ఒక సాధారణ ఆధ్యాత్మిక జీవనానికి సంబంధించి

సాధారణ ఆత్మీయ జీవితం జీవించడానికి దేవుని యందు విశ్వాసము ఉంచడం అవసరం, దేవుని వాక్యములను మనం అనుభవించడానికి, మనం వాస్తవ జీవితంలోకి రావడానికి అది పునాది అవుతుంది. మీరు ప్రస్తుతం అలవాటుగా చేసే ప్రార్థనలు, దేవునికి సమీపంగా రావడం, కీర్తనలు పాడడం, ఆరాధన, ధ్యానం, దేవుని మాటల గురించి ఆలోచించడం, ఇవన్నీ కలిపితే ఒక “సాధారణ ఆత్మీయ జీవితం” అవుతుందా? మీలో ఎవరికీ తెలిసినట్లు లేదు. సాధారణ ఆత్మీయ జీవితం అనేది ప్రార్థన, కీర్తనలు పాడడం, సంఘ జీవనంలో పాల్గొనడం, దేవుని మాటలను తిని, తాగడం వంటి వాటికి మాత్రమే పరిమితం కాదు. బదులుగా, ఒక సరిక్రొత్త, చైతన్యవంతమైన ఆధ్యాత్మిక జీవితం జీవించాలి. నీవెలా అభ్యసిస్తున్నావనే దానికంటే, నీ అభ్యాసం వల్ల ఎలాంటి ఫలితం లభించిందనేదే ఇక్కడ ప్రధానం. సాధారణ ఆత్మీయ జీవితం అంటే ప్రార్థించడం, కీర్తనలు పాడడం, దేవుని మాటలను తిని, తాగడం లేదా ఆయన మాటలను మననం చేసుకోవడం వరకే అని చాలామంది నమ్ముతారు, కానీ, ఆ పద్ధతులు నిజంగా ప్రభావం చూపుతున్నాయా, లేదా యదార్ధమైన అవగాహన తీసుకొస్తున్నాయా అనేది పట్టించుకోరు. ఇలాంటి మనుష్యులు బయటకు కనిపించే పద్ధతులు పాటిస్తూ, వాటి ఫలితాల గురించి ఏ మాత్రం ఆలోచించరు; వీళ్ళు మతపరమైన ఆచారాలలో జీవించే వారే తప్ప, వీళ్లు సంఘం లోపల జీవించే వారు కాదు, దేవుని రాజ్య జనుల కంటే వీళ్లది చాలా తక్కువ స్థాయి. వీరి ప్రార్థనలు, కీర్తనలు పాడడం, దేవుని మాటలను తిని తాగడం వంటివన్నీ నియమ నిబంధనలు పాటించినట్లుగా, ఏదో బలవంతంగా, అందరూ చేస్తున్నారు కాబట్టి, మేమూ చేస్తున్నాం అన్నట్లుగా ఉంటాయి, అంతేతప్ప హృదయపూర్వకంగా, ఇష్టంతో చేసినట్లుగా ఉండవు. ఇలాంటి వాళ్ళు ప్రార్థించినా, పాటలు పాడినా, వారి ప్రయత్నాలు ఫలించవు, ఎందుకంటే, వారు పాటించేది కేవలం నిబంధనలు, మతపరమైన ఆచారాలు కాబట్టి; వారు యదార్థంగా దేవుని మాటలను అనుసరించడం లేదు కాబట్టి. వారి దృషి మొత్తం వాటిని ఎలా పాటించాలి అని సణుగుకోవడం మీదే కేంద్రీకృతం అవుతుంది, ఎందుకంటే, వారు దేవుని మాటలను కేవలం పాటించాల్సిన నియమాలుగానే భావిస్తారు కాబట్టి. ఇలాంటి వాళ్లు దేవుని మాటలను ఆచరణలో పెట్టడం లేదు కానీ, వారి శరీర ఆశలను తీర్చుకుంటున్నారు, ఇతరులు చూస్తున్నారని తమను తాము ప్రదర్శించుకుంటున్నారు. ఈ మత సంబంధ నియమాలు, ఆచారాలన్నీ మనుషులు కల్పించుకున్నవి; అవి దేవుని నుంచి రాలేదు. దేవుడు నియమ నిబంధనలు పాటించలేదు, ఆయన ఏ ధర్మశాస్త్రానికీ లోబడలేదు. దానికి బదులుగా, ఆయన ప్రతీ రోజూ క్రొత్త సంగతులు, ఆచరణాత్మక పనులు. మూడంచెల-స్వార్థపూరిత సంఘంలో ఉండే ప్రజలు, ప్రతీరోజూ ఉదయకాలపు ఆరాధనలు హాజరవడం, సాయంత్రపు ప్రార్థనలు చేయడం, భోజనానికి ముందు కృతజ్ఞతా ప్రార్థనలు, అన్ని విషయాలలో దేవునికి కృతజ్ఞతలు తెలపడం వంటి వాటికే తమను తాము పరిమితం చేసుకుంటారు–ఏది ఏమైనప్పటికీ, వారెంత చేసినప్పటికీ, అవి ఎంతకాలం చేసినప్పటికీ, వారిలో పరిశుద్ధాత్మ కార్యం జరుగదు. ఎప్పుడైతే మనుష్యులు నియమాల మధ్య జీవిస్తూ, వారి హృదయాలను సాధనా పద్ధతులపై కేంద్రీకరిస్తారో, వారిలో పరిశుద్ధాత్ముడు పనిచేయలేడు, ఎందుకంటే, వారి హృదయాలు నియమాలతో, మానవ తలంపులతో నిండిపోయాయి కాబట్టి. అందుకే, దేవుడు జోక్యం చేసుకుని వారిలో పని చేయలేడు, వారు కేవలం నియమాల నియంత్రణలోనే జీవిస్తూ ఉంటారు. అలాంటి వారు ఎప్పటికీ దేవుని మెప్పు పొందలేరు.

