుని ఆచరణ కూడా సంపూర్ణతకు చేరుకుంటుంది, కాబట్టి, కార్యము క్రమముగా దాని అంతమును చేరుకుంటుంది. మానవుని ఆచరణ దేవుని కార్యముపై ఆధారపడి ఉంటుంది, అలాగే దేవుని నిర్వహణ అనేది మానవుని ఆచరణ మరియు సహకారము పట్ల సంపూర్ణ సంతోషాన్ని వ్యక్త పరుస్తుంది. మానవుడు దేవుని కార్యమునకు నిదర్శనము, దేవుని సమస్త నిర్వహణ కార్యము సాధనము, అలాగే దేవుని నిర్వహణ అంతటికీ ఫలితముగా ఉన్నాడు. మానవుని సహకారము లేకుండా, దేవుడొక్కడే కార్యము చేసి ఉంటే, తన కార్యమంతటిని గురించి స్పష్టీకరించడానికి ఏదీ ఉండేది కాదు, కాబట్టి దేవుని నిర్వహణకు కాస్తయినా ప్రాముఖ్యత ఉండేది కాదు. దేవుని కార్యముతో పాటుగా, తన కార్యమును వ్యక్త పరచడానికి మరియు దాని సర్వశక్తిని అలాగే జ్ఞానమును నిరూపించడానికి దేవుడు తగిన సాధనాలను ఏర్పరచుకోవడం ద్వారా మాత్రమే దేవుడు తన నిర్వహణా లక్ష్యమును సాధించగలడు, అలాగే ఈ కార్యమంతటిని ఉపయోగించి సాతానును సంపూర్ణముగా ఓడించే లక్ష్యాన్ని సాధించగలడు. కాబట్టి, దేవుని నిర్వహణలో మానవుడు విడదీయలేని ఒక భాగమై ఉన్నాడు, మరియు దేవుని నిర్వహణ ఫలించి దాని అంతిమ లక్ష్యాన్ని సాధించేలా మానవుడు మాత్రమే చేయగలడు; మానవుడు తప్ప, ఏ ప్రాణి అటువంటి పాత్ర పోషించలేదు. మానవుడు దేవుని కార్య నిర్వహణకు ప్రతిబింబముగా ఉండాలంటే, అవినీతి మయమైన మానవజాతి అవిధేయత పూర్తిగా నిర్మూలించబడాలి. దీనికి ఆయా సమయాలకు తగిన ఆచరణను మానవునికి అందించడం, మరియు మానవుని మధ్య దేవుడు అనుగుణమైన కార్యమును జరిగించడం అవసరము. అంతిమముగా దేవుని కార్య నిర్వహణకు ప్రతిబింబముగా ఉండే ప్రజల సమూహము ఈ విధముగా మాత్రమే లభిస్తుంది. కేవలము దేవుని కార్యము ద్వారా మానవుని మధ్య జరిగిన దైవకార్యము మాత్రమే దేవునికి సాక్ష్యమివ్వదు; అది సాధించడానికి, ఆయన కార్యమునకు తగినట్టుగా జీవిస్తున్న మనుష్యుల సాక్ష్యము కూడా అవసరము. ఎవరి ద్వారా ఆయన కార్యము వ్యక్త పరచబడుతుందో, ఆ ప్రజలపై దేవుడు మొదటిగా కార్యము చేస్తాడు, తద్వారా ఆయన చిత్తమును గూర్చిన అటువంటి సాక్ష్యము జీవరాశి మద్య ఉండిపోతుంది, దీన్నిబట్టి, దేవుడు తన కార్యము లక్ష్యాన్ని సాధిస్తాడు. సమస్త జీవరాశి మధ్య తనను గురించి తానే సాక్ష్యమియ్యలేడు గనుక సాతానును ఓడించడానికి దేవుడు ఒంటరిగా పని చేయడు. ఒకవేళ ఆయన అలానే చేస్తే, మానవుని పూర్తిగా ఒప్పించడం అసాధ్యం, కాబట్టి దేవుడు మొదటిగా మానవుని జయించాలి, అప్పుడు మాత్రమే సమస్త జీవరాశి మధ్య ఆయన సాక్ష్యాన్ని సంపాదించగలడు. ఒకవేళ మానవుని సహకారము లేకుండా, దేవుడొక్కడే కార్యము చేసి ఉంటే, లేక మానవుడు సహకరించాల్సిన అవసరము లేకపోతే, ఇక మానవుడు ఎన్నటికీ దేవుని స్వభావమును గ్రహించేవాడు కాదు, అలాగే ఎప్పటికీ దేవుని చిత్తాన్ని తెలుసుకునేవాడు కాదు; అప్పుడు దేవుని కార్యము దేవుని నిర్వహణ కార్యముగా పిలువబడదు. ఒకవేళ దేవుని కార్యమును గ్రహించకుండా, మానవుడు తనకు తానే పొరాడుచూ, కనిపెట్టుచూ, మరియు కష్టపడి పని చేస్తున్నాడంటే, మానవుడు పిచ్చి చేష్టలు చేస్తున్నాడని అర్ధము. పరిశుద్ధాత్మ కార్యము లేకుండా, మానవుడు చేసేదంతా సాతానుకు చెందినదే, ఇక అతడు విరోధి మరియు ఒక దుష్టుడు; దేవునికి అనుకూలమైనది ఏదీ లేనందున, అవినీతిమయమైన మానవజాతి చేసే ప్రతి పనిలో సాతాను కనుపరచ బడుచున్నాడు, మరియు మానవుడు చేసేదంతా సాతాను స్పష్టీకరణ అయి ఉన్నది. మాట్లాడిన అంతటిలో దర్శనాలు మరియు ఆచరణ గురించి ప్రత్యేకముగా ఏమీ లేదు. దర్శనాల ఆధారముగా, మానవుడు ఆచరణను మరియు విధేయత మార్గాన్ని కనుగొంటాడు, కాబట్టి తన తలంపులన్నీ పక్కనపెట్టి గతంలో వేటిని తాను కలిగిలేడో వాటిని పొందగలడు. మానవుడు ఆయనకు సహకరించి, తద్వారా మానవుడు ఆయన షరతులకు సంపూర్ణముగా లోబడాలని, మరియు దేవుని స్వభావము తెలుసుకోడానికి, మరియు సర్వోన్నతుడైన దేవుని శక్తిని అనుభవించడానికి, దేవుడే స్వయముగా చేసిన కార్యాన్ని చూపించమని మానవుడు అడగాలని కోరుచున్నాడు. ముగింపులో, ఇవే దేవుని నిర్వహణ అయి ఉన్నది. మానవునితో దేవుని ఐక్యతే నిర్వహణ, మరియు ఇది ఒక మహోన్నతమైన నిర్వహణ.
దర్శనములను కలిగి ఉన్నది ఏదైనా స్వయంగా దేవుని కార్యమునే మొదటగా సూచిస్తుంది, మరియు ఆచరణతో కూడినది ఏదైనా మానవుని ద్వారా జరిపించబడింది గనుక దేవునితో ఎటువంటి సంబంధము ఉండదు. దేవుని కార్యము స్వయంగా దేవుని ద్వారానే సంపూర్తి చేయబడుతుంది, మరియు మానవుని ఆచరణ మానవుని ద్వారానే నెరవేర్చబడుతుంది. దేవుడే స్వయంగా చేయాల్సిన దానిని మానవుడు చేయాల్సిన అవసరం లేదు, అలాగే మానవుడు అనుసరించవలసిన దానితో దేవునికి సంబంధము లేదు. దేవుని కార్యమనేది ఆయన స్వంత పరిచర్య మరియు మానవునికి ఎటువంటి సంబంధము లేదు. ఈ కార్యము మానవుడు చేయాల్సిన అవసరము లేదు, ఇంకా చెప్పాలంటే, దేవుడు చేయవలసిన కార్యమును మానవుడు చేయలేడు. మానవుడు అనుసరించవలసినది మానవుని ద్వారా మాత్రమే సాధించబడాలి, అది తన జీవితాన్ని త్యాగం చేయడమైనా, లేక సాక్షిగా నిలుచుటకు సాతానుపై తన విడుదల అయినా—ఇవన్నీ కూడా మానవుని ద్వారానే సాధించబడాలి. దేవుడు తాను చేయవలసిన కార్యమును తానే సంపూర్తి చేస్తాడు, ఏదైతే మానవుడు చేయాలో అది మానవునికి చూపబడుతుంది, మిగిలిన పని మానవుడు చేయడానికి విడిచిపెట్టబడుతుంది. దేవుడు అదనముగా ఏ కార్యమూ చేయడు. తన పరిచర్య పరిధిలో ఉన్న కార్యమును మాత్రమే ఆయన చేస్తాడు, మానవునికి మార్గమును మాత్రమే చూపుతాడు, మరియు ద్వారము తెరిచే కార్యము మాత్రమే చేస్తాడు, అలాగే మార్గము సులభతరము చేయడం వంటి కార్యము చేయడు; దీనిని అందరూ అర్ధం చేసుకోవాలి. సత్యాన్ని అనుసరించడం అంటే దేవుని మాటలను అనుసరించడం అని అర్ధం, ఇదంతా