18 వ అధ్యాయము

దేవుని వాక్యములన్నింటిలో ఆయన స్వభావం కొంత భాగం ఉంటుంది. దేవుని స్వభావాన్ని మాటల్లో పూర్తిగా వ్యక్తం చేయలేము, ఆయనలో ఎంత ఐశ్వర్యము ఉందో చూపడానికి మాత్రమే అది సరిపోతుంది. అన్నింటికి మించి, ప్రజలకున్న సామర్థ్యమునుబట్టి వారు చూడగలిగేది మరియు స్పృశించగలిగేది పరిమితంగా ఉంటుంది. దేవుని వాక్కులు స్పష్టంగా ఉన్నప్పటికీ, ప్రజలు వాటిని పూర్తిగా అర్థం చేసుకోలేరు. ఉదాహరణకు ఈ వాక్యములనే తీసుకోండి: “ఒక్క పిడుగుపాటులో, ప్రతి జంతువు యొక్క నిజమైన స్వరూపం బహిర్గతమయ్యింది. అలాగే, నా కాంతి ద్వారా ప్రకాశిస్తూ, మనిషి ఒకప్పుడు కలిగి ఉన్న పవిత్రతను తిరిగి పొందాడు. ఓహ్, పాత భ్రష్ట ప్రపంచమా! చివరికి, అది మురికి నీటిలో పడిపోయి, ఉపరితలం దిగువన మునిగిపోయి, బురదలో కరిగిపోయింది!” దేవుని వాక్యాలన్నింటిలో ఆయన అస్థిత్వం ఉంటుంది మరియు ప్రజలందరికీ ఈ వాక్యముల గురించి తెలిసినప్పటికీ, ఎవరికీ వాటి అర్థం తెలియదు. దేవుని దృష్టిలో ఆయనను ఎదిరించేవారందరూ ఆయన శత్రువులైయున్నారు, అంటే వారు దుష్టాత్మలకు చెందినవారందరూ జంతువులైయున్నారు. ఈ విషయాల నుండి, సంఘము యొక్క నిజమైన స్థితిని ఎవరైనా గమనించవచ్చు. మనుష్యులందరూ దేవుని వాక్కులు ద్వారా వెలిగించబడతారు, ఈ వెలుగులో, ఇతరుల ఉపన్యాసానికి లేదా శిక్షకు లేదా ప్రత్యక్ష తోసివేతకు గురి కాకుండా, పనులు చేసే ఇతర మానవ మార్గాలకు గురి కాకుండా మరియు ఇతరులు విషయాలను ఎత్తి చూపకుండా వారు తమను తాము పరీక్షించుకుంటారు. ఈ “సూక్ష్మ దృష్టికోణం” నుండి, వారి అంతరంగంలో నిజంగా ఎంత అస్వస్థత ఉందో వారు చాలా స్పష్టంగా చూస్తారు. దేవుని వాక్కులలో, ప్రతి విధమైన ఆత్మ వర్గీకరించబడుతుంది మరియు ఆత్మ యొక్క వాస్తవ రూపము బయలుపరచబడుతుంది; దేవదూతల ఆత్మలతో ఉన్నవారు మరింత ఎక్కువగా వెలిగించబడి, జ్ఞానోదయం పొందుతూ ఎదుగుతారు, అందుకే, దేవుని వాక్యములు ఇలా చెబుతాయి, “వారు ఒకప్పుడు కలిగి ఉన్న పవిత్రతను తిరిగి పొందారు.” ఈ వాక్కులు దేవుడు సాధించిన అంతిమ ఫలితంపై ఆధారపడి ఉంటాయి. నిజానికి, ఈ క్షణంలోనైతే, ఈ ఫలితం ఇంకా పూర్తిగా సాధించబడలేదు, అంటే ఇది కేవలం ముందగా రుచి చూడటం మాత్రమే, దీని ద్వారా దేవుని చిత్తాన్ని చూడవచ్చు. పెద్ద సంఖ్యలో ప్రజలు దేవుని వాక్యములలో బద్ధలు కొట్టుబడతారని మరియు ప్రజలందరిని క్రమేపీ పరిశుద్ధం చేసే ప్రక్రియలో ఓడించబడతారని చూపడానికి ఈ వాక్యములు దోహద పడతాయి. ఇక్కడ, దేవుడు ప్రపంచాన్ని అగ్నితో నాశనం చేయడం అనేదానితో “బురదలో కరిగిపోయింది” విభేదించదు మరియు “పిడుగు” అనేది దేవుని ఉగ్రతను సూచిస్తుంది. దేవుడు తన మహోగ్రతను ప్రదర్శించినప్పుడు, లోకమంతా అగ్నిపర్వతాలు బద్ధలవ్వడంలాంటి అన్ని రకాల విపత్తులను అనుభవిస్తుంది. ఆకాశంలో