దేవుని స్వభావమును అర్థం చేసుకోవడం చాలా ప్రాముఖ్యం

మీరు సాధించవలసిన కార్యములు అనేకమైయున్నవని నేను ఆశిస్తున్నాను. నేను కోరుకొనిన వాటిని మీ క్రియలు లేక మీ జీవితాలలోని అన్నియు నెరవేర్చలేవు కాబట్టి వేరొక ఎంపికను నేనే చేసియున్నాను, లేక నేనే నేరుగా విషయానికి వచ్చి, నా నిమిత్తమును మీకు వివరించవలసివచ్చెను. మీకున్న వివేచన చాలా తక్కువగాను, మీకున్న అభినందన మనస్సు తక్కువగాను ఉన్నందున, నా స్వభావమును గూర్చి మరియు నా గుణగణాలను గూర్చి మీరు పూర్తిగా నిర్లక్ష్యము చేశారు. అందువలన ఇది ఎంతో అత్యవసర విషయమైనందున, నేను వాటిని గూర్చి మీకు తెలియజేస్తున్నాను. ముందుగా నువ్వు ఎంత అర్థం చేసుకున్నావన్న విషయముతో సంబంధము లేకుండా, ఈ విషయాలన్నిటిని అర్థము చేసుకునే మనస్సు నీకున్నా లేకపోయినా, నేను వాటిని మీకు క్షుణ్ణంగా వివరించాలి. ఈ విషయాలన్నీ మీకేమీ క్రొత్త కాదు గానీ వీటి విషయమై ఎక్కువ అవగాహన లేదు, ఈ విషయాలు మీకు అలవాటు కావాలి, వీటి లోపల ఉండే అర్థాన్ని తెలుసుకోవాలి. మీలో అనేకులకు కొంత అవగాహన మాత్రమే ఉంది, అది పాక్షికంగా మరియు అసంపూర్ణముగా ఉంది. సత్యాన్ని మెరుగ్గా అనుసరించునట్లు మీకు సహాయము చేయడానికి, అంటే నా మాటలను మెరుగ్గా పాటించడానికి ఈ విషయాలనన్నిటినీ మీరు అన్నింటికంటే ముందుగా, ప్రప్రథమంగా తెలుసుకొని, వీటి విషయమై అవగాహన కలిగియుండాలి. ఒకవేళ ఈ విషయాలను అవగాహన చేసుకోకపోయినట్లయితే, మీ విశ్వాసము అస్థిరముగానూ, మోసపూరితముగానూ ఉండి, మతపరమైన ఉచ్చులతో నిండి ఉంటుంది. దేవుని స్వభావమును గూర్చి నీకు అర్థము కాకపోయినట్లయితే, నువ్వు ఆయన కొరకు చేయవలసిన పనిని చేయలేవు. దేవుని గుణగణాలు అర్థము కాకపోయినట్లయితే, ఆయన పట్ల నువ్వు గౌరవము మరియు భయమును కలిగియుండలేవు; వాటికి బదులుగా, నీలో నిర్లక్ష్య స్వభావముతో కూడిన పనికిమాలినతనము మరియు సందిగ్ధ మనస్సు ఉంటాయి. అంతేగాకుండా, సరిదిద్దలేని దేవదూషణ కూడా ఉంటుంది. వాస్తవానికి దేవుని స్వభావమును అర్థము చేసుకోవడము చాలా ప్రాముఖ్యమైన విషయమైనప్పటికీ, దేవుని గుణగణాలను తెలుసుకోవడమును విస్మరించలేము. ఏ ఒక్కరూ ఈ విషయాలను క్షుణ్ణంగా, లేక లోతుగా పరిశీలించలేదు. నేను జారీచేసిన పరిపాలనా నియమాలను మీరు త్రోసివేసినట్లుగా నేను స్పష్టంగా చూడగలుగుచున్నాను. మీరు దేవుని స్వభావమును అర్థము చేసుకొనకపోతే, అప్పుడు మీరు ఆయన స్వభావమును గూర్చి తక్కువ అంచన వేసే వారిగా ఉంటారు. ఆయన స్వభావమును తక్కవగా అంచన వేయడమనేది దేవుని మీదనే కోపాన్ని వ్యక్తపరచడముతో సమానం. ఇలాంటి సందర్భములో, మీ క్రియల మూలంగా చివరికి కలిగే ఫలితం పరిపాలనా నియమాలను ఉల్లంఘించడంగా ఉంటుంది. నువ్వు దేవుని గుణగణాలను తెలుసుకున్నప్పుడు, ఆయన స్వభావమును సహితం అర్థము చేసుకోవాలనే విషయాన్ని కూడా నువ్వు తెలుసుకోవాలి, మరియు ఆయన స్వభావమును అర్థం చేసుకున్నప్పుడు, ఆయన పరిపాలన నియమాలను కూడా అర్థం చేసుకోవాలి. పరిపాలనా నియమాలలోని ఎక్కువ శాతం విషయాలు దేవుని స్వభావమును గూర్చి మాట్లాడుతాయి, అయితే ఆయన స్వభావమంతా పరిపాలనా నియమాలలో వ్యక్తము చేయబడలేదు; అందుచేత, దేవుని స్వభావమును గూర్చి మీకున్న అవగాహనను వృద్ధి చేసికొనుటలో మీరు మరొక అడుగు ముందుకు వేయాలి.

