భూమిపై దేవుణ్ణి ఎలా తెలుసుకోవాలి

మీరందరు దేవుని ముందు ప్రతిఫలం పొందుకోవాలని మరియు దేవునిచే దయను పొందుకోవాలని కోరుకుంటారు; ప్రతియొక్కరు దేవుణ్ణి నమ్ముకోవటం మొదలు పెట్టిన తర్వాత వారు అటువంటి విషయాలను ఆశిస్తుంటారు, ప్రతి ఒక్కరు ఉన్నతమైన విషయాలను పొందుకోవటానికి కార్యనిమగ్నమై అత్యాసక్తితో వుంటారు, ఇతరుల వెనుక వెనుక ఉండాలని ఎవరూ ఇష్టపడరు. ఖచ్చితంగా, ఈ కారణం చేత, మీలో చాలా మంది పరలోకంలో ఉన్న దేవుని దయను పొందుకోవటానికి నిరంతరం ప్రయత్నిస్తుంటారు, వాస్తవానికి, దేవునిపట్ల మీకున్న సద్భక్తి లేక నమ్మకత్వము మరియు నిష్కల్మషమైన ప్రవర్తన ఎటువంటిది అంటే మీపట్ల మీకుండే నమ్మకత్వము మరియు నిజతత్వముకంటే చాలా తక్కువ. నేను దీనిని ఎందుకు చెబుతున్నాను? ఎందుకంటే, దేవునిపట్ల మీకుండే నమ్మకత్వాన్ని ఎంత మాత్రం చూడలేదు, అంతేగాకుండా, మీ హృదయాల్లో ఉన్న దేవుని ఉనికిని నేను నిరాకరిస్తున్నాను కాబట్టే నేను దేవునిపట్ల మీకున్న విశ్వాసపాత్రను చూడటం లేదు. ఇంకొక విధంగా చెప్పాలంటే, మీరు ఆరాధించే దేవుడు, మీరు ఇష్టపడే అస్పష్టమైన దేవుడు, అసలు ఉనికిలోనే లేడు. నేను దీన్ని చాలా ఖచ్చితంగా చెప్పడానికి కారణం మీరు నిజమైన దేవునికి చాలా దూరంగా ఉన్నారు. మీ నమ్మకత్వానికి కారణం మీ హృదయాలలో ఉన్నటువంటి విగ్రహమే; ఇట్లుండగా నా మట్టుకైతే, మీరు చూసే దేవుడు గొప్పవాడా, లేక చిన్నవాడా అని కాదు గానీ మీరు కేవలం మాటల ద్వారానే గుర్తిస్తారు. మీరు దేవునికి దూరంగా వున్నారని నేను చెప్పిన్నపుడు, నిజమైన దేవునికి మీరు దూరంగా వున్నారని, అస్పష్ట దేవుడు మీకు దగ్గరగా వున్నాడని అర్థం. “గొప్పవాడు కాదు” అని నేను చెప్పినప్పుడు, ఈ రోజున మీరు విశ్వసిస్తున్నటువంటి దేవుడు కేవలం గొప్ప సామర్థ్యాలు లేని వ్యక్తిగాను, చాలా ఉన్నతంగా లేని వ్యక్తిగాను ఎలా