త్రిత్వము ఉన్నదా?

యేసు శరీరునిగా మారాడన్న సత్యము తరువాత, పరలోకములో తండ్రి మాత్రమే కాదు, కుమారుడు మరియు పరిశుద్దాత్మ కూడా ఉన్నారని మానవుడు నమ్మాడు. అంటే, పరలోకమునందు తండ్రి, కుమారుడు మరియు పరిశుద్దాత్మగా ఉన్న ఒక త్రియేక దేవుడు ఉన్నాడనేది మనిషి కలిగియున్న ఒక సైద్దాంతిక భావన. దేవుడు ఒక్కడే అయినప్పటికీ, ఆయనలో ఈ మూడూ అంతర్లీనమై ఉన్నాయనే ఈ భావన మానవజాతి సమస్తంలోనూ ఉంది. సైద్దాంతిక భావన లోతుగా పాతుకుపోయిన వారందరూ తండ్రి, కుమారుడు మరియు పరిశుద్దాత్మ అని, ఆ ముగ్గురూ ఏకమైనది మాత్రమే దేవుడని విశ్వసిస్తారు. పరిశుద్ధ తండ్రి లేకుండా దేవుడు సంపూర్ణుడు కాలేడు. అదేవిధంగా, కుమారుడు లేదా పరిశుద్దాత్మ లేకుండా కూడా దేవుడు సంపూర్ణుడు కాలేడు. వారి ఉద్దేశంలో, కేవలం తండ్రి లేదా ఒక్క కుమారుడు మాత్రమే దేవునిగా పరిగణించబడడని వారు నమ్ముతారు. తండ్రి, కుమారుడు మరియు పరిశుద్దాత్మ కలిపి మాత్రమే దేవునిగా పరిగణించబడగలరు. ప్రస్తుతం, భక్తిగల విశ్వాసులందరూ, మరియు మీలో ప్రతి అనుచరుడూ, ఈ విశ్వాసాన్ని కలిగి ఉంటారు. అయితే, దేవునికి చెందిన విషయాల పట్ల ఎప్పుడూ మీరు సందిగ్ధంలోనే ఉంటారు కాబట్టి, ఈ విశ్వాసం సరైనదా, కాదా అనే దాని గురించి ఎవరూ వివరించలేరు. ఇవి ఉద్దేశాలే అయినప్పటికీ, అవి సరైనవో కావో మీకు తెలియదు. ఎందుకంటే, మీరు మత సంబంధమైన తలంపుల బారినపడి అతి ఘోరంగా మారారు. మత సంబంధమైన సైద్దాంతిక భావనలను మీరు చాలా గాఢంగా పుచ్చుకున్నారు, మరియు ఈ విషయము మీ అంతరంగములోకి చాలా లోతుగా పాకిపోయింది. కాబట్టి, ఈ విషయములో కూడా ఈ హానికరమైన ప్రాబల్యానికి మీరు లోబడిపోయారు. ఎందుకంటే, అసలు త్రియేక దేవుడే లేడు. అంటే, తండ్రి, కుమారుడు మరియు పరిశుద్దాత్మ అనే త్రిత్వము లేనేలేదు. ఇవన్నీ మానవ సైద్దాంతిక ఆలోచనలు మరియు మనిషి అపనమ్మకాలు. అనేక శతాబ్దాలుగా మనిషి ఈ త్రిత్వాన్ని నమ్మాడు, మానవ మనస్సులోని తలంపుల ద్వారా మాయ చేయబడ్డాడు, ఇది మనిషి ద్వారా కల్పించబడింది మరియు మనిషి ఇదివరకెన్నడూ దీన్ని చూడలేదు. ఇన్ని సంవత్సరాలలో, త్రిత్వపు “నిజమైన అర్ధాన్ని” వివరించిన బైబిల్ వాఖ్యానకర్తలు ఎంతోమంది ఉన్నారు. కానీ, ముగ్గురు భిన్నమైన వ్యక్తులుగా ఉన్న త్రియేక దేవుని గురించిన ఆ వివరణలన్నీ సందిగ్ధంగా మరియు అస్పష్టంగా ఉన్నాయి, మరియు దేవుని “నిర్మాణం” గురించి ప్రజలందరూ భ్రమలోనే ఉన్నారు. ఏ గొప్ప వ్యక్తి కూడా ఇప్పటివరకు సరైన వివరణ ఇవ్వలేకపోయాడు; చాలా వరకు వివరణలు హేతు పరముగా కాగితంపై సమీకరించబడ్డాయే తప్ప ఒక్క మనిషికి కూడా దాని భావము గురించి పూర్తి స్పష్టమైన అవగాహన లేదు. ఎందుకంటే, మనిషి హృదయంలో గొప్పదైన ఈ త్రిత్వము అసలు లేనేలేదు. నిజమైన దేవుని ముఖ స్వరూపాన్ని ఇంతవరకు ఎవరూ చూడలేదు కాబట్టి, దేవుని విశ్రమ స్థలములో ఏ వస్తువులు ఉన్నాయో పరిశీలించడానికి దర్శనం కోసం దేవుని నివాసానికి ఎక్కి వెళ్ళడానికి, “దేవుని గృహములో” ఖచ్చితంగా ఎన్ని పదివేల లేక వందల కోట్ల తరాలు ఉన్నాయో నిర్ణయించి లేదా నైసర్గికమైన దేవుని నిర్మాణము ఎన్ని భాగాలుగా రూపొందించబడిందో పరిశోధించే అదృష్టం ఎవరికీ లేదు. ప్రధానంగా పరిశీలించవలసినది: తండ్రి, కుమారుడు, అలాగే పరిశుద్దాత్మ వయస్సు; ప్రతి ఒక్కరి ప్రత్యక్షత; సరిగ్గా వారు ఎలా వేరుగా ఉంటారు, మరియు వారు ఎలా ఒక్కటయ్యారు అనే దాని గురించి. దురదృష్టవశాత్తూ, ఇన్నేళ్ళల్లో, కనీసం ఒక్కరు కూడా ఈ విషయాల వాస్తవాన్ని నిర్ధారించలేకపోయారు. త్రిత్వము పట్ల శ్రద్ద కలిగిన మనఃపూర్వకమైన మరియు భక్తిగల మత విశ్వాసులందరికీ మరియు సమస్త మానవజాతికి నివేదించడానికి పరలోకాన్ని చూడటానికి వెళ్లి ఒక “పరిశోధనాత్మకమైన నివేదికతో” తిరిగి వచ్చిన వ్యక్తి ఒక్కరైనా లేరు కాబట్టి, వారంతా కేవలం ఊహించుకుంటున్నారు. నిజానికి, అటువంటి భావనలు కలిగి ఉన్నందుకు మనిషిపై నిందను వేయలేము, అయితే తండ్రియైన యెహోవా మానవాళిని సృజించినప్పుడు కుమారుడైన యేసు తోడ్పాటు లేకపోవడానికి కారణమేమిటి? ఒకవేళ, ఆదిలోనే, అంతా యెహోవా నామాన్ని బట్టే జరిగిపోయి ఉంటే, ఎంతో బాగుండేది. ఒకవేళ నిండా మోపవలసి వస్తే, అది సృష్టి సమయంలో కుమారుని మరియు పరిశుద్దాత్మను తన ఎదుటకు పిలవకుండా, ఒంటరిగా మాత్రమే తన కార్యాన్ని జరిగించిన యెహోవా క్షణికావేశం మీద మోపాలి. వారందరూ ఏకకాలంలో కార్యము చేసి ఉంటే, మరి వారు ఒక్కరు కాలేరా? ఒకవేళ, ఆదినుండి అంతము వరకు, యెహోవా నామము మాత్రమే ఉండి, కృపాకాలం నుండి యేసు నామము లేకపోతే, లేదా ఒకవేళ ఆయన ఇప్పటికీ యెహోవా గానే పిలవబడుతూ ఉంటే, అప్పుడు మానవజాతి చేసిన ఈ విభజన బాధను దేవుడు తప్పించుకునేవాడు కాదా? ఖచ్చితంగా చెప్పాలంటే, వీటన్నిటిని బట్టి యెహోవాను నిందించలేము; ఒకవేళ నింద మోపవలసి వస్తే, అది యెహోవా, యేసు అలాగే పరిశుద్దాత్మ నామము ద్వారా ఆయన కార్యాన్ని చేస్తూ, దేవుడు ఎవరో తెలుసుకోలేనంతగా మనిషిని కలవరపెడుతున్న పరిశుద్దాత్మ మీద మోపబడాలి. పరిశుద్దాత్మ స్వయంగా ఆకారము లేదా రూపము లేకుండా కార్యము చేయడమే కాకుండా, యేసు