ఈ రోజున నేను మీతో సాధారణ సంభాషణ వలె మాట్లాడుట లేదు కాబట్టి నా మాటలను బహు జాగ్రత్తగా ఆపేక్షించాలనే బాధ్యత కలిగియుండాలి. అంతేగాకుండా, వాటి మీద చాలా లోతైన రీతిలో ప్రతిబింబించాలి. నేను చెప్పిన మాటలకు అర్థం ఏమనగా, నేను చెప్పిన మాటలకు మీరు అతి తక్కువ శ్రద్ధను చూపించారు. మీరు కనీసం దేవుని స్వభావాన్ని గురించి తెలుసుకోవడానికి కూడా ఇష్టపడుటలేదు; ఈ విషయమై కృషి చేయువారు ఒక్కరైననూ లేరు. ఈ కారణము చేత మీ విశ్వాసము కేవలము ఆడంబరంగా మాట్లాడుకోవడానికి మాత్రమే పనికి వస్తుంటుందని నేను చెప్పుతుంటాను. ఇప్పటికీ కూడా, మీలో ఏ ఒక్కరూ మీకున్న అత్యంత కీలక బలహీనత విషయమై ఎటువంటి తీవ్ర ప్రయత్నము చేయలేదు. నేను మీ కొరకు బాధలన్నిటి పడిన తరువాత మీరు నన్ను నిరాశపరిచారు. మీకు దేవుని పట్ల గౌరవము లేదని మరియు మీ జీవితాలు సత్య విహీనమైనవని చెప్పుటలో ఎటువంటి ఆశ్చర్యమూ లేదు. అలాంటి ప్రజలు పరిశుద్దులుగా ఎలా పరిగణించబడతారు? అటువంటి విషయాన్ని పరలోకపు నియమం ఎలా సహిస్తుంది! ఈ విషయములో మీరు చాలా తక్కువ అవగాహన కలిగియున్నందున, నేను ఎక్కువ వివరించి చెప్పడం తప్ప నాకు ఎంపిక చేసుకునే మరొక మార్గము లేదు.

