బైబిల్ పరిచయం (3)
బైబిల్‌లోని ప్రతిదీ స్వయంగా దేవుడు చెప్పిన మాటల నమోదు కాదు. బైబిల్ కేవలం దేవుని కార్యపు మునుపటి రెండు దశలను దస్తావేజు చేస్తుంది, అందులో ఒక భాగం ప్రవక్తల భవిష్యవాణికి సంబంధించిన నమోదు కాగా, మరొక భాగం కాలాల తరబడి దేవుడు ఉపయోగించుకున్న వ్యక్తులు రాసిన వారి అనుభవాలు మరియు జ్ఞానానికి సంబంధించినది. మానవ అనుభవాలు అనేవి మనిషి అభిప్రాయాలు మరియు జ్ఞానంతో కలుషితమై ఉంటాయి, ఇది ఏవిధంగానూ తప్పించుకోలేని పరిస్థితి. బైబిల్‌లోని అనేక గ్రంథాలలో మానవుని ఉద్దేశాలు, మానవుని పక్షపాత అభిప్రాయాలు మరియు మానవుల అర్థహీనమైన అవగాహన ఉంటాయి. నిజానికి, అత్యధిక పదాలు పరిశుద్ధాత్మ జ్ఞానోదయం మరియు వెలిగింపు ఫలితంగా ఉత్పన్నమైనవి, అవి సరైన అవగాహనలే అయినప్పటికీ, అవి పూర్తిగా సత్యం యొక్క ఖచ్చితమైన వ్యక్తీకరణలే అని ఇప్పటికీ చెప్పలేము. కొన్ని విషయాలపై వారి అభిప్రాయాలు వ్యక్తిగత అనుభవం నుండి పొందిన జ్ఞానం లేదా పరిశుద్ధాత్మ జ్ఞానోదయం తప్ప మరేమీ కాదు. ప్రవక్తల భవిష్యవాణులు స్వయంగా దేవునిచే బోధించబడినవి: యెషయా, దానియేలు, ఎజ్రా, యిర్మీయా మరియు యెహెజ్కేలు వంటి వారి భవిష్యవాణులు పరిశుద్ధాత్మ ప్రత్యక్ష బోధన నుండి వచ్చాయి; ఈ వ్యక్తులు జ్ఞానదృష్టి కలవారు, వారు భవిష్యవాణి చెప్పే ఆత్మ స్పృహను పొందారు మరియు వారందరూ పాత నిబంధనలోని ప్రవక్తలు. ధర్మశాస్త్ర యుగములో యెహోవా ప్రేరణలతో ఈ వ్యక్తులు అనేక భవిష్యవాణులు చెప్పారు, అవన్నీ నేరుగా యెహోవా బోధించినవే. మరి యెహోవా వారిలో ఎందుకు పనిచేశాడు? ఎందుకంటే, ఇశ్రాయేలు ప్రజలు దేవుడు ఎంచుకున్న ప్రజలు కాబట్టి, మరియు ప్రవక్తల కార్యము వారి మధ్యలో జరగాలి కాబట్టి; అందుచేతనే ప్రవక్తలు అలాంటి ప్రకటనలను పొందగలిగారు. వాస్తవానికి, వారికి దేవుడు బోధించిన ప్రకటనలను వారే స్వయంగా అర్థం చేసుకోలేదు. భవిష్యత్తులోని ప్రజలు వాటిని అవగాహన చేసుకోగలిగేలా మరియు అవి నిజంగా దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ కార్యమేననీ మరియు మానవుని నుండి వచ్చినవి కావనీ చూడటానికి మరియు పరిశుద్ధాత్మ కార్యమేనని వారికి ధృవీకరించడానికి పరిశుద్ధాత్మ ఆ మాటలను వారి నోటి ద్వారా పలికాడు. కృపా యుగములో, వారి బదులు ఈ కార్యాన్నంతా యేసు స్వయంగా తానే చేశాడు, కాబట్టి వ్యక్తులు ఇకపై భవిష్యవాణి చెప్పలేదు. కాబట్టి యేసు ఒక ప్రవక్తా? అవును, యేసు