మానవుడు చేయవలసిన మానవ కర్తవ్యము, దీనితో దేవునికి ఎటువంటి సంబంధము లేదు. మానవుని మాదిరిగానే దేవుడు కూడా వేదన అనుభవించి మరియు సత్యమందు శుద్ధి చేయబడాలని మానవుడు కోరుతున్నాడంటే, మానవుడు అవిధేయుడుగా ఉన్నాడు. దేవుని కార్యము ఆయన పరిచర్యను జరిగించడం, అలాగే మానవుని బాధ్యత ఏ ఆటంకము లేకుండా, దేవుని నిర్దేశాలన్నీ పాటించడం. దేవుడు కార్యము చేసే విధానం మరియు జీవించే రీతితో సంబంధము లేకుండా, మానవుడు సాధించవలసిన దానిని చేరుకోవలసిఉన్నది. దేవుడు మాత్రమే మానవుని అవసరతలను తీర్చగలడు, అంటే, దేవుడు మాత్రమే మానవుని అసరతలు తీర్చగల సమర్ధుడు. సంపూర్ణముగా సమర్పించుకుని అనుసరించడం తప్ప మానవునికి మరొక అవకాశము ఉండకూడదు; ఇది మానవుడు కలిగియుండవలసిన భావన. ఒక్కసారి దేవుడు స్వయంగా చేయవలసిన కార్యము సంపూర్తి కాగానే, మానవుడు దానిని, క్రమ క్రమముగా అనుభవించవలసి ఉన్నది. అంతములో, దేవుని నిర్వహణ అంతా సంపూర్తి అయ్యాక, ఒకవేళ, దేవుడు కోరిన దానిని మానవుడు ఇంకా చేయకపోతే, అప్పుడు మానవుడు శిక్షించబడాలి. దేవుని యొక్క ఆశయాలను మానవుడు నెరవేర్చలేదంటే, అది మానవుని అవిధేయత కారణాన్ని బట్టే; కానీ ఆయన కార్యములో దేవుడు పరిపూర్ణముగా లేడని అర్ధం కాదు. దేవుని మాటలను అనుసరించలేని వారూ, దేవుని ఆశయాలను నెరవేర్చలేని వారూ, అలాగే విధేయత చూపకుండా తమ కర్తవ్యాన్ని నెరవేర్చలేని వారందరూ శిక్షింపబడతారు. నేడు, మీరు సాధించవలసినది, మనుష్యులందరూ పాటించవలసిన మానవ కర్తవ్యమే కానీ అదనపు కోర్కెలు కాదు. మీ కర్తవ్యాన్ని నెరవేర్చటంలో కానీ లేదా సమర్ధవంతముగా చేయడములో కానీ మీరు విఫలమైతే, మీ మీదికి మీరే శ్రమను కొని తెచ్చుకోవడం లేదా? మీరు మరణాన్ని అనుసరించడం లేదా? మీకు ఇంకా మంచి భవిష్యత్తు మరియు సదవకాశాలు ఉంటాయని ఎలా ఆశిస్తారు? మానవజాతి నిమిత్తము దేవుని కార్యము జరిగించబడుతుంది, మరియు దేవుని నిర్వహణ నిమిత్తము మానవ సహకారము అందించబడుతుంది. తాను చేయవలసినదంతా దేవుడు చేశాక, మానవుడు తన ఆచరణలో దేవునికి సహకరించడానికి ఔదార్యం కలిగియుండాలి. దేవుని కార్యములో, మానవుడు ఏ ప్రయత్నాన్ని విడిచిపెట్టక, తన విధేయతను అర్పించాలి, అనేకమైన తలంపులతో నిమగ్నమై లేదా నిశ్చేష్టముగా కూర్చొని మరణము కోసం ఎదురు చూడకూడదు. మానవుని కోసం దేవుడు తనకు తానే త్యాగము చేయగలిగినప్పుడు, మానవుడు మాత్రం దేవునికి తన విధేయతను ఎందుకు అర్పించడం లేదు? మానవుడి పట్ల దేవుడు ఏక హృదయము మరియు మనస్సు కలిగి ఉన్నాడు, మరి మానవుడు మాత్రం చిన్న సహకారము కూడా ఎందుకు అందించలేకపోతున్నాడు? దేవుడు మానవజాతి కొరకు కార్యము చేస్తాడు, అయితే దేవుని నిర్వహణ నిమిత్తము మానవుడు తన కర్తవ్యాన్ని ఎందుకు నిర్వర్తించలేక పోతున్నాడు? దేవుని కార్యము ఇంత దూరము వచ్చినా, ఇంకా మీరు ఇప్పటికీ స్పందించరు, మీరు వింటారు కానీ కదలరు. అటువంటి ప్రజలు వినాశన సాధనాలు కారా? తన సర్వస్వాన్ని దేవుడు ఇదివరకే మానవునికి అంకితం చేశాడు, మరి నేడు మానవుడు మాత్రం తన కర్తవ్యాన్ని శ్రద్దగా నిర్వర్తించడంలో ఎందుకువిఫలమవుచున్నాడు? దేవునికి, ఆయన కార్యమే ఆయనకు మొదటి ప్రాధాన్యత, మరియు ఆయన నిర్వహణ కార్యము ఆయనకు అత్యంత ప్రాముఖ్యమైనది. దేవుని మాటలను అనుసరించడ మరియు దేవుని ఆశయాలు మానవునికిమొదటి ప్రాధాన్యత కావాలి. దీనిని మీరందరూ అర్ధం చేసుకోవాలి. మీతో పలుకబడిన మాటలు మీ అంతరంగము యొక్క ప్రధానమైన ఉత్పాదకమును చేరుకున్నాయి, దేవుని కార్యము అనంతమైన రాజ్యమున ప్రవేశించినది. అనేకమందికి ఈ మార్గములో ఉన్న సత్యము మరియు అసత్యము గురించి ఇప్పటికీ అవగాహన లేదు; తమ కర్తవ్యాన్ని నిర్వర్తించకుండా, ఇంకా వారు వేచి చూస్తున్నారు. బదులుగా, వారు దేవుని ప్రతి వాక్యమును మరియు కార్యమును పరిశీలిస్తారు, ఆయన ఏమి తింటున్నాడు మరియు తాగుతున్నాడు అనే వాటిపై వారు దృష్టి పెడతారు, అలాగే వారి తలంపులు అత్యంత దుఃఖ భరితముగా మారాయి. ఏమీ లేకుండానే అలాంటి ప్రజలు రచ్చ చేయడం లేదా? అలాంటి వారు దేవుని అన్వేషించే వారిగా ఎలా ఉంటారు? దేవునికి లోబడాలనే ఆలోచన వారు కలిగి ఉంటారు? వారి విధేయతను మరియు కర్తవ్యాన్ని వారి మనసుల్లో వెనుకకు నెట్టివేసి, బదులుగా దేవుడు ఎక్కడున్నాడో అనే దానిపై దృష్టి పెడతారు. వారు బలత్కారులు! మానవుడు గ్రహించవలసిన దానిని గ్రహించి, అలాగే ఆచరించవలసిన దానిని ఆచరిస్తే, అప్పుడు దేవుడు మానవునికి తన ఆశీర్వాదాలను తప్పక అనుగ్రహిస్తాడు, దాని కొరకు మానవుని నుండి ఆయనకు కావాల్సింది మానవుడు జరిపించవలసిన మానవ కర్తవ్యం. మానవుడు గనుక తాను అర్ధం చేసుకోవలసిన దానిని గ్రహించుటలో విఫలమైతే, ఆచరించవలసిన దానిని ఆచరించుటలో విఫలమైతే, అప్పుడు మానవుడు శిక్షించబడతాడు. దేవునికి సహకరించని వారు దేవునితో శత్రుత్వాన్ని కలిగి ఉంటారు, నూతన కార్యమును అంగీకరించని వారు దానికి విరోధముగా ఉన్నారు, వారు ఏమీ చేయకపోయినప్పటికీ స్పష్టముగా దానికి విరోధముగా ఉన్నారు. దేవుడు కోరుకున్న సత్యాన్ని ఆచరించకుండా, పరిశుద్ధాత్మ కార్యము పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ కనుపరిచే వ్యక్తులందరూ, ఉద్దేశ్యపుర్వకముగా విరోధిస్తూ మరియు దేవుని మాటల పట్ల అవిధేయత చూపే వ్యక్తులు. దేవుని మాటలకు విధేయులు కాకుండా దేవునికి లోబడని వారు తిరుగుబాటుదారులు, వారు దేవునికి విరోధ పక్షములోనే ఉన్నారు. తమ కర్తవ్యాన్ని నిర్వర్తించని ప్రజలు దేవునికి సహకరించని వారు, మరియు దేవునికి సహకరించని ప్రజలు పరిశుద్ధాత్మ కార్యాన్ని అంగీకరించని వారు.
