పరిపూర్ణత పొందవలసినవారు శుద్దీకరణను తప్పక అనుభవించాలి
నీవు దేవుని నమ్మితే, అప్పుడు నీవు దేవునికి విధేయత చూపి, సత్యాన్ని అనుసరిస్తూ, నీ బాధ్యతలన్నీ నెరవేర్చాలి. అదనంగా, నీ అనుభవించాల్సిన విషయాలను తప్పనిసరిగా అర్ధం చేసుకోవాలి. నీవు పరిష్కరించబడటం, క్రమశిక్షణ పొందడం, మరియు తీర్పు తీర్చబడటాన్ని మాత్రమే అనుభవిస్తూ, దేవుడు నిన్ను క్రమశిక్షణలో పెడుతున్నప్పుడు లేక నీతో వ్యవహరిస్తున్నప్పుడు ఎలాంటి అనుభూతి చెందకుండా, కేవలం దేవుణ్ణి నీవు ఆస్వాదిస్తున్నావంటే—అది ఒప్పుకోలేనిది. బహుశా ఈ శుద్దీకరణ విధానాన్ని, నీవు తట్టుకుని నిలబడగలవేమో, కానీ ఇది ఇంకా సరిపోదు; నీవు ఇంకా ముందుకు సాగాలి. దేవుని ప్రేమించడం అనే ఉపదేశం ఎన్నటికీ ఆగదు మరియు అంతము లేదు. దేవుణ్ణి విశ్వసించడాన్ని ప్రజలు చాలా సులభమైన విషయంగా చూస్తారు, కానీ ఒక్కసారి అనుసరణ అనుభవాన్ని పొందిన తరువాత, అప్పుడు దేవుని విశ్వసించడం ప్రజలు ఊహించినంత సులభమైనది కాదని వారు గ్రహిస్తారు. మానవుని శుద్ధి చేయడానికి దేవుడు కార్యము చేసినప్పుడు, మానవుడు బాధపడతాడు. ఒక వ్యక్తి శుద్దీకరణ ఎంత గొప్పగా ఉంటుందో, దేవుని పట్ల వారి ప్రేమ అంత గొప్పగా ఉంటుంది మరియు దేవుని శక్తి వారిలో అంతగా బయలుపరచబడుతుంది. దీనికి వ్యతిరేకంగా, ఒక వ్యక్తి ఎంత తక్కువ శుద్దీకరణను పొందుకుంటాడో, దేవుని పట్ల వారి ప్రేమ అంత తక్కువగా పెరుగుతుంది, మరియు వారిలో అంత తక్కువగా దేవుని శక్తి బయలుపరచబడుతుంది. అటువంటి వ్యక్తి యొక్క శుద్దీకరణ మరియు బాధ మరియు హింస అనుభవించడం ఎంత ఎక్కువగా ఉంటుందో, దేవుని పట్ల వారి ప్రేమ అంత లోతుగా పెరుగుతుంది, దేవుని పట్ల వారి విశ్వాసం ఎంత యధార్థంగా మారుతుందో, దేవుని గూర్చిన వారి జ్ఞానం అంత ఎక్కువగా ఉంటుంది. మీ అనుభవాలలో, పరిష్కారము పొంది మరియు ఎక్కువ క్రమశిక్షణ పొందినవారు, శుద్దీకరించబడుతున్న కొలది ఎక్కువగా బాధపడుతున్న వ్యక్తులను నీవు చూస్తావు, మరియు వారు దేవుని పట్ల గాఢమైన ప్రేమ కలిగి, చాలా లోతైన మరియు చొచ్చుకుపోయే దైవ జ్ఞానాన్ని కలిగియున్న వ్యక్తులని నీవు చూస్తావు. పరిష్కరించబడే అనుభవాన్ని పొందకుండా పైపైన అవగాహన కలిగి ఉన్నవారు: “దేవుడు చాలా మంచివాడు, ఆయనను ఆస్వాదించే ప్రజలకు ఆయన కృపను అనుగ్రహిస్తాడు” అని మాత్రమే చెప్తారు. ప్రజలు పరిష్కరించబడటం మరియు క్రమశిక్షణ పొందడం గురించి అనుభవాన్ని కలిగి ఉంటే, అప్పుడు వారు దేవుని నిజమైన జ్ఞానము గురించి మాట్లాడగలరు. కాబట్టి దేవుని కార్యము మానవునిలో ఎంత అద్భుతంగా ఉంటుందో, అది అంత విలువైనదిగా మరియు ప్రాముఖ్యమైనదిగా ఉంటుంది. అది నీకు ఎంత కఠినంగా ఉంటుందో, మరియు నీ భావనలతో ఎంత ప్రతికూలంగా ఉంటుందో, అంత ఎక్కువగా దేవుని కార్యము నిన్ను జయించి, మరియు నిన్ను సంపాదించి, మరియు నిన్ను పరిపూర్ణ పరచగలదు. దేవుని కార్యము ఎంత గొప్పది! దేవుడు ఈ విధంగా మానవుని శుద్ధి చేయకపోతే, ఆయన ఈ పద్దతిలో కార్యము చేయకపోతే, అప్పుడు ఆయన కార్యము అసమర్ధమైనదిగా మరియు ప్రాముఖ్యత లేకుండా పోతుంది. దేవుడు ఈ వర్గాన్ని ఎన్నుకొని సంపాదిస్తాడని, మరియు అంత్యదినాల్లో వారిని సంపూర్ణపరుస్తాడని గతంలో చెప్పబడింది; దీనిలో, ఒక అసాధారణ ప్రాముఖ్యత ఉన్నది. ఆయన మీలో కార్యాన్ని ఎంత గొప్పగా కొనసాగిస్తాడో, దేవుని పట్ల మీ ప్రేమ అంత స్వచ్చంగా మరియు గాఢంగా ఉంటుంది. దేవుని కార్యము ఎంత గొప్పదో, ఆయన జ్ఞానాన్ని మానవుడు అంతగా పొందుకుంటాడు, మరియు ఆయన గురించిన మానవుని జ్ఞానము అంత లోతుగా ఉంటుంది. అంత్యదినాల్లో, ఆరువేల సంవత్సరాల దేవుని నిర్వహణ ప్రణాళిక ముగింపులోనికి వస్తుంది. ఇది అంత సులభంగా ముగుస్తుందా? మానవ జాతిని ఆయన జయించిన తర్వాత, ఆయన పని అయిపోతుందా? అది అంత సులభంగా ఉంటుందా? నిజానికి ప్రజలు ఇది అంత సులభమని ఊహించుకుంటారు, కానీ దేవుడు చేసేది అంత సులభమైనది కాదు. మీరు దేవుని కార్యములో ఏ భాగాన్ని ప్రస్తావించినా, అది ఏదీ మనిషికి అర్ధం కాదు. నీవు దానిని గ్రహించగలిగితే, అప్పుడు దేవుని కార్యానికి విలువ లేదా ప్రాముఖ్యత లేకుండా పోతుంది. దేవుడు చేసే కార్యము అగోచరమైనది; అది నీ తలంపులకు పూర్తిగా భిన్నమైనది, మరియు నీ ఆలోచనలకు అది ఎంత విరుద్ధముగా ఉంటుందో, దేవుని కార్యము అంత అర్థవంతమైనదని అది చూపిస్తుంది; అది నీ తలంపులతో ఏకీభవిస్తే, అప్పుడది అర్ధంలేనిది అవుతుంది. నేడు, నీవు దేవుని కార్యము ఎంతో అద్భుతమైనదని భావిస్తున్నావు, అది ఎంత అద్భుతమైనదని నీవు అనిపిస్తుందో, దేవుడు అంత అగోచరమైన వాడని నీవు భావిస్తావు, మరియు దేవుని క్రియలు ఎంత గొప్పవో నీవు చూస్తావు. ఆయన మానవుని జయించడానికి ఏవో కొన్ని పట్టులేని, పనికిమాలిన కార్యాలు చేసి, ఆ తర్వాత ఏమీ చేయకపోతే, అప్పుడు మానవుడు దేవుని పని యొక్క ప్రాముఖ్యతను చూడలేడు. మీరు ఇప్పుడు కొద్దికొద్దిగా శుద్దీకరణ పొందుతున్నప్పటికీ, జీవితంలో మీ ఎదుగుదలకు ఇది ఎంతో ప్రయోజనకరము; కాబట్టి మీరు ఇలాంటి కష్టాలు అనుభవించడం ఎంతో అవసరం. నేడు, మీరు కొద్దిగా శుద్దకరణ పొందుతున్నారు, కానీ ఆ తర్వాత నీవు దేవుని క్రియలను నిజంగా చూస్తావు, మరియు చివరికి నీవు: “దేవుని క్రియలు చాల అద్భుతమైనవి” అని చెప్తావు! ఇవి నీ హృదయంలోని మాటలుగా ఉంటాయి. దేవుని శుద్దీకరణ కొంతకాలం అనుభవించాక (సేవకుల శ్రమ మరియు శిక్షాకాలం), కొందరు వ్యక్తులు చివరికి: “దేవుని విశ్వసించడం నిజంగా కష్టం” అంటారు! వాస్తవానికి వారు ఉపయోగించిన పదాలు, “నిజంగా కష్టం” అనేది, దేవుని క్రియలు