దేవుని స్వభావము అనేది చాలామందికి అర్థముకానటువంటి విషయములా కనిపిస్తుంది. అంతేగాకుండా, ఇది ప్రతియొక్కరు అంగీకరించే విషయము కాదు, ఎందుకంటే ఆయన స్వభావము మనుష్యుడు కలిగియున్న వ్యక్తిత్వము లాంటిది కాదు. దేవునికి కూడా ఆనందం, కోపం, బాధ మరియు సంతోషములాంటి స్వంత భావోద్వేగాలు ఉన్నాయి గానీ ఈ భావోద్వేగాలన్నీ మనిషికుండే భావోద్వేగాలకు విభిన్నంగా ఉంటాయి. ఆయన ఏమైయున్నాడో దానినే దేవుడు అని అంటారు మరియు ఆయన కలిగియున్న వాటినే ఆయన కలిగియున్నాడు. ఆయన వ్యక్తపరిచేవి మరియు ఆయన బయలుపరిచేవన్నీ ఆయనకున్న గుర్తింపులో నుండి మరియు ఆయనకున్న గుణగణాలలో నుండి వస్తున్నాయి. ఆయనకున్న గుణగణాలు మరియు ఆయనకున్న గుర్తింపుతో పాటు ఆయన ఏమైయున్నాడో, ఆయన ఏమి కలిగియున్నాడో అవన్నియూ ఏ మనుష్యుని ద్వారా పూరించబడవు. ఆయన స్వభావము సమస్త మానవాళిని తన ప్రేమతో కప్పిపుచ్చుతుంది, మానవాళికి ఓదార్పును కలిగిస్తుంది, మానవాళి మీద ద్వేష భావాన్ని కలిగిస్తుంది. అంతేగాకుండా, మానవాళిని గూర్చిన సంపూర్ణ అవగాహనను కలిగిస్తుంది. ఏదేమైనా, మనుష్యుని వ్యక్తిత్వము బహుశా ఆశావాదం గానూ, ఉల్లాసం గానూ, లేక ఎటువంటి అనుభూతి లేని విధంగానూ ఉండవచ్చు. దేవుని స్వభావము అనేది సమస్త విషయాలకు మరియు సమస్త జీవరాశుల పాలనకు సంబంధించింది, సమస్త సృష్టిని సృష్టించిన ప్రభువుకు సంబంధించింది. ఆయన స్వభావము ఘనతను, అధికారమును, గొప్పతనమును మరియు అన్నిటికి పైగా, సర్వాధిపత్యమును సూచిస్తుంది. ఆయన స్వభావము అధికారానికి చిహ్నమైయున్నది, సమస్త నీతికి చిహ్నమైయున్నది, సమస్త అందానికి మరియు మంచి విషయాలన్నిటికి చిహ్నమైయున్నది. వీటన్నిటికి మించి, ఎటువంటి శత్రు సైన్యము ద్వారా గానీ మరియు చీకటి ద్వారా గానీ జయించబడని లేక దాడి చేయుటకు అవకాశము లేనటువంటి ఆయనకు ఆయన స్వభావము చిహ్నమైయున్నది. అదేవిధంగా, సృష్టించబడిన వాటి ద్వారా బాధించబడని (లేక, బాధించబడుతూ సహనానికి గురికాని) ఆయనకు ఆయన స్వభావము చిహ్నమైయున్నది. ఆయన స్వభావాము అత్యున్నతమైన అధికారానికి చిహ్నమైయున్నది. ఏ వ్యక్తి కూడా లేక మనుష్యులెవ్వరూ ఆయన కార్యమును లేక ఆయన స్వభావమును భంగము కలిగించలేరు. అయితే, మనుష్యుని వ్యక్తిత్వము మృగములపై మనిషికున్న కొద్ది