ఎప్పుడైతే దేవుని కార్యము ఒక నిర్దిష్టమైన స్థితిని చేరుకుంటుందో, మరియు ఆయన నిర్వహణ ఒక నిర్దిష్టమైన స్థితిని చేరుకుంటుందో, అప్పుడు ఆయన హృదయానుసారులందరూ ఆయన ఆశయాలను నెరవేర్చే సామర్థ్యం కలిగి ఉంటారు. తన స్వంత నియమాల అనుగుణముగా, మానవుని నెరవేర్చు పటిమను బట్టి, దేవుడు మానవుని అవసరతలను తీరుస్తాడు. ఆయన నిర్వహణ గూర్చి మాట్లాడుతున్నప్పుడు, మనుగడ కోసము మానవునికి ఒక మార్గాన్ని ఇస్తాడు, మరియు ఆయన మానవునికి మార్గాన్ని కూడా సూచిస్తాడు. దేవుని నిర్వహణ మరియు మానవుని ఆచరణ రెండూ ఒకే దశలో మరియు ఏకకాలములో అమలు చేయబడతాయి. దేవుని నిర్వహణ గూర్చిన సంభాషణ మానవ స్వభావములోని మార్పులకు చెందినది, మరియు మానవుడు చేయవలసిన దానిని సంభాషించడం అలాగే మానవుని స్వభావములో మార్పులు దేవుని కార్యమును సంబంధించినది; ఈ రెండు వేరు చేయబడే కాలము లేనే లేదు. మానవుని ఆచరణ క్రమక్రమముగా మారుచున్నది. దేవుని కార్యము ఎల్లప్పుడూ మార్పు చెందుతూ మరియు వృద్ధి చెందుతుంది, గనుక మానవుని పట్ల దేవుని ఆశయాలు కూడా మారుతున్నాయి. మానవుని యొక్క ఆచరణ సిద్ధాంతంలో చిక్కుకొన్నట్లైతే, అతడు దేవుని కార్యము మరియు నడిపింపు లేనివాడని ఇది నిరూపిస్తుంది; మానవుని ఆచరణ ఎన్నడూ మారక మరియు లోతుగా వెళ్ళకపోతే, అటువంటి మానవుని ఆచరణ మానవ చిత్త ప్రకారము జరుగుతుందని, మరియు అది సత్యము ఆచరణ కాదని ఇది నిరూపించుచున్నది; ఒకవేళ మానవుడు నడచుటకు మార్గము లేకపోతే, అతడు ఇప్పటికే సాతాను హస్తాల్లో పడిపోయాడు, మరియు సాతాను చేత నడిపించబడుచున్నాడు, అంటే అతడు దురాత్మల చేత నడిపించబడుతున్నాడని అర్ధం. మానవుని ఆచరణ గనుక లోతుగా వెళ్ళకపోతే, దేవుని కార్యము వృద్ధి చెందదు, ఒకవేళ దేవుని కార్యములోనే గనుక మార్పు లేకపోతే, మానవుని ప్రవేశము నిలిచిపోతుంది; ఇది కాదనలేనిది. దేవుని కార్యమంతటిలో, మానవుడు గనుక యెహోవా ధర్మశాస్త్రమునకు కట్టుబడి ఉన్నట్లయితే, దేవుని కార్యము వృద్ది చెందేది కాదు, సమస్త యుగాన్నంతటిని అంతములోనికి తీసుకురావడం సాధ్యం కాదు. మానవుడు ఎల్లప్పుడూ సిలువను పట్టుకొని సహనమును మరియు వినయమును పాటించినట్లయితే, అప్పుడు దేవుని కార్యము ముందుకు సాగడం అసాధ్యం అవుతుంది. ఆరు వేల సంవత్సరాల నిర్వహణ కేవలం ధర్మశాస్త్రమునకు కట్టుబడి, లేదా సిలువను పట్టుకొని అలాగే సహనమును మరియు వినయమును పాటించే మనుష్యుల మధ్య ముగింపునకు తీసుకురాబడదు. బదులుగా దేవుని నిర్వహణ సమస్త కార్యము అంత్య దినములలో, దేవుని ఎరిగి, సాతాను చిక్కుల నుండి విడిపించబడి, మరియు సాతాను ప్రభావము నుండి పూర్తిగా తమకు తాముగా వైదొలగిన వారి మద్య ముగుస్తుంది. ఇదే దేవుని కార్యము యొక్క నిశ్చయమైన దశ. మతపరమైన సంఘాలకు చెందిన వారి ఆచరణకు కాలము చెల్లినదని ఎందుకు అంటారు? ఎందుకంటే, వారు నేటి కార్యము నుండి త్యజించబడిన దానిని ఆచరిస్తున్నారు. కృపా కాలములో, వారు కలిగియున్న ఆచరణ సరైనదే, కానీ కాలము గడిచి మరియు దేవుని కార్యము మారే కొలది, వారి ఆచరణకు క్రమముగా కాలము చెల్లిపోయింది. నూతన కార్యము మరియు నూతన కాంతిని బట్టి ఇది వెనుకబడిపోయింది. దీని మూల పునాది ఆధారముగా, పరిశుద్ధాత్మ కార్యము అనేక అడుగులు లోతుగా అభివృద్ధి చెందింది. అయినప్పటికీ ఆ ప్రజలు ఇంకా దేవుని కార్యము ఆరంభ దశలోనే ఉండిపోయి, ఇంకా పాత ఆచరణలు మరియు పాత వెలుగునకు కట్టుబడి ఉన్నారు. దేవుని కార్యము మూడు లేక ఐదు సంవత్సరాలలోనే గొప్పగా మారవచ్చు, మరి 2,000 సంవత్సరాల కాలములో ఇంతకంటే గొప్ప మార్పులు సంభవించవా? మానవుడు నూతన వెలుగు మరియు నూతన ఆచరణ కలిగి లేడంటే, అతడు పరిశుద్ధాత్మ కార్యమును అనుసరించలేదని అర్ధము. గతములో పరిశుద్ధాత్మ కార్యమును కలిగియున్న వారు ఇంకా పాత సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నారని, దేవుని నూతన కార్యము యొక్క అస్థిత్వమును మనము తిరస్కరించలేము; ఇది మానవుని వైఫల్యము. పరిశుద్ధాత్మ కార్యము ఎల్లప్పుడూ ముందుకు సాగుతూనే ఉంటుంది, మరియు పరిశుద్ధాత్మ ప్రవాహములో ఉన్న వారందరూ కూడా క్రమక్రమముగా, అధికముగా వృద్ధి మరియు మార్పు చెందుతారు. ఏ ఒక్క దశలోనూ వారు ఆగరు. వారిలో పరిశుద్ధాత్మ కార్యమును ఎరుగని వారు మాత్రమే, ఆయన ఆరంభ కార్యములో మిగిలిపోయి, పరిశుద్ధాత్ముని యొక్క నూతన కార్యమును అంగీకరించరు. అవిధేయత కలిగినవారు మాత్రమే పరిశుద్ధాత్మ కార్యమును పొందుకొనలేరు. మానవుని ఆచరణ పరిశుద్ధాత్మ నూతన కార్యమునకు అనుగుణముగా లేకపోతే, అది ఖచ్చితముగా నేటి కార్యముతో ఏకీభవించుటలేదు, అప్పుడు మానవుని ఆచరణ నేటి కార్యము నుండి తప్పక వేరు చేయబడుతుంది. అటువంటి కాలం చెల్లిన ప్రజలు దేవుని చిత్తాన్ని నెరవేర్చడములో కేవలం చేతకాని వారు, చివరి వరకు దేవునికి సాక్ష్యులుగా వారు ఉండలేరు. అటువంటి వ్యక్తుల సమూహములో, కార్య నిర్వహణ అంతా ముగించబడదు. ఒకప్పుడు ధర్మశాస్త్రాన్ని పాటించిన వారు, సిలువ కొరకు ఒకప్పుడు శ్రమ పడిన వారు, అంత్య దినముల కార్య దశను అంగీకరించకపోతే, అప్పుడు వారు చేసినదంతా వ్యర్ధము మరియు నిష్ప్రయోజనము అవుతుంది. పరిశుద్ధాత్మ కార్యము స్పష్టమైన భావన గతాన్ని అంటిపెట్టుకుని లేదు, కానీ వర్తమానమును మరియు ఉన్న చోటును హత్తుకోవడంలో ఉన్నది. నేటి కార్యమును కొనసాగించని వారు, మరియు నేటి ఆచరణ నుండి వేరైన వారు, పరిశుద్ధాత్మ కార్యమును అంగీకరించకుండా విరోధించేవారై ఉన్నారు. అటువంటి ప్రజలు దేవుని ప్రస్తుత కార్యమును అలక్ష్యము చేస్తారు. వారు గతములోని వెలుగును అంటిపెట్టుకున్నప్పటికీ, వారు పరిశుద్ధాత్మ కార్యము ఎరిగిన విషయాన్ని తిరస్కరించలేము. మానవుని ఆచరణలో మార్పులు గూర్చి, గతానికి ఇప్పటికి మానవుని ఆచరణలో వచ్చిన తేడాలు గురించి, ఆచరణ అనేది గత కాలములో ఎలా జరిగింది మరియు ఈనాడు ఎలా