పేతురు అనుభవాలు: శిక్ష మరియు తీర్పుల గూర్చిన అతనికున్న జ్ఞానం

అతను దేవునిచే శిక్షించబడుచున్నప్పుడు, పేతురు ఇలా ప్రార్థించాడు, “ఓ దేవా! నా శరీరం అవిధేయమైనది, మరియు నీవు నన్ను శిక్షించుము మరియు నాకు తీర్పు తీర్చుము. నీ శిక్ష మరియు తీర్పును బట్టి నేను సంతోషిస్తున్నాను మరియు నీవు నన్ను కోరుకోకపోయినా, నీ తీర్పులో నేను నీ పవిత్రమైన మరియు నీతియుక్తమైన స్వభావాన్ని గట్టిగా పట్టుకొనియున్నాను. నీవు నన్ను తీర్పు తీర్చినప్పుడు, నీ తీర్పులో ఇతరులు నీ నీతియుక్తమైన స్వభావాన్ని చూడగలుగుతున్నందుకు, నేను సంతృప్తి చెందుతాను. అది నీ స్వభావాన్ని వ్యక్తపరచగలిగితే మరియు నీ నీతివంతమైన స్వభావాన్ని సర్వ జీవులు చూడగలిగేటట్లు చేయగలిగితే ఇంకా అది నీ పట్ల నాకున్న ప్రేమను మరింత పవిత్రంగా చేయగలిగితే, నేను నీతిమంతుని పోలికను పొందగలను, అప్పుడు మీ తీర్పు మంచిది, ఎందుకంటే నీ కృపగల చిత్తం అలాంటిది. నాలో తిరుగుబాటు ఇంకా చాలా ఉందని మరియు నీ ముందుకు రావడానికి నేను ఇంకా సరిపోనని నాకు తెలుసు. ప్రతికూల వాతావరణంలో లేదా గొప్ప కష్టాల ద్వారా నీవు నన్ను ఇంకా ఎక్కువగా తీర్పు తీర్చాలని నేను కోరుకుంటున్నాను; నీవు ఏమి చేసినా, అది నాకు విలువైనది. నీ ప్రేమ చాలా గాఢమైనది మరియు చిన్న ఫిర్యాదు లేకుండా నీ దయలో నన్ను నేను ఉంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాను.” దేవుని కార్యమును అనుభవించిన తర్వాత పేతురుకున్నజ్ఞానం ఇది, మరియు ఇది దేవునిపట్ల అతనికున్న ప్రేమకు సాక్ష్యముగా కూడా ఉంది. ఈ రోజున, మీరు ఇప్పటికే జయించబడ్డారు, కానీ ఈ విజయం మీలో ఎలా వ్యక్తీకరించబడింది? కొంతమంది, “నా విజయం దేవుని అత్యున్నత కృపయు మరియు ఆయన ఔన్నత్యమైయున్నది. మనిషి జీవితం లోతైనదని మరియు ప్రాముఖ్యత లేనిదని ఇప్పుడే నేను గ్రహించాను. మానవుడు తన జీవితాన్ని తరతరాలుగా పిల్లలను కంటూ వారిని పెంచుతూ హడావిడిగా గడుపుతాడు కానీ చివరికి ఏమీ లేకుండా మిగులుతాడు. ఈ రోజున ఈ విధంగా జీవించడములో ఎటువంటి విలువా లేదనేది దేవునిచే జయించబడిన తర్వాత మాత్రమే నేను చూశాను; ఇది నిజంగా అర్ధంలేని జీవితం. నేను కూడా చనిపోవచ్చు, అక్కడితో పూర్తి కావచ్చు!” జయించబడిన ప్రజలందరూ దేవునిచే సంపాదించబడతారా? వారు మాదిరిగాను మరియు ఆదర్శవంతమైన వ్యక్తులుగాను మారగలరా? అలాంటి వ్యక్తులు ఏమి చేయకుండానే ఒక పాఠంగా ఉంటారు; వారికి ఆకాంక్షలు ఉండవు, అలాగే తమను తాము మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించరు. వారు జయించబడ్డారని లెక్కించబడినప్పటికీ, ఏమి చేయనట్లుగా కనబడే అటువంటి వ్యక్తులు పరిపూర్ణులవడానికి అసమర్థులుగా ఉంటారు. తన జీవిత అంతిమ భాగములో అతను పరిపూర్ణుడైన తర్వాత, “ఓ దేవా! నేను మరికొన్ని సంవత్సరాలు జీవించగలిగినట్లయితే, నేను నీ పట్ల పవిత్రమైన మరియు లోతైన ప్రేమను పొందాలనుకుంటున్నాను” అని పేతురు అన్నాడు. అతను సిలువకు వ్రేలాడదీయబడబోతున్నప్పుడు, “ఓ దేవా! నీ సమయం ఇప్పుడు వచ్చింది; నీవు నా కోసం సిద్ధం చేసిన సమయం వచ్చింది. నేను నీ కొరకు సిలువ వేయబడాలి, నేను నీ కొరకు ఈ సాక్ష్యాన్ని కలిగి ఉండాలి మరియు నా ప్రేమ నీ అవసరాలను తీర్చగలదని మరియు అది స్వచ్ఛంగా మారుతుందని నేను ఆశిస్తున్నాను. ఈ రోజు నీ కోసం చనిపోవడం ఇంకా నీ కోసం సిలువపై వ్రేలాడదీయడం అనేది నాకు ఓదార్పును మరియు భరోసానిస్తుంది. ఎందుకంటే నీ ఇష్టాన్ని నెరవేర్చడంకంటే, నీ కొరకు నన్నుఅప్పగించుకోవడంకంటే, నా జీవితం నీకు అర్పించుకోవడం కంటే, నాకు సంతృప్తికరమైనది ఏది లేదు. ఓ దేవా! నీవు చాలా ప్రియమైనవాడవు! నీవు నన్ను జీవించడానికి అనుమతిస్తే, నేను నిన్ను ఇంకా ప్రేమించేందుకు ఇష్టపడతాను. నేను జీవించినంత కాలం నిన్ను ప్రేమిస్తాను. నేను నిన్ను మరింత గాఢంగా ప్రేమించాలనుకుంటున్నాను. నీవు నన్ను తీర్పు తీర్చేది, శిక్షించేది మరియు శోధించేది ఎందుకంటే నేను నీతిమంతునిగా లేను, ఎందుకంటే నేను పాపం చేశాను. అయినప్పటికీ నీ నీతివంతమైన స్వభావం నాకు మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ఇది నాకు ఒక ఆశీర్వాదం, ఎందుకంటే నేను నిన్ను మరింత లోతుగా ప్రేమించగలుగుతున్నాను మరియు నీవు నన్ను ప్రేమించకపోయినా ఈ విధంగా నిన్ను ప్రేమించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను నీ యొక్క నీతియుతమైన స్వభావాన్ని చూడడానికి సిద్ధంగా ఉన్నాను, ఇది నన్ను మరింత అర్థవంతమైన జీవితాన్ని గడపగలిగేలా చేస్తుంది. ఇప్పుడు నా జీవితం మరింత అర్థవంతంగా ఉందని నేను భావిస్తున్నాను, ఎందుకంటే నేను నీ కోసమే సిలువ వేయబడ్డాను మరియు నీ కోసం చనిపోవడం అర్థవంతమైనది. అయినప్పటికీ నేను సంతృప్తి చెందడంలేదు, ఎందుకంటే నీ గురించి నాకు చాలా తక్కువ తెలుసు, నేను నీ కోరికలను పూర్తిగా నెరవేర్చలేనని మరియు నీకు చాలా తక్కువగా తిరిగి చెల్లించానని నాకు తెలుసు. నా జీవితంలో, నేను పరిపూర్ణముగా నీకు తిరిగి ఇవ్వలేకపోయాను; నేను దానికి సుదూరంగా ఉన్నాను. ఈ క్షణం నేను వెనక్కి తిరిగి చూస్తే, నేను నీకు చాలా ఋణపడి ఉన్నాను మరియు నా తప్పులన్నింటినీ సరి చేసుకోవడానికి ఇంకా నేను నీకు తిరిగి చెల్లించని ప్రేమను తీర్చుకోవడానికి ఈ క్షణం మాత్రమే మిగిలి ఉంది అని భావిస్తున్నాను” అని అతను తన హృదయంలో ప్రార్థించాడు.

మానవుడు అతని ప్రస్తుత పరిస్థితులతో సంతృప్తి చెందడం మాని వేసి ఒక అర్ధవంతమైన జీవితాన్ని గడపడానికి అన్వేషించాలి. పేతురు యొక్క స్వరూపములో జీవించడానికి, అతను పేతురు యొక్క జ్ఞానం మరియు అనుభవాలను కలిగి ఉండాలి. మనిషి ఉన్నతమైన మరియు లోతైన విషయాలను అన్వేషించాలి. అతను దేవునిపట్ల లోతైన, పవిత్రమైన ప్రేమను ఇంకా విలువ మరియు అర్థవంతమైన జీవితాన్ని కొనసాగించాలి. ఇది మాత్రమే జీవితం; అప్పుడే మనిషి పేతురులాగా ఉంటాడు. మీరు సానుకూలత వైపు మీ ప్రవేశంపట్ల చురుకుగా ఉండుట కొరకు దృష్టి పెట్టాలి అంతేకాకుండా క్షణిక సౌలభ్యం కోసం మరింత లోతైన, మరింత నిర్దిష్టమైన మరియు మరింత ఆచరణాత్మక సత్యాలను విస్మరించి వెనుకకు జారుకోవడానికి లొంగిపోయేలా నిన్ను నీవు అనుమతించకూడదు. నీ ప్రేమ ఆచరణాత్మకంగా ఉండాలి మరియు జంతువుకు భిన్నంగా లేని ఈ చెడిపోయిన, నిర్లక్ష్య జీవితం నుండి నిన్ను నీవు విడిపించుకోవడానికి నీవు మార్గాలను వెతకాలి. నీవు అర్థవంతమైన జీవితాన్ని, విలువైన జీవితాన్ని గడపాలి మరియు నిన్ను నీవు మోసం చేసుకోకూడదు లేదా నీ జీవితాన్ని ఆడుకునే బొమ్మలా భావించకూడదు. దేవునిని ప్రేమించాలని కోరుకునే ప్రతి ఒక్కరికీ, వారు సాధించలేని సత్యాలు మరియు న్యాయాలు లేవు. నీవు నీ జీవితాన్ని ఎలా గడపాలి? నీవు దేవునిని ఎలా ప్రేమించాలి మరియు ఆయన కోరికను తీర్చడానికి ఈ ప్రేమను ఎలా ఉపయోగించాలి? నీ జీవితంలో ఇంతకంటే గొప్ప విషయం లేదు. అన్నింటికంటే మించి, నీకు అటువంటి ఆకాంక్షలు మరియు పట్టుదల ఉండాలి మరియు వెన్నెముకలేని వారిలాగా, బలహీనులుగా ఉండకూడదు. అర్థవంతమైన జీవితాన్ని ఎలా అనుభవించాలో మరియు అర్థవంతమైన సత్యాలను ఎలా అనుభవించాలో నీవు తప్పక నేర్చుకోవాలి మరియు ఆ విధంగా నీతో నీవు యాంత్రికంగా ప్రవర్తించకూడదు. నీకు తెలియకుండానే, నీ జీవితం నిన్ను దాటిపోతుంది; ఆ తర్వాత, దేవుణ్ణి ప్రేమిండానికి నీకు ఇంకో అవకాశం ఉంటుందా? మనిషి చనిపోయిన తర్వాత దేవుణ్ణి ప్రేమించగలడా? నీవు పేతురువలెఅదే ఆకాంక్ష మరియు మనస్సాక్షిని కలిగి ఉండాలి; నీ జీవితం అర్థవంతంగా ఉండాలి మరియు నీతో నీవు ఆటలు ఆడకూడదు. మానవునిగాను మరియు దేవుణ్ణి వెంబడించే వ్యక్తిగాను, నీవు నీ జీవితాన్ని ఎలా ప్రవర్తించాలో, దేవునికి నిన్ను నీవు ఎలా అర్పించుకోవాలి, నీవు దేవునిపై మరింత అర్థవంతమైన విశ్వాసాన్ని ఎలా కలిగి ఉండాలో అనే విషయాలను జాగ్రత్తగా పరిశీలించగలగాలి. నీవు దేవుణ్ణి ప్రేమిస్తావు కాబట్టి, నీవు ఆయనను మరింత పవిత్రంగా, మరింత అందంగా, మరింత మంచిగా ప్రేమించాలి. ఈ రోజు, నీవు ఎలా జయించబడ్డావు అనే దానితో మాత్రమే నీవు సంతృప్తి చెందలేవు, కానీ భవిష్యత్తులో నీవు నడిచే మార్గాన్ని కూడా పరిగణించాలి. నీవు పరిపూర్ణంగా ఉండాలనే ఆకాంక్షలు మరియు ధైర్యం కలిగి ఉండాలి మరియు ఎల్లప్పుడూ నిన్ను నీవు అసమర్థునిగా భావించకూడదు. సత్యానికి ఇష్టమైనవి ఉన్నాయా? సత్యం ప్రజలను ఉద్దేశపూర్వకంగా వ్యతిరేకించగలదా? నీవు సత్యాన్ని వెంబడిస్తే, అది నిన్ను అధిగమించగలదా? నీవు న్యాయం కోసం గట్టిగా నిలబడితే, అది నిన్ను పడగొడుతుందా? జీవమును కలిగియుండాలని నిజంగా నీకు ఆకాంక్ష ఉన్నట్లయితే, జీవము నిన్ను తప్పించగలదా? నీవు సత్యం లేకుండా ఉన్నట్లయితే, అది సత్యం నిన్ను విస్మరించినందున కాదు కానీ, నీవు సత్యానికి దూరంగా ఉన్నందున; నీవు న్యాయం కోసం గట్టిగా నిలబడలేకపోతే, అది న్యాయంలో ఏదో తప్పు ఉన్నందున కాదు, కానీ అది వాస్తవాలకు విరుద్ధంగా ఉందని నీవు విశ్వసించినందున; మీరు చాలా సంవత్సరాలు జీవమును కలిగియుండాలని కోరుకున్న తరువాత కూడా జీవాన్ని పొందకపోతే, జీవానికి నీపట్ల మనస్సాక్షి లేనందున కాదు, కానీ నీకు జీవము పట్ల మనస్సాక్షి లేనందున, అంతేగాకుండా, జీవాన్ని నీ నుండి దూర పరచినందున జీవమును పొందలేదు; నీవు వెలుగులో నివసిస్తూ కూడా కాంతిని పొందలేక పోయినట్లయితే, ఆ కాంతి నిన్ను ప్రకాశింపజేయలేక పోయినందున కాదు కానీ నీవు కాంతి యొక్క ఉనికిపై శ్రద్ధ చూపనందున, కాంతి నీ నుండి నిశ్శబ్దంగా వెడలిపోయింది. నీవు వెంబడించకపోతే నీవు పనికిరాని చెత్త అని మాత్రమే చెప్పవచ్చు మరియు నీ జీవితంలో ధైర్యం లేదు మరియు చీకటి శక్తులను ఎదిరించే ఆత్మ లేదు. నీవు చాలా బలహీనంగా ఉన్నావు! నిన్ను ముట్టడించే సాతాను శక్తుల నుండి నీవు తప్పించుకోలేవు మరియు ఈ మాత్రపు సురక్షితమైన మరియు భద్రత గల జీవితాన్ని గడపడానికి మరియు అజ్ఞానంతో చనిపోవడానికి మాత్రమే సిద్ధంగా ఉన్నావు. నీవు సాధించవలసినదేమిటంటే జయించబడాలనే నీ సాధన; ఇది కట్టుబాటుతో నీవు కలిగియున్న విధి. నీవు జయించబడటానికి కనుక సంతృప్తి చెందితే, నీవు కాంతి యొక్క ఉనికిని దూరంగా త్రోసి వేస్తావు. నీవు సత్యం కోసం కష్టాలను అనుభవించాలి, నీవు సత్యానికి నిన్ను నీవు అప్పగించుకోవాలి, నీవు సత్యం కోసం అవమానాన్ని భరించాలి మరియు మరింత సత్యాన్ని పొందాలంటే నీవు మరిన్ని బాధలను అనుభవించాలి. నీవు చేయవలసింది ఇదే. ప్రశాంతమైన కుటుంబ జీవితం కోసం నీవు సత్యాన్ని త్రోసివేయకూడదు మరియు క్షణికమైన ఆనందం కోసం నీ జీవితం యొక్క గౌరవాన్ని మరియు సమగ్రతను కోల్పోకూడదు. నీవు అందంగా మరియు మంచిగా ఉన్నవాటిని అనుసరించాలి మరియు నీవు జీవితంలో మరింత అర్ధవంతమైన మార్గాన్ని అనుసరించాలి. నీవు అలాంటి అసభ్యకరమైన జీవితాన్ని గడుపుతూ, ఎటువంటి లక్ష్యాలను సాధించకపోతే, నీవు నీ జీవితాన్ని వృధా చేసుకోవడంలేదా? అటువంటి జీవితం నుండి నీవు ఏమి పొందగలవు? నీవు ఒక సత్యం కొరకు శరీర కోర్కెలతో నిండుకొనియున్న ఆనందాలను విడిచిపెట్టాలి మరియు కొద్దిపాటి ఆనందం కోసం సత్యాలన్నిటినీ విసిరివేయకూడదు. ఇటువంటి వ్యక్తులకు యథార్థత ఉండదు, లేదా వారికి హుందాతనం ఉండదు; వారి ఉనికికి అర్థం కూడా ఉండదు.