సాధారణ ఆత్మీయ జీవితం అనేది దేవుని ఎదుట జీవించే జీవితం. ఒక వ్యక్తి ప్రార్థించేటపుడు తన హృదయాన్ని దేవుని ఎదుట నిమ్మళపరచుకోవచ్చు, ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ వెలిగింపును కోరుకోవచ్చు, దేవుని మాటలు గ్రహించవచ్చు, ఇంకా దేవుని చిత్తాన్ని అర్థం చేసుకోవచ్చు. దేవుని మాటలను తిని, తాగడం ద్వారా ప్రజలు దేవుని ప్రస్తుత పనిని మరింత స్పష్టంగా గ్రహించవచ్చు. వారు సాధనకు కొత్త మార్గం పొందవచ్చు, పాతవి పట్టుకుని వేళ్ళాడనక్కరలేదు; వారు చేసే సాధన అంతా జీవితంలో ఎదుగుదల కోసమే. అలాగే, ప్రార్థన విషయానికి వస్తే, అది ఏవో కొన్ని వినసొంపైన మాటలు పలకడం కాదు లేదా నీవెంత రుణపడి ఉన్నావో తెలియజేస్తూ దేవుని ఎదుట కన్నీరు కార్చడం కాదు; నిజానికి, అది ఆత్మ ద్వారా తనను తాను సిద్ధపరచుకునేందుకు ఉద్దేశించినది, దేవుని ఎదుట తన హృదయాన్ని నిమ్మళపరచుకునేందుకు అనుమతించేది, అన్ని విషయాలలో దేవుని మాటల నుంచి నడిపింపు కోసం తనకు తాను శిక్షణ పొందడం లాంటిది, దానితో ఒకని హృదయం ప్రతీ రోజూ కొత్త వెలుగు వైపుకు ఆకర్షింపబడుతుంది, అందుకే మనం స్తబ్దుగా లేదా సోమరిగా ఉండకుండా, దేవుని మాటలను ఆచరణలో పెట్టి సరైన మార్గంలో నడవాలి. ఈ రోజుల్లో చాలామంది సాధనా పద్ధతుల మీదే దృష్టి కేంద్రీకరిస్తున్నారు, అయితే వారు సత్యాన్ని వెంబడించేలా, జీవితంలో ఎదిగేలా, వాటి ప్రకారం చేయడం లేదు. ఇదిగో ఇక్కడే వారు తప్పిపోయారు. కొంతమందిలో కొత్త వెలుగును పొందగల సామర్థ్యం ఉంటుంది, కానీ వారి సాధనా పద్ధతులు మారలేదు. వారు ఈ రోజు దేవుని వాక్యములు పొందాలని చూస్తూనే, తమ పాత మతపరమైన తలంపులను తీసుకొస్తారు, కనుక వారి పొందేది కూడా మతపరమైన భావనలతో రంగు పూసిన సిద్ధాంతమే అవుతుంది; వారు ఈ రోజు వెలుగును పొందడం లేదు, అంతే. దీని ఫలితంగా, వారి ఆచరణ మలినమవుతుంది; పాత పద్ధతులే కొత్తగా పొట్లం కట్టినట్లుగా ఉంటుంది. వారెంత బాగా సాధన చేసినప్పటికీ, వారు వేషధారులే. జనులు ప్రతీ రోజూ కొత్త సంగతులు చేసేలా దేవుడు వారిని నడిపిస్తాడు, ప్రతీ రోజూ వారొక కొత్త అంతరార్థం గర్హించేలా చేస్తాడు, వారు గతంలో చేసినదే తిరిగి చేసేవారుగా, పాతకాలపు మనుష్యుల వలే ఉండనవసరం లేదు. నీవు చాలా సంవత్సరాల నుంచి దేవుని యందు విశ్వాసం ఉంచిన వ్యక్తివైతే, ఇంకా నీ సాధనా పద్ధతులు ఏ మాత్రం మారకపోతే, ఇంకా నీకు అసూయ, బాహ్య సంగతులతో తీరిక లేకపోతే, ఇంకా దేవుని ఎదుట నీ హృదయాన్ని నిమ్మళపరచుకుని, ఆయన వాక్యములతో ఆనందించలేకపోతే, నీవేమీ పొందలేవు. దేవుని కొత్త పనిని అంగీకరించే విషయానికి వస్తే, నీవు భిన్నంగా ప్రణాళిక వేయకుండా, సరికొత్తగా సాధన చేయకుండా, కొత్త అవగాహనను కొనసాగించకుండా, పాత వాటినే పట్టుకుని, ఏదో పరిమితమైన కొత్త వెలుగు పొంది, నీవు సాధన చేసే విధానం ఏ మాత్రం మారకపోతే, నీవు పేరుకు మాత్రమే ఆత్మ ప్రవాహంలో ఉన్నట్లు లెక్క; నిజానికి, ఇలాంటి వారు మతపెద్దలైన పరిసయ్యుల వలే పరిశుద్ధాత్మ ప్రవాహానికి వెలుపలే ఉంటారు.

