ప్రారంభంలో క్రీస్తు పలుకులు—5 వ అధ్యాయము
పర్వతాలు, నదులు మార్పు చెందుతాయి, నీరు దాని మార్గంలో ప్రవహిస్తుంది, భూమీ ఆకాశం వలె మనిషి జీవితం శాశ్వతంగా ఉండదు. సర్వశక్తిమంతుడైన దేవుడు మాత్రమే నిత్య జీవము కలిగిన మరియు పునరుజ్జీవింపచేయువాడై యున్నాడు, ఇది తరాలు దాటి తరాలకు, ఎప్పటికీ కొనసాగుతుంది! అన్నివిషయాలు, అన్ని సంఘటనలు ఆయన చేతుల్లో ఉంటాయి, సాతాను ఆయన పాదాల క్రింద ఉంటాడు.
నేడు, దేవుడు ముందుగా నిర్ణయించిన ఎంపిక ద్వారా ఆయన మనలను సాతాను పట్టునుండి విడిపించాడు. ఆయన నిజంగా మన విమోచకుడు. క్రీస్తు శాశ్వతమైన, పునరుత్థానమైన జీవము వాస్తవానికి మనలో రూపొందించబడింది, దేవుని జీవముతో మనల్ని అనుసంధానించడానికి ఉద్దేశించబడింది, మనం నిజంగా ఆయనతో ముఖాముఖిగా రావచ్చు, ఆయనను తినవచ్చు, ఆయనను త్రాగవచ్చు, ఆయనను ఆస్వాదించవచ్చు. ఇది దేవుడు తన హృదయ రక్తపువెలతో చేసిన నిస్వార్థ సమర్పణ.
ఋతువులు వస్తాయి, పోతాయి. గాలి మరియు మంచు గుండా దాటివెళ్తాయి, జీవితపు బాధలు, హింసలు మరియు శ్రమలను కలుసుకొంటాయి, లోకపు అనేక తిరస్కారాలు మరియు అవమానాలు, ప్రభుత్వపు అనేక తప్పుడు ఆరోపణలు ఎన్ని ఉన్నప్పటికీ దేవుని విశ్వసనీయత లేదా ఆయన సంకల్పం కాస్తయినా తగ్గింపబడలేదు. హృదయపూర్వకంగా దేవుని చిత్తానికి, దేవుని నిర్వహణ ప్రణాళికకు అంకితం చేయబడి, అవి నెరవేరడం కోసం, ఆయన తన స్వంత జీవితాన్ని పక్కన పెట్టాడు. తన ప్రజల సమూహము అంతటి కోసం, ఆయన ఎటువంటి బాధలను విడిచిపెట్టడు, వారిని జాగ్రత్తగా పోషించాడు, వారికి నీరు పెట్టాడు. మనం ఎంత చీకటి క్రమ్మినవారముగా ఉన్నప్పటికీ, లేదా ఎంత కష్టతరముగా మనము ఉన్నప్పటికీ, మనం ఆయన ఎదుట మాత్రమే అప్పగించుకొనవలెను, మరియు క్రీస్తు పునరుత్థానజీవం మన పాత స్వభావాన్ని మారుస్తుంది…. ఈ మొదట పుట్టిన కుమారులందరి కోసం, ఆయన ఆహారాన్ని, విశ్రాంతిని వదులుకుంటూ అవిశ్రాంతంగా శ్రమిస్తున్నాడు. ఎన్ని పగళ్ళు రాత్రులు, ఎంత మండే వేడి మరియు గడ్డ కట్టే చలిలో, సీయోనులో ఆయన హృదయపూర్వకంగా చూస్తున్నాడు.
