వాస్తవికతను ఎలా తెలుసుకోవాలి
దేవుడు ఆచరణాత్మకమైన దేవుడు: ఆయన కార్యమంతా ఆచరణాత్మకమైనది, ఆయన మాట్లాడే మాటలన్నీ ఆచరణ యోగ్యమైనవి, మరియు ఆయన వ్యక్తపరచే సత్యములన్నీ ఆచరణాత్మకమైనవి. ఆయన మాట కానిదంతా శూన్యము, ఉనికి లేనిది, మరియు స్థిమితం లేనిది. నేడు, పరిశుద్దాత్మ ప్రజలను దేవుని మాటలలోనికి నడిపించవలసి ఉంది. ప్రజలు వాస్తవికతలో ప్రవేశించి వెంబడించాలంటే, వారు తప్పనిసరిగా వాస్తవికతను వెదకాలి, మరియు వాస్తవికతను తెలుసుకోవాలి, ఆ తరువాత వారు వాస్తవికతను అనుభవించి, అలాగే వాస్తవికతలో జీవించాలి. ప్రజలు వాస్తవికతను ఎంత ఎక్కువగా తెలుసుకుంటే, అంత ఎక్కువగా ఇతరుల మాటలు నిజమైనవో కావో తెలుసుకుంటారు; ప్రజలు వాస్తవికతను ఎంతగా తెలుసుకుంటే, వారి తలంపులు అంత తక్కువగా ఉంటాయి; ఎంతగా ప్రజలు వాస్తవికతను అనుభవిస్తే, వారు అంత ఎక్కువగా నిజమైన దేవుని కార్యాలను తెలుసుకుంటారు, మరియు వారి అవినీతి, సాతాను స్వభావాల నుండి విడుదల పొందడం అంత సులభతరం అవుతుంది; ఎంత ఎక్కువగా ప్రజలు వాస్తవికతను కలిగి ఉంటే, అంత ఎక్కువగా వారు శరీరేచ్చలను ద్వేషించి మరియు సత్యమును ప్రేమిస్తారు; ప్రజలు ఎక్కువగా వాస్తవికతను కలిగి ఉంటే, వారు దేవునికి కావలసినవాటి ప్రమాణాలకు దగ్గరగా వస్తారు. దేవునిచే సంపాదించబడిన ప్రజలు వాస్తవికతను కలిగి ఉన్నవారు, వాస్తవికతను తెలుసుకున్నవారు, వాస్తవికతను అనుభవించడం ద్వారా దేవుని నిజమైన కార్యాలను తెలుసుకుంటారు. నీ దేహమును క్రమపరచుకొని మరియు ఆచరణాత్మకమైన దారిలో నీవు ఎంత ఎక్కువగా దేవునికి సహకరిస్తే, అంత ఎక్కువగా నీవు పరిశుద్ధాత్మ కార్యములను పొందుకుంటావు, ఎంత ఎక్కువగా నీవు వాస్తవికతను సంపాదిస్తే, అంత ఎక్కువగా నీవు దేవుని ద్వారా జ్ఞానమును పొందుకుంటావు, మరియు ఈ విధంగా దేవుని నిజమైన కార్యములను గూర్చిన నీ జ్ఞానం గొప్పదిగా ఉంటుంది. నీవు ఇప్పుడున్న పరిశుద్ధాత్మ వెలుగులో జీవించగలిగితే, నీవు అనుసరించవలసిన ప్రస్తుత మార్గం నీకు స్పష్టంగా కనిపిస్తుంది, మరియు మతపరమైన భావాల నుండి అలాగే గతము యొక్క పాత ఆచారాల నుండి నిన్ను నీవు వేరు చేసుకోగలుగుతావు. నేడు వాస్తవికత ముఖ్యమైనది: ఎంత ఎక్కువగా ప్రజలు వాస్తవికతను కలిగి ఉంటారో, సత్యమును గూర్చిన వారి జ్ఞానము అంత స్పష్టంగా ఉంటుంది మరియు దేవుని చిత్తమును గూర్చిన అవగాహన గొప్పదిగా ఉంటుంది. వాస్తవికత అక్షరములను మరియు సిద్ధాంతాలను అధిగమించగలదు, ఇది నైపుణ్యాన్ని మరియు సిద్దాంతాలను అధిగమించగలదు, అలాగే ఎంత ఎక్కువగా ప్రజలు వాస్తవికతపై దృష్టి పెడతారో, అంత ఎక్కువగా వారు దేవుని నిజంగా ప్రేమిస్తారు, మరియు ఆయన వాక్యముల కొరకు ఆకలి దప్పులు కలిగి ఉంటారు. నీవు ఎల్లప్పుడూ వాస్తవికతపై దృష్టి కలిగి ఉంటే నీ జీవనశైలి, మతపరమైన భావనలు, మరియు సహజ స్వభావం దేవుని కార్యమును అనుసరించడం ద్వారా సహజంగా తొలగించబడతాయి. వాస్తవికతను అనుసరించనివారు, మరియు వాస్తవికత జ్ఞానము లేనివారు, అతీంద్రియమైన వాటిని అనుసరించే అవకాశం ఉన్నందున, వారు సులభంగా మోసపోతారు. అటువంటి ప్రజలలో కార్యమును జరిగించుటకు పరిశుద్ధాత్మ ఉపాయమును కలిగి ఉండడు, కాబట్టి వారు ఖాళీగా ఉన్నట్లు భావిస్తారు, మరియు వారి జీవితాలకు అర్ధం ఉండదు.