ఒక వ్యక్తి సాధారణ ఆత్మీయ జీవితాన్ని జీవించుటకు ప్రతీరోజూ నూతన వెలుగును పొందుకోగలగాలి మరియు దేవుని వాక్యమును అర్థం చేసుకుంటూ కొనసాగాలి. ఆ వ్యక్తి సత్యాన్ని స్పష్టంగా చూడాలి, అన్ని విషయాలలో సాధన చేసే మార్గాన్ని కనుగొనాలి, దేవుని వాక్యాన్ని ప్రతీరోజూ చదవటం ద్వారా క్రొత్త ప్రశ్నలను కనుగొని తన లోపాలను గ్రహించుకోగలిగి, తనను సంపూర్ణంగా కదిలించగలిగే, వాంఛించే, వెదికే హృదయం కలిగి వుండవచ్చు. కాబట్టి ఒక వ్యక్తి అన్ని సమయాలలో దేవుని యెదుట మౌనముగా వుంటూ, తాను దిగజారిపోతానేమో అనే భయము కలిగి ఉండాలి. ఏ మనుష్యులైతే దేవుని యెడల అంత తీవ్రమైన ఆకాంక్ష కలిగి, దేవుని వెదికే హృదయం కలిగి, నిరంతరం దేవుని సన్నిధిలో ప్రవేశించేందుకు సిద్ధంగా వుంటారో, అలాంటి వారు సరియైన ఆధ్యాత్మిక జీవన మార్గంలో వుంటారు. ఎవరైతే పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడతారో, ఎవరు మెరుగవ్వాలని కోరుకుంటారో, దేవునిచే పరిపూర్ణతను పొందాలని కోరుకుంటారో, ఎవరు దేవుని వాక్యపు లోతైన అవగాహన కోరుకుంటారో, ఎవరైతే అతీంద్రియ శక్తుల కోసం పాకులాడకుండా, దానికి బదులు నిజమైన క్రయధనము చెల్లిస్తూ, దేవుని చిత్తం పట్ల శ్రద్ధ వహిస్తారో వారే నిజంగా దేవుని సన్నిధిలోకి ప్రవేశాన్ని పొందుతారు, తద్వారా వారి అనుభవాలు మరింత యదార్థంగా ఉంటాయి, వారు ఖాళీ మాటలను మరియు సిద్ధాంతాలను వెదకరు, లేక అతీంద్రియ అనుభూతిని కొనసాగించాలని భావించరు, వారు ఏ గొప్ప వ్యక్తిత్వాన్ని పూజించరు—వీరే సాధారణ ఆధ్యాత్మిక జీవితంలోకి ప్రవేశించేవారు. వారు చేసే ప్రతీ పని జీవితంలో మరింత ఎదుగుదల కోసం తమను తాము నూతనపరుచుకుంటూ ఆత్మలో ఉల్లసిస్తూ, వారు ఎల్లప్పుడూ చురుకుగా ఉంటూ దేవుని సన్నిధిలోకి ప్రవేశాన్ని పొందగలుగుతారు. ఇది ఎరుగకయే వారు సత్యాన్ని అర్థం చేసుకొని వాస్తవంలోకి ప్రవేశిస్తారు. ఎవరైతే సాధారణ ఆధ్యాత్మిక జీవితం కలిగి వుంటారో వారు విముక్తిని, ఆత్మలో స్వాతంత్య్రాన్ని