నిగూఢమైవని, దేవుని కార్యము గొప్ప ప్రాధాన్యత మరియు విలువని కలిగి ఉందని, మరియు ఆయన కార్యము మానవునిచే ఎంతో విలువైనదిగా పరిగణించబడుతుందని చూపిస్తుంది. ఒకవేళ, నేను ఇంత కార్యము చేసిన తర్వాత, నీకు కాస్తయినా అవగాహన కలగకపోతే, నా కార్యానికి ఇంకా విలువ ఉంటుందా? అది నిన్ను: “దేవునికి సేవచేయడం నిజంగా కష్టమైనది, దేవుని క్రియలు చాల అధ్భుతమైనవి, దేవుడు నిజంగా తెలివైనవాడు! దేవుడు చాలా ప్రియమైన వాడు!” అని చెప్పేలా చేస్తుంది. ఒకవేళ, అనుభవకాలం తరవాత, నీవు అలాంటి మాటలు చెప్పగలిగితే, అప్పుడు అది నీవు దేవుని కార్యాన్ని నీలో పొందుకున్నావని నిరూపిస్తుంది. ఒక రోజు, నీవు విదేశాలలో సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఎవరైనా నిన్ను: “దేవుని పట్ల నీ విశ్వాసం ఎలా ఉంది?” అని అడిగితే, అప్పుడు నీవు: “దేవుని క్రియలు చాలా ఆశ్చర్యమైనవి!” అని చెప్పగలవు, అప్పుడు నీవు నిజమైన అనుభవాల నుండి మాట్లాడుతున్నావని వారు భావిస్తారు. ఇది నిజమైన సాక్ష్యమివ్వడం. దేవుని కార్యము జ్ఞానముతో నిండి ఉన్నది, నీలోని ఆయన కార్యము నిన్ను నిజముగా ఒప్పించి నీ హృదయాన్ని జయించింది. నీవు ఆయనను ఎల్లప్పుడూ ప్రేమిస్తావు ఎందుకంటే ఆయన మానవాళి ప్రేమ కంటే ఎంతో విలువైన వాడు! నీవు గనుక ఈ విషయాలను మాట్లాడగలిగితే, అప్పుడు నీవు ప్రజల హృదయాలను కదిలించగలవు. ఇదంతా సాక్ష్యమివ్వడమే. నీవు గనుక ప్రజలను కన్నీరు పెట్టించగలిగే, అద్భుతమైన సాక్ష్యమివ్వగలిగితే, నీవు దేవుణ్ణి నిజంగా ప్రేమించే వానివని ఇది కనుపరుస్తుంది, నీవు దేవుని ప్రేమిస్తున్నావు కాబట్టి, నీ ద్వారా, దేవుని క్రియలను సాక్ష్యముగా తెలియజేయవచ్చు. నీ సాక్ష్యం ద్వారా, ఇతరులు దేవుని కార్యాన్ని వెదకడానికి, దేవుని కార్యమును అనుభవించడానికి, వారు అనుభవించేది ఏ పరిస్థితిలోనైనా, వారు స్థిరముగా నిలబడగలరు. సాక్ష్యమివ్వడానికి ఇదొక్కటే నిజమైన మార్గం, ప్రస్తుతం నీ నుండి ఖచ్చితంగా కావలసినదీ ఇదే. దేవుడు అమూల్యమైన మరియు సమృద్ధిగలవాడు కాబట్టి, దేవుని కార్యము ఎంతో విలువైనదని, మరియు ప్రజలచే విలువైనదిగా పరిగణించబడుతుందని నీవు చూడాలి; ఆయన కేవలం మాట్లాడటమే కాదు, కానీ ప్రజలను తీర్పు తీర్చగలడు, వారి హృదయాలను శుద్ధి చేయగలడు, వారికి ఆనందాన్ని తీసుకురాగలడు, వారిని ఎన్నుకోగలడు, వారిని జయించగలడు, మరియు వారిని పరిపూర్ణ పరచగలడు. నీ అనుభవము నుండి దేవుడు ప్రేమామయుడని నీవు చూస్తావు. కాబట్టి ఇప్పుడు నీవు దేవుని ఎంతగా ప్రేమిస్తున్నావు? నీవు ఈ విషయాలను నీ హృదయపూర్వకంగా చెప్పగలవా? నీవు ఈ మాటల్ని నీ హృదయపు లోతుల్లో నుండి చెప్పినప్పుడు, అప్పుడు నీవు సాక్ష్యమివ్వగలవు. నీ అనుభవము ఈ స్థాయిని చేరుకున్న తర్వాత నీవు దేవునికి సాక్షిగా ఉండగలవు మరియు యోగ్యత పొందగలవు. నీ అనుభవములో ఈ స్థాయిని నీవు చేరుకోకపోతే, నీవు ఇంకా చాలా దూరంగా ఉంటావు. శుద్దీకరణ సమయంలో ప్రజలు బలహీనతలు కనుపరచడం సాధారణమైనదే, కానీ శుద్దీకరణ తరువాత నీవు: “తన కార్యములో దేవుడు చాలా తెలివైనవాడు” అని చెప్పగలగాలి! నీవు నిజంగా ఈ వాక్యాలను ఆచరణాత్మకముగా గ్రహించగలిగితే, అది నీవు ఎంతో సంతోషించేదిగా ఉంటుంది మరియు నీ అనుభవానికి విలువ ఉంటుంది.
ఇప్పుడు నీవు ఏమి అనుసరించాలి? దేవుని కార్యానికి నీవు సాక్షిగా ఉన్నావా లేదా, దేవుని సాక్ష్యముగా మరియు సాక్షాత్కారముగా ఉండగలవా లేదా? ఆయన ద్వారా ఉపయోగించబడటానికి తగినట్టుగా ఉన్నావా లేదా?—నీవు పరిశీలించుకోవాల్సిన విషయాలు ఇవే. దేవుడు నిజంగా నీలో ఎంత కార్యము చేశాడు? ఎంత నీవు చూశావు, ఎంత నీవు తాకావు? ఎంతగా నీవు అనుభవించావు, మరియు రుచి చూశావు? దేవుడు నిన్ను పరీక్షించాడా, నిన్ను పరిహరించాడా, లేక క్రమశిక్షణలో పెట్టాడా అనే సంబంధం లేకుండా, ఆయన క్రియలు మరియు ఆయన కార్యము నీ పట్ల జరిగించబడ్డాయి. కానీ దేవుణ్ణి విశ్వసించే వానిగా మరియు ఆయన ద్వారా పరిపూర్ణత పొందుకునేందుకు ఇష్టపడే వ్యక్తిగా, నీ ఆచరణాత్మకమైన అనుభవ ఆధారంగా దేవుని కార్యానికి నీవు సాక్ష్యమివ్వగలవా? నీ ఆచరణాత్మక అనుభవము ద్వారా ఆయన వాక్యమందు జీవించగలవా? నీ సొంత ఆచరణాత్మక అనుభవం ద్వారా నీవు ఇతరులకు అందించగలిగి దేవుని కార్యానికి సాక్ష్యమియ్యడానికి నీ మొత్తం జీవితాన్ని వెచ్చించగలవా? దేవునికి సాక్ష్యమివ్వడానికి, నీవు నీ అనుభవం, జ్ఞానం, మరియు వెచ్చించిన వెలపై ఆధారపడాలి. ఆ విధంగా మాత్రమే ఆయన చిత్తాన్ని నీవు తృప్తి పరచగలవు. నీవు దేవునికి సాక్ష్యమిచ్చే వానివేనా? నీకు ఈ కోరిక ఉన్నదా? నీవు ఆయన నామమును బట్టి, ఇంకా ఎక్కువగా, ఆయన కార్యమును బట్టి సాక్ష్యమివ్వగలిగి, మరియు ఆయన కోరుకునే ప్రతిరూపాన్ని బట్టి ఆయన ప్రజలు జీవించగలిగితే, అప్పుడు నీవు ఆయన సాక్షిగా ఉంటావు. నీవు దేవునికి నిజమైన సాక్షిగా ఎలా ఉంటావు? దేవుని వాక్యానుసారం జీవించాలని కోరుకోవడం మరియు అపేక్షించబడం ద్వారా మరియు నీ మాటలతో సాక్ష్యమివ్వడం ద్వారా మరియు ఆయన కార్యాన్ని మరియు అయన క్రియలను ప్రజలు చూడడానికి అనుమతించడం ద్వారా నీవు దీన్ని చేయవచ్చు. నీవు వీటన్నిటిని నిజంగా అనుసరిస్తే, దేవుడు నిన్ను పరిపూర్ణపరుస్తాడు. ఒకవేళ నీవు కోరునేదంతా దేవునిచేత పరిపూర్ణ పరచబడి మరియు చివరిలో ఆయన ఆశీర్వాదాలు పొందడమే అయితే, దేవునిపై నీ విశ్వాస దృక్పథం స్వచ్చమైనది కాదు. నిజ జీవితంలో దేవుని క్రియలను ఎలా చూడాలి, ఆయన తన చిత్తాన్ని నీకు బయలుపరచినప్పుడు ఆయనను ఎలా తృప్తి పరచాలి, ఆయన అద్భుత స్వభావానికి మరియు జ్ఞానానికి ఎలా