ఒక ప్రవక్తే, కానీ ఆయన అపొస్తలుల కార్యాన్ని కూడా చేయగలిగాడు—ఆయన భవిష్యవాణి చెప్పడం మరియు విశ్వమంతా ఉన్న ప్రజలకు ఉపదేశించడం మరియు బోధించడం రెండూ చేయగలడు. అయినప్పటికీ, ఆయన చేసిన కార్యము మరియు ఆయన ప్రాతినిధ్యం వహించిన గుర్తింపు ఒక్కటే కాదు. ఆయన సమస్త మానవాళికి విమోచన కలిగించడానికి, మనిషికి పాపము నుండి విమోచన కలిగించడానికి వచ్చాడు; ఆయన ఒక ప్రవక్త మరియు ఒక అపొస్తలుడు, కానీ అంతకు మించి ఆయన క్రీస్తు. ఒక ప్రవక్త భవిష్యవాణి చెప్పవచ్చు, కానీ అలాంటి ప్రవక్తను క్రీస్తు అని చెప్పలేము. ఆ కాలములో, యేసు ఎంతో భవిష్యవాణి చెప్పాడు, కాబట్టి ఆయనను ఒక ప్రవక్త అని చెప్పవచ్చు, కానీ ఆయన ప్రవక్త కాబట్టి క్రీస్తు కాదు అని చెప్పలేము. ఎందుకంటే ఆయన కార్యపు ఒక దశను కొనసాగించడంలో స్వయంగా దేవుడికి ప్రాతినిధ్యం వహించాడు మరియు ఆయన గుర్తింపు యెషయాకు భిన్నమైనది: ఆయన విమోచన కార్యాన్ని పూర్తి చేయడానికి వచ్చాడు మరియు ఆయన మనిషికి జీవితాన్ని కూడా అందించాడు మరియు దేవుని ఆత్మ నేరుగా ఆయనలోకి వచ్చింది. ఆయన చేసిన కార్యములో, దేవుని ఆత్మ నుండి ప్రేరణలు లేదా యెహోవా నుండి నిర్దేశాలు లేవు. దానికి బదులుగా, ఆత్మే నేరుగా పనిచేసింది—యేసు ఒక ప్రవక్తకు సమానం కాదని నిరూపించడానికి ఇది సరిపోతుంది. ఆయన చేసిన కార్యము విమోచన కార్యము, దాని తర్వాతే భవిష్యవాణి చెప్పడం వచ్చింది. ఆయన ఒక ప్రవక్త, ఒక అపొస్తలుడు, కానీ అంతకు మించి ఆయన విమోచకుడు. అదే సమయంలో, భవిష్యవాణి చెప్పేవారు భవిష్యవాణి మాత్రమే చెప్పగలిగారు, వారు మరేదైనా ఇతర కార్యము చేయడంలో దేవుని ఆత్మకు ప్రాతినిధ్యం వహించలేకపోయారు. మానవుడు ఇంతకు ముందెన్నడూ చేయని కార్యాన్ని యేసు చేశాడు మరియు మానవాళికి విమోచన కలిగించే కార్యాన్ని చేశాడు కాబట్టి, ఆయన యెషయా లాంటి వారికి భిన్నమైనవాడు. కొంతమంది ఈనాటి ప్రవాహాన్ని అంగీకరించరు, ఎందుకంటే ఇది వారికి అడ్డంకిని సృష్టించింది. వారు ఇలా అంటారు: “పాత నిబంధనలో అనేకమంది ప్రవక్తలు కూడా అనేక మాటలు చెప్పారు—కాబట్టి వారు ఎందుకు దేహధారియైన దేవుడు కాదు? ఈనాటి దేవుడు వాక్యములు చెబుతాడు—ఆయన దేవుని అవతారమని రుజువు చేయడానికి అది సరిపోదా? నీవు బైబిల్‌ను ప్రశంసించవు, నీవు దానిని చదవనే చదవవు—అలాంటప్పుడు ఆయన దేవుని అవతారమని చెప్పడానికి నీకు ఏ ఆధారం ఉంది? వారు పరిశుద్ధాత్మచే నిర్దేశించబడ్డారని