జరుగుతుంది అను వాటి గురించి చర్చలు ఎందుకు జరిగాయి? పరిశుద్ధాత్మ కార్యము నిత్యము ముందుకు సాగుచున్నందున, మానవుని ఆచరణ నిరంతరం మార్పు చెందడం అవసరం, కాబట్టి మానవుని ఆచరణలో ఇటువంటి విభాగాల గురించి ఎల్లప్పుడూ చెప్పబడతాయి. మానవుడు గనుక ఒక దశలో చిక్కుకొనిపోయి ఉన్నట్లయితే, అప్పుడు అతడు దేవుని నూతన కార్యము మరియు నూతన ప్రకాశమును అనుసరించుటకు అసమర్థుడని ఇది రుజువు చేస్తుంది; దేవుని నిర్వహణ ప్రణాళిక మారలేదని ఇది రుజువు చెయ్యదు. పరిశుద్ధాత్మ ప్రవాహానికి బయట ఉన్నవారు ఎల్లపుడూ వారే సరైన వారని అనుకుంటారు, కానీ నిజానికి, వారినుండి పరిశుద్ధాత్మ కార్యము వెడలిపోయింది మరియు వారు దేవుని కార్యము ఎడబాసి చాలా కాలము అయింది. దేవుని కార్యమనేది చాలాకాలం క్రితమే ఆయన తన కార్యము పూర్తి చేయాలనుకున్న ఒక నూతన జన సమూహము పైకి బదిలీ చేయబడింది. మతమందు ఉన్నవారు దేవుని నూతన కార్యమును అంగీకరించక, గతములో ఉన్న పాత కార్యమును మాత్రమే అంటి పెట్టుకుంటారు కాబట్టి, దేవుడు ఈ ప్రజలను విడనాడి, ఎవరైతే ఈ నూతన కార్యమును అంగీకరిస్తారో ఆ ప్రజల పట్ల ఆయన నూతన కార్యమును జరిగిస్తాడు. ఆయన నూతన కార్యములో సహకరించే ప్రజలు వీరే, మరియు ఈ విధముగా మాత్రమే ఆయన నిర్వహణ నెరవేర్చబడుతుంది. దేవుని నిర్వహణ ఎల్లప్పుడూ ముందుకు సాగుతుంది, మరియు మానవుని ఆచరణ ఎల్లప్పుడూ ఉన్నత స్థితికి చేరుకుంటుంది. దేవుడు ఎల్లప్పుడూ కార్యము చేస్తాడు, మరియు మానవుడు ఎల్లప్పుడూ అవసరతలో ఉంటాడు, అంటే అప్పుడు ఇద్దరు తమ అత్యున్నత స్థాయిని చేరి, దేవుడు మరియు మానవుడు సంపూర్ణ ఐక్యతను సాధిస్తారు. ఇదే దేవుని కార్యపు సాఫల్య భావన మరియు సమస్త దేవుని నిర్వహణ అంతిమ ఫలితము.
దేవుని కార్యము ప్రతి దశలో మానవుని సంబంధిత అవసరతలు కూడా ఉన్నాయి. పరిశుద్ధాత్మ ప్రవాహములో ఉన్న వారందరూ పరిశుద్ధాత్మ సన్నిధిని మరియు క్రమశిక్షణను కలిగి ఉంటారు, మరియు పరిశుద్ధాత్మ ప్రవాహమందు లేని వారందరూ, పరిశుద్ధాత్మ ఎటువంటి కార్యమూ లేనివారై, సాతాను ఆధీనములో ఉంటారు. పరిశుద్ధాత్మ ప్రవాహములో ఉన్న ప్రజలు దేవుని నూతన కార్యమును అంగీకరించే వారు మరియు దేవుని నూతన కార్యములో సహకరించేవారు. ఈ ప్రవాహములో ఉన్నవారు ఒకవేళ సహకరించలేక మరియు ఈ సమయమందు దేవుడు కోరిన సత్యాన్ని ఆచరణలో పెట్టలేకపోతే, అప్పుడు వారు క్రమశిక్షణకు లోనవుతారు అలాగే మరీ చెడిపోతే పరిశుద్ధాత్మ చేత వదిలి వేయబడతారు. పరిశుద్ధాత్మ నూతన కార్యాన్ని అంగీకరించే వారందరూ, పరిశుద్ధాత్మ ప్రవాహమందు జీవిస్తారు, మరియు వారు పరిశుద్ధాత్మ ద్వారా జాగ్రత్త చేయబడి సంరక్షించబడతారు. సత్యాన్ని ఆచరించుటకు ఇష్టపడే వారు పరిశుద్ధాత్మ జ్ఞానోదయం పొందుతారు, మరియు సత్యాన్ని ఆచరించుటకు ఇష్టపడని వారు పరిశుద్ధాత్మ క్రమశిక్షణకు గురవుతారు, అలాగే శిక్షకు కూడా గురి కావచ్చు. వారు ఎటువంటి వ్యక్తులు అయినప్పటికీ, వారు పరిశుద్ధాత్మ ప్రవాహమందు ఉన్నట్లయితే, ఆయన నామమును బట్టి ఆయన నూతన కార్యమును అంగీకరించే వారందరి పట్ల దేవుడు బాధ్యత వహిస్తాడు. ఆయన నామమును మహిమ పరుస్తూ ఆయన మాటలను అనుసరించడానికి ఇష్టపడేవారు ఆయన దీవెనలు పొందుకుంటారు; ఆయనకు అవిధేయులై ఆయన మాటలను ఆచరించుటకు ఇష్టపడని వారు ఆయన శిక్షను పొందుకుంటారు. పరిశుద్ధాత్మ ప్రవాహములో ఉన్న ప్రజలు నూతన కార్యమును అంగీకరించే వారు, మరియు వారు నూతన కార్యాన్ని అంగీకరించారు కాబట్టి, వారు దేవునికి తగిన సహకారమును అందించాలి, తమ కర్తవ్యాన్ని నిర్వర్తించని విరోధుల లాగా ప్రవర్తించకూడదు. ఇది మానవుని పట్ల దేవునికున్న ఏకైక ఆకాంక్ష. నూతన కార్యమును అంగీకరించని వారికైతే అలా కాదు; వారు పరిశుద్ధాత్మ ప్రవాహానికి బయట ఉన్నందున, పరిశుద్ధాత్ముని క్రమశిక్షణ మరియు దండన వారికి వర్తించవు. దినమంతా, ఈ వ్యక్తులు శరీరానుసారముగా జీవిస్తారు, తమ ఆలోచనానుసారముగా వారు జీవిస్తారు, మరియు వారు చేసేదంతా వారి మస్తిష్కాల్లో నుండి పుట్టిన సిద్దాంత విశ్లేషణ మరియు పరిశోధనకు అనుగుణముగా ఉంటుంది. పరిశుద్ధాత్మ నూతన కార్యమునకు కావలిసినది ఇది కాదు, ఇది దేవునికి సహకారముగా ఉండదు. దేవుని నూతన కార్యమును అంగీకరించని వారు దేవుని సన్నిధిని కోల్పోతారు, అంతే కాకుండా, దేవుని ఆశీర్వాదాలు మరియు రక్షణకు దూరమగుతారు. వారి మాటలు మరియు క్రియలు చాలా మట్టుకు పరిశుద్ధాత్మ కార్యము యొక్క గత ఆశయాలను అంటిపెట్టుకుని ఉన్నాయి; అవి సిద్దాంతమే కానీ, సత్యము కాదు. ఈ ప్రజల కూడికలు మతపరమైనవి తప్ప మరేవీ కావు అని నిరూపించడానికి ఆ సిద్దాంతము మరియు నిబంధన వంటివి సరిపోతాయి; వారు ఎన్నుకోబడినవారూ లేదా దేవుని కార్య సాధనాలూ కాదు. వారిలో ఉన్న వారందరి సమావేశాన్ని మతపరమైన మహా సభ అని పిలవచ్చు, కానీ సంఘము అని పిలవలేము. ఇది మారలేని నిజం. వారు పరిశుద్ధాత్మ నూతన కార్యమును కలిగి లేరు; కాబట్టి వారు చేసేదంతా మతాన్ని శుద్ధి చేస్తున్నట్టు కనబడుతుంది, వారు పరిశుద్ధాత్మ సన్నిధిని మరియు కార్యమును కలిగి ఉండరు; కాబట్టి వారు చేస్తున్నది మతముతో నింపబడినట్లు కనబడుతున్నది, కనుక పరిశుద్ధాత్ముని క్రమశిక్షణ మరియు జ్ఞానోదయం పొందడానికి వారు అనర్హులు. ఈ మనుష్యులందరూ నిర్జీవమైన ప్రేతాత్మలు, మరియు ఆత్మీయత లేని తొలిచే పురుగులు. వారికి మానవుని దుర్మార్గము మరియు విరోధమును గురించి తెలియదు, మానవుని దుష్టత్వము గురించి గ్రహింపు లేదు, దేవుని కార్యము మరియు దేవుని ప్రస్తుత చిత్తము గురించి వారికి అస్సలు తెలియదు. వారందరూ అవివేకులు, అనైతికమైన ప్రజలు, మరియు విశ్వాసులని పిలవబడటానికి అర్హత లేని నీచమైన వారు! వారు చేసేది ఏది దేవుని నిర్వహణపై