ఎత్తులో నిలబడి చూస్తే, భూమిపై, అన్ని రకాల విపత్తులు మానవాళిని సమీపించడానికి ఒక రోజు మాత్రమే మిగిలి ఉందని చూడవచ్చు. ఎత్తు నుండి కిందికి చూస్తే, భూకంపం రావడానికి ముందటి దృశ్యాలలాంటి విభిన్న దృశ్యాలను భూమి ప్రదర్శిస్తుంది. ద్రవ అగ్నిజ్వాల అదుపు లేకుండా చొచ్చుకొస్తుంది, లావా స్వేచ్ఛగా ప్రవహిస్తుంది, పర్వతాలు కదిలి పోతాయి మరియు చల్లని కాంతి అన్నిటిపై మెరుస్తుంది. సమస్త ప్రపంచం అగ్నిలో మునిగిపోయింది. ఇది దేవుడు తన ఉగ్రతను ప్రదర్శిస్తున్నప్పటి దృశ్యం, మరియు ఇది ఆయన తీర్పునిచ్చే సమయం. రక్తమాంసాలు ఉన్న వారందరూ తప్పించుకోలేరు. కాబట్టి, సమస్త లోకాన్ని నాశనం చేయడానికి దేశాల మధ్య యుద్ధాలు మరియు ప్రజల మధ్య సంఘర్షణలు అవసరం ఉండవు; దానికి బదులుగా, లోకమంతా దేవుని శిక్ష అనే ఊయలలో “ప్రజ్ఞ కలిగి తనలోతాను ఆనందిస్తుంది.” దీనిని ఎవ్వరూ తప్పించుకోలేరు; ప్రతి ఒక్క వ్యక్తి తప్పకుండా ఈ విషమ పరీక్షలను ఒకదాని తర్వాత ఒకటి దాటుకుంటూ వెళ్ళాలి. ఆపైన, సమస్త విశ్వం మరోసారి పరిశుద్ధ తేజస్సుతో మెరిసి పోతుంది మరియు సమస్త మానవాళి మరోసారి నూతన జీవితాన్ని జీవించడం మొదలు పెడుతుంది. దేవుడు విశ్వం పైన విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు మరియు ప్రతిరోజు సమస్త మానవాళిని ఆశీర్వదిస్తాడు. పరలోకం భరించలేనంత నిర్మానుష్యంగా ఉండదు, కానీ లోకం సృష్టించబడినప్పటి నుండి దానికిలేని శక్తిని తిరిగి సంతరించుకుంటుంది మరియు దేవుడు నూతన జీవితాన్ని మొదలు పెట్టినప్పుడు “ఆరవ రోజు” వస్తుంది. దేవుడు మరియు మానవాళి ఇద్దరూ విశ్రాంతిలోకి ప్రవేశిస్తారు మరియు విశ్వం ఇక ఏమాత్రం కలుషితంగా లేదా అశుద్ధముగా ఉండకుండా నవీకరించబడుతుంది. అందుకే దేవుడు ఇలా చెప్పాడు: “భూమి ఇకపై నిశ్చలంగా మరియు నిశ్శబ్దంగా లేదు, పరలోకం ఇకపై నిర్జనంగా మరియు విచారంగా లేదు.” పరలోక దేవుని రాజ్యంలో, అవినీతి లేదు, లేదా మానవ భావోద్వేగాలు లేవు, లేదా మానవాళికి చెరుపు చేసే ఏదైనా స్వభావం ఎప్పటికీ లేదు, ఎందుకంటే అక్కడ సాతాను ఆటంకం లేదు. “ప్రజలందరూ” దేవుని వాక్కులను అర్థం చేసుకోగలరు మరియు పరలోకంలోని జీవితం పూర్తిగా ఆనందంతో నిండిన జీవితం. పరలోకంలో ఉన్న వారందరికీ దేవుని జ్ఞానం మరియు దేవుని హుందాతనం ఉన్నాయి. పరలోకం మరియు భూమి మధ్య ఉన్న తేడాల కారణంగా, పరలోకంలోని పౌరులు “ప్రజలు” అని పిలవబడరు; అలా కాకుండా, దేవుడు వారిని “ఆత్మలు” అని పిలుస్తాడు. ఈ రెండు పదాల మధ్య చెప్పుకోదగ్గ తేడాలు ఉన్నాయి, ఇప్పుడు “ప్రజలు” అని పిలవబడేవారు సాతానుచే చెరపబడ్డారు, అదే “ఆత్మలు” విషయంలో అలా జరగలేదు. ముగింపులో, దేవుడు భూమిపై ఉన్న ప్రజలను పరలోక ఆత్మల లక్షణాలుగల జీవులుగా మారుస్తాడు, ఆ తర్వాత ఇక ఎప్పుడూ వారు