నీవు నిజముగా తర్భీదు పొంది, నిజముగా వెదకి, నిజముగా ప్రార్థించి, మరియు సత్యమును వెదకుటలో శోధింపబడటానికి సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మ నీలో కార్యమును చేయగలడు. సత్యమును అన్వేషించని వారికి అక్షరములు మరియు సిద్దాంతాలు, అలాగే శూన్యమైన సంప్రదాయాలు తప్ప మరేమీ ఉండవు, మరియు సత్యము లేనివారు సహజంగా దేవుని గూర్చి అనేకమైన భావనలు కలిగి ఉంటారు. అలాంటి ప్రజలను శరీర సంబంధమైన దేహము నుండి ఆత్మ సంబంధమైన దేహము లోనికి మార్చాలని దేవుని ఆశ తద్వారా వారు మూడవ ఆకాశానికి ఆరోహణము కావచ్చు. ఈ ప్రజలు ఎంత మూర్ఖులు! అలాంటి విషయాలు చెప్పే వారికి దేవుడు, లేక వాస్తవికత గూర్చి అవగాహన ఉండదు; అలాంటి వ్యక్తులు దాదాపుగా దేవుతో సహకరించలేరు, మరియు కేవలం ఊరక వేచియుండాలి. ప్రజలు సత్యాన్ని అర్ధం చేసుకుని మరియు స్పష్టముగా సత్యాన్ని చూడాలంటే, ఒకవేళ, ఇంకా, వారు సత్యమందు ప్రవేశించి దానిని అనుసరించాలంటే, అప్పుడు వారు నిజముగా తర్భీదు పొందాలి, నిజముగా వెదకాలి, నిజముగా ఆకలిదప్పులు కలిగి ఉండాలి. నీవు ఆకలిదప్పులు కలిగియున్నప్పుడు, మరియు నీవు నిజముగా దేవునికి సహకరించినప్పుడు, దేవుని ఆత్మ ఖచ్చితముగా నిన్ను తాకి నీలో కార్యము చేస్తాడు, నిన్ను ఇంకా వెలిగించి, మరియు వాస్తవికత గూర్చి ఇంకా అవగాహన అందించి, నీ జీవమునకు ఉన్నతమైన సహాయముగా ఉంటాడు.
ప్రజలు దేవుని తెలుసుకోవాలంటే, దేవుడు సాధ్యపరిచే దేవుడని ముందుగా వారు తెలుసుకోవాలి, వారు దేవుని వాక్యాలను, శరీరమందు దేవుని ఆచరణాత్మకమైన ప్రత్యక్షత, మరియు దేవుని ఆచరణాత్మకమైన కార్యమును గురించి తెలుసుకోవాలి. దేవుని కార్యమంతా ఆచరణాత్మకమైనదని తెలుసుకున్న తరువాత మాత్రమే, నీవు దేవునికి సహకరించగలవు, మరియు ఆయన మార్గములోనే నీ జీవితములో ఎదుగుదలను నీవు సాధించగలవు. వాస్తవికత గురించిన అవగాహన లేని వారందరికీ దేవుని వాక్యాలను అనుభవించే అవకాశమే లేదు, వారి తలంపులలో చిక్కుకుని, తమ ఊహలో జీవిస్తారు, అందువలన వారికి దేవుని వాక్యాల పట్ల అవగాహన ఉండదు. వాస్తవికతను గూర్చిన జ్ఞానము నీకు ఎంతగా ఉంటుందో, దేవునికి నీవు అంత సమీపముగా ఉంటావు, ఆయనతో అత్యంత సన్నిహితముగా ఉంటావు; నీవు అస్పష్టతను, నిర్లక్ష్యతను, మరియు సిద్దాంతమును ఎంతగా ఆశిస్తావో, నీవు దేవునికి అంతగా దూరమవుతావు, కాబట్టి నీవు దేవుని వాక్యములను అనుభవించడము శ్రమతో కూడుకున్నది మరియు కష్టమైనది మరియు ప్రవేశమునకు నీవు అసమర్థుడని భావిస్తావు. దేవుని వాక్యముల వాస్తవికతలోనికి మీరు ప్రవేశించాలని మరియు మీ ఆధ్యాత్మిక జీవితము సరైన దారిలో ఉంచాలని కోరుకుంటే, ముందు మీరు వాస్తవికతను తెలుసుకొని అస్పష్టత మరియు అసాధారణ సంగతుల నుండి మిమ్మల్ని మీరు వేరు పరచుకోవాలి, అనగా నిజానికి పరిశుద్దాత్మ అంతరంగములో నుండి నిన్ను ఎలా వెలిగించి మరియు నడిపిస్తాడని నీవు మొదట గ్రహించాలి. ఈ విధముగా, మానవుడిలోని పరిశుద్దాత్మ నిజమైన కార్యమును నీవు గ్రహించగలిగితే, అప్పుడు నీవు దేవుని చేత పరిపూర్ణునిగా చేయబడే సరైన మార్గములోనికి ప్రవేశిస్తావు.