అనే నామము లేకుండా, మనిషి ఆయనను తాకకుండా లేదా చూడకుండా, కేవలం ఉరుము శబ్దాలను మాత్రమే వింటూ ఉంటే, అప్పుడు ఈ విధమైన కార్యము మానవజాతికి ఎంతో ప్రయోజనకరంగా ఉండేది కాదా? అయితే మరి ఇప్పుడు ఏమి చేయవచ్చు? మానవుని తలంపులు నేటి దేవుడు భరించలేక మరియు పూర్తిగా నష్టపోయే విధంగా పర్వతమంత ఎత్తుగా మరియు సముద్రమంత విశాలంగా పెరిగిపోయాయి. గతంలో యెహోవా, యేసు, మరియు వారి మధ్య పరిశుద్దాత్మ మాత్రమే ఉన్నప్పుడు, మనిషి మాత్రం ఇంకా ఎలా ఎదుర్కోవాలనే సందిగ్ధంలోనే ఉన్నాడు, ఇప్పుడు అదనంగా దేవునిలో భాగమని చెప్పబడిన సర్వశక్తిమంతుడు కూడా జోడించబడ్డాడు. ఆయన ఎవరో మరియు త్రిత్వంలోని ఏ వ్యక్తిత్వంలో ఆయన ఇన్ని ఏళ్లుగా ఇమిడి ఉన్నాడో లేదా మరుగై ఉన్నాడో ఎవరికి తెలుసు? మానవుడు దీన్ని ఎలా భరించగలడు? త్రియేక దేవుని వివరించడానికే మనిషికి జీవితకాలం సరిపోతుంది, కానీ ఇప్పుడు “నలుగురిలో ఒక దేవుడు” ఉన్నాడు. దీన్ని ఎలా వివరించగలము? నీవు దీన్ని వివరించగలవా? సోదర సోదరీమణులారా! నేటి వరకు మీరు అటువంటి దేవుడిని ఎలా నమ్మారు? నిజంగా నేను మీకు నమస్కారం చెయ్యాలి. ఇప్పటికే త్రియేక దేవుని భరించడానికి సరిపోతుంటే; నలుగురైన ఈ ఏక దేవునిపై అంత స్థిరమైన విశ్వాసాన్ని మీరు ఎలా కొనసాగించగలిగారు? మిమ్మల్ని వెలుపలకి వెళ్ళమని ప్రాధేయపడ్డారు, అయినప్పటికీ మీరు తిరస్కరించారు. ఎంత అనూహ్యమైనది! నిజంగా మీరు ఏలా ఉన్నారో! నిజానికి, ఒక వ్యక్తి నలుగురు దేవుళ్లను నమ్మినప్పటికీ వారి నుండి ఏమీ పొందకపోవడం; ఇది ఒక అద్భుతమని మీకు అనిపించలేదా? మిమ్మల్ని చూస్తుంటే, మీరు ఇంత గొప్ప అద్భుతం చేస్తారని ఎవరికీ అనిపించదు! నిజానికి, త్రియేక దేవుడు ఈ లోకంలో ఎక్కడా లేడని నేను మీకు చెప్తాను. దేవునికి తండ్రి లేడు కుమారుడు లేడు మరియు తండ్రి కుమారులు కలిసి పరిశుద్దాత్మను ఒక సాధనంగా ఉపయోగిస్తున్నారన్న ఆలోచన అసలే లేదు. ఇదంతా ఈ లోకంలోనే ఒక పెద్ద అబద్దం మరియు అసలు ఉనికిలోనే లేదు! అయినా అటువంటి అబద్దము కూడా ఒక మూలాన్ని కలిగి ఉంటుంది మరియు పూర్తిగా నిరాధారమైనది కాదు, ఎందుకంటే మీ మనస్సులు అంత తేలికైనవి కావు మరియు మీ ఆలోచనలు కారణం లేకుండా ఉండవు. అయితే, అవి చాలా సముచితమైనవి మరియు తెలివైనవి, ఎంతగా అంటే, అవి ఎలాంటి సాతానుకైనా జయింపశక్యముకానివి. జాలిపడాల్సినది ఏమిటంటే, ఈ ఆలోచనలన్నీ అబద్దాలు మరియు ఉనికిలోనే లేనివి! మీరు ఇంకా నిజమైన సత్యాన్ని చూడలేదు; మీరు కేవలం కల్పించుకుని మరియు ఊహించుకుని, తర్వాత మోసపూరితంగా ఇతరుల నమ్మకాన్ని పొందడానికి, బుద్ది జ్ఞానము లేని మూర్ఖులపై ఆధిపత్యాన్ని సాధించడానికి వీటన్నిటినీ ఒక కథగా కల్పిస్తున్నారు, తద్వారా వారు గొప్పవైన మరియు ప్రసిద్ధికెక్కిన మీ “నేర్పుగల బోధనలను” విశ్వసిస్తారు. ఇది నిజమేనా? మానవుడు పొందవలసిన జీవన విధానం ఇదేనా? ఇదంతా బుద్దిహీనత! ఒక్క మాట కూడా సరైనది కాదు! ఇన్ని ఏళ్లలో, మీ ద్వారా దేవుడు ఈ రకంగా విభజించబడ్డాడు, ప్రతి తరముతో ఇంకా చక్కగా మరియు కళగా విభజించబడుతూ, ఒక్క దేవుడు ముగ్గురు దేవుళ్ళు అయ్యేంత వరకు విభజించబడ్డారు. మీరు ఆయనను ఎంతో చాకచక్యంగా విభజించారు కాబట్టి, ఇప్పుడు దేవుని తిరిగి ఒకరిగా చేయడం మనుషులుకు అసాధ్యం! బాగా ఆలస్యము కాక ముందే చురుకైన నా కార్యం కోసం కాకపోతే, మీరు ఇలా సిగ్గు లేకుండా ఇంకా ఎంతకాలం కొనసాగేవారో చెప్పడం కష్టమై ఉండేది! ఈ విధంగా దేవుని విభజించుకొంటూ పోతే, ఆయన ఇంకా మీ దేవుడు ఎలా అవుతాడు? ఇప్పటికైనా మీరు దేవుని గుర్తిస్తారా? ఇప్పటికైనా మీరు మీ మూలాల్ని కనుగొంటారా? నేను ఎప్పుడైనా తరువాత వచ్చి ఉంటే, మీరు “తండ్రి మరియు కుమారుని,” యెహోవా మరియు యేసును, ఇశ్రాయేలుకు తిరిగి పంపించి, మీకు మీరే దేవుని భాగస్తులమని చెప్పుకునే అవకాశమూ ఉంది. అదృష్టవశాత్తూ, ప్రస్తుతం ఉన్నవి అంత్యదినాలు. ఎట్టకేలకు, నేను ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఈ దినం వచ్చింది, మరియు నేను నా స్వహస్తాలతో ఈ దశ కార్యాన్ని పూర్తి చేశాక మాత్రమే దేవుని విభజించడం ఆగిపోతుంది. ఒకవేళ దీనికోసం కాకపోతే, మీలో ఉన్న సాతానులందరినీ ఆరాధించడానికి మీ బల్లల మీద పెట్టడాన్ని బట్టి కూడా లేచి ఉండేవారు. ఇది మీ కళాకృతి! దేవుణ్ణి విభజించడంలో మీ అర్ధం ఇదే! ఇంకా మీరు ఇలానే కొనసాగిస్తారా? నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను: ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు? ఏ దేవుడు మీకు రక్షణ తెస్తాడు? మీరు ఎల్లప్పుడూ ప్రార్థించే మొదటి దేవుడా? రెండో దేవుడా? లేక మూడవ దేవుడా? మీరు ఎల్లప్పుడూ ఎవరిని నమ్ముతారు? తండ్రినా? లేక కుమారుడినా? లేక పరిశుద్దాత్మనా? మీరు ఎవరిని నమ్ముతున్నారో నాకు చెప్పండి. మీరు చెప్పే ప్రతి మాటలో మీరు దేవుణ్ణి నమ్ముతున్నప్పటికీ, మీరు నిజానికి నమ్ముతుంది మీ స్వంత మస్తిష్కాన్ని! మీ హృదయాలలో అసలు దేవుడే లేదు! అయినప్పటికీ మీ మనస్సుల్లో మాత్రం అటువంటి అనేక త్రిత్వాలు ఉన్నాయి! మీరు ఒప్పుకోరు కదా?