ప్రభావం చూపదు, అది దేవుని ప్రణాళికలను కొంచెము కూడా చెరపలేదు. వారి మాటలు మరియు క్రియలు బహు అసహ్యకరమైనవి, చాలా దయనీయమైనవి, మరియు ప్రస్తావించడానికి అయోగ్యమైనవి. పరిశుద్ధాత్మ ప్రవాహంలో లేని వారి వలన ఏమీ కాదు అలాగే పరిశుద్ధాత్మ నూతన కార్యముతో వారికి ఎటువంటి సంబంధం ఉండదు. అందువలన, వారు ఏమి చేసినప్పటికీ, వారు పరిశుద్ధాత్మ క్రమశిక్షణ లేనివారు, మరియు, అంతే కాకుండా, పరిశుద్ధాత్మ జ్ఞానోదయం కూడా లేనివారు. వారందరూ సత్యమును ప్రేమించే ప్రజలు కానందున, పరిశుద్ధాత్మ చేత ఛీత్కారము పొంది తిరస్కరించబడిన వారై ఉన్నారు. వారు శరీరానుసారముగా నడుచుకుంటూ మరియు దేవుని విలాస పట్టిక క్రింద వారికి నచ్చినది చేస్తారు కాబట్టి వారు దుర్మార్గులుగా పిలవబడ్డారు. దేవుడు కార్యములు చేస్తున్నప్పుడు, ఉద్దేశపూర్వకముగానే వారు ఆయనకు ప్రతిబంధకముగా ఉంటారు, మరియు ఆయనకు విరుద్ధమైన దారిలో పరుగెత్తుతారు. దేవునికి సహకరించడములో మానవుని వైఫల్యము దానికదే అత్యంత విరోధమైనది, కాబట్టి ఉద్దేశపూర్వకంగానే దేవునికి విరోధముగా ఉన్న మానవులు వారి శిక్షను మరింతగా పొందరా? ఈ వ్యక్తుల దుర్మార్గమును గూర్చిన ప్రస్తావనలో, దేవుడు వారిని ఉపేక్షిస్తుంటే, కొందరు వ్యక్తులు మాత్రం వారిని శపించడానికి తొందరపడతారు. మానవునికి, వాని క్రియలు దేవుని నామమునకు సంబంధించినవిగా కనిపిస్తాయి, కాని వాస్తవానికి, దేవునికి పట్ల, ఆయన నామమునకు లేదా ఆయనకు సాక్ష్యముగా ఉండుటకు ఎటువంటి సంబంధమును కలిగి ఉండరు. ఈ ప్రజలు ఏమి చేసినప్పటికీ, అది దేవునికి సంబందించినది కాదు: అది ఆయన నామమునకు, మరియు ఆయన ప్రస్తుత కార్యమునకు రెండిటికీ సంబందించినది కాదు. ఈ ప్రజలు తమను తామే అవమానించుకుంటారు, మరియు సాతానును వ్యక్త పరుస్తారు; వారు ఉగ్రత దినము కొరకు దాచి పెట్టబడిన దుర్మార్గులు. నేడు, వారి చర్యలు ఏవైనప్పటికీ, దేవుని నిర్వహణకు ఆటంక పరచరు, మరియు దేవుని నూతన కార్యముతో వారికి ఎటువంటి సబంధము ఉండదు, అటువంటి వ్యక్తులు దేవుని ఉగ్రత దినము ఇంకా రావలసి ఉన్నందున సంబంధిత శిక్షకు అప్పుడే అప్పగించబడరు. దేవుడు ఇప్పటికే వ్యవహరించి ఉంటాడని నమ్మే వ్యక్తులు చాలా మంది ఉన్నారు, మరియు ఆ దుర్మార్గులు వీలైనంత త్వరగా శిక్షకు అప్పగించబడాలని వారు భావిస్తారు. కాని దేవుని నిర్వాహణ కార్యము ఇంకా ముగింపునకు రానందున, మరియు ఉగ్రత దినము ఇంకా రావలసి ఉన్నందున, అవినీతిపరులు ఇప్పటికీ తమ దుర్నీతి క్రియలను చేస్తూనే ఉన్నారు. కొందరు, “మతములో ఉన్నవారు పరిశుద్ధాత్మ కార్యము లేక సన్నిధిని కలిగియుండరు, మరియు దేవుని నామమునకు అవమానమును తెస్తారు; అయినా ఇంకా మితిమీరిన వారి ప్రవర్తనను సహిస్తూ, దేవుడు ఎందుకు వారిని నాశనం చేయడు?” అని అంటారు. సాతాను వ్యక్తీకరణ మరియు ఐహికమైన భావన కలిగిన వారు, అవివేకులైన వారు, అనైతికమైన వ్యక్తులైన, ఈ ప్రజలు; నిరర్ధకమైన వారు. మానవుని మధ్య దేవుడు ఏ విధముగా తన కార్యము చేస్తాడో తెలుసుకొనక ముందు, దేవుని ఉగ్రత యొక్క రాకడను వారు చూడరు. వారు గనుక పూర్తిగా జయించబడితే, ఆ దుర్మార్గులందరూ వారి శిక్షను పొందుకుంటారు, మరియు వారిలో ఒక్కరూ కూడా ఉగ్రత దినమును తప్పించుకోలేరు. దేవుని నిర్వహణను ఆటంకపరిచే వారు, తమ పనుల తీవ్రతను బట్టి శిక్షింపబడతారు మినహాగా, ప్రస్తుతానికి ఇది విజయ కార్యము అమలు పరిచే సమయమే గానీ, మానవుని శిక్షించే సమయం కాదు. మానవజాతి దేవుని నిర్వాహకత్వ సమయములో, పరిశుద్ధాత్మ ప్రవాహములో ఉన్న వారందరూ దేవునితో సంబంధమును కలిగి ఉంటారు. పరిశుద్ధాత్ముని చేత ఛీత్కరించబడి మరియు తిరస్కరించబడిన వారు సాతాను ప్రభావమందు నివసిస్తారు, కాబట్టి వారి ఆచరణకు దేవునితో ఎటువంటి సంబంధం ఉండదు. దేవుని నూతన కార్యమును అంగీకరించి మరియు దేవునికి సహకరించే వారు మాత్రమే దేవునితో సంబంధము కలిగి ఉంటారు, ఎందుకంటే దేవుని కార్యము దానిని అంగీకరించే వారికి కొరకు మాత్రమే ఉద్దేశించబడింది, వారు అంగీకరించినా అంగీకరించక పోయినా, ఇది ప్రజలందని ఉద్దేశించినది మాత్రము కానే కాదు. దేవుడు చేసే కార్యము ఎల్లప్పుడూ ఒక సాధనాన్ని కలిగి ఉంటుంది మరియు ఇష్టానుసారముగా జరగదు. సాతానుతో సహవాసము చేసే వారు దేవుని సాక్ష్యములుగా ఉండటానికి యోగ్యులు కారు, వారు దేవునికి సహకరించడానికి కూడా పనికి రారు.
పరిశుద్ధాత్మ కార్యము యొక్క ప్రతి దశకు మానవుని సాక్ష్యము అవసరము. కార్యపు ప్రతి దశ దేవునికి మరియు సాతానుకు మధ్య జరిగే ఒక యుద్దము, ఆ యుద్ద లక్ష్యము సాతాను, మానవుడు ఈ కార్యము జరుగుట ద్వారా పరిపూర్ణము చేయబడతాడు. దేవుని కార్యము ఫలిస్తుందా లేదా అనేది, దేవుని కొరకు మానవుడు ఇచ్చే సాక్ష్యము యొక్క రీతి మీద ఆధార పడి ఉంటుంది. ఆయనను వెంబడించే వారి నుండి దేవుడు కోరుతున్న సాక్ష్యము ఇదే; ఇది సాతాను ఎదుట ఇచ్చిన సాక్ష్యము మరియు ఆయన కార్యము యొక్క ప్రభావముల ఫలితము. దేవుని సమస్త నిర్వహణ మూడు భాగాలుగా విభజింపబడినది, ప్రతి దశలోనూ మానవుని నిర్దిష్టమైన ఆశయాలు ఉన్నాయి. అంతేగాక, కాలాలు గడిచి వృద్ధి చెందుతున్న కొలది, మానవజాతి అంతటి పట్ల దేవుని ఆశయాలు కూడా బహు ఉన్నతముగా మారాయి. మానవుడు “శరీరమందు వాక్యము యొక్క ప్రత్యక్షత” అనే వాస్తవాన్ని చూసే వరకు, దేవుని నిర్వహణ కార్యము అంచెలంచెలుగా ముగింపుకు చేరుకుంటుంది, మరియు ఈ విధముగా మానవుని అవసరతలు సాక్షమిస్తాయి అన్నట్లుగా, మానవుని అవసరతలు కూడా మరింతగా పెరిగాయి. మానవుడు ఎంత యధార్థముగా దేవునికి సహకరిస్తాడో, దేవుడు అంతగా మహిమను పొందుతాడు. మానవుని సహకారము అంటే అతడు కలిగి ఉండవలసిన సాక్ష్యము, మరియు తాను కలిగి ఉన్న సాక్ష్యమే మానవుని