అతిక్రమణలు మనిషిని నరకం వైపుకు నడిపిస్తాయి
మిమ్మల్ని జయించాలనే ఉద్దేశంతో మీకు పలు హెచ్చరికలు చేశాను అంతేగాక అనేక సత్యాలను అనుగ్రహించాను. ఇప్పటికి, మీరందరూ గతంలో కంటే గుర్తింపతగ్గ రీతిలో అత్యధిక సమృద్ధిగా అనుభూతి చెందుతున్నారు, ఒక వ్యక్తి ఎలా ఉండాలనే విషయంపై అనేక సిద్ధాంతాలను తెలుసుకున్నారు, అంతేగాక విశ్వాసమైన వ్యక్తులకు ఉండవలసిన కనీస జ్ఠానమును మీరు పొందుకున్నారు. ఇదంతా అనేక సంవత్సరాలుగా మీరు వేసిన పంటకు మీరు కోసిన కోత. మీరు సాధించిన వాటిని నేను కాదనడం లేదు, కానీ ఈ అనేక సంవత్సరాలుగా మీరు నాకు వ్యతిరేకంగా చూపిన అవిధేయత మరియు తిరుగుబాటు తనాన్ని నిరాకరిస్తున్నానని ఏ దాపరికం లేకుండా, తప్పకుండా చెప్పాలి ఎందుకంటే మీలో ఎవరు కూడా సాధువులు కాదు గనుక. సాతానుడి చేత చెడగొట్టబడిన ప్రజల నుండి మీకు కూడా మినహాయింపు లేదు; మీరు క్రీస్తు యొక్క శత్రువులు. ఇప్పటిదాకా, మీ అతిక్రమణలు మరియు అవిధేయతలు లెక్కపెట్టడానికి అసంఖ్యాకములుగా ఉన్నాయి, కాబట్టి మిమ్మల్ని ఎల్లప్పుడు నొప్పిస్తున్నాను అనడంలో వింతేమి లేదు. ఈ విధానంలో మీతో కలిసి జీవించాలని నేను కోరుకోవడంలేదు—కానీ మీ భవిష్యత్తు కోసం, మీ గమ్యాల కోసం, నేను ఇక్కడ మరియు ఇప్పుడు మరోసారి వేధిస్తాను. మీరు నాతో మమేకమవుతారని, అంతకన్నా నేను పలుకుతున్న వాక్యాలను నమ్మగలిగి, అందులోని లోతైన మర్మాలను గ్రహించ గలుగుతారని ఆశిస్తున్నాను. నేను చెప్పినదానిని సందేహించకుడి, నా మాటలను మీరు కోరుకున్నట్లుగా తీసుకుని, వాటిని మీ ఇష్టానుసారం పక్కన పెట్టండి; ఇది నాకు సహించలేనిదిగా ఉంది. నా వాక్యాలపై తీర్పు తీర్చకండి, ఇంకా చెప్పాలంటే, వాటిని తేలికగా అసలే తీసుకోకండి, లేదా నేను మిమ్మల్ని ఎల్లప్పుడు ప్రలోభపెడుతున్నట్టు, లేదా ఇంకా అధ్వన్నాంగా చెప్పాలంటే నేను మీకు చెప్పినది సరైనది కాదని చెప్పకండి. ఇవన్నీ కూడా నేను సహించలేనివిగా ఉన్నాయి. ఎందుకంటే, మీరు నా వాక్యాలను ఎన్నడూ బర్రలోకి ఎక్కించుకోకుండా నన్ను విస్మరిస్తూ నన్ను మరియు నేను చెప్పిన వాటిని ఆ విధమైన అనుమానంతో చూశారు గనుక, మీలో ప్రతి ఒక్కరికీ నేను అంత తీవ్రతగా చెబుతున్నాను: నేను చెప్పే దానిని తత్వశాస్త్రంతో ముడిపెట్టకండి; నా వాక్యాలను మోసగాళ్ల అబద్దాలతో ముడిపెట్టవద్దు. ఇంకా చెప్పాలంటే నా వాక్యాలకు మీరు తిరస్కరణతో అసలే ప్రతిస్పందించకండి. బహుశా నేను చెబుతున్నదానిని లేదా మాట్లాడే దానిని బహుశా ఇంత కనికరముగా