త్రిత్వపు భావనకు అనుగుణంగా కార్యపు మూడు దశలను అంచనా వేస్తే, ఒకొక్కరు చేసిన కార్యము ఒకేలా లేదు కాబట్టి ముగ్గురు దేవుళ్ళు ఉండి ఉండాలి. మీలో ఎవరైనా త్రిత్వం నిజంగా ఉందని చెప్తే, మరి ముగ్గురు వ్యక్తులలో ఈ ఒక్క దేవుని పాత్ర ఏమిటో వివరించాలి. పరిశుద్ద తండ్రి అంటే ఏమిటి? కుమారుడు అంటే ఏమిటి? పరిశుద్దాత్మ అంటే ఏమిటి? యెహోవా పరిశుద్ద త్రండా? యేసు కుమారుడా? అయితే మరి పరిశుద్దాత్మ ఏమవుతాడు? తండ్రి ఆత్మ కాదా? కుమారుని అంతర్గతం కూడా ఆత్మ కాదా? యేసు చేసిన కార్యము పరిశుద్దాత్మ కార్యము అవ్వదా? ఆ కాలంలో యెహోవా చేసిన కార్యము యేసుకు లాగా ఆత్మ ద్వారా జరిగించబడలేదా? దేవునికి ఎన్ని ఆత్మలు ఉంటాయి? మీ వివరణ ప్రకారం, తండ్రి, కుమారుడు, మరియు పరిశుద్దాత్మ అనే ముగ్గురూ ఒక్కటే; మరి అలాగైతే, అప్పుడు వారు ముగ్గురూ ఆత్మలే, కానీ మూడు ఆత్మలు కలిగి ఉన్నారు కాబట్టి, వారు ముగ్గురు దేవుళ్ళుగా ఉన్నారు. అంటే నిజమైన దేవుడు ఒక్కడూ లేదని అర్ధం; ఈ విధమైన దేవుడు ఇంకా దేవుని స్వాభావిక గుణాన్ని ఎలా కలిగి ఉంటాడు? దేవుడు ఒక్కడే అని మీరు ఒప్పుకుంటే, మరి ఆయనకు కుమారుడు ఎలా ఉంటాడు మరియు తండ్రి ఎలా అవుతాడు? ఇవన్నీ కేవలం మీ ఆలోచనలు కావా? “పరిశుద్దాత్మ ఒక్కడే మరియు దేవుడు ఒక్కడే” అని బైబిల్లో వ్రాయబడినట్లుగా, దేవుడు ఒక్కడే, ఈ దేవునిలో ఉన్న వ్యక్తి ఒక్కడే, మరియు దేవుని ఆత్మ ఒక్కడే. నీవు చెప్పే తండ్రి మరియు కుమారుడు ఉన్నారా లేదా అనే దానితో నిమిత్తం లేకుండా, చివరికి ఉండేది ఒక్క దేవుడు మాత్రమే మరియు పరిశుద్దాత్మ స్వభావమే మీరు నమ్మే తండ్రి, కుమారుడు, పరిశుద్దాత్మ స్వభావం కూడా. మరో మాటలో చెప్పాలంటే, దేవుడు ఆత్మ అయినప్పటికీ, ఆయన శరీరునిగా మారి మనుషుల మధ్య నివసించగలడు, అలాగే అన్నింటికంటే ఉన్నత స్థానంలో ఉండగలడు. ఆయన ఆత్మ సర్వాంతర్గ్రాహి మరియు సర్వాంతర్యామి. ఆయన ఏకకాలంలో శరీరునిగా మరియు లోకానికి ఉన్నతంగా ఉండగలడు. దేవుడంటే ఒకే ఒక నిజమైన దేవుడని జనులు చెబుతారు కాబట్టి, ఇక ఆయనను విభజించడానికి ఏమీ లేదు! దేవుడంటే ఒక ఆత్మ మాత్రమే మరియు ఒక వ్యక్తి మాత్రమే; అదే దేవుడి ఆత్మ. ఒకవేళ మీరు చెప్తున్నట్లు, తండ్రి, కుమారుడు, మరియు పరిశుద్దాత్మ ఉంటే, అప్పుడు ముగ్గురు దేవుళ్ళు ఉన్నట్లు కాదా? అప్పుడు పరిశుద్దాత్మ ఒక అంశం, కుమారుడు మరొక అంశం మరియు తండ్రి వేరొక అంశంగా ఉంటారు కదా. వారి వ్యక్తిత్వాలు వేరు మరియు వారి స్వభావాలు వేరుగా ఉంటే, వారెలా ఒకే దేవునిలో భాగం కాగలరు? పరిశుద్దాత్మ ఒక ఆత్మ; మనిషి దీన్ని సులభంగానే అర్థం చేసుకుంటాడు. మరైతే, తండ్రి అంటే ఆత్మ కన్నా ఎంతో ఎక్కువ కదా. ఆయన ఎన్నడూ భూమి మీదికి దిగి రాలేదు మరియు శరీరునిగా మారలేదు; ఆయనే మనిషి హృదయంలోని యెహోవా దేవుడు, మరియు నిశ్చయంగా ఆయనే ఆత్మ కూడా. అలాగైతే, ఆయనకు మరియు పరిశుద్దాత్మకు మధ్య సంబంధమేమిటి? అది తండ్రి కుమారుల మధ్య ఉండే సంబంధమా? లేక అది పరిశుద్దాత్మ మరియు తండ్రి ఆత్మకు మధ్య ఉండే సంబంధమా? వారి ఒకొక్కరి ఆత్మ స్వభావం ఒక్కటేనా? లేక పరిశుద్దాత్మ అంటే, తండ్రి సాధనమా? దీనిని ఎలా వివరించవచ్చు? అలాగే, కుమారుడు మరియు పరిశుద్దాత్మకు మధ్య గల సంబంధం ఏమిటి? అది రెండు ఆత్మల మధ్య ఉన్న సంబంధమా లేక మనిషికి మరియు ఆత్మకు మధ్య ఉండే సంబంధమా? ఇవన్నీ వివరణ లేని విషయాలే! ఒకవేళ వారందరూ ఒకే ఆత్మ అయితే, వారందరూ కలిగి ఉన్నది ఒకే ఆత్మ అయితే, అప్పుడు వాళ్లు ముగ్గురు అనే చర్చే ఉండదు. ఒకవేళ వారు విభిన్నమైన వ్యక్తులు అయితే, అప్పుడు వారి ఆత్మల శక్తి మారుతూ ఉంటుంది, వారు ఒకే ఆత్మగా అసలు ఉండలేరు. ఈ తండ్రి, కుమారుడు, మరియు పరిశుద్దాత్మ అనే ఆలోచనే అత్యంత అర్ధరహితమైనది! ఇది దేవుణ్ణి విభాగించి ఆయనను ముగ్గురిగా, ఒకొక్కరికి ఒక స్థాయి మరియు ఆత్మను ఇచ్చి విభజిస్తుంది; అలాంటప్పుడు ఆయన ఇంకా ఒకే ఆత్మ మరియు ఒకే దేవుడు ఎలా ఉండగలడు? భూమ్యాకాశాలు మరియు సమస్తమైనవన్నీ తండ్రి, కుమారుడు, మరియు పరిశుద్దాత్మ ద్వారా సృజించబడ్డాయని నాకు చెప్పగలరా? వారు కలిసి దానిని సృజించారని కొందరు అంటారు. మరి మానవజాతిని విమోచించింది ఎవరు? పరిశుద్దాత్మా? కుమారుడా? లేక తండ్రా? మానవజాతిని విమోచించింది కుమారుడని కొందరు అంటారు. అప్పుడు స్వభావ పరంగా కుమారుడు ఎవరు? ఆయన దేవుడి ఆత్మకు మానవావతారం కాదా? ఆ మానవావతారం పరలోకంలోని దేవుడిని సృజించబడిన మానవ దృష్టితో తండ్రి అని పిలుస్తుంది. పరిశుద్దాత్మ వలన దాల్చబడిన గర్భము ద్వారా యేసు