ప్రపంచం, ఇల్లు, పని మరియు అన్నీ, పూర్తిగా విస్మరించబడ్డాయి, సంతోషంగా, ఇష్టపూర్వకంగా ప్రాపంచిక ఆనందాలకు ఆయన సంబంధం తెంచుకున్నాడు…. ఆయన నోటి నుండి వచ్చే మాటలు మన హృదయాల్లోకి తాకి లోతుగా దాగివున్న విషయాలను బహిర్గతం చేస్తాయి. మనం ఎలా ఒప్పించబడలేము? ఆయన నోటి నుండి వచ్చే ప్రతి వాక్యం ఏ సమయంలోనైనా మనలో నిజం కావచ్చు. మనం ఏమి చేసినా, ఆయన సన్నిధిలో లేదా ఆయనకు దూరంగా దాచబడినా, ఆయనకు తెలియనిది ఏదియూ లేదు, ఆయనకు అర్థం కానిది ఏదియూ లేదు. మనకంటూ స్వంత ప్రణాళికలు మరియు ఏర్పాట్లు ఉన్నప్పటికీ, అవన్నీ ఆయన ముందు వెల్లడి చేయబడతాయి.
ఆయన ఎదుట కూర్చోవడం, మన ఆత్మలో ఆనందం, తేలిక మరియు ప్రశాంతత అనుభవించడం జరుగుతున్నప్పటికీ, ఎల్లప్పుడూ శూన్యంగానూ మరియు నిజంగా దేవునికి ఋణపడి ఉన్న అనుభూతి అనేది ఊహించలేనిది మరియు సాధించలేని ఒక అద్భుతం. సర్వశక్తిమంతుడైన దేవుడే నిజమైన దేవుడు అని నిరూపించడానికి పరిశుద్ధాత్ముడు సరిపోతాడు! ఇది తిరుగులేని రుజువు! ఈ గుంపులోని మనము వర్ణించలేని విధంగా ఆశీర్వదించబడ్డాము! దేవుని దయ మరియు కరుణ లేకపోతే, మనం నాశనానికి మాత్రమే వెళ్లేవాళ్లం మరియు సాతానును అనుసరించే వాళ్లం. సర్వశక్తిమంతుడైన దేవుడు మాత్రమే మనలను రక్షించగలడు!
ఆహ్! సర్వశక్తిమంతుడైన దేవుడా, ఆచరణాత్మక దేవుడా! ఆత్మీయ లోకంలోని రహస్యాలను వీక్షించడానికి మమ్మల్ని అనుమతించి, మా ఆధ్యాత్మిక నేత్రాలను తెరిచినది నువ్వే. రాజ్యపు అవకాశాలు అవధులు లేనివి. మనం వేచి ఉన్నంతవరకు జాగరూకతతో ఉందాం. ఆ రోజు మరీ అంత దూరంలో ఏమీ లేదు.
యుద్ధ జ్వాలలు సుడులు తిరుగుతాయి, ఫిరంగి పొగ గాలిని నింపేస్తోంది, వాతావరణం వెచ్చగా మారుతోంది, వాతావరణం మారుతోంది, ప్లేగు వ్యాధి వ్యాప్తి చెందుతోంది మరియు మనుగడ మీద ఎటువంటి ఆశ లేని ప్రజలు చనిపోగలరంతే.
ఆహ్! సర్వశక్తిమంతుడైన దేవుడా, ఆచరణాత్మక దేవుడా! నువ్వే నా అజేయమైన కోట. నువ్వే నా ఆశ్రయం. మేము నీ రెక్కల క్రింద గుంపుగా కూడియున్నాము. విపత్తు మమ్మల్ని చేరుకోలేదు. ఇది నీ దైవిక రక్షణ మరియు సంరక్షణ.
మేమందరం పాటలో మా స్వరాలు ఎలుగెత్తుతాము; మేము స్తుతిస్తూ పాడతాము, మా స్తుతి ధ్వని సీయోను అంతటా మోగుతుంది! సర్వశక్తిమంతుడైన దేవుడు, ఆచరణాత్మక దేవుడు, ఆ మహిమాన్వితమైన గమ్యాన్ని మన కోసం సిద్ధం చేశాడు. జాగరూకతతో ఉండండి—ఓహ్, జాగ్రత్తగా ఉండండి! ఆ గడియ మరీ అంత దూరంలో ఏమీ లేదు.