కనిపిస్తాడనే దానికి సూచనగా ఉన్నది. నేను “చిన్నవాడు కాదు” అని చెప్పినప్పుడు, ఈ వ్యక్తి గాలిని పిలిపించి మరియు వర్షమును ఆజ్ఞాపించలేనప్పటికీ, అతను భూమ్యాకాశములను కదిలించేటటువంటి కార్యమును చేయమని దేవుని యొక్క ఆత్మను పిలవలేని స్థితిలో ఉన్నప్పటికీ, మనుష్యులను పూర్తిగా అయోమయ గందరగోళములోనికి నెట్టి వేస్తాడని అర్థం. పైకి మాత్రం మీరందరూ భూమ్మీద ఉన్నటువంటి ఈ క్రీస్తుకు అత్యంత విధేయతతో కనిపిస్తారు, గాని గుణగణాలను కలిగియుండడములో మీకు ఆయనపై విశ్వాసం లేదు, లేదా మీరు ఆయనను ప్రేమించరు. మరొక విధంగా చెప్పాలంటే, మీరు మీ స్వంత భావాలలోనుండి పుట్టుకు వచ్చిన స్పష్టతలేని దేవునిలో నిజమైన విశ్వాసాన్ని కలిగియున్నారు మరియు రాత్రి మరియు పగలు కొరకు మీరు కాంక్షించే దేవుణ్ణి మీరు నిజంగా ప్రేమిస్తున్నారు, అయినప్పటికీ, ఆయనను మీరు వ్యక్తిగతంగా ఎప్పుడూ చూడలేదు. ఈ క్రీస్తు పట్ల మీకున్న విశ్వాసం లేశమాత్రమైనది, మరియు ఆయనపట్ల మీకు ప్రేమే లేదు. విశ్వాసం అంటే నమ్మిక మరియు నమ్మకం అని అర్థం; ప్రేమ అంటే ఒకరి హృదయంలో ఆరాధన భావము కలిగియుండుట మరియు పొగడుట, ఎన్నడూ వీడకుండుట అని అర్థం. అయినప్పటికీ, నేడు క్రీస్తునందు మీరు ఉంచిన విశ్వాసం మరియు ఆయనపట్ల మీరు కలిగియున్న ప్రేమ పై చెప్పిన నిర్వచనానికి బహు దూరంగా ఉన్నాయి. విశ్వాసం విషయానికి వస్తే, ఆయనలో మీ విశ్వాసం ఎలా వుంది? ప్రేమ విషయానికొస్తే, మీరు ఏ విధంగా ఆయనను ప్రేమిస్తున్నారు? అయన యొక్క స్వభావమును మీరు అర్థం చేసుకోవడం లేదు, ఆయన గుణగణాలలో చాలా తక్కువ గుణగణాలను అర్థము చేసుకున్నారు కాబట్టి, అయనపట్ల మీరు విశ్వాసం ఎలా కలిగి వుంటారు? అయనపట్ల మీ విశ్వాసమునకు నిజతత్వం ఎక్కడ వుంది? ఆయన పట్ల మీకు ప్రేమ ఎలా ఉంటుంది? అయన పట్ల మీరు కలిగియున్న ప్రేమకు నిజతత్వం ఎక్కడ వుంది?