జన్మించాడని మీకు తెలియదా? ఆయనలో పరిశుద్దాత్మ ఉన్నాడు; నీవు ఏమి చెప్పినప్పటికీ, ఆయన ఇప్పటికీ పరలోకము దేవునితో ఉన్నవాడు, ఎందుకంటే ఆయన దేవుని ఆత్మకు మానవావతారం. ఈ కుమారుడు అనే ఆలోచన కేవలం అసత్యం. సమస్త కార్యాన్ని జరిగించే ఆత్మ ఒక్కటే; అది స్వయంగా దేవుడే. అంటే, దేవుని ఆత్మే ఆయన కార్యాన్ని జరిగిస్తుంది. దేవుని ఆత్మ అంటే ఎవరు? అది పరిశుద్దాత్మ కాదా? యేసులో పనిచేసేది పరిశుద్దాత్మ కాదా? ఒకవేళ పరిశుద్దాత్మ (అనగా, దేవుని ఆత్మ) ద్వారా కార్యము జరిగించబడకపోతే, ఆయన కార్యము స్వయంభవుడైన దేవునికి ఎలా ప్రాతినిథ్యం వహించగలదు? పరలోకమందున్న దేవుణ్ణి తండ్రి అని పిలుస్తూ, యేసు ప్రార్థించినప్పుడు, అది కేవలం సృజించబడిన మానవ దృష్టి నుండి మాత్రమే జరిగింది. ఎందుకంటే, దేవుని ఆత్మ ఒక సామాన్యమైన మరియు సాధారణమైన మానవ దేహాన్ని ధరించింది మరియు సృజించబడిన వాని బాహ్య రూపాన్ని మాత్రమే కలిగి ఉంది. ఆయనలో దేవుని ఆత్మ ఉన్నప్పటికీ, ఆయన బాహ్య రూపము ఇంకా సాధారణ మానవునిలానే ఉంటుంది; మరో మాటలలో చెప్పాలంటే, యేసుతో సహా, మనుషులందరూ, ఆయన “మనుష్య కుమారుడు” అయ్యాడని మాట్లాడారు. ఆయన మనుష్య కుమారుడని పిలవబడుతున్నాడే గానీ, ఆయన సామాన్య ప్రజల సాధారణ కుటుంబములో పుట్టిన ఒక వ్యక్తి (పురుషుడైనా లేదా స్త్రీ అయినప్పటికీ, ఏ సందర్భంలోనైనా మానవ బాహ్య కవచంతో ఉన్నాడు) కాబట్టి, యేసు పరలోకమందున్న దేవుడిని తండ్రి అనే పేరుతో పిలవడమనేది మీరు మొదటగా ఆయనను తండ్రి అని పిలిచినట్టే ఉంది; ఆయన సృజించబడిన మానవ దృష్టితో అలా చేశాడు. కంఠస్థం చేయడానికి ఆయన మీకు నేర్పించిన ప్రభువు ప్రార్థన ఇంకా గుర్తుందా? “పర లోకమందున్న మా తండ్రీ” పరలోకమందున్న దేవుణ్ణి తండ్రిగా సంబోధించాలని ఆయన మనుషులందరినీ కోరాడు. మరియు తాను కూడా ఆయనను తండ్రీ అని సంబోధించాడు కాబట్టి, మీ అందరితో సమానంగా నిలిచే వ్యక్తి స్థానం నుండి ఆయన అలా చేశాడు. పరలోకమందున్న దేవుడిని మీరు తండ్రీ అని పిలిచారు కాబట్టి, యేసు కూడా తనను తాను మీతో సమానంగా మరియు దేవుడు భూమి మీద ఏర్పరచుకున్న ఒక మనిషి (అనగా, దేవుని కుమారుడు) గా ఎంచుకున్నాడు. తండ్రీ దేవా అని మీరు పిలిస్తే, మీరు సృజించబడిన వారనే అర్థం కాదా? భూమి మీద యేసుకు ఎంత గొప్ప అధికారము ఉన్నప్పటికీ, సిలువ వేయబడటానికి ముందు, ఆయన కేవలం పరిశుద్దాత్మ (అనగా, దేవుడు) ద్వారా నడిపించబడిన, ఒక మనుష్య కుమారుడు మరియు భూమి మీద సృజించబడిన జీవరాశులలో ఒకడు. ఎందుకంటే, ఆయన తన కార్యాన్ని ఇంకా పూర్తిచేయవలసి ఉన్నది. కాబట్టి, ఆయన పరలోకమందున్న దేవుడిని తండ్రీ అని పిలవడం ఆయన వినయము మరియు విధేయతను మాత్రమే కనుపరుస్తుంది. ఆయన దేవుణ్ణి (అనగా, పరలోకమందున్న ఆత్మను) ఆ పద్దతిలో సంబోధించడమనేది పరలోకమందున్న దేవుడి ఆత్మకు ఆయన కుమారుడని నిరూపించదు. అది కేవలం ఆయన దృష్టి వేరుగా ఉందనే తప్ప, ఆయన వేరే వ్యక్తి అని ఏమాత్రమూ కాదు. వేర్వేరు వ్యక్తులు ఉన్నారనేది కల్పితం! సిలువ వేయబడటానికి ముందు వరకు, యేసు భౌతిక పరిమితులకు లోబడి ఉన్న ఒక మనుష్య కుమారుడు, మరియు ఆత్మ అధికారాన్ని ఆయన సంపూర్ణముగా కలిగి లేడు. అందువలన ఆయన సృజించబడిన వానిగా తండ్రియైన దేవుని చిత్తాన్ని మాత్రమే కోరగలిగాడు. గేత్సేమనే తోటలో ఆయన ముమ్మారు “నా యిష్టప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే” అని ప్రార్థించాడు. సిలువ వేయబడక ముందు, ఆయన కేవలం యూదుల రాజు; ఆయన క్రీస్తు, మనుష్య కుమారుడు, కానీ మహిమాన్విత శరీరుడు కాదు. అందుకే, సృజించబడిన వాని స్థానం నుండి, ఆయన తండ్రీ దేవా అని పిలిచాడు. ప్రస్తుతం, తండ్రీ దేవా అని పిలిచే వారందరినీ కుమారుడని నీవు చెప్పలేవు. ఒకవేళ అదే అయితే, యేసు నేర్పిన ప్రభువు ప్రార్థన తరువాత మీరందరూ కుమారుడిగా మారిపోయారా? ఇంకా మీకు నమ్మకం కలగకపోతే, మీరు తండ్రీ అని ఏ వ్యక్తిని పిలుస్తారో నాకు చెప్పండి? ఒకవేళ మీరు యేసును సూచిస్తే, మరి యేసు తండ్రి మీకు ఏమవుతాడు? యేసు వెళ్ళిపోయిన తరువాత, తండ్రి మరియు కుమారుడు అనే ఆలోచనే లేకుండా పోయింది. ఆ ఆలోచన యేసు శరీరునిగా మారిన సంవత్సరాలకే సరిపోతుంది; మిగతా పరిస్థితులన్నిటిలో, మీరు తండ్రీ దేవా అని పిలిచినప్పుడు కలిగి ఉండేది సృష్టికి ప్రభువు మరియు సృజించబడిన ఒక జీవరాశికి మధ్య గల సంబంధం మాత్రమే. ఈ తండ్రి, కుమారుడు మరియు పరిశుద్దాత్మ అనే త్రిత్వపు ఆలోచన నిలబడే కాలం ఇకపై లేదు; ఇది యుగాలన్నిటిలో అరుదుగా కనబడిన ఒక కల్పితం మరియు ఇలాంటిది లేనేలేదు!