అధికారముకు చిహ్నమైయున్నదేగానీ అంతకు మించి మరేమియూ లేదు. మనిషి తనలోనూ మరియు తన మీదనూ ఎటువంటి అధికారమును, స్వయంప్రతిపత్తిని కలిగియుండడు, మరియు తనను తాను వృద్ధి చేసుకునే సామర్థ్యమూ తనకు లేదు, అయితే అన్నివిధాల ప్రజల, సంఘటనల మరియు అన్ని విషయాల నియంత్రణకు వచ్చినప్పుడు మనిషి తాను కలిగియున్న గుణగణాలను బట్టి భయానికి గురవుతూ ఉంటాడు. దేవుని ఆనందం అనేది నీతి మరియు వెలుగు ఉనికిని బట్టి మరియు అవి భయటకు కనిపించే దానినిబట్టి ఉంటుంది. ఎందుకంటే, చీకటి మరియు దుష్టత్వము అనేవి నాశనమవుతాయి. మనిషికి మంచి జీవితాన్ని మరియు వెలుగును తీసుకురావడములోనే ఆయన ఎంతగానో సంతోషిస్తాడు; ఆయన ఆనందం నీతియుతమైన ఆనందమైయున్నది, నిశ్చయత కలిగిన ప్రతివాటి ఉనికికి చిహ్నమైయున్నది, దానికంటే ఎక్కువగా, శుభప్రదానికి చిహ్నమైయున్నది. దేవుని కోపము అనేటువంటిది ఆయన సృష్టించుకున్న మానవాళి మీద అన్యాయము జోక్యము చేసుకోవడమువలన, ఆ అన్యాయము ఉనికిలో ఉండడము వలన కలిగే హానిని బట్టి సంభవించేదైయున్నది. ఎందుకంటే, చీకటి మరియు దుష్టత్వము ఉనికిలో ఉన్నాయి, సత్యాన్ని పారద్రోలే విషయాలు ఉనికిలో ఉన్నాయి, వీటికంటే ఎక్కువగా, అందమైన వాటిని మరియు మంచి వాటిని ఎదిరించే విషయాలు ఉనికిలో ఉన్నాయి. ఆయన కోపము ఎన్నడూ ఉనికిలో ఉండనటువంటి అననుకూల విషయాలకు చిహ్నమైయున్నది. దీనికంటే ఎక్కువగా, ఆయన కోపము ఆయన పరిశుద్ధతకు చిహ్నమై యున్నది. ఆయన బాధ లేక దుఃఖము అనేది ఎవరి విషయములోనైతే ఆయన నిరీక్షణ కలిగియున్నాడో, ఎవరైతే చీకటి లోనికి పడిపోయారో ఆ మానవాళిని బట్టి ఉంటుంది. ఎందుకంటే, మనిషి పట్ల ఆయన చేసిన కార్యము ఆయన అంచనాలకు చేరుకోలేదు. ఎందుకంటే, ఆయన ప్రేమించే మనుష్యులందరూ వెలుగులో జీవించడం లేదు. అమాయకులైన మనుష్యులనుబట్టి, నిర్లక్ష్యానికి గురైన యథార్థ మనిషిని బట్టి, తన స్వంత దృష్టికోణాలు కొరవడిన ఒక మంచి మనిషిని బట్టి ఆయన దుఃఖిస్తాడు. ఆయన బాధ అనేది ఆయన మంచితనానికి మరియు ఆయన కరుణకు, అందానికి మరియు దయకు గురుతుగా ఉన్నది. అవును, ఆయన శత్రువులు ఓడిపోవడము నుండి మరియు మంచి విశ్వాసముగల వ్యక్తిని సంపాదించుకోవడము నుండి ఆయనకు సంతోషము కలుగుతుంది. దీనికంటే ఎక్కువగా, శత్రు దళాలలన్నీ నాశనమగుట నుండి మరియు