చాలా మంది ఈ రోజు వరకు వెనుకంజ వేయకుండ నన్ను అనుసరించారు. అందుచేత, గత చాలా సంవత్సరాలుగా మీరు ఎక్కువ అలసటను కూడా కలిగియున్నారు. మీలో ప్రతి ఒక్కరిలో ఉండే సహజ సిద్ధమైన ప్రవర్తన మరియు మరియు అలవాట్లను నేను ఎంతో స్పష్టంగా గ్రహించాను; మీలో ప్రతి ఒక్కరితో సంభాషించడం అనేది అత్యంత కష్టతరమైనది. జాలి పడాల్సిన విషయం ఏమిటంటే, నేను మిమ్మల్ని అంత ఎక్కువగా అర్ధం చేసుకున్నప్పటికీ, మీరు నన్ను ఎంతమాత్రమూ అర్ధం చేసుకోలేదు. మీరు తికమక పడిన సందర్భములో ఎవరో కుయుక్తికి పడిపోయారని ప్రజలు అనడంలో ఆశ్చర్యం లేదు. మీరు నా యొక్క స్వభావం గురించి ఏమీ అర్థం చేసుకోలేదు, నా మనస్సులో ఉన్నదానిని అంత లోతుగా అర్థం చేసుకోలేదు. ఈ రోజు, నా గురించి మీరు కలిగియున్న అపార్థాలు క్రమేపి పెరుగుతూ వచ్చాయి మరియు నాపై మీకున్న విశ్వాసం తికమకతో కూడిన విశ్వాసంగానే మిగిలిపోయింది. మీరు నాలో విశ్వాసం కలిగి ఉన్నారని చెప్పడానికి బదులుగా, మీరందరూ నాతో అనుకూలంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నారని మరియు నాపట్ల అభిమానాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పడం మరింత సముచితంగా ఉంటుంది. మీ ఉద్దేశాలు చాలా సాధారణమైనవి: నాకు ప్రతిఫలం ఇవ్వగలిగిన వారిని నేను అనుసరిస్తాను, మరియు గొప్ప విపత్తుల నుండి నన్ను కాపాడే దేదేవుడైనా, లేదా ఇతర దేవుడనబడిన వ్యక్తి ఎవరినైనా నేను నమ్ముతాను. వీటిలో దేనిని నేను పట్టించుకోను. మీలో ఇటువంటి మనుష్యులు చాల మంది వున్నారు మరియు ఈ స్థితి చాల తీవ్రమైనది. ఒక రోజు క్రీస్తు కలిగియున్న గుణగణాలనుబట్టి క్రిస్తునందు విశ్వాసము కలిగియున్నవారు మీలో ఎంతమంది ఉన్నారని మీకు పరీక్ష పెట్టినట్లయితే కనీసం ఒక్కరైనా కనిపిస్తారో లేదో అని నాకు ఎంతో భయంగా ఉంది. అందుచేత, ఈ ప్రశ్నను మీలో ప్రతి ఒక్కరూ పరిగణనలోకి తీసుకుంటే ఎవరూ బాధనొందరు: మీరు విశ్వసించే దేవుడు నాకు మిక్కిలి భిన్నంగా ఉన్నాడు మరియు ఇలా ఉన్నప్పుడు, దేవునిపై మీరు విశ్వాసము కలిగియుండడానికిగల ముఖ్యాంశము ఏమిటి? మీరు ఫలానా అని ఊహించుకుంటున్న దేవునిలో ఎంత ఎక్కువ నమ్మకము కలిగియుంటారో అంతే ఎక్కువగా నాకు దూరమైపోతారు. అయితే, అప్పుడు ఈ సమస్య యొక్క సారాంశం ఏమిటి? మీలో ఎవరు కూడా ఎప్పుడూ ఇలాంటి ఒక ప్రశ్నను పరిగణనలోకి తీసుకోలేదు, కానీ దాని యొక్క తీవ్రత మీకు అర్థమయ్యిందా? ఈ విధంగా విశ్వసించడం వలన కలిగే పరిణామాలను గురించి మీరు ఆలోచించారా?