సాక్ష్యమివ్వాలి, నిన్ను క్రమశిక్షణపరచి మరియు వ్యవహరించే విధానానికి ఎలా సాక్ష్యమివ్వాలి అని నీవు అన్వేషించాలి. ఇవన్నీ కుడా ఇప్పుడు నీవు ఆలోచించవలసిన విషయాలు. దేవుని పట్ల నీ ప్రేమ ఆయన నిన్ను పరిపూర్ణ పరచిన తర్వాత మాత్రమే దేవుని మహిమలో పాలిభాగస్తుడయ్యేలా ఉంటే, ఇది ఇప్పటికీ అల్పమైనదై దేవుని ఆశయాలు నెరవేర్చదు. నీవు దేవుని కార్యానికి సాక్ష్యమివ్వగలగాలి, ఆయన కోరికలను తృప్తిపరచగలగాలి, మరియు ఆచరణాత్మక విధానంలో ఆయన ప్రజల పట్ల చేసిన కార్యాన్ని అనుభవించాలి. నొప్పి, కన్నీరు, లేక విచారం, నీ ఆచరణలో వీటన్నిటినీ తప్పక అనుభవించాలి. దేవుని కొరకు సాక్ష్యమిచ్చే వానిగా నిన్ను పరిపూర్ణ పరచడానికి అవి ఉద్దేశించబడ్డాయి. సరిగ్గా, ప్రస్తుతం బాధను అనుభవించడానికి మరియు పరిపూర్ణతను అన్వేషించడానికి నిన్ను పురికొల్పుతుంది ఏమిటి? నీ ప్రస్తుత బాధ నిజంగా దేవుని ప్రేమించి ఆయన కొరకు సాక్ష్యమివ్వడం కోసమేనా? లేక ఇది శారీరక ఆశీర్వాదాల కోసమా, నీ భవిష్యత్తు వృద్ధి మరియు అదృష్టం కోసమా? నీ ఉద్దేశాలు, తలంపులు మరియు నీవు వెంబడించే లక్ష్యాలన్నీ తప్పనిసరిగా సరిదిద్దబడాలి గాని నీ స్వంత చిత్తానుసారంగా నడిపించబడకూడదు. ఒక వ్యక్తి ఆశీర్వదించబడడం కోసం మరియు అధికారంలోనికి రావడం కోసం పరిపూర్ణతను అనుసరిస్తుంటే, మరొకరు దేవుణ్ణి తృప్తిపరచడానికి దేవుని కార్యానికి ఆచరణాత్మకంగా సాక్ష్యమివ్వాలని పరిపూర్ణతను వెంబడిస్తుంటే, ఈ రెండు అన్వేషణ మార్గాలలో నీవు దేనిని ఎన్నుకుంటావు? ఒకవేళ నీవు మొదటిదాన్ని ఎంచుకుంటే, అప్పుడు నీవు దేవుని ప్రమాణాలకు చాలా దూరంలో ఉన్నట్టు. నా కార్యాలు లోకమంతటా బహిరంగంగా తెలుస్తాయని మరియు లోకంలో నేను ఒక రాజుగా పాలిస్తానని నేను ఒకసారి చెప్పాను. మరోవైపు, మీకు అప్పగించబడింది బయటకు వెళ్లి దేవుని కార్యానికి సాక్ష్యమివ్వడం, రాజులుగా మరి లోకమంతా కనబడటం కాదు. దేవుని క్రియలతో విశ్వాన్ని మరియు ఖగోళాన్ని నిండనివ్వండి. ప్రతి ఒక్కరూ వాటిని చూచి గుర్తించనివ్వండి. ఈ మాటలు దేవునికి సంబంధించి మాత్రమే పలుకబడ్డాయి, మానవులు చేయవలసినదంతా దేవునికి సాక్ష్యమివ్వడం. ఇప్పుడు దేవుని గురించి నీకు ఎంత తెలుసు? దేవునికి నీవు ఎంత సాక్ష్యమియ్యగలవు? మానవుని పరిపూర్ణ పరచడంలో దేవుని ఉద్దేశ్యము ఏమిటి? దేవుని చిత్తాన్ని నీవు గ్రహించిన తర్వాత, దేవుని చిత్తం పట్ల ఎలా శ్రద్ధ చుపాలి? నీవు పరిపూర్ణత పొందడానికి మరియు నీవు జీవించేదాని ద్వారా దేవుని కార్యానికి సాక్ష్యమివ్వాలని ఇష్టపడితే, ఇటువంటి నడిపించే శక్తి నీకుంటే, ఇక ఏదీ అంత కష్టం కాదు. ఇప్పుడు ప్రజలకు కావలసింది విశ్వాసం. నీకు ఈ చోదక శక్తి ఉంటే, ఎలాంటి ప్రతికూలత, స్తబ్దత, సోమరితనం మరియు శరీరానుసారమైన ఆలోచనలు, జీవిత తాత్విక చింతనలు, తిరుగుబాటు స్వభావము, భావోద్వేగాలు మొదలైన వాటిని విడిచిపెట్టడం సులభం.
శ్రమలకు గురవుతున్నప్పుడు, ప్రజలు బలహీనమవ్వడం, లేదా వారిలో ప్రతికూలత కలగటం, లేక దేవుని చిత్తం పట్ల లేదా వారి అనుసరణ మార్గం పట్ల స్పష్టత లేకపోవడం సహజం. కానీ ఏ సందర్భములోనైనా దేవుని కార్యము పట్ల నీవు విశ్వాసాన్ని కలిగి ఉండాలి, యోబు వలె, దేవుని తిరస్కరించకూడదు. యోబు బలహీనుడై తాను పుట్టిన దినాన్ని శపించినప్పటికీ, మానవుని జీవితంలో సమస్త ఈవులు యెహోవా అనుగ్రహించినవే అని మరియు వాటన్నిటిని తీసివేయువాడు యోహోవాయే అని అతడు తిరస్కరించలేదు. అతడు ఎలా పరీక్షించబడినప్పటికీ, అతడు తన నమ్మకాన్ని కాపాడుకున్నాడు. నీ అనుభవములో, దేవుని వాక్యాల ద్వారా మీరు ఎంతగా శుద్దీకరణకు గురైనప్పటికీ, దేవుడు మానవాళి నుండి కోరేది ఏమంటే, క్లుప్తంగా, వారి విశ్వాసము మరియు ఆయన పట్ల వారికున్న ప్రేమ. ఈ విధంగా కార్యము చేయడం ద్వారా ఆయన ప్రజల విశ్వాసాన్ని, ప్రేమను, మరియు అభిలాషలను పరిపూర్ణ పరుస్తాడు. దేవుడు ప్రజల పట్ల పరిపూర్ణత కార్యాన్ని చేస్తాడు, వారు దానిని చూడలేరు, దాన్ని అనుభూతి చెందలేరు; అలాంటి పరిస్థితులలో, నీ విశ్వాసం అవసరం. దేనినైనా కంటితో చూడలేనప్పుడు ప్రజల విశ్వాసం అవసరం, మరియు నీవు సొంత ఆలోచనలను విడిచిపెట్టలేనప్పుడు నీ విశ్వాసం అవసరం. దేవుని కార్యము గురించి నీకు స్పష్టత లేనప్పుడు, నీకు కావలసింది విశ్వాసం కలిగి ఉండటం మరియు స్థిరమైన వైఖరిని తీసుకోవడం మరియు సాక్షిగా నిలవడం. యోబు ఈ స్థితిని చేరుకున్నప్పుడు, దేవుడు అతనికి ప్రత్యక్షమై అతనితో మాట్లాడాడు. అంటే, నీ విశ్వాసం ద్వారా మాత్రమే నీవు దేవుని చూడగలుగుతావు, మరియు నీవు విశ్వాసం కలిగి ఉన్నప్పుడు దేవుడు నిన్ను పరిపూర్ణ పరుస్తాడు. విశ్వాసం లేకుండా, ఆయన దీనిని చేయలేడు. దేవుడు నీవు పొందాలని ఆశించే దానిని నీకనుగ్రహిస్తాడు. నీవు విశ్వాసం కలిగి లేకపోతే, నీవు పరిపూర్ణత పొందలేవు మరియు దేవుని కార్యాలను, ఆయన సర్వాధికారాన్ని నీవు చూడలేవు. నీ ఆచరణాత్మక అనుభవంలో ఆయన కార్యాలు చూస్తావని నీవు విశ్వసించినప్పుడు, దేవుడు నీకు ప్రత్యక్షమవుతాడు, అంతరంగము నుండి ఆయన నిన్ను వెలిగిస్తాడు మరియు నడిపిస్తాడు. అలాంటి విశ్వాసం లేకపోతే, దేవుడు దానిని చేయలేడు. దేవునియందు నీవు నిరీక్షణ కోల్పోతే, ఆయన కార్యాన్ని నీవు ఎలా అనుభవించగలవు? కాబట్టి, నీవు విశ్వాసము కలిగి దేవుని పట్ల సందేహాలు లేకుండా ఉన్నప్పుడు మాత్రమే, ఆయన ఏం చేసినా సరే నీవు మాత్రం ఆయన పట్ల నిజమైన విశ్వాసం కలిగి ఉన్నప్పుడు మాత్రమే, నీ అనుభవాల ద్వారా అయన నిన్ను వెలిగించి ప్రకాశింపజేస్తాడు, మరియు అప్పుడు మాత్రమే నీవు