దేవుడు మానవుడిని శిక్షిస్తాడు మరియు తీర్పు తీరుస్తాడు. ఎందుకంటే ఆయన కార్యము కొరకు అది అవసరం, అంతేగాకుండా అది మానవునికి కూడా అవసరం కాబట్టి. మనిషి శిక్షించబడాలి మరియు తీర్పు తీర్చబడాలి, అప్పుడే అతడు దేవుని ప్రేమను పొందగలడు. ఈ రోజు, మీరు పూర్తిగా ఒప్పించబడ్డారు, కానీ మీరు స్వల్పంగా ఎదురుదెబ్బ తగిలినప్పుడు, మీరు ఇబ్బందుల్లో పడతారు; మీ స్థాయి ఇప్పటికే చాలా హీనమైనది, మరియు లోతైన జ్ఞానాన్ని సాధించడానికి మీరు అలాంటి శిక్షలు మరియు తీర్పులను ఇంకా అధికముగా అనుభవించవలసి ఉంటుంది. ఈరోజు, మీరు దేవునిపట్ల కొంత భక్తిని కలిగి ఉన్నారు, మరియు మీరు దేవునికి భయపడతారు, మరియు ఆయనే నిజమైన దేవుడని మీకు తెలుసు, కానీ మీకు ఆయనపట్ల గొప్ప ప్రేమ లేదు, ఇక మీరు పవిత్రమైన ప్రేమను అసలే సాధించలేదు. మీ జ్ఞానం చాలా ఉపరితలంగా ఉండి మీ స్థాయి ఇంకా సరిపోనిదిగా ఉంది. మీరు నిజంగా ఒక వాతావరణాన్ని ఎదుర్కొన్నప్పటికీ, మీరు ఇంకా సాక్ష్యమివ్వలేదు, మీ ప్రవేశం చాలా తక్కువ క్రియాశీలకంగా ఉంది, మరియు ఎలా ఆచరించాలో మీకు తెలియదు. చాలా మంది వ్యక్తులు నిష్క్రియాత్మకంగా మరియు చలనం లేకుండా ఉంటారు; వారు తమ హృదయాలలో మాత్రమే రహస్యంగా దేవుణ్ణి ప్రేమిస్తారు, కానీ ఆచరణాత్మకతకు చోటు ఉండదు, లేదా వారి లక్ష్యాలు ఏమిటో కూడా వారికి స్పష్టంగా తెలియదు. పరిపూర్ణులుగా చేయబడిన వారు మాత్రం సాధారణ మానవత్వాన్ని కలిగి ఉండటమే కాకుండా, మనస్సాక్షి ప్రమాణాల కంటే ఉన్నతమైన సత్యాలను కలిగి ఉంటారు; మనస్సాక్షి ప్రమాణాల కంటే ఉన్నతమైన సత్యాలను కలిగి ఉంటారు; వారు దేవుని ప్రేమను తిరిగి చెల్లించడానికి కేవలం వారి మనస్సాక్షిని మాత్రమే ఉపయోగించరు కానీ, అంతకంటే ఎక్కువగా, వారు దేవుని గూర్చి ఎరిగియున్నారు, దేవుడు మనోహరమైన వాడనియు మరియు మానవ ప్రేమకు అర్హుడు అనియు మరియు దేవునిలో ప్రేమించటానికి చాలా ఉందనియు చూశారు; మనిషి ఆయనను ప్రేమించకుండా ఉండలేడు! పరిపూర్ణులుగా చేయబడిన వారికి దేవునిపై ప్రేమ అనేది వారి స్వంత వ్యక్తిగత ఆకాంక్షలను నెరవేర్చుకోవడము కొరకు ఉంటుంది. వారిది అప్పటికప్పుడు సహజంగా పుట్టే ప్రేమ, ప్రతిఫలంగా ఏమీ అడగని ప్రేమ మరియు ఇది లావాదేవీలతో కూడిన వ్యాపార సంబంధమైన ప్రేమ కాదు. వారు దేవుణ్ణి ప్రేమించడానికి ఆయనను గురించిన వారికున్న జ్ఞానం తప్ప మరేమీ కాదు. అలాంటి వ్యక్తులు దేవుడు వారిపై కృపను ప్రసాదిస్తాడా లేదా అనే విషయాన్ని పట్టించుకోరు మరియు దేవుణ్ణి సంతృప్తి పరచడంకంటే మరి ఎందులోనూ తృప్తి చెందరు. వారు దేవునితో బేరసారాలు చేయరు, లేదా వారు మనస్సాక్షితో దేవునిపట్ల తమకున్న ప్రేమను కొలవరు: “నీవు నాకు ఇచ్చావు కాబట్టి నేను ప్రతిఫలంగా నిన్ను ప్రేమిస్తున్నాను; నీవు నాకు ఇవ్వకపోతే, బదులుగా నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు.” సంపూర్ణులుగా ఉన్నవారు ఎల్లప్పుడూ ఇలా నమ్ముతారు: “దేవుడు సృష్టికర్త, మరియు ఆయన తన కార్యమును మనపై జరిపిస్తాడు. నాకు ఈ అవకాశం, స్థితి మరియు అర్హతలు ఉన్నాయి కాబట్టి, నేను పరిపూర్ణంగా ఉండాలనే ఉద్దేశ్యంతో, అర్థవంతమైన జీవితాన్ని గడపడం మరియు నేను ఆయనను మెప్పించాలి.” ఇది పేతురు అనుభవించినట్లే ఉంటుంది: అతను అత్యంత బలహీనంగా ఉన్నప్పుడు, అతను దేవునికి ప్రార్థించి, “ఓ దేవా! సమయంతోను, లేదా ప్రదేశంతోను సంబంధం లేకుండా, నేను నిన్ను ఎప్పుడూ గుర్తుంచుకుంటానని నీకు తెలుసు. సమయంతోను లేదా ప్రదేశంతోను సంబంధం లేకుండా, నేను నిన్ను ప్రేమించాలనుకుంటున్నానని నీకు తెలుసు, కానీ నా స్థాయి చాలా చిన్నది, నేను చాలా బలహీనుడిని మరియు శక్తిలేనివాడిని, నా ప్రేమ చాలా పరిమితంగా ఉంది మరియు నీ పట్ల నా నిజాయితి చాలా తక్కువ. నీ ప్రేమతో పోలిస్తే, నేను జీవించడానికి అనర్హుడను. నా జీవితం వ్యర్థం కాకూడదనీ, కేవలం నీ ప్రేమను తీర్చుకోవడమే కాకుండా, నా దగ్గర ఉన్నదంతా నీకు అంకితం చేయాలనీ నేను కోరుకుంటున్నాను. నేను నిన్ను మెప్పించగలిగితే, ఒక జీవిగా, నేను మనశ్శాంతిని కలిగి ఉంటాను కనుక ఇంకేమీ అడగను. నేను ఇప్పుడు బలహీనంగా మరియు శక్తిహీనంగా ఉన్నప్పటికీ, నేను నీ ఉపదేశాలను మరచిపోను, అంతేగాకుండానీ ప్రేమను మరచిపోను. ఇప్పుడు నేను నీ ప్రేమను తిరిగి ఇవ్వడం తప్ప మరేమీ చేయడం లేదు. ఓ దేవా, నేను ఘోరమైన స్థితిలో ఉన్నాను! నా హృదయంలో ఉన్న ప్రేమను నేను నీకు ఎలా తిరిగి ఇవ్వగలను, నేను చేయగలిగినదంతా ఎలా చేయగలను, ఎలా నీ కోరికలను నెరవేర్చగలను ఇంకా నేను కలిగి ఉన్నదంతా నీకు ఎలా అర్పించగలను? నీకు మనిషి బలహీనత తెలుసు; నీ ప్రేమకు నేను ఎలా అర్హుడను? ఓ దేవా! నేను చిన్న స్థాయిలో ఉన్నానని, నా ప్రేమ చాలా తక్కువ అని నీకు తెలుసు. ఈ రకమైన వాతావరణంలో నేను చేయగలిగినంత ఉత్తమంగా ఎలా చేయగలను? నేను నీ ప్రేమను తిరిగి చెల్లించాలని నాకు తెలుసు, నేను కలిగి ఉన్నదంతా నీకు ఇవ్వాలని నాకు తెలుసు, కానీ ఈ రోజు నా స్థాయి చాలా చిన్నది. నీవు నాకు బలాన్ని మరియు విశ్వాసాన్ని అందించాలని నేను అడుగుతున్నాను, తద్వారా నేను నీకు అర్పించడానికి స్వచ్ఛమైన ప్రేమను కలిగి ఉండగలుగుతాను మరియు నేను కలిగి ఉన్నదంతా నీకు అంకితం చేయగలను; నేను కేవలం నీ ప్రేమను తిరిగి చెల్లించడం మాత్రమే కాకుండా, నీ శిక్షను, తీర్పును మరియు పరీక్షలను ఇంకా మరింత తీవ్రమైన శాపాలను అనుభవించగలను. నీవు నీ ప్రేమను చవి చూసేందుకు నన్ను అనుమతించావు మరియు నేను నిన్ను ప్రేమించకుండా ఉండలేను. అంతేగాకుండా, ఈ రోజు నేను బలహీనంగా మరియు శక్తిహీనునిగా ఉన్నప్పటికీ, నేను నిన్ను ఎలా మరచిపోగలను? నీ ప్రేమ, శిక్ష మరియు తీర్పు అనేవి నాకు నీ గురించి తెలియజేసాయి, అయినప్పటికీ నేను కూడా నీ ప్రేమను నెరవేర్చుకోలేకపోతున్నాను, ఎందుకంటే నీవు చాలా గొప్పవాడవు. నా దగ్గర ఉన్నదంతా సృష్టికర్తకు ఎలా అంకితం చేయగలను?” పేతురు యొక్క ప్రార్ధన మనవి అలా ఉంది, అయినప్పటికీ అతని స్థాయి తగిన విధంగా సరితూగలేదు. ఈ తరుణంలో అతడి గుండెల్లో కత్తి తిప్పినట్లు అనిపించింది. అతను వేదనలో ఉన్నాడు; అటువంటి పరిస్థితులలో ఏమి చేయాలో అతనికి తెలియదు. అయినప్పటికీ అతను ఇంకా ప్రార్థిస్తూనే ఉన్నాడు: “ఓ దేవా! మనిషి చిన్నపిల్లవారివలె ఉన్నాడు. అతని మనస్సాక్షి బలహీనంగా ఉంది మరియు నేను సాధించగలిగేది కేవలం నీ ప్రేమను తిరిగి చెల్లించుకోవడమే. ఈ రోజు నీ కోరికలను ఎలా తీర్చాలో నాకు తెలియదు, మరియు నేను చేయగలిగినదంతా చేయాలని, నా వద్ద ఉన్నదంతా ఇవ్వాలని మరియు నా వద్ద ఉన్నదంతా నీకు అంకితం చేయాలని మాత్రమే కోరుకుంటున్నాను. నీ తీర్పుతో సంబంధం లేకుండా, నీ శిక్షణలతో సంబంధం లేకుండా, నీవు నాకు ఏమి ప్రసాదించినా, నీవు నా నుండి ఏమి తీసుకున్నావనే దానితో సంబంధం లేకుండా, నీపై ఒక చిన్న ఫిర్యాదు చేసే స్థితి నుండి నన్ను విడిపించు. చాలా సార్లు, నీవు నన్ను శిక్షించినప్పుడు, నన్ను తీర్పు తీర్చినప్పుడు, నాలో నేను సణుగుకున్నాను మరియు పవిత్రతను సాధించలేకపోయాను, లేదా నీ కోరికలను నెరవేర్చలేకపోయాను. నీ ప్రేమకు నేను చెల్లించుకునేది బలవంతములోనుండి పుట్టింది, ఈ క్షణంలో నన్ను నేను మరింత ఎక్కువగా ద్వేషించుకొనుచున్నాను.” అతను దేవునిపట్ల పవిత్రమైన ప్రేమను కోరుకున్నాడు కాబట్టి పేతురు ఈ విధంగా ప్రార్థించాడు. అతను వెతుకుతున్నాడు మరియు వేడుకున్నాడు, అంతేగాకుండా అతను తనపై తాను నేరారోపణ చేస్తున్నాడు మరియు దేవునికి తన పాపాలను ఒప్పుకున్నాడు. అతను దేవునికి ఋణపడి ఉన్నాడని భావించాడు మరియు తనను తాను ద్వేషించుకున్నాడు, అయినప్పటికీ అతను కొంత విచారంగా మరియు అనాలోచితముగా ఉన్నాడు. అతను దేవుని కోరికలకు సరిపోనట్లుగా, ఇంకా ఉత్తమమైనదాన్ని చేయలేనట్లుగా, ఎల్లప్పుడూ అలానే భావించాడు. అలాంటి పరిస్థితుల్లో పేతురు యోబు విశ్వాసాన్ని కొనసాగించాడు. యోబు విశ్వాసం ఎంత గొప్పదో అతను చూశాడు, ఎందుకంటే తనకు ఉన్నదంతా దేవునిచే ప్రసాదించబడిందని యోబు చూశాడు మరియు దేవుడు అతని నుండి ప్రతిదీ తీసుకోవడం సహజం, అలానే దేవుడు తాను కోరిన వారికి ఇస్తాడు, అంటే అటువంటి దేవుని నీతి స్వభావమును ఇస్తాడు. యోబుకు ఎలాంటి ఫిర్యాదులు లేవు, ఇంకా దేవునిని స్తుతించగలిగాడు. పేతురుకి కూడా తన గురించి తనకు తెలుసు, మరియు తన హృదయంలో ఇలా ప్రార్థించాడు, “ఈ రోజు నేను నా మనసును ఉపయోగించి నీ ప్రేమను తిరిగి చెల్లించడంలో మరియు నేను నీకు ఎంతటి ప్రేమతో తిరిగి చెల్లిస్తాను అనే దానితో సంతృప్తి చెందకూడదు, ఎందుకంటే నేను నిన్ను సృష్టికర్తగా చూడలేని అసమర్థతను కలిగియున్నాను, ఎందుకంటే నా ఆలోచనలు చాలా భ్రష్టుపట్టుపోయాయి. నేను ఇప్పటికీ నిన్ను ప్రేమించటానికి అనర్హుడను కాబట్టి, నేను ఇష్టపూర్వకంగా చేసే విధంగా నేను కలిగి ఉన్నదంతా నీకు అంకితం చేసే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి. నీవు చేసినవన్నీ నేను తప్పక తెలుసుకోవాలి, వేరే మార్గం లేదు, మరియు నేను నీ ప్రేమను చూడాలి మరియు నీ పరిశుద్ధ నామాన్ని కీర్తించగలగాలి, తద్వారా నీవు నా ద్వారా గొప్ప కీర్తిని పొందవచ్చు. నేను నీకు ఈ సాక్ష్యంలో స్థిరంగా నిలబడటానికి సిద్ధంగా ఉన్నాను. ఓ దేవా! నీ ప్రేమ చాలా విలువైనది మరియు అందమైనది; నేను దుష్టుని చేతుల్లో ఎలా జీవించగలను? నేను నీ చేత తయారు చేయబడలేదా? నేను సాతాను ఆధిపత్యం క్రింద ఎలా జీవించగలను? నా మొత్తం జీవితం నీ శిక్షల మధ్య జీవించడానికి ఇష్టపడతాను. నేను దుష్టుని ఆధీనంలో జీవించడానికి ఇష్టపడను. నేను పవిత్రంగా తయారై, నా సర్వస్వాన్ని నీకు అంకితం చేయగలిగితే, నేను సాతానును ద్వేషిస్తాను మరియు వాని పరిధిలో జీవించడానికి ఇష్టపడను కాబట్టి, నీ తీర్పు మరియు శిక్షకు నా శరీరాన్ని మరియు మనస్సును అర్పించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నాపై నీ తీర్పు ద్వారా, నీవు నీ నీతివంతమైన ప్రవృత్తిని చూపుతావు; నేను సంతోషంగా ఉన్నాను మరియు చిన్న ఫిర్యాదు కూడా లేదు. నేను సృష్టించబడిన జీవి యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించగలిగితే, నా జీవితమంతా నీ తీర్పుతో పాటుగా ఉండడానికి నేను సిద్ధంగా ఉన్నాను, దాని ద్వారా నేను నీ నీతి స్వభావమును తెలుసుకుంటాను మరియు దుష్టుని ప్రభావం నుండి నేనే విడుదల పొందుతాను” అని పేతురు ఎల్లప్పుడూ ఈ విధంగా ప్రార్థించాడు, ఎల్లప్పుడూ ఆ విధంగానే వెదికాడు మరియు మరొక విధంగా చెప్పాలంటే అతను ఉన్నతమైన రంగానికి చేరుకున్నాడు. అతను దేవుని ప్రేమను తీర్చుకోవడమేకాక, ముఖ్యంగా, అతను సృష్టించబడిన వ్యక్తిగా తన కర్తవ్యాన్ని కూడా నెరవేర్చగలిగాడు. తన మనస్సాక్షిచేత నిందించబడకపోవడమే కాకుండా, అతను మనస్సాక్షి ప్రమాణాలను కూడా అధిగమించగలిగాడు. అతని ప్రార్థనలు దేవుని యెదుట కొనసాగుతూనే ఉన్నాయి, తద్వారా అతని ఆకాంక్షలు ఎప్పటికీ ఉన్నతంగా ఉన్నాయి మరియు దేవునిపట్ల అతని ప్రేమ ఎప్పటికీ గొప్పదిగా ఉంది. అతను బాధాకరమైన నొప్పిని అనుభవించినప్పటికీ, అతను దేవుణ్ణి ప్రేమించడం మరచిపోలేదు, ఇంకా అతను దేవుని చిత్తాన్ని అర్థం చేసుకునే సామర్థ్యాన్ని సాధించడానికి ప్రయత్నించాడు. తన ప్రార్థనలలో అతను ఈ క్రింది మాటలను పలికాడు: “నీ ప్రేమకు ఋణం తిరిగి చెల్లించడంకంటే నేను ఏమీ సాధించలేదు. నేను సాతానుముందు నీకై సాక్ష్యమివ్వలేదు, సాతాను ప్రభావం నుండి నన్ను నేను విడిపించుకోలేదు, ఇంకా శరీర రీతిగానే జీవిస్తున్నాను. నేను సాతానును ఓడించడానికి, వానిని అవమానించడానికి తద్వారా నీ కోరికను తీర్చడానికి నా ప్రేమను ఉపయోగించాలనుకుంటున్నాను. సాతాను నీ శత్రువైనందున, సాతానుకు నాలోని కొంచెము కూడా ఇవ్వకుండా, నా సంపూర్ణతను నీకు అందించాలనుకుంటున్నాను.” అతను ఈ దిశలో ఎంత ఎక్కువగా వెతికాడో, అతను అంతగా కదిలించబడ్డాడు మరియు ఈ విషయాలపై అతని జ్ఞానం అంత ఎక్కువగా పెరిగింది. తనకు తెలియకుండానే, అతను సాతాను ప్రభావం నుండి తనను తాను విడిపించుకోవాలని మరియు పూర్తిగా దేవుని వైపుకు తిరిగి రావాలని అతను తెలుసుకున్నాడు. అతను అటువంటి ప్రపంచాన్ని పొందుకున్నాడు. అతను సాతాను యొక్క ప్రభావాన్ని అధిగమించాడు మరియు శరీరానికి సంబంధించిన ఆనందాలు మరియు ఆహ్లాదాలను వదిలించుకున్నాడు మరియు దేవుని శిక్ష మరియు ఆయన తీర్పు అనే రెండింటినీ మరింత లోతుగా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాడు. అతను, “నేను నీ శిక్షణ మధ్య మరియు నీ తీర్పు మధ్య జీవిస్తున్నప్పటికీ, ఎలాంటి కష్టాలను ఎదుర్కొన్నా, నేను ఇప్పటికీ సాతాను ఆధిపత్యం కింద జీవించడానికి ఇష్టపడను, ఇక ఎన్నడూ నేను సాతాను యొక్క మోసాన్ని అనుభవించడానికి ఇష్టపడను. నీ శాపాల మధ్య జీవించడంలో నేను ఆనందాన్ని పొందుతున్నాను కానీ సాతాను ఆశీర్వాదాల మధ్య జీవించడంవల్ల నేను చాలా బాధపడ్డాను. నీ తీర్పు మధ్య జీవించడం ద్వారా నేను నిన్ను ప్రేమిస్తున్నాను మరియు ఇది నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. నీ శిక్ష మరియు తీర్పులనేవి నీతియుతమైనవి మరియు పవిత్రమైనవి; అది నన్ను శుద్ధి చేయడానికి, మరి ఎక్కువగా నన్ను రక్షించడానికి. నేను నీ సంరక్షణలో ఉండేందుకు నా జీవితమంతా నీ తీర్పు మధ్య గడపాలని ఇష్టపడతాను. నేను ఒక్క క్షణం కూడా సాతాను ఆధీనంలో జీవించడానికి ఇష్టపడను; నేను నీ ద్వారా శుద్ధి కావాలని కోరుకుంటున్నాను; నేను కష్టాలు అనుభవించినా, సాతాను దోపిడికి మరియు మోసానికి గురికావడాన్ని నేను ఇష్టపడను. ఈ జీవి నైన నేను, నీ చేత స్వాధీనపరచుకోబడి, నీ చేత తీర్పు తీర్చబడి, మరియు నీ చేత శిక్షించబడి, నీ చేత ఉపయోగించబడాలి. నేను నీ చేత శపించబడాలి కూడా. నీవు నన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు నా హృదయం సంతోషిస్తుంది, ఎందుకంటే నేను నీ ప్రేమను చూశాను. నీవు సృష్టికర్తవు మరియు నేను సృజింపబడిన జీవిని: నేను నీకు ద్రోహం చేసి, సాతాను ఆధీనంలో జీవించలేను, అలాగే నేను సాతానుచేత దోపిడీ చేయబడలేను. నేను సాతాను కోసం జీవించడానికి బదులుగా నీ యొక్క గుర్రము లేదా ఎద్దుగా ఉండాలి. శారీరక సుఖాలు లేకుండా నేను నీవు శిక్షణ మధ్య జీవించాలనుకుంటాను, నేను నీ కృపను కోల్పోయినప్పటికీ ఇది నాకు ఆనందాన్ని ఇస్తుంది. నీ కృప నా దగ్గర లేనప్పటికీ, నీ ద్వారా శిక్షించబడటం మరియు తీర్పు తీర్చబడటం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది; ఇది నీ ఉత్తమ ఆశీర్వాదము, నీ గొప్ప కృపయైయున్నది. నీవు ఎల్లప్పుడూ గంభీరంగా మరియు నా పట్ల కోపంగా ఉన్నప్పటికీ, ఇప్పటికీ నేను నిన్ను విడిచిపెట్టలేను మరియు ఇప్పటికీ నేను నిన్నుతగినంతగా ప్రేమించలేదు. నేను నీ గృహములో నివసించడానికి ఇష్టపడతాను, నేను నీ ద్వారా శపించబడటం, శిక్షించబడటం మరియు దండించబడటానికే ఇష్టపడతాను మరియు సాతాను ఆధిపత్యం క్రింద జీవించడానికి ఇష్టపడను, లేదా నేను శరీర రీతిగా ఉండటం కోసం మాత్రమే తొందరపడను శరీర రీతిగా జీవించడానికి అసలే ఇష్టపడను.” పేతురు ప్రేమ పవిత్రమైన ప్రేమ. ఇది పరిపూర్ణంగా తయారైన అనుభవం, మరియు పరిపూర్ణంగా తయారయ్యే అత్యున్నత రాజ్యం; ఇంతకంటే అర్థవంతమైన జీవితం మరొకటి లేదు. అతను దేవుని శిక్షను మరియు తీర్పును అంగీకరించాడు, అతను దేవుని నీతివంతమైన స్వభావాన్ని విలువైనదిగా భావించాడు మరియు పేతురు గురించి దీనికంటే విలువైనది లేదు. అతను ఇలా చెప్పాడు, “సాతాను నాకు భౌతిక ఆనందాలను ఇస్తాడు, అయితే నేను వాటిని విలువైనవిగా భావించను. దేవుని శిక్షను మరియు తీర్పు నాపైకి వస్తాయి, అంటే దీనిలో నేను కృపను పొందియున్నాను, ఇందులో నేను ఆనందాన్ని పొందుతున్నాను మరియు ఇందులో నేను ఆశీర్వదించబడ్డాను. దేవుని తీర్పు లేకుండ నేను దేవుణ్ణి ఎప్పటికీ ప్రేమించను, నేను ఇప్పటికీ సాతాను కింద జీవిస్తున్నాను, ఇప్పటికీ దానిచే నియంత్రించబడుచున్నాను మరియు ఆజ్ఞాపించబడుచున్నాను. పరిస్థితి ఇలాగే ఉన్నట్లయితే, నేను ఎప్పటికీ నిజమైన మనిషిని కాలేను, ఎందుకంటే నేను దేవునిని మెప్పించలేను మరియు నా సర్వం దేవునికి అంకితం చేయలేను. దేవుడు నన్ను ఆశీర్వదించనప్పటికీ, నాలో అగ్ని మండుతున్నట్లుగా లోపల ఓదార్పు లేకుండా, శాంతి, లేక ఆనందం లేకుండా, మరియు దేవుని శిక్ష మరియు క్రమశిక్షణ కూడా నాకు దూరంగా లేనప్పటికీ, దేవుని శిక్ష మరియు తీర్పులో నేను ఆయన నీతియుక్తమైన స్వభావాన్ని చూడగలను. నేను ఇందులో ఆనందిస్తాను; జీవితంలో అంతకన్నా విలువైన లేదా అర్ధవంతమైన విషయం మరొకటి లేదు. ఆయన రక్షణ మరియు సంరక్షణ నిర్దయాత్మకమైన శిక్షగా, తీర్పుగా, శాపాలుగా మరియు దండనగా మారినప్పటికీ, నేను ఈ విషయాలలో ఆనందాన్ని పొందుతాను. ఎందుకంటే అవి నన్ను బాగా శుద్ధి చేయగలవు మరియు నన్ను మార్చగలవు, నన్ను దేవునికి దగ్గరగా తీసుకురాగలవు, నన్ను దేవునిని మరింతగా ప్రేమించేలా చేయగలవు, మరియు దేవునిపట్ల నాకున్న ప్రేమను మరింత స్వచ్ఛమైనదిగా చేయగలదు. ఇది సృజించబడిన వ్యక్తిగా నా కర్తవ్యాన్ని నెరవేర్చగలిగేలా చేస్తుంది మరియు నన్ను దేవుని ముందుకు తీసుకు వెళుతుంద మరియు సాతాను ప్రభావానికి దూరంగాను తీసుకువెళుతుంది, తద్వారా నేను ఇకపై సాతానుకు సేవ చేయను. నేను సాతాను ఆధీనంలో జీవించనప్పుడు మరియు నేను కలిగి ఉన్నదంతా మరియు నేను చేయగలిగినదంతా, అంటేదేనినీ వెనుకకు తీసుకోకుండా దేవునికి అంకితం చేయగలిగినప్పుడు, అప్పుడు నేను పూర్తిగా సంతృప్తి చెందుతాను. దేవుని శిక్ష మరియు తీర్పు ద్వారా నేను రక్షింపబడ్డాను మరియు నా జీవితం దేవుని శిక్ష మరియు తీర్పు నుండి విడదీయరానివి. భూమిపై నా జీవితం సాతాను ఆధీనంలో ఉంది, మరియు అది దేవుని శిక్ష మరియు తీర్పు యొక్క సంరక్షణ, శ్రద్ధవలన కాకపోతే, నేను ఎల్లప్పుడూ సాతాను ఆధిపత్యం క్రింద జీవించి ఉండేవాడిని, అంతేకాకుండా, అర్థవంతమైన జీవితాన్ని గడపడానికి నాకు అవకాశము గాని మార్గాలు గాని ఉండేవి కావు. దేవుని శిక్ష మరియు తీర్పు నన్ను ఎన్నటికీ విడనాడనట్లయితే నేను దేవునిచే శుద్ధి చేయబడగలను. దేవుని యొక్క కఠినమైన మాటలు మరియు నీతియుక్తమైన స్వభావము మరియు దేవుని మహోన్నతమైన తీర్పులతో మాత్రమే నేను సర్వోన్నతమైన సంరక్షణను పొందాను మరియు వెలుగులో నివసించగలుగుచున్నాను, దేవుని ఆశీర్వాదాలను పొందుకున్నాను. శుద్ధి చేయబడడం మరియు సాతాను నుండి నన్ను నేను విడిపించుకోవడం మరియు దేవుని ఆధీనంలో జీవించడం అనేవి ఈ రోజు నా జీవితంలో గొప్ప ఆశీర్వాదమైయున్నాయి. ఇది పేతురు అనుభవించిన అత్యున్నతమైన ప్రపంచము.

