22 మరియు 23 వ అధ్యాయాలు
ఈ రోజు, దేవుని చిత్తాన్ని గ్రహించడానికి, దేవుని స్వభావాన్ని తెలుసుకోవడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు, అయినప్పటికీ వారు చేయాలనుకున్న దానిని కొనసాగించలేకపోవడానికి, వారి హృదయాలు ఎల్లప్పుడూ వారికి ఎందుకు నమ్మకద్రోహం చేస్తాయో మరియు వారు సాధించాలనుకున్నది ఎందుకు సాధించలేకపోతున్నారో కారణం ఎవరికీ తెలియదు. తత్ఫలితంగా, వారు మరోసారి అణచివేసే నిరాశచేత ఆవరించబడతారు, అయినా వారు భయపడుతూనే ఉంటారు. ఈ వివాదాస్పద భావోద్వేగాలను వ్యక్తం చేయలేక, వారు దుఃఖంతో తమ తలలు వాల్చుకొని, “దీనర్థం దేవుడు నాకు జ్ఞానోదయం కలిగించలేదనా? దీనర్థం దేవుడు నన్ను రహస్యంగా పరిత్యజించాడనా? బహుశా మిగతా వారందరూ బాగానే ఉండవచ్చు, దేవుడు నాకు తప్ప వారందరికీ జ్ఞానోదయం కలిగించాడు. నేను దేవుని వాక్యములను చదువుతున్నప్పుడు ఎప్పుడూ ఎందుకు కలత చెందుతాను, అంటే, నేనెప్పుడూ దేనినైనా ఎందుకు గ్రహించలేను?” అని తమను తాము ఎల్లప్పుడు ప్రశ్నించుకుంటారు. ప్రజల మనస్సులలో అలాంటి ఆలోచనలు ఉన్నప్పటికీ, వాటిని వ్యక్తపరచడానికి ఎవరూ సాహసించరు; వారు లోలోపల మదనపడుతూనే ఉంటారు. వాస్తవానికి, దేవుని వాక్యములను ఆయన తప్ప మరెవరూ అర్థం చేసుకోలేరు లేదా ఆయన నిజమైన చిత్తాన్ని గ్రహించలేరు. అయినప్పటికీ, తన చిత్తాన్ని గ్రహించాలని దేవుడు ఎల్లప్పుడూ ప్రజలను అడుగుతూనే ఉంటాడు, అంటే, ఇది ఒక బాతును బలవంతంగా కొమ్మపైకి తీసుకురావడానికి ప్రయత్నించడం లాంటిది కాదా? మానవుని వైఫల్యాల గురించి దేవునికి తెలియదా? దేవుని కార్యములో ఇది ఒక సంకటస్థితి, దీనిని ప్రజలు అర్థం చేసుకోలేరు, కాబట్టే, దేవుడు, “మనిషి వెలుగు మధ్యన జీవిస్తున్నాడు, అయినప్పటికీ అతనికి వెలుగు యొక్క అమూల్యత తెలియదు. అతనికి వెలుగు యొక్క సారాంశం మరియు వెలుగు యొక్క మూలం గురించి, అంతేకాకుండా, వెలుగు ఎవరికి చెందినదో తెలియదు.” అని చెప్పాడు. దేవుని వాక్యములు మనిషికి తెలిపేదాని ప్రకారం మరియు వారు ఆయన నుండి కోరుకునే దాని ప్రకారం, ఎవరూ మనుగడ సాధించరు, ఎందుకంటే మనిషి శరీరంలో దేవుని వాక్యాలను అంగీకరించడానికంటూ ఏదీ లేదు. కాబట్టి, దేవుని వాక్యములకు విధేయత చూపగలగడం, దేవుని వాక్యములను ఆస్వాదించగలగడం, ఆకాంక్షించగలగడం మరియు మనిషి స్థితిని గురించి దేవుడు సూచించే వాక్యములను వారి సొంత పరిస్థితులకు అన్వయించుకోగలగడం, తద్వారా తమను తాము తెలుసుకుంటారన్నదే