నేడు, ప్రతిదీ వాస్తవికత నుండి మొదలవుతుంది. దేవుని కార్యము అత్యంత వాస్తవమైనది, మరియు ప్రజలు స్పర్శించవచ్చు; అది ప్రజలు అనుభవించి మరియు సాధించగలది. దేవుని ప్రస్తుత కార్యమును తెలుసుకోకుండా ఆపే అస్పష్టమైన మరియు అసాధారణమైనవి చాలా ప్రజలలో ఉన్నాయి. అందువలన, వారి అనుభవాలలో వారు ఎల్లప్పుడూ వైదొలగి, పరిస్థితులు ఎల్లప్పుడూ కష్టముగా ఉంటాయని భావిస్తారు, మరియు ఇదంతా వారి తలంపుల మూలముగా సంభవిస్తుంది. ప్రజలు పరిశుద్దాత్మ కార్యపు నియమాలను గ్రహించలేరు, వారికి వాస్తవికత తెలియదు, కాబట్టి వారి ప్రవేశ విధానములో వారు ఎల్లప్పుడూ ప్రతికూలముగా ఉంటారు. వారు దేవుని ఆశయాలను దూరము నుండి చూస్తారు, వాటిని సాధించలేరు; వారు దేవుని వాక్యాలు నిజముగా మంచివని మాత్రమే చూస్తారు, కానీ ప్రవేశించే మార్గము కనుగొనలేరు. పరిశుద్దాత్మ ఈ నియమము ప్రకారము కార్యము చేస్తాడు; ప్రజల సహకారము ద్వారా, వారి ద్వారా చురుగ్గా ప్రార్థించడం, వెదకుతూ దేవునికి దగ్గరగా రావడం ద్వారా ఫలితాలను సాధించవచ్చు మరియు వారు పరిశుద్దాత్మ చేత వెలిగింపబడి మరియు ప్రకాశింపబడతారు. ఇది పరిశుద్దాత్మ ఏకపక్షముగా వ్యవహరించడమో లేక మానవుడు ఏకపక్షముగా వ్యవహరించడమూ కాదు. రెండూ అసమంజసమైనవి, మరియు ప్రజలు ఎంత ఎక్కువగా సహకరించి, దేవుని ఆశయాలకు చెందిన ప్రమాణాలను ఎంత ఎక్కువగా అన్వేషిస్తారో, పరిశుద్దాత్మ కార్యము అంత ఉన్నతముగా ఉంటుంది. పరిశుద్దాత్మ కార్యమునకు జోడించబడిన ప్రజల నిజమైన సహకారము మాత్రమే, దేవుని మాటల ముఖ్య భావాన్ని మరియు నిజమైన అనుభవాలను ఉత్పత్తి చేయగలదు. క్రమముగా, ఈ విధమైన అనుభవ మూలముగా ఒక పరిపూర్ణమైన వ్యక్తి ఉద్భవిస్తాడు. దేవుడు అసాధారణ పనులు చేయడు; ప్రజల తలంపులలో దేవుడు సర్వశక్తిమంతుడు, మరియు సమస్తము దేవునిచే జరిగింపబడుతుంది–ఫలితముగా ఊరికే వేచియుండు ప్రజలు, దేవుని వాక్యాలు చదవరు లేక ప్రార్థించరు, మరియు పరిశుద్దాత్మ తాకిడి కొరకు మాత్రమే ఎదురు చూస్తారు. సరైన అవగాహన ఉన్నవారైతే, దీనిని నమ్ముతారు; దేవుని పనులు నా సహకారము ఉన్నంత వరకు మాత్రమే వెళ్తాయి, దేవుని కార్యము నాలో చూపే ప్రభావము నేను ఎలా సహకరిస్తున్నాను అనే దానిపై ఆధారపడి ఉన్నది. దేవుడు మాట్లాడేటప్పుడు, దేవుని మాటలను వెదికి మరియు ప్రయతించడానికి నేను చేయగలిగినదంతా చేయాలి; దీనిని నేను సాధించాలి.