ఈ రోజు, మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు, మరియు మీలో ఒక్కరు కూడా సమస్యను పరిష్కరించుకునే ప్రావీణ్యతను కలిగిలేరు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే, ఓడిపోయే వారు మీరే. సమస్యలను గుర్తించడం కొరకు నేను మీకు సహాయపడతాను, అయితే వాటిని పరిష్కరింకోవడం అనేది మీ మీదనే ఆధారపడి వుంది.

ఇతరులను అనుమానించని వ్యక్తులనుబట్టి నేను సంతోషిస్తాను మరియు సత్యమును వె౦టనే అ౦గీకరి౦చేవారిని నేను ఇష్టపడతాను; ఈ రెండు రకాల వ్యక్తుల పట్ల నేను చాలా శ్రద్ధ చూపిస్తాను, నా దృష్టిలో వారు యథార్థవంతులు. మీరు మోసగించేవారైతే, అప్పుడు మీరు ప్రజలందరిపట్ల మరియు అన్ని విషయాల పట్ల జాగరూకత కలిగి మరియు అనుమానాస్పదంగా ఉంటారు, తద్వారా నాయందు మీరు కలిగియున్న విశ్వాసం అనుమానాస్పద పునాదిపై నిర్మించబడుతుంది. అటువంటి విశ్వాసమును నేను ఎన్నటికీ గుర్తించలేను. నిజమైన విశ్వాస౦ కొరవడినప్పుడు, మీరు మరి ఎక్కువగా నిజమైన ప్రేమలేనివారుగా నిర్ధారించబడతారు. మరియు నువ్వు దేవుణ్ణి అవమానించే స్థితికి వచ్చి, ఆయనను గురించి ఇష్టానుసారముగా ఊహించు పరిస్థితికి వస్తే, అప్పుడు మీరు ఎటువంటి ప్రశ్నలేకుండా, ప్రజలందరిలోను అత్యంత మోసపూరితమైనవారు అవుతారు. దేవుడు మనిషిలా ఉండగలడా లేదా అని నువ్వు ఊహించుకుంటావు: క్షమించరాని పాపం కలిగివున్నవాడు, సంకుచిత స్వభావం, నిష్పక్షపాతం లేనివాడు మరియు గురిగమ్యం లేనివాడు, న్యాయమును గురించి అవగాహన లేనివాడు, దుర్మార్గపు వ్యూహాలకు పాల్పడేవాడు, విశ్వాసఘాతకుడు మరియు కుయుక్తిపరుడు, దుష్టత్వంతోనూ మరియు చీకటితోనూ సంతోషించేవాడు, మొదలైన లక్షణాలు కలిగిన మనిషివలె దేవుడు ఉంటాడేమోనని ఊహించుకుంటారు. మనుష్యులకు అటువంటి ఆలోచనలు రావటానికి, దేవుని గురించిన కొంచెం జ్ఞాన౦ కూడా లేకపోవటం అనేది కారణం కాదా? అటువంటి విశ్వాసం పాపం కంటే ఎంత మాత్రం తక్కువ కాదు! నన్ను సంతోషపరచి మరి ముఖ్యంగా నా ముఖ స్తుతి చేసి మరియు నా దయ కోసం అతి వినయాలు ప్రదర్శించాలని, అటువంటి నైపుణ్యాలు కలిగి లేకపోతే దేవుని ఇంట్లోకి స్వాగతించరని మరియు అక్కడ వారు తమ స్థానాన్ని కోల్పోతారని కొంత మంది నమ్ముతారు. ఇన్ని సంవత్సరాలుగా మీరు పొందుకున్న జ్ఞానము ఇదేనా? మీరు పొందుకున్నది ఇదేనా? మరియు నా విషయమై మీరు కలిగియున్న జ్ఞానము అపార్థములను కలిగియుండె ఈ స్థితిని ఆపదు; దేవుని ఆత్మకు మరియు పరలోకానికి విరుద్ధ౦గా మీరు