సాతాను ఆటంకానికి గురి కారు. “నా పరిశుద్ధత విశ్వమంతటా విస్తరించింది.” “భూమి దాని ప్రాధమిక స్థితిలో పరలోకానికి చెందియుంది మరియు పరలోకం భూమితో ఐక్యమైయుంది. మానవుడు పరలోకాన్ని మరియు భూమిని కలిపే త్రాడు, మరియు మనిషి యొక్క పవిత్రత కారణంగా, మనిషి యొక్క పునరుద్ధరణ కారణంగా, పరలోకం ఇకపై భూమి నుండి దాచబడదు మరియు భూమి పరలోక విషయమై మౌనంగా ఉండదు.” ఇదే ఈ వాక్కులకు నిజమైన అర్థం. ఇటువంటి సమయములోనే, “దూతలు” మరొకసారి సమాధానముగా కలిసి ఉనికిలో ఉంటారు మరియు వారు తమకున్న పూర్వ స్థితిని తిరిగి పొందుకుంటారు, భూమ్యాకాశముల ప్రపంచాలకు మధ్యన శరీరము ద్వారా ఎన్నటికి వేరు చేయబడరు. భూమిపై ఉన్న “దేవదూతలు” పరలోకంలోని దేవదూతలతో సంభాషించగలరు, భూమిపై ఉన్న వ్యక్తులు పరలోకపు రహస్యాలను తెలుసుకుంటారు మరియు పరలోకంలోని దేవదూతలు మానవ లోకంలోని రహస్యాలను తెలుసుకుంటారు. పరలోకం మరియు భూమి మధ్య దూరం లేకుండా రెండూ ఏకమవుతాయి. దేవుని రాజ్యం గురించి వాస్తవం తెలుసుకోవటంలో ఉన్న అందం ఇదే. దేవుడు పూర్తి చేసేది ఇదే, మానవులు మరియు ఆత్మలు అన్నీ కోరుకునేది కూడా ఇదే. కానీ మతపరమైన ప్రపంచంలో ఉన్నవారికి దీని గురించి ఏమీ తెలియదు. వారు రక్షకుడైన యేసు తెల్లటి మేఘంపై వచ్చి, “చెత్తను” భూమిపైనే వదిలేసి, తమ ఆత్మలను తీసుకువెళ్లడం కోసం మాత్రమే ఎదురు చూస్తున్నారు (ఇక్కడ “చెత్త” అనేది మృతదేహాలను సూచిస్తుంది). మానవులందరిలో ఉన్న ఆలోచన ఇది కాదా? అందుకే దేవుడు ఇలా చెప్పాడు: “ఓహ్, మతపరమైన ప్రపంచమా! భూమిపై నా అధికారం ద్వారా అది ఎలా నాశనం చేయబడదు?” దేవుని ప్రజలు భూమిపై తమ జీవితాన్ని పూర్తి చేయడంవలన, మతపరమైన ప్రపంచం తలకిందులవుతుంది. దేవుడు చెప్పిన “అధికారము” అనే మాటకు నిజమైన అర్థం ఇదే. దేవుడు ఇలా చెప్పాడు: “నా కాలంలో, నా పేరును కించపరిచే వారు, ఎవరైనా ఉన్నారా? మనుష్యులందరూ తమ భక్తిపూర్వక దృష్టిని నా వైపు మళ్లిస్తారు మరియు తమ హృదయాలలో, వారు రహస్యంగా నాకు మొర్ర పెడతారు.” మతపరమైన ప్రపంచ వినాశనం వలన కలిగే పరిణామాల గురించి ఆయన చెప్పింది ఇదే. ఇది ఆయన వాక్యముల కారణంగా దేవుని సింహాసనం యెదుట తననుతాను సంపూర్ణంగా సమర్పించుకుంటుంది మరియు ఇకపై తెల్లటి మేఘం దిగి రావడం కోసం ఎదురు చూడదు, లేదా ఆకాశం వైపు చూడదు, అలా కాకుండా దేవుని సింహాసనం యెదుట జయించబడుతుంది. అందుకే, “తమ హృదయాలలో, వారు రహస్యంగా నాకు మొర్ర పెడతారు” ఈ వాక్యములు ఇలా ఉన్నాయి—ఇదే మతపరమైన ప్రపంచపు పరిణామం, దీనిని దేవుడు సంపూర్ణంగా జయిస్తాడు. దేవుని పరాక్రమం ప్రస్తావించేది ఇదే, అంటే తమకు దేవుడు తెలుసుననే సొంత ఆలోచనలను ఇక ఎప్పుడూ పట్టుకుని వేలాడకుండా, మానవజాతిలో అత్యంత తిరుగుబాటుతనంగల మతపరమైన ప్రజలందరినీ కూలదోయడం జరుగుతుంది.

