ప్రారంభంలో క్రీస్తు పలుకులు—3 వ అధ్యాయము

విజయుడైన రాజు ఆయన ఘనత గల సింహాసనం పైన కూర్చుని ఉన్నాడు. ఆయన విమోచనను సాధించాడు మరియు ఆయన తన జనులందరినీ ఘనతలో కనపడేలా నడిపించాడు. ఆయన ఈ విశ్వాన్ని ఆయన చేతులలో పట్టుకొని ఉన్నాడు, మరియు ఆయన దివ్యమైన జ్ఞానము మరియు శక్తితో దృఢమైన సీయోనును నిర్మించాడు. ఆయన మహిమతో ఈ పాపపూరితమైన ప్రపంచాన్ని తీర్పు తీరుస్తాడు. ఆయన దేశాలు మరియు జనులందరి మీద, భూమి మరియు సముద్రాలు మరియు వాటిలో నివసించేవాటన్నిటి పైన, అలాగే వ్యభిచారం అనే ద్రాక్షారసం తాగిన వారిపై కూడా దేవుడు తీర్పు తీర్చాడు. దేవుడు తప్పకుండా వారిపై తీర్పు తీరుస్తాడు, ఆయన తప్పకుండా వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు మరియు దానిలో దేవుని మహిమ వెల్లడి చేయబడుతుంది, ఆయన తీర్పు తక్షణమే మరియు ఆలస్యం లేకుండా వెల్లడి చేయబడుతుంది. ఆయన క్రోధాగ్ని తప్పకుండా వారి ఘోరమైన పాపాలను భస్మం చేస్తుంది మరియు ఏ క్షణంలోనైనా వారికి విపత్తు సంభవిస్తుంది; వారికి తప్పించుకునే ఏ మార్గమూ తెలీదు మరియు వారికి దాగుకొనటానికి ఏ చోటూ లేదు, వారు ఖచ్చితంగా ఏడుస్తారు మరియు వారి పళ్లు కొరుకుతారు, మరియు వారిపై వారు వినాశనాన్ని కొనితెచ్చుకుంటారు.

దేవునికి ప్రియమైన విజయులైన కుమారులు సీయోనులో కచ్చితంగా ఉంటారు, ఎప్పటికీ దాని నుండి విడిపోరు. అనేక సంఖ్యాకులైన జనులు ఆయన స్వరాన్ని దగ్గరగా వింటారు, ఆయన చర్యలను వారు జాగ్రత్తగా లక్ష్యపెడతారు, మరియు వారి స్తుతి శబ్దాలు ఎప్పటికీ ఆగవు. ఒక నిజ దేవుడు ప్రత్యక్షమయ్యాడు! మనము ఆత్మలో ఆయన గురించి నిశ్చయత కలిగి ఉండాలి మరియు ఆయనను దగ్గరగా వెంబడించాలి; మన శక్తి అంతటితో మనము ఏ మాత్రం సందేహించకుండా ముందుకు పరిగెత్తాలి. ప్రపంచపు అంతం మన ముందు బహిర్గతమవుతుంది; ఒక సరైన సంఘ జీవితం అలాగే జనులు, సంబంధాలు, మరియు మన చుట్టూ ఉన్న విషయాలు ఇప్పుడు కూడా మన శిక్షణను ఇంకా తీవ్రతరం చేస్తున్నాయి. ప్రపంచాన్ని ప్రేమించే మన హృదయాలను వెనక్కి తీసుకోవడానికి త్వరపడదాము! మరుగునపడిన మన దృష్టిని వెనక్కి తీసుకోవడానికి మనం త్వరపడదాము! మన అడుగులలో మనం నిలిచి ఉందాము, అలా సరిహద్దులు దాటి పోకుండా ఉండగలము. మన నోళ్లను దేవుని వాక్యంలో నడిచేలాగా కట్టిపెడదాము, మరియు మన సొంత లాభాలు మరియు నష్టాలను పట్టించుకోవద్దు. ఈ లౌకిక ప్రపంచము మరియు సంపద పట్ల మీకున్న దురాశతో కూడిన మోహము! ఓహ్, దాన్ని విడిచిపెట్టండి. భర్తలు మరియు కుమార్తెలు మరియు కుమారులకు అంటి పెట్టుకొనే అనుబంధం! ఓహ్, దాని నుండి మిమ్మల్ని మీరు విముక్తుల్ని చేసుకోండి. మీ దృక్పధాలు మరియు దురభిమానాలు! ఓహ్, మీరు వాటికి వెన్ను చూపండి. ఆహ్, మేల్కొనండి; సమయం తక్కువగా ఉంది! ఆత్మ లోపల నుండి పైకి చూడండి, పైకి చూడండి మరియు దేవుడిని నియంత్రణను తీసుకోనివ్వండి. ఏది జరిగినప్పటికీ, మరొక లోతు భార్యలా మారకండి. పక్కన పెట్టబడడం ఎంత దయనీయమైనది! నిజంగా ఎంత దయనీయం! ఓహ్, మేల్కొనండి!

మునుపటి:  ప్రారంభంలో క్రీస్తు పలుకులు—2 వ అధ్యాయము

తరువాత:  ప్రారంభంలో క్రీస్తు పలుకులు—5 వ అధ్యాయము

సెట్టింగులు

  • వచనం
  • థీమ్స్

ఘన రంగులు

థీమ్స్

అక్షరశైలి

అక్షరశైలి పరిమాణం

గీతల మధ్య దూరం

గీతల మధ్య దూరం

పేజీ వెడల్పు

విషయ సూచిక

శోధించండి

  • ఈ వచనాన్ని శోధించండి
  • ఈ పుస్తకాన్ని శోధించండి

Connect with us on Messenger