ఆచరణ అయి ఉన్నది. కాబట్టి, దేవుని కార్యము తగిన ప్రభావము కలిగి ఉంటుందా లేదా, మరియు సత్య సాక్ష్యము అనేది ఉంటుందా ఉండదా అనేవి మానవుని యొక్క సహకారము మరియు సాక్ష్యపు అవినాభావ బంధాన్ని కలిగి ఉన్నాయి. కార్యము సమాప్తమైనప్పుడు, అనగా, దేవుని నిర్వహణ ముగింపును చేరుకున్నప్పుడు, మానవుడు ఉన్నత సాక్ష్యము కలిగి ఉండాలి, అలాగే దేవుని కార్యము ముగింపును చేరుకున్నప్పుడు, మానవుని ఆచరణ మరియు ప్రవేశము వారి శిఖర స్థాయిని చేరుకుంటుంది. గతములో, మానవుడు ధర్మశాస్త్రము మరియు ఆజ్ఞలను పాటించవలసిన అవసరం ఉండేది, మరియు అతనికి ఓర్పు మరియు సహనము కలిగి ఉండవలసి వచ్చింది. నేడు, మానవుడు దేవుని ఏర్పాట్లన్నిటి పట్ల విధేయత కలిగి మరియు దేవుని పట్ల అత్యున్నతమైన ప్రేమను కలిగి ఉండవలసి ఉన్నది, అలాగే అతడు అంతిమముగా ఉద్దేశించబడిన మహా శ్రమలలో ఉన్నప్పటికీ దేవుని ప్రేమించవలసి ఉన్నది. ఈ మూడు దశలే, ఆయన నిర్వహణ అంతటిలో, అంచెలంచెలుగా దేవుడు మానవునికి తీర్చే అవసరాలు. దేవుని కార్యపు ప్రతి దశ దాని మునుపటి దానికంటే లోతుగా వెళ్ళుతుంది, మరియు ప్రతి దశలోని మానవుని అవసరతలు మునుపటి దానికన్నా తీవ్రముగా ఉంటాయి, కాబట్టి ఈ విధముగా దేవుని కార్యము దశల వారీగా రూపుదిద్దుకుంటుంది. మానవునికి అవసరతలు ఎప్పటికీ ఎక్కువగానే ఉంటాయి కాబట్టి మానవుని స్వభావము దేవునికి అవసరమైన ప్రమాణాలకు అతి దగ్గరలో ఉంటుంది, అప్పుడు మాత్రమే సమస్త మానవజాతి సాతాను ప్రభావము నుండి వైదొలగడం క్రమముగా ప్రారంభమవుతుంది, దేవుని కార్యము సంపూర్ణ ముగింపునకు వచ్చాక, సమస్త మానవ జాతి సాతాను ప్రభావము నుండి రక్షించబడుతుంది. ఆ సమయము వచ్చినప్పుడు, దేవుని కార్యము ముగింపునకు చేరుకుంటుంది, తన స్వభావములో పరివర్తనము చెందుటకు మానవుడు దేవునికి అందించే సహకారము ఇక ఉండదు, మరియు సమస్త మానవజాతి దేవుని వెలుగులో జీవిస్తారు, ఇక అక్కడి నుండి, దేవుని పట్ల తిరుగుబాటుతనము మరియు వ్యతిరేకత అనేవి ఉండవు. దేవుడు కూడా మానవుని ఎటువంటి కోర్కెలు కోరడు, అలాగే మానవునికి దేవునికి మధ్యలో సామరస్య పూర్వకమైన సహకారము ఉంటుంది, అదే మానవుడు మరియు దేవుడు కలిసి ఉండే జీవితం, దేవుని నిర్వహణ సంపూర్ణముగా ముగింపబడి, మానవుడు సాతాను యొక్క బంధకాల నుండి పూర్తిగా రక్షింపబడిన తరువాత వచ్చే జీవితం. దేవుని అడుగుజాడలను సమీపముగా అనుసరించలేని వారు, అటువంటి ఒక జీవితాన్ని పొందలేరు. వారు తమను తాము అగాధములో పడవేసుకుంటారు, అక్కడ వారు అంగలారుస్తూ పళ్ళు కొరుకుతారు; వారు దేవుని నమ్ముతారు కానీ, ఆయనను అనుసరించరు, వారు దేవుని నమ్ముతారు కానీ, ఆయన కార్యమంతటికీ కట్టుబడి ఉండరు. మానవుడు దేవుని విశ్వసిస్తున్నాడు కాబట్టి, అతడు దేవుని అడుగు జాడలను సమీపముగా, దశలవారీగా అనుసరించాలి; తాను “ఆయన ఎటు వెళ్ళినా గొర్రెపిల్ల లాగా అనుసరించాలి.” ఈ వ్యక్తులు మాత్రమే నిజమైన మార్గాన్ని వెదుకుతారు, కేవలము వీరు మాత్రమే పరిశుద్ధాత్మ కార్యమును ఎరిగినవారు. అక్షరాలను మరియు సిద్దాంతాలను పనికిమాలిన విధముగా అనుసరించే వ్యక్తులు పరిశుద్ధాత్మ కార్యము ద్వారా పరిత్యజించబడినవారు వారు. ప్రతి కాలములో, దేవుడు నూతన కార్యమును ప్రారంభిస్తాడు, ప్రతి కాలమందు, మానవునిలో నూతన ఆరంభము ఉంటుంది. వారి కాలములకు మాత్రమే వర్తించే సత్యములైన “యోహోవాయే దేవుడు” మరియు “యేసే క్రీస్తు” అనే సత్యాలకు మాత్రమే మానవుడు కట్టుబడి ఉంటే, అప్పుడు మానవుడు పరిశుద్ధాత్మ కార్యమును కొనసాగించలేడు, ఇక ఎన్నటికీ పరిశుద్ధాత్మ కార్యమును పొందలేడు. దేవుడు కార్యమును ఎలా చేసినప్పటికీ, కాస్తయినా సందేహించకుండా మానవుడు అనుసరిస్తాడు, అతడు సమీపముగా వెంబడిస్తాడు. ఈ విధముగా, మానవుడు పరిశుద్ధాత్ముని ద్వారా ఎలా పరిత్యజించబడుతాడు? దేవుడు ఏమి చేసినప్పటికీ, అది పరిశుద్ధాత్మ కార్యమని నిశ్చయించుకుని, ఎటువంటి అపోహలు లేకుండా పరిశుద్ధాత్మ కార్యములో సహకరిస్తూ, దేవుని కాంక్షలను తీర్చడానికి మానవుడు ప్రయత్నిస్తున్నంత కాలం, అతను ఎలా శిక్షించబడతాడు? దేవుని కార్యము ఎన్నడూ ఆగలేదు, ఆయన అడుగుజాడలు ఎన్నడూ నిలిచిపోలేదు, ఆయన నిర్వహణ కార్యము సంపూర్తి అయ్యేంత వరకు, ఆయన ఎన్నడూ ఆగక మరియు నిమగ్నమై ఉండే వాడు. కానీ మానవుడు భిన్నముగా ఉంటాడు; పరిశుద్ధాత్మ కార్యములో కాస్త పొంది, ఇక అది ఎన్నడూ మారదని భావిస్తాడు; నూతన జ్ఞానాన్ని పొందిన తరువాత, అతడు దేవుని కార్యపు అడుగుజాడలను వెంబడించడానికి ముందుకు వెళ్ళడు; దేవుని కార్యములో కొంత భాగాన్ని చూశాక, అతడు వెంటనే దేవుని ఒక చెక్క బొమ్మగా అభివర్ణిస్తాడు, మరియు దేవుడు ఎల్లప్పుడూ తన ముందు కనిపించే ఈ రూపములోనే ఉంటాడని నమ్ముతాడు, ఇది గతములోనే ఇలా ఉంది మరియు భవిష్యత్తులో కూడా ఇలానే ఉంటాడని భావిస్తాడు; మిడిమిడి జ్ఞానాన్ని పొంది, మానవుడు తనను తానే మరిచిపోయేంతగా గర్వాన్ని కలిగి, ఉనికిలోనే లేని దేవుని స్వభావాన్ని దుర్బుద్ధితో ప్రకటించడం ఆరంభించాడు; పరిశుద్ధాత్మ కార్యము ఒక దశను గూర్చి నిశ్చయత పొందాక, దేవుని నూతన కార్యమును ప్రకటించే వ్యక్తి ఎలాంటివాడైనా, మానవుడు దానిని అంగీకరించడు. వీరు పరిశుద్ధాత్మ యొక్క నూతన కార్యమును అంగీకరించలేని ప్రజలు; వారు మహా సంప్రదాయవాదులు, నూతన విషయాలను అంగీకరించలేరు. అటువంటి వ్యక్తులు దేవుని నమ్మేవారు అలాగే తిరస్కరించే వారు కూడా. ఇశ్రాయేలీయులు “యెహోవాను మాత్రమే నమ్ముతూ యేసయ్యను నమ్మకపోవడం” తప్పు అని మానవుడు నమ్ముచున్నాడు, అయినప్పటికీ అనేకమంది “యెహోవాను మాత్రమే విశ్వసించి యేసును తిరస్కరించండి” మరియు “మెస్సయ్య రాకడ కొరకు కనిపెడుతూ, యేసుగా పిలవబడుచున్న మెస్సయ్యను మాత్రం