దైవదూషణ చేయడ౦ అనేది దానికంటే చాలా ఘోరమైన విషయం. అందువల్లనే మీకున్నటువంటి ఆ విశ్వాసం మీరు నా నుండి మరింత ఎక్కువగా దూరమైపోవడానికి మరియు నాకు వ్యతిరేకంగా నిలబడడానికి కారణమవుతుందని నేను చెబుతున్నాను. అనేక సంవత్సరాలుగా జరుగుతూ వచ్చిన ల కార్యమంతటిలో మీరు అనేక సత్యములను చూశారు, కానీ నా చెవులు ఏమి విన్నాయో మీకు తెలుసా? మీలో ఎంతమంది సత్యమును అంగీకరించడానికి ఇష్టపడుచున్నారు? మీరందరు సత్యానికి మూల్యం చెల్లించడానికి ఇష్టపడుచున్నామని నమ్ముతారు, కానీ మీలో ఎంతమంది నిజంగా సత్యము కొరకు బాధపడ్డారు? మీ హృదయాలలో అవినీతి తప్ప మరేమీ లేదు, తద్వారా ప్రతి ఒక్కరూ, వారు ఎవరు అయినప్పటికీ అందరు మోసపూరితమైనవారని మరియు వంకర బుద్ధి ఉన్నవారని భావించేలా మ్మిమ్మల్ని తయారు చేస్తుంది, ఇంకా చెప్పాలంటే, దేవుడు దయా హృదయములేని, లేక ప్రేమా గుణములేని ఒక సాధారణ మనిషివలె శరీరధారిగా వస్తాడని నమ్మే స్థాయికి తీసుకు వస్తుంది. దానిక౦టే ఎక్కువగా, పరలోక౦లోని దేవునిలోనే ఉన్నత ప్రవర్తన, దయ, కనికరం అనే గుణగణాలు ఉ౦టాయని మీరు నమ్ముతారు. అటువంటి పరిశుద్ధుడు ఉనికిలోనే లేడని, కేవలం చీకటి మరియు దుష్టత్వం మాత్రమే భూమిపై పరిపాలిస్తాయని మీరు నమ్ముతారు, అయితే దేవుడు మంచివాడని మరియు అందమైనవాడని, మనుష్యులచే రూపొందించబడిన ఒక పౌరాణిక వ్యక్తిలా ఉంటాడని భావిస్తారు. పరలోకమునందు ఉన్నటువంటి దేవుడు చాలా గౌరవించదగిన వ్యక్తియని, నీతిమంతుడు మరియు గొప్పవాడని, ఆరాధనకు మరియు ప్రశంసలకు యోగ్యుడని మీ మనస్సులలో పెట్టుకున్నారు; ఇలాంటప్పుడు ఈ భూమిపై ఉన్నటువంటి ఇలాంటి దేవుడు పరలోకమందున్న దేవునికి ఒక ప్రత్యమ్నాయం మరియు ఆయన చేతిలో ఒక సాధనము మాత్రమే అని మీరు భావిస్తారు. ఈ దేవుడు పరలోకమునందు వున్న దేవునితో సమానం కాడని, కనీసం పరలోకమందున్న దేవునివలె ప్రస్తావించబడలేదు. దేవుని యొక్క గొప్పతనం మరియు ఘనతల విషయానికొస్తే, అవి పరలోకమందున్న దేవుని మహిమకే చెందుతాయి, మనిషి యొక్క స్వభావం మరియు భ్రష్టత్వ విషయానికి వస్తే, అవి భూమిపై ఉన్నటువంటి దేవుని లక్షణాల్లో భాగమై ఉంటాయి. పరలోక౦లో ఉన్న దేవుడు నిత్య౦ ఉన్నతమైనవాడు, భూమి మీద వున్న దేవుడు ఎప్పటికీ అల్పమైనవాడు, బలహీనుడు మరియు అసమర్థుడు. పరలోక౦లో ఉన్న దేవుడు భావోద్వేగాలకు గురవ్వడు, కేవలము నీతిని మాత్రమే కలిగియుంటాడు, అయితే భూమి వున్న దేవునికి నీతి న్యాయాలు లేకుండ స్వార్థపూరిత ఉద్దేశాలు మాత్రమే