పేతురు మరియు పౌలుల ఉదాహరణలలో పేతురు వాస్తవికతపై ఎక్కువ శ్రద్ధ కనుపరచినట్లుగా మీరు చూడవచ్చు. పేతురు వెళ్ళిన దాని నుండి, అతని అనుభవాలు గతములో విఫలమైన వారి గుణపాఠాల సారాంశముగా మరియు గతములోని పరిశుద్దుల బలములను అతడు గ్రహించినట్టు కనబడుచున్నది. పేతురు అనుభవాలు ఎంత నిజమైతే, ప్రజలు ఈ అనుభవాలను చేరుకొని వాటిని తాకగలిగి, మరియు వాటిని పొందగలుగుతున్నారో దీనినుండి చూడవచ్చు. అయితే, పౌలు భిన్నముగా ఉన్నాడు: అతడు మాట్లాడినవన్నీ అస్పష్టముగా మరియు అదృశ్యముగా ఉన్నాయి, మూడవ ఆకాశమునకు వెళ్ళడం, సింహాసనము అధిరోహించడం, మరియు నీతి కిరీటము వంటివి. అతడు బాహ్య సంబంధమైన వాటిపై దృష్టి పెట్టాడు: స్థితిని బట్టి మరియు ప్రజలకు ఉపన్యసించడం, తన పెద్దరికాన్ని ప్రదర్శించడం, పరిశుద్దాత్మచే తాకబడటం, మొదలైనవి. తాను అనుసరించినది ఏదీ నిజము కాదు మరియు చాలావరకు అది కల్పితము, కాబట్టి పరిశుద్దాత్మ ప్రజలను ఎంతగా తాకుతాడు, ప్రజలు ఆస్వాదించే గొప్ప సంతోషము, మూడవ ఆకాశమునకు వెళ్ళడం, లేక వారు తమ అనుదిన తర్భీదును ఆసాదించే తీరు, దేవుని వాక్యములను చదవడానికి వారు ఆస్వాదించే రీతి, అదంతా కూడా అద్భుతమైనదిగా కనబడుతుంది–ఇవేవీ నిజము కాదు. పరిశుద్దాత్మ కార్యమంతా సాధారణమైనది మరియు వాస్తవమైనది. నీవు దేవుని వాక్యములను చదివి ప్రార్థించినప్పుడు, అంతరంగములో మీరు ప్రకాశంగా మరియు దృఢముగా ఉంటారు, బాహ్య ప్రపంచము మీతో జోక్యము చేసుకోదు; అంతరంగములో, మీరు దేవుని ప్రేమించడానికి సిద్దముగా ఉండి, సానుకూల సంగతులతో నిమగ్నమవ్వడానికి సిద్దపడి, అలాగే మీరు చెడ్డ లోకమును అసహ్యించుకుంటారు. దేవునిలో జీవించడం అంటే ఇదే. ప్రజలు చెప్తున్నట్లు, గొప్ప ఆనందాన్ని అనుభవించడం కాదు–అలాంటి మాటలు ఆచరణాత్మకం కాదు. నేడు, ప్రతిదీ వాస్తవికత నుండి మొదలవ్వాలి. దేవుడు చేసేదంతా వాస్తవము, మరియు మీ అనుభవాలలో నిజముగా దేవుని తెలుసుకోవడం, మరియు దేవుని కార్యము యొక్క అడుగుజాడలను వెదకడం, పరిశుద్దాత్మ ప్రజలను తాకడం మరియు వెలిగించడం అంటే ఏమిటి అనువాటిపై శ్రద్ధ వహించాలి. దేవుని వాక్యములను మీరు తిని, త్రాగి మరియు ప్రార్థించి, నిజమైన రీతిలో సహకరిస్తే, మీరు మీ చెవులతో విని, మీ కళ్ళతో గమనిస్తూ, తరచూ ప్రార్థిస్తూ మరియు మీ హృదయమందు ఆలోచిస్తూ, దేవుని కార్యమునకు సహకారముగా చేయగలిగినదంతా నీవు చేసి, గతించిన కాలములనుండి మంచిని గ్రహించి, పేతురు వలె చెడును విసర్జించాలి, అప్పుడు దేవుడు ఖచ్చితముగా నిన్ను నడిపిస్తాడు.