నీవు అంటావు, మరియు కార్యపు ఈ దశ స్వయంగా దేవుడు చేసిన కార్యమని నీవు నమ్ముతావు—అయితే దీనికి నీ వద్ద ఉన్న ఆధారం ఏమిటి? నీవు ఈరోజు దేవుని వాక్యములపై దృష్టిని కేంద్రీకరిస్తావు మరియు నీవు బైబిల్‌ను తిరస్కరించినట్లు, దానిని పక్కన పెట్టినట్లు అనిపిస్తుంది.” కాబట్టి నీవు నాస్తికత్వాన్ని మరియు మతవిరుద్ధతను విశ్వసిస్తున్నావని వారు అంటారు.
అంత్యకాలములో దేవుని కార్యానికి నీవు సాక్ష్యమివ్వాలనుకుంటే, నీవు బైబిల్ అంతర్గత కథను, బైబిల్ స్వరూపాన్ని మరియు బైబిల్ సారాంశాన్ని తప్పక అర్థం చేసుకోవాలి. ఈనాడు, బైబిలే దేవుడని మరియు దేవుడే బైబిల్ అని ప్రజలు నమ్ముతారు. అదేవిధంగా, బైబిల్‌లోని వాక్యములన్నీ దేవుడు మాట్లాడినవేననీ, అవన్నీ దేవుడే చెప్పాడని కూడా వారు నమ్ముతారు. పాత మరియు కొత్త నిబంధనలోని అరవై-ఆరు గ్రంథాలన్నీ మనుష్యులచే రాయబడినప్పటికీ, అవన్నీ దేవుని ప్రేరణతో మరియు పరిశుద్ధాత్మ పలికిన మాటల నమోదని కూడా దేవుడిని విశ్వసించే వారు అనుకుంటారు. ఇది మానవుని తప్పుడు అవగాహన, ఇది పూర్తిగా వాస్తవాలకు అనుగుణంగా లేదు. నిజానికి, భవిష్యవాణి గ్రంథాలే కాకుండా, పాత నిబంధనలోని చాలా భాగం ఒక చారిత్రక నమోదు మాత్రమే. కొత్త నిబంధనలోని కొన్ని లేఖలు వ్యక్తుల అనుభవాల నుండి వచ్చాయి మరికొన్ని పరిశుద్ధాత్మ జ్ఞానోదయం నుండి వచ్చాయి; ఉదాహరణకు, పౌలు లేఖలు ఒక వ్యక్తి కార్యము నుండి ఉద్భవించాయి, అవన్నీ పరిశుద్ధాత్మ జ్ఞానోదయ ఫలితమే, అవి చర్చిల కోసం రాయబడ్డాయి మరియు అవి చర్చిలలోని సోదరసోదరీమణులకు ప్రేరేపణ మరియు ప్రోత్సాహం అందించే వాక్యములు. అవి పరిశుద్ధాత్మ మాట్లాడిన మాటలు కాదు—పౌలు పరిశుద్ధాత్మ తరపున మాట్లాడలేకపోయాడు, అంతేకాకుండా ఆయన ప్రవక్త కూడా కాదు, యోహాను చూసిన దర్శనాల కన్నా చాలా తక్కువ దర్శనాలనే ఆయన చూశాడు. ఆయన లేఖలు ఎఫెసస్, కొరింథీ, గలాటియా మరియు ఇతర చర్చిల కోసం రాయబడ్డాయి. అందుచేత, కొత్త నిబంధనలోని పౌలు లేఖలు చర్చిల కోసం పౌలు ద్వారా రాయబడినవి, అవి పరిశుద్ధాత్మ నుండి వచ్చిన ప్రేరణలు కావు, అలాగే అవి పరిశుద్దాత్మ ప్రత్యక్షంగా పలికిన పలుకులు కావు. ఆయన వాటిని తన కార్యము చేసే క్రమంలో చర్చిల కోసం రాసిన ఉద్బోధ, ఓదార్పు మరియు ప్రోత్సాహక పదాలు మాత్రమే. అదేవిధంగా, అవన్నీ ఆ కాలములో పౌలు చేసిన చాలా పనుల గురించిన నమోదు కూడా. ఆ కాలములోని చర్చి సోదరసోదరీమణులు