మనిషి పరిపూర్ణుడైన తర్వాత పొందవలసిన స్థితి ఇదే. నీవు ఇంతగా సాధించలేకపోతే, నీవు అర్థవంతమైన జీవితాన్ని గడపలేవు. మనిషి శరీర రీతిగా జీవిస్తాడు, అంటే అతను మానవ నరకంలో జీవిస్తాడు మరియు దేవుని శిక్ష మరియు తీర్పులు అనేవిలేకుండా, మనిషి సాతానువలె అపవిత్రంగా ఉంటాడు. మనిషి ఎలా పవిత్రుడు కాగలడు? దేవుడు శిక్షించడం మరియు తీర్పు తీర్చడం అనేవి మనిషికి ఉత్తమ సంరక్షణగాను మరియు గొప్ప కృపగాను ఉన్నాయని పేతురు నమ్మాడు. దేవుడు శిక్షించడం మరియు తీర్పు ద్వారా మాత్రమే మానవుడు మేల్కొనగలడు మరియు శరీరాన్ని ద్వేషించగలడు, సాతానును ద్వేషించగలడు. దేవుని కఠినమైన క్రమశిక్షణ మనిషిని సాతాను ప్రభావం నుండి విముక్తి చేస్తుంది, అతనికున్న చిన్న ప్రపంచం నుండి విడిపిస్తుంది మరియు దేవుని సన్నిధి వెలుగులో జీవించేలా చేస్తుంది. శిక్ష మరియు తీర్పుకంటే మెరుగైన విమోచన లేదు! పేతురు ఇలా ప్రార్థించాడు, “ఓ దేవా! నీవు నన్ను శిక్షించి, తీర్పు తీర్చినంత కాలం, నీవు నన్ను విడిచిపెట్టలేదని నేను తెలుసుకుంటాను. నీవు నాకు సంతోషాన్ని లేదా శాంతిని ఇవ్వకపోయినా, నన్ను బాధలో జీవించేలా చేసినా, లెక్కలేనంత శిక్ష విధించినా, నీవు నన్ను విడిచిపెట్టనంత వరకు, నా హృదయం తేలికగా ఉంటుంది. ఈ రోజు, నీ శిక్ష మరియు తీర్పు నా ఉత్తమ సంరక్షణగా మరియు నా గొప్ప ఆశీర్వాదంగా మారాయి. నీవు నాకు ఇచ్చే కృప నన్ను రక్షిస్తుంది. ఈ రోజు నీవు నాకు ప్రసాదించిన కృప నీ నీతి స్వభావానికి ప్రత్యక్షతయైయున్నది, మందలింపు మరియు తీర్పు అనేవి కూడా గొప్ప కృపయైయున్నది; అంతేకాకుండా, ఇది ఒక ప్రయోగాత్మకమైయున్నది, మరియు అంతకంటే ఎక్కువగా, ఇది శ్రమను అనుభవించే జీవితమైయున్నది” పేతురు శరీర ఆనందాలను పక్కన పెట్టగలిగాడు మరియు లోతైన ప్రేమ మరియు గొప్ప రక్షణను కోరాడు, ఎందుకంటే అతను దేవుని శిక్ష మరియు తీర్పు నుండి ఎక్కువ కృపను సంపాదించుకున్నాడు. తన జీవితంలో, మనిషి ప్రక్షాళన చెందాలని మరియు అతని స్వభావంలో మార్పులు తెచ్చుకోవాలని ఇష్టపడినట్లయితే, అతను అర్ధవంతమైన జీవితాన్ని గడపాలని మరియు సృష్టించబడిన వ్యక్తిగా తన కర్తవ్యాన్ని నెరవేర్చాలని కోరుకుంటే, ఆయన దేవుని శిక్షను మరియు తీర్పును తప్పక అంగీకరించాలి మరియు సాతాను యొక్క వంచన మరియు ప్రభావం నుండి తనను తాను విడిపించుకోవడానికి మరియు దేవుని వెలుగులో జీవించడానికి దేవుని క్రమశిక్షణ, దేవుని శిక్ష అతని నుండి దూరం కావడాన్ని అనుమతించకూడదు. దేవుని శిక్ష మరియు తీర్పుయే వెలుగు అని, మనిషి యొక్క రక్షణకి వెలుగు అని మరియు కృప లేదా సంరక్షణకంటే మించిన మంచి ఆశీర్వాదం లేదని తెలుసుకోండి. మనిషి సాతాను ప్రభావంతో జీవిస్తాడు మరియు శరీర రీతిగా ఉంటాడు; అతను శుద్ధి చేయబడకపోతే మరియు దేవుని సంరక్షణ పొందకపోతే, అప్పుడు మనిషి మరింత భ్రష్టుపడతాడు. అతను దేవుణ్ణి ప్రేమించాలని కోరుకుంటే, అతను తప్పనిసరిగా శుద్ధి చేయబడాలి మరియు రక్షించబడాలి. “దేవా, నువ్వు నాతో దయగా ప్రవర్తించినప్పుడు నేను సంతోషిస్తాను, ఆదరణను పొందుతాను; నీవు నన్ను శిక్షించినప్పుడు, నేను మరింత ఎక్కువ ఆదరణను మరియు సంతోషాన్ని అనుభవిస్తాను. నేను బలహీనంగా ఉన్నా, చెప్పలేని బాధలను భరిస్తున్నప్పటికీ, కన్నీళ్లు మరియు విచారం ఉన్నప్పటికీ, ఈ దుఃఖం అనేది నా అవిధేయతవల్ల మరియు నా బలహీనతవల్ల కలిగిందని మీకు తెలుసు. నేను నీ కోరికలను తీర్చులేనందుకు ఏడుస్తున్నాను, నీ అవసరాలకు నేను సరిపోనందుకు దుఃఖం మరియు పశ్చాత్తాపాన్ని అనుభవిస్తున్నాను, కానీ నేను ఈ రంగాన్ని సాధించడానికి ఇష్టపడుచున్నాను, నిన్ను సంతృప్తి పరచడానికి నేను చేయగలిగినదంతా చేయడానికి ఇష్టపడుచున్నాను. నీ శిక్ష నాకు సంరక్షణను తెచ్చిపెట్టింది మరియు నాకు ఉత్తమమైన రక్షణను ఇచ్చింది; నీ సహనాన్ని మరియు ఓర్పును నీ తీర్పు మరుగున పెడుతుంది. నీ శిక్ష మరియు తీర్పు లేకుండా, నేను నీ దయ మరియు ప్రేమావాత్సల్యతలను ఆస్వాదించలేను. ఈ రోజు, నీ ప్రేమ ఆకాశాలను అధిగమించిందని మరియు అన్నింటికంటే గొప్పగా ఉందని నేను ఎక్కువగా చూస్తున్నాను. నీ ప్రేమ కేవలం కరుణ మరియు ప్రేమావాత్సల్యత మాత్రమే కాదు; అంతకంటే ఎక్కువగా, అది శిక్ష మరియు తీర్పులైయున్నవి. నీ శిక్ష మరియు తీర్పు నాకు చాలా ఇచ్చింది. నీ శిక్ష మరియు తీర్పు లేకుండా, ఏ ఒక్క వ్యక్తి కూడా శుద్ధి చేయబడడు మరియు ఏ ఒక్క వ్యక్తి కూడా సృష్టికర్త యొక్క ప్రేమను అనుభవించలేడు. నేను వందల కొద్దీ కష్టాలను ఇబ్బందులను భరించి, మరణానికి కూడా చేరువగా ఉన్నప్పటికీ, అవి నిన్ను నిజంగా తెలుసుకునేలా చేసి, అత్యున్నతమైన రక్షణను పొందేలా చేశాయి. నీ శిక్ష, తీర్పు మరియు క్రమశిక్షణ నా నుండి దూరమైతే, నేను చీకటిలో సాతాను ఆధిపత్యంలో జీవిస్తాను. మనిషి శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి? నీ శిక్ష మరియు తీర్పు నన్ను విడిచిపెట్టినట్లయితే, అది నీ ఆత్మ నన్ను విడిచిపెట్టినట్లే, నీవు ఇకపై నాతో లేనట్లే. అలా అయితే, నేను ఎలా జీవించడం కొనసాగించగలను? నీవు నాకు అనారోగ్యాన్ని ఇచ్చి, నా స్వేచ్ఛను తీసుకుంటే, నేను జీవించడం కొనసాగించగలను గాని నీ శిక్ష మరియు తీర్పు నన్ను విడిచిపెట్టినట్లయితే, నేను జీవించడానికి మార్గం లేదు. నేను నీ శిక్ష మరియు తీర్పు లేకుండా ఉంటే, నేను నీ ప్రేమను కోల్పోయేవాడిని, నేను మాటల్లో చెప్పలేనంత లోతైన ప్రేమ. నీ ప్రేమ లేకుండా, నేను సాతాను ఆధిపత్యం క్రింద జీవిస్తాను మరియు నీ మహిమాన్వితమైన ముఖాన్ని చూడలేను. నేను ఎలా జీవించగలను? అలాంటి చీకటిని, అలాంటి జీవితాన్ని నేను భరించలేకపోయాను. నీవు నాతో ఉండటం నిన్ను చూడటం లాంటిదే, కాబట్టి నేను నిన్ను ఎలా విడిచిపెట్టగలను? ఇవి కేవలం కొన్ని ఆదరణతోకూడిన మాటలే అయినప్పటికీ, నా నుండి గొప్ప ఆదరణను తీసుకోవద్దని నేను నిన్ను వేడుకుంటున్నాను, నేను నిన్ను బ్రతిమాలుకుంటున్నాను. నేను నీ ప్రేమను ఆస్వాదించాను మరియు ఈ రోజు నేను నీ నుండి దూరంగా ఉండలేను; నేను నిన్ను ప్రేమించకుండా ఎలా ఉండగలను? నీ ప్రేమ కారణంగా నేను చాలా బాధతో ఎంతగానో కన్నీళ్లు పెట్టుకున్నాను, అయినప్పటికీ ఇలాంటి జీవితం మరింత అర్థవంతమైనదని, నన్ను మరింత సుసంపన్నం చేయగలదని, నన్ను మరింతగా మార్చగలదని మరియు సృష్టించబడినవారందరూ కలిగి ఉండవలసిన సత్యము మరింత సాధించగలిగేలా నన్ను చేయగలదని నేను ఎల్లప్పుడూ భావించాను.