భవిష్యత్తులో ఇంకెవ్వరూ చెప్పలేరు. ఇంత ఓర్పుగా ఈ అంశాల గుండా మిమ్మల్ని ఎవరూ అసలే నడిపించలేరు ఆ రోజులను మీరు మంచి తరుణాలతో నిండిన వాటిని నెమరు వేసుకుంటూ గడుపుతారు, లేదా నొప్పితో బిగ్గరగా వెక్కి వెక్కి ఏడ్వడం లేదా మూలుగుతుంటారు లేదా చీకటి రాత్రుల లో సత్యము లేదా జీవము యొక్క తుంపు కైనా ఏర్పాట్లు లేకుండా జీవిస్తూ నిరాశతో వేచిచూస్తుంటారు లేదా అంతయూ కోల్పోయి చేదు వ్యాకూలతలో నివసిస్తూ మీరు మొత్తంగా హేతుబద్ధతని కోల్పోతారు…. వాస్తవికంగా మీరు ఎవ్వరూ ఈ సంభావనీయతల నుండి తప్పించుకోలేరు. ఎందుకంటే మీలో ఎవ్వరూ కూడా నిజంగా దేవుని ఆరాధించే స్థానాన్ని ఆక్రమించలేదు, కానీ దుష్ట దుర్మార్గములలో మీకు మీరు మునిగిపోయి, మీ నమ్మకాలను మీ ఆత్మ, జీవాత్మ మరియు శరీరములతో జీవము సత్యములకు ఎటువంటి సంబంధం లేని మరియు వాటికి విరుద్ధమైన అనేక విషయములను మిశ్రమించుకుని వాటిలో మునిగి పోతారు. మీ కొరకు నేను ఆశించునది ఏమనగా వెలుగు మార్గమునకు మీరు తీసుకొని రాబడుదురుగాక. నా ఏకైక ఆశ ఏమంటే మీకు మీరు స్వయంగా జాగ్రత్త వహించుకోవడం ద్వారా మిమ్మల్ని మీరు జాగ్రత్త చేసుకోగలరన్నదే, మరియు మీ ప్రవర్తన మరియు అతిక్రమణలను ఉదాసీనతతో అవలోకించినప్పుడు మీరు మీ గమ్యంపై ఎక్కువ శ్రద్ధ వహించరు.
సుదీర్ఘ కాలంగా, దేవుని యందు విశ్వాసము గలవారు ఎతో వాంఛతో అందమైన గమ్యం కోసం నిరీక్షిస్తున్నారు, దేవుని విశ్వాసులందరూ మంచి భవిష్యత్తు అకాశ్మాత్తుగా తమ వద్దకు వచ్చేస్తుందని ఆశిస్తారు. వారందరూ తాము అది తెలుసుకునే ముందే, పరలోకములో శాంతియుతంగా ఏదైనా ఒక స్థలంలో శాంతిమంతంగా ఉండగలరని నిరీక్షిస్తున్నారు. అయితే, వారి అందమైన ఆలోచనలతో, పరలోకము నుండి క్రిందికి పడే అటువంటి మంచి భవిష్యత్తును పొందుకునేందుకుగాని లేదా అక్కడ కుర్చీలో కూర్చునేందుకు అర్హులేనా అన్నది వారు ఎన్నడూ ఎరుగరని నేను చెప్పగలను. మీకు ప్రస్తుతం మిమ్ములను గురించిన మంచి అవగాహన ఉంది, అయినప్పటికీ అంతిమ కాలపు విపత్తుల నుండి తప్పించుకునేందుకు మరియు దుష్టులను శిక్షించేటప్పుడు సర్వశక్తిగల ఆయన ఆపన్న హస్తము. నుండి తప్పించుకునేందుకు మీరు ఆశిస్తున్నారు. తియ్యని స్వప్నాలు మరియు వారు అనుకున్న రీతిలో విషయాలు జరగాలని శాతానుడు చెరిచిన ప్రజలందరి ఉమ్మడి గుణంగా ఉన్నట్టున్నది, వ్యక్తిగతంగా ఏ ఒక్క వ్యక్తి చేసిన మేధస్సుకు సంబంధించినది కాదు. అలా అయినప్పటీ, మీ మితిమీరిన కోరికలతోపాటు ఆశీర్వాదములు పొందుకునేందుకైన