ప్రతిరోజూ పొందుతారు, వారు దేవుని మాటలను ఎటువంటి ఆటంకాలూ లేని మార్గంలో దేవునికి సంతృప్తికరంగా అనుసరిస్తారు. వీరికి ప్రార్థన చేయటం ఒక బాహ్య మర్యాద లేక ఒక పద్ధతి కాదు; ప్రతీ రోజూ వారు నూతన వెలుగును పొందుతూ వుంటారు. ఉదాహరణకు మనుష్యులు తమను తాము దేవుని యెదుట మౌనముగా ఉంచి, సాధన చేయటం వలన నిజముగా వారి హృదయాలను దేవుని ఎదుట నిమ్మళంగా వుంచుకోగలరు, వారు వేరెవరి వలన చెదరగొట్ట బడరు. ఏ వ్యక్తి గానీ, సంఘటన గానీ, లేక విషయం గానీ వారి సాధారణ ఆధ్యాతిక జీవితాలను నిర్బంధించలేదు. అటువంటి సాధన మాత్రమే ఫలితాలను ఇవ్వటానికి ఉద్దేశించబడిందే తప్ప మనుష్యులెవరూ నియమాలను అనుసరించటానికి ఉద్దేశించబడలేదు. ఇటువంటి సాధన నియమాలను అనుసరించేదిగా కాకుండా, మనుష్యుల జీవితాలలో ఎదుగుదలను ప్రోత్సహించేదిగా ఉంటుంది. ఒకవేళ నీవు ఈ సాధనను ఒక నియమావళిని అనుసరించే ఒక మార్గంగా మాత్రమే చూస్తే, అది ఎప్పటికీ నీలో మార్పుని తీసుకురాలేదు. ఇతరుల వలే నీవు కుడా ఈ సాధన చేస్తూనే ఉండవచ్చు కానీ, చివరకు ఆ ఇతరులు పరిశుద్దాత్మ పనిని అందిపుచ్చుకున్నప్పటికీ, నీవు మాత్రం పరిశుద్దాత్మ ప్రవాహం నుండి వెలివేయబడతావు. అంటే, ఇక్కడ నిన్ను నీవే మోసపుచ్చుకోవటం లేదా? ఈ మాటల ఉద్దేశం ఏమిటంటే, మీ హృదయాలను దేవుని ఎదుట నిమ్మళపరచుకొనే విధంగా చేయాలి, దేవుని వైపుకి మీ హృదయాలను త్రిప్పాలి. అప్పుడే, వారిలో దేవుని పనికి ఎటువంటి ఆటంకం లేకుండా ఫలితము లభించును. అప్పుడు మాత్రమే మనుష్యులు దేవుని చిత్త ప్రకారం ఉండగలుగుతారు.

మునుపటి:  వాస్తవికతను ఎలా తెలుసుకోవాలి

తరువాత:  సంఘ జీవితమును గూర్చి మరియు నిజమైన జీవితమును గూర్చి చర్చించుట

సెట్టింగులు

  • వచనం
  • థీమ్స్

ఘన రంగులు

థీమ్స్

అక్షరశైలి

అక్షరశైలి పరిమాణం

గీతల మధ్య దూరం

గీతల మధ్య దూరం

పేజీ వెడల్పు

విషయ సూచిక

శోధించండి

  • ఈ వచనాన్ని శోధించండి
  • ఈ పుస్తకాన్ని శోధించండి

Connect with us on Messenger