మనిషి యొక్క మొత్తం జీవితం సాతాను ఆధిపత్యం క్రింద గడుస్తుంది మరియు సాతాను ప్రభావం నుండి తమంతట తాముగా విడిపించుకోగల ఒక్క వ్యక్తి కూడా లేడు. అందరూ అపవిత్రమైన ప్రపంచంలో, భ్రష్టత్వములో మరియు శూన్యతలో స్వల్పమైన అర్థం గానీ విలువ గానీ లేకుండానే జీవిస్తున్నారు; వారు శరీర రీతిగా, కామం కోసం మరియు సాతాను కోసం అటువంటి నిర్లక్ష్య జీవితాలను గడుపుతారు. వారి ఉనికికి కనీస విలువ లేదు. సాతాను ప్రభావం నుండి తనను విడిపించే సత్యాన్ని కనుగొనడంలో మనిషి అసమర్థుడు. మనిషి దేవునిని నమ్మి, బైబిలు చదివినా, సాతాను ప్రభావం నుండి తనను తాను ఎలా విడిపించుకోవాలో అర్థం కావడం లేదు. యుగాలన్నిటిలో అతి కొద్ది మంది మాత్రమే ఈ రహస్యాన్ని కనుగొన్నారు, చాలా కొద్ది మంది మాత్రమే దీనిని గ్రహించారు. అలాగే, మనిషి సాతానును అసహ్యించుకున్నప్పటికీ, శరీరాన్ని అసహ్యించుకున్నప్పటికీ, సాతాను ఉచ్చు యొక్క ప్రభావం నుండి తనను తాను ఎలా వదిలించుకోవాలో అతనికి తెలియదు. ఈ రోజు కూడా మీరు ఇంకా సాతాను ఆధిపత్యం క్రింద లేరా? మీ అవిధేయ చర్యలకు మీరు పశ్చాత్తాపపడరు మరియు మీరు అపవిత్రులని మరియు అవిధేయులమని మీరు అసలే భావించరు. దేవుణ్ణి వ్యతిరేకించిన తర్వాత, మీరు మనశ్శాంతిని కలిగి ఉంటారు మరియు గొప్ప ప్రశాంతతను కూడా అనుభవిస్తారు. మీ దొరికిన ఈ ప్రశాంతత మీరు అవినీతిపరులు కావడంవల్ల కాదా? ఈ మనశ్శాంతి మీ అవిధేయతవల్ల రాలేదా? మనిషి మానవ నరకంలో నివసిస్తున్నాడు, అతను సాతాను యొక్క చీకటి ప్రభావంలో జీవిస్తాడు; దేశమందంతట దయ్యాలు మనిషితో కలిసి జీవిస్తాయి, మనిషి శరీరాన్ని ఆక్రమిస్తాయి. భూమిపై మీరు అందమైన స్వర్గంలో నివసించరు. మీరున్న ప్రదేశం దెయ్యం యొక్క రాజ్యం, మానవ నరకం, ఒక ప్రేతాత్మల నిలయం. మనిషి శుద్ధి కాకపోతే, అతను అపవిత్రతను కలిగియున్నవాడు; అతను దేవునిచే రక్షించబడకపోతే మరియు శ్రద్ధ వహించబడకపోతే, అతను ఇప్పటికీ సాతాను బందీగా ఉంటాడు; అతను తీర్పు తీర్చబడకపోతే మరియు శిక్షించబడకపోతే, సాతాను యొక్క చీకటి ప్రభావం యొక్క అణచివేత నుండి తప్పించుకోవడానికి అతనికి మార్గం ఉండదు. నీవు ప్రదర్శించే అవినీతి స్వభావం మరియు మీరు జీవించే అవిధేయ ప్రవర్తన నీవు ఇప్పటికీ సాతాను అధికారంలో జీవిస్తున్నారని నిరూపించడానికి సరిపోతాయి. నీ మనస్సు మరియు ఆలోచనలు శుద్ధిపరచబడనట్లయితే మరియు నీ స్వభావాన్ని నిర్ధారించి శిక్షించినట్లయితే, నీ ఉనికి మొత్తం ఇప్పటికీ సాతాను ఆధిపత్యం ద్వారానే నియంత్రించబడుతుంది, నీ మనస్సు సాతాను ద్వారా నియంత్రించబడుతుంది, నీ ఆలోచనలు సాతానుచేత వక్రీకరించబడతాయి మరియు నీవు మొత్తం సాతాను హస్తాల ద్వారా నియంత్రించబడతావు. ఇప్పుడు పేతురు ప్రమాణాల నుండి నీవు ఎంత దూరంలో ఉన్నావో నీకు తెలుసా? నీవు ఆ సామర్ధ్యాన్ని కలిగి ఉన్నావా? ఈ రోజున శిక్ష మరియు తీర్పు గురించి నీకు ఎంతవరకు తెలుసు? పేతురు తెలుసుకున్న దానిలో నీవు ఎంతవరకు కలిగి ఉన్నావు? ఈ రోజు నీవు తెలుసుకోలేకపోతే, భవిష్యత్తులో నీవు ఈ జ్ఞానాన్ని సాధించగలవా? నీ వంటి సోమరి మరియు పిరికివాడు శిక్ష మరియు తీర్పులను తెలుసుకోవడంలో అసమర్థుడు. నీవు శారీరక శాంతిని మరియు శారీరక ఆనందాలను వెంబడిస్తే, అప్పుడు నీవు శుద్ధి చేయబడే మార్గం ఉండదు, చివరికి నీవు సాతానుకు తిరిగి ఇవ్వబడతావు, నీవు జీవించేది సాతానులో మరియు ఇదే శరీరము. ఈనాటి పరిస్థితుల ప్రకారం, చాలా మంది వ్యక్తులు జీవమును అనుసరించరు, అంటే వారు శుద్ధి చేయబడటం లేదా లోతైన జీవన అనుభవంలోకి ప్రవేశించడం గురించి పట్టించుకోరు. అలా అయితే, వారిని ఎలా పరిపూర్ణులవుతారు? జీవమును వెంబడించనివారు పరిపూర్ణులయ్యే అవకాశం లేదు మరియు దేవుని గురించిన జ్ఞానాన్ని వెంబడించనివారు, తమ స్వభావాలలో మార్పులను అనుసరించనివారు సాతాను చీకటి ప్రభావం నుండి తప్పించుకోలేరు. వారు కేవలం వేడుకలను అనుసరించి సాధారణ సేవలకు హాజరయ్యే మతాన్ని విశ్వసించే వారిలాగే, వారికున్న దేవుని జ్ఞానము గురించి మరియు వారి స్వభావంలో మార్పులను తెచ్చుకోవడమును గురించి పట్టుదలగా కలిగియుండరు. ఇది సమయాన్ని వృధా చేయడం కాదా? దేవునిపై మనిషికి ఉన్న విశ్వాసంలో, అతను జీవమునకు సంబంధించిన విషయాలపై తీవ్రమైన శ్రద్ధ చూపకపోతే, సత్యంలోకి ప్రవేశించకపోతే, అతని స్వభావంలో మార్పుల విషయమై పరితపించకపోతే, దేవుని కార్యమును గురించిన జ్ఞానాన్ని వెంబడించకపోతే, అతను పరిపూర్ణుడు కాలేడు. మీరు పరిపూర్ణులు కావాలనుకుంటే, మీరు దేవుని కార్యమును అర్థం చేసుకోవాలి. ప్రత్యేకించి, మీరు ఆయన శిక్ష మరియు తీర్పుల యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలి మరియు ఈ కార్యము మనిషిపై ఎందుకు నిర్వహించబడుతుందో అర్థం చేసుకోవాలి. నీవు అంగీకరించగలవా? ఈ రకమైన శిక్షణ ఇచ్చు సమయంలో, నీవు పేతురువలె అదే అనుభవాలను మరియు జ్ఞానాన్ని సాధించగలవా? నీవు దేవుని గూర్చిన మరియు పరిశుద్ధాత్మ యొక్క క్రియను గూర్చిన జ్ఞానాన్ని వెంబడించినట్లయితే, అంతేగాకుండా, నీవు నీ స్వభావములో మార్పుల తెచ్చుకోవడము విషయములో పరితపిస్తే, నీవు పరిపూర్ణుడయ్యే అవకాశం ఉంటుంది.