ఆయన కార్యాలు చూడగలవు. ఈ విషయాలన్నీ విశ్వాసం ద్వారా సాధించబడతాయి. శుద్దీకరణ ద్వారా మాత్రమే విశ్వాసం వస్తుంది, మరియు శుద్దీకరణ లేనప్పుడు, విశ్వాసం వృద్ధి చెందదు. ఈ “విశ్వాసం” అనే పదం, దేనిని సూచిస్తుంది? విశ్వాసం అనేది మానవులు దేనినైనా చూడలేనప్పుడు మరియు తాకలేనప్పుడు, దేవుని కార్యము మానవ తలంపులతో ఏకీభవించనప్పుడు, మానవాతీతమైనప్పుడు కలిగి ఉండవలసిన నిజమైన విశ్వాసం మరియు యదార్థమైన హృదయం. నేను మాట్లాడే విశ్వాసం ఇదే. శుద్దీకరణ మరియు కష్ట సమయాల్లో ప్రజలకు విశ్వాసం అవసరం, విశ్వాసం అనేది శుద్దీకరణ తరువాత వస్తుంది; శుద్దీకరణ మరియు విశ్వాసం రెండూ వేరుపరచబడలేవు. దేవుడు ఎలా కార్యము చేసినా, నీ పరిస్థితి ఏదైనా, నీవు జీవితాన్ని కొనసాగించి మరియు సత్యాన్ని అనుసరించగలగాలి, దేవుని కార్యపు జ్ఞానాన్ని వెదకగలగాలి, మరియు ఆయన పనుల గురించి అవగాహన కలిగి ఉండాలి, మరియు నీవు సత్యానుసారంగా ప్రవర్తించగలగాలి. అలా చేయడం వలన నిజమైన విశ్వాసం ఉంటుంది, మరియు అలా చేయడం అనేది దేవుని పై నీవు నిజమైన విశ్వాసాన్ని కోల్పోలేదని కనుపరుస్తుంది. శుద్దీకరణ ద్వారా సత్యాన్ని అనుసరించడంలో పట్టుదల కలిగి, ఆయనపై ఎలాంటి సందేహాలు పెంచుకోకుండా నీవు దేవుణ్ణి నిజంగా ప్రేమించగలిగి, ఆయన ఏం చేసినా ఆయనను తృప్తి పరచడానికి నీవు ఇంకా సత్యాన్ని అనుసరిస్తూ, మరియు నీవు ఆయన చిత్తము కోసం లోతుల్లో పరిశీలించి అయన చిత్తము పట్ల శ్రద్ధ వహించినప్పుడు మాత్రమే నీవు దేవునిపై నిజమైన విశ్వాసాన్ని కలిగి ఉంటావు. గతంలో, నీవు రాజుగా పరిపాలించబోతున్నావని దేవుడు చెప్పినప్పుడు, నీవు ఆయనను ప్రేమించావు, మరియు ఆయన నీకు బహిరంగముగా తనను తాను కనుపరచుకున్నప్పుడు, నీవు ఆయనను అనుసరించావు. కానీ ఇప్పుడు దేవుడు మరుగైయున్నాడు, నీవు ఆయనను చూడలేవు, మరియు శ్రమలు నీ మీదికి వచ్చేశాయి—మరి ఇప్పుడు నీవు దేవునిపై నిరీక్షణ కోల్పోతున్నావా? కాబట్టి, నీవు ఎల్లప్పుడూ తప్పనిసరిగా జీవితాన్ని కొనసాగించాలి దేవుని చిత్తాన్ని సంతృప్తి పరచడానికి ప్రయత్నించాలి. ఇది నిజమైన విశ్వాసంగా పిలువబడుతుంది, ఇది నిజమైన మరియు బహు రమ్యమైన ప్రేమ.
గతంలో, ప్రజలందరూ వారి తీర్మానాలు చేసుకోవడానికి దేవుని ఎదుటకు వచ్చి, వారు: “దేవుణ్ణి ఎవరూ ప్రేమించక పోయినా, నేను తప్పక ప్రేమించాలి” అని చెప్పేవారు. కానీ ఇప్పుడు, నీ మీదికి శుద్దీకరణ వస్తుంది, మరియు ఇది నీ భావనలకు అనుగుణంగా లేదు కాబట్టి, నీవు దేవునిపై విశ్వాసాన్ని కోల్పోయావు. ఇది నిజమైన ప్రేమా? యోబు క్రియల గురించి నీవు చాలా సార్లు చదివావు—నీవు వాటిని మర్చిపోయావా? నిజమైన ప్రేమ విశ్వాసంలో నుండే రూపుదిద్దుకుంటుంది. నీవు పొందే శుద్దీకరణల ద్వారానే నీవు దేవుని పట్ల నిజమైన ప్రేమను పెంపొందించుకుంటావు, మరియు నీ విశ్వాసం ద్వారానే నీ ఆచరణాత్మక అనుభవాలలో దేవుని చిత్తం పట్ల నీవు శ్రద్ధ వహించగలవు, మరియు విశ్వాసం ద్వారానే నీవు నీ స్వంత శరీరాన్ని విడిచిపెట్టి జీవాన్ని అనుసరిస్తావు; ప్రజలు చేయవలసినది ఇదే. నీవు గనుక ఇలా చేస్తే, అప్పుడు నీవు దేవుని కార్యాలు చూడగలవు, కానీ నీలో విశ్వాసం లోపిస్తే, అప్పుడు నీవు దేవుని పనులను చూడలేవు మరియు ఆయన కార్యాన్ని అనుభవించలేవు. మీరు దేవుని చేత ఉపయోగించబడి పరిపూర్ణపరచబడాలంటే, మీరు ప్రతీది కలిగి ఉండాలి; బాధపడటానికి సంసిద్ధత, విశ్వాసము, సహనము, విధేయత, మరియు దేవుని కార్యాన్ని అనుభవించే సామర్థ్యము, ఆయన చిత్తాన్ని గ్రహించడం, ఆయన విచారాన్ని పరిగణలోనికి తీసుకోవడం, మరియు మొదలైనవి. ఒక వ్యక్తిని పరిపూర్ణ పరచడం సులభం కాదు, మరియు నీవు అనుభవించే ప్రతి ఒక్క శుద్దీకరణకు నీ విశ్వాసం మరియు ప్రేమ అవసరం. నీవు దేవుని ద్వారా పరిపూర్ణ పరచబడాలంటే, మార్గంలో ముందుగా పరుగెత్తడం మాత్రమే సరిపోదు, దేవుని కోసం మిమ్మల్ని మీరు వెచ్చించుకోవడం మాత్రమే సరిపోదు. దేవునిచే పరిపూర్ణ పరచబడాలంటే నీవు తప్పనిసరిగా అనేక విషయాలను కలిగి ఉండాలి. నీవు బాధను ఎదుర్కొన్నప్పుడు, నీవు శరీర సంబంధమైన ఆందోళనను పక్కనపెట్టి, దేవునికి విరోధముగా అభియోగాలు మోపకూడదు. దేవుడు నీ నుండి తనను తాను మరుగు చేసుకొన్నపుడు, నీ మునుపటి ప్రేమను క్షీణించకుండా మరియు చెదిరిపోకుండా కాపాడుకోడానికి, ఆయనను అనుసరించే విశ్వాసం నీవు కలిగి ఉండాలి. దేవుడు ఏం చేసినా, నీవు ఆయన రూపకల్పనకు లోబడి, ఆయనకు విరోధముగా అభియోగాలు మోపడానికి బదులు నీ స్వంత శరీరాన్ని శపించుకోవడానికి సిద్దపడాలి. నీవు శ్రమలను ఎదుర్కొన్నప్పుడు, నీవు ఘోరంగా ఏడ్చినా లేక ఏదైనా ప్రియమైన వస్తువుతో విడిపోడానికి ఇష్టం లేకపోయినా, నీవు దేవుని సంతృప్తి పరచాలి. ఇది మాత్రమే నిజమైన ప్రేమ మరియు విశ్వాసం. నీ అసలు స్థాయి ఏదైనా, మొదట నీవు కష్టాలను అనుభవించాలనే సంకల్పం మరియు నిజమైన విశ్వాసం రెండూ కలిగి ఉండాలి, మరియు నీవు శరీరాన్ని విడిచి పెట్టాలనే సంకల్పాన్ని కూడా కలిగి ఉండాలి. దేవుని చిత్తాన్ని తృప్తి పరచడానికి మీరు వ్యక్తిగత కష్టాలను భరించడానికి మరియు మీ వ్యక్తిగత ప్రయోజనాలకు నష్టాలను చవిచూడడానికి సిద్ధపడాలి. మిమ్మల్ని గురించి మీరు మీ హృదయంలో పశ్చాత్తాపాన్ని కూడా కలిగి ఉండాలి: గతంలో, మీరు దేవుణ్ణి సంతృప్తి పరచలేకపోయారు, మరి ఇప్పుడు, మిమ్మును గురించి మీరే పశ్చాత్తాపపడవచ్చు. మీరు వీటిలో దేనిలోనైనా లోప కలిగి ఉండకూడదు—ఈ విషయాల ద్వారానే దేవుడు నిన్ను పరిపూర్ణ పరుస్తాడు. నీవు ఈ ప్రమాణాలను నెరవేర్చకపోతే, ఇక నీవు పరిపూర్ణ పరచబడలేవు.
దేవుణ్ణి సేవించే వ్యక్తికి ఆయన కోసం ఎలా భాధపడాలో తెలియడం మాత్రమే కాదు; అంతకంటే ఎక్కువగా, దేవుని ప్రేమను అనుసరించడమే దేవుని విశ్వసించడం యొక్క ఉద్దేశం అని వారు గ్రహించాలి. దేవుడు కేవలం నిన్ను శుద్దీకరించడానికి మరియు నీ జీవితాన్ని బాధించడానికి మాత్రమే నిన్ను ఉపయోగించుకోడు, కానీ బదులుగా నీవు ఆయన కార్యాలు తెలుసుకునేలా మరియు ప్రాముఖ్యంగా, మానవ జీవితపు నిజమైన ప్రాధాన్యతను తెలుసుకునేలా ఆయన నిన్ను ఉపయోగించుకుంటాడు, తద్వారా దేవుని సేవించడం అంత సామాన్యమైన పని కాదని నీవు తెలుసుకుంటావు. దేవుని కార్యమును అనుభవించడం అంటే కృపను ఆస్వాదించడం కాదు, బదులుగా ఆయన పట్ల నీకున్న ప్రేమ కొరకు బాధించబడటం. నీవు దేవుని కృపను అనుభవిస్తున్నావు కాబట్టి, ఆయన గద్దింపును కూడా నీవు ఆస్వాదించాలి; నీవు వీటన్నిటిని అనుభవించవలసి ఉన్నది. నీవు దేవుని వెలిగింపును నీలో అనుభవించవచ్చు, మరియు ఆయన నీతో ఎలా వ్యవహరించి నిన్ను తీర్పు తీరుస్తాడో కూడా నీవు అనుభవించవచ్చు. ఈ విధంగా, నీ అను గొప్పదిగా ఉంటుంది. దేవుడు నీపై ఆయన న్యాయతీర్పు మరియు గద్దింపును చేపట్టాడు. దేవుని వాక్యము నిన్ను పరిష్కరించింది, కానీ అది మాత్రమే కాదు; అది నిన్ను వెలిగించి మరియు ప్రకాశింపజేసింది. నీవు ప్రతికూలంగా మరియు బలహీనంగా ఉన్నప్పుడు, నిన్ను గురించి దేవుడు చింతిస్తాడు. ఈ కార్యమంతా మనిషికి చెందిన ప్రతిదీ దేవుని ఏర్పాటులలో ఉన్నదే అని నీకు తెలియజేయడం కోసమే. దేవుని నమ్మడం అంటే బాధపడటం లేక అన్ని రకాలైన పనులు ఆయన కోసమే చేయడం అని నీవు అనుకోవచ్చు; దేవుణ్ణి అనుసరించడం వలన నీ శరీరానికి శాంతి కలుగుతుందని, లేక నీ జీవితంలో ప్రతిదీ సాఫీగా సాగుతుందని, లేక నీవు ప్రతి విషయంలో సౌఖ్యముగా మరియు తేలికగా ఉంటావని అనుకోవచ్చు. అయితే, ఇవేవీ ప్రజలు దేవునిపై వారికున్న నమ్మకానికి జోడించదగిన ఉద్దేశాలు కావు. ఒకవేళ నీవు ఈ ఉద్దేశాలతో నమ్మితే, నీ దృక్పథం తప్పు, మరియు నీవు పరిపూర్ణ పరచబడటం అసాధ్యం. దేవుని కార్యాలు, దేవుని నీతియుక్తమైన స్వభావం, ఆయన వివేకము, ఆయన వాక్యాలు, మరియు ఆయన అద్భుత స్వభావం మరియు అగోచరత ఇవన్నీ ప్రజలు గ్రహించవలసిన విషయాలు. ఈ అవగాహన కలిగి, దీనిని ఉపయోగించుకుని నీ హృదయం నుండి వ్యక్తిగత ఆక్షేపణలు, నిరీక్షణలు, మరియు భావనలను వదిలించుకోవాలి. ఈ విషయాలను తొలగించుకోవడం ద్వారా మాత్రమే మీరు దేవుడు విధించిన షరతులను నెరవేర్చగలరు, మరియు ఇలా చేయడం ద్వారా మాత్రమే నీవు జీవితాన్ని పొంది దేవుని తృప్తి పరచగలవు. దేవుని నమ్మడం యొక్క ఉద్దేశం ఆయనను తృప్తి పరచడం మరియు ఆయన ఆశించే స్వభావముతో జీవించడం, తద్వారా ఆయన క్రియలు మరియు కీర్తి అనేవి యోగ్యత లేని సమూహము ద్వారా వెల్లడి చేయబడతాయి. దేవుణ్ణి నమ్మడానికి ఇది సరైన దృక్పథం, మరియు నీవు అనుసరించవలసిన గమ్యం కూడా ఇదే. దేవుని పట్ల విశ్వాసం గురించి సరైన దృష్టి కలిగి, దేవుని వాక్యాలను పొందుకునేందుకు ప్రయత్నించాలి. మీరు దేవుని వాక్యాన్ని తిని త్రాగాలి మరియు మీరు సత్యమందు జీవించగలగాలి, ప్రత్యేకించి ఆయన ఆచరణాత్మక క్రియలను, ఆయన అద్భుత కార్యాలను, విశ్వమంతటా, అదే విధంగా శరీరమందు ఆయన చేసే కార్యాన్ని మీరు చూడగలగాలి. ప్రజలు, వారి ఆచరణాత్మక అనుభవాల ద్వారా, దేవుడు వారిపై ఆయన కార్యాన్ని ఎలా చేస్తాడు మరియు వారి పట్ల ఆయన చిత్తము ఏమైయున్నదని గ్రహించవచ్చు. ప్రజలలోని సాతాను దుర్నీతి స్వభావాన్ని తొలగించడమే దీనంతటి ఉద్దేశం. నీలోని సమస్త అపవిత్రతను మరియు దుర్నీతిని విడిచిపెట్టి, మరియు నీలోని చెడు తలంపులను విడిచిపెట్టి, మరియు దేవుని పట్ల నిజమైన విశ్వాసాన్ని పెంపొందించుకుని—నిజమైన విశ్వాసంతోనే నీవు నిజముగా దేవుని ప్రేమించగలవు. ఆయనపై మీకున్న విశ్వాసం ఆధారంగా మాత్రమే మీరు దేవునిని యధార్ధముగా ప్రేమించగలరు. ఆయనపై విశ్వాసం లేకుండా మీరు దేవుని ప్రేమను సాధించగలరా? నీవు దేవుని నమ్ముచున్నావు కాబట్టి, మీరు దాని గురించి కలవరం చెందరు. కొంతమంది ప్రజలు దేవునిపై విశ్వాసము ఆశీర్వాదాలను తెస్తుంది అని చూడగానే వారు ఉత్తేజంతో నిండిపోతారు, కానీ శుద్దీకరణలను అనుభవించాలి అని చూడగానే వారు శక్తినంతా కోల్పోతారు. అది దేవుని నమ్మడమా? చివరికి, దేవుని యెదుట నీ విశ్వాసమందు నీవు సంపూర్ణ మరియు పూర్తి విధేయతను సాధించాలి. నీవు దేవుణ్ణి నమ్ముచున్నావు, కానీ ఇప్పటికీ నీవు ఆయనపై కోరికలు కలిగి ఉన్నావు, నీవు తీసివేయలేని అనేక మతపరమైన భావనలు, వదులుకోలేని నీ వ్యక్తిగత ప్రయోజనాలు కలిగి ఉన్నావు, మరియు ఇప్పటికీ శరీరానుసారమైన ఆశీర్వాదాల కోసం ప్రయత్నిస్తూ దేవుడు నీ శరీరాన్ని కాపాడి, నీ ఆత్మను రక్షించాలని ఆశిస్తావు—ఇవన్నీ చెడ్డ దృక్పథం కలిగి ఉన్న ప్రజల ప్రవర్తనలు. మత విశ్వాసాలు కలిగియున్న ప్రజలు దేవునిపై విశ్వాసం కలిగి ఉన్నప్పటికీ, తమ స్వభావాలు మార్చుకోడానికి ప్రయత్నించరు మరియు దేవుని జ్ఞానాన్ని అనుసరించరు, కానీ బదులుగా శరీరానుసారమైన ప్రయోజనాల కోసం మాత్రమే ప్రయతిస్తుంటారు. మీలో అనేక మందికి మతపరమైన నమ్మకాల సముదాయానికి చెందిన విశ్వాసాలు ఉన్నాయి; అది దేవునిపై నిజమైన విశ్వాసం కాదు. దేవుని నమ్మాలంటే, ఆయన కొరకు బాధపడటానికి సిద్దపడిన మరియు తమను తాము ఉపేక్షించుకోడానికి సంకల్పించిన హృదయాన్ని ప్రజలు కలిగి ఉండాలి. ప్రజలు ఈ రెండు షరతులకు అనుగుణంగా ఉంటేనే తప్ప, దేవునిపై వారి విశ్వాసం చెల్లదు, మరియు వారి స్వభావంలో మార్పును సాధించలేరు. యధార్థంగా సత్యాన్ని అనుసరిస్తూ, దేవుని జ్ఞానాన్ని వెదకుతూ, మరియు జీవితాన్ని కొనసాగించే వారు మాత్రమే దేవుణ్ణి నిజముగా విశ్వసించే ప్రజలు.