దేవుని వాక్యములు పదేపదే దేవుని రాజ్యపు అందం గురించి ముందుగా చెప్పనప్పటికీ, దాని వివిధ అంశాల గురించి మాట్లాడినప్పటికీ మరియు దానిని విభిన్న దృష్టికోణాల నుండి వివరించినప్పటికీ, అవి ఇప్పటికీ దేవుని రాజ్యకాలపు ప్రతి పరిస్థితిని పూర్తిగా వ్యక్తపరచలేవు, ఎందుకంటే, వాటిని స్వీకరించే ప్రజల సామర్థ్యం మరీ తక్కువ. ఆయన పలికిన వాక్యములన్నీ చెప్పబడ్డాయి, కానీ ప్రజలు ఫ్లోరోస్కోప్ ద్వారా, ఎక్స్-కిరణాలతో వాటి లోపలికి చూడలేదు, కాబట్టి వాటిపై స్పష్టత మరియు అవగాహన లేకుండా పోయింది మరియు తికమక కూడా పడ్డారు. ఇదే శరీరమందున్న అతి పెద్ద లోపం. ప్రజలు తమ హృదయాలలో దేవుణ్ణి ప్రేమించాలని అనుకున్నప్పటికీ, సాతాను ఆటంకం కారణంగా వారు ఆయనను ఎదిరిస్తారు, కాబట్టి దేవుడు ప్రజలను ఉజ్జీవింపజేయడానికి, వారి మొద్దుబారిన హృదయాలను పదేపదే స్పృశించాడు. దేవుడు బయలుపరచినదంతా సాతాను చెడుతనమునే, అందుకే ఆయన మాటలు ఎంత ఎక్కువ కఠినంగా ఉంటాయో, అంత ఎక్కువగా సాతానుకు అవమానానికి లోనవుతాడు, ప్రజల హృదయాలు ఎంత తక్కువగా కట్టుబడి ఉంటాయో, ప్రజలలో అంత ఎక్కువగా ప్రేమ వికసిస్తుంది. ఈ విధంగానే దేవుడు తన కార్యమును జరిగిస్తాడు. సాతాను బయలుపరచబడి మరియు వాడిని లోతుగా చూసిన కారణంగా, ఇకపై అది ప్రజల హృదయాలను ఆక్రమించడానికి సాహసం చేయడు, కాబట్టి దేవదూతలు ఇకపై వేధించబడరు. ఈ విధంగా, వారు తమ పూర్ణ హృదయముతో మరియు పూర్ణ మనస్సుతో దేవుణ్ణి ప్రేమిస్తారు. ఇప్పుడు మాత్రమే, దేవదూతలు దేవునికి చెందినవారని మరియు దేవుణ్ణి ప్రేమిస్తారని ప్రజలు వారి నిజమైన ఆత్మలలో స్పష్టంగా చూస్తారు. ఈ మార్గం ద్వారా మాత్రమే దేవుని చిత్తం నెరవేరగలదు. “మానవులందరి హృదయాల లోపల, ఇప్పుడు నా కోసం ఒక స్థలం ఉంది. ఇకపై నేను మనుషుల యొక్క విరక్తిని లేదా తిరస్కరణను ఎదుర్కోను, ఎందుకంటే నా గొప్ప పని ఇప్పటికే నెరవేర్చబడింది మరియు ఇకపై ఆటంకం ఉండదు.” పైన వివరించిన దాని అర్థం ఇదే. సాతాను వేధింపు కారణంగా, దేవుణ్ణి ప్రేమించడానికి ప్రజలకు సమయం దొరకదు మరియు ఎల్లప్పుడూ ప్రాపంచిక విషయాలలో చిక్కుకుపోతారు మరియు సాతానుచే వంచించబడి, వారు గందరగోళంతో ప్రవర్తిస్తారు. అందుకే దేవుడు, మానవాళికి “జీవితంలో చాలా కష్టాలను, ప్రపంచంలోని అనేక అన్యాయాలను, మనుషుల యొక్క అనేక వైపరీత్యాలను ఎదుర్కొన్నాను, కానీ ఇప్పుడు వారు నా వెలుగులో నివసిస్తారు. గత అన్యాయాలను బట్టి ఎవరు విలపించారు?” అని చెప్పాడు. ప్రజలు ఈ వాక్యములు విన్నప్పుడు, వారి దుఃఖంలో దేవుడు వారి భాగస్వామి అయినట్టు, వారిపట్ల సానుభూతి చూపుతున్నట్టు, ఆ సమయంలో, వారి ఫిర్యాదులను చెప్పుకుంటున్నట్టు వారు భావిస్తారు. వారికి అకస్మాత్తుగా మానవ ప్రపంచంలోని బాధ తెలుస్తుంది, అప్పుడుఇలా ఆలోచిస్తారు: “ఇది ఎంతో నిజం, నేను ప్రపంచంలో ఎప్పుడూ దేనినీ ఆనందించలేదు. నా తల్లి గర్భం నుండి బయటపడ్డప్పటి నుండి ఇప్పటివరకు, నేను మానవ జీవితాన్ని అనుభవించాను, నేను ఏమీ పొందలేదు, కానీ నేను ఎంతో బాధపడ్డాను. ఇదంతా ఎంతో శూన్యం! ఇప్పుడు నేను సాతానుచే ఎంతో చెడగొట్టబడ్డాను! ఓహ్! దేవుని రక్షణ లేకపోతే, నా మరణ సమయం ఆసన్నమైనప్పుడు, నేను నా జీవితమంతా వృథాగా జీవించినట్టు ఉండదా? మానవ జీవితానికి ఏమైనా అర్థం ఉందా? సూర్యునికింద ఉన్నదంతా వ్యర్థమని దేవుడు చెప్పడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఈ రోజు దేవుడు నాకు జ్ఞానోదయం కలిగించి ఉండకపోతే, నేను ఇప్పటికీ చీకటిలోనే ఉండేవాడిని. ఎంత దౌర్భాగ్యం!” ఈ సమయంలో, వారి హృదయంలో ఒక అనుమానం తలెత్తుతుంది: “నేను దేవుని వాగ్దానం పొందలేకపోతే, నేను జీవితాన్ని అనుభవించడాన్ని ఎలా కొనసాగించగలను?” ఈ వాక్యములు చదివిన వారందరికీ వారు ప్రార్థించేటప్పుడు కన్నీళ్లు వస్తాయి. మానవుని మానసికత అలాంటిది. ఎవరికైనా మానసిక అసమతుల్యత ఉంటే తప్ప, దీనిని uచదివి, ఎలాంటి స్పందన ఇవ్వకుండా ఉండడం అసాధ్యం. ప్రతిరోజూ, అన్ని రకాల ప్రజల స్థితిగతులను దేవుడు బయలుపరుస్తాడు. కొన్నిసార్లు, వారి తరపున ఆయన మనోవేదనలను వెల్లగక్కుతాడు. కొన్నిసార్లు, ఒక ప్రత్యేక పరిస్థితిని అధిగమించడానికి మరియు విజయవంతంగా దాటడానికి ప్రజలకు ఆయన సహాయం చేస్తాడు. కొన్నిసార్లు, ప్రజల కోసం వారి “రూపాంతర జీవితములను” ఆయన ఎత్తి చూపుతాడు. అలా కాకపోతే, ప్రజలు జీవితంలో ఎంత ఎదిగారో వారికి తెలియదు. కొన్నిసార్లు, దేవుడు ప్రజల అనుభవాలను వాస్తవికతలో ఎత్తి చూపుతాడు, మరికొన్నిసార్లు, వారి లోపాలను మరియు దోషాలను ఎత్తి చూపుతాడు. కొన్నిసార్లు, ఆయన వారి నుండి కొత్త అవసరతలను కోరుకుంటాడు, మరికొన్నిసార్లు, వారు తనను అర్థం చేసుకునే స్థాయిని ఎత్తి చూపుతాడు. అయితే, దేవుడు ఇలా కూడా