పరిపూర్ణులవ్వాలని కోరుకునేవారికి, జయించబడే కార్యము యొక్క ఈ దశ ఎంతో అత్యగత్యం; ఒక్కసారి మనిషి జయించబడిన తర్వాత మాత్రమే అతను పరిపూర్ణమయ్యే కార్యమును అనుభవించగలడు. కేవలం జయించబడే కార్యమును కలిగియుండుటవలన ఎటువంటి గొప్ప విలువ ఉండదు, ఇది మిమ్మల్ని దేవుడు వాడుకునే అర్హతగల వ్యక్తులవలె చేయదు. నీవు సువార్తను వ్యాప్తి చేయడంలో నీ వంతు పాత్రను పోషించలేవు, ఎందుకంటే నీవు జీవమును వెంబడించలేదు మరియు నీలో మార్పును మరియు పునరుద్ధరణను కోరుకోలేదు కాబట్టి నీకు జీవమును గూర్చిన అసలైన అనుభవం లేదు. ఈ దశల వారీ పనిలో, నీవు ఒకప్పుడు సేవ చేసేవానిగా మరియు మెరుపు కాగితం లాంటి వ్యక్తిగాను వ్యవహరించావు, కానీ ఆఖరికి నీవు పేతురులాగా ఉండటాన్ని వెంబడించకపోతే పేతురు పరిపూర్ణంగా మారిన మార్గానికి అనుగుణంగా నీవు అన్వేషించకపోతే, అప్పుడు సహజంగానే, నీవు నీ వైఖరిలో మార్పులను అనుభవించలేవు. నీవు పరిపూర్ణునిగా మారాలని కోరుకునే వ్యక్తివైతే, నీవు సాక్ష్యాన్ని కలిగి ఉంటావు, అప్పుడు నీవు, “దేవుని కార్యములోని ఈ దశలలో, దేవుని శిక్ష మరియు తీర్పుల యొక్క కార్యమును నేను అంగీకరించాను. నేను చాలా బాధలను భరించినప్పటికీ, దేవుడు మనిషిని ఎలా పరిపూర్ణం చేస్తాడో నేను తెలుసుకున్నాను, దేవుడు చేసిన క్రియను నేను పొందాను, దేవుని నీతిని గురించిన జ్ఞానం నాకు ఉంది మరియు ఆయన శిక్ష నన్ను రక్షించింది. ఆయన నీతియుక్తమైన స్వభావం నాపైకి వచ్చి నాకు ఆశీర్వాదాలను మరియు కృపను తీసుకు వచ్చింది; ఆయన తీర్పు మరియు శిక్ష నన్ను రక్షించింది మరియు శుద్ధి చేసింది. నేను దేవుని ద్వారా శిక్షించబడకుండా, తీర్పు తీర్చబడకుండా ఉన్నట్లయితే మరియు దేవుని కఠినమైన మాటలు నాపైకి రాకపోతే, నేను దేవుణ్ణి తెలుసుకోనే వాడిని కాను మరియు నేను రక్షించబడే వాడిని కూడా కాదు. ఈ రోజు నేను చూస్తున్నాను: సృష్టించబడినవారిలో ఒక వ్యక్తిగా, సృష్టికర్త చేసిన అన్ని విషయాలను ఆనందించడమే కాకుండా, అన్నింటికంటే ముఖ్యంగా, సర్వ జీవులు దేవుని యొక్క నీతి స్వభావాన్ని మరియు ఆయన నీతియుతమైన తీర్పును ఆస్వాదించాలి, ఎందుకంటే దేవుని స్వభావం మనిషి సంతోషించేందుకు అర్హమైనది. సాతానుచే చెరుపుకి గురికాబడిన జీవిగా, దేవుని నీతి స్వభావాన్ని ఆనందించాలి. ఆయన నీతి స్వభావంలో శిక్ష మరియు తీర్పులు ఉంటాయి, అంతేకాకుండా, గొప్ప ప్రేమ ఉంటుంది. ఈ రోజు నేను దేవుని ప్రేమను పూర్తిగా పొందలేనప్పటికీ, దానిని చూసే గొప్ప భాగ్యం నాకు కలిగింది మరియు ఇందులో నేను దీవించబడ్డాను” అని చెప్తావు. పరిపూర్ణులయ్యేవారు నడిచే మార్గం ఇది, వారు చెప్పే జ్ఞానం ఇదే. అలాంటి వ్యక్తులు పేతురు లాగానే ఉంటారు; పేతురు లాంటి అనుభవాలు వారికి ఉన్నాయి. అలాంటి వ్యక్తులు సత్యాన్ని కలిగి, జీవమును పొందియున్నారు కూడా. వారు చివరి వరకు అనుభవించినప్పుడు, దేవుని తీర్పు సమయంలో వారు ఖచ్చితంగా సాతాను ప్రభావం నుండి తమను తాము పూర్తిగా విడిపించుకుంటారు మరియు దేవునిచేత సంపాదించబడిన వ్యక్తులవుతారు.