శ్రమలు నీమీదికి వచ్చినప్పుడు, ఆ శ్రమలను అదుపు చేయడంలో దేవుని కార్యాన్ని ఎలా అన్వయిస్తావు? నీవు ప్రతికూలంగా ఉంటావా, లేక మానవుని పట్ల దేవుని పరీక్ష మరియు శుద్దీకరణను ఒక సానుకూల కోణం నుండి అర్ధం చేసుకుంటావా? దేవుని పరీక్షలు మరియు శుద్దీకరణల నుండి నీవు ఏమి పొందుతావు? దేవుని పట్ల నీ ప్రేమ పెరుగుతుందా? నీవు శుద్దీకరణకు గురైనప్పుడు, యోబు శ్రమలను నీవు అన్వయించుకుని, దేవుడు నీలో చేసే కార్యము పట్ల మనస్ఫూర్తిగా నిమగ్నమై ఉంటావా? యోబు శ్రమల ద్వారా దేవుడు మనిషిని ఎలా పరీక్షిస్తాడో నీవు చూడగలవా? యోబు శ్రమలు నీకు ఏ రకమైన స్పూర్తినిస్తాయి? నీ శుద్దీకరణల మధ్య దేవునికి సాక్ష్యమివ్వడానికి నీవు సమ్మతిస్తావా, లేక సౌఖ్యమైన వాతావరణంలో శరీరాన్ని తృప్తి పరచాలని నీవు అనుకుంటున్నావా? దేవునిపై విశ్వాసం గురించి నిజంగా నీ దృష్టి ఏమిటి? ఇది నిజంగా ఆయన కోసమేనా, శారీరం కోసం కాదా? నీ అన్వేషణలో నీవు ఛేదించాలి అనే లక్ష్యం నిజంగా ఉందా? నీవు శుద్దీకరణల గుండా వెళ్లి, తద్వారా దేవుని ద్వారా పరిపూర్ణతను పొందడానికి ఇష్టపడుతున్నావా, లేక బదులుగా దేవుని చేత గద్దించబడి శపించబడతావా? దేవుని గూర్చి సాక్ష్యమిచ్చే విషయంలో నిజంగా నీ అభిప్రాయం ఏంటి? కొన్ని పరిస్థితులలో దేవుని గురించి సాక్ష్యమివ్వడానికి ప్రజలు ఏమి చెయ్యాలి? ఆచరణాత్మకమైన దేవుడు నీలోని ఆయన మూల కార్యమందు ఎంతో బయలుపరిచాడు కాబట్టి, నీవు ఎప్పుడూ విడిచిపెట్టాలనే ఆలోచనలు ఎందుకు కలిగి ఉంటావు? దేవునిపై నీ విశ్వాసం దేవుని కోసమే ఉన్నదా? మీలో అనేకమందికి, మీ నమ్మకం అనేది మీ సొంత వ్యక్తిగత ప్రయోజనం కోసం, మీ తరుపున మీరు ఎంచే లెక్కలో భాగం. చాలా కొద్దిమంది ప్రజలు మాత్రమే దేవుని కోసం దేవుణ్ణి విశ్వసిస్తారు; ఇది తిరుగుబాటుతనము కదా?
శుద్దీకరణ కార్యపు ఉద్దేశం ప్రధానంగా ప్రజల విశ్వాసాన్ని పరిపూర్ణపరచడం. చివరిలో, సాధించింది ఏంటంటే నీవు వెళ్లిపోవాలనుకోవడం కానీ, అదే సమయంలో, నీవు వెళ్ళలేకపోవడం; కొంతమంది ప్రజలు నిరీక్షణ యొక్క చిట్టచివరి తునక కోల్పోయినప్పటికీ, వారు ఇంకా విశ్వాసాన్ని కలిగి ఉంటారు; మరియు ప్రజలు వారి స్వంత భవిష్యత్ అవకాశాల గురించి ఇకపై ఎలాంటి నిరీక్షణ కలిగి ఉండరు. ఆ సమయంలో మాత్రమే దేవుని శుద్దీకరణ ముగించబడుతుంది. మానవుడు ఇంకా జీవన్మరణాల మధ్య కొట్టుమిట్టాడే దశకు చేరుకోలేదు, మరియు వారు మరణాన్ని రుచి చూడలేదు, కాబట్టి శుద్దీకరణ ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు. సేవకుల ఘట్టంలో ఉన్నవారు కూడా సంపూర్తిగా శుద్దీకరించబడలేదు. యోబు ఘోరమైన శుద్దీకరణకు లోనైయ్యాడు, ఆధారపడటానికి అతని వద్ద ఏమీ లేదు. వారు ఆధారపడటానికి ఏమీ లేని మరియు నిరీక్షణే లేని స్థాయి వరకు ప్రజలు శుద్దీకరించబడాలి—ఇది మాత్రమే నిజమైన శుద్దీకరణ. సేవకుల సమయంలో, నీ పట్ల ఆయన చిత్తము ఏమైనా మరియు ఆయన ఏమి చేసినా, దేవుని ఎదుట నీ హృదయము నిమ్మళంగా ఉంటే, నీవు దేవుని ఏర్పాట్లకు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటే, మార్గపు అంచున దేవుడు చేసిన ప్రతి దానిని నీవు గ్రహిస్తావు. యోబు శ్రమలకు నీవు గురవుతావు, మరియు అదే సమయంలో పేతురు శ్రమలకూ నీవు లోనవుతావు. యోబు పరీక్షింపబడినప్పుడు, అతడు సాక్షిగా నిలిచాడు, చివరికి, అతనికి యెహోవా ప్రత్యక్షమయ్యాడు. అతడు సాక్షిగా నిలిచిన తర్వాత మాత్రమే దేవుని ముఖమును చూడటానికి అతడు అర్హుడు అయ్యాడు. “నేను అపవిత్రమైన దేశమునకు మరుగై ఉన్నాను కానీ పరిశుద్ద రాజ్యానికి నన్ను నేను కనుపరుచుకొంటాను” అని ఎందుకు చెప్పబడింది? ఎందుకంటే నీవు పరిశుద్దంగా ఉండి సాక్షిగా నిలబడినప్పుడు మాత్రమే దేవుని ముఖమును చూసే ఘనతను నీవు పొందుతావు. నీవు ఆయన సాక్షిగా నిలబడలేకపోతే, ఆయన ముఖమును చూసే భాగ్యం నీకు ఉండదు. శుద్దీకరణల నేపథ్యంలో నీవు వెనుదిరిగి లేక దేవునిపై అభియోగాలు మోపితే, అది ఆయనకు సాక్ష్యమివ్వడంలో విఫలమవ్వడం మరియు సాతాను పరిహాసపు పాత్రగా మారడం, అప్పుడు నీవు దేవుని ప్రత్యక్షతను పొందలేవు. నీవు యోబు వలె, శ్రమల మధ్య తన శరీరాన్ని శపించి దేవునిపై అభియోగము మోపకుండా, మరియు అభియోగం లేకుండా తన శరీరాన్ని అసహ్యించుకుంటూ లేక మాటల ద్వారా పాపము చేయకుండా ఉండగలిగితే, అప్పుడు నీవు సాక్షిగా నిలబడతావు. నీవు ఒక నిర్దిష్ట స్థాయి వరకు శుద్దీకరించబడిన తరువాత ఇంకా యోబు వలె, దేవుని ఎదుట సంపూర్ణ విధేయతతో ఆయన పట్ల ఇతర ఆశయాలు లేక సొంత ఆలోచనలు ఏవీ లేకుండా ఉంటే, అప్పుడు దేవుడు నీకు ప్రత్యక్షమవుతాడు. ప్రస్తుతం దేవుడు నీకు ప్రత్యక్షమవ్వడు ఎందుకంటే నీకు నీ సొంత ఆలోచనలు, వ్యక్తిగత దురభిమానము, స్వార్ధపూరిత తలంపులు, వ్యక్తిగత అవసరాలు మరియు శరీరానుసారమైన ఆశలు అనేకము ఉన్నందున, నీవు ఆయన ముఖమును చూడటానికి అర్హుడవు కాదు. నీవు దేవుని చూసినట్లయితే, నీ భావనలను బట్టి నీవు ఆయనను కొలత వేస్తావు, ఆలా చేయడం వలన, నీ ద్వారా ఆయన సిలువ వేయబడతాడు. నీ తలంపులకు అనుగుణంగా లేని అనేక సంగతులు నీమీదికి వచ్చినప్పటికీ, నీవు వాటిని పక్కన పెట్టి, ఈ సంగతుల నుండి దేవుని కార్యముల జ్ఞానమును పొందగలుగుతున్నావు, శుద్దీకరణల మధ్యలో దేవుని పట్ల నీకున్న ప్రేమపూరిత హృదయాన్ని నీవు వెల్లడిపరచినట్లయితే, అదే సాక్షిగా నిలబడటం అంటే. నీ ఇల్లు ప్రశాంతంగా ఉండి, శరీరానుసారమైన సౌఖ్యాలను నీవు ఆస్వాదిస్తుంటే, నిన్ను ఎవరూ హింసించరు, మరియు సంఘములో ఉన్న నీ సహోదర సహోదరీలు నీకు లోబడతారు, దేవుని పట్ల నీకున్న ప్రేమా హృదయాన్ని నీవు వెల్లడిపరచగలవా? ఈ స్థితి నిన్ను శుద్దీకరించగలదా? శుద్దీకరణ ద్వారా మాత్రమే దేవుని పట్ల నీకున్న ప్రేమ కనుపరచబడగలదు, మరియు నీ తలంపులకు అనుగుణముగా లేని సంగతుల ద్వారా మాత్రమే నీవు పరిపూర్ణపరచబడగలవు. చాలా విరోధమైన మరియు ప్రతికూలమైన విషయాలు కలిగిన సేవతో, అన్ని రకాలైన సాతాను వ్యక్తీకరణలను ప్రయోగించడం ద్వారా—దాని చర్యలు, దాని అపవాదులు, దాని ఆటంకాలు మరియు మోసాలు—వికారమైన సాతాను ముఖాన్ని దేవుడు నీకు స్పష్టంగా చూపించి, తద్వారా నీవు సాతానును ద్వేషించి దాన్ని విడిచిపెట్టేలా, సాతానును గుర్తించడానికి నీ సామర్థ్యాన్ని పరిపూర్ణ పరుస్తాడు.