అనేకమందికి ఆదికాండములోని: “మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము” అనే (ఆదికాండము 1:26) దేవుని వాక్యాలు గుర్తుకురావచ్చు. “మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరుని చేయుదము” అనే దేవుడి వాక్యమును పరిగణనలోకి తీసుకుంటే, “మన” అనేది రెండు అంతకంటే ఎక్కువ అని సూచిస్తుంది; ఇక్కడ ఆయన “మనము” అని చెప్పాడు కాబట్టి, అక్కడ ఉన్నది కేవలం ఒక్క దేవుడు కాదన్న మాట. ఈ విధంగా మనిషి విభిన్నమైన వ్యక్తుల సంక్షేపాన్ని గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు, మరియు ఈ వాక్యాల నుండే తండ్రి, కుమారుడు మరియు పరిశుద్దాత్మ అనే భావన పుట్టుకొచ్చింది. అలాంటప్పుడు తండ్రి ఎలా ఉంటాడు? కుమారుడు ఎలా ఉంటాడు? మరియు పరిశుద్దాత్మ ఎలా ఉంటాడు? అంటే, ఆ ముగ్గురిని కలిపి ఒక్కరిగా చేసిన స్వరూపము నుండే నేటి మానవజాతి వచ్చి ఉంటుందా? అప్పుడు మనిషి స్వరూపము తండ్రి, కుమారుడు మరియు పరిశుద్దాత్మను పోలి ఉంటుందా? దేవుని రూపాల్లోని ఏ రూపంలో మానవుడు ఉన్నాడు? మానవుని ఈ ఆలోచన కేవలం అసత్యము మరియు అర్ధరహితము! అది ఒక్క దేవుణ్ణి అనేక దేవుళ్ళుగా మాత్రమే విభజించగలదు. మోషే కాండమును రాసిన సమయమనేది లోక సృష్టిని అనుసరించి మానవాళి సృజించబడిన తర్వాతి కాలం. లోకము ప్రారంభమైనప్పుడు, తొలినాళ్లలో మోషే లేడు. బైబిల్ రాసిన తరువాత చాలా కాలం వరకు అది లేదు, అయితే మరి, పరలోకంలోని దేవుడు ఏమి మాట్లాడాడో అతనికి ఎలా తెలిసింది? దేవుడు లోకాన్ని ఎలా సృజించాడు అనే దాని గురించి అతనికి అంతుచిక్క లేదు. బైబిల్లోని పాత నిబంధనలో, ఇశ్రాయేలులో తన కార్యాన్ని జరిగిస్తున్న ఏకైక సత్య దేవుడైన యెహోవా గురించే తప్ప, తండ్రి, కుమారుడు, మరియు పరిశుద్దాత్మ గురించి ప్రస్తావించబడలేదు. కాలాలు మారుతున్న కొద్దీ ఆయన వేర్వేరు పేర్లతో పిలువబడ్డాడు. అంతమాత్రాన, ఆ ప్రతి పేరు వేరొక వ్యక్తిని సూచిస్తుందని నిరూపించదు. అదే నిజమైతే, మరి దేవునిలో లెక్కలేనంతమంది వ్యక్తులు ఉండాలి కదా? పాత నిబంధనలో రాయబడింది యెహోవా కార్యము, మరియు ధర్మశాస్త్ర కాలంలో ఆరంభం కోసం స్వయంభవుడైన దేవుడు చేసిన కార్యపు దశ గురించి మాత్రమే. అది దేవుని కార్యము, ఆయన పలికినప్పుడు, అది కలిగింది మరియు ఆయన ఆజ్ఞాపించినప్పుడు అది నిలిచిపోయింది. యెహోవా ఎప్పుడూ కూడా తాను కార్యము జరిగించడానికి వచ్చిన తండ్రినని చెప్పుకోలేదు, లేదా మానవజాతిని విమోచించడానికి కుమారుడు వస్తాడని కూడా ఆయన ఎన్నడూ ప్రవచించలేదు. అదే యేసు కాలానికి వస్తే, సర్వ మానవాళిని విమోచించడానికి దేవుడు శరీరుడిగా మారాడని మాత్రమే చెప్పబడిందే తప్ప, కుమారుడు వచ్చాడని కాదు. కాలాలు ఒకేలా ఉండవు మరియు స్వయంభవుడైన దేవుడు చేసే కార్యము కూడా వేరుగా ఉంటుంది కాబట్టి, ఆయన తన కార్యాన్ని వేర్వేరు రంగాలలో జరిగించవలసిన అవసరం ఉన్నది. ఈ విధంగా, ఆయనను సూచించే గుర్తింపు కూడా భిన్నంగా ఉంటుంది. యెహోవాయే యేసు తండ్రి అని మనిషి నమ్ముతాడు, కానీ నిజానికి యేసు దానిని ఒప్పుకోకుండా ఇలా ఉన్నాడు: “మనము ఎన్నడూ తండ్రి మరియు కుమారునిగా వర్గీకరించబడలేదు; నేను పరలోకమందున్న తండ్రి ఒక్కటై ఉన్నాము. నా యందు తండ్రి మరియు తండ్రి యందు నేను ఉన్నాము; మనుషులు కుమారుని చూసినప్పుడు, వారు పరలోకమందున్న తండ్రిని చూస్తున్నారు” అని చెప్పబడినప్పుడు, అది తండ్రియైనా, లేదా కుమారుడైనా, వారు ఏక ఆత్మగానే ఉన్నారే తప్ప, వేర్వేరు వ్యక్తులుగా విడిపోలేదు. ఒకసారి మానవుడు వివరించడానికి ప్రయత్నించాడంటే, పరిస్థితులు విభిన్న వ్యక్తుల భావజాలం, అలాగే తండ్రి కుమారుల మధ్య గల సంబంధంతో సంక్లిష్టంగా మారతాయి. మానవుడు వేర్వేరు వ్యక్తుల గురించి మాట్లాడేటప్పుడు, అది దేవుడిని భౌతికపరం చేయడం లేదా? ఆ వ్యక్తులకు మొదటిది, రెండవది, మరియు మూడవది అని హోదాను కూడా మనిషి కల్పిస్తాడు; ఇవన్నీ మనిషి ఊహాగానాలు మాత్రమే, సిఫారసు చేయదగినవి కావు, మరియు పూర్తిగా అవాస్తవికమైనవి! ఒకవేళ నీవు అతనిని: “ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు?” అని అడిగితే, అతడు తండ్రి, కుమారుడు, మరియు పరిశుద్దాత్మ త్రిత్వమే దేవుడని చెప్తాడు: ఏకైక సత్య దేవుడు. మీరు ఇంకా: “తండ్రి ఎవరు?” అని అడిగితే, అతడు: “తండ్రి పరలోకమందున్న దేవుని ఆత్మ; ఆయన