ఆత్రుతకు ఒక ముగింపు పెట్టాలని కోరుకుంటున్నాను. మీ అతిక్రమణలు అసంఖ్యాకములు, మీ తిరుగుబాటుతనం నిత్యమూ వృద్ధిలో ఉండడం వాస్తవమైతే, మీ భవిష్యత్తు కొరకైన అందమైన పథకాలు ఎలా సరిపోగలవు? మిమ్మలను ఆదుకునేందుకు ఏది లేకుండానే మీరు కొరుకున్న విధంగా మీరు తప్పులు చేయాలనుకుంటే, మరో వైపు మీ కలలు సాకారం కావాలని కోరుకుంటున్నారు, అయితే మీ జడత్వమైన నిద్ర నుండి ఎన్నడూ మేలుకోవద్దనే నేను సూచించగలను—ఎందుకంటే మీవి వట్టి నిరర్దకమైన కలలు మరియు నీతిమంతుడైన దేవుని సాన్నిధ్యంలో, అతను మీ కొరకు మినహాయింపు ఇవ్వడు. మీరు కేవలం మీ కలలు మాత్రమే సాకారం కావాలనుకుంటే, మీరు ఎన్నడూ కలలు కనవద్దు; బదులుగా సత్యాలను నిజాలను నిత్యమూ ఎదుర్కొనండి. మీరు రక్షించబడడానికి ఇదొక్కటే మార్గము. దృఢమైన షరత్తులతో చెప్పాలంటే ఈ పద్దతి యొక్క దశలు ఏమిటి?
మొదటగా, మీ అతిక్రమములు అన్నింటినీ ఒకసారి పరిశీలించుకోండి, మీ ప్రవర్తన మరియు ఆలోచనలు ఏవైనా సత్యానికి సరిపోని విధంగా ఉన్నయా అని పరిశీలించుకోండి.
మీరు సులభంగా చేయగలిగిన ఏకైక విషయమై ఇదేనని, తెలివైన ప్రజలందరూ ఇది చేయగలరని నేను నమ్ముతున్నాను. ఆయినప్పటికీ, అతిక్రమము మరియు సత్యము గురించి ఏ మాత్రమూ తెలియని వారు మినహాయించబడతారు, ఎందుకంటే పునాది స్థాయిలోనే, వారు తెలివైన ప్రజలు కాదు. నేను మాట్లాడుతున్నది దేవునిచే ఆమోదించబడిన నిజాయితీపరుల గురించి, దేవుని పరిపాలకా పరమైన ఆజ్ఞలను నిశ్చయముగా ఉల్లంఘించని వారు మరియు సొంత అతిక్రమములను సుళువుగా వివేచించు వారి గురించి. మీ నుండి నాకు కావాలసినది సుళువుగా సాధించగలిగినది ఇదే అయినప్పటికీ, మీ నుండి కావాలసినది ఇదొక్కటి మాత్రమే కాదు. ఏది ఏమైనప్పటికీ, ఈ అవసరతనుబట్టి మీరు రహస్యంగా నవ్వుకోరని నేను భావిస్తున్నాను, మరీ ముఖ్యంగా మీరు దీనిని తక్కువ అంచనా వేయరని, తేలికగా తీసుకోరని భావిస్తున్నాను. దీనిని మీరు తీవ్రంగా పరిగణించాలి, కొట్టిపారేయ కూడదు.
రెండవదిగా, మీ ప్రతి అతిక్రమములు మరియు అవిధేయతలకు తుల్యమైన సత్యము కొరకు వెదకాలి, ఈ సత్యాలను ఆ సమస్యలకు పరిష్కారంగా ఉపయోగించుకోవాలి. ఆ తరువాత, మీ అతిక్రమణ చర్యలు మరియు అవిధేయ ఆలోచనలు మరియు చర్యలను సత్యాన్ని ఆచరించుటతో భర్తీ చేయాలి.
మూడవదిగా, మీరు నిజాయితీపరునిగా ఉండాలి, ఎల్లప్పుడూ తెలివిగాను మరియు నిత్యమూ కపటపూరితంగా నడుచుకునే వ్యక్తిగా ఉండకూడదు. (ఇక్కడ మిమ్మల్ని నిజాయితీపరునిగా ఉండాలని మరోమారు చెబుతున్నాను.)