అనేకమైన నీ వైఫల్యాల మరియు బలహీనతల అనుభవాలు, నీ ప్రతికూల సమయాలు అన్నీ దేవుని శ్రమలుగా చెప్పవచ్చు. ఇది ఎందుకంటే ప్రతిదీ దేవుని నుండే వస్తుంది, సమస్త విషయాలు మరియు సంఘటనలు ఆయన చేతుల్లో ఉన్నాయి. నీవు విఫలమైనా లేక బలహీనపడినా మరియు తడబడినా, అదంతా దేవునిపై ఆధారపడి ఆయన పట్టులో ఉంటుంది. దేవుని దృష్టిలో, ఇది నీ శ్రమ, నీవు ఒకవేళ దానిని గుర్తించకపోతే, అది శోధనగా మారుతుంది. రెండు రకాలైన స్థితులను ప్రజలు తప్పక గుర్తించాలి: ఒకటి పరిశుద్దాత్మ నుండి వస్తుంది, మరొకటి సాతాను మూలంగా కావచ్చు. మొదటి స్థితిలో పరిశుద్దాత్మ నిన్ను ప్రకాశింపజేసి నిన్ను గురించి నీవు తెలుసుకొని, నీకు నీవు అసహ్యించుకుని మరియు పశ్చాత్తాపపడి, దేవుని పట్ల నిజమైన ప్రేమను కలిగి ఉండటానికి, ఆయనను తృప్తి పరచడం పట్ల నీ హృదయాన్ని నిమగ్నం చేయడానికి అనుమతిస్తాడు. మరొకటి నిన్ను నీవు తెలుసుకునే స్థితి, కానీ నీవు ప్రతికూలంగా మరియు బలహీనంగా ఉంటావు. ఈ స్థితినే దేవుని శుద్దీకరణ అని, మరియు దీన్ని సాతాను శోధనగా కూడా చెప్పవచ్చు. ఇది నీ కొరకైన దేవుని రక్షణ అని నీవు గుర్తించి మరియు నీవు ఇప్పుడు ఆయనకు ఎక్కువగా రుణపడి ఉన్నావని నీవు గ్రహించి, ఇప్పటి నుండి తిరిగి చెల్లించడానికి ప్రయత్నిస్తూ మరియు ఇంకా ఎన్నడూ అలాంటి దుర్నీతిలో పడకుండా, ఆయన వాక్యాలను తిని త్రాగడానికి నీవు కృషిచేస్తూ, నిన్ను నీవు లేనివానిగా భావిస్తూ, హృదయ వాంఛ కలిగి ఉన్నట్లయితే, ఇప్పుడది దేవుని శ్రమ. బాధ ముగిసిపోయి నీవు మరోసారి ముందుకు సాగుతున్న తరువాత, దేవుడు ఇంకా నిన్ను నడిపిస్తాడు, ప్రకాశింపజేస్తాడు, వెలిగిస్తాడు మరియు పోషిస్తాడు. అయితే నీవు దీన్ని గ్రహించకుండా మరియు నీవు ప్రతికూలంగా ఉండి, కేవలం నిరాశకు నిన్ను నీవు విడిచిపెట్టి, నీవు ఈ రకంగా ఆలోచిస్తే, అప్పుడు సాతాను శోధన నీ మీదికి వచ్చే ఉంటుంది. యోబు శ్రమలను అనుభవించినప్పుడు, దేవుడు మరియు సాతాను ఒకరితో ఒకరు పందెము వేసుకుని, సాతాను యోబును బాధపెట్టడానికి దేవుడు అనుమతించాడు. దేవుడు యోబును పరీక్షిస్తున్నప్పటికీ, నిజానికి అతని మీదికి వచ్చింది సాతాను. సాతాను, యోబును శ్రమ పెట్టిందే, కానీ యోబు దేవుని పక్షమన ఉన్నాడు. ఒకవేళ అలా అయ్యి ఉండకపోతే, యోబు శోధనలో పడేవాడు. ప్రజలు శోధనలో పడిన వెంటనే, వారు ప్రమాదంలో పడతారు. శుద్దీకరణ గుండా వెళ్ళడమంటేనే దేవుని నుండి వచ్చిన శ్రమ అని చెప్పవచ్చు, కానీ నీవు మంచి స్థితిలో లేకపోతే, అది సాతాను నుండి వచ్చిన శోధన అని చెప్పవచ్చు. దర్శనం గురించి నీకు స్పష్టత లేకపోతే, సాతాను నిన్ను నిందిస్తాడు, దర్శన విషయంలో నీకు గుడ్డితనమును కలుగజేస్తాడు. నీకు తెలిసేలోపే, నీవు శోధనలో పడిపోతావు.
నీవు దేవుని కార్యాన్ని అనుభవించకపోతే, నీవు ఎన్నటికీ పరిపూర్ణ పరచబడలేవు. నీ అనుభవములో, నీవు వివరాల్లోకి కూడా తప్పనిసరిగా వెళ్ళాలి. ఉదాహరణకి, నీవు ఆలోచనలు మరియు అధికమైన ప్రేరణలు పెంపొందించుకోడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి, మరియు ఈ సమస్యలను పరిష్కరించడానికి నీవు ఎటువంటి తగిన ఆచరణలు కలిగి ఉన్నావు? నీవు దేవుని కార్యాన్ని అనుభవించగలిగితే, నీవు స్థాయిని పొందుకున్నావని అర్ధం. నీవు శక్తిని పొందుకున్నట్టు మాత్రమే కనిపిస్తే, ఇది నిజమైన స్థాయి కాదు మరియు నీవు ఖచ్చితంగా స్థిరంగా నిలబడలేవు. నీవు దేవుని కార్యాన్ని అనుభవించగలిగి మరియు దానిని ఎప్పుడైనా ఎక్కడైనా అనుభవించగలిగి యోచించగలిగినప్పుడు మాత్రమే, మీరు గొర్రెల కాపరులను విడిచిపెట్టి దేవునిపై ఆధారపడి స్వతంత్రముగా జీవించగలిగినప్పుడు, దేవుని నిజమైన కార్యాలు మీరు చూస్తారు—అప్పుడు మాత్రమే దేవుని చిత్తము నేరవేరుతుంది. ఇప్పుడు, చాలామంది ప్రజలకు ఎలా అనుభవించాలో తెలియదు, వారు ఎప్పుడైనా సమస్య ఎదుర్కొన్నప్పుడు, దాని నుండి ఎలా జాగ్రత్తపడాలో వారికి తెలియదు; వారు దేవుని కార్యాన్ని అనుభవించలేని అసమర్థులు, మరియు వారు ఆధ్యాత్మిక జీవితాన్ని గడపలేరు. నీవు దేవుని వాక్యాలు తీసుకుని నీ ఆచరణాత్మక జీవితంలో పనిచెయ్యాలి.