వాటిని బహిష్కరణ చేయుట నుండి ఈ సంతోషము ఎక్కువగా పుడుతుంది. ఎందుకంటే, మనుష్యులందరూ మంచి జీవితాన్ని మరియు సమాధానకరమైన జీవితాన్ని పొందుకుంటారు. దేవుని సంతోషము అనేది మనిషి ఆనందానికి విభిన్నముగా ఉంటుంది. అంతేగాకుండా, ఇది మంచి ఫలాలతో అలంకరించిన భావనయైయున్నది. ఇది ఆనందముకంటే గొప్ప భావనయైయున్నది. ఆయన సంతోషము అనేది ఈ క్షణము నుండే మనుష్యులు శ్రమల నుండి విడిపించబడ్డారనుటకు చిహ్నమైయున్నది, మరియు మనుష్యులు వెలుగు ప్రపంచములోనికి ప్రవేశించారనుటకు గురుతైయున్నది. మరొక ప్రక్కన, మానవాళి యొక్క భావోద్వేగాలన్నీ నీతి, వెలుగు, లేక అందమైనవాటి కొరకు కాకుండా తన స్వంత ఇష్టా ఇష్టముల కొరకే పుట్టుకువస్తున్నాయి, మరియు అవన్నియు పరలోకము అందజేసిన కృప కొరకే ఉన్నాయి. మానవాళి భావోద్వేగాలన్నీ స్వార్థపూరితమైనవి మరియు అవన్నీ చీకటి లోకానికి సంబంధించినవి. అవన్నియూ దేవుని ప్రణాళిక కొరకు మరియు దేవుని చిత్తము కొరకు ఉనికిలో లేవు. కాబట్టి, దేవుని గూర్చి మరియు మనుష్యుని గూర్చి ఒకే విధంగా మాట్లాడలేము. దేవుడు ఎల్లప్పుడూ అత్యున్నతుడు మరియు ఎల్లప్పుడూ ఘనతకు పాత్రుడు, మనిషి ఎల్లప్పుడూ అధముడే, ఎల్లప్పుడూ అయోగ్యుడే. ఈ కారణము చేతనే దేవుడు ఎల్లప్పుడూ త్యాగాలను చేస్తూ, మనుష్యులకు తనను తాను అంకితం చేసుకుంటూ ఉంటాడు; ఏదేమైనా, మనిషి ఎల్లప్పుడూ తన కొరకు తాను పరితపిస్తుంటాడు. మనుష్యుల మనుగడ కొరకు దేవుడు ఎల్లప్పుడూ బాధలు పడుతూనే ఉంటాడు, అయినప్పటికీ మనిషి వెలుగు కొరకు గానీ, లేక నీతి కొరకు గానీ సహకరించడు. మనిషి కొంతవరకు ప్రయాస పడినప్పటికీ, అది ఒక దెబ్బకు కూడా తట్టుకోలేదు. ఎందుకంటే, మనిషి ప్రయాస ఎల్లప్పుడూ తన కొరకే గానీ ఇతరుల కొరకు కాదు. మనిషి ఎల్లప్పుడూ స్వార్థ పరుడే, అయితే దేవుడు నిస్వార్థపరుడు. దేవుడు న్యాయమైన వాటికి, మంచి వాటికి, మరియు అందమైనవాటికి మూలమైయున్నాడు, అయితే మనిషి వికార కృత్యాలను చేయుటలోనూ, చెడు పనులు చేయుటలోనూ విజయవంతంగా నిలిచియున్నాడు. దేవుడు తన నీతికి మరియు అందానికి సంబంధించిన గుణగణాలను వదులుకోడు, అయితే మనిషి ఎటువంటి సమయములోనైనా, ఎటువంటి పరిస్థితిలోనైనా దేవుని నుండి దూరమవడానికి మరియు నీతిని వదులుకోవడానికి సిద్ధంగా ఉంటాడు.