మీరు ఈ మూడు విషయాలను సాధించగలిగితే, మీరు అదృష్టవంతులలో ఒకరు—ఎవరైతే కలలు సాకారం చేసుకుని మరియు మంచి భవిష్యత్తును పొందుకుంటారో ఆ వ్యక్తి. బహుశా, మీరు ఈ మూడు ఆకర్షణీయంగా లేని అవసరతలను తీవ్రంగా పరిగణించగలరు లేదా బహుశా వీటిని బాధ్యతారహితంగా పరిగణిస్తారు. ఏదైనప్పటికీ, నా ఉద్దేశ్యం మీ కలలను పరిపూర్ణం చేయడం మరియు మీ ఆలోచనలను ఆచరణలోకి తీసుకురావడమే తప్ప, మిమ్మల్ని ఆటపట్టించడం లేదా మిమ్మలను వెర్రి వాళ్లను చేయడం కాదు.
నా ఆజ్ఞాపనలు ఒక వేళ సుళువైనవి కావచ్చు, కానీ నేను మీకు చెప్పేది ఒకటి ఒకటి కలిపితే రెండు అన్నంత సులభము కాదు. ఒక వేళ మీరు చేసేదంతా దీనిని గురించి ఆషామాషీగా మాట్లాడటమే అయితే లేదా ఖాళీగా ఎక్కువ ధ్వని గల ప్రచారాలతో తిరుగుతూ ఉన్నట్టయితే మీ పథకాలు మరియు మీ కోరికలు ఎప్పటికీ ఏమీలేని వట్టి కాగితముగా మిగిలిపోతాయి. చాలా సంవత్సరాలుగా బాధపడుతూ, కష్టపడి పని చేస్తున్నప్పటికీ ఎటువంటి ఫలితం లేకుండా పోతున్నటువంటి వారి పట్ల నాకు జాలి ఉండదు. అందుకు భిన్నంగా, నా ఆజ్ఞాపనలు నెరవేర్చని వారిని శిక్షిస్తాను, సత్కారాలు ఉండవు సానుభూతి అసలే చూపను. చాలా సంవత్సరాలుగా అనుచరులుగా ఉంటూ, మీరు ఏదైనా కష్టపడి చేస్తారని, కేవలం సేవాపరులుగా ఉన్నంత మాత్రాన దేవుని ఇంటి లో గిన్నెడు బియ్యం అనుగ్రహించబడుతుంది అని మీరు ఊహించవచ్చు. మీలో ఎక్కువ మందిఇలాగే ఆలోచిస్తుంటారని నేను చెప్పగలను, ఎందుకంటే మీరు ఎల్లప్పుడు విషయాలపై ఎలా ఆధిపత్యం చెలాయించాలనే సూత్రాన్నే పాటిస్తారే తప్ప ఆధిపత్యం ఎలా పొందాలనే దానిని పాటించేవారు కాదు. కాబట్టి, ఇప్పడు మీకు నేను చాలా ముఖ్యమైన విషయం చెబుతున్నాను: మీరు కష్టపడి చేసే పని ఎంతటి సుకృతమైనను నేను పట్టించుకోను, మీ యోగ్యత ఎంతటి ఆకట్టుకునైదైనా, మీరు ఎంత సమీపంగా నన్ను అనుసరించినా, ఎంత పేరు ప్రఖ్యాతలు గలవారైనా, మీ వైఖరిలో ఎంతటి వృద్ధిని సాధించినా నేను పట్టించుకోను; నా ఆజ్ఞాపనలను నెరవేర్చనంత వరకూ నా ప్రశంసలను నువ్వు ఎన్నటికీ గెలుచుకోలేవు. సాధ్యమైనంత త్వరగా మీ సొంత ఆలోచనలు, లెక్కలను తుడిచిపెట్టేసి, నా అవసరతలను పూర్తి చేయడంపై తీవ్రంగా పని చేయండి. లేనియెడల, నా కార్యమునకు ముగింపు పలికేదానిలో భాగంగా నేను ప్రతి ఒక్కరినీ భస్మంగా మారుస్తాను, మరీ తీవ్రమైన స్థితి అయితే ఏళ్ల తరబడిన నా కార్యమును మరియు బాధను ఏమీలేకుండా చేస్తాను, ఎందుకనగా నా శత్రువులను, సాతాను రూపాన్ని కలిగి ఉన్న వారిని నా రాజ్యములోనికి గాని లేదా తదుపరి కాలములోనికి నేను తీసుకు వెళ్లలేను.