ఆయన సలహాను అనుసరించడానికి, ప్రభువును సేవించే సోదరసోదరీమణులందరూ ప్రభువైన యేసు పశ్చాత్తాప మార్గానికి కట్టుబడి ఉండేలా చేయడానికి అవి రాయబడ్డాయి. ఆ కాలంలోని చర్చిలైనా, భవిష్యత్తులోని చర్చిలైనా, తాను రాసిన వాటినే అందరూ తిని, తాగాలని పౌలు ఏరకంగానూ చెప్పలేదు, అలాగే ఆయన మాటలన్నీ దేవుని నుండే వచ్చాయని కూడా ఆయన చెప్పలేదు. ఆ కాలపు చర్చి పరిస్థితులనుసరించి, ఆయన సోదరసోదరీమణులకు తెలియజేసాడు, వారికి కేవలం ఉద్బోధించాడు మరియు వారిలో నమ్మకాన్ని ప్రేరేపించాడు మరియు ఆయన కేవలం ప్రజలకు బోధించాడు లేదా గుర్తుచేసాడు మరియు వారికి ఉద్బోధించాడు. ఆయన మాటలు ఆయన సొంత భారం మీద ఆధారపడ్డాయి మరియు ఆయన ఈ మాటల ద్వారా ప్రజలకు సహాయపడ్డాడు. ఆయన ఆ కాలపు చర్చిల అపొస్తలడు చేసే పని చేశాడు, ఆయన యేసు ప్రభువు ఉపయోగించుకున్న ఒక కార్యకర్త, కాబట్టి ఆయన తప్పక చర్చిల బాధ్యత తీసుకోవాలి మరియు తప్పక చర్చిల పనిని చేపట్టాలి, ఆయన సోదరసోదరీమణుల స్థితిని గురించి తెలుసుకోవాల్సి వచ్చింది—ఈ కారణంగా, ఆయన ప్రభువును సేవించే సోదరసోదరీమణులందరి కోసం లేఖలు రాశాడు. ఆయన ప్రజలకు చెప్పిన మెరుగుపరిచే మరియు సానుకూలమైనదంతా సరైనదే, కానీ అది పరిశుద్ధాత్మ పలుకులకు ప్రాతినిధ్యం వహించలేదు మరియు అది దేవునికి ప్రాతినిధ్యం వహించలేకపోయింది. ఒక మనిషి అనుభవాల నమోదులను మరియు ఒక వ్యక్తి లేఖలను చర్చిల కోసం పరిశుద్ధాత్మ చెప్పిన మాటలుగా ప్రజలు భావించడం చాలా తప్పుడు అవగాహన మరియు ఘోరమైన దైవదూషణ! పౌలు చర్చిల కోసం రాసిన లేఖల విషయానికి వస్తే, ఇది ప్రత్యేకించి వాస్తవం, ఎందుకంటే ఆయన లేఖలు ఆ కాలములోని ప్రతి చర్చి పరిస్థితులు మరియు స్థితిపై ఆధారపడి, సోదరసోదరీమణుల కోసం రాయబడ్డాయి మరియు సోదరసోదరీమణులు ప్రభువైన యేసు కృపను పొందగలిగేలా వారికి ప్రభువు గురించి ఉద్బోధించే క్రమంలో రాయబడ్డాయి. ఆయన లేఖలు ఆకాలపు సోదరసోదరీమణులలో ఉత్సాహాన్ని రేకెత్తించడానికి ఉద్దేశించబడ్డాయి. దీన్ని ఆయన సొంత భారమని మరియు పరిశుద్ధాత్మ ఆయనకిచ్చిన భారమని కూడా చెప్పవచ్చు; అన్నింటినీ మించి, ఆయన ఆ కాలంలో చర్చిలకు మార్గదర్శనం చేసిన అపొస్తలుడు, ఆయన చర్చిలకు లేఖలు రాసి వాటిని ప్రోత్సహించాడు—అది అప్పటి ఆయన బాధ్యత. ఆయన గుర్తింపు కేవలం ఒక కార్యకర్త అయిన అపొస్తలుడిది మరియు ఆయన కేవలం దేవుడు పంపిన అపొస్తలుడు మాత్రమే; ఆయన ప్రవక్త