నేను పలికిన ప్రతి వాక్కులో దేవుని స్వభావమును గూర్చి ఉంటుంది. మీరందరూ నా మాటలను చాలా జాగ్రత్తగా ఆలోచించడం మంచిది, మరియు మీరు తప్పకుండా వాటి నుండి గొప్ప లాభాన్ని పొందుకుంటారు. దేవుని గుణగణాలను గ్రహించడం చాలా కష్టం, అయితే మీరందరూ దేవుని స్వభావమును గూర్చి కొంతమట్టుకైనా ఆలోచన కలిగియున్నారని నేను నమ్ముచున్నాను. దేవుని స్వభావమును వ్యతిరేకించని అనేకమైన కార్యములను నాకు చూపించునట్లు మీరు చేసియున్నారని నేను నిరీక్షించుచున్నాను. అప్పుడే నేను ఎక్కువ నిశ్చయత కలిగియుంటాను. ఉదాహరణకు, ఎల్లప్పుడూ నీ హృదయములో దేవుణ్ణి కలిగియుండు. మీరు నడుచుకును విధానము ఆయన మాటల ప్రకారమే ఉండనియ్యండి. అన్ని విషయాలలో ఆయన ఉద్దేశాల కొరకు వెదకండి. అన్ని విషయాల్లో దేవుని ఉద్దేశాలను వెదకండి, మరియు దేవుణ్ణి అగౌరవపరిచే, దేవునికి అవమానం కలిగించే వాటి నుండి దూరంగా ఉండండి. నీ హృదయములో భవిష్యత్తు శూన్యతను పూరించడానికి నీ మనస్సులో దేవుణ్ణి తక్కువ చేసి చూస్తావు. నువ్వు ఇలా చేస్తే, నువ్వు దేవుని స్వభావమును కించపరుస్తావు. మరలా, నీ జీవిత కాలమంతటిలో దేవునికి విరుద్ధంగా ఫిర్యాదులు గాని, లేక దూషణలు గాని చేయకపోయి ఉండవచ్చు, మరియు అలాగే, ఆయన నీకు అప్పగించినవన్నిటిని సరిగ్గా వెల్లడి చేసియుండవచ్చు మరియు నీ జీవిత కాలమంతటిలో ఆయన మాటలన్నిటికి లోబడియుండవచ్చు కూడా, అలాంటప్పుడు పరిపాలనా నియమాలకు విరుద్ధంగా నువ్వు అపరాధము చేయకుండా ఉంటావు. ఉదాహరణకు, “ఆయన దేవుడని నేనెందుకు అనుకోవడం లేదు?” “పరిశుద్ధాత్ముడు ఇచ్చిన కొంత జ్ఞానోదయముకంటేను ఈ మాటలు పెద్ద గోప్పవేమి కావని నేను అనుకుంటున్నాను,” “నా అభిప్రాయములో దేవుడు చేసే ప్రతిదీ సరిగ్గా ఉండకపోవచ్చు,” “దేవుని మానవత్వము నాకు గొప్ప విషయం కాదు,” “దేవుని మాటలను నమ్మదగినవి కావు,” లేక మరిన్ని తీర్పు తీర్చినట్లుగా ఉండే మరిన్ని మాటలను నువ్వు ఎప్పుడైనా చెప్పినట్లయితే, అనేకమార్లు తరుచుగా మీ పాపాల విషయమై పశ్చాత్తాపపడి, ఒప్పుకోవాలని నేను నిన్ను హెచ్చరిస్తున్నాను. ఇలా చేయకపోయినట్లయితే, నువ్వు క్షమాపణ పొందే అవకాశమే దొరకదు, ఎందుకంటే నువ్వు మనిషికి కాదు, దేవునికి కోపము పుట్టిస్తున్నావు. ఒక మనిషికి తీర్పు తీర్చుచున్నావని నువ్వు అనుకుంటున్నావు గానీ దేవుని ఆత్మ దానిని ఆ విధంగా పరిగణించడు. ఆయన శరీరాన్ని నువ్వు అగౌరవపరచడమనేది ఆయనను అగౌరవపరచడముతో సమానము. ఇది ఇలా ఉన్నప్పుడు, నువ్వు ఆయన స్వభావమును కించపరచలేదా? దేవుని ఆత్మ ద్వారా జరిగించబడిన ప్రతి కార్యము శరీరములో ఉన్నప్పుడు ఆయన కార్యమును పరిరక్షించుకోవడానికి జరిగిందని మరియు ఈ కార్యము సక్రమంగా జరిగే క్రమములోనే జరిగిందని మీరు గుర్తుంచుకోవాలి. నువ్వు దేవుని ఉగ్రతను రేకెత్తించావు, మరియు అందుచేత, నీకు పాఠం బోధించడానికి ఆయన సరియైన క్రమశిక్షణను ఉపయోగిస్తాడు.