ప్రజలు జయించబడిన తర్వాత, వారికి ఎటువంటి అద్భుతమైన సాక్ష్యం ఉండదు. వారు కేవలం సాతానును అవమానపరిచారు, కానీ దేవుని వాక్కుల యొక్క వాస్తవికతలోనుండి జీవించలేదు. నీవు రెండవ రక్షణను పొందలేదు; నీవు కేవలం పాపపరిహారార్థ బలిని మాత్రమే పొందావు, నీవు ఇంకా పరిపూర్ణునిగా చేయబడలేదు, అంటే ఇది గొప్ప నష్టమే. మీరు దేనిలోకి ప్రవేశించాలో మరియు మీరు ఏ విధంగా జీవించాలో అర్థం చేసుకోవాలి మరియు మీరు వాటిలోకి ప్రవేశించాలి. చివరికి, నీవు పరిపూర్ణంగా ఉండకపోతే, నీవు నిజమైన మనిషివి కాలేవు మరియు నీవు విచారంతో నిండిపోతావు. ఆదిలో దేవుడు సృష్టించిన ఆదాము మరియు అవ్వలు పవిత్రమైన వ్యక్తులే, అంటే, ఏదేను వనములో వారు కల్మషం లేకుండా పరిశుద్ధులైయుండిరి. వారు కూడా యెహోవాకు నమ్మకంగా ఉండిరి, యెహోవాకు చేసే ద్రోహం గురించి ఏమీ తెలియకుండెను. ఎందుకంటే వారు సాతాను ప్రభావము యొక్క భంగం లేకుండా ఉండిరి, సాతాను విషం లేనివారైయుండిరి మరియు వారు మానవాళి మొత్తంలో ఎంతో పవిత్రులైయుండిరి. వారు ఏదేను తోటలో నివసించారు, ఎటువంటి అపవిత్రత లేకుండా, శరీరం ద్వారా స్వాధీనపరచబడకుండా యెహోవాయందలి భక్తితో ఉండేవారు. తరువాత, వారు సాతాను ద్వారా శోధించబడినప్పుడు, వారు సర్పం లాగా విషం కలిగి ఉన్నారు మరియు యెహోవాకు ద్రోహం చేయాలనే కోరికను కలిగి ఉన్నారు మరియు వారు సాతాను ప్రభావంలో జీవించారు. ప్రారంభంలో, వారు పవిత్రులుగా ఉంటూ యెహోవాయందలి భయభక్తిని కలిగియుండిరి; ఈ స్థితిలో మాత్రమే వారు మనుషులుగా మారారు. అటు పిమ్మట, వారు సాతానుచే శోధించబడిన తరువాత, వారు మంచి మరియు చెడుల తెలివినిచ్చే చెట్టు ఫలాలను తిని, సాతాను యొక్క ప్రభావంలో జీవించారు. వారు క్రమంగా సాతానుచే పాడుచేయబడ్డారు మరియు మనిషి యొక్క అసలు ప్రతిరూపాన్ని కోల్పోయారు. ప్రారంభంలో, మానవుడు యెహోవా శ్వాసను కలిగి ఉన్నాడు, కొంచెం కూడా అవిధేయుడు కాదు మరియు అతని హృదయంలో చెడు ఉండేది కాదు. ఆ సమయంలో, మనిషి నిజంగా మానవుడిగానే ఉన్నాడు. సాతాను ద్వారా భ్రష్టుపట్టిన తరువాత, మనిషి మృగంలాగా మారాడు. అతని ఆలోచనలు మంచి గాని లేదా పవిత్రత గాని లేకుండా దుష్టత్వము మరియు అపవిత్రతో నిండి ఉన్నాయి. ఇది సాతాను కాదా? నీవు దేవుని కార్యమును అధికముగా అనుభవించావు, అయినప్పటికీ నీవు మారలేదు, లేదా శుద్ధి కాలేదు. నీవు ఇప్పటికీ సాతాను ఆధిపత్యంలో నివసిస్తున్నావు, ఇంకా దేవునికి లోబడటం లేదు. ఇలాంటి వ్యక్తి జయించబడిన వ్యక్తే గాని పరిపూర్ణుడైన వ్యక్తి కాదు. మరి అలాంటి వ్యక్తిని పరిపూర్ణుడవ్వలేదని ఎందుకు అంటారు? ఎందుకంటే ఈ వ్యక్తి జీవమును గాని, లేక దేవుని క్రియను గూర్చిన జ్ఞానాన్ని గాని వెంబడించడు, మరియు శరీర సుఖాలు మరియు క్షణిక సుఖాల కంటే మరేమియూ కోరుకోడు. తత్ఫలితంగా, వారి జీవన విధానంలో ఎటువంటి మార్పులు లేవు మరియు దేవుడు సృష్టించిన మనిషి యొక్క అసలు రూపాన్ని వారు తిరిగి పొందలేదు. అలాంటి వాళ్ళు నడిచే శవాలు, ఆత్మ లేని మృతులు! ఆత్మలోని విషయాల జ్ఞానాన్ని వెంబడించని వారు, పవిత్రతను వెంబడించనివారు మరియు సత్యాన్ని అనుసరిస్తూ జీవించనివారు, ప్రతికూలత వైపు మాత్రమే జయించబడటంలో సంతృప్తి చెందేవారు మరియు దేవుని వాక్యముల ప్రకారం పవిత్ర మానవులుగా జీవించలేనివారు, అంటే వీరు రక్షింపబడని వ్యక్తులు. ఎందుకంటే, మనుష్యులు సత్యములేని ప్రజలై ఉంటే, దేవుడు పరీక్షించు సమయంలో మనుష్యులు స్థిరంగా నిలబడలేరు; దేవుని పరీక్షల సమయంలో స్థిరంగా నిలబడగలిగిన వారు మాత్రమే రక్షింపబడినవారు. నాకు కావలసింది పేతురు లాంటి వ్యక్తులు, పరిపూర్ణులుగా మారాలని కోరుకునే వ్యక్తులు. ఈ రోజు సత్యము కొరకు తహతహలాడే మరియు కోరుకునే వారికి అది ఇవ్వబడుతుంది. ఈ విమోచన దేవుని ద్వారా రక్షింపబడాలని కోరుకునే వారందరికీ మంజూరు చేయబడుతుంది కానీ మీరు మాత్రమే పొందుకోవడానికి ఉద్దేశించినది కాదు. దీని ఉద్దేశ్యం ఏమిటంటే మీరు దేవుని ద్వారా సంపాదించబడవచ్చు; దేవుడు మిమ్మల్ని సంపాదించు క్రమములోనే మీరు దేవుణ్ణి సంపాదించుకుంటారు. ఈ రోజు నేను మీతో ఈ మాటలు మాట్లాడాను, మీరు వాటిని విన్నారు మరియు మీరు ఈ మాటల ప్రకారం ఆచరించాలి. చివరికి, మీరు ఈ మాటలను ఆచరణలో పెట్టినప్పుడు, ఈ మాటల ద్వారా నేను మిమ్మల్ని సంపాదించుకున్న క్షణం అవుతుంది; అదే సమయంలో, మీరు కూడా ఈ మాటలను సంపాదించుకున్నారు, అంటే మీరు ఈ అత్యున్నతమైన రక్షణను పొందుకున్నారు. ఒక్కసారి మీరు శుద్ధి చేయబడినవారైతే, మీరు నిజమైన మానవులుగా మారతారు. నీవు సత్యాన్ని బట్టి బ్రతకడములో అసమర్థుడివైతే, లేదా పరిపూర్ణంగా తయారైన వ్యక్తి యొక్క సారూప్యతతో జీవించడంలో అసమర్థుడివైతే, నీవు మానవునివి కాదని, నడిచే శవమని, మృగానివని చెప్పవచ్చు. ఎందుకంటే నీవు సత్యం లేకుండా ఉన్నావు, అంటే నీవు యెహోవా ఊదిన శ్వాస లేకుండా ఉన్నావు, అందువల్ల నీవు ఆత్మలేని చనిపోయిన వ్యక్తివి! జయించబడిన తర్వాత సాక్ష్యమివ్వడం సాధ్యమే అయినప్పటికీ, నీవు పొందేది కొద్ది రక్షణ మాత్రమే, మరియు నీవు ఆత్మను కలిగి ఉన్న జీవిగా మారలేదు. నీవు శిక్షను మరియు తీర్పును అనుభవించినప్పటికీ, దాని ఫలితంగా నీ స్వభావం పునరుద్ధరించబడలేదు లేక మారలేదు; నీవు ఇప్పటికీ నీ పాత స్వభావమును కలిగియున్నావు, నీవు ఇప్పటికీ సాతానుకు చెందినవానివి, మరియు నీవు శుద్ధి చేయబడిన వ్యక్తివి కాదు. పరిపూర్ణులైనవారికి మాత్రమే విలువ ఉంటుంది మరియు అలాంటి వ్యక్తులు మాత్రమే నిజమైన జీవితాన్ని పొందారు. ఒక రోజు, ఎవరైనా నీతో ఇలా అంటారు, “నీవు దేవుని కార్యమును అనుభవించావు, కాబట్టి ఆయన కార్యము ఎలా ఉంటుందో ప్రకటించు. దావీదు దేవుని క్రియలను అనుభవించాడు మరియు యెహోవా కార్యాలను చూశాడు, మోషే కూడా యెహోవా కార్యాలను చూశాడు, మరియు వారిద్దరూ యెహోవా కార్యాలను వర్ణించగలిగారు మరియు యెహోవా యొక్క మహా ఔన్నత్యమును గురించి మాట్లాడగలిగారు. మీరు అంత్య దినాలలో శరీరధారియైన దేవుని కార్యమును చూశారు; నీవు ఆయన జ్ఞానం గురించి మాట్లాడగలవా? నీవు ఆయన కార్యము యొక్క అద్భుతం గురించి మాట్లాడగలవా? దేవుడు మీ నుండి ఏమి కోరుకున్నాడు, మరియు మీరు వాటిని ఎలా అనుభవించారు? మీరు అంత్య దినములలో దేవుని కార్యమును అనుభవించారు, అప్పుడు మీ గొప్ప దర్శనం ఏమిటి? మీరు దీని గురించి మాట్లాడగలరా? మీరు దేవుని నీతియుక్తమైన స్వభావం గురించి మాట్లాడగలరా?” ఈ ప్రశ్నలు ఎదురైనప్పుడు నీవు ఎలా స్పందిస్తావు? ఒకవేళ నీవు, “దేవుడు చాలా నీతిమంతుడు, ఆయన మనల్ని శిక్షిస్తాడు మరియు తీర్పు తీరుస్తాడు మరియు మనల్ని నిస్సందేహంగా బయలుపరుస్తాడు; దేవుని స్వభావం నిజంగా మనిషి యొక్క నేరాన్ని సహించదు; దేవుని కార్యాన్ని అనుభవించిన తర్వాత, నేను మన స్వంత మృగత్వాన్ని తెలుసుకున్నాను, మరియు నేను నిజంగా దేవుని నీతివంతమైన స్వభావాన్ని చూశాను,” అప్పుడు అవతలి వ్యక్తి, “మీకు దేవుని గురించి ఇంకా ఏమి తెలుసు? ఎవరైనా జీవములోకి ఎలా ప్రవేశిస్తారు? నీకు ఏవైనా వ్యక్తిగత ఆకాంక్షలు ఉన్నాయా?” అని అడుగుతాడు. అప్పుడు నీవు, “సాతాను ద్వారా భ్రష్టుపట్టిన తరువాత, దేవుని ద్వారా సృష్టించబడినవన్నీ మృగాలుగా మారాయి మరియు గాడిదలకంటే ఎక్కువేమీ తీసిపోలేదు. ఈ రోజు, నేను దేవుని చేతులలో జీవిస్తున్నాను, కాబట్టి నేను సృష్టికర్త యొక్క కోరికలను తప్పక తీర్చాలి మరియు ఆయన బోధలన్నిటికి లోబడాలి. నాకు వేరే మార్గం లేదు” అని ప్రత్యుత్తరం చెబుతావు. నీవు ఇలాంటి సాధారణ విషయాలలో మాత్రమే మాట్లాడితే, ఆ వ్యక్తికి మీరు చెప్పేది అర్థం కాదు. దేవుని కార్యము గురించి నీకు ఏమి తెలుసు అని వారు మిమ్మల్ని అడిగినప్పుడు, వారు నీ వ్యక్తిగత అనుభవాలను సూచిస్తున్నారు. దేవుని శిక్ష మరియు తీర్పును అనుభవించిన తర్వాత మీరు ఎటువంటి జ్ఞానాన్ని కలిగి ఉన్నారని వారు విచారిస్తున్నారు మరియు ఇందులో వారు నీ వ్యక్తిగత అనుభవాల గురించి ప్రస్తావిస్తున్నారు మరియు నీవు సత్యం గురించి నీ జ్ఞానం గురించి మాట్లాడాలని అడుగుతున్నారు. నీవు అలాంటి వాటి గురించి మాట్లాడలేకపోతే, ఈనాటి కార్యమును గురించి నీకు ఏమీ తెలియదని ఇది రుజువు చేస్తుంది. నీవు ఎల్లప్పుడూ విశేషమైన లేక విశ్వవ్యాప్తంగా తెలిసిన మాటలు మాట్లాడతావు; నీకు నిర్దిష్ట అనుభవాలు లేవు, నీ జ్ఞానానికి చాలా తక్కువ సారాంశం ఉంది మరియు నీకు నిజమైన సాక్ష్యాలు కూడా లేవు, కాబట్టి ఇతరులు నీచే ఒప్పించబడరు. దేవునికి నిష్క్రియాత్మక అనుచరునిగా ఉండకండి మరియు నీకు ఆసక్తిని కలిగించే వాటినే అనుసరించవద్దు. చల్లగా, లేక వెచ్చంగానైనాఉండకపోవడం ద్వారా నిన్ను నీవు నాశనం చేసుకుంటావు మరియు నీ జీవితానికి భంగము కలిగించుకుంటావు. నీవు అటువంటి నిష్క్రియాత్మకత మరియు అచేతనం నుండి నిన్ను నీవు వదిలించుకోవాలి మరియు సానుకూల విషయాలను అనుసరించడంలో మరియు నీ స్వంత బలహీనతలను అధిగమించడంలో ప్రవీణుడివి కావాలి, తద్వారా నీవు సత్యాన్ని సంపాదించుకోగలవు మరియు సత్యాన్ని బట్టి జీవించగలవు. నీ బలహీనతల గురించి భయపడాల్సిన పని లేదు మరియు నీ లోపాలు నీకున్న అతిపెద్ద సమస్య కాదు. నీ అతి పెద్ద సమస్యమరియు నీ అతి పెద్ద లోపం ఏమిటంటే నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండకపోవడం మరియు సత్యాన్ని వెతకడంలో నీకు కోరిక లేకపోవడం. మీ అందరిలో ఉన్న అతి పెద్ద సమస్య ఏమిటంటే పిరికి మనస్తత్వం, తద్వారా మీకు ఉన్న విషయాలతోనే సంతోషంగా ఉంటారు కనుక నిష్క్రియంగా అలానే వేచి ఉంటారు. ఇది మీకున్న గొప్ప అడ్డు మరియు మీ సత్యాన్వేషణకు అతిపెద్ద శత్రువు. నేను చాలా లోతైన అర్థాన్ని కలిగిన మాటలను మాట్లాడినందున మాత్రమే నీవు లోబడితే, నీవు నిజంగా జ్ఞానాన్ని సంపాదించుకోలేదని అర్థం మరియు నీవు సత్యాన్ని విలువైనదిగా పరిగణించలేదని అర్థం. నీవు కలిగి ఉన్న విధేయత సాక్ష్యం కాదు మరియు అటువంటి విధేయతను నేను ఆమోదించను. నీ దేవుడు ఖచ్చితంగా ఎక్కడ నుండి వచ్చాడు? నీవు కలిగియున్న ఈ దేవుని గుణగణాలు ఏమిటి?” అని నిన్ను ఎవరైనా అడుగవచ్చు, అప్పుడు నీవు, “ఆయన గుణగణాలు శిక్షించడం మరియు తీర్పు తీర్చడం” అని ప్రత్యుత్తరం ఇస్తావు. అప్పుడు అతను అలాగే కొనసాగిస్తూ, “దేవుడు మనిషిపట్ల కనికరం మరియు ప్రేమగలవాడు కాదా? ఇది నీకు తెలియదా?” అని అంటాడు, అప్పుడు నీవు, “అది ఇతరుల దేవుడు. మతస్థులైన ప్రజలు విశ్వసించే దేవుడు, అది మన దేవుడు కాదు” అని అంటావు. నీవంటి వ్యక్తులు సువార్తను వ్యాప్తి చేసినప్పుడు, నీవు నిజమైన మార్గాన్ని వక్రీకరిస్తావు. అప్పుడు నీకు వచ్చే ఉపయోగం ఏమిటి? ఇతరులు నీ నుండి నిజమైన మార్గాన్ని ఎలా పొందగలరు? నీవు సత్యం లేకుండా ఉన్నావు, మరియు సత్యం గురించి ఏమీ మాట్లాడలేవు, అంతేగాక, నీవు సత్యాన్ని బట్టి జీవించలేవు కూడా. దేవుని యెదుట జీవించడానికి నీకు అర్హత కల్పించేది ఏమిటి? నీవు ఇతరులకు సువార్తను వ్యాపింపజేసినప్పుడు మరియు నీవు సత్యం గురించి సహవాసం చేసినప్పుడు మరియు దేవునికి సాక్ష్యంగా ఉన్నప్పుడు, నీవు వారిని గెలవలేనట్లయితే, వారు నీ మాటలను ఖండిస్తారు. నీవు ఉండేది దండగా కదా? నీవు దేవుని కార్యమును చాలా అనుభవించావు, అయినప్పటికీ నీవు సత్యం గురించి మాట్లాడినప్పుడు అది అర్ధవంతముగా లేదు. నీవు దేనికీ ఉపయోగపడనివానివి కాదా? నీ వలన ఏమి ఉపయోగం? నీవు దేవుని కార్యమును ఎంతో అనుభవించావు, అయినప్పటికీ ఆయనను గూర్చిన కనీస జ్ఞానం లేదు? దేవుని గురించి నీకు నిజమైన జ్ఞానం ఏమి ఉందని వారు అడిగినప్పుడు, నీవు మాటలు లేనట్టు ఉంటావు లేదా అసందర్భమైన వాటితో సమాధానం ఇస్తావు. దేవుడు శక్తిమంతుడనియు, నీవు పొందిన గొప్ప ఆశీర్వాదాలు నిజంగా దేవుని గొప్పతనము అని, దేవునిని స్వయంగా చూడగలగడం కంటే గొప్ప ఆధిక్యత మరొకటి లేదు అని చెప్తావు. ఇలా చెప్పడంలో విలువ ఏమిటి? అవి ఉపయోగములేని ఉత్త మాటలు! దేవుని కార్యమును ఎంతో అనుభవించిన నీకు దేవుని ఔన్నత్యమే సత్యమని తెలుసా? నీవు దేవుని కార్యమును తప్పక తెలుసుకోవాలి మరియు అప్పుడు మాత్రమే నీవు దేవునికి నిజమైన సాక్ష్యాన్ని కలిగి ఉంటావు. సత్యాన్ని పొందుకోలేని వారు దేవునికి ఎలా సాక్ష్యం చెప్పగలరు?