కాదు, భవిష్యవాణి చెప్పేవాడు కాదు. ఆయనకు, ఆయన సొంత పని మరియు సోదరసోదరీమణుల జీవితాలే అత్యంత ముఖ్యమైనవి. కాబట్టి, ఆయన పరిశుద్ధాత్మ తరపున మాట్లాడలేకపోయాడు. ఆయన మాటలు పరిశుద్ధాత్మ చెప్పిన మాటలు కావు, అవి దేవుని మాటలని కూడా చెప్పలేము, ఎందుకంటే దేవుడు సృష్టించిన ఒక జీవి కంటే పౌలు ఎక్కువేమీ కాదు మరియు నిశ్చితంగా దేవుని అవతారం కాదు. ఆయన గుర్తింపు యేసు గుర్తింపుతో సమానం కాదు. యేసు చెప్పిన మాటలు పరిశుద్ధాత్మ మాటలే, అవి దేవుని మాటలు, ఎందుకంటే ఆయన గుర్తింపు దైవకుమారుడైన క్రీస్తు గుర్తింపు. పౌలు ఆయనకు సమానం ఎలా కాగలడు? పౌలు లేఖలు లేదా మాటలు లాంటి వాటిని పరిశుద్ధాత్మ పలికిన పలుకులుగా ప్రజలు చూస్తే, వాటిని దేవుడిగా ఆరాధిస్తే, అప్పుడు వారిని మరీ ఎక్కువ విచక్షణారహితమైన వారని మాత్రమే చెప్పవచ్చు. మరీ కఠినంగా మాట్లాడాల్సి వస్తే, ఇదంతా దైవదూషణ కాదా? ఒక మానవుడు దేవుని తరపున ఎలా మాట్లాడగలడు? ఆయన లేఖల నమోదులు మరియు ఆయన మాట్లాడిన మాటలను పవిత్ర గ్రంథం లేదా పరలోక గ్రంథంలాగా భావించి వాటి ముందు ప్రజలు ఎలా మోకరిల్లగలరు? దేవుని మాటలను ఒక మానవుడు మామూలుగా పలుకగలడా? ఒక మానవుడు దేవుని తరపున ఎలా మాట్లాడగలడు? కాబట్టి, నీవు చెప్పేదాని అర్థం—చర్చిల కోసం ఆయన రాసిన లేఖలు ఆయన సొంత ఆలోచనలతో కలుషితం కాలేదనా? అవి మానవుని ఆలోచనలతో కలుషితం కాకుండా ఎలా ఉండగలవు? ఆయన తన సొంత అనుభవాలు మరియు తన సొంత జ్ఞానంపై ఆధారపడి చర్చిల కోసం లేఖలు రాశాడు. ఉదాహరణకు, పౌలు ఒక నిర్దిష్ట అభిప్రాయంతో కూడిన లేఖను గలాటియా చర్చిల కోసం రాశాడు, అదే పేతురు మరో అభిప్రాయం ఉన్న లేఖను రాశాడు. వీటిలో ఏది పరిశుద్ధాత్మ నుండి వచ్చింది? ఎవరూ కూడా ఖచ్చితంగా చెప్పలేరు. కాబట్టి, వారిరువురూ చర్చిల కోసం భారాన్ని మోశారని మాత్రమే చెప్పవచ్చు, అయినప్పటికీ వారి లేఖలు వారి స్థాయిని సూచిస్తాయి, అవి సోదరసోదరీమణుల కోసం వారి ఏర్పాటు మరియు తోడ్పాటును, చర్చిల పట్ల వారి భారాన్ని సూచిస్తాయి మరియు అవి మానవుల పనిని మాత్రమే సూచిస్తాయి—వారు సంపూర్ణంగా పరిశుద్ధాత్మకు సంబంధించినవారు కాదు. నీవు ఆయన లేఖలను పరిశుద్ధాత్మ మాటలని చెబితే, నీవు చెప్పేది అర్థరహితం అవుతుంది మరియు నీవు దైవదూషణకు పాల్పడినట్లు అవుతుంది! కొత్త నిబంధనలోని పౌలు లేఖలు మరియు ఇతర లేఖలు అతి ఇటీవలి ఆధ్యాత్మిక వ్యక్తుల జ్ఞాపకాలకు సమానం: అవి వాచ్‌మెన్ నీ గ్రంథాలు లేదా లారెన్స్ అనుభవాలు మొదలైన వాటికి సమానం. ఇటీవలి ఆధ్యాత్మిక వ్యక్తుల గ్రంథాలు కొత్త నిబంధనలో కూర్పు చేయబడలేదు, అయినప్పటికీ ఈ వ్యక్తుల గుణగణాలు సమానంగా ఉన్నాయి: వారు ఒక నిర్దిష్ట కాలంలో పరిశుద్ధాత్మ ఉపయోగించుకున్న వ్యక్తులు మరియు వారు ప్రత్యక్షంగా దేవునికి ప్రాతినిధ్యం వహించలేకపోయారు.
కొత్త నిబంధనలోని మత్తయి సువార్త యేసు వంశక్రమాన్ని దస్తావేజు చేస్తుంది. అది ప్రారంభంలో, యేసు అబ్రాహాము మరియు దావీదు వంశస్థుడని మరియు యోసేపు కుమారుడని చెబుతుంది; తర్వాత అది యేసు పరిశుద్ధాత్మ ద్వారా గర్భంలో పడ్డాడని మరియు కన్యకు జన్మించాడని—అంటే ఆయన యోసేపు కుమారుడు లేదా అబ్రాహాము మరియు దావీదుల వారసుడు కాదని చెబుతుంది. అయినప్పటికీ, వంశావళి యేసును యోసేపుతో జోడించాలని గట్టిగా చెబుతుంది. తరువాత, యేసు జన్మించిన క్రమాన్ని నమోదు చేయడాన్ని వంశావళి ప్రారంభిస్తుంది. అది యేసు పరిశుద్ధాత్మ ద్వారా గర్భంలో పడ్డాడని, ఆయన కన్యకు జన్మించాడని, యోసేపు కుమారుడు కాదని చెబుతోంది. అయినప్పటికీ, యేసు యోసేపు కుమారుడని వంశావళిలో స్పష్టంగా రాయబడింది మరియు యేసు కోసం వంశావళి రాయబడింది కాబట్టి, అది నలభై రెండు తరాలను నమోదు చేస్తుంది. యోసేపు తరానికి వెళ్ళినప్పుడు, మరియ భర్త యోసేపు అని, యేసు అబ్రహాము వంశస్థుడని నిరూపించడానికి ఇవ్వబడిన పదాలను అది హడావిడిగా చెబుతుంది. ఇది విరుద్ద వాదన కాదా? వంశావళి యోసేపు పూర్వీకులను స్పష్టంగా నమోదు చేస్తుంది, ఇది స్పష్టంగా యోసేపు వంశావళి, కానీ మత్తయి అది యేసు వంశావళి అని వాదిస్తాడు. ఇది యేసు పరిశుద్ధాత్మ ద్వారా గర్భంలో పడిన వాస్తవాన్ని నిరాకరించడం లేదా? కాబట్టి, మత్తయి రాసిన వంశావళి మానవుని ఆలోచన కాదా? ఇది హాస్యాస్పదం! ఈ విధంగా ఈ గ్రంథం అసలు పరిశుద్ధాత్మ నుండి రాలేదని నీవు తెలుసుకోవచ్చు. బహుశా, దేవుడికి భూమిపై తప్పక వంశావళి ఉండాలనుకునే వారు కొందరు ఉన్నారు, కాబట్టి వారు యేసును అబ్రాహాము నలభై రెండవ తరానికి కేటాయించారు. అది నిజంగా హాస్యాస్పదమే! భూమిపైకి వచ్చిన తర్వాత, దేవుడికి వంశావళి ఎలా ఉండగలదు? దేవునికి వంశావళి ఉందని నీవు అంటే, నీవు ఆయనను దేవుడు సృష్టించిన జీవులతో సమానం చేయడం లేదా? దేవుడు భూమికి చెందినవాడు కాదు, ఆయన సృష్టికి ప్రభువు మరియు ఆయన శరీరధారి అయినప్పటికీ, ఆయన మానవునితో సమానమైన స్వభావం గలవాడు కాదు. దేవుడికి దేవుడు సృష్టించిన జీవితో సమానమైన స్థాయిని నీవు ఎలా ఇవ్వగలవు? అబ్రాహాము దేవునికి ప్రాతినిధ్యం వహించలేడు; ఆయన ఆ కాలములో యెహోవా కార్యానికి సంబంధించినవాడు, ఆయన కేవలం యెహోవా ఆమోదించిన ఒక నమ్మకమైన సేవకుడు మరియు ఆయన ఇశ్రాయేలు ప్రజలలో ఒకడు. ఆయన యేసుకు పూర్వీకుడు ఎలా కాగలడు?