అత్యున్నతమైన ప్రమాణం. అంతిమంగా దేవుని రాజ్యం వచ్చినప్పుడు, శరీరములో ఉన్న మనిషి ఇప్పటికీ దేవుని చిత్తాన్ని గ్రహించలేడు, అతనికి ఇప్పటికీ వ్యక్తిగత మార్గనిర్దేశం అవసరమవుతుంది, అయినప్పటికీ ప్రజలు సాతాను అవరోధం లేకుండా ఉంటారు మరియు మానవుని సాధారణ జీవితాన్ని కలిగియుంటారు; సాతానును ఓడించడంలో దేవుని లక్ష్యం ఇదే. దేవుడు తాను సృష్టించిన మనిషి అసలు స్వభావాన్ని తిరిగి పొందుకునే క్రమములో ఆయన దీనిని ప్రధానంగా జరిగిస్తాడు. దేవుని మనస్సులో, “శరీరము” అనేది ఈ కింది వాటిని సూచిస్తుంది: శరీరము దేవుని స్వభావాన్ని తెలుసుకోలేనిది; శరీరము ఆధ్యాత్మిక ప్రపంచపు వ్యవహారాలను చూడలేనిది; అంతేగాకుండా, సాతానుచే భ్రష్టుపట్టే విధంగా ఉన్నప్పటికీ, దేవుని ఆత్మచేత కూడా నిర్దేశించబడుతుంది. దేవుని ద్వారా సృష్టించబడిన శరీరపు గుణగణాలు ఇవే. సహజంగానే, మానవాళి జీవితాల్లో అస్తవ్యస్తత కలిగించే గందరగోళాన్ని నివారించడానికి కూడా ఇది ఉద్దేశించబడింది. దేవుడు ఎంత ఎక్కువగా మాట్లాడితే, ఆయన ఎంత ఎక్కువగా తీవ్రంగా మాట్లాడితే అంత ఎక్కువమంది అర్థం చేసుకుంటారు. ప్రజలు తమకు తెలియకుండానే మారుతారు మరియు తెలియకుండానే వెలుగులో జీవిస్తారు, కాబట్టి, “వెలుగు కారణంగా, అవి పెరుగుతున్నాయి మరియు చీకటిని విడిచిపెట్టాయి.” ఇది దేవుని రాజ్యంలోని అందమైన దృశ్యం, మరియు “వెలుగులో జీవించడం, మరణం నుండి వెడలి పోవడం” గురించి తరచూ చెప్పబడింది. భూమిపై పాపం గురించి స్పష్టంగా తెలుసుకున్నప్పుడు, అంటే, దేవుని రాజ్యమును గూర్చి తెలుసుకున్నప్పుడు, భూమి మీద ఇకపై యుద్ధం ఉండదు; ఇకపై తిరిగి ఎప్పుడూ కరువులు, తెగుళ్ళు, భూకంపాలు ఉండవు; ప్రజలు ఆయుధాలను ఉత్పత్తి చేయడం ఆపివేస్తారు; అందరూ శాంతిని, స్థిరత్వమును కలిగి జీవిస్తారు; ప్రజల మధ్య సాధారణ సంబంధాలు మరియు దేశాల మధ్య సాధారణ సంబంధాలు ఉంటాయి. కానీ ప్రస్తుత పరిస్థితికి దీనితో పోలిక లేదు. ఆకాశం కింద అంతా గందరగోళంగా ఉంది మరియు ప్రతి దేశంలో క్రమంగా తిరుగుబాట్లు తలెత్తుతాయి. దేవుని పలుకుల నేపథ్యంలో, ప్రజలు క్రమంగా మారుతున్నారు మరియు అంతర్గతంగా, ప్రతి దేశం నెమ్మదిగా ముక్కలుగా విభజించబడుతుంది. బబులోను స్థిరమైన పునాదులు ఇసుక మీద కట్టిన కోటలాగాకంపించడం ప్రారంభిస్తాయి మరియు దేవుని చిత్తం మారినప్పుడు, లోకంలో తెలియకుండానే విపరీతమైన మార్పులు సంభవిస్తాయి మరియు లోకానికి అంతిమ దినం వచ్చిందని ప్రజలకు చూపిస్తూ, ఏ సమయంలోనైనా అన్ని రకాల సంకేతాలు కనిపిస్తాయి! ఇది దేవుని ప్రణాళిక; ఆయన కార్యము చేసే దశలు ఇవే మరియు ప్రతి దేశం నిస్సందేహంగా ముక్కలు చేయబడుతుంది. పాత సొదొమ రెండవసారి నాశనం చేయబడుతుంది, కాబట్టి, దేవుడు “ప్రపంచం పథానమైపోతుంది! బబులోను శక్తిహీమైపోయింది!” అని అంటాడు, దీనిని దేవుడు తప్ప మరెవరూ పూర్తిగా అర్థం చేసుకోలేరు; వాస్తవంగా చూస్తే, ప్రజల అవగాహనకు ఒక పరిమితి ఉంది. ఉదాహరణకు, ప్రస్తుత పరిస్థితులు అస్థిరంగాను మరియు అల్లకల్లోలంగాను ఉన్నాయని అంతర్గత వ్యవహారాల మంత్రులకు తెలిసి ఉండవచ్చు, కానీ వారు వాటిని తెలియజేయడములో అసమర్థులై ఉన్నారు. ఈ దయనీయ పరిస్థితులను తలకిందులు చేస్తూ, తాము తలెత్తుకోగలిగే రోజు కోసం, లోకమంతా వెలుగును ప్రసరిస్తూ, తూర్పున సూర్యుడు మరోసారి ఉదయించే రోజు రావడం కోసం, తమ మనస్సులలో ఆశిస్తూ, వారు కేవలం ప్రస్తుత పరిస్థితులను నడపడం మాత్రమే చేయగలరు. అయితే, సూర్యుడు రెండవసారి ఉదయించినప్పుడు, అది పాత వ్యవస్థను పునరుద్ధరించడానికి కాదని, అది పునరుజ్జీవనం, సంపూర్ణ మార్పు అని వారికి కొద్దిపాటి అవగాహన ఉంది. సమస్త విశ్వం కోసం దేవుని ప్రణాళిక ఇలాగే ఉంటుంది. ఆయన ఒక కొత్త లోకాన్ని తయారు చేస్తాడు, అన్నింటికి మించి, ఆయన మొదట మనిషిని పునరుద్ధరిస్తాడు. ఈ రోజు, మానవాళిని ఆశీర్వాదాలను అనుభవించే స్థాయిలో మాత్రమే ఉండిపోనివ్వకుండా, వారిని దేవుని వాక్యాలలోకి తీసుకురావడమే అతి ముఖ్యమైన కార్యమై ఉన్నది. అంతేకాకుండా, “రాజ్యంలో, నేనే రాజును-కానీ నన్ను రాజుగా భావించే బదులు, మనిషి నన్ను ‘పరలోకం నుండి దిగివచ్చిన రక్షకునిగా’ పరిగణిస్తున్నాడు. దాని ఫలితంగా, నేను తన అవసరాలు తీర్చాలని కోరుకుంటాడు మరియు నన్ను గూర్చిన జ్ఞానాన్ని అనుసరించడంలేదు” అని దేవుడు చెప్పినట్లు, ప్రజలందరి నిజమైన పరిస్థితులు అలాంటివే. ఈ రోజు, ప్రజలు ఏమీ కోరుకోకుండానే దేవుణ్ణి తెలుసుకునేలా చేస్తూ, మానవుడు సంతృప్తి చెందలేని దురాశను పూర్తిగా పారద్రోలడమనేదే కీలకమైన విషయం. అలాంటప్పుడు, “చాలా మంది బిచ్చగాళ్లలాగా నా ముందు వేడుకున్నారు; చాలా మంది నా ముందు తమ ‘మూటలు’ తెరిచారు మరియు బ్రతకడానికి ఆహారం ఇవ్వమని నన్ను వేడుకున్నారు.” అని దేవుడు చెప్పడంలో ఆశ్చర్యం లేదు. ఇలాంటి స్థితులు ప్రజల దురాశను సూచిస్తాయి మరియు వారు దేవుణ్ణి ప్రేమించడం లేదని, కానీ ఆయన నుండి కోరికలు కోరుతారని, లేదా వారు ఇష్టపడే వాటిని పొందడానికి