ఉంటాయి. పరలోక౦లో ఉన్న దేవునికి చిన్నపాటి వంకర బుద్ధి ఉ౦డదు మరియు ఆయన ఎల్లప్పుడూ నమ్మదగినవాడుగా ఉంటాడు. అయితే, భూమి మీద ఉండే దేవునికి ఎల్లప్పుడూ నీతి నిజాయితీ లేనివాడు. పరలోకమందున్న దేవుడు మనిషిని ప్రియముగా ప్రేమిస్తాడు, అదే భూమి మీద వున్న దేవుడు మనిషిపై చాలా తక్కువ శ్రద్ధను చూపిస్తాడు మరియు పూర్తిగా నిర్లక్ష్యం కూడా చేస్తాడు. ఇలాంటి తప్పుడు జ్ఞానం మీ హృదయాలలో చాలా కాలంగా ఉండిపోయింది మరియు భవిష్యత్తులోను కూడా శాశ్వతంగా ఉండిపోతుందేమో. క్రీస్తు జరిగించిన క్రియలను, ఆయన జరిగించిన కార్యమనంతటిని మీరు అవినీతి దృక్పథం నుండి చూసి, వాటిని అంచనా వేస్తారు. అలాగే ఆయనకున్న గుర్తింపును మరియు ఆయనకున్న గుణగణాలను దుష్ట సంబంధమైన దృష్టికోణము నుండి చూసి, వాటిని అంచనా వేస్తుంటారు. మీకు ముందుగా వచ్చినటువంటి వారు సహితము చేయనటువంటి ఘోరమైన తప్పును మీరు చేశారు. అంటే, అయన తలపై కీరిటం పెట్టుకున్న ఉన్నతమైన దేవుణ్ణి మాత్రమే మీరు సేవిస్తారు మరియు ప్రాముఖ్యతలేని మరియు మీకు కనిపించని దేవుణ్ణి మీరు ఎప్పుడూ లక్ష్య పెట్టరు. ఇది మీ పాపం కాదా? మీరు దేవుని స్వభావానికి వ్యతిరేక౦గా చేసిన నేరానికి ఇది ఒక చక్కని ఉదాహరణ కాదా? మీరు పరలోకంలో వున్న దేవుణ్ణి ఆరాధిస్తారు. మీరు ఉన్నతమైన చిత్రాలను ఆరాధిస్తారు మరియు వాగ్ధాటితో విశిష్టమైన మాటలను పలికే వారిని గౌరవిస్తారు. మీ యొక్క చేతులను సంపదలతో నింపే దేవుని ద్వారా సంతోషంగా ఆదేశించబడాలనుకుంటారు మరియు మీ యొక్క ప్రతి కోరికను తీర్చగలిగిన దేవుని కొరకు ఆరాట పడతారు. ఉన్నతంగా లేనటువంటి ఈ దేవుణ్ణి మీరు ఆరాధించరు; ఏ మనుష్యుని ద్వారా ఘనతపొందని ఈ దేవునితో సహవాసం చేయడాన్ని మీరు ద్వేషిస్తారు. మీకు ఒక్క పైసా కూడా ఇవ్వని ఈ దేవునికి సేవ చేయడం మాత్రం మీకు ఇష్టముండదు, మరియు తన కొరకు మిమ్మల్ని ఆరాటపడేవిధంగా చేయలేనివాడు ఈ ప్రేమలేని ఈ దేవుడు. ఈ దేవుడు మీ సరిహద్దులను విస్తరింపజేసుకోవడానికి మిమ్మల్ని బలపరచడు, మీరు ఒక నిధిని కనుగొన్నట్లు భావించడానికి కూడా అవకాశమివ్వడు, మీరు ఆశించవాటిని కుడా చాలా తక్కువగా నెరవేరుస్తాడు. ఇలాగున్నప్పుడు, ఎందుకు మీరు ఆయనను అనుసరిస్తారు? ఇలాంటి ప్రశ్నల గురించి ఎప్పుడైనా ఆలోచించారా? మీరు చేసేది ఏదీ ఈ క్రీస్తును బాధించదు; మరీ ముఖ్యంగా, అది పరలోక౦లో ఉన్న దేవుణ్ణి బాధిస్తు౦ది. దేవునిపై మీకున్న విశ్వాసం యొక్క ఉద్దేశ్యం ఇది కాదని నేను అనుకుంటున్నాను!