ఎంతో కార్యము మరియు ఎన్నో మాటలు నీపై ఎటువంటి ప్రభావం కలగజేయకపోతే, అప్పుడు దేవుని కార్యమును వ్యాప్తి చేసే సమయం వచ్చినప్పుడు నీవు నీ కర్తవ్యాన్ని నిర్వర్తించలేవు, అప్పుడు సిగ్గుపడతావు మరియు అవమానానికి గురవుతావు. ఆ సమయంలో, నీవు దేవునికి ఎంతో రుణపడి ఉన్నావని, దేవుని గురించి నీకున్న జ్ఞానం పైపై జ్ఞానమని నీవు భావిస్తావు. ఆయన కార్యము చేయుచున్నప్పుడు, నీవు ఈ దినము దేవుని యొక్క జ్ఞానాన్ని వెంబడించకపోతే, అప్పుడు తర్వాత అది చాలా ఆలస్యం అవుతుంది. చివరలో నీకు మాట్లాడడానికి జ్ఞానం ఉండదు, అంటే నీవు ఏమీ లేకుండా ఖాళీగా మిగిలిపోతావు. దేవునికి ఒప్పజెప్పడానికి నీవు ఏమి ఉపయోగిస్తావు? నీవు దేవుని వైపు చూడడానికి ధైర్యం కలిగి ఉన్నావా? నీవు ఇప్పుడే నీ అన్వేషణలో కష్టపడి పని చేయాలి, తద్వారా చివరికి మనిషికి దేవుని యొక్క శిక్ష మరియు తీర్పు ఎంత ప్రయోజనకరమైనదో, మరియు ఆయన శిక్ష మరియు తీర్పు లేకుండా మనిషి రక్షింపబడలేడని మరియుకేవలం ఈ అపరిశుద్ధమైన భూమిలోనికి మరింత లోతుగా, బురదలోకి మరింత లోతుగా మునిగిపోగలడని నీవు పేతురువలె అర్థము చేసుకుంటావు. ప్రజలు సాతాను ద్వారా భ్రష్టుపట్టారు, ఒకరిపై ఒకరు కుట్ర పన్నారు మరియు ఒకరిపట్ల మరొకరు కఠినంగా ప్రవర్తిస్తున్నారు, దేవునిపట్ల వారికున్న భయాన్ని కోల్పోయారు. వారి తిరస్కారం చాలా పెద్దది, వారి తలంపులు చాలా ఉన్నాయి, మరియు అవన్నీ సాతానుకు చెందినవే. దేవుని యొక్క శిక్ష మరియు తీర్పు లేకుండా, మనిషికున్న భ్రష్ట స్వభావము శుద్ధీకరించబడదు మరియు అతను రక్షింపబడలేడు. శరీరధారియైన దేవుని కార్యము ద్వారా వ్యక్తీకరించబడినది ఏమంటే ఖచ్చితంగా ఆత్మ ద్వారా వ్యక్తీకరించబడినదే, మరియు ఆయన చేసే కార్యము ఆత్మ ద్వారా చేయబడిన దాని ప్రకారం నిర్వహించబడుతుంది. ఈ రోజు నీవు ఈ కార్యము గురించి జ్ఞానము కలిగి లేనట్లయితే, అప్పుడు నీవు ఎంతో అవివేకివి అని మరియు ఎంతో కోల్పోయావు అని అర్థం! నీవు దేవుని రక్షణను పొందకపోతే, అప్పుడు నీ నమ్మకం మతపరమైన విశ్వాసం మరియు నీవు మతానికి చెందిన క్రైస్తవునివి. ఎందుకంటే నీవు మృత సిద్ధాంతాన్ని స్థిరంగా పట్టుకున్నావు, నీవు పరిశుద్ధాత్మ యొక్క నూతన కార్యాన్ని కోల్పోయావు; నీ విశ్వాసము దేవుని ఆమోదాన్ని పొందుకోలేని సమయములో దేవుని ప్రేమను వెంబడించే ఇతరులు సత్యాన్ని మరియు జీవాన్ని పొందుకోగలుగుతారు. దానికి బదులుగా, నీవు వినాశనకరమైన మరియు ద్వేష పూరితమైన చర్యలకు పాల్పడే ఒక దుర్మార్గుడిగా మారావు; నీవు సాతాను యొక్క పరిహాసాలకు లక్ష్యంగా, మరియు సాతాను యొక్క బంధీగా మారావు. దేవుడు మనిషి నమ్మడములో లేడు కానీ అతను ప్రేమించడములోను, అతను వెంబడించడములోను మరియు అతను ప్రేమించడములోను ఉన్నాడు. నీవు ఈ రోజున వెంబడించకపోతే, అప్పుడు “అప్పట్లో నేను దేవునిని ఎందుకు సరిగ్గా అనుసరించలేదు, ఎందుకు ఆయనను సరిగ్గా సంతృప్తి పరచలేదు, నా జీవిత స్వభావంలోని మార్పులు తెచ్చుకోవడములో నేనెందుకు ఆసక్తి చూపలేదు? నేను ఆ సమయంలో దేవునికి సమర్పించుకోనందుకు, దేవుని వాక్యము యొక్క జ్ఞానాన్ని వెంబడించనందుకు ఎంతగా చింతిస్తున్నాను. మునుపు దేవుడు చాలా చెప్పాడు; నేను ఎలా వెంబడించకుండా ఉన్నాను? నేను చాలా తెలివి తక్కువ వాడిని!” అని నువ్వు చెప్పే రోజు వస్తుంది, నిన్ను నీవు కొంత మేరకు ద్వేషిస్తావు. ఈ రోజు నీవు నేను చెప్పే మాటలను నమ్మవు, మరియు వాటిని పట్టించుకోవు; ఈ కార్యము వ్యాప్తి చెందే రోజు వచ్చినప్పుడు మరియు నీవు దాని సమస్తాన్ని చూస్తావు, నీవు చింతిస్తావు, మరియు ఆ సమయంలో నీవు మూగబోతావు. ఆశీర్వాదాలు ఉన్నాయి గానీ నీకు వాటిని ఆస్వాదించడం తెలియదు, మరియు సత్యం ఉంది గానీ నీవు దానిని వెంబడించవు. నీపై నీవే తిరస్కారమును తెచ్చుకోవడం లేదా? ఈ రోజు దేవుని కార్యము యొక్క తదుపరి దశ ఇంకా ప్రారంభం కావలసినప్పటికీ నీ నుండి కోరిన వాటిలో, మరియు నిన్ను జీవించమని అడిగిన దానిలో ఎటువంటి ప్రత్యేకత లేదు. ఎంతో పని ఉంది మరియు ఎన్నో సత్యాలు ఉన్నాయి; నీ చేత గుర్తింపబడడానికి అవి తగినవి కావా? దేవుని శిక్ష మరియు తీర్పు నీ ఆత్మను మేల్కొల్పలేనిదిగా ఉందా? దేవుని శిక్ష మరియు తీర్పు నిన్ను నీవు ద్వేషించుకునేలా చేయలేదా? నీవు సాతాను ప్రభావంలో శాంతి మరియు ఆనందములతో స్వల్పమైన శారీరక సౌఖ్యంతో జీవించడానికి తృప్తిగా ఉన్నావా? నీవు జనులందరిలో హీనుడివి కాదా? విమోచనను చూసినా, దానిని పొందుకోవడానికి వెంబడించని వారికంటే ఎక్కువ అవివేకులు ఎవరూ ఉండరు; వీరందరూ తమ శరీరములను తమకు తామే అపవిత్రము చేసుకొని మరియు సాతానునుబట్టి ఆనందించువారు. నీవు దేవునిలో ఉంచిన విశ్వాసము ఎటువంటి సవాళ్లను, లేదా విపత్తులను, లేదా స్వల్పమైన శ్రమను ఇవ్వదని నిరీక్షణను కలిగియుంటావు. నీ సొంత విపరీత ఆలోచనలను సత్యం ముందు పెట్టడానికి బదులుగా నీవు ఎల్లప్పుడూ పనికిమాలిన విషయాలను వెంబడిస్తావు, మరియు నీవు జీవితానికి ఎటువంటి విలువను చేర్చవు, నీవు చాలా విలువలేనివాడివి! నీవు పంది వలె జీవిస్తావు, అంటేనీకు పందులకు మరియు కుక్కలకు మధ్య ఏమి తేడా ఉంది? సత్యాన్ని వెంబడించడానికి బదులుగా శరీరాన్ని ప్రేమించే వారందరూ మృగాలు కారా? ఆత్మలు లేకుండా మృతి చెందిన వారందరూ నడిచే శవాలు కారా? మీ మధ్య ఎన్ని మాటలు చెప్పబడుచున్నాయి? మీ మధ్య చిన్న కార్యము మాత్రమే చేయబడిందా? మీ మధ్య నేను ఎంతగా అందించాను? నీవు వాటిని ఎందుకు పొందుకోలేదు? నువ్వు ఫిర్యాది చేయడానికి ఏముంది? నీవు శరీరముతో అధికమైన ప్రేమలో ఉన్నందువలన నీవు ఏమీ పొందుకోలేని స్థితి కాదా ఇది? మరియు నీ ఆలోచనలు మరీ విపరీతంగా ఉన్నందువల్ల కాదా? ఇది నీవు చాలా తెలివి తక్కువవాడివి అవడంవల్ల కాదా? నీవు ఈ ఆశీర్వాదాలను పొందుకొనుటకు సామర్థ్యం లేనివాడివయితే, నిన్ను రక్షించనందుకై నీవు దేవుణ్ణి నిందించగలవా? నీవు వెంబడించేది ఎందుకంటే దేవుణ్ణి విశ్వసించిన తర్వాత శాంతిని పొందుకోగలిగేందుకు, నీ పిల్లలు అనారోగ్యం నుండి విడుదలపొందుట కొరకు, నీ భర్త మంచి ఉద్యోగం కలిగి ఉండుట కొరకు, నీ కుమారునికి మంచి భార్య దొరుకుట కొరకు, నీ కుమార్తెకు మంచి భర్త కోసం, నీ ఎద్దులు మరియు గుర్రాలు భూమిని బాగా దున్నడం కోసం, నీ పంటల కోసం మంచి వాతావరణం ఉండే సంవత్సరం కోసం. వీటినే నువ్వు కోరేది. సుఖంగా జీవించడానికి, నీ కుటుంబానికి ఏ ప్రమాదం సంభవించకుండుట కొరకు, ఉపశమనము పొందుట కొరకు, నీ ముఖము దుమ్ము ధూళిచేత తాకబడకుండుట కొరకు, నీ కుటుంబ సభ్యుల పంటలు వరదలకు గురికాకుండా ఉండుట కొరకు, నీవు ఏ విపత్తులకు గురికాకుండా ఉండుట కొరకు, దేవుని ఆలింగనంలో బతకడానికి, భద్రమైన గూటిలో జీవించడానికి నీ అన్వేషణయైయున్నది. ఎల్లప్పుడు శరీరాన్ని వెంబడించే నీవంటి పిరికివాడు, అంటే నీవు హృదయం కలిగి ఉన్నావా, నీవు ఆత్మ కలిగి ఉన్నావా? నీవు మృగానివి కావా? నేను ప్రతిఫలంగా ఏదీ అడగకుండానే నిజమైన మార్గాన్ని నీకు ఇస్తాను. అయినప్పటికీ నీవు అనుసరించవు. నీవు దేవుని నమ్మేవారిలో ఒకనివా? నేను నిజమైన మానవ జీవితాన్ని నీపై అనుగ్రహిస్తాను, అయినప్పటికీ నీవు వెంబడించవు. నీకు పందికి, లేక కుక్కకు ఎటువంటి వ్యత్యాసము ఏముంది? పందులు మానవ జీవితాన్ని అనుసరించవు, అవి శుద్ధీకరించబడుటను వెంబడించవు మరియు వాటికి జీవితం అంటే ఏంటో అర్థం కాదు. ప్రతిరోజు, వాటికి నిండినంత తిన్న తర్వాత, అవి నేరుగా నిద్రపోతాయి. నేను నిజమైన మార్గాన్ని నీకు ఇచ్చాను, అయినప్పటికీ నీవు ఇంకా దానిని పొందుకోలేదు: నీవు ఖాళీ చేతులతో ఉన్నావు. నీవు ఈ జీవితంలో పందిలాంటి జీవితాన్ని కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నావా? అలాంటి జనులు జీవించి ఉండటంలో సార్ధకత ఏముంది? నీ జీవితం తుచ్చమైనది మరియు అల్పమైనది, నీవు అపవిత్రమైన మరియు విచ్చలవిడితనం నడుమ జీవిస్తావు మరియు నీవు ఏ లక్ష్యాలను కలిగి జీవించవు; నీ జీవితం అన్నింటిలోకెల్లా అతి అల్పమైనది కాదా? నీవు దేవుని చూసే ధైర్యాన్ని కలిగి ఉన్నావా? నీవు ఈ విధంగా అనుభవిస్తూ ఉంటే, నువ్వు ఏమీ సాధించలేవు కదా? నీకు నిజమైన మార్గం ఇవ్వబడింది, కానీ నీవు అంతిమంగా దానిని పొందగలవా లేదా అనేది నీ స్వంత వ్యక్తిగత అన్వేషణపై ఆధారపడి ఉంటుంది. దేవుడు నీతివంతుడైన దేవుడని, మానవుడు అంతము వరకు ఆయనను అనుసరిస్తున్నంతవరకూ, ఆయన ఖచ్చితంగా మానవునిపట్ల నిష్పక్షపాతంగా ఉంటాడని ప్రజలు చెబుతారు, ఎందుకంటే ఆయన అత్యంత నీతివంతుడు. మనిషి చివరి వరకు ఆయనను అనుసరిస్తే, ఆయన మనిషిని పక్కన పెట్టగలడా? నేను మనుష్యులందరిపట్ల నిష్పక్షపాతంగా ఉంటాను, మరియు నా నీతి స్వభావంతో మనుష్యులందరికీ తీర్పు తీరుస్తాను, అయినప్పటికీ నేను మనిషి నుండి కోరేవాటికి అనువైన పరిస్థితులు ఉన్నాయి మరియు నేను కోరుకునేవాటిని వారు ఎంతటివారైనా అందరూ నెరవేర్చాలి. నీ అర్హతలు ఎలా ఉన్నాయో, లేక నీవు ఎంత కాలంగా వాటిని కలిగి ఉన్నావో నేను పట్టించుకోను; నీవు నా మార్గంలో నడుస్తున్నావా లేదా, నీవు సత్యాన్ని ప్రేమిస్తున్నావా లేదా మరియు సత్యము కొరకు తృష్ణ కలిగియున్నావా లేదా అనేదాన్ని మాత్రమే నేను పట్టించుకుంటాను. నీవు సత్యాన్ని కోల్పోయి, దానికి బదులుగా నా నామానికి అవమానాన్ని తీసుకువస్తే, నా మార్గం ప్రకారం ప్రవర్తించకుండా, శ్రద్ధ గాని, లేక పట్టింపు లేకుండా ఊరకనే అనుసరిస్తుంటే, అప్పుడు ఆ సమయంలో నేను నీ దుష్టత్వము కొరకు నిన్ను పడగొట్టి శిక్షిస్తాను. అప్పుడు నీవు చెప్పడానికి ఏం ఉంటుంది? దేవుడు నీతిమంతుడు కాదని నీవు చెప్పగలవా? ఈ రోజున నీవు నేను చెప్పిన మాటలను ఆచరణలో పెడితే, నేను ఆమోదించేది నీ వంటి వ్యక్తినే. నీవు దేవుణ్ణి వెంబడిస్తున్నప్పుడు నీవు ఎల్లప్పుడూ బాధపడ్డావని, నీవు కష్టమైనా, నష్టమైనా ఆయనను అనుసరించావని మరియు మంచి, చెడుల పరిస్థితులను ఆయనతో పంచుకున్నావని అని చెప్తావు, కానీ నీవు దేవుడు పలికిన వాక్కుల ప్రకారంగా జీవించలేదని చెప్తావు; నీవు దేవుని కొరకు పరిగెత్తాలని మరియు ప్రతిరోజూ దేవుని కోసం నిన్ను నీవు వెచ్చించాలని మాత్రమే కోరుకుంటావు మరియు అర్థవంతమైన జీవితాన్ని గడపాలని ఎప్పుడూ అనుకోలేదు. “ఏదేమైనా, దేవుడు నీతిమంతుడని నేను నమ్ముతున్నాను. నేను ఆయన కొరకు బాధపడ్డాను, ఆయన కొరకు అటూ ఇటూ పరిగెత్తాను మరియు ఆయన కొరకు నన్ను నేను సమర్పించుకున్నాను మరియు ఎటువంటి గుర్తింపు పొందకపోయినా నేను కష్టపడి పనిచేశాను; ఆయన ఖచ్చితంగా నన్ను గుర్తుంచుకుంటాడు” అని నీవు కూడా అంటావు. దేవుడు నీతిమంతుడనేది నిజం, అయినప్పటికీ ఈ నీతి అపవిత్రమైనవాటితో కలుషితం కాలేదు: ఇందులో మానవ చిత్తం లేదు మరియు ఇది శరీరం లేదా మానవ వ్యవహారాల ద్వారా కలుషితం కాదు. తిరుగుబాటుదారులు మరియు విరోధులందరూ, ఆయన మార్గానికి సమ్మతించని వారందరూ శిక్షించబడతారు; ఎవరూ క్షమించబడరు మరియు ఎవరూ విడిచిపెట్టబడరు! అప్పుడు కొంతమంది, “ఈ రోజు నేను నీ కొరకు పరుగెడుతున్నాను; ముగింపు వచ్చినప్పుడు, నీవు నాకు కొద్దిగా ఆశీర్వాదం ఇవ్వగలవా?” అని అంటారు, అందుచేత నేను నిన్ను, “నీవు నా మాటలకు కట్టుబడి ఉన్నావా?” అని అడుగుతాను. నీవు మాట్లాడే నీతి లావాదేవీలపై ఆధారపడి ఉంటుంది. నీవు నేను నీతిమంతుడనని మరియు మనుష్యులందరి పట్ల నిష్పక్షపాతంగా ఉన్నానని, మరియు నన్ను అంతము వరకు అనుసరించే వారందరూ ఖచ్చితంగా రక్షింపబడతారని మరియు నా ఆశీర్వాదాలను పొందుతారని మాత్రమే అనుకుంటావు. “నన్ను చివరి వరకు అనుసరించే వారందరూ ఖచ్చితంగా రక్షింపబడతారు” అనే నా మాటలకు అంతరార్థం ఉంది: నన్ను చివరి వరకు అనుసరించే వారు నా ద్వారా పూర్తిగా సంపాదించబడతారు, వారు నా ద్వారా జయించబడిన తర్వాత సత్యాన్ని వెదకి, పరిపూర్ణులు కాబడతారు. నీవు ఎటువంటి వాటిని సాధించావు? నీవు నన్ను చివరి వరకు అనుసరించడం మాత్రమే సాధించావు, అంతకు మించి ఏముంది? నీవు నా మాటలకు కట్టుబడి ఉన్నావా? నీవు నేను కోరిన వాటిలో ఒకదానిని మాత్రమే సాధించావు, అయినప్పటికీ మిగిలిన నాలుగింటిని పూర్తి చేయాలనే ఉద్దేశ్యం నీకు లేదు. నీవు కేవలం సులభమైన, తేలికైన మార్గాన్ని కనుగొన్నావు మరియు అదృష్టవంతుడివి అవుతావనే ఆశతో దానిని అనుసరించావు. నీవంటి వ్యక్తిపట్ల నా నీతి స్వభావం అనేది ఒక శిక్ష మరియు తీర్పుయైయున్నది. ఇది ఒకానొక నీతియుతమైన ప్రతికారమైయున్నది మరియు దుష్ట కార్యాలు చేసేవారందరికీ ఇది న్యాయమైన శిక్షయైయున్నది; నా మార్గంలో నడవనివారందరూ చివరి వరకు అనుసరించినప్పటికీ ఖచ్చితంగా శిక్షించబడతారు. ఇది దేవుని నీతియైయున్నది. ఈ నీతి స్వభావం మనిషిని శిక్షించడంలో వ్యక్తమైనపుడు, మనిషి మూగవాడు అవుతాడు మరియు దేవుణ్ణి అనుసరిస్తున్నప్పుడు అతను ఆయన మార్గంలో నడవలేదని పశ్చాత్తాపపడతాడు. “ఆ సమయంలో, నేను దేవుణ్ణి అనుసరిస్తున్నప్పుడు కొద్దిగానే బాధపడ్డాను, కానీ దేవుని మార్గంలో నడవలేదు. ఎటువంటి సాకులు ఉన్నాయి? శిక్షించడం తప్ప వేరే దారి లేదు!” అయినప్పటికీ, “ఏమైనప్పటికీ, నేను చివరి వరకు అనుసరించాను, కాబట్టి నీవు నన్ను శిక్షించినా, అది అంత తీవ్రమైన శిక్ష కాదు, మరియు ఈ శిక్ష అమలు చేసిన తర్వాత కూడా నీవు నన్ను కోరుకుంటావు. నీవు నీతివంతునివని మరియు నాతో ఎప్పటికీ ఆ విధంగా ప్రవర్తించవని నాకు తెలుసు. తుదకు, నేను తుడిచిపెట్టబడే వారిలా కాదు; తుడిచిపెట్టబడబోయే వారు తీవ్రమైన శిక్షను పొందుకుంటారు, అయితే నేను పొందుకునే శిక్ష తేలికగా ఉంటుంది” అని అతని మనస్సులో అనుకుంటాడు. నీతి స్వభావం అనేది నీవు చెప్పినట్లుగా ఉండదు. ఇది తమ పాపాలను ఒప్పుకోవడంలో మంచిగా ఉండేవారందరూ సౌమ్యంగా వ్యవహరించే విషయం కాదిది. నీతి అనేది పవిత్రమైనది మరియు ఇది మనిషి యొక్క అపరాధమును సహించని స్వభావం. మార్పు చెందకుండా అపవిత్రంగా ఉన్నదంతా దేవుని అసహ్యించుకోవడానికి గురి చేయబడుతుంది. దేవుని నీతి స్వభావం చట్టం కాదు, కానీ పరిపాలనా శాసనం: ఇది రాజ్యములోనే ఉండే పరిపాలనా శాసనం, మరియు సత్యాన్ని కలిగి ఉండని మరియు మార్పు చెందనివారికెవ్వరికైనా ఈ పరిపాలనా శాసనం న్యాయమైన శిక్షయైయున్నది మరియు రక్షణ కొరకు ఎటువంటి లాభము ఉండదు. ఒకరీతిగా ప్రతి మనిషిని వర్గీకరించినప్పుడు, మంచివారు బహుమానం పొందుతారు మరియు చెడ్డవారు శిక్షించబడతారు. ఇది మనిషి యొక్క గమ్యం స్పష్టమైనపుడు జరుగుతుంది; ఇది రక్షణకి సంబంధించిన కార్యము ముగింపుకు వచ్చే సమయం, ఆ తర్వాత, మనిషిని రక్షించే కార్యము ఇకపై జరగదు మరియు దుష్ట పనులు చేసే ప్రతి ఒక్కరిపై ప్రతీకారం తీర్చబడుతుంది. కొంతమంది,“దేవుడు తరచుగా తన పక్కన ఉండే ప్రతి ఒక్కరినీ గుర్తుంచుకుంటాడు. ఆయన మనలో ఎవరినీ మరచిపోడు. మనం దేవుని ద్వారా పరిపూర్ణులమవుతామని హామీ ఇవ్వబడ్డాము. ఆయన క్రింద ఉన్నవారిలో ఎవరినీ గుర్తుపెట్టుకోడు, క్రింద ఉన్న వారిలో పరిపూర్ణులయ్యేవారు మనకంటే తక్కువగా ఉంటారని హామీ ఇవ్వబడింది, మనం తరచుగా దేవుణ్ణి ఎదుర్కొనేవాళ్లం; మనలో ఎవ్వరమూ దేవునిచే మరువబడలేదు, మనమందరం దేవునిచే ఆమోదించబడ్డాము మరియు మనము దేవునిచే పరిపూర్ణులము అవుతామని హామీ ఇవ్వబడ్డాము” కొంతమంది చెప్తారు. మీ అందరికీ అలాంటి భావనలు ఉన్నాయి. ఇదేనా నీతి? నీవు సత్యాన్ని ఆచరణలో పెట్టావా లేదా? నీవు నిజానికి ఇటువంటి పుకార్లను వ్యాపింపజేస్తున్నావు, నీకు సిగ్గు అనేదే లేదు!