ప్రయత్నిస్తారని చూపుతున్నాయి. ప్రజలకు ఆకలితో ఉన్న తోడేలు స్వభావం ఉంటుంది; వారందరూ మోసగాళ్లు మరియు దురాశపరులు, కాబట్టి, వారి దురాశతో నిండిన హృదయాలను అప్పగించమని మరియు నిజాయితీ నిండిన హృదయాలతో దేవుణ్ణి ప్రేమించమని బలవంతం చేస్తూ, వారు చేయాల్సిన ఆవశ్యకాలను దేవుడు పదే పదే కోరుతాడు. వాస్తవంగా చెప్పాలంటే, ఈనాటికే, ప్రజలు తమ హృదయాలను పూర్తిగా దేవునికి ఇవ్వవలసి ఉంది; వారు ఆయనపై పూర్తిగా ఆధారపడకుండా, కొన్నిసార్లు తమపైతామే ఆధారపడుతూ, మరికొన్నిసార్లు దేవునిపై ఆధారపడుతూ, రెండు పడవలపై కాలు మోపుతారు. దేవుని కార్యము ఒక నిర్దిష్ట స్థానానికి చేరుకున్నప్పుడు, ప్రజలందరూ నిజమైన ప్రేమ మరియు విశ్వాసం మధ్య జీవిస్తారు మరియు దేవుని చిత్తం నెరవేర్చబడుతుంది; ఆవిధంగా, దేవుడు కోరుకునేవి నెరవేర్చలేనంత ఎత్తైన స్థితిలో లేవు.
దేవదూతలు పరలోకం మరియు భూలోకం మధ్య హడావుడిగా తిరుగుతూ, ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తిరిగి వచ్చిన తర్వాత ప్రతిరోజూ మానవ లోకంలోకి దిగుతూ, దేవుని కుమారుల మధ్య మరియు ప్రజల మధ్య నిరంతరం తిరుగుతూ ఉంటారు. ఇది వారి కర్తవ్యం, కాబట్టి, ప్రతిరోజూ, దేవుని కుమారులు మరియు దేవుని ప్రజలను కాపు కాయడానికి గొర్రెల కాపరులు ఉంటారు, వారి జీవితం క్రమంగా మారుతుంది. దేవుడు తన స్వరూపాన్ని మార్చుకున్న రోజున, భూమిపై దేవదూతల కార్యము అధికారికంగా ముగుస్తుంది మరియు వారు పరలోక ప్రపంచానికి తిరిగి వెళ్తారు. ఈ రోజు, దేవుని కుమారులు మరియు ప్రజలందరూ అదే పరిస్థితిలో ఉన్నారు. క్షణాలు గడిచేకొద్దీ, ప్రజలందరూ మారుతున్నారు మరియు దేవుని కుమారులు మరియు దేవుని ప్రజలలో క్రమంగా పరిపక్వత చెందుతున్నారు. పోల్చి చూసినప్పుడు, యెఱ్ఱని మహాఘటసర్పము యెదుట తిరుగుబాటుదారులు అందరు కూడా మారుతున్నారు: ప్రజలు ఇకపై యెఱ్ఱని మహాఘటసర్పమునకు విశ్వాసపాత్రులు కాదు మరియు దయ్యాలు ఇకపై దాని ఏర్పాట్లను అనుసరించవు. అలాకాకుండా, వారు “తమకు తగినట్లుగా ప్రవర్తిస్తారు మరియు ప్రతి ఒక్కటి దాని స్వంత మార్గంలో వెళ్తున్నారు.” ఆ విధంగా, “భూమిపై ఉన్న దేశాలు ఎలా నశించకుండా ఉంటాయి? భూమిపై ఉన్న దేశాలు ఎలా పతనం కాకుండా ఉంటాయి?” అని దేవుడు చెప్పినప్పుడు, పరలోకం తక్షణం కిందికి తోసుకు వస్తుంది…. మానవాళి అంతం గురించి తెలియజేస్తుందా అన్నట్లుగా ఉండే ఇదొక అపశకున భావనయైయున్నది. ఇక్కడ ప్రవచించబడి వివిధ అపశకున సంకేతాలు, యెఱ్ఱని