కొన్నిసార్లు దేవుడు ఒక నిర్దిష్టమైన అనుభూతిని నీకు అనుగ్రహిస్తాడు, ఆ అనుభూతి నిన్ను అంతర్గత ఆనందం మరియు దేవుని సన్నిధిని కోల్పోయేలా చేస్తుంది, ఆవిధంగా నీవు అంధకారంలో మునిగిపోతావు. ఇది ఒక విధమైన శుద్దీకరణ. నీవు ఏదైనా చేసినప్పుడల్లా, అది ఎప్పుడూ వంకరగానే ఉంటుంది, లేక నీవు గోడకు ఢీకొంటావు. ఇది దేవుని క్రమశిక్షణ. కొన్నిసార్లు, దేవునికి అవిధేయమైన మరియు తిరుగుబాటు చేసే పని ఏదైనా నీవు చేసినప్పుడు, ఎవరికీ దాని గురించి తెలియకపోవచ్చు—కానీ దేవునికి తెలుసు. ఆయన నిన్ను వదిలిపెట్టడు, ఆయన నిన్ను క్రమశిక్షణ పరుస్తాడు. పరిశుద్దాత్మ కార్యము చాలా వివరంగా ఉంటుంది. ఆయన ప్రజల ప్రతి మాట మరియు చర్యను, వారి ప్రతి క్రియ మరియు కదలికను, మరియు వారి ప్రతి తలంపు మరియు ఆలోచనను జాగ్రత్తగా గమనిస్తాడు, తద్వారా ప్రజలు ఈ విషయాలపై అంతరంగిక అవగాహనను పొందుతారు. నీవు ఏదైనా ఒకసారి చేస్తే అది విఫలమవుతుంది, తిరిగి నీవు ఏదైనా చేస్తే ఇంకా అది విఫలమవుతుంది, మరియు క్రమక్రమంగా పరిశుద్దాత్మ కార్యాన్ని నీవు అర్ధం చేసుకుంటావు. అనేక మార్లు క్రమశిక్షణలో పెట్టబడిన తర్వాత, దేవుని చిత్తానుసారము కానిది ఏమిటి మరియు దేవుని చిత్తానుసారముగా ఉండటానికి ఏమి చేయాలి అని నీవు తెలుసుకుంటావు. చివరికి, మీలోని పరిశుద్దాత్మ నడిపింపుకు మీరు ఖచ్చితమైన ప్రతిస్పందనలు కలిగి ఉంటారు. కొన్నిసార్లు, నీవు తిరుగుబాటుదారునిగా ఉండటాన్ని బట్టి అంతరంగములోని దేవునిచే నీవు మందలించబడతావు. ఇదంతా దేవుని క్రమశిక్షణ నుండి వస్తుంది. నీవు దేవుని వాక్యాన్ని విలువైనదిగా పరిగణించకపోతే, ఆయన నీ పట్ల మనస్సు పెట్టడు. నీవు దేవుని వాక్యాన్ని ఎంత ప్రాముఖ్యముగా తీసుకుంటావో, ఆయన అంతగా నిన్ను వెలిగిస్తాడు. ప్రస్తుతం, సంఘములో కొంతమంది ప్రజలు అస్తవ్యస్తమైన గందరగోళపు విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. వారు అనేక అనుచితమైన పనులు చేస్తూ మరియు క్రమశిక్షణ లేకుండా ప్రవర్తిస్తారు, కాబట్టి పరిశుద్దాత్మ కార్యము వారిలో స్పష్టముగా కనిపించదు. కొంతమంది ప్రజలు డబ్బు సంపాదన కోసం తమ విధులను విడిచిపెట్టి, క్రమశిక్షణ లేకుండా వ్యాపారం చేయడానికి బయల్దేరుతారు; అలాంటి వ్యక్తి ఇంకా గొప్ప ప్రమాదములో ఉన్నాడు. వారు ప్రస్తుతం పరిశుద్దాత్మ కార్యాన్ని కలిగి లేకపోవడమే కాకుండా, భవిష్యత్తులో, వారు పరిపూర్ణ పరచబడటం కష్టం. పరిశుద్దాత్మ కార్యము వారిలో కనిపించని మరియు దేవుని క్రమశిక్షణ వారిలో చూడలేని అనేకమంది ప్రజలు ఉన్నారు. వారు దేవుని కార్యము ఎరుగని వారు మరియు దేవుని చిత్తము పట్ల స్పష్టత లేనివారు. శుద్దీకరణల సమయంలో స్థిరముగా నిలువగలిగిన వారు, దేవుడు ఏమి చేసినా ఆయనను అనుసరించే వారు, కనీసం విడిచిపెట్టలేని వారు, లేక పేతురు సాధించిన దానిలో కనీసం 0.1% అయినా సాధించగలిగే వారు బాగానే ఉంటారు, కానీ దేవుడు ఉపయోగించుకునే పరంగా చూస్తే వారికి విలువ లేదు. అనేక మంది ప్రజలు విషయాలను చాలా త్వరగా గ్రహించి, దేవుని పట్ల నిజమైన ప్రేమను కలిగి ఉంటారు, మరియు పేతురు స్థాయిని కూడా అధిగమించగలరు, దేవుడు వారిపై పరిపూర్ణతా కార్యాన్ని చేస్తాడు. అటువంటి ప్రజల వద్దకు క్రమశిక్షణ మరియు జ్ఞానం వస్తాయి, మరియు వారిలో దేవుని చిత్తానుసారము కానిది ఏదైనా ఉంటే, వారు ఒకేసారి దానిని విడిచిపెట్టవచ్చు. అటువంటి ప్రజలు బంగారము, వెండి, మరియు విలువైన రత్నాలు వంటివారు—వారి విలువ చాలా ఎక్కువ! దేవుడు అనేక రకాలైన కార్యాలు చేసినా కానీ నీవు ఇంకా ఇసుక లేదా రాయిలా ఉంటే, ఇక నీవు విలువ లేనివాడవు.
ఎర్రని మహా ఘట సర్పము యొక్క దేశములో దేవుని కార్యము అద్భుతమైనది మరియు అగోచరమైనది. సంఘములో అన్నిరకాల ప్రజలు ఉన్నందున, ఆయన కొంతమంది వ్యక్తుల సముదాయాన్ని పరిపూర్ణ పరిచి మరికొందరిని వెళ్ళగొడతాడు—సత్యాన్ని ప్రేమించే వారు ఉన్నారు, ప్రేమించనివారూ ఉన్నారు; దేవుని కార్యమును అనుభవించే వారు వున్నారు, అనుభవించని వారూ ఉన్నారు; తమ కర్తవ్యాన్ని నిర్వర్తించే వారు ఉన్నారు, నిర్వర్తించని వారూ ఉన్నారు; దేవుని గురించి సాక్ష్యమిచ్చే వారు ఉన్నారు, ఇవ్వని వారూ ఉన్నారు—వారిలో ఒక భాగం అవిశ్వాసులు మరియు దుర్మార్గులు ఉన్నారు, మరియు వారు నిశ్చయముగా తొలగించబడతారు. నీవు దేవుని కార్యము గురించి స్పష్టముగా తెలుసుకోకపోతే, నీవు ప్రతికూలంగా ఉంటావు; ఎందుకంటే దేవుని కార్యము కొంతమంది వ్యక్తులలోనే కనబడుతుంది. అదే సమయంలో, దేవుని నిజముగా ప్రేమించేది ఎవరు మరియు ఎవరు కాదు అనేది స్పష్టమవుతుంది. దేవుని నిజముగా ప్రేమించే వారు పరిశుద్దాత్మ కార్యాన్ని కలిగి ఉంటారు, అయితే ఆయనను నిజముగా ప్రేమించని వారు ఆయన కార్యపు ప్రతీ అడుగు ద్వారా బయలుపరచబడతారు. వారు తొలగించబడే వారిగా మారుతారు. ఈ వ్యక్తులు విజయ కార్యపు సమయమందు బయలుపరచబడతారు, మరియు ఈ ప్రజలు పరిపూర్ణపరచడానికి పనికిరాని వ్యక్తులు. పరిపూర్ణపరచబడిన వారు తమ సంపూర్ణతలో దేవునిచే ఎన్నుకోబడినవారు, మరియు వారు పేతురు వలె దేవుని ప్రేమించే సమర్ధులు. జయించబడినవారు ఆకస్మికమైన ప్రేమను కలిగి ఉండరు, కానీ నిశ్చేష్టమైన ప్రేమను కలిగి, దేవుని ప్రేమించడానికి బలవంతపరచబడతారు. ఆకస్మికమైన ప్రేమ అనేది ఆచరణాత్మక అనుభవం ద్వారా కలిగిన అవగాహన మూలముగా అభివృద్ధి చెందుతుంది. ఈ ప్రేమ ఒక హృదయాన్ని ఆక్రమించుకొని వారిని స్వచ్చందంగా దేవుని పట్ల భక్తిని కలిగి ఉండేలా చేస్తుంది; దేవుని వాక్యాలు వారి పునాదులుగా మారి, వారు దేవుని కొరకు బాధ అనుభవించగలరు. వాస్తవానికి, ఇవి దేవునిచే పరిపూర్ణపరచబడిన వ్యక్తి కలిగి ఉండే విషయాలు. నీవు జయించబడాలని మాత్రమే ఆశిస్తే, నీవు దేవునికి సాక్ష్యమియ్యలేవు; ప్రజలను జయించడం ద్వారా మాత్రమే దేవుడు తన రక్షణ లక్ష్యాన్ని సాధిస్తే, అప్పుడు సేవకుల దశలోనే పని పూర్తయి ఉండేది. ఏదేమైనప్పటికీ, దేవుని అంతిమ లక్ష్యం ప్రజలను జయించడం కాదు, ప్రజలను పరిపూర్ణ పరచడం. కాబట్టి ఈ దశను జయించే కార్యమని చెప్పే కంటే, కాబట్టి ఇది పరిపూర్ణ పరిచే మరియు తొలగించే కార్యమని చెప్పవచ్చు. కొంతమంది వ్యక్తులు పూర్తిగా జయించబడలేదు, మరియు వారిని జయించే సమయంలో, వ్యక్తుల సమూహము ఒకటి పరిపూర్ణపరచబడుతుంది. ఈ రెండు కార్యాలు ఏకధాటిగా జరుగుతాయి. ఇంత సుదీర్ఘమైన కార్యములో కూడా ప్రజలు విడిచి వెళ్లలేదంటే, ఇది జయించే లక్ష్యము సాధించబడిందని చూపిస్తుంది—ఇది జయించబడటం యొక్క వాస్తవం. శుద్దీకరణలు పరిపూర్ణపరచబడటం కోసమే గానీ, జయించబడటం కోసం కాదు. శుద్దీకరణలు లేకుండా, ప్రజలు పరిపూర్ణపరచబడలేరు. కాబట్టి శుద్దీకరణలు ఎంతో విలువైనవి! నేడు వ్యక్తుల సమూహమొకటి పరిపూర్ణపరచబడినది, ఎన్నుకోబడింది. ఇంతకు ముందు చెప్పబడిన పది ఆశీర్వాదాలన్నీ పరిపూర్ణత పొందినవారినే లక్ష్యంగా చేసుకున్నాయి. భూమిపై వారి స్వరూపాన్ని మార్చుకోవడం కోసం ఉన్న ప్రతిదీ పరిపూర్ణపరచబడిన వారిని లక్ష్యంగా చేసుకుంది. పరిపూర్ణత పొందనివారు దేవుని వాగ్దానాల్ని పొందడానికి అర్హులు కారు.