సర్వాధికారి మరియు పరలోకపు యజమానుడు” అని చెప్తాడు. “మరి యెహోవా ఆత్మా?” అంటే, అతడు: “అవును” అంటాడు! ఒకవేళ నీవు, “కుమారుడు ఎవరు?” అని అడిగితే, అతడు నిజానికి యేసే కుమారుడని చెప్తాడు. “మరి యేసు సంగతేంటి? ఆయన ఎక్కడి నుండి వచ్చాడు?” అతడు: “పరిశుద్దాత్మ ద్వారా గర్భము ధరించిన మరియమ్మకు యేసు పుట్టాడు” అని చెప్తాడు. మరి ఆయన అంతరంగము కూడా ఆయన ఆత్మనే కదా? ఆయన కార్యము కూడా పరిశుద్దాత్మ ప్రతినిధిగా లేదా? యోహోవాయే ఆత్మ, అలాగే యేసు అంతరంగము కూడా. ప్రస్తుతపు అంత్య దినాల్లో, ఇప్పటికీ ఉన్నది ఆత్మయే అని చెప్పనవసరం లేదు; వారు విభిన్నమైన వ్యక్తులుగా ఎలా ఉంటారు? ఇది కేవలం దేవుని ఆత్మ వివిధ దృక్కోణాలలో ఆత్మ కార్యాన్ని జరిగించడం లేదా? అలాగని, వ్యక్తుల మధ్య వ్యత్యాసమేమీ ఉండదు. పరిశుద్దాత్మ ద్వారా యేసు ధరించాడు, నిస్సందేహంగా, ఆయన కార్యము నిశ్చయంగా పరిశుద్దాత్మదే. యెహోవా జరిగించిన కార్యపు మొదటి దశలో, ఆయన శరీరునిగా మారలేదు మరియు మనిషికి కనబడలేదు. కాబట్టి మనిషి ఆయన ప్రత్యక్షతను ఎన్నడూ చూడలేదు. ఆయన ఎంత గొప్ప వాడైనా మరియు ఉన్నది ఎంత ఎత్తైనా, ఆయన ఇంకా ఆత్మయే, ఆదిలో మానవుని సృజించినది ఆ దేవుడే. అంటే, ఆయన దేవుని ఆత్మయై ఉన్నాడు. మేఘాల మధ్య నుండి ఆయన మనిషితో మాట్లాడాడు, కేవలం ఒక ఆత్మగా, ఆయన రూపాన్ని ఎవరూ చూడలేదు. కృపా కాలంలో దేవుని ఆత్మ దేహములోనికి వచ్చి యూదయలో అవతరించినప్పుడు మాత్రమే యూదునిగా అవతరించిన వాని స్వరూపాన్ని మొదటిసారిగా మనిషి చూశాడు. ఆయనను గురించి యెహోవా చేసేది ఏమీ లేదు. అయితే, ఆయన పరిశుద్దాత్మ ద్వారా గర్భము ధరించాడు, అంటే, స్వయంగా యెహోవా ఆత్మ ద్వారా గర్భము దాల్చాడు, మరియు యేసు ఇంకా దేవుని ఆత్మ స్వరూపిగానే జన్మించాడు. మనిషి మొదటిగా చూసింది పరిశుద్దాత్మ పావురం వలె యేసుపై దిగడం; అది పరిశుద్దాత్మయే గానీ, ప్రత్యేకించిన యేసుకు ఆత్మ కాదు. అలాంటప్పుడు యేసు ఆత్మ పరిశుద్దాత్మ నుండి వేరు చేయబడగలదా? ఒకవేళ యేసు యేసుగా, కుమారుడిగా మరియు పరిశుద్దాత్మ అనేది పరిశుద్దాత్మగా ఉంటే, అప్పుడు వారెలా ఒకటి కాగలరు? ఇలానే అయితే కార్యము జరిగి ఉండదు. యేసులోని ఆత్మ, పరలోకమందున్న ఆత్మ, మరియు యెహోవా ఆత్మ అన్నీ ఒక్కటే. దానిని పరిశుద్దాత్మ, దేవుని ఆత్మ, మండుచున్న ఏడంతల ఆత్మ, మరియు సర్వాంతర్యామి ఆత్మ అని పిలుస్తారు. దేవుని ఆత్మ చాలా కార్యమును జరిగించగలదు. ఆయన లోకాన్ని సృజించగలడు మరియు దాన్ని జలప్రళయం ద్వారా నాశనమూ చేయగలడు; ఆయన సర్వ మానవాళిని విమోచించగలడు. అంతేకాకుండా, ఆయన సమస్త మానవజాతిని జయించి మరియు నాశనం చేయగలడు. ఈ కార్యమంతా స్వయంగా దేవుని చేత జరిగించబడుతుందే గానీ దేవుని వ్యక్తిత్వాలలోని ఎవరూ ఆయనకు బదులుగా చేయలేరు. ఆయన ఆత్మను యెహోవా మరియు యేసు, సర్వశక్తిమంతుడు అని కూడా పిలుస్తారు. ఆయనే ప్రభువు మరియు క్రీస్తు. ఆయన మనుష్య కుమారునిగా కూడా మారగలడు. ఆయన ఆకాశములలోనూ మరియు భూమి మీద కూడా ఉన్నాడు; ఆయన విశ్వములన్నిటి కన్నా మరియు జన సమూహములలో ఎంతో ఉన్నతమైన వాడు. భూమ్యాకాశాలకు ఆయన మాత్రమే యజమాని! సృష్టి మొదలుకుని నేటి వరకు, ఈ కార్యము స్వయంభవుడైన దేవుని ఆత్మచే జరిగించబడుతుంది. అది ఆకాశాలలో ఉన్న కార్యమైనా లేక శరీర సబంధమైనదైనా, సమస్తమూ ఆయన స్వంత ఆత్మ ద్వారా జరిగించబడుతుంది. సకల ప్రాణులు, ఆకాశమందైనా లేక భూమి మీదనైనా, సర్వ శక్తిమంతమైన ఆయన అరచేతిలో ఉన్నాయి; ఇదంతా స్వయంభవుడైన దేవుని కార్యము మరియు ఆయనకు బదులుగా ఎవరూ చేయలేనిది. పరలోకంలో ఆయన ఆత్మయే కాకుండా స్వయంభవుడైన దేవుడు కూడా; మానవుల మధ్యలో ఆయన శరీరుడు కాకుండా స్వయంభవుడైన దేవునిగా ఉన్నాడు. ఆయన వందల వేల పేర్లతో పిలవబడవచ్చు, అయినప్పటికీ, ఆయన ఇంకా స్వయంభవుడు, ఆయన ఆత్మ యొక్క ప్రత్యక్ష వ్యక్తీకరణ. సిలువ ద్వారా సర్వ మానవాళికి విమోచనము చేయడం, మరియు అంత్య దినాల్లో సమస్త దేశాలకు మరియు సమస్త ప్రాంతాలకు ప్రకటించడం కూడా, ఆయన ఆత్మ ప్రత్యక్ష కార్యమై ఉన్నది. అన్ని సమయాల్లో, దేవుడు మాత్రమే సర్వ శక్తిమంతుడు మరియు ఏకైక సత్య దేవుడు, సర్వాంతర్యామి అయిన దేవుడని పిలవబడతాడు. విభిన్నమైన వ్యక్తులు లేనే లేరు, తండ్రి, కుమారుడు మరియు పరిశుద్దాత్మ అనే భావజాలము అసలు లేదు. పరలోకమందు మరియు భూమి మీద ఉన్న దేవుడు ఒక్కడే!