యేసు వంశావళిని ఎవరు రాశారు? దాన్ని స్వయంగా యేసే రాశాడా? “నా వంశావళిని రాయండి” అని యేసు వారితో స్వయంగా చెప్పాడా? మత్తయి దీనిని యేసు సిలువ వేయబడిన తర్వాత నమోదు చేశాడు. ఆ సమయంలో, యేసు తన శిష్యులు అర్థం చేసుకోలేని ఎంతో కార్యాన్ని చేశాడు మరియు దానికి ఎటువంటి వివరణ కూడా ఇవ్వలేదు. ఆయన వెళ్లిపోయిన తర్వాత, ఆయన శిష్యులు అన్నిచోట్లా ప్రవచనం చేయడం మరియు పని చేయడం ప్రారంభించారు మరియు కార్యపు ఆ దశ కోసం, వారు లేఖలు మరియు సువార్త గ్రంథాలు రాయడం ప్రారంభించారు. కొత్త నిబంధనలోని సువార్త గ్రంథాలనేవి యేసుకు సిలువ వేసిన ఇరవై నుండి ముప్పై సంవత్సరాల తరువాత నమోదు చేయబడ్డాయి. దానికి ముందు, ఇశ్రాయేలు ప్రజలు పాత నిబంధనను మాత్రమే చదివేవారు. అంటే, కృపా యుగము ప్రారంభంలో ప్రజలందరూ పాత నిబంధననే చదివారు. కొత్త నిబంధన కృపా యుగములో మాత్రమే వెలుగులోకి వచ్చింది. యేసు కార్యము చేసినప్పుడు కొత్త నిబంధన ఉనికిలో లేదు; ఆయన పునరుత్థానమై పరలోకానికి వెళ్లిపోయిన తర్వాత ప్రజలు ఆయన కార్యాన్ని నమోదు చేశారు. అప్పుడు కేవలం నాలుగు సువార్తలు మాత్రమే ఉన్నాయి, అవిగాకుండా పౌలు మరియు పేతురు లేఖలతో పాటు ప్రకటన గ్రంథం కూడా ఉన్నాయి. యేసు పరలోకానికి వెళ్లిపోయిన మూడు వందల యేండ్ల కంటే ఎక్కువ కాలం తర్వాత, అటుపిమ్మట వచ్చిన తరాలు కొన్ని ఎంపిక చేసిన దస్తావేజులను క్రోడీకరించారు, ఆ తర్వాతే బైబిల్ కొత్త నిబంధన ఉనికిలోకి వచ్చింది. ఈ కార్యము పూర్తి చేయబడిన తర్వాత మాత్రమే కొత్త నిబంధన ఉనికిలోకి వచ్చింది; ఇది అంతకు మునుపు లేదు. ఆ కార్యాన్నంతా దేవుడే చేశాడు, పౌలు మరియు ఇతర అపొస్తలులు వివిధ ప్రదేశాలలోని చర్చిలకు అనేక లేఖలు రాశారు. వారి అనంతరం ప్రజలు వారి లేఖలను కూర్పు చేశారు మరియు పత్మాసు ద్వీపంలో యోహాను నమోదు చేసిన, అంత్యకాలములో దేవుని కార్యాన్ని గురించి భవిష్యవాణి ఉన్న, గొప్ప దర్శనాన్ని దానికి జోడించారు. ప్రజలు ఈ వరుస క్రమాన్ని తయారుచేశారు, ఇది నేటి మాటలకు భిన్నంగా ఉంది, ఈనాడు నమోదు చేయబడినది, దేవుని