నాకు ఎన్నో ఆశలు ఉన్నాయి. మిమ్మల్ని మీరు సన్మార్గములోను మరియు సత్ ప్రవర్తనలోను నడిపించుకోగలరని, మీ కర్తవ్యమును యధార్థముగా నిర్వర్తించగలరని, సత్యమును, మానవతా భావాన్ని కలిగియుంటారని, దేవుని కొరకు తమ వద్ద ఉన్న ప్రతి ఒక్కటి కడకు తమ ప్రాణాలైనా అర్పించగల వ్యక్తులుగా, మొదలైనవారుగా ఉండగలరని, నేను ఆశిస్తున్నాను. ఈ ఆశలన్నీ మీ లోపాలు మరియు మీ అవినీతి మరియు అవిధేయత నుండి ఉద్భవించాయి నేను మాట్లాడిన మాటల్లో ఏ ఒక్కటి కూడా మిమ్మల్ని ఆకర్షించడానికి సరిపోక పోయినట్లయితే, ఇక ఇప్పుడు నేను చేయగలిగింది ఏమీ చెప్పకపోవడమే. అయినప్పటికీ, దాని ఫలితం ఏమై ఉంటుందో మీకు తెలిసే ఉంటుంది. నేను అంత తరచుగా విశ్రాంతి తీసుకోను, నేను మాట్లాడకపోతే, నేను ప్రజలు చూసేవిధంగా ఏదో ఒకటి చేస్తాను. నేను ఒకని నాలుకను కుళ్ళిపోయేలా చేయగలను, లేదా ఎవరినైనా చిన్నాభిన్నమై చనిపోయేలా చేయగలను, లేదా ప్రజలకు నరాల బలహీనతలను కలుగజేసి, వారిని అనేక విధములలో వికారముగా కనబడేలా చేయగలను. ఆ తరువాత, ప్రజల కొరకు నేను ప్రత్యేకంగా కల్పించిన హింసను సహించే వారిలా చేయగలను. ఈ విధంగా నేను మహదానందం పొందగలిగి, చాలా సంతోషించగలను. “మంచికి మంచి మరియు చెడుకు చెడు ప్రతిఫలంగా వస్తుందని” ఎల్లప్పుడూ చెబుతుంటారు, కాబట్టి ఇప్పుడు మాత్రం ఎందుకు కాకూడదు? ఒక వేళ నీవు నన్ను ఎదిరించాలనుకున్నా, నా గురించి తీర్పు తీర్చాలని అనుకున్నా, నీ నోరు కుళ్లిపోయేలా నేను చేయగలను, అది నాకు అనంతమైన ఆహ్లాదాన్ని ఇస్తుంది. ఎందుకనగా, చిట్టచివరకు, మీరు ఏదైతే చేశారో అది నిజం కాదు, ఇంకా చెప్పాలంటే దానికి జీవితంతో సంబంధం లేదు, అయితే, నేను చేసే ప్రతి ఒక్కటీ సత్యమే; నా చర్యలు అన్నీ నా కార్యముల యొక్క సిద్ధాంతాలకు సంబంధించినవిగాను మరియు నేను నిర్దేశించిన పరిపాలక ఆజ్ఞలుగా ఉన్నాయి. కాబట్టి, మీలో ప్రతి ఒక్కరు కొంత ధర్మాన్ని కూడబెట్టుకోమని, ఎక్కువ పాపములను చేయవద్దని, అంతేగాక మీ ఖాళీ సమయాలలో నా ఆజ్ఞాపనలను ఆలకించాలని నేను కోరుచున్నాను. అప్పుడు నేను ఆనందించగలను. ఒక వేళ మీరు శరీరపరంగా చేసే ప్రయత్నంలో వెయ్యవ వంతు సత్యానికి దోహదపడితే (లేదా దానం చేస్తే) అప్పుడు మీరు తరచూ అతిక్రమణలకు పాల్పడరని మీ నోళ్లు కుల్లిపోవని నేను చెబుతున్నాను. ఇది స్పష్టంగా లేదా?