దేవుని నిర్వహణ ప్రణాళిక ఆరువేల సంవత్సరాల వ్యవధి కలిగి ఆయన కార్యములోని వ్యత్యాసాల ఆధారంగా మూడు కాలాలుగా విభజించబడింది: మొదటి కాలము పాత నిబంధన ధర్మశాస్త్ర కాలము; రెండవది కృపా కాలము; మరియు మూడవది అంత్య దినాలకు చెందినది—దేవుని రాజ్య కాలము. ఒక్కో కాలంలో ఒక్కో గుర్తింపు వర్ణించబడింది. ఇది కేవలం కార్యములోని వ్యత్యాసాలను బట్టి మాత్రమే జరుగుతుంది. అంటే, కార్యము అవసరతలు బట్టి అని అర్థం. ధర్మశాస్త్ర కాలంలోని కార్యపు మొదటి దశ ఇశ్రాయేలులో నిర్వహించబడింది మరియు విమోచన కార్యాన్ని ముగించే రెండవ దశ యూదయలో నిర్వహించబడింది. విమోచన కార్యము కొరకు యేసు పరిశుద్దాత్మ ద్వారా గర్భము దాల్చబడి ఏకైక కుమారునిగా జన్మించాడు. ఇదంతా కార్యపు అవసరాలను బట్టి జరిగింది. అంత్య దినాల్లో, దేవుడు ఆయన కార్యాన్ని అన్య దేశాలలోకి విస్తరించి అక్కడి ప్రజలను జయించాలని ఆశిస్తాడు, తద్వారా ఆయన నామము వారి మధ్య గొప్ప చేయబడుతుంది. సర్వ సత్యం లోనికి ప్రవేశించడంలో మరియు అర్ధం చేసుకోవడంలో ఆయన మనిషికి ఉపదేశించాలని ఆశిస్తాడు. ఈ కార్యమంతా ఒకే ఆత్మ ద్వారా జరిగించబడుతుంది. ఆయన దానిని వివిధ దృక్పథాల నుండి చేసినప్పటికీ, కార్య నియమాలు మరియు స్వభావము అలానే ఉంటాయి. వారు నిర్వర్తించిన కార్యపు స్వభావము మరియు నియమాలను గమనిస్తే, అప్పుడు అదంతా చేసింది ఒకే ఆత్మ అని మీకు తెలుస్తుంది. ఇంకా కొంతమంది: “తండ్రి తండ్రే; కుమారుడు కుమారుడే; పరిశుద్దాత్మ పరిశుద్దాత్మే, చివరికి, వారు ఒక్కటి అవుతారు” అని అంటారు. అయితే నీవు వారిని ఎలా ఒకటిగా చేస్తావు? తండ్రి మరియు పరిశుద్దాత్మ ఒకటి చేయబడగలరు? స్వాభావికముగా వారు ఇద్దరు అయితే, వారు ఎలా కలిసిపోయినా సరే, వారు రెండు భాగాలుగా మిగిలిపోరా? వారిని ఒకటిగా చేయడం గురించి మీరు మాట్లాడేటప్పుడు, ఒక దానిని సంపూర్ణం చేయడానికి రెండు భాగాలను జోడిస్తున్నట్టు కాదా? అంటే సంపూర్ణం చేయబడటానికి ముందు వారు రెండు భాగాలు కాదా? ఒక్కో ఆత్మ ఒక్కో స్వభావాన్ని కలిగి ఉంటుంది, మరియు రెండు ఆత్మలు ఒక్కదానిగా చేయబడలేవు. ఆత్మ అనేది భౌతికమైన వస్తువు కాదు, మరియు భౌతిక ప్రపంచములో అది దేనినీ పోలి ఉండదు. తండ్రి ఒక ఆత్మ, కుమారుడు మరొకటి, మరియు పరిశుద్దాత్మ ఇంకొకటి అయినప్పటికీ, ఆ మూడూ మూడు పాత్రలలోని నీళ్ళలాగా ఒకదానిలో ఒకటి కలిసిపోతాయని, కాబట్టి, ఆ ముగ్గురూ ఒకరు కాలేరా? అని మనిషి చూస్తుంటాడు. ఇది పూర్తిగా తప్పుడు మరియు అర్ధరహితమైన వివరణ! ఇది దేవుని విడగొట్టడం కాదా? తండ్రి, కుమారుడు, మరియు పరిశుద్దాత్మ ఒక్కరిగా ఎలా అవుతారు? వారి మూడు భాగాలలో ఒకొక్కరివి భిన్న స్వభావాలు కాదా? “యేసు ఆయన ప్రియ కుమారుడని దేవుడు స్పష్టంగా చెప్పలేదా?” అని అడిగే ఇతరులు కూడా ఉన్నారు. యేసు దేవుని ప్రియ కుమారుడు, తనయందు ఆయన ఆనందిస్తున్నాడు—ఇది స్వయంగా దేవుడే స్పష్టంగా చెప్పాడు. అది దేవుడు తనకు తానే సాక్ష్యమివ్వడం, కానీ ఇంకో దృష్టితో చూసినట్లయితే, అది పరలోకమందున్న ఆత్మ తన స్వంత శరీరధారణకు సాక్ష్యమివ్వడం, పరలోకమందున్న తన కుమారునికి కాదు. నీకు అర్థమైందా? “తండ్రియందు నేనును నాయందు తండ్రియు ఉన్నామని” అనే యేసు మాటలు, వారు ఒకే ఆత్మ అని సూచించడం లేదా? వారు పరలోకానికి మరియు భూలోకానికి మధ్య విడిపోయారు అంటే అది శరీరధారణను బట్టి కదా? నిజానికి, వారు ఇప్పటికీ ఒక్కరే; ఏదేమైనప్పటికీ, ఇది కేవలం దేవుడు తనకు తానే సాక్ష్యమివ్వడం. కాలాల్లోని మార్పులు, కార్యపు అవసరతలు, మరియు ఆయన కార్య నిర్వహణ ప్రణాళికలోని వివిధ దశల కారణంగా, మానవుడు ఆయనను పిలిచే పేరు కూడా వేరుగా ఉంటుంది. ఆయన తన కార్యపు మొదటి దశను జరిగించడానికి వచ్చినప్పుడు, ఇశ్రాయేలీయుల కాపరి అయిన యెహోవా అని మాత్రమే పిలువబడ్డాడు. రెండవ దశలో, శరీరధారి అయిన దేవుడు కేవలం ప్రభువు, మరియు క్రీస్తు అని పిలవబడ్డాడు. కానీ ఆ సమయంలో, పరలోకమందున్న ఆత్మ ఆయన ప్రియమైన దేవుని కుమారుడని మాత్రమే పేర్కొన్నాడు గానీ ఆయనే దేవుడి ఏకైక దైవ కుమారుడని ప్రస్తావించలేదు. ఇది అసలు జరగలేదు. దేవుడు ఏకైక సంతానాన్ని ఎలా కలిగి ఉంటాడు? అప్పుడు దేవుడు మనిషిగా మారినట్టు కాదా? ఆయన శరీరధారి కాబట్టి, ఆయన ప్రియమైన దేవుని కుమారునిగా పిలవబడ్డాడు మరియు, దీని నుండి, తండ్రి కుమారుల మధ్య సంబంధం వచ్చింది. ఇది కేవలం పరలోకము మరియు భూలోకము వేరు పరచడం వలన మాత్రమే జరిగింది. యేసు శరీరుని స్థానం నుండి ప్రార్థించాడు. ఆయన అటువంటి సాధారణ మానవ స్వభావపు శరీరాన్ని ధరించాడు కాబట్టి, శరీరుని స్థానము నుండి ఆయన: “నా బాహ్య కవచము సృజించబడినవానికి చెందినది. భూమి మీదికి రావడానికి నేను శరీరాన్ని ధరించాను కాబట్టి, పరలోకానికి నేను చాలా, చాలా దూరంగా ఉన్నాను” అని అన్నాడు. ఈ కారణాన్ని బట్టి, ఆయన శరీరుని స్థానం నుండి మాత్రమే తండ్రి అయిన దేవునికి ప్రార్ధించగలిగాడు. అది శరీరధారి అయిన దేవుని అత్మతో అమర్చబడిన, ఆయన కర్తవ్యం. కేవలం అయన శరీర స్థానం నుండి తండ్రిని ప్రార్థించాడు కాబట్టి ఆయన దేవుడు కాదని చెప్పలేము. అయన ప్రియమైన దేవుని కుమారుడని పిలవబడినప్పటికీ, ఆయన ఆత్మ యొక్క మానవావతారం మరియు ఆయన స్వభావం ఇంకా ఆత్మయే కాబట్టి, ఆయన ఇప్పటికీ దేవుడే. ఆయనే దేవుడైతే మరి ఎందుకు ప్రార్థించాడని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. అది ఎందుకంటే, ఆయన శరీరధారి అయిన దేవుడు, శరీరమందు నివసిస్తున్న దేవుడే గానీ, పరలోకమందున్న ఆత్మ కాదు. మనిషి చూచినట్లు, తండ్రి, కుమారుడు మరియు పరిశుద్దాత్మ అందరూ దేవుడు. ఒక్కనిగా చేయబడిన ఆ ముగ్గురిని మాత్రమే ఏకైక సత్య దేవునిగా పరిగణించవచ్చు మరియు ఈ విధంగా, ఆయన శక్తి అసామాన్యమైన గొప్పదిగా ఉంటుంది. ఈ విధంగా మాత్రమే ఆయన మండుచున్న ఏడంతల ఆత్మ అని చెప్పేవారూ ఉన్నారు. ఆయన రాకడ తరువాత కుమారుడు ప్రార్థించినప్పుడు, ఆయన ప్రార్థన చేసింది ఆత్మకు. నిజానికి, ఆయన ప్రార్థన చేస్తుంది సృజించబడిన వాని స్థానం నుండి. శరీరము సంపూర్ణమైనది కాదు కాబట్టి, ఆయన సంపూర్ణముగా లేకుండా శరీరునిగా వచ్చినప్పుడు ఆయన అనేక బలహీనతలు కలిగి ఉన్నాడు, మరియు ఆయన తన శరీరమందు కార్యాన్ని జరిగించినదాన్ని బట్టి ఆయన ఎంతగానో కలవరపడ్డాడు. అందుకే ఆయన తాను సిలువ వేయబడటానికి ముందు మూడు సార్లు, అలాగే దానికంటే ముందు ఎన్నో సార్లు తండ్రి అయిన దేవునికి ప్రార్థించాడు. అయన తన శిష్యుల మధ్య ప్రార్థించాడు; ఆయన కొండమీద ఒంటరిగా ప్రార్థించాడు; ఆయన దోనె మీద ప్రార్థించాడు; ఆయన జన సమూహాల మధ్య ప్రార్థించాడు; ఆయన రొట్టె విరిచినప్పుడు ప్రార్థించాడు; మరియు ఆయన ఇతరులను దీవించినప్పుడు ప్రార్థించాడు. ఆయన అలా ఎందుకు చేశాడు? ఆయన ప్రార్థన చేసింది ఆత్మకు; ఆయన ఆత్మకు, పరలోకమందున్న దేవునికి, శరీరపు స్థానం నుండి ప్రార్థిస్తున్నాడు. కాబట్టి, మనిషి దృష్టిలో, ఆ కార్యపు దశలో యేసు కుమారునిగా మారాడు. అయితే, ఈ దశలో ఆయన ప్రార్థించలేదు. మరి ఇది ఎందుకు? ఇది ఎందుకంటే ఆయన ముందుకు తెచ్చింది వాక్యపు కార్యాన్ని, వాక్యపు దండన మరియు న్యాయ తీర్పును. ఆయనకు ప్రార్ధనలు చేయవలసిన అవసరం లేదు, మరియు ఆయనది మాట్లాడే పరిచర్య. ఆయన సిలువ వేయబడలేదు, మరియు ఆయన అధికారములో ఉన్న వారిని మనిషి ద్వారా ఎదిరించలేదు. ఆయన కేవలం తన కార్యాన్ని జరిగిస్తాడు. యేసు ప్రార్థించిన సమయంలో, పరలోక రాజ్యానికి ఆరోహణమవ్వడానికి, తండ్రి చిత్తము నెరవేరడం కోసం మరియు రాబోవు కార్యము కోసం ప్రార్థించాడు. ఈ దశలో, పరలోక రాజ్యము ఇప్పటికే దిగి వచ్చింది, కాబట్టి ఆయన ప్రార్థించాల్సిన అవసరం ఇంకా ఉందా? కాలాన్ని ముగించడమే ఆయన కార్యము, కాబట్టి తదుపరి దశ కోసం ప్రార్థించాల్సిన అవసరం ఉన్నదా? లేదనే నేను చింతిస్తున్నాను!