మహాఘటసర్పము యొక్క దేశంలో సరిగ్గా జరుగుతున్నవే మరియు భూమి మీద ఉన్న ఏ ఒక్కరూ దీనిని తప్పించుకోలేరు. ఇది దేవుని వాక్యములలో ప్రవచనములాంటిది. ఈ రోజు, సమయం తక్కువ ఉందనే ఒక హెచ్చరిక ప్రజలందరికీ ఉంది, తమపై ఒక విపత్తు విరుచుకు పడబోతుందని వారు భావిస్తున్నట్లు అనిపిస్తుంది, అయినప్పటికీ వారికి తప్పించుకునే మార్గాలు లేవు, కాబట్టి వారందరికీ ఎలాంటి ఆశ లేదు. దేవుడు “నేను నా రాజ్యం యొక్క ‘ఆంతరంగిక శాల’ ను రోజురోజుకు అలంకరిస్తున్నప్పుడు, నా పనికి అంతరాయం కలిగించడానికి ఎవరూ నా ‘కార్యాలయం’ లోకి అకస్మాత్తుగా ప్రవేశించలేదు.” అని చెబుతాడు, వాస్తవానికి, దేవుని వాక్యముల అర్థం కేవలము ప్రజలు ఆయన వాక్యముల ద్వారా దేవుణ్ణి తెలుసుకోవచ్చని చెప్పడం కాదు. అన్నింటికీ మించి, ప్రతిరోజు దేవుడు తన కార్యములోని తరువాతి భాగాన్ని పూర్తి చేయడానికివిశ్వమంతా అన్ని రకాలుగా అభివృద్ధిని చేస్తాడని అవి సూచిస్తాయి. దీనికి, “నా పనికి అంతరాయం కలిగించడానికి ఎవరూ నా ‘కార్యాలయం’ లోకి అకస్మాత్తుగా ప్రవేశించలేదు.” అని ఆయన చెప్పడానికి కారణం, దేవుడు దైవత్వంతో పనిచేస్తాడు మరియు ప్రజలు ఆయన కార్యములో పాలుపంచుకోవాలని ఇష్టపడినా వారు పాలుపంచుకోవడానికి అసమర్థులైయున్నారు. నేను మిమ్మల్ని ఇలా అడగాలనుకుంటున్నాను: నిజంగా సమస్త విశ్వంలో ప్రతి అభివృద్ధిని నీవు చేయగలవా? భూమిపై ఉన్న ప్రజలు వారి పూర్వీకులను ధిక్కరించేలా నీవు చేయగలవా? దేవుని చిత్తాన్ని సేవించడానికి విశ్వమంతటా ఉన్న ప్రజలను మళ్లించగలవా? సాతాను అల్లర్లు సృష్టించేలా నీవు చేయగలవా? ప్రజలకు ప్రపంచం నిర్మానుష్యంగా మరియు శూన్యంగా ఉందని అనిపించేలా నీవు చేయగలవా? ప్రజలు అలాంటి వాటిని చేయలేరు. గతంలో, సాతాను తన “నైపుణ్యాలను” పూర్తి స్థాయిలో ప్రయత్నించడం ఇంకా జరగనప్పుడు, అవి దేవుని కార్యపు ప్రతి దశలో ఎల్లప్పుడూ జోక్యం చేసుకునేవి; ఈ దశలో, సాతాను వద్ద ఇక కుతంత్రాలు అయిపోయాయి, ప్రజలందరూ దాని గురించి తెలుసుకునేందుకు, దాని నిజమైన రంగులను చూపించేలా దేవుడు చేశాడు. “నా కార్యానికి ఎవరూ ఎప్పుడూ అంతరాయం కలిగించలేదు” అనే వాక్యముల సత్యానికి అసలు అర్థం ఇదే.