చెప్పాడు: “నేను చాలా మంది చెప్పిన హృదయపూర్వక మాటలను, కష్టాల మధ్య వారి బాధాకరమైన అనుభవాల గురించి చాలా మంది చెప్పిన కథనాలు విన్నాను; చాలా మంది, విపత్కర పరిస్థితుల్లో, నా పట్ల నిరంతరం తమ విధేయతను చూపడం నేను చూశాను, నేను చాలా మందిని, కఠిన మార్గంలో నడుస్తున్నప్పుడు, బయటపడే మార్గం కోసం వెతకడం గమనించాను.” ఇది సానుకూల పాత్రల వివరణయైయున్నది. “మానవ చరిత్ర నాటకం” యొక్క ప్రతి అంకములో, సానుకూల పాత్రలే కాకుండా ప్రతికూల పాత్రలు కూడా ఉంటాయి. కాబట్టి, దేవుడు ఈ ప్రతికూల పాత్రల చెడుతనాన్ని బహిర్గతం చేస్తూనే ఉంటాడు. ఆ విధంగా, “విశ్వాసఘాతకులతో” పోల్చి చూడటం ద్వారానే “నిజాయితీపరులైన మనుషుల” వినయమైన నమ్మకత్వమ మరియు భయంలేని ధైర్యము బహిర్గతం అవుతుంది. ప్రజలందరి జీవితాలలో, ప్రతికూల అంశాలు, అలాగే తప్పనిసరిగా సానుకూలమైన అంశాలు కూడా ఉంటాయి. ప్రజలందరి గూర్చిన సత్యాన్ని బయలుపరచడానికి దేవుడు ఆ రెండింటిని ఉపయోగించుకుంటాడు. తద్వారా విశ్వాసఘాతకులు తమ తలలను వంచుకొని, వారి పాపములను ఒప్పుకుంటారు. తద్వారా, అటువంటి ప్రోత్సాహముతో, నీతిమంతుల నమ్మకంగా కొనసాగుతూ జీవిస్తుంటారు. దేవుని వాక్యములలోని అంతరార్థాలు చాలా లోతుగా ఉంటాయి. కొన్నిసార్లు, ప్రజలు వాటిని చదివి పొట్టచెక్కలయ్యేలా నవ్వుతారు, మరికొన్నిసార్లు, మౌనంగా తలలు వంచుకుంటారు. కొన్నిసార్లు, వారు గతాన్ని గుర్తుచేసుకుంటారు, కొన్నిసార్లు బిగ్గరగా ఏడుస్తూ, తమ పాపాలను అంగీకరిస్తారు, కొన్నిసార్లు తడబడతారు, మరికొన్నిసార్లు వెదుకుతూ ఉంటారు. మొత్తంమీద, దేవుడు మాట్లాడే భిన్న పరిస్థితుల కారణంగా ప్రజల ప్రతిస్పందనలలో మార్పులు ఉంటాయి. ఒక వ్యక్తి దేవుని వాక్యములను చదివినప్పుడు, విన్నవారు కొన్నిసార్లు ఆ వ్యక్తి మానసిక అనారోగ్యంతో ఉన్నాడని కూడా పొరపాటుగా విశ్వసించవచ్చు. ఈ వాక్యములను పరిశీలించండి: “కాబట్టి, భూమిపై వివాదాస్పదమైన విభేదాలు లేవు, మరియు నేను జారీ చేసిన మాటలను బట్టి, ఆధునిక యుగం యొక్క వివిధ ‘ఆయుధాలు’ ఉపసంహరించబడతాయి.” ఇందులో “ఆయుధాలు” అనే పదం ఒక్కటే రోజంతటికీ సరిపోయే నవ్వుకు ఆజ్యం పోయవచ్చు మరియు ఈ “ఆయుధాలు” పదాన్ని ఎవరైనా అనుకోకుండా గుర్తుకు తెచ్చుకున్నప్పుడల్లా, తమలో తామే గట్టిగా నవ్వుకుంటారు. అంతే కదా? దీన్ని చూసి నీవు నవ్వకుండా ఎలా ఉండగలవు?