మానవ వివరణలలో అనేకమైన వైరుధ్యాలు ఉన్నాయి. నిజానికి, ఇవన్నీ మానవుని తలంపులే; తదుపరి పరిశీలన లేకుండానే, అవి నిజమని మీరందరూ నమ్ముతారు. త్రియేక దేవుడు లాంటి భావనలన్నీ మనిషి ఆలోచనలు మాత్రమే అని మీకు తెలియదా? మానవునికి చెందిన ఏ జ్ఞానమూ సంపూర్ణమైనది మరియు స్పష్టమైనది కాదు. అపవిత్రమైనవి ఎల్లప్పుడూ ఉంటాయి మరియు మనిషి అనేక ఆలోచనలు కలిగి ఉంటాడు; సృజించబడిన వాడు దేవుని కార్యాన్ని ఏమాత్రమూ వివరించలేడని ఇది వెల్లడి చేస్తుంది. మనిషి మనస్సులో ఎంతో ఉంది, మొత్తం హేతువు మరియు ఆలోచన నుండి వస్తూ, సత్యముతో విబేధిస్తాయి. నీ వాదన దేవుని కార్యాన్ని పూర్తిగా వేరు చేయగలదా? యెహోవా కార్యమంతటిలోని తెలివిని నీవు పొందగలవా? దీనంతటిని చూడగలిగే వ్యక్తిగా నీవు ఉన్నావా, లేదా నిత్యము నుండి అను నిత్యము చూడగలిగే స్వయంభవుడైన దేవునిగా ఉన్నావా? చాలా కాలం క్రిందటి నిత్యత్వమును నుండి రాబోవు నిత్యత్వము వరకు చూడగలిగేది నీవా, లేక అలా చేయగలిగిన దేవుడా? నీవు ఏమంటావు? దేవుని వివరించడానికి నీవు ఏవిధంగా యోగ్యుడివి? నీ వివరణ ఏ ప్రాతిపదికన ఉంది? నీవు దేవునివా? భూమ్యాకాశాలు, మరియు సమస్తమైనవి అన్నీ స్వయంభవుడైన దేవునిచే సృజించబడ్డాయి. దీన్ని చేసింది నీవు కాదు, మరెందుకు నీవు తప్పుడు వివరణలు ఇస్తున్నావు? ఇప్పటికీ, నీవు త్రియేక దేవుడిని నమ్మడం కొనసాగిస్తున్నావా? ఈ విధానాన్ని నీవు ఎంతో భారంగా భావించడం లేదా? ముగ్గురిని కాకుండా, ఏకైక దేవుణ్ణి విశ్వసించడమే నీకు ఉత్తమం. తేలికగా ఉండడమే ఉత్తమం, ఎందుకంటే ప్రభువు భారము తేలికైనది.

మునుపటి:  శరీరధారణ ప్రాముఖ్యతను పరిపూర్ణం చేసే రెండు శరీరధారణలు

తరువాత:  విజయ కార్యపు అంతర్గత సత్యము (1)

సెట్టింగులు

  • వచనం
  • థీమ్స్

ఘన రంగులు

థీమ్స్

అక్షరశైలి

అక్షరశైలి పరిమాణం

గీతల మధ్య దూరం

గీతల మధ్య దూరం

పేజీ వెడల్పు

విషయ సూచిక

శోధించండి

  • ఈ వచనాన్ని శోధించండి
  • ఈ పుస్తకాన్ని శోధించండి

Connect with us on Messenger