దేవుడు మీయందు ఆన౦ది౦చాలని మీరు ఆశిస్తున్నారు, అయినప్పటికీ మీరు దేవునికి దూర౦గా ఉన్నారు. ఇక్కడ విషయం ఏమిటి? మీరు ఆయన మాటలను మాత్రమే అంగీకరిస్తారు, కానీ ఆయనయందు సంపూర్ణమైన విశ్వాసము కలిగియుండడానికి ఆయన వ్యవహరించే తీరును, ఆయన దిద్దుబాటును, ఆయన నిర్వహించు ప్రతి కార్య నిర్వహణను మీరు అంగీకరించడం లేదు. మీరు అతని ప్రతి ఏర్పాటును అంగీకరించగలరు. అయితే, ఇక్కడ విషయం ఏమిటి? చివరి విశ్లేషణలో, మీ విశ్వాసం అనేది ఎప్పటికి కోడిపిల్లను ఉత్పత్తి చెయ్యలేని ఖాళీ గుడ్డు పెంకు లాంటిది. మీరు కలిగియున్న విశ్వాసము మీకు సత్యము గాని, జీవము గాని ఇవ్వలేదు కానీ దానికి బదులుగా మీకు జీవనాధారం మరియు నిరీక్షణ యొక్క భ్రాంతికరమైన భావాన్ని ఇచ్చింది. మీరు దేవునిలో నమ్మకముంచడానికిగల ఉద్దేశ్యం ఈ జీవనాధార భావన మరియు నిరీక్షణయే కాని సత్యము మరియు జీవము కాదు. తద్వారా నేను చెప్పేదేమిటంటే, దేవునిలో మీరు కలిగియున్న విశ్వాస క్రమం అనేది దాస్యం మరియు సిగ్గులేనితనం అనే వాటి ద్వారా దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, మరియు దీనిని ఏ విధంగాను నిజమైన విశ్వాసంగా భావించలేము. ఇటువంటి విశ్వాసం ద్వారా కోడి పిల్ల ఏ విధంగా పుట్టగలదు? ఇంకొక మాటలో చెప్పాలంటే, ఇటువంటి విశ్వాసం అనేది ఏమి సాధించగలదు? మీ స్వంత లక్ష్యాలను సాధించడం కొరకు ఆయనను ఉపయోగించడమే దేవునిపై మీ విశ్వాసం యొక్క ఉద్దేశ్యం అవుతుంది. దేవుని యొక్క స్వభావానికి వ్యతిరేకంగా మీరు చేసిన నేరానికి ఇది మరింత వాస్తవం కాదా? మీరు పరలోకంలో వున్న దేవుని యొక్క ఉనికిని విశ్వసిస్తారు మరియు ఈ భూమిపై వున్న దేవుని నిరాకరిస్తారు, అయినప్పటికీ, నేను మీ యొక్క దృష్టికోణాలను గుర్తించను; ఈ భూమి మీద తమ పాదాలను ఉంచి, భూమిపై ఉన్న దేవునికి సేవ చేసే వారిని మాత్రమే నేను ప్రశంసిస్తాను, కానీ భూమిపై ఉన్న క్రీస్తును ఎన్నడూ అంగీకరించని వారిని నేను ఎన్నడూ ప్రశంసించను. అలాంటి వారు పరలోక౦లో ఉన్నటువంటి దేవునికి ఎ౦త నమ్మక౦గా ఉన్నా, చివరలో, దుష్టులను శిక్షి౦చే నా చేతి ను౦డి వారు తప్పి౦చుకోలేరు. ఈ మనుష్యులందరూ దుష్టులైయున్నారు; వారు దేవుని వ్యతిరేకించిన దుష్టులు మరియు ఎప్పుడూ ఆనందముతో దేవునిపట్ల విధేయత చూపలేదు. అవును, క్రీస్తు తెలియని వారిలో మరియు ఇంకను ఆయనను అంగీకరించని వారిలో వీరి సంఖ్య కలిసి వుంది. మీరు పరలోక౦లో ఉన్న దేవునిపట్ల నమ్మక౦గా ఉ౦డగలిగిన౦తకాల౦, క్రీస్తు పట్ల మీకు ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తి౦చగలరని మీరు నమ్ముతున్నారా? తప్పు! మీరు క్రీస్తును నిర్లక్ష్యం చేస్తే పరలోకమందున్న తండ్రిని కూడా నిర్లక్ష్యం చేసినట్లే. మీరు పరలోక౦లో ఉన్న దేవుని పట్ల ఎ౦త నమ్మక౦గా ఉన్నా, అది కేవల౦ వట్టి మాటలు, నటన మాత్రమే, ఎ౦దుక౦టే భూమి మీద ఉన్నటువంటి దేవుడు కేవలం మనుష్యుడు సత్యాన్ని కలిగిఉండుటకు మరియు మరి౦త లోతైన జ్ఞానాన్ని గడించడానికి మాత్రమే కాదు, అ౦తక౦టే ఎక్కువగా మనుష్యుని ఖ౦డి౦చడ౦లో, ఆ తర్వాత దుష్టులను శిక్షి౦చడానికి