నీవు నవ్వినప్పుడు, దేవుడు మానవాళి నుండి ఏమి కోరుకుంటున్నాడో గ్రహించడం మర్చిపోవద్దు మరియు చర్చి వాస్తవ స్థితిని కూడా చూడటం మర్చిపోవద్దు: “మానవజాతి మొత్తం సాధారణ స్థితికి తిరిగి వచ్చింది మరియు కొత్త జీవితాన్ని ప్రారంభించింది. కొత్త పరిసరాలలో నివసిస్తున్నారు, చాలా మంది తమ చుట్టూ చూస్తూ, తాము పూర్తిగా కొత్త ప్రపంచంలోకి ప్రవేశించినట్లు భావిస్తున్నారు, మరియు దీని కారణంగా, వారు తమ ప్రస్తుత వాతావరణానికి తగినట్టుగా వెంటనే మారలేకపోతున్నారు లేదా ఒకేసారి సరైన మార్గంలోకి ప్రవేశించలేకపోతున్నారు.” ఇదే సంఘము యొక్క ప్రస్తుత వాస్తవ స్థితి. ప్రజలందరూ తక్షణమే సరైన మార్గంలోకి ప్రవేశించాలని మరీ ఎక్కువ ఆత్రుత పడకు. పరిశుద్ధాత్మ కార్యము ఒక దశ వరకు పురోగమించిన తర్వాతే, ప్రజలందరూ అదేమిటో తెలుసుకోకుండానే దానిలోకి ప్రవేశిస్తారు. నీవు దేవుని వాక్యముల గుణగణాలను గ్రహించినప్పుడు, ఆయన ఆత్మ ఏ దశ వరకు పని చేసిందో నీకు తెలుస్తుంది. దేవుని చిత్తం ఇలా ఉంది: “నేను మనిషి యొక్క దుర్మార్గాన్ని బట్టి, తగిన 'ఉపదేశ' కొలమానాన్ని మాత్రమే వాడతాను, ప్రతి ఒక్కరూ సరైన మార్గంలోకి వెళ్లేలా చేయడం మంచిది.” ఇదే దేవుడు మాట్లాడే మరియు పని చేసే విధానం, అలాగే మానవాళి ఆనుసరించాల్సిన నిర్దిష్ట మార్గం కూడా ఇదే. దీని తరువాత, ఆయన మానవాళి మరొక స్థితిని ప్రజలకు ఎత్తి చూపాడు: “మనుష్యులు నాలో ఉన్న ఆనందాన్ని ఆస్వాదించడానికి ఇష్టపడకపోతే, వారు తమ హృదయాలను ఏర్పరచుకున్న దానిని బట్టి నేను వారిని అగాధంలోకి పంపగలను.” దేవుడు విస్తృతంగా మాట్లాడాడు మరియు ప్రజలు ఫిర్యాదు చేయడానికి లేశమాత్రం అవకాశం కూడా లేకుండా చేశాడు. ఇదే దేవునికి మనిషికి మధ్య ఉన్న ఖచ్చితమైన తేడా. దేవుడు ఎల్లప్పుడూ మనిషితో మనసు విప్పి, స్వేచ్ఛగా మాట్లాడుతున్నాడు. దేవుడు చెప్పే ప్రతి మాటలో, ఎవరైనా ఆయన నిజాయితీతో