దేవుని గుణగణాలను తెలుసుకోవడం అనేది చిన్న విషయమేమీ కాదు. నువ్వు ఆయన స్వభావమును తప్పకుండ అర్థం చేసుకోవాలి. ఈ విధంగా, క్రమేపి, నీకు తెలియకుండానే, నువ్వు దేవుని గుణగణాలను తెలుసుకుంటావు. నువ్వు ఆయన జ్ఞానములోనికి ప్రవేశించినప్పుడు, నువ్వు మరింత ఎక్కువ ఉన్నతమైన, అద్భుతమైన అందమైన స్థితిలోనికి అడుగు వేస్తున్నావని నిన్ను గూర్చి నువ్వు తెలుసుకుంటావు. చివరికి, నువ్వు కలిగియున్న భయంకరమైన ఆత్మ విషయమై సిగ్గు పడతావు, మరియు దానికంటే ఎక్కువగా, నీకు కలిగిన అవమానాన్ని దాచుకోవడానికి స్థలమే లేదన్నుట్లుగా భావిస్తావు. అటువంటి సమయములో, దేవుని స్వభావమును గూర్చి కించపరచడానికి చాలా తక్కువ అవకాశం ఉంటుంది. నీ హృదయం దేవునికి మరింత ఎక్కువ దగ్గరవుతుంది, మరియు ఆయన కొరకైన ప్రేమ నీ హృదయములో క్రమేపి పెరుగుతుంది. ఇది మనుష్యులు అందమైన స్థితిలోనికి ప్రవేశిస్తున్నారనుటకు సూచనయైయున్నది. కానీ మీరు ఈ స్థితిని ఇంకా పొందుకోలేదు. మీరందరూ మీ గమ్యం కొరకు మాత్రమే పరిగెడుతూ ఉండగా, దేవుని గుణగణాలను గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేసే ఆసక్తి ఎవరికి ఉంది? ఇలాగే కొనసాగితే, మీకు తెలియకుండానే పరిపాలన నియమాలకు లేక ఆజ్ఞలకు విరుద్ధంగా అపరాధం చేస్తారు, ఎందుకంటే మీరు దేవుని స్వభావమును గూర్చి చాలా తక్కువగా అర్థం చేసుకున్నారు. అందుచేత, దేవుని స్వభావమునకు విరుద్ధంగా మీరు చేసిన అపరాధముల కొరకు మీరిప్పుడు పునాదిని వేసుకున్నట్లుగా లేదా? దేవుని స్వభావమును గూర్చి అర్థం చేసుకొమ్మని నేను మిమ్మల్ని అడగడం అనేది నా కార్యము నుండి ప్రక్కకు తొలగిపోవాలని కాదు. తరచుగా మీరు పరిపాలనా నియమాలకు లేక ఆజ్ఞలకు విరుద్ధంగా అపరాధాలు చేస్తుంటే, మీరు శిక్షను తప్పించుకోగలుగుతారా? అప్పుడు నేను చేస్తున్న నా పని పూర్తిగా వ్యర్థం కాదా? అందుచేత, నీ స్వంత ప్రవర్తనను పరిశీలన చేస్తుండటంతో పాటు, మీరు వేసే అడుగులలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని నేను ఇప్పటికీ మిమ్మల్ని బ్రతిమాలుచున్నాను. నేను మీ విషయమై కోరుకునే గొప్ప కోరిక ఏదైనా ఉందంటే అది ఇదే. మీరు ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా పరిగణిస్తారని నేను నిరీక్షిస్తున్నాను. నాకు భయంకరమైన కోపాన్ని పుట్టించే విధంగా మీ క్రియలు నన్ను రెచ్చగొట్టే రోజు వచ్చినప్పుడు, పరిణామాలు కేవలము మీకు సంబంధించినవిగా మాత్రమే ఉంటాయి. మీ స్థానములో నిలువబడి ఆ శిక్షను భరించడానికి ఏ ఒక్కరూ ఉండరు.

మునుపటి:  అతిక్రమణలు మనిషిని నరకం వైపుకు నడిపిస్తాయి

తరువాత:  భూమిపై దేవుణ్ణి ఎలా తెలుసుకోవాలి

సెట్టింగులు

  • వచనం
  • థీమ్స్

ఘన రంగులు

థీమ్స్

అక్షరశైలి

అక్షరశైలి పరిమాణం

గీతల మధ్య దూరం

గీతల మధ్య దూరం

పేజీ వెడల్పు

విషయ సూచిక

శోధించండి

  • ఈ వచనాన్ని శోధించండి
  • ఈ పుస్తకాన్ని శోధించండి

Connect with us on Messenger