తిరస్కరించండి” అనే పాత్రను పోషిస్తున్నారు. పరిశుద్ధాత్మ కార్యపు ఒక దశను అంగీకరించిన తరువాత, ఇంకా దేవుని ఆశీర్వాదాలు పొందకుండా, ఇప్పటికీ సాతాను ఆధిపత్యములోనే జీవిస్తున్నారు అనుటలో ఆశ్చర్యమేమీ లేదు. ఇది మానవుని తిరుగుబాటుతనము ఫలితము కాదా? నేటి నూతన కార్యమును అనుసరించని ప్రపంచవ్యాప్తముగా ఉన్న క్రైస్తవులు, దేవుడు తమ కోరికలు నేరవేరుస్తాడని, తాము ఆ అదృష్టమును పొందుకుంటామనే నిరీక్షణను అంటిపెట్టుకుని ఉన్నారు. ఇప్పటికీ, దేవుడు వారిని మూడవ ఆకాశమునకు ఎందుకు తీసుకెళ్తాడో వారు ఖచ్చితముగా చెప్పలేరు, తెల్లటి మేఘారూడుడై వారిని స్వీకరించుటకు యేసయ్య ఎలా వస్తాడో వారికి స్పష్టత లేదు, వారు ఊహించిన దినమున యేసయ్య నిజముగా తెల్లటి మేఘము మీద వస్తాడా లేదా అనేది వారు ఖచ్చితమైన స్పష్టతతో చెప్పలేరు. దేవుడు వారిలో ప్రతిఒక్కరిని తీసుకెళ్తాడా, ప్రతి జాతికి నుండి వైవిధ్యభరితమైన కొందరని తీసుకెళ్తాడా అని వారికే తెలియదు; కాబట్టే, వారందరూ చింతిస్తూ, అయోమయములో ఉన్నారు. వారు తమ వేళ్ళ మీద రోజులని లెక్కించడము తప్ప, దేవుడు ప్రస్తుతము చేస్తున్న కార్యము, ప్రస్తుత కాలము, దేవుని చిత్తము—గురించిన దేనిమీద వారికి కనీస అవగాహన అయినా లేదు. అంతము వరకు దేవుని అనుసరించకపోయినా, తాము అన్నిటినీ పొందుకున్నామని నమ్మే ఆ “తెలివైన వ్యక్తులు,” దేవుని ప్రత్యక్షతను చూడలేరు, అయితే అంతము వరకు గొర్రెపిల్ల అడుగుజాడలను అనుసరించిన వారు మాత్రమే చివరి ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. వారిలో ప్రతి ఒక్కరూ తామే భూమి మీద అత్యంత తెలివి గలవారని నమ్ముతూ, కొనసాగుతున్న దేవుని కార్యపు వృద్దిని నిష్కారణముగా మధ్యలోనే ముగించి, అలాగే వారు “దేవుని పట్ల అత్యంత విధేయత కలిగి, దేవుని అనుసరిస్తూ, దేవుని మాటలయందు నిలిచి” ఉన్నారని, దేవుడు వారిని పరలోకము తీసుకెళతాడు అని కచ్చితముగా విశ్వసిస్తున్నట్లు అగుపడతారు. దేవుడు పలికిన మాటల పట్ల “అత్యంత వినయము” ఉన్నప్పటికీ, వారు పరిశుద్ధాత్మ కార్యమును వ్యతిరేకిస్తూ, మోసము మరియు చెడుతనమునకు పాల్పడతారు, కాబట్టి వారి మాటలు మరియు పనులు ఇప్పటికీ అసహ్యముగా ఉంటాయి. అంతము వరకు దేవుని అనుసరించని వారు, పరిశుద్ధాత్మ కార్యమును కొనసాగించని వారు, మరియు పాత కార్యమునకు కట్టుబడి, దేవుని పట్ల విధేయతను కనుపరచుటలో విఫలమవ్వడమే కాకుండా, దానికి విరుద్ధముగా, నూతన యుగము ద్వారా తిరస్కరింపబడి, దైవ వ్యతిరేకులుగా మారిన వారు, శిక్షింపబడతారు. వారి కంటే దౌర్భాగ్యులు ఎవరైనా ఉంటారా? పాత ధర్మశాస్త్రాన్ని తిరస్కరించి, నూతన కార్యమును అంగీకరించు వారందరూ మనస్సాక్షి లేని వారని అనేకమంది అనుకుంటారు. పరిశుద్ధాత్మ కార్యము గురించి అస్సలు ఎరుగకుండా, “మనస్సాక్షి” గురించి మాత్రమే మాట్లాడే ఈ వ్యక్తులు, అంతిమ వారి స్వీయ మనస్సాక్షిని ద్వారా తమ అనుకూలతలు అర్ధాంతరముగా తొలగిపోతాయి. దేవుని కార్యము సిద్దాంతానికి కట్టుబడి ఉండదు, అది ఆయన స్వంత కార్యమైనప్పటికీ, దేవుడు ఇంకా దానిని అంటిపెట్టుకుని ఉండడు. పరిత్యజించబడవలసినది పరిత్యజించబడుతుంది, తొలగించబడవలసినది తొలగించబడుతుంది. ఇప్పటికీ, దేవుని నిర్వహణలో ఒక చిన్న భాగాన్ని పట్టుకుని ఉండుట ద్వారా, మానవుడు తనకు తానే దేవునితో శత్రుత్వాన్ని పెట్టుకున్నాడు. ఇది మానవుని మూఢత్వము కాదా? ఇది మానవుని అవివేకము కాదా? దేవుని ఆశీర్వాదములు పొందలేమనే భయముతో, ఎంతగా ప్రజలు పిరికివారుగా మరియు అజాగ్రత్త పరులుగా ఉంటారో, అంతగా వారు గొప్ప ఆశీర్వాదాలు పొందలేరు, మరియు చివరి దీవెనను కూడా పొందలేరు. అత్యంత శ్రద్ధతో ధర్మశాస్త్రానికి కట్టుబడే వ్యక్తులందరూ ధర్మ శాస్త్రము పట్ల అత్యంత విధేయతను కనుపరుస్తారు, మరియు అలాంటి వారు ధర్మ శాస్త్రము పట్ల ఎంత ఎక్కువగా విధేయతను కనుపరుస్తారో, వారు అంతగా దేవుని ధిక్కరించే విరోధులుగా ఉంటారు. ప్రస్తుతానికి ఇది దేవుని రాజ్యకాలము మరియు ధర్మశాస్త్ర కాలము గానీ కాదు, మరియు నేటి కార్యమును మరియు గత కార్యమును ఒకేసారి ప్రస్తావించలేము, అలాగే గత కార్యమును నేటి కార్యముతో పోల్చలేము. దేవుని కార్యము మారింది, మానవుని ఆచరణ కూడా మారింది; మానవుని యొక్క ఆచరణ అంటే ధర్మశాస్త్రాన్ని అంటిపెట్టుకోవడం మరియు సిలువను మోయడమో కాదు, కావున ధర్మశాస్త్రము మరియు సిలువ పట్ల ప్రజలు కలిగియున్న విధేయత మాత్రమే దేవుని ఆమోదాన్ని పొందలేదు.
దేవుని రాజ్య కాలములో మానవుడు బాగా సంపూర్ణము చేయబడతాడు. విజయ కార్యము తరువాత, మానవుడు శ్రమలకు మరియు శుద్దీకరణకు అప్పగించబడతాడు. ఎవరైతే ఈ శ్రమల కాలమును జయించి మరియు సాక్ష్యముగా నిలుస్తారో, వారు అంతిమముగా సంపూర్ణము చేయబడతారు; వారు జయించిన వారు. ఈ శ్రమల కాలములో, మానవుడు శుద్దీకరణను అంగీకరించవలసి ఉన్నది, మరియు ఈ శుద్దీకరణయే దేవుని కార్యమునకు అంతిమ ప్రతీక. దేవుని నిర్వహణ సమస్త కార్యము ముగింపునకు ముందుగా మానవుడు చివరిసారి శుద్ధి చేయబడతాడు, దేవుని అనుసరించు వారందరూ ఈ తుది పరీక్షను స్వీకరించాలి, మరియు వారు ఈ అంతిమ శుద్దీకరణను అంగీకరించాలి. పరిశుద్ధాత్మ కార్యము మరియు దేవుని నిర్దేశము లేని వారు శ్రమల చేత ఆవరించబడిన వారై ఉన్నారు, కానీ నిజముగా జయించబడినవారు, మరియు దేవుని నిజముగా వెదకువారు చివరివరకు స్థిరముగా నిలబడతారు; వారు మానవత్వమును కలిగి కడవరకు దేవుని ప్రేమించేవారు. దేవుడు ఏమి చేసిన ఈ జయము పొందిన వారు దర్శనాలను కోల్పోరు, అలాగే సాక్ష్యాన్ని పోగొట్టుకోక సత్యమును అనుసరిస్తారు. మహా శ్రమల నుండి అంతిమముగా బయటపడేది వీరే. మురికి నీటిలో చేపలు పట్టేవారు ఇంకా నేటికీ ఇతరులపై