ప్రతి రోజూ, సంఘాలలోని ప్రజలు దేవుని వాక్యములను చదువుతారు, ప్రతిరోజూ వారు “నిర్వహించు బల్ల” పై భాగాలుగా ఛేదించబడే కార్యము గుండా వెళ్తుంటారు. ఉదాహరణకు, “తమ హోదాను కోల్పోవడం,” “తొలగించబడటం,” “వారి భయాలు తగ్గించబడ్డాయి మరియు ప్రశాంతతను పునరుద్ధరించడం,” “విడిచిపెట్టబడడం” మరియు “‘భావన’ లేకపోవడం”, —అలాంటి వెక్కిరింపు పదాలు ప్రజలను “వేదిస్తాయి” మరియు వారు సిగ్గుతో మూగబోయేలా చేస్తాయి. వారి సమస్త శరీరం, అంటే తల నుండి పాదాల వరకు, లోపల నుండి బయటి వరకు, ఏ భాగమూ దేవుని ఆమోదాన్ని పొందదన్నట్లుగా ఉంటుంది. దేవుడు తన వాక్కులతో ప్రజల జీవితాలను ఎందుకు అంత బట్టబయలు చేస్తాడు? దేవుడు కావాలనే ప్రజలకు కష్టాలు కల్పిస్తున్నాడా? ఇదెలా ఉందంటే, కడుక్కోలేని విధంగా ప్రజలందరి ముఖాలకు బురద పూసినట్లుగా ఉంది. ప్రతిరోజూ తలలు వంచి, కుంభకోణాలు చేసే కపట నటులవలె వారి పాపాల చిట్టా విప్పుతారు. ప్రజలు తమ సొంత వాస్తవ పరిస్థితుల గురించి పూర్తిగా తెలియనంతగా, సాతాను చేత ఎంతగానో భ్రష్టుపట్టిపోయారు. కానీ దేవుని దృష్టిలో, వారి శరీరపు ప్రతి భాగంలో సాతాను విషం ఉంది, వారి మూలుగలో కూడా ఉంది; ఫలితంగా, దేవుని ప్రత్యక్షతలు ఎంత లోతైన అర్థము కలిగి ఉంటే, ప్రజలు అంత ఎక్కువగా భయపడతారు, ఆవిధంగా ప్రజలందరూ సాతానును తెలుసుకుంటారు మరియు మనిషిలో సాతానును చూస్తారు, ఎందుకంటే వారు నేరుగా తమ కళ్లతో సాతానును చూడలేరు. ప్రజలందరు వాస్తవంలోకి ప్రవేశించారు కాబట్టి, దేవుడు మనిషి స్వభావాన్ని బట్టబయలు చేస్తాడు, అంటే, ఆయన సాతాను స్వరూపాన్ని బట్టబయలు చేస్తాడని చెప్పవచ్చు. ఆవిధంగా నిజమైన, చూడదగిన సాతానును మానవుడు చూడగలిగేలా చేస్తాడు. ఆచరణాత్మకమైన దేవుణ్ణి తెలుసుకోవడం వారికి ఎంతో మంచిది. మానవుడు దేవుణ్ణి శరీర రూపంలో తెలుసుకునేలా ఆయన చేస్తాడు మరియు మానవులందరి దేహంలో నిజమైన, చూడదగిన సాతానును మానవుడు తెలుసుకోగలిగేలా, ఆయన సాతానుకు రూపాన్ని ఇస్తాడు. చెప్పబడే వివిధ స్థితులన్నీ సాతాను పనుల వ్యక్తీకరణలే. కాబట్టి, శరీరముతో ఉన్న వారందరూ సాతాను స్వరూపానికి ప్రతిబింబాలేనని చెప్పవచ్చు. దేవుడు తన శత్రువులకు తగినవాడు కాదు, అంటే వారు ఒకరిపట్ల ఒకరు విరోధులై ఉంటారు, వారు విభిన్నమైన రెండు శక్తులుగా ఉన్నారు; కాబట్టి, దయ్యాలు ఎప్పటికీ దయ్యాలే, మరియు దేవుడు ఎప్పటికీ దేవుడే; వారు నిప్పు మరియు నీరువలె ఒకరికొకరు ఇమడనివారు మరియు వారు ఎల్లప్పుడూ పరలోకానికి మరియు భూమికి ఉన్నంత తేడాను కలిగి ఉంటారు. దేవుడు మనిషిని సృష్టించినప్పుడు, ఒక రకమైన ప్రజలలో దేవదూతల ఆత్మలు ఉండేవి, మరొక రకమైన ప్రజలలో ఆత్మ ఉండేది కాదు, కాబట్టి రెండవ రకానికి చెందిన వారిని దయ్యముల ఆత్మలు