వాస్తవాలను గ్రహి౦చడ౦లో కీలకపాత్ర వహించడానికి కూడా. ఇక్కడ ప్రయోజనకరమైన మరియు హానికరమైన ఫలితాలను మీరు అర్థం చేసుకున్నారా? మీరు వాటిని అనుభవించారా? ఒక రోజున మీరు తప్పకుండ ఈ సత్యమును అర్ధం చేసుకోవాలని నా కోరుకొనుచున్నాను; దేవుని తెలుసుకోవటానికి, మీరు తప్పనిసరిగా పరలోకంలో వున్న దేవుణ్ణి మాత్రమే తెలుసుకోవడం కాదు కాని, దానికంటే కూడా ముఖ్యంగా, భూమి మీద వున్న దేవుణ్ణి తెలుసుకోవాలి. మీ యొక్క ప్రాధాన్యతలను అయోమయానికి గురిచేయవద్దు లేదా ప్రధానమైనదానిని మార్పు చేసుకోవడానికి వేరొక ఆలోచనను అనుమతించవద్దు. ఈ విధ౦గా మాత్రమే మీరు దేవునితో మ౦చి స౦బ౦ధాన్ని నిర్మించుకోగలుగుతారు, దేవునికి సన్నిహిత౦గా అవుతారు, మీ హృదయాన్ని ఆయనకు దగ్గరిగా తీసుకువెళ్ళగలుగుతారు. మీరు చాలా సంవత్సరాలుగా విశ్వాసంతో ఉండి మరియు నాతో చాలా కాలంగా సంబంధం కలిగి ఉండి, ఇంకనూ నాకు దూరంగా ఉంటే, అప్పుడు మీరు తరచుగా దేవుని స్వభావానికి విరుద్ధంగా నడిచి ఆయనను బాధపరచినవారవుతారు మరియు మీ యొక్క అంతమును ఊహించలేనంత కష్టతరం అవుతుంది అని నేను చెబుతున్నాను. నాతో అనేక సంవత్సరాలు కలిగివున్న అనుబంధం మిమ్మల్ని మానవులిగాను మరియు సత్యమును కలిగివున్న వ్యక్తిగా మార్చడంలో విఫలమైతే, మీ యొక్క చెడ్డ మార్గాలను మీ స్వభావంలోకి తీసుకువచ్చినట్లయితే, అప్పుడు మీరు ఇంతకు ముందు కంటే రెట్టింపు అహంకారాన్ని కలిగి ఉండటమే కాక, నా పట్ల మీకున్న అపార్థాలు కూడా పెరిగిపోయాయని, మీరు నన్ను మీ చిన్న సన్నిహితుడుగా పరిగణించారని అర్థం, అప్పుడు మీకున్న రోగం కేవలం చర్మపు లోతుల్లోనికే కాకుండా మీ ఎముకల వరకు చొచ్చుకుపోయిందని నేను చెబుతున్నాను. మీకు ఇంకా మిగిలి వున్నది అంతా ఏమిటంటే, మీ యొక్క అంత్యక్రియల ఏర్పాట్లు జరిగేవరకు వేచివుండటమే. అప్పుడు మీరు, మీ దేవుడిగా ఉండటానికి నన్ను ప్రాధేయపడాల్సిన అవసరం లేదు, ఎ౦దుక౦టే మీరు మరణానికి అర్హమైనటువంటి పాపమును చేశారు, అది క్షమించరాని పాప౦. నేను మీ మీద దయ చూపించినప్పటికీ, పరలోక౦లో ఉన్న దేవుడు మీ యొక్క జీవమును తీసివేయుము అని పట్టుబడతారు, ఎ౦దుక౦టే, దేవుని స్వభావానికి విరుద్ధ౦గా మీరు చేసినటువంటి అపరాధ౦ సాధారణమైన సమస్య కాదు, కానీ ఒక భయంకరమైన స్వభావం. సమయం వచ్చినప్పుడు, నేను ముందుగానే చెప్పలేదని నన్ను నిందించవద్దు. ఇదంతయు తిరిగి ఈ విషయానికి వస్తుంది: సాధారణ మనిషిగా భూమి మీద ఉన్న దేవుడైన క్రీస్తుతో మీరు సంబంధం కలిగి ఉన్నప్పుడు, అంటే, ఈ దేవుడు ఒక మనిషే గానీ మరేమీ కాదని మీరు విశ్వసించినప్పుడు, మీరు నశిస్తారు. ఇది మీ అందరికీ నేను ఇచ్చే ఏకైక మందలింపు.

మునుపటి:  దేవుని స్వభావమును అర్థం చేసుకోవడం చాలా ప్రాముఖ్యం

తరువాత:  చాలా తీవ్రమైన సమస్య: ద్రోహం (1)

సెట్టింగులు

  • వచనం
  • థీమ్స్

ఘన రంగులు

థీమ్స్

అక్షరశైలి

అక్షరశైలి పరిమాణం

గీతల మధ్య దూరం

గీతల మధ్య దూరం

పేజీ వెడల్పు

విషయ సూచిక

శోధించండి

  • ఈ వచనాన్ని శోధించండి
  • ఈ పుస్తకాన్ని శోధించండి

Connect with us on Messenger