కార్యపు దశల ప్రకారం ఉంది; ఈనాడు ప్రజలు స్వయంగా దేవుడు చేసిన కార్యములో మరియు ఆయన స్వయంగా పలికిన వాక్యములలో నిమగ్నమై ఉన్నారు. నీవు—అంటే మానవజాతి—జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు; ఆత్మ నుండి నేరుగా వచ్చిన వాక్యములు, అంచెలవారీగా అమర్చబడ్డాయి మరియు అవి మానవుని నమోదుల అమరికకు భిన్నమైనవి. వారు నమోదు చేసినది, వారి విద్య స్థాయి మరియు మానవ సామర్థ్యానికి అనుగుణంగా ఉన్నాయని చెప్పవచ్చు. వారు మానవుల అనుభవాలను నమోదు చేశారు, మరియు వారిలో ప్రతి ఒక్కరికి నమోదు చేయడానికి మరియు తెలుసుకోవడానికి వారి సొంత మార్గాలు ఉండేవి మరియు ప్రతి నమోదు భిన్నంగా ఉండేది. కాబట్టి, నీవు బైబిల్‌ను దేవుడిగా ఆరాధిస్తే, నీవు అత్యంత అజ్ఞానివి మరియు మూర్ఖుడివి! నీవు నేటి దేవుని కార్యాన్ని ఎందుకు కోరుకోవు? దేవుని కార్యము మాత్రమే మానవుడిని రక్షించగలదు. బైబిల్ మనిషిని రక్షించలేదు, ప్రజలు దానిని అనేక వేల యేండ్లు చదవవచ్చు కానీ అప్పటికీ వారిలో స్వల్ప మార్పు కూడా ఉండదు, నీవు బైబిల్‌ను ఆరాధిస్తే ఎప్పటికీ పరిశుద్ధాత్మ కార్యాన్ని పొందలేవు. ఇశ్రాయేలులోని దేవుని కార్యపు రెండు దశలు బైబిల్‌లో నమోదు చేయబడ్డాయి, కాబట్టి ఈ నమోదులలోని అన్ని పేర్లు ఇశ్రాయేలుకు సంబంధించినవి మరియు అన్ని సంఘటనలు ఇశ్రాయేలులో జరిగినవి; “యేసు” అనే నామము కూడా ఒక ఇశ్రాయేలీయుని నామమే. నీవు ఈనాటికీ బైబిల్‌ను చదువుతూ ఉంటే, నీవు సాంప్రదాయానికి కట్టుబడుతూ ఉన్నట్టు కాదా? బైబిల్ కొత్త నిబంధనలో నమోదు చేయబడినవన్ని యూదయకు సంబంధించిన విషయాలు. మూల వచనం గ్రీకు మరియు హీబ్రూ భాషలలో ఉంది మరియు ఆయనను పిలిచిన నామము మరియు ఆ సమయంలో యేసు మాటలన్నీ మానవ భాషకు చెందినవి. ఆయనను సిలువపై వేలాడదీసినప్పుడు, యేసు ఇలా అన్నాడు: “ఎలీ, ఎలీ, లామా సబచ్తానీ?” ఇది హిబ్రూ కాదా? దీనికి కారణం యేసు యూదయలో అవతరించడమే, కానీ దేవుడు యూదుడని ఇది రుజువు చేయదు. ఈనాడు, దేవుడు చైనాలో దేహధారి అయ్యాడు, కాబట్టి ఆయన చెప్పేవన్నీ నిస్సందేహంగా చైనా భాషలో ఉన్నాయి. అయినప్పటికీ వీటిని బైబిల్ నుండి అనువదించబడిన చైనా భాషతో పోల్చలేము, ఎందుకంటే ఈ పదాల మూలం భిన్నమైనది: ఒకటి మానవులచే నమోదు చేయబడిన హీబ్రూ నుండి వచ్చింది, మరొకటి ప్రత్యక్షంగా ఆత్మ పలికిన పలుకుల నుండి వచ్చింది. అలాంటప్పుడు ఏమాత్రం తేడా లేకుండా ఎలా ఉండగలదు?