ఆవహించాయి, అందుకే వారిని దయ్యాలు అని అంటారు. అంతిమంగా, దేవదూతలు దేవదూతలే, దయ్యాలు దయ్యాలే మరియు దేవుడు దేవుడే. వాటి వాటి ప్రకారంగా ప్రతిదానికి ఉన్నటువంటి అర్థం ఇదే, కాబట్టి, దేవదూతలు భూమిపై రాజ్యపాలన చేస్తూ, ఆశీర్వాదాలు అనుభవించేటప్పుడు, దేవుడు తన నివాస స్థానానికి తిరిగి వచ్చి, విశ్రాంతి తీసుకుంటాడు. మిగిలిన వారందరూ, అంటే దేవుని శత్రువులు బూడిదైపోయారు. వాస్తవానికి, ప్రజలందరూ బయిటికి దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లు కనిపిస్తారు, కానీ మూలం వారి పదార్థములోనే ఉంది, అంటే దేవదూతల స్వభావంగలవారు దేవుని చేతిని, అగాధములో పడకుండగా ఎలా తప్పించుకుంటారు? అదేవిధంగా దయ్యాల స్వభావముతో ఉన్నవారు దేవుణ్ణి నిజంగా ఎలా ప్రేమించగలరు? అలాంటి ప్రజల గుణగణాలు దేవునిపట్ల నిజమైన ప్రేమను చూపించేవి కావు, కాబట్టి వారికి దేవుని రాజ్యంలోకి ప్రవేశించే అవకాశం ఎప్పుడైనా ఎలా ఉంటుంది? లోకాన్ని సృష్టించినప్పుడు దేవుడు అన్నింటినీ ఏర్పాటు చేశాడు, దేవుడు ఈ విధంగా చెప్పినట్టుగానే: “నేను గాలి మరియు వానల మధ్య ముందుకు సాగాను, మరియు సంవత్సరాలు తరబడి మనిషితో గడిపాను మరియు ఈ రోజు వరకు వచ్చాను. ఇవి ఖచ్చితంగా నా కార్యనిర్వహక ప్రణాళిక యొక్క దశలు కావా? నా ప్రణాళికకుకి ఎవరు జోడించారు? నా ప్రణాళిక యొక్క దశల నుండి ఎవరు తప్పించుకోగలరు?” శరీరధారిగా మారిన తరువాత, దేవుడు తప్పక మనిషి జీవితాన్ని అనుభవించాల్సి వచ్చింది, అంటే ఇది ఆచరణాత్మకమైన దేవుని ఆచరణాత్మక వైపు కాదా? మానవుని బలహీనత కారణంగా దేవుడు మనిషి నుండి దేనినీ దాచిపెట్టడు; అలాకాకుండా, ఆయన మనిషికి సత్యాన్ని బట్టబయలు చేస్తాడు, దేవుడు ఈ విధంగా చెప్పినట్టుగానే: “సంవత్సరాలు తరబడి మనిషితో గడిపాను.” ఇది సరిగ్గా ఎందుకంటే, దేవుడు ఈ భూమి మీద సంవత్సరం వెంబడి సంవత్సరం గడిపిన శరీరముగా మారిన దేవుడైయున్నాడు; దానికి అనుగుణంగా, అన్ని రకాల ప్రక్రియలకు లోనైన తర్వాత మాత్రమే ఆయన శరీరధారియైన దేవుడుగా భావించబడగలడు మరియు ఆ తర్వాత మాత్రమే ఆయన శరీరం లోపల దైవత్వంతో కార్యము చేయగలడు. అన్ని రహస్యాలను బహిర్గతము చేసిన తర్వాత, ఆయన తన స్వరూపాన్ని స్వేచ్ఛగా మార్చుకుంటాడు. దేవుడు నేరుగా సూచించిన, ప్రాకృతాతీతము కానటువంటి వివరణలో ఇది మరొక కోణం.
మొక్కుబడిగా చేసేవాడిలా ఉండకుండా, దేవుని వాక్కులలో ప్రతి వాక్యమును నెరవేర్చాల్సిన అవసరం ఉంది. ఇది దేవుని ఆజ్ఞయైయున్నది!