కూడిన హృదయాన్ని చూడవచ్చు, ఇది ప్రజలు ఆయన హృదయంతో తమ హృదయాలను పోల్చుకుని కొలుచుకునేలా, వారి హృదయాలను ఆయన కోసం తెరిచేలా వీలు కల్పిస్తుంది, దీంతో ఇంద్రధనస్సు వర్ణ పటంలో వారు ఏ బిందువు వద్ద ఉన్నారో ఆయన చూడవచ్చు. దేవుడు ఏ వ్యక్తి విశ్వాసాన్ని గాని, లేదా ప్రేమను గాని ఎప్పుడూ మెచ్చుకోలేదు, అయితే ఆయన ఎల్లప్పుడూ ప్రజల అవసరాలను తీరుస్తూ, వారి చేడుతనాన్ని బయలుపరిచాడు. ప్రజలకు ఎంత స్వల్ప “స్థాయి” ఉందో మరియు వారి “నీతి” ఎంత లోపించిందో ఇది చూపిస్తుంది. ఈ లోపాలను నింపడానికి వారు మరింత “సాధన” చేయవలసిన అవసరముంది, ఇందుచేతనే దేవుడు ఎల్లప్పుడు ప్రజలపై “తన కోపాన్ని ప్రదర్శించుకుంటూ వచ్చాడు”. ఏదో ఒక రోజు, దేవుడు మానవాళి గురించిన పూర్తి సత్యాన్ని బయలుపరచినప్పుడు, ప్రజలు పరిపూర్ణులుగా తయారు చేయబడతారు మరియు దేవుడు విరామంగా ఉంటాడు. ప్రజలు ఇకపై దేవుణ్ణి ప్రాధేయపడరు మరియు ఆయన ఇకపై వారికి “బోధన” చేయడు. అది మొదలు, ప్రజలు “వారి సొంతంగా జీవించగలుగుతారు,” కానీ దానికి ఇప్పుడు సమయం కాదు. ప్రజలలో ఇప్పటికీ “వంచకులు” అని పిలిచేలా వారిలో చాలా ఉన్నాయి మరియు ఇంకా అనేక రీతులుగా పరీక్షించవలసిన అవసరం ఉంది, వారి “పన్నులు” సరిగ్గా చెల్లించబడగలిగేలా అనేక “తనిఖీ కేంద్రాలు” అవసరమైయున్నాయి. ఇప్పటికీ నకిలి సామాగ్రి ఉంటే, వాటిని అమ్మకుండా చేయడానికి వాటిని జప్తు చేస్తారు, ఆ తర్వాత దొంగ రవాణా చేయబడిన సామాగ్రిని ధ్వంసం చేస్తారు. ఇలా చేయడం మంచి పద్ధతి కాదా?

మునుపటి:  16 వ అధ్యాయము

తరువాత:  22 మరియు 23 వ అధ్యాయాలు

సెట్టింగులు

  • వచనం
  • థీమ్స్

ఘన రంగులు

థీమ్స్

అక్షరశైలి

అక్షరశైలి పరిమాణం

గీతల మధ్య దూరం

గీతల మధ్య దూరం

పేజీ వెడల్పు

విషయ సూచిక

శోధించండి

  • ఈ వచనాన్ని శోధించండి
  • ఈ పుస్తకాన్ని శోధించండి

Connect with us on Messenger