నువ్వు ఎంత ఎక్కువ అతిక్రమణలకు పాల్పడతావో మంచి గమ్యాన్ని చేరుకునేందుకు అంత తక్కువ అవకాశాలు పొందుకుంటావు. దానికి విరుద్ధంగా, నువ్వు ఎంత తక్కువ అతిక్రమణలకు పాల్పడతావో దేవునిచేత ప్రశంసించబడడానికి అంత ఎక్కువ అవకాశాలు పొందుకుంటావు. నేను నిన్ను క్షమించడానికి సాధ్యం కానంత స్థాయికి నీ అతిక్రమణలు పెరిగినట్టయితే, అప్పుడు నువ్వు క్షమించబడడానికైన అవకాశాలను బొత్తిగా కోల్పోయినవాడివి అవుతావు. అటువంటప్పుడు, నీ గమ్యం పై స్థాయిలో ఉండదు కానీ, క్రిందికి ఉంటుంది. నువ్వు నన్ను విశ్వసించనట్లయితే, అప్పుడు నువ్వు ధైర్యంగా తప్పు చెయ్యి, మరియు అది నీకు ఏ ఫలితాన్ని ఇస్తుందో చూడు. నువ్వు సత్యాన్ని మనస్పూర్తిగా ఆచరించే వ్యక్తి అయితే, అప్పుడు నువ్వు నీ అతిక్రమణలకు క్షమించబడడానికి తప్పక అవకాశాలను పొందుకోగలవు, నువ్వు తరచుగా కుడా అవిధేయత చూపవు. ఒక వేళ నువ్వు సత్యాన్ని ఆచరించడానికి సిద్ధంగాలేని వ్యక్తి అయితే, అప్పుడు దేవుని ముందు నీ అతిక్రమణల సంఖ్య తప్పక పెరుగుతుంది నువ్వు ఎక్కువగా మరియు తరచుగా అవిధేయత చూపుతావు, నువ్వు నీ పరిమితిని చేరుకునే వరకు, ఇది నీ పూర్తి విధ్వంస సమయం అవుతుంది. ఇది ఎప్పుడు జరుగుతుందంటే, ఆశీర్వాదాలను పొందుకునేటువంటి నీ ప్రశాంతమైన కల చెదరినప్పుడు. మీ అతిక్రమణలను పరిపక్వత లేని లేదా తెలివి తక్కువ వ్యక్తి యొక్క తప్పులుగా పరిగణించవద్దు; నీకు సత్తా లేని కారణంగానే సత్యాన్ని ఆచరించడం సాధ్యం కాలేదని నెపాన్ని ఉపయోగించుకోకు. ముఖ్యంగా, నువ్వు పాల్పడిన అతిక్రమణలను అంతగా విషయం తెలియని వ్యక్తి యొక్క చర్యలుగా పరిగణించడం చేయకు. ఒక వేళ నిన్ను నువ్వు క్షమించడంలో ఆరితేరిన వాడివైతే, మీ పట్ల మీరు దాతృత్వతంతో వ్యవహరించేవారైతే, నువ్వు ఎప్పటికీ సత్యాన్ని పొందుకోలేని పిరికివాడివని లేదా నీ అతిక్రమణలు నిన్ను చుట్టుముట్టడం ఎప్పటికీ విరమించవని నేను చెబుతాను; అవి సత్యం యొక్క అవసరతలను ఎప్పటికీ నెరవేర్చకుండా ఉండే విధంగా చేస్తాయి, మరియు సాతానుకు ఎప్పటికీ విశ్వాసపాత్రుడిగా ఉండిపోయేందుకు దారి తీస్తాయి. ఇప్పటికీ మీకు నేను చెప్పే సలహా ఇదే: కేవలం నీ గమ్యం వైపు మాత్రమే దృష్టి సారించడంలో మునిగి పోయి, మరుగున పడిన నీ అతిక్రమణలను గుర్తించడంలో విఫలం కాకండి; అతిక్రమణలను తీవ్రంగా పరిగణించండి, అదే సమయంలో మీ గమ్యంపట్ల అధిక శ్రద్ధ వహిస్తూ వీటిని విస్మరించడం చేయకండి.