ఆధారపడవచ్చు, అంతిమ శ్రమల నుండి ఎవరూ తప్పించుకోలేరు, అలాగే చివరి పరీక్షను ఎవరూ తప్పించుకోలేరు. జయించిన వారికి, అటువంటి శ్రమ ఒక అద్భుతమైన శుద్దీకరణగా ఉన్నది; కానీ మురికి నీటిలో చేపలు పట్టేవారికి ఇది పూర్తిగా పరిత్యజించే కార్యము. వారి విషయంలో ఎంతగా ప్రయత్నించినప్పటికీ, వారి హృదయములో దేవుని యందు కలిగియున్న వారి విధేయత మారదు; కానీ హృదయములో దేవుని కలిగి లేని వారికి, ఒకసారి దేవుని కార్యము వారికి శరీరానుసారముగా ప్రయోజనకరము కానప్పుడు, దేవుని పట్ల వారి దృష్టిని మార్చుకుని, దేవుని నుండి వైదొలుగుతారు. దేవుని ఆశీర్వాదాలను మాత్రమే ఆశించే వారు, దేవుని కొరకు తమను తామే వెచ్చించాలి మరియు అంకితము చేసుకోవాలి అనే కోరిక లేని, అటువంటి వారు కడవరకు స్థిరముగా నిలువలేరు. దేవుని కార్యము ముగింపునకు వచ్చినప్పుడు అటువంటి నీచమైన వ్యక్తులందరూ బహిష్కరించబడతారు, మరియు వారు ఎటువంటి సానుభూతి పొందడానికైనా అయోగ్యులు. మానవత్వము లేని వారు దేవుని నిజముగా ప్రేమించలేరు. పరిసరాలు సౌఖ్యముగా మరియు సురక్షితముగా ఉన్నప్పుడు, లాభాలు పొందేటప్పుడు, వారు దేవుని పట్ల సంపూర్ణ విధేయత కలిగి ఉంటారు, కానీ వారు ఆశించినది అందనప్పుడు, లేక చివరికి తిరస్కరించబడినప్పుడు, వెంటనే వారు తిరుగుబాటు చేస్తారు. కేవలం ఒక రాత్రి కాల వ్యవధిలో కుడా, వారు చిరునవ్వుతో, “దయా-హృదయం” గల వ్యక్తి నుండి వికారమైన-క్రూరమైన హంతకునిగా మారగలరు, ఒక ప్రాస మరియు పంక్తి లేకుండా, వారి నిన్నటి శ్రేయోభిలాషిని నేడు వారి మరణకరమైన శత్రువుగా భావిస్తారు. కంటి రెప్పలార్పకుండా చంపే పిశాచాలైన, ఈ దురాత్మలను తరిమి కొట్టకపోతే, అవి పొంచియున్న ప్రమాదముగా మారవా? విజయ కార్యము పూర్తయిన తరువాత మానవుని రక్షించే కార్యము సాధించబడదు. విజయ కార్యము పూర్తయినప్పటికీ, మానవుని శుద్ధి చేసే కార్యము ఇంకా కాలేదు; మానవుడు పూర్తిగా శుద్ధి చేయబడిన తరువాత, దేవుని పట్ల నిజముగా విధేయత కనుపరచే వారు పరిపూర్ణులు అయిన తరువాత, వేషధారులై తమ హృదయములో దేవుడు లేని వారు ప్రక్షాళన చేయబడిన తరువాత, మాత్రమే అటువంటి కార్యము సంపూర్తి చేయబడుతుంది. దేవుని కార్యము యొక్క అంతిమ దశలో సంతృప్తి చెందని వారు పూర్తిగా పరిత్యజించబడుతారు, మరియు పరిత్యజించబడినవారు అపవాది సంబంధులు. వారు దేవుని తృప్తి పరచలేనందున, వారు దేవునికి విరోధులు అయ్యారని, మరియు నేడు ఈ వ్యక్తులు దేవుని అనుసరిస్తున్నప్పటికీ, చివరికి మిగిలేది కుడా వాళ్ళే అని ఇది నిరూపించుట లేదు. “అంతము వరకు దేవుని అనుసరించు వారు రక్షణ పొందుకుంటారు,” అనే మాటలలో “అనుసరించడం” అంటే శ్రమలలో స్థిరముగా నిలిచి ఉండటం. నేడు, అనేకమంది దేవుని అనుసరించడము చాలా సులభమని అనుకుంటారు, కానీ దేవుని కార్యము ముగిసే ముందు, “అనుసరించడం” గురించిన వాస్తవ అర్ధము నీకు తెలుస్తుంది. జయించబడిన తరువాత కూడా నీవు దేవుని అనుసరించ కలుగుతున్నావు కాబట్టి, పరిపూర్ణులు కాబోయే వారిలో నీవు ఒకరివి అని ఇది నిరూపించదు. శోధనలు సహించలేని వారు, శ్రమలలో విజయము సాధించలేని వారు, స్థిరముగా నిలువలేరు, మరియు చిట్టచివరి వరకు దేవుని అనుసరించలేరు. దేవుని నిజముగా అనుసరించే వారు తమ కార్యము యొక్క పరీక్షను తట్టుకోగలరు, అయితే, దేవుని నిజముగా అనుసరించని వారు దేవుని ఎటువంటి శ్రమలనైనా తట్టుకోలేరు. ఎప్పటికైనా వారు బహిష్కరించబడతారు, అలాగే జయించబడిన వారు దేవుని రాజ్యములో ఉంటారు. మానవుడు స్వయంగా తీసుకున్న నిర్ణయముతో సంబంధము లేని, దేవుని పరీక్షల ద్వారా, మానవుడు నిజముగా దేవుని వెదకుతున్నాడా లేదా అనేది అతని పని పరీక్షను బట్టి నిర్ణయించబడుతుంది. దేవుడు ఏ వ్యక్తినీ ఇష్టానుసారముగా తృణీకరించడు; ఆయన చేసేదంతా మానవుని పూర్తిగా ఒప్పించగలదు. మానవునికి కనిపించని కార్యము మరియు మానవుని ఒప్పించలేని కార్యము ఏదీ దేవుడు చేయడు. మానవుని విశ్వాసము నిజమైనదా కాదా అనేది వాస్తవాలను బట్టి రుజువు అవుతుంది కానీ, మానవుని నిర్ణయం బట్టి కాదు. “గోధుమలు గురుగులు కాలేవు మరియు గురుగులు గోధుమలు కాలేవు” అనే దానిలో ఏ సందేహమూ లేదు. దేవుని నిజముగా ప్రేమించే వారందరూ దేవుని రాజ్యములో ఉంటారు, మరియు ఆయనను నిజముగా ప్రేమించే వారెవ్వరి పట్ల ఆయన చెడుగా ప్రవర్తించడు. వారి వివిధమైన పనులు మరియు సాక్ష్యముల ఆధారముగా, జయించాబడినవారు దేవుని రాజ్యములో యాజకులు లేక అనుచరులుగా పనిచేస్తారు, శ్రమలలో విజయము పొందిన వారు దేవుని రాజ్యములో యాజక సముహముగా ఏర్పడతారు. లోకమంతటా సువార్త కార్యము ముగిశాక, యాజక సమూహము ఏర్పడుతుంది. ఆ సమయము వచ్చినప్పుడు, మానవుడు చేయాల్సింది దేవుని రాజ్యములో తన బాధ్యతను నిర్వర్తించడం మరియు దేవునితో కూడా కలిసి రాజ్యములో జీవించడం. యాజక సమూహములో ప్రధాన యాజకులు మరియు యాజకులు ఉంటారు, మిగిలిన వారు కుమారులుగా మరియు దేవుని ప్రజలుగా ఉంటారు. శ్రమల కాలములో దేవుని కొరకు వారిచ్చిన సాక్ష్యములను బట్టి ఇది నిర్ణయించబడుతుంది; అవి ఇష్టానుసారముగా ఇవ్వబడిన బిరుదులు కావు. మానవుని స్థాయి స్థిరపరచిన తరువాత, దేవుని కార్యము ఆగిపోతుంది, ప్రతి ఒక్కటి వాటి జాతి ప్రకారము వర్గీకరించబడి, వాటి ఆరంభ స్థానానికి తిరిగి వస్తుంది, ఇది దేవుని కార్యపు విజయ చిహ్నము, ఇది దేవుని కార్యము మరియు మానవుని ఆచరణకు తుది ఫలితము, ఇది దేవుని కార్యము మరియు మానవుని సహకారమునకు దర్శనముల స్పష్టీకరణగా ఉన్నది. అంతములో, మానవుడు దేవుని రాజ్యములో విశ్రమిస్తాడు, అలాగే దేవుడు కూడా, విశ్రమించడానికి తన నివాస స్థలమునకు చేరుకుంటాడు. 6,000 సంవత్సరాలుగా దేవుడు మరియు మానవుని మధ్య సహకారమునకుఫలితమిదే.