ఈ రోజున కొంతమంది దేవుని ద్వారా వాడబడుతూ వెంబడిస్తారు, కానీ జయించబడిన తర్వాత వారు నేరుగా ఉపయోగించబడలేరు. ఈ రోజు మాట్లాడే మాటల విషయానికొస్తే, దేవుడు ప్రజలను వాడుకుంటున్నప్పుడు, నీవు ఇంకా వాటిని సాధించలేకపోతే, నీవు పరిపూర్ణునిగా చేయబడలేదు. మరో మాటలో చెప్పాలంటే, మనిషిని పరిపూర్ణుడిగా మార్చే కాలం ముగింపుకు వచ్చే ఆరంభ దశలో మనిషి వెలివేయబడతాడా లేదా దేవుని ద్వారా వాడబడతాడా అనేది నిర్ణయించబడుతుంది. జయించబడిన వారు నిష్క్రియాత్మకతకు మరియు ప్రతికూలతకు ఉదాహరణలు తప్ప మరేమీ కాదు; వారు మాదిరిలుగాను మరియు ఆదర్శవంతమైన ప్రజలుగాను ఉన్నారు, కానీ వారు కేవలము విభిన్నంగా ఉన్నారంతే. మనిషి జీవన స్వభావం మారి, లోపలా, బయటా అతను మార్పులను సాధించినప్పుడే, అతడు పూర్తిగా పరిపూర్ణుడు అవుతాడు. ఈ రోజు, నీకు ఏది కావాలి: జయించబడడమా, లేక పరిపూర్ణమవడమా? మీరు ఏది సాధించాలనుకుంటున్నారు? నీవు పరిపూర్ణుడివి కావడానికి షరతులను నెరవేర్చారా? నీకు ఇంకా ఎటువంటి షరతులను కొరత కలిగియున్నావు? నిన్ను నీవు ఎలా సన్నద్ధం చేసుకోవాలి మరియు నీ లోపాలను ఎలా సరిదిద్దుకోవాలి? పరిపూర్ణమయ్యే మార్గంలోకి నీవు ఎలా ప్రవేశించాలి? నీవు పూర్తిగా ఎలా సమర్పించుకోవాలి? నీవు పరిపూర్ణమవ్వాలని కోరుతున్నావు గనుక నీవు పరిశుద్ధతను వెంబడిస్తావా? నీవు శుద్ధి చేయబడటానికి శిక్షను మరియు తీర్పును అనుభవించాలని కోరుకునే వ్యక్తివా? నీవు శుద్ధి చెందడానికి వెంబడిస్తున్నావు కాబట్టి నీవు శిక్షను మరియు తీర్పును అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నావా? నీవు దేవుణ్ణి తెలుసుకోవాలని అడుగుతావు, కానీ నీకు ఆయన శిక్ష మరియు తీర్పు గురించి అవగాహన ఉందా? ఈ రోజు ఆయన నీపై జరిగించే కార్యములో ఎక్కువ భాగం శిక్షించడం మరియు తీర్పు తీర్చడమే ఉంటాయి; నీపై నిర్వహించబడిన ఈ కార్యము గురించి నీకున్న అవగాహన ఏమిటి? నీవు అనుభవించిన శిక్ష మరియు తీర్పు అనేవి నిన్ను శుద్ధి చేశాయా? ఇది నిన్ను మార్చిందా? ఇది నీపై ఏమైనా ప్రభావం చూపిందా? ఈ రోజు జరుగుచున్న ఎక్కువ కార్యముతో నీవు విసిగిపోయావా, అంటే శాపాలు, తీర్పులు మరియు మర్మములువంటివాటితో ఎక్కవగా విసిగిపోయావా? లేదా ఈ విషయాలు నీకు గొప్ప ప్రయోజనకరంగా ఉన్నాయని నీవు భావిస్తున్నావా? నీవు దేవుణ్ణి ప్రేమిస్తావు, కానీ నీవు ఆయనను ఎందుకు ప్రేమిస్తున్నావు? నీవు కాస్త కృపను పొందినందువలన నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? లేక, నీవు శాంతి మరియు ఆనందాన్ని పొందిన తర్వాత దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? లేక, నీవు దేవుని శిక్ష మరియు తీర్పు ద్వారా శుద్ధి చేయబడిన తర్వాత ప్రేమిస్తున్నావా? నిన్ను దేవుణ్ణి ప్రేమించేలా చేసేది ఏమిటి? పరిపూర్ణమవడానికి పేతురు ఏ షరతులను నెరవేర్చాడు? అతను పరిపూర్ణుడైన తర్వాత, అది ఎటువంటి కీలకమైన విధానములో వ్యక్తీకరించబడింది? ఆయన కోసం ఎదురుచూడటంవలన అతను ప్రభువైన యేసును ప్రేమించాడా, లేక అతను ఆయనను చూడలేకపోయినందున ఆయనను ప్రేమించాడా, లేక అతను నిందించబడినందున ఆయనను ప్రేమించాడా? లేక బాధలను, శ్రమలను అంగీకరించి, తన సొంత కల్మషాన్ని, అవిధేయతను తెలుసుకుని, ప్రభువు పవిత్రతను తెలుసుకున్నందుకు యేసు ప్రభువును మరింత ఎక్కువగా ప్రేమించాడా? దేవుని శిక్ష మరియు తీర్పుల కారణంగా అతని ప్రేమ పవిత్రంగా మారిందా, లేక వేరొక దానివలన మారిందా? ఇందులో దేనివలన మారింది? దేవుని కృపవలన నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు మరియు ఈ రోజు ఆయన నీకు కొంత ఆశీర్వాదం ఇచ్చాడు. ఇదేనా నిజమైన ప్రేమ? నీవు దేవుణ్ణి ఎలా ప్రేమించాలి? నీవు పూర్తిగా ఒప్పింపబడేందుకు మరియు ఆయన గురించిన జ్ఞానాన్ని కలిగి ఉండేందుకు ఆయన నీతి స్వభావాన్ని చూసాక, ఆయనను నిజంగా ప్రేమించగలిగేలా నీవు ఆయన శిక్షను మరియు తీర్పును అంగీకరించాలా? పేతురులాగా, నీవు దేవుణ్ణి తగినంతగా ప్రేమించలేవని నీవు చెప్పగలవా? శిక్ష మరియు తీర్పు తర్వాత జయించబడేందుకు వెంబడిస్తున్నావా, లేక శిక్ష మరియు తీర్పు తర్వాత శుద్ధి చేయబడి, రక్షించబడాలని మరియు పట్టించుకోవాలని వెంబడిస్తున్నావా? నీవు వీటిలో దేనిని అనుసరిస్తావు? నీ జీవితం అర్థవంతమైనదేనా, లేదా అది అర్ధరహితమైనదా మరియు విలువ లేనిదా? నీకు శరీరం కావాలా, లేక నీకు సత్యం కావాలా? నీవు తీర్పును కోరుకుంటున్నావా లేదా ఆదరణను కోరుకుంటున్నావా? దేవుని కార్యమును ఎక్కువగా అనుభవించిన తర్వాత, అలాగే దేవుని పవిత్రతను మరియు నీతిని చూసిన తర్వాత, నీవు ఎలా వెంబడించాలి? నీవు ఈ మార్గమందు ఎలా నడవాలి? దేవునిపట్ల నీకున్న ప్రేమను నీవు ఎలా ఆచరణలో పెట్టాలి? దేవుని శిక్ష మరియు తీర్పు అనేవి నీలో ఏదైనా ప్రభావాన్ని సాధించిందా? దేవుని శిక్ష మరియు తీర్పు గురించి నీకు జ్ఞానం ఉందా లేదా అనేది నీవు ఎలా జీవిస్తున్నావు మరియు నీవు దేవుణ్ణి ఏ మేరకు ప్రేమిస్తున్నావనే దాని పైన ఆధారపడి ఉంటుంది! నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నావని నీ పెదవులు చెబుతున్నాయి, అయినప్పటికీ నీవు పాతదైన, అవినీతి స్వభావంలోనే జీవిస్తున్నావు; నీకు దేవునిపట్ల భయం లేదు, మరియు నీకు మనస్సాక్షి అసలే లేదు. ఇటువంటి వ్యక్తులు దేవుణ్ణి ప్రేమిస్తారా? అలాంటి వ్యక్తులు దేవునికి విధేయులుగా ఉంటారా? వారు దేవుని శిక్షను మరియు తీర్పును అంగీకరించేవారా? నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నావని మరియు ఆయనయందు విశ్వసిస్తున్నావని చెప్తావు, అయినప్పటికీ నీవు నీ తలంపులను విడిచిపెట్టవు. నీవు చేసే పనిలో, నీ ప్రవేశంలో, నీవు మాట్లాడే మాటలలో మరియు నీ జీవితంలో నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నావని చెప్పడానికి ఎటువంటి క్రియలు లేవు మరియు దేవునిపట్ల భయభక్తులు లేవు. శిక్ష మరియు తీర్పు పొందిన వ్యక్తి ఇతడేనా? అలాంటి వ్యక్తి పేతురు కాగలడా? వారికి పేతురువంటి జ్ఞానం మాత్రమే ఉంటుంది, కానీ జీవంచరు? ఈ రోజు, మనిషి నిజమైన జీవితాన్ని గడపడానికి ఎటువంటి షరతు కావాలి? పేతురు నోటి నుండి వచ్చిన మాటలు మరియు ప్రార్థనలు కావా? అవి అతని హృదయాంతరాల్లోంచి వచ్చిన మాటలు కాదా? పేతురు ప్రార్థన మాత్రమే చేసి, సత్యాన్ని ఆచరణలో పెట్టలేదా? నీ అన్వేషణ ఎవరి కోసం? దేవుని శిక్ష మరియు తీర్పు సమయంలో నీవు సంరక్షణను మరియు శుద్ధీకరణను పొందేలా నీకు నీవు ఎలా కారణమవుతావు? దేవుని శిక్ష మరియు తీర్పు మనిషికి ఎటువంటి ప్రయోజనాన్ని కలిగించలేదా? తీర్పులన్నీ శిక్షలేనా? కేవలం శాంతి మరియు ఆనందం, భౌతిక ఆశీర్వాదాలు మరియు క్షణిక సుఖం మాత్రమే మనిషి జీవితానికి ప్రయోజనకరంగా ఉంటాయా? తీర్పు జీవితం లేకుండా మనిషి ఆహ్లాదకరమైన మరియు సౌకర్యవంతమైన వాతావరణంలో జీవిస్తే, అతను శుద్ధీకరించబడతాడా? మనిషి మారాలని మరియు శుద్ధి కావాలని కోరుకుంటే, అతను పరిపూర్ణమవడాన్ని ఎలా అంగీకరించాలి? ఈ రోజు నీవు ఏ మార్గాన్ని ఎంచుకోవాలి?

మునుపటి:  మోయాబు సంతతి వారిని రక్షించడం యొక్క ప్రాముఖ్యత

తరువాత:  మీరు తప్పకుండా కార్యమును అర్థము చేసుకోవాలి–తికమకలో దేనిని అనుసరించవద్దు!

సెట్టింగులు

  • వచనం
  • థీమ్స్

ఘన రంగులు

థీమ్స్

అక్షరశైలి

అక్షరశైలి పరిమాణం

గీతల మధ్య దూరం

గీతల మధ్య దూరం

పేజీ వెడల్పు

విషయ సూచిక

శోధించండి

  • ఈ వచనాన్ని శోధించండి
  • ఈ పుస్తకాన్ని శోధించండి

Connect with us on Messenger